planning
-
‘క్రూయిజ్’కు పెరుగుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్‌ఫాల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్‌లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.లోతైన సముద్ర క్రూయిజ్‌లు, తీర ప్రాంత క్రూయిజ్‌లు, రివర్ క్రూయిజ్‌లు, యాచ్ క్రూయిజ్లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.దేశీయంగా పెరుగుదల..గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్‌కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్‌లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.క్రూయిజ్ పర్యటనలు ఇలా..ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్‌ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్‌లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
Chandrayaan-3: చంద్రయాన్–3 ప్లానింగ్ షెడ్యూల్ సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయా న్–3 మిషన్ ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం దశలవారీగా చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు. చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు ఐసారు, లూనార్ ఆర్బిట్‌లోకి చేరుకున్న తర్వాత మరో ఐసా ర్లు ఆర్బిట్ రైజింగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమేట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) భూనియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించా రు. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను తీసుకెళుతున్న ప్రపొల్షన్ మాడ్యూల్ మొత్తం బరువు 2,145 కిలోలు. ప్రపొల్షన్ మాడ్యూల్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 1,696 కేజీల ఇంధనాన్ని నింపారు. మిగిలిన 449 కేజీలు పేలోడ్ ఇనుస్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ ప్రపొల్షన్ మాడ్యూల్‌కు అనుసంధానం చేసిన ల్యాండర్, అందులో ఉన్న రోవర్‌ను చంద్రుడి మీదకు విజయవంతంగా తీసుకెళ్లి వదిలిపెట్టింది. ఇప్పటికి రెండు ఘట్టాలను పూర్తిచేశారు. ఇక మూడో ఘట్టమే మిగిలి ఉంది. ఈ ఘట్టాన్ని కూడా ఈనెల 23న బుధవారం సాయంత్రం 5.47 గంటలకు ప్రారంభించి 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపైన దించుతుంది. దశలవారీగా చూస్తే.. ► జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ► మొదటిగా చంద్రయాన్–3 మిషన్ భూమికి దగ్గరగా అంటే పెరిజీ 175 కిలోమీటర్లు, భూమికి దూరంగా అపోజి 36,500 కిలోమీటర్లు దూరంలోని భూ మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. ► చంద్రయాన్–3 మిషన్ కక్ష్యలోకి ప్రవేశించగానే బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం (ఉపగ్రహాల నియంత్రిత భూకేంద్రం) శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు. ► గత నెల 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూ రంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 17న రెండోసారి భూమికి దగ్గరగా 173 కిలోమీ టర్ల ఎత్తును 223 కిలోమీటర్లుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తును 42,000 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ► 18న మూడో విడతలో 224 కిలోమీటర్లు, దూ రంగా 51,568 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 22న నాలుగో విడతలో భూమికి దగ్గరగా 233, దూరంగా 71,351 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు. ► 25న ఐదోసారి భూమికి దగ్గరగా 236, భూమికి దూరంగా 1,27,609 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. 25 నుంచి ఆగస్టు 1 అర్ధరాత్రి దాకా చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈనెల 1న అర్ధరాత్రి చంద్రయాన్–3 మిషన్నుపెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపునకు మళ్లించారు. ►5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164్ఙశ్రీ18074 ఎత్తుకు చేరింది. ► 6న ప్రపొల్షన్ మాడ్యూల్ లూనార్ ఆర్బిట్‌లో మొదటి సారిగా కక్ష్య దూరాన్ని తగించే ప్రక్రియను ప్రారంభించి 170్ఙశ్రీ4,313 కిలోమీటర్లకు తగ్గించారు. ►9న రెండో సారి కక్ష్య దూరాన్ని తగ్గించి 174్ఙశ్రీ1437 కిలోమీటర్లు చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. ► 14ప మూడోసారి 151్ఙశ్రీ179 కిలోమీటర్లకు తగ్గించారు. ► 16న నాలుగోసారి 153్ఙశ్రీ163 కిలోమీటర్లకు తగ్గించారు. ► 17న చంద్రయాన్–3 119్ఙశ్రీ127 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ► 18న ల్యాండర్ మాడ్యూల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113్ఙశ్రీ157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► 20న అంటే ఆదివారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా 25్ఙశ్రీ134 కిలోమీటర్లకు చేరుకుంది. ► 23 బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ల్యాండర్ మాడ్యూల్లో ఇంధనాన్ని 37 నిమిషాలపాటు మండించి 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవం ప్రాంతంలో దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించి చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను మదువైన చోట సేఫ్‌గా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండర్ చంద్రుడిపై దిగిన తరువాత అందులో నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు 4 గంటల సమయాన్ని తీసుకుంటుంది. రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చా క సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది.. -
ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే..
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కావున ఉద్యోగస్థులైనా, వ్యాపారస్తులైనా తప్పకుండా ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవడం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేసే వారు మాత్రం తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉ఇల్లు కొనటం అనేది కేవలం భావోద్వేగానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక పరమైన అంశం కూడా. కావున ఇల్లు కొనేటప్పుడు ఎక్కడ కొనుగోలు చేస్తున్నాము, ధర ఎంత ఉంది అనే మరిన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. సొంత ఇల్లు భద్రతాభావం అందిస్తుంది. 👉కొత్త ఇల్లు కొనుగోలు చేయడంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందని ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేస్తే, అవసరమైన సౌకర్యాలు లభించకపోగా.. రవాణా & ఇతర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 👉సాధారణంగా ఇంటికయ్యే ఖర్చులో 10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ అవసరం. అయితే మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి హోమ్ లోన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో ఇల్లు కొనుగోలు చేయడానికి అన్వేషించాలి. 👉ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రం సరిపోదు.. దానికి కట్టుదిట్టమైన రిజిస్ట్రేషన్ వంటివి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు మీరు ఇల్లు కొనుగోలు చేసే డబ్బుతో పాటు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. 👉బిల్డర్లు లేదా ప్రాపర్టీ డీలర్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కొనటానికి ముందే లాయర్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకోబోయే ప్రాపర్టీకి కో-ఓనర్ ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. అంతే కాకుండా తీసుకోబోయే ప్రాపర్టీ లిటిగేషన్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్నాయన్న తరువాతే రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు నిశ్చింతగా కొత్తింట్లో అడుగుపెట్టవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కావలసిన వివరాలు తెలుసుకోకుండా.. ఇల్లు కొంటే భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. దీనిని వినియోగదారుడు గుర్తుంచుకోవాలి. -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
పెట్టుబడుల నిర్వహణకు సామ్కో సీఆర్పీ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ సామ్కో కొత్త తరం క్యాపిటల్ రిసోర్స్ ప్లానింగ్ (సీఆర్పీ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులను అందుకునేలా ఇన్వెస్టర్లు సులువుగా తమ పెట్టుబడులను నిర్వహించుకునేందుకు, ట్రేడింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. ఇటు తమ పెట్టుబడులపై రాబడులను, అటు ప్రామాణిక సూచీలపై రాబడులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునేలా స్వంతంగా ఒక వ్యక్తిగత సూచీని ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇందులో సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. మరోవైపు, 67 శాతం మంది ఇన్వెస్టర్లు .. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులు అందుకోలేకపోతున్నారని తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో సూచీలను మించి రాబడులను అందుకునే ధోరణులను పెంపొందించేందుకు ’మిషన్ – ఏస్ ది ఇండెక్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. -
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్‌బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్‌బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్‌బీలు బిగ్ డేటా అనలైటిక్స్‌ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్‌ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
వచ్చే ఏడాది జీప్ కొత్త మోడళ్లు
ముంబై: దేశీయ మార్కెట్ కోసం వచ్చే ఏడాది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు జీప్ ఇండియా హెడ్ నిపుణ్ మహాజన్ తెలిపారు. ‘వచ్చే ఏడాది కూడా వృద్ధిని చూస్తున్నాం. ఉత్పత్తిని జోడించినప్పుడు వృద్ధి జరుగుతుంది. కస్టమర్ సంఖ్యను, పరిమాణాన్ని పెంచుతాం. మరింత వ్యాపారాన్ని జోడిస్తామని ఆయన ప్రకటించారు. ఇదీ చదవండి: Zomato డెలివరీ ఫెయిల్: భారీ మూల్యం చెల్లించిన జొమాటో పరిమాణం పరంగా 2023 మెరుగ్గా ఉంటుంది. 2022లో మూడు ఉత్పాదనలను పరిచయం చేశాం.నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఖరీదైన విభాగంలో పోటీపడుతున్నాయి. మార్కెట్ పనితీరు బాగుంది’ అని అన్నారు. భారత్‌లో కంపెనీ జీప్ కంపాస్, రాంగ్లర్, మెరీడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విక్రయిస్తోంది. గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిపుణ్ ఈ విషయాలను వెల్లడించారు. కాగా, ఈ ఎస్యూవీ ధర రూ.77.5 లక్షలు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 110కిపైగా అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎనమిది ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, ఆక్యుపెంట్ డిటెక్షన్ వీటిలో ఉన్నాయి. -
ప్లాన్ చెయ్.. గోల్ వెయ్!
మంచి వేతనం.. వీలైనంత పెట్టుబడి.. వీటితో ఆర్థిక లక్ష్యాల సాధన సులభమే అనుకుంటున్నారా..? ఎంత సంపాదించామన్నది కాదు.. భవిష్యత్తు కోసం ఎంత ప్రణాళికాబద్దంగా మదుపు చేశామన్నది ముఖ్యమనే ఆర్థిక సూత్రం గుర్తుకు తెచ్చుకోండి. ఆర్థిక లక్ష్యాల సాధనకు దగ్గరి దారి అంటూ లేదు. అనుకున్నంత సులభమూ కాదు..! సరైన అంచనాలు, రాబడులు, అంచనాలకు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించడం, వివిధ సాధనాల మధ్య సమతూకమైన కేటాయింపులు, అత్యవసరాలకు సన్నద్ధత, జీవితానికి, రుణాలకు, ఆరోగ్యానికి రక్షణలు.. ఇటువంటివన్నీ ఎంతో కీలకమవుతాయి. ఒకటి అనుకోవచ్చు. కానీ, ఫలితం మరో రకంగా ఉండొచ్చు. తుది ఫలితంపై ప్రభావం చూపించే అంశాలు ఎన్నో ఉంటాయి. మెరుగైనవి అనుకున్న ప్రణాళికలు కూడా బెడిసి కొట్టొచ్చు. ఇందుకు కారణం మీరు వేసే తప్పటడుగులు కావచ్చు. తప్పుడు అంచనాలు కూడా కావచ్చు. ఆర్థిక లక్ష్యాల సాధనలో పొరపాట్లు, తప్పులకు అవకాశం లేకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడమే ఈ కథనం ప్రధాన ఉద్దేశం. పునాదులు బలంగా ఉంటేనే నిర్మాణం చాలా కాలం పాటు నిలుస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అకాల మరణం సంభవిస్తే.. పెద్ద ప్రమాదానికి లోనైతే.. తీవ్ర అనారోగ్యం బారిన పడితే.. అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోతే ప్రణాళికలపై పెద్ద ప్రభావమే పడుతుంది. ముఖ్యంగా గత రెండేళ్లలో (కరోనా నాటి నుంచి) ఎన్ని అనూహ్య పరిణామాలను వ్యక్తులుగా మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకోవాలి. ఉద్యోగాలు కోల్పోయిన వారు, వేతన కోతలను ఎదుర్కొన్నవారు, ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.లక్షలు ధారపోసిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా.. చాలకుండా ఇబ్బంది పడ్డవారు చాలా మందే ఉన్నారు. జీవిత బీమా లేకుండా, కరోనాతో మరణించిన వ్యక్తుల (స్థితిమంతులు కానివారు) కుటుంబాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే తగినంత జీవిత బీమా, వైద్య బీమా రక్షణ, రుణాలకు రక్షణ కవరేజీలతోపాటు అత్యవసర నిధి అంటూ ఒకదానిని సమకూర్చుకోవాలని ఈ పరిణామాలు తెలియజేశాయి. బీమా రక్షణ ఎంత తీసుకోవాలి? దీనికి.. అందరికీ ఒక్కటే సమాధానం కాబోదు. వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ఆరోగ్య చరిత్ర, వయసు ఇలా ఎన్నో అంశాలు ప్రామాణికం అవుతాయి. ఎంతలేదన్నా కనీసం 10 ఏళ్ల వార్షిక ఆదాయానికి తగ్గకుండా బీమా రక్షణ ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ మీ కుటుంబ జీవనానికి అవుతున్న ఖర్చులు, చెల్లించాల్సిన రుణ ఈఎంఐలు కీలకం అవుతాయి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి జీవిత బీమా అంటూ ఇతమిద్ధమైన ప్రామాణికం లేదు. భారీగా అప్పులు తీసుకుని ఏదోలా నెట్టుకు వస్తున్న వారికి అధిక కవరేజీ అవసరం. మీ ఆదాయ వ్యయాలు, తీర్చాల్సిన రుణ బాధ్యతలు, పెట్టుబడులు అన్నీ కూడా జీవిత బీమా కవరేజీ కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మృణ్ అగర్వాల్ సూచించారు. వైద్య బీమా విషయానికొస్తే కనీసం రూ.5 లక్షల కవరేజీ అవసరం. మెట్రోల్లో నివసించే వారికి కనీసం రూ.7–10 లక్షల కవరేజీ అయినా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబానికి కనీసం రూ.15 లక్షల ఫ్లోటర్ పాలసీ ఉండడం సహేతుకమన్నది ఆర్థిక సలహాదారు సూచన. ఇందుకోసం బేసిక్‌గా కొంత కవరేజీ తీసుకుని దానికి సూపర్ టాపప్ జోడించుకోవడం ద్వారా తక్కువ ప్రీమియానికే మెరుగైన రక్షణ ఉండేలా చూసుకోవచ్చు. అత్యవసర నిధితో అనుకోకుండా ఎదురయ్యే అవసరాలను గట్టెక్కవచ్చు. ‘ఆర్థిక ప్రణాళిక అత్యవసర నిధితోనే మొదలవ్వాలి. ఎందుకంటే మిగులు నిల్వలుంటేనే ప్రణాళిక మొత్తం సాఫీగా నడిచిపోతుంది’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరాని సూచించారు. కనీసం వచ్చే ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అదనంగా మరో 3–6 నెలల అవసరాలకు కూడా నిధిని సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నిశ్చింతను ఇస్తుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ము ఖ్యంగా ఉద్యోగ భద్రత లేని వారు ఏడాది అవసరాలకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వీటికి అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకోవాలి. తీవ్ర అనారోగ్యాల్లో (కిడ్నీలు, మూత్ర పిండాలు, గుండె జబ్బులు, కేన్సర్ వంటివి) బేసిక్ హెల్త్ కవరేజీ చాలకపోవచ్చు. ఒక్కటిగానే.. లేక విడిగానా ఒక్కో లక్ష్యానికి విడిగా పెట్టుబడులు పెట్టుకోవడమా? లేదంటే అన్నింటినీ కలిపి ఒక్కటే విధానం అనుసరించడమా? ఉద్యోగం లేదా వృత్తి జీవితం కొత్తల్లో చాలా మంది తమకు మిగులుతున్నంత మేరకు తీసుకెళ్లి ఒక్కటే పెట్టుబడిగా నిర్వహిస్తుంటారు. చాలా మంది యువతకు ప్రణాళికల పట్ల ఆసక్తి అంతగా కనిపించడదు. కేవలం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళుతుంటారు అంతే. తమ ఆర్థిక లక్ష్యాలకు అంకెలను జోడించకపోతే అందులో సమగ్రత లోపిస్తుంది. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత మీ జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్నదానిపై స్పష్టత ఉండకపోతే.. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలోనూ స్పష్టత ఉండదు. వీలున్నంత చేసుకుంటూ వెళితే చివర్లో ఆ నిధి సరిపడకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పైగా ప్రతీ లక్ష్యం వారీగా పెట్టుబడుల ప్రణాళిక లేకపోతే.. ఒక్కటే పెట్టుబడి నిధి కొనసాగుతుంది. అప్పుడు సమీప కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం ఈ ఏకీకృత నిధి నుంచి ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీంతో భవిష్యత్తు లక్ష్యాలకు కొంతే మిగులుతుంది. ఉదాహరణకు రుణంపై ఇల్లు సమకూర్చుకునేందుకు డౌన్ పేమెంట్ కోసమని కొంత వెనక్కి తీసుకుంటే.. అప్పుడు పిల్లల ఉన్నత విద్య, విశ్రాంత జీవన అవసరాలపై ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే అన్నింటికీ ఒక్కటే నిధి కాకుండా.. విడిగా ప్రతీ అవసరం, లక్ష్యానికి ప్రత్యేక ప్రణాళిక, కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి. ప్రతీ బకెట్‌లోనూ ప్రత్యేక పెట్టుబడులు అవసరమని కాదు దీని ఉద్దేశ్యం. భిన్న లక్ష్యాలకు ఒకే విధమైన మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడి సాధనాలను వినియోగించుకోవచ్చు. కాకపోతే ప్రతీ లక్ష్యానికి విడిగా కేటాయింపుల ప్రణాళిక ఉండాలి. అంటే లక్ష్యం వారీగా సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పూర్తి స్పష్టత ఉంటుంది. ‘‘అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామనే దానిపై స్పష్టత ఉంటే ప్రణాళిక అమలు సులభంగా మారుతుంది’’ అని గెట్టింగ్ యూ రిచ్ సీఈవో రోహిత్‌షా అన్నారు. అంచనాలు సరిగ్గా ఉంటేనే.. అన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో లక్ష్యానికి ఇన్వెస్ట్ చేస్తే మీ బాధ్యత తీరినట్టు కాదు.. లక్ష్యాన్ని చేరినట్టు కానే కాదు. ఫలానా లక్ష్యానికి పెట్టుబడులు ప్రారంభింస్తే సగమే పూర్తయినట్టు అనుకోవాలి. కొన్నేళ్ల తర్వాతి అవసరానికి ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకునే ముందు కరెన్సీ విలువను, కొనుగోలు శక్తిని తగ్గించేసే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంపిక చేసుకునే సాధనాల్లో రాబడులపై కచ్చితమైన అంచనాలు ఉండాలి. అధిక రాబడుల అంచనాలు వేసుకుంటే అది చివర్లో అయోమయానికి దారితీయవచ్చు. అందుకే రాబడుల అంచనాలు సహేతుకంగా, చారిత్రక గణాంకాలకు సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలి. మీ పెట్టుబడికి ఆ రాబడి అంచనా రేటును జోడిస్తే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నదానిపై స్పష్టత సాధించొచ్చు. ఇక ద్రవ్యోల్బణ రేటు అన్నింటికీ ఒకటే మాదిరిగా ఉండదు. విద్య, వైద్యానికి సంబంధించి మన దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. నిత్యావసర ఉత్పత్తులపై ద్రవ్యోల్బణం మోస్తరుగా ఉంటుంది. ఇళ్ల ధరల ద్రవ్యోల్బణం 3–4 శాతం స్థాయిల్లోనే ఉంటే.. విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం స్థాయిలో ఉంటుంది. అంటే ఫలానా కోర్సుకు ప్రస్తుతం రూ.లక్ష ఖర్చవుతుంటే.. ఏడాది తర్వాత అదే కోర్సు కోసం రూ.1.10 లక్షలు అవసరమవుతాయి. పెట్టుబడులపై రాబడులను అధికంగా ఊహించుకోవడం కూడా విఘాతం కలిగించేదే. ఈక్విటీలపై రాబడులు 11–13% దీర్ఘకాలంలో వస్తాయని ఆశించడం సమంజసంగానే ఉంటుంది. అంతేకానీ, 22–24% స్థాయి రాబడులు వస్తాయని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే చివర్లో కావాల్సిన మొత్తానికంటే తక్కువే సమకూరొచ్చు. అందరికీ ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉండాలనేమీ లేదు. ఈక్విటీలకు తక్కువ కేటాయింపులతోనూ దీర్ఘకాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. కాకపోతే అప్పుడు రాబడులపై అంచనాలు మోస్తరుగానే ఉండాలి. అందుకు కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్... ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, లక్ష్యానికి ఉన్న వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనాలు, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయమవుతుంది. అప్పుడే వివిధ సాధనాల మధ్య ఎంత చొప్పన ఇన్వెస్ట్ (అస్సెట్ అలోకేషన్) చేసుకోవాలన్న స్పష్టతకు రాగలరు. ఆర్జన మొదలు పెట్టిన కొత్తలో ఈక్విటీలకు 75–80 శాతం కేటాయింపులు సరైన విధానమే అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ, లక్ష్యాలకు చేరువ అవుతున్న తరుణంలోనూ ఈక్విటీలకు కేటాయింపులను 80 శాతం చొప్పున కొనసాగించుకుంటూ వెళ్లడం సరికాదు. ముఖ్యంగా గడిచిన 18–24 నెలల రాబడులను ప్రామాణికంగా చూడొద్దు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు కుప్పకూలి తిరిగి భారీ ర్యాలీ చేశాయి. 15–20 ఏళ్లలో ఈక్విటీల నుంచి 11–12 శాతం రాబడులు ఆశించడం సహేతుకం అవుతుంది. అదే డెట్, ఈక్విటీల కలబోతపై రాబడులు 9–10 శాతం స్థాయిలో ఉంటాయని ఆశించొచ్చు. స్థిరాదాయ సాధనాల నుంచి 7–8 శాతం రాబడులకు మించి ఆశించొద్దు. సమీక్ష, దిద్దుబాటు.. మీరు చేస్తున్న పెట్టుబడులపై రాబడి అంచనాలకు తగ్గట్టుగా లేదనుకోండి.. లేదంటే మీరు వేసుకున్న అంచనాలకు మించి ద్రవ్యోల్బణం ఉందని గుర్తించినట్టయితే.. తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఒక శాతం ఎక్కువ ఉన్నా అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇందుకు వీలుగా పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. ఏటా పెట్టుబడిని నిర్దేశిత శాతం మేర పెంచుకుంటూ వెళ్లడం ఒక పరిష్కారం అవుతుంది. అస్సెట్ రీబ్యాలన్స్ను అమలు చేయాలి. లక్ష్యానికి చేరువ అవుతున్న సమయంలో అస్సెట్ అలోకేషన్ పక్కాగా ఉండాలన్నది నిపుణుల సూచన. అనుకున్నట్టుగా ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్లడం లేదని ఎప్పుడు భావించినా.. నిపుణులైన ఆర్థిక సలహాదారుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. లక్ష్యాన్ని సమీపిస్తుంటే... లక్ష్యానికి చేరువు అవుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్ ఏదైనా సంక్షోభం కారణంగా కుప్పకూలితే పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మరింత పెట్టుబడికి మొగ్గు చూపించొచ్చు. తద్వారా తక్కువ ధరలకే ఎక్కువ యూనిట్లు సమకూరతాయి. కాకపోతే ఈక్విటీ మార్కెట్ బేర్ దశ నుంచి బయటకు వచ్చేందుకు 2–3 ఏళ్ల సమయం పట్టొచ్చు. అరుదుగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే అప్పుడు ఏం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి. కనుక లక్ష్యానికి మరో 3–4 ఏళ్లు వ్యవధి ఉండగానే ఈక్విటీ పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా నిర్ణీత శాతం చొప్పున డెట్ సాధనాలకు మళ్లించుకోవాలి. ఇందుకు సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లక్ష్యం మరో 18 నెలలు ఉందనగా అనుకున్నంత సమకూరడం లేదని తెలిస్తే.. అప్పుడు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతరాన్ని పూడ్చుకుందామనుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది. మరో 2–3 ఏళ్ల వ్యవధి ఉంటే ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవడం సరికాదు. దీనికి బదులు వీలైతే ఆ లక్ష్యాన్నే వాయిదా వేసుకోవడం ఒక మార్గం. విశ్రాంత జీవనం, పిల్లల ఉన్నత విద్య లక్ష్యాలకు ఈ వాయిదా కుదరదు. కానీ, కారు కొనుగోలు, ఇల్లు కొనుగోలు, ఇతర విలాస వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇతర లక్ష్యాల నిధి నుంచి కొందరు తీసేసుకుంటారు. కారు కొనుగోలు వంటి అవసరం కాని నిధి నుంచి తీసుకుంటే తప్పులేదు. కానీ, పిల్లల విద్య, విశ్రాంత జీవనం లక్ష్యాల నుంచి తీసుకోవడం సరికాదు. అటువంటప్పుడు విద్యా రుణం వంటి మార్గాలను పరిశీలించొచ్చని షా సూచించారు. -
వచ్చే ఏడాది ‘వేతన’ పండుగ!
ముంబై: భారత్‌లో వచ్చే ఏడాది వేతన పెంపులు అధిక స్థాయిలో ఉండొచ్చంటూ అంతర్జాతీయ అడ్వైజరీ సంస్థ ‘విల్లిస్ టవర్స్ వాట్సన్’ అంచనా వేసింది. 2021లో వేతన పెంపులు సగటు 8 శాతం స్థాయిలో ఉంటే, 2022లో సగటున 9.3 శాతానికి పెరగొచ్చంటూ ‘శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్’లో పేర్కొంది. ఉద్యోగులను నిలుపుకోవడం, వారిని ఆకర్షించే సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ వేతన పెంపుల దిశగా అడుగులు వేయక తప్పదన్నది ఈ సంస్థ విశ్లేషణ. వచ్చే 12 నెలల కాలానికి మెరుగైన వ్యాపార పరిస్థితుల దృష్ట్యా.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే ఎక్కువ వేతనాల పెంపు ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ సంస్థ ద్వైవార్షిక సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 13 దేశాల్లోని 1,405 కంపెనీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో 435 భారత కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్‌లో మెజారిటీ కంపెనీలు (52.2 శాతం) వచ్చే ఏడాది కాలానికి సానుకూల వ్యాపార ఆదాయ అంచనాలను వెల్లడించినట్టు ఈ నివేదిక తెలియజేసింది. 2020 నాలుగో త్రైమాసికంలో ఉన్న 37 శాతం కంటే ఇది ఎంతో మెరుగుపడినట్టు ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దానికి ఇది నిదర్శనంగా పేర్కొంది. సర్వే నివేదికలోని వివరాలు.. ► 30 శాతం కంపెనీలు వచ్చే 12 నెలల్లో నియామకాలను పెంచనున్నట్టు తెలిపాయి. 2020లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ► ఇంజనీరింగ్ (57.5 శాతం) ఐటీ (53.4 శాతం) సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ట్రేడింగ్ (34.2 శాతం), విక్రయాలు (37), ఫైనాన్స్ 11.6 శాతం చొప్పున నియామకాలు ఉండనున్నాయి. ► ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా ఉంది. స్వచ్చంద అట్రిషన్ రేటు (ఉద్యోగులు స్వయంగా మారిపోవడం) 8.9 శాతంగా, స్వచ్ఛందం కాని (కంపెనీలే ఉద్యోగులను తొలగించడం) అట్రిషన్ రేటు 3.3 శాతంగా ఉంది. ► 2022లో హైటెక్ రంగంలో 9.9 శాతం మేర వేతన పెంపు ఉండనుంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రిటైల్ రంగ్లాలో 9.5 శాతం మేర, తయారీలో 9.30 శాతం మేర పెంపు ఉండొచ్చు. నిపుణులను నిలబెట్టుకోవడం సవాలు.. ‘‘వ్యాపార ఆశావాదం పెరగడం అధిక వేతన బడ్జెట్‌కు, అధిక నియామకాలకు దారితీయనుంది. ఉద్యోగులపై ఖర్చు పెట్టే విషయంలో కంపెనీలకు కరోనా మహమ్మారి ఒక వాటర్òÙడ్ విప్లవం వంటిది’’ అని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సలి్టంగ్ లీడర్ ఇండియా రాజుల్ మాథుర్ పేర్కొన్నారు. -
ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ క్రిస్ కెయిన్స్ జీవితం నేర్పే పాఠాలివే!
ఇప్పుడు న్యూజిల్యాండ్ అంటే కెయిన్ విలియమ్సన్ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు అతనే క్రిస్ కెయిన్. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్ టు హై సక్సెస్ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ కెయిన్స్ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్ జీవితం. న్యూజిల్యాండ్ స్టార్ హాలీవుడ్ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్ స్టార్ ఆటగాడు కెయిన్స్. ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్ తను ఎదిగాడు. పైసల్లేక ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్ కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్ చివరకు బస్సులు కడిగే క్లీనర్ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి డైమండ్ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్ కెయిన్స్ కెరీర్ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్మెంట్ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. అదుపులేని ఖర్చులతో కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. అవనసర ఖర్చులు వద్దు అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్ కెయిన్స్ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు. ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్ రన్లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్ బఫెట్ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు. ఆలోచన ధోరణి మారాలి డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు. -
రూ.100 నోటు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలకు షాకిచ్చిన కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనుం దా? తాజా వార్తలు, సాక్షాత్తు ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్‌డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు యోచిస్తున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా పంచాయతీలోని మంగళూరు, నేత్రావతి హాల్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ (డిఎల్ఎస్సి), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (డిఎల్ఎంసి) సమావేశంలో బీ మహేష్ మాట్లాడుతూ రూ.100, రూ .10, రూ .5 పాత కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్ ఇచ్చారు. అలాగే 10 రూపాయల నాణెం ప్రవేశపెట్టి 15 సంవత్సరాల తరువాత కూడా వ్యాపారులు, వ్యాపారవేత్తలు సహా చాలామంది వాటిని అంగీకరించడానికి ఇష్టపడ్డంలేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తుండటంతో బ్యాంకులు, ఆర్బీఐకి సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మరి పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఆర్బీఐ అమలుచేయనున్న సమగ్ర ప్రణాళిక, విధివిధానాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాగా నవంబర్ 8, 2016లో రూ.500,1000 రూపాయల నోట్ల డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువైన కరెన్సీ నోట్‌తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది. 2019లో 100 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. 2019 లో, సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టిఐ సమాధానంలో ఆర్బీఐ వెల్లడించింది. దీంతో త్వరలోనే 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్బీఐ అప్పట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
మీ అడుగులు ఎటువైపు..
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎన్నో పాఠాలు నేర్పిన సంవత్సరం.. 2020. ఒక మహమ్మారి (కోవిడ్–19) వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలను కుదిపేసింది. పెట్టుబడులపై దీని ప్రభావం గణనీయంగానే పడింది. ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకుని.. భవిష్యత్తు పరిస్థితులపై ఒక అంచనాతో 2021 సంవత్సరానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారా..? పెట్టుబడుల విషయంలో ఏ విభాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఫండ్ మేనేజర్ల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీలు రంగాలు.. ప్రస్తుతానికి అయితే అన్ని రకాల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని రంగాల్లో డిమాండ్ బలంగానే ఉంది. వ్యయ నియంత్రణలు, ఆస్తుల నాణ్యత పరంగా మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. మహమ్మారిని నియంత్రించడం ఆలస్యమైనా లేదా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో కొనసాగకపోయినా రంగాల వారీగా ర్యాలీ కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావొచ్చు. జీడీపీ వృద్ధి తీరుపైనే మార్కెట్ రాబడులు ఆధారపడి ఉంటాయి. 2–5 ఏళ్ల కాల దృష్టితో ఇన్వెస్టర్లు పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. – శ్రేయాష్ దేవల్కర్, సీనియర్ ఫండ్ మేనేజర్, యాక్సిస్ ఏఎమ్‌సీ మిడ్, స్మాల్‌క్యాప్ మార్చి, జూన్ త్రైమాసికాలపై లాక్డౌన్ ప్రభావం చూపించగా.. ఆదాయాల పరంగా మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు 2020 సెప్టెంబర్ నాటికి మంచి రికవరీని చూపించాయి. అంతర్జాతీయంగా వెల్లువలా ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా స్టాక్స్ ధరలను గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఎర్నింగ్స్ రికవరీ ఆలస్యమవుతుందన్న అంచనాలతో మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో.. ఇప్పటికీ బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, రిటైల్ స్టాక్స్ పనితీరు నిరుత్సాహకరంగానే ఉంది. కొన్ని రంగాల/స్టాక్స్ విలువలు చాలా ఎక్కువలోనే ఉన్నాయి. కనుక అధిక ఆశావాదంతో కాకుండా బలహీన కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విలువలు చూడ్డానికి అధికంగా ఉన్నాయి. కానీ, అవి తక్కువ ఆర్జనా సైకిల్లో (కాలంలో) ఉన్నాయి. ఆదాయాల్లో రికవరీ మొదలైతే ఇవి మంచి రాబడులను ఇవ్వగలవు. అధిక వ్యాల్యూషన్ల దృష్ట్యా ఏడాది కోసం అయితే స్మాల్, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయవద్దనే సూచిస్తున్నాము. ప్రస్తుతం చూస్తున్న అనిశ్చిత పరిస్థితుల్లో 2021 సంవత్సరానికి ప్రత్యేకంగా ఏ అంచనాలు ఇవ్వడం వివేకమని భావించడం లేదు. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు ఈ విభాగంలోని స్టాక్స్‌లో పెట్టుబడుల వైపు చూడొచ్చు. ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ డెట్ వడ్డీ రేట్లు..! రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండడం, ఆర్బీఐ చర్యల కారణంగా విస్తారమైన నిధుల అందుబాటు నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు లిక్విడిటీ మిగులుగానే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకూలతల దృష్ట్యా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి (ఐదేళ్ల వరకు) ఈల్డ్ కర్వ్ అధికంగానే ఉండొచ్చు. పాలసీ సర్దుబాట్లు క్రమంగా ఉండొచ్చు. ఈల్డ్ కర్వ్ చాలా నిటారుగా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యామూడేళ్ల కంటే ఎక్కువ కాల దృష్టితో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అస్థిరతలకు సన్నద్ధంగానూ ఉండాలి. – అనురాగ్ మిట్టల్, ఐడీఎఫ్సీ ఫండ్ ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ ఏవి మెరుగు? ఇన్వెస్టర్లు తమ కాల వ్యవధి, రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులను మూడు బకెట్లుగా వర్గీకరించుకోవాలి. లిక్విడిటీ బకెట్‌ను స్వల్ప కాల అవసరాల కోసం కేటాయించుకోవాలి. కోర్ బకెట్ అధిక నాణ్యతతో కూడిన క్రెడిట్ లేదా డ్యురేషన్ ఫండ్స్‌తో ఉండాలి. స్థిరమైన రాబడులను అందించే విధంగా ఎంపిక ఉండాలి. ఇందుకోసం అల్ట్రాషార్ట్, మీడియం టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక శాటిలైట్ బకెట్ అన్నది దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించినది. మూడేళ్లకు పైన కాలానికి కేటాయింపులు చేసుకునే వారికి ఇది అనుకూలం. కొంత అస్థిరతలను తట్టుకునే విధంగా ఉండాలి. అయితే స్థూల ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో, క్రెడిట్ స్ప్రెడ్స్ కుచించుకుపోయిన దృష్ట్యా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి రిస్క్‌కు తగ్గ రాబడులు ఇవ్వవని మా అభిప్రాయం. పసిడి లార్జ్‌క్యాప్.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య, పరపతి విధానాలు సులభంగా మారడం కారణంగా వచ్చిన స్టాక్స్ ర్యాలీ ఇది. అధిక ఫ్రీ క్యాష్ ఫ్లో (వ్యాపారంలో నగదు లభ్యత), తక్కువ రుణ భారం, అధిక ఆర్‌వోఈ (ఈక్విటీపై రాబడి) ఉన్న కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. గడిచిన రెండు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే.. పండుగుల సీజన్‌తో ధరల పరంగా కంపెనీలకు స్వేచ్ఛ (ప్రైసింగ్ పవర్) తిరిగి లభించింది. డిమాండ్ ఎక్కువగా ఉండడానికి తోడు, ఇప్పటికీ కొన్ని రంగాల్లో సరఫరా పరంగా సమస్యలు ఇందుకు కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా 2021లో ఈ డిమాండ్ నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైనది. తక్కువ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు కొనసాగడం అనేది రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక రికవరీకి కీలకం అవుతుంది. చాలా కంపెనీల వ్యాల్యూషన్లు అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్లలో పురోగతి, తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన రాబడులకు దారితీయగలవు. ర్యాలీ ముగిసినట్లేనా? కరోనా వ్యాక్సిన్ల తయారీలో పురోగతితో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశావహ ధోరణి ఏర్పడింది. దీంతో రిస్కీ సాధనాలకు (ఈక్విటీ తదితర) డిమాండ్ ఏర్పడడంతో బంగారం ర్యాలీ గత కొన్ని వారాలుగా నిలిచింది. అయితే, సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్లను ఇవ్వడం ఆరంభించినా కూడా.. గడిచిన కొన్ని నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన నష్టం ఒక్క రాత్రితో పోయేది కాదు. పూర్తిగా కోలుకునేందుకు ఐదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు మరో విడత పెరిగిపోవడంతో ఆర్థిక రికవరీ బలహీనపడనుంది. మరికొన్ని నెలల పాటు ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయి. బంగారం ధరల్లో అప్‌మూవ్ కరోనాకు ముందే మొదలైంది. కాకపోతే అద్భుత ర్యాలీకి కారణాల్లో కరోనా వైరస్ కూడా ఒకటి. బంగారం ధరలకు మద్దతుగా నిలిచిన స్థూల ఆర్థిక పరిస్థితులే 2021లోనూ కొనసాగనున్నాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య ప్రపంచంలో కనిష్ట వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము. కనుక యూఎస్ ట్రెజరీల్లో కంటే బంగారంలో పెట్టుబడులను కలిగి ఉండడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. అనూహ్యమైన లిక్విడిటీతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉండనే ఉంది. ఇది కూడా బంగారానికి మద్దతుగా నిలిచే అంశమే. గోల్డ్ ఈటీఎఫ్‌లు.. భారత్‌లో బంగారంపై పెట్టుబడుల విషయంలో ఈటీఎఫ్‌ల వాటా గతంలో 10 శాతంగా ఉంటే, 2020లో 25 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ కారణంగా భౌతికంగా బంగారం కొనుగోలుకు అననుకూలతలు ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే, డిజిటైజేషన్, బంగారంలో స్వచ్ఛత, ధరలు, సౌకర్యం కూడా ఇన్వెస్టర్లను ఈటీఎఫ్‌లకు దగ్గర చేస్తోంది. కనుక ఈటీఎఫ్‌లకు ఆదరణ కొనసాగుతుంది. బంగారం అన్నది రిస్క్‌ను తగ్గించి, పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్నిచ్చే సాధనం. మీ పెట్టుబడుల్లో 10–15 శాతం మేర బంగారానికి ఇప్పటికీ కేటాయించనట్టయితే.. అందుకు ఇది సరైన తరుణం అవుతుంది. తక్కువ ధరల నుంచి ప్రయోజనం పొందొచ్చు. – చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ ఏఎమ్‌సీ రియల్టీ ఇళ్లకు డిమాండ్ 2020 ద్వితీయ ఆరు నెలల్లో (జూలై నుంచి) నివాస గృహాలకు బలమైన డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖా తీసుకున్న చర్యలు కొనుగోలు దిశగా నిర్ణయానికి దారితీశాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో గృహాల ధరలు చాలా మార్కెట్లలో స్థిరంగా ఉండిపోవడం, కొన్ని చోట్ల దిద్దుబాటుకు (తగ్గడం) గురి కావడం చూశాము. దీంతో అవి అందుబాటు ధరలకు వచ్చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల డిమాండ్ పుంజుకుంది. కొత్త ఏడాది! ఇతర పెట్టుబడి సాధనాల పనితీరు, బడ్జెట్లో ప్రకటనలు, కేంద్రం అందించే రాయితీలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇవన్నీ డిమాండ్‌ను నిర్ణయించేవే. ఆర్థిక వృద్ధిలో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లు అంత త్వరగా అంతం కావు. వాణిజ్య రియల్టీ అంతర్జాతీయ, దేశీయ ఐటీ, టెక్నాలజీ రంగంలో క్రమబద్ధమైన వృద్ధి, కార్పొరేట్ల విస్తరణ కారణంగా.. ఆఫీసు స్థలాలకు వృద్ధి కొనసాగుతూనే ఉంది. కీలకమైన వాణిజ్య మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీల్లో వృద్ధి నెలకొనడమే కాకుండా, సాధారణ స్థితి ఏర్పడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నందున ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాము. – శిశిర్ బైజాల్, చైర్మన్, ఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా -
వారంపైగా ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ (ఖాళీ తేదీలు) సెప్టెంబర్ నెలలో లేనందున, ఆగస్టులోనే సెట్స్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్స్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారుపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై శనివారం అడ్వొకేట్ జనరల్‌తోనూ చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్ నిర్వహణపై చర్చించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. వారంపైగా ఎంసెట్ పరీక్షలు కరోనా నేపథ్యంలో సెట్స్ నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో సెషన్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15–16 వేలకు తగ్గించనున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సాధారణంగా ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను వారంపైగా నిర్వహించాల్సి ఉంది. 70 వేల మందికిపైగా హాజరయ్యే అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో సెషన్‌కు విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఐదు రోజుల్లో 8 నుంచి 9 సెషన్లలో, అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడ్రోజుల్లో నాలుగైదు సెషన్లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 55,012 దరఖాస్తులు వచ్చిన ఐసెట్ మూడు లేదా నాలుగు సెషన్లలో, 43,356 దరఖాస్తులు వచ్చిన ఎడ్‌సెట్‌ను మూడు సెషన్లలో, 27,978 దరఖాస్తులు వచ్చిన ఈసెట్‌ను రెండు సెషన్లలో, 21,704 దరఖాస్తులు వచ్చిన పీజీఈసెట్‌ను వీలైతే ఒకే సెషన్లో, 28,805 దరఖాస్తులు వచ్చిన లాసెట్‌ను రెండు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలను ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉండటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ మార్గదర్శకాలను కోర్టుకు వివరించి పరీక్షల నిర్వహణ అనుమతి పొందాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు షెడ్యూలు జారీ చేసేలా కసరత్తు చేస్తోంది. -
లాక్డౌన్ కొనసాగింపు?
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలిపాయి. అయితే, లాక్డౌన్ కొనసాగింపునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు చేయొద్దని సూచించారు. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేసింది. ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా లేక కొనసాగించినా ఈ నిర్ణయాలను అమలు చేయాలని సూచించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు ముగిసే ఏప్రిల్ 14 తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ జీఓఎం చర్చించింది. హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలు ఇచ్చే సమాచారమే కీలకమని జీఓఎం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా భేటీలో చర్చించారని, దేశంలో ఎక్కడా వాటి రవాణాకు అడ్డంకులు ఏర్పడలేదని సంబంధిత మంత్రి వివరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితిపై లోతైన చర్చ జరిపామని జీఓఎం భేటీ అనంతరం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. 40 కోట్ల మంది మరింత పేదరికంలోకి.. కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చ్ 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదముం దని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆల్కహాల్ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. -
ఆడించండి.. ఆస్వాదించండి!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. స్వీయ నియంత్రణే కరోనా వైరస్‌కు విరుగుడు అని వైద్యులు పదే పదే చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏకంగా వచ్చే నెల 14 వరకు స్వీయ నియంత్రణ పాటించాలని తేల్చి చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రజలు పాటించాల్సిన విధానాలు, సూచనలు చేశారు. 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి, సింగిల్ కుటుంబాలు ఎప్పుడూ లేనంతగా ఒకే దగ్గర 20 రోజులకుపైగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద కుటుంబాలైతే ఒకే దగ్గర ఉండటం వల్ల కొన్ని గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకే టీవీలో ఒకే సినిమా చూడాలంటే, ఒకే ఆట ఆడాలంటే అనేక ఇబ్బందులు, మనస్పర్థలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో కుంటుంబంలోని సభ్యులంతా వివిధ రకాల పనుల్లో ఉండటం వల్ల వచ్చే నెల 14 వరకు సంతోషంగా గడపొచ్చు. చిన్న పిల్లలకు.. చిన్న పిల్లలను స్కూల్‌కు వెళ్లినట్లుగా ఉదయం పూటే నిద్రలేపాలి. వారికి టైం ప్రకారం టిఫిన్ అందించాలి. ఏవైనా టెక్స్‌బుక్స్ ఇచ్చి దానిని పూర్తి చేయాలని సూచించాలి. అదే విధంగా వివిధ రకాల బొమ్మలు, ఆటలు ఆడుకునేందుకు తగిన సమయం ఇవ్వాలి. కొన్ని గంటల పాటు క్యారంబోర్డు లాంటి ఆటలు ఆడించాలి. అదే సమయంలో ఫోన్లకు దూరం పెట్టడం ఎంతో మంచిదని, ఫోన్లకు అలవాటు పడితే అనేక ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. పెద్దవాళ్లకు.. ఇంట్లో వారు రోజూ ఆఫీసుకు వెళ్లిన తర్వాత పెద్దవాళ్లు వాళ్లకు నచ్చిన టీవీ సీరియల్ లేదా సినిమా చూస్తారు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సీరియల్, నచ్చిన సినిమా పెట్టి వారికి కొంత సమయం కేటాయించాలి. ముందు జాగ్రత్తగా ఉదయం సమయంలోనే భోజనం అందించి, డాక్టర్లు సూచించిన మందులు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. జాయింట్ ఫ్యామిలీ.. ఉమ్మడి కుటుంబాలు అయితే ఇంటిపనుల్లో అందరూ తలోచేయి వే యాలి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పనిని విభజించుకోవాలి. వంట లు, ఇంటి పనుల్లో అందరూ చేయి వేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి వారు వదిలేస్తే కుటుంబాల్లో తగాదాలు వచ్చే ప్రమాదం ఉంది. -
8 కారిడార్లు.. 140.13 కి.మీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజె క్టు పట్టాలెక్కుతోంది. ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగన మే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 3 కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. 2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కి అప్పగించారు. మెట్రో నుంచి.. లైట్ మెట్రోగా... పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి.. మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టుని సిద్ధం చెయ్యగా.. లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల.. ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా.. రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతా యి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచ్చిన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ 52 శాతం భరించగా.. మిగిలిన 48 శాతం నిధుల్ని సదరు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ భరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,200 కోట్లు కొరియా నుంచి రుణం తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అప్పట్లో ప్రయత్నించింది. తరువాత మరుగున పడిపోయింది. తొలిదశలో 35 కి.మీ.. కానీ... వాస్తవానికి 2016 పనులు ప్రారంభించాలన్నది మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి లక్ష్యం. కానీ అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులో మార్పులు, చేర్పులూ చేస్తూ కాలయాపన చేసింది. 2016లో పనులు ప్రారంభించి తొలిదశలో 35 కి.మీ వరకూ కారి డార్ల పనులు పూర్తి చేసేందుకు 2018 డిసెంబర్‌ని గడువుగా నిర్దేశించుకున్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు ఇంకా పరిశీలన స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంఆర్‌సీకి 245 ఎకరాలు.. ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చుకునేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఏఎంఆర్‌సీకి ప్రభుత్వ భూములు అందించాలని సర్కారు నిర్ణయించింది. నగరంలోని 245 ఎకరాలు ఇచ్చేందు కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చి న ఆదాయాన్ని సముపార్జించుకోనుంది. ఇప్పటికే పలు చోట్ల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూముల్ని గుర్తించారు. ముడసర్లోవలో 100 ఎకరాలు, మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో 2 ఎకరాలు, ఎన్వీపీ లా కాలేజీ ఎదురుగా 50 ఎకరాలు రెవిన్యూకి చెందిన భూములతో పాటు శిల్పారామం సమీపంలో 13 ఎకరాలు, టూరిజం శాఖకు చెందిన స్థలం, పరదేశీపాలెంలో రెవెన్యూ, జీవీఎంసీకి చెందిన 80 ఎకరాలు ఏఎంఆర్‌సీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. మొత్తంగా కొత్త ప్ర భుత్వం వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ►ప్రారంభంలో ప్రతి స్టేషన్ నుంచి 10 నిమిషాలకో ట్రైన్ ►రద్దీని బట్టి.. ప్రతి రెండు నిమిషాలకో ట్రైన్ పరుగులు ►రెండు 750 వాట్స్ డీసీ కోచ్ ►డిపోలు ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన ►విమానాశ్రయ ప్రాంతంలో ఒకటి, హనుమంతువాక వద్ద మరొక డిపో ఏర్పాటు హైదరాబాద్ మెట్రో కంటే మిన్నగా... హైదరాబాద్ మెట్రో రైల్ కంటే మిన్నగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. అన్నింటికీ అనుకూలంగా.. ఇక్కడి వాతావరణానికి అనువుగా ప్రణాళికలు రూపొందించాం. మెట్రో నిర్మాణంలో ప్రస్తుత జాతీయ రహదారి భవిష్యత్తు అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ స్థలం అందుబాటులో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల్ని అంచనా వేసి ప్రాజెక్టుకి రూపకల్పన చేశాం. ప్రభుత్వం నిర్దేశించే మార్గంలో మెట్రో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాం. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ ప్రాజెక్టు ఎండీ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకం... విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్, మెట్రో అవకాశాల్ని పరిశీలించిన తర్వాత సమగ్రమైన ప్రణాళికతో రూట్ మ్యాప్‌ని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి -
ఇంటికి జియో ఫెన్సింగ్
సాక్షి, హైదరాబాద్: స్వగ్రామంలో మీ ఇల్లు ఎక్కడుందో చూసుకోవాలంటే ఏం చేస్తారు. ఠక్కున గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి ఇంటిని వెతుకుతారు. ఊరు నమూనా తెలుసు కాబట్టి.. మీ ఇల్లు ఎక్కడుందో పసిగడతారు. అదే ప్రభుత్వం మీ ఇంటి చిరునామా తెలుసుకోవాలంటే.. చాలా కష్ట పడాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రతి ఇంటిని ‘జియో ఫెన్సింగ్’చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ‘నజరీ నక్షా’ఆధారంగా ప్రతి ఇంటిని ఓ నిర్దిష్ట ఆకారంగా గుర్తిస్తోంది. దీనికోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలను వాడుతోంది. వీటిని సాధారణ మ్యాప్‌లతో అనుసంధానించడం ద్వారా ఏ శాశ్వత నిర్మాణం ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. జియో రిఫరెన్సింగ్ అని పిలిచే ఈ పద్ధతితో పోలింగ్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓటర్లందరి వివరాలను అదే స్టేషన్లో నిక్షిప్తం చేసేందు కు ఈసీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ సమస్యను మాన్యువల్‌గా అధిగమించేందుకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఈసీ చేస్తున్న కసరత్తు నజరీ నక్షా ద్వారా పూర్తి కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు 31,76,699 ఇళ్ల ఆకారాలను గుర్తించగా.. 2,01,255 ఇంటి నంబర్లను అనుసంధానించింది. 2,56,441 ఓటర్ల వివరాలను కూడా సేకరించింది. ఏం చేస్తారంటే.. మొదట నియోజకవర్గ సరిహద్దులను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా నిర్దారిస్తారు. ఆపై పోలింగ్ కేంద్రాల పరిధిని గుర్తిస్తారు. ఆయా కేంద్రాల పరిధిలోకి వచ్చే ఓటర్ల వివరాలను బూత్‌స్థాయి అధికారి సహకారంతో క్రోడీకరిస్తారు. ఓటరు గుర్తింపు కార్డుల్లోని వివరాల ఆధారంగా ఇళ్లు ఉన్న ప్రాంతాలను, అందులోని సభ్యులను గుర్తిస్తారు. ఈసీ ఈ ఇక్కడి వరకే పరిమితం అవుతుండగా, రెవెన్యూ శాఖ దీనికి అదనంగా ఇళ్లకు జియో రిఫరెన్స్ ఇచ్చే ప్రక్రియకు పూనుకుంటోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశా రు. ఓటర్ల వివరాలకే పరిమి తం కాకుండా.. ప్రజావసరాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని ఆ లేఖలో సూచించారు. ఉపయోగమేంటి.. రేషన్ పంపిణీ నుంచి మౌలి క సదుపాయాల కల్పన వరకు ఈ టెక్నాల జీ ఉపయోగపడనుంది. గ్రామాల్లో వార్డుల విభజన, క్లస్టర్లను తయారీ సులువు కానుంది. పౌరసేవల పరిధిని కూడా నిర్దేశించే వీలుంది. పట్టణాల్లో కష్టమే.. ఈ ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో అనుకున్నంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. పట్టణాల్లో నివసించే వారి చిరునామాలు తరచుగా మారే అవకా శం ఉందని, ఈ మేరకు నివాసం మారినప్పుడల్లా ఈ వ్యవస్థను అప్డేట్ చేసుకోవాలని భావిస్తున్నా రు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలోనూ మార్పులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నా రు. ఏదేమైనా రాష్ట్రంలోని శాశ్వత నిర్మాణాలకు జియోఫెన్సింగ్ ఇవ్వడం ద్వారా ప్రజావసరాలను త్వరితగతిన సమకూర్చడంతోపాటు పలు సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా అమలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!
సాక్షి. న్యూఢిల్లీ: బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్‌కుక్ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్ కుక్ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్ సంస్థకు చెందిన 22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది. స్టాక్మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై స్పందించిన థామస్‌కుక్ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది. నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 2012 నాటికి ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్ వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో వివరణాత్మక పరివర్తన ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో చదవండి : ‘థామస్ కుక్’ దివాలా... -
బల్దియాపై బీజేపీ కార్యాచరణ
సాక్షి, ఆదిలాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బల్దియాల్లో పాగా వేయాలని ఆ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తమ సత్తా చాటాలనే దృఢ సంకల్పంతో ముందుకు కదులుతోంది. పట్టణాల పార్టీ కేడర్‌లో ఇప్పటికే జోష్ కనిపిస్తోంది. ఎన్నికలు ఇప్పుడే వచ్చినా ఢీ అనేందుకు సిద్ధమవుతున్నారు. కార్యాచరణ ఇలా.. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మున్సిపల్ ఎన్నికల కోసం క్లస్టర్ ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ క్లస్టర్‌కు ఇన్‌చార్జీగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బా పురావును నియమించింది. దీనికి సంబంధించి రెండు రోజుల కిందే పార్టీ నుంచి ప్రకటన వెలబడింది. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఆదిలా బాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు పార్టీ పరంగా ఆయన ఇన్‌చార్జీగా వ్యవహరించనున్నారు. ఆదిలా బాద్, నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో గతంలో టీఆర్ఎస్, భైంసాలో ఏఐఎంఐఎం పార్టీలు గెలుపొందాయి. ఖానాపూర్ మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇటు టీఆర్ఎస్తోపాటు అటు ఏఐఎంఐఎంతో పోరుకు సిద్ధమవుతోంది. గతంలో ప్ర త్యక్ష ఎన్నికల ద్వారా ఆదిలాబాద్, నిర్మల్ ము న్సిపాలిటీల్లో బీజేపీ గెలుపొందింది. అయితే ఆ తర్వాత జరిగిన పరోక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఈ రెండు మున్సిపాలిటీలతోపాటు మిగతా ము న్సిపాలిటీల్లోనూ నామమాత్రంగా ప్రభావం చూపెట్టింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఆయా చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపురావును ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా నియమించడంతో పార్టీ కేడర్‌లో జోష్ కనిపిస్తోంది. పక్కా ప్రణాళిక.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వే యాలని చూస్తున్న బీజేపీ తగు ప్రణాళిక రూ పొందిస్తుంది. అయితే రిజర్వేషన్లు ఖరారు త ర్వాతే ఈ కార్యాచరణకు బీజం వేయాలని చూ స్తున్నారు. ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర నాయకురాలు సు హాసిని రెడ్డి మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ రిజర్వేషన్ జనరల్ ఉన్న పక్షంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సుహాసిని రె డ్డి రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు. ఇం దుకోసం ఆమె పార్టీ పెద్దలను కూడా కలిసిన ట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా అ« ద్యక్షుడు పాయల శంకర్‌తో ఆమెకు రాజకీయంగా పొసగకపోవడంతో పరిణామాలు ఎలా ఉం టాయనేది ఆసక్తికరంగా మారింది. అదే స మయంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తన అల్లుడు సిద్ధార్థ్‌ను మున్సిపల్ ఎన్నికల్లో రంగంలోకి దించడం ద్వారా చైర్మన్ పీఠంపై గురిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నా యి. నిర్మల్లోనూ బీజేపీకే పటిష్ట కేడర్ ఉంది. అక్కడ కూడా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి బల్దియాలో ప్రభావం చూపాలని ఆ పార్టీలో ఉత్తేజం కనబడుతోంది. ఇక ముథోల్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ కంటే అధిక ఓట్లు సాధించా రు. అయితే భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం ప్రభావం ఉంది. దీంతో బీజేపీ ఎంఐఎంతో పోటీగా నిలవనుంది. ఇక కాగజ్‌నగర్‌లోనూ ప్రభావం చూపాలని ఆ పార్టీ ఆశిస్తుంది. కొత్త మున్సిపాలిటీ అయిన ఖా నాపూర్‌లో ఉనికి చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. -
అంతరిక్ష పంట.. అదిరెనంట!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు నెలల తరబడి ఉండి.. పరిశోధనలు చేస్తుంటారని తెలిసిన విషయమే. అయితే వారు ఏం తింటారు.. ఎలా జీవిస్తారనే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. వారు తినేందుకు ఇక్కడి నుంచి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిస్తారు. అయితే వీటిల్లో సరైన పోషకాలు ఉండటేదని, వారికి మరిన్ని పోషకాలు అందేలా చేసేందుకు అక్కడే పంటలు పండించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో చాలా మొక్కలనే పెంచారు. ఆ జాబితాలోకి తాజాగా మరో రకం చేరనుంది. ఇస్పనోలా చిలీ పెప్పర్ అనే మిరప రకం మొక్కను ఇప్పుడు అంతరిక్షంలో పండించనున్నారు. ఈ మొక్కలను ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది మొదట్లో అంతరిక్షంలోకి పంపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అరుణగ్రహం వంటి చాలా దూరంగా ఉన్న గ్రహాలపైకి వెళ్లే వ్యోమగాములకు ఈ ప్రయోగం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏం పండించారో తెలుసా? క్యాబేజీ గోధుమ వరి తులిప్ ఉల్లి బఠానీలు ముల్లంగి వెల్లుల్లి దోస బంగాళదుంప పొద్దుతిరుగుడు తదితరాలు.. -
ఇలా సాగుదాం..
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలు, ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని ప్రణాళిక కమిటీ గుర్తించింది. జిల్లాలోని నేలలు, వాతావరణం, నీటి ఆధారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వాటికి అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలను గుర్తించారు. రానున్న ఖరీఫ్‌లో రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలు సాగు చేయవచ్చని గుర్తించారు. జిల్లాలోని 21 మండలాల్లో ఆయా పంటల సాగుకు 2,30,498 హెక్టార్లు అనువుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. అయితే గత ఏడాది ప్రణాళికతో పోలిస్తే సాధారణ సాగు విస్తీర్ణం ఈ ఏడాది ప్రణాళికలో తగ్గింది. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,32,707 హెక్టార్లు కాగా.. అంతకుమించి 2,53,158 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాది వరి, మిర్చి పంటల సాగు విస్తీర్ణంపెరిగింది. గత ఏడాది వరి సాధారణ సాగు విస్తీర్ణం 60,547 హెక్టార్లు కాగా.. 82,437 హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం వరి సాధారణ సాగు విస్తీర్ణం ప్రణాళికలో కొంచెం తక్కువగా చూపారు. ఈ ఏడాది వరి 59,361 హెక్టార్లలో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పప్పు దినుసులు పెసర, కంది, మినుము, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం వచ్చే ఖరీఫ్ కాలానికి సాగు చేసే వివిధ రకాల పంట లకు సంబంధించిన విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పొం దుపరిచింది. వీటిలో దాదాపు 22,189 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉంటాయని నిర్దేశించారు. టీ సీడ్స్ కార్పొరేషన్ నుంచి విత్తనాలను అందుబాటులో ఉంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటికే టీ సీడ్స్ సంస్థ 15వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచింది. పెసర 2,910, కంది 50 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్టకూ.. జీలుగు, పిల్లి పెసర, జనుము పంటలను సాగు చేసి.. సాగు భూమిని సారవంతం చేయాలని నిర్ణయించారు. జీలుగు 12,500 క్వింటాళ్లు, పిల్లి పెసర 6 వేల క్వింటాళ్లు, 635 క్వింటాళ్ల జనుము విత్తనాలను ఇప్పటికే టీ సీడ్స్ సంస్థ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రణాళికను రూపొందించాం. అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విత్తనాలను టీ సీడ్స్ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది. ఎరువుల కొరత లేకుండా ముందస్తుగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి జిల్లా వ్యవసాయాధికారి -
వేసవికి ప్లాన్ ఏంటి..?
వేసవి సెలవుల్లో రీఫ్రెష్ అవ్వడం కోసం చక్కని పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలన్న ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అయితే, ఎంపిక దగ్గరే సమస్యంతా. దూర ప్రాంతాలకు వెళ్లి రావడం అనేది కొంచెం కష్టమైన టాస్కే. ఎంపికను బట్టే ప్లానింగ్ ఆధారపడి ఉంటుంది. ముందుగా ఎక్కడికి వెళ్లాలన్న దానిపై కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ఆ తర్వాతే ప్రణాళిక ఆరంభమవుతుంది. కొంచెం ముందుగా సన్నద్ధం అయితే టికెట్ల బుకింగ్ దగ్గర నుంచి హోటళ్ల బుకింగ్ వరకు సాఫీగా సాగిపోతుంది. ఆలస్యం చేస్తే ఆదరాబాదరతోపాటే బడ్జెట్ కూడా పెరిగిపోవచ్చు. ఇప్పటికీ వేసవి పర్యటనకు ప్రణాళిక రూపొందించుకోకుండా, ఎక్కడో ఒక చోటకు వెళ్లొద్దామనుకునేవారు.. వెంటనే తాము చూడాలనుకుంటున్న వాటిపై స్పష్టతకు రావాలి. ఇందుకు నిపుణులు తెలియజేస్తున్న ప్లానింగ్ మీకోసం... ఎన్నో ఎంపికలు రవాణా సదుపాయాలు విస్తృతమైన తర్వాత పర్యాటక ప్రియులకు ఎన్నెన్నో గమ్యస్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఏది ఎంచుకోవాలన్న మీమాంస కూడా ఎదురవుతుంది. వేసవి ట్రిప్ ద్వారా తాము ఏం ఆశిస్తున్నామనే ఆకాంక్ష, బడ్జెట్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక మారిపోవచ్చు. ‘‘భారత పర్యాటకులకు దక్షిణాఫ్రికా సఫారీ అనుభవం ప్రముఖ ఎంపిక. ఇక ఫ్రాన్స్ అయితే వంటకాలు, వైన్‌కు ప్రసిద్ధి. చరిత్ర, సంస్కృతి, నిర్మాణ కళ పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులు హంగేరి, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియాలను ఎంచుకుంటుంటారు. స్పా, వెల్నెస్, రెజువెనేషన్ అనుభవాలు కోరుకునే వారికి దక్షిణ కొరియా ఎంపిక అవుతుంది. స్విట్జర్లాండ్, క్రోయేషియా ఫొటోగ్రఫీ ప్రియులకు అనుకూలం’’ అని థామస్ కుక్ ఇండియా లీజర్ ట్రావెల్ విభాగం అధిపతి రాజీవ్ కాలే వివరించారు. సంపాదనా శక్తి పెరుగుతుండడంతో భారతీయ పర్యాటకులు ప్రముఖ పండుగల సమయాల్లో (విదేశీ పండుగలు)నూ ఆయా దేశాలకు వెళ్లి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థాయిలాండ్‌లో ఏప్రిల్ 13–15 మధ్య జరిగే సాంగ్‌క్రాన్ (వాటర్ ఫెస్టివల్), హాంకాంగ్‌లో జూన్ 7న జరిగే డ్రాగన్ బోట్ ఫెస్టివల్, స్పెయిన్‌లో ఆగస్ట్ 28న జరిగే లా టమాటినా(టమాటా ఫెస్టివల్), దక్షిణ కొరియాలో జూలై 19–28 మధ్య జరిగే బోర్యాంగ్ మడ్ ఫెస్టివల్ ను చూసేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని రాజీవ్ కాలే తెలిపారు. యూకేలో మే నుంచి ఆరంభమయ్యే ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్‌కూ ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్ అయిన జపాన్, దక్షిణ అమెరికా, క్రోయేషియా, ఐస్‌ల్యాండ్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు ఉంటే థీమ్ పార్క్స్ అనుకూలం. ‘‘సింగపూర్, మలేషియాలోని లెగోల్యాండ్లో యూనివర్సల్ స్టూడియోలు ఉన్నాయి. టోక్యో, హాంకాంగ్, ప్యారిస్, ఓర్లాండోలలో డిస్నీల్యాండ్స్ ఉన్నాయి’’ అని బ్రాండ్ ఎక్స్పీడియా మార్కెటింగ్ హెడ్ మన్మీత్ అహ్లువాలియా తెలిపారు. ఇక ఆఫీసు బాధ్యతల నుంచి స్వల్ప విరామం తీసుకునేవారికి వీసా అవసరం లేని, సులభ వీసాలకు అవకాశం ఉండే సింగపూర్, బాలి, థాయిలాండ్, శ్రీలంకను ఎంచుకోవచ్చు. బడ్జెట్ ఎంత? పర్యటనకు వెళ్లొద్దామనే ఆలోచన వచ్చిన తర్వాత ముందుగా తేల్చుకోవాల్సినది ఎంత ఖర్చు పెడతారని. బడ్జెట్‌ను బట్టే ఎక్కడికి వెళ్లి రావచ్చన్నది నిర్ణయించుకోవడానికి వీలు పడుతుంది. ఆర్థిక సలహాదారులు అయితే వార్షికంగా మీరు చేసే ఖర్చుల్లో విచక్షణారహిత వినియోగం 15 శాతాన్ని మించకుండా చూసుకోవాలని చెబుతుంటారు. ‘‘సెలవు కాలంలో చేసే ఖర్చులు విచక్షణారహితం కిందకే వస్తాయి. మీ వార్షిక ఖర్చులో ఇది 10 శాతం మించకుండా ఉండడం అనుకూలం. వేసవితోపాటు, శీతాకాలంలోనూ పర్యాటక ప్రదేశాలను చూడాలనుకునే వారు ఈ పరిధికి లోబడే బడ్జెట్‌ను రెండు భాగాలు చేసుకోవాలి. అంతేకానీ మొత్తం బడ్జెట్‌ను వేసవి కోసం ఖర్చు పెట్టేయరాదు’’ అని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విషాల్ ధావన్ సూచించారు. మీరు ఎంత ఖర్చును భరించగలరన్న దాని ఆధారంగా పర్యాటక ప్రదేశాల జాబితాను షార్ట్‌లిస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ‘‘తక్కువ బడ్జెట్ ఉన్నవారు భారత్‌లోపల లేదా దక్షిణాసియాలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే తూర్పు యూరప్‌లోని ప్రాంతాలను సందర్శించొచ్చు. ఇంకా ఎక్కువ ఖర్చు చేయగలిగే వారు పశ్చిమ యూరప్‌కు వెళ్లొచ్చు’’ అని అహ్లువాలియా సూచించారు. కరెన్సీ ప్రభావం గత కొన్ని వారాల్లో డాలర్‌తో రూపాయి కాస్త బలపడడం కూడా బడ్జెట్‌ను తగ్గించేదే. గత 6 నెలల్లో ప్రధాన కరెన్సీలతో రూపాయి విలువ 2.9–8.8% బలపడింది. దీనివల్ల భారతీయుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే అన్ని చార్జీలు పెరిగిపోతుంటాయి. కనుక ఈ లోపే అన్నీ బుక్ చేసుకోవడం మంచిదని కాక్స్ అండ్ కింగ్స్ కరణ్ ఆనంద్ తెలిపారు. వీసా కోసం.. వీసాను ముందే తీసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. చాలా మందికి వీసాకు పట్టే సమయంపై తగిన అవగాహన ఉండదు. బ్రిటన్, షెంజెన్‌కు వీసా కావాలంటే కనీసం 10–15 రోజులు పడుతుందనేది నిపుణుల మాట. అదే ఆస్ట్రేలియాకు అయితే ఇది 20 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే.. విమాన టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడం వల్ల చార్జీల భారం తగ్గే వెసులుబాటు ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ల చార్జీలు పెరిగే వరకు వేచి చూడకుండా ముందే బుక్ చేసుకోవాలని ఎస్‌వోటీసీ ట్రావెల్ హెడ్ డానియల్ డిసౌజౌ సూచించారు. రెండు నెలల ముందే టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా కనీసం 20–22 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కరణ్ ఆనంద్ తెలిపారు. ‘‘డైరెక్ట్‌గా వెళ్లే విమానాల్లో టికెట్ చార్జీలు ఎక్కువ. కనెక్టింగ్ విమానాలు చౌక. తగిన వ్యవధి ఉన్న వారు కనెక్టింగ్ విమానాల ద్వారా వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చని అహ్లువాలియా తెలిపారు. ఇక ఏ సమయంలో మీరు చేరుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి విమానం సాయంత్రానికి చేరుకుంటే, ఆ రోజు స్థానిక సందర్శనకు వీలు పడదని అహ్లువాలియా గుర్తు చేశారు. అదే సమయంలో ఆ రాత్రికి విడిది కోసం గాను హోటల్, భోజన ఖర్చులను పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. కనుక ఉదయం సమయానికి తీసుకెళ్లే ఫ్లయిట్‌ను ఎంచుకోవడం కూడా ఖర్చు ఆదాకు ముఖ్యమని తెలియజేశారు. ఇక హోటల్స్ విషయంలోనూ ముందుగానే త్వరపడడం మంచిది. చాలా హోటళ్లు డిమాండ్‌ను సృష్టించేందుకు, సీజన్ ఆరంభానికి ముందే బుకింగ్‌లను పూర్తి చేసుకునేందుకు ఎర్లీబర్డ్ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయని రాజీవ్ కాలే తెలిపారు. ఇక హోటల్ స్టార్ రేటింగ్‌ను బట్టి కూడా చార్జీల్లో మార్పులు ఉంటాయి. నగరం లోపల ఉన్న హోటళ్లు దూరంగా ఉన్న హోటళ్లతో పోలిస్తే ఎక్కువ చార్జీలు తీసుకుంటుంటాయి. అన్ని రకాల బుకింగ్‌లను ఇప్పుడు సులభంగా ఆన్లైన్లో చేసుకునే సదుపాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ముందుగా లోడ్ చేసిన ఫారెక్స్ కార్డులను వినియోగించుకోవడం వల్ల కొంత పొదుపు చేసుకోవచ్చు. పర్యాటకులు మెచ్చే ప్రాంతాలు ప్రముఖ ట్రావెల్ సైట్ ‘ట్రిప్ అడ్వైజర్’ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతాలకు ట్రావెలర్స్ చాయిస్ అవార్డులను (2019 సంవత్సరానికి) ప్రకటించింది. ట్రిప్ అడ్వైజర్ కస్టమర్ల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. భారత్‌లో పర్యాటకులకు నచ్చినవి... 1. జైపూర్ (రాజస్తాన్) 2. గోవా (గోవా) 3. న్యూఢిల్లీ 4. మనాలి (హిమాచల్‌ప్రదేశ్) 5. కోచి (కేరళ) 6. బెంగళూరు (కర్ణాటక) 7. జైసల్మేర్ (రాజస్తాన్) 8. ముంబై (మహారాష్ట్ర) 9. ఉదయ్‌పూర్ (రాజస్తాన్) 10. ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్) ఆసియాలో టాప్10 డెస్టినేషన్స్... 1. బాలి (ఇండోనేషియా) 2. ఫుకెట్ (థాయిలాండ్) 3. సీమ్‌రీప్ (కంబోడియా) 4. హనోయ్ (వియత్నాం) 5. టోక్యో (జపాన్) 6. ఖాట్మండు (నేపాల్) 7. జైపూర్ (భారత్) 8. హాంగ్‌కాంగ్ (చైనా) 9. సియోల్ (దక్షిణ కొరియా) 10. గోవా (భారత్) అంతర్జాతీయంగా టాప్ ఇవీ... 1. లండన్ (ఇంగ్లండ్) 2. పారిస్ (ఫ్రాన్స్) 3. రోమ్ (ఇటలీ) 4. క్రెటే (గ్రీస్) 5. బాలి (ఇండోనేషియా) 6. ఫుకెట్ (థాయిలాండ్) 7. బార్సెలోనా (స్పెయిన్) 8. ఇస్తాంబుల్ (టర్కీ) 9. మర్రాకెచ్ (మొరాకో) 10. దుబాయి (యూఏఈ) రూ.2–3 లక్షల బడ్జెట్ అయితే ప్రాంతం బడ్జెట్(రూ.లక్షల్లో) సీషెల్స్ 2 ప్రాగ్ 2 ఇటలీ 3 హాంకాంగ్ 2.75 గ్రీస్ 3 -
పకడ్బందీగా.. ప్రశాంతంగా..
సిరిసిల్లక్రైం: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం తనకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పూర్తిపారదర్శకంగా, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సహా ప్రధాన రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు పోలీసు బలగాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 60 సమస్యాత్మకం.. 9 అత్యంత సమస్యాత్మకం.. జిల్లాలో 492 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 60 సమస్యాత్మక, 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని పోలీసు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన అల్లర్లు, వివాదాలను ఆధారంగా చేసుకుని వీటిని విభజించారు. గతంలో నక్సల్స్ ప్రభావం ఉన్నగ్రామాలు, ఒకేచోట అధికంగా పోలింగ్స్టేషన్లు, ఓటర్ల రద్దీ అధికంగా ఉండే పోలింగ్ కేంద్రాలను సైతం సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ఆయా కేంద్రాల్లో అదనపు పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి.. నేరాలను నియంత్రించేందుకు సిరిసిల్లతోపాటు వేములవాడలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరిచేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట, జనసమ్మర్థం ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫుటేజీల్లో స్పష్టత వచ్చేలా పోలీసులు అధికారులు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా మండలాల పోలీసు అధికారులు.. తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేపనిలో ఉన్నారు. ప్రధాన పట్టణాలే కాదు.. ప్రతీ గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదేవిషయంపై ఎస్పీ రాహుల్‌హెగ్డే తరచూ సమీక్ష సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాలు.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తోడ్పడతాయని అదికారులు భావిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో వీటిని గుర్తించి అక్కడ పూర్తిస్థాయిలో వీడియో చిత్రీకరించేందుకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన సీసీ కెమెరాలు సమకూర్చేందుకు కాంట్రాక్టర్లతో చర్చిస్తున్నారు. దీనికితోడు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అడిషనల్ డీజీపీ జితేందర్ ఇటీవల జిల్లా పోలీస్ అధికారులను అదేశించారు. జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా సీసీ కెమెరాల ఏర్పాటు విషయాన్ని పోలీస్ అధికారులతో చర్చించారు. పోలింగ్ నాటికి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.