RajnathSingh
-
‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్
తిరువనంతపురం: సీపీఎం పార్టీపై దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్ అయ్యారు. కేరళలోని కాసర్గాడ్లో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ‘సీపీఎం అధికారంలోకి వస్తే దేశంలోని న్యూక్లియర్ ఆయుధాల(అణు బాంబులు)ను ధ్వంసం చేస్తామని చెబుతోంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా న్యూక్లియర్ బాంబులను కలిగి ఉన్నప్పుడు మనం వాటిని వదులుకుంటే ఎలా. సీపీఎం తీరు దేశ భద్రతతో ఆటలాడినట్లుంది. సీపీఎం హామీపై కాంగ్రెస్ పార్టీ వెంటనే తన వైఖరి వెల్లడించాలి’అని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. సీపీఎం, కాంగ్రెస్ కలిసి కేంద్రంలో దోచుకోవాలని చూస్తున్నాయని, ఇది తాము జరగనివ్వబోమని రాజ్‌నాథ్ చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 26న రెండో దశలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. తృణమూల్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే -
ఆర్మీ పరికరాలు , అస్త్రాలకు ఆయుధ పూజ చేసిన రాజ్ నాథ్ సింగ్
-
ఉక్రెయిన్‌లో రక్తపాతం.. వారికి కీలక హామీ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. రష్యా వైఖరిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉంది. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితులపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని స్పష్టం చేశారు. భారతీయులను స్వదేశానికి తరలించేందకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. వారిని సురక్షితంగా భారత్‌కు చేరుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగన తలాన్ని మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ వెళ్లిన ప్రత్యేక విమానాలు తిరిగి రావడానికి, అక్కడికి విమానాలు వెళ్లడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాగా, గగనతలం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక విమానాలను పంపి భారతీయులకు స్వదేశానికి తరలిస్తామన్నారు. ఇప్పుడు కూడా మన దేశ పౌరులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
మహిళ కాళ్లు మొక్కిన రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పరమవీర చక్ర పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నోదేవి పాదాలను తాకారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకాగా అందులో ఈ ఘటన చోటు చేసుకుంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిరస్మరణీయ విజయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి 1971 యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ ముక్తిజోద్ధులు, భారత యుద్ధ అనుభవజ్ఞులతో స్నేహపూర్వకంగా కలిసి వారితో సంభాషించారు. ‘భారత సాయుధ దళాలు వారి పరాక్రమ పోరాటంలో ధైర్యవంతులైన ముక్తిజోద్ధులతో కలిసి పనిచేశాయి. యుద్ధ అనుభవజ్ఞుడైన కల్నల్ హోషియార్ సింగ్‌ను 1971 యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించినందుకు దేశంలోని అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్రతో సత్కరించారు, ఇది బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిందని’ తెలుపూతూ ట్వీట్ చేశారు. Had a warm interaction with the Bangladeshi Muktijoddhas and the Indian war veterans who fought against injustice in 1971 war. The Indian Armed Forces worked together with the courageous Muktijoddhas in their valiant struggle.#SwarnimVijayParv pic.twitter.com/R6LnbUzeZC — Rajnath Singh (@rajnathsingh) December 14, 2021 -
అఫ్గాన్ పరిస్థితులు సవాల్‌గా మారాయి: రాజ్‌నాథ్ సింగ్
-
మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
కరోనా మహమ్మరి విజృంభిస్తున్న సమయంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ శుభవార్త చెప్పింది. డీఆర్డీఓ ప్రయోగశాల డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్) యాంటీబాడీ డిటెక్షన్-బేస్డ్ కిట్ 'డీప్ కోవాన్(DIPCOVAN)'ను అభివృద్ధి చేసింది. ఢిల్లీకి చెందిన వాన్గార్డ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఆర్డీఓ శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ కిట్, కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్సైడ్ ప్రొటీన్లను అది డిటెక్ట్ చేస్తుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్డీఓ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం మొన్నటికి మొన్న 2డీజీ మెడిసిన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం.. డీప్ కోవాన్ ఇతర వ్యాధులతో ఎటువంటి క్రాస్ రియాక్టివిటీ లేకుండా శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కేవలం 75 నిమిషాల కాలంలో పరీక్ష నిర్వహించవచ్చు. ఈ కిట్ జీవిత కాలం 18 నెలలు. ఈ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఏప్రిల్ 2021లో ఆమోదించింది. 2021 మేలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ), ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి అమ్మకాలు & పంపిణీ కోసం ఆమోదం పొందింది. డీప్ కోవాన్ జూన్ మొదటి వారం నుంచి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా వాణిజ్యపరంగా అందుబాటులో ఉంటుంది. కీలక సమయంలో దేశానికి అండగా నిలుస్తున్న డీఆర్డీఓని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. డిప్కోవన్ అంటే ఏమిటి? డిప్కోవన్ కోవిడ్ -19 యాంటీబాడీ డిటెక్షన్ కిట్. ఒక వ్యక్తి గతంలో కోవిడ్ -19 వైరస్‌కు గురిఅయ్యడా?, అతని శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. ఇది దేనికి ఉపయోగించబడుతుంది? ప్రతిరోధకాలను గుర్తించడం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. ఇది సెరో-సర్వేల వంటి కోవిడ్-19 ఎపిడెమియాలజీ అధ్యయనాలలో ఉపయోగించబడుతుంది. మీకు కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎంత ఖర్చు అవుతుంది? డీఆర్డీవో తెలిపిన వివరాల ప్రకారం.. దాని పరిశ్రమ భాగస్వామి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ కిట్‌ను ఒక్కొక్కటి 75 రూపాయలకు విక్రయిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ -
‘స్మార్ట్’ విజయవంతం
బాలాసోర్(ఒడిసా): భారత నావికా దళం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం చేరనుంది. దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. యాంటీ–సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ‘స్మార్ట్’తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. సోమవారం ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలో ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో ‘స్మార్ట్’ను పరీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుం డా పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ‘స్మార్ట్’పరీక్ష నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. -
లాక్డౌన్ సడలింపులు : మంత్రుల బృందం కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను సడలించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల బృందం శనివారం ఉదయం జరిగే భేటీలో విస్తృతంగా చర్చించనుంది. మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నుంచి ఎలా బయటకు రావాలనే వ్యూహాలపై ఈ భేటీలో మంత్రుల బృందం సమీక్షించనుంది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఆరోసారి సమావేశమవుతున్న మంత్రుల బృందం లాక్డౌన్ నియంత్రణలను దశలవారీగా సడలించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి తమ నివేదికను అందచేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను మరోసారి ప్రభుత్వం పొడిగిస్తుందా లేక హాట్‌స్పాట్స్‌కే లాక్డౌన్ నియంత్రణలను పరిమితం చేస్తుందా అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ప్రధాని మోదీ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌లతో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇక రెడ్‌జోన్స్‌ను మినహాయించి ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు నియంత్రణలతో కూడిన సడలింపులను ప్రకటిస్తారని భావిస్తున్నారు. చదవండి : 3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా.. -
వారంతా ఒకపూట భోజనాన్ని త్యాగం చేయండి: నడ్డా
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితులను మోదీ ఎలా ఎదుర్కుంటారు అని ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తోందని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి బీజీపీ కార్యకర్త 40 మందిని కలిసి ఒక్కొక్కరు రూ. 100 చొప్పున పీఎం కేర్స్ ఫండ్‌కి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్స్‌లు, బ్యాంక్ ఉద్యోగులు, పోస్ట్మ్యాన్లకు మనమందరం కృతజ్ఞతలు తెలిపాలన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంఘీభావంగా ఒకపూట భోజనాన్నిత్యజించాలని నడ్డా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా పార్టీ వ్యవస్థపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు ట్వీట్టర్ వేదిక తన సందేశాన్ని అందించారు. (కరోనాను తరిమికొడదాం: మోదీ పిలుపు) అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 40 సంవత్సరాల్లోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి భారతీయ జనతా పార్టీ బలమైన స్తంభంలా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ చూరగొందని పేర్కొన్నారు. 1977లో విధించిన అత్యవసర పరిస్థితి తరువాత జరిగినలోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పై ఐక్య పోరాటం చేయడానికి జనతా పార్టీతో విలీనం అయిన జనసంఘ్ పార్టీ నాయకులు 1980 లో ఏప్రిల్ 6 న బీజేపీని స్థాపించారు. చదవండి: దీపయజ్ఞం మన సంకల్పాన్ని చాటింది : మోదీ -
నేడు జిల్లాకు ఉపరాష్ట్రపతి
సాక్షి, నెల్లూరు: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంక్యనాయుడు శని వారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం జిల్లాకు రానున్నారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నెల్లూరు నగరానికి వస్తున్నారు. అలాగే రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి పాల్గొంటా రు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 24వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 1.20 గంటలకు నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం నగరంలోని సర్ధార్ పటేల్ నగర్‌లోని స్వగృహానికి చేరుకుంటారు. మధ్నాహ్నం 3 గంటలకు నగరం నుంచి వెంకటాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రత్యేక రైలులో చెర్లోపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. మార్గమధ్యంలో వెలిగొండల్లో నూతనంగా నిర్మించిన రైల్వే టన్నెల్‌ను పరిశీలిస్తారు. మళ్లీ తిరుగుప్రయాణమైన వెంకటాచలం చేరుకుని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో రాత్రి బస చేస్తారు. 25వ తేదీ ఉదయం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసే ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆనంతరం గూడురు రైల్వే స్టేషన్‌కు చేరుకుని గూడూరు–విజయవాడ నడుమ నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. ఆనంతరం నెల్లూరు చేరుకుని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 10.45 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి బయలుదేరి కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) నూతనంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ అల్యూమినియం అలీ ప్రొడక్షన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. విజయవాడలోని ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో రాత్రి బస చేస్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నెల్లూరు నగరానికి చేరుకొని ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. 26న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 26వ తేదీ నెల్లూరుకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంటకు విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గన బయలుదేరి బొడ్డువారిపాళెంలో నూతనంగా నిర్మించనున్న అల్యూమినయం ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉపరాష్ట్రపతి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. నేడు గవర్నర్ రాక నెల్లూరు(పొగతోట): రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శనివారం నెల్లూరుకు రానున్నారు. ఉదయం విజయవాడలోని గన్నవరం విమానశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.00 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నెల్లూరు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.20 గంటలకు పోలీసుపరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని ఉపరాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అనంతరం ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరివెళతారు. భారీ బందోబస్తు నెల్లూరు(క్రైమ్): ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శనివారం ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ , 26వ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 1,294 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఐశ్వర్వ రస్తోగి చర్యలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో కల్వర్లు, రహదారులను బాంబ్, డాగ్ స్క్వాడ్లు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అడుగడుగునా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ట్రయన్ రన్ పూర్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ట్రయల్ రన్ నిర్వహించారు. స్వర్ణభారతి ట్రస్ట్, వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమాలకు లైజన్ ఆఫీసర్‌గా నాయుడుపేట ఎస్సై డీ వెంకటేశ్వరరావును నియమించారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలు వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, రాష్ట్ర గవర్నర్ పర్యటనల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు పర్యటించే సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. హెలిప్యాడ్, అభివృద్ధి కార్యక్రమాల వద్ద ముందస్తు అనుమతి పొందిన వారు మినహా ఇతరులను అనుమతించరాదని సూచించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది విధిగా ఐడీ కార్డులు, డ్యూటీపాస్‌లు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వీరభద్రుడు, ఎస్బీ డీఎస్పీ ఎన్.కోటారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
నేవీ సమీక్షకు నవ్యాంధ్ర సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖ రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నగరానికి రావడం ఇది రెండోసారి. ఇటీవల జరిగిన తొలి పర్యటనలో శారదా పీఠాన్ని సందర్శించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మలి పర్యటనను దేశ రక్షణ శాఖ కార్యక్రమాలకు కేటాయించారు. ఈ పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే జరిగే విందులో పాల్గొని.. అదే రోజు రాత్రి విజయవాడకు తిరిగి వెళ్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆదివారం మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉంటారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఇద్దరూ కలిసి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ రెండోసారి నగరానికి వస్తుండగా, రక్షణ మంత్రి హోదాలో రాజ్‌నాధ్ విశాఖ రావడం ఇదే తొలిసారి. రక్షణ మంత్రి శనివారం మధ్యాహ్నమే నగరానికి రానుండగా.. సీఎం వైఎస్జగన్ రాత్రి 7 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయంలోనే పార్టీ నాయకులు, అధికారులు ఇతర ముఖ్యులతో మాట్లాడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరి సమావేశ మందిరానికి 7.30కు చేరుకుంటారు. అక్కడ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలుస్తారు. అనంతరం రాత్రి 8.15 వరకు నౌకాదళ సమీక్షలో వారిద్దరూ కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ జరిగే విందులో సీఎం జగన్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారు. రాత్రి 8.40 గంటలకు సీఎం బయలుదేరి 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు తిరిగి వెళ్తారు. రెండు రోజులు రక్షణ మంత్రి ఇక్కడే.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 3.55 వరకు హెలికాప్టర్లో తూర్పు నౌకాదళంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. రాత్రి 7.30కు ఈస్ట్రన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సమీక్ష సమావేశం, విందు కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్‌జగన్‌తో కలిసి పాల్గొంటారు. రెండో రోజు ఆదివారం ఉదయం ఐఎన్ఎస్ డేగా నుంచి బయలుదేరి ఈఎన్సీ ప్రధాన కేంద్రానికి చేరుకొని నౌకలను సందర్శిస్తారు. నావికులు, నేవీ అధికారులు, నేవీ సివీలియన్ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలోఢిల్లీ బయలుదేరి వెళ్తారు. విశాఖ చేరుకున్న నౌకాదళాధిపతి కేంద్ర రక్షణ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ శుక్రవారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న కరమ్బీర్సింగ్ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ స్వాగతం పలికారు. భారత నౌకాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చిన కరమ్‌బీర్ సింగ్‌కు గార్డాఫ్ హానర్ నిర్వహించి స్వాగతం పలికారు. అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజున ఈఎన్సీ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. -
నాలుగున్నరేళ్లలో 4500మంది ఆత్మహత్యలు...
సాక్షి, నాగర్‌కర్నూల్: తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్న టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో 4500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఎందుకు చేసుకున్నారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి దిలీపాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మార్పు కోసం బీజేపీ’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని, ఆర్థిక ప్రగతిని విస్మరించి నిర్లక్ష్యం చేసిందని, పథకాలు అమలుపర్చడంలో విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకం ప్రారంభిస్తే తెలంగాణలో అమలుచేయడం లేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి నాలుగున్నరేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి అసమర్థత వల్ల అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు. యూపీఏ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16వేల కోట్లు ఇస్తే మోడీ హయాంలో రూ.లక్షా 15వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని అన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందన్నారు. దీనినుంచి దృష్టి మరల్చేందుకే రాజ్యాంగ వ్యతిరేకమైన మైనర్లకు 12శాతం రిజర్వేషన్ అంటున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తు అపవిత్ర కలయిక అని, దీనివల్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నా రు. కాంగ్రెస్ నాయకులు ప్రధాని పదవిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు ఏర్పాటుచేసే ఒకే ఒక్కపరిశ్రమ అవినీతి పరిశ్రమ అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి, పత్తి, గోధుమలకు మద్దతు ధర పెంచిందని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. లక్ష ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. దిలీపాచారిని గెలిపించాలి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న దిలీపాచారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దిలీప్ ప్రసంగం విన్నానని, మంచి వక్త అని, అసెంబ్లీకి పంపితే నాగర్‌కర్నూల్ ప్రజల కష్టాలపై అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పారు. హిందీలో ప్రసంగించిన రాజ్‌నాథ్‌సింగ్ మొదట తెలుగులో నాగర్‌కర్నూల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం హిందీలో ప్రసంగిస్తుండగా జాతీయ కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు తెలుగులో అనువదించారు. నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి ఏదీ? బీజేపీ అభ్యర్థి దిలీపాచారి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో నాగర్‌కర్నూల్‌లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని అన్నారు. అభివృద్ధి, సమస్యలను పరిష్కరించకుండా ఓట్లు అడుగుతున్నారని అన్నారు. వారిని ఓటుతో తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీలు అమలుచేయలేదన్నా రు. బీజేపీని గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌కు కేంద్రీయ సంస్థలను తీసుకొస్తానని, యువకులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కేంద్ర హోంశాఖ మంత్రి మొదటిసారిగా నాగర్‌కర్నూల్‌కు వస్తుండటంతో సభాప్రాంగణం వద్ద, సభా ప్రాంగణానికి చేరుకునే దారిలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉయ్యలవాడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు గంటసేపు ప్రసంగించారు. 1.45గంటలకు తిరిగి వెళ్లిపోయారు. బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సభలో బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబమూర్తి, బంగారు శృతి, కాశీరాజు, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
#మీటూ ఎఫెక్ట్: రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు. మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్లను బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి మేనకగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. -
కారు ఆపనందుకు కాల్చేశారు
లక్నో: లక్నోలో దారుణం చోటుచేసుకుంది. యాపిల్ కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని కారులో ఇంటికి వెళుతుండగా ఆయన్ను వెంబడించిన పోలీసులు కాల్చిచంపారు. యాపిల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్‌తివారీ(38) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మరో సహోద్యోగితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. ఇక్కడి ముకదమ్‌పూర్ వద్దకు రాగానే కారును ఆపాల్సిందిగా ఇద్దరు పోలీసులు సైగ చేశారు. వివేక్ కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో ఆ కారును ఓవర్టేక్ చేసిన కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ వివేక్ ఎడమచెవి కింద దూసుకుపోవడంతో కారు డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. అనంతరం వివేక్‌ను ఇక్కడి లోహియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆత్మరక్షణ కోసమే కాల్చాను: ప్రశాంత్ కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ప్రశాంత్ మాట్లాడుతూ..‘శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ముకదమ్‌పూర్ వద్ద ఓ కారు లైట్లు ఆర్పేసి అనుమానాస్పదంగా ఆగి ఉండటాన్ని చూశా. నేను దగ్గరకు వెళ్లగానే వివేక్ ఒక్కసారిగా కారును నామీద నుంచి పోనిచ్చేందుకు యత్నించాడు. 3సార్లు ఇలా యత్నించాడు. దీంతో నా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాను’ అని తెలిపారు. కాగా, బుల్లెట్ కారణంగానే వివేక్ చనిపోయినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదుచేశారు. సీఎం వచ్చి పరామర్శించేవరకూ వివేక్ అంత్యక్రియలు నిర్వహించబోనని భార్య తేల్చిచెప్పారు. సీబీఐ విచారణతో పాటు పోలీస్‌శాఖలో తన చదువుకు తగ్గ ఉద్యోగం, రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన హోంమంత్రి రాజ్‌నాథ్ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
రాఫెల్ విషయంలో నిరాధార ఆరోపణలు తగదు
-
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్..
ఢాకా : ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ వీసా సెంటర్‌ను బంగ్లాదేశ్ ఢాకాలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్ ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్‌లో దాదాపు 18, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బంగ్లాదేశ్ హోం మినిస్టర్ అసదుజామాన్ ఖాన్ కమల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ‘అన్ని ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ వల్ల, వీసా కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గునుంద’ని తెలిపారు. ఈ విషయం గురించి ఇండియన్ హై కమిషనర్ హర్ష వర్ధన్ శ్రింగ్లా ‘జమునా పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ ప్రంపంచలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 12 భారతీయ వీసా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో మోతీఝీల్, ఉత్తర, ఢాకా, గుల్షన్‌లో ఉన్ననాలుగు వీసా సెంటర్లను ఆగస్టు 31 నాటికి ఇక్కడికే మారుస్తాం అని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు భారత్‌కు వస్తూంటారు. గతేడాది భారత ప్రభుత్వం 14 లక్షల మంది బంగ్లాదేశీయులకు వీసాలు జారీ చేసింది. -
ఉగ్ర కలాపాల్ని పాక్ తక్షణం ఆపాలి: రాజ్‌నాథ్
శ్రీనగర్: ఉగ్రవాద కార్యకలాపాల్ని తక్షణం ఆపివేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్ పాక్‌ను కోరారు. కశ్మీర్, పాక్‌లో కశ్మీర్ అంశంపై సరైన ఆలోచన ఉన్న అందరితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్లో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చర్చలకోసం గతేడాది అక్టోబరులోనే కేంద్ర ం ప్రత్యేక ప్రతినిధిని నియమించిందని గుర్తు చేశారు. కశ్మీర్లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణను రంజాన్ వరకు పొడిగించే వీలుందన్నారు. పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన ఘటనల్లో పాల్గొన్న యువతపై కేసుల్ని ఉపసంహ రించుకోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని యువతను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని, అయితే చిన్నపిల్లలు తప్పులు చేయడం సహజమని ఆయన అన్నారు. -
రాంమాధవ్‌కు మాతృవియోగం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాతృమూర్తి వారణాసి జానకీ దేవి(81) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన జానకీ దేవి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర బీజేపీ నేతలు ఇక్కడి రాంమాధవ్ నివాసంలో ఉంచిన జానకీ దేవి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జానకీ దేవి అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగుతాయని పార్టీ కార్యాలయ కార్యదర్శి మహేంద్ర పాండే తెలిపారు. -
నక్సలిజం అంతం దానితోనే సాధ్యం
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన సమస్యగా మారిన నక్సలిజాన్ని కేవలం యుద్ధం, బులెట్స్ ద్వారానే అంతం చేయలేమని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత కూడా మనం చేరుకోలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తేనే నక్సల్ ప్రభావం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘రైజింగ్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా దేశంలో నక్సలిజం ప్రధాన సమస్యగా మారిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఒక్కటే దానిని అంతం చేయగలదని పేర్కొన్నారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ఇప్పడు నక్సలిజం సమస్యను ఎంతో అధిగమించామని, ఇది ప్రభుత్వ విజయమన్నారు. దేశంలో వెనుకబడిన గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల హెల్త్‌స్కీం ఆ సమస్యలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి ఆర్థికవేత్తలు, మేధావులు, సైంటిస్టుల సహకారం కావాలని, అప్పుడే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు. -
బీఎస్ఎఫ్ చరిత్రలో తొలి మహిళా అధికారి
గ్వాలియర్: ఐదు దశాబ్దాల సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) చరిత్రలో దళంలో చేరిన తొలి మహిళా అధికారిగా తనుశ్రీ పరీక్ (25) రికార్డు సృష్టించారు. 52 వారాల శిక్షణ అనంతరం టెకన్పూర్ బీఎస్ఎఫ్ శిక్షణా కేంద్రంలో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్లో 67 మంది అధికారుల దళానికి తనుశ్రీ నాయకత్వం వహించారు. రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన పరీక్, 2014లో యూపీఎస్సీ నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆఫీసర్ ర్యాంకులో బీఎస్ఎఫ్లో చేరారు. పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న ఓ యూనిట్‌కు అధికారిగా పరీక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దు భద్రతా దళాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళిక రచిస్తోందన్నారు. మిలిటరీ తర్వాత భూ, వాయు, జలాల్లో పని చేస్తున్న రెండో దళంగా బీఎస్ఎఫ్ను ప్రశంసించారు. బీఎస్ఎఫ్ తొలి రక్షణ రేఖ మాత్రమే కాదని, తొలి రక్షణ గోడ అని పొగిడారు. ఇటీవల విధి నిర్వహణలో మృతిచెందిన సిబ్బందికి నివాళులర్పించిన రాజ్‌నాథ్.. దళంలోని సమస్యల పరిష్కారానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తోందన్నారు. టెకన్పూర్ క్యాంప్‌ను సందర్శించిన సింగ్.. టియర్ స్మోక్ యూనిట్ (టీఎస్‌యూ) రూపొందించిన పీఏవీఏ షెల్ ఫైరింగ్ ప్రదర్శనను తిలకించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు ఉపయోగించే పెల్లట్ గన్ల స్థానంలో ఈ షెల్లను వినియోగించనున్నారు. -
అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి ఖాయమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీ గుర్తు సైకిల్‌ను పంచర్ చేయగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ చైన్ తెంచారని అన్నారు. దీంతో సైకిల్ నడవలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీలో ములాయం కుటుంబంలో ఇటీవల విభేదాలు ఏర్పడి, ఆ తర్వాత సమసిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత విభేదాలను పక్కనబెట్టి తామంతా ఒక్కటేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎస్పీలో విభేదాల కారణంగా ఆ పార్టీ బలహీనపడిందని రాజ్‌నాథ్ అన్నారు. -
మైనస్ + మైనస్ = మైనస్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘోరపరాజయం చవిచూస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమిని మైనస్ ప్లస్ మైనస్ ఈక్వల్ టు మైనస్‌గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని రాజ్‌నాథ్ విమర్శించారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ఏమాత్రం ప్రభావం చూపబోదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఆఖరి పోరాటం చేస్తోందని చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రాజ్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంగా ఉన్నారని, యూపీలో మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బీజేపీ సాధిస్తుందని ఓ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ చెప్పారు. -
ఉగ్ర పాక్‌ను ఏకాకి చేయాలి
⇒ ఉగ్రదాడిపై హోం, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో రాజ్‌నాథ్ ⇒ రష్యా, అమెరికా పర్యటనల్ని రద్దుచేసుకున్న హోం మంత్రి న్యూఢిల్లీ/శ్రీనగర్: యూరిలో ఉగ్ర దాడిపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, దాన్ని ఒంటరి చేయాలంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. యూరిలోని సైనిక బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు కఠోర శిక్షణ పొందారని, అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడి వెనుక సూత్రధారుల్ని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు. 17 మంది సైనికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపంతో పాటు, గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రత్యక్ష సహకారం కొనసాగించడంపై రాజ్‌నాథ్ అసంతృప్తిని వెలిబుచ్చారు. దాడి అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్‌నాథ్ అత్యవసర భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదా రు అజిత్ డోవల్, హోం శాఖ, ఆర్మీ, పారామిలటరీకి చెందిన ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. సమావేశ వివరాల్ని ప్రధానికి వివరించానని రాజ్‌నాథ్ తెలి పారు. ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా, అమెరికా పర్యటనల్ని రాజ్‌నాథ్ వాయిదా వేసుకున్నారు. నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన కోసం ఆదివారం రాత్రి రాజ్‌నాథ్ రష్యా వెళ్లాలి. అక్కడి నుంచి ఇండో-యూఎస్ అంతర్గత భద్రతా చర్చల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 26 నుంచి ఆరు రోజులు అమెరికాలో పర్యటించాలి. దాడి ఘటన తెలిసిన వెంటనే జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ .ఎన్.వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలతో మాట్లాడి పూర్తి వివరాల్ని తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలంటూ హోం కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, ఇతర అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గోవా పర్యటనను మధ్యలోనే ముగించి ఆగమేఘాలపై శ్రీనగర్ చేరుకున్నారు. సైనికులపై దాడి, అనంతరం సైన్యం ప్రతిదాడిపై పరీకర్‌కు ఆర్మీ అధికారులు వివరించారు. శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికుల్ని పరామర్శించారు. అమెరికా, బ్రిటన్ తీవ్ర సంతాపం భారత సైనికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా ప్రకటించింది. బాధితులకు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జాన్ కిర్బీ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో పటిష్ట భాగస్వామ్యం ఏర్పాటుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి సాగేందుకు, సూత్రధారుల్ని చట్టానికి పట్టిం చేందుకు బ్రిటన్ సిద్ధమని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో రోశయ్య సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంగళవారమిక్కడ పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. తమిళనాడు, కేరళ గవర్నర్లు కొణిజేటి రోశయ్య, పి సదాశివం ఆయనతో భేటీ అయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా రాజ్‌నాథ్‌ను కలిశారు. వీరు వేర్వేరుగా కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయాల గురించి రాజ్‌నాథ్‌తో చర్చించినట్టు సమాచారం. -
'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు'
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ బీజేపీ నేతలు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. గవర్నర్ వైఖరిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించామని నేతలు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల లిస్టులో అధికారపార్టీ భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్లో పెట్టకుండా హైదరాబాద్‌లో లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని నేతలు ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలను కలిసిన వారిలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నారు.