public interest litigation (PIL)
-
Lok sabha elections 2024: ఉచిత వాగ్దానాలపై పిల్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఈ ఉచిత తాయిలాల ప్రకటనలు, వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి’ అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్‌ను దాఖలుచేశారు. ఈయన తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టులో వాదించారు. ‘ ఉచిత వాగ్దానాలిచ్చే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి, ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభింపజేయాలి’ అని కోరారు. ‘ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారిస్తాం. ఏ తేదీన విచారించాలన్న దానిపై గురువారం బోర్డ్‌లో చర్చిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ఉచితాలపై పిల్ దాఖలవడం గమనార్హం. ‘‘ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలు ప్రకటించడంతో ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో ప్రభావితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. పోటీ పార్టీల విజయావకాశాలనూ ఇవి దెబ్బతీస్తాయి. పారదర్శకమైన ఎన్నికల క్రతువుకు ఇది విఘతం. ఉచితాలు ప్రజాస్వామ్య విలువల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ‘‘ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఈ ఉచితాలు ఒక రకంగా ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటిదే. అధికార పార్టీ మళ్లీ అధికారంలో కొనసాగడానికి ఇది ఒక మార్గంలా పనికొస్తోంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టాల్సిందే. ఇందులోభాగంగా ఎన్నికల గుర్తుల(రిజర్వేషన్, అలాట్మెంట్) ఉత్తర్వు, 1968లోని సంబంధిత పేరాలో అదనపు షరతులను ఈసీ జతచేయాలి. ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుక ఉచితాల వాగ్దానాలు చేయొద్దని పార్టీలకు షరతు విధించాలి’ అని పిటిషనర్ కోర్టును కోరారు. -
‘మా పార్కును కాపాడండి ప్లీజ్’
హైదరాబాద్, సాక్షి: నిత్యం తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ కొందరు చిన్నారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్లు లేఖ రాశారు. దీంతో లేఖను సుమోటోగా తీసుకుని.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది హైకోర్టు. హైకోర్టుకు చిన్నారుల లేఖ ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారంటూ 23 మంది చిన్నారులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రోజూ తాము ఆడుకునే పార్క్‌ను ఎలాగైనా కాపాడాలంటూ లేఖలో సీజేను కోరారు. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని సీఎస్, జిల్లా కలెక్టర్, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది. స్థలం సంగతేంటీ? అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిల్లలు అడుకునేందుకు 1.5 ఎకరాల పార్క్ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి పార్క్ నిర్మాణం చేపట్టింది. ఈ స్థలం కబ్జా చేస్తున్నారని 2022 సంవత్సరం ఫిబ్రవరిలో కౌన్సిలర్ అంబకంటి అశోక్ అప్పటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పట్లో నిర్మాణం ఆగిపోయింది. దాని తర్వాత కూడా అధికారులు పార్కు అభివృద్ధి విషయంలో చర్యలు చేపట్టలేదు. దీంతో కొందరు మళ్ళీ ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. దీనిపై తిరిగి కౌన్సిలర్, కాలనీవాసులతో కలిసి కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. పెద్దల వల్ల కానిది పిల్లలు.! ఇదే కాలనీకి చెందిన 23 మంది పిల్లలు.. పార్కును కాపాడాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 2023లో లెటర్ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించడమే కాకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ యంత్రాంగాన్ని అడిగారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందని, ఈ భూమిని కాపాడి పార్కును నిర్మించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖలో చిన్నారులో కోరారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కమిషనర్ శైలజ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాము ఆడుకునే పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ జిల్లా ,కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆక్రమణల కట్టడికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 7 కు తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. -
ఉచిత ప్రయాణంపై పిల్.. ప్రయోజనం లేదన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్ దాఖలు చేసిన పిటీషన్లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్..హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది. ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్‌పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట -
మేం జోక్యం చేసుకోం.. పిల్ కొట్టివేత
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియెట్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు. మే 18వ తేదీన లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసిన ఒక ప్రకటనతో పాటు లోక్‌సభ స్పీకర్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఇచ్చిన ఆహ్వానం.. రాష్ట్రపతిని అవమానించడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ అడ్వొకేట్ జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం వెకేషన్ బెంచ్ పరిశీలనకు తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ఉల్లంఘన(పార్లమెంటు రాజ్యాంగాన్ని వివరించేక్రమంలో.. ఉభయ సభలకు రాష్ట్రపతి ప్రతినిధిగా ఉంటారని వివరిస్తుంది) కిందకు ఎలా వస్తుందని, ఒక న్యాయవాదిగా అది రుజువు చేయాలని జస్టిస్ జేకే మహేశ్వరి కోరారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందునా.. ఫైన్ విధిస్తామని సున్నితంగా మరో జస్టిస్ నరసింహ సున్నితంగా హెచ్చరించారు. ఈ తరుణంలో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకే మొగ్గు చూపించారు. -
సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. సుప్రీం ఘాటు స్పందన
న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్ కొట్టేశారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్షిప్లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. అయితే.. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో పిటిషన్ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో కేంద్రం తరపు నుంచి లివింగ్ రిలేషన్‌షిప్‌లపై రిజిస్ట్రేషన్, గైడ్‌లైన్స్‌ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది. ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం సీరియస్! -
పీరియడ్ లీవ్స్ కొరకు పిల్.. తిరస్కరణ
ఢిల్లీ: విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో ఋతుస్రావ సమయంలో.. సెలవులు మంజూరుచేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది తమ పరిధిలోని అంశం కాదంటూనే.. పిటిషనర్‌కు కీలక సూచన చేసింది ధర్మాసనం. ఇది మా పరిధిలోని అంశం కాదు. విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. కాబట్టి, పిటిషనర్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించడం సముచితంగా ఉంటుంది అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి నెలా మహిళా ఉద్యోగులకు ఋతు నొప్పి సెలవులు(పీరియడ్స్ లీవ్) మంజూరు చేయాలని కంపెనీలు/యజమానులపై ఒత్తిడి చేస్తే.. అది ఉద్యోగ నియామకాల్లో తీవ్ర ప్రభావం చూపెడుతుందని పిల్‌ను వ్యతిరేకించిన న్యాయవాది(లా స్టూడెంట్ ఒకరు) బెంచ్ ముందు వాదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిల్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా పిటిషనర్ కొన్ని కీలకాంశాలను లేవనెత్తారని.. కాకపోతే ఇది విధానాల రూపకల్పనకు సంబంధించి కావడంతో.. పిల్‌పై విచారణ ముందుకు సాగించలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి.. లాయర్ విశాల్ తివారీ ద్వారా ఈ పిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అన్ని రాష్ట్రాలు పాటించేలా కేంద్రం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని పిటిషనర్ కోరారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, స్పెయిన్(మూడు రోజులు.. వీలును బట్టి ఐదు రోజులకు కూడా పొడిగించొచ్చు), జాంబియా.. ఇలా చాలా దేశాల్లో పీరియడ్స్ లీవ్‌లను మంజూర చేస్తున్నారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961 ప్రకారం.. మహిళలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పెయిడ్ లీవ్ పొందే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి గర్భం దాల్చిన సమయంలో. అందునా.. ఆ నిబంధనల పర్యవేక్షణ కోసం సెక్షన్ 14 ప్రకారం ఒక ఇన్స్పెక్టర్ నియమించాల్సి ఉంటుంది కూడా. అయితే.. కేంద్ర ప్రభుత్వం అలాంటి పర్యవేక్షకులను ఇంతదాకా నియమించలేదు అని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాదు దేశంలో బీహార్ రాష్ట్రం మాత్రమే 1992 నుంచి రుతుస్రావ సమయంలో ప్రత్యేక సెలవులను రెండురోజులపాటు మంజూరు చేస్తూ వస్తోందని సదరు పిటిషనర్ బెంచ్‌కు తెలిపారు. అలాగే జొమాటో, బైజూస్, స్విగ్గీ కూడా పెయిడ్ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వికిపీడియా సమాచారం ప్రకారం.. కేరళ ప్రాంతంలో 1912 సంవత్సరంలో ఓ బాలికల పాఠశాలకు పీరియడ్స్ లీవ్స్ మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అంతేకాదు.. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కూడా. -
ప్రతీ దానికి పిల్ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతీ దానికీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడమేనా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికిలేని అభ్యంతరం మీకెందుకని రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకొచ్చారని అడిగింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించుకోవాలని ఆయనకు స్పష్టంచేసింది. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. ప్రతీ వ్యవహారంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీఓ–388ని ప్రభుత్వం అమలుచేయడంలేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2017లో జారీచేసిన జీఓ ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. అయితే.. ఈ జీఓను అమలుచేయకుండా ప్రభుత్వం కొత్త జీఓ జారీచేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని నిలదీసింది. ప్రతీ దానికి ఇలా పిల్ దాఖలు చేయడమేనా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. -
‘పిల్’లతో కాలహరణం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్‌లో ఉన్న కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఏఎం ఖని్వల్కర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. -
‘జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం’.. అభ్యంతరం ఏమీ లేదు
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం విషయంలో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చట్టం పేరులో జ్యుడిషియల్ అని ఉన్నంత మాత్రాన, అది కోర్టులు నిర్వర్తించే విధులు నిర్వర్తిస్తున్నట్లు కాదని స్పష్టంచేసింది. పేరులో జ్యుడిషియల్ అని ఉండ టం వల్ల వచ్చిన నష్టం ఏముందని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే న్యాయశాఖ ఉండగా.. ఆ శాఖను కాదని, జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం కింద ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి సలహాలు తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ తిరుపతికి చెందిన వ్యాపారి యల్లపల్లి విద్యాసాగర్ గతేడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలో ఎక్కడా జ్యుడిషియల్ ప్రివ్యూ అన్న పదమే లేదన్నారు. జ్యుడిషియల్ రివ్యూ ఉందని, దీనిపై పూర్తిగా న్యాయస్థానాలకే అధికారం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పేరులో జ్యుడిషియల్ అని ఉన్నంత మాత్రాన ఆ చట్టం కింద ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి కోర్టు విధులను నిర్వర్తించరని గుర్తు చేసింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదంది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్ల ప్రక్రియను ఈ జ్యుడిషియల్ ప్రివ్యూ పరిశీలిస్తుందన్నారు. టెండర్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇందులో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు లేవని తెలిపారు. -
రాజు ఆత్మహత్య.. హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి,హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాజు మృతిపై అనుమానాలు ఉన్నాయని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థిస్తూ.. లంచ్ మోషన్ పిటిషయన్ దాఖలు చేశారు. మధ్యాహ్నాం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. (చదవండి: రాజు... నేరచరితుడే! ) చిన్నారి హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపినట్లయితే.. రూ.10లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. (చదవండి: ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్) కాగా.. రాజు ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడో రాజును పట్టుకుని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: సైదాబాద్ నిందితుడి కదలికలు: సింగరేణి కాలనీ టు నష్కల్ -
‘గురుకుల’ పోస్టులపై పిల్.. పార్ట్‌టైమ్ ట్యూటర్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓ పార్ట్‌టైమ్ ట్యూటర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ గత ఏప్రిల్‌లో వినతిపత్రం ఇచ్చి కనీసం నాలుగు వారాల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే పిల్ దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. పార్ట్‌టైమ్ ట్యూటర్‌గా ఉంటూ అధ్యాపకుల నియామకాలు చేయాలని కోరుతూ పిల్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. గురుకుల పోస్టులకు దరఖాస్తు చేయనంటూ అఫిడవిట్ సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.మధు ఈ పిల్ దాఖలు చేశారు. -
అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించిన ప్రవాసి సంఘం
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జారీ చేసిన రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్లు రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసం, విచిత్రం, అహేతుకం, జీవించే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే విధంగా ఉన్నందున ప్రేరేపించబడి జారీచేయబడ్డ ఆ సర్కులర్లను చెల్లుబాటు లేనివిగా (క్వాష్) ప్రకటించాలని పిటిషనర్ భీంరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డిల ధర్మాసనం కేసును గురువారం విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి కేసు వాదించారు. భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి, హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం 29 జులై కి వాయిదా వేశారు. ఇలాంటి మరొక కేసును కలిపి విచారించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ తగ్గించిన కనీస వేతనాల వలన గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం పడుతుందని, వారు మరింత పేదరికంలోకి జారిపోనున్నారన్నారు. గత మూడు నెలలుగా గల్ఫ్ కార్మిక సంఘాలు పాత వేతనాలను కొనసాగించాలని, కనీస వేతనాలను తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్లను రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎంపీలు, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారని, కేంద్రం ఈ విషయాన్ని మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2020 లో సర్క్యులర్ల జారీ కంటే ముందు... బహ్రెయిన్ లో కనీస వేతనాలు హెల్పర్ కు 318 డాలర్లు, ఫోర్మాన్ కు 662 డాలర్లు, ఒమాన్ లో క్లినర్ కు 208 డాలర్లు, ఫోర్మాన్ కు 520 డాలర్లు, యుఏఇ లో క్లినర్ కు 259 డాలర్లు, హెవీ డ్రైవర్‌కు 637 డాలర్లు కనీస వేతనాలుగా ఉండేవి. అందరినీ ఒకేగాటన కట్టి అన్ని వృత్తులకు, అన్ని కేటగిరీల కార్మికులకు కనీస వేతనం 200 డాలర్లుగా తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేశారు. ఖతార్‌లో పనిచేసే అన్ని దేశాల కార్మికులకు ఎలాంటి వివక్ష లేకుండా కనీస వేతనం 1,000 రియాళ్ళు, అకామడేషన్ (వసతి)కి 500 రియాళ్ళు, భోజనానికి 300 రియాళ్ళు చెల్లించాలనే చట్టం 20 మార్చి 2021 నుండి అమలులోకి వచ్చింది. భారత ప్రభుత్వం మాత్రం తమ కార్మికులను 728 రియాళ్ళ కనీస వేతనానికి పంపిస్తామని సర్కులర్లు జారీ చేయడం ఆశ్చర్యకరమని మంద భీంరెడ్డి అన్నారు. తగ్గించిన వేతనాలతో గల్ఫ్ దేశాలలో కనీస జీవన ప్రమాణాలను కొనసాగించడం కష్టమని, సర్క్యులర్లత జారీ కంటే ముందు ఉన్న వేతనాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. చదవండి: నాడు-నేడుకి తానా ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళం ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ -
సలాం కేసులో కౌంటర్లకు ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐని ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ (ఐయూఎంఎల్‌పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదన్నారు. అందువల్ల సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, తమ జోక్యం అవసరంలేదని స్పష్టంచేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఇటీవల పోలీసులపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. సీబీఐకి హైకోర్టులో న్యాయవాది లేకపోతే ఎలా? సీబీఐ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు పూర్తిస్థాయి న్యాయవాది(స్టాండింగ్ కౌన్సిల్) లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని వెంటనే సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర న్యాయ శాఖకు తెలియచేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్‌కు సూచించింది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కౌంటర్ దాఖలుకు సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెన్నకేశవులు మూడు వారాల గడువు కోరడంతో ఏ హోదాలో హాజరవుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో ప్రత్యేకంగా స్టాండింగ్ కౌన్సిల్ ఉండాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరు కావడానికి వీల్లేదని పేర్కొంది. -
బిల్డర్ల మోసాల నుంచి రక్షణ కల్పించాలి
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు బిల్డర్లు, ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్రం నమూనా ఒప్పందాలను సిద్ధం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ ‘మోడల్ బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్’, ‘మోడల్ ఏజెంట్, బయ్యర్ అగ్రిమెంట్’లను అమలయ్యేలా చూడాలని కూడా బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తన పిల్లో కోరారు. ప్రమోటర్లు, బిల్డర్లు, ఏజెంట్లూ ఏకపక్షమైన ఒప్పందాలను ఉపయోగిస్తూంటారని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసి భవనాలను కొనుగోలుదార్లకు అందించడంలో విపరీతమైన జాప్యం చేయడం, వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఇప్పటికే చాలాసార్లు జరిగాయనీ, ఏకపక్ష ఒప్పందాల్లోని నిబంధనలను సాకుగా చూపుతున్నారని అశ్విని కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘బిల్డర్లు డెలివరీ షెడ్యూల్‌ను పదే పదే జారీ చేస్తూంటారు. అనైతికమైన, ఏకపక్షమైన వ్యాపార కార్యకలాపాలు చేస్తూంటారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఫ్రాడ్, మోసం, విశ్వాస ఘాతుకం, నిజాయితీ లేకపోవడం, కార్పొరేట్ చట్టాల ఉల్లంఘన, భవనాల విషయంలో అవకతవకలు జరుగుతూంటాయి’’అని వివరించారు. ఈ చర్యలన్నింటి వల్ల వినియోగదారులు మానసిక, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని, అంతేకాకుండా తాము జీవించే, జీవనోపాధి హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే సాఫ్ట్ లాంచ్ చేయడం చట్టాన్ని నేరుగా అతిక్రమించడమేనని ఆరోపించారు. విక్రయానికి ముందుగా నియంత్రణ సంస్థల వద్ద ఆ ప్రాజెక్టును నమోదు చేయడం అవసరమని, బిల్డర్ వద్ద అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కూడా ఈ పిటిషన్లో కోరారు. -
ప్రజాహితం కావవి.. ప్రచారం కోసం వేసే వ్యాజ్యాలు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) ప్రచార ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని హైకోర్టు సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పత్రికల్లో వచ్చే కథనాల క్లిప్పింగులను జత చేసి, వాటి ఆధారంగా పిటిషన్లు వేస్తూ.. వాటినే పిల్లంటున్నారని తెలిపింది. ఇలా ఓ పిల్ దాఖలు చేసి, మరుసటి రోజు పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని తాము రోజూ చూస్తున్నామంది. హైకోర్టు ఉన్నది ఇలాంటి వ్యాజ్యాలను విచారించేందుకు కాదని తేల్చిచెప్పింది. ► గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. ఓసారి పరిహారం తీసుకున్నాక గ్రామాలను ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ► పరిహారం తీసుకుని కూడా గ్రామాలను ఖాళీ చేయబోమంటే దాని అర్థమేంటని ప్రశ్నించింది. ► 2011లోనే నిర్వాసితులకు పరిహారం చెల్లించామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ► తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది. ► ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ► గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ, మరికొందరు పిల్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ► సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి, మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. 90 శాతానికి పైగా పిల్లు కేవలం ప్రచార ప్రయోజన వ్యాజ్యాలేనని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ► 2011లోనే పరిహారం చెల్లించామని, దీన్ని తీసుకున్న వ్యక్తులు సైతం ఆ తర్వాత పునరావాస కేంద్రాల వద్ద సిమెంట్ రోడ్డు కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని జగన్మోహన్రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ► పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్.. తాము పత్రికా కథనాల ఆధారంగా పిల్ వేయలేదన్నారు. ► దీనికి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ.. ‘ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు పత్రికల్లో కథనం వచ్చింది. ఓ పత్రికలో స్వయంగా చదివాను’ అని స్పష్టం చేయడంతో అజయ్‌కుమార్ మౌనం వహించారు. ► ఈ సమయంలో సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఈ పిల్ల్లో ‘ఇంటర్వీనర్స్’గా చేరాలని భావిస్తున్నామని తెలిపారు. ► ఈ వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూనా? సమర్థిస్తూనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ► సమర్థిస్తున్నామని వీరారెడ్డి చెప్పగా.. అయితే ఇంటర్వీనర్గా చేరే బదులు వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని, సాధారణంగా ఇంటర్వీనర్స్గా చేరే వ్యక్తులు పిటిషన్లను వ్యతిరేకిస్తారని ధర్మాసనం తెలిపింది. -
గండికోట పరిహారంపై అన్ని వ్యాజ్యాలను కలిపి విచారిస్తాం
సాక్షి, అమరావతి: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదంటూ ఓ రాజకీయ నాయకుడు దాఖలు చేసిన వ్యాజ్యం ఓ వైపు.. ప్రభుత్వం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిందని, ఇక్కడ సీసీ రోడ్లకు బదులు మట్టి రోడ్లు వేస్తున్నారంటూ పరిహారం తీసుకున్న వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యం మరో వైపు ఉండటంతో ఈ రెండిటిని కలిపి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. పరిహారం విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి, రెండు రోజుల పాటు గండికోట రిజర్వాయర్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసి, అక్కడి ప్రజల ప్రాణాల రక్షణ కోసం చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేసింది. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు కూడా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ రాకేశ్ ధర్మాసనం విచారణ జరిపింది. -
కోర్టుకొచ్చే ముందు ‘డిమాండ్ ఆఫ్ జస్టిస్’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా, ప్రభుత్వానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తుండటం ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్న నేపథ్యంలో.. దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టే దిశగా రాష్ట్ర హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వానికి ఫలానా అంశంపై నిర్ధిష్టమైన ఆదేశం (మాండమస్) ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ముందు పిటిషనర్ ఆ అంశంపై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి ‘న్యాయాన్ని డిమాండ్’ (డిమాండ్ ఆఫ్ జస్టిస్) చేయడం తప్పనిసరని హైకోర్టు పేర్కొంది అలా న్యాయాన్ని డిమాండ్ చేయకుండా నేరుగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) అయినప్పటికీ దానిని విచారించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇలా న్యాయాన్ని డిమాండ్ చేయకుండా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు మళ్లించిందని.. దీనిపై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ బట్టు దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఆక్షేపించిన ధర్మాసనం కేంద్ర నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దారి మళ్లించిందని, దీనిపై విచారణకు ఆదేశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన జి.శరత్‌రెడ్డి గత ఏడాది జూన్‌లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారించింది. నిధుల మళ్లింపు విషయంలో పిటిషనర్ సరైన వివరాలు సమర్పించలేదని.. అంతేకాక, ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ శరత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వినతిపత్రం ఇవ్వకపోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రభుత్వానికి ఫలానా ఆదేశం ఇవ్వండని న్యాయస్థానాలను ఆశ్రయించే ముందు.. ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను ‘డిమాండ్ ఆఫ్ జస్టిస్’ కోరడం తప్పనిసరి ధర్మాసనం స్పష్టంచేస్తూ శరత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
బినామీలు న్యాయస్థానాలకు వస్తున్నారు
సాక్షి, అమరావతి: సదుద్దేశం లేకుండా దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రాథమిక దశలోనే కొట్టి వేయాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు విన్నవించారు. ఇటీవల నాయకుల ఆత్మలు, బినామీలు ఓ పక్కా ప్రణాళికతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు అందరితో సమానంగా ప్రకటనలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న పిటిషనర్ కిలారు నాగ శ్రవణ్ పలు కీలక అంశాలను తొక్కిపెట్టి వ్యాజ్యం దాఖలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. వివరాలు వెల్లడిస్తే విషయం తెలుస్తుంది: ఏజీ ► 2014–19 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలు, మిగిలిన పత్రికలకు ఇచ్చిన ప్రకటనల వివరాల గురించి పిటిషనర్ మాట్లాడటం లేదు. ఆ వివరాలు ప్రస్తావించి ఉంటే అసలు విషయం తెలిసేది. అర్థ సత్యాలను మాత్రమే కోర్టు ముందుంచారు. ► పిటిషనర్‌కు టీడీపీతో ఎంతో అనుబంధం ఉందనేది అందరికీ తెలుసు. ► పిటిషనర్ తన రాజకీయ మార్గదర్శి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి డిజిటల్ మహానాడు నిర్వహించారు. సుప్రీం తీర్పునకు విరుద్ధం: పిటిషనర్ న్యాయవాది ► పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ నాగ శ్రవణ్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫోటోను పెద్దగా వాడుతున్నారని, ముఖ్యమంత్రి తండ్రి ఫోటోను కూడా వాడుతున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రకటనల్లో పార్టీ రంగులను వాడుతున్నారని, సాక్షి పత్రికకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని, సర్క్యులేషనే లేని ప్రజాశక్తి, ఆంధ్రప్రభలకు సైతం ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని పేర్కొన్నారు. అభ్యంతరాల దాఖలుకు అనుమతి.. ► ఈ వ్యాజ్యం విచారణార్హతపై ప్రాథమిక అభ్యంతరాలు దాఖలు చేస్తామని ఏజీ పేర్కొనడంతో హైకోర్టు అందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. (అడ్మిషన్ రద్దు చేసుకుంటే ఫీజు వాపసు ఇవ్వాల్సిందే) -
నాలుగు ముక్కలతో ‘పిల్’లా?
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రచార వ్యాజ్యాలను దాఖలు చేసే పిటిషనర్లు హైకోర్టును స్వర్గధామంలా భావిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వ్యాజ్యాల ద్వారా వారంతా ప్రభుత్వాన్ని నడపాలని, శాసించాలని ఉబలాటపడుతున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పేదలకు ఇళ్ల పథకం కింద మైనింగ్ భూములు కేటాయిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పొన్నవోలు పలు అంశాలను ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో పేదలకు శాశ్వత గృహ కల్పన లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుత కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని కోర్టుకు నివేదించారు. వీరి లక్ష్యమంతా ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రజలకు దగ్గర కాకుండా చేయడమేనన్నారు. న్యాయస్థానాలను మభ్యపెట్టే యత్నాలు.. ►ప్రకాశం జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి మక్కెన తిరుపతిస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన కుమారుడు మక్కెన శ్రీనివాసులు పిల్ దాఖలు చేశారు. తిరుపతిస్వామి పిటిషన్లో తన వయసును 50 సంవత్సరాలుగా పేర్కొంటే శ్రీనివాసులు తన వయసును 51 ఏళ్లుగా చూపారన్నారు. అంటే తండ్రి కంటే కుమారుడి వయసే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం 30 చట్టాలను ఉల్లంఘించిందని పిల్లో పేర్కొన్న పిటిషనర్, ఎలా ఉల్లంఘించిందో మాత్రం ఎక్కడా చెప్పలేదు. ►ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిందంటూ రకరకాల ఆరోపణలుతో నాలుగు ముక్కలు రాసేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో పిటిషన్లు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడిందో ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు. ►ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఏకైక ఎజెండా, జెండాతోనే వీరంతా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అసంతృప్త, అరాచక శక్తులను ఆదిలోనే అణచివేయాలి. లేనిపక్షంలో న్యాయవ్యవస్థకు పెనుముప్పుగా మారతారు. ►దీనిపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. ముందు జీతభత్యాలు నిర్ణయించండి తర్వాత పోస్టులు నోటిఫై చేయండి వినియోగదారుల కమిషన్ పోస్టుల భర్తీపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్ట నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ముందు చైర్మన్, సభ్యుల జీతభత్యాలను నిర్ణయించి, అనంతరం పోస్టులను నోటిఫై చేయాలని సూచించింది. ఆ తర్వాతే దరఖాస్తులను ఆహ్వానించి, అంతిమంగా వాటిని సెలక్షన్ కమిటీ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నెల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. వినియోగదారుల ఫోరంలలో పై పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అజయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులను ప్రభుత్వం సంతోషంగా స్వీకరించ లేకపోతోంది హైకోర్టుకు రిజిస్ట్రార్ జనరల్ నివేదన హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా స్వీకరించలేకపోతోందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్.భానుమతి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టులో కోవిడ్‌ను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బీసీ సంఘం అధ్యక్షుడి హోదాలో వి.ఈశ్వరయ్య రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రికి ఫిర్యాదులు చేశారని తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌గా నియమించిందన్నారు. ఇప్పుడు హైకోర్టును రెడ్ జోన్‌గా ప్రకటించాలని కోరుతూ పిల్ దాఖలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా ఈశ్వరయ్య చేసిన ఆరోపణలనే తన పిటిషన్లో పేర్కొందని తెలిపారు. పిల్‌ను విచారణకు తీసుకోవాలా? వద్దా అన్న అంశంపై ఉత్తర్వులిస్తామని ధర్మాసనం వెల్లడించింది. -
ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
పిల్ ముసుగులో రాజకీయాలు
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ముసుగు వేసుకుని రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకుంటున్నారని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యాలను ఉపేక్షించరాదన్నారు. పిల్ దాఖలు చేసి ప్రభుత్వం నిధులను ఎలా ఖర్చు చేయాలో కూడా నిర్దేశిస్తున్నారంటే, పరిస్థితి ఎక్కడ వరకు వచ్చిందో కోర్టులు గమనించాలని కోరారు. ఇటువంటి వ్యాజ్యాలను అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. భూముల విక్రయాలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పొన్నవోలు వాదనలు వినిపించారు. సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం భూములను విక్రయిస్తుంటే, వాటిని అడ్డుకునేందుకు విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు, గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ వ్యాజ్యాలు వేశారని, అసలు ఈ వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు వీరికి ఉన్న అర్హత ఏమిటో న్యాయస్థానం విచారించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించిందని, కౌంటర్ దాఖలుకు విచారణను గురువారానికి వాయిదా వేసిందని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, భూముల విక్రయంపై తాజాగా దాఖలైన వ్యాజ్యాలను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హిమబిందు, శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది. శైలజ తరఫున న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు, హిమబిందు తరఫున న్యాయవాది బి.నళిన్‌కుమార్ వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ఇదే అంశంపై జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో దీనిని కూడా అదే ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
కుల,మత వివరాల్లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: జన ధ్రువీకరణపత్రంలో కుల,మత వివరాలు లేకుండా జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం నాచారం గ్రామానికి చెందిన జర్నలిస్టు సందేపు స్వరూప, ఎ.డేవిడ్‌లు దాఖలు చేసిన పిల్లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జనన, మరణ ధ్రువీకరణ అధికారి, కొత్తకోట మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు కుల,మతాలకు అతీతంగా ఇష్టపడి వివాహం చేసుకున్నారని, వారి కుమారుడు ఇవాన్ రూడే జనన పత్రంలో కులమత వివరాలు లేకుండా జారీ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు ఎస్.వెంకన్న, డి.సురేశ్‌కుమార్‌లు వాదించారు. గతేడాది మార్చి 23న వారికి కుమారుడు పుడితే ఇప్పటి వరకూ జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదన్నారు. తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎం.స్నేహ గతంలో ఇదే తరహాలో చేసిన ప్రయత్నాలు ఫలించాయని, స్థానిక కలెక్టర్ ఆమెకు కుల,మత వివరాలు లేకుండా «సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డి.వి. రామకృష్ణారావు, కృపాళి దంపతులు తమ కుమారుడిని స్కూల్లో చేర్చినప్పుడు ఏమతమో దరఖాస్తులో రాయాలని స్కూల్ యాజమాన్యం పట్టుబట్టిందని, చివరికి హైకోర్టు మందలించిన తర్వాత వారి కుమారుడికి స్కూల్లో సీటు లభించిందని న్యాయవాదులు తెలిపారు. కులం, మతం పట్ల నమ్మకం లేని వారి విశ్వాసాలను కూడా గౌరవించాలన్నారు. -
ధరల పెంపు కథనాలు పిల్‌గా పరిగణన
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధానికి చేపట్టిన చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అడ్డంపెట్టుకుని వ్యాపారులు కూరగాయల రేట్లను విపరీతంగా పెంచేయడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆహార, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. ఫలక్‌నూమా రైతుబజార్, మండీ, మెహదీపట్నం రైతు బజారల్లో విపరీతంగా కూరగాయల రేట్లను పెంచేశారంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. బెండకాయలను కిలో రూ.44కి అమ్మాలని బోర్డుపై ఉండగా, రూ.70కి అమ్ముతున్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. పలు కూరగాయలను భారీ రేట్లకు విక్రయిస్తున్నారని అందులో వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూరగాయల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. -
‘షికారా’ ను నిలిపి వేయాలంటూ పిటిషన్
విధూ వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ‘షికారా’ మూవీని నిలిపి వేయాలంటూ కశ్మీర్‌కు చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. షికారాకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయబడింది. 1980, 90 లలో వలస వెళ్లిన కశ్మీర్ పండితుల గురించే సాగేకథ ఆధారంగా విధు వినోద్ చోప్రా షికారా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సాదియా, ఆదిల్ ఖాన్ షికారాతోనే తెరంగేట్రం చేసయనున్నారు. కాగా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాపై కోర్టులో పిటిషన్ నమోదవడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.(సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్) ఈ విషయంపై తాజాగా విధూ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ విషయాన్ని మా లీగల్ టీం చూసుకుంటుంది. శికారా సినిమాను అడ్డుకుంటూ కొంతమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. దీనిపై ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. మా లాయర్ హరీష్ సల్వే దీని గురించి తగిన చర్యలు తీసుకుంటాడు’ అని తెలిపారు. కాగా కశ్మీర్ పండితుల గురించి అసత్యాలను చిత్రీకరించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. సినిమాను నిలిపివేయాలని, సినిమాలో ముస్లింలను చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలను తొలగించాలని కోరుతున్నట్లు పిల్ దాఖలు చేసిన వారిలో ఒకరు తెలిపారు.