ranjith
-
కోలీవుడ్ టార్చ్ బేరర్స్
కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్‌ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్‌గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్‌లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్మెంట్తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.సామాజిక వివక్షే కథగా...అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.పోరాట యోధులుగా...సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్‌కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.కఠినమైన వాస్తవాలతో...తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్‌ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే. కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్‌కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు -
'ఆ డైరెక్టర్ నా పర్సనల్ ఫోటోలు నటి రేవతికి పంపాడు'
మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి తెలుపుతూ జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదిక వెళ్లడించింది. దీంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై కోజికోడ్‌లోని మంకావ్కు చెందిన సజీర్ (33) సంచలన ఆరోపణలు చేశాడు. 2012లో తనపై దర్శకుడు రంజిత్ లైంగికదాడికి పాల్పడ్డారని కేరళ డీజీపీకి లేఖ రాశాడు. ప్రస్తుతం కోజికోడ్‌లోని ఓ స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సజీర్.. సీనియర్ హీరోయిన్ రేవతి పేరును తెరపైకి తీసుకొచ్చి పెద్ద దుమారమే రేపాడు.2012లో కోజికోడ్‌లో బవుత్తియుడే నమతిల్ సినిమా షూటింగ్ సమయంలో రంజిత్‌ను తొలిసారి కలిశానని సజీర్ ఇలా తెలిపాడు. 'ఆ సమయంలో నేను డిప్లొమా చదువుతున్నాను. ఆ సినిమా సెట్ వద్దకు నేనూ వెళ్లాను. ఏదైనా సినిమాలో ఛాన్స్ కావాలని నేను అడగ్గానే వెంటనే ఒక టిష్యూ పేపర్‌పై తన ఫోన్ నంబర్ రాసి ఇచ్చాడు. ఆపై బెంగళూరులోని తాజ్ హోటల్‌కు నన్ను ఆహ్వానించాడు. అయితే, రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌కు నేను వెళ్లాను. వారు నన్ను లోపలికి అనుమతించలేదు. అయితే, రంజిత్ సూచనమేరకు వెనుక గేటు ద్వారా లోపలికి వెళ్లాను. గదిలోకి నేను వెళ్లిన సమయంలో దర్శకుడు రంజిత్ మద్యం మత్తులో ఉన్నాడు. అప్పుడు నన్నూ మద్యం తీసుకోమని చెప్పడంతో జీవితంలో మొదటిసారి సేవించాను. కళ్లు బాగున్నాయంటూ దగ్గరికొచ్చి నా దుస్తులు తొలగించి రాత్రంతా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ సమయంలో నా ఫోటోలను కూడా రంజిత్ తీశాడు. అని సజీర్ ఫిర్యాదు చేశాడు.'దర్శకుడు రంజిత్ గదిలోకి వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫోటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను.రంజిత్ బాలకృష్ణన్‌పై బెంగాలీ నటి శ్రీలేఖ కూడా కొద్దిరోజుల క్రితమే కీలక ఆరోపణలు చేసింది. రంజిత్ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని బహిరంగంగానే ఆమె చెప్పుకొచ్చింది. 2009లో ఒక సినిమా ఆడిషన్ కోసం సంప్రదిస్తే.. ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. నటి ఆరోపణలపై రంజిత్ స్పందించాడు. అవన్నీ ఆరోపణలు మాత్రమేనని ఆయన అన్నాడు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలకు పాల్పడుతున్నారని వెళ్లడించాడు. అయితే, తాజాగా ఆరోపణలు చేసిన సజీర్ గురించి ఇంకా ఆయన రియాక్ట్ కాలేదు. -
భార్య మృతదేహాన్ని ఛీ కొట్టిన ఐఏఎస్ ఆఫీసర్!
ఆయనో ఐఏఎస్ అధికారి. తన కళ్లెదుటే భార్య విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆయన ఏమాత్రం కనికరం చూపించలేదు. ఆమె మృతదేహాన్ని సైతం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ అధికారి నిరాకరించారు. ఛీ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే..గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీలో కమిషన్‌లో పని చేసే ఉన్నతాధికారి రంజిత్ కుమార్(తమిళనాడు). ఆయన భార్య సూర్య జై. తొమ్మిది నెలల నుంచి ఆమె కనిపించకుండా పోయారు. అయితే భార్య మిస్సింగ్‌పై ఆయన పోలీసులను ఆశ్రయించలేదు. పైగా విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. తాజాగా.. ఆమె ఓ కిడ్నాప్ కేసులో నిందితురాలు అని తేలింది. ఇంకో భారమైన విషయం ఏంటంటే.. ఓ గ్యాంగ్‌స్టర్ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయారని తేలింది.మహారాజ హైకోర్టు అనే గ్యాంగ్‌స్టర్‌తో రిలేషన్షిప్లో ఉన్న సూర్య జై.. తొమ్మిది నెలల కిందట ఓరోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అయితే ఈ నెల 11వ తేదీన తమిళనాడు మధురై పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో సూర్య జైని నిందితురాలిగా చేర్చారు. మహారాజ, అతని అనుచరుడు సెంథిల్ కుమార్‌తో కలిసి మధురైకి చెందిన ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేసిందామె. పోలీసులు ఆ కుర్రాడిని రక్షించినా.. నిందితులు మాత్రం తప్పించుకున్నారు.పరారీలో ఉన్న సూర్య జై సడన్‌గా గత శనివారం గాంధీనగర్‌లోని రంజిత్ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. తన తప్పు తెలుసుకున్నానని, విడాకులు వద్దంటూ, తనను రక్షించమని, కలిసి జీవిద్దామని భర్తను బతిమాలుకుంది. అయితే తన పరువు పోయిందంటూ ఆమె దూషిస్తూ.. ఇంట్లోకి అనుమతించలేదాయన. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అక్కడే విషం తాగి కుప్పకూలింది.స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆదివారం ఆమె కన్నుమూసింది. విషయం తెలిసిన ఆయన ఆస్పత్రికి వెళ్లారే తప్ప.. భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. పని మనుషులతో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి వెళ్లిపోయారట. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె రాసిన సూసైడ్ లెటర్ సారాంశాన్ని వివరించేందుకు మాత్రం నిరాకరించారు.సీఎంకు సూర్య లేఖ!అయితే మధురై బాలుడి కిడ్నాప్ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె రాసిన లేఖ సోమవారం మధురై పోలీసులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. అందులో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన మదురైలో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆ బాలుడి తల్లి మైథిలీ రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో మదురై పోలీసులు రంగంలోకి దిగారు. తిరునల్వేలికి చెందిన మహారాజ్‌తో పాటు మరికొందరి ద్వారా ఈ కిడ్నాప్‌ను గుజరాత్లో ఉన్న ఐఏఎస్ అధికారి రంజిత్ సతీమణి సూర్య ప్రమేయం కిడ్నాప్‌లో ఉన్నట్టుగా బాలుడి తల్లి ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన మదురై పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐఏఎస్ అధికారి సతీమని సూర్య, ఆ బాలుడి తల్లి మైథిలీ మధ్య నగదు లావాదేవీల వివాదం ఉన్నట్లుగా వారు వాగ్మూలం ఇచ్చినట్టు వెలుగు చూసింది. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, మైథిలీ రాజలక్ష్మి ఆరోపణల కారణంగా తన భర్తకు తీవ్ర తలవంపులు వచ్చినట్టు, ఈ వ్యవహారంలో సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ ఆమె రాసిన లేఖ సోమవారం మదురై పోలీసులకు చేరడం చర్చకు దారి తీసింది. -
పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: దీపావళి రోజున విషాదం నెలకొంది. మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు వెళ్లిన యువకుడు విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. పెంబి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఈర్ల పోసాని–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈర్ల రంజిత్ (23) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండునెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామ సమీపంలో తన తండ్రికి ఉన్న మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు ఆదివారం ఉదయం 6 గంటలకు వెళ్లాడు. ఉదయం 10 గంటల అవుతున్నా ఇంటికి రాలేదు. తండ్రి అక్కడికి వెళ్లి చూడగా.. విద్యుత్ మోటర్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. పెళ్లిపీటలపై ఎక్కాల్సిన కొడుకు కానరానిలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రజినీకాంత్ తెలిపారు. -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి తీవ్ర విషాదం!
నిజామాబాద్: నగరంలోని ముబారక్‌నగర్ సుజిత్ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోదాసు రంజిత్ (19) మృతి చెందాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో మహేశ్‌కుమార్ తెలిపిన వివరాలు.. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన బోదాసు రంజిత్, బోదాస్ గంగాధర్ వరుసకు అన్నదమ్ములు. వీరు ఇద్దరు మేస్త్రీ పనిచేయడానికి నగరానికి వస్తున్నారు. గంగాధర్ బైక్ నడుపుతుండగా రంజిత్ వెనక కూర్చున్నాడు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. వెనక కూర్చున్న రంజిత్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడి తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం, సుజిత్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు రోడ్డుపై నిలిపి ఉండటంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు రోడ్డు బైఠాయించారు. దీంతో దాదాపు గంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్‌హెచ్‌వో హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
పోలీసులకు సవాల్‌గా ‘కత్తిపోటు’ కేసు.. అనుమానాలెన్నో..
వరంగల్: వరంగల్ నగరంలోని మిల్స్‌కాలనీ ఠాణా పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన కత్తిపోటు కేసు విచారణ పోలీసులకు సవాల్‌గా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ సమయంలో వరంగల్ నగరం నడిబొడ్డున ఈనెల 5వ తేదీ రాత్రి గణేశ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వారం రోజులు కావొస్తున్నా.. పోలీసులు ఏం తేల్చలేకపోతున్నారు. ఎం.శ్రీనివాస్, అతడి బావమర్ది కె.రంజిత్‌కు బ్యాంకులో ఇప్పించిన దాదాపు రూ.కోటిన్నర రుణం కింద ఇవ్వాల్సిన కమీషన్ అడిగినందుకే తనపై దాడి చేశారని చారుగండ్ల శ్రీనివాస్ మిల్స్‌కాలనీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి జరిగిన రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి రక్తపు మరకలతో ఎంజీఎం ఆస్పత్రికి వెళ్తే వైద్యులు చికిత్స అందించారు. దాదాపు కడుపుపై మూడు కుట్లు వేసి మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. అనుమానాలెన్నో.. పోలీసులు తేల్చాల్సిందే.. ● నిందితుడు ఎం.శ్రీనివాస్ అదే రోజు రాత్రి వరకు హైదరాబాద్‌లో ఉన్నట్టుగా చెప్పడంతో అక్కడి సీసీటీవీ ఫుటేజీలను తెప్పిస్తున్నట్టుగా తెలిసింది. ● బాధితుడు సి.శ్రీనివాస్ మాత్రం తనపై దాడి చేసింది ఎం.శ్రీనివాస్, కె.రంజిత్ అని ఖరాఖండిగా పోలీసులకు చెబుతున్నాడు. దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలో నిందితుడు ఎం.శ్రీనివాస్ ఇంటి వద్ద సీసీ టీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాధితుడు శ్రీనివాస్ అతడి ఇంటి ముందుకు వచ్చి బండిపైనే ఉండి పిలిచినట్టుగా ఉన్న దశ్యాలు రికార్డు అయ్యాయి. ● బాధితుడు ఆరోపిస్తున్నట్టుగా తనపై దాడి చేసిన సమయంలో అటువైపుగా కారు వెళ్లడం వల్ల బండి స్లో చేశానని, ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేస్తుండడంతో బండి పట్టుకొని ముందుకొచ్చానని చెప్పాడు. ●బాధితుడు చెప్పినట్లుగా ఆ సమయంలో అటువైపుగా వెళ్లిన కారు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీకి చిక్కాలి. అటువంటిదేమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇతడిపై దాడి జరిగి పరారైన వెంటనే ఆ కారు వెనక్కి తీసుకొని వెళ్లారా? వెళ్తే మెయిన్‌రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యం చిక్కి ఉంటుంది కదా.. ఆ దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ● బాధితుడే కత్తితో దాడి చేసుకొని ఇలా చేశాడన్న ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం ఎంత అన్నది పోలీసులు తేల్చాలి. బాధితుడు మాత్రం తనను తాను పొడుచుకునేంత ఖర్మ పట్టలేదని, కమీషన్ ఇవ్వాలని కొన్నిరోజులుగా వారి చుట్టూ తిరుగుతున్నానని, దాని కోసం ప్రాణం తీసుకునే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. అవసరమైతే తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానే తప్ప ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ● దీంతో అసలు ఏం జరిగిందనే దిశగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అసలు నిందితులెవరో తేల్చాల్సిన అవసరం కనిపిస్తోంది. అవసరమైతే ఆ దాడి చేసిన సమయంలో ఫిర్యాదుదారుడు శ్రీనివాస్‌తో పాటు ఇంకా ఎవరి మొబైల్ నంబర్లు ఆ ప్రాంతంలో పనిచేశాయి అనే దిశగా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. -
భర్త హోటల్లో పని చేసే సప్లయర్‌తో భార్య వివాహేతర సంబంధం
కర్ణాటక: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడి సహా ఐదుగురిని తలఘట్టపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...గతనెల 29న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన అరుణ్‌కుమార్ (34) ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో జేఎస్ఎస్ కళాశాల పక్కన హోటల్ నడిపిస్తున్నాడు. ఆ హోటల్‌కు గణేశ్ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి తోడు అరుణ్‌కుమార్, గణేశ్‌తో చేబదులుగా కొంత నగదు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే గణేశ్, రంజిత వివాహేతర సంబంధం గురించి అరుణ్ తెలుసుకుని భార్యను తీవ్రంగా మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్ అతని శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు. అరుణ్ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. మరుసటి రోజు తలఘట్టపుర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా రంజిత మొబైల్ ఫోన్‌కాల్ డేటా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
అభిమాని ఆఖరి కోరిక తీర్చిన హీరో ప్రభాస్
-
మంచి మనసున్న మన్నెం
నల్గొండ: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న గణేశ్‌కు చికిత్స అనంతర ఖర్చుల కోసం మండలానికి చెందిన ఎన్ఆర్ఐ, బీఆఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెందిన శంకర్ కుమారుడు గణేష్‌కు ఇటీవల నిమ్స్‌లో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న మన్నెం రంజిత్ యాదవ్ ఆదివారం నిమ్స్‌లో గణేష్ తల్లిదండ్రులను కలిసి వారికి రూ.20వేలు అందజేశారు. ఆయన వెంట మాడుగులపల్లి బీఆఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు కడయం సైదులు, ముద్ద నవీన్ ఉన్నారు. -
‘లెహరాయి’ పెద్ద హిట్ అవ్వాలి: కార్తికేయ
‘కొత్తగా వచ్చే సినిమాలు ఎంత హిట్ అయితే అంతమంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది. లెహరాయి చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని యంగ్ హీరో కార్తికేయ అన్నారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ వేణుగోపాల్ గారే. ఇది ఒక మంచి కథ. ఈ కథను పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది’ అని హీరో రంజిత్ అన్నారు. ‘ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని హంగులు లెహరాయిలో ఉన్నాయి. డిసెంబర్ 9న విడుదలయ్యే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. -
Leharaayi: ఆకట్టుకుంటున్న ‘బేబీ ఒసే బేబీ’ సాంగ్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 90వ దశకంలో ట్రెండింగ్‌లో ఉన్న సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. తాజాగా లెహరాయి చిత్రం నుంచి ‘బేబీ ఒసే బేబీ’ మాస్ మెలోడీని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, సాకేత్, కీర్తన శర్మ ఇద్దరూ తమ మెస్మరైజింగ్ వాయిస్ తో ఆలపించారు. డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆకట్టుకుంటున్న ‘లెహరాయి’ ట్రైలర్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఓ యువ జంట కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ కాలేజీలో చాలామందితో ప్రొపోజల్స్ అందుకుంటుంది. వాటినుంచి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా హీరోకి ఐ లవ్ యు అని చెబుతుంది, అయితే ఆమె తండ్రి తన కుమార్తెపై ఎక్కువ ప్రేమను చూపిస్తుంటాడు. ఉద్దేశపూర్వకంగా చెప్పడం వలన తండ్రి కూతుర్లు ఏమి చేసారు.? కథ ఎటువంటి మలుపులు తిరిగిందని యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని సాగే డైలాగులు రంజిత్, సౌమ్య మీనన్ మధ్య సాగే సంభాషణలు యూత్ ను అలరిస్తాయి. ఫన్ పోర్షన్ కూడా బాగుంది. ట్రైలర్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాప్ట్‌గా ఉంది. పూర్తి భావోద్వేగాలు, వినోదం మరియు ప్రేమతో నిండిన ఈ యూత్‌ఫుల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 9న సినిమా విడుదలవుతోంది. -
‘లెహరాయి’ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్
రంజిత్, సౌమ్యా మీనన్ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్‌పై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మెరుపై మెరిసావే.. వరమై కలిసావే.. గుండె గిల్లి వెల్లావే..’ అంటూ సాగే రెండో పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్ డైరెక్టర్ జీకే (ఘంటాడి కృష్ణ)గారి పాటలను అప్పట్లో యూత్ అంతా పాడుకునేవారు. చాలా రోజుల తర్వాత ఆయన ‘లెహరాయి’ ద్వారా మళ్లీ రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మెరుపై మెరిసావే..’ కి జీకేగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడటం మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాను. సినిమాని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్. ‘‘మంచి ఫీల్ ఉన్న కథా చిత్రమిది’’ అన్నారు రామకృష్ణ పరమహంస. -
‘లెహరాయి’ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
‘‘లెహరాయి’ దర్శకుడు రామకృష్ణ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. సెన్సిబుల్ వ్యక్తి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు విజయ్‌కుమార్ కొండా అన్నారు. రంజిత్, సౌమ్యా మీనన్, గగన్ విహారి ముఖ్య పాత్రల్లో రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విజయ్‌కుమార్ కొండా విడుదల చేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. రామకృష్ణ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడవుతాడు’’ అన్నారు. ‘‘మంచి కాన్సెప్‌్టతో వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్. ‘‘ఫ్యామిలీ ఎమో షన్స్ మిళితమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు రామకృష్ణ పరమహంస. -
నా కల నిజమైంది..అలా మారడం చాలెంజింగ్: హీరో ఆర్య
అది పెద్ద సవాల్ఆర్య హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సారపట్ట పరంబరై’. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ఆర్య మాట్లాడుతూ– ‘‘ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న నాకు రంజిత్ చెప్పిన ‘సారపట్ట పరంబరై’ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ బాక్సింగ్ ఉంటుంది. జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1975లో మద్రాస్‌లో ఉండే బాక్సింగ్ కల్చర్‌ని చూపించాం. బాక్సర్‌గా మారడం ఫిజికల్‌గా పెద్ద చాలెంజింగ్‌గా అనిపించింది. జాతీయ స్థాయి బాక్సర్ల దగ్గర శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నా మ్యారీడ్ లైఫ్ బాగుంది. ‘గజినీకాంత్, కాప్పాన్, టెడ్డీ’ చిత్రాల్లో సాయేషా (హీరోయిన్, ఆర్య భార్య), నేను కలిసి నటించాం. మంచి కథ దొరికితే మళ్లీ నటిస్తాం. తెలుగులో ‘వరుడు’, ‘సైజ్ జీరో’ చిత్రాల తర్వాత మరో సినిమా చేయాలని నాకూ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
రంజిత్.. ఓ అజ్ఞాతవాసి!
సాక్షి, హైదరాబాద్/మద్దూరు(హుస్నాబాద్): దళంలో పుట్టిపెరిగిన రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ అనే మావోయిస్టు తాజాగా జనజీవనస్రవంతిలో కలిశాడు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా ఉండి మృతి చెందిన రామన్న కుమారుడే రంజిత్. అతడు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వద్ద బుధవారం హైదరాబాద్‌లో లొంగిపోయాడు. రంజిత్ మావోయిస్టు దంపతులు సావిత్రి– రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్నలకు 1998లో దండకారణ్యంలో జన్మించాడు. ‘‘సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రామన్న 1982లో పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అక్కడే సావిత్రిని వివాహం చేసుకున్నాడు. సావిత్రి ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం డివిజనల్ కమిటీ మెంబర్‌గా ఉంది. రంజిత్ దండకారణ్యంలోని జనతన సర్కారు పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లోని కాకతీయ స్కూల్లో శ్రీకాంత్ అని పేరు మార్చుకుని 10వ తరగతి వరకు చదివాడు. 2017లో తండ్రి ఆదేశాల మేరకు పార్టీలో చేరాడు. 2019లో రామన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం పార్టీలో రంజిత్‌కు అవమానాలు, వేధింపులు ఎక్కువకావడంతో తాళలేక పోలీసులకు లొంగిపోదామని తల్లి వద్ద ప్రతిపాదించగా ఆమె తిరస్కరించింది’’అని డీజీపీ వివరించారు. రంజిత్‌కు సాయం రంజిత్‌కు పునరావాసం కింద రూ.4 లక్షలు, తక్షణ ఆర్థిక అవసరాల కింద రూ.ఐదువేలను డీజీపీ అందజేశారు. కాగా, హరిభూషణ్ స్థానంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా దామోదర్ బాధ్యతలు తీసుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. మాకు సంతోషంగా ఉంది... ‘మా తమ్ముడు రావుల రామన్న 12 ఏళ్లప్పుడు కుటుంబాన్ని వదిలి ఉద్యమంలోకి వెళ్లాడు. తర్వాత తిరిగి రాలేదు. 2019లో అనారోగ్యంతో బాధపడుతూ చనిసోయాడని పోలీసుల ద్వారా తెలిసింది. మా తమ్ముడికి కొడుకు రంజిత్ ఉన్నాడని పోలీసుల ద్వారానే తెలిసింది. అతడు ఉద్యమ బాటను విడిచి జనజీవితంలో కలవడం మాకు సంతోషంగా ఉంది. –రావుల చంద్రయ్య (రావుల శ్రీనివాస్ అన్న) -
రంజిత్ స్ఫూర్తిగాథ.. నైట్‌వాచ్‌మెన్ నుంచి ఐఐఎం..
కాసర్గడ్: ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న రంజిత్ రామచంద్రన్‌ది స్ఫూర్తిదాయక చరిత్ర. నైట్‌వాచ్‌మన్‌గా పనిచేసి, ఆ తరువాత ఐఐటీలో చదువుకుని, ప్రస్తుతం ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి చేరారు. ఈ వివరాలను ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయన వివరించారు. కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్‌తో కప్పిన తన చిన్న గుడిసె ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఫేస్బుక్లో 37 వేల లైక్స్ వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు. కాసర్గడ్లోని పనతుర్‌లో ఉన్న ఒక టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లో రంజిత్ నైట్ వాచ్‌మన్‌గా పనిచేశారు. అలా చేస్తూనే పీఎస్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించారు. తనకు మలయాళం మాత్రమే తెలియడం, ఆంగ్లం రాకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పీహెచ్డీ కోర్సు వదిలేద్దామనుకున్నారు. కానీ గైడ్ డాక్టర్ సుభాష్ సహకారంతో కోర్సు పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పేదరికంతో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశానని, తన తండ్రి టైలర్ కాగా, తల్లి ఉపాధి కూలీ అని ఆ పోస్ట్‌లో రంజిత్ తెలిపారు. -
‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏప్రిల్ 28 ఏం జరిగింది జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నిర్మాణ సంస్థ : వీజీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత & దర్శకత్వం : వీరాస్వామి సంగీతం : సందీప్ కుమార్ సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్ విడుదల తేది : ఫిబ్రవరి 27, 2021 కరోనా కారణంగా కొన్ని నెలల పాటు థియేటర్లకు దూరమైన సినీ ప్రియులు ఇప్పుడిప్పుడే మునుపటి వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వంద శాతం సిట్టింగ్‌కు అనుమతి రావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకుతరలివస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో వరుస సినిమాలను విడుదల చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మన టాలీవుడ్దర్శక,నిర్మాతలు. ప్రతి వారం నాలుగైదు సినిమాలను విడుదలచేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఈ వారం కూడా ఇప్పటికే నితిన్ చెక్‌తో పాటు అరడజను పైగా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా శనివారం (పిభ్రవరి 27)న ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’మూవీ విడుదలైంది. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో రంజిత్, షెర్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? తొలి సినిమాతో రంజిత్ హిట్ అందుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. కథ విహారి(రంజిత్) సినిమా రైటర్. ప్రముఖ నిర్మాత(తనికెళ్ల భరణి)కి గతంలో నాలుగు విజయవంతమైన సినిమాలు అందించాడు. కానీ ఇటీవల తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. దీంతో తదుపరి తీయబోయే సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని దర్శకుడిపై ఒత్తిడి పెంచుతాడు. దీనికి తోడు ప్రముఖ దర్శకుడు (రాజీవ్ కనకాల) నిర్మాతకు డేట్స్ కేటాయించడంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది.దీంతో ఆ ఒత్తిడిని తగ్గించేందుకు భార్య ప్రవలిక( షెర్రీ అగర్వాల్), పిల్లలతో కలిసి వారం రోజుల పాటు సిటీకి దూరంగా గడపాలని భావిస్తాడు. ఫ్యామిలీతో కలిసి కారులో బయలుదేరిన విహారికి మార్గమధ్యలో ఎస్సై డేవిడ్(అజయ్) తారాసపడతాడు. డేవిడ్ సలహా మేరకు విహారి ఫ్యామిలీతో కలిసి సిరిపురం అను గ్రామంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. వెళ్లిన మొదటి రోజే తాను దిగిన గెస్ట్ హౌస్ కు ఎదురుగా ఉండే భవంతి తనకేదో చెప్పాలనుకుంటుదనే భావనకు గురవుతాడు. తనకు అనిపించిన విషయాన్ని ఎస్సై డేవిడ్‌తో షేర్ చేసుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు. విహారికి నిజంగా ఆ ఇల్లు ఏదో చెప్పాలని అనుకుందా? ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి? అసలు విహారి మాత్రమే ఆ ఆత్మలు ఎందుకు కనిపించాయి? అసలు ఏప్రిల్ 28న ఏం జరిగింది? అనేదే మిగతా కథ నటీ నటులు హీరో రంజిత్‌కి ఇది మొదటి సినిమా. ప్రముఖ సినిమా రచయిత ఏల్చూరి వెంకట్రావు గారి అబ్బాయే రంజిత్. మొదటి సినిమా అయినప్పటికీ ఉన్నంతతో అతను బాగానే నటించాడు. కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ షెర్రీ అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక విలన్‌గా రాజీవ్ కనకాల బాగానే మెప్పించాడు. చాలా కాలం తర్వాత రాజీవ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర పోషించాడు. అజయ్, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ హారర్ సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఊరికి చివరిలో ఓ పాడుపడ్డ గది. అందులో దెయ్యాలు.. అక్కడి అనుకోకుండా హీరో వెళ్లడం..దెయ్యాలకు ఫ్లాష్‌బ్యాక్.. చిన్నపాటి ట్విస్ట్. దాదాపు హారర్ చిత్రాలు అన్ని ఇలాగే ఉంటాయి. కానీ వాటిని తెరపై చూపించే విధానాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడుతుంది. ఇక ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’సినిమా కూడా అలాంటిదే. గత సినిమాల కథనే దర్శకుడు ఎంచుకున్నాడు. కాకపోతే చిన్న ట్విస్ట్‌లు పెట్టి హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ అతని ఆలోచన బెడిసి కొట్టింది. సినిమాలో ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కానీ, భయపెట్టే సీన్లు కాని ఒకటి కూడా ఉండదు. ఫస్టాఫ్ మొత్తం సింపుల్‌గా సాగిపోతుంది. అసలు హారర్ మూవీ చూస్తున్నామనే భావనే ప్రేక్షకులకు కలగకపోగా, బోర్ కొట్టించే సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి. ఏ ఒక్క సన్నివేశంలో కూడా కొత్తదనం కనిపించదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆ దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ కూడా బోర్ కొట్టించేవిధంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో మాత్రం చిన్నపాటి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తాడు. సందీప్ కుమార్ తన నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలను కాస్త భయపెట్టే ప్రయత్నం చేశాడు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే హారర్ మూవీస్ రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకులకు ఈ సినిమాలో కొత్తదనం ఏది కనిపించడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏప్రిల్ 28 ఏమి జరగలేదు. ప్లస్ పాయింట్స్ ఉన్నంతలో రాజీవ్ కనకాల, రంజిత్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ రొటీన్ హారర్ డ్రామా ఫస్టాఫ్ సెకండాఫ్ సాగతీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నా బాధ తనలో చూస్తున్నాను: నిఖిల్
‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనే మాటను చాలా ఏళ్లుగా వింటున్నాను. ఆ తేడా నాకు తెలియదు. బడ్జెట్ ఎంత? నటీనటులు ఎవరు? అనేదానికంటే సినిమా ఇచ్చే అనుభూతి ముఖ్యం అని నా భావన. అనుభూతిపరంగా చూస్తే ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ చాలా పెద్ద సినిమా అవుతుంది. నా యువత, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను పడిన బాధ, తపన రంజిత్‌లో చూస్తున్నాను. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా’’ అన్నారు హీరో నిఖిల్. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా స్వీయ దర్శకత్వంలో వీరాస్వామి .జి నిర్మించిన ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ ఈ నెల 27న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో.. ‘‘ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది’’ అన్నారు ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సొహైల్. ‘‘మార్చి 5న మా సినిమాను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ఆ రోజు ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో ఈ 27న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వీరాస్వామి. -
ఆ రోజు ఏం జరిగింది
రంజిత్, షెర్లీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. ఈ చిత్రం ద్వారా వీరాస్వామి దర్శక–నిర్మాతగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను నారా రోహిత్ విడుదల చేయగా, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీవిష్ణు వీడియో ద్వారా టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ రచయితల సంఘంలో మొట్టమొదటి వ్యక్తి ఏల్చూరి వెంకట్రావు. ఆయన కుమారుడు రంజిత్ వాళ్ల నాన్నలానే ఆయుర్వేద డాక్టర్ అవుతాడనుకున్నాను. కానీ యాక్టర్ అయ్యాడు. ఈ సినిమా ట్రైలర్ చూశాను. రంజిత్ అద్భుతంగా నటించాడనిపించింది’’ అన్నారు పరుచూరి గోపాలకష్ణ. ‘‘రంజిత్ నాకు పదేళ్లుగా తెలుసు. థ్రిల్లర్ జానర్‌తో తీసిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అన్నారు వీరాస్వామి. రంజిత్ మాట్లాడుతూ– ‘‘వీరాస్వామి చెప్పిన లైన్ నచ్చటంతో స్క్రిప్ట్ డెవలప్ చేసి 25 రోజుల్లో షూటింగ్ దాదాపుగా పూర్తి చేశాం. కరోనా వల్ల షూట్ ఆగిపోవటంతో పాటు మా వీరాస్వామిగారి మదర్, మా సినిమాకి పని చేసిన కిశోర్‌గారు రీసెంట్గా కరోనాతో చనిపోయారు. ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగినా ధ్వజస్తంభంలా నిలిచి సినిమాను పూర్తి చేసిన వీరాస్వామిగారికి హ్యాట్సాఫ్’’ అన్నారు. -
జానాకి పోటీ.. రంగంలోకి యువనేత
సాక్షి, నల్గొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ బలమైన స్థానిక నేతను అన్వేషించే పని పడినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్ఎస్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది. జానా రెడ్డికి గట్టి పోటీ! ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతైన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానికంగా బలమైన యాదవ సామాజిక వర్గంనికి చెందిన నేత కావడంతో.. సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే పరిణామం. మరోవైపు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
స్వదేశం చేరుకున్న టీఆర్ఎస్ నేత రంజిత్
సాక్షి, నల్గొండ : వ్యాపార అవసరాల నిమిత్తం అమెరికా వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీఆర్ఎస్ నాయకుడు మన్నెం రంజిత్‌యాదవ్ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన రంజిత్ యాదవ్ వ్యాపార పనుల నిమిత్తం మార్చి 13న అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కరోనా వైరస్ విజృంభించటంతో భారత్ లాక్డౌన్ విధించి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో దేశానికి వచ్చే అవకాశం లేక ఆయన అక్కడే చిక్కుబడి పోయారు. అయితే భారత ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడంతో ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. -
బిజినెస్ మీటింగ్ కోసం వెళ్లి...చిక్కుల్లో
నల్లగొండ, నిడమనూరు(హాలియా) : మండలంలోని ఎర్రబెల్లికి చెందిన మన్నెం రంజిత్‌యాదవ్ బిజినెస్ పనిమీద ఈ నెల 13న అమెరికాకు వెళ్లారు. కాగా కరోనా వైరస్ నివారణలో భాగంగా అక్కడ మీటింగ్‌లు అన్నీ రద్దు చేశారు. దీంతో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాకపోకలపై నిషేధం ఉండడంతో ఇబ్బందిగా ఉందని శుక్రవారం ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. భారత ప్రభుత్వం సైతం ఈనెల 22నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇండియాకు రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపాడు. అమెరికాలో కరోనా అందరినీ కంగారు పెడుతోందని, ప్రభుత్వం చెబుతున్న విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు) -
ప్రేమ పోరాటం
‘‘మోని’ టైటిల్ ఆసక్తిగా ఉంది. దర్శకుడు సత్యనారాయణ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తాను ఇదివరకు చేసిన ‘నందికొండ వాగుల్లోన’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ‘మోని’ కూడా సూపర్ హిట్ అవ్వాలి. నిర్మాతకు డబ్బులు రావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. లక్కీ ఏకారి, నాజియా జంటగా సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో రంజిత్ కోడిప్యాక సమర్పణలో తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రం ‘మోని’. నవనీత్ చారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను సాయి వెంకట్ విడుదల చేశారు. రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘షాలిని, నందికొండ వాగుల్లోన’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు లక్కీ ఏకారి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉన్నాయి. మా బ్యానర్లో రెండో చిత్రంగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుంది’’ అన్నారు సత్యనారాయణ ఏకారి. ‘‘ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు మాకు, మా టీమ్‌కి మంచి క్రేజ్ తేవాలి’’ అని లక్కీ ఏకారి, నాజియా అన్నారు. సంగీత దర్శకుడు నవనీత్ చారి పాల్గొన్నారు.