ramalayam
-
అందరి బంధువయా...‘వల్లభి’ రామయ్య!
ముదిగొండ: సామాజిక కట్టుబాట్లు కఠినంగా ఉన్న రోజుల్లో దళితులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. కుల వివక్షత అడుగడుగునా తాండవించేది. అలాంటి రోజుల్లో దళితులు దేవుడిని తమ గుండెల్లో పెట్టుకుని రామాలయం నిర్మాణం చేపట్టారు. ఆ ఆలయానికి 90 ఏళ్ల నుంచి వారసత్వంగా ఇప్పటికీ దళితుడే పూజారిగా కొనసాగుతుండటం విశేషం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామికి నిత్య పూజలు జరుగుతుండగా.. కులమతాలకతీకంగా అంతా దర్శించుకుని తరిస్తున్నారు.ఆ అవమాన భారంతోనే.. ఏళ్ల క్రితం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా కొందరు దళితులు గోడ పైనుంచి చూస్తుండగా అగ్రకుల పెద్దలు అవమానించారు. దీన్ని ఆత్మగౌరవ సమస్యగా భావించిన దళితులు రామాలయం నిర్మాణానికి ప్రతిన బూనారు. స్థల సేకరణ, ఆపై దేవాలయ నిర్మాణం చకచకా జరగగా.. దళితవాడలో సద్గురు బోధనానంద బోధనల ప్రభావంతో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్న వంగూరి రామస్వామి తొలినాళ్లలో పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట రాములవారి చిత్ర పటంతో నిత్యం పూజలు చేసేవారు. చిన్నగా నిర్మించిన ఆలయంలో పూజలు చేస్తున్న దళితులను అగ్రకులాల వారు హేళన చేసేవారు.దీంతో అగ్రకులాలు – దళితుల నడుమ వివాదం రాజుకుంది. అప్పటికే రామాలయ నిర్మాణం పేరుతో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన దళితులు అగ్రకులాలపై సై అంటే సై అన్నారు. దీన్ని తట్టుకోలేక అగ్రకులాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గ్రామాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది.ఈ విషయం తెలిసిన గాంధేయవాది బన్సాలీ వల్లభి గ్రామానికి చేరుకుని దళితులు నిర్మించిన రామాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. ఈ వార్త బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగా ఇరువర్గాల మధ్య రాజీ అనంతరం బన్సాలీ దీక్ష విరమించారు. భారమైనా బాధ్యతగా.. దళితులు రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టపడితే కుటుంబాలను పోషించుకోవడమే కష్టం. అయినప్పటికీ కుటుంబ బాగోగుల కంటే మిన్నగా రాముడి కోసం, రాముడే శ్వాసగా వంగూరి రామస్వామి కుటుంబం జీవిస్తోంది. ఎంత కష్టమైనా.. తాము తిన్నా తినకపోయినా రామయ్యకు నిత్యపూజలు చేయడం, నైవేద్యం సమర్పించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కుటుంబ పోషణ మాటేమో కానీ.. వీరే కుటుంబానికి భారంగా మారినా రాముడి సేవలోనే జీవిస్తున్నారని చెప్పాలి.వైఎస్సార్ హయాంలో ధూపదీప నైవేద్యంఆలయంలో ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. వంగూరి రామస్వామి నిత్యం ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూనే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. వంగూరి రామస్వామి మరణానంతరం 1988లో ఆయన కుమారుడు చిన ముత్తయ్య పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయన కొనసాగగా అనారోగ్య కారణాలతో చిన ముత్తయ్య మరణించాక ఆయన మనవడు అనంతరాములు పూజారిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ క్రమాన అనంతరాములు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన అర్చకత్వం, పౌరోహిత్యంలో శిక్షణ పొందడం విశేషం. కాగా, ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో పలు ఆలయాల నిర్వహణ, అర్చకుల భృతి కోసం ధూప, దీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో వల్లభి ఆలయానికి కూడా చోటు దక్కగా నెలనెలా నిధులు అందుతున్నాయి.రూ.40 లక్షలతో పునర్నిర్మాణంతొలినాళ్లలో నిర్మించిన ఆలయం పాతబడటంతో రూ.40 లక్షలతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలో 2023 మార్చి 17న ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపనతో పాటు రాజగోపురం, కల్యాణమండపం, శిఖర ప్రతిష్టాపన భవనేస్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి చేతుల మీదుగా జరిగింది.దళిత పూజారి ద్వారా దగ్గరైన దేవుడు నా వయస్సు 80 ఏళ్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలయం ఉంది. అప్పట్లో గానుగ సున్నంతో నిర్మించగా రాములవారి పటంతో శ్రీరామనవమి వేడుకలు వంగూరి చిన ముత్తయ్య జరిపించేవారు. ఇప్పుడు కులమత భేదం లేకుండా అంతా ఆలయానికి వస్తున్నారు. నూతన గుడి నిర్మించాక అభివృద్ధి చెందింది. దళిత పూజారి ద్వారా శ్రీరాముడు మాకు దగ్గరయ్యాడు. – సామల వీరన్న, వల్లభి గ్రామవాసి వారసత్వంగా పూజలు... తాతముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తుండటంతో పాటు టీటీడీలో వేదమంత్రాలు, పూజల్లో శిక్షణ తీసుకున్నాను. ఆలయంలో పూజలు చేస్తూనే సత్యనారాయణస్వామి వ్రతాలు, గృహప్రవేశాలు నిర్వహిస్తుంటా. సీఎంగా వైఎస్సార్ ఉన్నప్పుడు ప్రకటించిన ధూపదీప నైవేద్యం పథకం ద్వారా వచ్చే నిధులతో పాటు గ్రామస్తులు ఇచ్చే విరాళాలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. – వంగూరి అనంతరాములు, ప్రస్తుత పూజారి -
ఒంటిమిట్టకు పూర్వ వైభవం!
ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది. ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
330 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాం: అమిత్ షా
Updates: ►లోక్ సభ సమావేశాలు నిరవధిక వాయిదా ఢిల్లీ: రామమందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజని తెలిపారు. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడని పేర్కొన్నారు. రాముడు ఒక మతానికే చెందిన దేవుడు కాదు అని తెలిపారు. #WATCH | Norwegian professional football manager and former player Ole Gunnar Solskjær arrives in Mumbai. pic.twitter.com/5hEj5QBg2a — ANI (@ANI) February 10, 2024 రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని.. మోదీ ఆధ్వర్యంలో 330 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించామని తెలిపారు. బీజేపీ, మోదీ ఏం హామీ ఇచ్చారో అది నెరవేర్చామని చెప్పారు. భారత సంస్కృతి రాముడితో ముడిపడి ఉందని అన్నారు. రామ మందిర నిర్మాణంలో అందరం ఐక్యమత్యంగా వ్యవహరించామని తెలిపారు. Union Home Minister Amit Shah while addressing Lok Sabha on the Ram Temple resolution, says, "22 January will be a historic day for the years to come...It was the day that fulfilled the hopes & aspirations of all Ram devotees..." pic.twitter.com/FYXVhAKVwV — ANI (@ANI) February 10, 2024 పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నేడు చివరిరోజు. ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఈ తీర్మానాన్ని బీజేపీ ఎంపీలు రూల్ 193 కిందకు తీసుకురానున్నారు. సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రాజ్యసభలో, మోషన్ రూల్ 176 కింద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. Budget Session | Rajya Sabha will later commence a short-duration discussion on 'Shree Ram Mandir Ke Etihasic Nirman aur Pran Pratishta' (Historic construction of Shree Ram Temple and Pran Pratishta). BJP MPs Sudhanshu Trivedi and Rakesh Sinha are to raise the discussion on the… — ANI (@ANI) February 10, 2024 బీజేపీ ఎంపీలు కె. లక్ష్మణ్, సుధాన్షు త్రివేది, రాకేష్ సిన్హా రూల్ 193 ప్రకారం లోక్‌సభలో రామాలయం నిర్మాణంపై తీర్మాణం చేయనున్నారు. బీజేపీ ఎంపీలు సత్యపాల్ సింగ్ , శ్రీకాంత్ షిండే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టపై చర్చను లేవనెత్తనున్నారు. ఉభయసభలలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. Budget Session | A short-duration discussion on White Paper on the Indian Economy is scheduled in the Rajya Sabha today. BJP legislators Sushil Kumar Modi and Prakash Javadekar will raise the discussion informing its impact on the lives of the people of the country. — ANI (@ANI) February 10, 2024 ఇదీ చదవండి: Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య! -
10 రోజుల్లో రూ. 12 కోట్లు.. బాలరాముని ఆదాయం!
అయోధ్యలోని రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామభక్తులు బాలరామునికి విరాళాలు, కానుకలు విరివిగా అందజేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలలో భక్తులు నూతన రామాలయానికి విరాళాలు అందజేస్తున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు రూ.12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22న ఒక్కరోజునే రామ్‌లల్లా రూ.3.17 కోట్ల విరాళాన్ని అందుకున్నాడు. ముఖ్యమంత్రి యోగితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి 11న రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోజున శ్రీరాముని దర్శించుకోనున్నారు. మరోవైపు రామాలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల జాబితాను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి నూతన రామాలయంలో నిర్వహించే మొదటి ఉత్సవం కానుంది. ఆరోజు ఆలయంలో సరస్వతీ మాతను పూజించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. రామాలయంలో ఏడాది పొడవునా 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరగనున్నాయి. -
శ్రీ రామునికి అయోధ్య జన్మస్థానం..భద్రాచలం కర్మ స్థానం..
-
అయోధ్యకు లండన్ సాధ్విల బృందం!
శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా రామభక్తులు తరలివస్తున్నారు. లండన్‌కు చెందిన మహిళల బృందం ఇప్పటికే అయోధ్య చేరుకుంది. వారిలో కొందరు మనస్తత్వవేత్తలు, మరికొందరు జీవశాస్త్రవేత్తలు ఉన్నారు. వీరు సాధ్విలుగా మారారు. వీరంతా తమ ఉద్యోగాలను వీడి, సన్యాసం స్వీకరించారు. సాధ్వి అవధి మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో అయోధ్యకు వచ్చానని, ఇప్పుడు రామ్‌లల్లా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. అయోధ్యకు తరలివచ్చిన సాధ్వి అవక్షి మాట్లాడుతూ ‘తామంతా సాధ్విలం, అశుతోష్మావారి అనుచరులం. రామ్‌లల్లా పవిత్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చాం. ఇది సనాతనీయులకు అపూర్వమైన రోజు. దీని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం ఉంది. ఇప్పుడు ప్రపంచ వేదికపై హిందువులు బహిరంగంగా ఉత్సవం జరుపుకునే అవకాశం వచ్చిందని’ అన్నారు. సాధ్వి గాబ్రియేల్ మాట్లాడుతూ ‘నాలోని భక్తే నన్ను రామ్‌లల్లాకు దగ్గర చేసింది. అందరూ అయోధ్య రాముని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సానుకూల శక్తి అపారంగా ఉంది. కొన్ని యుగాలుగా మనకు మార్గదర్శకంగా నిలిచిన రామాయణం, హిందూ సంస్కృతి, వేదాలు, మంత్రాలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. సాధ్వి అవక్షి డబుల్ పీహెచ్డీ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ విభాగంలో ఫిజియాలజిస్ట్‌గా పనిచేశారు. ఆమె తన ఉద్యోగాన్ని వదులుకొని సాధ్వీగా మారారు. గాబ్రియెల్.. బ్రిటన్‌లో జీవశాస్త్రవేత్తగా పనిచేశారు. పదవీ విరమణ పొందాక, సాధ్విగా మారారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! -
22న మరో రామాలయంలోనూ ప్రాణప్రతిష్ఠ
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్‌లోని సౌసర్ నగర్లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు. -
22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే.. ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి గోవా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్‌లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. హర్యానా హర్యానాలో కూడా రామ్‌లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్ హోటళ్లు! -
రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు
అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటునికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేస్తూ ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు జాకీష్రాఫ్‌ను మెచ్చుకుంటున్నారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రామునిపై ఆ నటునికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్ జాకీని ఉద్దేశించి ‘జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి’ అని కామెంట్ చేయగా, మరొకరు, 'కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు' అని రాశారు. జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. నిరుపేద చిన్నారులకు వైద్య చికిత్స చేయించేందుకు, అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాఫ్ విరాళాలు అందిస్తుంటారు. ఆయన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. #WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x — ANI (@ANI) January 14, 2024 -
అయోధ్యలో రోజుకు 30 వేల మందికి వసతి!
ఈ నెల 22న బాలరాముడు తన దివ్యమైన దేవాలయంలో ఆసీనులు కానున్నాడు. ఆరోజు ప్రత్యేక అతిథుల సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది పూర్తయ్యాక అంటే 22వ తేదీ తరువాత సామాన్య భక్తులను అయోధ్యకు ఆహ్వానించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. జనవరి 22 తర్వాత వచ్చే భక్తుల వసతి, ఆహారం తదితర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు సీఎం యోగి స్వయంగా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి అధికారులకు అందించారు. ఈ మేరకు ప్రతిరోజూ 30 వేల మంది బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వసతి సౌకర్యాలను మరింతగా పెంచనున్నారు. ఇటీవల అయోధ్యకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు జనవరి 22 తరువాత వచ్చే భక్తులకు హోటళ్లు, ధర్మశాలలు, హోమ్ స్టే, టెంట్ సిటీ, డార్మిటరీలో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రామనగరికి వచ్చే భక్తుల విషయంలో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘రామచరిత మాసన’ విక్రయాల జోరు! -
10 ప్రముఖ రామాలయాలు.. వీటి గొప్పదనం ఇదే..
అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రామాలయంలో జనవరి 22న బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే దేశంలోని 10 ప్రముఖ రామాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరం (ఉత్తరప్రదేశ్) ఈ ఆలయ గొప్పదనం జగద్విదితం. అయోధ్యను రామజన్మభూమి అని అంటారు. ఇది సరయూ నది ఒడ్డున ఉంది. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం (కేరళ) ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన శ్రీరాముని విగ్రహాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని చెబుతారు. కేరళలోని చెట్టువా ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడంటారు. తరువాతి కాలంలో ఆ ప్రాంత పాలకుడు వక్కయిల్ కైమల్ ఆ విగ్రహాన్ని త్రిపయార్ ఆలయంలో ప్రతిష్టించాడు. ఇక్కడికి వచ్చిన భక్తుడు దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతాడని భక్తులు నమ్ముతారు. కాలారామ్ ఆలయం (నాసిక్) మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో కాలారామ్ ఆలయం ఉంది. ఇక్కడ రెండు అడుగుల ఎత్తయిన రాముడి నల్లని విగ్రహం కనిపిస్తుంది. సీత, లక్ష్మణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. గోదావరి నదిలో రాముని నల్లని విగ్రహం ఉన్నట్లు అతనికి కల వచ్చింది. దీంతో ఆయన మరుసటి రోజు ఆ విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించారు. సీతా రామచంద్రస్వామి ఆలయం (తెలంగాణ) ఈ ఆలయం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఉంది. లంక నుండి సీతామాతను తీసుకువచ్చే క్రమంలో.. శ్రీరాముడు గోదావరి నదిని దాటిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలోని శ్రీరాముని విగ్రహం విల్లు, బాణాలతో కూడివుంటుంది. చేతిలో కమలం పట్టుకున్న సీతామాత శ్రీరాముని పక్కన నిలుచుని ఉంటారు. రామరాజ దేవాలయం (మధ్యప్రదేశ్) ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. భారతదేశంలో శ్రీరాముని దేవునిగా కాకుండా రాజుగా పూజించే ఏకైక ఆలయం రామరాజ ఆలయం. ఇక్కడ ప్రతిరోజూ శ్రీరామునికి ఆయుధ వందనం చేస్తుంటారు. కనక్ భవన్ ఆలయం (అయోధ్య) అయోధ్య రాముని జన్మస్థలం. ఇక్కడే ఉన్న కనక్ భవన్ ప్రముఖ రామాలయాల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఆలయంలోని బంగారు సింహాసనాలపై ఆభరణాలతో అలంకృతమైన సీతారాములు ఉన్న కారణంగా ఈ ఆలయానికి కనక్ భవన్ ఆలయం అనే పేరు వచ్చింది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయ గోడలు అద్భుతంగా కనిపిస్తాయి. శ్రీ రామ తీర్థ మందిర్ (అమృత్సర్) ఈ ఆలయం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. లంక నుండి వచ్చిన తరువాత సీతామాతను శ్రీరాముడు విడిచిపెట్టినప్పుడు, ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఈ ఆలయం అదే స్థలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇక్కడే సీతామాత కవలలకు జన్మనిచ్చిందని అంటారు. కొందండ రామస్వామి దేవాలయం (చిక్కమగళూరు) ఈ ఆలయం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. హిరమగళూరులో పరశురాముడు.. శ్రీరాముని వివాహ దృశ్యాలను చూపించమని ఆయనను అభ్యర్థించాడట. దీనికి ప్రతిగా కోదండరామస్వామి ఆలయంలోని విగ్రహాలు హిందూ వివాహ అలంకారంలో కనిపిస్తాయి. రాముడు, లక్ష్మణునికి కుడి వైపున సీతామాత నిలుచునివున్న ఏకైక ఆలయం ఇదే. రామస్వామి దేవాలయం (తమిళనాడు) రామస్వామి దేవాలయం తమిళనాడులో ఉంది. రామస్వామి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని అయోధ్య అంటారు. భరతుడు, శత్రుఘ్నునితో పాటు రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠితమైన ఏకైక ఆలయం ఇదే. రఘునాథ్ ఆలయం (జమ్మూ) ఈ ఆలయం జమ్మూలో ఉంది. ఇది ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయ సముదాయంలో దాదాపు ఏడు ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంలోని ఇతర దేవతలకు కూడా పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం మొఘలల నిర్మాణ శైలిలో ఉంటుంది. -
అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో ఐదు మండపాలు (హాళ్లు) ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం. దేవతా మూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. సింహద్వారం నుండి ప్రవేశించే భక్తులు 32 మెట్ల ద్వారా ఆలయం లోనికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహరీగోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ర్యాంప్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. 25 వేల మంది యాత్రికులకు సరిపడేలా సౌకర్యాల కేంద్రం (పీఎఫ్సీ)నిర్మిస్తున్నారు. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలు కల్పించనున్నామని ట్రస్ట్ తెలిపింది. ఇది కూడా చదవండి: Pran Pratishtha: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత? -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి!
సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది. నూతన రామాలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. 33 మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తరువాత భక్తులు దక్షిణ దిశ నుండి నిష్క్రమణ కావాలని ఉంటుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన రామాలయ విశేషాల గురించి తెలియజేసింది. మొత్తం ఆలయ సముదాయం 70 ఎకరాలు. ఇందులో 25 నుంచి 30శాతం స్థలంలో మాత్రమే ఆలయం నిర్మితమవుతోంది. మిగిలిన ప్రాంతం పచ్చదనంతో కూడి ఉంటుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ.. ఆలయంలోని బాలరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన చేసే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు ప్రధాన ద్వారాలు సిద్ధం కానున్నాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. పూజలు, ప్రార్థన, భజనలకు ఐదు మంటపాలు నిర్మిస్తున్నారు. ఆలయ సముదాయంలో మొత్తం 44 ద్వారాలు ఉండనున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ సముదాయంలో మౌలిక సదుపాయాలు విరివిగా ఉంటాయన్నారు. నీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం కూడా ఉంటాయన్నారు. భక్తుల కోసం సుమారు 25 వేల లాకర్లు ఏర్పాటు చేస్తున్నమని, ఇక్కడ సామాను ఉచితంగా ఉంచుకోవచ్చన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నూతన ఆలయం నాగర్ శైలిలో ఉంటుందని, ఇది ఉత్తర భారత దేవాలయాల ప్రత్యేకశైలి అని చెప్పారు. అలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారని, ఇది దక్షిణ దేవాలయాల నిర్మాణ శైలికి ఉదారహణ అని తెలిపారు. ఆలయ నలుమూలల్లో సూర్య భగవానుడు, గణపతి, శివుడు, భగవతి అలయాలు ఉంటాయని, మధ్యలో బాలరాముడు కొలువుదీరుతాడన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! -
అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి తమవంతు విరాళాలు అందించారు. సాధారణంగా ఇతరుల ముందు చేతులు చాచే వీరు రామ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా అందించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)సమర్పణ్ నిధి ప్రచారంలో కాశీకి చెందిన 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. గత నవంబర్‌లో కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకుని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కాశీలో భిక్షాటన సాగించే బైద్యనాథ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నాని చెప్పాడు. అప్పటి నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తున్నానన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగున్నదని తెలుసుకుని యాచకులమంతా విరాళాలు సేకరించి అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. తాను జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా నాలుగు వేల మందికి పైగా చెప్పులు కుట్టేవారు, చాకలివారు, స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని నూతన రామాలయం కోసం విరాళంగా అందించారు. కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు. ఇది కూడా చదవండి: రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి! -
‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2024 జనవరి 22న నూతన రామాలయంలో మర్యాద పురుషోత్తముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. తాజాగా శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15తో పోల్చారు. రాయ్ మీడియాతోమాట్లాడుతూ దేశంలో 1947, ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో, 2024 జనవరి 22 కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే సాధనంగా అయోధ్య రామమందిర నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమవుతుండటంపై దేశ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. 2024, జనవరి 22న నూతన రామాలయంలో జరిగే బాల రాముని విగ్రహప్రతిష్ణాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. -
రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన వెంట రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకెళ్లారు. తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి రామ మందిరం నేపథ్యంతో వజ్రాల హారాన్ని తయారు చేయించారు. ఈ వజ్రాల హారంలో ఐదు వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించామని సదరు వ్యాపారి తెలిపారు. హారం తయారీలో రెండు కిలోల వెండిని వినియోగించామన్నారు. అలాగే 40 మంది కళాకారులు ఈ డిజైన్‌ను 35 రోజుల్లో పూర్తి చేశారన్నారు. దీనిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కోసం తయారు చేయలేదని, అయోధ్యలోని రామాలయానికి కానుకగా అందజేస్తామని తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోని కోట్లాది మంది రామభక్తులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తారన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తామని అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నదీతీరం గుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ఏఐతో మరో కొత్త ఆందోళన! -
రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం
రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా ఎంపిక అయిన అర్చక అభ్యర్థులు బుధవారం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరికీ నేటి నుంచి అంటే గురువారం నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఈ ఆరు నెలల శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులకు శ్రీరామ జన్మభూమి ఆలయంతో పాటు ఇతర దేవాలయాలలో అర్చకులుగా నియమించనున్నారు. మరోవైపు శిక్షణ కార్యక్రమాలకు వచ్చిన అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తమకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ సమయంలో ప్రతి అర్చక అభ్యర్థికి నెలకు రూ. 2,000 ఇవ్వనున్నారు. అర్చక శిక్షణకు వచ్చిన అభిషేక్ పాండే మాట్లాడుతూ శ్రీరాముని ఆరాధనా విధానం, పూజలు మొదలైన వాటిపై తమకు శిక్షణ అందిస్తున్నారన్నారు. కాగా అర్చక అభ్యర్థులకు శిక్షణ సమయంలో అర్హత కలిగిన ఆచార్యుల దగ్గర సమస్త ఆచార వ్యవహారాలు నేర్పించనున్నారు. అయోధ్యలో రామాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
అయోధ్య ధ్వజ స్థంభాల నిర్మాణం జరుగుతోందిలా..
నూతన సంవత్సరం రాకకు మరికొద్ది రోజులే మిగిలివున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. కంపెనీ ఎండీ భరత్ మేవాడ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని నూతన రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల తయారీ పని తమకు అప్పగించారని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 5,500 కిలోల బరువున్న ఒక ప్రధాన ధ్వజ స్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజ స్తంభాలు ఉన్నాయని భరత్ తెలిపారు. మరోవైపు రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. ఆలయ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి #WATCH | Gujarat: Construction of 7 flag poles for the Ram temple in Ayodhya is underway in Ahmedabad. (04.12) pic.twitter.com/GkPCQudVoq — ANI (@ANI) December 5, 2023 -
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు
‘ఆదిపురుష్’ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా నటించారు. భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్ హనుమాన్‌కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్ 🙏Spreading the Divine Aura of Lord Rama unconditionally🤩The Motto to take the Epic & Divine Tale #Adipurush to everyone & every corner continues to be celebrated 🙏@shreyasgroup announces 100+1⃣ tickets to Every Ramalayam in Every Village of Khammam Dt for… pic.twitter.com/2FB5BWVbh6— Shreyas Media (@shreyasgroup) June 11, 2023 చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా -
అయోధ్యలో ‘భూ’కంపం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం కోసం జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 12వేల చదరపు మీటర్ల భూమి కొనుగోలులో భారీ అవినీతి దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ భూమిని కేవలం రూ.2కోట్లకు కొన్న వ్యక్తి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అదేరోజున కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని, అయోధ్య రామాలయ ట్రస్ట్ స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అవినీతి లావాదేవీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘శ్రమజీవుల విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం వారి నమ్మకాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అక్రమ నగదు బదిలీ వ్యవహారమని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా∙డిమాండ్ చేశారు. రామాలయం నిర్మాణాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వ్యాపారంగా మలచుకున్నాయని ఒకప్పటి బీజేపీ భాగస్వామి అయిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓ ప్రకాశ్ రాజ్‌భర్ ఆరోపించారు. అసలు వివాదం ఏంటి? వివాదానికి కేంద్రబిందువైన ఆ భూమి కొనుగోలు పత్రాల ప్రకారం.. మార్చి 18న బాగ్ జైసీ గ్రామంలో కుసుమ్ ఫాటక్ అనే వ్యక్తి తన 12,080 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న భూమిని రవి తివారీ, సుల్తాన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులను రూ.2 కోట్ల మొత్తానికి విక్రయించాడు. రవి, అన్సారీలు కొన్న అదే 18 వ తేదీన కేవలం కొద్ది నిమిషాల తర్వాత వీరిద్దరి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏకంగా రూ.18.5 కోట్లు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసింది. ట్రస్టు సభ్యులైన బీజేపీ నేత అనిల్ మిశ్రా, అయోధ్య మాజీ మేయర్ హ్రిషీకేశ్ ఉపాధ్యాయ్లు ట్రస్టు తరఫున సంతకాలు చేసి ఈ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ముఖ్యపాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. వేరొకరి నుంచి రూ.2 కోట్లకు కొన్న భూమిని అదే రోజున కొద్ది నిమిషాల్లో రూ.16.5 కోట్లు ఎక్కువ చెల్లించి కొనాల్సిన అవసరమేముందని, ట్రస్టు సొమ్మును దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
‘అయోధ్య’ కోసం చట్టం తేవాలి
నాగపూర్: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. శ్రీరాముని జన్మస్థలంలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష అన్నారు. ‘ఆత్మగౌరవ దృష్టితో చూసినా లేదా దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొనాలంటే ఆలయ నిర్మాణం అవశ్యం’ అని పేర్కొన్నారు. జన్మభూమి ప్రదేశంలో గతంలో దేవాలయం ఉందనడానికి సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించినా ఇంకా ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగించలేదన్నారు. రామ మందిర నిర్మాణం రాజకీయాల వల్ల ఆలస్యమవుతోందన్న భాగవత్.. సమాజం ఓపికనూ పరీక్షించడం ఎవరికీ మంచిది కాదని హెచ్చరించారు. ‘స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు. దాంతో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కేంద్రం పూనుకుని, అవసరమైతే సంబంధిత చట్టం తీసుకువచ్చైనా ఆ అడ్డంకులు తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. విజయదశమి సందర్భంగా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సంఘ్ శ్రేణులను ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. శబరిమలపై..: శబరిమల అంశంపై స్పందిస్తూ.. ‘సంప్రదాయాలను, భక్తుల విశ్వాసాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తీర్పుతో సమాజంలో విబేధాలు ఏర్పడ్డాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు హిందూ సమాజమే ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. అర్బన్ నక్సలిజం వల్ల సమాజంలో విద్వేషం వ్యాప్తి చెందుతోందన్నారు. -
రామాలయంలో బ్యాగు కలకలం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఓ భక్తుడు వదిలేసిన బ్యాగుతో కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి కోవెలకు సమీపంలో ఓ భక్తుడు బ్యాగు వదిలిపెట్టి వెళ్లాడు. అది చాలా సేపు అక్కడే ఉంది. ఆలయ సిబ్బంది దాని ని చూసి, సెక్యూరిటీ వారికి సమాచారం ఇవ్వటం తో వారు దానిని పరిశీలించారు. అయితే బ్యాగు పై అనుమానం కలుగటంతో బాంబ్‌స్క్వాడ్ బృం దానికి సమాచారం ఇచ్చారు. బ్యాగులో ఏదో ఉం దని ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాం దోళనకు గురయ్యారు. బాంబుస్క్వాడ్ బృందం వచ్చి ఆ బ్యాగును నిశితంగా పరిశీలించగా అందు లో భక్తులకు సంబంధించిన కొబ్బరికాయ, బట్ట లు ఉన్నాయి. దీంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీ ల్చుకున్నారు. బ్యాగుకు సంబంధించిన భక్తులెవ్వరూ రాకపోవటంతో దానిని ఆలయ సిబ్బంది ఆధీనంలో ఉంచుకున్నారు. -
పెద్ద తుంబళం మరో అయోధ్య
ఆదోని రూరల్/అర్బన్: పెద్ద తుంబళంలోని పురాతన రామాలయాన్ని అభివృద్ధి చేస్తే మరో అయోధ్యగా ప్రఖ్యాతి చెందుతుందని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్ద తుంబళం గ్రామాన్ని సందర్శించి అక్కడి పురాతన రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ 800 ఏళ్ల క్రితం నాటి దేవాలయం ఇప్పటికి పటిష్టంగా ఉండటం విశేషమన్నారు. మాన్యం భూముల ద్వారా ఆదాయం వస్తున్నా ఆయలం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో ఇటీవలే మాట్లాడి రూ. కోటితో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను పూనుకున్నట్లు చెప్పారు. అనంతరం అదే గ్రామంలోని జైన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ౖజైన్ సంప్రదాయబద్దంగా స్వామికి శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త విట్టారమేష్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. రామరాజ్యం రావాలంటే గురువులే రావాలి రామరాజ్యం రావాలంటే రాజకీయ నాయకులచేత రాదని, గురువులొస్తేనే రామరాజ్యం వస్తుందని పరిపూర్ణానందస్వామి అన్నారు. సోమవారం పట్టణంలోని భవసాగర కల్యాణ మండపంలో పురప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంపై ఎందరో దాడులు చేసినా దేశ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నది గురువులేన్నారు. రామమందిరం నిర్మాణం చేయాలంటే రామనామంతో పాటు, కార్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖులు విట్టా కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, విట్టా రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, మారుతీరావు, ప్రకాష్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.