by polls
-
నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్ మీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్‌లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.మరోవైపు.. పోలింగ్ బూత్‌లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. -
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్‌నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్‌తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. -
మెరుగైన ఫలితాలు సాధిస్తాం: అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అధికారం కోసం వారి కుమ్ములాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఇతర పార్టీల్లో చీలిక రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీలోనూ చీలికలకు పాల్పడుతోందన్నారు. -
ఉప ఎన్నికల్లో ఎన్డీయేకు షాక్.. ఇండియా కూటమి జోరు
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్‌లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఇక, మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.సీఎం సతీమణి విజయం..హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.బెంగాల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్..పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.పంజాబ్ బైపోల్ ఆప్‌దే..పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు. బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab. BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024 -
ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఏపీతో పాటు కర్ణాటక(జగదీష్ శెట్టర్-రాజీనామా), బీహార్(రామ్‌బాలి సింగ్-అనర్హత వేటు), ఉత్తరప్రదేశ్(స్వామి ప్రసాద్ మౌర్య-రాజీనామా) మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది.నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జులై 2 కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన ఉండనుంది. జులై 12వ తేదీన ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. -
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి; సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను బుధవారం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, బీహార్ తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కొ అసెంబ్లీ స్థానం.. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆ సీట్లు ఎందుకు ఖాళీ అయ్యాయనే కారణాలను కూడా వివరించింది. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల బై పోలింగ్ జులై 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే.. జులై 13వ తేదీన కౌంటింగ్.. అదే రోజు సాయంత్రం ఫలితాల్ని వెల్లడిస్తారు.ఇదీ చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ, తొలి సంతకం దేనిమీద అంటే.. -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం
updates... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్బీజేపీ 22887 ఓట్లుబీఆర్ఎస్-21489 ఓట్లు కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..కాంగ్రెస్- శ్రీగణేష్ -18140బీఆర్ఎస్-నివేదిత- 11739బీజేపీ-వంశీ తిలక్-9160కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలుమొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140 బిజెపి అభ్యర్థి తిలక్ 2666 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నికకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్ఎస్కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్‌కి గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్ -
కాంగ్రెస్ రెబల్‌కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్‌లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్‌కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్‌లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్‌తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్‌పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
యెల్లో బ్యాచ్ ఏడుపే.. వైఎస్సార్సీపీ ఎదుగుదల
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తాజా గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్సీపీ మద్దతు దారులు గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. ► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. ► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. ► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► ఎన్టీఆర్ జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. ► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు. ► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. ► నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► వైఎస్సార్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పరాభవం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ బోల్తా పడింది. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 34 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నెల్లూరు: మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం. చేజర్ల మండలం పాతపాడు లో రీకౌంటింగ్ లోను సమాన ఓట్లు రావడంతో లాటరీ నిర్వహించిన అధికారులు. లాటరీలో వైసీపీ అభ్యర్థి షేక్.మస్తాన్ బి విజయం ఏలూరు: దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం. పెదపాడు మండలం, పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన 10వ వార్డు ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొట్టపు సోమేశ్వరి 26 ఓట్ల మెజారిటీతో విజయం. జీలుగుమిల్లి గ్రామంలో 6వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన మడకం ధనరాజు 42ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► పెదపాడు మండలం వీరమ్మ కుంట గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు. మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడన నాగబాబును ఓడించారు. ►వణుదుర్రు సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపు పశ్చిమగోదావరి: పాలకొల్లు మండలం గోరింటాడా గ్రామపంచాయతీ ఆరో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పీతల యమున దుర్గ చంద్రకళ 15 ఓట్ల మెజారిటీతో గెలుపు. పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో ఆరో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి అంగర రామలక్ష్మి 10 ఓట్ల మెజారిటీతో గెలుపు. వీరవాసరం మండలం మత్యపురి గ్రామం ఒకటో వార్డు లో వైఎస్సార్సీపీ బలపరిచిన కారేంపల్లి విజయలక్ష్మి 167 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణా: బంటుమిల్లి 4 వ వార్డుకి వైఎస్సార్సీపీ బలపర్చిన గొల్ల సృజన విజయం ఎన్టీఆర్: తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా YSRCP బలపరిచిన చలివేంద్ర హరిబాబు విజయం. తూర్పు గోదావరి: రాజానగరం మండలం పల్ల కడియం గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన పెండ్యాల అరుణ సమీప అభ్యర్థి చేవా ప్రమీలపై విజయం సాధించారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన తాతపూడి సత్యవతి విజయం సాధించారు. అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గం లో వైఎస్సార్ సీపీ హవా. టీడీపీ కి జేసీ బ్రదర్స్ కు ఎదురుదెబ్బ. జేసీ సొంత మండలం పెద్దపప్పూరు లో టీడీపీకి చేదు అనుభవం తాడిపత్రి నియోజకవర్గం లో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం ► దేవునుప్పలపాడు పంచాయతీ లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య సర్పంచ్ గా ఎన్నిక ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మెజారిటీ స్థానాలు చలివెందుల, దేవునుప్పలపాడు పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం 33 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయం 21 వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల గెలుపు తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, పెనుకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ ► హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఉపేంద్ర రెడ్డి 337 ఓట్లతో విజయం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిపత్యం ► శాంతిపురం మండలం కడపల్లి పంచాయితీ 10 వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారుడు సుధాకర్ ప్రత్యర్థి ప్రకాష్ పై 47 ఓట్లుమెజారిటీతో గెలుపు అనకాపల్లి జిల్లా: నక్కపల్లి మండలంలో రేబాక చిన దొడ్డిగల్లులలో రెండు వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం శ్రీకాకుళం జిల్లా: ►టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయతీ జగన్నాధపురం ఏడో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పావని 124 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 219 ఓట్లు గాను 156 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పావనికు 124 ఓట్లు రాగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి సింగపురం మోహిని కు 28 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ►నరసన్నపేట మండలం కొమర్థి లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి. లబ్బ రాజారావు 24 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 50 ఓట్లు రాగా వైసీపీ బలపరచిన అభ్యర్థికి 74 ఓట్లు వచ్చాయి. ►సారవకోట మండలం బద్రి సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థి మజ్జి అసిరమ్మ గెలుపు సాధించారు. ►నందిగాం మండలం అన్నపురం పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి బార్నాన ఇంద్రవేణి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 775 ఓట్లకు 633 ఓట్లు పాలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి ఇంద్రవేణికు 353, టీడీపీ బలపర్చిన అభ్యర్ధి బర్నాన తిరుపతిరావు కు 264 ఓట్లు వచ్చాయి ►బూర్జ మండలం పెదలంకాం సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కాకితాపల్లి గోవిందరావు గెలుపు సాధించారు. -
నేడు ‘స్థానిక’ ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష పద్ధతిన ఎన్నిక జరిగే పలు పదవులకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే ఎన్నికలు జరిగి రాజీనామా చేయడం, మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్, మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు, 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 12 పంచాయతీల్లో 12 ఉప సర్పంచి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం 11 గంటలకు ఆయా స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలు, పదవుల వివరాలు పట్టణ ప్రాంతాల్లో.. ► మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (కృష్ణా జిల్లా)– రెండు డిప్యూటీ మేయర్ పదవులు ► పెడన మున్సిపాలిటీ (కృష్ణా)– చైర్పర్సన్ ► మాచర్ల మున్సిపాలిటీ (పల్నాడు)– వైస్ చైర్మన్ ► ధర్మవరం (శ్రీసత్యసాయి)– రెండు వైస్ చైర్మన్ పదవులు . గ్రామీణ ప్రాంతాల్లో.. ► ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4): రామకుప్పం (చిత్తూరు జిల్లా), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) ► ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7): రామకుప్పం, విజయాపురం(చిత్తూరు), రాపూరు (నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (పార్వతీపురం మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం) ► కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరిగే మండలాలు (3): చిత్తూరు (చిత్తూరు), బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ► ఉపసర్పంచి ఎన్నికలు జరిగే పంచాయతీలు (12): అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి పంచాయతీలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీ -
ఉప ఎన్నికలు.. ఏడులో మూడు అక్కడే!
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్ పోలింగ్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఏడు చోట్ల సైతం ఉప ఎన్నికల పోలింగ్ ఇవాళే(డిసెంబర్ 5, సోమవారం) జరగనున్నాయి. ఇందులో ఒక లోక్‌సభ స్థానం సైతం ఉంది. రాజస్థాన్(సర్దార్‌షాహర్), ఛత్తీస్‌గఢ్(భానుప్రతాప్‌పూర్), ఒడిశా(పదంపూర్)లలో సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనర్హత వేటు కారణంగా ఖుర్‌హని స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్డీయే కూటమికి సీఎం నితీశ్‌కుమార్ గుడ్ బై చెప్పిన తర్వాత జరుగుతున్న.. మొదటి ఎన్నిక ఇది. ఇక మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఎన్నికతో ఉత్తర ప్రదేశ్ ప్రధాన చర్చకు దారి తీసింది. సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ములాయం కంచుకోట అయినప్పటికీ.. కిందటిసారి జరిగిన ఎన్నికలో తక్కువ మార్జిన్‌తో గెలుపుతో గెలుపొందారు ములాయం. దీంతో ఎస్పీ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్ భార్య, ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీలో దిగారు. ఇక బీజేపీ మాజీ ఎంపీ రఘురాజ్ సింగ్ శక్య ఈసారి బరిలో నిల్చున్నారు. యూపీలోనే రాంపూర్ సదర్, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ఈ ఉప ఎన్నికల ఫలితాలను సైతం వెల్లడించనుంది ఎన్నికల సంఘం. -
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్‌రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
‘దుబ్బాకలో రూ.10వేలు, హుజురాబాద్‌లో 20వేలు, మునుగోడులో 40వేలు’
సాక్షి, వరంగల్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఇటీవల హనుమకొండలో మృతి చెందిన ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా మాట్లాడారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాలుపడుతుందని ఆరోపించారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల అక్రమాలను అడ్డుకుంటాం. దుబ్బాకలో ఓటుకు రూ. 10వేలు, హుజురాబాద్ రూ. 20 వేలు పంచిన బీఆర్ఎస్ ఇప్పుడు మునుగోడులో ఓటుకు రూ. 40వేలు పంచేందుకు సిద్ధమైంది. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, మద్యం మునుగోడుకు పంపించడం చూస్తే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్లో ఉన్నారో అర్థమవుతుంది.’ అని దుయ్యబట్టారు బండి సంజయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా కోసం రాజీనామా చేశాడని మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో బీజెపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. ఫోన్ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. నీచమైన, దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్‌దేనని, బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు బండి సంజయ్. ఇదీ చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. 6 రాష్ట్రాల్లోని 7 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 14న నామినేషన్లు. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అక్టోబర్ 17 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు. ఉప ఎన్నికలు జరిగే స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ -
Sangrur By-Poll Results: పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు!
చంఢీగడ్: పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో.. శిరోమణి అకాళిదల్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ .. ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంగ్రూర్ నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ ఎంపీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా భగవంత్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆయన గెలుపొందిన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పంజాబ్‌లో గెలిచిన ఆప్ ఉపఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు. కానీ అలా పంజాబ్‌లో అధికారం చేపట్టిందో లేదో.. అంతలోనే ఇలా ఓటమి పాలవడం ఆప్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే -
ఉత్తరాఖండ్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం
Bypoll Results: చంపావత్ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్లతో విజయకేతనాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా గహ్తోరి డిపాజిట్ కోల్పోయారు. కాగా ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అయ్యింది. కాగా మే 31న ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 3న వెలువడ్డాయి. ధామి గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. చంపావత్ నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. అలాగే ‘‘చంపావత్ ఉపఎన్నికలో ఓట్ల ద్వారా మీరు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలతో నా హృదయం చాలా ఉద్వేగానికి లోనైంది. నేను మాట్లాడలేకపోతున్నాను’’ అని తన విజయం తర్వాత ముఖ్యమంత్రి ధామి ట్వీట్ చేశారు. కేరళలోని త్రిక్కాకర నిజయోకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ఉమా థామస్ విజయం సాధించారు. ఒడిశాలోని బ్రజరాజ్నగర్లో బీజేడీ అభ్యర్థి అలకా మొహంతి గెలుపొందారు. ఉత్తరాఖండ్, ఒడిశాలో అధికార పార్టీ అభ్యర్ధులే విజయం సాధించగా.. కేరళలో ప్రతిపక్ష యూడీఎఫ్‌కు విజయం దక్కింది. గత సాధారణ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గాను 47 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరేసి రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామికి మాత్రం ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన భువన చంద్ర కప్రీ విజయం సాధించారు. అయినప్పటికీ పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల్లో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ధామి కోసం చంపావత్ స్థానం నుంచి విజయం సాధించిన హేమేష్ కర్క్‌వాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. -
యడ్డీని ఎవరూ టార్గెట్ చేయలేరు
సాక్షి, గంగావతి (కర్ణాటక): మాజీ సీఎం యడియూరప్పను టార్గెట్ చేసే శక్తి ఎవరికీ లేదని ఆయన కుమారుడు బీ.వై. విజయేంద్ర అన్నారు. ఆయన సింధగి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో కొప్పళ గవిమఠాన్ని సందర్శించి గవిసిద్దేశ్వర స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సింధగి, హానగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. చంద్రశేఖర్ పాటిల్, కనకగిరి ఎమ్మెల్యే ధడేసూగూరు బసవరాజ్, అమరేష్ కరడి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించనుంది. అయితే, జోబాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్‌సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు. చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
హుజురాబాద్ లో అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ
-
Huzurabad: ఓట్ల కోసం కుట్రలు చేయడం సిగ్గుచేటు
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మంత్రులు తమ నియోజకవర్గాల్లో అమలు చేయించుకునే దమ్ము, ధైర్యం ఉంటే స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు తమ నియోజకవర్గాలు, మంత్రిత్వశాఖలను గాలికి వదిలి హుజూరాబాద్ రాజకీయం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఓటర్లను మభ్యపెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ నియోజకవర్గాల్లోని దళితులకు మూడెకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీసబ్ ప్లాన్ నిధులతో ఎంతమందిని ఆదుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఈటల రాజేందర్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ యంత్రాంగం, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నా నేటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత రాజకీయాలకు అలవాటు పడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, నాటి నిజాం సర్కారుకు నేటి కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు కౌంట్‌డౌన్ మొదలవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, మీడియా ఇన్చార్జి కటకం లోకేశ్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. చదవండి: ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు -
మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో రసవత్తర పోరుకు తెరలేచింది. బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భవానీపూర్ ఉపఎన్నిక పోరులో న్యాయవాది ప్రియాంకా టిబ్రేవాల్‌ను బరిలోకి దింపింది. మరోవైపు ఈ రోజు (సెప్టెంబర్ 10 శుక్రవారం ) మమత తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలో సీఎం మమతా బెనర్జీ భవానిపుర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఘన విజయం సాధించి బీజేపీకి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నందీగ్రామ్ అసెంబ్లీ స్థానానికిగాను దీదీ, బీజేపీ సువేందు అధికారి మధ్య హోరా హోరీగా సాగిన పోరులో చివరికి మమత ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఆ పదవిలో కొనసాగాలంటే, నిర్దేశిత గడువులోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సెప్టెంబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ జరగనుంది. చదవండి : Ganesh Chaturthi 2021-Mangli Songs: ‘లంబోదరా’ మంగ్లీ మరో అద్భుత గీతం ఎవరీ ప్రియాంక టిబ్రేవాల్ 1980, జూలై 7న కోల్‌కతాలో జన్మించిన ప్రియాంకా న్యాయ పట్టాను పొందారు. థాయిలాండ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారామె. గత ఆరేళ్ల కాలంలో బీజేపీలో కీలక హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం బెంగాల్ బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2014లో కాషాయ కండువా కప్పుకున్న ఆమె 2015లో కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో రంగ ప్రవేశం చేశారు. అయితే తృణమూల్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. అలాగే 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. 2011 నుండి రెండుసార్లు భవానీపూర్ సీటును గెలుచుకున్న మమతపై రెండుసార్లు టీఎంసీ చేతిలో ఓటమి పాలైన ప్రియాంక తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు. మరోవైపు 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న హింసపై కోల్‌కతా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వారిలో ప్రియాంకా ఒకరు. దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. హింసాత్మక రాజకీయాలకు ముగింపు పలకాలని, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తామంటూ ఇప్పటికే టీఎంసీపై యుద్ధం మొదలుపెట్టిన ప్రియాంక ఈ కీలక పోరులో మమతకు ధీటుగా ప్రియాంక నిలబడగలరా? కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకు పడే మమతకు సరిజోడిగా నిలవగలరా? సుదీర్ఘ అనుభవానికి తోడు, ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే దీదీని నిలువరించడం ప్రియాంకకు సాధ్యమేనా? భవానీపూర్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది. -
రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలతోపాటు బిహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఇటీవల ప్రకటించిన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా ఈసీ జారీ చేసింది. అసోం, తమిళనాడు (2), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల (సెప్టెంబర్) 15న జారీ కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇక పుదుచ్చేరి రాజ్యసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ గోకులకృష్ణణ్ పదవీకాలం అక్టోబర్ 6 తో ముగియనుంది. ఈ స్థానానికి కూడా ఉప ఎన్నికలతో పాటే ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తాజా షెడ్యూల్లో పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అలాగే ఓట్ల లెక్కింపు కూడా అక్టోబర్ 4న ఉంటుంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్ సంగతి విదితమే. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనుంది. -
Etela Rajender: అందరి దృష్టి కమలాపూర్పైనే...
సాక్షి , వరంగల్ : అధికార టీఆర్ఎస్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తానం ముగిసినట్లయింది. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే కాగా ఈనెల 14న ముహూర్తం ఖరారైంది. భూఆక్రమణల వివాదంలో చిక్కుకున్న ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. గతనెల 1వ తేదీ నుంచి మొదలైన ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్ని పార్టీల నాయకులు, జేఏసీ నేతలను రాజేందర్ కలిసిన సందర్భంగా కొత్తగా పార్టీ పెడతారా.. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారా అన్న చర్చ సాగింది. చివరకు బీజేపీ కీలక నేతలతో భేటీ అయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ఆయన స్వగ్రామం కాగా.. ఇక్కడి నుంచే తన కొత్త ప్రస్తానాన్ని తాజాగా మొదలుపెట్టారు. దీనికి తోడు టీఆర్ఎస్ అగ్రనేతలు సైతం కమలాపూర్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూ ఎవరు కూడా రాజేందర్ వెంట వెళ్లకుండా కట్టడి చేస్తుండడంతో ఉప ఎన్నికలు వస్తే కనక ఈ మండల కేంద్రమే కార్యక్షేతంగా మారనుందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే పదవికి గుడ్ బై టీఆర్ఎస్తో 19 ఏళ్ల అనుబంధానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా బీజేపీ కేంద్ర నాయకులతో భేటీ అయిన ఆయన ఆ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈనెల 14 న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారని వెల్లడించాయి. అందరి దృష్టి కమలాపూర్పైనే... మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది. మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్ కమలాపూర్ నుంచే ‘ఆపరేషన్’ మొదలెట్టారు. కమలాపూర్‌కు చెందిన ముఖ్య అనుచరులైన జెడ్పీటీసీ మొదలు సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు ఎవరూ ఆయన వెంట వెళ్లకుండా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. చదవండి: ‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’ Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ రోడ్‌మ్యాప్