Railway passengers
-
రైల్వేశాఖ సరికొత్త కార్యక్రమం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం కల్పిస్తోంది. ఖాళీ బెర్త్‌ల గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందిస్తోంది.హాజీపూర్ రైల్వే జోన్లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలోనూ ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్)లో ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంట్లో కూర్చొనే రైలులో ఖాళీగా ఉన్న సీట్ల గురించి నాలుగు గంటల ముందుగానే తెలుసుకుంటారు. ఏ రైలులో ఏ తరగతిలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే వీలుంది.రిజర్వేషన్ ఇలా.. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, ఖాళీగా ఉన్న సీట్లను కేటాయించే కరెంట్ రిజర్వేషన్ ఆన్లైన్లో జరగదు. ఇందుకోసం స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. దానాపూర్ రైల్వే డివిజన్ నుంచి బయలుదేరే రైళ్ల ప్రస్తుత స్థితిని తెలిపే వ్యవస్థను ప్రారంభించారు. రైలు ఎక్కడ నుండి బయలుదేరుతుందో అదే స్టేషన్ నుండి కరెంట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే రైలు ఆలస్యమైతే ఆ రైలు ఏ స్టేషన్ గుండా వెళుతుందో తెలిసిపోతుంది. అంతే కాదు ఏ ప్రత్యేక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ రోజు నడుస్తుందనే సమాచారాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నారు.మొబైల్లో మొత్తం సమాచారం రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, అన్ని తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల పూర్తి సమాచారం ‘ఎక్స్’, ఫేస్బుక్ ద్వారా ప్రయాణికుల మొబైల్ ఫోన్ స్క్రీన్‌పైకి వస్తుంది. దీని ఆధారంగా ఖాళీ సీట్లకు అప్పటికప్పుడు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్‌కు రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్ మధ్య వ్యత్యాసం ఉంది. రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు బుక్ చేసుకునేది తత్కాల్ టికెట్. అదే కరెంట్ రిజర్వేషన్ కోసం ఆ రైలు చార్ట్ సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. చార్ట్ తయారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల స్థితని కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తెలియజేస్తారు. -
వచ్చే అయిదేళ్లలో 3 వేల కొత్త రైళ్లు
న్యూఢిల్లీ: రానున్న నాలుగయిదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.వీటివల్ల రైల్వేల ప్రయాణికుల సామర్థ్యం ప్రస్తుతమున్న 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరుగుతుందని వెల్లడించారు. రైళ్ల వేగాన్ని పెంచడం, నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడం కూడా తమ శాఖ ప్రథమ లక్ష్యమని గురువారం ఆయన రైల్వే భవన్లో మీడియాకు తెలిపారు.ప్రస్తుతం 69 వేల కొత్త కోచ్‌లు అందుబాటులో ఉండగా, ఏటా 5 వేల కోచ్‌లు కొత్తగా తయారవుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో ఏడాదికి 200 నుంచి 250 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు రానున్న సంవత్సరాల్లో మరో 400 నుంచి 450 వరకు వందేభారత్ రైళ్లు కూడా ఉంటాయని పేర్కొన్నాయి. -
రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు!
పాట్నా: బీహార్ ఛప్రా జిల్లాలో ఓ రైలులో ప్రయాణిస్తున్న యువకుడు బిత్తిరి చర్యకు పాల్పడ్డాడు. కదులుతున్న ట్రైన్లో ఒక చేత్తో వేలాడుతూ మరో చేతిలో బెల్టు తోక వైపున పట్టుకుని బకిల్ తగిలేలా పక్క రైల్లో ప్రయాణిస్తున్న వారిని కొడుతూ కనిపించాడు. కదులుతున్న ఒక రైలు కంపార్టుమెంట్ డోర్ దగ్గర నిలబడి మరో ట్రైన్ డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఓ పోకిరి. పక్కనున్నవారు వాడు చేస్తోన్న పాడు పనికి వత్తాసు పలుకుతున్నారు. ఈ ఆకృత్యాన్ని వీడియో తీసి రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు మరో యువకుడు. ట్విట్టర్లో వీడియో తోపాటు.. పక్క రైలులో డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతున్నాడు. ఇది కరెక్టేనా..? దీని వలన ఈ యువకుడితో పాటు అటువైపున్న వ్యక్తికి కూడా ప్రమాదమే. ఒకవేళ ట్రైన్ నుండి పడిపోయినా దారుణం జరుగుతుంది. దయచేసి ఇలాంటి సంఘ వ్యతిరేక వ్యక్తులపై చర్యలు తీసుకోండి.. అంటూ విజ్ఞప్తి చేశాడు. దీని బదులిస్తూ తూర్పు మధ్య రైల్వే.. ఈ సంఘటనను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకంటామని తెలిపింది. ఇది కూడా చదవండి: మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’ यह व्यक्ति दुसरे ट्रेन में दरवाजे के पास बैठे लोगों को बेल्ट से मार रहा है, क्या यह सही है 🤔 इस व्यक्ति के बेल्ट से मारने के कारण दरवाजे में बैठा व्यक्ति ट्रेन से गिर भी सकतें है,बड़ी दुर्घटना भी हो सकती है कृपया ऐसे आसामाजिक आतंकी लोगों पर कड़ी कार्यवाही करें 🙏@RailMinIndia… pic.twitter.com/BQEgHWe9rO — देव 🚩 (@I_DEV_1993) July 7, 2023 -
Balaji Division: బాలాజీ పట్టాలెక్కేనా!
సాక్షి, రాజంపేట: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదనే భావన ఉమ్మడి వైఎస్సార్ జిల్లా రైలు ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులను వేధిస్తోంది. కొత్త జోన్ ఏర్పడిన తరుణంలో కొత్త డివిజన్‌గా యేళ్లతరబడి ప్రతిపాదనలో ఉన్న బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్‌లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేయాలని సీమ వాసుల నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. గుంతకల్‌కు వెళ్లాలంటే దూరాభారం... తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్‌లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై వత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96 కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39 కి.మీ), పాకాల–మదనపల్లె (83 కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ)లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలుగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్‌లోకి వెళ్లింది. కొత్తడివిజన్ ఏర్పడితే నందలూరుకు పూర్యవైభవం.. కొత్త డివిజన్ ఏర్పడితే బ్రిటీషు కాలం నాటి రైల్వేకేంద్రానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలో ఉన్న రేణిగుంట జంక్షన్ తర్వాత నందలూరు రైల్వేకేంద్రం రైల్వేపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. డివిజన్‌కు రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా రాజ్యసభలో నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వేపరిశ్రమ వస్తే గుంతకల్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుందని రైల్వే ఉన్నతాధికారులు భావించినట్లు తెలుస్తోంది. విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వరకు బాలాజీ డివిజన్‌గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం బాలాజీ డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖజోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజన్ ఉంటుంది. డివిజన్ కావడానికి అన్ని అర్హతలు బాలాజీ డివిజన్‌కు ఉన్నాయి. అందరికి ఉపయోగకరం. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా అడుగులు వేయాలి. –షేక్ కమాల్‌బాషా, మాజీ కార్మికనేత, రైల్వే మజ్దూర్ యూనియన్ దశాబ్దాల నుంచి బాలాజీ డివిజన్ ప్రతిపాదన బాలాజీ డివిజన్ ఏర్పాటైతే నందలూరుకు మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నట్లే. రైల్వేపరిశ్రమ పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. బాలాజీ డివిజన్లో రేణిగుంట తర్వాత ప్రాముఖ్యత కలిగిన రైల్వేకేంద్రం నందలూరు. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. –పులి భాస్కరయ్య, రిటైర్డ్ లోకోపైలెట్, నందలూరు బాలాజీ డివిజన్‌ను బలపరచాలని ఎంపీలను కోరుతాం విశాఖ జోన్ ఏర్పాటు నిర్ణయం శుభపరిణామం. ఈ నేపథ్యంలో బాలాజీ డివిజన్ ప్రతిపాదనను బలపరచాలని ఎంపీలను కోరతాము. గుంతకల్ కారణంగా నందలూరుకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల నందలూరుకు పూర్వవైభవం వస్తుందని రైల్వేనిపుణులు చెబుతున్నారు. –సయ్యద్‌అమీర్, వైఎస్సార్సీపీ, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధాన రైల్వేకేంద్రం: నందలూరు ప్రధాన స్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లా మీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం
IRCTC Tatkal Tickets.. సాక్షి, అమరావతి: ఈ–టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్‌ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీనిపై సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో కలసి రూపొందించిన నివేదికను రైల్వే శాఖకు ఐఆర్సీటీసీ సమర్పించింది. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఐఆర్సీటీసీ పోర్టల్‌లో సమూల సంస్కరణలు తీసుకువస్తూ.. అప్‌గ్రేడ్ చేయనున్నారు. దారి మళ్లుతున్న 35 శాతం తత్కాల్ టికెట్లు.. రైల్వే శాఖ ఈ–టికెటింగ్ విధానంలో ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్లను కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఫేక్ ఐడీలతో అక్రమంగా బల్క్ బుకింగ్ చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ నియమించిన గ్రాంట్ థాంటన్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది. తత్కాల్ కోటాలోని దాదాపు 35 శాతం టికెట్లు ఇలా దారిమళ్లుతున్నట్టు తేలింది. దీంతో బల్క్ బుకింగ్‌ల దందాకు అడ్డుకట్ట వేయాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఈ–టికెటింగ్ పోర్టల్‌లో సంస్కరణలు తీసుకువచ్చి అప్‌గ్రేడ్ చేయనుంది. అలాగే ఈ–టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐఆర్సీటీసీ పోర్టల్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2021 డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం 80.5 శాతం రైల్వే టికెట్లు ఈ–టికెటింగ్ విధానంలోనే బుక్ చేస్తున్నారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్లలోని కౌంటర్ల వద్ద కంటే ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా మూడు రెట్లు అధికంగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో ఇప్పటివరకు 10 కోట్ల మంది నమోదు చేసుకోగా.. వారిలో 7.50 కోట్ల మంది ఈ–టికెట్ల కొనుగోలులో క్రియాశీలకంగా ఉంటున్నారు. 2014లో అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ పోర్టల్‌కు సగటున నిమిషానికి 28 వేల లావాదేవీలు సాగించే సామర్థ్యముంది. కానీ గత ఎనిమిదేళ్లలో డిమాండ్ అమాంతం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సేవలు అందించేందుకు పోర్టల్ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే పోర్టల్‌సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. నిమిషానికి 40 వేల వరకు లావాదేవీలు సాగించే సామర్థ్యంతో పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్ కల్లా అప్‌గ్రేడ్ చేసిన పోర్టల్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా చదవండి: AP: హెచ్ఆర్సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం -
కదిలే రైలు నుంచి ప్యాసింజర్‌ను తోసేసిన సిబ్బంది
లక్నో: రైల్వే ప్యాంట్రీ సిబ్బంది దాష్టికానికి తెగపడ్డారు. కదిలే రైలు నుంచి ఓ వ్యక్తిని బయటకు తోసేశారు. వాటర్ బాటిల్ విషయంలో అతను వాళ్లతో వాగ్వాదానికి దిగగా.. పాన్ మసాలా రైలులో ఉమ్మేశాడంటూ సిబ్బంది అతనిపై దాడికి దిగారు. ఉత్తర ప్రదేశ్ లలిత్పూర్ దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ బాటిల్ విషయంలో చెలరేగిన గొడవ.. చిలికి చిలికి దుమారం రేపింది. ఆ కోపంలో సిబ్బంది.. సదరు ప్రయాణికుడిపై కక్ష కట్టారు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ గొడవ పెట్టుకుని.. చితకబాది బయటకు తోసేశారు. రవి యాదవ్(26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. జిరోలి దగ్గరకు చేరుకోగానే ప్యాంట్రీ స్టాఫ్‌తో అతనికి గొడవ మొదలైంది. వాటర్ బాటిల్ కొనుగోలు మొదలై.. రైలులో పాన్ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ పెద్దది అయ్యింది. ఈ తరుణంలో లలిత్పూర్ స్టేషన్ దగ్గర రవి యాదవ్ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు. ఈలోపు రైలు కదిలింది. బలవంతంగా అతన్ని ఆపేసి.. రైలులోనే దాడి చేశారు. ఆపై అతన్ని పట్టాలపైకి విసిరేశారు. స్థానికులు రవిని గమనించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడినట్లు ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. రవి ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని.. ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. -
రైలు ప్రయాణం.. యూటీఎస్ యాప్‌లో జనరల్ టికెట్ల బుకింగ్ ఇలా!
సాక్షి, ఖమ్మం : రైలు ప్రయాణమంటే హడావుడి అంతాఇంత కాదు. ఇంటి నుంచి స్టేషన్‌కు పిల్లలు, లగేజీతో చేరుకోవడం.. తీరా టికెట్ కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూలో నిల్చొని టికెట్ తీసుకోవడం.. ఇంతలోనే ఎక్కాల్సిన రైలు ఒక్కోసారి వెళ్లిపోవడం.. టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టాల్సి రావడం.. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేలా రైల్వే శాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరి చేతుల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన స్మార్ట్ పోన్లు ఉంటున్న నేపథ్యంలో ఎంచక్కా ఇంటి నుంచే జనరల్ టికెట్ బుక్ చేసుకుని సమయానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లే అవకాశం కల్పించారు. యూటీఎస్(అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం) మొబైల్ యాప్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్లలో యాప్ ఉపయోగించుకునేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. ప్రధాన రైల్వేస్టేషనల్లో పండుగ సెలవులు, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడకుండా యాప్ ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాగా, ప్రయాణికులు రైలు ప్రయాణం చేసే రోజునే ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుక్ అయిన గంటలోపే రైలు ఎక్కాల్సి ఉండగా, ఎక్కాల్సిన రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రైలు ఉన్నప్పుడే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ అవుతుంది. అలాకాకుండా రైలు ఎక్కాక టికెట్ బుక్ కాదు. అలాగే, స్మార్ట్ ఫోన్లో జీపీఆర్ఎస్ యాక్టివేషన్లో ఉండాలి. చదవండి: చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు.. యాప్‌లో నమోదు, బుకింగ్ ఇలా.. జీపీఆర్ఎస్ యాక్టివేషన్ ఉన్న స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేశాక ఫోన్ నంబర్, పేరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసుకుని వచ్చే ఓటీపీ ఆధారంగా ఖాతా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆతర్వాత యాప్ తెరిచి ఫోన్ నంబరు, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అయితే సాధారణ బుకింగ్, క్విక్ బుకింగ్, ఫ్లాట్‌ఫాం టికెట్, సీజన్ టికెట్, క్యూఆర్ బుకింగ్, కేన్సల్ టికెట్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం తదితర వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక నగదు చెల్లింపునకు ఆర్–వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ ఉపయోగించుకోవచ్చు. కాగిత రహిత టికెట్ ఆప్షన్ ఎంచుకుంటే టికెట్ కలెక్టర్లకు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్న టికెట్ చూపిస్తే సరిపోతుంది. లేదా ముద్రించిన టికెట్ ఆప్షన్ ఎంచుకుంటే రైల్వేస్టేషన్‌లోని ఏటీవీఎం, కో–టీవీఎం, ఓసీఆర్ యంత్రాలు, ఓటీఎస్ బుకింగ్ కౌంటర్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఖమ్మం స్టేషన్లో అవగాహన.. ఖమ్మం మామిళ్లగూడెం: యూటీఎస్(అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టమ్)పై రైల్వే అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు జనరల్ టికెట్లతో పాటు సీజన్ టికెట్లు, పాస్ తీసుకునే అవకాశముందని వెల్లడించారు. ఇందుకోసం ఖమ్మం రైల్వేస్టేషన్లో మంగళవారం అవగాహన కల్పించిన అధికారులు సాధారణ బుకింగ్ కౌంటర్ వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేయడమే కాక స్టేషన్ పరిసరాల్లో కూ ఆర్ కోడ్ స్కానర్లు అమర్చారు. చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులు, రైల్వే ఆస్తుల పరిరక్షణపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: రైల్వేతో పాటు ప్రయాణికుల ఆస్తుల పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రస్తుత వేసవిలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటం, పెద్దఎత్తున సరుకు రవాణా రైళ్ల రాకపోకలు.. ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముంది. దొంగలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే నేరస్తులతో సహా అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అరికట్టేందుకు ఆర్పీఎఫ్ పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. రైల్వే ఆస్తుల రక్షణతో పాటు, ప్రయాణికుల భద్రత కోసం రాష్ట్ర పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రయాణంలో ప్రమాదాలు... రైలు పట్టాలే మృత్యుపాశాలుగా మారుతున్నాయి. జీవితంపై విరక్తితో కొందరు ఆత్మహత్యల కోసం పట్టాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్లలో పట్టాల మీదుగా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు దాటుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా, కదిలే రైలు ఎక్కడం వల్ల, లేదా రైలు స్టేషన్లో పూర్తిగా ఆగకుండానే దిగేందుకు ప్రయత్నిస్తూ మరికొందరు పట్టాలపైకి జారి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నియంత్రణలో ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తత వల్ల కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. ‘మిషన్ జీవన్ రక్ష’ కింద ఈ ఏడాది మార్చి నెలలో 13 మంది పురుషులు, 8 మంది మహిళలను కాపాడినట్లు అధికారులు తెలిపారు. బాలలకు భరోసా.. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి రైళ్లెక్కే చిన్నారులకు రైల్వేస్టేషన్లే అడ్డాలుగా మారుతున్నాయి. తెలిసీ తెలియక రైళ్లలో దూర ప్రాంతాలకో చేరుకొని అసాంఘిక శక్తుల చేతుల్లో పడుతున్న పిల్లలు వీధి బాలలుగా మారి చివరకు నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పిల్లల రక్షణ కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. ► రైల్వేస్టేషన్లలో బాలల రక్షణ కోసం పని చేసే సహాయ కేంద్రాలకు ఆర్పీఎఫ్ బాసటగా నిలు స్తోంది. ‘ఆపరేషన్ నాన్హే ఫరిస్తే’ పథకంలో భా గంగా ఇల్లు వదిలి తప్పిపోయి, లేదా పారిపోయి వచ్చిన 93 మంది పిల్లలను ఆర్పీఎఫ్ దళాలు కాపాడాయి. వారిలో 66 మంది అబ్బాయిలు, మరో 27 మంది అమ్మాయిలు ఉన్నారు. ► ‘ఆపరేషన్ డిగ్నిటీ’ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులు, నిస్సహాయులు, మతిస్థిమితం లేనివారు, అక్రమ రవాణాకు గురయ్యే వాళ్లను గుర్తించి రక్షించారు. అలాంటి వారిని తిరిగి కుటుంబాలకు అప్పగించారు. అయిదుగురు పురుషులతో పాటు 10 మంది మహిళలను కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణంలో వైద్య సహాయం అవసరమైన 59 మందిని ఆర్పీఎఫ్ దళాలు సత్వరమే చేరుకొని ఆస్పత్రులకు తరలించాయి. అక్రమ రవాణాపై ఉక్కుపాదం... ► రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ నార్కో స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.గత నెలలో రూ.7.50 లక్షలకు పైగా విలువైన మాదకద్రవ్యాల ఉత్పత్తులను జప్తు చేసి, ఆరుగురు వ్యక్తుల ను అరెస్టు చేశారు. ఆపరేషన్ సట్కార్క్’లో భాగంగా రూ.1.97 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. -
రాజ్యసభ ముందుకు రైల్వే ప్రయాణీకుల సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణీకుల సమస్యలను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. రైళ్లలో అపరిశుభ్రమైన దుప్పట్లు సరఫరా చేస్తున్నారని, ఏసీ సరిగా ఉండటం లేదని ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ సమత, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సరైన ఏసీ సదుపాయ ఉండటం లేదని, అపరిశుభ్రమైన బెడ్ రోల్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. రైళ్లలో శుభ్రతతో కూడిన దుప్పట్లు సరఫరా చేయడంతో పాటు అంతరాయం లేని ఏసీని అందుబాటులోకి తేవాలని కోరారు. రైళ్లలో కనీస సదుపాయాలను పరిశుభ్రంగా ప్రయాణీకులకు అందించాలని, ఈ విషయంలో రైల్వే శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
తేరా టైం ఆయేగా - కేంద్రమంత్రి హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, అలియా జంటగా నటించిన బాలీవుడ్ మూవీ గల్లీబాయ్ లోని అప్నా టైం ఆయేగా పాటను రైల్వే మంత్రి పియూష్ గోయల్ బాగా వాడేశారు. ఇదే సాంగ్ థీమ్ తో ‘తేరా టైం ఆయేగా’ అంటూ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక చేశారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైల్వే ప్రయాణికులను ఉద్దేశించి ‘తేరా టైం ఆయేగా అంటూ ఫన్ ట్రాక్‌తో రూపొందించిన సాంగ్ ఇపుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. దీన్ని స్వయంగా పీయూష్ గోయల్ తన ట్విటర్లో షేర్ చేశారు. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న అప్నా టైం పాట తరహాలో టికెట్ లేని ప్రయాణం నేరం అనే అవగాహనను ప్రయాణీకుల్లో కల్పించేందుకు ప్రయత్నించారు. దీంతో ‘తేరాం టైం’ రీమిక్స్ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో టీసీ టిక్కెట్లు తనిఖీ, టిక్కెట్లు లేని వారికి జరిమానా విధింపు, ప్రయాణికుల ఫొటోలతో కూడిన సాంగ్ ట్రాక్ మ్యూజిక్ వీడియోను పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘టికెట్ లేకుండా ప్రయాణం చేయకండి... యూటీఎస్ యాప్, ఏటీవీఎం మెషీన్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయండి’ అంటూ, దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో పాట పూర్తవుతుంది. Tera Time Aayega pic.twitter.com/3JI8SoPx3u — Piyush Goyal (@PiyushGoyal) February 18, 2019 -
మధుమేహులకు రైళ్లలో ప్రత్యేక భోజన వసతి
సాక్షి, హైదరాబాద్: మధుమేహులు ప్రయాణాల్లో ఏది పడితే అది తినలేరు. ఒకవేళ తిన్నా.. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే అలాంటి వారికోసం రైల్వే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వారి కోసం రైలు ప్రయాణంలో ప్రత్యేకంగా ఆహారాన్ని అందించనుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’అనే యాప్‌ను రూపొందించింది. ‘మాతో కలసి ప్రయాణం చేస్తున్నపుడు మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం’అంటూ ఐఆర్సీటీసీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఎలా ఆర్డర్ చేయాలి? http://bit.ly/2Oees9O లేదంటే.. food on track appని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యాప్: food on track app ఐఓఎస్ యాప్: goo.gl/41wxZF ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు https://www.ecatering.irctc.co.in/లో మీ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. రాబోయే రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్న మెనూ ప్రత్యక్షమవుతుంది. అందులో మధుమేహం ఉన్న ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. యాప్ లేకపోతే..: స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేనివారికి, ఈ విధానం కష్టంగా తోచిన వారికి మరో అవకాశం కూడా ఉంది. 1323కి ఫోన్ చేసి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు. లేదా MEAL (P NQ)139కి ఎస్ఎంఎస్ కూడా పం పొచ్చు. ఏదైనా కారణంతో ఆర్డర్ వద్దనుకుంటే.. 2 గంటల ముందు రద్దు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : రైలుల్లో ప్రయాణించే వారికి ఐడెంటీ ప్రూఫ్స్ తప్పనిసరి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే ఎలా అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఏం ఆందోళన చెందక్కర్లేదట. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ వెర్షన్లను ఐడీ ప్రూఫ్స్ అంగీకరిస్తామని దేశీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్ అందించే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీలను అంగీకరిస్తుందని గురువారం ప్రకటించింది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ స్టోరేజ్ సర్వీసులను అందిస్తోంది. ఈ విషయంపై అన్ని జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను, వాలిడ్‌గా భావిస్తామని రైల్వే చెప్పింది. ‘డిజిలాకర్ అకౌంట్లోకి లాగిన్ అయి ఇష్యూడ్ డాక్యుమెంట్ల సెక్షన్‌కు వెళ్లి ప్రయాణికులు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే, దాన్ని వాలిడ్ గుర్తింపుగానే ధృవీకరించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వపు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను, ఆధార్‌ను డిజిటల్‌గా అందిస్తోంది. సీబీఎస్ఈతో కూడా ఇది భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. -
మంటల్లో చిక్కుకున్న ఏపీ ఎక్స్‌ప్రెస్
-
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, గ్వాలియర్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు (బీ6, బీ7) పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల సమయంలో గ్వాలియర్ సమీపంలోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ వద్ద బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాణికులు సామాగ్రి మాత్రం మంటల్లో కాలిపోయింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని, ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసినట్లు రైల్వే పీఆర్వో మనోజ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న రెండు బోగీల్లో వైజాగ్‌కు చెందిన 65 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో నడిచే రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ విడుదల చేసిన అత్యవసర ఫోన్ నంబర్లు: 1322, 1800111189 విశాఖలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08912883003, 08912883004, 08912746330, 08912746344 గ్వాలియర్‌లో హెల్ప్‌లైన్ నంబర్లు: 0751-2432799, 0751-2432849 ఝాన్సీలో హెల్ప్‌లైన్ నంబర్లు: 0510- 2440787, 0510- 2440790 -
రైల్వే ఫుడ్ సర్వీసులపై జీఎస్టీ బాదుడు
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ప్రభుత్వం షాకిచ్చింది. రైళ్లు, స్టేషన్లలో ఐఆర్సీటీసీ లేదా దేశీయ రైల్వే సరఫరా చేసే అన్ని కేటరింగ్ సర్వీసులపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై ఇప్పటికే రైల్వే బోర్డుకి కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ విధింపుతో రైళ్లలో, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, స్టేషన్లలో అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు, డ్రింకుల సరఫరాల్లో జీఎస్టీ రేటులో ఏకరూపత సాధించవచ్చని పేర్కొంది. ‘దేశీయ రైల్వే, దేశీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, వారి లైసెన్సీలు రైలలో, ప్లాట్‌ఫామ్‌ల వద్ద సరఫరా చేసే ఆహార పదార్థాలు, డ్రింక్‌లపై ఎలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం జీఎస్టీ విధించనున్నామని క్లారిటీ ఇస్తున్నాం’ అని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వద్ద వర్తకులు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు విధిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తిన తర్వాత ఐఆర్సీటీసీ పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లను రైళ్లలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తొలుత ఈ పీఓఎస్ బిల్లింగ్ మిషన్లను ట్రైన్ నెంబర్. 12627-28, SBC-NDLS కర్నాటక ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ బేసిస్‌లో ప్రవేశపెట్టారు. వచ్చే వారాల్లో మరిన్ని మార్గాల్లో కూడా ఈ మిషన్లను అందుబాటులోకి తేనున్నట్టు దేశీయ రైల్వే అధికారులు చెప్పారు. -
రైల్వే క్లాక్‌రూమ్, లాకర్ల ఫీజు పెంపు!
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు లగేజీని భద్రపరచుకునే క్లాక్రూములు, లాకర్ల ఫీజులను పెంచేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. ఫీజుల్ని పెంచే అధికారాన్ని డివిజినల్ రైల్వే మేనేజర్ల(డీఆర్ఎం)కు కట్టబెట్టింది. ఈ సేవల ఆధునీకరణకు త్వరలో బిడ్లు ఆహ్వానించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త విధానంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఫీజుల్ని పెంచే అధికారం డీఆర్ఎంలకు ఉంటుంది. లగేజీని గరిష్టంగా నెలరోజుల పాటు భద్రపరుస్తామని, కొత్త విధానాన్ని తొలుత ‘ఏ’ క్లాస్ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 24 గంటల పాటు వస్తువుల్ని భద్రపరిచేందుకు క్లాక్ రూమ్‌కు రూ.15, లాకర్‌కు రూ.20 వసూలు చేస్తున్నారు. -
మెరుగైన సేవలందించండి
రైల్వే సహాయ మంత్రి గొహెయిన్ సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు అందించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గురువారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!
-
రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!
అమరావతి : రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్ తీసుకుంటే 92 పైసల్ని బీమా రూపంలో కట్టించుకుని జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఆర్సీటీసీ కల్పిస్తున్న ఆన్లైన్ రిజర్వేషన్ విధానంలో జారీ చేసే టికెట్లకు మాత్రం బీమా చెల్లింపునకు ఆప్షన్ విధానం కల్పించారు. ఈ ఆప్షన్ విధానాన్ని తొలగించి తప్పనిసరి చేస్తూ ఆన్లైన్ రిజర్వేషన్ విధానానికి సవరణలు చేయనున్నారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుల్లో 823 మందికి గాను 695 మంది ఆన్లైన్లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకున్నారు. 128 మంది రైలు ప్రయాణ బీమా పొందారు. ఈ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంలో 150 మంది మృతి చెందారు. రైలు ప్రయాణ బీమా పొందిన వారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే రూ.10 లక్షలు, ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, గాయాలైతే రూ.10 వేలు, రైలు ప్రయాణంలో సామాగ్రి పోతే రూ.5 వేలు పరిహారంగా అందుతాయి. -
రైలు ప్రయాణికుల కొత్త టెక్నిక్
ముంబై: మొన్నటి వరకు చిన్ననోట్ల భారమైన ప్రయాణికులకు ఇప్పుడు రద్దు చేసిన పెద్ద నోట్లు తలనొప్పి తెప్పిస్తున్నాయి. దీంతో లోకల్ రైలు ప్రయాణికులు సాధ్యమైనంత తరకు వాటి పీడ వదిలించుకునేందుకు తమ తెలివి తేటలు ఉపయోగిస్తున్నారు. ఇదివరకు ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగించే వారు మాస, త్రైమాసిక సీజన్ పాస్‌లు పొందేందుకు ఆసక్తి కనబర్చేవారు. ఇప్పుడు ఏకంగా ఆరు నెలలు, సంవత్సరం సీజన్ పాస్‌లు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా లోకల్ రైల్వే టికెట్ల కౌంటర్ల వద్ద క్యూలను తగ్గించేందుకు స్మార్ట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మొన్నటివరకు అప్పుడప్పుడు ప్రయాణించే వారు (తమ అవసరాన్ని బట్టి) రూ.50 లేదా రూ.100 స్మార్ట్ కార్డులు రీచార్జ్ చేయించుకునేవారు. ఇప్పుడు అదే సామాన్య ప్రజలు రూ.500 లేదా రూ.1000 చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు రీచార్జ్ చేసుకుంటున్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే, స్మార్ట్ కార్డులు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రైల్వే టికెట్ల కౌంటర్ల వద్ద స్వీకరిస్తుండడంతో ప్రజల దృష్టి ఇటువైపు మళ్లింది. దీంతో పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని రద్దయిన రెండు, మూడు రోజుల్లోనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చింది. రద్దయిన నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే బదులుగా రైల్వే టికెట్ల కౌంటర్లను ఆశ్రయిస్తున్నారు. పైగా రూ.100 రీచార్జ్ చేసుకుంటే 5 శాతం బోనస్‌గా లభిస్తుంది. అంటే ఐదు రూపాయల ప్రయాణం ఉచితంగా చేయవచ్చు. రూ.10,000 రీచార్జ్ చేసుకుంటే రూ.500 బోనస్ లభిస్తుంది. దీంతో ప్రయాణికులు స్మార్ట్ కార్డు కొనుగోలుకు ఎగబడుతున్నారు. అందులో రీచార్జ్ చేసుకున్న డబ్బులు ఎటూ పోవు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు పెద్ద నోట్ల బెడదను వదిలించుకునేందుకు లోకల్ రైల్వే టిక్కెట్ కౌంటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
ఆ రైళ్లలో నో వెయిటింగ్ లిస్ట్
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఇక వెయిటింగ్ లిస్టు కష్టాలు తప్పనున్నాయి. సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. ఇప్పటివరకూ... చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే 'వికల్ప్' పథకాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెస్తోంది. సువిధ రైళ్లలో కేవలం ఆర్ఏసీ టికెట్లను మాత్రమే ఇవ్వనుంది. ఈ విధానం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతోపాటు, తత్కాల్ టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు రీఫండ్ విషయంలో కూడా నిబంధనలను మార్పు చేసింది. అలాగే తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు కొత్త విధానం ద్వారా టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కొంతమేరకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక తత్కాల్ టికెట్ల జారీ సమయంలో కూడా రైల్వేశాఖ మార్పులు చేసింది. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ కోచ్ తత్కాల్ టికెట్లకు, స్లీపర్ కోచ్ అయితే 11 నుంచి 12 గంటల సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే వచ్చే నెల నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్లలో పేపర్ లెస్ టికెట్ విధానం అమల్లోకి రానుంది. మొబైల్ టికెట్లను అనుమతించనుంది. అలాగే రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. -
రైల్వే ప్రయాణికులకు వైఫై సదుపాయం
నేటి నుంచి సికింద్రాబాద్ స్టేషన్లో అందుబాటులోకి... సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! మంగళవారం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వైఫై సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా లక్షలాది మందికి 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. త్వరలో కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లలోనూ వైఫై సేవలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఎ, బి కేటగిరీల కింద నమోదైన పలు ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో కూడా ఈ సదుపాయం రానుంది. -
ప్రయాణికుల భద్రతే ముఖ్యం
రైల్వేబోర్డు సేఫ్టీ అడ్వైజర్ సంజయ్‌గార్గ్ మచిలీపట్నం/గుడివాడ టౌన్ : రైల్వే ప్రయాణికుల భద్రతకు ఏమాత్రం భంగం కలిగినా కారకులైన అధికారులను ఇంటికి పంపిస్తామని రైల్వే సేఫ్టీ బోర్డు అత్యున్నత స్థాయి కమిటీ సభ్యుడు సంజీవ్‌గార్గ్ హెచ్చరించారు. శుక్రవారం గుడివాడ, మచిలీ పట్నం, పెడన రైల్వేస్టేషన్లను కమిటీ సభ్యులతో కలసి ఆయన పరిశీలించారు. గుడివాడ - పెడన రైల్వే ట్రాక్ వెంబడి కాపలా లేని 24వ నంబరు రైల్వేక్రాసింగ్ వద్ద ఆయన అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. పెడన సమీపంలో బుడమేరు - సింగ్‌నగర్ మధ్య ఉన్న వంతెనను పరిశీలించారు. ఆయా స్టేషన్ మాస్టార్లు, గేట్ మెన్లతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు. సిబ్బందితోనూ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కున్నారు. ప్రమాదాలను నివారించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్టేషన్ల పనితీరును పరిశీలించడానికి వచ్చా మన్నారు. ప్రధానంగా ద్విచక్రవాహనాలు పాసింజర్ రైళ్లలో పంపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క చుక్క కూడా పెట్రోల్ ఉండకూడదని సూచించారు. గుడివాడ ప్లాట్‌ఫాంపై రైలు ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్న పార్సిల్ చేసిన ద్విచక్రవాహనాన్ని ఆయన పరిశీలించారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో 8 రైళ్లు ఆలస్యంగా నడిచాయని, దానికి కారణాలు తెలియ జేయాలని ఆదేశించారు. ట్రాక్ నిర్వహణ, వాటికి కావాల్సిన సామాగ్రి అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకున్నారు. మొత్తం 8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం అన్ని శాఖల పనితీరుపై పరిశీలన జరిపింది. స్టేషన్ మేనేజర్ శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు సేప్టీ ఆఫ్ ట్రాఫిక్ ఓమ్‌ప్రకాష్, సిగ్నల్ అండ్ టెలికమ్ విజయలక్ష్మికౌశిక్, డెరైక్టర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ అలోక్‌కుమార్, ఇంజినీరింగ్ అషీష్ కుమార్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జనరల్ పద్మజ, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్ఎస్ఆర్.ప్రసాద్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ సత్యనారాయణ, సేఫ్టీ ఆఫీసర్ ఎం. ప్రసాద్, ఆయా రైల్వేస్టేషన్ల సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రక్షణలేని రైల్వేగేట్ల వద్ద ఆగుతున్నారా?..... గుడ్లవల్లేరు : రక్షణ లేని రైల్వేగేట్ల వద్ద కాపలా ఉంటున్న గార్డుల సమస్యలపై సంజీవ్ గార్గ్ ఆరా తీశారు. గుడ్లవల్లేరు మండలంలోని గాదేపూడి రక్షణ లేని రైల్వేగేటు వద్ద పరిస్థితిని పరిశీలించారు. రైలు వచ్చేటపుడు ఆగుతున్నారా అని గార్డును అడిగారు. తాను స్థానికుడిని కావడంతో తన మాట విని, ఆగుతున్నారని గార్డు కాగిత చంటిబాబు చెప్పాడు. హడావుడిగా రైల్వే శాఖ ఏర్పాట్లు... గార్గ్ వస్తున్నారని తెలుసుకున్న రైల్వేశాఖ అధికారులు పక్కనున్న పొలాల సరిహద్దుల్లో రాత్రికి రాత్రి సరిహద్దు రాళ్లను పాతారు. గేట్ల వద్ద గార్డులకు అప్పటికపుడే తాత్కాలిక గూడులను ఏర్పాటు చేశారు. రైళ్ల వలన రక్షణ లేని గేట్ల వద్ద జరిగే ప్రమాదాలపై కరపత్రాల్ని గార్గ్ ఎదుటే పంచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. పోస్టర్లను ఆయన వచ్చే గంట ముందు అంటించడంతో హడావుడి నెలకొంది. గార్గ్‌కు గాదేపూడి, వడ్లమన్నాడు వాసులు సమస్యల ఏకరువు పెట్టారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని గార్గ్ సమాధానమిచ్చారు. -
బ్లాక్ బెర్రీ సరికొత్త యాప్!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రైలు టికెట్లను ఇకపై ఆన్లైన్లో సులభంగానే బుక్ చేసుకోవచ్చు. రైలు టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కొత్త బ్లాక్‌బెర్రీ మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ-10 వినియోగదారులు ‘ఐఆర్సీటీసీ ఆప్’ అనే ఈ ఆప్‌ను బ్లాక్‌బెర్రీ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రతి నిమిషానికీ 7 వేల చొప్పున రోజూ 5 లక్షల టికెట్ల వరకూ బుక్ అవుతున్నాయని, ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆప్‌ను విడుదల చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ యాప్ ను వినియోగించడం చాలా సులభతరంగా ఉంటుందని రైల్వే అధికారి స్పష్టం చేశారు. ప్రతీ ఏటా 31 కోట్ల మంది ప్రయాణికులు పైగా రైల్వే రిజర్వేషన్ చేసుకుంటున్నారన్నారు.దీనిలో 55 శాతం మంది ప్రయాణికులు బుకింగ్ కౌంటర్లను ఆశ్రయిస్తుండగా, 37 శాతం మంది ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారన్నారు. మిగతా 8 శాతం మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద రిజర్వేషన్లు చేయించుకుంటున్నారన్నారు. -
సదా నిరాశే..
సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : యూపీఏ సర్కారు తరహాలోనే భారీగా పన్నుల భారం మోపిన మోడీ ప్రభుత్వం.. దానికి తగిన విధంగా విజయవాడ డివిజన్‌పై వరాల జల్లులు కురిపించలేకపోయిందని రైల్వే ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్, ఇక్కడి నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రైళ్లు, నగరంలో శాటిలైట్ స్టేషన్, జనసాధారణ్ రైళ్లు నడపడం, రైళ్ల వేగం పెంచడం వంటి హామీలన్నీ ఈ ప్రాంతవాసులకు కలగానే మిగిలిపోయాయి. విజయవాడ-న్యూఢిల్లీ ఏసీ రైలు విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఏసీ రైలు వేశారు. ఇది కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీనివల్ల ఒరిగిందేమీ లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. జనసాధారణ్, ఎక్స్‌ప్రెస్, పాసింజర్, డెమో రైళ్ల కొత్తదనమేమీ లేదు రైల్వే బడ్జెట్లో కొత్తదనం లేదు. బడ్జెట్‌కు ముందే చార్జీల మోత మోగించారు కాబట్టి, ప్రస్తుతం చార్జీల ఊసే ఎత్తలేదు. విజయవాడ డివిజన్‌కు ఒక్క రైలు మినహా ఏం మంజూరు చేయలేదు. మోడీ ప్రభుత్వం రైల్వే మోడరనైజేషన్ వైపు అడుగులు వేస్తోందని ఈ బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతోంది. ప్రరుువేటీకరణ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారు. - స్వామిచరణ్, నేషనల్ మజ్దూర్ యూనియన్ సీనియర్ సభ్యుడు కలలు కల్లలే అయ్యూరుు.. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే బడ్జెట్‌ను రూపొందించలేదని స్పష్టమైంది. జిల్లావాసుల చిరకాల వాంఛ మచిలీపట్నం- రేపల్లె లైను నిర్మాణ విషయం ప్రస్తావించకపోవడం బాధాకరం. నర్సాపురం-మచిలీపట్నం రైలు ఏర్పాటుచేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నా ఫలితం లేదు. ఇది జిల్లా ప్రజలకు నిరాశాజనకంగానే ఉంది. - బి.ధన్వంతరి ఆచార్య, హిందూ కళాశాలల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చేదు మాత్ర.. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుంటే.. రైల్వే చార్జీలు పెంచడం దారుణం. రైల్వేమంత్రి సొంత రాష్ట్రమైన కర్ణాటకు భారీ ప్రయోజనాలు చేకూర్చే విధంగానే బడ్జెట్ ఉంది. మచిలీపట్నం-విజయవాడ డబ్లింగ్ లైన్ల విషయంపై కూడా స్పష్టమైన ప్రకటన రాలేదు. మొత్తానికి రైల్వే బడ్జెట్ మొత్తం చేదుమాత్రలా ఉంది. - దోసపాటి జగన్మోహనరావు, వైద్యుడు నీటిమూటలే.. విజయవాడ-భీమవరం ఎలక్ట్రికల్ డబుల్ లైన్ ప్రతిపాదన గత ప్రభుత్వంలోనే మంజూరైనప్పటికీ ఈ బడ్జెట్లో నిధులు కేటారుుంచలేదు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు రెండు ప్రత్యేక కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కేవలం రెండే రెండు కొత్త రైళ్లు వేసి చేతులు దులిపేసుకున్నారు. - ఏవీఆర్ రాజు, అడ్వకేట్