Political Entry
-
సుశీల్‌కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ రాజకీయాల్లోకి!
సోలాపూర్: పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ నెలకొంది. ఇంతలో గణేశ్ ఉత్సవాల కోలాహలం వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అనేకమంది ఆశావాహులు భవిష్యత్‌లో తమకు అందరూ అండగా ఉండాలనే అభిలాషతో పలు మండపాలలో పూజలు, దర్శనాలు చేసుకుంటూ కానుకలు విరాళాలు అందజేయడంలో మొగ్గు చూపారు. అయితే సోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గత మూడు పర్యాయాలు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు ప్రణతీ శిందే ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానం ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలనే తపనతో దాదాపు 19 మంది ఆశావాహులు అభ్యర్థిత్వం కోసం ఆసక్తిగా కలలు కంటున్నారు.గత కొన్ని రోజులుగా సుశీల్ కుమార్ శిందే మనవడు శిఖర్ పహారియా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే తన పిన్ని ఎంపీ ప్రణతీ ప్రాతినిధ్యం వహిస్తున్న సోలాపూర్ సిటీ సెంట్రల్ స్థానానికి లేక పక్కనే గల సోలాపూర్ సౌత్ రూరల్ స్థానం ద్వారా రాజకీయ వారసుడిగా ముందుకు వస్తారనే వార్తలు గుప్పు మంటూ తెర మీదికి వస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని గణేశ్ ఉత్సవ మండలాలను సందర్శించడం అందరితో చనువుగా మెలగడం, తన తాత ఫామ్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన గణేశ్ ఉత్సవాన్ని సందర్శించడానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించడం మొదలైన ప్రక్రియ ఆయన్ను సుశీల్ కుమార్ శిందే కుటుంబం రాజకీయ వారసుడిగా ముందుకు తీసుకురాగలరనే భావనను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఆశీర్వదించిన పట్టణ ప్రజలకు రాజకీయ వారసుడిని అందించాలని సుశీల్ కుమార్ శిందే కుటుంబంతో పాటు ఆయన్ను అభిమానించే వారు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. -
వినేశ్ రాజకీయం నాకిష్టం లేదు: మహవీర్ ఫోగట్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరిగే హర్యానా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారని సమాచారం. ఇక.. ఈ నేపథ్యంలో వినేశ్ రాజకీయ ప్రవేశంపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ ప్రతికూలంగా స్పందించారు. వినేశ్ ఫోగట్ రాజకీయ రంగ ప్రవేశంపై తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే..‘‘మరో ఒలింపిక్స్(2028)లో వినేశ్ పాల్గొనాలని కోరుకుంటున్నా. ఆ పోటీలో ఆమె బంగారు పతకం గెలవాలి. అందుకోసం ఆమె మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి సారించాలి. ఆమె రాజకీయాల్లో చేరటాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. యువకులైన పిల్లలు వాళ్లు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వారిపైన ఆధారపడి ఉంటుంది. వారికి నచ్చజెప్పటమే నా బాధ్యత.ఈ వయస్సులో వినేశ్ మరో ఒలింపిక్స్‌లో పాల్గొనటమే సరియైంది. ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నా. బ్రిజ్ భూషన్‌పై రెజ్లర్లు అంతా నిరసనలు చేశారు. దాని వల్ల ఏం న్యాయం జరగలేదు. హర్యానాలో ఎన్నికల ప్రకటన వెలువడి.. వినేశ్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక అన్ని చర్చలు మొదలయ్యాయి’’ అని అన్నారు. వినేశ్ రెజ్లింగ్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మహవీర్ ఫోగట్ పునఃపరిశీలించాలని ఇటీవల కోరిన విషయం తెలిసిందే.మరోవైపు.. వినేశ్, భజరంగ్ పూనియాలో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. వినేశ్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే.. భగవంతుడు ఆమెకు పతకం చేజారేలా చేశాడని అన్నారు. -
Haryana Assembly Elections 2024: ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది. ఈ ఇద్దరు రెజ్లర్లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే. -
దళపతి విజయ్ కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం!
తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. గతేడాది లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని కూడా స్థాపించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు విద్యార్థులను ఆయన త్వరలోనే సన్మానించనున్నారు. ఈ ఏడాది 10,12 తరగతుల్లో టాపర్‌గా నిలిచిన వారికి సర్టిఫికెట్తో పాటు రివార్డులను విజయ్ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. జూన్ 28, జూలై 3 తేదీలలో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులను సన్మానించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. విజయ్ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT)లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5, 2024న థియేటర్లలోకి రానుంది. -
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్‌గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్‌గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్‌గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పొలిటికల్ ఎంట్రీపై డీకేశివకుమార్ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: రాజకీయ రంగ ప్రవేశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య స్పందించారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో భాగంగా ఐశ్వర్య శుక్రవారం(ఏప్రిల్26) బెంగళూరులో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు ఐశ్వర్య. ‘నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదు. నేను విద్యాసంస్థలు నడుపుతున్నాను. దేశం గర్వపడేలా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు వారి వారి రంగాల్లో పనిచేయాలి.బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన బాబాయి డీకే సురేష్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాగా, 2019 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచింది డీకే సురేష్ ఒక్కరే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 ఎంపీ సీట్లలో బీజేపీ ఏకంగా 25 సీట్లు గెలుచుకుంది. -
త్వరలో రాజకీయ పార్టీ: హీరో విశాల్
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు తమిళ నటుడు విశాల్ ప్రకటించారు. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ త్వరలో రాజకీయాల్లోకి వస్తా. 2026లో పార్టీ తరఫున నేను కూడా బరిలో దిగుతా. పార్టీ ఏర్పాటు, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ 100 శాతం జరగాలని ఆశిస్తున్నా’’ అని విశాల్ చెప్పారు. -
తారలొకచోట... మెరుపులు మరోచోట
వాళ్లంతా భోజ్‌పురీ సినీ పరిశ్రమను తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్న తారలు. వెండితెరపై కనిపించారంటే విజిళ్లు, క్షీరాభిష్కాలే. అయితే వారిపట్ల ఈ వీరాభిమానమంతా భోజ్‌పురీ సినిమాలకు పుట్టిల్లయిన బిహార్, పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లకే పరిమితం. వాళ్లు స్థానికంగా ఎంతగా వెలిగినా బాలీవుడ్, తెలుగు తదితర సినీ పరిశ్రమల్లోనే విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించడం ద్వారానే దేశవ్యాప్తంగా ఫేమ్‌లోకి వచ్చారు. రాజకీయ రంగస్థలంపైనా ఇదే సీన్ రిపీటవుతోంది. భోజ్‌పురీ తారలెవరూ వారి స్వరాష్ట్రమైన బిహార్‌లో పెద్దగా ఉనికి చాటలేకపోతున్నారు. కారణాలేవైనా వారిని అక్కడినుంచి బరిలోకి దింపేందుకు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేసి మాత్రమే వాళ్లు లోక్‌సభలో అడుగు పెడుతున్నారు... భోజ్‌పురీ నటీనటులకు, వారి స్వరాష్ట్రమైన బిహార్‌కు రాజకీయంగా ఎప్పుడూ చుక్కెదురే. పొరుగు రాష్ట్రాలకో, సుదూరాలకో వెళ్లి మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్నారు. పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా రాణించిన భోజ్‌పురీ సూపర్‌స్టార్ రవికిషన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జౌన్పూర్ లోక్‌సభ స్థానంలో బరిలో దిగిన ఆయన ఘోర ఓటమి చవిచూసి ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం బీజేపీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి 3 లక్షల ఓట్ల పై చిలుకు భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా అక్కడినుంచే బరిలోకి దిగుతున్నారు. మరో ప్రముఖ భోజ్‌పురీ నటుడు మనోజ్ తివారీ అయితే ఏకంగా ఢిల్లీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. బిహార్‌లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామానికి చెందిన ఆయన ఈశాన్య ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఈసారి కూడా అక్కడినుంచే పోటీలో ఉన్నారు. భోజ్‌పురీ నట గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్ పరిస్థితీ అంతే. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఆజంగఢ్ నుంచి నెగ్గిన ఆయన ఈసారీ అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. మరో భోజ్‌పురీ గాయకుడు పవన్ సింగ్‌కు కూడా ఈసారి పశ్చిమ బెంగాల్ లోని ఆసన్సోల్ నుంచి బీజేపీ టికెటివ్వగా రెండు రోజులకే ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. బిహారీ బాబుగా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా గతంలో రెండుసార్లు బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచినా 2019లో టికెట్ దక్కకకపోవడంతో పశి్చమ బెంగాల్ వలస వెళ్లారు. అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇంటర్నెట్ సంచలనం, భోజ్‌పురీ గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఈసారి ఢిల్లీ నుంచి టికెట్ ఇస్తారంటున్నారు. గుంజన్.. ఒకే ఒక్కడు ఈ లోక్‌సభ ఎన్నికల్లో భోజ్‌పురి సినీ పరిశ్రమకు సంబంధించి బిహార్ నుంచి పోటీ చేస్తున్నది గుంజన్ కుమార్ ఒక్కరే. అయితే ఈ భోజ్‌పురీ/మగధీ గాయకుడు తన స్వస్థలమైన నవడా నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. ‘‘అన్ని ప్రధాన పార్టీలనూ సంప్రదించా. ఎవరూ టికెటివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వాపోతున్నారాయన! భోజ్‌పురి నటులు, గాయకులకు బిహార్‌లో లోక్‌సభ టికెటివ్వడానికి ప్రధాన పారీ్టలు వెనకా ముందాడుతున్న మాట వాస్తవమేనని భోజ్‌పురి గాయకుడు వినయ్ బిహారీ అంటున్నారు. ఆయన బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియా ఎమ్మెల్యే. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. కానీ ఏ పార్టీ కూడా టికెటివ్వకపోవడంతో 2010లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థగా పోటీ చేయాల్సి వచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన భోజ్‌పురీ భాషకు బిహార్‌లోనే తగిన గౌరవం లభించడం లేదు. బహుశా అందుకే భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు ఇతర రాష్ట్రాల నుంచే తప్ప స్వరాష్ట్రంలో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయేమో!’ అన్నారు. భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు బీజేపీ మున్ముందు కచి్చతంగా బిహార్ నుంచి అవకాశమిస్తుందని తనకు నమ్మకముందని రవికిషన్ చెప్పుకొచ్చారు. -
Lok sabha elections 2024: అమేధీ నుంచి రాబర్ట్ వాద్రా..?
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేధీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా అమేధీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిధ్దమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమేధీ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి, ‘ఆమె వల్ల అమేధీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పుచేశామని నమ్ముతున్నారు’ అంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. -
ఐటం సాంగ్స్‌తో రఫ్ఫాడించిన బ్యూటీ.. రాజకీయాల్లోకి?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా పార్టీ స్థాపించారు. తాగాజా ఊర్వశి రౌతేలా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో పలు పార్టీలు సినీతారలకు టికెట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇన్స్టంట్ బాలీవుడ్‌తో మాట్లాడిన రౌతేలా, "నాకు ఇప్పటికే టిక్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి" అని అన్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయాలని వెల్లడించింది. ఊర్వశి రౌతేలాకు ఎలక్షన్ టికెట్ ఇచ్చారని వెల్లడించింది. కానీ.. ఏ పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి రావాలని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’
సమాజ్‌వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్ఎస్ఎస్పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ? -
పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ ప్లాన్ ఇదేనా..?
'తమిళగ వెట్రి కళగం' పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర పర్యటనపై దృష్టి పెట్టే విధంగా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వివరాలు.. దశాబ్ద కాలంగా రాజకీయ చర్చలు, వార్తలకు తెరదించుతూ రాజకీయ పార్టీని విజయ్ ప్రకటించేసిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం'గా నామకరణం చేసిన విజయ్ పార్టీలో 'ద్రావిడం' అన్న పదానికి చోటు కల్పించ లేదు. తమిళనాడులోని పార్టీల ముందు తప్పనిసరిగా ఆ పదం అనేది ఉంటూ వస్తోంది. అయితే భిన్నంగా తమిళ ప్రజలు, తమిళనాడును ప్రతిబంబించే విధంగా 'తమిళగ వెట్రి కళగం' అన్న పేరు ప్రజలలోకి దూసుకెళ్లడం ఖాయం అని విజయ్ మద్దతుదారులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రకటన చేసిన విజయ్‌కు మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసినట్టు సమాచారం. ఇక విజయ్‌కు సర్వత్రా శుభాకాంక్షలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో సైతం విజయ్ మంచివారని, గర్వం లేని వ్యక్తి అని పేర్కొంటూ, ఆయన రాకను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. విజయ్ రాకతో డీఎంకేకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎంపీ 'కనిమొళి' వ్యాఖ్యానించారు ప్రజల్లోకి ఎంట్రీ ఎప్పుడంటే.. పార్టీ ప్రకటన తదుపరి ఇక మున్ముందు రాజకీయంగా కార్యాచరణను విస్తృతం చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను, బృందాలను రంగంలోకి దించబోతున్నారు. జిల్లాల కార్యదర్శులతో భేటీలను విస్తృతం చేయనున్నారు. ఇప్పటికే ఆనంద సాగరంలో మునిగి ఉన్న అభిమానులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా పార్టీ సభ్యత్వ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టబోతున్నారు. అలాగే పార్టీ జెండా, గుర్తును ప్రజలకు పరిచయం చేయడం, పార్టీ ఆవిర్భావ మహానాడుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మహానాడు మదురై లేదా కడలూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు ఉంటాయని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా, సమాచారమైనా ఇకపై విజయ్ మాత్రమే ప్రకటిస్తారని విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్ పేర్కొన్నారు. విజయ్ ఎలాంటి సమాచారమైనా స్వయంగా ప్రకటిస్తారని, అంత వరకు వేచి ఉండాలని సూచించారు. -
'ఒకవేళ మీరు సీఎం అయితే'.. దళపతి సమాధానం ఇదే!
అందరూ ఊహించినట్టే జరిగింది. ఇన్ని రోజులు ఆయన రాజకీయ అరంగేట్రం కోసం కళ్లు కాసేలా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. గతంలో చాలాసార్లు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాజకీయ ఎంట్రీపై ప్రకటన రిలీజ్ చేశారు. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇన్ని రోజులుగా ఎదురు చూసిన స్టార్ హీరో అభిమానులు ఇప్పుడు కాస్తా రిలాక్స్ అయ్యారు. ఎట్టకేలకు తమ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పార్టీ పేరు ప్రకటనతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దళపతి విజయ్. ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన నటించిన సినిమాలో చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: దళపతి విజయ్ అభిమానుల గుండె పగిలే వార్త..) కాగా.. 2018లో విజయ్ నటించిన చిత్రం సర్కార్. ఆ సినిమాలో ఓటు రిగ్గింగ్ గురించి దళపతి ప్రస్తావించారు. తన ప్రమేయం లేకుండా పోలైన ఓటును న్యాయపోరాటం ద్వారా సాధించుకునే ఎన్ఆర్ఐ పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఛాన్స్ వస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన ఓ యాంకర్ విజయ్ను ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఒకవేళ మీరు నిజజీవితంలో సీఎం అయితే ఏం చేస్తారని ప్రశ్నించారు. దీనికి విజయ్ బదులిస్తూ..'నేను కనుక ముఖ్యమంత్రిని అయితే.. సినిమాల్లో ఎప్పటికీ నటించను' అని క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసి చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించినవారే తప్ప.. ప్రజల కోసం పనిచేసిన వారు లేరని ఆయన అన్నారు. తాజాగా పార్టీ ప్రకటనతో విజయ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2026 లక్ష్యంగా పార్టీ స్థాపించినట్లు విజయ్ వెల్లడించారు. -
మీరు రాజకీయాల్లోకి వస్తారా? నారాయణ మూర్తి సమాధానం ఇదే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' (Narayana Murthy) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సొంతంగా ఉపయోగించే టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, రాజకీయాలపై తనకున్న ఆసక్తిని గురించి ప్రస్తావించారు. సమాజంలో మరుగుదొడ్లను శుభ్రం చేసేవారిని చాలా చిన్న చూపు చూస్తారని, అందువల్లే నా పిల్లలకు మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పడానికి, సొంతంగా ఉపయోగించే టాయిలెట్లను శుభ్రం చేసుకోవడం గురించి వివరించారు. నా పిల్లలు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారని, వారి ప్రశ్నలకు ప్రేమతో సమాధానాలు చెబుతానని వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం చాలామంది ధనవంతుల కుటుంబాలలో సొంత టాయిలెట్లను సొతంగా శుభ్రం చేసుకునే పద్దతి పూర్తిగా నిషిద్ధంగానే ఉందని తెలిపారు. రాజకీయాల్లో చేరే ఆలోచన ఉందా.. నారాయణ మూర్తిని రాజకీయాల్లో చేరే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు తనకు లేదని.. తన పిల్లలు, మనవళ్లతో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతే కాకుండా.. సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. భౌతిక శాస్త్రం నుంచి అర్ద శాస్త్రం వరకు వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు కూడా వివరించారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. రచయిత్రి, పరోపకారి అయిన 'సుధామూర్తి' (Sudha Murthy) కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని కూడా నారాయణ మూర్తి తెలిపారు. అవసరమైనప్పుడు తప్పకుండా సమాజానికి సేవ చేస్తామని, దానికోసం రాజకీయాల్లో స్థానం తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. -
అతి త్వరలో విజయ్ కొత్త పార్టీ..
-
ముద్రగడ దారెటు ?..కేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
-
పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు!
2023లో పాకిస్తాన్లో చోటుచేసుకున్నరాజకీయాలు సినిమా సీన్లను తలపించాయి. యాక్షన్, సస్పెన్స్, డ్రామా అన్నీ కనిపించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్‌లో చోటుచేసుకున్న రాజకీయ గందరగోళం మున్ముందు కూడా ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి రావడం సంచలనాలుగా నిలిచాయి. పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మాజీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 9న జరిగిన నిరసనను పాక్ ఆర్మీ.. ఇదొక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది. కాగా ఇమ్రాన్ ఖాన్ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించారని పాక్ మాజీ ప్రధాని షరీఫ్ ఆరోపించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆగస్టులో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అనంతరం పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్‌పై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం పాక్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పీటీఐ కొత్త అధ్యక్షునిగా బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్టీలో ఎన్నికలు జరిగాయి. గౌహర్ ఖాన్‌ను స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ఈ పదవికి నామినేట్ చేశారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చిన దరిమిలా రాజకీయాలు మరింత వేడెక్కాయి. నవాజ్ షరీఫ్ బ్రిటన్‌లో నాలుగేళ్ల పాటు ఉండి, అక్టోబర్ 21న దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. 2024 ఫిబ్రవరిలోపు పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అధికార పగ్గాలు తాత్కాలిక ప్రధాని చేతుల్లోనే ఉన్నాయి. నవాజ్ షరీఫ్ నాలుగేళ్లు దేశానికి దూరంగా ఉన్నా ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ బలహీనపడలేదు. నవాజ్ షరీఫ్ లేనప్పటికీ, కుమార్తె మరియం, నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌లు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుండి దించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. అల్-అజీజియా మిల్స్, అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు నవాజ్ షరీఫ్‌ను దోషిగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు 2017లో తన జీతం ప్రకటించనందుకు సుప్రీంకోర్టు అతనిపై జీవితకాల అనర్హత వేటు వేసింది. ఈ నేపధ్యంలో షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఇమ్రాన్ ఖాన్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం 2019లో లండన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. దీనిపై లాహోర్ హైకోర్టు నాలుగు వారాల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. అయితే నాలుగు వారాలకు బదులుగా నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల తర్వాత లండన్ నుండి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఇది కూడా చదవండి: సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు? -
సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి 'సుధామూర్తి' (Sudha Murthy) ఇటీవల కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా.. లేదా అనే విషయాన్ని గురించి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుధా మూర్తి కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి, భవన నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని.. కళ, సంస్కృతి, భారతీయ చరిత్ర మొత్తం ఉట్టిపడేలా ప్రతిదీ చాలా అందంగా ఉన్న ఈ నిర్మాణం గురించి చెప్పడానికి మాటలు చాలవని తెలిపింది. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడం తన కల అని.. ఆ కల ఇప్పటికి నిజమైందని విలేకరులతో వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకరులు మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని సుధా మూర్తిని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు నవ్వుతూ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన కోడలు గురించి ప్రస్తావిస్తూ అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులకు ముందు అపర్ణ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. #WATCH | Delhi | As Sudha Murty visits the Parliament, she says, "It is so beautiful...No words to describe. I wanted to see this for a long time. It was a dream come true today. It is beautiful...It's art, culture, Indian history - everything is beautiful..." pic.twitter.com/P2kKp2Wj2o — ANI (@ANI) December 8, 2023 -
‘జెడ్పీటీసీ’ టు సీఎం
పేరు : ఎనుముల రేవంత్‌రెడ్డి పుట్టిన తేదీ : 8–11–1967 స్వగ్రామం : కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) చదువు : బీఏ భార్య : గీతారెడ్డి కూతురు : నైమిష–సత్యనారాయణరెడ్డి (అల్లుడు) సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: విద్యార్థి దశ నుంచే రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి అడుగిడారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీతోపాటు ఆర్ఎస్ఎస్లో కూడా చురుగ్గా పనిచేశారు. కొంతకాలం మలక్‌పేటలో ఉన్న ఆయన నారాయణగూడకు మకాం మార్చారు. నారాయణగూడలో మిస్టర్ ఆడ్స్ పేరుతో ఓ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చాక ప్రింటింగ్ ప్రెస్‌ను తమ్ముడు కృష్ణారెడ్డికి అప్పగించారు. కృష్ణారెడ్డి బర్కత్‌పుర డివిజన్‌కు టీడీపీ తరపున ఎంసీహెచ్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ► 2004లో టీఆర్ఎస్లో చేరి కల్వకుర్తి అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్క లేదు. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్‌రెడ్డి గెలిచారు. ► 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా రేవంత్‌రెడ్డి గెలవడం అప్ప ట్లో సంచలనమే. అదే ఏడాదిలో టీడీపీలో చేరారు. ► 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్‌కు టీడీపీ తరఫున పోటీచేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ► 2015 మే 15న రేవంత్‌రెడ్డిని ఓటుకు కోట్లు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కూతురి పెళ్లి సమయంలో తనను అరెస్ట్ చేయడం పట్ల రేవంత్ సీరియస్‌గా స్పందించారు. ‘నీ అంతు చూస్తా.. నిన్ను గద్దె దించడమే నా లక్ష్యం’అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ► తెలంగాణలో టీడీపీ ప్రాభవం పూర్తిగా కోల్పోవడంతో 2017లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ► టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి మూడోసారి బరిలో దిగా డు. పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ► 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ► 2021 జూన్ 26న అధిష్టానం రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 7న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జరిగిన గ్రేటర్, ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నా.. పట్టుదలతో ముందుకు కదిలి.. ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టారు. ► ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్లలో రేవంత్ పోటీ చేయగా, కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్‌లో గెలిచారు. నాపై గెలిచిన వ్యక్తి నేడు సీఎం.. వెరీ హ్యాపీ నాపై పోటీ చేసిన వ్యక్తి నేడు తెలంగాణ సీఎం అవుతుండటం సంతోషంగా ఉంది. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే.. రేవంత్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన సీఎం అవుతున్నారంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. – ఎండీ రబ్బానీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, మిడ్జిల్ మండలం -
ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి?
రాజకీయ పార్టీల విరాళాల సేకరణ విషయంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు నూతన విధానంలో విరాళాలు స్వీకరిస్తున్నాయి. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ అని అంటారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపై మరోసారి దుమారం చెలరేగడంతో పాటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఎన్నికల విరాళాలు స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు జారీకావు. ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. వీటిలో అతి తక్కువ విలువ కలిగిన బాండ్ రూ. 1,000. కోటి రూపాయలది అత్యధిక విలువ కలిగిన బాండ్. ఈ బాండ్ల కొనుగోలు సంఖ్యపై పరిమితి లేదు. ఎన్నికల సమయంలో, ఎలక్టోరల్ బాండ్ల విక్రయం విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుతాయి. ఎన్నికల విరాళాలను స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీలు ఏవి అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన అంటే రిజిస్టర్ అయిన పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు. ఇంతేకాకుండా లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల విరాళాలు స్వీకరించే పార్టీ ఓట్ షేర్ ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎన్నికల విరాళాలకు సంబంధించిన నియమాలు చాలా సులభతరం అయ్యాయి ఒక వ్యక్తి, సమూహం లేదా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత రాజకీయ పార్టీ ఈ బాండ్‌ను జారీ చేసిన 15 రోజుల్లోగా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ప్రతి లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు భారీగా విరాళాలు అందుతాయి. ఇది కూడా చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? -
రాజకీయాల్లోకి స్టార్ హీరో కూతురు.. క్లారిటీ ఇదే!
సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శృతిహాసన్. తరచుగా సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే శృతి.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోలీవుడ్ స్టార్, మక్కల్ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వారసురాలు కావడంతో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. (ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ విషయమై శ్రుతిహాసన్ ఇప్పటికే చాలా స్పష్టంగా సమాధానం చెబుతూనే వచ్చింది శృతి. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించగా... ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదురైంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడంపైనే తనకు ఆసక్తి ఉందని చెప్పారు. కాగా.. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆల్బమ్‌ను కూడా రూపొందిస్తున్నట్లు.. దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రుతిహాసన్ చెప్పారు. (ఇది చదవండి: హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?) -
రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి!
తమిళస్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అంతే కాకుండా విజయ్ ప్రజాసంఘం ఇప్పుడు సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ మరింత బలంగా ముందుకు సాగే ప్రయత్నానికి సిద్ధం అవుతోంది. ఇది చూస్తుంటే విజయ్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: అల్లు అర్జున్‌కే అవార్డు అని ముందే హింట్ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్) ఆయన అభిమానులు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో పలు వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు. విజయ్ రంగప్రవేశమే తదుపరి అనే ప్రచారం జోరుగా సాగుతుంది. విజయ్ ఆంజనేయ సంఘం ఇప్పటికే ప్రజాసంఘంగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. కాగా.. ఈ సంఘం ద్వారా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. తాజాగా సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా శనివారం ఉదయం విజయ్ అభిమాన సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్ నేతృత్వంలో పనైయూర్‌లోని విజయ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన అభిమానులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల కోసం 30 వేల మందిని నియమించారు. బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ విజయ్ ప్రజా సంఘాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమ సంఘానికి చెందిన ప్రతి విషయాన్ని ప్రజల్లోకి చేరే విధంగా వాట్సాప్‌లను వినియోగించాలని చెప్పారు. అదే విధంగా 234 నియోజకవర్గాల్లో జరిగే విషయాలను క్లుప్తంగా వీడియోలో చిత్రీకరించి సంఘం ప్రధాన నిర్వాహకునికి పంపించాలని కోరారు. అలాంటి వాటిని ప్రధాన నిర్వాహకుల అనుమతి లేకుండా ప్రచారం చేయరాదన్నారు. అదేవిధంగా ఏ విషయంలోనూ కుల,మత వివక్షతకు పాల్పడరాదని సూచించారు. (ఇది చదవండి: ఎవరైనా ప్రపోజ్ చేశారా?.. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?) -
ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నేను ఆర్టిస్ట్‌ను.. రాజకీయాలకు నో 'నా మీద చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్‌ను.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. ఇది మరీ టూమచ్.. నేను సంగీతాన్నే నా కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏ పార్టీ నాకు ఆహ్వానాలు పంపలేదు. నేను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదు. దయచేసి ఈ రూమర్స్‌ను ఇక్కడితో ఆపేయండి..' అని నోట్ షేర్ చేశాడు. 'పుకార్లు రావడం సాధారణమే.. కానీ ఈ పుకారు మాత్రం మరీ టూమచ్‌గా ఉంది' క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: సిగరెట్, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం.. -
గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?
కొత్తగూడెం బీఆర్ఏస్ ఎమ్మెల్యే టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించి భంగపాటే మిగిలింది. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన వర్క్ అవుట్ కాలేదన్న భావనలో ఉన్నారు గడల. ఎమ్మెల్యే చాన్స్ చేజారడటంతో గడల సైలెంట్ అయిపోతారా? లేక వేరే దారి చూసుకుంటారా? గడల పొలిటికల్ రూట్ మ్యాప్ ఏవిధంగా ఉండబోతుంది? ఒక్కరోజు ముందు కూడా హడావిడి బీఆర్ఏస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు నిరాశే మిగిలింది. టికెట్‌పై ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ దీవెనెలు సైతం తనకే ఉంటాయన్నారు. బీఆర్ఏస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడ కొత్తగూడెంలో హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం నినాదంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో పాదయాత్ర ప్రారంభించారు. రాజకీయం అంటేనే సేవ.. కట్ చేస్తే! 23 వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి జీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులతో కలిసి గడప గడపకి పాదయాత్ర చేపట్టారు. గడప గడపకు వెళ్తూ అడపడుచులకు పసుపు-కుంకుమ, గాజులు, కరపత్రంతో కలిగిన ప్యాకెట్ ఇస్తూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై డాక్టర్ గడల శ్రీనివాస రావు స్పందిస్తూ రాజకీయం అంటేనే సేవ అని, కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఇంటింటికీ పాదయాత్ర భారీ ఆర్భాటంతో చేపట్టడంతో అధికార బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలోనూ పెద్ద చర్చకే దారి తీసింది. సీన్ కట్ చేస్తే.. హెల్త్ డైరెక్టర్‌గానే కొనసాగుతారా? లేక మరుసటి రోజే బీఆర్ఏస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో కొత్తగూడెం టికెట్ సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావుకే దక్కింది. దీంతో గడల ఆశలు గల్లంతై పోయాయని కొత్తగూడెం నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుంది. టికెట్ దక్కకపోవడంతో గడల కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తుంది. హెల్త్ డైరెక్టర్ గానే కోనసాగుతారా? లేక వేరే దారి చూసుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. చదవండి: కరీంనగర్: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా వేరే పార్టీలోకి! ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంటే.. హెల్త్ డైరెక్టర్ పదవి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సైలెంట్‌గా ఉండే వచ్చేసారి ఏమైనా గుర్తించండి అని కేసీఆర్ నుంచి హమీ తీసుకొని తన పని చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు సొంత ప్రాంతమైన కొత్తగూడెంలో కొన్ని నెలలుగా జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం వికెండ్‌లో మాత్రమే ఉంటాయి. అయితే గడల వ్యవహరంపై గతంలో ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో పైర్ అయ్యాయి. హెల్త్ డైరెక్టర్‌గా ఉండి రాజకీయాలు చేయడం ఏంతవరకు సబబని నిలదిశాయి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం గడల పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటు వెళ్లారు. చేయాల్సిన ప్రయత్నాలు చేసినా.. చివరికి భంగపాటే జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో గడల కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి అనేక వివాదాలు గడల చుట్టు తిరుగుతూ వచ్చాయి. ఓ ఏంపీపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడం, అనేక కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దూమారమే రేపాయి. అంతేకాదు ప్రగతి భవన్లో నిమిషం వ్యవధిలో రెండు సార్లు సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల్లోనే ఉంటు వచ్చారు గడల.. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగూడెం టికెట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినా చివరకు భంగపాటే మిగిలిందన్న భావనలో ఉన్నారు గడల శ్రీనివాస్ రావు.. మరి హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. -
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మగధీరుడు ఆయనే!
ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు.. స్థానం వేరు చిరంజీవి సినిమారంగంలో ఒక లెజెండ్. ఆయన తుపాన్‌లా రాలేదు. చిరు జల్లులా వచ్చి తుపాన్‌లా మారాడు. ఆయన 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన 'ఆచార్యు'డు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి 'ఛాలెంజ్' లను 'మగధీరుడు' లాగా ఎదుర్కుంటూ 'విజేత'గా నిలిచిన 'మగమహారాజు' . అభిమానుల గుండెల్లో ఆయనొక 'ఖైదీ'. బాక్సాఫీసు వసూళ్ల 'వేట'లో 'ఛాలెంజ్' విసిరితే 'రోషగాడి'లా 'జాతర' చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా.. అలాంటి వాల్లకు ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఇప్పటి తరం ట్విటర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు అప్పట్లో కవర్‌పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి. ఇప్పడు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగేవారికి తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978 లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మెదలుపెట్టిన మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ప్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980 వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన 'మొగుడు కావాలి' సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఆ సమయం నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. 'చిరంజీవి-ఎన్టీఆర్'కు ప్రత్యేకం ఆ తర్వాత వచ్చిన 'తిరుగులేని మనిషి' చిత్రం తన కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో 'చిరంజీవి-ఎన్టీఆర్' కలిసి నటించిన ఏకైకా సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే.. చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఊరికిచ్చిన మాట' సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడినా.. ఆ తర్వాత 'చట్టానికి కళ్లులేవు' చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీది శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ రెండు సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజా థియేటర్లో 80రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది ఈ సినిమా.. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు.. ఒక యాక్టర్, స్టార్‌కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్‌నైట్ సూపర్ స్టార్‌ను చేసింది ఈ సినిమా.. ఇందులోని చిరు లుక్‌నే రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి. ఇంతలా మెగస్టార్ జీవితంలో ఖైదీ సినిమా పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా 2007లో శంకర్ దాదా జిందాబాద్‌తో సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగాఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు పది లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకి పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకూ వాహనాలు వెళుతూనే వున్నాయి. కనీవినీ ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ, రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. ఆయన పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2004 నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వైఎస్సార్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్సార్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటికే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని మళ్లీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి గారిపైనా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగష్టులో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. తిరుపతి సభ నుంచే చిరుకు మొదటి దెబ్బ పార్టీ ఆవిర్భావ సభరోజు పది లక్షలకు మంది పైగా వచ్చిన జనం అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండ్‌కు దగ్గర్లో మెగాస్టార్ సభ పెడితే జనం వెయ్యి మంది కూడా లేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచే చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు.. రాజకీయాలు వేరని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు. రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా సినిమా హీరోకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడి ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజీనికాంత్, కమల్ హాసన్‌కు ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకండని ఆయన ఇలా సూచించారు. 'రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్‌స్టార్‌గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్‌లోకి వచ్చి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో నెగ్గాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల వైపు వచ్చాను. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్.' అని చిరంజీవి అన్నారు. 2017లో రీ ఎంట్రీ రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరం అయి తన అభిమానుల కోసం 2017లో 'ఖైదీ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాలు దూరం అయితే... అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీపడుతూ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తూ కొత్తకొత్త అభిమానులను సంపాధించుకుంటున్న తరుణంలో పదేళ్లు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కు వస్తే మునపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుచేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డ్యాన్స్‌లు, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్లిన.. ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్నీ తీసినా వాటి వెనుకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతోకొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా.. ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. భవిష్యత్‌లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్రపరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మ విభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు. -సాక్షి వెబ్ డెస్క్