Pre release
-
ప్రేమలో భిన్న కోణం
‘‘నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు ఇప్పటివరకు తీసిన 14 సినిమాల ద్వారా ఎందరో దర్శకులను, రచయితలను, నటీనటులను పరిచయం చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’’ చిత్రంతోనూ చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఆయన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం యూనిట్‌కి బ్రేక్ ఇవ్వాలి’’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కినుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా తేజ సజ్జా, అతిథులుగా దర్శకులు యదు వంశీ, పవన్ సాధినేని, హర్ష, రచయిత కోన వెంకట్, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ‘‘నేటి తరం యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ప్రేమకథలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు’’ అన్నారు బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్. -
రెడీలా బ్లాక్ బస్టర్ కావాలి: శ్రీనువైట్ల
‘‘ధూం ధాం’ సినిమా పాటలు బాగున్నాయి. ఈ చిత్రం ఫస్టాఫ్ ప్లెజంట్‌గా ఉండి సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందని ఈ మూవీకి పని చేసిన నా స్నేహితులు చెప్పారు. మా ‘రెడీ’ సినిమాకి కూడా సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందనే టాక్ విడుదలకి ముందే వచ్చింది. అదే తరహాలో రూపొందిన ’ధూం ధాం’ చిత్రం ‘రెడీ’లా బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ కావాలి’’ అని డైరెక్టర్ శ్రీను వైట్ల ఆకాంక్షించారు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన సినిమా ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘ధూం ధాం’ ప్రీ రిలీజ్‌కి అతిథిగా హాజరైన దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ– ‘‘సాయికిషోర్ మచ్చ నాకు మంచి మిత్రుడు. ‘ధూం ధాం’తో తనకి, యూనిట్‌కి మంచి విజయం దక్కాలి’’అన్నారు. ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు సాయి రాజేశ్ అన్నారు. ‘‘మా అబ్బాయి చేతన్‌ను ఈ సినిమా హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది’’ అన్నారు రామ్ కుమార్.‘‘శ్రీను వైట్లగారి కామెడీని, వైవీఎస్ గారి సాంగ్స్ స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశాను. ప్రేక్షకుల టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం’’ అని సాయికిషోర్ మచ్చా తెలిపారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో గీత రచయితగా రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న రామజోగయ్య శాస్త్రిని ఈ వేదికపై సన్మానించారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దామోదర ప్రసాద్ మాట్లాడారు. -
రిషబ్ శెట్టిలా పెద్ద హీరో కావాలి: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘జాతర’ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషబ్ శెట్టిలా తను కూడా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలి. అలాగే ‘జాతర’ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్గా నటించారు. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘జాతర’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో ఈ మూవీని చక్కగా తీశారాయన’’ అని శివ శంకర్ రెడ్డి చెప్పారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని సతీష్ బాబు రాటకొండ కోరారు. -
రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ కావాలి
‘‘కార్తీగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మన తెలుగు హీరో అని చెప్పుకుంటాం. ‘96’ సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ప్రేమ్ కుమార్‌గారు నా కలల దర్శకుడు. వారిద్దరూ కలిసి చేసిన ‘సత్యం సుందరం’ సినిమాని ఈ 28న చూడండి. అలాగే 27న ‘దేవర’ చిత్రం చూడండి. ఈ రెండు సినిమాలూ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో శ్రీదివ్య కీలకపాత్రలో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలల క్రితం కార్తీగారిని కలిసి, కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలి ఉంది. ‘సత్యం సుందరం’ ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. ఈ సినిమా చూడ్డానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.‘‘యుగానికి ఒక్కడు’ సినిమా చూసినప్పుడే కార్తీగారు నాకు చాలా నచ్చేశారు. నాకు ఇష్టమైన హీరోతో పని చేయడం హ్యాపీ. మా సినిమాని చూడండి’’ అని శ్రీదివ్య తెలిపారు. ‘‘ఆర్య, జగడం’ సినిమాలతో నా కెరీర్‌ని తెలుగులో ప్రారంభించాను. ఆ తర్వాత తమిళ పరిశ్రమకు వెళ్లాను. ఈ నెల 28న అందరం థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్ కుమార్. ‘‘చాలా హార్ట్‌ఫుల్‌గా తీసిన సినిమా ‘సత్యం సుందరం’’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. రచయిత, నటుడు రాకేందు మౌళి మాట్లాడారు. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
‘కమిటీ కుర్రోళ్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
Vikram: తంగలాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ టీమ్‌ని చూస్తే ముచ్చటేసింది: విశ్వక్ సేన్
‘‘ప్రతిభ ఉన్న యువతకు సీ స్పేస్ అనే సంస్థ ద్వారా మంచి వేదిక సృష్టించాడు నవదీప్. నా తోటి నటీనటుల్లో నేను గౌరవించే వాళ్లలో చాందినీ చౌదరి ఒకరు. తను ఎప్పుడూ టెన్షన్ పడుతుంటుంది. ‘యేవమ్’తో తనకి ఆ భయం పోయింది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘యేవమ్’ లాంటి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు, మహిళా ఎడిటర్ పని చేయడం హ్యాపీగా ఉంది. ఈ టీమ్‌కి ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు. ‘‘యేవమ్’ చూశాను. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి’’ అన్నారు మరో అతిథి, డైరెక్టర్ సందీప్ రాజ్. ‘‘ఈ మూవీలో నాది పోలీస్ పాత్ర అనగానే యాక్షన్ ఓరియంటెడ్ అనుకున్నాను. అయితే యాక్షన్ పాటు అన్ని షేడ్స్ నా పాత్రలో ఉన్నాయి’’ అన్నారు చాందిని. ‘‘మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ‘యేవమ్’’ అన్నారు నవదీప్. ‘‘ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్’’ అన్నారు ప్రకాశ్ దంతులూరి. -
ఇండస్ట్రీ నుంచి పంపించేస్తామన్నారు: విశ్వక్ సేన్
‘‘నిజాయతీగా పని చేసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి మంచి సినిమా తీశాం. అందుకే ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ కుటుంబంతో కలిసి రావొచ్చు. సినిమా చూశాక రెండు మూడు రోజుల పాటు ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీనే నా ‘ఫలక్‌నుమా దాస్’ రిలీజ్ అయ్యింది. నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ సినిమా.. ఆదరించిన ప్రేక్షకులే. నా కెరీర్ ఆరంభంలో ‘ఇలాంటి యాటిట్యూడ్ ఇండస్ట్రీలో పనికి రాదు.. తొక్కేస్తారు.. పంపించేస్తారు’ అన్నారు. అయినా నా క్యారెక్టర్ మార్చుకోలేదు. ఐదేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీకి, దర్శక–నిర్మాతలకు, ముఖ్యంగా నా ఫ్యాన్స్‌కి థ్యాంక్స్. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయాయి.మరో ఐదేళ్లు ఫైనల్.. కాల్చిపడేస్తా మొత్తం. రత్నలాంటి పాత్ర చేయాలన్నది నా కల. అలాంటి కథతో వచ్చిన కృష్ణ చైతన్యకి థ్యాంక్స్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన నిర్మాతల్లో నాగవంశీ బెస్ట్’’ అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నల ఆశీస్సుల వల్లే ఇక్కడ ఉన్నాను. మా గురువు త్రివిక్రమ్‌గారే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మూలం. ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సాయి సౌజన్యగార్లకు కృతజ్ఞతలు. బుజ్జిగా నేహాశెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. తను చేసిన రత్న పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 31 తర్వాత విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముందు, తర్వాత అని మాట్లాడు కుంటారు. నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూశాక నిజంగా కృష్ణ చైతన్య తీశాడా? అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంటెన్స్ మూవీ రాలేదు’’ అన్నారు. నటి నేహా శెట్టి, నటులు మధునందన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘డర్టీ ఫెలో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫోటోలు)
-
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్‌కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
కథ వినగానే మా నాన్న గుర్తొచ్చారు
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్‌కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్‌కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్‌కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్‌కి ఇస్తాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్. -
చరిత్ర తెలియజేసే రజాకార్
‘‘రజాకార్’ ముస్లింలకు వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రం. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. గురువారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో యాటా సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ చరిత్రపై ‘రజాకార్’ చేసే చాన్స్ ఇచ్చిన నారాయణరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది
‘‘తెలుగులో బాలకృష్ణతో సినిమాలు చేశాను. ఎవరైనా బాలకృష్ణని చూసి నవ్వితే చాలు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది’’ అంటూ చెన్నైలో జరిగిన తమిళ చిత్రం ‘గార్డియన్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్ అనడం వైరల్‌గా మారింది. బాలకృష్ణతో వరుసగా ‘జైసింహా’ (2018), ‘రూలర్’ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్ రవికుమార్. ఆ చిత్రాల షూటింగ్ లొకేషన్లో జరిగిన సంఘటనలనే ‘గార్డియన్’ వేదికపై పంచుకున్నట్లున్నారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ– ‘‘ఒకరోజు లొకేషన్లో ఒక వ్యక్తి నవ్వితే.. ‘ఎందుకు నవ్వుతున్నావ్... రేయ్ ఎందుకురా నవ్వావ్.. నన్ను చూసి ఎందుకు నవ్వావ్’’ అని బాలకృష్ణ కొట్టడానికి ముందుకు వెళ్లినట్లుగా చేతులతో చూపించారు కేఎస్ రవికుమార్. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఇంకోసారి నా అసిస్టెంట్‌ని ‘ఆ ఫ్యాన్‌ని ఇలా తిప్పు’ అంటే.. అతను ఫ్యాన్ తి΄్పాడు. ఆ గాలికి బాలకృష్ణ విగ్ కాస్త చెదిరినట్లయితే అతను నవ్వాడు. ‘ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్’ అని బాలకృష్ణ అడుగుతుంటే అసలే తను నా అసిస్టెంట్.. ఎక్కడ కొట్టేస్తారేమోనని, ‘సార్ సార్.. అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ సార్..’ అన్నాను. ‘లేదు లేదు.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. చూడు ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ‘రేయ్.. వెళ్లరా ఇక్కణ్ణుంఛి’ అని అతన్ని పంపించేశాను’’ అని కూడా చె΄్పారు రవికుమార్. -
గ్రాండ్‌గా విశ్వక్ సేన్ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ బాధ్యత మనందరిపై ఉంది
‘‘మనందరిలో దేశభక్తి ఎంత ఉన్నా కానీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా మన యువత ఇలాంటి సినిమాలు చూడాలి. ఈ మూవీని తీయడం యూనిట్ బాధ్యత. విజయం అందించి మన రియల్ హీరోలైన సైనికులకు నివాళి అర్పించాల్సిన, అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు. కానీ, ట్రైలర్ చూస్తే ఎంతో రిచ్‌నెస్, ఎక్కువ బడ్జెట్ మూవీలా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదు.. మన ఆలోచన ల నుంచి వస్తుంది. తక్కువ ఖర్చులో అలా రిచ్‌గా చూపిస్తే సినిమా బాగా వస్తుంది.. ఇటు నిర్మాతలూ బాగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వరుణ్ ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తాడు. నేను ‘టాప్‌గన్’ మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. ఈరోజు ‘టాప్‌గన్’ లాంటి గొప్ప సినిమాని ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపంలో మనవాళ్లు సులభంగా చేశారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా వరుణ్‌గాడు మంచి సినిమా ఇచ్చాడని మీరు(మెగా అభిమానులు) గర్వపడేందుకు ప్రతి సినిమాకి కష్టపడుతుంటాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శక్తి ప్రతాప్ సింగ్ హడా. ‘‘మా మూవీని సైనికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత సిద్ధు ముద్ద. ఈ వేడుకలో సహ నిర్మాత నందకుమార్, కెమెరామేన్ హరి కె.వేదాంతం, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు నవదీప్, అభినవ్ గోమటం, శతాఫ్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కథని నమ్మి చేశారనిపిస్తోంది
‘‘విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ చిత్రంలో తొలిసారి హీరోగా చేశాడు. ఈ చిత్రంతో తనకు మంచి సక్సెస్ రావాలి. టీజర్, ట్రైలర్ చూస్తే కథని నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తోంది. టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం విజయం సాధించి, దర్శక, నిర్మాతలకు మంచి బ్రేక్ రావాలని ఆశిస్తున్నాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. అభినవ్ గోమఠం, వైశాలి రాజ్ జంటగా తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. కాసుల క్రియేటివ్ వర్క్స్‌పై భవాని కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, మూవీ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అభినవ్ గోమఠం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు తొలి అవకాశం ఇచ్చిన అభినవ్‌కు, నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు తిరుపతి రావు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు భవాని కాసుల. -
‘ధీర’ట్రైలర్ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్ రాజు
‘‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తున్నాం. శ్రీనివాస్‌గారు చిన్న నిర్మాతలకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారు. ఇక లక్ష్ నటించిన ‘ధీర’ట్రైలర్ బాగుంది. తన హార్డ్ వర్క్, చిత్ర యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధీర’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ మూవీ రేపు (శు క్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ‘దిల్’ రాజు, దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై, సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎంతో మంది దర్శకులని పరిచయం చేశాను. ‘ధీర’తో విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. లక్ష్ ను చూసి తండ్రిగా గర్విస్తుంటాను. మా ప్రొడక్షన్లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు. ‘‘పక్కోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే వాడికి ఓ మిషన్ అప్పగిస్తే ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యల్ని ‘ధీర’లో చూస్తారు’’ అన్నారు లక్ష్ చదలవాడ. ‘‘ధీర’ చాలా యూనిక్ పాయింట్. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు విక్రాంత్ శ్రీనివాస్. -
మా ఇద్దరికీ సంక్రాంతి కలిసొచ్చిన పండగ
‘‘నాన్నగారికి (సూపర్ స్టార్ కృష్ణ), నాకు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్‌బస్టరే.. ఈసారి కూడా ‘గుంటూరు కారం’తో బాగా గట్టిగా కొడతాం. కానీ, ఈసారి కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు. ఆయన నా సినిమా చూసి కలెక్షన్స్, సినిమా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఫోన్ కోసం ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడు అవన్నీ మీరే (ఫ్యాన్స్) చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మానాన్న.. మీరే అన్నీ (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా మీనాక్షీ చౌదరి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘నేను త్రివిక్రమ్ గారి సినిమాలు చేసినప్పుడల్లా నా నటనలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాలకు మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ ఆ మ్యాజిక్ జరిగింది. ఒక కొత్త మహేశ్‌బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. మా నిర్మాత చినబాబుగారికి అత్యంత ఇష్టమైన హీరో నేనే. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో వచ్చిన సంతోషం చూసినప్పుడు నాకు ఆనందంగా అనిపించేది. శ్రీలీలతో డ్యాన్స్ చేయడమంటే వామ్మో.. అదేం డ్యాన్సు.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది (నవ్వుతూ). తమన్ ప్రతిసారీ నాకు బెస్ట్ ఇస్తాడు. ‘కుర్చీ మడతపెట్టి..’ పాట చూస్తే థియేటర్లు బద్దలయిపోతాయి. పాతికేళ్లుగా మీరు (ఫ్యాన్స్) చూపించిన అభిమానం మరచిపోలేను. మాటల్లేవ్.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకేమీ తెలియదు.. మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ –‘‘కృష్ణగారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి గొప్ప మహానటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ, ఆయన పని చేసిన ఓ సినిమాకి పోసానిగారి వద్ద అసిస్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత ‘అతడు, ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుకుగా పుట్టిన మహేశ్‌గారు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంటుంది. ఒక సినిమాకి 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేశ్‌గారే.. ఈ మాట చెప్పడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరు. ‘అతడు, ఖలేజా’లకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అది అందం పరంగా, నటన పరంగానూ. ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి థియేటర్లలో ఆనందంగా జరుపుకుందాం’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చినబాబు, నాగవంశీల సక్సెస్ జర్నీ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఏదో మాయ చేస్తారు.. ఈ సినిమాలో కూడా చేశారు. ‘గుంటూరు కారం’తో మహేశ్‌గారు కలెక్షన్ల తాట తీస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది’’ అన్నారు. -
సంక్రాంతికి పండగే పండగ
‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను ఆదరించిన మీరు ‘సైంధవ్’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్’ కోసం వచ్చాను. న్యూ ఏజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. శైలేష్ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్‌హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్‌గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్ హీరోలు రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని చూశాను. ‘సైంధవ్’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్ మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. -
హను–మాన్: ప్రతి టిక్కెట్‌పై ఐదు రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళం
‘‘సంక్రాంతి అన్నది సినిమాలకు చాలా మంచి సీజన్. ఎన్ని చిత్రాలు వచ్చినా సరే కథ బాగుండి.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా బాగా ఆడాలి.. ఆడుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘హను–మాన్’ టీజర్, ట్రైలర్ చూడగానే అద్భుతంగా అనిపించడంతో డైరెక్టర్ ఎవరని అడిగి, ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నాను. ‘మీ సూపర్ హీరో ఎవరు?’ అని ఓ ఇంటర్వ్యూలో సమంత అడిగినప్పుడు.. ‘హను–మాన్’ అని టక్కున చెప్పేశాను. అదే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ వర్మ ఆలోచన, తేజ కష్టం వృథా కావు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవచ్చు. కానీ, సినిమాని విడుదల రోజు.. లేకుంటే మరుసటి రోజు.. ఫస్ట్ షో.. లేదంటే సెకండ్ షో చూస్తారు. సినిమా బాగుంటే ఎన్ని రోజులైనా చూస్తారు. ‘హను–మాన్’లాంటి మంచి సినిమా తీసిన నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రం ఆడినన్ని రోజులు ప్రతి టిక్కెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని యూనిట్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రామమందిరంప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది.. కుటుంబ సమేతంగా వెళతాను’’ అన్నారు. కె.నిరంజన్ మాట్లాడుతూ– ‘‘నేను ఏదైతే నమ్మానో దాన్ని అలాగే తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్‌కి థ్యాంక్స్. మా విజన్‌తో నిర్మించిన ‘హను–మాన్’ని ప్రేక్షకులు బిగ్స్క్రీన్స్లో చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవిగారికే. ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తున్నా. రామ్‌చరణ్‌గారికి రాజమౌళిగారు, రవితేజగారికి పూరి జగన్నాథ్‌గారు, నాకు.. ప్రశాంత్ వర్మగారు అని సగర్వంగా చెబుతున్నా’’ అన్నారు తేజ సజ్జా. ‘‘నన్ను నమ్మి ‘హను–మాన్’ తీయమని సపోర్ట్ చేసిన నిరంజన్ రెడ్డి సర్కి థ్యాంక్స్. కలలో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు తేజ.. తనకి సినిమా అంటే అంత ప్రేమ. ఈ సంక్రాంతికి పిల్లలు, పెద్దలందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసేలా ‘హను–మాన్’ ఉంటుంది అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటుడు వినయ్ రాయ్, కెమెరామేన్ దాశరథి శివేంద్ర, డైరెక్టర్ కేవీ అనుదీప్, రచయిత–డైరెక్టర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, గౌర హరి తదితరులు పాల్గొన్నారు. -
యానిమల్ తరహాలో ‘దీనమ్మ జీవితం’
దేవ్ బల్లాని, ప్రియా చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో మురళీ రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై. మురళీకృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రం ఇది.పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘యానిమల్’ వంటి రా అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ ‘దీనమ్మ జీవితం’. తమిళ్, మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి కంటెంట్‌తో సినిమా చేయగలరని నిరూపించే చిత్రమిది’’ అన్నారు మురళీ రామస్వామి. ‘సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని ప్రియా చౌహాన్ అన్నారు.