Positive
-
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
పాకిస్తాన్‌కు పాకిన మంకీపాక్స్.. ముగ్గురికి పాజిటివ్
ఇస్లామాబాద్: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.కాగా ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
భారత్ అవుట్‌లుక్.. పాజిటివ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు మెరుగుపరిచింది. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్అండ్పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్ రేటింగ్‌నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్‌లకు సంబంధించీ ఇదే అవుట్‌లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు. -
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
పాలమూరులో 20ఏళ్ల యువకుడికి కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్
పాలమూరు: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్లీ అలజడి మొదలైంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం 14 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాకేంద్రంలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఆర్ఓగా పని చేస్తున్న సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు. సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రిలోని ల్యాబ్ పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుంటామని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఐదు రోజులుగా 151 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా ఆరోగ్యశాఖతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, పీపీ, పీసీఆర్ కిట్స్, మందుల ఇతరత్రా సామగ్రిని సమకూర్చారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని, జాతర్లు, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లడం, జన సమూహంలో ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..!
ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేయాలి. ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్‌తో గది కార్నర్‌ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది. నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్‌ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్‌ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. (చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!) -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
స్టాక్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ స్తర్త్స్
-
ఎవరెస్ట్ బ్రాండ్ సాంబార్ మసాలా అమ్మొద్దు: అమెరికా అధికారులు
గుజరాత్లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తవుతున్న సాంబార్ మసాలా, గరమ్ మసాలాను అమెరికాలో విక్రయించొద్దని అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. సల్మొనెల్లా టెస్టులో ఇవి పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది. సాల్మొనెల్లా అనేది.. చిన్నపిల్లలు లేదా వృద్ధులలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ఉన్న ఇతరులలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఇది కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తుంది. సాల్మొనెల్లా సోకిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా తరచుగా జ్వరం, అతిసారం (రక్తంతో కూడినది కావచ్చు), వికారం, వాంతులు , కడుపు నొప్పి వంటి వాటితో అనారోగ్యం బారిన పడుతుంటారు. అరుదైన పరిస్థితులలో, సాల్మొనెల్లాతో ఇన్ఫెక్షన్ జీవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ధమనుల అంటువ్యాధులు (అనగా, సోకిన అనూరిజమ్స్), ఎండోకార్డిటిస్, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. చదవండి: Viral Video: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే! -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, రాజ్‌నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
మోసపూరిత చెక్కులకు పీఎన్బీ చెక్
న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించడం ద్వారా కస్టమర్లు పీపీఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చెక్ ప్రెజెంటేషన్‌కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్‌లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి. -
డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్. రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్‌కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్‌గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 40 రోజులు కీలకం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్‌లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి పాజిటివ్.. చైనా వేరియంట్? -
బ్యాంకింగ్ అవుట్‌లుక్ ‘పాజిటివ్’
ముంబై: బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్‌ను దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం ‘పాజిటివ్’కు అప్‌గ్రేడ్ చేసింది. రుణ నాణ్యత పెరుగుదల, మూలధన పటిష్టతలు తన అవుట్‌లుక్ పెంపునకు కారణమని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) చివరికల్లా స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) ఈ దశాబ్ద కనిష్ట స్థాయి.. 4 శాతానికి దిగివస్తాయని విశ్వసిస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. ప్రస్తుత 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 15.2 శాతం ఉంటే, 2023–24 నాటికి ఈ రేటు 11 నుంచి 11.6 శాతానికి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వ రంగం బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణవృద్ధి 13.4–14.1 శాతం శ్రేణిలో ఉంటే, 2022–23లో ఈ రేటు 9.5–10.1 శాతం శ్రేణికి దిగివస్తుందని ఇక్రా అంచనావేసింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ విషయంలో ఈ రేటు 14.5–15.5 శాతం శ్రేణి నుంచి 12.6–13.5 శాతం శ్రేణికి దిగివస్తుందని విశ్లేíÙంచింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణంగా పేర్కొంది. 2023–24 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ 1 శాతం లోపునకు దిగివస్తుందని అంచనావేసింది. బ్యాంకింగ్ నికర వడ్డీ మార్జిన్లు 2023–24లో భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి డిపాజిట్ రేటు భారీ పెంపు అవకాశాలను కారణంగా చూపింది. అయితే అధిక రుణ విలువలు బ్యాంకింగ్ పటిష్టతకు దోహదపడుతుందని విశ్లేషించింది. చక్కటి లాభదాయకత ద్వారా బ్యాంకింగ్ స్వయంగా మూలధన అవసరాలను తీర్చుకోగలుగుతాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ప్రధాని మోదీతో భేటీకి ముందు హిమాచల్ సీఎంకు షాక్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకీ ముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కరోనా బారినపడ్డారు. ఇవాళ(సోమవారం) ఆయన ఢిల్లీలో ప్రధానిని కలవాల్సి ఉంది. కానీ అంతకుముందే నిర్వహించే సాధారణ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సీఎంకు కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్లోకి వెళ్లారని హిమాచల్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ వాయిదా పడినట్లు చెప్పారు. సీఎం సుఖ్వీందర్, డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభ సింగ్‌తో పాటుు 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో పాటు డిసెంబర్ 16న రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత మూడో రోజే సీఎం వైరస్ బారినపడ్డారు. సుఖ్వీందర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా కలిశారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
TS: మూడేళ్ల తర్వాత అక్కడ స్వైన్‌ఫ్లూ కలకలం.. బాలికకు పాజిటివ్!
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు ఇలా.. ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్‌ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే.. స్వైన్‌ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్‌తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది. వారికే ఎక్కువగా.. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ఇలా.. ఏడాది పాజిటివ్ కేసులు 2013 3 2014 5 2015 37 2016 3 2017 5 2018 4 2019 4 2022 1 జాగ్రత్తలు పాటించండి జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్‌ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ -
ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. After developing flu like symptoms, I got my self tested for COVID-19 and my reports are positive. I request everybody who has come in contact with me in last 48 hours to kindly isolate and get yourself tested, if you develop any symptoms. — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 12, 2022 -
ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ... నమోదైన తొలి కేసు
ఇటలీలోని ఒక వ్యక్తి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవి ఎటాక్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఐదు రోజుల స్పెయిన్ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గత తొమ్మిది రోజులుగా తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో బాధపడ్డాడని చెప్పారు. అంతేగాక అతని ప్రైవేట్ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడ్డాడని వివరించారు. అదీగాక అతని చర్మం పై దద్దుర్లు, పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయని చెప్పారు. దీంతో అతన్ని ఆస్పత్రి వర్గాలు అత్యవసర ఇన్ఫెక్షన్ విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభంచారు. తొలుత అతనికి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ టెస్టులు చేయగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇలా ఒకేసారి మూడు వ్యాధులు ఎటాక్ అయ్యిన తొలికేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ కూడా సోకిందని తేలింది. దీంతో అతనికి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్, మంకీపాక్స్ నుంచి బయటపడి కోలుకున్నాడని చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిడ్స్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసు మంకీపాక్స్, కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియజేసిందన్నారు. అలాగే ఒక వ్యక్తి లైంగిక అలవాట్లు వ్యాధుల నిర్ధారణ చేయడానికి ఎంత కీలకమో ధృవీకరించిందన్నారు. పైగా ఆయా రోగులకు చికిత్స అందించేటప్పుడూ వైద్యులు కూడా తగిన జాగ్రత్తల తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. (చదవండి: మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి)