Power purchase agreement
-
అదే ఉన్మాదం
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ హయాంలోనూ.. ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ.. ఎప్పుడూ, ఎవరూ చేయని గొప్ప ఆలోచనకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. రానున్న 30 ఏళ్లల్లో రైతులకు హక్కుగా వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ ఈనాడు మాత్రం ఈ ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఇప్పటికే అనేక విధాలుగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచినప్పటికీ, టీడీపీ, దాని కరపత్రిక ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే అర్ధంలేని ఆరోపణలతో ఆదివారం మరో అబద్దపు కథనాన్ని ఈనాడు వండి వార్చింది. రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై సమగ్ర అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖకు చెందిన సాంకేతిక కమిటీ తప్పుడు లెక్కలతో అంకెల గారడీ చేసిందంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపన ఖర్చులను అంచనా వేసేటప్పుడు ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) తప్పు చేసిందంటూ ఈనాడు నిరాధారంగా ఆరోపణ చేసింది. వాస్తవాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పత్రిక దాచిపెట్టింది. ‘ఐఎస్టీఎస్’ చార్జీలపై అవే అబద్ధాలుసెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని సెకీ లేఖ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ (సీఈఆర్సీ), సెకీ ఒప్పందంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈనాడు మాత్రం కళ్లున్నా కబోదిలా నటిస్తూ పచ్చి అబద్దాలను ప్రచురిస్తోంది.లేఖలోనే ప్రతిపాదించిన సెకీరాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ ఓ లేఖలో..ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్ ఆపరేషన్ డేట్– సీఓడీ)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి0దని స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తించవని ఆ లేఖలో వివరంగా చెప్పింది.ప్రత్యేక ప్రోత్సాహకం కింద రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుందని తెలియజేస్తూ 2021 సెపె్టంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ రాసిన లేఖసెకీ ఒప్పందంలోనూ ఉందిసెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం(పవర్ సేల్ అగ్రిమెంట్)లోనూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశం ఉంది.ఒప్పందంలోని నిబంధన 3.2 ప్రకారం..ఐఎస్టీఎస్ ఛార్జీలు, ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, సీటీయూ (సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ) షెడ్యూలింగ్ ఛార్జీలే కాకుండా ఇంజెక్షన్/డెలివరీ పాయింట్ నుంచి సబ్‌స్టేషన్ వరకూ ఏ ఇతర చార్జీలు కూడా రాష్ట్ర డిస్కంలు చెల్లించనవసరం లేదని ఒప్పందంలో పొందుపరిచారు. దీనిని బట్టి చట్టపరంగానూ, ఒప్పందం పరంగానూ సెకీతో ఏపీ చేసుకున్న ఒప్పందానికి మాత్రమే ఐఎస్టీఎస్ చార్జీల మాఫీతో పాటు భవిష్యత్తులో జరిగే ఎలాంటి మార్పుల వల్లనైనా ఎలాంటి ఇతర చార్జీలు పడవని స్పష్టమవుతోంది.సీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం నిబంధనలపై నోటిఫికేషన్ ఇచ్చింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పిఓ) ఉన్న సంస్థలకు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు 25 ఏళ్ల పాటు లభిస్తుంది.రాష్ట్రంలో పెడితేనే భారంనిజానికి రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే స్టేట్ నెట్వర్క్ పెంపుదల అనివార్యమని, అందుకు వ్యయం రూ.2,600 కోట్లు అవుతుందని ఏపీపీసీ కమిటీ తేల్చి చెప్పింది. అంతేకాకుండా 6,400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అంతర్ రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానం చేయడం వల్ల రూ.1,021 కోట్ల అదనపు ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్) ఛార్జీలు ఏటా పడతాయని కమిటీ సూచించింది. అదే 6,400 మెగావాట్ల నుంచి ఉత్పత్తి 10,092 మిలియన్ యూనిట్లకు పెరిగితే అప్పుడు ఐఎస్టీఎస్ చార్జీలు యూనిట్‌కు దాదాపు రూ.1 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం వల్ల ఇవేవీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, అంతిమంగా ప్రజలపైనా భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అయ్యే వ్యయాన్ని భరించాల్సిన అవసరం తప్పుతుంది.సెకీతోనే అనేక ప్రయోజనాలురాష్ట్రంలోనే సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసి, రైతులకు ఇవ్వాలని, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ద్వారా 6400 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం టెండర్లు సైతం పిలిచారు. కానీ దానిని రాజకీయ కారణాలతో కొందరు అడ్డుకున్నారు. అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీల భారం లేకుండా యూనిట్ రూ.2.49 చొప్పున అతి చవక ధరకు విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన లేఖ పంపింది. దానిపై కమిటీ వేసి మరీ అధ్యయనం చేసిన తరువాత, ఏపీఈఆర్సీ అనుమతితో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. దీనివల్ల రాష్ట్రంలో పెట్టాలనుకున్న ప్రాజెక్టుకు అయ్యే రూ.2,600 కోట్ల వ్యయం ఆదా అయ్యింది. ఆ ప్రాజెక్టుకు కేటాయించాల్సిన భూమి కూడా మిగిలింది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు లభిస్తుండటంతో రాష్ట్ర ఖజానాపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. అదనంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు సైతం వచి్చంది. సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటే టీడీపీ, దాని కరపత్రిక ఈనాడుకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
Big Question: రాష్ట్రానికి మేలు జరిగితే ఎల్లో బ్యాచ్ కు ఏడుపెందుకు ?
-
ఆంధ్రాకి బాబు చేసిన ద్రోహం.. SECI ఒప్పందంలో ఏం జరిగింది?.. ఆధారాలతో బయటపెట్టిన జగన్
-
అదానీతో విద్యుత్ ఒప్పందం జరగలేదు: గుడివాడ అమర్నాథ్
-
సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారాయని ఆరోపణలు చేస్తుండటాన్ని ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలే అని అర్థం. ఇక అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు చేస్తూ డిస్కమ్‌లు(విద్యుత్ పంపిణీ సంస్థలు) ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకోని ఒప్పందాలకు అదానీ గ్రూప్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకోని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా.. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలన్నది స్పష్టమవుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూపుపై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు.. తాజాగా అదానీ గ్రూపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూపు అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడుదారుల రక్షణ పేరిట అమెరికాబ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతోపాటు ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిషా, చత్తీస్ఘడ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూపు భారీ ఎత్తున లంచాలు ఎర చూపిదంటూ ఆరోపించారు. ఆరోపణల వెనుక భారీ కుట్ర! రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూర్చేందుకు వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూపు లంచాలు ఇవ్వచూపిందంటూ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంటే కేవలం రూ.2.49 (రూ.2.6 తక్కువగా)కే.. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్‌కు రూ.4.63–రూ.6.76తో పోల్చినా చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే రూ.2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే.. అదానీ గ్రూపు లంచాలు ఎందుకు ఇవ్వజూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగ పత్రంలో ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎవరైనా చెబుతారు. కాగా, అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది. -
‘భద్రాద్రి.. యాదాద్రి’పై సర్కారుకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు వచ్చి న ఆరోపణలపై విచారణ నిర్వహించిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్.. గడువు చివరి తేదీ అయిన గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంధన శాఖ వద్ద ఈ నివేదిక ఉంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించడంతో పాటు కేబినెట్ భేటీలో చర్చించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభలో కూడా నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి చర్యలకు సిఫార్సు టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగించడం, టెండర్లకు వెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంలో చోటు చేసుకున్న విధానపరమైన అవకతవకతలు, వీటితో రాష్ట్ర ఖజానాకు జరిగిన నస్టాన్ని కమిషన్ లెక్కగట్టినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని కమిషన్ నిర్ధారణకు వచ్చి నట్టు సమాచారం.ఆయనతో పాటు గత ప్రభుత్వంలోని ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులూ బాధ్యులని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాగా దీని ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్‌తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌ను విచారించకుండానే నివేదిక! తొలుత జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు కాగా, ఆయన గత ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులు, విద్యుత్ సంస్థల సీఎండీలు, ఇతర అధికారులు, ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇతర సాక్షుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. పలువురికి క్రాస్ ఎగ్జామినేషన్ సైతం నిర్వహించారు. రాతపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన్నుంచి రాత పూర్వక సమాధానం అందింది.నిర్ణయాలను తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే..విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని అప్పట్లో కేసీఆర్ కోరారు. కాగా విలేకరుల సమావేశంలో కేసీఆర్‌పై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో నియమితులైన జస్టిస్ లోకూర్..సాక్ష్యాలు, నివేదికల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. కేసీఆర్ ఇచ్చి న జవాబును ఆయన పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ సమీక్ష గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలకు సంబంధించి అందిన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. -
ప్రైవేట్ విద్యుత్‌తో ప్రజలపై భారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించకపోవడంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇతర మార్గాల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు తప్పుబట్టారు. ప్రైవేటు విద్యుత్ కొనాల్సి రావడంతో తుదకు రాష్ట్ర ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. జెన్కో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జెన్కో విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు మెరుగుపరచాలని సూచించారు. ట్రూఅప్ చార్జీలతో పాటు ఎంవైటీ పిటిషన్‌లోని వ్యయాలు అసాధారణంగా, అవాంఛనీయంగా ఉన్నాయని, ప్రజలపై భారంపడకుండా నియంత్రించాలని ఈఆర్సీని కోరారు. 2022–23కి సంబంధించి జెన్కో దాఖలు చేసిన రూ.830.61 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలతో పాటు 2024–25 నుంచి 2028–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై సోమవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించింది. వేణుగోపాల్‌రావుతో పాటు పారిశ్రామిక, వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యలకు తమ సలహాలు, సూచనలు తెలియజేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి ‘తక్కువ వ్యవధిలో కీలక పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. విద్యుత్ సంస్థలను నియంత్రించడానికి ఈఆర్సీ తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే విషయంలో వెనుకాడరాదు..’ అని వేణుగోపాల్ రావు సూచించారు. ఫిక్స్డ్ చార్జీలపై ఫ్యాప్సీ అభ్యంతరం విద్యుత్ కేంద్రాల ఫిక్స్డ్ చార్జీలను అసాధారణ రీతిలో పెంచి ప్రతిపాదించడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ) ప్రతినిధి రమణ్‌దీప్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పలు పారిశ్రామిక సంఘాల తరఫున ఆయన మాట్లాడారు. ‘కొత్తగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిక్స్డ్ చార్జీలు భారంగా మారాయి. దీనితో పోల్చితే పాత విద్యుత్ కేంద్రాలు మెరుగ్గా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. జెన్కో ప్రతిపాదించిన వివిధ రకాల వ్యయాలు హేతుబద్ధంగా లేవు. జెన్కో వార్షిక నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయం రూ.792 కోట్లు ఉంటే, అందులో రూ.696.98 కోట్లు వేతన సవరణ వాటా ఉంది..’ అని అన్నారు. ఐదేళ్లలో ఆదాయ అవసరాలు రూ.43,713 కోట్లు: జెన్కో వచ్చే ఐదేళ్లలో రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.4,789 కోట్లు, ఫిక్స్డ్ చార్జీలు రూ.35,931 కోట్లు, అదనపు పెన్షన్ వ్యయాలు రూ.8,205 కోట్లు, మూలధన పెట్టుబడి వ్యయాలు రూ.1,664 కోట్లు, ఇతరత్రాలు కలిపి మొత్తం రూ.43,713 కోట్ల ఆదాయం అవసరం కానుందని జెన్కో తెలియజేసింది. ఆ మేరకు ఆదాయార్జనకు అనుమతిస్తూ ట్రూఅప్, ఎంవైటీ పిటిషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. కాగా జెన్కో పిటిషన్లపై పలువురి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 29లోగా ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. -
ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు అవసరమయ్యే ఎనర్జీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సంస్థ అవసరాలు తీర్చడానికి వీలుగా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్-తక్కువ పరిమాణం, అధిక భద్రత కలిగే రియాక్టర్లు) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే ఒక కార్పొరేట్ సంస్థ ఈమేరకు వివిధ ఎస్ఎంఆర్ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఇది మొదటిసారి కావడం గమనార్హం.గూగుల్ సంస్థ కైరోస్ పవర్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2030 నాటికి కైరోస్ పవర్‌కు చెందిన ఎస్ఎంఆర్ ద్వారా విద్యుత్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. 2035 నాటికి మరిన్ని రియాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోని అంశాల అమలు తుదిదశ చేరేనాటికి ఆరు నుంచి ఏడు రియాక్టర్ల ద్వారా మొత్తం 500 మెగావాట్ల విద్యుత్‌ను గూగుల్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు, ఏ ప్రాంతంలోని రియాక్టర్ల నుంచి కొనుగోలు చేయబోతున్నారో మాత్రం తెలియజేయలేదు.ఏఐ టెక్నాలజీలో నిత్యం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుతున్న పరికరాలు, డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. సంప్రదాయ విద్యుత్ తయారీకి బదులుగా గ్లోబల్ కంపెనీలు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ అణు రియాక్టర్ల ద్వారా వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ టాలెన్ ఎనర్జీ నుంచి న్యూక్లియర్ పవర్డ్ డేటా సెంటర్‌ను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్‌లో రియాక్టర్‌ను పునరుద్ధరించడంలో కాన్స్టెలేషన్ ఎనర్జీకి సాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2023-2030 మధ్య యూఎస్ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి దాదాపు 47 గిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
విద్యుత్తు కమిషన్‌కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
‘విద్యుత్’ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కమిషన్ ఏకపక్షంగా విచారణ జరుపుతోందనేందుకు ఆధారాలు చూపడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంది. కమిషన్ ఏర్పాటు చట్టపరంగానే జరిగిందని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ.. వాటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ –1952 కింద జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అసలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా.. వద్దా.. అన్న అంశంపై జరిగిన వాదనలు శుక్రవారం పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పిటిషనర్‌ను కూడా వివరాలు కోరింది ‘ప్రెస్మీట్లో ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ జరుగుతున్న తీరును మాత్రమే జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి విలేకరులకు వెల్లడించారు. నివేదిక ఏకపక్షంగా ఇస్తారేమోనని ఊహించడం సరి కాదు. కమిషన్ విచారణ పక్షపాతంగా సాగుతోందనడానికి సరైన సాక్ష్యాలను చూపడంలో పిటిషనర్ విఫలమయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆరోపణలకు సరైన సాక్ష్యాలను చూపాలి. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు గురించిన సమాచారం తెలుసుకోవడంలో భాగంగా పిటిషనర్ నుంచి కూడా కమిషన్ వివరాలు కోరింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ –1952ని ఉల్లంఘిస్తూ మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై విచారణ జరిపేందుకు కమిషన్‌కు అర్హత ఉంది. ఎస్ఈఆర్సీ నిర్ణయాలతో విభేదించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకునే న్యాయపరమైన వెసులుబాటు ఉన్నా.. దానికి విస్తృత పరిధి లేదు. కొనుగోళ్లు భారామా? కాదా? లాంటి అంశాల జోలికి అది వెళ్లదు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ లేవని భావిస్తున్నాం..’ అని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను తీర్పు కాపీలో పొందుపరిచింది. కమిషన్ ఏర్పాటులో దాపరికం లేదు ‘జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నియామకమైన నాటి నుంచి ఇప్పటివరకు 15 మందికి పైగా సాక్షులను విచారించింది. ఇదే క్రమంలో కేసీఆర్‌ను కూడా కమిషన్ వివరాలు కోరింది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కమిషన్. ఇందులో దాపరికం అంటూ ఏదీ లేదు. ప్రజలకు వివరాలు తెలిస్తే వచ్చే నష్టం కూడా లేదు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో మాట్లాడారనడం అసంబద్ధం. 8బీ నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్‌కు ఉంది..’అని ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. విచారణ పూర్తి కాకుండానే మీడియాతో మాట్లాడారు ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), ఈఆర్సీతో పాటు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పీపీఏలపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లో విచారణ ఎలా సాగాలో మార్గదర్శకాలు జారీ చేయడం చట్ట వ్యతిరేకం. చట్ట ప్రకారం కమిషన్ ఏర్పాటు చెల్లదు. విచారణ పూర్తి కాకుండానే, వివరాలు పరిశీలించకుండానే.. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా భేటీ నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతూ ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికతతో ప్రభుత్వానికి రూ.250 కోట్లు నష్టం వస్తుందని ముందే తేల్చేశారు. కేసీఆర్ వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా జస్టిస్ నరసింహారెడ్డి మీడియా భేటీలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఇవ్వబోయే నివేదిక ఎలా ఉండనుందో తెలిసిపోతోంది. ఈ కారణాలతోనే ఆయనను ప్రతివాదిగా చేర్చాల్సి వచ్చింది..’అని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోంధీ పేర్కొన్నారు. -
భద్రాద్రి పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కష్టమే: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ జన సమతి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు. కేంద్రం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలుపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందజేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.అనంతరం, కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది. విద్యుత్ శాఖను రూ.80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకున్నారు.వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకుంది. ఒప్పందం రద్దు కారణంగా ప్రభుత్వంపై రూ.250కోట్ల అదనపు భారం పడింది. విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధం. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు విద్యుత్ శాఖ అధికారి రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కమిషన్ ముందు పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒప్పందం ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్‌కు ఎందుకు వెళ్లారనే సమాచారం ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఈ ఒప్పందం వల్ల రూ.2600 కోట్ల నష్టం జరిగింది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే సప్లై చేయలేదు. అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారు. తర్వాత తప్పు తెలుసుకుని రద్దు చేసుకోవాలనుకుంటే కుదరలేదు.ఇరు రాష్ట్రాల డిస్కంల ఒప్పందాల ద్వారా ఎంఓయూ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారు. 2010లో తయారు చేసుకున్న పలు యంత్రాలను టెక్నాలజీని బీహెచ్ఈఎల్.. ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావు అని మా అభిప్రాయం. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు.. సరైన లొకేషన్ కూడా కాదు.యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుంది. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేళ్లుగా చెయ్యలేదు. ఈ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. రూ.635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో తొమ్మిది వేలు, యాదాద్రి రవాణా వల్ల రూ.1600 కోట్లకు పైగా నష్టం జరుగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందని, కమిషన్ సందేహాలకు కేసీఆర్ బహిరంగంగా సమాధానం ఇచ్చారన్నారు. కమిషన్ ఉద్దేశం వేరేలా ఉందని, వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు.నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలని చెప్పారన్నారు. కానీ 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డికి పేరు ఉందని, చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్సీ ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారన్నారు.కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెబుతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమిషన్లు రద్దు అయ్యాయని, ఈఆర్సీ స్వతంత్ర కమిషన్ అని, అది ఇచి్చన తీర్పు ఫైనల్ అన్నారు. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమిషన్ ఎట్లా వేస్తారని నరసింహారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా.బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయని, తెలంగాణ మాత్రం యూనిట్‌కు రూ.3.90 పెట్టి విద్యుత్ తీసుకున్నట్టు వివరించారు. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదని తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆరీ్టపీసీ నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు.పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించినట్టు తెలిపారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగలంతా ఏకమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని, రేవంత్‌రెడ్డి మోదీ లైన్లో పని చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి మాటలను పట్టించుకోమని, పీసీసీ పదవి డబ్బులతో రేవంత్ తెచ్చుకున్నాడని కోమటిరెడ్డి అనలేదా అని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. -
పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ బహిరంగ లేఖ
-
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం
-
‘విద్యుత్’ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది. ప్రస్తుత, మాజీ అధికారులందరికీ.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం. త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా.. విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
‘90 శాతం ఉచిత విద్యుత్ ఇచ్చాం’.. మంత్రి వెల్లడి
రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 2023లో ప్రభుత్వం 90 శాతం ఉచిత విద్యుత్‌ను అందించినట్లు పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించినప్పటి నుంచి ప్రతినెలా గృహాల్లో సరాసరి 300 యూనిట్లకు బదులు 600 యూనిట్ల కరెంట్ అధికంగా సరఫరా అవుతుందన్నారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,873 కోట్లతో పంపిణీ వ్యవస్థలను పునరుద్ధరించినట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇతర సంస్థలతో పవర్‌పర్చేజ్ అగ్రిమెంట్లపై సంతకం చేసిందని చెప్పారు. దాంతో 1,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పంజాబ్ 2023లో అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. గరిష్ఠంగా జూన్ 23, 2023న 15,293 మెగావాట్ల విద్యుత్ అవసరమైనట్లు తెలిసింది. -
తక్కువ ధరకు వస్తుంటే ఎక్కువకు కొంటారా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కనీస అవగాహన లేకుండా ‘డిస్కంల మిగులు ఆట’ అంటూ ఈనాడు ఓ తప్పుడు కథనాన్ని ప్రజలపై రుద్దింది. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే.. ఖరీదు ఎక్కువ ఉన్న స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి తగ్గిస్తున్నారంటూ ఓ వింత కథ అల్లింది. డిస్కంలకు.. తద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరే నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు వెల్లడించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ♦ రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యుత్ డిమాండ్ తగ్గింది. దానివల్ల స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి ఈ నెలలో రావాల్సిన విద్యుత్‌ను నిబంధనలకు అనుగుణంగా డిస్కంలు తగ్గించుకున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా వారం ముందు ప్రణాళికలో భాగంగా విద్యుత్ సేకరణ తగ్గించాయి. రోజువారీ, రియల్ టైం గ్రిడ్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి తగ్గితే రియల్ టైం మార్కెట్ నుంచి కొని లోడ్ షెడ్డింగ్ రాకుండా, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నాయి. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తిని ప్రతి నిమిషానికీ సర్దుబాటు చేస్తూ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ సూచనల ప్రకారం అవసరమైన సమయంలో మార్కెట్ నుండి విద్యుత్ సేకరిస్తున్నాయి. ♦దేశం మొత్తం డిమాండ్ తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్ ధరలు తగ్గాయి. యూనిట్ రూ.3 నుంచి రూ.4.50కే లభిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డిస్కంలు స్వల్పకాలిక ఒప్పందాల కొనుగోలు తగ్గించి, మార్కెట్ నుంచి అవసరానికి తగ్గట్టు కొంటున్నాయి. దీనివల్ల డిస్కంలకు ఆర్థిక లాభం చేకూరుతుంది. అంతేగానీ చేతిలో ఉన్న విద్యుత్‌ను వదిలేసి మార్కెట్ నుంచి కొనేందుకు డిస్కంలు పరుగులు పెట్టడం లేదు. చంద్రబాబు హయాంలోనే అనవసర ఒప్పందాలు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ బ్యాక్ డౌన్ చేసి అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. రాష్ట్రంలో 2015–16 మధ్య 642 మిలియన్ యూనిట్లు, 2016–17లో 12 వేల మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,600 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండేది. రూ.2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత ఈ మిగులు విద్యుత్‌ను బ్యాక్ డౌన్ (వృథా) చేసి ప్రైవేటు విద్యుత్ కొనుగోలును చంద్రబాబు ప్రోత్సహించారు. పవన విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.4.84కు తీసుకున్నారు. ఫిక్స్డ్ చార్జీతో కలిపి ఈ ధర రూ.5.94 అయ్యేది. సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 కు బదులు రూ.8.90 వెచ్చించారు. ఇలా దాదాపు 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల ఏటా రూ.3,500 కోట్లు భారం ఇప్పటికీ పడుతోంది. -
కరెంటును కమ్మేసిన ‘బాబు’ అవినీతి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులూ విద్యుత్ శాఖను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు నిదర్శనం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు). అనవసర పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పాటు అధిక బిడ్డింగ్, నాణ్యతలేని బొగ్గు సేకరణ, విదేశీ బొగ్గు కొనుగోలు వరకూ దేనినీ వదిలిపెట్టలేదు. వీటిలో అవినీతిని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)నే వెల్లడించింది. ముడుపుల కోసం విద్యుత్ రంగాన్ని కకావికలం చేసి, డిస్కంలను అప్పులపాలు చేసి, విద్యుత్ వ్యవస్థను కుంగదీసి భారీ అవినీతిని పెంచి పోషించిన ‘బాబు’ను అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అవసరం లేకపోయినా ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ఆర్డర్లు ఇచ్చారు. 2014 మే నుంచి 2015 అక్టోబరు వరకు దాదాపు ఏడాదిన్నరలోనే 13,180 మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొన్నారు. దీని విలువ రూ.8,286 కోట్లకు పైనే. ఇందులో కొంత విద్యుత్‌ను ఎక్కడా లేని విధంగా యూనిట్ రూ.10కు కొన్నారు. జెన్కో విద్యుత్ యూనిట్ రూ.4.50 మాత్రమే ఉంది. అయితే జెన్కో ఉత్పత్తి పెంచకుండా చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు చేసైనా ప్రైవేటు కొనుగోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో రూ. 15 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణ. ఇందులో ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు దాదాపు రూ.4 వేల కోట్లు ముడుపులుగా అందినట్లు అంచనా. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి రాసిన లేఖలో చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా అధిక ధరలకు ప్రైవేటు నుంచి కొంటున్న విషయాన్ని బయటపెట్టింది. మూసేస్తే రూ.675.69 కోట్లు నష్టం చంద్రబాబు హయాంలో బొగ్గు కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్వాకాలను కాగ్ కడిగిపారేసింది. ఇష్టారాజ్యంగా బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లిన వైనాన్ని ఎండగట్టింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు కొన్న ప్రభుత్వ పెద్దల తీరును తప్పుబట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీని వల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ.2.94 నుంచి రూ.4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ.675.69 కోట్లు నష్టం వాటిల్లింది. అధిక ధరకు నాణ్యత లేని బొగ్గు మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడంలేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొన్న బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యత లేని రూ.3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరకు కొనడం వల్ల జెన్కోకు రూ.918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొన్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెర వెనుక కోల్ మాఫియా చక్రం తిప్పింది. రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. ఇందులో రూ.200 కోట్లు బాబు అండ్ కోకు ముడుపులుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. -
భారీగా విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఆగస్టు మొదటివారం నుంచి మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 31లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు లేక బోరుబావుల కింద ఉచిత విద్యుత్ బాగా వాడేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్దఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. దీంతో గతవారం రోజులుగా రాష్ట్రంలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 13వేల మెగావాట్లకు మించిపోయింది. ఈ నెల 11న అత్యధికంగా 13,829 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదేరోజు జాతీయస్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,28,963 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వేసవిలో డిమాండ్ ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. గత నెలాఖరులో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో అప్ప ట్లో రోజువారీగా రాష్ట్రస్థాయిలో గరిష్ట విద్యుత్ డి మాండ్ 8వేల మెగావాట్లలోపు మాత్రమే నమోదైంది. గత నెల 27న అయితే గరిష్ట డిమాండ్ ఏకంగా 6904 మెగావాట్లకు పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ త్వరలో 14వేల మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయని ట్రాన్స్‌కో యాజమాన్యం అంచనా వేస్తోంది. జల విద్యుదుత్పత్తిపై కరువు నీడలు కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 3000 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతి ఏటా తెలంగాణ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1000 ఎంయూలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 97 టీఎంసీలు, నాగార్జునసాగర్ నిండాలంటే 166 టీఎంసీల వరద ఎగవ నుంచి రావాలి. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. రోజూ రూ.30 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో గరిష్ట డిమాండ్ నెలకొని ఉండే వేళల్లో నిరంతర విద్యుత్ కొనసాగించడానికి పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పెద్దఎత్తున విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. రోజూ రూ.30 కోట్ల వ్యయంతో 60 ఎంయూల విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు తీవ్ర భారంగా మారాయి. -
‘షాక్’ ఇచ్చింది చంద్రబాబే!.. డ్రామోజీ చెప్పని వాస్తవాలివీ
సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగడానికి గత టీడీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకమే కారణం. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా విడుదలచేస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్సీ) సమర్పించలేదు. నిజానికి.. ఏపీఈఆర్సీ అనుమతించిన మేరకే డిస్కంలు విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతకుమించి ఒక్కపైసా కూడా వసూలు చేయడంలేదు. కానీ, ప్రజలు ఏమాత్రం భరించలేని విధంగా ప్రభుత్వం రకరకాల పేర్లతో ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలు పెంచిందంటూ ‘స్విచ్చేస్తే షాకే’ శీర్షికతో ఈనాడు మరో తప్పుడు కథనాన్ని మంగళవారం అచ్చేసింది..’ అంటూ ఆ పత్రిక రాతలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీలు ఐ.పృద్వీతేజ్, జె.పద్మాజనార్ధన్‌రెడ్డి, కె.సంతోష్ రావులు మంగళవారం అంశాల వారీగా వెల్లడించిన వివరాలివీ... ఆరోపణ: సామాన్యులు మోయలేనంత భారీగా గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ చార్జీలనుపెంచింది. వాస్తవం: ఈ అభియోగం పూర్తిగా అసత్యం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎంబీసీలకు వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి అప్పటివరకు అమలులో వున్న వార్షిక ట్రూఆప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు చార్జీల స్థానంలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సంవత్సరం జూన్ నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును అమలుచేస్తున్నాయి. అందువల్ల జూన్‌లో ఈ సంవత్సరం ఏప్రిల్ నెల విద్యుత్ కొనుగోలు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం కనిష్ట గ్రిడ్ డిమాండ్ ఉన్న సీజన్లో ధరలు తక్కువుంటే ఆ తగ్గింపు కూడా వినియోగదారులకు వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలవుతోంది. ఆరోపణ: ఉపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే చిన్న వ్యాపారులకు కూడా విద్యుత్ చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వలేదు. వాస్తవం: చిరు వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వం ఎంతో అంకితభావంతో ఉంది. అందువల్లే చిరు వ్యాపారులకు 2019 నుంచి ఇప్పటివరకూ విద్యుత్ చార్జీలు పెంచలేదు. చిరు వ్యాపారులకు మేలు చేయాలనే లక్ష్యంతోనే పలు వర్గాలకు సబ్సిడీ రూపంలో ఉచిత విద్యుత్ అమలుచేస్తోంది. సెలూన్ షాపులు నడుపుకునే వారికి నెలకు 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువనున్న గోల్డ్ స్మిత్‌లు (బంగారు ఆభరణాలు తయారుచేసే వారికి) వంద యూనిట్లు, ఇస్త్రీ దుకాణాలు నడుపుకునే రజకులకు 150 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. మరికొన్ని వర్గాల చిరు వ్యాపారులకు కూడా కొంతమేర ఉచిత విద్యుత్ అందిస్తూ సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లు నడుపుకునే వారికి కూడా రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించింది. అంతేకాక.. చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఆరోపణ: ప్రజల నుంచి ఏటా రూ.11,270కోట్లు అదనంగా వసూలుచేస్తూ ప్రభుత్వం దండుకుంటోంది. వాస్తవం: ఇది పూర్తిగా అసత్యం. ఏటా వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు పెరుగుతాయి. వినియోగదారులు పెరిగినట్లే వసూలు మొత్తం పెరుగుతుంది. దీనిని అదనపు వసూళ్ల కింద చూపడం సమంజసం కాదు. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఏపీఈఆర్సీ సిఫార్సుల ప్రకారమే డిస్కంలు విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కూడా ప్రభుత్వం కొంత భాగం సబ్సిడీగా భరిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాటి ఆదాయ అవసరాల నివేదికలు ముందు సంవత్సరం సెపె్టంబర్ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్యపడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో వాస్తవంగా హెచ్చుతగ్గులుంటాయి. అవి విద్యుత్ చట్టంలోను, సంబంధిత నిబంధనలలో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలలోగానీ, విద్యుత్ కొనుగోలు వ్యయంలోగానీ ఉండే హెచ్చుతగ్గులు సర్దుబాటు చార్జీల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు వసూలుచేసుకునే వెసులుబాటు ఉంటుంది. దాని ప్రకారమే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సర్దుబాటు చార్జీలు విధిస్తున్నాయి. ఆరోపణ: ట్రూ అప్, ఇంధన సర్దుబాటు, విద్యుత్ సుంకం అంటూ రకరకాల పేర్లతో విద్యుత్ బిల్లులు వసూలుచేస్తూ ప్రభుత్వం ప్రజలకు షాక్ కొడుతోంది. వాస్తవం: విద్యుత్ తయారుచేయాలంటే బొగ్గు, ఆయిల్ లాంటి అనేక ముడిపదార్థాలు అవసరం. వీటి కొనుగోలు ధర, రవాణా వ్యయం పెరిగినప్పుడు ఆ మేరకు విద్యుత్ చార్జీలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఇలా చేయక తప్పదు. గత ప్రభుత్వం ఇలా చార్జీలు వసూలుచేస్తే ఒప్పుగా, ఇప్పుడు వసూలుచేస్తే తప్పుగా ఈనాడుకు కనిపిస్తోంది. ఈ సంవత్సరం విద్యుత్ నియంత్రణ మండలి వారి టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం అన్ని వనరుల నుంచి సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.31 ఉండగా, 2023 ఏప్రిల్ నెలలో సంభవించిన అధిక ఉష్ణోగ్రతలవల్ల గ్రిడ్ డిమాండ్ అంచనాల కన్నా అధికంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం దాదాపు 617 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్ల ప్రాతిపదికన రూ.475 కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి యూనిట్‌కు రూ.0.20 ట్రూ అప్ చార్జీని డిస్కంలు వసూలుచేస్తున్నాయి. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సుంకం పెరగలేదు. ఇదివరకు నిర్దేశించిన ప్రకారమే యూనిట్‌కు కేవలం 6 పైసలు వసూలుచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించి విద్యుత్ కొనుగోలు, సరఫరా వ్యయం ప్రతి యూనిట్‌కు దాదాపు రూ.1.0 పెరిగినప్పటికీ నిబంధనల మేరకు యూనిట్‌కు కేవలం రూ.0.40 సర్దుబాటుగా వసూలుచేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2020–21కు గాను కోవిడ్‌వల్ల విద్యుత్ డిమాండ్ కనిష్టంగా ఉన్న కాలంలో మార్కెట్ ధరలు అత్యంత కనిష్టంగా వున్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేయడంతో దాదాపు రూ.4,800 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు మిగల్చాయి. ఈ తగ్గింపు వాస్తవ ఖర్చులు ఆడిట్ అయ్యాక విద్యుత్ నియంత్రణ మండలి వారు జారీచేసిన ఆర్థిక సంవత్సరం 2022–23 టారిఫ్ ఉత్తర్వులలో పంపిణీ సంస్థల నికర వార్షిక ఆదాయ అవసరాల నుంచి తగ్గించారు. ఆరోపణ: వ్యవసాయ మీటర్లకు అమర్చే స్మార్ట్ మీటర్ల భారాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో ప్రజలపైనే వేయనుంది. వాస్తవం: వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టంగా ప్రకటించింది. అయినా ఈ ఖర్చును ఇతర వినియోగదారులపై మోపుతారని ‘ఈనాడు’ పదే పదే అబద్ధాలు అచ్చేస్తోంది. ఈ స్మార్ట్ మీటర్ల ఖర్చు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన ఉత్తర్వులిచ్చింది. స్మార్ట్ మీటర్ల సరఫరాదారుని ఎంపిక ప్రక్రియ కూడా అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారమే పూర్తయింది. -
Fact Check:చట్ట ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి : ఒకసారి విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిన తరువాత ఒప్పంద కాలానికి కొనుగోలు చేసినా, చేయకపోయినా, ఆ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసినా, చేయకపోయినా స్థిర ఛార్జీలు అనేవి భరించాల్సిందే. వీటిలో ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు, అప్పు మీద వడ్డీ, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు, యంత్రాల అరుగుదల, తరుగుదల వంటివి ఉంటాయి. ఈ విషయం విద్యుత్ రంగంపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, తమవి అత్యున్నత విలువలని గొప్పలు చెప్పుకునే ఈనాడు దినపత్రికకు మాత్రం ఈ విషయం తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన ధ్యేయంగా తప్పుడు కథనాలను నిత్యం వండి వారుస్తోంది. దానిలో భాగంగానే ‘హిందుజాకు దోచిపెట్టింది రూ.1,234 కోట్లు’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. అందులో అసలు నిజాలను ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్థనరెడ్డిలతో కలిసి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం విద్యుత్ సౌథలో మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈనాడు అబద్ధాల వెనుక నిజానిజాలిలా ఉన్నాయి.. ఒప్పందాలు ఇప్పటివి కాదు.. హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దు్రష్పచారం చేస్తున్నారు. ఈ హిందుజా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) మొదటిసారి 1994లోనే అప్పటి ఎలక్ట్రిసిటీ బోర్డుతో జరిగింది. తరువాత దానిని సవరించి 1998లో 1,040 మెగావాట్ల పవర్ ప్లాంట్ కడతామని ఒప్పందం చేసుకున్నారు. 2001 నాటికి ఆ పీపీఏ గడువు ముగిసింది. తర్వాత వారు మళ్లీ ప్రభుత్వాన్ని సంప్రదించి, మర్చంట్ పవర్ ప్లాంట్కైనా వెళ్తామని అమమతి కోరారు. 2010లో మెగావాట్‌కు రూ.5.33 కోట్లు చొప్పున రూ.5,545 కోట్లతో ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారించారు. వివిధ కారణాలతో విద్యుత్ కేంద్రం నెలకొల్పడంలో జాప్యం జరిగింది. హిందూజా రాకపోయినా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి 2011లో 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి, యూనిట్ రూ.3.60 చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకుంది. 2013లో హిందూజాతో ఒక మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్‌ను ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ, 2014లో పీపీఏ ప్రకారం హిందూజా సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయింది. దీంతో 2016 జనవరిలో మొదటి యూనిట్, జూలైలో రెండవ యూనిట్లో ఈ విద్యుత్ కేంద్రం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. 2016 ఆగస్టులో ఏపీఈఆర్సీ హిందూజా టారిఫ్‌ను యూనిట్ రూ.3.82గా నిర్ణయించి, ఏటా 2,828 మిలియన్ యూనిట్లు తీసుకోవాలని డిస్కంలకు చెప్పింది. రూ.5,623 కోట్లు ఫిక్స్డ్ చార్జీలుగా నిర్ధారించింది. టీడీపీ అనాలోచిత నిర్ణయం ఫలితమే.. ఈ నేపథ్యంలో.. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం నుంచి వైదొలగాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిర్ధేశించింది. దానికి అనుగుణంగా ఈ ఒప్పందం వద్దని డిస్కంలు చేసిన అభ్యర్ధనకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఈ ఒప్పందంపై న్యాయ పోరాటం, చిక్కులు ప్రారంభమయ్యాయి. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఆప్టెల్)ను హిందూజా ఆశ్రయించింది. ట్రిబ్యునల్ టీడీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అంతిమంగా ఫిబ్రవరి 2022లో సుప్రీంకోర్టు ‘ఈ ఒప్పందం రద్దు కుదరదు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి అమలులో వున్నట్లే’ అని తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హిందూజాకు స్థిర చార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి. నిజానికి.. ఇన్ని రోజులు హిందుజా విద్యుత్ కేంద్రం అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి విద్యుత్ తీసుకోలేకపోవటానికి కారణం గత ప్రభుత్వం 2018లో తీసుకున్న లోపభూయిష్ట నిర్ణయమే. టీడీపీ ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకోకపోయి ఉంటే, హిందూజా నుంచి విద్యుత్ తీసుకుని ఆ మేరకు చెల్లింపులు చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు విద్యుత్ తీసుకోకుండానే చార్జీలు చెల్లించాల్సి రావడం గత ప్రభుత్వ పాప ఫలితమే. అంతేగాని.. ఉత్తుత్తి విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అదీగాక.. 2022 మార్చి తర్వాత హిందూజా సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1,040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అవుతోంది. చట్టప్రకారమే అనుమతి.. అప్పీలెట్ ట్రిబ్యునల్ వారి ఉత్తర్వుల్లో హిందూజా టారిఫ్‌ను స్థిర, చర ఛార్జీలుగా విభజించమని ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారం కమిషన్ అప్పటి తాత్కాలిక (ఆడ్హాక్) చార్జీ అయిన యూనిట్ రూ.3.82ను స్థిరచార్జీ రూ.1.06గాను.. చరచార్జీ రూ.2.76గాను విభజించింది. దీని ముఖ్యోద్దేశ్యం.. మెరిట్ ఆర్డర్ సూత్రాలను ఈ విద్యుత్ కేంద్రానికి అమలుపరచడమే. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆగస్టు 2022లో ఇచ్చిన తుది ఉత్తర్వుల్లో అప్పటికున్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఇంతకుముందు నిర్ణయించిన తాత్కాలిక (అడ్‌హక్) చార్జీయే 2016 నుంచి 2022 ఆగస్టు వరకు వర్తిస్తుందని చెప్పింది. టారిఫ్ అప్పటికే రెండు భాగాలుగా విభజించినందున ఇందులో స్థిరఛార్జీ చెల్లింపు అన్నది భాగమే కాబట్టి కమిషన్ నిర్ణయం మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరంలేదు. హిందుజాకు స్థిరఛార్జీల బకాయిలు వాళ్ల ఉత్పత్తి అందుబాటు ప్రకటనలను బట్టి చెల్లించాలని అడ్వొకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖా కార్యదర్శి, న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌గుప్తా విద్యుత్ పంపిణీ సంస్థలకిచ్చిన న్యాయ సలహాలో ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు, అప్పీలేట్ ట్రిబ్యునల్, ఏపీఈఆర్సీ ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులు, ఎలక్ట్రిసిటీ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ప్రభుత్వం డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆలస్య చెల్లింపు సర్‌చార్జీ (ఎల్పీఎస్ ) స్కీం నిబంధనలకు లోబడి, హిందుజాకు రూ.1,234 కోట్లు స్థిర చార్జీలను చెల్లించడానికి అనుమతినిచ్చింది. ‘ఈనాడు’ అవగాహనా రాహిత్యం.. హిందుజాపై సుప్రీంకోర్టు, అప్పీలేట్ ట్రిబ్యునల్, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన తుది తీర్పుల ప్రకారం హిందూజా విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వంపైన, డిస్కంలపైన ఉంది. నిజానికి.. హిందూజా దాదాపు రూ.2,401 కోట్లకు అర్జీ పెట్టినప్పటికీ సాంకేతిక, న్యాయపరమైన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కోల్ ఎంత ఉంది, ఆ రోజు నార్మేటివ్ అవైలబిలిటీ ఎంత అనేది ప్రతి యూనిట్ ప్రకారం అన్ని స్థాయిల్లోనూ రోజువారీగా క్షుణ్ణంగా పరిశీలించి చివరికి వారికి మొత్తం రూ.1,234 కోట్లు చెల్లించాలని లెక్కించాం. ఈ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో జరిగాయి. కాబట్టి, ఈ వివరాలు కమిషన్‌కు ఆర్థిక సంవత్సరం 2022–23 నాల్గవ త్రైమాసికానికి డిస్కంలు సమర్పించే ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు నివేదికలో నిబంధనల ప్రకారం పొందుపరుస్తాయి. వాస్తవాలిలా ఉంటే.. ఈ నిజాలను గాలికొదిలేసి, విద్యుత్ తీసుకోని కాలానికి స్థిరఛార్జీలు హడావిడిగా చెల్లించేశారని, కనీసం కమిషన్ అనుమతి తీసుకోలేదని ఈనాడు రాయడం పూర్తిగా అవగాహనా రాహిత్యం. విషయంపట్ల తగినంత పరిజ్ఞానం, ఏపీఈఆర్సీ ఇచ్చిన వివిధ నిబంధనలు, నియమావళి గురించి అవగాహన లేకుండా అబద్ధాలు అచ్చేశారు. -
పరిశ్రమలకు విద్యుత్ సడలింపులు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ వినియోగ పరిమితులను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం సడలించింది. ఈ మేరకు వివిధ పారిశ్రామికవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. హెచ్‌టీ సర్వీసుల వినియోగదారులకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. దీనికి అవసరమైన నిరభ్యంతర పత్రం కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. అలాగే మార్కెట్లో కొనే విద్యుత్‌పై క్రాస్–సబ్సిడీ సర్‌చార్జ్, అదనపు సర్‌చార్జ్‌ల నుంచి మినహాయింపునిచ్చింది. అదేవిధంగా పరిమితులు అమలులో ఉన్నంతవరకు కనీస చార్జీలు వర్తించవని.. వాస్తవ వినియోగంపైనే డిమాండ్ చార్జీలు విధించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. వినియోగదారులు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్‌ను పొందే విషయంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా నెలవారీ కోటా పూర్తి చేసిన తర్వాత మాత్రమే పరిమితుల ప్రకారం జరిమానాలు విధించాలి. డిస్కమ్‌ల అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకి 209 మిలియన్ యూనిట్లు ఉంది. దీనిలో థర్మల్ 70 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు 38 మి.యూ, హైడ్రో 6 మి.యూ, గ్యాస్, సెయిల్ 8 మి.యూ, పవన విద్యుత్ కంపెనీలు 16 మి.యూ, సౌర విద్యుత్ కంపెనీలు 25 మి.యూ, హిందుజా 12 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 0.04 మిలియన్ యూనిట్ల చొప్పున అందిస్తున్నాయి. ఇప్పటికీ పవర్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి 34 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తే తప్ప డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నెల 30 వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులపై విధించిన పరిమితులను పొడిగించాలని డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. పరిమితుల వల్ల 290 మిలియన్ యూనిట్లు ఆదా.. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ, గృహావసరాలకు కోతలు లేకుండా సరఫరా అందించడం కోసం ఈ నెల 8 నుంచి పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు అమలులోకి వచ్చాయి. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే 290 మిలియన్ యూనిట్లను ఆదా చేసి గృహావసరాలకు నిరంతరం, వ్యవసాయావసరాలకు 7 గంటలు విద్యుత్‌ను అందించారు. ఇంకా కొరత ఉండటం, పంటలకు విద్యుత్ అవసరం వంటి కారణాలతో పరిమితులను మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు నిరంతరం నడిచే పరిశ్రమలు రోజులో వాడే విద్యుత్ వినియోగంలో 50 శాతం వరకు వాడుకోవచ్చు. మిగతా పరిశ్రమలకు వారంలో ఒక రోజు (వారాంతపు సెలవు కాకుండా) పవర్ హాలిడే అమలు జరుగుతుంది. అయితే ప్రజాప్రయోజనాల దృష్ట్యా దాదాపు 22 పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులకు ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. -
విద్యుత్ ధరలపై ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ధరలపై పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంధన శాఖ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో విద్యుత్ కొనుగోలు జరిగిన ఖర్చునే ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు (ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) ప్రతిపాదనలు సమర్పించాయి. హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా.. పంపిణీ సంస్థలు దీర్ఘకాలిక, స్పల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఇలా కొనే విద్యుత్ ధరలు ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా ఉంటాయి. పలు ఉత్పత్తి సంస్థలు యూనిట్ ధరను రూ.5.54 వరకూ నిర్ణయించి అమ్ముతున్నాయి. హైడల్ విద్యుత్ యూనిట్ రూ.1.58 పైసలకే లభిస్తుంది. కానీ.. దీని లభ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను ఎక్కువ ధర చెల్లించైనా సమకూర్చుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత డిస్కంలపై ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా ఎక్కడ విద్యుత్ దొరికితే అక్కడ కొనుగోలు చేస్తున్నాయి. 23న ఏపీ ఈఆర్సీ విచారణ ఇలా కొన్న విద్యుత్ సగటు వ్యయం ఈపీడీసీఎల్ యూనిట్ రూ.4.51గా, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.4.53గా నిర్ధారించాయి. తాము కొంటున్న విద్యుత్ ధరలను సంస్థల వారీగా కూడా డిస్కంలు ఏపీ ఈఆర్సీకి నివేదించాయి. ఈ మొత్తం కొనుగోలు ఖర్చులకు 2021–22 ఏడాది కూడా అనుమతించాల్సిందిగా మండలిని కోరాయి. డిస్కంలు సమర్పించిన లెక్కలు, ప్రతిపాదనలపై మార్చి 23న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ లోగా ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను ఏపీ ఈఆర్సీ ఈ మెయిల్ commn& secy@aperc.inకు పంపవచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మండలి విచారణ చేపడుతుంది.