register
-
విశాఖ ఆర్టీవో ఆఫీస్ లో దసరా, దీపావళి దందా
-
ఘోస్ట్ పేషెంట్‌తో ముచ్చటిస్తున్న సెక్యూరిటీ గార్డు: వీడియో వైరల్
ఒక ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలోని ఘటన ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ఈ ఘటన అర్జెంటీనాలోని ఫినోచిట్టో శానిటోరియం, బ్యూనస్ ఎయిర్స్లో ఉన్న ఒక ప్రైవేట్ కేర్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఆ వీడియోలో...ఆస్పత్రి వద్ద ఉన్న ఆటోమెటిక్ డోర్లు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఎవరో ఎంట్రవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే సెక్యూరిటీ గార్డు మాత్రం లేచి వచ్చి మరీ రిజిస్టర్లో పేషెంట్ ఎవరో వచ్చినట్లుగా వివరాలు నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత లోపలకి వెళ్లే దారిని వివరిస్తూ ఒక వీల్ చైర్ కూడా ఇస్తున్నట్లు కనిపించింది. ఈ ఘటన సీసీఫుటేజ్‌లో రాత్రి 3 గంటల ప్రాంతంలో రికార్డు అయ్యిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా వామ్మో ఏముందక్కడా? అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డైలీ స్టార్ అనే స్థానిక మీడియా ఈ విషయమై ఆరా తీయగా ఆ తలుపులు ప్రతి పది గంటలకోసారి ఆటోమెటిక్‌గా తెరుచకుంటాయని చెబుతున్నారు ఆస్పత్రి యజమాన్యం. పైగా ఆ రోజు ఏ పేషెంట్ వివరాలు ఆ సమయంలో రికార్డు చేయలేదని అన్నారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవ్వడం స్థానికి మీడియా వంతైంది. మరికొంతమంది నెటిజన్లు మాత్రం.... ఆ సెక్యూరిటీ గార్డు కావాలనే ఇలా చేశాడు. అక్కడే ఏమి లేదు ఇదంతా సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుందనే తెలిసే ఇలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
రణరంగంగా జేఎన్‌యూ వర్సిటీ.. విద్యార్థులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై సోమవారం జేఎన్‌యూ రిజిస్ట్రార్ విద్యార్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ ఓ నోటీసులో హెచ్చరించారు. జేఎన్‌యూ వర్సిటీలో హింసకు పాల్పడితే సహించేది లేదన్నారు. శాంతికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీరామనవమి పూజ సందర్బంగా వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ సందర్బంగా వర్సిటీ హాస్టల్లో నాన్ వెజ్ వండటం వల్లే ఘర్షణ తలెత్తినట్టు ఓ విద్యార్థి సంఘం నేత పేర్కొనగా.. తామేమీ నాన్ వెజ్ ఫుడ్‌కు వ్యతిరేకం కాదు అని, హాస్టల్లో ఏదైనా తినవచ్చు అని మరో విద్యార్థి సంఘం నేత తెలిపారు. ఇక, ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్తులపై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. -
టిక్‌టాక్ యూజర్లకు శుభవార్త..! సరికొత్తగా..
భారత్-చైనా మధ్య భీకర పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన సుమారు 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అందులో పబ్జీ, టిక్‌టాక్ వంటి యాప్‌లు ఉండడం గమనార్హం. భారత్‌లో ఉన్న యూజర్ల నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోకుండా ఉండేందుకు ఇప్పటికే క్రాఫ్టన్ గేమ్స్ పబ్జీను తిరిగి బీజీఎమ్ఐ రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరో యాప్ టిక్‌టాక్ తిరిగి భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టిక్‌టాక్ మాతృక సంస్థ బైట్‌డాన్స్ భారత్‌లోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా బైట్‌డాన్స్ టిక్‌టాక్ స్థానంలో..TickTockను రిలీజ్ చేయనుంది. బైట్‌డాన్స్ TickTock పేరుతో కొత్త ట్రేడ్‌మార్క్ అప్లికేషన్‌ను జూలై 7 న దాఖలు చేసినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఈ నెల ప్రారంభంలో టిక్‌టాక్ కోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ కమిషన్‌కు కొత్త ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసినట్లు టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటివరకు సంస్థ ఈ విషయంపై అధికారికంగా ధృవీకరించలేదు. దేశ భద్రతా విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు చైనీస్ యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ నిషేధంతో స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ పేరిట షార్ట్ వీడియోలను యూజర్లకు అందుబాటులో తెచ్చాయి. భారత్‌లో టిక్‌టాక్‌పై పూర్తి నిషేధం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తుల్లో ప్రాచుర్యాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ యాప్‌ను సుమారు మూడు బిలియన్లకు పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. -
టీకా కోసం.. ‘కోవిన్’లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి 50 ఏళ్లు పైబడిన, ఆ లోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేసేందుకు పేర్ల నమోదుపై గందరగోళం నెలకొంది. వారి పేర్లను కోవిన్ యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నాకే టీకా వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నారు. త్వరలో రెండో డోసు మొదలుకానుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు. లబ్ధిదారుల గుర్తింపు సవాల్... రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి మొదటి విడత టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల మందిని గుర్తించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు దాదాపు 2 లక్షల మంది ఉంటారు. వారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. వారు కాకుండా మిగిలిన వారంతా 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. అంటే 75 లక్షల మందికి వచ్చే నెల నుంచి టీకా వేయాల్సి ఉంది. కానీ వారి జాబితా తయారీపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు. కోవిన్ యాప్‌లో పేర్లు ఎలా నమోదు చేయాలో మార్గదర్శకాలను కేంద్రం పంపించలేదు. వారిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించి జాబితా ఎలా తయారు చేయాలో కూడా అధికారులకు స్పష్టత లేదు. సులభతరం అన్నప్పటికీ... వ్యాక్సిన్ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం సులభతరం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గతంలో పేర్కొన్నారు. కోవిన్ యాప్‌లో పేర్లను ఎవరికి వారు రిజిస్ట్రేషన్న్ చేసుకోవాలని మొదట్లో సూచించారు. అలాగే పీహెచ్‌సీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ–సేవ కేంద్రాల్లో లబ్ధిదారులు పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. అందుకోసం పీహెచ్‌సీల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు. 50 ఏళ్లు పైబడిన వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఆ పత్రం లేనివారు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ వంటివి తెస్తే యాప్‌లో అప్లోడ్ చేసి వారి పేర్లను నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
వరంగల్ : మీ ఓటు ఉందా.. చెక్ చేసుకోండి..
సాక్షి, వరంంగల్ : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. - ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ చివరి గడువు. -
ఇదేమి ’హనుమంతా’..
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: ఇదేమి హనుమంతా.. ఇంకా ఈనెల 25వ తేదీ రాలేదుగా.. మరెలా ఉద్యోగం చేశావు. నీవు చేసే మాయాజాలంలో ఇదో కోణమంటావా.. అవన్నీ పక్కనబెట్టి అడిగేవారు లేరు కదా.. అంతా నా ఇష్టం అంటావా. ఏది ఏమైనా గడవని రోజుల్లో కూడా ఉద్యోగం చేసినట్లు అటెండెన్స్ పట్టికలో చూపడం మీకే చెల్లిందేమో.. అటెండెన్స్ మాయాజాలం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొంత మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండానే జీతాలు అందుకుంటున్నారు. సెలవు పెట్టిన తేదీలకు సంబంధించి, అటెండెన్స్ పట్టికలోని గడుల్లో ముందు చుక్కలు పెడుతున్నారు. మళ్లీ విధులకు రాగానే ఆ చుక్కలను సంతకాలుగా మార్చేస్తున్నారు. రేపటి సంతకాలను సైతం ఈ రోజే పెట్టేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఇక చెప్పనక్కర్లేదు. ఇలా ఉద్యోగాలు చేయకుండానే చేసినట్లు అటెండెన్స్‌లో చూపి, పూర్తి జీతాలను అందుకుంటూ, ఆ చినవెంకన్న సొమ్ముకు శఠగోపం పెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకు కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేసేవారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ సిబ్బంది సైతం ఇదే బాణీని అవలంబిస్తున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన ద్వారా తేటతెల్లమైంది. అసలు జరిగిందేమిటంటే శ్రీవారి ఆలయంలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన అటెండెన్స్‌లో సిబ్బంది చేస్తున్న మాయాజాలాన్ని బట్టబయలు చేసింది. ఆధ్యాత్మిక గ్రంథాలయ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న ఆర్.హనుమంతాచార్యులు ఈనెల 11 నుంచి 16 వరకు తనకు సంబంధించిన అటెండెన్స్ పట్టికలోని గడుల్లో సంతకాలు పెట్టలేదు. అయితే శుక్రవారం ఖాళీ గడుల్లో సంతకాలు పెట్టిన ఆయన, అంతటితో ఆగకుండా ఈనెల 25 వరకు విధులు నిర్వర్తించినట్లు సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు బహిర్గతం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. పర్యవేక్షణాలోపమే కారణం విధులకు హాజరైన ఆలయ సిబ్బంది నిత్యం అటెండెన్స్ పట్టికలో, తేదీకి సంబంధించిన గడిలో సంతకం చేయాలి. ఒక వేళ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా క్యాంపునకు వెళితే ‘ఓ.డి’ అని చూపాలి. అదే సెలవు గనుక పెడితే ’ఎల్’ అని రాయాలి. ఒక వేళ ఉద్యోగి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైతే ఆబ్సెంట్ చూపి, అతనిపై చర్యలు తీసుకోవాలి. ఏ విభాగానికి సంబంధించిన అధికారి, ఆ విభాగ అటెండెన్స్ పట్టికను ప్రతి రోజు క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఇక్కడ అవేమీ జరగడం లేదు. ఉద్యోగి సెలవులు పెట్టిన రోజుల్లో సైతం, విధులు నిర్వర్తించినట్లుగా అటెండెన్స్ పట్టికలో చూపుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
నిజమైన సం.. క్రాంతి!
సం..క్రాంతి.. పండుగ కాంతి.. మట్టి పిసికే రైతు ఒంటరిగా ఉంటే విఫణిలో బేలగా నిలబడాల్సి వస్తుంది.. వ్యాపారుల నిలువు దోపిడీకి గురవ్వాల్సి వస్తుంది.. విత్తనాలు, ఎరువులు వ్యాపా రులు చెప్పిన (చిల్లర) ధరకు కొనాల్సి వస్తుంది.. దళారులు చెప్పిన (టోకు) ధరకే పంటను తెగనమ్మాల్సి వస్తుంది...! అటువంటి రైతులే, చేయీ చేయీ కలిపితే మహత్తర శక్తిగా మారొచ్చని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతన్నలు రుజువు చేశారు. ఐకమత్యంతో కదులుతూ చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద పండుగ వేళ లక్ష్మీపూర్ రైతన్నల ఆచరణ నుంచి మనమూ స్ఫూర్తి పొందుదాం.. ఒక్కతాటిపైకి వచ్చిన అన్నదాతలకు నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుదాం.. లక్ష్మీపూర్ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమష్టి శక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ చిన్న గ్రామం లక్ష్మీపూర్. తొలుత సహకార సంఘంగా ఏర్పడిన రైతులు అనతి కాలంలోనే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. లక్ష్మీపూర్ సొసైటీ 2016 డిసెంబర్లో రిజిస్టరైంది. సొసైటీ కన్నా మెరుగైన ప్రయోజనాల కోసం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ)ని రైతులు నాబార్డ్ తోడ్పాటుతో సెప్టెంబర్ 2018లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీకి కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు కూడా ఇటీవలే లభించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను, రాయితీలను, రుణాలను అందుకోవడానికి.. తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్ రైతులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అవకాశం ఏర్పడింది. సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఒకే చోట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే సంఘం రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నేరుగా సంఘానికి వస్తాయి. దీనివల్ల రైతులకు రవాణా భారం, ఖర్చులు తగ్గాయి. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు.. ఆ గ్రామంలో 90 శాతం రైతు కుటుంబాలే. దాదాపు 8 వేల జనాభా. వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టపడి చేస్తూ, ప్రతి పంటలోను తోటి గ్రామాల రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తుంటారు. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, టమాటోలు తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. వేరుశెనగ, కంది పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రతి భూమిలో కనీసం రెండు, మూడు పంటలు పండిస్తారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీ వారిదే. ఎన్నికలయ్యాక మాత్రం అందరూ ఒక్కటిగా మెలుగుతున్నారు. ఒకప్పుడు అందరు రైతుల మాదిరిగానే ఆ రైతులు పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎ.డి. అశోక్‌కుమార్ తోడై, రైతుల ఐకమత్యంతో ఏమేమి సాధించవచ్చో నూరిపోశారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే లక్ష్షీ్మపూర్ రైతుల పరస్పర సహకార సంఘం. సభ్యత్వ రుసుము రూ. 3,500 తొలుత ఐదుగురు సభ్యులు సహకార సంఘానికి బీజం వేశారు. వారి ఆలోచనలు నచ్చిన గ్రామంలోని రైతులందరు సంఘంలో సభ్యులైనారు. కేవలం నెలలోపే, ఎవరి ప్రమేయం లేకుండా 312 మంది రైతులు సభ్యులుగా చేరడం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా చెపుతుంటారు. రెండెకరాల రైతుకు అప్పట్లో సభ్యత్వ రుసుము రూ. 2,300 ఉండేది, ప్రస్తుతం రూ. 3,500కు పెరిగింది. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, మూడు నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సంఘం చైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను ప్రతి రెండేళ్ల కొకసారి ఎన్నుకుంటారు. వీరు సంఘం నిర్మాణం, పటిష్టత, వ్యాపారాలపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమవుతుంటారు. చైర్మన్ సహా ప్రతి సభ్యుడూ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులందరి ముందు ప్రమాణం చేస్తారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు సంఘానికి ప్రత్యేక నిబంధనలు రాసుకుని ముందుకు వెళ్తుండటంతో సొసైటీ విజయపథాన నడుస్తోంది. సర్వసభ్య సమావేశానికి రాకపోతే రూ. 500 జరిమానా, సంఘ డైరెక్టర్లు సమావేశానికి వెళ్లకపోతే రూ. 100 జరిమానా విధిస్తుంటారు. దీంతో, ప్రతి సమావేశానికి సభ్యులందరూ వచ్చి తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సంఘానికి ఆదాయం తెస్తూనే, సంఘ సభ్యుడైన రైతులకు లాభం ఉండేలా తొలుత ‘లక్ష్షీ్మపూర్ రైస్’ను తెర మీదకు తెచ్చి, సఫలీకృతులయ్యారు. ఆ కోవలోనే గ్రామ రైతులు పండించిన విత్తనాన్ని తోటి రైతులకు అందించాలనే ఆకాంక్షతో ‘లక్ష్మీపూర్ సీడ్’ను అమ్ముతున్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లక్ష్మీపూర్ నువ్వుల’ను సైతం మార్కెట్లోకి తీసుకువచ్చారు. క్వింటాలుకు రూ. వెయ్యి అదనపు రాబడి గ్రామంలో ఎక్కువగా బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం వరి రకాలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామస్తులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో, ఎకరాకు 28–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. రైతులు ఎవరికివారే వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, గ్రామంలోని మిల్లులో మర ఆడిస్తారు. అప్పుడు సంఘ ప్రతినిధి బృందం పరిశీలించి, బాగున్నాయనుకుంటేనే సంఘం తీసుకుని, గోదాములో నిల్వ చేస్తుంది. మార్కెట్ రేటు కంటే తక్కువకే నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు. బియ్యం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత సంఘానికి జమ చేసి, మిగతా డబ్బులను వెంటనే రైతులకు చెల్లిస్తుంటారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరూ సన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుతుండటంతో, ధాన్యాన్ని అమ్మిన దాని కంటే, బియ్యం అమ్మగా రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు లాభపడుతున్నారు. లక్ష్మిపూర్ సీడ్‌కు ఆదరణ గ్రామ రైతులు ప్రతి సీజన్లో లక్షల రూపాయలు పెట్టి రక రకాల కంపెనీల వరి విత్తనాన్ని తీసుకువచ్చి పంటే వేసేవారు. కానీ, విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల పంట దిగుబడులు వచ్చేవి కాదు. దీంతో, రైతులందరం కలిసి మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవడం కాదు, తోటి రైతులకు కూడా అందించాలని లక్ష్షీ్మపూర్ సీడ్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. పొలాస పరిశోధనా స్థానం నుంచి వరిలో కొత్త దొడ్డు రకం జెజిఎల్–24423ని దాదాపు 1000 ఎకరాల్లో సాగు చేసి, ఆ విత్తనాన్ని తోటి రైతులకు అమ్ముతున్నారు. వీటితో పాటు ఐఆర్–64, బతుకమ్మ, ఎంటియు–1010 రకాలను కూడా విక్రయిస్తున్నారు. విత్తన రైతులకు మార్కెట్ ధర కంటే రూ. 200 వరకు ఎక్కువ ధర వస్తున్నది. లక్ష్మీపూర్ రైతులు పసుపు పంట తర్వాత నువ్వులు వేస్తుంటారు. గ్రామంలో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు నువ్వులు పండుతాయి. నువ్వులు నాణ్యంగా ఉన్నప్పటికీ, దళారులు రంగ ప్రవేశం చేసి కిలో రూ 70–100 వరకు కొనుగోలు చేసేవారు. దీంతో, రైతులకు సరైన ఆదాయం రాక నష్టపోతుండేవారు. సీడ్స్, రైస్‌తో లక్ష్మీపూర్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చినందున, నువ్వులను సైతం విక్రయిస్తున్నారు. ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. లక్ష్మీపూర్ రైతులు ఐకమత్యంతో చేస్తున్న ప్రతి పనికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తోడ్పాటునిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవ వల్ల గ్రామంలో రూ. 4 కోట్లతో విత్తన శుద్ధి ప్లాంట్ ఏర్పాటైంది. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చైర్మన్ తిరుపతి రెడ్డి రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 2017లో రూ. 11 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు, 2018లో రూ. 14 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు అమ్మారు. సంఘం ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు రూ. 4 కోట్ల టర్నోవర్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు. రైతులు పండించే కూరగాయల అమ్మకానికి లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘటితం కావడం వల్ల రైతులు అధికాదాయం పొందుతున్నారు. సరసమైన ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు దొరుకుతుండటంతో వినియోగదారులూ సంతోషపడుతున్నారు. (వివరాలకు.. సంఘ ప్రతినిధులు మోహన్ రెడ్డి(95020 26069), రాంరెడ్డి(99484 52429) పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలి పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలన్నదే మా సంఘం ప్రధాన ఉద్దేశం. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటూనే సంఘాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. యువ రైతులను, ఖాళీగా ఉండే వెనుకటి పెద్ద మనుషులను సంఘ సలహాదారులు నియమించుకుంటున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒక చోట అందిస్తూనే, ముఖ్యంగా రైతులు పండించిన ప్రతి పంటను ఎలా మార్కెటింగ్ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నాం. అదే మాదిరిగా వినియోగదారులకు సైతం తక్కువ ధరలో ఉత్పత్తులు అందేందుకు ప్రయత్నిస్తున్నాం. – పన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్(93915 28529), లక్ష్మీపూర్ రైతుల సహకార సంఘం, జగిత్యాల జిల్లా సంకల్ప బలమే సక్సెస్‌కు కారణం లక్ష్మీపూర్ సొసైటీ రైతు లోకానికి మార్గదర్శిగా మారింది. ఇక్కడి రైతులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటంతో, చాలా గ్రామాల రైతులు సైతం లక్ష్మీపూర్ రైస్ మాదిరిగా ఆయా గ్రామాల పేర్లతో రైస్ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడి రైతుల్లో సంకల్పం, పట్టుదల, విజయం సాధిస్తామన్న నమ్మకం మెండుగా ఉంది. అందువల్లే ప్రతి పనిలోనూ సక్సెస్ కాగలుగుతున్నారు. – అశోక్‌కుమార్ (85004 28578), జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారు, జగిత్యాల ∙‘లక్ష్మీపూర్ నువ్వుల’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్ శరత్ నువ్వులు విక్రయిస్తున్న సంఘ సభ్యులు – పన్నాల కమలాకర్, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘శక్తి’ యాప్‌లో కార్యకర్తలు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల కార్యకర్తలంతా ఓటర్ ఐడీ నంబర్‌ను 7996179961కు ఎస్ఎంఎస్ చేసి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రాహుల్ ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలంతా జూన్ 15 లోపు రిజిస్టర్ చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీ గా కార్యకర్తలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్న పార్టీ.. తాజాగా కార్యకర్తలను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తోంది. దీనికి ‘శక్తి’పేరుతో ప్రత్యేకంగా యాప్ రూపొందించి అన్ని స్థాయిల్లోని కార్యకర్తల వివరాలను నమోదు చేస్తోంది. యాప్ ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారం సులువుగా కార్యకర్తలకు చేరవేయొచ్చని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో యాప్ ద్వారా కార్యకర్తల నమోదు మొదలవగా తెలంగాణలోనూ వెంటనే ప్రారంభించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. -
రెండో చాసెస్తో రిజిస్టర్ చేయాల్సిందే..
♦ రవాణా శాఖ అధికారులకు తేల్చి చెప్పిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కారురోడ్డు ప్రమాదంలో చాసెస్ పూర్తిగా దెబ్బతిని, కొత్త చాసెస్ బిగించిన సందర్భంలో కారులో మార్పులు చేశారన్న కారణంతో ఆ వాహనాన్ని రిజిస్టర్ చేయబోమని చెప్పడానికి వీల్లేదని రవాణా శాఖ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్–52కు సవరణలు తీసు కొచ్చారని, దీని ప్రకారం దెబ్బతిన్న చాసెస్ స్థానంలో కొత్త చాసెస్ బిగించి ఆ విషయాన్ని వాహన యజమానికి తెలియచేసినప్పుడు ఆ వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ రజనీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇదే అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ఇదీ నేపథ్యం 2007లో టయోటా కారు కొన్న 2 నెలలకు రోడ్డు ప్రమాదంలో చాసె స్ పూర్తిగా దెబ్బతింది. కారును పరిశీలించిన టయోటా కంపెనీ మరో నంబర్‌తో కొత్త చాసెస్ ఇచ్చింది. రెండో చాసెస్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రే షన్ చేసేందుకు ఆర్టీఏ అధికారులు నిరాకరించారు. రవా ణా చట్టంలోని సెక్షన్–52 ప్రకారం చాసెస్ మారిస్తే రిజి స్ట్రేషన్‌కు వీల్లేదన్న ఆర్టీఏ వాదనను 2008లో సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. దీనిపై రవాణా అధికారులు అప్పీల్ చేశారు. అన్ని అర్హతలున్న కంపెనీ కాబట్టి కొత్త చాసెస్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ధర్మాసనం తెలిపింది. -
ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
-
చింతమనేనిపై కేసు నమోదు
దేవరపల్లి(పశ్చిమగోదావరి): విధి నిర్వాహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై జె. పాపారావు పై ఎమ్మెల్యే దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దేవరపల్లి గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతర సందర్భంగా ట్రాఫిక్ మళ్లిస్తుండగా.. అక్కడికి చేరుకున్న చింతమనేని దుర్భాషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు. దీంతో ఆయనపై 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కర్నూలు సబ్ రిజిస్రా్టర్పై చర్యలు తీసుకోండి
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి జేసీ రిపోర్టు కర్నూలు (అగ్రికల్చర్): ప్రభుత్వ భూమిగా గుర్తించి సెక్షన్ 22(ఎ)లో పెట్టి లావాదేవీని నిషేధించిన భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసిన కర్నూలు సబ్ రిజిష్ట్రార్ మహబూబ్బాషాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు తెలిసింది. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 234/1,2,3,4లోని ప్లాట్లను ప్రభుత్వ భూములుగా గుర్తించి క్రయ, విక్రయాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ భూముల జాబితా అనెగ్జర్ –2లో పెట్టింది. అయితే కర్నూలు సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ బాషా 21, 22 ప్లాట్లను 2015లో ఒకరి పేరుమీద, 2016లో మరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణను విచారణ అధికారిగా నియమించారు. ఈయన విచారణ జరిపి అక్రమాన్ని నిర్ధారించినట్లు సమాచారం. ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
ఓటరుగా నమోదు చేసుకోండి
ఉపాధ్యాయులకు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : 2017లో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న పిలుపునిచ్చారు. బుధవారం ఎస్టీయూ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు ఫారమ్ 19, ఒక ఫొటో, ఓటరుకార్డును తీసుకుని సమీపంలోని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ , ఎంఈఓ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా కూడా ను నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఠీఠీఠీ.ఛ్ఛి్చౌnఛీజిట్చ/nజీఛి.జీnను సందర్శించి ఆన్లైన్ ఓటరుగా నమోదు అవ్వవచ్చన్నారు. -
రికార్డుల్లో నమోదు చేయాలి
భువనగిరి అర్బన్ : గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని డీపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. గ్రామాల్లో పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయని, ఆన్ ఆఫ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి సమస్య పరిష్కరించాలని, నూరు శాతం పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీవరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రికార్డులను తప్పనిసరిగా సరి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఎ. రవికుమార్, ఎండీపీఓ గోపాలకి షన్‌రావు, భగవన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు నర్సింహ, శ్రీనివాస్, దినాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఆర్‌ఎస్‌ఆర్‌లో ‘చుక్కలు’ పునః పరిశీలన
అనెగ్జర్–5ను రివైజ్డ్ చేయాలని సీసీఎల్ఏ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): రీ సెటిల్మెంటు రిజిస్టర్(ఆర్ఎస్ఆర్)లో గ్రామాలు, సర్వే నెంబరు వారీగా పట్టాదారు స్థానంలో చుక్కలున్న భూముల గుర్తింపును మరోసారి పరిశీలించాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల వివరాలను 5 రకాల జాబితాల్లో చేర్చారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న వాటిని అనెగ్జర్– 5లో చేర్చి ప్రభుత్వానికి పంపారు. చుక్కలున్న కొన్ని సర్వే నెంబర్లను అనెగ్జర్ – 5లో పెట్టకుండా అవగాహన లోపంతో రెవెన్యూ సిబ్బంది అ¯ð గ్జర్ 1లో పెట్టి అసైన్డ్ భూములుగా చూపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో జాబితాను రివైజ్డ్ చేసి పంపాలని సీసీఎల్ఏ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలను జిల్లా కేంద్రానికి రప్పించి ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న చుక్కల భూములను ఏ జాబితాలో పెట్టారో పరిశీలింపజేస్తారు. అనెగ్జన్–1లో ఉన్న చుక్కల భూములను అనెగ్జర్–5లోకి తీసుకువస్తారు. చుక్కలున్న భూముల్లో 1955కు ముందు క్రయ,విక్రయాలకు సంబంధించి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో రిజిష్ట్రేషన్లు జరిగిన భూములను ప్రయివేటు భూములుగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. రివైజ్డ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. -
కళాశాలలు రిజిస్టర్ చేసుకోవాలి
కడప కోటిరెడ్డి సర్కిల్: సాంఘిక సంక్షేమ శాఖలో ఈ పాస్ వెబ్సైట్లో 2016–17 సంవత్సరానికి కళాశాలలు రిజిస్టరు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 413 ప్రభుత్వ, ప్రయివేటు, డిగ్రీ ఇతర వృత్తి కళాశాలలు ఉన్నాయన్నారు. వాటిలో 299 కళాశాలల వారు రిజిస్టర్ చేసుకొన్నారని, ఇంకా 114 కళాశాలలు రిజిస్టర్ చేసుకోలేదని వీరంతా ఈ నెల 31వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. రిజిస్టర్ చేసుకున్న హార్డ్ కాపీలను ఆమోదం కోసం ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమశాఖ వారికి సమర్పించాలన్నారు. -
సాదా బైనామాలకు జూన్ 15 గడువు
హైదరాబాద్: తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది. సెక్షన్ 22(2) ఏపీరైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ చట్టం మేరకు సాదాబైనామాపై ఉన్న సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ విన్నపం మేరకు జూన్, 2, 2014 లోపు తేదీలు ఉన్న సాదాబైనామాలను రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధీకరిచేందుకు సర్కారు అనుమతించింది. క్లెయిమ్‌ల వన్‌టైమ్ సెటిల్మెంట్ అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. క్లెయిమ్‌ల స్వీకరణకు ఆఖరి గడువును జూన్ 15. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీని కూడా మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హక్కు బదిలీ, కేటాయింపు కోరుకునే సాదాబైనామా జూన్, 2, 2014 కు ముందు రాసుకున్నదై ఉండాలి. ఈ క్రమబద్దీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు ఈ పథకం ఎంతమాత్రం వర్తించదు. ఉత్తర్వుల అమలు నిమిత్తం తగిన చర్యలు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ను, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు చేసుకునేది ఇలా.. సాదాబైనామా రిజిస్ట్రేషన్ కోరుకునే వ్యక్తి ఫారమ్ 10తో పాటు సాదాబైనామా జిరాక్స్ ప్రతిని జతచేసి సంబంధిత మండల తహశీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం ఫారమ్ 11 ద్వారా నోటీసు జారీచేసిన తహశీల్దారు సదరు ఆస్థిపై విచారణ చేయిస్తారు. విచారణ అనంతరం ఫారమ్ 10లో కోరిన భూమిని దరఖాస్తుదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆ ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్‌కు జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా మండల తహశీల్దారు సిఫారసు చేస్తారు. భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓనరుతో ఎంతమాత్రం పనిలేదు. స్టాంపు డ్యూటీని కూడా మినహాయించడంతో లబ్దిదారులు ఒక్కరూపాయి చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వం ఇచ్చిన సాదాబైనామా క్రమబద్దీకరణ అవకాశం ద్వారా ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు లక్షన్నర మంది వ్యవసాయ దారులకు తాజా ప్రక్రియ ద్వారా లబ్ది చేకూరనుంది. -
మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
సికింద్రాబాద్ : స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగిన తరుణంలో గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు రోగులకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు రోజుల క్రితం అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన మహిళ (50) గాంధీకి రాగా ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. బుధవారం సన్‌షైన్ ఆస్పత్రి నుంచి మూడేళ్ల బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రాగా పరీక్షల్లో వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో గాంధీలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న సమయంలో విజృంభించే వ్యాధి కారక వైరస్ చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో వెలుగులోకి రావడంతో రూపాంతరం చెందిందేమోనని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గుర్తింపు కార్డు పోరుుందా! అయితే పొందండి ఇలా..
ప్రయోజనం ఒకప్పుడు గుర్తింపు కోసం ఒక్క రేషన్ కార్డునో, లేదా ఓటర్ గుర్తింపు కార్డునో అడిగేవారు. ఇప్పుడు అనేక రకాల గుర్తింపు కార్డులు జీవితంతో భాగమయ్యాయి. డెబిట్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకూ వెంట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కార్డులుపోతే ఏం చేయూలో అర్థంగాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పొందడానికీ మార్గాలున్నారుు. అవేవో తెలుసుకుందాం. -గురజాల ఆధార్ కార్డు అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అరుు్యంది. ఆధార్ కార్డు పోతే దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మీ పూర్తి వివరాలు చెపితే ఆన్లైన్లో చూస్తారు. దీని కోసం తెల్ల రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి. నిర్ణీత రుసుం చెల్లిస్తే డుప్లికేట్ ఆధార్ కార్డు జారీ చేస్తారు. తాజాగా ఆకర్షణీయంగా ఉండే పీవీసీ కార్డులూ ఇస్తున్నారు. ఓటరు కార్డు గుర్తింపు ధ్రువీకరణకు, ఓటు వేయడానికి ఎంతో ఉపయోగపడే ఓటర్ కార్డు పోతే సులభంగా పొందవచ్చు. పోయిన మీ కార్డులోని వివరాలతో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆ వివరాలతో సరిపోల్చి మీ కార్డు నెంబర్ చూపుతారు. అవన్నీ సరైనవైతే అక్కడికక్కడే డూప్లికేట్ కార్డు జారీ చేస్తారు. దీని కోసం నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఆకర్షణీయంగా ఉండే పి.వి.సి ఓటరు కార్డులు కూడా జారీ చేస్తున్నారు. పాన్ కార్డు ప్రతి ఉద్యోగి, లేదా ఆదాయ మార్గాలున్న వారందరికీ ఇప్పుడు పాన్‌కార్డు తప్పనిసరి. ఈ పాన్ కార్డు పోతే దానికి సంబంధించిన సంఖ్య ఉంటే దగ్గరలోని టిన్ ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి డూప్లికేట్ కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డు సంఖ్య గుర్తులేనప్పుడు గతంలో మీరు ఇచ్చిన వివరాలన్నీ పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖ నుంచి మీ ఫోన్ నంబర్‌కు సమాచారం వస్తుంది. మీ వివరాలతో సరిపోల్చి ఇప్పటికే మీ పేరిట జారీ అయిన పాన్ సంఖ్య తెలుస్తుంది. వివరాలకు సంక్షిప్త సందేశంలో ఇచ్చిన టోల్ ఫ్రీ సంఖ్యకు ఫోన్ చేసి పాన్ సంఖ్యను తెలుసుకుని డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డెబిట్..క్రెడిట్ కార్డు నగదు సంబంధిత డెబిట్, క్రెడిట్ కార్డులు వ్యక్తి జీవితంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కార్డులు పోతే తక్షణం సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. బ్యాంకు మూసివుంటే సంబంధిత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి లేదా కార్డుల సేవలందిస్తున్న విభాగానికి సమాచారం అందించాలి. దీంతో కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను వారు నిలువరించడం జరుగుతుంది. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి మరొక కార్డు కోసం దర ఖాస్తు చేసుకుంటే కొన్ని జాతీయ బ్యాంకులు వెంటనే, మరికొన్ని బ్యాంకుల్లో కొంత సమయం తర్వాత జారీ చేస్తున్నారు. రేషన్ కార్డు సాధారణంగా రేషన్‌కార్డు పోతే దాని సంఖ్య ఆధారంగా డూప్లికేట్ జారీ చేస్తారు. ఈ సంఖ్య తెలియకపోతే సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న డైనమిక్ కీ రిజిష్టర్‌లో వివరాలు తీసుకుని మీ సేవ ద్వారా డూప్లికేట్ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పట్టణాల్లో అరుుతే సహాయ పౌర సరఫరాల అధికారి, గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లు డూప్లికేట్ కార్డు జారీ చేస్తారు. వాటిని మళ్లీ మీ సేవ ద్వారా పొందవచ్చు. డ్రైవింగ్ లెసైన్సు ఆర్సీ(రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాలు పడతాయి. దీంతో పాటు పోలీసులకు వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. ఆర్సీ పోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకుండా ముందుగా ఆర్సీ పోయినట్లు మీ సేవ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత దానికి సంబంధించిన రసీదును తీసుకెళ్లి సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో డూప్లికేట్ ఆర్సీ కోసం దరఖాస్తు చేసి, నిర్ణీత రుసుం చెల్లించాలి. ఆ తర్వాత పోలీసుల నుంచి అభ్యంతరం లేనట్లు పత్రం తీసుకుని వచ్చాక డూప్లికేట్ ఆర్సీ మంజూరు చేస్తారు. రైల్వే రిజర్వేషన్ టికెట్ దూర ప్రయాణాల కోసం ముందస్తు రైల్వే రిజర్వేషన్ టికెట్ కోనుగోలు చేసి, తీరా ప్రయాణ సమయం మరచిపోవడం, పోగొట్టుకోవడం చేస్తారు. అటువంటి వారు డూప్లికేట్ టికెట్ పొందే అవకాశం ఉంది. చార్ట్ తయారీకి ముందే గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించి వివరాలు తెలిపితే డూప్లికేట్ టికెట్‌ను నిర్ణీత రుసుం వసూలు చేసి జారీ చేస్తారు. -
విద్యావంతులే బోల్తాపడుతున్నారు!
- సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న సిటీవాసులు - వరుడు, ఫ్రెండ్ రూపంలో దగా - పార్శిల్ గిఫ్ట్ పంపిస్తామని లక్షల్లో దోచుకుంటున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: మొన్న...భారత్ మ్యాట్రీమోని కన్నడిగూడ వెబ్సైట్లో తార్నాకలో ఉంటున్న 54 ఏళ్ల విజయలక్ష్మి పేరు రిజిస్టర్ చేసుకుంది. చందన్ డేవిడ్ పటేల్ అనే వ్యక్తి తన ప్రొఫైల్‌కు లైక్ కొట్టడంతో అతని వివరాలను తెలుసుకునేందుకు వెబ్సైట్ వాళ్లకు రూ. 5 వేలు చెల్లించింది. తనకు పెళ్లి అయి విడాకులయ్యాయని, యూకేలోని ఆయిల్ రిఫైనరీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని అతను పేర్కొన్నాడు. ఇలా వీరిమధ్య సన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే 40 వేల యూఎస్ డాలర్లు, వెడ్డింగ్ రింగ్, బంగారు ఆభరణాలతో పాటు విడాకుల పత్రాలతో పార్సిల్ పంపుతున్నానని ఆమెకు చెప్పాడు. అలా ఆమెకు మరుసటి రోజు డాక్టర్ ఫిలిప్స్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో కార్ట్కోడ్తో పాటు కస్టమ్స్ టాక్స్, మనీ లాండరింగ్ కింద దాదాపు 15,89,000ల ఆయా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసింది. మరో నాలుగు లక్షలు కట్టాలని మళ్లీ కాల్ రావడంతో అనుమానం వచ్చిన పెద్దావిడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను జూలై 21న ఆశ్రయించింది. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లి వలపన్ని చందన్ డేవిడ్ పటేల్ అలియాస్ డూయిస్ను అరెస్టు చేసి తీసుకొచ్చారు. నిన్న...మెట్టుగూడలో ఉంటున్న పద్మిని కూడా విజయలక్ష్మి మాదిరిగానే మోసపోయింది. భారత్ మ్యాట్రీమోని కన్నడిగూడ వెబ్సైట్లో పేరు రిజిస్టర్ చేసుకుంది. అమెరికాలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నానని దేవ్ ప్రిన్స్ అడిగ పరిచయం చేసుకున్నాడు. గిఫ్ట్ పంపుతున్నానని చెపి.. డబ్బు కాజేశాడు. మళ్లీ డబ్బు పంపించమని అడగడంతో మోసపోయానని గ్రహించిన ఆమె జూలై 17న సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అతడిని హైదరాబాద్ రప్పించి పట్టుకొనేందుకు సైబర్ పోలీసులు పథకం వేశారు. తాజాగా... తెలుగు దినపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేస్తున్న యువతికి ఆరు నెలల క్రితం ఫేస్బుక్లో స్కాట్లాండ్కు చెందిన జాన్సన్ మోరేతో పరిచయం ఏర్పడింది. అలా అతను ఆమె కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. వారం క్రితం 15 వేల పౌండ్లు, రింగ్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ పార్శిల్ పంపుతున్నానని చెప్పాడు. మరుసటి రోజే కార్తీ అగర్వాల్ కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి డెలివరీ చార్జీస్ కింద రూ. 42,500లు, మనీ లాండరింగ్ కింద 1,30,000, టాక్స్ కింద 1,70,000లు చెల్లించాలని బ్యాంక్ ఖాతాలు ఇచ్చాడు. ఆ యువతి ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసింది. మళ్లీ యాంటీ టైస్టు డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, 2,90,000లు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను బుధవారం ఆశ్రయించింది. ఇలా విద్యావంతులు, సంపన్నులు, భారీగా డబ్బు వస్తుందని మరికొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. లక్షల్లో డబ్బులు చెల్లించి పీకల్లోతు నష్టపోయాక సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫేస్బుక్ చాటింగ్ స్నేహంతో కొందరు... మ్యాట్రీమోనిలో వరుడి రూపంలో మరికొందరు... లాటరీ తగిలిందని ఇంకొందరు...ఇన్సూరెన్స్ డబ్బులు నాలుగింతలు చేస్తామని మరికొందరు... ఇలా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో నెలకు పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ వాటి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సైబర్ పోలీసులు సామాజిక మాధ్యమాలు, పత్రికా ప్రకటనల ద్వారా అవగాహన కలిగించినా... ఉన్నత విద్యావంతులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను పట్టుకుంటున్నా.... వారి నుంచి మాత్రం డబ్బు రికవరీ కావడం లేదు. అందుకే సైబర్ నేరగాళ్ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం తప్పదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త అవసరం ప్లస్ 371, ప్లస్ 371 నంబర్లతో వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారం పెట్టకపోవడమే ఉత్తమం. కొన్ని సంస్థలు బూటకపు ఈ మెయిల్స్‌తో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి. నగదు లావాదేవీల్లో నయా వంచన జరుగుతోంది. అమ్మాయిలు కూడా ఊరికే ఎదుట వ్యక్తులను నమ్మి లక్షలు లక్షలు ధారపోయరాదు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తత అవసరం. ముగ్గురు నైజీరియన్ల అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: లాటరీ తగిలిందని సిటీకి చెందిన ఓ అమ్మాయిని మోసగించిన ముగ్గురు నైజీరియన్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని మహవీర్ మార్గ్‌లో నిందితులు ఒడిడి అనిరియోడి వాల్స్, కెమాకర్ ఆంటోనీ, జెన్వోబసి గోస్పెల్ ఇకెన్నాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు....వారిని అక్కడి సీఎంఎం టిస్ హజారి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి బుధవారం తీసుకొచ్చారు. వివరాలు... మూడు కోట్ల 60 లక్షల సమ్సాంగ్ లాటరీ తగిలిందని జూన్ తొలివారంలో మల్కాజిగిరికి చెందిన ఓ అమ్మాయి సెల్‌కి ఎస్ఎంఎస్ వచ్చింది. డబ్బు పంపించాలంటే చిరునామాతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు పంపించామన్నారు. దీంతో ఎగిరి గంతేసిన ఆమె పూర్తి వివరాలు పంపింది. ఆ తర్వాత రోజు సమ్‌సంగ్ కంపెనీ డెరైక్టర్ జేమ్స్ మోర్గాన్ విన్నింగ్ లాటరీ గెలుచుకుందని మెయిల్ పంపించారు. లావాదేవీలు సాఫీగా సాగేందుకు భారత్‌లోని ఆర్బీఐ అధికారులు కాంటాక్ట్‌లో ఉంటారని తెలిపారు. ఇన్కమ్ టాక్స్ క్లియరెన్స్, యాంటి టైస్టు సర్టిఫికెట్, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వివిధ బ్యాంక్ ఖాతాలు ఇవ్వగా అందులో 15,50,800లు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత కూడా డబ్బులు డిపాజిట్ చేయమని కాల్స్ రావడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరామ్, ఇన్స్పెక్టర్ మహమ్మద్ రియాజుద్దీన్, ఎస్ఐ విజయ్ వార్తన్ బృందం న్యూఢిల్లీకి వెల్లి మహవీర్ మార్గ్‌లో ముగ్గరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిడి అనిరియోడి వాల్స్, కెమాకర్ అంటోనీ, జెన్వోబసి గోస్పెల్ ఇకెన్నాల నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు, పది సెల్ఫోన్లు, ఎనిమిది ఇంటర్నెట్ డేటాకార్డులు, 53 అక్టివ్ సిమ్‌కార్డులు, 1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన ఒడిడి అనిరియోడి వాల్స్ నైజీరియాలో పోలీసు అధికారిగా పనిచేసి...2013లో భారత్‌కు బిజినెస్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. కాలపరిమితి ముగిసినా అక్రమంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. -
మీరా జాస్మిన్ పెళ్లి నమోదుకు చిక్కులు
నటి మీరా జాస్మిన్ వివాహం నమోదుకు రిజిస్టర్ అధికారులు నో అనడం చర్చనీయాంశంగా మారింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషలన్నింటిలోను ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన నటి మీరా జాస్మిన్. ఈమె వ్యక్తిగత జీవితం పలు మలుపులు తిరిగి చివరికి అనిల్ జాన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ముడిపడింది. ప్రముఖ మాండలిన్ సంగీత కళాకారుడు రాజేష్‌తో మీరా జాస్మిన్ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. మీరాజాస్మిన్-అనిల్ జాన్‌ల వివాహం గత ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న చర్చిలో జరిగింది. అయితే వీరి వివాహాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ అధికారులు నమోదు చేయలేదు. అందుకు కారణం అనిల్ జాన్కిది రెండో వివాహం అన్న సందేహమే. దీనిపై రిజిస్ట్రార్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ, ఇటీవల మీరాజాస్మిన్, అనిల్‌జాన్ తమ వివాహ నమోదు సమస్య గురించి అడగడానికి తమ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. వివాహం జరిగిన 45 రోజుల తరువాత వివాహం నమోదు చేయడానికి వచ్చిన వారిని విచారించడం అన్నది సాధారణ విషయం అన్నారు. నటి మీరాజాస్మిన్ ప్రస్తుతం చిత్రాల్లో నటించడం లేదన్నారు. భర్తతో కలిసి దుబాయ్‌లో నివశిస్తున్న ఆమెను వివాహ నమోదు సమస్య గురించి ప్రశ్నించగా ఆమె ఎలాంటి బదులు ఇవ్వలేదని తెలిపారు. ఈ కారణంగానే వారి వివాహాన్ని చట్టబద్దంగా నమోదు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనిల్ జాన్ ఇంతకు ముందు బెంగళూర్‌కు చెందిన ఒక యువతితో పెళ్లికి సిద్ధం అయ్యారని అయితే కొన్ని కారణాల వల్ల ఆ వివాహం ఆగిపోయింది. ఆ యువతి కుటుంబ సభ్యులు తమ వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని పెళ్లి సమయంలో అనిల్ జాన్ పోలీసుల రక్షణ కోరారు. మరో విషయం ఏమిటంటే అనిల్ జాన్‌కు బెంగళూర్‌కు చెందిన యువతికి వివాహం అయినట్లు నటి మీరాజాస్మిన్, అనిల్ జాన్‌కు రెండో భార్య అనే విషయం ప్రచారంలో ఉంది. -
ఏవీఎస్.. పక్కదారి?
ప్రమాదాలను కూడా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. వర్షాకాలంలో పాముకాటుకు గురైన వారు ఎక్కువగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది వైద్య సిబ్బంది దానికి విరుగుడుగా వాడే ఏవీఎస్ ఇంజక్షన్లను బయటకు అమ్ముకుంటున్నారు. పాముకాటుకు గురైన వారి సంఖ్య... వాడిన ఇంజక్షన్ల సంఖ్యకు మధ్య తేడా ఉండడమే దీనికి నిదర్శనం. సాక్షి, మహబూబ్‌నగర్: అది చాలా అరుదుగా వినియోగించే మందు.. ఓ మాటలో చెప్పాలంటే పాముకాటు బాధితులకు ప్రాణం పోసే దివ్య ఔషధం. ఇంతటి విలువైన యాంటీ స్నేక్ వీనమ్(ఏవీఎస్) వాయల్స్ జిల్లా ఆస్పత్రిలో పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాటుకాటు బాధితుల సంఖ్య, వినియోగించిన ఏవీఎస్ వాయల్స్‌ను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పాటుకాటు బారినపడే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తుంటాయి. దీనినుంచి బాధితులను రక్షించేందుకు విరుగుడుగా ఉపయోగించే యాంటీ స్నేక్ వీనమ్ మందును ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతుంది. కానీ మహబూబ్‌నగర్‌లోని ప్రధాన ఆస్పత్రి నుంచి బహిరంగమార్కెట్‌కు అవి తరలుతున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.. జిల్లా ఆస్పత్రిలోని రిజిస్టర్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది అన్ని పీహెచ్సీలలో కలిపి 41కేసులు నమోదైనట్లు డీఎంహెచ్ఓ కార్యాలయం పేర్కొంది. కానీ జిల్లా ఆస్పత్రిలో మాత్రం ఇప్పటివరకు 247 పాముకాటు కేసులను నమోదు చేశారు. అయితే ఇక్కడ విషయమేమంటే పాముకాటుకు గురవుతున్న వారి ఎక్కువగా గ్రామీణులే ఉంటున్నారు. వారు మొదట పీహెచ్‌సీలను ఆశ్రయిస్తారు. అక్కడ సరైన సదుపాయాలు కల్పించలేని పక్షంలో ఏరియా ఆస్పత్రికి.. లేదంటే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కానీ పీహెచ్‌సీల్లో నమోదైన కేసుల కంటే జిల్లా ఆస్పత్రిలో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే వెయ్యి ఏవీఎస్ వాయల్స్ ఉపయోగించినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. గతేడాది అంతే : 2013లో జిల్లాలో పీహెచ్‌సీల్లో 196 కేసులు నమోదైతే, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో 474మంది బాధితులకు చికిత్స అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఈ ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 2,809 ఏవీఎస్‌లను ఉపయోగించినట్లు లెక్కలు వేశారు. అయితే ఈ విషయమై అప్పుడే అనుమానాలు తలెత్తడంతో వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ విచారణ కూడా చేపట్టింది. సంస్థ ఎండీ స్వయంగా స్థానిక ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. అప్పట్లో అవకతవకలు జరిగాయా? లేదా అన్నది మాత్రం బయటకు వెలువడలేదు. తాజాగా ఇదే ఆస్పత్రిలో నమోదైన పాముకాటు కేసులకు మించి ఏవీఎస్‌లను వినియోగించడాన్ని చూస్తే మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కొందరి చేతివాటం వల్ల ఈ విలువైన మందు పక్కదారి పడుతుందనే విషయం తేటతెల్లమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. ఆస్పత్రి నుంచి మందులు బయట కు వెళ్లే ప్రసక్తేలేదు. యాంటీ స్నేక్ వీనమ్ మెడిసిన్ పక్కదారి పడుతున్నదన్నది అవాస్తవం. మా దగ్గరికొచ్చే పేషెంట్ల వివరాలు, వారికిచ్చిన వాయల్స్ లెక్క కచ్చితంగా పాటిస్తున్నాం. ప్రభుత్వ లేబల్ ఉన్న ఏవీఎస్ బయట ఎక్కడైనా ప్రైవేట్ఆస్పత్రుల్లో కానీ నర్సింగ్‌హోముల్లో ఉన్నట్లు బయటపడలేదు. ఒకవేళ జిల్లా ఆస్పత్రి నుంచి మందులు బయటకు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. - శ్యాముల్స్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
రాజధాని నగరంలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గత రెండ్రోజుల్లో 30 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయగా ఇద్దరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఇందులో ఒకరు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో, మరొకరు నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత ఆరు మాసాల్లో సుమారు 350 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు జరగగా.. అందులో 31 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇందులో తొమ్మిది మంది మృతి చెందారు. అయితే అధికారులు దీన్ని టైఫాయిడ్, మలేరియా తరహాలోనే స్థానిక వ్యాధిగా పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. మన వాతావరణంలో హెచ్1ఎన్1 వైరస్ బాగా కలిసిపోయి ఉందని, మన రాష్ట్రంలో ఉన్నవారి నుంచే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోందని చెబుతున్నారు. -
టీఎస్ కోడ్ అమలుకు 4 నెలల గడువు
హైదరాబాద్: కొత్త వాహనాలకు తెలంగాణ స్టేట్ (టీఎస్) కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత వాహనాలకు టీఎస్ కోడ్ అమలు చేయడానికి నాలుగు నెలలు గడువు ఇచ్చామని, అవసరమైతే గడువు ఇంకా పెంచుతామని ఆయన చెప్పారు. ఇందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు.