by poll
-
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్
-
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
-
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్‌లో హైడ్రామా
నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లుగెలుపు కోటా 155095 గా నిర్ణయంమొత్తం చెల్లిన ఓట్లు 310189చెల్లని ఓట్లు 25824మొత్తం పోలైన ఓట్లు 336013చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీంకౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డిముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణతమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహంనల్లగొండముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగిందిమూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారుమేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదుమూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదుఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాంఎన్నికల సంఘం స్పందించాలిరిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాంఅధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందితమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యంనాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలుఅయినా ఫలితాలు వెల్లడించని అధికారులు👉ముగిసిన నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఅధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 👉నాల్గో రౌండ్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులుఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుసాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం👉మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. అయితే.. మూడో రౌండ్లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్‌గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. లీడ్ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516అశోక్ (స్వతంత్ర) 27,49318,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్నచెల్లిన ఓట్లు 2,64,216చెల్లని ఓట్లు: 23,784 -
Telangana: సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్‌లో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపే(మే 13 సోమవారం) పోలింగ్ జరగనుంది.తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిల్చున్నారు. వీళ్లలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.మరోవైపు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాణంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరఫున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ నారాయణన్‌లు ప్రధాన పార్టీల తరఫు నుంచి బరిలో నిలిచారు. -
బాలకృష్ణ పీఏ ఓవరాక్షన్
సాక్షి, శ్రీసత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ, టీడీపీ లీడర్ శ్రీనివాస్ రావు ఓవరాక్షన్‌కు దిగాడు. శనివారం నియోజకవర్గంలోని చలివెందుల పోలింగ్ కేంద్రం వద్ద తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతంగా మారింది. చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా.. పోలింగ్ కేంద్రం వద్ద శ్రీనివాసరావు, తన అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. పోలింగ్ సరళిని తాను పరిశీలించాలంటూ కేంద్రంలోకి వెళ్లబోయే ప్రయత్నం చేశాడు. అయితే.. అది రూల్స్‌కు విరుద్ధమంటూ పోలీసులు అడ్డుకోగా.. దూసుకెళ్లే యత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దౌర్జన్యకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. -
రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తూ పార్లమెంట్ సెక్రటేరియట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కాగా రాహుల్‌పై అనర్హత వేటు వేయడంతో లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ప్రజాప్రాతినధ్య చట్టం 2015లోని సెక్షన్ 151(ఏ) ప్రకారం.. ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయితే 6 నెలల్లోపు ఉప ఎన్నికల నిర్వహించి ఆ స్ధానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి నిబంధలన ప్రకారం సెప్టెంబర్ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. దీనిపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. లోక్‌సభ సభ్యత్వం రద్దుపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కాంగ్రెస్ పేర్కొంది. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా జనాందోళన్కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు. చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
ఉప ఎన్నికల ఫలితాలు: ఏడు చోట్ల గెలిచిన అభ్యర్థులు వీరే
Assembly Lok Sabha Bypoll Results దేశంలో ఏడుస్థానాల(ఒక లోక్‌సభతో కలిపి) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. యూపీ అసెంబ్లీ ఒకటి, బీహార్‌లో ఒకటి మినహాయించి మిగిలిన చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఏడు చోట్ల గెలుపొందిన అభ్యర్థులను పరిశీలిస్తే.. ► మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో డింపుల్ యాదవ్(ఎస్పీ) విజయం సాధించింది. 2.88 లక్షల మెజార్టీతో డింపూల్ గెలుపొందారు. ► ఖతౌలీ నియోజవవర్గం స్థానాన్ని ఎస్పీ మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి మదన్ భయ్యా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ► యూపీలోని రాంపూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా అనూహ్య విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అసిమ్ రాజాపై 33 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడటంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) దూరంగా ఉన్నాయి. దీంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగింది. ►బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కుర్హానీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలోకి దిగిన కేదార్ ప్రసాద్ గుప్తా.. మహాఘట్బంధన్ అభ్యర్థిపై 3,645 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జేడీయూతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలిపొందింది. ►ఒడిశాలోని పదంపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ బరిహా 42,679 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ ఒడిపోయినప్పటికీ 2019 ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ మాత్రం డిపాజిట్ కోల్పోయింది. ► రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ 26,852 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ► ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతమ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మాండవి 21, 171ఓట్ల తేడాతో గెలుపొందారు. #Mainpuri Lok Sabha by-polls | SP candidate Dimple Yadav leads with a margin of 54,797 votes; counting continues https://t.co/nvB6P1RW7m — ANI (@ANI) December 8, 2022 ► అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గం రామ్‌పూర్‌లోనూ సమాజ్‌వాదీ అభ్యర్థి అసిమ్ రాజా ముందంజలో కొనసాగుతున్నారు. కథౌలీలో ఆర్ఎల్డీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ► ఒడిషా పదంపూర్‌లో అధికార బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ బరిహా ఆధిక్యంలో ఉన్నారు. ► బీహార్ కుర్హానీలో.. జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతోంది. ► రాజస్థాన్ సర్దార్షాహర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ► ఛత్తీస్‌గఢ్(భానుప్రతాప్‌పూర్)లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. న్యూఢిల్లీ: ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో మరో ఏడుస్థానాల(ఒక లోక్‌సభతో కలిపి) ఉప ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. యూపీ అసెంబ్లీ ఒకటి, బీహార్‌లో ఒకటి మినహాయించి మిగిలిన చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రత్యేకించి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి పార్లమెంట్ స్థానం ఎవరి కైవసం అవుతుందా? అని ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్
మోరాదాబాద్: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రామ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలకు మొట్టమొదటిసారిగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్, ఆయన కుటుంబం దూరం అయ్యింది. 1977 నుంచి ఈ నియోజకవర్గం ఖాన్ ఇలాకాగా రామ్‌పూర్ విరజిల్లుతోంది. అయితే.. విద్వేషపూరిత ప్రసంగం కేసులో.. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మూడేళ్ల శిక్ష పడింది అజామ్ ఖాన్‌కి. దీంతో.. ఆయన శాసన సభ సభ్యత్వం కోల్పోవడంతో రామ్‌పూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అజామ్ ఖాన్ భార్య తంజీన్ ఫాతిమాగానీ, ఆయన కోడలుగానీ బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ, ఎస్పీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసీమ్ రజా ఖాన్‌కు టికెట్ కేటాయించింది. రజా ఖాన్, అజామ్ ఖాన్‌ను అత్యంత సన్నిహితుడు. గతంలో ఆజామ్ ఖాన్ తన పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థిగా రజా ఖాన్ పోటీ చేశారు. అయితే.. బీజేపీ ఘనశ్యామ్ లోథి చేతిలో ఓడిపోయారు. రామ్‌పూర్ నియోజక వర్గానికి 1997 నుంచి 2022 దాకా మొత్తం 12 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో.. పదిసార్లు ఆయన గెలుపొందారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. గతంలో అజామ్ ఖాన్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఉప ఎన్నిక జరగ్గా.. ఆ సమయంలో ఆయన భార్య తంజీన్ ఫాతిమా పోటీ చేసి.. గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సమాజ్‌వాదీ పార్టీ మొండి చేయి చూపించింది. అజామ్ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబం న్యాయపరమైన కేసులు ఎదుర్కొంటోంది. 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఆజామ్ ఖాన్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే కుట్రకు పాల్పడిన అభియోగాలపై ఆజామ్ ఖాన్ భార్య, ఆయన తనయుడిపై కేసు నమోదు అయ్యింది కూడా. ఇక బీజేపీ తరపున ఇక్కడ ఆకాశ్ సక్సేనా బరిలో నిలవనున్నారు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆకాశ్ పోటీ చేసి.. ఆజామ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. -
20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారు : సీఎం కేసీఆర్
-
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు
-
బీజేపీ వాగ్దానం అంటేనే జుమ్లా మాటలు: మంత్రి హరీష్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్న పెన్షన్ రూ.750. బీజేపీ పాలిత కర్ణాటకలో రూ.650, మహారాష్ట్రలో రూ.1,000 ఇస్తున్నారు. ఇదే బీజేపీ నాయకులు మునుగోడులో గెలిస్తే రూ.3 వేల పెన్షన్ ఇస్తామని జుమ్లా హామీలు ఇస్తున్నారు. ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉంటుందా..?’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ వన్నీ జుమ్లా మాటలేనని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వండి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రూ.3 వేల పింఛన్ ఇస్తామన్నారని, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండికి బండి, గుండుకు గుండు అని ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని హరీశ్‌రావు నిలదీశారు. (ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు, తర్వాత వాటిని ఉల్లంఘిస్తూ చెప్పిన మాటల వీడియోలను ప్రదర్శించారు) చిత్తశుద్ధి ఉంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. దేశవ్యాప్తంగా రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని ప్రధాని మోదీతో అధికారికంగా చెప్పించాలన్నారు. లేని పక్షంలో జుమ్లా హామీలు ఇచ్చినందుకు బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకిచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదు నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టనపెట్టుకన్న మోదీ.. చివరికి రైతులకు క్షమాపణలు చెప్పి, ఏడాదైనా వారికిచ్చిన హామీలను నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టిన మోదీ ఇప్పటికీ తన ధోరణి మార్చుకోలేదన్నారు. కృష్ణా నీటి వాటా తేల్చకపోవడం వంటి ఎన్నో అంశాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి మునుగోడులో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆత్మగౌరవం కోసం రాజీనామా చేయలేదని, ఆస్తులు పెంచుకోవడానికి చేశారని చెప్పారు. రూ. 2,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రూ.200గా ఉన్న పెన్షన్‌ను తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000కి పెంచామని, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.2,016 ఇస్తున్నట్లు హరీశ్ తెలిపారు. డయాలసిస్ రోగులకు, బీడీ, గీత, నేత కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణాయే అని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ పథకం ద్వారా సీఎం కేసీఆర్ మునుగోడుతో పాటు ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందని, అయితే కేంద్రం ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 10 రెట్లు అధికంగా ధాన్యం దిగుబడి యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని, నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించి, గతంలో కన్నా 10 రెట్ల అధిక ధాన్యం దిగుబడికి సీఎం కారణమయ్యారని హరీశ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట జిల్లాల చిట్టచివరి భూముల వరకు సాగునీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: మును'గోడదూకుడు'.. కొద్దిరోజుల్లోనే మూడు పార్టీలు మారి... -
బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఫొటోలు
-
హుజురాబాద్: మంత్రులు బస చేసిన కిట్స్ కాలేజీలో సోదాలు
-
AP Special: బద్వేలు బరిలో మూడో డాక్టర్
వైఎస్సార్ జిల్లా: బద్వేలు శాసన సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు మరో వైద్యురాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలో ఇద్దరు వైద్యులు ఈ శాసనసభకు, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఎంఎస్ జనరల్ సర్జన్ చదివిన డాక్టర్ శివరామక్రిష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి పర్యాయం 1978లో జనతాపార్టీ తరపున 10,187 ఓట్లతో, రెండో పర్యాయం కాంగ్రెస్ తరపున 10,001 మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా 44,7354 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఈయన ఎంబీబీఎస్,ఎంఎస్ ఆర్థోపెడిక్ చదివారు. ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున డాక్టర్ సుధా పోటీలో ఉన్నారు. ఈమె ఎంబీబీఎస్ చదివి గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ సుధ భార్యభర్తలు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ప్రస్తుత.. ఉప ఎన్నికలో ఆయన భార్య సుధా నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీచేయమని ప్రకటించాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం సుధ ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. చదవండి: Badvel bypoll: బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ -
అక్టోబరు 7న ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ప్రమాణం
కోల్‌కతా: భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సీఎం మమతా మంగళవారం గవర్నర్ జగదీప్ ధన్కర్కు లేఖ రాశారు. అక్టోబరు 3న విడుదలైన భవానీపూర్, జంగీపూర్, షంషేగంజ్ ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. ప్రియాంక టిబ్రేవాల్‌కు 26,428 ఓట్లు సాధించింది. ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్‌ఖేరీ ఘటనను టీఎంసీ ఖండించింది. విపక్షనేతలు.. రైతులను పరామర్శించకుండా అడ్డుకోవడంపై ఛటర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Bhabanipur Bypoll: భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం -
మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 294 స్థానాల్లో 213 ఎమ్మెల్యేలను గెలుచుకుని ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మమతా ఓటమి మాత్రం ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆరు నెలల్లోపు అసెంబ్లీ సభ్యురాలు కాకుంటే ఆమె ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సిందే. చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్‌దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు విసిరిన సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాళ్ల పర్వంలో త్రుటిలో పరాజయం పొందారు. ఆమెను బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 16వ తేదీ ఉపసంహరణ. ఈ స్థానంతో పాటు మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్ టౌన్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నిక కోసం పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, బుధవారం రెండు అర్జీలు అందిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. హుజూరాబాద్ మండలం కనుకుంట్ల గ్రామానికి చెందిన జాలి కమలాకర్‌రెడ్డి, సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఒంటెల లింగారెడ్డి దరఖాస్తులను ఆఫీస్ ఇన్‌చార్జీలకు అందజేశారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోదలచుకుంటే రూ.5 వేల డీడీని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ పేరున తీసి, బయోడేటా, పాస్ పోర్టు సైజ్ ఫొటో జత చేసిన ఫారాలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని సూచించారు. ఆశావహులు అందజేసిన దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేస్తామని, వాటిని పరిశీలించి ఈనెల 10 తర్వాత అభ్యర్థి పేరు వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు. చదవండి: గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు -
టీఆర్ఎస్కు ఓటేసి రుణం తీర్చుకోవాలి: మంత్రి గంగుల
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): నియోజకర్గానికి సీఎం కేసీఆర్ అడగకుండానే వరాలు ఇస్తున్నారని, టీఆర్ఎస్కు ఓటేసి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం పట్టణంలోని సీటీసెంట్రల్ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన మెకానిక్‌లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆటోనగర్‌ను ఏర్పాటు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యేను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్‌లో ఆటోనగర్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని అడిగితే వెంటనే మూడెకరాల భూమిని కేటాయించారన్నారు. గతంలోని చెరువులు ఎండేవని, ఇప్పుడు కాళేశ్వరంతో మత్తళ్లు దూకుతున్నాయని తెలిపారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అశీర్వదించాలని కోరారు. అనంతరం ఆటో యూనియన్ సభ్యులకు భూమిపత్రాలను అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు, యూనియన్ నాయకులు ఉన్నారు. -
Mamata Banerjee: దీదీ పోటీచేసేది అక్కడి నుంచేనా?
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించి మూడోసారి పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కషి చేసిన ఆమె నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. బీజేపీ పక్కా వ్యూహంతో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో మమత దానిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఓ స్పష్టత వచ్చిందని సమాచారం. మమతా బెనర్జీ కోసం తన పదవిని వదులుకునేందుకు భవానీపూర్ ఎమ్మెల్యే ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ శుక్రవారం రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మమతా బెనర్జీ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మమతా పోటీ చేసే స్థానంపై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. ఏం జరగనుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే భవానీపూర్ నుంచే మమత 2016లో గెలిచిన విషయం తెలిసిందే. ఆ స్థానం టీఎంసీకి కంచుకోట. దీంతో మమత గెలుపు సునాయాసమేనని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ -
బీజేపీకి అండగా టీఆర్ఎస్: ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా బీజేపీకి టీఆర్ఎస్ అండగా నిలబడింది. ఓ ఉప ఎన్నిక విషయమై బీజేపీ బరిలో నిలవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పోటీ నుంచి దూరంగా జరిగింది. ఆ ఎన్నికలో పోటీ చేయడం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామం హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. లింగోజిగూడ డివిజన్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్‌కు ఏప్రిల్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో రమేశ్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తుండడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం ప్రగతి భవన్లో కలిసింది. ఈ సందర్భంగా లింగోజిగూడలో ఏకగ్రీవానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆకుల రమేశ్ గౌడ్ సతీమణి, కుమారుడు, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేశ్ గౌడ్ మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి అకాల మరణంతో వచ్చిన ఈ ఎన్నికలో పోటీ పెట్టవద్దు అని బీజేపీ చేసిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేయడం విశేషం. ఏకగ్రీవ ఉప ఎన్నికకు సహకరించాలని కేటీఆర్ ఉత్తమ్‌ను కోరినట్లు సమాచారం. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేశ్ గౌడ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు కలిసి రావాలని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి @KTRTRS గారు కోరారు. — TRS Party (@trspartyonline) April 16, 2021 -
‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ ఏప్రిల్ 17న జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియడంతో 17న జరిగే పోలింగ్ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పలు సూచనలు చేశారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సమయాన్ని పెంచడంతోపాటు పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. సాధారణంగా ప్రతీ 1,500 మందికి ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తామని, కానీ కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతీ 1,000 మందికి ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అదనంగా 477 సహా మొత్తంగా 2,410 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌కు ముందు 48 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలవద్ద కోవిడ్ వ్యాప్తిని నిరోధించే విధంగా శానిటైజేషన్, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఎండ వేడిని తట్టుకునేలా టెంట్లు, మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 80 ఏళ్లు దాటినవారు, అంగవైకల్యమున్న వారిని ఓటు వేయడానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర బలగాలతో బందోబస్తు.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉండగా, అందులో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షలమంది మహిళా ఓటర్లు ఉన్నారని విజయానంద్ తెలిపారు. 466 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 10,796 మంది ఎన్నికల సిబ్బంది, 13,827 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలతో బందోబస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునే విధంగా తొలిసారిగా ‘మే నో పోలింగ్ స్టేషన్’ (mayknowpolling station) పేరిట ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఓటర్ ఐడీ కార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాహనాల తనిఖీలను కేంద్ర బలగాలకు అప్పగించామని చెప్పారు. వలంటీర్లను ఎన్నికల సంబంధిత కార్యక్రమాల్లో వినియోగించకూడదని విజయానంద్ స్పష్టం చేశారు. -
సాగర్ ఉప ఎన్నిక: సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయమై సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక పక్క ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే మరోపక్క టీఆర్ఎస్కు మద్దతు పలకడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ తీసుకోవాల్సి వచ్చిందని సీపీఎం(ఎం) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఐ (ఎం) కూడా మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్ జోష్ మీద ప్రచారం చేయనుంది. దివంగత నోముల నర్సింహయ్య తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ (ఎం) సోమవారం ప్రకటించింది. కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, వామపక్ష అభిమానులు నోముల భగత్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని పై కమిటీలు సూచించాయి. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ నోముల భగత్‌ను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కున్ రెడ్డి నాగిరెడ్డి తెలిపారు. -
తిరుపతి ఉప ఎన్నిక: అత్యంత సంపన్న అభ్యర్థి ఆమే!
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారిణి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. తనకు మొత్తంగా రూ. 25 కోట్ల విలువ గల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆమె, 2019-20 మధ్యకాలంలో తన ఆదాయం రూ. 39.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తన తల్లి నుంచి సంక్రమించిన బంగారు ఆభరణాల విలువ రూ. 52 లక్షలు అని తెలిపారు. రత్నప్రభ ఆస్తి వివరాలు ఇలా.. ►మొత్తం ఆస్తి విలువ(భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి)- రూ. 25 కోట్లు ►రత్నప్రభ సొంత ఆస్తులు- రూ. 19.7 కోట్లు ►బ్యాంకు డిపాజిట్ల విలువ- రూ. 2.8 కోట్లు ►బంగారు ఆభరణాల విలువ- రూ. 52 లక్షలు ►చరాస్తుల విలువ- రూ. 3.5 కోట్లు ►భూమి, భవనాలు, ఇళ్ల స్థలాలు, ఇతర స్థిరాస్తుల విలువ- రూ. 16.2 కోట్లు ♦ఇక తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. అదే విధంగా టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పనబాక లక్ష్మి(భర్త క్రిష్ణయ్యతో కలిసి ఉమ్మడి ఆస్తి) తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. కాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు భారీ ఎత్తున స్వతంత్రులు కూడా నామినేషన్ వేశారు. చదవండి: బీజేపీ-జనసేన బంధానికి బీటలు! గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి -
ఉప ఎన్నిక: నాన్న కల నిజం చేస్తా!
భువనేశ్వర్: పూరీ జిల్లా పిప్పిలి శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక ముఖచిత్రం స్పష్టమవుతోంది. ఈ నియోజక వర్గంలో త్రిముఖ పోటీ తప్పనట్లు కనిపిస్తోంది. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ పిప్పిలి నియోజకవర్గంలో సిగపట్లు పట్టనున్నాయి. బీజేడీ, బీజేపీ ఒకరి తర్వాత ఒకరుగా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఈ రెండు పార్టీల కంటే ముందుగా గెలుపు అవకాశాలు ఉన్న ముగ్గురు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోవడంపట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేడీ నుంచి రుద్రప్రతాప్ అధికార బీజేడీ పార్టీ అభ్యర్థిగా రుద్ర ప్రతాప్ మహారథిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం ఖరారు చేసి ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి కుమారుడు రుద్రప్రతాప్ మహారథి. త్వరలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. నాన్న కల సాకారం చేస్తా: రుద్ర ప్రతాప్ మహారథి తల్లిదండ్రులు, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆశీస్సులతో పిప్పిలి ఉప ఎన్నిక టికెట్ లభించడం అదృష్టం. ముఖ్యమంత్రి నమ్మకం వమ్ము కాకుండా నాన్న కలను సాకారం చేసే దిశలో కృషి చేస్తానని రుద్ర ప్రతాప్ మహారథి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పిప్పిలి ఉపఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆశ్రిత్ పట్నాయక్ తొలుత నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. తొలుత 2014వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల ఓట్లు సాధించారు. రెండో సారి 2019వ సంవత్సరంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 72 వేల ఓట్లు సాధించారు. 15 వేల 787 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలైనప్పటికీ అధికార పక్షం బిజూ జనతా దళ్ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ తరఫున ఆశ్రిత్ పట్నాయక్ తగిన అభ్యర్థిగా అధిష్టానం నిర్ధారించి టికెట్ కేటాయించింది. భారీ ఊరేగింపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సమీర్ మహంతి, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఊరేగింపుగా బయల్దేరి పూరీ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ టికెట్ రేసులో ముగ్గురు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రాథమికంగా ఖరారైన అభ్యర్థుల జాబితాలో నిషికాంత మిశ్రా అగ్రస్థానంలో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో అజిత్ మంగరాజ్, పూర్ణ చంద్ర స్వంయి ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి కాంగ్రెస్ టికెట్ లభిస్తుంది. చదవండి: పిప్పిలి సమరానికి కసరత్తు.. -
ఉప ఎన్నిక సమరానికి కసరత్తు.. కాంగ్రెస్ ముందంజ!
భువనేశ్వర్: పూరీ జిల్లాలోని పిప్పిలి అసెంబ్లీ నియోజక వర్గం ఉపఎన్నిక ఏప్రిల్ 17 వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ శిబిరాల్లో కొత్త వాతావరణం నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభలో ఈ నియోజక వర్గానికి ప్రత్యేక ఉనికి ఉంది. గతంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి దీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించగా ఇటీవల అధికార పక్షం బిజూ జనతా దళ్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేడీ సిట్టింగ్ సభ్యుడు ప్రదీప్త మహారథి అకాల మరణంతో త్వరలో జరగనున్న ఉపఎన్నిక ఈ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు అవకాశాల కోసం కాంగ్రెస్, బీజేడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. పూరీ జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పిప్పిలి స్థానం కూడా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో తరచూ బీజేపీ ప్రముఖులు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ముందంజలో కాంగ్రెస్ పిప్పిలి నియోజక వర్గానికి అభ్యర్థిని ఖరారు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఔత్సాహిక అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాల జాబితాను ఖరారు చేసి పార్టీ అధిష్టానం ఆమోదం కోసం సిఫారసు చేసినట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నిరంజన పట్నాయక్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి పిప్పిలి నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. 30 మంది ప్రచారకులు పిప్పిలి ఉపఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్ని చేపడుతోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారు. ఈ మేరకు 30 మంది ప్రముఖ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపేందుకు యోచిస్తోంది. సమీక్ష సమావేశాల్లో బీజేపీ పిప్పిలి నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిని ఖరారు చేయడంలో భారతీయ జనతా పార్టీ తలమునకలై ఉంది. పార్టీ ప్రముఖులు డాక్టర్ సంబిత్ పాత్రో, పృథ్వీరాజ్ హరిచందన్, గోలక్ మహా పాత్రోలు అభ్యర్థిని ఖరారు చేయడంలో సమీక్షిస్తున్నారు. సానుభూతి వైపు మొగ్గు అధికార పక్షం బిజూ జనతా దళ్ సానుభూతి సూత్రంతో పిప్పిలి నియోజక వర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దివంగత నాయకుడు ప్రదీప్త మహారథి కుటుంబీకుల నుంచి ఒకరికి టికెట్ కట్టబెట్టి నియోజక వర్గం ఓటర్ల సానుభూతితో గట్టెక్కే యోచనలో ఉంది. కాంగ్రెస్, బీజేపీల వ్యూహం బెడిసి కొట్టాలంటే ఇంతకంటే బీజేడీకి ఇంతకంటే అనుకూలమైన మార్గం మరొకటి లేనట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రదీప్త మహారథి భార్య, ఆయన కుమారుడు పిప్పిలి నుంచి అధికార పక్షం బిజూ జనతా దళ్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి ఒకరికి టికెట్ లభించడం తథ్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: అడవి పంపిన బిడ్డ -
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్?
తిరుపతి ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్ర నేతలు క్షేత్ర స్థాయిలోకి దిగేసి రాజకీయ సమీకరణలకు తెర తీస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఆరు రోజులే గడువు ఉంది. అయితే బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, జనసేన వైఖరి చూస్తుంటే బీజేపీ తప్పులు ఎత్తి చూపించి బయటపడి.. ఆంతరంగిక మిత్ర పార్టీ టీడీపీకి మద్దతుగా నిలవాలనే లోపాయికారి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి కంటే.. నోటాకే అత్యధిక ఓట్లు రావడం.. జిల్లాలో ఆ పార్టీ బలాన్ని తేటతెల్లం చేస్తోంది. సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రధాన పార్టీలు హడావుడి చేస్తుంటే.. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో స్నేహబంధాన్ని తెగదెంపులు చేసుకున్న జనసేన బీఎస్పీ పార్టీతో జతకట్టింది. ఎన్నికల తర్వాత ఎక్కడా ఆ పార్టీకి సరైన ఓట్లు రాకపోవడంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో స్నేహబంధానికి తెర తీసింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణలో ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేసిన జనసేన.. హఠాత్తుగా ఆ పార్టీతో విభేదించి తెగదెంపులు చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించినట్లుగానే ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సహకరించలేదంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలల్లో మాత్రం కలిసి పనిచేస్తామని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఎన్నికల సమన్వయ కమిటీలో స్థానం కల్పించలేదని అసహనంతో జనసేన నేతలు ఊగిపోతున్నారు. ఈ పరిస్థితే ఇంకా ఒప్పందంపై ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఆంతరంగిక మిత్ర పార్టీతో.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆంతరంగిక మిత్ర పార్టీతో కలిసి పనిచేయాలనే చీకటి ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ పరిధిలో జనసేన, బీజేపీ ఉమ్మడి కమలం అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం పొత్తు క్షేత్రస్థాయిలో పొడవలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి రాని జనసేన నాయకులను పక్కన పెట్టి బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఉప ఎన్నికల బాధ్యుల కమిటీలో జనసేనకు చోటు ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన జంప్ జిలానీలకు పెద్ద పీట వేసింది. ఈ కమిటీలో చోటు ఇవ్వని కమలనాథులపై గ్లాసు నేతలు గుర్రుగా ఉన్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ జనసేనకు ఆహ్వానం కూడా లేదు. స్థానిక నేతలను కూర్చొ బెట్టుకొని మద్దతు ఇవ్వాలని కోరిన దాఖలాలు లేవు. తమను చిన్న చూపు చూస్తున్న కమలనాథులతో జత కట్టలేమని తెగేసి చెప్పి పాత స్నేహ హస్తం అందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన లోపాయికారికంగా పాత స్నేహం మనస్సులో పెట్టుకుని టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో అయితే టీడీపీతో జతకట్టడం కంటే నోటా వైపు మొగ్గు చూపితే బావుంటుందని ఆ నేతలు ఇప్పటికే రహస్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీకి ఆరో స్థానం 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు. వైఎస్సార్సీపీ, టీడీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలకు మాత్రం డిపాజిట్ కూడా రాకపోవడం విశేషం. -
లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధం: శ్రద్ధ
యశవంతపుర/కర్ణాటక: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తమ కుటుంబం బెళగావి లోక్‌సభ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుందని దివంగత కేంద్రమంత్రి సురేశ్ అంగడి కూతురు, మంత్రి జగదీశ్ శెట్టర్ కోడలు శ్రద్ధా శెట్టర్ తెలిపారు. బెళగావి విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బెళగావిలో పోటీకి మానసికంగా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. అయితే, పోటీపై బీజేపీ హైకమాండ్ నిర్ణయమే అంతిమం అని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందన్నారు. కాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి(65) గతేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం విదితమే. మహమ్మారి కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఆయన ప్రాతినిథ్యం వహించారు. సురేష్ అంగడి స్వస్థలం బెళగావి జిల్లాలోని కేకే కొప్పా. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శ్రద్ధ ఉన్నారు. ఇక సురేష్ అంగడి మరణంతో బెళగావి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, ఆ స్థానంలో ఆయన కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఈమేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కూతురు స్ఫూర్తితో సురేష్ అంగడి(ఫైల్ ఫొటో) చదవండి: రాజకీయాలకు రాంరాం: దీప -
కమలంతో దోస్తీకి టీడీపీ సై..!
రాజకీయం రంగులు మారుస్తోంది.. పొత్తుల కుంపటి రగులుకుంటోంది.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీల మధ్య మంత్రాంగం నడుస్తోంది.. లోపాయికారీ ఒప్పందాలకు రంగం సిద్ధమవుతోంది.. జనసేనను కలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది.. కమలంతో దోస్తీ కట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.. గెలుపుపై ఆశ లేకపోయినా అభ్యర్థిత్వం కోసం కుస్తీ సాగుతోంది. సాక్షి, తిరుపతి : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన ప్రతిపక్ష పార్టీలు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. పొత్తుల కోసం పక్క పార్టీలతో మంతనాలు సాగిస్తున్నాయి. ఒప్పందం కుదిరినా అభ్యర్థి గా మాత్రం తమ వాడే ఉండాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఏకంగా అభ్యర్థిని సైతం ప్రకటించింది. అయితే చంద్రబాబు ప్లాన్ మాత్రం వేరేగా ఉందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. జనసేనకు బలం లేకపోయినా సొంతంగానే అభ్యర్థిని నిలబెట్టింది. అప్పుడు ఆయా పార్టీలకు చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం మళ్లీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. (మాట తప్పడమే బాబు నైజం!) ఒప్పందం కుదిరేనా? ఉప ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటే లబ్ధి చేకూరుతుందనే దానిపై ప్రతిపక్ష పార్టీలు తర్జనభర్జన సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణలోని దుబ్బాకలో గెలిచాం గనుక తిరుపతిలో కూడా ఒంటరిగానే నిలబడదామని బీజేపీ భావిస్తోంది. జనసేన మద్దతును మాత్రం కోరుకుంటోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని బీజేపీ ప్రకటించడంతో జనసేన ఆగ్రహంగా ఉంది. దుబ్బాకలో వాడుకుని ఇప్పుడు దూరం పెడతారా అని మండిపడుతోంది. తిరుపతిలో పొత్తు కుదిరినా తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కాంగ్రెస్ కూడా తమ కార్యకర్తలను కూడగట్టేందుకు విఫలయత్నం చేస్తోంది. రహస్య మంతనాలు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే అమలు చేయనున్నట్లు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకునేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎవరికి వారు దళిత కార్డును వాడుకుని ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
నేడే బిహార్‌లో తుది విడత పోలింగ్
పట్నా: బిహార్‌లో తుది విడత ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, దాదాపుగా 2.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మూడో విడత కీలకంగా ఒవైసీ ఈ విడత జరిగే ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఎన్డీయే, మహాఘట్బంధన్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో పాటుగా అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం, మాయావతికి చెందిన బీఎస్పీ, ఉపేంద్ర కుష్వా ఆర్ఎల్ఎస్పీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తమ పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కోసి–సీమాంచల్ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోనే తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ ఏడాది వరదలతో అతలాకుతలమవుతూ సారో ఆఫ్ బిహార్‌గా పేరు పడిన కోసి ప్రాంతంలో ముస్లింలు, యాదవులు, అత్యంత వెనుకబడిన వర్గాల కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో 30% జనాభా ముస్లింలే. దీంతో ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ చాలా సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన ఉధృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అత్యధిక నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో ఎలాగైనా పట్టు సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ర్యాలీలోనూ బిహార్ అభివృద్ధి చెందాలంటే నితీశ్ కుమార్ సీఎం కావాలని ఆయన పేరే జపించారు. బిహార్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. -
రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
-
చర్చకు రెడీ: హరీష్ రావుకు ప్రతి సవాల్
సాక్షి, కరీంనగర్: మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, చర్చకు ఎక్కడికి రావాలో చెప్పాలంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీ నారాయణ చాలెంజ్ చేశారు. రేషన్ బియ్యం, అంగన్ వాడీ పౌష్టికాహారంలో కేంద్రం వాటా ఎంత.. రాష్ట్ర వాటా ఎంతో చర్చిద్దామా అంటూ ప్రశ్నలు సంధించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీష్ రావు, బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి: మంత్రి హరీశ్‌రావుకు డీకే అరుణ సవాల్) అదే విధంగా, బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన యెండల లక్ష్మీ నారాయణ.. కేంద్ర ఆవాసయోజన, కృషి వికాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని హరీష్‌ను ప్రశ్నించారు. ‘‘క్రిష్ వికాస్ యోజన కింద కేంద్రం 850 కోట్ల రూపాయలిస్తే.. వాటిని ట్రాక్టర్ల రూపంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన వాటిపైన చర్చిద్దామా?. ప్రతి అంశంలో కేంద్రం వాటా ఏంటో చెప్పేందుకు నేను సిద్ధం, హరిష్ రావు సిద్ధమా? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు నీళ్ళు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో హరీష్ రావు చెప్పాలి. గ్రామ పంచాయితీలకు 10 వేల ట్రాక్టర్ లు కొంటె అందులో ఎక్కువశాతం మహేంద్ర ట్రాక్టర్లు ఎందుకు ఉన్నాయో హరీష్ రావు చెప్పాలి’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘బీజేపి కార్పొరేటర్ ఎక్కడో ప్రెజెంటేషన్‌లో తప్పుదొర్లితే, దాన్ని పట్టుకుని రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు మాట్లాడమేమిటి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సీఎం స్వంత జిల్లాలో సరైన గుణపాఠం ఎదురు కాబోతోంది’’ అని చురకలు అంటించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సౌమ్యంగా.. కూల్‌గా సవాళ్లు విసిరారు.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనను చర్చకు రమ్మని ప్రతిసవాల్ విసురుతున్నా అని యెండల పేర్కొన్నారు.(చదవండి: బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట) -
దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థులు వీరే!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 46 నామినేషన్లు దాఖలు కాగా, 11 మంది ఉపసంహరించుకున్నారు. స్క్రూటినీలో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మొత్తంగా 23 మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. వీరిలో ఎనిమిది మంది పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నవారు ఉండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. (చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే') పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నవారు 1. టీఆర్ఎస్ పార్టీ- సోలిపేట సుజాత 2. కాంగ్రెస్ పార్టీ- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 3. బీజేపీ- రఘు నందన్ రావు 4. అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్- కత్తి కార్తీక 5. జై స్వరాజ్- గౌట్ మల్లేశం 6. శ్రమజీవిపార్టీ- జాజుల భాస్కర్ 7. ఇండియా ప్రజా బంద్ పార్టీ- సునీల్ 8. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా- సుకురి అశోక్ స్వతంత్ర అభ్యర్ధులు 9. అండర్ఫ్ సుదర్శన్ 10.అన్న బుర్ర రవి తేజ గౌడ్ 11 అన్న రాజ్ 12. కంటే సాయన్న 13. కొట్టాల యాదగిరి ముదిరాజ్ 14. కోట శ్యామ్ కుమార్ 15. విక్రమ్ రెడ్డి వేముల 16. బండారు నాగరాజ్ 17. పీఎం .బాబు 18.బుట్టన్నగారి మాధవ రెడ్డి 19.మోతె నరేష్ 20. రణవేని లక్ష్మణ్ రావు 21. రేపల్లె శ్రీనివాస్ 22 .వడ్ల మాధవాచారి 23. సిల్వెరి శ్రీకాంత్ -
అమిత్ జోగీ నామినేషన్ తిరస్కరణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని మార్వాహీ రిజర్వుడ్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్న జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే) అధినేత, దివంగత సీఎం అజిత్ జోగీ తనయుడు అమిత్ జోగీ నామినేషన్ శనివారం తిరస్కరణకు గురైంది. ఆయన సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అమిత్ జోగీ గిరిజనుడు కాదని అక్టోబర్ 15న ఉన్నత స్థాయి సర్టిఫికేషన్ పరిశీలన కమిటీ తేల్చిచెప్పింది. ఆయన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీని ఆధారంగా∙అమిత్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అలాగే ఇదే ఉప ఎన్నికలో బరిలోకి దిగుతున్న అమిత్ జోగీ భార్య రిచా నామినేషన్‌ను కూడా ఇదే కారణంతో తిరస్కరించారు. అజిత్ జోగీకి కంచుకోట అయిన మార్వాహీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఆయన కుటుంబ సభ్యులెవరూ పోటీపడే అవకాశం లేకుండాపోయింది. అజిత్ జోగీ మరణంతో ఖాళీ అయిన మార్వాహీ అసెంబ్లీకి స్థానానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. -
ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్‌రావు ఈ విడత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!) అనుకూలంపై అంచనా.. ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి 1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్) వరుస ఓటమి చవిచూసినా.. వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్‌రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్ఆర్ఏస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్‌రావు రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు. చేనేత సమస్యలపై లోక్‌సభలో చర్చిస్తా.. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్
సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 823 కావడంతో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోలైన ఓట్లన్నింటిని కలిపేస్తారు. అందులో నుంచి చెల్లుబాటు కాని ఓట్లను తీసివేస్తారు. అ తర్వాత 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కడతారు. మొదటి రౌండ్లో 600 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతి రౌండ్లో మిగిలిన 223 ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కించిన అనంతరం ఫలితాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అభ్యర్థి గెలుపును ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపు పత్రాన్ని అందజేస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు డిపాజిట్లు రావాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే 823 ఓట్లలో సుమారు 138 ఓట్లు వచ్చిన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కుతాయి. లేనిపక్షంలో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవాల్సి వస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే.. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోయే అవకాశముంది. ప్రాధాన్యత ఓటు విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు ఓటములు తేలాలంటే పోలైన ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే పోలైన ఓట్ల సంఖ్యలో సగాని కంటే +1 అన్నమాట. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 ఓట్లు (రెండు పోస్టల్ ఓట్లతో కలిపి) పోలయ్యాయి. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 413 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల సరళిని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ వస్తే, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిర్వహించే అవకాశం లేదు. ఆరుగురు కౌంటింగ్ ఏజెంట్లు.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు పాసులు జారీ చేశారు. కౌంటింగ్ హాల్లోకి ఒక్కో అభ్యర్థికి ఆరుగురు కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. వీరికి ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్‌ను కూడా కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు. పాలిటెక్నిక్ కళాశాల రెండో గేట్ నుంచి కౌంటింగ్హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. -
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ
దేవ్రియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ముకుంద్ భాస్కర్‌మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్‌ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు. -
దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక శాసన సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో నేడు అధికార పార్టీలో చేరారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంత మంది ముఖ్య నేతలు సైతం టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు.(చదవండి: మీ లింగన్న లాగే అందుబాటులో ఉంటా: సుజాత) ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్‌రావుకు టికెట్ కేటాయించడం పట్ల తోట కమలాకర్‌రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది. షెడ్యూల్ వివరాలు నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 -
ఉప ఎన్నిక: కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు. వార్ వన్ సైడ్: బాజిరెడ్డి నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తొలి ఓటు వేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తదితర 28 మంది టీఆర్ఎస్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. వార్ వన్ సైడే ఉందని, కవిత గెలుపు ఖాయమన్నారు. ఆమె రాకతో రాజకీయాలు మారబోతున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు: గణేష్ గుప్తా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయి. కవిత సునాయాసంగా విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. నిజామాబాద్‌కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అనంతరం బోధన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. ఓటు హక్కు వినయోగించుకునే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్ క్యాంప్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు. జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు కార్పొరేటర్లంతా బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, రాజేశ్వర్ అక్కడికి చేరుకున్నారు. 24 మందికి కరోనా పాజిటివ్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 824 మంది మొత్తం ఓటర్లు ఉండగా 24 మంది ఓటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్ బాధితులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా వెలువడే అవకాశాలు ఉన్నప్పటికీ, తమ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీల బలాబలాలు జిల్లాలో అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 413 మంది ఓటర్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. మొత్తం ఓటర్లు 824లో టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే టీఆర్ఎస్కు సొంత బలం ఉంది. దీనికి తోడు మిత్ర పక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మద్దతుగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు 66 మంది ఉండగా, ఇప్పటికే దాదాపు అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారే. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే 75 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం సుమారు 67కు తగ్గింది. అలాగే బీజేపీకి 85 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పటి వరకు 35 మందికి పైగా కారెక్కారు. టీఆర్ఎస్ సొంత బలం, ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన వారితో కలిపి తమకు సుమారు 700 మించి ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం ఖాయమనే ధీమాతో గులాబీ శ్రేణులు ఉన్నాయి. -
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా నోటిఫికేషన్ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. దుబ్బాకతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన 56 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని వాల్మీకి ఎంపీ స్థానం ఉప ఎన్నిక జరుగనుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ వివరాలు.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం.. దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. . అధిష్టానంపై ఒత్తిడి అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందలని పక్కా ప్రణాళిక బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి. -
‘కాంగ్రెస్, టీఆర్ఎస్ మిలాఖత్’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలకు హుజూర్నగర్ ఉపఎన్నిక తెరలేపినట్లుగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ చివరి మూడు రోజులు సభను రాజకీయ సభగా మార్చారని విమర్శించారు. ఒక దశలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని చేసిన ప్రకటన గమనిస్తే మిలాఖత్ రాజకీయాలు అర్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు సులువు కాదని ముఖ్యమంత్రికి అర్ధం అయ్యిందని, అందుకే పరోక్షంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా హుజూర్ నగర్ ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
సైదిరెడ్డికి మరో చాన్స్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం అవకాశమిచ్చారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి. హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్ఎస్ ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది. (చదవండి : మోగిన ఎన్నికల నగారా) టీఆర్ఎస్కు అగ్ని పరీక్షే హుజూర్ నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అగ్ని పరీక్ష అని చెప్పాలి. హుజూర్ నగర్ నియోజక వర్గము ఏర్పాటు అయిన తరువాత ఒక్కసారి కూడా టీఆర్ఎస్ విజయం సాధించలేదు. 2009 నుంచి హుజూర్ నగర్ లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు చేదు ఫలితమే ఎదురైంది. మంత్రి జగదీశ్ రెడ్డి 2009 లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాసోజు శంకరమ్మకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. తర్వా త జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని పోటీకి దింపింది. కానీ భంగపాటు మాత్రం తప్పలేదు. నల్గొండ ఎంపీ సీటు కోల్పోయిన పరాభావంలోఉన్న టీఆర్ఎస్ హుజూర్నగర్ సీటును దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. మండలానికి ఒక మంత్రిని పెట్టి గెలిచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
వైరల్ అవుతున్న ఓ అఫిడవిట్...ఆస్తి ఎంతో తెలిస్తే
సాక్షి, చెన్నై: తమిళనాడులోని పెరంబూరు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. అఫిడవిట్ల పరిశీలనలో ఎన్నికల సంఘం పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఆస్తులకు సంబంధించి అఫిడవిట్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలను చూపించారు. తన ఆస్తి 1.7 లక్షల కోట్ల రూపాయలనీ, వరల్డ్ బ్యాంక్‌కు తాను బకాయిపడ్డ మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలని ప్రకటించడం చర్చకు దారితీసింది. రిటైర్డ్ పోలీస్ అధికారి మోహన్ రాజ్ (67) నామినేషన్‌తోపాటు ఈ వింత అఫిడవిట్‌ను దాఖలు చేశారు. తన నామినేషన్ స్వీకరించడంతో ఇది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ అయిందని చెప్పారు. మోహన్‌రాజ్ ఈ నంబర్లను ఎంచుకోవడం వెనక రహ్యసం ఏమిటంటే.. తన ఆస్తిగా ప్రకటించిన రూ.1.76 లక్షల కోట్లు 2జీ కుంభకోణం విలువ. ఇక రూ.4 లక్షల కోట్ల అప్పు విషయానికి వస్తే..ఇదితమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పు. (2019-20బడ్జెట్లో మార్చి, 2020 నాటికి అప్పురూ.3,97,495.96 కోట్లకు చేరనుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.) అయితే పోలీసు విభాగంనుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తనకు సొంత ఇల్లు ఉందన్న విషయాన్ని ప్రకటించలేదన్నారు. తన భార్యకు రూ. 2.50 లక్షల విలువ చేసే 13 సవర్ల బంగారం, 20వేల రూపాయల నగదు ఉన్నట్టు ప్రకటించారట. అలాగే మూడు లక్షల రూపాయల గోల్డ్‌లోన్ ఉండగా, బ్యాంకు ఈ బంగారాన్ని వేలం వేసినట్టు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం 2 జి స్పెక్ట్రమ్ కేసు సరిగా దర్యాప్తు చేయలేదని ఆరోపించడంతోపాటు ప్రభుత్వం "అసమర్ధత పరిపాలన" కు నిదర్శనం రూ .4 లక్షల కోట్ల భారీ రుణ భారమని మండిపడ్డారు. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా తాను ఇలాంటి అఫిడవిట్‌నే సమర్పించాననీ, తన రూ.1,977 కోట్లగా చూపించానని చెప్పారు. అయినా తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు లేవని తెలిపారు. అంతేకాదు అఫిడవిట్లో మీరు ఏమి డిక్లేర్ చేసినా, ఈడీ ఏమీ చేయదంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి తప్పుడు డిక్లరేషన్ చేసినందుకు ఎలాంటి చర్యలను ఎదుర్కోలేదా అన్ని ప్రశ్నించినపుడు..ఈసీ నుంచి తనకు కనీసం నోటీసు కూడా రాలేదన్నారు. ఎన్నికల కమిషన్ సహా పలు అధికారుల వైఖరితో విసిగిపోయానని, ఇలాంటి తప్పుడు ప్రకటనలను నేరం కింద పరిగణించాలని మోహన్ రాజ్ డిమాండ్ చేశారు. జాతి మంచి కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్న ఈయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి తనయుడు కావడం విశేషం. అయితే మోహన్‌రాజ్ అఫిడవిట్‌పై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏప్రిల్ 18న ఇక్కడ పోలింగ్ జరగనుంది. -
ఉప ఎన్నికల బరిలో కమల్ పార్టీ
చెన్నై: తమిళనాడులో త్వరలో 20 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుందని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ వెల్లడించారు. ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న కమల్ హాసన్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన 18మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును ఇటీవల మద్రాస్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. దీంతోపాటు డీఎంకే అధినేత కరుణానిధి, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఏర్పడ్డాయి. -
ఉప ఎన్నికల్లో ఆర్జేడీ హవా
సాక్షి, పాట్నా: బిహార్ ఉప ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హవా కొనసాగింది. ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ కైవసం చేసుకోగా, మరో అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తిరిగి సొంతం చేసుకుంది. అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్‌కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది. జహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు పరీక్షగా నిలిచాయి. బీజేపీకి స్వల్ప ఊరట కాగా, ఉప ఎన్నికల్లో ఓ అసెంబ్లీ స్థానాన్ని నెగ్గిన బీజేపీకి స్వల్ప ఊరట లభించింది. భబువా అసెంబ్లీ నియోజకవర్గాన్ని మళ్లీ బీజేపీ సొంతం చేసుకుంది. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి శంభు పటేల్‌పై 11 వేల పైచిలకు ఓట్ల మెజార్టీతో బీజేపీ నాయకురాలు రింకీ రాణి పాండే విజయం సాధించారు. ఇటీవల రింకీ భర్త ఆనంద్ భూషణ్ పాండే మృతితో ఖాళీ అయిన భబువాకు ఉప ఎన్నిక జరిగింది. ఆనంద్ భూషణ్ భార్య రింకీని బరిలో నిలపగా సానుభూతి ఓట్లు పడ్డాయి. దీంతో కనీసం ఈ ఒక్క స్థానాన్నైనా బీజేపీ సొంతం చేసుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మెగా ఉప ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
లక్నో/పట్నా : మెగా ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని రెండు, బిహార్‌లోని ఒక లోక్ సభ స్థానానికి ఆదివారం ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీజేపీని ఓడించేందుకు బద్ధశత్రువులుగా పేరుగాంచిన ఎస్పీ-బీఎస్పీలు ఈ ఉప ఎన్నికల కోసం చేతులు కలిపాయి. ఇక బిహార్‌లోని అరారియా లోక్ సభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. మహాకూటమి నుంచి నితీశ్ బయటికి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో ఆసక్తి నెలకొంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మార్చి 14న ఫలితాలు వెలువడుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఈ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. -
ఉప ఎన్నిక ప్రశాంతం
అనంతపురం న్యూసిటీ : తాడిపత్రి, హిందూపురం మున్సిపాలిటీలకు సంబంధించి రెండు స్థానాలకు జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. హిందూపురంలో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, పోలీసులు ఇరు వర్గాలను మందలించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. హిందూపురంలో 9వ వార్డు ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున రాధ, టీడీపీ తరఫున శాంత బరిలో దిగారు. ఈ వార్డులో 2,576 ఓట్లకు గానూ 1,395 ఓట్లు పోలయ్యాయి. 54.15 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే తాడిపత్రి 4వ వార్డుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్, టీడీపీ తరఫున లక్ష్మీదేవి, స్వతంత్య్ర అభ్యర్థి రియాజ్ బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 1,680 ఓట్లుండగా, 1,181 ఓట్లు పోలవగా, 70.29 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 10న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తాం
-
కలహాల కమలం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానానికి సొంత పార్టీలో వర్గపోరు ఇబ్బందిగా మారింది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న కమలం పార్టీకి ముఖ్యనాయకుల మధ్య కలహాలు.. ఎన్నికల పోరును ఎదుర్కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. కేంద్రంలో అధికార పార్టీగా వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. గతంలో వరంగల్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పార్టీగా మళ్లీ ఈ సీటు కైవసం చేసుకోవచ్చనే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉంది. సమర్థుడికి టికెట్ ఇచ్చి విజయం కోసం గట్టిగా కృషి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. బీజేపీ అధిష్టానం తీరు ఇలా ఉంటే... జిల్లాలోని ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం విరుద్ధంగా ఉంది. జిల్లాలోని పార్టీ రెండుగా చీలిపోయి ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు వచ్చిన సమయాల్లోనూ జిల్లా నాయకులు ఇలాగే వ్యవహరిస్తుండడం బీజేపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఏ పార్టీకి లేని విధంగా వరంగల్ నగర జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లాగా బీజేపీకి జిల్లాలో రెండు శాఖలు ఉన్నాయి. సాంకేతి కంగా రెండు శాఖలను రెండు జిల్లాలుగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెం డు శాఖలు ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి కీలక నేతలే గ్రూపులు పెంచి పోషిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. వరంగల్ లోక్‌సభ ఎన్నిక వ్యూహంపై బీజేపీ సన్నాహక సమావేశాన్ని జూలై 13న నిర్వహించాలని నిర్ణయించారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఒకేచోట సమావేశం కావాల్సి ఉంది. అయితే వరంగల్ నగర, వరంగల్ గ్రామీణ శాఖలు పార్టీ సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికను సవాలుగా భావిస్తున్న బీజేపీ అధిష్టానం ముందుగా నిర్ణయించిన సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్‌ను పంపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ రెండు శాఖలను సమన్వయం చేయాల్సిన కిషన్‌రెడ్డి వేర్వేరుగా నిర్వహించిన రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. లోక్‌సభ పరిధి సమావేశం ఒక్కటిగా జరగాల్సి ఉండగా... రెండు చోట్ల జరగడంపై కృష్ణదాస్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తలు, నాయకులు ఒక్కటిగా ఎలా పనిచేస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. గతంలో అధికార పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు... కొత్త నాయకత్వాన్ని తీసుకురావడంలో పట్టుదలకు పోయి పార్టీకి నష్టం చేస్తున్నారని కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. జాతీయ భావాలున్న వారిని, గతంలో బీజేపీ అనుకూల సంఘాల్లో పనిచేసిన వారిని పార్టీకి దగ్గరగా చేసే కార్యక్రమం విషయంలో సీనియర్లు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కేంద్రంలో అధికార పార్టీగా ఉప ఎన్నికలో సత్తా చూపాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మం త్రులు, బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు తరచూ జిల్లాకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలను పక్కనబెట్టి... పార్టీలోని ప్రత్యర్థులను ఎలా అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ సీని యర్ల వ్యవహారశైలి ఉంటోందని వాపోతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి రావడానికి ఇష్టపడని వారికి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పడం బీజేపీలోనే చెల్లుబాటవుతోందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేతలు ఉన్న పార్టీకి ఉప ఎన్నికలో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయని గుసగుసలాడుకుంటున్నారు. -
నేటితో ప్రచారానికి తెర
ఉప ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాల పర్యటనలతో హోరెత్తిపోయిన ఆర్కేనగర్లో గురువారం ప్రచారానికి తెరపడనుంది. 27వ తేదీన పోలింగ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ప్రకటించారు. చెన్నై :చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ ప్రధాన పార్టీల నుంచి రంగంలో ఉన్నారు. వీరిద్దరుకాక మరో 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అమ్మ తరపున మంత్రులు, 50 మంది ప్రచార బృందం పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది. సీపీఐ అభ్యర్థి సైతం తన వంతు ప్రచారం సాగిస్తున్నారు. అభ్యర్థి హోదాలో జయలలిత ఈనెల 22వ తేదీన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. 27 వ తేదీన పోలింగ్ సందర్భంగా గురువారం సాయంత్రానికి ప్రచారం ముగించాలని, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వ చ్చిన వారంతా ఆర్కేనగర్ విడిచి వెళ్లాలని సందీప్ సక్సేనా ఆదేశించారు. ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పది కంపెనీల పారా మిలిటరీ దళాలు బందోబస్తులో ఉన్నాయని, వీరుగాక వెయ్యి మంది రాష్ట పోలీసులు, 1150 మంది ఎన్నికల సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆందోళన: ఆర్కేనగర్ నియోజకవర్గంలో గురువారం అన్నదాతలు ఆకస్మిక ఆందోళన చేపట్టి పోలీసులను పరుగులు పెట్టించారు. తండయార్‌పేట-తిరువత్తియూర్ రోడ్డులోని కార్పొరేషన్ మండల కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి రైతులు గుమికూడడం ప్రారంభించారు. మీరు ఎవరు, ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, ఊరికినే నిలుచున్నా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. 10 గంటల సమయానికి సుమారు వందమంది రైతులు గుంపుగా చేరి మండల కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. మీకు ఏమి కావాలని పోలీసులు ప్రశ్నించగా, ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకే ఆమె పోటీ చేస్తున్న ఆర్కేనగర్లో వినతి పత్రం సమర్పిస్తున్నామని బదులిచ్చారు. వినతి పత్రాలు ఇక్కడ ఇవ్వకూడదని పోలీసులు వారికి అడ్డుతగలడంతో అకస్మాత్తుగా రోడ్లపై పడుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతల ఆందోళనతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఆర్కేనగర్ పరిధిలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీల్లో పోలీస్ పేరుతో ఉన్న వాహనం నుండి ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న వసంతకుమార్, ఎమ్ఎల్ రవి, పాల్‌రాజ్, తదితర 9 మంది అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తండయార్‌పేటలోని కార్పొరేషన్ మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి దూసుకెళ్లారు. పోలీసులు సర్దిచెప్పి పంపివేశారు. అలాగే ప్రచార సమయంలో తనపై రాళ్లు రువ్వారని మరో స్వతంత్య్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదు స్వీకరించక పోవడంతో ధర్నాకు దిగాడు. 4రోజులు టాస్మాక్ సెలవు : ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపు సందర్బంగా నాలుగురోజుల పాటూ టాస్మాక్ దుకాణాలకు, బార్లకు సెలవు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 27వ తేదీ రాత్రి వరకు, అలాగే లెక్కింపురోజైన 30వ తేదీ రాత్రి వరకు శలవు దినాలను అమలుచేయనున్నారు. ‘అమ్మగెలుపు-తెలుగోడి గెలుపు’ కేతిరెడ్డి ప్రచారం: తెలుగువారు అత్యధికంగా నివసించే ఆర్కేనగర్ నియోజకవర్గంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నాడీఎంకే తరపున ఈనెల 13 వ తేదీ నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి తెలుగు ప్రజలంతా తమ నూరుశాతం ఓట్లను రెండాకుల చిహ్నంపై వేసి అమ్మను అఖండమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అమ్మ గెలుపు తెలుగోడి గెలుపు అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ వాడవాడలా ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపిస్తే రాష్ట్రం మరిన్ని మంచి పథకాలతో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఏఐటీఎఫ్ ప్రచారం: ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి నేతృత్వంలో పలు తెలుగు సంఘాల ప్రముఖులు గురువారం ఆర్కేనగర్లో ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని పేర్కొంటూ అన్నాడీఎంకే తరపున ప్రచారం జరిపారు. చెన్నైపురి ట్రస్ట్ చైర్మన్ తంగుటూరి రామకృష్ణ, టామ్స్ అధ్యక్షులు గొల్లపల్లి ఇజ్రాయేల్, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, దక్షిణభారత తెలుగు సంక్షేమం సంఘం అధ్యక్షులు దోర్నాదుల సత్యనారాయణ, మెహతానగర్ తెలుగు ప్రముఖులు ప్రకాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. -
మెదక్ ఓటమిపై కాంగ్రెస్ అంతర్మధనం
-
అధికార బలంతోనే గెలవగలిగారు
-
వాళ్ళందరికి ప్రజలే బుద్ధి చెప్పారు!
-
ఆ విషయం అధికారులే ఒప్పుకున్నారు!
-
మెదక్‌లో టీఆర్ఎస్ ఘన విజయం
-
బీజేపీ ఢీలా పడిందా?
-
ఎవరెన్ని చెప్పినా.. ప్రజలు మమ్మల్నే నమ్మారు!
-
బీజేపీకిదేం ఎదురు దెబ్బ కాదు!
-
నందిగామలో తంగిరాల సౌమ్య ఘన విజయం
-
నాన్నగారికి ప్రజలిచ్చిన నివాళి
-
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలివీ!
-
మెదక్‌లో కారు జోరు!
-
ఓటింగ్ సరళిని బట్టి ఫలితాల్ని చెప్పలేం!
-
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతం
-
ఆళ్లగడ్డ ఎన్నికలపై హైకోర్టులో ఫిటీషన్లు: భన్వర్‌లాల్
-
ముగిసిన ఉపఎన్నికల ప్రచారపోరు