programme
-
‘జ్ఞాపకాలు..అనుభవాలు ఎంతో మధురం’
సోలాపూర్: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్ ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్ కొండ బత్తిని,స్నేహల్ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు. -
యానిమేషన్ రంగంలో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతిసారిలాగే ఈ కార్యక్రమంలోనూ తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోని 115వ ఎపిసోడ్ నేడు ప్రసారమయ్యింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని చెబుతూ, నేటి మన్ కీ బాత్‌లో ధైర్యం, దూరదృష్టి కలిగిన ఇద్దరు గొప్ప హీరోల గురించి చర్చిస్తాను. సర్దార్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరగనుంది. బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15న జరగనుంది. ఈ ఇద్దరు మహానుభావుల ముందున్న సవాళ్లు భిన్నమైనవి. అయినా వారి దృష్టి ఒక్కటే.. అదే దేశ సమైక్యత అని ప్రధాని పేర్కొన్నారు.నా జీవితంలో మరచిపోలేని క్షణాలు ఏవి అని మీరు నన్ను అడిగితే, చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైనది. అది గత ఏడాది నవంబర్ 15న బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామానికి వెళ్లాను. ఈ ప్రయాణం నాపై చాలా ప్రభావం చూపిందని మోదీ అన్నారు.ఛోటా భీమ్లాగా మన ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, మోటు-పత్లు, బాల్ హనుమాన్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేటెడ్ పాత్రలు, చలనచిత్రాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోంది. భారతీయ క్రీడలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నాయి. భారత్‌లో సృజనాత్మక శక్తి ఉప్పొంగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియా’ అనేవి యానిమేషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.10 సంవత్సరాల క్రితం, భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని ఎవరైనా చెప్పినప్పుడు, చాలా మంది దానిని నమ్మలేదు. పైగా ఎగతాళి చేసేవారు. కానీ నేడు దేశం సాధించిన విజయాన్ని చూసి.. వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఒకప్పుడు రక్షణ పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసిన భారతదేశం నేడు 85 దేశాలకు వాటిని ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరకు చేరిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ -
వన్ స్టేట్.. వన్ కార్డు
సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్‌ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్ స్టేట్– వన్ కార్డ్’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్‌లో జన్ ఆధార్ స్కీమ్ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్ పెహచాన్ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 12 అంకెలతో కూడిన డిజిట్ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. వ్యక్తిగత ఐడీలు.. తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఒకే చోట అన్ని వివరాలు.. ప్రస్తుతం ఒక కుటుంబంలోని వారు వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్ క్లిక్‌తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప ఒకదానికొకటి అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని, ఈ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎం రిలీఫ్‌ఫండ్‌తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. -
వచ్చాడు గెలిచాడు!
తుమ్ ముజేనా యూ బచానా పావోవే’... రఫీ పాడిన ఈ పాటను ఏడేళ్ల అవిర్భవ్ వేదిక మీద పాడుతుంటే అందరికీ కన్నీరు వచ్చింది. ఇంత బాగా పాడిన ఈ బుడతడిని సోనిలో సూపర్‌స్టార్ సింగర్ సీజన్ 3 (మార్చి 2024 నుంచి ఆగస్టు 2024 వరకు) చూసిన వారెవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే మొత్తం 11 మంది ఫైనలిస్ట్‌లలో తమ ఓటింగ్ ద్వారా అవిర్భవ్నే విజేతగా నిలిపారు.పది లక్షల రూపాయల బహుమతి వచ్చేలా చూశారు. జడ్జిల చాయిస్‌గా అధర్వ బక్షి అనే మరో చిన్నోడు విజేతగా నిలిచినా ఈ సీజన్లో సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం అవిర్భవే. చిన్నగా కోమలమైన ఆకారంతో ఉన్నప్పటికీ అవిర్భవ్ రేంజ్ చాలా గొప్పది. కేరళకు చెందిన అవిర్భవ్ తన సోదరి అనిర్విన్య దగ్గర రెండేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాడు.తెలుగు షోస్‌లో కూడా పాల్గొన్నాడు. కాని ఇపుడు సూపర్‌స్టార్ సింగర్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతమయ్యాడు. అర్జిత్ సింగ్ ఇతడి ఫేవరెట్ సింగర్. పెద్దయ్యాక గాయకుణ్ణి అయ్యి సల్మాన్, షారుక్‌ఖాన్‌లకు పాడతానని అంటున్నాడు అవిర్భవ్.ఇవి చదవండి: ఆమె గొంతుక.. మన గుండెల్లో..! -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
‘అహ్లాన్ మోదీ’లో మార్పులు.. కారణమిదే!
యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఫిబ్రవరి 13) పాల్గొనబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా కుదించారు. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో పలు మార్పులు చేశారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే బహిరంగ కార్యక్రమం గురించి అధికారి సజీవ్ పురుషోత్తమన్ మాట్లాడుతూ ప్రతికూల వాతావరణం కారణంగా 35 వేల మంది హాజరయ్యేందుకు మాత్రమే ఏర్పాట్లు చేయగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 60 వేల మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరి కోసం 500లకు పైగా బస్సులను నడుపుతున్నామన్నారు. వెయ్యిమంది వాలంటీర్లు తమ సేవలను అందిస్తారని తెలిపారు. యూఏఈలో ప్రధాని ఈ నెల 13, 14 తేదీలలో పర్యటించనున్నారు. -
నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు(శనివారం) ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం ఝార్సుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్పూర్ వెళతారు. జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద రూ.2,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 2,660 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడనుంది. అలాగే దాదాపు రూ. 28,980 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
నేడు అయోధ్యలో ఏ సమయానికి ఏం జరగనుంది?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే.. దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం. అయోధ్యలో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు. యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శనలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు. రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడం. కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం. #WATCH | Ayodhya, Uttar Pradesh: Morning visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/qIRiYVgnei — ANI (@ANI) January 22, 2024 నూతన రామాలయంలో నేటి మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. అంటే 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ నేపధ్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు. -
నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి! ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. -
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం.. ‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
నారా లోకేష్‌కి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అంశాన్ని జనాల్లో నానుతూ ఉండేలా చేయాలని టీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. అన్ని ఫెయిల్ అవుతున్నాయి. టీడీపీకి ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. లోకేష్ పిలుపును జనాలు పట్టించుకోకపోవడంతో ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబుకు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల వరకు తాళ్లు, గుడ్డ, రిబ్బన్లతో సంకెళ్ల వేసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నామమాత్రం కూడా స్పందన లేదు. ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు.. బాల్కనీలో కూడా కనిపించలేదు. బాబు అరెస్టుపై లోకేష్ మాటలను విశాఖ నగర వాసులు లెక్కచేయలేదు. అవినీతి పరులకు సంఘీభావం ఏమిటంటూ జనాలు నవ్వుకుంటుకున్నారు. ఇప్పటికే అట్టర్ ప్లాప్ మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి న్యాయానికి సంకెళ్లు సంఘీభావ కార్యక్రమాలు. స్వయంగా అచ్చెంన్నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో కనీసం 50 మంది టీడీపీ కార్యకర్తలు కూడా కనిపించలేదు. చదవండి: పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం -
Live: వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
జగనన్నకు చెబుదాం కార్యక్రమం..నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
-
నాడు - నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ భారీ విరాళం
-
చికాగో నాట్స్ విభాగం థ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌కు చక్కటి స్పందన
చికాగో: భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు మేముసైతం సమాజహితం కోసం అని స్పందించారు. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్ ద్వారా వందలాది బట్టలు, బూట్లను సేకరించారు. ఇలా సేకరించిన వాటిని చికాగో శివారులోని అరోరాలో ఉన్న హెస్డ్ హౌస్ హోమ్ లెస్ షెల్టర్‌కు అందించారు. చికాగో నాట్స్ నాయకులు శ్రీహరీశ్ జమ్ము, నరేంద్ర కడియాల, వీర తక్కెళ్లపాటి లు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి చికాగో నాయకులకు దిశా నిర్థేశం చేశారు. వీరితో పాటు నాట్స్ ఈసీ సభ్యులు మదన్ పాములపాటి వైస్ ప్రెసిడెంట్(సర్వీసెస్) , కృష్ణ నిమ్మలగడ్డ, లక్ష్మి బొజ్జ, బిందు వీధులముడి, రోజా శీలంశెట్టి, భారతీ పుట్టా తమ వంతు సహకారం అందించారు. నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు సుమతి నెప్పలి, బిందు బాలినేని, ప్రతిభ, ప్రత్యూష, నవీన్ జరుగుల, వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, పండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, రాజేష్ వీధులమూడి, సతీష్, వినోద్ బాలగురు, యజ్ఞేశ్, అరుల్ బాబు, శ్రేయాన్, అక్షిత, రుషిత, ఆరుష్ , ఆదిన్, వర్షిత్, కృష్ణఫణి, సంకీత్, నిరుక్త, నిత్య, సహస్ర, హన్సిక, అన్షిక, వేద, అనీష్ తదితరులు గివింగ్ బ్యాక్ కార్యక్రమంలో చురుకుగా వ్యవహారించారు. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా అవార్డులు అందించారు. హ్యూస్టన్‌లో నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్ హ్యూస్టన్: తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా బాల,బాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ సహ సమన్వయకర్త చంద్ర తెర్లీ నాట్స్ క్రీడా సమన్వయకర్త ఆదిత్య దామెర నేతృత్వంలో ఈ టోర్నెమెంట్ జరిగింది. నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త విజయ్ దొంతరాజు, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, సుమిత్ అరిగెపూడి, శ్రీనివాస్ కాకుమాను, వీరు కంకటాల, వంశీ తాతినేని తదితరులు ఈ టోర్నెమెంట్ విజయానికి కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ ఎప్పుడూ వెన్నంటి ఉండి తమ సహాయ సహకారాలను అందిస్తుందని నాట్స్ బోర్డు సభ్యులు సునీల్ పాలేరు అన్నారు. చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి నాట్స్ కేంద్ర కమిటీ సభ్యులు, కోశాధికారి హేమంత్ కొల్ల అభినందనలు తెలిపారు. క్రీడా నైపుణ్యత ఆధారంగా బాలబాలికలకు రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు. -
Family Doctor: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా
‘ఆకలికి అన్నము వేదనకు ఔషధం’ అనే నానుడి మనకందరికీ తెలిసినదే! శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఆనారోగ్య శరీరాలకు ఔషధం అనేది కూడా అంతే ముఖ్యం. కానీ ఔష ధాన్ని నిర్ణయించాల్సింది మటుకు వైద్యులే అనేది జగమెరిగిన సత్యం! రోగిని పరీ క్షించటం, వ్యాధిని నిర్ణయించి తగిన సమయంలో సరియైన మోతాదులలో మందులు వాడటం అనేది వైద్యుల బాధ్యతే. అయితే ‘విత్తం ఉంటేనే వైద్యం’ అనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉండ టంతో సమాజంలోని పేద, మధ్యతరగతి వారు వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం గ్రామాల్లో స్థిర నివాసం ఉండే వైద్యులు ఉండేవారు. వారికి ఆ ఊళ్లో ఉన్న అన్ని కుటుంబాల ఆరోగ్య స్థితుల పట్ల ఒక అవగాహన ఉండేది. అందువల్ల ఆయా కుటుంబాలకు వైద్య చికిత్స అందించడం తేలికయ్యేది. వారందరినీ ఫ్యామిలీ డాక్టర్లుగా వ్యవహరించడం కద్దు. అయితే ప్రస్తుతం వైద్యుల సంఖ్య పెరుగుతున్నా ఈ ఆధునిక కాలంలో పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రజలందరికీ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇందుకు వైద్యం ఖరీదైనదిగా మారటం ఒక కారణమైతే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎక్కువ మంది డాక్టర్లు పెద్ద ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడం ఇంకో కారణం. దీంతో ఆయా గ్రామాల్లో కానీ, లేదా పట్టణాల్లోని వార్డుల్లో కానీ జీవించే వారికి ఫ్యామిలీ డాక్టర్ అనదగిన వైద్యుని సేవలు పొందే అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో లభిస్తూనే ఉంటాయి. అలాగే వైద్య సౌకర్యాలు ఫరవాలేదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. అలాగే రోగం, రొప్పు వస్తే అర్హత గల డాక్టర్ వైద్య సేవలు మృగ్యం. నాసిరకం మందులు, నాటు మందులు మాత్రమే వారికి లభిస్తాయి. మూఢనమ్మకాలతో కూడిన వైద్యం వారిని కాటేస్తున్నది. నాణ్యమైన వైద్యం కావాలంటే... అప్పుల పాలు కావటమో, ఆస్తులు తాకట్టు పెట్టటమో, నగ నట్రా లేదా ఆస్తులు అమ్ముకోవటమో చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా స్త్రీలలో ప్రసవ వేదన సమస్యలు, సాధారణ స్త్రీ ఆరోగ్య సమస్యలు; దీర్ఘకాలిక వ్యాధులున్నవారి సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సహజమైన ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో కలిగే రుగ్మతలు, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వంటి వాటికి చికిత్స పొందే తాహతు పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా తక్కువ మందికే ఉంది. అందుకే ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయింది. మాటలతో మానసిక భరోసా, అవసరమైన వరకే మందులతో వైద్యం చేసే పరిస్థితి ప్యామిలీ డాక్టర్ విధానంలో ఉంటుంది. నిజంగా ఇది ‘కారుచీకటిలో కాంతి పుంజం’ వంటిదని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఆవిష్కరణ మన రాష్ట్రానికే కాదు దేశానికే, ఆదర్శం, హర్షణీయం. ఇదేదో ప్రభుత్వ ఆకర్షణీయ పథకం అనుకుంటే పొరపాటే! ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్య స్థితిగతుల గురించిన సమాచారాన్ని సేకరించి... తగిన విధంగా వైద్య సేవలను అందచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపక రిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వాలంటరీ వ్యవస్థ, నూతన విద్యా విధానాల వైపు దేశం యావత్తూ ఆసక్తికరంగా చూస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీసుకువస్తున్న ‘ఫ్యామిలీ డాక్టర్స్’ విధానం మరింతగా దేశ ప్రజలను ఆకర్షించి మంచి ఫలితాలు పొందడానికి మార్గదర్శకమవుతుంది. ఇంగ్లాండ్‌లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. వైద్యునికి రోగికి మధ్య సత్సంబంధాలు మెరుగుపరచటమే కాక.... సకాలంలో సరియైన రీతిలో ప్రజలకు పెద్దగా ఆర్థిక భారం లేని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. అందుకే ఈ విధానా నికి ఆహ్వానం పలుకుదాం! ఆరోగ్యకర మైన సమాజాన్ని నిర్మిద్దాం! (క్లిక్ చేయండి: మన మందులు మంచివేనా?) - అమరనాథ్ జగర్లపూడి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
నెక్ట్స్ ఎడ్యుకేషన్ నుంచి ‘నెక్ట్స్ 360’
హైదరాబాద్: విద్యా సంబంధిత సాస్ కంపెనీ నెక్ట్స్ ఎడ్యుకేషన్.. ‘నెక్ట్స్ 360’ను ఆవిష్కరించింది. ఇది సమగ్ర విద్యా కార్యక్రమమని, విద్యార్థుల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ఆడియో విజువల్స్, యాక్టివిటీలు, పాఠ్య ప్రణాళికలు, కరిక్యులమ్ ఉంటుందని పేర్కొంది. అలాగే, నెక్ట్స్ 360 విద్యా సంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులతో సంప్రదింపులు, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, హాజరు నమోదు, రిపోర్ట్ కార్డ్ జారీ, అడ్మిషన్లు, ఫీజుల నిర్వహణ తదితర సేవలను దీని ద్వారా నిర్వహించుకోవచ్చు. రెండు వేలకు పైగా పాఠశాలలు, పది లక్షల మంది విద్యార్థులు, 50వేల మంది టీచర్లను చేరుకోవాలని అనుకుంటున్నట్టు నెక్ట్స్ ఎడ్యుకేషన్ తెలిపింది. -
లంకలో ఉపశమన కార్యక్రమాలకు శ్రీకారం!... : విక్రమసింఘే
Sri Lanka Acting President To Implement Urgent Food: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్ధనే ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆందోళకారుల ఆగ్రహావేశాలు చల్లరే దిశగా ప్రజలకు సత్వరమే సాయం అందించడం పై రణిల్ దృష్టి సారించారు. మొదటగా ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ అత్యవసర సహాయ కార్యక్రమాలను అమలు చేయాలని రణిల్ నిర్ణయించారు. ఈ సహాయ కార్యక్రమాల ద్వారా ముందుగా ఇంధనం, గ్యాస్, కనీస ఆహర పదార్థాలను అందిచాలని సూచించారు. ఈ మేరకు రణిల్ జులై16న పార్లమెంట్ సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఆగస్టులో సమర్పించే రిలీప్ బడ్జెట్లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. తొలుత ఆహార భద్రత కార్యక్రం అమలును వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడం పై దృష్టి సారించారు. మరోవైపు వ్యాపారవేత్తలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలను నిర్వహించేలా వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న ప్రణాళిక శాంతియుత నిరసకారుల కారుల కారణంగా తీసుకున్న గొప్ప ప్రణాళికగా పేరుగాంచుతుందన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని రణిల్ అన్నారు. ఐతే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదిలావుండగా మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేలను కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: శ్రీలంకలో ఇంధన పాస్‌లకు శ్రీకారం.. రేషన్‌పై పెట్రోల్ పంపిణీ!) -
Asani Cyclone Effect: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసని తుఫాన్ వల్ల సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ -
దేశానికే దిశ నిర్ధేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మహిళలకు రక్షణ కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ‘దిశ’ నిర్దేశం చేశారని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నా రు. ఏపీ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ది శ యాప్ అమలుచేసే దిశగా అడుగు వేస్తున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలోని సన్‌రైజ్ హోటల్లో దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ మెగా డ్రైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జీఆర్ రాధిక అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా దిశ యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతను లఘు చిత్రం ద్వారా చూపించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దిశ యాప్ ద్వారా యువతులు నిర్భయంగా ఉండవచ్చని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్‌పై విద్యార్థినులు ఇంటి చుట్టుపక్కల వా రికి అవగాహన కల్పించాలని సూ చించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి మహిళాలోకం జేజేలు పలుకుతోందన్నారు. ఈ యాప్ ద్వారా రానున్న రో జుల్లో నేరాల సంఖ్య తగ్గతుందన్నారు. కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ఏపీలో అడుగులు పడుతున్నాయని తెలిపారు. దిశ ఓ రక్షణ కవచం మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మహిళల భద్రతపై ఎస్పీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చు ట్టడం చాలా గొప్ప విషయమన్నారు. దిశ యాప్ అనేది ఒక రక్షణ కవచమని తెలిపారు. దిశ యాప్ ద్వారా ఢిల్లీలో ఆపదలో ఉన్న ఓ మహిళను సురక్షి తంగా కాపాడారని గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్, దిశ వాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మీ వెంటే ఉంటుంది.. జాయింట్ కలెక్టర్ విజయసునీత మాట్లాడుతూ అక్క, అన్న అనుక్షణం మీతో ఉండలేకపోవచ్చని, దిశ యాప్ ప్రతి క్షణం మీ వెంటనే ఉంటుందని తెలిపారు. యాప్ ఉంటే పోలీసు రక్షణ ఉన్నట్టేనన్నారు. పాట అదుర్స్.. ప్రత్యేక ఆహ్వానితుడు, గాయకుడు, ఇండియన్ ఐడ ల్ విజేత రేవంత్ దిశ యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి పాడిన పాట అందరికీ ఆకట్టుకుంది. తన సొంత ఊరిలో ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. మ నపై మనం నమ్మకం పెట్టుకోవాలన్నారు. అనంతరం దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ చేపట్టి పెద్దఎత్తున దిశ యాప్‌లు రిజిస్ట్రేషన్ చేయించారు. యాప్ అందరికీ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ దిశ యాప్ ను ఆడ, మగ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దిశ యాప్ ఎస్ఓఎస్ బటన్ నొక్కి షేక్ చేస్తే పోలీసు వారికి సమాచారం చేరి తక్షణమే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి నైనా జైస్వాల్, ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్, జేసీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ∙ఈ సందర్భంగా నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి నిర్వహించి షార్ట్‌ఫిల్మ్‌ల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు శ్రీకాకుళం వాసి జర్నలిస్ట్ డోల అప్పన, డాక్టర్ మాదిన ప్రసాదరావు టీమ్‌కు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు కాశీబుగ్గ వాసి బోనెల గోపాలరావులకు మంత్రి చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వరరావు, పి.సోమశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్, డీఎస్పీ ఎం.మహేంద్ర, శివరామి రెడ్డి, జి.శ్రీనివాసరావు, ప్రసాద రావు, సీఐ ఈశ్వర్ ప్రసాద్ అంబేడ్కర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దిశ గొప్ప వరం సమాజంలో స్త్రీ శక్తిని పెంపొందించడానికి దిశ గొప్ప వరం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి మానవతావాదిగా నిరూపించుకున్నారు. దిశ అనేది మహిళల రక్షణకు కేంద్ర బిందువులాంటి ఆయుధం. – నైనా జైస్వాల్, క్రీడాకారిణి నాన్నలా రక్షణ దిశ యాప్ ఓ అన్నలా, నాన్నలా, అమ్మలా మహిళకు భద్రత ఇస్తుంది. ఈ యాప్ ఉంటే తల్లిదండ్రులు నిర్భయంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్ మొదటి ప్రాధాన్యత జిల్లాలో ప్రతి మహిళ భద్రతకు పోలీసు శాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పో లీసుల సాయం పొందాలి. స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోదు. దిశ యాప్ ఉంటేనే స్మార్ట్. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ వివరాలను గోప్యంగా ఉంటాయి. పురుషు లు కూడా యాప్‌ను వినియోగించాలి. – జీఆర్ రాధిక, ఎస్పీ -
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
-
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనబాట కార్యక్రమం
-
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’