prem kumar
-
Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్ కుమార్సంగీతం: గోవింద్ వసంత్విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. (చదవండి: దేవర మూవీ రివ్యూ)ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
హిట్ డైరెక్టర్‌తో కార్తీ.. కొత్త సినిమాకు క్రేజీ టైటిల్
'విరుమాన్', 'సర్దార్', 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలతో వరస హిట్లు కొట్టిన కార్తీ.. 'జపాన్'తో ఘోరమైన ప్లాఫ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా సరే దీన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో డైరెక్టర్ నలన్ కుమారస్వామి తీస్తున్న మూవీ ఒకటి కాగా.. '96' ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శత్వం వహిస్తున్న చిత్రం మరొకటి. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) కార్తీ లేటెస్ట్ మూవీని ఇతడి అన్న సూర్యనే నిర్మిస్తున్నాడు. గతంలో రెండు చిత్రాలు చేశాడు. ఇది హ్యాట్రిక్ మూవీ. ఇకపోతే కార్తీ-ప్రేమ్ కుమార్ కాంబోలో తీస్తున్న సినిమాకు గోవింద్ వసంత సంగీతమందిస్తున్నారు. ఇది తంజావూర్ ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు 'దమెయ్యళగన్' టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) -
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా?
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట కమాన్ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రేమ్‌కుమార్(28) కరీంనగర్లో ఉంటూ ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి భూపాలపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రేగొండ మండలం భాగిర్తి పేట కమాన్ శివారులో భూపాలపల్లి నుంచి పరకాల వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రేమ్‌కుమార్ క్యాబిన్‌లోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లు వీరబోయిన రమేష్, మురళితో పాటు ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేగొండ ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, తీగల మాధవ్ ఘటనా స్థలికి చేరుకుని ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని డీసీఎం క్యాబిన్ నుంచి బయటకు తీసి పరకాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈఘటనపై మృతుడి సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొగ మంచు, అతివేగమే కారణం? పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి పొగ మంచు, అతివేగమే కారణమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండడంతో వాహనాల వేగం ఎక్కువగా ఉంటుందని, దీనికి తోడు పొగ మంచుతో దారి, ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, భాగిర్తిపేట కమాన్ శివారు ప్రమాదాలకు అడ్డగా మారుతోంది. ఏటా కమాన్ సమీపంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి.. -
30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?
టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోలకు డూపులను వాడే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. స్టార్ హీరోకి సంబంధించిన రిస్కీ ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ ఈ డూపులతోనే చేయిస్తారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో అచ్చం రియల్ హీరో చేసినట్లే ఆ సన్నివేశాలను చూపిస్తారు దర్శకుడు. అయితే ఈ డూపుల గురించి ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని డూప్‌గా నటించిన వారికి కూడా గుర్తింపు లభిస్తోంది. తనదైన డ్యాన్స్, ఫైట్లలో తెలుగు చిత్ర సీమలో రారాజుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని చిత్రాల్లో డూప్‌ని వాడారు. తనలాగే ఉన్న ఓ వ్యక్తిని పలు చిత్రాల్లో నటించజేసి విజయాలు అందుకున్నారు. ఆ డూప్ పేరు ప్రేమ్ కుమార్. అతనిది పశ్చిమ గోదావారి జిల్లా పాలకొల్లు. రికార్డింగ్ డ్యాన్సర్‌గా ఉన్న ఆయన గత 30 ఏళ్లుగా చిరంజీకి సినిమాలకు డూప్‌గా నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయనకు ఒక కంపెనీ ఉంది. అక్కినేని అభిమాని కానీ.. ప్రేమ్ కుమార్ నాన్న స్టేజ్ షోలు నిర్వహించేవాడు. ప్రేమ్ కుమార్ సినీ ప్రస్థానం కూడా స్టేజ్ షో నుంచే ప్రారంభమైంది. తొలుత అక్కినేని నాగేశ్వరరావు పాటలకు డ్యాన్స్ చేసేవాడు. అంతేకాదు అక్కినేనికి ప్రేమ్ కుమార్ పెద్ద అభిమాని. అయితే స్నేహితుల ప్రొత్సాహంతో అతను చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసి..మెగాస్టార్ అభిమానిగా మారారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ కుమారే చెప్పారు. ‘నా పదోతరగతి 1985లో పూర్తయింది. ఆరేళ్ల వయసు నుంచే నేను స్టేజ్ షోలో పాల్గొన్నారు. ప్రతిసారి అక్కినేని హిట్ పాటలకు స్టెప్పులేసి అలరించేవాడిని. కాలేజీ సమయంలో స్నేహితులు చిరంజీవి పాటలకు ట్రై చేయమని చెప్పారు. మొదటగా చిరు ‘ఇందువదనా..’పాటకు డ్యాన్స్ చేశా. అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత వరుసగా చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ వచ్చాను. ఇక 1990లో డిగ్రీ పాసయ్యాక.. సినిమాల్లో ఓ ఆఫర్ వచ్చింది. అది చిరంజీవి ఛాలెంజ్ సినిమా. ఎగిరి గంతేసి నటించేశాను. ఆ తర్వాత రాక్షసుడు, మరణ మృదంగం సినిమాల్లో చిరు డూప్‌గా నటించిన తర్వాత బ్రేక్ వచ్చింది. కొన్నాళ్ల వరకు సినిమా అవకాశాలు రాలేదు. స్టేజ్ షోలు చేస్తూనే జీవనం సాగించాను. టీచర్ ఉద్యోగం రిజెక్ట్ చేస్తే.. స్టేజ్ షోలు చేస్తున్న సమయంలోనే నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పటికే నా సంపాదన వేలల్లో ఉండేది. దీంతో ఆ ఉద్యోగం వదిలేద్దామనుకున్నాను. కానీ మా నాన్నగారు వద్దన్నారు. ‘ఇప్పుడు ఏజ్ ఉన్నావు. డ్యాన్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావు. కొన్నాళ్లకు ముసలోడివి అవుతావు. అప్పుడు ఎలా బతకుతావు? ఉద్యోగం నీ జీవితానికి భద్రత అని చెప్పడంతో టీచర్ జాబ్‌లో చేరాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఖాలీ సమయంలో స్టేజ్ షోలో నిర్వహించేవాడిని. ఈ మధ్య పెళ్లి కాని ప్రసాద్లో చిరంజీవిలా నటించాను. అలాగే సైరా చిత్రంలోనూ చిరు డూప్‌గా నటించాను. చిరు నా దేవుడు నేను ఎప్పుడూ చిరంజీవిని ఫాలో కాలేదు. కానీ ఆ దేవుడే నన్ను చిరంజీవి వైపు పంపించాడు. ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఆయనలా నటించడం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. ఆయన డబ్బులే నేను తింటున్నాను. నాకు కనబడే ఒకే ఒక దేవుడు చిరంజీవి. చనిపోయేలోపు ఆయనను ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. చిరంజీవిని చూసి చనిపోవాలనేదే నా కోరిక’అని ప్రేమ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. (చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) -
కుటుంబంతో కలిసి చూడొచ్చు
‘‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
నవ్వించే ప్రేమ్‌కుమార్
సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నమ్మడంవల్లే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. నా సినిమాల్లో నటించిన అభిషేక్ దర్శ కుడు అవుతాడని ఊహించలేదు. భవిష్యత్‌లో హ్యూమర్‌కి తనో బ్రాండ్ అవుతాడనిపిస్తోంది. ‘ప్రేమ్‌కుమార్’ రెండు గంటలు నవ్వించే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అవే ΄ాత్రలను ఈ సినిమాలో చూస్తాం’’ అన్నారు అభిషేక్ మహర్షి. ‘‘ప్రేక్షకు లను నవ్వించాలని చేసిన సినిమా ఇది’’ అన్నారు శివ ప్రసాద్. -
అన్నదమ్ముల అదృశ్యం..!
-
యూఎస్ రోడ్డు ప్రమాదంలో ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతి.. 9 రోజుల తర్వాత..
సాక్షి, రామగిరి(నల్లగొండ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి(26) అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదోరిగూడెం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని న్యూయార్క్ సాక్కిడ్‌హార్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి ఆగస్టు 23న వెళ్లాడు. ప్రేమ్‌కుమార్‌రెడ్డి స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా అక్టోబర్ 25న తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ప్రేమ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. స్వగ్రామంలో.. తిప్పర్తి మండలం గోదోరిగూడేనికి చెందిన ప్రేమ్‌కుమార్‌రెడ్డి తల్లితండ్రులు లక్ష్మారెడ్డి లలితలు హైదారాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి హైదరాబాద్‌లో రైస్ బిజినెస్ చేస్తాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉంది.ప్రేమ్‌కుమార్‌రెడ్డి పెద్దవాడు ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. పోయి రెండు నెలలు గడవకముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు తొమ్మిరోజుల తర్వాత మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా ప్రేమ్‌కుమార్‌రెడ్డి డెడ్‌బాడీని స్వగ్రామం గోదోరిగూడేనికి తరలించారు. కుటుంబ సభ్యులు బంధువుల రోదనల నడుమ బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురు ప్రేమ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు దంపతులు, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ గోదా క్రిష్ణారెడ్డి ఉన్నారు. -
96 మూవీ కాంబో రిపీట్, విజయ్ సేతుపతికి మరో హిట్!
'96' చిత్ర కాంబో రిపీట్ కానుందని సమాచారం. నటుడు విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన విజయవంతమైన చిత్రం 96ను అంత ఈజీగా ఎవరు మరచిపోలేరు. ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు ప్రేమ్‌కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. చాలా గ్యాప్ తరువాత నటి త్రిష జీవితంలో మంచి జోష్ నింపిన చిత్రం ఇది. ఇక నటుడు విజయ్ సేతుపతి వీర ప్రేమికుడిగా చూపించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. కాగా దర్శకుడు ప్రేమ్‌కుమార్ మరోసారి విజయ్‌సేతుపతిని డైరక్ట్ చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
పలుమార్లు నెగెటివ్..చివరి పరీక్షలో పాజిటివ్
-
కరోనా పరీక్షల్లో నెగెటివ్.. సీటీ స్కాన్‌లో పాజిటివ్
హైదరాబాద్: కరోనా చెలగాటం సామాన్యులకు ప్రాణసంకటం.. ముందు నిద్రాణంగా ఉండి ఆ తర్వాత పంజా విసురుతోంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని కరోనా పరీక్ష చేయించుకుంటే ముందు నెగెటివ్ అని వస్తోంది.. ఆ తర్వాత సీటీస్కాన్లో అది పాజిటివ్‌గా తేలి ప్రాణాలు తీస్తోంది. ఈ విధంగానే ఓ ఏఎస్ఐని కబళించింది. కరోనాతో పోరులో చివరికి ఆయన కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ్‌కుమార్(55) ఏఎస్ఐగా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలోనూ ఆయన రేయింబవళ్ళు సేవలందించారు. ఈ నెల 7వ తేదీన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. సీటీ స్కాన్‌లో పాజిటివ్ అని.. కరోనా కాకపోవచ్చని భావించిన ప్రేమ్‌కుమార్ ఎర్రగడ్డలోని నీలిమా ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రేమ్‌కుమార్‌కు íసీటీ స్కాన్ తీశారు. ఈ స్కాన్‌లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కరోనా వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఉండొచ్చని భావించిన వైద్యులు ఆయనను కోవిడ్ ఆస్పత్రుల్లో చేరాలని సూచించగా మళ్లీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి వెళ్ళారు. నెగెటివ్ వచ్చిన వారికి ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు లేవని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చేరిన కాసేపటికే ఆక్సిజన్ సరఫరా సరిగా లేక ప్రేమ్‌కుమార్ కళ్ల ముందే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ వద్ద భద్రతాకార్డుపై చికిత్స అందించే సౌకర్యంలేదని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నించారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారుల చొరవతో అపోలో ఆస్పత్రిలో బెడ్ దొరికింది. అక్కడ ప్రేమ్‌కుమార్‌కు మరోసారి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. సోమవారం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్రేమ్‌కుమార్ చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. -
పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు..
సాక్షి తాడేపల్లి : కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక బకింగ్‌హామ్‌కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న వేములపూడి ప్రేమ్ కుమార్ (30) మృతదేహం మంగళవారం తెనాలి మండలం కొలకలూరు రైల్వే బ్రిడ్జి వద్ద లభించింది. విజయవాడ పటమటలో నివసించే ప్రేమ్ కుమార్ గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద డిసెంబర్ 28న బకింగ్‌హామ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం కొలకలూరు రైల్వే బ్రిడ్జి సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన విజయవాడలోని ప్రేమ్‌కుమార్ భార్య దిశిదాకృష్ణ, బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ తరలించారు. వడ్డీ వ్యాపారి బతకనివ్వట్లేదు! ‘పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు. మనకిక న్యాయం జరగదు. బతకాలని ఉన్నా.. బతకనివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించు..’ అంటూ ఓ యువకుడు తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకిన ఘటన విజయవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పటమటకు చెందిన ప్రేమ్‌కుమార్, అతని సోదరి జ్యోతి కలిసి ఇద్దరి ఇళ్లను అదే ప్రాంతానికి చెందిన కాసుల వెంకట రంగారావు అనే వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టి 2017వ సంవత్సరంలో రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొదట్లో రూ.3 వడ్డీ అని చెప్పిన రంగారావు.. ఆ తర్వాత వడ్డీ రేటును రూ.10కి పెంచాడు. చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం ప్రేమ్ కుమార్, జ్యోతి వడ్డీ మొత్తంతోపాటు అసలు మొత్తంలో రూ.5 లక్షలు చెల్లించేశారు. చివరకు రూ.లక్ష అప్పు ఉండగా.. దానిని కూడా త్వరలో చెల్లిస్తామని, ఈలోపు తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలు తిరిగివ్వాలని రంగారావును కోరగా.. ఇంకా రూ.16 లక్షలు బకాయి ఉన్నారని, ఆ మొత్తం చెల్లిస్తేనే పత్రాలిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ప్రేమ్‌కుమార్ ఈ నెల 16న స్పందన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ ద్వారకా తిరుమలరావు ఆ ఫిర్యాదు పరిష్కరించాలని పటమట పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఫలితం లేకపోవడంతో ప్రేమ్‌కుమార్ 23వ తేదీన మరోసారి స్పందనలో సీపీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారి ప్రేమ్‌కుమార్‌పై కిరాయి గుండాలతో దాడి చేయించాడు. ఈ విషయాన్ని కూడా స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇక ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగదని ఆవేదన చెందిన అతడు ఈనెల 28న సాయంత్రం తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకేశాడు. చదవండి: కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ! -
నర్సంపేటలో ఆర్మీ జవాన్ ప్రేమ్‌కుమార్ హత్య
-
ప్రేమ్‌కుమార్ హత్య హేయమైనది
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేవరకద్ర మండలం డోకూరులో బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్ హత్య హేయమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు. రాజ్యాంగబద్ధంగా నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గురువారం దేవరకద్ర మండలం డోకూరులో ప్రేమ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి న సిద్ధాంతాల కోసం ఎంపీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ను అధికార పార్టీ నాయకులు వేట కొడవళ్లతో నరికి చంపారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకు, ఫలితాలు టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత, సన్నిహితుడు వినోద్ ఓడిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దొడ్డిదారిన గ్రామాల్లోని బీజేపీ కార్యకర్తలను అణచివేస్తామంటే అది టీఆర్ఎస్ పార్టీ నాయకుల అవివేకమేనన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే తిరుగుబాటు తప్పదని, హత్యా రాజకీయాలను నిలువరిస్తామని అన్నారు. ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంటుందని, ఇకపై ఆ కుటుంబ బాధ్యతను పార్టీయే తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
కలికిరి: స్థానిక బండకాడపల్లిలో నివాసం ఉంటూ జిల్లాలోని సత్యవేడులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌కుమార్ సోమవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. బండకాడపల్లికి చెందిన గడ్డం ఏసురత్నం కుమారుడు ప్రేమ్‌కుమార్ 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ (పీసీ నెం.3760). సత్యవేడులో విధులు నిర్వహిస్తున్న ఇతను గతేడాది నవంబరు 12 నుంచి విధులకు వెళ్లకపోవడంతో ఇతన్ని డిజెక్టర్ చేశారు. దీంతో అతను ఇటీవల జిల్లా ఉన్నతాధికారులను కలసి విన్నవించగా, ఎన్నికల విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. అయితే మరలా విధులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్న అతన్ని విధులకు వెళ్లాలని భార్య మందలించింది. లెక్కచేయకపోవడంతో.. తన భర్తను విధులకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ఉదయం కలికిరి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడిన స్థానిక పోలీసులు విధులకు వెళ్లాలని నచ్చజెప్పారు. ఇంటికి వెళ్లిన తరువాత భార్య నిరోషా తాగునీరు తీసుకురావడానికి కుళాయి వద్దకు వెళ్లింది. ఈ సమయంలో ప్రేమ్‌కుమార్ ఇంటిపైకప్పు కొక్కీకి చీరతో ఉరివేసుకున్నాడు. ఎంత సేపటికీ గడియ తీయకపోవడంతో భార్య నిరోషా ఇరుగుపొరుగు వారిని పిలిచి గడియ తీసి చూసింది. భర్త ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సాయంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ♦ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రేమశ్రీ(7), రక్షిత(6), కుమారుడు యశ్వంత్(4) ఉన్నారు. పండుగ రోజు విషాదం.. మహాశివరాత్రి పర్వదినం రోజున కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త మృతదేహం వద్ద చిన్నారులతో కలిసి భార్య నిరోషా రోదించడం చూసిన ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు. పోలీసు సంఘం ఆర్థిక సాయం.. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ్‌కుమార్ కుటుం బానికి దహన ఖర్చులకు గాను రూ.15వేలు అందజేశారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సాయం త్వరితగతిన అందేలా యూనియన్ తరఫున కృషి చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. -
బైక్ నంబర్ 96
హీరోలకు కెరీర్లో మరచిపోలేని హిట్స్ అందించినప్పుడు హీరోలు ఆ దర్శకులకు ఏదో గిఫ్ట్ ఇవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను గిఫ్ట్‌గా అందించారు విజయ్ సేతుపతి. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘96’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. విజయ్ సేతుపతికి బైక్స్ అంటే ఇష్టమట. అందుకే తన దర్శకుడికి బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తే బావుంటుందని భావించి ఎన్ఫీల్డ్ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సుమారు 3 లక్షలు ఖరీదైన ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ‘0096’. సినిమా టైటిల్ కూడా కలిసేలా ప్లాన్ చేసి, ఇలా ప్రెజెంట్ చేయడంతో ప్రేమ్‌కుమార్ ఆశ్చర్యపోయింటారు. ఈ సినిమా తెలుగులో ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలోనే శర్వానంద్, సమంత జంటగా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
యశ్ మహాచంద్ర
‘కేజీయఫ్’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యశ్. ఆయన కీలక పాత్ర చేసిన ‘చంద్ర’ చిత్రాన్ని ‘మహాచంద్ర’ పేరుతో అనువదిస్తున్నారు. యశ్, ప్రేమ్ కుమార్, శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. రూపా అయ్యర్ దర్శకత్వంలో షాన్వాజ్ నిర్మించారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ – ‘‘కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. యశ్ కీలక పాత్రలో కనిపిస్తారు. శ్రియ అద్భుతమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: దామోదర వనాఛార్య, సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ్, కెమెరా: దాస్. -
మహిళతో అసభ్య ప్రవర్తన.. ఊబర్ డ్రైవర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కొండాపూర్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఊబర్ క్యాబ్ డ్రైవర్‌ను షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌లో ప్రేమ్ కుమార్ అనే ఊబర్ క్యాబ్ డ్రైవర్‌ను సైబరాబాద్ షీటీమ్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ నెల 19వ తేది(గురువారం) ఉదయం మాదాపూర్ నుండి ఢిల్లీకి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు ఊబర్ క్యాబ్‌లో ఓ మహిళ బయలు దేరారు. అయితే దారిలో తన పట్ల డ్రైవర్ ప్రేమ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా ప్రయాణీకురాలు ఢిల్లీలోని సబ్ధర్ జంగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సైబరాబాద్ కమీషనర్ సందీప్ శాండిల్య ఆదేశాలతో రంగంలోకి దిగిన షీటీమ్స్ బృందాలు డ్రైవర్ ప్రేమ్ కుమార్‌ను అరెస్టు చేశాయి. నిందితుడిపై ఐపీసీ 354 A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
కనగానపల్లి(అనంతపురం జిల్లా): కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లిలో 44వ జాతీయ రహాదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. ప్రేమ్ కుమార్, మరో ఇద్దరు కలిసి స్కార్పియోలో హిందూపూర్ నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా గూడ్సులారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్ అక్కడకిక్కడే మృతిచెందగా..మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రేమ్‌కుమార్ గోరంట్లలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాకీ తీర్చు.. లేకుంటే మా పాపను పెంచు!
ఆటోలో రెండు నెలల పసికందును వదిలిపెట్టిన దంపతులు జడ్చర్ల టౌన్: బాకీ తీర్చడం కోసం ఓ దంపతులు వింత షరతు పెట్టారు. బాకీ తీర్చాలని, లేకుంటే తమ పాప (2నెలలు)ను నువ్వే పెంచుకోవాలని పసికందును అక్కడే వదిలిపెట్టి పోయారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన సిద్దూ జడ్చర్లలో ఆటో నడుపుతుంటాడు. ఇతనికి అక్క వరసయ్యే అదే తండాకు చెందిన సువర్ణ ఆమె భర్త ప్రేమ్‌కుమార్‌లకు రూ.8 వేలు బాకీ ఉన్నాడు. ఈ క్రమంలో బాదేపల్లి పట్టణానికి వచ్చిన సువర్ణ, ప్రేమ్కుమార్లు ఆదివారం సాయంత్రం సిద్దూ ఆటో ఎక్కారు. నేతాజీ చౌరస్తానుంచి స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాసవి కమాన్ వద్దకు చేరుకోగానే అప్పుకట్టాలని సిద్దూపై ఒత్తిడి తెచ్చారు. త్వరలోనే తీరుస్తానని చెప్పినప్పటికీ వారు వినకుండా అప్పు తీర్చే వరకు మా పాపను నువ్వే పెంచుకో అంటూ ఆటోలో పసికందును వదిలిపెట్టి పరుగు లంఘించారు. అవాక్కయిన సిద్దూ.. వెంటాడగా ప్రేమ్‌కుమార్ చిక్కాడు. సువర్ణ తప్పించుకుంది. స్థానికులు ప్రేమ్‌కుమార్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రేమ్‌కుమార్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి పాపను అప్పగించారు. -
ప్రేమ్ కుమార్‌కు రజతం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో కుమారవెల్ ప్రేమ్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రేమ్ కుమార్ 7.92 మీటర్ల దూరం దూకి తన ఖాతాలో రజత పతకాన్ని వేసుకున్నాడు. జాంగ్ యావోగువాంగ్ (చైనా-7.99 మీటర్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌లో ఓంప్రకాశ్ కర్హానా ఇనుప గుండును 18.77 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి. -
'మేం గెలిస్తే ఆయనే సీఎం'
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం గయాలో పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రేమ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బిహార్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. బిహార్‌లో బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తిగా ప్రేమ్ కుమార్‌కు మంచి పేరుంది. బీజేపీ సాధారణంగా ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించడం అరుదు. బిహార్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత షాన్వాజ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
భువనగిరి అర్బన్ : అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొనగా దుర్మరణం పొందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి నాగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గూడూర్‌కు చెందిన బింగి ప్రేమ్‌కుమార్(28) వలిగొండలోని తన అత్తగారి ఇంటికి బైకుపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులోకి రాగానే భువనగిరి నుంచి నల్లగొండకు వెళ్తున్న యాదగిరిగుట్టడిపో బస్సు ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టింది. ఎగిరిపడ్డ ప్రేమ్‌కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్‌కుమార్ బీబీనగర్‌లోని ఎంఎస్ కంపెనీలో పనిచేస్తుండేవాడని ఎస్ఐ భిక్షపతి తెలిపారు. మృతునికి భార్య సబిత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.