Praful Patel
-
ఒకతాటిపైకి పవార్ ఫ్యామిలీ!
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.కలిసిపోవాలని కోరుకున్నాతాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.పెద్దాయన అంటే చాలా గౌరవంపవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.అప్పుడు చాలా బాధపడ్డాంఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు. చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా? మళ్లీ ఒక్కటవుతారా?ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
సహాయ మంత్రి మాకొద్దు: ఎన్సీపీ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇవ్వజూపిన సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయమంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలపగా మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని వివరించారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్సీపీకి కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్లో ఎన్సీపీకి ఇద్దరు సభ్యులున్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కారే లోక్‌సభలో సభ్యులుగా ఉన్నారు. -
బీజేపీ ‘వాషింగ్‌మెషిన్’ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ సెటైర్లు వేసింది. బీజేపీ ఒక వాషింగ్‌మెషిన్ పార్టీ అని శనివారం(మార్చ్ 30) నిర్వహించిన ప్రెస్మీట్లో తృణమూల్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ప్రెస్మీట్లో తృణమూల్ నేతలు బీజేపీ వాషింగ్ మెషిన్ అని స్టిక్కర్లు అతికించిన వాషింగ్ మెషిన్‌ను ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి తోడు ‘వాషింగ్ పౌడర్ బీజేపీ’ అనే టైటిల్‌తో వీడియోను కూడా తృణమూల్ నేతలు రిలీజ్ చేశారు. అవినీతి కేసులున్న పక్క పార్టీల నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ పొందుతున్నారనేది ఈ వీడియోలో సెటైరికల్‌గా చూపించారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్పటేల్పై ఉన్న విమానాల లీజు కేసులో సీబీఐ ఆయనకు క్లీన్చిట్ ఎందుకిచ్చిందని తృణమూల్ నేత రితబ్రతా బెనర్జీ ప్రశ్నించారు. తమకు లొంగనందునే అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరేన్లను బీజేపీ అరెస్టు చేయించిందని తృణమూల్ నేతలు మండిపడ్డారు. శరద్‌పవార్ ఎన్సీపీని చీల్చి మేనల్లుడు అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇది జరిగి సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత ఎయిర్ ఇండియా విమానాల లీజు కేసులో ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇస్తూ దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ -
ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్‌పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్‌పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్‌పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
India-Maldives Row:మాల్దీవుల వివాదం: లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ కీలక వ్యాఖ్యలు
లక్ష్యదీప్ వ్యవహారంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ మండిపడ్డారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు భారతదేశ గౌరవాన్ని సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మొదటిసారి అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ స్పందించారు. ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలను భారత్ అస్సలు సహించదని అన్నారు. అదీ కాక, భారత దేశంలో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమయంలో భారతప్రధాన మంత్రికి తమదైన శైలిలో అండగా నిలిచిన భారత దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనుచిత వ్యఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలని లేదని, తమ విలువలు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నారు. మాల్దీవుల మంత్రులు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అన్నారు. సదరు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశాన్ని, తమ దేశ ప్రధానమంత్రిని కించపరిచితే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. లక్ష్య దీప్‌కు మాల్దీవుల టూరిస్టులను అనుతిస్తారా? అని మీడియా ప్రశ్నకు.. అందరిని స్వాగతించడమే తమ దేశ సంస్కృతి అని అన్నారు. మాల్దీవుల సందర్శకులు లక్ష్యదీప్కు వచ్చి, ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. అభినందిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వారు అలా ఉంటే తమకు కూడా సంతోషమేనని అన్నారు. వారి రాకపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తప్పకుండా మాల్దీవుల టూరిస్టులు కూడా లక్ష్యదీప్కు రావాలని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ లక్ష్యదీప్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి అందాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విసయం తెలసిందే. అయితే కొంత మంది నెటిజన్లు మాల్దీవుల కంటే కూడా లక్ష్యదీప్ బాగుందని కామెంట్లు చేశారు. దీంతో మాల్దీవుల మంత్రులు.. ప్రధాని మోదీ వీడియో, ఫొటోలపై అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదమై.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక.. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. చదవండి: Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం -
మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు షాకిస్తూ అజిత్ పవార్.. అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే టీమ్‌లో చేరిపోయారు. అనంతరం.. అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణస్వీకారం చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనల వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా మహారాష్ట్రలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ముంబైలో శరద్ పవార్‌ను కలిశారు. అయితే, శరద్ పవార్‌ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఇక, వీరంతా తిరుగుబాటు చేసిన శరద్ పవార్‌ను కలవడం ఇదే తొలిసారి. కాగా, పవార్‌ను కలిసిన అనంతరం ఎన్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శరద్‌పవార్ ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్‌ను కోరినట్టు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై ఆయనేమీ స్పందించలేదని వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. అంతకుముందు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య మాటల వార్ చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తమనే అసలైన ఎన్సీపీగా గుర్తించాలంటూ అజిత్ వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. అటు తానే ఎన్సీపీ చీఫ్ అంటూ శరద్ పవార్ స్పష్టం చేశారు. #WATCH | We all came here to seek the blessings of respected Sharad Pawar today. We requested Pawar sahib that NCP should stay united. On this, Sharad Pawar did not give any reaction: Praful Patel, Ajit Pawar faction leader, at Mumbai's YB Chavan Centre pic.twitter.com/lvgXV2AZdy — ANI (@ANI) July 16, 2023 ఇది కూడా చదవండి: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్బీస్పీ.. -
అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి
న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అజిత్ పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ ను వెన్నుపోటు పొడిచారని చెబుతూ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎదుట కట్టప్ప బాహుబలిని చంపిన పోస్టర్లతో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఎన్సీపీ విద్యార్థి విభాగమైన రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ నాయకులు గద్దర్(నమ్మకద్రోహి) అని పెద్దగా రాసి బాహుబలి సినిమాలో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడిచిన దృశ్యం ఉన్న పెద్ద పోస్టర్ ని నిలబెట్టారు. ఢిల్లీ కార్యాలయం ఎదుట అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లు ఉన్న పోస్టర్లన్నిటినీ తొలగించి వాటి స్థానంలో ఈ పోస్టర్లను, హోర్డింగులను ఏర్పాటు చేశారు. పోస్టర్ మీద "మనలోని దేశద్రోహులు ఎవరన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వారిని క్షమించరు" అని పైన చిన్నగా రాసి పెద్దగా నమ్మకద్రోహి అని రాశారు. ఈ పోస్టర్లు, వాటిని ప్రతిష్టించిన వీడియోలు బయటకు రావడంతో ఎన్సీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించిన క్షణం నుండి మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలు ఎలక్షన్ కమిషన్ ముందు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో ఉన్నాయి. #WATCH | Old posters and hoardings of NCP that showed Ajit Pawar and Praful Patel on them are being removed from outside the office of the party in Delhi. A new poster with 'Gaddaar' (traitor) written on it is being put up there. pic.twitter.com/CjLoQmI5u9 — ANI (@ANI) July 6, 2023 ఇది కూడా చదవండి: యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం -
'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్..
ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్ పవార్‌తో కలిసి తాను కూడా ఆ మీటింగ్‌కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు. 'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు. నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనుక కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు! -
విలేకరి ప్రశ్నపై ప్రపుల్ పటేల్‌కు కోపం వచ్చింది.. వీడియో వైరల్..
ముంబయి: శరత్ పవార్ అనుయాయులైన ప్రఫుల్ పటేల్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు. నిన్న రాజ్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ అంశంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రపుల్ పటేల్ దురుసుగా స్పందించారు. ఈ రోజు ప్రపుల్ పటేల్ అజిత్ పవార్ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిసినందుకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందనే పుకార్లలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇంకా ఢిల్లీకి వెళ్లి మాట్లాడలేదని చెప్పారు. మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు. ఎన్సీపీ పార్టీని, నాయకుడు శరద్ పవార్‌ను వదిలేస్తున్నారా? అనే ప్రశ్నకు ప్రపుల్ పటేల్ కోపం తెచ్చుకున్నారు. కారు అద్దాలను పైకి ఎత్తేశారు. కారును ముందుకు పోనివ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న ప్రపుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ కూడా అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిశారు. #WATCH | NCP leader Praful Patel, says "We are the NCP and that is what we are doing. We will decide now if I have to go to Delhi. We have not discussed anything about Delhi, we have only discussed about the formation of our government in Maharashtra" pic.twitter.com/Wp4e3X7RIi — ANI (@ANI) July 3, 2023 కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: 'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. -
ఇలాంటివి చాలా చూశాను.. ఎవ్వరినీ విడిచిపెట్టను..
ముంబై: ఇంతకాలం నమ్మిన బంటుగా ఉన్న అజిత్ పవార్ మరోసారి ప్లేటు ఫిరాయించడంతో ఆత్మరక్షణలో పడింది ఎన్సీపీ నాయకత్వం. ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదంటూనే అజిత్ పవార్ ప్రఫుల్ పటేల్ వంటి కీలక నాయకులతో వెళ్లి షిండే ప్రభుత్వంలో చేరడంపై శరద్ పవార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చాలా చూశానని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ ఆదివారం 40 మంది ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో హుటాహుటిన ఒకచోట చేరిన ఎన్సీపీ వర్గాలు ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ ధిక్కరణకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. నాకు ఇలాంటివి కొత్తేమీ కాదు. 1980లో కూడా ఇలాగే 58 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీకి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. ఆరోజు నాతో ఆరుగురు మాత్రమే మిగిలినప్పుడు కూడా నేను భయపడకుండా మళ్ళీ పార్టీని యధాస్థితికి తీసుకొచ్చాను. అప్పుడు నన్ను విడిచి వెళ్లిన వారంతా వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీని కూడా పునర్నిర్మించుకుంటామని అన్నారు. పార్టీని విడిచి వెళ్లిన వారిలో కొంతమందిపై బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ఆరోపించారు. అయితే నాతో పాటు చాలాకాలం కలిసి పనిచేసి, నేను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే కూడా వారితో వెళ్లడమే నన్ను కొంచెం బాధించిందని అన్నారు. ఇది కూడా చదవండి: ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్‌పవార్ -
ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్‌పవార్
ముంబై: మహా రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు అలకపాన్పుపై ఉన్న ఎన్సీపీ నేత అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంలో చేరి మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఎన్సీపీ మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మరోసారి అదే సీన్ రిపీట్ చేశారు. కాకపోతే ఈసారి వారు షిండే నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో జత కట్టారు. ఆదివారం ఉదయం 40 మంది ఎమ్మెల్యేలతో గవర్నరును కలిసి వెంటవెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మేము అధికారంలో ఉన్న రెండున్నరేళ్లలో మా దృష్టాంతా అభివృద్ధి మీదే ఉంది. మా నిర్ణయంపై విమర్శలు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకి తీసుకెళ్లాలన్న దాని గురించే మా ఆలోచనంతా అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారేమోనన్న ప్రశ్న తలెత్తగా.. మేము ప్రభుత్వంలో చేరామంటే ఎన్సీపీ పార్టీ ప్రభుత్వంతో చేతులు కలిపినట్టే. మేము ఎన్నికల్లో కూడా ఇదే ఎన్సీపీ గుర్తుపై పోటీ చేస్తామని అన్నారు అజిత్ పవార్. ఎన్డీయేతో పొత్తు గురించి ప్రస్తావించగా మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ థాక్రేతో కలిసి మహావికాస్ అఘాడి ప్రభుత్వంతో చేతులు కలిపాము. ఆరోజు శివసేనతో కలిసి వెళ్లినపుడు ఈరోజు బీజేపీతో కలిసి ఎందుకు వెళ్ళకూడదు. రాష్ట్రాభివృద్ధే అజెండాగా చేసుకున్నప్పుడు ఎవరితో కలిసినా తప్పులేదని అన్నారు. ట్విట్టర్ లో ప్రమాణస్వీకారం తాలూకు ఫోటోలను జతపరచి.. ఎన్సీపీ సన్నిహితులు, మహారాష్ట్ర ప్రజాభీష్టం మేరకు నేను ఈరోజున మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ పదవి ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. महाराष्ट्रातील जनतेची इच्छा, राष्ट्रवादी काँग्रेस पक्षातील सहकाऱ्यांचा पाठिंबा, विश्वासाच्या बळावर आज राज्याचा उपमुख्यमंत्री म्हणून पद व गोपनीयतेची शपथ घेतली. माझ्या या पदाचा उपयोग जनतेच्या कल्याणासाठी, महाराष्ट्राच्या विकासासाठी होईल असा विश्वास देतो. pic.twitter.com/mvZ2oh7w6u — Ajit Pawar (@AjitPawarSpeaks) July 2, 2023 ఇది కూడా చదవండి: అత్త చేసిన పనికి బిత్తరపోయిన అల్లుడు.. -
‘లక్షద్వీప్’ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా
కొచ్చి: లక్షద్వీప్‌లో కోవిడ్ విజృంభణకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంలో అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఫిల్మ్ మేకర్ అయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కవరట్టికి తిరిగి వెళ్తే తనను అరెస్ట్‌చేస్తారని, ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ‘ ఒకప్పుడు కరోనా పాజటివ్ కేసులులేని లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ వచ్చాక కోవిడ్ పరిస్థితులు దారుణంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సంధించిన జీవాయుధం ఆయన’ అంటూ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయేషా వ్యాఖ్యానించారు. ఆయేషా కేంద్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ లక్షద్వీప్ బీజేపీ చీఫ్ అబ్దుల్ ఖాదర్ ఆమెపై పోలీసు ఫిర్యాదుచేశారు. దీంతో పదో తేదీన దేశద్రోహం ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ప్రఫుల్‌కు ‘బ్లాక్ డే’ స్వాగతం లక్షద్వీప్‌లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్ లక్షద్వీప్‌కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్ వ్యతిరేక నినాదాలిచ్చారు. -
లక్షద్వీప్‌ను ముంచేస్తారా?
సేవ్ లక్షద్వీప్, గో బ్యాక్ ప్రఫుల్ నినాదాలతో ఇల్లిల్లూ మారుమోగిపోతోంది. సముద్ర జలాల్లో మునిగి మరీ నిరసన తెలుపుతున్నారు. దేశద్రోహం కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందన్న దాకా పరిస్థితి వెళ్లిపోయింది . అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అడ్మినిస్ట్రేటర్ వివాదాస్పద నిర్ణయాలేంటి? ద్వీప సముదాయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అరేబియా సముద్రంలో ప్రశాంతంగా ఉండే పగడపు దీవుల్లో చిచ్చు రేగింది. అభివృద్ధి పేరుతో తీసుకున్న నిర్ణయాలు అలల్లో అలజడి రేపాయి. కేంద్రం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడా దీవుల్ని నిండా ముంచేసేలా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ 2020 డిసెంబర్ 4 వరకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. పెద్దగా వార్తల్లోకి వచ్చింది లేదు. అదే రోజు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో కేంద్ర ప్రభుత్వం దాద్రా నాగర్ హవేలి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు... గుజరాత్ మాజీ మంత్రి అయిన ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్‌ని మాల్దీవుల్లా మార్చేస్తానంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థానిక యంత్రాంగంతో మాట మాత్రంగానైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (ఎల్డీఏఆర్) సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షద్వీప్‌లో స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ రిసార్టులు, హై ప్రొఫైల్æ బీచ్ ఫ్రంట్లు నిర్మిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఉన్న దీవి కాస్తా పోతుందనే ఆందోళనలైతే ఉన్నాయి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లక్షద్వీప్ ప్రజలకు బాసటగా నిలిచారు. ప్రఫుల్ పటేల్‌ను తొలగించాలన్న డిమాండ్‌లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రతిపాదనల్ని నిలిపివేయాలని కోరింది. 36 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ అభివృద్ధి ప్రణాళికపై స్థానికులతో చర్చించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా లక్షద్వీప్ ప్రజలకి అండగా నిలబడి ప్రజా వ్యతిరేక విధా నాల్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు. నేడు లక్షద్వీప్‌కు ప్రఫుల్ ఉద్యమం తారస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు ప్రఫుల్ పటేల్. సోమవారం నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్‌లో ఆయన పర్యటించనున్నారు. ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై మంతనాలు జరుపుతారు. వివాదాస్పద నిర్ణయాలివే ► గోవధపై నిషేధం, గోమాంసం అమ్మకం, రవాణా చేయకూడదు. అలా చేసిన వారికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ► తమ సంస్కృతి, ఆహారపు అలవాట్లపై దాడి అని స్థానికులు భగ్గుమంటున్నారు ► ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నప్పటికీ ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని కనకపోతే పోటీ చేయొచ్చు. ► ఈ దీవుల్లో ఉండే అత్యధికులు ముస్లింలు కావడంతో వారికి పిల్లలు ఎక్కువ. అందుకే ఇక్కడ ముస్లిం జనాభాని టార్గెట్ చేశారన్న అసహనం వారిలో కనిపిస్తోంది. ► మద్యంపై నిషేధం ఉన్నప్పటికీ జనాభా నివసిస్తున్న దీవుల్లో కూడా పర్యాటకులకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతినిచ్చారు ► సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారికి వ్యతిరేకంగా గూండా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ► దేశంలోనే నేరాల రేటు అతి తక్కువగా ఉన్న దీవుల్లో ఇలాంటి కఠిన చట్టం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటర్‌ని విమర్శించే వారిపైనే దీనిని ప్రయోగిస్తారన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► గత ఏడాది కాలంగా లక్షద్వీప్‌లో కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటించడంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆ ఆంక్షల్ని తొలగించడంతో 8 వేల వరకు కేసులు నమోదయ్యాయి. 30 మంది వరకు మరణించారు. ► గ్రీన్ జోన్ ట్యాగ్ తొలగిపోవడంతో కోవిడ్ ఇంకెంత ప్రమాదకరంగా మారుతుందోనన్న భయం స్థానికుల్ని వెంటాడుతోంది. ► ఈ దీవుల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఎక్కడైనా భూముల్ని తీసుకునే అధికారాలు, అక్కడున్న వారిని ఖాళీ చేయించే అధికారం ఎల్డీఏఆర్కు కట్టబెట్టారు. మైనింగ్, క్వారీయింగ్ కూడా చేయొచ్చు. స్థానిక యంత్రాంగంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారీ కట్టడాలు వచ్చి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. ► వేటకు వెళ్లే మత్స్యకారుల పడవల్లో భద్రత కల్పించడానికి ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ూ నేరుగా జనం కదలికలపై నిఘా పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. లక్షద్వీప్ ప్రత్యేకతలు కేరళకు పశ్చిమాన 200 కి.మీ. దూరంలో ఉన్న లక్షద్వీప్ 32 ద్వీపాల సముదాయం. వాటిలో 10 ద్వీపాల్లో ప్రజలు నివసిస్తున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాలో అంతర్భాగంగా ఉండే లక్షద్వీప్‌కు 1956లో కేరళ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. ఇక్కడ జనాభా కేవలం 65 వేలు. వారిలో 96 శాతం మంది ముస్లింలు. వీరు జాలర్ల వృత్తిలో ఉన్నారు. పశుమాంసమే వీరికి ఆహారం. వీరికి ఏదైనా కావాలంటే కేరళ రాష్ట్రం మీదే ఆధారపడతారు. కొబ్బరి చెట్ల పెంపకం, పర్యాటకం, పశుపోషణ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 2014 నుంచి ఎన్సీపీ నుంచి మహమ్మద్ ఫైజల్ ఎంపీగా ఉంటే పంచాయతీ మండళ్లలో కాంగ్రెస్‌కు పట్టు ఉంది. పర్యావరణం దెబ్బతింటుంది లక్షద్వీప్ ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగుతోంది. వాతావరణ మార్పులతో ఏడాది పొడవునా సముద్రం ఎప్పుడు చూసినా అల్లకల్లోలంగా ఉంటోంది. తుఫాన్లు పెరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు తరిగిపోతున్నాయి. 1998లో 51శాతం ఉన్న పగడపు దిబ్బలు 2017 నాటికి 11 శాతానికి తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు, తవ్వకాలు చేపడితే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని ద్వీపం మునిగిపోయే ప్రమాదం ఉంది – ప్రొఫెసర్ ఎస్.అభిలాష్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్‌కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. చదవండి: యూపీఏ చైర్మన్‌గా పవార్ మాకు ఓకే : సంజయ్‌రౌత్ కాంగ్రెస్‌లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు. -
ఏవియేషన్ స్కామ్‌లో చిదంబరానికి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఏవియేషన్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి రూ 70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ గత వారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు నష్టం వాటిల్లేలా చర్యలు చేపట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ స్కామ్ జరిగిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా, ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విమానయాన సంస్థలకు ఆయన అనుకూలంగా వ్యవహరించారని, ఏవియేషన్ లాబీయిస్ట్ దీపక్ తల్వార్‌తో టచ్‌లో ఉన్నారని ప్రఫుల్ పటేల్‌పై ఆరోపణలున్నాయి. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ప్రయోజనాలు దక్కేలా తల్వార్ పటేల్‌తో చర్చలు జరిపారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 నుంచి 2011 మధ్య పటేల్ పౌర విమానయాన మంత్రిగా వ్యవహరించారు. -
ప్రఫుల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జరిగిన ఏవియేషన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది. జూన్ 6వ తేదీన ఉదయం దర్యాప్తు సంస్థ అధికారి ముందు హాజరుకావాలని ఆయనకు నోటీసు ఇచ్చింది. విమానయాన మంత్రిగా తన హయాంలో వివిధ ఏవియేషన్ సంస్థలకు లాభం చేకూర్చే క్రమంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోయిందని ఈడీ ఆరోపిస్తోంది. అరెస్ట్అయిన లాబీయిస్ట్ దీపక్ తల్వార్ విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారాయని ఇది మనీలాండరింగ్ కేసుగా భావిస్తున్నామని ఈడీ తెలిపింది. -
‘ఫిఫా’ కౌన్సిల్ సభ్యుడిగా ప్రఫుల్ పటేల్
కౌలాలంపూర్: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఫిఫా’ కౌన్సిల్ మెంబర్‌గా ఆయన ఎంపికయ్యారు. భారత్‌నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా పటేల్ నిలిచారు. శనివారం జరిగిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) కాంగ్రెస్‌లో ప్రఫుల్‌కు సర్టిఫికెట్ అందజేసి ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో దీనిని అధికారికంగా ప్రకటించారు. కౌన్సిల్ మెంబర్ పదవి కోసం మొత్తం 46 ఓట్లలో పటేల్‌కు 38 ఓట్లు పడటం విశేషం. ఆయనతో పాటు మరో నలుగురు వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. మరో వైపు ఏఎఫ్సీ అధ్యక్షుడిగా షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. -
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రపుల్ పటేల్ షాక్
న్యూఢిల్లీః గుజరాత్ నుంచి కాంగ్రెస్ తరపున పెద్దల సభకు బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలోకి క్యూ కడుతున్న క్రమంలో తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రపుల్ పటేల్ వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత కలవరపెడుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనేదానిపై తమ పార్టీ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రపుల్ పటేల్ వ్యాఖ్యానించారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసింది. గుజరాత్ శాసనసభలో ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. గుజరాత్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపికవనుండగా వారిలో బీజేపీ నుంచి అమిత్ షా, స్మతీ ఇరానీలు సులభంగా ఎన్నికవనున్నారు. మూడో అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి తిరిగి బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సీనియర్ నేత వాఘేలా మద్దతుదారులు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ గెలువాలంటే ఎన్సీపీ మద్దతు కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. -
కొత్త ఎంపీల్లో కోటీశ్వరులు వీరే!
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 96 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇటీవల 57 మంది రాజ్యసభకు ఎన్నికైయ్యారు. వీరిలో ఎన్పీపీకి చెందిన ప్రపుల్ పటేల్ అత్యధిక ఆస్తులు కలిగిన వారిగా గుర్తించినట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సర్వే నివేదిక వెల్లడించింది. ఆయనకు రూ. 252 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ (212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా(193 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన రాజ్యసభ ఎంపీల్లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర టాప్-10 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఆయన ఆస్తిపాస్తులు రూ. 49 కోట్లుగా చూపించారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎంపీల జాబితాలో బీజేపీకి అనిల్ దవే(60 లక్షలు), రామకుమార్(86 లక్షలు), కాంగ్రెస్ కు చెందిన(1.8కోట్లు) ఉన్నారు. 57 మంది ఎంపీల్లో 13 మంది(23 శాతం)పై క్రిమినల్ కేసులు, ఏడుగురు(12 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. -
'పరువు'కు పోతే ఫైన్ పడింది!
- ఎయిర్ ఇండియా మాజీ అధికారిపై పరువునష్టం దావాలో మాజీ కేంద్ర మంత్రికి షాక్ - విచారణకు హాజరుకాకపోవటంపై కోర్టు ఆగ్రహం.. రూ. 3వేల జరిమానా ముంబై: సాధారణంగా నిందితులు లేదా ఆరోపణలు ఎదుర్కునే వ్యక్తుల గౌర్హాజరుపై ఆగ్రహం వ్యక్యంచేసే కోర్టులు కొన్ని సందర్భాల్లో మాత్రమే పిటిషనర్ తీరును తప్పుబతూఉంటాయి. ఓ ఉన్నతాధికారిపై పరునష్టం దావావేసి కనీసం ఒక్కసారైనా విచారణకు హాజరుకాకుండా తిరుగుతోన్న మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ విషయంలోనూ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు అదేతరహా అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా రూ. 3వేల జరిమానా విధించింది. ప్రఫుల్ పటేల్ విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా తీవ్రంగా నష్టపోయిందని ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ తన ఆత్మకథా పుస్తకంలో పేర్కొన్నారు. అయితే జితేంద్ర తన పుస్తకంలో పేర్కొన్న విషయాలు అవాస్తవాలని ఆరోపిస్తూ మంత్రి ఫ్రఫుల్ పటేల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ మాజీ మంత్రివర్యులు ఒక్కసారైనా విచారణకు హాజరుకాలేదు. గురువారం విచారణ సందర్భంగా మరోసారి హాజరు మినహాయింపు కోరిన ప్రఫుల్ పటేల్ తరఫు న్యాయవాదిని కోర్టు చివాట్లు పెట్టింది. 'ఇంకెన్నిసార్లు ఇలా చేస్తారు? మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని అర్థమవుతోందా?' అంటూ ఆగ్రహంవ్యక్తం చేసిన మెజిస్ట్రేట్ వి.పి. అధోనే.. విచారణకు గైర్హాజరవుతున్నందుకుగానూ ప్రఫుల్ పటేల్ కు రూ.3వేల జరిమానా విధించారు. -
‘జలయుక్త' లో అంతా బోగస్సే
షోలాపూర్ జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ షోలాపూర్: షోలాపూర్ జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం (జలయుక్త శివారు) పర్యవేక్షించడానికి వచ్చిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా మోసగించారని సాంగోళాకు చెందిన జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ ఆరోపించారు. శనివారం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని ఈ విషయంలో పక్కదారి పట్టించారని, దీనికి సంబంధించిన నివేదికను సీఎంవోకు పంపానని చెప్పారు. ‘జిల్లాలో జలశివారు ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పనులను సందర్శించేందుకు సీఎం వచ్చారు. సాంగోళా తాలూకా మంగేవాడిలో సిమెంట్‌తో నిర్మించిన చెరువును ఆయనకు చూపించారు. అందులో 22.06 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని చూపించారు. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ ఆ స్థాయిలో నీటి నిల్వ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రామస్తులు, జల నిపుణుల సమక్షంలో కొలతలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా నాలుగు నుంచి ఆరు టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే వీలుంటుంది’ అని ప్రఫుల్లా వివరించారు. కేవలం ప్రచారం కోసం అధికారులు పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. దీని వల్ల నీటి సమస్య తీరకపోగా, వ్యయం తడిసి మోపెడవుతుందన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులతో సహా ముఖ్యమంత్రిని కలుసుకొని జలయుక్త శివారులోని బోగస్ ఉదంతాలపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తానని ప్రఫుల్ల తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
-
50:50 కి ఒప్పుకోవాల్సిందే..
ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 50 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌కు జాతీయ కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం జారీచేసింది. ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తమకు కేటాయిస్తామంటున్న 124 సీట్లకు ఒప్పుకోమన్నారు. 288 సీట్లకు గాను తమకు 144 స్థానాలు కేటాయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘మాకు 124 స్థానాలే ఇస్తామని కాంగ్రెస్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాకు 50 శాతం సీట్లు కేటాయించాల్సిందేనని మేం ఇప్పటికే చాలాసార్లు చెప్పాం..’ అని పటేల్ అన్నారు. ‘ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఆ పార్టీ ప్రతిస్పందన కోసం మేం మరో రోజు ఎదురుచూస్తాం.. తర్వాత ఏంచేయాలనేది నిర్ణయించుకుంటా’మని చెప్పారు. తాము ఇప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సీట్ల నేపథ్యంలోనే ప్రస్తుతం తాము సగం సీట్లు అడుగుతున్నామని ఆయన నొక్కిచెప్పారు. గతంలో కాంగ్రెస్ కన్నా మేం ఎక్కువ సీట్లు గెలుచుకున్నా సీఎం పదవి వారికే వదిలివేశామనే విషయాన్ని వారు గుర్తుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. అందుకే మేం 144 స్థానాలు కోరుతున్నాం.. ఇదేం కొత్త డిమాండ్ కాదు కదా..’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.