rent house
-
40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే పాన్ ఇండియా స్టార్
సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే డబ్బుంటే ఇల్లు లేదా నగలు కొనుక్కోవాలని చూస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు కోసం భరోసా అని చెబుతాడు. కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అసలు సొంతిల్లు ఎందుకు కొనుక్కోవాలి అని వింత లాజిక్ చెబుతున్నాడు. కావాలంటే అద్దె ఇంట్లోనే ఉంటానని ఖరాఖండీగా చెబుతున్నాడు.ఖేర్ ఏమన్నాడంటే?'సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్సయ్యా. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అయినా ఎవరి కోసం ఇల్లు కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బుని ప్రతినెలా బ్యాంకులో దాచుకుని, కొంత డబ్బుతో ప్రతినెలా అద్దెకడితే సరిపోతుందిగా! భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందుకే ఆస్తులు కొనే డబ్బుని దాచిపెట్టి, దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు'(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)'మంచి సినిమాలు చేస్తున్న టైంలో తనకోసం ఓ ఇల్లు కొనివ్వమని అమ్మ కోరింది. దీంతో ఓ హౌస్ కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేం అక్కడే ఉండేవాళ్లం. ఆ చనిపోయిన తర్వాత సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది. సింగిల్ బెడ్రూమ్ చాలాని చెప్పింది గానీ 8 బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని బహుమతిగా ఇచ్చాను. నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో చాలారోజుల తర్వాత అర్థమైంది' అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు.హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు, లీడ్ రోల్స్.. ఇలా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ్ ఖేర్.. తెలుగు నుంచి వచ్చిన కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు లాంటి పాన్ ఇండియా మూవీస్‌లోనూ కనిపించారు. అయితే అనుపమ్ చెప్పిన లాజిక్ ఆయన లాంటి స్టార్ యాక్టర్స్‌కి వర్కౌట్ కావొచ్చేమో గానీ సామాన్యులకు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే..
ఇప్పటికి కూడా చాలా మందికి సొంత ఇంట్లో ఉండాలా? లేక అద్దె ఇంట్లో ఉండాలా? అనే ప్రశ్న, ప్రశ్నగానే ఉంది. కొందరు సొంత ఇల్లు బెస్ట్ అంటే.. మరి కొందరు అద్దె ఇల్లు బెటర్ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు జెరోధా సీఈఓ నితిన్ కామత్ తనదైన రీతిలో సమాధానం వెల్లడించారు. జర్నలిస్ట్ సోనియా షెనాయ్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జెరోధా సీఈఓ నితిన్ కామత్ 'రెంట్ vs బై' ప్రశ్నకు సమాధానంగా.. సొంత ఇల్లు కంటే అద్దె ఇంట్లో ఉండటానికే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నితిన్ కామత్ జవాబుతో కొందరు ఏకీభవిస్తే.. మరికొందరు సొంతంగా ఇల్లు ఉంటేనే బాగుంటుందని వాదిస్తున్నారు. నితిన్ కామత్ మాట్లాడుతూ.. తనకు ఉన్న ఇల్లు తన తల్లిదండ్రులదని, భావోద్వేగాల కారణంగా ఎప్పుడూ ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉండాలని, కాబట్టే కొత్త ఇల్లు కొనేది లేదని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో లక్షల వ్యూవ్స్ పొందింది. దీనిపైనా నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని మాటలు ఎవరూ నమ్మొద్దని, అవన్నీ మూర్ఖపు మాటలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! ఇందులో నిజమెంత? View this post on Instagram A post shared by Sonia Shenoy (@_soniashenoy) -
అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..?
దేశంలోని అనేక నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అద్దెలు వేలల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. భారతీయులు ఎగబడి మరీ వెళుతున్న కెనడాలో అద్దెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కెనడా రాజధాని టొరంటోలో ఇంటి అద్దెలు తెలిస్తే అవాక్కవుతారు. ఈ నగరంలో హౌసింగ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ క్రమంలో టొరంటోకు చెందిన అన్య ఎట్టింగర్ అనే మహిళ నెలకు రూ.54,000 చొప్పున తన క్వీన్సైజ్ బెడ్‌ను మరో మహిళతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన షేర్ చేసింది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నెల అద్దె దాదాపు రూ.2.17 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అద్దెల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వీడియోలో తెలిపింది. తాను కాండోలో ఉంటున్నట్లు మాస్టర్ బెడ్రూమ్, క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి మహిళ కోసం వెతుకుతున్నానని అందులో చెప్పింది. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? గతంలో తాను ఫేస్బుక్ కంపెనీలో పరిచయమైన అమ్మాయితో బెడ్రూమ్ని పంచుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. సగం మంచాన్ని అద్దెకు ఇవ్వడానికి మహిళ చేసిన ప్రయత్నం ఓకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమె ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వినటానికే ఇది హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Anya Ettinger (@aserealty) -
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా?అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
గతవారం స్థిరాస్తి అద్దెకిచ్చినప్పుడు ఓనర్‌గారికి ఆ ఆదాయం ఎలా లెక్కించాలి .. మినహాయింపులేమిటి? మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. ఈసారి మీరు అద్దె చెల్లించే వారయితే .. అంటే మీరు కిరాయిదారైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన విషయాలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి తెలుసుకుందాం. ♦మీరు ఇచ్చే రెంటుకి అగ్రిమెంటు రాసుకోండి. దయచేసి రెంటును నగదు రూపంలో ఇవ్వకండి. చెక్కు ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, బదిలీ ద్వారా రెంటు ఇవ్వండి. ♦కొంత నగదు, కొంత బ్యాంకు అని ఒప్పుకోకండి. రెంటు ఇవ్వగానే రసీదు పుచ్చుకోండి. కనీసం ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారానైనా తీసుకోండి. సత్సంబంధాలు కొనసాగినన్నాళ్లూ రసీదు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ జాతివైరం సహజం. ముందుగా ఆలోచించి ఒక అలవాటుగా అనుసరించండి. ♦ప్రత్యేకించి నగదు పుస్తకం, లెడ్జర్లో పద్దులు రాయకపోయినా, ఈ వ్యవహారాలను అన్ని వివరాలతో సహా ఒక పుస్తకంలో రాయండి. ♦మీరు ఉద్యోగైనా, వ్యాపారస్తులైనా, వృత్తి నిపుణులైనా ఇలా చెల్లించే అద్దెను ఖర్చుగా భావించి, మినహాయింపు పొందాలంటే కాగితాలు కావాలి. ♦మీ ఓనర్ పాన్ నంబరు, బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని భద్రపర్చుకోండి. ♦ఇల్లు ఒకరి పేరు మీద ఉంటే మరొకరి పేరు మీద అద్దె వసూలయ్యే సందర్భాలూ ఉంటాయి. భార్యాభర్తలు, మామా అల్లుళ్లు, అన్నదమ్ములు, ఇలాంటి అతి తెలివి వారుంటారు. మీకు సంబంధం లేకపోయినా, మీరు గట్టిగా అడగలేకపోయినా.. కాగితాలు, రసీదు లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ♦194– ఐ సెక్షన్ కొన్ని బాధ్యతలను అంటకట్టింది. అదే టీడీఎస్. ♦చెల్లించే వార్షిక అద్దె రూ. 2,40,000 దాటితే ప్రతి చెల్లింపునకు టీడీఎస్ కట్ చేసి, ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖాతాలో చెల్లించి ఆ మేరకు ఫారం 16 అని మీ యజమానికి ఇవ్వాలి. ♦194– ఐ వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ♦మరో సెక్షన్ 194 ఐఆ ఉందండోయ్. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. ♦వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, ‘ట్యాక్స్ ఆడిట్’ అవసరం లేని వారు, వర్తించనివారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. ♦అద్దె నెలకి రూ. 50,000 దాటిన వారికే వర్తిస్తుంది. నెలలో కొంత వ్యవధికి అయినా వర్తిస్తుంది. ♦నెలకి రూ. 50,000 అంటున్నారు, సంవత్సరానికి అని అనడం లేదు.. మీరు వారం రోజులకు అద్దె ఇచ్చి రూ. 50,000 దాటి పుచ్చుకుంటే చాలు. ♦ఇలా అద్దె ఇచ్చేటప్పుడు పన్ను రికవరీ చేసి మిగతా మొత్తమే ఇవ్వాలి. ట్యాక్సును సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, ఆ మేరకు టీడీఎస్ సర్టిఫికెట్ 16 ఇ ద్వారా ఇవ్వాలి. ♦పన్ను వసూలు చేయకపోయినా, వసూలు చేసిన మొత్తం సకాలంలో చెల్లించకపోయినా, సకాలంలో టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా .. వడ్డీ, పెనాల్టీలు భరించాలి. ♦ఏతావతా.. రెంటు చెల్లించిన వారికి మాత్రమే టీడీఎస్ బరువు, బాధ్యతలు ఉన్నాయి. -
ఇంటిని అద్దెకిచ్చి ఆస్తులు అమ్ముకున్న ప్రముఖ కంపెనీ సీఈవో!
ఆ మధ్య ఓ వ్యక్తి రెంట్ హౌస్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు కోసం ఏకంగా తన కిడ్నీ అమ్మకానికి ఉందంటూ బెంగళూరులో ఓ పోస్టర్ అతికించిన విషయం తెలిసిందే. వాస్తవానికి తనకు బెంగళూరు ఇందిరానగర్‌లో ఓ ఇల్లు అవసరం’ అందుకే ఇళ్ల యజమానులు కనికరిస్తారేమోనని కిడ్నీ విక్రయం అంటూ పోస్టర్ అతికించి, అదే పోస్టర్లో తన వివరాల కోసం స్కాన్ చేయాలంటూ ఓ క్యూఆర్ కోడ్‌నూ ముద్రించడంతో సదరు వ్యక్తి సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారారు. దీంతో పలువురు నెటిజన్లు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తే.. ఇంటి ఓనర్లకు మానవత్వం లేదని మరికొందరు దుమ్మెత్తి పోశారు. మిగిలిన ఇంటి ఓనర్ల సంగతి ఎలా ఉన్నా..యజమానులు తమ ఇంటిని అద్దెకి ఇచ్చి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. అందుకే తమ తల్లిదండ్రులే నిదర్శనమని అంటున్నారు కార్పోరేట్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ క్యాపిటల్ మైండ్ సీఈవో దీపక్ షెనాయ్. బెంగళూరులో దీపక్ షెనాయ్ తల్లిదండ్రులు ఓ వ్యక్తికి తన ఇంటిని రెంట్‌కు ఇచ్చారు. అద్దెకు ఉన్న సదరు వ్యక్తి మొదటి నెల రెంట్ సమయానికే చెల్లించాడు. మరుసటి రోజు నెల నుంచి రెంట్ చెల్లించడం మానేశాడు. ఇదే విషయంపై షెనాయ్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందు వేరేవాళ్లను ఇలాగే వేధించారని అతడు కూడా తిరిగి మాపై కేసు పెట్టాడు. దాదాపూ 2ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మా ఇంటిని మేం దక్కించుకో గలిగాము’ అంటూ షెనాయ్ తన తల్లిదండ్రులకు జరిగిన చేదు అనుభవాల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఓ ఇంటి యజమాని కిరాయి దారుల నుంచి తన ఇంటిని కాపాడుకున్నారంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Personally went through this...Mom went to the court house for two years once every two months to evict a tenant who refused to pay rent after the first month. He also filed a case saying henchmen used just like that. Had done this with other people too. It took two years to get… https://t.co/cDTHu1DsGq — Deepak Shenoy (@deepakshenoy) July 25, 2023 ఇక, క్యాపిటల్ మైండ్ సీఈవో తన ట్వీట్లో..‘పత్రికా కథనంలోని వ్యక్తికి జరిగినట్లు నాకు ఇలాగే జరిగింది. మొదటి నెల తర్వాత అద్దె చెల్లించడానికి నిరాకరించిన అద్దెదారుని ఖాళీ చేయమని అమ్మ రెండు సంవత్సరాల పాటు పోరాడింది. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కోర్టుకు వెళ్లింది. మాఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి కూడా మాపై కేసు పెట్టాడు. కోర్టులో మా కేసు తుది ఉత్తర్వులు రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత అద్దెకు ఉన్న వ్యక్తిని ఇళ్లు ఖాళీ చేయించేందుకు మరో మూడు నెలలు పట్టింది. ఇక పోలీసుల సాయంతో ఇల్లు ఖాళీ చేయిద్దామని నిర్ణయించుకున్న చివరి రోజు మా ఇంట్లో కిరాయి దారు ఇల్లును ఖాళీ చేసి వెళ్లి పోయాడు. ఇలా తన సొంత ఇంటిని కిరాయి దారుల నుంచి దక్కించుకునేందుకు మా అమ్మ ఉన్న స్థిరాస్తులన్నీ అమ్మేసి, ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క ఇంటిలో నివసిస్తోంది. కాబట్టి ఇంటి ఓనర్లు కిరాయికి ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటిని అద్దెకి ఇచ్చి తప్పు చేయొద్దు అని కోరారు. చదవండి👉 తెగ కొంటున్నారు : రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు అధిక గిరాకీ.. ఎక్కడంటే -
ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్!
అద్దె ఇంటి కోసం మీరెప్పుడైనా ఇంటర్వ్యూ ఎదుర్కొన్నారా? అద్దె ఇంటికి ఇంటర్వ్యూ ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ ఎంట్రప్రిన్యూర్కు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వింత వింత ప్రశ్నలతో బెదరగొట్టేశాడు ఆ ఇంటి ఓనర్. బెంగళూరులో ఓ స్టార్టప్ నిర్వహిస్తున్న నీరజ్ మెంట అనే ఎంట్రప్రిన్యూర్ అద్దె ఇంటి వేటలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఇంటి ఓనర్‌తో జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియను, ఆయన అడిగిన వింత ప్రశ్నలను ట్విటర్లో షేర్ చేశారు. తాను నిధుల కోసం కూడా ఇంత కఠోరమైన ఇంటర్వ్యూను ఎదుర్కోలేదు అంటూ ఇంటి ఓనర్ ప్రశ్నల తీరును వివరించారు. ఇంటి కోసం మొదట బ్రోకర్ ద్వారా కొంత సమాచారం, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌ను పంపించాక ఆ బ్రోకర్ ఇంటి ఓనర్‌తో కాల్ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఇంటి ఓనర్ ఇంటర్వ్యూ ప్రారంభించాడు. కుటుంబ నేపథ్యం నుంచి మొదలు పెట్టి మెల్లిగా స్టార్టప్ గురించి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. బిజినెస్ మోడల్ ఏంటీ, బర్న్ రేట్, ఇన్వెస్టర్లు.. ఇలా సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగాడు. తర్వాత నీరజ్ భార్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి కూడా వివరాలు ఆరా తీశాడు. ఇలా చాలా సేపు ప్రశ్నలు అడిగిన ఆయన తన ఇంట్లో అద్దెకు ఉండేవారు మంచి వంశ వృక్షం ఉన్నవారై ఉండాలని సెలవిచ్చారు. ఇంకా కొంతమందితో మాట్లాడి ఒకటి రెండు రోజులలో ఏ విషయం చెబుతానన్నాడు. ఇదంతా విన్న నీరజ్ భార్య ‘నువ్వు నిధుల సమీకరణ కోసం వెళ్లావా?’ అని చమత్కరించిందని చెప్పుకొచ్చాడు. ట్విటర్లో ఇదంతా చదివిన పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. ఇదీ చదవండి: బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్లో ఆసక్తికర చర్చ My tenant interview was longer and more grueling than my Seed round pitch. I recently started househunting in Bangalore and one owner wanted to interview me before saying yes. A 🧵 of all the questions #bangalorehousehunt @peakbengaluru — Neeraj Menta (@neerajmnt) July 12, 2023 -
6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె!
కొన్నేళ్ల క్రితం వరకు నగరాలు, పట్టణాల్లో సామాన్యుడికి సొంత ఇల్లు అనేది కలగానే ఉండేది. కానీ కోవిడ్ -19తో పరిస్థితులు మారాయి. మహమ్మారి సమయంలో అద్దె ఇంట్లో ఉండే వారి వెతలు ఎలా ఉన్నాయో కొన్ని సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లు చూపించాయి. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా సొంతిల్లు కొనే పనిలో పడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల్లో సులభంగా లభించే ఇంటి రుణాలు సొంతింటి కలను మరింత నిజం చేశాయి. మరి అద్దె ఇంట్లో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నెలల వ్యవధిలో యజమానులు పెంచుతున్న ఇంటి అద్దెల్ని కట్టుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. తాజాగా, బెంగళూరులో 23 ఏళ్ల శామ్ సంగ్ ఉద్యోగి అర్ష్ గోయల్ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మారతహళ్లి దొడ్డనుకుంది గేటెడ్ కమ్యూనిటీ హాల్స్‌లో 3 బీహెచ్‌కే గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అద్దె నెలకు రూ.57,000. బెంగళూరు వంటి మహానగరాల్లో ఏడాదిలో 11 నెలల పాటు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఆ అపార్ట్మెంట్లో చేరిన అర్ష్ గోయల్‌కు 6 నెలల తర్వాత యజమాని పెట్టిన ఖండీషన్కు కంగుతిన్నాడు. అదేంటంటే? అద్దెకు చేరి ఆరు నెలలు పూర్తయింది కాబట్టి.. రెంటును అకస్మాత్తుగా మరో రూ.15,000 పెంచుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణయాన్ని అంగీకరించడం, లేదంటే ఇల్లును ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. అయితే, యజమానికి రెంట్ పెంచడాన్ని గోయల్ జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో బెంగళూరులో అద్దె ఇల్లు వెతుక్కోవడం, ఇంటి యజమానులు పెట్టే కండీషన్లు తలకు మించిన భారంగా మారాయి. దీంతో పెంచిన రెంట్‌ను చెల్లించేందుకు గోయల్ స్నేహితులు అంగీకరించారు. చివరికి చేసేది లేక తానుకూడా అంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సిద్ధమైన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. మళ్లీ కొత్త అపార్టెంట్ను వెతుక్కోవడం సమస్య కాబట్టి భూస్వామికి అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని గోయల్ ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. My Landlord in Bangalore increased rent by 15,000 INR within one year whereas as per agreement the increase per year should have been 5%. The only option he gave was either to leave or pay the increased rent. — Arsh Goyal (@arsh_goyal) July 8, 2023 ఇల్లు మారొచ్చుకదా.. ఓ ప్రముఖ మీడియా సంస్థ జరిపిన ఇంటర్వ్యూలో, బ్రోకర్ ద్వారా ఈ ఫ్లాట్‌ను వెతకడానికి నెలరోజుల సమయం పట్టినట్లు గోయల్ వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఉంటున్న ఫ్లాట్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ఆఫీస్ దగ్గర, పైగా రోజువారీ ప్రయాణంలో ట్రాఫిక్ బాధల నుంచి బయటపడొచ్చు. ఇప్పటికే అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారి బాధల్ని దగ్గరుండి చూసినట్లు అర్ష్ చెప్పుకొచ్చాడు. దీంతో అర్ష్ గోయల్ తరహాలో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే -
ఎలా వస్తాయ్ వీళ్లకీ ఐడియాలు! ఇంటి అద్దె ఎక్కువని.. విమానంలో జాబ్‌కు వెళ్తోంది!
ప్రజలు సొంతూళ్లను వదిలి ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. అయితే ఉద్యోగాలైతే దొరుకుతున్నాయి గానీ నివసించేందుకు సొంత ఇళ్లు అంటేనే.. అనుకున్నంత ఈజీ కాదు. సరే పోనీ అద్దె ఇంట్లో ఉంటూ బతుకు బండిని ముందుకు నడిపిద్దామని అనుకుంటే.. నగరాల్లో అద్దెలా భారం భయాన్ని పుట్టిస్తోంది. దీంతో చేసేదేమి లేక తక్కువ అద్దె చూసుకుని.. పని చేస్తున్న కంపెనీకి కిలీమీటర్ల దూరం అయినా..ట్రాఫిక్ జామ్‌లో గంటల సమయాన్ని వృథా చేసుకుంటూ జీవనాన్ని గడిపేస్తుంటాం. ఇదంతా మనకి తెలిసిన కథే.. అయితే ఓ యువతి చేసిన పనికి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అద్దె భరించలేక.. విమాన ప్రయాణం ఒక యువతి ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి మరొక రాష్ట్రానికి వెళ్ళొస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోఫియా సెలెంటానో అనే 21 ఏళ్ల యువతి న్యూజెర్సీలోని ఓగిల్వీ హెల్త్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేస్తోంది. కానీ ఆ నగరంలో అపార్ట్మెంట్ల అధిక ధర పలుకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం ఆ నగరం శివారు ప్రాంతం ఉండాలంటే కూడా.. కనీసం నెలకు 3400 డాలర్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెండునెలల తన ఇంటర్న్‌షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. అందుకని ఆమె తాను ఇంటర్న్‌షిప్ చేస్తున్న ప్రదేశం నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో తక్కువ అద్దెకు రూం తీసుకుంది. ఆఫీసుకు వారానికి ఒక రోజు కాబట్టి విమానం ప్రయాణాన్ని ఎంచుకుంది. ఎందుకంటే.. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. ఇదే నయమని తాను ఈ దారిని ఎంచుకుంది. అందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నట్లు ఆమె తెలిపింది. టిక్‌టాక్‌లో ఆమె మాట్లాడిన తర్వాత తన కథ వెలుగులోకి వచ్చింది. చదవండి: Hayden Bowles Success Story: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ! -
అద్దెకుండాలా.. ఇల్లు కొనాలా .. ఏది లాభం?
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. చివరికి తమ కలల సౌధాన్ని నెరవేర్చుకుంటారు. అయితే గత ఐదేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిపోతున్న అద్దెలు, ఇళ్ల ధరలు.. సొంతింటి కలను దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు.. ప్రాపర్టీలు, రెంట్లు ఆకాశాన్ని తాకుతున్న నగరాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ నివేదించింది. ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ‘కేపిటల్ మైండ్’ ఫౌండర్, సీఈవో దీపక్ షెనాయ్ (Deepak Shenoy) ఇంటి కొనుగోలుపై పెట్టే పెట్టుబడిని ‘భయంకరమైన పెట్టుబడి’గా అభివర్ణించారు. ఇల్లు, కారు కొనుగోలు చేయడం మంచిది కాదన్నారు. సొంత ఇల్లు కొనుగోలుతో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. సొంతంగా కారు కొనుక్కునే బదులు.. ఓలా, ఊబర్ లాంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చని అన్నారు. కానీ కొనుగోలు, అద్దె ఈ రెండూ ఎప్పటికి పోవు. ఎందుకంటే ఎక్కువ మంది దృష్టిలో ఆ రెండు ఓ విశ్వాసం లాంటివి. అందుకే చాలా మంది ఇల్లు, కార్లకు యజమానులవ్వాలని అనుకుంటారు. ఒక్కోసారి కారు కొన్నట్లు ఇల్లు కొనుగోలు చేయొచ్చా? అని ఆలోచిస్తుంటారు. మరికొందరు పెట్టుబడులతో ఇల్లు కొనుగోలు విషయంలో గందరగోళానికి గురవుతారని ట్వీట్ చేశారు. అయితే గత దశాబ్దంలో ఇళ్ల కొనుగోళ్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్ల తరహాలో ఇళ్ల కొనుగోళ్లు ఓ భయంకరమైన పెట్టుబడి. కానీ సొంత ఇల్లు ఉంటే మనకు నచ్చిన విధంగా అందంగా అలంకరించుకోవచ్చు. పాస్‌పోర్ట్‌లో పర్మినెంట్ అడ్రస్ కింద అప్లయి చేసు కోవచ్చు. రెంట్ కట్టే బాధతప్పుతుంది. అద్దె ఇల్లు కోసం మీడియేటర్లతో సంప్రదింపులు జరిపే అవసరం ఉండదనే భావనలో ఉంటారని.. కానీ సొంత ఇల్లు కొనుగోలు చేయడం సమర్ధించే పెట్టుబడి కాదని అన్నారు దీపక్ షెనాయ్. ప్రస్తుతం దీపక్ షెనాయ్ వ్యక్తం చేసిన ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలకు దూరం చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి👉 ఆర్బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా? -
బాపట్ల జిల్లా కేంద్రంలో అద్దెల దరవు..!
సాక్షి, బాపట్ల: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఫలితంగా బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావడంతో రాష్ట్ర చిత్రపటంలో ప్రత్యేకత స్థానం ఏర్పడింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బాపట్ల జిల్లా కేంద్రం కావడం.. జిల్లా స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అధికార యంత్రాంగం, ఉద్యోగులు రావడంతో నివాస గృహాలకు డిమాండ్ ఏర్పడింది. అద్దె ఇళ్ల కోసం అందరూ ఒకేసారి రావడంతో యజమానులు సైతం అద్దెలు ఆకాశానికి పెంచేశారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో... బాపట్ల పురపాలక సంఘ పరిధిలో దాదాపు లక్షకు పైగా జనాభా, దాదాపు 30 వేల వరకు నివాస గృహాలు, 2 వేల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.. భౌగోళికంగా 7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. చిన్న పట్టణ స్థాయికే పరిమితమైన బాపట్లను జిల్లా కేంద్రం చేయడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే పరిపాలన సాగిస్తున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కొత్తగా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన జనాభా అవసరాల మేర నివాస గృహాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. బదిలీలతోపాటు, ఇతరత్రా కారణాల వలన నివాస గృహలు ఖాళీ అయి ఇల్లు అద్దె బోర్డు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. వారి అవసరాలను గుర్తించిన ఇంటి యజమానులు మాత్రం అద్దెలను రెండింతలు చేసి డిమాండ్ సృష్టించారు. గతంతో పోలిస్తే... గతంలో బాపట్ల జిల్లా కేంద్రం కాకముందు సింగిల్ బెడ్రూం సదుపాయం ఉన్న నివాస గృహం అద్దె రూ.4 వేలకే దొరికేది.. అలాగే డబుల్ బెడ్రూం సదుపాయాలు ఉన్న నివాస గృహం అయితే నెల అద్దె రూ.7 వరకు ఉండేది.. అందులో పాత బడిన నివాసాలు, నిర్మించిన భవనాలకు అద్దెలు మార్పు ఉండేది.. ప్రస్తుతం గృహాలు అవే అయినా అద్దెల్లో మాత్రం మార్పు ఉంది. సింగిల్ బెడ్రూం గృహానికి రూ.7వేలు పైగా అద్దె చెబుతుండగా, డబుల్బెడ్రూం గృహానికి రూ.12 వేల వరకు అద్దె నిర్ణయించి యజమానులు చెబుతున్నారు. దీంతో అమాంతంగా పెరిగిన ఇంటి అద్దెలతో చిరుద్యోగులు హడలిపోతున్నారు. అధికారులు, ఉద్యోగులు వారి కొచ్చే నెలజీతం బట్టి నివాస గృహాలను ఎంపిక చేసుకుంటారు. నెలవారీ జీతం ఇంటి అద్దె నుంచి ఇతరత్రా కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వ్యక్తగత అవసరాలు అన్నింటిని ఆ నెల జీతంతోనే సర్దుకుపోవాలి. దీంతో జీతాన్ని బట్టి నివాస గృహాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చిరుద్యోగులు మాత్రం బాపట్లలో పెరిగిన అద్దెలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెకే వేలాది రూపాయలు వెచ్చిస్తే తమ కుటుంబ అవసరాలు ఏలా తీర్చుకోవాలని మదనపడుతున్నారు. దీంతో చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నూతన జిల్లా కావడం పరిపాలన ప్రక్రియ వేగవంతం కాలేదు. మరికొన్ని రోజుల్లో పాలన పరమైన ప్రక్రియ వేగవంతమైతే ఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకాశానంటుతున్న అద్దెల భారంతో ఆందోళన చెందుతున్నారు. అద్దెలు చెల్లించడం భారంగా ఉంది బాపట్లలో జిల్లా ఏర్పాటుకు ముందు ఇంటి అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న గృహాల యజమానులు ఒక్కసారిగా ఇంటి అద్దెలను అమాంతం పెంచేశారు. గతంలో రూ. 3500 నుంచి 4000 వరకు అద్దె చెల్లిస్తే బాపట్లలో డబల్‌బెడ్‌రూమ్ కలిగిన గృహం అద్దెకు లభించేది ప్రస్తుతం డబుల్ బెడ్రూం అద్దెకు కావాలంటే రూ. 7500 నుంచి 10 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికారులు స్పందించి అద్దె నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సీహెచ్ జనార్ధన్‌రావు, బాపట్ల -
కొండగట్టు అద్దె గదుల్లో వ్యభిచారం... ముగ్గురి అరెస్టు!!
కొండగట్టు/మల్యాల(చొప్పదండి): కొండగట్టు దిగువన ఉన్న శ్రీ వీరాంజనేయ అద్దె గదుల్లో మంగళవారం మల్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు పట్టుబడినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బాధిత మహిళ కాకుండా గదుల నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌తోపాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. (చదవండి: కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి అరెస్ట్) -
ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా.. ఇద్దరు అరెస్టు
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్ సోఫియా (50) నెల రోజుల క్రితం బౌద్ధనగర్‌లోని కమ్యూనిటీహాల్ గల్లీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావునగర్ ఏషియన్ వైన్స్‌లో పనిచేస్తున్న అప్పుల అనీల్ (26) సాయంతో అమ్మాయిలు, ఆంటీలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వ్యభిచార గృహంపై దాడి చేసి ఓయువతి (23)కి విముక్తి కల్పించి, నిర్వాహకులు రేచల్ సోఫియా, అనీల్‌తోపాటు అత్తాపూర్‌కు చెందిన విటుడు శ్రీశైలం (40)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు చెందిన మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ నరేష్ తెలిపారు. చదవండి: అమ్మాయితో పరిచయం.. ప్రేమ.. పండుగకు ఇంటికి వచ్చి.. -
మీ ఇల్లు నచ్చింది.. అద్దెకు ఉంటానంటూ ఫోన్ పే లింకు పంపి..
సాక్షి, హిమాయత్‌నగర్: ఆర్మీ అధికారినని చెప్పి ఓ వ్యక్తి తన అకౌంట్ నుంచి డబ్బులు కాజేశాడంటూ వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ మహిళ సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటిని రూ.10 వేలకు అద్దెకు ఇస్తున్నట్లు ఓఎల్ఎక్స్, మ్యాజిక్బ్రిక్స్లో యాడ్ పోస్ట్ చేశామన్నారు. ఇది చూసిన ఓ వ్యక్తి తాను ఆర్మీ అధికారినని, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వస్తున్నట్లు చెప్పాడు. మీ ఇల్లు నచ్చింది మీకు ఫోన్ పే లింకు పంపుతున్నాను యాక్సెప్ట్ చేస్తే ముందుగానే డబ్బులు ఇస్తానని నమ్మించి, లింకు పంపాడు. లింకును ఓపెన్ చేశాక తన అకౌంట్లో ఉన్న రూ.లక్షా 95వేలు కాజేసినట్లు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ కరెన్సీతో పట్టుబడ్డ మహిళ శంషాబాద్: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని శంషాబాద్ విమానాశ్రయలో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈకే–275 విమానంలో అబుదాబి వెళ్లడానికి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి లగేజీని సాధారణ తనిఖీల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ అధికారులు పరిశీలించారు. అందులో 50,500 సౌదీ రియాల్స్ (భారత కరెన్సీ విలువలో రూ.9.77 లక్షలు) బయటపడ్డాయి. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు మహిళను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు
చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు నగరాలకు వచ్చే అమ్మాయిలు, మహిళలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఒంటరి మహిళలు, పెళ్లికాని అమ్మాయిలకు ఇళ్లు ఇవ్వమంటూ అపార్ట్మెంట్ సొసైటీలు విద్యార్థినులు, లేడీ ఎంప్లాయిస్‌ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేవలం అమ్మాయిలు ధరించే దుస్తులు సరిగా లేవన్న కారణంతో ఈ దారుణానికి అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు తెగబడుతున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇంత కాలం ఇళ్లకే పరిమితమై వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఉన్నత విద్య కోసం గ్రామాలను వదిలిన విద్యార్థినులు నగరాల బాట పడుతున్నారు. అయితే ఇలా వస్తున్న మహిళల పట్ల కొందరు ఛాందసవాదులు పెడుతున్న రూల్స్ ఇబ్బందికరంగా మారుతున్నాయి. అహ్మదాబాద్‌లో వ్యాపార వాణిజ్య రంగాల్లో మెట్రో నగరాల సరసన చేరేందుకు వడివడిగా అడుగులు వస్తోంది అహ్మదాబాద్. ఈ నగరంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థల కార్పొరేట్ ఆఫీసులు, జాతీయస్థాయి విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ పని చేసేందుకు, చదువుకునేందుకు గుజరాత్ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చాలా మంది అహ్మదాబాద్ చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా, ఇళ్లలో, అపార్ట్మెంట్లలో అద్దెకు ఉంటున్నారు. నిన్నామొన్నటి వరకు ఇలా ఉండే వారికి ఏ ఇబ్బందులు లేవు, కానీ తాజాగా అమ్మాయిలు, మహిళలను టార్గెట్‌గా చేసుకుని కొత్త రూల్స్ పెడుతున్నారు. అమ్మాయిలకు ఇవ్వం అహ్మదాబాద్‌లో గత కొద్ది కాలంగా చాపకింద నీరులా కొత్త రకం ప్రచారం తెరపైకి తెచ్చారు. పెళ్లైన జంటలకే ఇళ్లు అద్దెకు ఇవ్వాలి తప్పితే సింగిల్‌గా ఉండే అమ్మాయిలు, మహిళలకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దంటూ ప్రచారం ప్రారంభించారు. కనీసం పెయింగ్ గెస్టులుగా కూడా ఇళ్లలో ఉండనివ్వరాదంటూ హుకుం జారీ చేస్తున్నారు. చాలా మంది మౌనంగా ఈ ఇబ్బందులు పడుతున్నారు. కాదని ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఘటన అహ్మాదాబాద్ మిర్రర్లో ప్రచురితమైంది, దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బౌన్సర్లతో దాడులు అహ్మదాబాద్‌లోని వైష్ణోదేవీ ఏరియా సమీపంలో ఉన్న రత్నా పారడైజ్ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు మహిళల పట్ల కఠిన ఆంక్షల విషయంలో మరింతగా దిగజారారు. తమ అపార్ట్మెంటులో ఉంటున్న నిర్మా యూనివర్సిటీ విద్యార్థినులను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ ఆగస్టు 27న ఆదేశించారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో బౌన్సర్లతో బెదిరించారు. కాలేజీ నుంచి అపార్ట్మెంట్కి వచ్చిన స్టూడెంట్స్‌ని గేటు దగ్గరే గంటల తరబడి నిలబెట్టారు. వర్షంలో తడుస్తున్నా లోనికి రానివ్వలేదు. పోలీస్ స్టేషన్లో అదే తీరు సోసైటీ సభ్యుల వేధింపులను ఆ విద్యార్థినులు ప్లాట్ యజామాని యోగేష్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. సోసైటీ సభ్యుల తీరుని ప్లాట్ యజమాని ఖండించగా మరుసటి రోజు బౌన్సర్లు అతనిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీ ఆఫీసులో జరిగిన ఘటనపై అతను ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఆగస్టు 29న యోగేష్ పటేల్‌కి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది. అతనిపై నాలుగు ఫిర్యాదు వచ్చాయని, వాటిపై విచారణ చేయాలంటూ.. యోగేష్ పటేల్‌తో పాటు అతని భార్యా పిల్లలను ఆ రోజంతా స్టేషన్లోనే ఉంచారు. చివరకు సొసైటీపై రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. మమ్మల్నీ ఇబ్బంది పెట్టేందుకే మా సొసైటీలో బ్యాచ్‌లర్స్‌కి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని ముందే చెప్పాం. కానీ యోగేష్ పటేల్ ఆ నిబంధన ఉల్లంఘించాడు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మరో సొసైటీ మెంబర్ కరణ్ కియాని అంటున్నారు. వాళ్ల దుస్తులు బాగాలేవు నిర్మా యూనివర్సిటీ విద్యార్థులతో మాకు ఏ సమస్యా లేదు. అయితే అప్పుడప్పుడు వారు ధరించే దుస్తులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి దుస్తులతో వారు అపార్ట్మెంట్లో తిరగడం మాకు ఇబ్బందిగా ఉంటోంది. అందుకే ఖాళీ చేయమని కోరుతున్నాం అంటూ అరుణ్ జోషి అనే సొసైటీ మెంబర్ మీడియాకు తెలిపారు. ఇంకెక్కడ భద్రత రత్నా సొసైటీలోని ప్లాట్స్‌లో నేను అమ్మాయితో పాటే ఉంటున్నాను. తనకు కాలేజీకి వెళ్లడం, ఇంటికి వచ్చి చదువుకోవడం తప్ప మరో ధ్యాసే ఉండదు. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని ప్లాటఠ్ ఖాళీ చేయమనడం ఎంత వరకు సబబు. ఫుల్ సెక్యూరిటీ ఉండే అపార్ట్మెంట్లోనే మాకు రక్షణ లేకుండా ఇంకా ఎక్కడ దొరకుతుంది అంటూ బాధిత విద్యార్థినుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. డీజీపీకి చేరిన పంచాయతీ తమను ఇళ్లు ఖాళీ చేయించేందుకు పారడైజ్ అపార్ట్మెంట్ సొసైటీ బలవంతం చేయడంపై బాధిత విద్యార్థినులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిర్మా యూనివర్సిటీలో విద్యార్థులు అందరికీ సరిపడ వసతి లేదని, అందువల్లే తాము బయట ప్లాట్‌లో ఉంటూ చదువుకుంటున్నామని వివరించారు. ఇప్పుడు బలవంతంగా తమను ప్లాట్ ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. తమను బెదిరించిన బౌన్సర్లు, ఇబ్బంది పెడుతున్న సొసైటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రియల్టర్ల ఆందోళన పెద్ద నగరాల్లో అపార్ట్మెంట్ల అద్దె అనేది ఎంతో ముఖ్యమైన బిజినెస్ అని.. కేవలం పెళ్లైన వారికే వాటిని అద్దెకు ఇవ్వాలంటూ నిబంధనలు పెడితే ఇళ్ల అమ్మకాలు పడిపోతాయని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఇండిపెండెంట్‌గా పని చేస్తున్న యువతులు అహ్మాదాబాద్‌కు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని చెబుతున్నారు. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి -
అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు
సాక్షి, ఒంగోలు: అద్దె ఇంటికోసం వెతుకుతున్నామని, మీ ప్లాట్ ఎదురుగా ఉన్న ఇల్లు అద్దెకు తీసుకుందామని వచ్చామంటూ ముగ్గురు వ్యక్తులు మహిళను బంధించి 12 సవర్ల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ సంఘటన పెళ్లూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు యువకులు, 40 ఏళ్ల వయసున్న మహిళ పెళ్లూరులోని సాయి రిట్రీట్ అనే అపార్టుమెంట్ మూడో ఫ్లోర్లో 302 నంబర్ ప్లాట్‌లో నివాసముంటున్న శిఖాకొల్లి లక్ష్మీ తాయారు వద్దకు వచ్చి ఎదురింటి ప్లాట్‌ను అద్దెకు తీసుకోవాలని వచ్చామని, మంచినీళ్లు ఇవ్వరా అని కోరారు. దీంతో ఆమె వంట ఇంట్లోకి వెళ్లగానే ముగ్గురు వ్యక్తులు హాల్లోకి వచ్చి మాటల్లో బెట్టి ఆమెను బెదిరించి శరీరంపై ఉన్న బంగారు గాజులు 4 (ఆరు సవర్లు), 5 సవర్ల బంగారు చైను, ఒక సవర కమ్మలు మొత్తం వెరసి 12 సవర్లు దోచుకున్నారు. అనంతరం ఆమెను హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే మహిళ భయపడి ఎవరికి చెప్పేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
లగ్జరీగా ఇళ్ల అద్దెలు.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో లగ్జరీ ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కోవిడ్ కలకలం నేపథ్యంలో వందలాది ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో.. భారీగా వేతనాలు అందుకుంటున్న ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాలకు చెందిన ఉన్నతోద్యోగులు, టీమ్‌లీడర్లు, సీఈఓలు, కార్పొరేట్లు లగ్జరీ ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వీరిలో ఇప్పటికే చాలా మంది భారీగా అద్దెలు చెల్లించి విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో వెల్లడించింది. ఈప్రాంతంలో 2014తో పోలిస్తే ప్రస్తుతం అద్దెల విషయంలో సుమారు 26 శాతం మేర పెరుగుదల నమోదైందని తెలిపింది. ఇక లగ్జరీ ఇళ్ల సెగ్మెంట్లో భారీగా అద్దెలు వసూలు చేస్తున్న నగరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ తరవాత స్థానంలో నిలిచిన బెంగళూరులో 24 శాతం..ఆతరవాత నిలిచిన చెన్నై, కోల్‌కతా నగరాల్లో 19 శాతం అద్దెల్లో పెరుగుదల నమోదైనట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అద్దెల భూమ్‌కు కారణాలివే.. ► కోవిడ్ కలకలకం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు పరిమితమవడం. ►ఇల్లునే ఆఫీసుగా మార్చుకునేందుకు పలువురు లగ్జరీ ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిచూపడంతోపాటు..ఇంట్లో సువిశాల ప్రాంగణాన్ని ఆఫీసు కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ► నగరంలో ఐటీ కారిడార్ కాస్మొపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్‌గా నిలవడంతోపాటు విద్య,వైద్య,మౌలికవసతులు అందుబాటులో ఉండడంతో చాలా మంది ఈప్రాంతంలో అద్దెకుండేందుకు ఇష్టపడడం. ► బహుళజాతి కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఐటీ కారిడార్ చిరునామాగా మారడం. సమీప భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు ఈప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలుండడం. ► పలు ఐటీ, బీపీఓ, కెపిఓ సంస్థలు తమ సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులకు లగ్జరీ ఇళ్లలో వసతి సదుపాయం ఏర్పాటుచేయడం. మెట్రోనగరం ప్రాంతం ఇళ్ల అద్దెల్లో పెరుగుదల శాతం హైదరాబాద్ ఐటీకారిడార్ 26 బెంగళూరు జేపినగర్ 24 చెన్నై కొట్టుపురం 19 కోల్‌కతా అలీపూర్ 19 -
నిమ్మగడ్డ ఇంటి అద్దెపై లోకాయుక్తలో ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్‌లో నివాసముంటూ ప్రతి నెలా ఇంటి అద్దె పొందుతున్న అంశంపై లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేసినట్టు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాసగౌడ్ సోమవారం తెలిపారు. గతంలో ఇదే అంశంపై ఫోరం ప్రతినిధులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ) స్వతంత్ర సర్పంచ్ పైనా ‘పచ్చ’మార్కు! -
మరింత అద్దె కావాలా..?
ఇంటి విలువతోపోలిస్తే అద్దె రూపంలో వచ్చే ఆదాయం చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే, సొంత నివాసం కోసం కాకుండా అద్దెకు ఇచ్చే ఇంటి విషయంలో ఆదాయం గురించి యజమానులు చాలా సందర్భాల్లో పునరాలోచన చేస్తుంటారు. మరింత అద్దె ఆదాయం కావాలని ఉంటుంది. కానీ, మార్గమేంటో పాలుపోదు. అయితే, నిజంగా అద్దెఆదాయం పెంచుకోవాలని అభిలషించే వారి ముందు నేడు పలు మార్గాలున్నాయి. వీటి గురించితెలియజేసేకథనమేఇది. దేశీయ రెసిడెన్షియల్ భవనాల మార్కెట్లో అద్దె రాబడులు అన్నవి ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అద్దె రాబడి సగటున 2–3 శాతంగా ఉంది. అంటే రూ.50 లక్షల విలువ కలిగిన ఇంటిపై వచ్చే అద్దె ఆదాయం మహా అయితే రూ.9,000–12,000 మధ్య ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో కోలివింగ్, పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం అనే కొత్త నమూనాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఆశ్రయించడం వల్ల యజమానులకు కాస్త అధిక రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంది. ‘‘నూతన నమూనాల్లో ముఖ్యంగా కోలివింగ్ రూపంలో అద్దె రాబడి 8 శాతం (ఇంటి విలువపై) వరకు వచ్చే అవకాశం ఉంది. నేరుగా అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే 3 శాతం కంటే ఎంతో ఎక్కువ’’ అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. మరింత అద్దె ఆదాయం కోరుకునే వారికి ఈ నమూనాలు ఉపకరిస్తాయి. అయితే, ఈ రెండు నమూనాల్లోనూ వాటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి ద్వారా ఇళ్ల యజమానులు అందరూ అధిక ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పలేం. ఎందుకంటే పర్యాటకులకు అద్దెకు ఇచ్చే నమూనా కింద అధిక ఆదాయం కోరుకునే వారు... వారి ఇల్లు ఏ ప్రాంతంలో ఉన్నదీ కీలక పాత్ర పోషిస్తుంది. పట్టణానికి మధ్య భాగంలో ఉందా లేక పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉందా అని చూడాల్సి ఉంటుంది. ‘‘కో లివింగ్ నమూనాలో ఇంటి విస్తీర్ణం పెద్దగా ఉండాలి. మొత్తం ఇంట్లో కనీసం 50–60 గదులు అయినా ఉండాలి’’ అని బెంగళూరుకు చెందిన కోలివ్ సంస్థ సీఈవో సురేష్ రంగరాజ పేర్కొన్నారు. ఇల్లు ఎక్కడ ఉంది, ఏ తరహా ప్రాపర్టీ అనే అంశాల ఆధారంగా ఇంటి యజమాని కోలివింగ్, పర్యాటకులకు అద్దెకు ఇవ్వడంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అలాగే, రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్ర, పెట్టుబడి వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 50 శాతం అధికంగా... కో లివింగ్ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ఇంటి యజమాని తన అద్దె ఆదాయాన్ని 50 శాతం, లేదా అంతకుమించి పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ‘‘కో లివింగ్ విభాగంలో కంపెనీలు విడి భవనాలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకుంటే వీటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవడం సులభం. ఐటీ పార్క్‌లు, వ్యాపార కేంద్రాలు, కార్యాలయ సముదాయాలకు సమీప ప్రాంతాల్లోని భవనాలకు ఎక్కువ ఆసక్తి చూపుతాయి. రిస్క్ తీసుకోని యజమానులు అయితే కో లివింగ్‌లో స్థిరమైన అద్దె విధానాన్ని ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకునే వారు అధిక ఆదాయం కోసం ఆదాయ పంపిణీ (వచ్చిన ఆదాయంలో కంపెనీకి, యజమానికి ఇంతని వాటా)విధానాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇంటి యజమానులతో కో లివింగ్ ప్లాట్‌ఫామ్‌లు 10 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటుంటాయి. నిర్వహణ, పోలీసుల ద్రువీకరణ, అద్దెకు ఉండే వారితో లావాదేవీల వ్యవహారాలన్నీ కంపెనీలే చూసుకుంటాయి. ఇంటి యజమానిపై ప్రత్యేక బాధ్యతలు ఏమీ ఉండవు. పర్యాటకులకు అద్దెకిచ్చేట్టు అయితే... ఎయిర్బీఎ బీ, ఓయో ప్లాట్‌ఫామ్‌లు అయితే ఇంటి యజమానులు తమ ప్రాపర్టీలను స్వల్ప కాలం పాటు అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వల్పకాలం పాటు విడిది చేసే పర్యాటకులకు ఈ సంస్థలు.. అద్దెకు ఇచ్చుకునే వేదికగా నిలుస్తున్నాయి. ప్రాంతం లేదా ఇంటి విస్తీర్ణం విషయంలో ఈ విధానంలో నియంత్రణలు ఉండవు. ఒక గదిని కూడా అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఎయిర్బీఎ¯Œ బీ వంటి సంస్థలు ఆదాయంలో ఇంటి యజమానికి ఎక్కువ వాటా ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కాకపోతే, ఇంటి యజమాని పాత్ర ఎక్కువ ఉండాలి. తమ ఇంటిని మార్కెటింగ్ చేయడం, సందర్శకుల అవసరాలకు తగినట్టుగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. మీనాక్షి దహియా ఎయిర్బీఎ¯Œ బీకి సూపర్ హోస్ట్‌గా ఉన్నారు. ఎక్కువ మంది టాప్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఆమెకు ఈ హోదా లభించింది. ఆమెకు మూడు ప్రాంతాల్లోని ఇళ్లలో మొత్తం 55 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ఆమె అంతకు ముందుతో పోలిస్తే 140 శాతం అధికంగా ఆదాయం పొందుతున్నట్టు స్వయంగా తెలిపారు. ‘‘ఎయిర్బీఎ¯Œ బీలో ప్రొఫైల్ నిర్మించుకునేందుకు సమయం తీసుకుంటుంది. కానీ, సందర్శకులు ఆతిథ్యం ఇచ్చిన వారికి అధిక రేటింగ్ ఇవ్వడం మొదలైతే వ్యాపారం వృద్ధి చెందుతుంది. సందర్శకుల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా నా ఇంటిలో మార్పులు చేస్తుంటాను’’ అని దహియా తెలిపారు. ఎయిర్బీఎ¯Œ బీ ప్రతీ బుకింగ్‌పై చెల్లించే మొత్తం నుంచి 3 శాతాన్ని చార్జ్‌గా వసూలు చేస్తోంది. పేయింగ్ గెస్ట్‌కు అయితే... రెండు లేదా మూడు పడకల ఇల్లు కలిగిన వారు ఆదాయం పెంచుకునేందుకు వారి ముందున్న మార్గం దాన్ని పేయింగ్ గెస్ట్ అకామడేష¯Œ (పీజీ)గా మార్చుకోవడం. ‘‘3బీహెచ్‌కే ఫ్లాట్‌ను విడిగా ఓ కుటుంబానికి అద్దెకు ఇస్తే మహా అయితే రూ.16,000–17,000కు మించి రాదు. అదే ఆరుగురు వ్యక్తులకు పీజీ కింద ఇస్తే, ఒక్కొక్కరి నుంచి రూ.6,000 చొప్పున రూ.36,000 ఆదాయం వస్తుంది’’ అని చెన్నైకి చెందిన ఉమాసుబ్రమణియం తెలిపారు. అయితే పీజీ కింద మార్చాలనుకుంటే ఇంటి యజమాని కొన్ని చట్టపరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, పీజీలో ఒక ఆక్యుపెన్సీ బయటకు వెళితే, మరొకరు వచ్చే వరకు అంతమేర అద్దె ఆదాయానికి గండి పడుతుంది. అద్దెకు ఇస్తే... నేరుగా ఓ కుటుంబానికి అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఆదాయం స్థిరంగా ఉంటుంది. అద్దెకుండే వారిపై యజమానికి పూర్తి నియంత్రణా ఉంటుంది. అయితే, ఇంటికి కొన్ని మార్పులు చేయడం ద్వారా కాస్త అదనపు ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణుల సూచన. ‘‘ఫర్నిషింగ్స్పై ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం కప్‌బోర్డులు, మాడ్యులర్ కిచెన్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. కొంచెం అద్దె పెంచి అయినా సరే అడ్వాస డిపాజిట్‌ను తగ్గించుకునేందుకు ముందుకు రావాలి. తక్కువ డిపాజిట్ కారణంగా సులభంగా కిరాయిదారులు ముందుకు వస్తారు’’ అని నోబ్రోకర్ డాట్ కామ్ సీఈవో అమిత్ అగర్వాల్ సూచించారు. ఫర్నిషింగ్స్ సమకూర్చి అద్దెకు ఇవ్వడం వల్ల 25 శాతం వరకూ అదనపు అద్దె లభించవచ్చు. యువ జంటలు, బ్రహ్మచారులు ఇంట్లో ఫర్నిషింగ్స్పై ఇన్వెస్ట్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరని, అటువంటి వారికి ఇంటి యజమానులే వాటిని సమకూర్చి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నది సూచన. -
ఇల్లు చూస్తానని వచ్చి..
నాగోలు: అద్దెకు ఇల్లు కావాలని వచ్చి ఇంటి యజమానురాలికి చెందిన నల్లపూసల దండ, బంగారు ఉంగరం ఎత్తుకెళ్లిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. డీఐ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట నందనవనం కాలనీకి చెందిన ఆంజనేయులు కార్ షోరూంలో పని చేసేవాడు. అతని బార్య వైష్ణవి అలియాస్ హబీబ గృహిణి. జీతం సరిపోకపోవడంతో వైష్ణవి చోరీలకు పాల్పడుతోంది. ఈ నెల 12న ఇద్దరూ కలిసి బైక్‌పై తిరుగుతూ న్యూ శివపురి కాలనీలో టులెట్ బోర్డు ఉన్న బిల్లపట్టి నర్సింహారెడ్డి ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నర్సింహారెడ్డి భార్యను కలిసి ఇల్లు అద్దెకు కావాలని పోర్షన్ చూపించాలని కోరారు. ఆమె వారికి ఇంటిని చూపిస్తుండగా వైష్ణవి దృష్టి వంటగదిలో అలమరాలో ఉన్న నల్లపూసల దండ, బంగారు ఉంగరంపై పడింది. బయటికి వెళ్లిన కొద్ది నిమిషాల్లో తిరిగి వచ్చిన వైష్ణవి యజమానురాలితో కిచెన్ చూస్తానని చెప్పి లోపలికి వెళ్లి నల్లపూసల దండ, బంగారు ఉంగరం ఎత్తుకెళ్లింది. మరుసటి రోజులు నగలు కనిపించకపోవడంతో నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల వాహనాన్ని గుర్తించి ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా వైష్ణవిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్ట్ చేసి నల్లపూసలదండ, ఉంగరం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. జేబు దొంగ అరెస్ట్ నాగోలు: జేబు దొంగను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు అతడి నుంచి సెల్‌ఫోన్, రూ. 6 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక త్రిమూర్తి కాలనీకి చెందిన విజయ్ అలియాస్ జమ్ములు( ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు జేబు దొంగతనాలకు పాల్పడేవాడు. గతంలో సెల్‌ఫోన్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై జీడిమెట్ల, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. బుధవారం రాత్రి ఎల్బీనగర్లో అనుమానాస్పదంగా కనిపించిన విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి సెల్‌ఫోన్, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
కోర్టులో హీరోకు చుక్కెదురు
యశవంతపుర: అద్దె ఇవ్వకూండా ఇంటి యజమానిని బెదిరించారనే అరోపణలు ఎదుర్కొంటున్న నటుడు యశ్‌కు కోర్టులో చుక్కెదురైంది.మూడు నెలల్లో అద్దె ఇంటిని ఖాళీ చేయాలని బెంగళూరు నగరంలోని 42వ సిటీ సివిల్ కోర్టు మంగళవారం అదేశించింది. 2010 నుంచి కత్రిగుప్పకు చెందిన మునిప్రసాద్ ఇంటిని నటుడు యశ్ అద్దెకు తీసుకున్నాడు. మొదట సక్రమంగా బాడుగను ఇచ్చేవారని, తర్వాత నిర్లక్ష్యం చేయడంతోపాటు ఇంటి యజమానిని బెదిరించారనే ఆరోపణలున్నాయి. ఇంటిని ఖాళీ చేయాలని సూచిస్తే బెదిరంచినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అనేక సార్లు ఇరువురి మధ్య ఘర్సణ కూడా జరిగాయి. మునిప్రసాద్ ఫిర్యాదు మేరకు గిరినగర పోలీసులు యశ్, అతడి తల్లి పుష్పలపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. 2010 నుంచి బకాయి ఉన్న రూ. 9 లక్షల 60 వేలు చెల్లించాలని, మూడు నెలల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
మా ఇంట్లో ఉందువు..రా అమ్మా!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్.. సోమవారం ఉదయం ప్రజావాణిలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇంతలో బండ్లగేరిలోని అద్దె ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు ఆర్.సోనాబాయి నడవలేక నడవలేక అతి కష్టంగా కర్ర సాయంతో వచ్చింది.. ఆమెను చూడగానే కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి విషయమేమిటని ఆరా తీశారు.. ‘కొన్నేళ్లుగా నేను, నా కొడుకు ఉంటున్న కిరాయి ఇంటి నుంచి ఖాళీ చేయాలని యజమాని చెబుతున్నారు.. ఇప్పటికప్పుడు ఖాళీ చేసి ఎక్కడికెళ్తాం బిడ్డా.. కొంచెం సమయం ఇవ్వమని నువ్వైనా చెప్పు’ అంటూ వేడుకుంది. దీంతో చలించిపోయిన కలెక్టర్.. ‘మా ఇంట్లో ఉందువు రా... అమ్మా... నీ కెలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ నేను చూసుకుంటాను’ అని చెప్పాడు. అయితే, ఆ వృద్ధురాలు మాత్రం ‘నీకెందుకు కష్టం బిడ్డా.. కొన్నిరోజులు ఆ ఇంట్లోనే ఉండేలా యజమానికి చెప్పు’ అని కోరగా.. కలెక్టర్ వెంటనే సోనాబాయికి కొంత గడువు ఇచ్చేలా యజమానితో మాట్లాడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో ఆమె ‘నువ్వు సల్లంగా ఉండు బిడ్డా’ అంటూ ఆనందంగా వెనుతిరిగింది. -
హతవిధీ.. ఏమిటీ దుస్థితి
రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకొచ్చేందుకు ఒప్పుకోని యజమాని రోడ్డే దిక్కయిన వైనం.. కొత్తపల్లి(జమ్మికుంట రూరల్) : సొంత ఇల్లు లేని పేదవాడు మరణిస్తే ఎన్ని కష్టాలో.. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబీకులు ఓ వైపు దుక్కిస్తుంటే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక బంధువులు సతమతమైన హృదయ విచారకర ఘటన ఇది. చనిపోయినందుకు బాధపడాలో, ఆశ్రయం కోసం వెతకాలో తెలియక ఆ కుటుంబం పడిన వేధన గ్రామస్తులను కలిచి వేసింది. చివరికి ఆ శవానికి రోడ్డే దిక్కయింది. కెనాల్ రోడ్డుపై శవాన్ని ఉంచి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితికి సంబంధించిన వివరాలివి. కర్ణాటక రాష్ట్రంలోని శివమోగం జిల్లా శికారిపూర్ తాలూకా నలవాల్ గ్రామానికి చెందిన హమాలీ కుమార్(36) జీవనోపాధి కోసం 20 యేళ్ల క్రితం జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చాడు. ఇక్కడే వివాహం చేసుకున్నాడు. కుమార్ స్థానిక కూరగాయల మార్కెట్లో 12 యేళ్లుగా హమాలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కూరగాయలు తీసుకువచ్చేందుకు ఆదివారం టాటా ఏస్‌లో వెళ్తుండగా యాదగిరిగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. కుమార్ మృతి వార్త విని కుటుంబీకులు కుప్పకూలారు. బంధువులంతా శోక సంద్రంలో మునిగారు. శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని కొత్తపల్లికి తీసుకువచ్చారు. అయితే మృతుడిది అద్దె ఇల్లు కావడంతో యజమాని శవాన్ని ఇంటి ముందు ఉంచడానికి నిరాకరించాడు. ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో కొత్తపల్లి శివారు ఎస్సారెస్పీ ఉప కాలువ రహదారిపై టెంట్ వేసి శవాన్ని బంధువుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య లత, కుమారుడు శివశంకర్, కూతురు చంద్రకళ ఉన్నారు. ఇలా ఎందరో... సొంత ఇల్లు లేక మృతుల అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించేందుకు అష్టకష్టాల పాలైన వారి సంఖ్య అధికంగానే ఉంది. గతంలోనూ సొంత గూడు లేని నిరుపేదలు మృతి చెందగా కర్మలను వారి కుటుంబసభ్యులు చెట్లు, గుట్టల్లో నిర్వహించుకొన్న సంఘటనలు కోకొల్లలు. ఇటీవల స్వర్ణ కారుడు అనారోగ్యంతో, ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందిన ఘటనల్లోనూ శవాన్ని ఎక్కడికి తరలించాలనే తెలియక రోడ్డుపైనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మిగతా కర్మలకు పాడుబడ్డ ప్రభుత్వ భవనాలు, ఊరు చివర మైదానాల్లో నిర్వహించుకోవాల్సిన దౌర్భగ్య పరిస్థితి. ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న తరహాలోనే ఇల్లు లేని పేదల కోసం ధర్మశాలలు ఏర్పాటు చేసి కర్మకాండలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
విద్యార్థులమని చెప్పి గది అద్దెకు తీసుకొని..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో సోమవారం భద్రతా బలగాల దాడుల్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వారం రోజుల క్రితమే ఉగ్రవాదులిద్దరు.. విద్యార్థులమంటూ తప్పుడు సమాచారం ఇచ్చి శ్రీనగర్‌లోని సరాయ్ బాలా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వితంతువైన ఆ ఇంటి యజమానురాలు సైతం వారికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించమని కోరకుండానే ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తరపున పనిచేస్తున్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు సరైన ఆధారాలు చూసుకొని ఇవ్వాలని, అలాగే ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సెంట్రల్ కశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ బట్ తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోమవారం శ్రీనగర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు సైతం హతమైన విషయం తెలిసిందే. -
'అద్దె అడిగితే చీరేస్తా..'
బంజారాహిల్స్ : ఇంటి అద్దె అడిగితే చీరేస్తానంటూ వృద్ధురాలిని బెదిరించిన కాంగ్రెస్ నేతపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఎన్బీటీనగర్కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రధాన అనుచరుడు పి.తిరుమలేష్ నాయుడు ఎమ్మెల్యే కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ కె.దాక్షాయని (61)కి చెందిన ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. నెలకు రూ.11 వేల అద్దె చెల్లిస్తానని చెప్పి 2013 నవంబర్ నుంచి ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అద్దెకు దిగిన సమయంలో రెండు నెలల అడ్వాన్స్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోగా.. అప్పటి నుంచి అద్దె కూడా చెల్లించడం లేదు. పలుమార్లు అద్దె కోసం అడగ్గా ఇటీవల రూ.50 వేలు మాత్రం బ్యాంకు అకౌంట్లో వేశాడని.. మిగతా డబ్బుల కోసం అడిగితే 'అద్దె ఇవ్వను, ఫ్లాట్ ఖాళీ చేయను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..' అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని దాక్షాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న అద్దె డబ్బులు అడిగేందుకు మరోసారి వెళ్లగా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అద్దె అడిగితే చీరేస్తానంటూ హెచ్చరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తిరుమలేష్ నాయుడుపై ఐపీసీ సెక్షన్ 509, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లు మారలేదని ఇల్లాలు ఆత్మహత్య
చిక్కడపల్లి (హైదరాబాద్) : ఇల్లు మారదామంటే భర్త ఒప్పుకోలేదనే మనస్తాపంతో నాలుగు నెలల పసిపాపతో సహా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్‌లో మంగళవారం జరిగింది. ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న సాయికుమార్ భార్య శ్వేత(26) పుట్టింటి నుంచి సోమవారమే భర్త వద్దకు వచ్చింది. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉంటే ఒంటరిగా అనిపిస్తుందని వేరే ఇల్లు మారదామని భర్తను అడిగింది. అయితే అందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె నాలుగు నెలల పసిపాప ఐశ్వర్యపైనా, తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. సంఘటనా స్థలంలోనే తల్లీబిడ్డా చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.