red zone
-
రెడ్ జోన్ గా ప్రకటన
-
Europe Heatwave: మండిపోతున్న యూరప్.. చరిత్రలో తొలిసారి
లండన్: యూరప్‌ను ఎండలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం లింకన్షైర్లోని కోనింగ్స్‌బైలో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీలు నమోదైంది! దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోయాయని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఒక రికార్డేనని తెలిపింది. లండన్‌తోపాటు ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది. సోమవారం జారీ చేసిన రెడ్ వార్నింగ్‌ను అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో తూర్పు లండన్‌లోని వెన్నింగ్టన్ గ్రామంలో గడ్డికి అంటుకున్న మంటలు ఇళ్లకు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి. ఇంగ్లండ్‌లో లండన్‌లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు జనం జలాశయాలను ఆశ్రయిస్తున్నారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ సేపు ఎండ ప్రభావానికి గురైతే అనారోగ్యం తప్పదంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తీవ్రత నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో రహదారులను మూసివేశారు. కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కొన్నిటిని రద్దు చేశారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముందని రైల్వే శాఖ తెలిపింది. ఎండలతో తలెత్తే డిమాండ్ కారణంగా ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నీటి సరఫరా సంస్థలు తెలిపాయి. -
హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: పలువురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినందున హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫెడరేషన్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు రిజిస్ట్రీ చర్యలు తీసుకుందని తెలిపింది. రోడ్‌జోన్‌గా ప్రకటించడమంటే హైకోర్టును మూసివేయడమేనని, తద్వారా న్యాయం తలుపులు మూసేవేసినట్లవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం గుర్తు చేసింది. అలాగే కరోనా నిరోధానికి పారా మిలిటరీతో కర్ఫ్యూ విధించేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. (ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది: కోన రఘుపతి) -
'పాజిటివ్'పై తగ్గిన నెగెటివిటీ!
సాక్షి, హైదరాబాద్: కరోనా భౌతికదూరాన్ని శాసిస్తే.. కరుణ మానసిక సాన్నిహిత్యాన్ని చాటుతోంది. కోవిడ్ మనుషులను విడగొడితే.. మానవత్వం మనుషులను కూడగడుతోంది. పాజిటివ్ వచ్చినవారి పట్ల పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ ఆపత్కాలంలో ప్రజల ప్రవర్తనలో మెల్లగా మార్పు గోచరిస్తోంది. కొన్ని నెలల క్రితం కరోనా అనగానే పరిగెట్టేవారు. ఆ వైరస్ సోకితే ఇక భూమిపై నూకలు చెల్లినట్టేనని, అది ఎక్కడ తమకు సోకుతుందోనని,ఏమైపోతామోనని భయకంపితులయ్యేవారు. పాజిటివ్ వచ్చిందని తెలిస్తే చాలు బాధితులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలివేసినట్టుగా చూసేవారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినా దూరంగా ఉంచుతూ అనుమానాస్పదంగా చూసేవారు. అయితే ఇప్పుడు కోవిడ్ మహమ్మారి విషయంలో మనుషుల తీరు, వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పాజిటివ్ వచ్చినవారి పట్ల మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయినా ‘నేనున్నాననీ... నీకేం కాదనీ’అనే విధంగా బం«ధువులు, మిత్రులు, ఇరుగుపొరుగువారు ముందుకు వచ్చి బాధితులకు ధైర్యం నూరిపోస్తున్నారు. జాగ్రత్తల గురించి చెబుతున్నారు. కరోనా రోగులకు ఇది టానిక్‌గా పనిచేస్తుండడంతో త్వరగా కోలుకుని మళ్లీ మామూలు మనుషులుగా మారడానికి దోహదపడుతున్నారు. బంధువులు, ఆఫీస్ బాసుల భరోసా బంధువుల్లో ఎవరికైనా కరోనా సోకితే రోజుకు రెండు, మూడుసార్లు ఫోన్ చేస్తూ ఆర్యోగం గురించి ఆరా తీస్తున్నారు. గతంలో వచ్చినవారు తీసుకున్న జాగ్రత్తలు, పోషక విలువలున్న ఆహారం, సరైన మందులు, ఇతర విషయాల గురించి చెబుతూ ధైర్యం నూరిపోస్తున్నారు. ఆయా ఆఫీసుల్లోని ఉద్యోగులకు కరోనా సోకినట్టు తెలియగానే వెంటనే బాస్‌లు తమ హోదా, దర్పాన్ని పక్కన పెట్టేసి తెల్లవారుజాము నుంచే ఫోన్లు చేసి భుజం తట్టి ధైర్యం చెబుతున్నారు. ఆఫీసు చింత పక్కన పెట్టేసి ముందు పూర్తి ఆరోగ్యాన్ని సాధించే దిశగా దృష్టి మరల్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా లభించిన భరోసా వారిలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. కరోనా సోకి ఇబ్బందుల్లో ఉన్నవారికి వారి బంధువులు, మిత్రులు మాట సాయమే కాదు, ఆర్థకంగానూ ఆదుకుంటూ అవసరాలకు అవసరమైన డబ్బులు సాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా వివిధ మొబైల్ యాప్‌ల ద్వారా రోగుల అవసరాల మేర డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. డబ్బు సాయానికే పరిమితం కాకుండా బాధిత కుటుంబాలవారికి వివిధ రకాల నిత్యావసరాలు సైతం అందజేస్తూ భరోసా కల్పిస్తున్నారు. బ్యారికేడ్ల నుంచి అవగాహన దాకా... గతంలో పక్క వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటేనే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెంటనే అనధికారిక కంచెలు, బ్యారికేడ్లు వెలిసేవి. ప్రభుత్వ అధికారు లు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ఏరియాగానో, రెడ్ జోన్‌గానో ప్రకటించడానికి ముందే ‘ఇది రెడ్‌జోన్’ప్రాంతమంటూ ప్రచారం చేసేవారు. దీంతో అటు వైపునకు వెళ్లాలంటేనే ఎవరూ సాహసించేవారు కాదు. నేడు కరోనా వచ్చినవారు పక్కింట్లో ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా గడుపుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం, ఇతర వస్తువులను అందిస్తున్నారు. -
తగ్గుతున్న వెరీయాక్టివ్ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే నెలలో పాజిటివ్ కేసులు తగ్గినట్టే వెరీయాక్టివ్ క్లస్టర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజా కేసుల నమోదును బట్టి చూస్తే 16వ తేదీ నుంచి వెరీయాక్టివ్ క్లస్టర్ల సంఖ్య తగ్గింది. నాలుగు రోజుల కిందట 56 క్లస్టర్లుగా ఉన్న ఈ సంఖ్య.. బుధవారం నాటికి 50కి తగ్గింది. వెరీయాక్టివ్ క్లస్టర్లంటే.. ఒకటి నుంచి ఐదు రోజుల్లోగా కేసులు నమోదైనవి. వీటిని రెడ్ జోన్లో ఉన్న క్లస్టర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న కేసుల్లో ఎక్కువగా కేంద్రీకృతంగా.. అంటే వచ్చిన ప్రాంతాల్లోనే మళ్లీ కేసులు వస్తున్నాయన్నమాట. కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరించకపోవడమంటే నియంత్రణ చర్యలు బాగున్నట్టు లెక్క. 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరగడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కేసుల నమోదు ఇలా ► 6 నుంచి 14 రోజుల్లో నమోదవుతున్న యాక్టివ్ క్లస్టర్లు కూడా తగ్గుతున్నాయి. ► శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వంటి జిల్లాల్లో వెరీయాక్టివ్ క్లస్టర్లు లేవు. ► కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా వెరీయాక్టివ్ క్లస్టర్లున్నాయి. ► కర్నూలు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అర్బన్ ప్రాంతాలే కేంద్రీకృతంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ► 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య వారం రోజుల్లో 75 నుంచి 101కి పెరిగింది ► 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ► పాజిటివ్ కేసుల్లో 80 శాతం పైగా 40 ఏళ్ల లోపు వారే ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు ► గత పది రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో కోయంబేడుతో సంబంధం ఉన్నవే ఎక్కువ. రాష్ట్రంలో రికవరీ శాతం 65.08 రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 65.08 శాతంగా ఉంది. బుధవారం 43 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య 1,664గా ఉంది. ఇంకా యాక్టివ్ కేసులు 843 ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 9,159 మందికి పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వీటిలో కోయంబేడుకు సంబంధించిన కాంటాక్టు కేసులు 10 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,560కి చేరగా.. వీరిలో వలస కూలీలు 153 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 0.96గా ఉంది. -
కరోనా: 43 కంటైన్మెంట్ జోన్లు
సాక్షి, నెల్లూరు(పొగతోట): కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 43 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు, కూరగాయల దుకాణాలు తెరిచేందుకు మాత్రమే అనుమతించారు. లాక్‌డౌన్‌ను ఈనెల 31వ తేదీ వరకు పొడిగిసూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిబంధనల అమలుపై అధికారులు కసరత్తు చేశారు. జిల్లావ్యాప్తంగా 43 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో దుస్తులు, బంగారం, చెప్పుల దుకాణాల మినహా మిగిలిన చోట్ల విక్రయాలు కొనసాగించవచ్చు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పాఠశాలలకు అనుమతి లేదు. అన్ని ప్రాంతాలల్లో రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. (ఆ డ్రగ్ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్) మార్గదర్శకాలు ఇవే.. దుకాణాలు తెరిచే విషయంలో అధికారులు పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఒక్కో దుకాణం వద్ద ఐదుగురికి మించి ఉండకుడదు. భౌతిక దూరం పాటించాలి. ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకురావాలి. మున్సిపాలిటీల్లో దుకాణాలు రోజు మార్చి తీయాలి. సోమవారం తీసిన షాపు మంగళవారం తెరవకూడదు. మంగళవారం తీసిన దుకాణం బుధవారం మూసివేయాలి. షాపుల మధ్య దూరం పెరిగితే ప్రజలు భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకరిద్దరు మినహా సిబ్బంది ఉండకుడదు. పనిచేసేవారు మాస్క్‌లు ధరించి తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. లాక్డౌన్ సమయంలో అధిక ధరలకు విక్రయించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లు ఇవే.. బోగోలు మండలంలో ఇబ్రహీంపేట, అల్లూరు మండలంలో నార్త్‌మోపూరు, కుర్రులబ్బిపాళెం, కావలి మండలంలో వీఆర్‌నగర్, దగదర్తి మండలంలో ఎల్‌ఎన్‌పురం, కొండాపురం మండలంలో పార్లపల్లి, తడ మండలంలో భీములవారిపాళెం, తడ, అక్కంపేట, నాయుడుపేట మండలంలో బీడీకాలనీ, ఎల్ఏ సాగరం, బాలాజీ గార్డెన్స్, పెద్దమసీద్ వీధి, వెల్కమ్ స్ట్రీట్, ఎల్ఐసీ స్ట్రీట్, ఓజిలి మండలంలో నెమళ్లపూడి, సూళ్లూరుపేట మండలంలో మహదేవయ్యనగర్, మన్నార్‌పోలూరు, వనంతోపు, పెళ్లకూరు మండలంలో శిరసనంబేడు, నెల్లూరు అర్బన్ మండలంలో ఖుద్దూస్‌నగర్, కోటమిట్ట, గాంధీనగర్, మాగుంటలేఅవుట్, మూలాపేట, వెంకటేశ్వరపురం, ట్రంక్‌రోడ్డు, కిసాన్‌నగర్, చంద్రబాబునగర్, స్టోన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, బాలాజీనగర్, ఎన్టీఆర్ నగర్, కోవూరు మండలంలో లక్ష్మీనగర్, లేగుంటపాడు, పోతిరెడ్డిపాళెం, ఇనమడుగు, ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట, టీపీగూడూరు మండలంలో టీపీగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రేబాల, ముత్తుకూరు మండలంలో మల్లూరు, నెల్లూరు రూరల్ మండలంలో కాకుపల్లి, వాకాడు మండలంలో తిరుమూరు, నవాబుపేట, బాలాయపల్లి మండలంలో ఊట్లపల్లి, గూడూరులో 5, 6, 8 వార్డులు. 7 పాజిటివ్ కేసులు నెల్లూరు(అర్బన్): జిల్లాలో సోమవారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూళ్లూరుపేటలో ఐదు, వింజమూరు మండలం నల్లగొండ్లలో రెండు కేసులు వెలుగు చూశాయి. సూళ్లూరుపేటలో మహదేవయ్యనగర్, వనంతోపుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య 44కు చేరింది. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు మార్కెట్ లింక్‌లతో కలువాయి, కోవూరు, వింజమూరు, తదితర మండలాల్లో ఇప్పటికే ట్రూనాట్ పద్ధతిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. వాటిని తిరుపతికి పంపి నిర్ధారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సోకి కోలుకున్న మొత్తం 9 మందిని సోమవారం నారాయణ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. అందులో 9 నెలల చిన్నారి, నలుగురు పురుషులు, మరో నలుగురు మహిళలున్నారు. వాకాడు మండలానికి చెందిన ఇద్దరు, నెల్లూరు కోటమిట్ట నుంచి నలుగురు, స్టోన్‌హౌస్‌పేట నుంచి ఇద్దరు, జెండావీధికి చెందిన మరొకరు డిశ్చార్జి అయిన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు 106 మందిని ఇంటికి పంపారు. మరో 58 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్ జోన్‌గా మనుబోలు మనుబోలు: మనుబోలు గ్రామంలో కరోనా కేసు వెలుగు చూసిన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సోమవారం నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ మనుబోలులో పర్యటించారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. పోలీసులకు సూచనలిచ్చారు. సర్వే చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 28 రోజులపాటు ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, వైద్య సదుపాయాలను నేరుగా ఇళ్ల వద్దే అందజేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు. దుకాణాలు మూసివేయించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రామృష్ణారెడ్డి, తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్వేత, ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులున్నారు. -
అన్ని దుకాణాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు కరోనా లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతోపాటు రాష్ట్రాలకు మరిన్ని సడలింపులు కల్పించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున సడలింపులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగతా మొత్తం ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే బస్సులు రోడ్డెక్కుతాయని, అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని గతంలోనే ప్రకటించామని, తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా 31 వరకు లాక్డౌన్ 4.0ను ప్రకటించడంతో రాష్ట్రంలోనూ ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయేవరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇండియా బ్యాక్ టు వర్క్.. దేశవ్యాప్తంగా ఇండియా బ్యాక్ టు వర్క్ అనే మాట వినిపిస్తోందని, ఆ దిశగా పలు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటిల్లో రాష్ట్రానికి అనుకూలమైన అంశాలను ఎంచుకొని అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొందని, వైద్యరంగ శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదనే తరహాలో మాట్లాడుతున్నారన్నారు. అందుకే కరోనాతో ఇక కలసి సహజీవనం చేయాల్సిన గత్యంతరంలేని పరిస్థితి నెలకొందని వివరించారు. ఇక ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని, ఎక్కువకాలం ఇళ్లకే పరిమితం కావడం కూడా సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను బాగా అనుసరించామని, దీనివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎంతో సహకరించారని, వారందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇకపైనా కరోనాతో కలసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటించి సమస్య తీవ్రం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దు కాణాల నిర్వాహకులు వారి దుకాణాలను శానిటైజ్ చేసుకోవడంతోపాటు కొనుగోలుదారులకు కూడా శానిటైజర్ అందిస్తూ కరోనా విస్తరించకుండా చూడాలని విన్నవించారు. ఆంక్షలు ఎత్తేశాం కదా అని జనం ఇష్టమున్నట్లు బయటకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ సమస్య పెరుగుతుందని, కరోనా తిరగబెడితే మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని కేసీఆర్ సూచించారు. సర్వసన్నద్ధమయ్యాకే సడలింపులిస్తున్నాం... కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇప్పటికే అన్ని రకాల షాపులకు అనుమతిచ్చామని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోనే కరోనా ఇబ్బంది ఉన్నందున 17 వేల బెడ్లు, అన్ని రకాల పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్న తర్వాతే సడలింపులు ఇస్తున్నామన్నారు. సమస్య వస్తే మళ్లీ వెనక్కి వెళ్తామని, మున్ముందు పరిస్థితిని బట్టి సమీక్షించుకుంటామని చెప్పారు. కులవృత్తుల వారికి ఇప్పుడే చాలా చేస్తు న్నామని, అత్యవసరమైతే వారిని ఆదుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. లాయర్ల తరహాలో జర్నలిస్టులను ఆర్థికంగా ఆదుకొనే విషయంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి 2, 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫుడ్ హోం డెలివరీ ఓకే! హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించే విషయంలో సీఎం కేసీఆర్ ఎలాం టి స్పష్టత ఇవ్వలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలకు అనుమతి ఉండదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆహారం వండి హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందని స్పష్టంచేశాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న లాక్డౌన్ పొ డిగింపు జీవోలో దీనిపై స్పష్టత ఇవ్వనుంది. ఆటోలు, క్యాబ్‌లకు ఓకే.. మెట్రోకు నో కంటైన్మెంట్ జోన్లు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. క్యాబ్‌లలో డ్రైవర్ కాకుండా ముగ్గురు ప్రయాణికులను అనుమతిస్తామని, ఆటోల్లో డ్రైవర్ కాకుండా ఇద్దరు మాత్రమే ఎక్కాలని వెల్లడించారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ఏరియాలో 1,452 కుటుంబాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులున్న కంటైన్మెంట్ ఏరియాల పరిధిలో 1,452 కుటుం బాలు ఉన్నాయని, ఆ కుటుంబాలకు సంబం ధించిన ఇళ్లు, వాటి పరిసరాలు మాత్రమే ఇక కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ ప్రాంతాలను మాత్రమే రెడ్జోన్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని వారిని ఆ పరిధి దాటి బయటకు అనుమతించబోమని, బయటి వారిని లోనికి అనుమతించబోమన్నారు. ఈ విషయంలో గట్టి నిఘా ఉంటుందని చెప్పారు. కంటైన్మెంట్ ఏరియాల పరిధిలోని కుటుంబాల వారికి కావాల్సిన నిత్యావసరాలను డోర్ డెలివరీ తరహాలో ప్రభుత్వమే సరఫరా చేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇది ఆయా కుటుంబాలు, ఆ ప్రాంతాల సంక్షేమంతోపాటు రాష్ట్ర సంక్షేమానికి సంబంధించిన విషయం అయినందున ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బస్సులకు రైట్‌రైట్... కరోనాతో కలసి జీవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి... రాష్ట్రంలో ప్రజారవాణాకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే రోడ్డెక్కుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కొన్ని పద్ధతులు రూపొందించారని, వాటి మేరకు బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నందున సిటీ బస్సులను మాత్రం అనుమతించట్లేదని, అలాగే అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు వేరే రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తెలంగాణకు రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇవ్వట్లేదన్నారు. ‘జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు వస్తాయి. కానీ ఇమ్లిబన్ (ఎంజీబీఎస్) బస్ స్టేషన్‌కు బస్సులను రానీయరు. జూబ్లీ బస్‌స్టేషన్‌కు రానిస్తరు. కరోనా సమస్య ఉన్న దిల్సుఖ్నగర్ వైపు రానీయరు. సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద సమస్య లేదు. ఎల్బీనగర్ వైపు బస్సులను అనుమతించాలని మంత్రులు కూడా అడిగారు. నేను అనుమతించలేదు. బస్సులన్నీ రాత్రి 7 గంటల్లోపు డిపోలకు తిరిగి వచ్చేయాలి. ఏదైనా కొన్ని బస్సులు దూర ప్రాంతాల నుంచి వచ్చేవి, ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే రాత్రి 8 గంటల వరకు అనుమతిస్తం. ప్రయాణికుల వద్ద టికెట్ ఉంటది. దాన్ని చూసి అనుమతిస్తరు. జిల్లాల మధ్య ప్రైవేటు బస్సులు, స్టేజీ కార్యరియర్లు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, కార్లు కూడా నడుస్తయి. కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో అన్ని తెరుచుకుంటున్నయి. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు. ఇబ్బంది ఉండదు. మహారాష్ట్ర, ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికి బస్సులు నడపట్లేదు. అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాల విషయంలో రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. మేము అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు అనుమతించట్లేదు’అని కేసీఆర్ స్పష్టం చేశారు. అనుమతించేవి... కరోనా కేసులున్న ప్రాంతా ల్లోని కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రం మొత్తం అన్ని రకాల దుకాణాలు. జీహెచ్ఎంసీ పరిధిలో సరి–బేసి పద్ధతిలో ఒకరోజు కొన్ని, మరోరోజు ఇంకొన్ని షాపులు. వాటి పూర్తి వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ విడుదల చేస్తారు. కంటైన్మెంట్ జోన్లు తప్ప అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ సెలూన్లు, ఈ–కామర్స్ సముదాయాలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు. పరిశ్రమలు, తయారీరంగ యూనిట్లలో పూర్తిస్థాయిలో పనులు. వాటన్నింటిలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. మూతపడే ఉండేవి ప్రార్థనా మందిరాలు. మతపరమైన సమావేశాలు, ఉత్సవాలు. ఫంక్షన్ హాళ్లు, మాల్స్, సినిమా హాళ్లు. బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టేడియాలు, పార్కులు, స్విమ్మింగ్పూళ్లు, జిమ్‌లు, అమ్యూజ్మెంట్ పార్కులు. అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు. రాత్రి కర్ఫ్యూ యథాతథం.. ప్రస్తుతం రాత్రివేళ అమలులో ఉన్న కర్ఫ్యూ యథాతథం. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి -
స్థానిక భాగస్వామ్యం పెంచండి
న్యూఢిల్లీ: పట్టణ నివాస ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతుండటంతో కేంద్రం మరిన్ని వనరులను ఉపయోగించుకునేందుకు యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు స్థానికులతో సన్నిహితంగా ఉండే రాజకీయ, మత నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను వీరికి అప్పగించాలంది. అదేవిధంగా, ‘పట్టణ ప్రాంతాల్లో ‘సంఘటన ప్రతిస్పందన వ్యవస్థ’ను ఏర్పాటు చేసి, సమర్థుడైన వ్యక్తిని ‘ఇన్సిడెంట్ కమాండర్’గా నియమించాలి. ఈ కమాండర్ కరోనా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించడంతోపాటు ఆయా కంటైన్మెంట్లలో ప్రణాళిక, నిర్వహణ, రవాణా, ఆర్థిక వ్యవహారాలను అమలు చేస్తుంటారు. ఇన్సిడెంట్ కమాండర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీలో ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఇప్పటికే ఆ ప్రాంతంలో సేవలందిస్తున్న ఎన్జీవోలు సభ్యులుగా ఉంటారు’ అని పేర్కొంది. ‘ప్రజలు తమ నివాస ప్రాంతాలకే పరిమితమయ్యేందుకు సెక్షన్–144 అమలు చేయడంతోపాటు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలి. ఇతర ప్రాంతాల నుంచి కంటైన్మెంట్లలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలి. వీటిని ఎంత కచ్చితంగా అమలు చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి’అని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం వరకు ఏపీ, తెలంగాణల్లోని కర్నూలు, గ్రేటర్ హైదరాబాద్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 30 మున్సిపాలిటీల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
రెడ్ జోన్లలో ఆటో, ఏసీ షాపులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు రెడ్జోన్ల పరిధిలో ఉన్న ఇతర అన్ని మున్సిపాలిటీల్లో ఆటోమొబైల్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, వాహనాల రిపేర్ గ్యారేజీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లకు సంబంధించిన అన్ని రకాల షోరూమ్స్, షాపులను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం రెడ్జోన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు, అత్యవసర సేవలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన హార్డ్‌వేర్ తదితర షాపులు, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పంపుసెట్ల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై పైన పేర్కొన్న దుకాణాలు, షోరూమ్స్‌ను అనుమతించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రెడ్‌జోన్‌లో పోలీసులపై దాడి
ముంబై: ఫేస్ మాస్క్ లేకుండా బయటకు వస్తూ, లాక్డౌన్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించిన పోలీసులపై దాడికి దిగారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటన గురువారం ముంబైలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. అక్కడ గురువారం 15 మంది వ్యక్తులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని గమనించిన పోలీసులు కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు ఏమాత్రం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (టార్గెట్ ‘ఆర్మీ’ !) ఫేస్ మాస్క్ కూడా ధరించకుండా బయట ఎందుకు తిరుగుతున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. వెంటనే ఆవేశంతో దుండగులు పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలపాలయ్యారు. వారిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణించిన పై అధికారులు దీనికి కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) -
ఇంటి ముంగిటే వైద్యం
అనంతపురం హాస్పిటల్: కరోనా కలకలం నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రధానంగా కరోనా వ్యాప్తి చెందకుండా రెడ్‌జోన్ ప్రాంతాల్లోని వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలందించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పాటు రెడ్‌జోన్ ప్రాంతాల్లోని 8 వేల మందికి, వారికి సేవలందించే వైద్యులు, పోలీసులు తదితర సిబ్బందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులకూ చికిత్స జిల్లాలో 29 రెడ్జోన్లు ఉండగా.. ఆరోగ్యశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, ఆశా, ఏఎన్ఎం, వలంటీర్లతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక, సాధరణ జబ్బులతో బాధపడే వారికి ఈ శిబిరాల్లోనే వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే సంబంధిత సీనియర్ వైద్యులు హాజరై చికిత్సనందిస్తారు. కరోనా అనుమానిత లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే స్థానికంగా విధుల్లో ఉండే పోలీసులు, తదితర సిబ్బందికీ ఇక్కడ వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. 7,190 మందికి పరీక్షలు రెడ్‌జోన్ ప్రాంతాల్లోని 7,190 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు కరోనా లక్షణాలు కల్గిన 964 మందికి, ఆ ప్రాంతంలో ఉండే 4,438 మంది ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను క్వారన్‌టైన్‌కు పంపి సేవలందించారు. మెరుగైన వైద్యం కలెక్టర్ ఆదేశాలతో రెడ్‌జోన్‌ల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. దీర్ఘకాలిక సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తారు. ఆ తర్వాత సంబంధిత వైద్య నిపుణులతో వైద్యం అందిస్తాం. ఈక్లినిక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. –కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, జిల్లా వైద్యాధికారి -
11 నుంచి ఇంటర్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీ డియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11వతేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.రమేష్‌లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో చర్చించి పలు సూచనలు చేశారు. 60 లక్షల పత్రాల మూల్యాంకనం... ► మే 11 నుంచి ఆరెంజ్, గ్రీన్జోన్లలో ఇంటర్ జవాబు పత్రాల మూ ల్యాంకనం మొదలవుతుంది. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెడ్జోన్లలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటవుతాయి. ► మూల్యాంకనానికి రెండు, మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి మూల్యాంకన నిర్వహిస్తారు. ► ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షలకు తేదీలు ఖరారు చేసినందున ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారు. ► మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారు. ► 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. -
అసలు సవాలు ఇప్పుడే!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు బయటకు రావడం మొదలైంది. వాణిజ్య, వ్యాపార, ఇతర వృత్తుల వారు కార్యకలాపాలను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వీధి వ్యాపారులు రోడ్లపైకి వస్తున్నారు. రెడ్‌జోన్ జిల్లాల్లోనూ కొన్నింటికి సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల మద్యం దుకాణాలకు, కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అంటే లాక్డౌన్ సడలింపుల తో వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి రోజు వారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి, ఆసరా లేకుండా ఉన్నవారు సడలింపులతో ఎంతో ఊరట చెందారు. అయి తే కరోనా వైరస్‌ను ఇప్పటివరకు లాక్‌డౌన్‌తో కట్ట డి చేశారు. తాజా సడలింపులతో ఎలాంటి పరిణా మాలు ఎదురవుతాయోనన్న భయాందోళన వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను వెంటాడుతోంది. సడలిం పుల అనంతరం తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడం వైద్య, ఆరోగ్య శాఖకు సవాలుగా మారింది. ప్రజలను చైతన్యం చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కట్టడిలోనే ఉన్నామని, లాక్‌డౌన్‌లోనూ ఇచ్చిన వెసులుబాటులోనూ జాగ్రత్తలతో కట్టడి పాటించాలని కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ‘కరోనాతో కలసి జీవనం సాగిం చాల్సిందే’నని, ఆ ప్రకారం ముందుకు సాగ క తప్పదంటున్నారు. జనబాహుళ్యంలో హెర్డ్ ఇమ్యునిటీ రావాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రకారం యువకులు బయటకు రావాలి. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతరత్రా అనారోగ్యాలతో ఉన్న వారు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. ► భౌతికదూరం: ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. అపరిచితులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి. మార్కెట్లు, కార్యాలయాలు, ప్రయాణ సమయాల్లోనూ సురక్షితమైన దూరాన్ని పాటించాలి. ► ఫేస్ మాస్క్‌లు: ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరిం చాలి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే విషయంలో ఇదే అత్యంత కీలకమైన అంశం. ఇంట్లో తయారుచేసిన డబుల్ లేయర్డ్ ఫేస్ మాస్క్‌లు ఇన్ఫెక్షన్ను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మాస్క్‌లను తరచుగా పైన తాకడం, సర్దుబాటు చేయడం మంచిది కాదు. రోజూ ఉతికిన తర్వాత తిరిగి వాడాలి. ► ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం: ఫ్లూ లక్షణాలు అంటే దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలి. ► సొంతంగా రావొచ్చు: కరోనా పాజిటివ్ వ్యక్తితో లేదా వారితో పరిచయమున్న వ్యక్తులతో కాంటాక్ట్ అయితే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. ► అనవసర ప్రయాణాలు వద్దు: ప్రజలు అనవస ర ప్రయాణాలను నివారించాలి. ఇంట్లో ఉండటం కరోనా నియంత్రణకు ఉత్తమ నివారణ వ్యూహం. ► ఆహారపు అలవాట్లు: సరిగ్గా వండిన ఆహారాన్ని తినాలి. సురక్షితమైన మంచి నీటిని తాగాలి. రోజూ తాజా పండ్లు తినాలి. పుష్కలంగా నీరు తాగాలి. ► వృద్ధులు: వృద్ధులు ఇళ్లల్లోనే ఉండాలి. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలుంటే అవసరమైన మందులు తప్పక వాడాలి. ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► వ్యక్తిగత పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత ము ఖ్యం. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. దగ్గినపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మానసిక ప్రశాంతత: యోగా, ధ్యానం ద్వారా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ► కరోనా సంబంధ సమాచారం కావాల్సిన వారు 104కి కాల్ చేయాలి. ► మానసిక ఆరోగ్యంపై కౌన్సెలింగ్ సేవలు అవసరమైనవారు 108కి కాల్ చేయాలి. -
కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: కలెక్టర్
సాక్షి, విజయవాడ: జిల్లాలోని రెడ్ జోన్లలో ప్రతీ చోట జియోగ్రాఫికల్ క్వారంటైన్‌ను అమలు చేస్తున్నామని కలెక్టర్ ఇంతీయాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక జిల్లా వ్యాప్తంగా 37 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయని, ఒక్క విజవాడ సిటీలోనే 20 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇక నూజివీడు, జగ్గయ్య పేట, నందిగామ, పెనమలూరు, మచిలీపట్నాలలో కొన్ని క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఎటువంటి వెసులుబాటులు లేవన్నారు. అదే విధంగా రెడ్ జోన్ ప్రాంతాలలో పూర్తిగా రాకపోకలు నిషేధించామని, గ్రీన్ జోన్లలో కూడా నిబంధనలకు లోబడే వెసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. (సత్ఫలితాలిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారంటైన్..) నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుత్రిలోని క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయన్నారు. పరిస్థితులకు అనుకూలంగా పరిశ్రమల నిర్వహణ జరుగుతుందని, మిర్చి కోతకు వచ్చిన 3800 మంది వలసకూలీలను ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రకు తరలించామన్నారు. మరో 2200 మందిని బస్సుల ద్వారా స్వగ్రామాలకు చేర్చామని తెలిపారు. మిగిలిన వారిని కూడా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. (కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు!) -
రెడ్‌జోన్ ఆసుపత్రులు సర్వసన్నద్ధం
విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే సూచనలిచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని చెప్పాం. వీటిని ఇంకా ఎలా బలోపేతం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించే విషయంపై కూడా మార్గదర్శకాలు తయారు చేయాలి. దిశ, టెలి మెడిసిన్, వ్యవసాయం, అవినీతి నిరోధకానికి సంబంధించిన కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించాలి. వీటిని ఉపయోగించుకునే విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. మరో రెండు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండటం మంచిది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలను మాత్రమే కేంద్రం అనుమతించినందున దాదాపు వారు లక్ష మంది వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వీరందరినీ క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేయించడం కష్టమైన పని. అందువల్ల మిగిలిన వారు సహకరించాలి. సాక్షి, అమరావతి: రెడ్ జోన్లలో ఉన్న ఆసుపత్రులను అన్ని విధాలా సన్నద్ధంగా ఉంచుకోవాలని, కచ్చితమైన మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. టెలి మెడిసిన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కీలకమైన కాల్ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, వలస కూలీల తరలింపు, పరీక్షల సరళిపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పరీక్షల సరళిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకే అనుమతులు ► రెడ్ జోన్ పరిధిలో ఉండే ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు ఇతరత్రా అవసరమైన వైద్య పరికరాలు నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ► వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులనే అనుమతిస్తున్నామని అధికారులు వివరించారు. వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి.. ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. ► వచ్చే వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఆయా రాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్ జోన్లో ఉన్నారా? ఆరెంజ్ జోన్లో ఉన్నారా? రెడ్ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. వీటిని నిర్ధారించుకుని వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ► స్పందన వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. అయితే వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా (మంగళవారం) టెస్టులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ► ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో పరీక్షలు ► రోజు వారీ పరీక్షల సామర్థ్యం 10 వేలకు పైగా పెరిగింది. ప్రతి పది లక్షల జనాభాకు రాష్ట్రంలో 2,345 పరీక్షలు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో 2,224, తమిళనాడులో 1,929, రాజస్తాన్‌లో 1,402 పరీక్షలు. ► రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 పరీక్షలు. ఆదివారం వరకు 1,25,229 పరీక్షలు. ► 24 గంటల్లో 67 పాజిటివ్‌లు నమోదు. యాక్టివ్ కేసులు 1,093. 524 మంది డిశ్చార్జి. మొత్తంగా 1,650 కేసులు, 33 మంది మృతి. ► రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల శాతం 1.32. దేశంలో ఇది 3.84 శాతం. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 2 శాతం. దేశంలో ఇది 3.27 శాతం. ► రాష్ట్రంలోని 11 ల్యాబ్‌ల్లో 22 మిషన్ల ద్వారా కొనసాగుతున్న పరీక్షలు. ప్రతి జిల్లాలో 4 మిషన్లు అందుబాటులో ఉంచే యత్నం. పీరియాడికల్‌గా 3 ల్యాబ్‌లలో ఫ్యుమిగేషన్ (శుద్ధి చేసే ప్రక్రియ). 45 కేంద్రాల్లో 345 ట్రూనాట్ మిషన్ల ద్వారా కూడా పరీక్షలు. -
రెడ్ జోన్లో మినహాయింపులకు నో..
లక్నో : రెడ్ జోన్లో ఎలాంటి మినహాయింపులు ఇచ్చిదిలేదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 19 జిల్లాలను రెడ్ జోన్‌గా గుర్తించామని, వాటిల్లో కఠిన చర్యలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఆరెంజ్ జోన్లను గ్రీన్జోన్లుగా మలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడిన యోగి ఆదిత్యానాథ్ త్వరలోనే యూపీలో కరోనా ఫ్రీ రాష్ట్రంగా తయారుచేస్తామని చెప్పారు. (రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ!) ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు రంగాలకు లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నామని సీఎం ప్రకటించారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలన్నీ తెరుచుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విడతల వారీగా వారిని పంపుతున్నామన్నారు. కాగా యూపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ కారణంగా 43 మంది మృత్యువాత పడ్డారు. (ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్నందున లాక్‌డౌన్‌ను మే 17 వరకు పోడగించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గిన ప్రాంతాలను వివిధ జోన్లుగా కేటాయించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన సడలింపులను ఇచ్చింది. ఈ క్రమంలో మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాలకు కేంద్రం కొన్ని సడలింపు ఇస్తూ మార్గదర్శకాలను వెల్లడించింది. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) నగరంలో అవసరమైన కార్యకలాపాల కోసం ప్రయణాలు చేయొచ్చా.. దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ అవసరమైన కార్యకలాపాల ప్రయణాలపై కేంద్రం దేశవ్యాప్తంగా నిషేధం విధించినట్లు శుక్రవారం పేర్కొంది. ఇక అటువంటి ప్రయాణాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా ప్రాంతాలకు నిర్థిష్ట పరిమితులు విధించడానికి రాష్ట్రా ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారం ఉన్నట్లు కూడా కేంద్రం వెల్లడించింది. ఇక ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి అనుమతి? సాంకేతికపరంగా అనుమతి ఉన్నప్పటికీ అది ఆయా రాష్ట్ర, నగరాల నిర్దిష్ట మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటి పనులకు పనిమనిషి రావడానికి అనుమతి ఉందా? సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య అనవసరమైన ప్రయాణాన్ని నిషేధించినప్పటికీ.. రోజులో పగటిపూట గృహ సహాయాలకు, పని మనుషులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. స్నేహితుల దగ్గరకు వెళ్లేందుకు అనుమతి? అనవసర కార్యకలాపాలకు నిషేధం విధించిన సమయంలో స్నేహితులు లేదా సన్నిహితులను కలుసుకునేందుకు నిషేధం ఉంది. నిషేధం సమయంలో కాకుండా మిగతా సమయాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకోవచ్చు. అయితే అది వారున్న ప్రాంతాల్లోని నిర్థిష్ట మార్గదర్శకాలను బట్టి ఉంటుంది. అయితే కేంద్రం సామాజిక, మతపరమైన సమావేశాలపై నిషేధం విధించింది. చదవండి: ప్రధానీ కీలక భేటీ: రెండో ప్యాకేజీ సిద్దం! ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉందా? రెడ్ జోన్ల ప్రాంతాలలో ప్రభుత్వం వాహనాలతో అనుమతించబడిన కార్యకలాపాలకు అనుమతిస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో మాత్రమే అనుమతి ఉంది. కానీ ద్విచక్ర వాహనాలకు పిలియన్-రైడింగ్ అనుమతించబడవు. ప్రజా రవాణా సంగతేంటి? రెడ్‌జోన్ ప్రాంతాల నివాసితులకు కనీసం సైకిల్ రిక్షాలు, ఆటో-రిక్షాలకు కూడా అనుమతించబడవు. ఇక దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను నిషేధించబడ్డాయి. ఇక ఆరెంజ్ జోన్లలో ఇంటర్ ఇంట్రా-డిస్ట్రిక్ట్ బస్సు కార్యకలాపాలు నిషేధించబడ్డాయి, కాని డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో ప్రైవేట్ వాహనాల్లో కదలికను అనుమతిస్తారు. కాగా గ్రీన్ జోన్లలో మాత్రం బస్సులో 50 శాతం ప్రయాణాకులతో నడపడానికి అనుమతినిచ్చింది. తెరిచే దుకాణాలు ఏవేవి? నగర పరిధిలో ఉన్న అన్ని మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ మూసివేయబడతాయి. కానీ నిత్యవసర వస్తువులు అమ్మే కిరాణా దుకాణాలకు మినహాయింపు ఉంటుంది. అన్ని స్వతంత్ర దుకాణాలు, పొరుగు దుకాణాలు, నివాస సముదాయాలలో ఉన్న దుకాణాలకు అవసరమైనవా లేదా అనే దానితో సంబంధం లేకుండా అనుమతించబడతాయి, అయితే భౌతిక దూరం మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ గురించి ఏమిటి? అవసరమైన వాటి కోసం మాత్రమే రెడ్ జోన్లలో ఇ-కామర్స్ అనుమతించబడిందని కేంద్రం ఉత్తర్వులలో పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అనవసరమైన (ఆన్లైన్ షాపింగ్స్) విక్రయాలకు కూడా అనుమతి ఉంటుందని పెర్కొంది. ఆరోగ్య సేతు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదా? ప్రైవేటు, ప్రభుత్వ రంగాల ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆప్‌ను ప్రతీ ఉద్యోగి ఉపయోగించేలా చూడటం సదరు సంస్థ నిర్వాహకుడి బాధ్యత. రెడ్, ఆరెంజ్ జోన్ల వారు మాత్రమే కాకుండా సడలింపులు లేని అని కంటైన్మెంట్ జోన్లకు కూడా ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. రెడ్ జోన్స్: వీటిని హాట్ స్పాట్స్ అని కూడా పిలుస్తారు. కరోనా వైరస్(కోవిడ్ -19) కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలు. ఒక ప్రాంతాన్ని రెడ్‌జోన్ ప్రకటించే ముందు, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, రెట్టింపు రేటును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 130 రెడ్జోన్లు ఉన్నాయి. ఆరెంజ్ జోన్లు: రెడ్, గ్రీన్ లేని ప్రదేశాలు. తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు. ప్రస్తుతం ఈ విభాగంలో 284 జిల్లాలు ఉన్నాయి. గ్రీన్ జోన్స్: కేసులు లేని ప్రదేశాలు, 21 రోజుల్లో కేసు నమోదు కాని ప్రదేశాలు. ప్రస్తుతం దేశంలో 319 గ్రీన్ జోన్లు ఉన్నాయి. -
కంటైన్మెంట్లు క్లీన్ స్వీప్
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెడ్ జోన్లన్నీ తొలగించారు. నగరంలో రెడ్ జోన్లు ప్రకటించిన కొద్దిరోజులకే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం (జీహెచ్ఎంసీ సర్కిల్–19) పరిధిలోని బోరబండ, రాజీవ్‌నగర్, జయంతినగర్, వెంకటగిరి ప్రాంతాల్లో కరోనా కేసులు రావడం, అందులో రాజీవ్‌నగర్‌లో ఒకరు మృతిచెందారు. దాంతో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయా ఏరియాలను అష్టదిగ్బంధనం చేశారు. నాలుగు ప్రాంతాల్లో కలిపి దాదాపు 3,740 మంది జనాభా ఉన్నారు. ఈ నాలుగు ఏరియాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. వారి ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలను రెడ్జోన్ల పరిధిల్లో ఉన్న ప్రజలకు అందించారు. నిరంతరం కూరగాయలు, మెడిసిన్స్, నిత్యావసర సరుకులు వారికి అందేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిరంతర పర్యవేక్షణకు పోలీసు అధికారుల సహకారం అందించడంతో మూడు రోజుల కిందట మూడు ప్రాంతాల్లో ఉన్న రెడ్జోన్లు బోరబండ, జయంతినగర్, రాజీవ్నగర్లను తొలగించారు. ప్రస్తుతం తాజాగా శుక్రవారం మిగిలి ఉన్న వెంకటగిరి ప్రాంతాన్ని కూడా తొలగించినట్టు జీహెచ్ఎంసీ, పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా రెండు వారాలకు పైగా కంటైన్మెంట్స్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నందు వల్లనే ఇక్కడ తిరిగి మొదటి పరిస్థితి నెలకొందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చినందుకే ఎత్తేశాం సర్కిల్–19 పరిధిలో కరోనా కేసులు నమోదు కావడం వల్లనే కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. నాలుగు కంటైన్మెంట్లను అష్టదిగ్బంధనం చేసి లోపల ఉన్న వారిని బయటకు పంపకుండా, బయట వారిని లోనికి అనుమతించకుండా ఆయా ఏరియాల్లో ప్రత్యేక గుడారాలు వేసి నిరంతరం పోలీసుల సహకారంతో మా నోడల్ అధికారులు పర్యవేక్షించారు. వారికి కావాల్సిన కూరగాయలు, సరుకులతో పాటుగా అన్ని వస్తువులు ఇళ్ల వద్దకే అందజేశారు. ప్రజలు కూడా మాకు సహకరించారు. మొత్తం 13 పాజిటివ్ కేసుల్లో ఒకరు చనిపోయారు. ఒకరిని గాంధీకి, మరొకరిని ఛాతీ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని డిశ్చార్చ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మామూలుగా మారిపోయాయి. – రమేష్, ఉప కమిషనర్ -
ఏపీలో తగ్గిన రెడ్జోన్లు
ఆంక్షల పరిధి తక్కువే కేంద్రం తాజా మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కేసులు ఉన్న ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసు నమోదైతే.. గ్రామీణ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర, పట్టణ, నగర ప్రాంతంలో అయితే 5 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్ జోన్/క్లస్టర్‌గా గుర్తించారు. ఇలాంటి క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 238 ఉన్నాయి. వీటిలోనే రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. కేవలం ఈ పరిధిలోనే ఆంక్షలు అమలవుతాయి. ఇవి మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతమంతా గ్రీన్ జోన్ కిందికే వస్తుంది. ఈ 238 క్లస్టర్లలో కూడా ఆరెంజ్ జోన్లు అధికంగా ఉన్నాయి. కనుక ఆ ప్రాంతాల్లో మినహాయింపులు ఎక్కువే. రెడ్ జోన్లలో కూడా కొన్ని సడలింపులను కేంద్రం సూచించింది. ఈ లెక్కన రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఆంక్షల పరిధి 20 శాతం కూడా మించి ఉండదని స్పష్టమవుతోంది. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రెడ్ జోన్లు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్ జోన్లో, ఒకటి గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మారిన ప్రాతిపదిక ► గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్ని బట్టి జోన్లను వర్గీకరించారు. ► అయితే తాజాగా పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్లు తెలిపింది. ► ఇప్పటి వరకు కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్‌జోన్‌లోకి తీసుకుంటారు. వారం వారం మారుతుంది.. ► కొన్ని జిల్లాలను రెడ్ జోన్లోకి చేర్చడాన్ని పలు రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే.. వారం వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్ర స్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చు. ► కేంద్రం ఇచ్చిన రెడ్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒక యూనిట్లో 21 రోజుల పాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చు. ఏపీలో జిల్లాలు ఇలా.. రెడ్‌జోన్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఉన్నాయి. ఆరెంజ్ జోన్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్నాయి. గ్రీన్జోన్లో విజయనగరం ఉంది. -
తెలంగాణలో 6 రెడ్ జోన్ జిల్లాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రెడ్ జోన్ కేటగిరీ జిల్లాలు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 9 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా తాజాగా 6 జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 18 ఆరెంజ్ జోన్లో, 9 గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లో, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు వారం దేశవ్యాప్తంగా 170 రెడ్ జోన్లో, 207 ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. మారిన ప్రాతిపదిక...: గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్నిబట్టి జోన్లను వర్గీకరించారు. అయితే తాజాగా ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ప్రాతిపదికన విస్తృతం చేసినట్టు తెలిపింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి, సర్వైలెన్స్ వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్టు తెలిపింది. ఇప్పటివరకు కరోనా కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్ జోన్లోకి పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. చదవండి: భారత్ కేంద్రంగా నూతన ప్రపంచం వారం వారం మారుతుంది... కొన్ని జిల్లాలు రెడ్ జోన్లోకి చేర్చడాన్ని రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే ఈ జాబితా చలనశీలత కలిగినదని, ప్రతి వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్రస్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్ జోన్లను, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చని పేర్కొన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒక యూనిట్లో 21 రోజులపాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చన్నారు. అందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా, కేంద్రం ప్రకటించినట్లుగా ఆయా జిల్లాలను పూర్తిస్థాయిలో రెడ్జోన్లుగా ఉంచాలా లేక అక్కడ కూడా కంటైన్మెంట్ జోన్ల ప్రకారమే నడుచుకోవాలా అన్న దానిపై రాష్ట్ర అధికారులు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్ ప్లాన్‌ను అమలు చేయడం వల్లే ఇప్పటివరకు విజయవంతంగా వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురాగలిగామని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. చదవండి: చైనాపై మళ్లీ కారాలు మిరియాలు రెడ్ జోన్లో.. 1. హైదరాబాద్ 2. సూర్యాపేట 3. రంగారెడ్డి 4. మేడ్చల్ 5. వికారాబాద్ 6. వరంగల్ అర్బన్ గ్రీన్ జోన్లో.. 1. పెద్దపల్లి 2. నాగర్‌కర్నూల్ 3. ములుగు 4. భద్రాద్రి కొత్తగూడెం 5. మహబూబాబాద్ 6. సిద్దిపేట 7. వరంగల్ రూరల్ 8. వనపర్తి 9. యాదాద్రి భువనగిరి ఆరెంజ్ జోన్లో.. 1. నిజామాబాద్ 2. గద్వాల 3. నిర్మల్ 4. నల్లగొండ 5. ఆదిలాబాద్ 6. సంగారెడ్డి 7. కామారెడ్డి 8. ఆసిఫాబాద్ 9. కరీంనగర్ 10. ఖమ్మం 11. మహబూబ్‌నగర్ 12. జగిత్యాల 13. రాజన్న సిరిసిల్ల 14. భూపాల్పల్లి 15. మెదక్ 16. జనగాం 17. నారాయణ్‌పేట్ 18. మంచిర్యాల -
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను రెడ్ జోన్లుగా నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదుకాని విజయనగరాన్ని గ్రీన్‌జోన్‌గా డిక్లేర్ చేసింది. కొత్త జాబితా ప్రకారం దేశంలోని 130 జిల్లాలను రెడ్ జోన్లుగా, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, 319 జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్రం గుర్తించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 14 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 ఆరెంజ్ జోన్లో, 9 జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్‌స్పాట్(రెడ్‌జోన్).. తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్ హాట్‌స్పాట్స్‌గా.. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్ జోన్లుగా పేర్కొంటారనే విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల వివరాలు జిల్లాల వారీగా.. రెడ్ జోన్: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఆరెంజ్ జోన్: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం గ్రీన్ జోన్: విజయనగరం చదవండి: 3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా.. ఫేస్ మాస్క్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ -
కరోనా విజృంభణ: రెడ్ జోన్లో రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొత్తం 11 జిల్లాల్లోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గుర్తించిన రెడ్జోన్ల జాబితాలో అన్ని జిల్లాలను చేర్చింది. అంతేకాకుండా దేశ రాజధాని పరిధిలోని ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో హాట్ స్పాట్ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. వీటిలో ఫరీదాబాద్, గౌతమ్ బుద్దా, సోనీపేట్, నోయిడా సిటీలు కూడా ఉండటం గమనార్హం. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో ఆయా జిల్లాలను హాట్‌స్పాట్ జోన్లుగా నోటిఫై చేసింది. (లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ) ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలను కూడా కేంద్రం రెడ్జోన్ల జాబితాలో చేర్చింది. దేశ వ్యాప్తంగా మొత్తం 132 రెడ్జోన్లను కేంద్ర గుర్తించిన విషయం తెలిసిందే. వైరస్ తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా వివిధ ప్రాంతాలను విభజించింది. మరోవైపు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 3515కు చేరగా.. మృతుల సంఖ్య 59కి పెరిగింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులు మరింత అప్రమత్తం చేశారు. (తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే) కోటాకు 40 బస్సులు.. ఇక రాజస్తాన్‌లో కోటాలో చికుక్కున్న వారి కోసం ఆప్ సర్కార్ ప్రత్యేకంగా బస్సులను పంపింది. కోటాలో ఉన్న విద్యార్థులను దాదాపు 40 బస్సులతో ఢిల్లీకి తరలించనున్నారు. వారందరినీ స్వస్థలాలకు చేర్చిన తరువాత.. ప్రతి ఒక్కరూ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు రాష్ట్రంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీని కొరకు శుక్రవారం ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలపై సడలింపులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలను ప్రస్తుతం 129కి తగ్గించింది. (రికార్డు స్థాయిలో కరోనా కేసులు) తెలంగాణలోని రెడ్ జోన్లు.. హైదరాబాద్ సూర్యాపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికరాబాద్ వరంగల్ మరోవైపు కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారాల కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెలంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుకు గుర్తించింది ఆరెంజ్ జోన్లు జాబితా.. నిజామాబాద్ జోగులాంబ గద్వాల నిర్మల్ నల్గొండ అదిలాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఆసిఫాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్‌నగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ భూపాలపల్లి జనగామ నారాయణ్‌పేట మంచిర్యాల తెలంగాణలో కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న తొమ్మిది జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే దేశంలో 219 జిల్లాలకు గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. తెలంగాణలో గ్రీన్ జోన్లు పెద్దపల్లి నాగర్ కర్నూల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సిద్దిపేట వరంగల్ రూరల్ వనపర్తి యాదాద్రి భువనగిరి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మే నెల అత్యంత కీలకం
న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19)పై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని వీరు అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్ చేయడమే మేలని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కొనసాగిస్తూ రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రధాని వ్యాఖ్యానించడం తెల్సిందే. (రష్యా ప్రధానికి కరోనా) లాక్డౌన్ నుంచి సడలింపులు ఉంటాయన్న వార్తలు వస్తున్న తరుణంలో వైద్య నిపుణులు కంటైన్మెంట్ జోన్లు, గ్రీన్‌జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని చెబుతున్నారు. దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 129కి తగ్గాయి. ఇదే సమయంలో గ్రీన్జోన్లు 325 నుంచి 307కు, తగ్గిపోగా, ఆరెంజ్ జోన్లు 207 నుంచి 297కు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వైరస్ నాశనం కాదని, వ్యాప్తిని నియంత్రించగలమన్నది గుర్తించాలని, కాబట్టి రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం మేలని, అదే సమయంలో గ్రీన్జోన్లలో నియంత్రణలు ఎత్తివేసి.. రెడ్జోన్ల వారు అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ కుమార్ గుప్తా తెలిపారు. (సొంతూరికి దారేది?) శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సర్జన్ అయిన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, మతపరమైన ప్రాంతాలపై నిషేధం కొనసాగాలని సూచించారు. గ్రీన్జోన్ల సరిహద్దులను మూసివేయడంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు తొడుక్కోవడం వంటి నిబంధనలను అక్కడ పాటించేలా చూడాలని అరవింద్ తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అవి తగ్గేదాకా లాక్డౌన్ కొనసాగాలని అన్నారు. లాక్డౌన్ మరో నాలుగు వారాలపాటు ఉంటే బాగుంటుందని, కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ దశలో లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని మ్యాక్స్ హెల్త్‌కేర్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ అభిప్రాయపడ్డారు. గ్రీన్జోన్లలో కొంత ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని అన్నారు. (ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ) భిన్నాభిప్రాయాలు లాక్డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జనాభాలో యువత 44 శాతం ఉండడం, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైబడి ఉండడం, క్షయ వ్యాధిని నిరోధించే బీసీజీ టీకాలు తీసుకోవడం, కరోనా వైరస్ స్ట్రెయిన్స్‌లో ఉన్న తేడాలు తదితర కారణాలతో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందన్న వాదనలు ఉన్నాయి. అందుకే భౌతిక దూరం, పారిశుద్ధ్యం చర్యల్ని పకడ్బందీగా తీసుకొని దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరో వాదనను వినిపిస్తోంది. భారత్ ఇప్పటివరకు వైరస్‌ని తొక్కి పట్టి ఉంచిందని, 130 కోట్ల జనాభా ఉన్న దేశం లాక్డౌన్ ఎత్తేస్తే వ్యాధి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు సమీర్ శరణ్ హెచ్చరించారు. ఈ వైరస్ పూర్తిస్థాయి నిర్మూలనకి ఏడాది పడుతుందని లాక్డౌన్ ఎత్తేసే సమయంలో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
అష్ట దిగ్బంధంలో నరసరావుపేట
సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక బృందాలు పోలీసులు పేటలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 920 ప్రైమర్, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇంకా 200 మందికిపైగా గుర్తించి క్వారంటైన్ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో కాంటాక్ట్‌ల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రూరల్ ఎస్పీ సీహెచ్ విజయరావు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు ప్రత్యేక బృందాల్లో పని చేస్తున్నారు. ‘డ్రోన్’ కన్నుతో నరసరావుపేటలోని వరవకట్టు ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్, ఏఎన్ఎస్ పోలీసులు పేటలో 24/7 గస్తీ కాస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో భద్రత కోసం మూడు ప్లటూన్ల ప్రత్యేక బృందాలు, ఎనిమిది మంది సీఐలు, 14మంది ఎస్ఐలు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లను నరసరావుపేటకు అదనంగా ఇటీవల కేటాయించారు. ఫలిస్తున్న ప్రణాళికలు రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించ కుండా గ్రీన్జోన్లను కాపాడుకునే విధంగా యంత్రాంగం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే రెడ్‌జోన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడ ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు క్వారంటైన్లో ఉండటం వల్ల యంత్రాంగం కొంత మేర ఊపిరి పీల్చుకుంటుంది. బయటకు రావొద్దు..దది ‘కరోనాను నిర్మూలించడంలో ప్రజలు తమవంతు సహకారం అందించాలి. ప్రధానంగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే వారి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ప్రజలు సహకరించాలి నరసరావుపేటలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. వైరస్ మూలాలు ఇక్కడి నుంచి రూరల్ జిల్లా మొత్తం వ్యాపిస్తున్నాయి. దీంతో పేటను అష్టదిగ్బంధం చేశాం. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్కరు పోలీస్ ఆంక్షలకు లోబడి నడుచుకోవాలని రూరల్ ఎస్పీ, విజయరావు స్పష్టం చేశారు. – విజయరావు, రూరల్ ఎస్పీ