Question paper leak
-
ఆన్లైన్లో నకిలీ ప్రశ్నాపత్రం.. విద్యార్థిపై సీబీఐ ఛార్జ్‌షీట్?
సాక్షి,న్యూఢిల్లీ : యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ స్కూల్ విద్యార్ధి యూజీసీ- నెట్ నకిలీ ప్రశ్నాపత్రాన్ని టెలిగ్రాంలో షేర్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. సదరు విద్యార్ధిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జూన్ 18న నిర్వహణ.. ఆ వెంటనే పరీక్ష రద్దు కేంద్ర విద్యా శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయించేందుకు యూజీసీ-నెట్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే కేంద్రం ఆ పరీక్షను జూన్ 18న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షను 11 లక్షల మంది రాశారు. అనూహ్యాంగా యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ అయ్యిందని కేంద్రానికి సమాచారం అందింది.వెంటనే ఆ మరుసటి రోజే (జూన్19) పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సత్వరమే విచారణ చేపట్టాలని కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీచేశారు. స్కూల్ విద్యార్థిపై CBI ఛార్జ్‌షీట్!దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పేపర్ లీకేజీ జరిగిందా? జరిగితే అందుకు కారకులు ఎవరనేది ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ తన దర్యాప్తులో జూన్ 18న జరిగిన పరీక్షకు సంబంధించి లీకైన ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్‌ను ఓ పాఠశాల విద్యార్థి టెలిగ్రామ్‌లో షేర్ చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. ఈ అంశంపై సదరు పాఠశాల విద్యార్ధిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుందని సమాచారం. యూజీసీ పరీక్ష కొత్త తేదీలు ఇవేకేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిద్ధమైంది. ఇప్పటికే ఆ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్సెట్ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. -
రాజ్యసభలోనూ నీట్ రగడ
న్యూఢిల్లీ: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరొకటి ఇండియన్ పేపర్ లీక్. ఒక ఐపీఎల్ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.నీట్–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్(ఎన్టీఏ)గా పలకాలి’ అని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్ నేత దిగి్వజయ్‌సింగ్ సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్ లీకేజీల్లో కోచింగ్ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్ సుమన్ అనుమానం వ్యక్తంచేశారు. -
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా,నీట్ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుందని తెలుస్తోంది. -
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్‌లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్‌లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్‌లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్‌లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
లీకు వీరులకు బ్రేక్!
దశాబ్దాలుగా దాదాపు దేశవ్యాప్త జాడ్యంగా వున్న సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం తొలి అడుగు పడింది. పోటీపరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నేరగాళ్లని తేలితే రూ. కోటి వరకూ జరిమానా, అయిదేళ్ల వరకూ శిక్ష ఉంటాయని బిల్లు చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీకుల్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టులేదు. కేంద్రం తెచ్చిన చట్టం దాని పరిధిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్టీఏ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్,నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి వర్తిస్తుంది. ఈ నమూనాలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేయాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన సూచన మంచిదే. పోటీ పరీక్షల చుట్టూ వేలాదికోట్ల వ్యాపారం నడుస్తోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలు కొన్నిటిలో తర్ఫీదిచ్చే సంస్థలు కొలువుదీరేవి. అక్కడ వేలకు వేలు ఖర్చుపెట్టిన లక్షలాదిమంది విద్యార్థులు దర్శనమిచ్చేవారు. ఈమధ్య ఇది చిన్న నగరాలకూ, పట్టణాలకూ కూడా పాకింది. సివిల్ సర్వీసులు మొదలుకొని రాష్ట్రాల్లోని సర్వీసు కమిషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్మీ, పోలీసు విభాగాలు నిర్వహించే పరీక్షల కోసం పల్లెసీమల నుంచి సైతం వేలమంది తరలివస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు సాధిస్తే జీవితాంతం చీకూ చింతా లేకుండా బతికేయొచ్చని నిరుద్యోగులు కలలు కంటున్నారు. కానీ ప్రశ్నపత్రాలతో వందలకోట్లు దండు కునే ముఠాలు ఈ కలల్ని కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల భర్తీని ప్రహసన ప్రాయం చేస్తున్నాయి. విజేతలవుతున్నవారిలో ఎవరు సచ్ఛీలురో, ఎవరు కాదో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే అంశంపై 90వ దశకంనుంచి ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలెట్టాయి. కానీ అవి ఆగిన జాడ లేదు. ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాలు లీకయినట్టు తొలిసారి 1997లో మీడియాలో కథనాలొచ్చాయి. లక్నోలోని ఒక సంస్థ ఆ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలకు 12 గంటల ముందు తమ విద్యార్థులకు ఆ ప్రశ్నలు అందించినట్టు ఆ కథనాలు తెలిపాయి. ‘ఆఖరి నిమిషం టిప్స్’ ప్రోగ్రాం మాటున తమ దగ్గరున్న 700 మందిలో వందమంది విద్యార్థుల దగ్గర అదనంగా సొమ్ము వసూలు చేసి వారిచేత బట్టీపట్టించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. మొదటిరోజున ఒక విద్యార్థి తండ్రి జేఈఈ చైర్మన్‌కు ఈ సంగతి ఫిర్యాదుచేసినా కుమారుడి వైఫల్యంపై వేదనతో ఆధారం లేని ఆరోపణ చేశారని ఆయన కొట్టిపారేశారు. తమ నిర్వాకంపై ఆయనకు అంత నమ్మకం మరి! కానీ మరుసటి రోజు మ్యాథ్స్ పేపర్‌ను ఫాక్స్ చేశాక ఆయనకు తత్వం బోధపడింది. కావాలని అక్కడక్కడ చేసిన కొద్దిపాటి మార్పులు మినహా అది తమ ప్రశ్నపత్రాన్నే పోలివుందని గ్రహించి చివరి నిమిషంలో ఆ పరీక్షను రద్దుచేశారు. ఆ లీకేజీకి అప్పటి కాన్పూర్ ఐఐటీ డైరెక్టర్‌కు వున్న పుత్రప్రేమే కారణమని కథనాలొచ్చాయి. ఆ ఏడాది రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపరీక్షపై సైతం ఇలాంటి కథనాలే వెలువడినా అది రద్దు కాలేదు. ప్రశ్నపత్రాలు కైంకర్యం చేసి కోట్లాది రూపాయలు వెనకేస్తున్న మాఫియాతోపాటు కొన్ని సందర్భాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకుండే స్వప్రయోజనాలు, అవతలివారిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశాలు కూడా ఈ లీకులకు కారణమైన ఉదంతాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ కేబినెట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు అప్పట్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుకు నైతిక బాధ్యతవహిస్తూ తప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీ ప్రముఖ నాయకుడే ఈ లీకేజ్‌కి ఒడిగట్టారని ఆయన ఆరోపించటం ఎవరూ మరిచిపోరు. ప్రశ్నపత్రాలు సంపాదించే ఉద్యోగార్థుల్లో కొందరు గప్‌చిప్‌గా ఉండక సొమ్ము చేసుకోవాలని కక్కుర్తిపడిన సందర్భాల్లో లేదా తమ సన్నిహితులకు అందజేసినప్పుడు మీడియాకు వెల్లడై చాలాసార్లు చౌర్యం బయటపడుతుంటుంది. ఇలాంటివేమీ లేనప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది. నిజాయితీపరులైన ఉద్యోగార్థులను లీకేజీ దెబ్బతీస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలవుతాం. గత అయిదేళ్లలో 15 రాష్ట్రాల్లో లక్షా నాలుగువేల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, ఇందువల్ల కోటి 40 లక్షలమంది ఉద్యోగార్థుల భవి ష్యత్తు దెబ్బతిందనీ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. ఈ లీకుల పర్యవసానంగా పరీక్ష రద్దు చేసినా, నిరవధిక వాయిదా వేసినా, పట్టించుకోకుండా వదిలేసినా దెబ్బతినేది నిరుద్యోగులే. నిరుడు తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రశ్నపత్రాల లీకు నిరుద్యోగ ప్రపంచాన్ని ఎంత కలవరపరిచిందో ఎవరూ మరిచిపోరు. అయితే లీకులకు కొన్ని సంస్థలు, వ్యకులను మాత్రమే బాధ్యులుగా చేయడంతో సరి పెట్టక రాజకీయ నాయకులు, ఏజెంట్లు, పోటీ పరీక్షల విభాగాల్లోవుండే అవినీతి అధికారులు వగైరాలతో కూడిన మాఫియా ముఠాలున్నాయని గుర్తిస్తే తాజా చట్టం మరింత కఠినతరం చేయ టానికి అవకాశం వుంటుంది. లీకు సంగతి వెల్లడికాగానే రంగప్రవేశం చేసేలా ఈడీ, సీబీఐ తరహాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పరచటంవల్ల బాధ్యులను గుర్తించటం వేగవంతమవుతుంది. ఈ కేసుల్లో నిందితుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా అవసరమే. ఇక లీకులవల్ల లబ్ధి పొందే ఉద్యోగార్థులను ఈ చట్టం పరిధినుంచి తప్పించటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి. ఈ లీకుల లబ్ధిదారుల్లో సైతం భయభక్తులుంటేనే సమస్యను అరికట్టడం సాధ్యమవుతుంది. -
TS High Court: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్‌ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పదో పరీక్షలు హరీష్ రాశాడు. హరీష్ పదో తరగతి ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు.. గురువారం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర హైస్కూల్లో టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని అధికారురలు డీబార్ చేశారు. తన కుమారుడు హరీష్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని తండ్రి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరించడంతోనే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందన్నారు. తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. తర్వాత ఫలితాలు విడుదల సమయంలో హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టారు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. తక్షణమే ఫలితాలు వెల్లడించాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చదవండి: ఎవరిది తప్పు.. ఎవరికి ముప్పు ? -
టీఎస్పీఎస్సీ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ) ఉద్యోగులు అది నిర్వహించే పరీక్షలు ఎలా రాస్తారు. వారిని పరీక్షపత్రాల తయారీకి ఎలా అనుమతిస్తారు?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల ప్రశ్నపత్రం లీకేజీపై హైకోర్టుకు మంగళవారం సిట్ దర్యాప్తు స్థాయీ నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే నిందితుల వివరాలను ఇవ్వాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ నివేదిక అందజేసి వాదనలు వినిపించారు. దర్యాప్తు నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలని, వారి తరఫు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీల్డ్ కవర్ నివేదికలను బహిర్గతం చేయవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ఠంకా చెప్పారు. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. సిట్ చైర్మన్‌పై ఆరోపణలు ఉన్నాయని, సరీ్వస్ కమిషన్ ఏర్పాటులోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రవాస భారతీయుల పాత్ర ఉందన్నారు. ఇది 30 లక్షల మంది భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సెక్షన్ అధికారి వద్ద మాత్రమే కాకుండా చైర్మన్, కార్యదర్శి వద్ద కూడా పాస్వర్డ్ ఉంటుందన్నారు. పారదర్శకంగా సాగని దర్యాప్తు సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ ఠంకా అన్నారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను ఎవరు తయారీ చేశారు.. ఏ ఏజెన్సీకి అప్పగించారు.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరీక్షలు రాసేవారిని విధులకు ఎందుకు అనుమతించారని అడుగగా, పరీక్షలు రాసేవారిని నిర్వహణ ప్రక్రియకు దూరంగా పెట్టినట్లు ఏజీ చెప్పారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను సమరి్పస్తామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు మరికొన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా, 17 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఒకరు మాత్రం న్యూజిలాండ్‌లో ఉన్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నివేదించారు. ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
నిర్లక్ష్యం ఫలితమేనా?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతటా వైఫల్యమే.. హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది. కొన్నేళ్ళుగా నడుస్తోందా? టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్లో నిక్షిప్తమవుతుంది. టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. -
టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర పెద్ద గేమ్‌ప్లాన్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్‌ది ప్రధాన పాత్ర అని తేలడంతోనే ప్రథమ నిందితుడిగా చేర్చామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కొత్త అంశాలు బయటికొస్తే సెక్షన్లు మారుతాయని వివరించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చామని.. ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్‌లను అరెస్టు చేశామని, ఏ4గా ఉన్న బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని తెలిపారు. పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. సంజయ్ ఆదేశాలతోనే లీక్ ఈ కేసులో నిందితుడైన బూర ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలా మందికి వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని పంపించాడని.. బండి సంజయ్ ఆదేశాల మేరకే ప్రశాంత్ కుట్రలో భాగస్వామి అయ్యాడని విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. ‘‘రెండు రోజుల క్రితం సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ప్రశాంత్ చాటింగ్‌లో పేర్కొన్న అంశాలనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. తర్వాతిరోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ కాల్ మాట్లాడాడు. దీనికి సంబంధించి 76800 06600 నంబర్‌తో కూడిన ఫోన్ ఇవ్వాలని అడిగినా బండి సంజయ్ ఇవ్వలేదు. ఆ ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది’’ అని సీపీ వెల్లడించారు. ఇంకా కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రశాంత్‌పై కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని.. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ లోక్‌సభ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్ ఈ హిందీ పేపర్‌ను ఈటెల రాజేందర్, ఆయన పీఏ నరేందర్‌లతోపాటు పలువురు బీజేపీ నేతలకు పంపాడని చెప్పారు. చట్టప్రకారమే అరెస్టులు బండి సంజయ్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చని, దీనికి తగిన కారణాలున్నాయని సీపీ రంగనాథ్ వివరించారు. సంజయ్ అరెస్టుకు ముందు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని చెప్పారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, వరంగల్‌లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను అరెస్టు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా చట్టపరిధిలో సమాధానం ఇస్తామన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే సంజయ్, ఇతర నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందన్నారు. రిమాండ్ రిపోర్టు: అరెస్టులకు కారణాలివీ.. హిందీ పేపర్ లీక్ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. బండి సంజయ్ సహా నలుగురి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు లోబడి.. నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఆ అంశాలు, కారణాలివీ.. ♦ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రాన్ని తీసి, దాని ఫోటోలను వాట్సాప్/సోషల్ మీడి యాలో షేర్ చేయడం హేయమైన నేరం. ఇంకా పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులు రిమాండ్ కాకుంటే పరీక్షల నేరాలకు మరింతగా పాల్పడి.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే అవకాశం ఉంది. ♦ నిందితులు రిమాండ్‌కు వెళ్లకుంటే.. రాష్ట్రంలోని చిత్తశుద్ధి గల విద్యార్థులు సీరియస్‌గా తీసుకుని, నిందితులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయతి్నస్తే.. అది శాంతిభద్రతల సమస్యకు దారితీయవచ్చు. ♦ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. చాలా సాక్ష్యాలను సేకరించాలి. నిందితులు బయట ఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, తదుపరి దర్యాప్తు సరైన విధంగా జరగకుండా ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంది. ♦ ఇది చాలా తీవ్రమైన కేసు, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరపూరిత కుట్ర. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో చేశారు. మరికొందరు నేరస్తులను ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లోతైన దర్యాప్తు అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితులను రిమాండ్‌కు పంపాలి. -
పదో తరగతి పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వచ్చన్ పేపర్ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. పొరపాటున మరో వాట్సాప్ గ్రూప్‌లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని, అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం పదో తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఇవి ఆటో నుంచి మాయమయ్యాయి. విషయం బయటకు రావడంతో అధికారులు బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్‌కు కారణమైన ఇద్దరు తపాలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న వీ రజిత(ఎంటీఎస్), నాగరాజు(ఔట్ సోర్సింగ్)లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
తెలంగాణ: టెన్త్ హిందీ పేపర్ లీక్!?
సాక్షి, వరంగల్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ కలకలం నడుస్తోంది. తాజాగా ఇవాళ(మంగళవారం) రెండో రోజూ పరీక్షల్లో హిందీ పేపర్ సైతం లీక్ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఉదయం 9గం.30కే పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. టెన్త్ విద్యార్థులకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ చక్కర్లు కొట్టింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. నిన్న తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది విద్యాశాఖ. అలాగే.. బందప్ప, సమ్మప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
టెన్త్ పేపర్ అవుట్
సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/ తాండూరు: టెన్త్ పరీక్షల తొలిరోజు.. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ పాఠశాలలోని ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మరో పాఠశాలలోని టీచర్‌కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు సహా నలుగురిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేట్ స్కూళ్ల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వికారాబాద్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది? పదవ తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు తెలుగు పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే పరీక్ష కోసం 9.30కి ఇన్విజిలేటర్లు వారికి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల–1లోని 5వ నంబర్ పరీక్ష హాల్లో కూడా అలాగే ఇచ్చారు. ఆ గదిలో శ్రీనివాసులు ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో రిలీవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప రూమ్ నంబర్ ఐదుకు వచ్చాడు. గైరుహాజరైన ఓ విద్యార్థికి చెందిన క్వశ్చన్ పేపర్ తీసుకుని శ్రీనివాసులుకు తెలియకుండా తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. తొలుత పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్‌కు పంపి వెంటనే డిలిట్ చేశాడు. 9.37 సమయంలో చెంగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్ ద్వారా పంపాడు. అతని ద్వారా ప్రశ్నపత్రం వేరే ఇతర వాట్సాప్ గ్రూపులకు, 11: 30 ప్రాంతంలో ఓ మీడియా వాట్సాప్ గ్రూప్‌కు వెళ్లింది. విలేకరులు కొందరు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలాంటిదేమీ లేదని అన్నారు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న పేపర్‌తో పోల్చి చూస్తే నిజమేనని తేలింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రిమినల్ కేసుల నమోదు ఈ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్ చేశామని, వీరిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదనపు కలెక్టర్‌ను రంగంలోకి దింపామని తెలిపారు. విచారణలో తాండూరు–1 స్కూల్ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించామన్నారు. పేపర్ ఫోటోలు తీసిన బందెప్పతో పాటు అతను పేపర్ సెండ్ చేసిన సమ్మప్పను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించిన సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివకుమార్ (ముద్దాయిపేట, యాలాల మండలం), చీఫ్ సూపరింటెండెంట్ కె.గోపాల్ (తాండూరు హైస్కూల్–1)ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసిన విషయాన్ని గమనించడంలో విఫలమైన శ్రీనివాస్‌ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించటంతో పాటు అతనిపై కూడా తదుపరి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. లీకైన పేపర్‌ను ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేసినట్లుగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదని కలెక్టర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ ఫొటోలు తీసి మరో ఉపాధ్యాయుడికి పంపినప్పటికీ.. విద్యార్థులు ఆ పేపర్ ద్వారా కాపీయింగ్‌కు పాల్పడినట్టు తేలలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం బయటకు వాస్తవమే.. టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన స్పందించారు. తాండూరు హైస్కూల్–1 నుంచి ప్రశ్నపత్రం మరో టీచర్‌కు వెళ్ళిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. అయితే పరీక్ష సమయంలో ఇతరులెవరూ లోపలికి రాలేదని, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపారని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా పరీక్షలన్నీ యధాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో మిలాఖత్? ప్రశ్నపత్రం బయటకు వెళ్లిన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కూడా పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్ళడం నిషేధం. అలాంటిది ఓ ఇన్విజిలేటర్ ఎలా తీసుకెళ్ళాడనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే అతని సెల్‌ఫోన్ ద్వారా వెళ్ళిన ప్రశ్నపత్రం ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులకు కూడా వెళ్ళినట్టు అనుమానిస్తున్న పోలీసు వర్గాలు ఈ దిశగా విచారణ చేపట్టాయి. ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నం టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యూఐ ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ నేతలు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలోనూ వివాదాస్పదుడే.. తాండూరు నంబర్–1 పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బందెప్పకు వివాదాస్పదుడిగా పేరుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలోనే దేహశుద్ధి చేశారు. అప్పట్లో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. తాజాగా ప్రశ్నప్రతం లీక్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
పరీక్షల పద్ధతి మారాల్సిన తరుణం!
ప్రశ్నపత్రాల లీకులను నిరోధించడానికి కఠినమైన చర్యలు తాత్కాలికంగా అవసరమే కావొచ్చు. కానీ ఈ సమస్యకు నిజమైన పరిష్కారం, పరీక్షల వ్యవస్థలోనే సంస్కరణ జరగడం! ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో గుర్తుపెట్టుకోవడమే ప్రధానం. ఇదే లీకులకు, కాపీలకు కారణమవుతోంది. దీన్ని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో ముఖ్యమైనవి: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం, జ్ఞాపకశక్తిని పరీక్షించడం కాకుండా అవగాహనతో కూడిన సమాధానాలిచ్చే ప్రశ్నలను ఎక్కువగా ఇవ్వడం. కంప్యూటర్లను అందించడంలో మౌలిక వసతుల ఖర్చు పెరుగుతుంది. కానీ ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా, భద్రత అంశాల్లో ఖర్చులు తగ్గుతాయి. పైగా లీకుల వల్ల ఉత్పన్నమయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతి పరీక్షా సీజన్ కూడా ప్రశ్నపత్రాల లీకులు, కాపీయింగులు, అవి జరగకుండా భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామనే హామీలకు సంబంధించిన వార్తలను ప్రవాహంలా మోసుకొస్తుంది. ఆ ప్రమాణాల ప్రకారం చూసినా కూడా గత కొన్ని నెలల్లో తలెత్తిన వరుస వివాదాలు ఎంతో చెరుపుచేశాయి. గత నెలలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రాష్ట్ర నియామక పరీక్షల్లో ఎవరైనా మోసానికి పాల్పడుతూ పట్టుబడితే కనీసం 10 సంవత్సరాల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని చేసింది. కొన్ని రోజుల తర్వాత, ప్రశ్న పత్రాల లీకులను నిరోధించడానికి గుజరాత్ శాసనసభ ఏకగ్రీవంగా ఒక బిల్లును ఆమోదించింది. దోషులుగా రుజువైన వారికి పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానాను ఈ బిల్లులో ప్రతిపాదించారు. అదే రోజు, రాజస్థాన్ ఉపాధ్యాయుల అర్హతా పరీక్ష పత్రాలు పరీక్ష తొలి రోజునే లీక్ అయ్యాయి. అవి వ్యాప్తి చెందకుండా వెంటనే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఇక, గత వారంలోనే అస్సాంలో 10వ తరగతి ప్రశ్నపత్రాలు మళ్లీ మళ్లీ లీక్ అవుతుండటం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రశ్నపత్రాల లీకులను నిరోధించడానికి కఠినమైన, దండనాత్మక చర్యలు తాత్కాలికంగా అవసరమే కావొచ్చు. కానీ ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ఏమిటంటే, మన పరీక్షల వ్యవస్థలోనే సంస్కరణ జరగడం! ఇది కాపీలను, లీకులను తగ్గించ డమే కాదు, రానున్న సంవత్సరాల్లో అభ్యర్థులకు అవసరమైన సము చిత నైపుణ్యాలను పరీక్షించేలా ఉపకరిస్తుంది. 1970ల నుండి జాబ్ మార్కెట్ అవసరాలను పరిశీలిస్తే – సాధా రణ అభిజ్ఞా నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలను పణంగా పెట్టి, రొటీనుకు తావులేని మానవ సహసంబంధాలు, విశ్లేషణాత్మక నిపు ణతలు అనేవి నాటకీయంగా పెరుగుతూ వచ్చాయని ఒక పరిశోధన చెబుతోంది. ఆఫీస్ సెక్రటరీ లేక స్టెనోగ్రాఫర్, మానవ బ్యాంక్ టెల్లర్ వంటి సాంప్రదాయికమైన పాత్రలు వాస్తవంగా అదృశ్యమైపోవడం దీనికి ఉదాహరణ. ఇవన్నీ పునరుక్త శారీరక లేక అభిజ్ఞాపరమైన నిపుణతలను ఆశిస్తాయి. జాబ్ మార్కెట్లో ప్రవేశించేవారు అత్యున్నత నైపుణ్య స్థాయితో పోటీపడాల్సిన అవసరాన్ని కృత్రిమ మేధ (ఏఐ) ఉపకరణాల పెరుగుదల తప్పనిసరి చేసింది. ఈరోజు భారతీయ పరీక్షలు చాలావరకు సాధారణ అభిజ్ఞా నైపుణ్యాలను కొలవడం పైనే దృష్టి పెడుతున్నాయి. ఇదే లీకులకు, కాపీల వైపు మొగ్గుచూపే సమస్యలకు కారణమవుతోంది. దీన్ని పరిష్కరించడానికి స్వతంత్ర మైనవే అయినా, పరస్పర అనుసంధానిత నాలుగు చర్యలు తీసు కోవచ్చు. మొదటిది, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అభ్యర్థులకు విభిన్నమైన ప్రశ్నపత్రాలు ఇవ్వ వచ్చు. మొత్తం ప్రశ్నల పూల్ చాలా పెద్దదిగా ఉండటం వల్ల లీకుల సమస్య తగ్గిపోతుంది. కాపీ చేయడం కష్టతరమైపోతుంది. వీటి ముద్రణ, రవాణా ప్రక్రియలు గణనీయంగా తగ్గిపోతాయి లేదా దాదాపుగా లేకుండా పోతాయి. పైగా, విభిన్న ప్రశ్నపత్రాలు ఉన్నప్పటికీ ఆధునిక గణాంక టెక్నిక్కులు అభ్యర్థుల తులనాత్మక పనితీరును అత్యంత కచ్చితంగా, వాస్తవంగా తక్షణం కొలవడానికి ఉపకరిస్తాయి. అలాంటి పరీక్షలు అత్యున్నత నైపుణ్యాలను పరీక్షించే నిర్దిష్ట కర్తవ్యాలను కూడా అభ్యర్థులకు ఇవ్వగలుగుతాయి. పైగా కంప్యూ టర్తోనే దిద్దించవచ్చు (ఉదాహరణకు, గ్రాఫ్ లేదా మ్యాపుపై పాయింటును గుర్తించడం, ఒక ప్యాసేజీలోని పదాన్ని మార్చడం). ఇప్పటికే అతి పెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతీయ పరీక్షలను చాలావరకు కంప్యూటర్లలో నిర్వహిస్తున్నారని గుర్తుంచుకోవాలి. పరీక్షలు జరపడం కోసం కంప్యూటర్లను అందించడంలో మౌలిక వసతుల ఖర్చు పెరుగుతుంది. కానీ ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా, భద్రత అంశాల్లో ఖర్చులు తగ్గుతాయి. లీకుల వల్ల ఉత్పన్నమయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. (ఇది అనివార్యంగానే పునఃపరీక్షలకు దారితీస్తుంది). రెండు, ఓపెన్ బుక్ పరీక్షలను మరింతగా పెంచడం. ఈ విధానం పరీక్షా హాల్లోకి నిర్దిష్ట సామగ్రిని తీసుకెళ్లడానికి అభ్యర్థులను అనుమ తిస్తుంది. ఇవి వాస్తవాలతోపాటు ప్రాథమిక ఫార్ములాలను కలిగి ఉన్న బుక్లెట్ల లాంటివి కావొచ్చు. సులభంగా కాపీ చేసే సమస్య దీంతో తొలగిపోతుంది. దీనివల్ల అభ్యర్థులు తమ జ్ఞానాన్ని వాస్తవ జీవి తానికీ, మరింత పెద్ద సమస్యలకూ వర్తింపజేసుకోగలుగుతారు. మూడు, కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించడం కాకుండా అవగా హనతో కూడిన సమాధానాలు అవసరమైన ప్రశ్నలను ఎక్కువగా ఇవ్వడం. ఒకవేళ కంప్యూటర్లు లేక ఓపెన్ బుక్ పరీక్షలను ఉపయోగించనప్పటికీ, కేవలం గుర్తు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా అర్థం చేసుకుని, అన్వయించడంపై ఆధారపడిన నైపుణ్యాల కోసం అభ్య ర్థులను పరీక్షించాలి. ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో గుర్తు పెట్టు కోవడమే ప్రధాన అవసరంగా ఉంటోంది. ఈ విధంగా ప్రశ్న లను మెరుగుపర్చినప్పుడు, సమాధానాలు ఇవ్వడం అనేది ఎప్పుడూ యాంత్రికంగా ఉండదు (ఈ విధానంలో కూడా ప్రశ్నలు ఆబ్జెక్టివ్ లేదా మల్టిపుల్ ఛాయిస్‌గానే ఉండవచ్చు). ఇలాంటి అనేక ప్రశ్నలు ఒక అపరిచిత నేపథ్యం నుంచి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు వాటి సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాతే ప్రశ్నకు సమాధానం ఇవ్వ వలసి ఉంటుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా అత్యుత్తమ పరీక్షలు ఇప్పటికే ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలను గూగుల్ చేయలేము. పైగా, జీపీటీ–4 వంటి విధానంలో కూడా సులువుగా వీటికి సమాధానాలు కనుగొనలేమని గుర్తించారు (కాకపోతే నెమ్మ దిగా అదీ సాధ్యమవుతోంది). నాలుగు, పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం. సులువుగా పరీక్షా ప్రక్రియను మెరుగుపర్చడానికి ఉన్న అవకాశం, పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాల గురించి దేశ, రాష్ట్రాల స్థాయుల్లో ప్రజావగాహన ప్రచారాలు నిర్వహించాలి. అభ్యర్థులు లేక వారి కుటుంబ సభ్యులు తరచుగా పరీక్షల సంస్కరణలను వ్యతి రేకిస్తుంటారు. ఎందుకంటే పరీక్షల్లో మార్పు చేస్తే తమకు తెలియని పద్ధతిని ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడతారు. నష్టం కలుగుతుందని భావిస్తారు. ఈ కొత్త పరీక్షల గురించిన ప్రచారం అవెందుకు మెరుగో వివరిస్తుంది. సాపేక్ష గ్రేడింగ్, పర్సెంటైల్స్ వంటి భావనలను కూడా సరిగ్గా వివరించలేకపోతే వ్యతిరేకత మూటగట్టుకుంటాయి. కొన్నిసార్లు కోర్టుల్లో కూడా వీటికి వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు. చివరగా, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా, ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో కూడా మంచి స్కోర్ సాధించేలా అభ్యర్థులకు ఈ ప్రచారాలు టిప్స్ అందిస్తాయి. ఇలాంటి ప్రచారాలు జరగకపోతే, అభ్యర్థులు జరిగే మార్పుల గురించి తెలుసుకోలేరు. ట్యూషన్, కోచింగ్ క్లాసుల నుంచి అందే వాస్తవాలే వీరికి ప్రామాణికం అవుతాయి. ఇవి దాదాపుగా యథాతథ స్థితినే నిలిపి ఉంచుతాయి. నియామకాల కోసం గానీ లేక అకెడమిక్ కోర్సుల కోసం గానీ నిర్వహించే పరీక్షల నాణ్యత అనేదే మానవ పెట్టుబడి నాణ్యతను నిర్దేశిస్తుందని చాలా దేశాలు గుర్తించాయి. అందుకే మనం దీనికి గొప్ప ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఇదే మంచి తరుణం. కాపీలు, లీకులు అనేవి కునారిల్లుతున్న వ్యవస్థ తాలూకు లక్షణాలను విస్తృతంగా ప్రదర్శిస్తుండటాన్ని మనం చూశాము. అందుకే ఈ రంగంలో మార్పు తప్పనిసరి. శ్రీధర్ రాజగోపాలన్ వ్యాసకర్త సహ–వ్యవస్థాపకుడు, ‘ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్స్’ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
TSPSC Paper Leak Case: ఎల్బీనగర్ లాడ్జిలో ఎవరెవరు కలిశారు?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్.. ఎల్బీనగర్లోని ఓ లాడ్జిపై దృష్టి సారించింది. ఏఈ పరీక్ష జరగడానికి ముందురోజు రాత్రి నిందితులు అక్కడ బస చేయడం, మరికొందరు వచ్చి వారిని కలవడంతో.. వచ్చిన వారెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కొత్తగా అరెస్టు చేసిన ముగ్గురినీ సిట్ అధికారులు గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పోలీసు కస్టడీ పూర్తయిన తొమ్మిది మందినీ జైలుకు పంపారు. మరోపక్క గ్రూప్–1 పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మంది జాబితాను కమిషన్ నుంచి సేకరించిన పోలీసులు వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. లాడ్జి నుంచే ఏఈ పరీక్షకు .. గత నెల ఆఖరి వారంలో ప్రవీణ్ కుమార్ నుంచి ఏఈ ప్రశ్నపత్రం అందుకున్న రేణుక, డాక్యాలు అభ్యర్థులైన నీలేశ్, గోపాల్‌లను మహబూబ్‌నగర్ జిల్లాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. రెండురోజుల పాటు అక్కడే ఉంచి పరీక్షలకు సిద్ధం చేశారు. ఈ నెల 4 రాత్రి నీలేష్, గోపాల్, డాక్యాలతో పాటు అతడి సమీప బంధువు రాజేందర్ రెండు వాహనాలపై ఎల్బీనగర్కు వచ్చారు. అక్కడి ఓ లాడ్జిలో బస చేశారు. మర్నాడు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రంలో నీలేష్, గోపాల్‌తో పరీక్ష రాయించారు. అయితే వీళ్లు లాడ్జిలో ఉండగా కొందరు వచ్చి కలిసినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో వాళ్లు అభ్యర్థులేనా? కొన్ని ప్రశ్నలు లేదా ప్రశ్నపత్రాన్ని నీలేష్, గోపాల్ వారితో పంచుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. 9 మంది నిందితుల్ని మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జైలుకు మరో ముగ్గురు నిందితులు... గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న, చేసిన వారి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. 2013లో గ్రూప్–2 ద్వారా ఎంపికై, ప్రస్తుతం కమిషన్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న షమీమ్ అనే మహిళకు రాజశేఖర్ ద్వారా గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రం అందింది. దీని ఆధారంగా పరీక్ష రాసిన ఆమె ఏకంగా 127 మార్కులు పొందింది. కమిషన్‌కు చెందిన ఓ సభ్యుడి వద్ద పీఏగా పని చేస్తున్న డి.రమేష్ కుమార్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేష్‌కు ప్రవీణ్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ చేరింది. వీరిలో రమేష్‌కు 122 మార్కులు, సురేష్‌కు 107 మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఈ ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వీరిని వారం రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. 25 మంది అభ్యర్థులకు నోటీసులు.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 25 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విడతల వారీగా మొత్తం 121 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. టీఎస్పీఎస్సీ కస్టోడియన్ శంకరలక్ష్మిని మరోసారి విచారించాలని నిర్ణయించారు. తెరపైకి రాజశేఖర్ బంధువు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ప్రశాంత్ గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చి ప్రిలిమినరీ పరీక్ష రాసి వెళ్ళాడు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన ప్రశాంత్ 100కు పైగా మార్కులు పొందినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఇతడికి లీకైన గ్రూప్–1 పేపర్ అందిందా? అని అనుమానిస్తున్న సిట్ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక అన్నీ సీబీ పరీక్షలే! లీక్‌లను అరికట్టేందుకు ఇదే ఉత్తమ మార్గం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర అపవాదును మూటగట్టుకున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆయా పరీక్షలు రద్దు చేసిన కమిషన్.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో 50 వేల లోపు అభ్యర్థులున్న పరీక్షలను మాత్రమే సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకంటే ఎక్కువున్నప్పుడు ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) ఆధారిత పరీక్షలను నిర్వహిస్తోంది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రశ్నపత్రా లను మూడు నెలలకు ముందుగానే ఖరారు చేసి రూపొందించడం, ఆ తర్వాత వాటిని అత్యంత గోప్యంగా ముద్రించడం, వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను కంటికి రెప్పలా కాపాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓఎంఆర్ పరీక్షల విధానాన్ని క్రమంగా వదిలించుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. డిపార్ట్మెంటల్ పరీక్షలతో సహా అన్ని రకాల నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. లీకేజీకి చెక్..! సీబీటీ విధానంలో కఠినం, మధ్యస్థం, సులభతరం అనే మూడు కేటగిరీల్లో ప్రశ్న బ్యాంకులను తయారు చేసి సర్వర్‌లో అందుబాటులో ఉంచుతారు. ఎంతోముందుగా ప్రశ్నపత్రం ఖరారు చేయడం ఉండదు. పరీక్ష సమయంలో నిర్దేశించిన నిష్పత్తుల్లో అప్పటికప్పుడు ప్రశ్నలు అభ్యర్థులకు కంప్యూటర్లో ప్రత్యక్షమవుతాయి. అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఏదీ ఇవ్వరు. కంప్యూటర్ స్క్రీన్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీకి దాదాపు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే సర్వర్ సిస్టంను హ్యాక్ చేయడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన సీబీటీ పరీక్షల నిర్వహణలో మరో కీలక అంశం మౌలిక వసతులు. సీబీటీ పరీక్షలను నిర్వహించాలంటే తగినన్ని కంప్యూటర్లతో ల్యాబ్‌లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం అయాన్ డిజిటల్ లాంటి సంస్థలతో పలు సంస్థలు అవగాహన కుదుర్చుకుని సీబీటీ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులున్నప్పుడు సీబీటీ పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా? అనే కోణంలో కమిషన్ పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, పీజీ నీట్ తదితర పరీక్షలన్నీ సీబీటీ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సగటున లక్ష నుంచి రెండు లక్షల వరకు అభ్యర్థులుంటున్నారు. అందువల్ల వీటిని ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లు ఆ మేరకు సర్దుబాటు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలను కూడా పూర్తిగా సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తే అవసరమైన వ్యవస్థపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యలక్షల్లో ఉంటే ఏయే వ్యవస్థలను వినియోగించుకోవాలి? పరీక్షలను ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తే ఏం చేయాలి? మౌలిక వసతుల కల్పన ఎలా? తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. -
బీజేపీ కుట్ర కోణం!
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై మాకూ ఓ అనుమానం ఉంది. ఈ కేసులో అనుమానితుడిగా, నిందితుడిగా అరెస్టయిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్య కర్త. అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న అంశాలను వెలికి తీయాలని బీఆర్ఎస్ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేశాం. మా ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే.. ఇలా నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్ర అని, యువతను బిజీగా ఉంచి తమ దగ్గరికి రానీయకుండా చేయడానికే నోటిఫికేషన్లు ఇచ్చా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (బండి సంజయ్) స్వయంగా అన్నారు. దీన్ని బట్టి అనుమానించాల్సి వస్తోంది.. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సాధ్యమైనంత త్వరగా మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా బీజేపీ అనుకూలతను ప్రదర్శిస్తూ, ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశాడని.. ఇందుకు సంబంధించి ఎన్నో ఫొటోలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఉండటంతోనే అనుమానిస్తున్నామని.. ఈ కుట్ర కోణంలో దర్యాప్తు జరపాలని డీజీపీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్రశ్నపత్రాల లీకుల వెనక ఎవరున్నా.. వారు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా అమలు చేయాల్సిన సంస్కరణలపై శనివారం బీఆర్కేఆర్ భవన్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తదితరులతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్ర అనే ధోరణిలో మాట్లాడిన వ్యక్తి (బండి సంజయ్) పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ2గా దొరకడం చూస్తే ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతలో లేని పోని అనుమానాలు కలిగించే విధంగా నిందలు వేసి అప్రతిష్టపాలు చేయాలని కుట్ర ఉందా? అన్నది శోధించాలని డీజీపీని కోరుతున్నాం. ఇది వ్యవస్థ వైఫల్యం కాదు.. టీఎస్పీఎస్సీలోని ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పుతో మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. దీనిని నివారించి ఉండాల్సింది. రాష్ట్ర యువతలో భరోసా నింపాల్సిన బాధ్యత ఉందని భావించి సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశం నిర్వహించాం. గత 8 ఏళ్లలో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా టీఎస్పీఎస్సీ అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసింది. 155 నోటిఫికేషన్లు ఇచ్చి 37వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఉమ్మడి ఏపీలో ఏదైనా పరీక్ష జరిగిందంటే ఏపీపీఎస్సీ మీద పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వచ్చేవి. టీఎస్పీఎస్సీ 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏ ఒక్క ఆరోపణ రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో పక్షపాతం ఉండేదని ఆరోపణలున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసింది. సంస్కరణలపై చర్చించాం.. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులే కాదు.. వారి వెనకాల ఎవరున్నా నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఇది వ్యవస్థ వైఫల్యమో, సంస్థాగత వైఫల్యమో కాదు. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు. లక్షల మంది పిల్లలకు ఇబ్బంది ఎదురైంది. ఇలా మళ్లీ జరగకుండా చేయాల్సిన మార్పులు, సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించాం. యువత ఆందోళన చెందవద్దు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం. నిరుద్యోగ యువతకు సంబంధించి ఏవో కొన్ని వార్తలు (ఆత్మహత్యల వార్తలు) వస్తున్నాయి. యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి వెంట ప్రభుత్వం ఉంది. నాలుగు పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ అభ్యర్థులు మళ్లీ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. పటిష్టమైన నివారణ చర్యలతో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ పరీక్ష రాసేందుకు అర్హులే. టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ జరగలేదని సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విపక్షాలు పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు లీకేజీ అంశాన్ని చిలువలు పలువలు చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడి యువతలో అశాంతి, అసహనం చెలరేగేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలా విపక్షాల నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఉంది. రాజకీయ నిరుద్యోగులు, బేహారుల రెచ్చగొట్టే మాటలను నిరుద్యోగులు పట్టించుకోవద్దు. ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. కొందరు నేతలు ఎన్ని చిల్లర ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారు. మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని స్వయంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎక్కడ పోయాయి ఆ ఉద్యోగాలు అని అడిగితే.. పకోడీలు వేయడం కూడా ఉద్యోగాలని అంటారు. అలాంటి మీరు (బీజేపీ నేతలు) వచ్చి ఉద్యోగాలపై మాకు చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది. చెప్పి మాటపడొద్దు. రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్‌కి నేనే బాధ్యుడినా? రాజ్యాంగబద్ధమైన టీఎస్పీఎస్సీ రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వం పాత్ర ఉండదు. ప్రభుత్వం తరఫున ఒక సెక్రటరీ మాత్రమే ఉంటారు. కానీ ఐటీ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఒకరు అంటారు. రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్‌కు నేనే బాధ్యుడినా? ఇంటర్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఏం జరిగినా ఐటీ మంత్రిది తప్పు అంటారు. గుజరాత్లో 8 ఏళ్లలో 13 పేపర్లు లీకైతే అక్కడ ఎవరైనా మంత్రిని బర్తరఫ్ చేశారా? రాజీనామా చేశారా? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో నేరుగా సీఎం మీద ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేశారా? అస్సాంలో మొన్న పోలీసు నియామకాల ప్రశ్నపత్రం లీకైతే సీఎం రాజీనామా చేశారా..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 24 గంటలూ రీడింగ్ రూమ్‌లు.. ఉచిత భోజన వసతి రద్దయిన గ్రూప్–1, డీఏఓ, టీపీఓ, ఏఈఈ పరీక్షల కోచింగ్ మెటీరియల్‌ను రెండు, మూడు రోజుల్లో ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తాం. జిల్లాల్లోని రీడింగ్ రూమ్‌లు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంటాయి. అక్కడ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా సీఎస్ నాయకత్వంలో కలెక్టర్లు శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఇంకా ఏమైనా నిర్దిష్ట డిమాండ్ వస్తే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. -
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?!
సాక్షి, హైదరాబాద్: పేపర్ లీకేజీ ప్రకంపనలతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ జరిగిన కీలక భేటీలో.. కీలకనిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలువుల జాతర పేరుతో.. ఈ మధ్యకాలంలో మొత్తం వివిధ రకాల పరీక్షలకు సంబంధించి 26 నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. అయితే ఏఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడం, ఆపై సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండడంతో.. ఇప్పుడు కొన్ని పరీక్షలను రద్దు చేస్తూనే, దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 20 పరీక్షలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏడు పరీక్షలు జరగ్గా.. వాటి పేపర్లు మొత్తం! లీక్ అయినట్లు సిట్ దర్యాప్తు నివేదిక ద్వారా దాదాపుగా నిర్ధారణ చేసుకుంది కమిషన్. ఈ నేపథ్యంలో మొన్న ఏఈ పరీక్ష.. ఇవాళ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరో రెండు పరీక్షలను(ఏఈఈ, డీఏవో పరీక్షలు) సైతం రద్దు చేసి.. వాటిని తిరిగి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే అయిపోయిన నాలుగు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధం కాగా.. మరో మూడు పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అవే.. గ్రౌండ్ వాటర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు. ఈ క్రమంలో ఈ పరీక్షల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్న పత్రాలతో పాటు.. రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా పరీక్షల పత్రాలను సైతం మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో.. టీఎస్పీఎస్సీ దాదాపు 20కి పైగా పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ వేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విమర్శలకు, అభ్యర్థుల అనుమానాలకు తావు లేకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. ప్రశ్నాపత్రాలను తిరిగి రూపొందించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష తేదీలను మార్చేసి, ఆలోపు కొత్త ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో పిటిషన్ ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఎన్ఎస్యూఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పిటిషన్లో పేర్కొన్న ఆయన.. రాష్ట్ర పరిధిలోని సిట్‌తో కాకుండా సీబీఐగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన పిటిషన్లో కోర్టును కోరారు. -
లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు.. బీజేపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. తొలుత శుక్రవారమే కలిసి వినతిపత్రం సమర్పించాలని భావించినా, గవర్నర్ అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో కార్యక్రమాన్ని 18వ తేదీకి మార్చారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని పార్టీ అభిప్రాయపడింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. లీకేజీ వ్యవహారంపై బీజేపీ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ గురువారం రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ అధ్యక్షతన సమావేశమమైంది. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలని, కమిషన్ చైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని కమిటీ డిమాండ్ చేసింది. గ్రూప్–1, ఏఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైనట్లు ప్రాథమికంగా అంచనా వేసిన కమిటీ.. మిగిలిన పేపర్ల లీకేజీ సంబంధిత అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్‌కు లింకులున్నాయా? లీకేజీకి సంబంధించిన పలు అంశాలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించింది. ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయి? దీని వెనుక ఎవరున్నారు? చైర్మన్‌పై ఏమైనా ఒత్తిడి ఉందా? కింది స్థాయి సిబ్బందికి నేరుగా ప్రగతి భవన్‌తో లింకులున్నాయా? తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. కాగా కేంద్రం 2011లో చేసిన ఐటీ చట్ట సవరణ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే అన్ని శాఖల్లోని ఐటీ విభాగాలు తప్పనిసరిగా కేంద్రం నియమించిన థర్డ్ పార్టీ నిర్వహించే సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వ శాఖ వెబ్‌సైట్‌కూ ఆడిట్ సర్టిఫికెట్ లేదనే విషయం పలువురు సభ్యులు ప్రస్తావించారు. నష్టపోయే విద్యార్థులకు పరిహారంపై ఒత్తిడి పరీక్షల రద్దుతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్న నేపథ్యంలో వారందరికీ రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కమిటీ నిర్ణయించింది. అయితే గత షెడ్యూల్ మేరకు ఆయా పరీక్షలన్నీ నిర్వహించి ఉద్యోగ నియామకాలను పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కూడా తీర్మానించింది. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ కన్వీనర్ సీహెచ్.విఠల్, సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చంద్రవదన్, టి.క్రిష్ణప్రసాద్, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఎస్.కుమార్, కరుణా గోపాల్ పాల్గొన్నారు. అక్రమాలపై న్యాయపోరాటం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు ధరణి స్కాం, జీహెచ్ఎంసీ నకిలీ సర్టిఫికెట్ల స్కాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెల్లింపుల స్కాం సహా ఇరిగేషన్ శాఖలో భారీగా కుంభకోణాలు జరుగుతున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికంతటికీ ఐటీ శాఖ పరిధిలో ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తున్న లోపాలే కారణమని అంచనాకు వచ్చారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం న్యాయపోరాటం చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. -
TSPSC Paper Leak: రాజశేఖర్ ఆర్థిక పరిస్థితిపై సిట్ ఆరా
జగిత్యాల క్రైం: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ఏ–2గా ఉన్న రాజశేఖర్ ఆర్థిక మూలాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. వాస్తవానికి ఈ కుటుంబం గతంలో ఆర్థికంగా అంత ఉన్నదేమీకాదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ తండ్రి ఉపాధి కోసం దుబాయ్, సౌదీ, మస్కట్, లిబియా లాంటి దేశాలకు వలస వెళ్లారు. అంతోఇంతో సంపాదించి ఆ సొమ్ముతో తన కుమారుడు, కుమార్తెను చదివించారు. తల్లి అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంది. చదువు పూర్తయ్యాక రాజశేఖర్ టీఎస్పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అయితే ‘ఉద్యోగంలో చేరిన కొద్దికాలంలోనే తాటిపల్లిలో ఆధునిక హంగులతో రూ.25 లక్షలు – రూ.30 లక్షల విలువైన భవనం నిర్మించాడు. తన ఇద్దరు స్నేహితులకు ఉద్యోగాలు ఇప్పించాడు. సోదరికి కరీంనగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారు న్యూజిలాండ్‌లో స్థిరపడగా..తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. వారికి గ్రామ శివారులో సుమారు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది..’అని గ్రామస్తులు చెబుతున్నారు. వీటన్నిటిపైనా సిట్ దృష్టి సారించినట్లు తెలిసింది. బంధువుల సాయంతో కాంట్రాక్టు ఉద్యోగం.. కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేసిన రాజశేఖర్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండి కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులో శిక్షణ పొందాడు. తర్వాత అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ మూడేళ్ల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. తిరిగి స్వదేశానికి వచ్చి లంబాడిపల్లికి చెందిన సుచరితను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఐదేళ్ల బాబు ఉన్నాడు. కాగా రాజశేఖర్‌కు కరీంనగర్‌లోని అతని సమీప బంధువులు 2017లో టీఎస్పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. తమ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని, నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నాడని తల్లిదండ్రులు గ్రామస్తులకు చెబుతూ వచ్చినట్లు సమాచారం. సన్నిహితులు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాజశేఖర్ తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్నేహితులకు 2018లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిసింది. ఒకరు విద్యాశాఖలో, మరొకరు వేరే శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం. కాగా రాజశేఖర్ మరికొందరికి కూడా ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పించాడని తెలుస్తోంది. -
మిగతా పేపర్లు పెన్‌డ్రైవ్ దాటలేదు! ఫిబ్రవరి 27న పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్–1 పేపర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంపై సాంకేతిక దర్యాప్తు చేస్తున్న సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు తమ ప్రాథమిక నివేదికను గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అందించారు. కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష పత్రాలు మాత్రమే లీక్ అయ్యాయని, గ్రూప్–1 పేపర్లు పరీక్ష పూర్తయిన తర్వాతే ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లోకి చేరాయని, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లకు సంబంధించినవి పెన్‌డ్రైవ్ దాటి బయటకు రాలేదని తేల్చారు. కమిషన్ కంప్యూటర్లలో అక్రమ చొరబాట్లు, నెట్వర్క్ మార్పు చేర్పులను గుర్తించడానికి ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ఓపెన్ కాకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. రాజశేఖర్ సాయంతో.. ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లకు డిమాండ్ ఉండటంతో ముందుగా అవి కా వాలని రేణుక కోరింది. దీంతో రాజశేఖర్ సాయంతో కమిషన్ కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్లోకి చొరబడిన ప్రవీణ్ అందులోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఈ పెన్‌డ్రైవ్‌ను అందులోని సమాచారం, ఆధారాలు ధ్వంసం కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో విశ్లేషించారు. ఫోల్డర్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది? ఎప్పు డు మోడిఫై అయ్యింది? చివరిసారిగా ఎప్పుడు యాక్సెస్ అయ్యింది? తదితర వివరాలు పరిశీలించారు. పెన్‌డ్రైవ్‌లో ఫిబ్రవరి 27న ఈ ‘క్వశ్చన్ పేపర్స్’ఫోల్డర్ క్రియేట్ అయినట్లు తేల్చారు. ఆ పేపర్లను ఫోల్డర్లోనే ఉంచడంతో.. ఈ ఫోల్డర్లో ఉన్న ఏఈ ప్రశ్నపత్రాల ప్రింట్ఔట్ తీసిన ప్రవీణ్ మరుసటి రోజు (ఫిబ్రవరి 28న) రేణుక, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు అందించాడు. అదే సమయంలో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ), గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన పరీక్షల పేపర్లు కూడా ఉన్నాయని, అభ్యర్థులను చూడాలని రేణుకకు చెప్పాడు. అయితే ఏఎంవీఐ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పరీక్షలకు తేదీ ఖరారు కాకపోవడంతో వాటిపై ఆమె ఆసక్తి చూపలేదు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం తమ సామాజిక వర్గంలోనే వెతికే ప్రయత్నాల్లో ఉండగా పట్టుబడింది. మరోవైపు గ్రూప్–1 పరీక్షలు గతేడాది అక్టోబర్‌లోనే పూర్తయిపోయినా.. శంకరలక్ష్మి ఆ పేపర్లను ఫోల్డర్లోనే ఉంచడంతో అవికూడా ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లోకి చేరాయని సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రవీణ్ పెన్‌డ్రైవ్ నుంచి ఈ ఫైల్స్ మరో కంప్యూటర్లోకి కాపీ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు చెప్పారు. అయితే లీకేజ్ జరిగిందనే కోణంలోనే, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ కొనసాగిస్తున్నామని సిట్ అధికారులకు తెలిపారు. బిట్ లాకర్ ‘కీ’ని మర్చిపోయారు.. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలను నిర్వహించే టీఎస్పీఎస్సీ లోని సాంకేతిక అంశాల్లో ఉన్న మరో నిర్లక్ష్యాన్ని సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు గురువారం గుర్తించారు. అక్రమ చొరబాట్లను గుర్తించడానికి కంప్యూటర్లలో సాధారణంగా బిట్ లాకర్ అనే సాఫ్ట్వేర్ పొందుపరుస్తారు. దీన్ని ఓపెన్ చేసి, సమ గ్రంగా విశ్లేషించడం ద్వారా ల్యాన్లో కనెక్ట్ అయి ఉన్న ఏఏ కంప్యూటర్లు, ఎప్పుడెప్పుడు అక్రమ చొరబాట్లకు గురయ్యాయనేది గుర్తించవచ్చు. ఈ బిట్ లాకర్‌ను విశ్లేషించడానికి తెరవాలంటే దాన్ని ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో వాడిన ‘కీ’తెలిసి ఉండాలి. కానీ టీఎస్పీఎస్సీ కంప్యూటర్లలో అది ఇన్స్టాల్ అయి ఏళ్లు గడిచి పోవడం, నాటి ‘కీ’ప్రస్తుత అడ్మిన్లకు తెలియకపోవడంతో బిట్ లాకర్ ఓపెన్ కావట్లేదు. ప్రత్యామ్నాయ సాఫ్ట్వేర్ల ద్వారా దానిని తెరవడానికి ప్రయత్నిస్తుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. -
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు, గతంలో జరిగిన ఉదంతాల నిగ్గు తేల్చేందుకు కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నగర పోలీసులు బదిలీ చేశారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరగనుంది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఏ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి? గతంలోనూ ఇలా జరిగాయా? తదితర అంశాలపై సిట్ లోతైన దర్యాప్తు జరపనుంది. మరోవైపు ప్రశ్నపత్రాల లీక్ కేసులో తొమ్మిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రేణుకను చంచల్‌గూడ మహిళ జైలుకు మిగతా ఎనిమిది మందిని చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు మంగళవారం జ్యుడీíÙయల్ రిమాండ్‌కు (చంచల్‌గూడ జైలుకు) తరలించారు. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు వీలుగా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇలావుండగా ఈ కేసులో నిందితుడు గత అక్టోబర్‌లో గ్రూప్–1 పరీక్ష రాయడం, 150కి ఏకంగా 103 మార్కులు సాధించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ వైరల్ టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న పులిదిండి ప్రవీణ్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 పరీక్ష రాశాడు. కానీ పరీక్షకు ప్రిపేర్ కావడానికి కనీసం ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. అయినా మొత్తం 150 మార్కులకు గాను ఏకంగా 103 సాధించాడు. దీంతో ఆ పేపర్‌ను కూడా తస్కరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓఎంఆర్ షీట్‌ను నింపడంలో చేసిన పొరపాటు కారణంగా ప్రవీణ్ డిస్క్వాలిఫై అయ్యాడు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్‌లోని ప్రతి అంశాన్నీ పక్కాగా నింపాల్సి ఉంటుంది. దీని పైభాగంలో హాల్ టిక్కెట్ నంబర్‌తో పాటు టెస్ట్ బుక్లెట్ నంబర్, వెన్యూ కోడ్లను తొలుత అంకెల్లో నింపి, వాటి కింద ఓఎంఆర్ విభాగంలో సున్నాలు చుడుతూ పూరించాలి. అంకెల్ని సక్రమంగా వేసిన ప్రవీణ్‌కుమార్ సున్నాలు చుట్టడంలో మాత్రం పొరపడ్డాడు. టెస్ట్ బుక్లెట్ నంబర్‌కు అంకెల్లో ‘459244’గా వేసిన ఇతను సున్నాల దగ్గరకు వచ్చేసరికి ‘4599244’అని రీడ్ అయ్యేలా పూరించాడు. దీంతో అతను ఆ పరీక్షలో డిస్క్వాలిఫై అయ్యాడని అధికారులు చెప్తున్నారు. ఈ ఓఎంఆర్ షీట్ మంగళవారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పది రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవడ్యావత్ డాక్యా సహా మొత్తం తొమ్మిది మందినీ తదుపరి విచారణ నిమిత్తం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నిందితులను ప్రశ్నించడంతోపాటు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ల పరిశీలన, ఫోరెన్సిక్ నివేదిక అందాకే లీకేజీలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లి, సోదరుడి ఆర్థిక ఇబ్బందులతో.. పోలీసులు కోర్టుకు సమరి్పంచిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు పొందుపరిచారు. రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ గతంలో వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆమె తల్లికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేణుక తనకు పరిచయస్తుడైన ప్రవీణ్‌ను ట్రాప్ చేసి, పరీక్ష పేపర్లు బయటకు తీసుకువస్తానని, వాటిని అమ్మి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదామని చెప్పింది. పేపర్లు చేజిక్కిన తర్వాత భర్త లవడ్యావత్ డాక్యా, రాజేశ్వర్లతో కలిసి ప్రధానంగా తమ సామాజిక వర్గం వారికే విక్రయించాలని నిర్ణయించుకుంది. నీలేష్, గోపాల్‌లకు అమ్మడానికి సిద్ధమై ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. అయితే వాళ్లు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు వారి నుంచి తీసుకున్న రూ.15 లక్షల్లో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచి్చంది. 48 మందితో అసభ్య చాటింగ్.. ఫొటోల షేరింగ్ కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దాన్ని ఆన్లైన్లో నింపే క్రమంలో పొరపాట్లు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో కమిషన్ నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతూ ఉంటాయి. వీటిని సరి చేసుకోవడానికి అనేక మంది అభ్యర్థులు, అభ్యర్థినులు టీఎస్పీఎస్సీకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో యువతులు, మహిళలకు సహాయపడే ప్రవీణ్.. ఆపై వారిని ట్రాప్ చేసి లోబర్చుకునేవాడని తెలుస్తోంది. దాదాపు 48 మందితో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం చేశాడని ప్రవీణ్ ఫోన్‌ను విశ్లేషించిన సైబర్ నిపుణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేణుక కూడా ప్రవీణ్‌కు గురుకుల పరీక్షల నేపథ్యంలో పరిచయమైంది. 2018లో గురుకులాల్లో హిందీ టీచర్ పోస్టుకు ఆమె దరఖాస్తు చేసుకుంది. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కమిషన్‌కు వచ్చిన ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. పరీక్ష సమస్య పరిష్కారం కాగా.. పరిచయం కాస్తా సన్నిహిత సంబంధం వరకు వెళ్లింది. వీళ్లు కొన్ని వ్యక్తిగత ఫొటోలను కూడా షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో రేణుక గురుకుల పరీక్షలో క్వాలిఫై కావడంలోనూ లీకేజీ వ్యవహారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస సెలవులు.. మరిన్ని అనుమానాలు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 2018 నుంచి పనిచేస్తున్న రేణుక..ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సెలవులు తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష ఈ నెల 5న జరగగా.. నాలుగో తేదీన సెలవు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐదో తేదీ ఆదివారం కాగా.. బంధువులు చనిపోయారని ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సెలవులో ఉన్నట్లు ఆమె సహోపాధ్యాయులు తెలిపారు. మరోవైపు గ్రూప్–1 పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16న జరగగా.. నవంబర్‌లో 12 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యింది. 14 రోజులు మెడికల్ లీవ్ పెట్టినట్లు సిబ్బంది తెలిపారు. ఇప్పుడు, అప్పుడు పరీక్షల తర్వాత వరుస సెలవులు పెట్టిన క్రమంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో 13 మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్ -
ప్రశ్న పత్రం లీక్ యత్నం కేసులో సెల్ఫోన్లు సీజ్
పెడన: కోర్టుల్లో పోస్తుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ చేసేందుకు యత్నించి అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్ జైలుకు పంపించినట్టు కృష్ణాజిల్లా పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు. ఇప్పటికే వారి ఫోన్లో ప్రశ్న పత్రానికి సంబంధించిన ఫోటోలను వాటి జిరాక్స్ కాపీలను తీయించడంతో పాటు ఆ ఫోన్లను ఫోరెన్సిక్ (ఎఫ్ఎస్ఎల్)ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. నివేదిక వచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని, రాగానే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు. -
ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం
శ్రీకాకుళం న్యూకాలనీ/సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షళంత్రితోపాటు కొత్తకోట కేంద్రాల్లో పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీకైందంటూ తప్పుడు ప్రచారం చేయడం విద్యార్థుల్లో కలకలం సృష్టించింది. ఇలా లేనిపోని వార్తలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ హెచ్చరించారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ రిపోర్టర్‌ను విచారించారు. ఆయన తనకేమీ తెలియదని చెప్పారు. మరి చానెల్లో స్క్రోలింగ్ ఎలా వచ్చిందని అధికారులు ప్రశ్నించారు. రిపోర్టర్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం, రిపోర్టర్, తదితరులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి గార పగడాలమ్మ ఎస్పీ జీఆర్ రాధికకు ఫిర్యాదు ఇచ్చారు. అంతకుముందు పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ ఎం.జ్యోతికుమారి, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఆర్.జయప్రకాష్, రెవెన్యూ అధికారులు సందర్శించారు. పోలీసుల సహకారంతో క్షుణ్నంగా పరిశీలించాక ఎలాంటి లీకేజీ జరగలేదని నిర్ధారణకు వచ్చారు.