petrol and diesel prices hike
-
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. బీజేపీకి సిద్ధరామయ్య కౌంటర్
బెంగళూరు: కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంధన ధరలు పెరిగినప్పటికీ పొరుగు రాష్ట్రాల ధరల కంటే తక్కువగానే ఉందని సమర్ధించుకున్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.కాగా, సీఎం సిద్ధరామయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయల సేల్స్ ట్యాక్స్ పెంచాం. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల కంటే తక్కువే ఉంది. బీజేపీ నేతలు దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు మాట్లాడే ముందు కేంద్రం పెంచిన అదనపు సుంకాలపై కామెంట్స్ చేస్తే బాగుండేది.పలు సందర్భాల్లో రాజకీయ కారణాల దృష్ట్యా ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్‌పై అదనపు సుంకాన్ని పెంచారు. దాదాపు పది కంటే ఎక్కువ సార్లే పెంచారు. కేంద్రం అదనంగా సుంకాలు విధించినప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీని ఎందుకు ప్రశ్నించలేదు. కేంద్రం పన్నలు విధించిన కారణంగా మేము దాదాపు 1,87,00,000 కోట్లు పోగొట్టుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ట్యాక్స్ పెంచామని’ చెప్పుకొచ్చారు.#WATCH | Bengaluru: On fuel price hike, Karnataka CM Siddaramaiah says, "We have raised sale tax by Rs 3, both on petrol and diesel. Still, we are less than the rates that our neighbouring states have. The BJP people are making it an issue for political reasons. When Narendra… pic.twitter.com/oIbmbYGqLY— ANI (@ANI) June 17, 2024ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెలువడిని అనంతరం కర్ణాటకలో ఇంధన ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలపై అదనంగా మూడు రూపాయలు ట్యాక్స్ విధించారు. దీంతో, పెరిగిన ఇంధన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. -
పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఉచిత హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత హామీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిత్యవసర వస్తువల ధరల్ని పెంచుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.20 పెంచుతూ నిర్ణయించింది. దీంతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.85చేరగా.. డీజిల్ ధర రూ.88.93కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్‌లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూ.330కు చేరుకుంది. ద్రవ్యోల్బణం 27.4 శాతానికి చేరడంతో ఈ చర్య అనివార్యమయినట్లు ప్రభుత్వం చెబుతోంది. శనివారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 296.41 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీన కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.14 చొప్పున పెంచింది. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్
ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం. పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్. గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్. ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే.. -
కొనడానికి లేదు.. తినడానికి లేదు
ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్ కింద కునుకు తీద్దామంటే కరెంట్ ఉండదు. ఏం చేయాలి? ఎలా బతకాలి? అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు. అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు. కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుద్దామంటే కరెంట్ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్ పెట్రోల్ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్ రూ.250, అయిదు కేజీల గ్యాస్ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు. పాల పౌడర్ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు. 2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ? పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో డాలర్ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
-
మరోసారి పెరిగిన ఇంధన ధరలు..! 3 రోజుల్లోనే రూ. 2 పైగా బాదుడు..! కొత్త ధరలు ఇవే..
Fuel Rates Today: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బ్యారెట్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల పాటు వరుసగా పెంచిన చమురు సంస్థలు, ధరల పెంపుకు ఒక్కరోజు బ్రేక్ గ్యాప్ ఇచ్చి మరోసారి బాదుడు షురూ చేశాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్ 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76, డీజిల్ ధర రూ. 98.74 గా ఉంది. దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.40 పైగా పెరిగాయి. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
-
వాహనదారులకు భారీ షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత వాహనదారులపై పెట్రో బాదుడు షురూ అయ్యింది. చివరి సారిగా డీజిల్,పెట్రోల్ ధరలు గతేడాది నవంబర్ 4వరకు పెరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడు మళ్లీ పెట్రోల్ ధరల పెంపు ప్రారంభమైంది. దీంతో బుధవారం లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 84పైసలు పెరిగాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే రోజురోజుకు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరూ.110గా ఉండగా డీజిల్ ధర రూ.96.36 పైసలుగా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.08 ఉండగా డీజిల్ ధర రూ.98.10పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.99 ఉండగా డీజిల్ ధర రూ.97.90పైసలుగా ఉంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.87.47పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00పైసలుగా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.51 ఉండగా డీజిల్ ధర రూ.90.62పైసలుగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.16 ఉండగా డీజిల్ ధర రూ.92.19పైసలుగా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42 ఉండగా డీజిల్ ధర రూ.85.80పైసలుగా ఉంది. -
చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమరు ధరల వల్ల అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కఠిన సమయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంధన ధరలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ధరలను తాత్కాలికంగా తగ్గించుకోవడం కోసం 10 పాయింట్ల ప్రణాళికను సూచించింది. ప్రపంచ చమురు మార్కెట్'లో రష్యా మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రభావం అనేక దేశాల మీద అధికంగా ఉంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ఉన్న ఒక కీలక మార్గం చమురు డిమాండ్'ను తగ్గించడం అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. తాము సూచించిన 10 పాయింట్ల ప్రణాళిక వల్ల కొంత మేరకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, ఈ 10 పాయింట్ల ప్రణాళిక అమలకు అనేక దేశాల ప్రభుత్వ మద్దతు అవసరం అని పేర్కొంది. ఈ ప్రణాళిక అమలు అనేది ప్రతి దేశ ఇంధన మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, సామాజిక & రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల మీద ఆధారపడుతుంది అని తెలిపింది. 10 పాయింట్ల ప్రణాళికలోని ముఖ్య అంశాలు: ప్రస్తుతం హైవేలపై ఉన్న వేగ పరిమితిని గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగం తగ్గించాలి. దీని వల్ల కార్లు వినియోగించే ఆయిల్ వినియోగం సుమారు 290 కేబీ/డీ ఆదా అవుతుంది, ట్రక్కులు వినియోగించే ఆయిల్ వినియోగం 140 కేబీ/డీ ఆదా అవుతుంది. కేబీ/డీ అంటే రోజుకు వెయ్యి బ్యారెల్స్ ఆయిల్ అని అర్ధం. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఒక రోజు సుమారు 170 కేబీ/డీ ఆయిల్ వినియోగం ఆదా అవుతుంది. అంటే, మూడు రోజులు కలిపి సుమారు 500 కేబీ/డీ ఆదా కానుంది. ప్రతి ఆదివారం నగర రోడ్ల మీద కార్లను అనుమతి ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతి ఆదివారం సుమారు 380 కేబీ/డీ ఆదా అవుతుంది; నెలకు ఒక ఆదివారం 1520 కేబీ/డీ ఆదా చేస్తుంది. ప్రజా రవాణాను, మైక్రోమొబిలిటీ, వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడం వల్ల సుమారు 330 కేబీ/డీ ఆదా చేస్తుంది. పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రత్యామ్నాయ ప్రైవేట్ కారు యాక్సెస్ పెంచడం వల్ల సుమారు 210 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. కారు షేరింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 470 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సరుకు రవాణా ట్రక్కుల కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ & గూడ్స్ డెలివరీని ప్రోత్సహించడం వల్ల సుమారు 320 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సాధ్యమైనంత వరకు విమానాలకు బదులుగా హై స్పీడ్, నైట్ రైళ్లను వినియోగించడం వల్ల సుమారు 40 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న చోట వ్యాపార విమాన ప్రయాణాన్ని చేపట్టక పోవడం వల్ల సుమారు 260 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 100 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. (చదవండి: దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!) -
పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్..! బంకులకు క్యూ కట్టిన జనాలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్, డిజీల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డిజీల్ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. కొత్త రికార్డులు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్‌కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. రూ. 12 కు పెరిగే ఛాన్స్..! రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ఆఫర్ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు. నష్టాల్ని పూడ్చుకోవాల్సిందే పెట్రోల్, డిజీల్ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
ఒకేరోజు డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 పెంపు.. బతికేది ఎలా?
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ) నేడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. ఎల్ఐఓసీ సంస్థ ఒక నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడవసారి. డీజిల్ రిటైల్ ధరను లీటరుకు రూ.75, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్ఐఓసీ ప్రకటించింది. శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు & గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం" అని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎటువంటి సబ్సిడీని అందుకోదని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో ధరలు పెంచాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చమురు, గ్యాస్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు అని మనోజ్ గుప్తా పేర్కొన్నారు. ధరలను భారీగా పెంచిన సంస్థకు నష్టాలు తప్పడం లేదు గుప్తా అన్నారు. ఎల్ఐఓసీకి ప్రధాన పోటీదారుడు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పటివరకు ఎలాంటి ధరల పెంపును ప్రకటించకపోవడం విశేషం. (చదవండి: రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!) -
పెట్రోల్ ధర రూ.12 అప్!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. దేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్‌పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది. తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్‌కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్‌లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్‌కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది. దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్‌యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం! -
పెట్రోల్, డీజిల్ ధరలపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ధరలు
కోలంబో: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం క్రమంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. యుద్దం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్ కూడా తీవ్ర సమస్యగా మారింది. రష్యా- ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ. 20, డీజిల్ రూ. 15 లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 139కి పెరిగింది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులపై మరింత భారం పడినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశంలో ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. విదేశీ మారక నిల్వలను ఆదాచేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్‌లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657 కు చేరి రికార్డు సృష్టించింది. తాజాగా కరెంట్ కోతలు సైతం విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బాబోయ్..మళ్లీ బండ బాదుడు!! రెట్టింపు కానున్న గ్యాస్ ధరలు!
రానున్న రోజుల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయికి చేరుకోగా..త్వరలో పెరగనున్న వంటగ్యాస్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారనున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొన్నాయి. సీఎన్జీ, విద్యుత్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రధాన కారణం పెరుగుతున్న రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులేనని తెలుస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరల ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి నుండి పుంజుకుంటున్న దేశాల వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాల్ని తీర్చడంలో వైఫల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే 2.9 డాలర్ల నుంచి 6 - 7 వరకు పెరిగే అవకాశం ఉండనుంది. చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?! -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..!
ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్ బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ కొంతమందికి ఊరటను కల్పించిన మరికొందరికీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ప్రతిపక్షాలు బడ్జెట్‌పై తీవ్ర విమర్శలను చేశాయి. బడ్జెట్లో పెట్రోల్, డిజీల్‌పై తీసుకున్న నిర్ణయం మరోసారి వాహనదారులకు షాక్ తగలనుంది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు లీటర్‌కు రూ. 2 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కారణం అదే..! పెంపు అప్పటి నుంచే..! ఇథనాల్ లేదా బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలనే ప్రతిపాదనను బడ్జెట్ 2022లో పొందుపరిచారు. దీంతో అన్‌బ్లెండెడ్ ఫ్యూయల్‌పై లీటరుకు రూ. 2 పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనతో చాలా ప్రాంతాల్లో 2022 అక్టోబర్ 1 నుంచి డీజిల్‌పై అదనపు బాదుడును కేంద్రం విధించనుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కొన్ని ప్రాంతాలలో పెట్రోలు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్గారాలను తగ్గించేందుకు..! మిక్స్డ్ పెట్రోల్, డీజిల్‌ను వాడడంతో తక్కువ స్థాయిలో ఉద్గారాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్లో నాన్-బ్లెండెడ్ ఇంధనాలపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 90 డాలర్లు దాటిన బ్యారెట్ క్రూడ్ ఆయిల్..! అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది.ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు 90 డాలర్లకు చేరిన భారత్‌లో ఇప్పటివరకు ఇంధన ధరల్లో మార్పు రాకపోవడం విశేషం. చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..! -
రాజకీయ ఇంధనం!
పెట్రోల్... డీజిల్... పాలకుల పుణ్యమా అని సెంచరీ దాటేసిన వీటి రిటైల్ రేట్లపై చర్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. అక్టోబర్ 30న వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలలో వీచిన ఎదురుగాలి ఫలితమో ఏమో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రో రేట్లను రవ్వంత తగ్గించాల్సి వచ్చింది. దీపావళి కానుకగా వచ్చిన ఆ ఊరడింపు ప్రకటనతో ఇప్పుడు రాష్ట్రాలూ తమ వంతు పన్నులను తగ్గించాలన్నది డిమాండ్ పైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు రానున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు సహజంగానే తమ వంతుగా వ్యాట్‌ను కొంత తగ్గించాయి. కానీ, ఇప్పటికే కేంద్రం నుంచి నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామని భావిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ కరోనా వేళ అందుకు నిరాకరించాయి. కేంద్రమే మరింత తగ్గించాలన్నాయి. కేంద్రం ఇష్టానికి పెంచుకుంటూ పోయిన రేట్లు ఇప్పుడు రాజకీయ అవసరాల క్రీడగా మారడమే విచారకరం. ప్రాథమిక చమురు ధరకు కేంద్ర ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్, వ్యాట్‌ను కలిపితే వచ్చేది – పెట్రోల్ బంకుల్లో అమ్మే రిటైల్ ధర. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి దేశీయంగా పెట్రోల్ రిటైల్ రేటు పెరగడం అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతర్జాతీయ మార్పులతో సంబంధం లేకుండా, ఇక్కడ పాలకులు ఎప్పటికప్పుడు అధిక సుంకాలు విధించుకుంటూ పోవడం సరైనది కాదు. గత ఏడాది క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా సరే కేంద్రం లీటరు పెట్రోలుపై రూ. 13, డీజిల్‌పై రూ. 16 వంతున ఎక్సైజ్ బాదుడు బాదింది. కరోనా ముందునాళ్ళతో పోలిస్తే, ఇప్పుడు పెట్రో రేట్లు కొండెక్కి కూర్చోవడానికి అలాంటి నిర్ణయాలే కారణం. అలా ధరలను కొండంత పెంచిన కేంద్రం ఏ ప్రయోజనాల కోసమైతేనేం ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని గోరంత తగ్గించింది. పెట్రోలుపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 మేరకైనా కేంద్రం తగ్గింపునివ్వడం ఆహ్వానించ దగినదే. అయితే, దాని వల్ల లభించిన ఊరట స్వల్పమే. పెట్రోలియమ్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ డేటా ప్రకారం పెట్రోలియమ్ రంగంపై వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి 2014–15లో రూ. 1.72 లక్షల కోట్లు వస్తే, ఇప్పుడది ఏకంగా రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. అందులో రాష్ట్రాలకు దక్కేది రూ. 19,475 కోట్లే. అంటే, 5.8 శాతమే. ఒకవైపున అంతర్జాతీయ సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా సరే, సామాన్యుడు కొనే పెట్రోల్, డీజిల్ రేట్లు చుక్కలనంటాయి. 2019 మేలో లీటరు పెట్రోల్ రూ. 76.89, డీజిల్ రూ. 71.50 ఉండేవి. పాలకుల పుణ్యమా అని రెండున్నరేళ్ళలో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి పెట్రోల్ రూ. 115.99, డిజీల్ రూ. 108.66కు సర్రున పెరిగాయి. ఇది కళ్ళెదుటి నిజం. గడచిన రెండేళ్ళలో పెట్రోలు, డీజిల్ రేట్లపై విధించే ఎక్సైజ్ సుంకం రూపురేఖలనే కేంద్ర సర్కారు మార్చేసింది. నిజానికి, ఇంధనంపై కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు పంచవలసి ఉంటుంది. కానీ, కేంద్రం తెలివిగా పెరిగిన పెట్రో ఆదాయం డివిజబుల్ పూల్‌లోకి రాకుండా, సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలోనే రూ. 2,87,500 కోట్లు వసూలు చేసింది. అలా వచ్చినదాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పని లేకుండా, తన దగ్గరే ఉండిపోయేలా కేంద్రం ఎత్తు వేసింది. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వాటాకు కేంద్రం ఇలా గండి కొట్టడంతో, రాష్ట్రాలు గతంలో సాక్షాత్తూ 15వ ఆర్థిక సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. యథేచ్ఛగా సెస్ పెంచిన కేంద్రం తీరా ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలనే వాదనను స్వపక్షీయుల నోట అనిపిస్తోంది. అసలే కరోనా దెబ్బతో ఆదాయాలు పోయి, దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ కునారిల్లాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లలోనూ రాష్ట్రాలే తగ్గింపు ఇవ్వాలని కోరితే, రాష్ట్రాలు మాత్రం ఎక్కడకు పోతాయి? ఏం చేస్తాయి? ఆ మాటకొస్తే ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కేంద్ర జీఎస్టీల వల్ల వచ్చే ఆదాయం కన్నా చమురుపై ఎక్సైజ్ సుంకంతో కేంద్రానికి వచ్చేది తక్కువ. కానీ, ప్రభుత్వం నడపడానికి ఈ చమురుపై వచ్చే ఆదాయమే అత్యంత కీలకమన్నట్టు కేంద్ర పాలకులు మాట్లాడడం ఎంతవరకు అర్థవంతం? ఏమైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా పన్నులను సమర్థించుకోవడం వల్ల అంతిమ భారం వినియోగదారుడి మీదే పడుతోంది. దేశంలో అమ్ముడయ్యే ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో నూటికి 80కి పైగా ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలే. పెట్రో ధరలపై కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలతో ఏకంగా ఈ సామాన్యుల ఇంటి బడ్జెట్లే తలకిందులు అవుతున్నాయి. అంటే, అటు ఆర్థికవ్యవస్థ పరంగా కానీ, ఇటు ప్రజా సంక్షేమ రీత్యా కానీ పెట్రోల్‌పై కేంద్ర సర్కారు వారి పన్ను విధానం లోపాలపుట్టే. ఇకనైనా, పెట్రో రేట్ల వ్యవహారాన్ని రాజకీయ విన్యాసంగా మార్చకుండా, పాలకులు సరైన నిర్ణయం తీసుకోవాలి. రాబడిలో న్యాయమైన వాటాపై కేంద్రం, రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి, పెట్రోల్‌పై అధిక పన్నులు తగ్గించాలి. సామాన్యులకు మేలు చేయాలి. పెట్రో రంగంపై బాదుడుతో ఆదాయాన్ని పెంచుకొనే ప్రయాస మానేసి, దశాబ్దకాలంగా పడిపోతున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టడం అత్యవసరం. మరోపక్క జీఎస్టీ మెరుగ్గా అమలయ్యేలా, మరింత ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. ఇలాంటి అసలైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తేనే, ఈ పెట్రో మంటలు తగ్గుతాయి. అలా కాకుండా, తామే ధరలు పెంచేసి, ఆ పైన పదో, పరకో తగ్గించాం లెమ్మంటే అది అక్షరాలా పిర్ర గిల్లి జోల పాడడమే! -
పెట్రో మంటలు..! 10 నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నెల రోజుల్లో లీటర్‌కు రూ.8కి పైగా పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విధంగా చమురు ధరలు పెరగడం అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి స్తోంది. వాహనదారులకు చుక్కలు కనబడుతుంటే.. నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరలు పరోక్షంగా నిత్యావసరా ల రేట్లు పెరిగేందుకు దోహదపడుతున్నా యి. సరుకు రవాణా చార్జీలు 10% నుంచి 15% వరకు పెరగడంతో నూనెలు, పప్పులు, కూరగాయల వంటి నిత్యావసరాలతో పాటు అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగిపోతున్నాయి. 15 రోజులకు బదులు రోజూ.. మే 2017 వరకు ప్రతి 15 రోజులకు పెట్రో ధరలను సవరించేవారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం (అంతర్జాతీయ సర్దుబాట్లు పేరిట) నేపథ్యంలో ఆ ఏడాది జూన్ నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సవరించడం మొదలుపెట్టారు. 2019 చివరి వరకు కొంత అటు ఇటుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు 2020 నుంచి హెచ్చు తగ్గులకు లోనవడం ప్రారంభం అయ్యింది. ఇక 2021 జనవరి నుంచి మొత్తం మీద పెరుగుదలే కొనసాగింది. ఈ ఏడాది జనవరి 1న హైదరాబాద్‌లో రూ.87.06 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర నవంబర్1 వ తేదీ నాటికి రూ.114.12కు పెరిగింది. అదే సమయంలో లీటర్ డీజిల్ రూ. 80.60 నుంచి రూ.107.40కి చేరింది. అంటే రెండిటి ధరల్లో పది నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల చోటు చేసుకుందన్నమాట. సెంచరీ దాటి దూసుకుపోతూ.. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ. 8.32 పైసలు, డీజిల్‌పై 9. 51 పైసలు పెరిగాయి. తర్వాత రెండు నెలలు లీటర్ పెట్రోల్‌పై 75 పైసలు, డీజిల్‌పై రూ.92 పైసలు మేరకు తగ్గాయి. ఆ తర్వాత వరసగా పెరుగుతూనే వచ్చాయి. జూన్‌లో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కును దాటగా... డీజిల్ అక్టోబర్ నెలలో సెంచరీ కొట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్ల మేర ఉంటోంది. ఈ లెక్కన నెలకు వినియోగదారులపై రూ. వందల కోట్ల భారం పడుతోంది. జనవరి నుంచి 10 నెలల్లో వేల కోట్ల భారం పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ.200కు చేరువలో వంట నూనెలు పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసరాల ధరలపై పెను ప్రభావం చూపుతున్నాయి. పాలు, పెరుగు, బియ్యం, కూరగాయలు, పండ్లు, నూనెలు, పప్పుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్‌కు రూ.200 మార్కుకు దగ్గరగా ఉన్నాయి. అనేక పప్పుల ధరలు కిలో రూ.150కి పైగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, టమాట, బెండకాయ, వంకాయ వంటి కూరగాయల ధరలు కిలోకు రూ. 60 నుంచి రూ. 80 వరకు పలుకుతున్నాయి. ప్రతి కిరాణ వస్తువు మీద కిలోకు రూ. 1 నుంచి రూ. 2 వరకు వరకు ధరలను పెంచినట్లు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే సరకు రవాణా చార్జీలను 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచారని, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పారు. రవాణా చార్జీలు పెరగడంతో నిత్యావసరాలతో పాటు ఇతర అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.40 కోట్ల వాహనాలు ఉండగా... అందులో సరుకు రవాణా వాహనాల సంఖ్య 3.73 లక్షలు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు, ఇతర సరుకులు, వస్తువులు, సామగ్రి తెచ్చే వేలసంఖ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పెరిగిన డీజిల్ ధరల ప్రభావం అన్ని రకాల సరుకులపై పడుతోంది వాహన ప్రయాణం భారం రాష్ట్రంలోని 1.40 కోట్ల వాహనాలలో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. టూ వీలర్ల ద్వారానే ప్రతిరోజు కోటి లీటర్లకు పైగా పెట్రోల్ వినియోగం అవుతోంది. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క లీటర్పైనే రూ.26కు పైగా పెరిగిందంటే 11 నెలల కాలంలో ఎంత మేర భారం పడిందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాహనాలపై వెళ్లడానికే భయపడే పరిస్థితి నెలకొంది. జీఎస్టీనే పరిష్కారమైనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. పెట్రోలియం సంస్థలు ధరలను పెంచుతుండగా, ఆ మొత్తానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను సవరిస్తున్నాయి. కేంద్రం పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పేరిట ఏకంగా రూ.39.27 మేర పన్నుల భారం వేస్తుండగా, రాష్ట్రం వ్యాట్ రూపేణా మరో రూ.26.29 వసూలు చేస్తోంది. ఈ పన్నుల కారణంగానే ధరలు అమాంతంగా పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఏడాదికి పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ రూపేణా సుమారు రూ.8 వేల కోట్ల మేర ఆదాయం వస్తోంది. రెండు నెలలుగా భారీగా పెరుగుతున్న చమురు ధరలతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. కొన్ని రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకున్నా, మన రాష్ట్రం మాత్రం పన్నులను తగ్గించలేదు. ఈ నేపథ్యంలో చమురు ధరలు దిగిరావాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని చెబుతున్నా... చమురు, మద్యంపై హక్కును వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. 2021 జనవరి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన హైదరాబాద్‌లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌కు) ఇలా.. –––––––––––––––– నెల పెట్రోల్ డీజిల్ –––––––––––––––––––––––– నవంబర్ 114.12 107.40 అక్టోబర్ 106.00 98.39 సెప్టెంబర్ 105.40 96.84 ఆగస్టు 105.83 97.96 జూలై 102.69 97.20 జూన్ 98,20 93.08 మే 93.99 88.05 ఏప్రిల్ 94.16 88.20 మార్చి 94.79 88.86 ఫిబ్రవరి 89.77 83.46 జనవరి 87.06 80.60 – రాష్ట్రంలో పెట్రోల్ వినియోగం నెలకు సగటున: 15 కోట్ల లీటర్లు – జనవరితో పోలిస్తే నవంబర్ నాటికి వినియోగదారులపై పడిన భారం సుమారుగా రూ.405.9 కోట్లు – సగటు డీజిల్ వినియోగం : 25 కోట్ల లీటర్లు – వినియోగదారులపై పడిన భారం రూ.676.5 కోట్లు అన్ని వర్గాలపై ప్రభావం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో సరుకు రవాణా చార్జీలు ఆకాశన్నంటాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి. – డి.పాపారావు, ఆర్థికరంగ నిపుణుడు -
ఇంధన ధరలు తగ్గేదే లే.! అక్కడ పెట్రోల్ రూ. 121 దాటేసింది..!
Petrol Diesel Prices Rise To New High On Oct 31: ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి పెంచాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసలు మేర పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 31, 2021) పెట్రోల్, డీజిల్‌పై పెంపుదల కనిపిస్తోంది. ►తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.34పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.98.07పైసలు వద్ద కొనసాగుతోంది. ►వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.115.15పై., డీజిల్ రూ.106.23కు చేరింది. ►కోలకత్తాలో పెట్రోలో రూ.109.79పైసలు, డీజిల్ రూ.101.19పైసలకు చేరాయి. ►హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.72కి చేరింది. డీజిల్ రూ.106.98 వద్ద కొనసాగుతోంది. ►విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.115.28 , రూ.107.94 గా ఉన్నాయి. ►చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.04, డీజిల్ రూ.102.25 గా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్‌ల ఆధారంగా ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాలో, పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.121 మార్కును దాటేశాయి. -
తగ్గేదేలే...హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..?
-
అయిదో రోజూ పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా అయిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగినట్లు ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరిందని తెలిపాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. కాగా, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పెరుగుదలను ప్రభుత్వం పాల్పడుతున్న పన్ను దోపిడీగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కొంతయినా ఉపశమనం లభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేయడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, పెట్రోల్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం రికార్డులు సాధించిందన్నారు. -
Petrol Diesel Prices: వరుసగా ఐదో రోజు కూడా బాదుడే...!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో..దేశ వ్యాప్తంగా మరోమారు పెట్రోలు, డిజీల్ ధరలు పెరిగాయి. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! వరుసగా ఐదవ రోజూ ఆదివారం (అక్టోబర్ 24, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.96.32పైసలు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.46పై., డీజిల్ రూ.104.38కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కి చేరింది. డీజిల్ రూ.105.08 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.113.52, రూ.106.11 గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.111.34, రూ.102.23 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్‌ల ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు ఉండనున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలూ 19 డాలర్లకు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 85 డాలర్లకు చేరుకుంది. చదవండి: 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్సైట్! ఎప్పుడంటే.. -
ఉచిత వ్యాక్సినేషన్ వల్లనే పెట్రో మంట!
న్యూఢిల్లీ: దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించారు. ఒక లీటర్ పెట్రోలు కన్నా ఒకలీటర్ హిమాలయన్ నీటి ధర అధికమన్నారు. పెట్రోల్ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామన్నారు. 130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుం దని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నింద మోపాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు.