Radha Ravi
-
ఐశ్వర్య రాయ్‌పై అత్యాచారం చేస్తానంటే స్పందించలేదేంటి?: చిన్మయి
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని భావించానని, అలాంటి సీన్స్ లేకపోవడం నిరాశకలిగించిందని మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. ఇకపై అతనితో నటించబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లు త్రిషకు మద్దతు ప్రకటిస్తూ..మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మన్సూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే మన్సూర్ మాత్రం త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. తాను సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తనదైన స్టైల్లో స్పందించింది. మన్సూర్ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..గతంలో చాలా మంది హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నటుడు రాధా రవికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్) అందులో రాధా రవి ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ..‘నాకు హిందీ భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడ్ని. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్లు’ అని సరదాగా అన్నారు. రాధ రవి మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు. ఈ వీడియోని చిన్మయి ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. రాధరవి..ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేస్తానంటే అంతా జోక్‌గా తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి రాసుకొచ్చింది. (చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) చిన్మయి షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడరని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది రాధరవిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. "I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." - Radha Ravi Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7 — Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023 -
ఓటీటీలతో నిర్మాతలకు ఎప్పటికైనా చేటే: నటుడు
తమిళసినిమా: కణల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి చెన్నైలో ఘనంగా నిర్వహించారు. నైటింగేల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయ్బాల నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సమయ మురళి నిర్వహించారు. నటి కావ్యా బెల్లు శ్రీధర్ మాస్టర్, స్వాతికృష్ణన్, జాన్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెన్భా, సతీష్ చక్రవర్తి ద్వయం సంగీతాన్ని అందించిన దీనికి భాస్కర్ ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు. నటుడు రాధారవి ముఖ్య అతిథిగా హాజరైన చిత్ర ఆడియోను ఆవిష్కరించి మాట్లాడారు. చిత్ర కథను దర్శకుడు తనకు చెప్పారని చాలా బాగుందని పేర్కొన్నారు. నటి కావ్యా బెల్లు చాలా చక్కగా నటించారని ప్రశంసించారు. సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పెరిగిపోతున్నాయని, వీటితో నిర్మాతలకు ఎప్పటికైనా చేటే అని అన్నారు. దర్శకుడు సమయ మురళి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అన్నారు. -
నయన తారపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అభ్యర్థులంతా గెలిచేందుకు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ ఎన్నికల్లో హీరో కమల్ హాసన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కమల్‌కు మద్దతుగా నటి సుహాసిని ప్రచారం చేస్తోంది. బీజేపీకి మద్దతుగా ఖుష్బు, నమితతో పాటు పలువురు నటీనటులు ప్రచారం చేస్తుండగా, డిఎంకేలో స్టాలిన్ కుమారు ఉదయనిధి స్టాలిన్ ఊపు మీదున్నారు. సీని నటులు ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే, సీనీ నటుడు రాధా రవి హీరోయిన్ నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, నయన్‌తో సహజీవనం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ నాట చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గతంలో నేను నయన తార గురించి చెడుగా మాట్లాడానని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశానంటూ ఆరోపిస్తూ పార్టీలో ఉండడానికి అర్హత లేదన్నారు. నన్ను పార్టీ నుంచి పంపించాడానికి మీరేవరు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశిస్తూ ధ్వజమెత్తారు. ఇక మీ పార్టీలో నయన తార ఎవరని, ఉదయనిధితో ఆమె సహజీవనం చేస్తోందా.. అయినా అలాంటివి నేను పట్టించుకొను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కమల్ హాసన్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. భార్యలనే కాపాడుకోలేని కమల్ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని, ప్రధాని మోదీకి, కమల్‌కు చాలా తేడా ఉందంటూ విమర్శించారు. కాగా గతంలో రాధా రవి నయన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. దెయ్యం పాత్రలు పోషిస్తూ ఎంతో మందితో తిరిగిన ఆమె.. దేవత పాత్రలు చేయడానికి పనికిరాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నయ తారతో పాటు పలువురు సినీ పెద్దలు స్పందిస్తూ ఆయనపై దీరుపై మండిపడ్డారు. అయినా ఆయన తీరు మారలేదు. తాజాగా మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన రాధా రవిని బీజేపీ ప్రోత్సహిస్తోందంటూ ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. #RadhaRavi the star campaigner of B.J.P hasn't learned his lesson nor would never learn I suppose... He yet again shames #Nayanthara in a stage!! I wonder how can he get away with such disgusting, disgraceful, ill talks on one of South India's biggest actors...!! https://t.co/cwFsEFPuub pic.twitter.com/7hia5FfVDU — Visvesh ✨ (@PawPawVee) March 31, 2021 చదవండి: నిశ్చితార్థం చేసుకున్న నయనతార! ఆచార్య ఫస్ట్ సాంగ్: సీనియర్ నటి స్పెషల్ అట్రాక్షన్ -
ఇంకా విమర్శలు చేస్తే చిన్మయిపై పిటిషన్ వేస్తా
చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని సీనియర్ నటుడు, సౌత్ ఇండియన్ డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధార చెప్పారు. ఈయనపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కాగా ఈ యూనియన్‌కు గత 15 తేదీన ఎన్నికలు జరిగాయి. నటుడు రాధారవి మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి నామినేషన్‌ను వేసింది. అయితే ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. అది చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. దీంతో రాధారవి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బింగ్ కళాకారుల యూనియన్ సంక్షేమానికి పలు పథకాలును రచించినట్లు రాధారవి తెలిపారు. కాగా చిన్మయి వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆమె తమపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రచార ప్రియురాలిగా మారినట్లు విమర్శించారు. ఇంకా తమపై విమర్శలు చేస్తే చిన్మయిపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. -
క్షమాపణ కోరడం, కాళ్లు పట్టుకోవడం జరగదు: చిన్మయి
సాక్షి, చెన్నై: సీనియర్ నటుడు, దక్షిణ భారత డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధారవి, గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయికి మధ్య వివాదానికి తెరపడేలా లేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. గత 2018లో డబ్బింగ్ కళాకారుల యూనియన్‌కు జరిగిన ఎన్నికల్లో నటుడు రాధారవి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆయనపై గాయని చిన్మయి మీటూ ఆరోపణలను గుప్పించారు. దీంతో వీరి మధ్య వివాదానికి తెర లేచింది. కాగా గాయని చిన్మయిని యూనియన్ నుంచి తొలగించారు. అందుకు ఆమె సభ్యత్వాన్ని చెల్లించలేదన్న కారణాన్ని చూపారు. దీంతో చిన్మయి కోర్టును ఆశ్రయించారు. అక్కడ తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చినా, డబ్బింగ్ కళాకారుల యూనియన్ చిన్మయిని చేర్చుకోలేదు. కాగా డబ్బింగ్ కళాకారుల యూనియన్ ప్రస్తుతం కార్యవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో శనివారం ఎన్నికలు జరిగాయి. అయితే ఇంతకు ఈ ఎన్నికల్లో మళ్లీ రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి అధ్యక్షపదవికి బరిలోకి దిగారు. అయితే ఎన్నికల అధికారి చిన్మయి నామినేషన్‌ను రద్దు చేశారు. దీంతో ఆమె మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిన్మయి పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఇది అన్యాయం అంటూ చిన్మయి మరోసారి అప్పీల్ చేయడానికి సిద్ధం అయ్యారు. సోమవారం రిట్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. కాగా శనివారం డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికలు జరిగాయి. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను రద్దుకు గురి కావడంతో నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో ఇతర పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు. దీంతో ఆ ఎన్నికలను అడ్డుకునే విధంగా గాయని చిన్మయి పోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి రానుందనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా నటుడు రాధారవి మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి క్షమాపణ చెబితే ఆమెను తిరిగి యూనియన్‌లోకి చేర్చుకుంటామని అన్నారు. దీనికి స్పందించిన గాయని చిన్మయి క్షమాపణ కోరడం గానీ,నటుడు రాధారవి ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకోవడం గానీ జరగదన్నారు. తాను చట్ట పరంగానే ఎదుర్కొంటానని ఆమె పేర్కొన్నారు. -
రాధారవిపై చిన్మయి ఫైర్..
చెన్నై, పెరంబూరు: నటుడు రాధారవి కుట్ర పన్ని ఎన్నికల్లో గెలిచారని గాయని, డబ్బింగ్ కళాకారిని చిన్మయి విమర్శించారు. డబ్బింగ్ యూనియన్ భవన ని ర్మాణంలో అవక తవకలు జరిగాయని, లక్షల్లో డబ్బును తినేశారని, నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈమె కోలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రవేసుకున్నారనే చెప్పాలి. ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి వంటి వారిపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించారు. వారిని క్షమించేది లేదంటూ అవకాశం కలిగినప్పుడల్లా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆ మధ్య వైరముత్తుకు గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించగా దాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా నటుడు రాధారవికి చిన్మయికి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. సౌత్ ఇండియన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధారవి ఆ యూనియన్ నుంచి చిన్మయిని తొలగించారు. ఆమె వార్శిక చందాను చెల్లించని కారణంగానే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే తనపై కక్షతోనే రాధారవి తన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించిన చిన్మయి దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించింది. అయినప్పుటికీ ఆమె సభ్యత్వాన్ని ఆమోదించేది లేదంటూ యూనియన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా చిన్నయి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె నామినేషన్‌ను తిరష్కరించిన ఎన్నికల అధికారి నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దీనిపై చిన్మయి ఫైర్ అయ్యారు. ఈమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలన్నారు. అలాంటిది తన నామినేషన్‌ను ఎందుకు తిరష్కరించార న్నది వెల్లడించకుండా రాధారవి విజయం సాధించారని ప్రకటించడంలో అతి పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇక్కడ ఓడింది తాను మాత్ర మే అయితే మాట్లాడేదాన్ని కాదని అన్నారు. పలు ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో సభ్యులు గా ఉన్న వందలాది మంది పారితోషకాలు నుంచి తీసుకున్న 10 శాతం డబ్బుతో యూనియన్ను నిర్వహిస్తున్నారని, ఆ డబ్బుతోనే యూనియన్‌కు భ వనాన్ని కట్టబడిందని చెప్పారు. అయితే రూ. 47.5 లక్షలతో స్థలాన్ని, భవనాన్ని కట్టించి కోట్ల రూపాయలకు పైగా డబ్బింగ్ కళాకారుల డబ్బును స్వాహా చేశారని ఆరోపించారు. ఆ అవినీతిని బయటకు తీయడానికే తాము పోరాడుతున్నామని అన్నారు. అయితే ఎదిరించి మాట్లాడితే హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫోన్లో దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ యూనియన్‌లో రాధారవికి వ్యతిరేకంగా 45 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఇప్పుడు తానూ వారికి వ్యతిరేకంగా మారడంతో ఓటమి ఖాయం కావడంతో దొడ్డి దారిలో రాధారవి గెలిచినట్లు ఆరోపించారు. ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చిన్మయి తెలిపారు. -
నామినేషన్ తిరస్కరణ
తమిⶠఇండస్ట్రీలో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికలపై ఎప్పుడూ లేని ఆసక్తి నెలకొంది. దానికి కారణం ప్రెసిడెంట్ పదవికి రాధారవిపై పోటీగా డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని చిన్మయి నామినేషన్ వేయడమే. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు చిన్మయి. ఆ తర్వాత డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి ఆమె తొలగించబడ్డారు. కానీ కోర్టు నుంచి ఇంటర్న్ ఆర్డర్ (చిన్మయిని యూనియన్ సభ్యురాలిగా పరిగణించాలి) తెచ్చుకున్నారు చిన్మయి. ఆ తర్వాతే రామరాజ్యం పార్టీ తరఫున డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారామె. అయితే చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దాంతో రాధారవి ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘‘ఎలక్షన్ కమిషనర్ నేను సభ్యురాలిని కాదని నామినేషన్ తిరస్కరించారు. నా వద్ద కోర్ట్ ఇంటర్న్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఎందుకు సభ్యురాలిగా పరిగణించలేదో అర్థం కావడం లేదు. ఎవరి సూచనల మేరకు ఈ పని చేశారు? రాధారవి ఆజ్ఞ మేరకా? ఈ విషయంపై న్యాయపరంగా పోరాడతాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు చిన్మయి. -
చిన్మయి నామినేషన్ తిరస్కరణ
పెరంబూరు: దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికలు వివాదానికి తెరలేపాయి. ఈ యూనియన్ ఎన్నికలు బుధవారం చెన్నైలో జరిగాయి. కాగా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు రాధారవి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి పోటీ చేశారు. వీరిద్దరి మద్య చాలా కాలంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాధారవిపై చిన్మయి మీటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్ నుంచి తప్పించారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని తీర్పు నిచ్చింది. అలా చిన్మయి యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. కాగా బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరష్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అయితే చిన్మయి నామినేషన్ తిరష్కరణ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. దీంతో డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్ తిరష్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దీని గురించి ఆమె గురువారం మీడియా ముందుకు రానున్నారు. -
ఎం.ఆర్. రాధా బయోపిక్
ఎం.ఆర్ రాధ... తమిళంలో పాపులర్ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట. -
బీజేపీలోకి నమిత, రాధారవి
సాక్షి, చెన్నై: సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. శనివారం చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు కాషాయం కండువా కప్పుకున్నారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్ అభినందనలు తెలియజేశారు. అయితే సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు. -
ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి
విమర్శకుల దృష్టి ఇప్పుడు నయనతారపై పడింది. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. జయాపజయాలకు అతీతంగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. తమిళంలోనే ఇటు సూపర్‌స్టార్‌తో, అటు దళపతి విజయ్‌తో ఏకకాలంలో నటిస్తున్న నటి ఈమె. ఆ మధ్య తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాధారవి మాట్లాడుతూ నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ, మరో చిత్రంలో సీతగానూ నటిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చుననీ, ఇంతకు ముందు సీతగా నటించాలంటే కేఆర్.విజయనే ఎంపిక చేసేవారని అన్నారు. ఇప్పుడైతే నమస్కరించేవారూ నటించవచ్చు, అందుకు భిన్నమైన వారూ నటించవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీశాయి. చాలా మంది ప్రముఖులు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు. సాధారణంగా ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోని నయనతార ఈ వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. వెంటనే రాధారవికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసింది. అందులో ఇకపై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని భావిస్తున్నానని పేర్కొంది. అంతేకాదు నడిగర్ సంఘాన్ని గట్టిగానే ప్రశ్నించింది. సంఘం తమకు వృత్తిపరంగా సహకరించే విషయం గురించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇంతకుముందే ఒక లేఖ ద్వారా తెలియజేశానని, సుప్రీంకోర్టు వెల్లడించినట్లు నడిగర్ సంఘం ద్వారా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తారా? విశాఖా కమిటీ సూచనల మేరకు ఆరోపణలు చేసిన వారిని విచారిస్తారా? అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన నడిగర్‌సంఘం వెంటనే రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ లేఖ రాసింది. కాగా ఆదివారం జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపధ్యంలో నయనతార ఓటు వేయడానికి రాలేదు. దీంతో తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్సంఘంను ప్రశ్నించిన నయనతార, అదే బాధ్యతతో ఓటు వేయడానికి రావాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నయనతార ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. దీంతో ఒకరిని ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు తన బాధ్యతను కూడా నిర్వహించాలిగా అంటూ ఈ సంచలన నటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కష్టాల్లో నయన్!
దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. పారితోషికంలోనూ తన ఆధిక్యతను చాటుకుంటున్న ఈ లేడీ సూపర్‌స్టార్‌కు అవకాశాలు చేతి నిండా ఉన్నాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలాంటిది ఇప్పుడు వచ్చిన సమస్య అంతా సక్సెస్ రేటింగ్ పడిపోవడమే. ఈ విషయంలో నయనతార టైమ్ అస్సలు బాగోలేదనే చెప్పాలి. నిజానికి ఈ సంచలన నటి సక్సెస్‌ను చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య అరమ్, కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్‌లు అందుకున్న నయనతార ఆ తరువాత విజయాలకు దూరం అయ్యారు. ఇటీవల ఐరా, శివకార్తికేయన్‌తో నటించిన మిస్టర్ లోకల్ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం శిరోభారంగా మారిందనే చెప్పాలి. ఈ చిత్ర నిర్మాణంలోనే జాప్యం జరిగింది. ఎట్టకేలకు పూర్తి చేసుకుని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరకూ వచ్చిన కొలైయుధీర్ కాలం చిత్రం ఆ వేడుకలో సీనియర్ నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. దీనికి తోడు నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివ అది ఆగిపోయిందనుకున్న చిత్రం అని కొలైయుధీర్ కాలం గురించి చేసిన వ్యాఖ్యలు చిత్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తరువాత సమస్య పరిష్కారం అయ్యి చిత్ర విడుదలకు సన్నాహాలు జరిగి తేదీని కూడా ప్రకటించారు. అయితే టైటిల్ సమస్యతో చిత్ర విడుదలపై కోర్టు తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఇదంతా నటి నయనతారకు మనశ్శాంతిని కరువు చేసే సంఘటనలే. ఇలాంటి సమయంలో నయనతారకు మరో చింత పట్టుకుంది. ఇదే కొలైయుధీర్ కాలం చిత్రం హిందిలోనూ ఖామోషి పేరుతో తెరకెక్కింది. ఈ రెండు భాషలకు దర్శకుడు చక్రి తోలేటి. నయనతార పాత్ర హిందిలో తమన్నా నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలై అపజయాన్నే చవిచూసింది. దీంతో ఇప్పుడు కొలైయుధీర్ కాలం చిత్రం రిజల్ట్‌ను ఊహించుకుంటే నయనతారకు చెప్పలేనంత చింత పట్టుకుందట. అయితే ఆ చిత్రం గురించి కాదు నయనతార బాధ తన మార్కెట్‌కు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్నదేనట. ప్రస్తుతం ఈ అమ్మడు రజనీకాంత్‌తో దర్బార్, విజయ్‌కు జంటగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. -
రాధారవి, శరత్‌కుమార్ అరెస్టుకు ఆదేశం
సాక్షి, చెన్నై: సినీ నటులు రాధారవి, శరత్‌కుమార్‌ల అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రా«ధారవి కార్యదర్శిగా గతంలో ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నటీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
నేనెందుకు క్షమాపణ చెప్పాలి?
‘‘నేనెప్పుడూ ఎవర్నీ క్షమించమని అడగలేదు. అది మా రక్తంలోనే లేదు. అయినా నేనెందుకు క్షమాపణ అడగాలి. నేనేమైనా హత్య చేశానా’’ అని విరుచుకుపడ్డారు రాధారవి. నయనతారపై ఆ మధ్య ‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాధారవి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో చాలామంది రాధారవిని తప్పు పట్టారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజులకు ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను (నయనతార) బాధపెట్టి ఉంటే పశ్చాత్తాపపడుతున్నా’’ అని పేర్కొన్నారు రాధారవి. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో రాధారవి మాట్లాడుతూ – ‘‘ఒకవేళ ఆరోజు నేను మాట్లాడింది తప్పయితే అక్కడున్నవాళ్లు సపోర్ట్ చేసేవాళ్లు కాదు. ఇప్పుడు నా నుంచి క్షమాపణ ఎదురు చూస్తే చెప్పడానికి రెడీగా లేను. నటుడిగా నాకు అవకాశాలు రావంటున్నారు. అయితే నన్నెవరూ ఆపలేరు. సినిమాలు కాకపోతే నాటకల్లో నటిస్తాను’’ అన్నారు. -
ఆమె ప్రియుడిపై చట్టపర చర్యలా?
సినిమా: ఎవరో చేసిన పనికి మరెవరో బలి అవడం అంటే ఇదేనేమో. అంతే కాదు ఆవేశం అనర్థాలకు దారి తీస్తుందన్నది నిజం. అలా ఒక వ్యక్తి సంచలన వ్యాఖ్యలు ఇద్దరికి ఎఫెక్ట్ అవుతున్నాయి. అందులో ఒకరు అగ్రనటిగా రాణిస్తున్న నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్. రెండవ వ్యక్తి కొలైయుధీర్ కాలం చిత్ర నిర్మాత. అసలు విషయం ఏమిటంటే నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కొలైయుధీర్ కాలం. దీనికి బిల్లా–2 చిత్రం ఫేమ్ చక్రి తోలేటి దర్శకుడు. సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మాణ బాధ్యతలను చేపట్టి ఆ తరువాత వైదొలిగారు. సంగీత దర్శకుడిగానూ తప్పుకున్నారు. కారణాలేమైనా ఆ తరువాత ఈ చిత్రానికి మదియళగన్ నిర్మాత అయ్యారు. కాగా చాలా కాలం నిర్మాణంలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరగ్గా, ఆ వేడుకలో అతిథిగా పాల్గొన్న నటుడు రాధారవి నయనతారపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత వివాదానికి దారి తీశాయో తెలిసిందే. చివరికి రాధారవిని డీఎంకే పార్టీ బహిష్కరించే స్థాయికి సీరియస్ అయ్యింది. ఇకపోతే ఆయనకు కౌంటర్ ఇచ్చే విధంగా నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్ కొంచెం ఎక్కువగానే ఆవేశపడ్డాడు. నయనతారపై విమర్శలు చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్రానికి సంబంధించి అనవసర వ్యాఖ్యలు చేశాడు. కొలైయుధీర్ కాలం చిత్ర దర్శక నిర్మాతలు దాన్ని కొన్నేళ్ల క్రితమే వదిలేశారని భావించాను. అలాంటిదిప్పుడు సరికాని కార్యక్రమానికి అనవసర వ్యక్తులు పాల్గొని ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడారని అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు చిత్ర నిర్మాతకు తీరని నష్టాన్ని కలిగించాయట. చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేసే విధంగా నిర్మాతల వర్గం వ్యాపారం చేసుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు వైదొలిగారు. ఆగిపోయిన సినిమా అని విఘ్నేశ్‌శివన్ వ్యాఖ్యలతో ట్రైలర్ విడుదల తరువాత కొలైయుధీర్ కాలం చిత్రాన్ని కొనుగోలు చేద్దామనుకున్న పలువురు బయ్యర్లు వెనక్కుపోయారట. అంతే కాకుండా చిత్ర డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన ఒక ప్రముఖ సంస్థ కూడా వదిలేసిందట. దీంతో విఘ్నేశ్‌శివన్ వ్యాఖ్యల కారణంగా చిత్ర వ్యాపారం బాధించడంతో ఆ నష్టాన్ని ఆయనే భర్తీ చేయాలని, లేని పక్షంలో ఈ వ్యవహారంపై కేసు వేయడానికి నిర్మాత సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి. -
విశాల్‌పై భగ్గుమన్న రాధారవి
చెన్నై : ప్రముఖ నటి నయనతారపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాధారవి తీరును పలువురు కోలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తప్పుపడుతున్నారు. రాధారవి వ్యవహార శైలి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ భగ్గుమన్నారు. రాధారవి తన పేరుముందున్న రాధాను తొలగించుకోవాలని లేకుంటే మహిళలకు అన్యాయం చేసినట్టవుతుందని విశాల్ ఘాటుగా ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్‌పై రాధారవి స్పందించారు. తన పేరు ముందున్న పదాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది ఆర్కే నగర్ లాంటిదే..విశాల్ ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నాడు..రాధ మా తండ్రి పేరు..అందుకే ఈ పేరు పెట్టుకున్నా’నని రాధారవి పేర్కొన్నారు. కాగా,నయనతార నటించిన ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమెను ఉద్దేశించి రాధారవి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వేదికపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రవర్తనకు గాను ఆయనను డీఎంకే సస్పెండ్ చేసింది. -
టికెట్లు పంపిస్తాం... సినిమా చూడండి!
‘‘ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు దెయ్యం పాత్రలూ చేస్తున్నారు. వాళ్లే సీతపాత్రలూ చేస్తున్నారు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’’... ఇలా ఇటీవల తమిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’కి సంబంధించిన వేడుకలో నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నయనతారకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా చాలామంది సినీప్రముఖులు తమ గళం వినిపించారు. వారిలో సమంత కూడా ఉన్నారు. ‘‘మీరు బాధలో ఉన్న వ్యక్తి. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధగా ఉంది. మీ ఆత్మ లేక దాని తాలూకు ఏమైనా మీలో మిగిలి ఉంటే దానికి ప్రశాంతత కావాలి. నయనతార నెక్ట్స్ సూపర్‌హిట్ ఫిల్మ్ సినిమా టికెట్లు మీకు పంపిస్తాం. పాప్‌కార్న్ తింటూ చూసి ఆస్వాదించండి’’ అని కాస్త చమత్కరిస్తూనే తనదైన శైలిలో విమర్శిస్తూ సమంత ట్వీట్ చేశారు. సమంత ట్వీట్‌కు నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. -
డబ్బింగ్ చెప్పనిస్తారా?
‘మీటూ’ ఉద్యమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కీలకపాత్ర పోషించారు. ప్రముఖ తమిళ కవి వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా, అజ్ఞాతంగా ఉంటూ ఆయనపై ఆరోపణలు చేసినవారి ట్వీట్స్‌ను తన ట్వీటర్లో పోస్ట్ చేశారామె. అది మాత్రమే కాదు.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్‌లో ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండానే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యత్వ ఫీజు చెల్లించలేదనే కారణం చూపి చిన్మయిని యూనియన్ నుంచి పక్కనపెట్టారు. ఈ విషయంలో న్యాయం కోసం చిన్మయి మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు టెంపరరీ స్టే ఇస్తూ, ఈ విషయం మీద మార్చి 25లోగా వివరణ ఇవ్వాలని రాధారవిని ఆదేశించింది. ‘‘ఇది కేవలం కొన్ని రోజుల స్టే మాత్రమే. రాధారవి, అతని అనుచరులు ఎలా స్పందిస్తారో, అప్పుడు కేసు ఎలా ముందుకు నడుస్తుందో చూడాలి. ఇది వరకు యూనియన్ నుంచి తప్పించబడ్డ వాళ్ల అనుభవాలు వింటే ఇది కొన్నేళ్లపాటు సాగే పోరాటం అని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ఇలా కేసు ఏళ్ల తరబడి సాగితే చిన్మయి గొంతు తమిళంలో మళ్లీ ఎప్పుడు వినిపించాలి? అసలు చిన్మయికి మళ్లీ డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇస్తారా? కాలమే చెప్పాలి. -
చిన్మయి నిషేధంపై స్టే
మీటూ ట్వీట్లతో కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది మీటూ ఆరోపణల నేపథ్యంలో తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై చిన్మయి తీవ్ర ఆరోపణలు చేశారు. రాధరవి చాలా సందర్భాల్లో మహిళపై దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో కొద్ది రోజుల్లోనే చిన్మయిపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ నిషేధం విధించింది. ఈ ఘటనపై చిన్మయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిషేధంపై స్టే విధించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్మయి ‘కోర్టు నా మీద విధించిన నిషేధంపై స్టే ఇచ్చింది. కానీ ఇంకా చేయాల్సిన పోరాటం చాలా ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది’ అంటూ ట్వీట్ చేశారు. I have been awarded an interim stay order by the Honble Court regarding my ban from the Tamilnadu Dubbing Union. It is a long legal battle ahead. Hope justice will prevail. Thank you. — Chinmayi Sripaada (@Chinmayi) 15 March 2019 -
మరో షాకిచ్చిన చిన్మయి
నటుడు రాధారవితో తాడో పేడో తేల్చుకోవడానికి గాయని చిన్మయి సిద్ధం అయినట్టున్నారు. రాధారవి, ప్రముఖ సీనియర్ నటుడు, దక్షిణ భారత బుల్లితెర, సినీ డబ్బింగ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. ఇక గాయని చిన్మయి డబ్బింగ్ కళాకారుల సంఘంలో సభ్యురాలు కూడా. ఆమె నటి త్రిష వంటి ప్రముఖ నటీమణులకు గొంతును అరువిస్తుంటారు. అయితే ఇటీవల రాధారవికి చిన్మయికి మధ్య బహిరంగ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో మీటూకు ప్రాబల్యం తీసుకొచ్చింది చిన్మయినే అని చెప్పవచ్చు. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించి సంచలనం పుట్టించిన చిన్మయి నటుడు రాధారవిని వదలలేదు. దీంతో చిన్మయి ఆరోపణల్లో నిజం లేదంటూ కొట్టిపారేసిన రాధారవి అంతటితో ఊరుకోకుండా, ఆమెను డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి తొలగించారు. అందుకు చిన్మయి రెండేళ్లుగా సంఘ వార్షిక సభ్యత్వ రుసుంను చెల్లించలేదన్నది సాకుగా చూపారు. అందుకు చిన్మయి ఘాటుగానే స్పందించారు. మీటూ ఆరోపణ కారణంగానే రాధారవి తనను సంఘం నుంచి తొలగించారని, అయినా తన సభ్యత్వాన్ని రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని, తాను శాశ్వత సభ్యురాలినని పేర్కొన్నారు. తాజాగా రాధారవికి మరో షాక్ ఇచ్చారు. రాధారవికి మలేషియా ప్రభుత్వం డటోక్ అనే ఆ దేశ ప్రతిష్టాత్మకమైన బిరుదుతో సత్కరించిందట. దీంతో ఆయన పేరు ముందు డటోక్ అపే బిరుదును తగిలించుకున్నారు. ఈ బిరుదు వెనుక గుట్టును గాయని చిన్మయి బయట పెట్టారు. ఈ బిరుదుపై మలేషియా ప్రభుత్వానికి చిన్మయి లేఖ రాసి నిజానిజాలు తెలిపాల్సిందిగా కోరారు. చిన్మయి లేఖకు స్పందించిన ఆ దేశ ప్రభుత్వం రాధారవికి తమ ప్రభుత్వం డటోక్ బిరుదును అందించిన దాఖలాలు లేవని, అసలు భారతదేశానికి సంబంధించి ఒక్క నటుడు షారూక్‌ఖాన్‌కు మినహా మరెవరికీ ఆ బిరుదును అందించలేదనిపేర్కొంది. ఈ విషయాన్ని గాయని చిన్మయి శనివారం తన ట్విట్టర్లో పోస్ట్‌చేసి రాధారవి డటోక్ పట్టం నకిలీ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి దీనికి రాధారవి స్పందన ఎలా ఉంటుందో? -
తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు
‘మీటూ’ ఉద్యమం గురించి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిర్భయంగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన ట్వీటర్ ఖాతా ద్వారా చాలా మంది అజ్ఞాత స్త్రీల ఆరోపణలకు గొంతునిచ్చారు. ప్రముఖ పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవి మీద ఆరోపణలు చేశారు. వీటివల్ల మీకు అవకాశాలేమైనా తగ్గుతాయనుకుంటున్నారా? అని ఆ మధ్య ‘సాక్షి’ అడిగినప్పుడు ‘అలాంటిదేం లేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా’’ అని చిన్మయి అన్నారు. మరి.. తాజా పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. విషయం ఏంటంటే.. చిన్మయిని డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తొలగించారు. ‘‘నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అంటే.. ఇక తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పలేను. రెండు సంవత్సరాలుగా నేను యూనియన్ ఫీజŒ కట్టలేదన్నదాన్ని కారణంగా చూపించారు. కానీ, ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పడం వల్ల నాకొచ్చిన ఆదాయంలో 10శాతం తీసుకున్నారు. పాత బకాయిలున్నట్టు మెసేజ్ కానీ, లెటర్ కానీ పంపకుండా నా మెంబర్షిప్ తొలగించారు. మళ్లీ తమిళ సినిమాలకు డబ్ చేస్తానో లేదో తెలియదు’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. విశేషం ఏంటంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌కు రాధారవి ప్రెసిడెంట్. -
మీటూ.. ఓ బెదిరింపు ఆయుధం
‘‘ప్రొఫెషనల్ పని మీద ఇంటికి వెళ్తే నాతో తప్పుగా ప్రవర్తించాడు’’ అంటూ తమిళ నటుడు, నటి రాధిక సోదరుడు రాధారవి మీద ఓ మహిళ అజ్ఞాతంగా ఆరోపించారు. ఈ విషయంపై రాధారవి స్పందించారు.. ‘‘రేసిజం గురించి మాట్లాడటానికి అమెరికాలో మొదలైన ‘మీటూ’ ఉద్యమం మన ఇండియాలో తప్పు దారిలో నడుస్తోంది. కొన్ని రోజులైతే ‘మీటూ’ అనేది బెదిరింపు ఆయుధంలా మారిపోతుందేమో? మీటూ అనేది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా. ఇలా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎవరు కరెక్టో మనం తెలుసుకోవాలి. మేం అజ్ఞాతంగా ఉంటాం కానీ మగవాళ్ల పేర్లు మాత్రం చెబుతాం అంటున్నారు. తప్పు జరిగితే వెంటనే బయటకు చెప్పాలి. 15 ఏళ్ల క్రితం ఇలా జరిగింది అని చెప్పడంలో పాయింటే లేదు. ఉద్యమం నిజమైతే నేను కచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ ‘మీటూ’ నమ్మేలా లేదు. అందుకే సపోర్ట్ చేయదలచుకోలేదు’’ అన్నారు. -
అన్నయ్యతో కలిసి...
తమిళనాట ఎంతో పాపులారిటీ సంపాదించిన నటుడు, రాజకీయ నాయకుడు ఎం.ఆర్. రాధా. ఆయన వారసుడు రాధారవి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక రాధిక అప్పట్లో కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా సంపాదించుకున్న పేరు గురించి తెలిసిందే. 1980లలో ఎన్నో సినిమాల్లో ఈ అన్నాచెల్లెళ్లు ఆన్ స్క్రీన్ కూడా అన్నాచెల్లెళ్లుగా నటించారు. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా కోసం ఈ ఇద్దరూ మళ్లీ స్క్రీన్‌పై బ్రదర్ అండ్ సిస్టర్‌గా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అధర్వ మురళీ హీరోగా శ్రీ గణేష్ తెరకెక్కించనున్న ‘కురుది అట్టమ్’లో రాధిక, రాధారవి చాలా గ్యాప్ తర్వాత కలిసి యాక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తెలియజేస్తూ – ‘‘రాధిక, రాధారవి మా సినిమాకు కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. ఆ క్యారెక్టర్స్ రాసుకున్నప్పటి నుంచీ వీళ్లను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేదు. ఇద్దరికీ నా కథ నచ్చి ఒప్పుకోవడం నాకు చాలా గ్రేట్ మూమెంట్’’ అని పేర్కొన్నారు. -
నటుడు, డీఎంకే నేత ఇంటిపై బాంబుదాడి
సాక్షి, చెన్నై: సీనియర్ నటుడు, డీఎంకే నేత రాధా రవి ఇంటిపై సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు దాడిలో రవి సోదరుడు కుమార్ (55) గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన తమిళనాడు డీఎంకే నేతలలో కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కంచీపురంలోని డీఎంకే నేత రవి ఇంటిపై దాడికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటర్‌పై రవి ఇంటికి రాగా, మూడో నిందితుడు ఇంటి చుట్టుపక్కల వారి కదలికలను గమనించాడు. స్కూటర్ దిగిన ఇద్దరు వ్యక్తులు రాధా రవి ఇంటి ఆవరణలోకి చొరబడి క్రూడ్ బాంబులను విసిరారు. ఓ బాంబును ఇంటి ముందు విసిరిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల బాంబు దాడిలో నటుడు రవి సోదరుడు కుమార్ (55) గాయపడగా, చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
నటుడి ఇంటి వద్ద పోలీసు భద్రత
కేకే.నగర్(చెన్నై): దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడిన మాట్లాడిన డీఎంకే నేత, నటుడు రాధారవిపై నిరసన జ్వాలలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో రాధారవి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మింట్‌లో ఇటీవల జరిగిన డీఎంకే బహిరంగ సమావేశంలో నటుడు రాధారవి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేనాంపేటలో గల రాధారవి ఇంటిని ముట్టడించి పోరాటం చేస్తామని దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు రాధాకృష్ణన్ ప్రకటించాడు. దీంతో రాధారవి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. దీనిపై రాధారవి మాట్లాడుతూ తాను దివ్యాంగుల మనసు బాధించేలా మాట్లాడలేదని తెలిపారు. కనిమొళి ఖండన రాధారవి మాటలను డీఎంకే మహిళా విభాగ కార్యదర్శి కనిమొళి తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ దివ్యాంగులను కించపరిచి వారి మనసులు బాధించే విధంగా రాధారవి మాట్లాడడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇకనైనా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హితవు చెప్పారు.