response
-
సిరియా సంక్షోభం.. భారత్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ:సిరియా సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 9) ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత, అందరినీ కలుపుకుపోయే రాజకీయ ప్రక్రియ సిరియాలో స్థిరత్వం తీసుకువస్తుందని అభిప్రాయపడింది.సిరియాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపింది.సిరియాలోని అన్ని పక్షాలు ఐక్యమత్యం,సార్వభౌమత్వం కోసం పనిచేయాలని సూచించింది. దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది.సిరియా రాజధాని డెమాస్కస్‌లోని భారత ఎంబసీ కొనసాగుతుందని, భారతీయులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంబసీని సంప్రదించాలని కోరింది. కాగా, సిరియాలో నియంత పాలనను కూలదోసి రెబల్స్ అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: పిల్ల చేష్టలనుకుంటే నియంత పాలన అంతానికి నాంది పలికింది -
ప్రధాని రష్యా టూర్.. స్పందించిన అమెరికా
వాషింగ్టన్: ప్రధాని మోదీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాధ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘రష్యాతో సంబంధాలపై మేం మా ఆందోళనను భారత్‌కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో చూడాలి. ఉక్రెయిన్ సార్వభౌమాత్వాన్ని,ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించాల్సిందిగా రష్యాతో దగ్గరగా వ్యవహరించే ఏ దేశమైనా పుతిన్‌కు చెప్పాలి’అని మిల్లర్ పేర్కొన్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు దూరంగా ఉండాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. అయితే కొన్ని ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యాతో భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్‌ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్‌డ్రైవ్‌లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం: ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రతి చర్యలకు తమ ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై చర్చించేందుకు ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ బుధవారం(ఏప్రిల్17)న భేటీ కానుంది. ఈ నేపథ్యంలో దాడులను ఎదుర్కొనడానికి తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ‘ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మా స్పందన తీవ్రంగా ఉంటుంది’ అని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ చెప్పారు. తమ సుఖోయ్-24ఎస్ విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడి చేస్తుందా లేదంటే ఇరాన్ వెలుపల దాడులు చేస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలకు ఎర్ర సముద్రంలో రక్షణ కల్పిస్తున్నట్లు ఇరాన్ నేవీ అడ్మిరల్ షారమ్ ఇరానీ తెలిపారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 1న ఇరాన్ వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. వీటిలో 99 శాతం మిసైళ్లను ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థ సహకారంతో కూల్చి వేసింది. ఇదీ చదవండి.. ఇరాన్‌కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా -
కేజ్రీవాల్ అరెస్టు.. స్పందించిన అమెరికా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారాన్ని గమనిస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కేజ్రీవాల్ కేసులో పారదర్శక, న్యాయబద్ద, వేగవంతమైన విచారణ జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు ఒక వార్తాసంస్థతో చెప్పారు. కాగా, ఇటీవలే కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో విదేశీ వ్యవహారల శాఖ భారత్‌లోని జర్మనీ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికా కూడా కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధికారి వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తున్నది కీలకంగా మారింది. కాగా, ముడుపులు తీసుకుని లిక్కర్ పాలసీ రూపొందించడంలో ప్రధాన పాత్ర అరవింద్ కేజ్రీవాల్దేనన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చ్ 21న ఆయనను అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టింది. కోర్టు కేజ్రీవాల్‌ను మార్చ్ 28 దాకా ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు -
రోల్‌మోడల్ స్టేట్‌గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్‌లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్‌గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్‌మోడల్ స్టేట్‌గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్‌ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్‌కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్‌కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్‌కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
'బాబుతో నేను' కార్యక్రమానికి స్పందన కరువు
అమరావతి: 'బాబుతో నేను' కార్యక్రమానికి టిడిపి నేతలు నుండి స్పందన కరువవుతోంది. కార్యక్రమానికి మద్దతు కోసం నేతలు పడరాని పాట్లు పడతున్నారు. 'బాబుతో నేను' కార్యక్రమంలో అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని అచ్చెం నాయుడు బహిరంగ లేఖ రాశారు. పాల్గొనని నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం అచ్చెన్నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ఆడియో లీకైంది. ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని అచ్చెన్నాయుడు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇదీ చదవండి: అమావాస్యనాడు పవన్ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు -
ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?
ఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఉదయనిధిని విమర్శించే క్రమంలో ఇండియా కూటమి స్వభావం ఎంటో స్పష్టమవుతోందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని సీనియర్ నాయకుడు కేసీ వేణు గోపాల్ తెలిపారు. 'సర్వ ధర్మ సమభావన' అని పేర్కొంటూ ఇదే కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు. #WATCH | On DMK leader Udhayanidhi Stalin's 'Sanatana dharma' remark, Congress General Secretary KC Venugopal says, "Our view is clear; 'Sarva Dharma Samabhava' is the Congress' ideology. Every political party has the freedom to tell their views....We are respecting everybody's… pic.twitter.com/86Mg265PQT — ANI (@ANI) September 4, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని చెప్పారు. ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదని స్పష్టం చేశారు. సమాన అవకాశాలు ఇవ్వని మతమేదైనా వ్యాధితో సమానమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఇండియా కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందని అన్నారు. ఆక్రమణదారుల దాడులను తట్టుకుని నిలబడగలిగిందని చెప్పారు. ఇది దేశానికి పునాది అని మాట్లాడారు. అలాంటి ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పారు. హక్కుల కోసం పోరాడిన అలాంటి సనాతనీయులపై మహారాష్ట్రలో లాఠీ ఛార్జీ చేసిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. సనాతన నిర్మూలన పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo — Amit Malviya (@amitmalviya) September 2, 2023 బీజేపీ మండిపాటు.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కూడా ఉంది. ముంబయి వేదికగా జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇండియా కూటమిపై బీజేపీ దాడి చేసింది. ముంబయి భేటీలో ఇదే నిర్ణయించారా? అని ప్రశ్నలు గుప్పించారు. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
'చావడమే మేలు..' పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు తండ్రి ఆవేదన..
జైపూర్: పాక్ వెళ్లి ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజు చర్యల పట్ల ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి భారత్‌కు రావడానికి అంజూకు హక్కు లేదని అన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని అన్నారు. అంజు.. వివాహిత అయిన రాజస్థాన్‌కు చెందిన భారతీయ మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండియా నుంచి పాక్‌కు వెళ్లి తన ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదేమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు. ఇదీ చదవండి: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి! అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. చాలా విచారకరమైన విషయమని అన్నారు. సీమా హదర్ కేసుకు భిన్నంగా అంజు అనే వివాహిత రాజస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోని తన ఫేస్బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లింది. రాజస్థాన్‌లో బివాడీకి చెందిని అంజూకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్‌లోకి అడుగుపెట్టిన అంజు.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజు చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు. అంజు తనకు చెప్పకుండానే పాక్ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్‌లో ఉన్నట్లు కాల్ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఇదీ చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! -
స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు
సాక్షి, భీమవరం: భీమవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ యు.రవిప్రకాష్ అర్జీదారుల సమస్యల తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించామని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ► భీమవరం వన్‌టౌన్‌కు చెందిన వ్యక్తి తనను 2020లో యూనియన్ బ్యాంక్ మేనేజర్, మరికొందరు కలిసి రూ.19 లక్షల వరకు మోసం చేశారని దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చార్జిషీట్ వేయలేదని ఫిర్యాదు చేశారు. ► పోడూరుకు చెందిన మహిళ తనకు ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని నకిలీ వీసా పత్రాలు ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేసింది. ► వీరవాసరానికి చెందిన మహిళ తనకు పక్క ఇంటి వారితో సరిహద్దు గొడవలున్నాయని, దౌర్జన్యం చేస్తున్నారని న్యాయం చేయాలని కోరారు. ► మొగల్తూరుకి చెందిన మహిళ ఒక వ్యక్తి తన వెంటపడుతూ వేధిస్తుండటంతో పాటు తనకు పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరింది. ► వీరవాసరానికి చెందిన మహిళ తనను భర్త, అత్తమామలు, మరుదులు వేధిస్తుండగా గృహహింస కేసు పెట్టానని, వారంతా రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకున్న తర్వాత తిరిగి వేధిస్తున్నారని ఎస్పీ వద్ద వాపోయింది. ► స్పందన కార్యక్రమం అనంతరం ఎస్పీ రవిప్రకాష్ పోలీస్ క్వార్టర్లో ఏర్పాటుచేసిన జిల్లా పోలీసు వెల్ఫేర్ ఆస్పత్రిని సందర్శించారు. -
జగనన్న సురక్ష: గంటల వ్యవధిలోనే మోక్షం.. 11రకాల సేవలు ఉచితం
-
మొక్కు‘బడి బాట’..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’కు స్పందన నామమాత్రంగానే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించట్లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటుండగా..టీచర్ల నిర్లిప్తత ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు స్కూళ్లు ఆకర్షించినట్టుగా విద్యార్థులను ప్రభుత్వ టీచర్లు ఆకర్షించడం లేదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్టు సమాచారం. కాగా చాలాచోట్ల బడిబాట కార్యక్రమానికి వెళ్లేందుకు టీచర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో వెళ్లినట్టుగా చూపిస్తూ, ఆన్లైన్లో ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు పంపుతున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. డీఈవోలు, ఎంఈవోల కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బడి మానేసినవారు తిరిగి చేరేలా.. బడి మానేసిన వారిని బడికి తిరిగి రప్పించడమే కాకుండా, ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులను మరలించేందుకు విద్యాశాఖ ఈ నెల 3 నుంచి ‘బడిబాట’చేపట్టింది. ప్రతి స్కూల్ పరిధిలో టీచర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు బడిలో చేరేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గుర్తించింది 66 వేలు.. ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మందిని కొత్తగా చేర్పిస్తున్నామని విద్యాశాఖ చెబుతోంది. కానీ ఇప్పటివరకు బడిలో చేర్పించాల్సిన విద్యార్థులు 66,847 మందిని మాత్రమే గుర్తించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో ఒకటవ తరగతిలో చేర్చాల్సిన వారి సంఖ్య 16,038 ఉంది. ఇందులో 12,120 మందిని అంగన్వాడీల్లో చేరి్పంచేందుకు పేర్లు నమోదు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చేరేందుకు 1,181 మంది మొగ్గుచూపారు. ఇక 2,737 మంది బడిబాట బృందాలతో సంబంధం లేకుండానే స్కూళ్లలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 2–7 తరగతుల మధ్య బడి మానేసిన పిల్లలు 8,966 మందిని కూడా గుర్తించారు. వీళ్లు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చేరారన్నది స్పష్టత ఇవ్వలేదు. రాజధాని పరిసరాల్లోనే ఎక్కువ బడి మానేస్తున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకన్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 4,137 మందిని గుర్తించారు. హైదరాబాద్‌లో 2,376 మంది బడి మానేసినట్టు తెలుసుకున్నారు. మెదక్‌లో 2,254 మంది, మేడ్చల్‌లో 1,457 మంది బడికి దూరమైనట్టు గుర్తించారు. ఇక ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 3,371 మంది, నిజామాబాద్‌లో 4,107 మంది బడి మానేసిన పిల్లలున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకెళ్లని విద్యార్థుల తల్లిదండ్రులంతా దినసరి కూలీలే కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు పిల్లలను కూడా రోజువారీ పనులకు పంపుతున్నట్టు తేలింది. వీళ్లను గుర్తించడమే తప్ప, వీరంతా స్కూళ్లలో చేరతారా? లేదా? అనేది మాత్రం స్పష్టం కావట్లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికీ గాలమేస్తున్నాయి. గ్రామాల్లో కొంతమందికి కమీషన్లు ఇస్తూ పిల్లల్ని తమ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరుతున్నాయి. ఊరూరా ఫ్లెక్ల్సీలతో ప్రచారం చేస్తున్నాయి. టీచర్లకు టార్గెట్లు వి«ధించి మరీ విద్యార్థులను చేర్చేలా ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రం మొత్తమ్మీద లక్షమంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లలో చేరినట్టు తెలుస్తోంది. -
ఆ మూవీకి తెలుగులో ఊహించని రెస్పాన్స్!
కేరళలో రీసెంట్ టైమ్స్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన '2018'. ఈ చిత్రం ఇవాళే తెలుగులో విడుదలైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్‌ను హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనూ ప్రదర్శించారు. ప్రెస్ స్క్రీనింగ్, సెలబ్రిటీ ప్రీమియర్‌కు అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్‌లో ప్రేక్షకుడిని సీటులోనే కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి) కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోందని, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
‘అన్నా మళ్లీ మీరే సీఎం కావాలి.. మేమంతా మీ వెనకే ఉంటాం’
సాక్షి, నెల్లూరు జిల్లా: దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే, లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే జగనన్న మళ్లీ సీఎం కావాలి.. అందరికీ నమస్కారం, నేను 20 ఏళ్ళుగా రెండెకరాల భూమికి హక్కులు లేక గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మన జగనన్న వచ్చిన తర్వాత చుక్కుల భూముల చిక్కులు శాశ్వతంగా పరిష్కరించారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య వికలాంగురాలు పెన్షన్ ఇవ్వమని గత ప్రభుత్వంలో అడిగితే ఖాళీ ఉంటే ఇస్తామని ఇవ్వలేదు, కానీ జగనన్న పాలనలో నా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు, రూ. 3 వేలు తలుపుతట్టి ఇస్తున్నారు, నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి, నేను దళితుడిని, నేను రెండు ఎకరాలు కౌలుకు సాగుచేస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రూ. 41,500 నాకు పెట్టుబడి సాయం అందింది, జగనన్నను నేను జీవితంలో మరిచిపోలేను, మన దళితులు ఎదగాలంటే జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మనం మళ్లీ సీఎం చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్ బావుంటుంది. ధన్యవాదాలు. -మద్దెల ప్రసాదు, రైతు, ముంగమూరు, బోగోలు మండలం మేమంతా మీ వెనకే ఉంటాం.. అన్నా నమస్కారం, మాకు 3 ఎకరాల పొలం ఉంది. అది మేం పండించుకుంటాం కానీ హక్కులు లేవు, మీరు ఈ రోజు మాకు ఆ భూమిపై హక్కులు కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నన్ను మీరు రూ. 50 లక్షల విలువైన పొలానికి వారసురాలని చేశారు, నేనే కాదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు, వారికి అమ్మ ఒడి వస్తుంది, నేను వారిని ఇంగ్లీష్ మీడియంలో ప్రేవేట్ స్కూల్ లో చదివించాలనుకునేదానిని, కానీ మీరు అవన్నీ ఇవ్వడంతో వారు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళని స్కూల్‌కు పంపుతుంటే చూడముచ్చటగా ఉంది, పిల్లలకు గోరుముద్ద పథకం కింద మంచి భోజనం ఇస్తున్నారు. మేం తల్లిదండ్రులుగా కూడా ఆలోచించని విధంగా మీరు మేనమామగా ఆలోచించి చేస్తున్నారు, మా డ్వాక్రా సంఘంలో నాకు మూడు విడతలుగా రూ. 22 వేలు వచ్చాయి, మా సంఘానికి బ్యాంకులో రూ. 10 లక్షలు ఇవ్వగా నా వాటాగా రూ. 1 లక్ష వచ్చాయి, దానికి కూడా సున్నా వడ్డీ పథకం కింద ఏప్రిల్ నెలలో వడ్డీ కూడా వేస్తున్నారు, బయట అధిక వడ్డీలకు ఇస్తుంటే మీరు సున్నా వడ్డీకి ఇస్తున్నారు. మాకు రైతుభరోసా సాయం అందింది, మా మామయ్యకు పెన్షన్ వస్తుంది, ఉదయం ఆరుగంటలకే వలంటీర్ వచ్చి మీ మనవడు ఇచ్చారని ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నా మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మేమంతా మీ వెనకే ఉంటాం, ధన్యవాదాలు. -మమత, మహిళా రైతు, జక్కేపల్లి గూడూరు, బోగోలు మండలం వైనాట్ 175.. తప్పకుండా గెలుస్తాం.. అందరికీ నమస్కారం, ఈ రోజు పండుగ రోజు, ఎన్నో ఏళ్లుగా చుక్కల భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతన్నల సమస్యను సీఎం పరిష్కరించారు. సీఎం రైతుల పక్షపాతి, ఆయన తండ్రి బాటలో ముందుకెళుతూ, రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నారు, నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి, వాటిని విముక్తి చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం రైతాంగానికి ఉపయోగకరం, పిల్లల చదువుల కోసం దేశంలో ఏ సీఎం చేయని విధంగా వేల కోట్లు ఖర్చుపెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చారు, గడప గడపకు వెళుతున్న సమయంలో ప్రతి ఇంటిలో ఏ విధంగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంటింటికీ తలుపుతట్టి మరీ పెన్షన్స్ ఇస్తున్నారు, కావలి నియోజకవర్గ అభివృద్ది జగనన్న వల్లే సాధ్యమైంది, ఈ రోజు రామాయపట్నం పోర్ట్ పనులు ఏ విధంగా పరిగెత్తుతున్నాయో మనకు తెలుసు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా అతి త్వరలో పూర్తి అవుతున్నాయి, చంద్రబాబు శంకుస్ధాపనలు చేశారే తప్ప ఒక్క పని చేయలేదు. కావలి పెద్ద చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాదాపు 7,8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది, రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది, సోమశిల నుంచి కావలికి నీరు వచ్చే పరిస్ధితి లేదు, మాకు సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వాలని కోరాం, కావలి పట్టణంలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేస్తే మేం ఆ పనులు పూర్తిచేసుకుంటాం, గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ కాలనీలో 6 వేల ఇళ్ళు మంజూరు అయ్యాయి కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని పూర్తిచేయాలని కోరుతున్నాం, జగనన్న మళ్లీ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు, చాలా సంతోషం, మీరు అన్నట్లు వైనాట్ 175, తప్పకుండా గెలుస్తాం, ధన్యవాదాలు. -కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి -
మళ్లీ మళ్లీ వైఎస్ జగనే సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు
-
సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదంపై మేయర్ విజయలక్ష్మి రియాక్షన్
-
జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే మా భవిష్యత్తు అంటున్నారు జనాలు.. పేద ప్రజల బతుకులకు ఒక భరోసా ఇచ్చి.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ఎంతో మేలు చేస్తున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే 5 గంటలకే నిద్రలేపి మరి పింఛను ఇస్తున్నారు. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు. మా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ వృద్ధులు దీవిస్తున్నారు. చదవండి: జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..? -
డాలస్‌లో నాటా బోర్డు మీటింగ్: నిధుల సేకరణకు విశేష స్పందన
డాలస్: అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రత్యేక అతిధి గా విచ్చేయగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాస్ సోమవరపు(కోశాధికారి), మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కార్యదర్శి ), సతీష్ నరాల (సంయుక్త కోశాధికారి ) తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు రీజినల్ కోఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూన్ 30, జులై 1-2 2023 లో డాలస్ లో జరిగే కన్వెన్షన్ గురించి వివరాలు తెలిపారు. బోర్డు సమావేశం తర్వాత సభ్యులు అందరూ డాలస్ కన్వెన్షన్ టూర్ కు వెళ్లి అక్కడ వేదికను పరిశీలించి నాటా మెగా కన్వెన్షన్‌కు రానున్న పదిహేను వేల మంది అతిధులకు కల్పించే సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం జరిగిన నిధుల సేకరణ విందు లో పాల్గొన్న ఏడు వందల పైగా పలువురు దాతలు కనీవిని ఎరుగని రీతిలో రెండు మిలియన్ల ఆరు వందల వేల డాలర్లు ($2,600,000) ఇస్తామని నాటా కు వచ్చిన హామీ అమెరికాలో సరిక్రొత్త రికార్డు సృష్టించింది. ఈ విధంగా నిధుల సేకరణకు విశేష కృషి చేసిన డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి గారిని నాటా కార్యవర్గం ప్రత్యేకం గా అభినందించింది. వివిధ రాష్టాల నుండి వచ్చిన నాటా కార్యవర్గ సభ్యులను గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి) నిధుల సేకరణ విందు లో పాల్గొన్న దాతలకు పరిచయం చేసినారు. ఈ కార్యక్రమాన్ని గిరీష్ రామిరెడ్డి (కన్వీనర్ ), బూచిపూడి రామి రెడ్డి (కోఆర్డినేటర్ ), కృష్ణ కోడూరు (కో కన్వీనర్), భాస్కర్ గండికోట(కో కోఆర్డినేటర్), రమణ రెడ్డి క్రిస్టపాటి(డిప్యూటీ కన్వీనర్), మల్లిక్ ఆవుల (డిప్యూటీ కోఆర్డినేటర్), రవీంద్ర అరిమండ (బోర్డు సభ్యుడు), వీరా రెడ్డి వేముల, దర్గా నాగిరెడ్డి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), పుట్లూరు రమణ(బోర్డు సభ్యుడు), చెన్నా రెడ్డి, మోహన్ రెడ్డి మల్లంపాటి, ప్రసాద్ చొప్ప ఇతరులు అతిధులకు సౌకర్యాలను కల్పించారు. ఈ నిధుల సేకరణ విందుకు హాజరై హామీ ఇచ్చిన దాతలు అందరిని నాటా కార్యవర్గం పేరు పేరున అభినందించింది. -
అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లకు స్పందన అంతంతే
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజా వాటాదారులకు అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లలో నామమాత్ర స్పందనే కనిపించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలులో భాగంగా అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను చేపట్టింది. పబ్లిక్ నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ప్రకటించిన ఓపెన్ ఆఫర్లు వారాంతాన(9న) ముగిశాయి. సిమెంట్ దిగ్గజాలు వెల్లడించిన వివరా ల ప్రకారం 4.89 కోట్ల షేర్లకుగాను ఏసీసీ వాటాదారుల నుంచి 40.51 లక్షల షేర్లు మాత్రమే లభించాయి. ఇక అంబుజా సిమెంట్స్ విషయంలో మరింత తీసికట్టుగా కేవలం 6.97 లక్షల షేర్లు టెండర్ అయ్యాయి. కంపెనీ 51.63 కోట్ల షేర్ల కోసం ఆఫర్ ఇచ్చింది. రెండు కంపెనీల ఓపెన్ ఆఫర్లు ఆగస్ట్ 26న ప్రారంభమయ్యాయి. ఏసీసీ షేరుకి రూ. 2,300, అంబుజాకు రూ. 385 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు)డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్ ఆఫర్లు విజయవంతమైతే రూ.31,000కోట్లు వెచ్చించవలసి వచ్చేది. వారాంతాన ఏసీసీ షేరు ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 3 శాతం అధికంగా రూ. 2,365 వద్ద ముగిసింది. అంబుజా సిమెంట్స్ ఆఫర్ ధరకంటే 18 శాతం ప్రీమియంతో రూ. 454 వద్ద స్థిరపడింది. -
AP: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: కేబినెట్‌పై నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన స్పందిస్తూ.. కూర్పు అంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయన్నారు. పార్టీ తల్లి లాంటిదని.. అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చదవండి: ‘బూజు పట్టిన టీడీపీ.. బాబుది మళ్లీ అదే పాట’ -
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రెస్పాన్స్.. ట్వీట్ రూపంలో రాజమౌళి మనసులో మాట!
దర్శకుధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం పేరుకే పాన్ ఇండియా చిత్రమైన జక్కన్న మేకింగ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్... ఈ చిత్రానికి గ్లోబల్ వైడ్ గుర్తింపునే తీసుకొచ్చింది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌తో ఆర్ఆర్ఆర్ టీం కూడా బీజీ బిజీగా గుడుపుతోంది. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్లో.. జక్కన్న మార్క్ డైరక్షన్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన, కీరవాణీ మ్యూజిక్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పటికే నెట్టింట ఈ ట్రైలర్ రికార్డ్లను బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. దీంతో జక్కన్న ట్రైలర్‌కి వస్తున్న రెస్మాన్స్కి చూసి ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మానియానే కనిపిస్తోంది. అయితే ట్రైలర్‌కి నలుమూలల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి రాజమౌళి ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిటల్ మరిచిపోతోంది. తాజాగా ఆయన తన ట్వీటర్ ద్వారా స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ కి అన్ని చోట్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ పట్ల మాటలు రావడం లేదు. ఇంకేమి చెప్పలేను, మా టీమ్ అంతా చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ తార ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 No words to express and can’t say anything more for the #RRRTrailer response from all corners… Our entire team is overjoyed with the response.:)https://t.co/0oXeghBfpC — rajamouli ss (@ssrajamouli) December 10, 2021 చదవండి: Jr NTR: ఆయన లేకపోతే అంతా జీరోలా అనిపిస్తోందంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ -
ఇళ్ల పట్టాల దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలి: సీఎం జగన్
-
Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...!
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్ ఎస్టేట్, డెవలపర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మొదటి షో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుపులకు లోనైంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత ఎక్కడా ప్రాపర్టీ షోలు భారీ స్థాయిలో జరగలేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ ఆగస్టు 13,14,15 తేదీల్లో హైటెక్స్‌లో , క్రెడాయ్ హైదరాబాద్ యూనిట్ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది. రియల్ పుంజుకుంటోంది క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్ బాగుందని క్రెడాయ్, హైదరాబాద్ యూనిట్ ట్రెజరర్ ఆదిత్య అన్నారు. కోవిడ్ మునుపటి స్థితికి రియల్ ఎస్టేట్ చేరుకుంటుందనే నమ్మకం కలిగిందన్నారు. కొత్తగా ఇళ్లలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆఫీస్ స్పేస్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్లు ఉండటంతో మార్కెట్ ఆశాజనకంగా ఉందన్నారు. రెస్పాన్స్ బాగుంది ప్రాపర్టీ షో ప్రారంభం కాకుముందు జనాల రెస్సాన్స్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేదని, కానీ ఈ షో ప్రారంభమైన తర్వాత అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాంటూ తెలిపింది గౌరు డెవలపర్స్‌కి చెందిన కావ్య. కొత్త ఇళ్లులు, స్థలాలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని, మూడు రోజులుగా వస్తున్న వారికి తమ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నామంది. మార్కెట్‌పై అవగాహన దాదాపు పద్దెనిమిది నెలలుగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర పనులకే బయటకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై సరైన అవగాహన ఉండటం లేదు. అయితే క్రెడాయ్ భారీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడంతో మార్కెట్‌పై అవగాహన కోసం చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా గృహిణిలు కొత్త ఇళ్ల గురించి ఎక్కువగా వాకాబు చేస్తున్నారు. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ముసురుకున్న అనుమానాలను క్రెడాయ్ ప్రాపర్టీ షో పటాపంచలు చేసింది.