rises
-
413కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఈ భారీ విపత్తుకు బలయినవారి సంఖ్య 413కి చేరింది. ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వారి కోసం 10వ రోజు(గురువారం)కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ ఏజెన్సీలకు చెందిన వెయ్యిమందికిపైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా వయనాడ్, మలప్పురం జిల్లాలోని చలియార్ నది గుండా వెళ్లే ప్రాంతాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నది నుండి మృతదేహాలను, శరీరభాగాలను వెలికితీసి తొలుత వాటిని డీఎన్ఏ పరీక్షకు పంపి, అనంతరం వాటిని గుర్తిస్తున్నారు.ఆ తరువాత ఆ మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఆనంతరం ఆయా సమాధుల ముందు నంబర్ల రాసి, డీఎన్ ఏ రిపోర్టు ఆధారంగా బంధీకులకు అధికారులు తెలియజేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా, 10వేలమందికిపైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు మూడు దశల్లో పునరావాసం కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
తయారీకి ‘ఆర్డర్ల’ జోష్..
న్యూఢిల్లీ: సానుకూల డిమాండ్, కొత్త ఆర్డర్ల దన్నుతో జూన్‌లో తయారీ రంగ ఉత్పత్తి పెరిగింది. దీంతో ఉద్యోగాల కల్పన కూడా గణనీయంగా మెరుగుపడింది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సూచనగా గత నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్‌లో 58.3కి పెరిగింది. మే నెలలో ఇది 57.5గా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. కొత్త ఆర్డర్ల రాకతో కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటున్నట్లు హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఎకానమిస్ట్ మైత్రేయి దాస్ తెలిపారు. 2005 మార్చిలో దీనికి సంబంధించిన డేటాను సేకరించడం మొదలుపెట్టిన తర్వాత గత 19 ఏళ్లలో ఉద్యోగాల కల్పన రేటు ఇంత వేగవంతంగా ఉండటం ఇదే తొలిసారని వివరించారు. జూన్‌లో సిబ్బంది వ్యయాలతో పాటు ముడి వస్తువులు, రవాణాపై ఖర్చులు పెరగడంతో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు దాస్ చెప్పారు. -
ట్రేడింగ్‌పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్‌పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
రూపాయి జోరు.. డాలరుతో పోలిస్తే బలపడిన రూపాయి
న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ మరోసారి బలపడింది. 18 పైసలు పుంజుకుని 82.41 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 82.59తో పోలిస్తే తొలుత 82.42 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. తదుపరి డాలరుతో మారకంలో 82.32 వరకూ లాభపడింది. ఇంట్రాడే కనిష్టం 82.43కాగా.. చివరికి 82.41 వద్ద ముగిసింది. వెరసి గత రెండు రోజుల్లో 20 పైసలు బలపడింది. ఇందుకు ఈక్విటీ మార్కెట్లు లాభపడటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సహకరించినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. డాలరుతో మారకంలో ఆసియా కరెన్సీలు పుంజుకోవడం సైతం రూపాయికి బలాన్నిచ్చినట్లు తెలియజేశాయి. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
HDFC Bank Q4 Results: లాభాలతో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది. స్టాండెలోన్ సైతం క్యూ4లో స్టాండెలోన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది. -
అక్షయ తృతీయకు ముందు పసిడి ప్రియులకు భారీ షాక్! రికార్డ్ హై
న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పుంజు కోవడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా వారం రోజుల్లో అక్షయ తృతీయ రానున్న తరుణంలో కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైం హైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగి రూ.61,780కి చేరింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77,580 స్థాయికి ఎగిసింది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2,041డాలర్ల వద్ద, వెండి ఔన్స్ 25.88 డాలర్లుగా ఉంది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు) దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 600 రూపాయలు ఎగిసి 61,200 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 550పెరిగి 56, 650 వద్ద ఉంది. అలాగే మరో విలువైన లోహం వెండి ఏకంగా కిలోకి 1200 రూపాయలు పెరిగి రూ.83,800గా ఉంది. మార్చి1న రూ. 70వేలుగా ఉన్న కిలో వెండి ధర మార్చి 31 నాటికి 77500 స్థాయికి చేరింది. తాజాగా 83వేలకు చేరడం విశేషం. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్) అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగానూ ప్రభావం చూపుతున్నట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌కు వ్యతిరేకంగా గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 101 మార్క్ దిగువకు పడి పోయింది. మార్చిలో అమెరికా పీపీఐ ఇండెక్స్ ఊహించని విధంగా క్షీణించడంతో వారంవారీ జాబ్‌లెస్ క్లెయిమ్‌ల సంఖ్య 2,39,000 పెరిగింది. దీంతో ట్రెజరీ దిగుబడులు కూడా తగ్గినట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) -
హెచ్డీఎఫ్సీ లాభం అప్ క్యూ3లో రూ. 7,078 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్- డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 7,078 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 3,261 కోట్ల నుంచి రూ. 3,691 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం మెరుగై రూ. 4,840 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.32 శాతం నుంచి 1.49 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ఎఫెక్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో లాభదాయకత మందగించినట్లు హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ వెల్లడించారు. అయితే రుణాలను కొత్త రేట్లకు వేగంగా అనుసంధానిస్తున్నట్లు, ఈ ప్రభావం రుణాలపై తదుపరి త్రైమాసికం నుంచీ ప్రతిఫలించనున్నట్లు తెలియజేశారు. వ్యక్తిగత రుణ విభాగం 26 శాతం వృద్ధిని సాధించగా.. సగటు టికెట్(రుణ) పరిమాణం రూ. 35.7 లక్షలకు బలపడినట్లు వెల్లడించారు. రూ. 18 లక్షలకుపైగా వార్షిక ఆదాయంగల రుణగ్రహీతలు 52 శాతంగా తెలియజేశారు. గ్రూప్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనంపై ఆర్బీఐ, ఎన్సీఎల్టీ నుంచి నిర్ణయాలు వెలువడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. -
అమర రాజా సేల్స్ అదిరాయ్: లాభం రూ. 201 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) 39 శాతం పెరిగింది. రూ. 201 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 144 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,700 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 2,097 కోట్ల నుంచి రూ. 2,449 కోట్లకు పెరిగాయి. రూ.1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 2.90 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. గురువారం బీఎస్ఈలో సంస్థ షేరు ఒక్క శాతం పెరిగి సుమారు రూ. 520 వద్ద ముగిసింది. -
41 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 41 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదురి వెల్లడించారు. 2021-22 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఈ విలువ రూ.2,50,881 కోట్ల నుంచి రూ.3,54,570 కోట్లకు చేరినట్లు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఇక ఇదే కాలంలో వస్తు సేవల పన్ను, కస్టమ్స్ సుంకాలుసహా పరోక్ష పన్ను వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ.3,14,476 కోట్ల నుంచి రూ.3,44,056 కోట్లకు ఎగసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంపై పెరిగిన వడ్డీ భారం కేంద్రంపై వడ్డీ చెల్లింపుల భారం పెరిగినట్లు చౌదురి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2021–22లో (జీడీపీ విలువలో) ఈ పరిమాణం 3.1 శాతంగా ఉందని, విలువలో ఇది రూ.7.31 లక్షల కోట్లని ఆయన తెలిపారు. 2014-15లో వడ్డీ చెల్లింపుల విలువ 3.27 లక్షల కోట్లయితే, జీడీపీలో ఇది 2.6 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2014-15లో ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.62.44 లక్షల కోట్లయితే (జీడీపీలో 50.1 శాతం), 2021-22లో ఈ విలువ రూ.138.88 లక్షల కోట్లని (జీడీపీలో 58.7 శాతం) వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ భారం 155.33 లక్షల కోట్లకు (60.2 శాతం) చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. -
దిగ్గజాలకు షాక్: వొడాఫోన్ ఐడియాలో భారీ పెట్టుబడులు?!
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాలో ఈ-కామర్స్ దిగ్గజం దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ ఏకంగా 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందన్న నివేదికలు వెలువడ్డాయి. దీంతో వొడాఫోన్ ఐడియా షేరు 5శాతం లాభపడింది. ఈ భారీ పెట్టుబడుల అంచనాలతో వొడాఫోన్ ఐడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కంపెనీ షేరు ఇంట్రా డేలో రూ.9.36కి చేరింది. అలాగే గత రెండు రోజుల్లో ఈ షేరు 7.33 శాతం లాభపడింది. ఇప్పటిదాకా అమెరికా టెక్ కంపెనీలనుంచి ఎలాంటి పెట్టుబడులు సాధించలేని ఏకైక టెల్కో వొడాఫోన్ ఐడియా. తాజా అంచనాలు అమలైతే కంపెనీకి భారీ పెట్టుబడి సమకూరినట్టే. గత రెండున్నరేళ్లుగా, అమెరికా టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇండియాలో తమ క్లౌడ్ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయ టాప్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడి పెట్టాయి. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా మూల ధన సేకరణ నిమిత్తం ఇన్వెస్టర్ల వేటలో ఉన్న సంగతి తెలిసిందే. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని నెట్‌వర్క్‌లో పెట్టుబడికి ఉపయోగించాలని కూడా యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.7,023 కోట్ల నష్టంతో పోలిస్తే ఈ క్యూ4లో రూ.6,563 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని టెల్కో నివేదించింది. అయితే నవంబర్ 25, 2021 నుంచి అమలైన టారిఫ్ పెంపుతో ఏడాది క్రితం రూ. 9,608 కోట్ల నుండి క్యూ4లో కార్యకలాపాల ఆదాయం 6.5 శాతం ఎగిసి రూ. 10,240 కోట్లకు పెరిగింది. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ పది లక్షలకు కంటే ఎక్కువ కొత్త 4జీ సబ్స్క్రైబర్లను సాధించింది. -
కోటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1,642 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,244 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,685 కోట్ల నుంచి రూ. 8,063 కోట్లకు పుంజుకుంది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 6,912 కోట్ల నుంచి రూ. 6,480 కోట్లకు నీరసించింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.7 శాతం నుంచి 3.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.87% నుంచి 1.28 శాతానికి పెరిగాయి. కాగా.. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 962 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ. 935 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1% లాభంతో రూ. 1,740 వద్ద ముగిసింది. -
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, ముంబై: తగ్గినట్టే తగ్గి మురిపించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు సోమవారం ఊపందు కున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభంనుంచి బైటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని అమెరికా పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన తరువాత ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా భారీ ప్యాకేజీ మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న అంచనాలతో డాలర్ క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేసింది. ఎంసిఎక్స్‌లో బంగారు ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.68 శాతం లేదా 310 రూపాయలు పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ .46,046 వద్ద ఉంది.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం లేదా 778 రూపాయలు పెరిగి కిలో 69,562 రూపాయలకుచేరింది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ. 46,970 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు ధర 1,748 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పెరిగి 26.71 డాలర్లకు చేరింది. అమెరికా ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు. కాగా శుక్రవారం స్పాట్ మార్కెట్లో, బంగారం ధరలు 10 గ్రాములకు 342 రూపాయలు తగ్గి 45,599 రూపాయల వద్ద ఎనిమిది నెలల కనిష్టానికి చేరాయి. అలాగే 2 వేల రూపాయలకు పైగా క్షీణించిన వెండి కిలోకు రూ .67,419 కు పడిపోయిన సంగతి తెలిసిందే. -
కొనుగోళ్ల మద్దతు : మార్కెట్లు జంప్
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లో ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు క్రమంగా లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 190 పాయింట్లు ఎగిసి 51500 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 15162 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో కనిష్ట స్థాయిల్లో కొనుగళ్ల ధోరణి కనిపిస్తోంది. బ్యాంకింగ్, మెటల్స్ షేర్లకు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. వీక్లీ డెరివేటివ్స్ ముగియనున్న తీవ్ర ఒడిదుడుకులుంటాయని అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ పండితులు సూచిస్తున్నారు. కీలక మద్దతు స్థాయిలను గమనించాలంటున్నారు. ఐషర్ మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కోలు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, గెయిల్ , టాటా స్టీల్, అదాని పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ లాభపడుతుండగా, ఐషర్ మోటార్స్ ఎన్టీపీసీ టైటాన్, హీరోమోటోకార్ప్, విప్రో నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఐటీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎసిసి, అశోక్ లేలాండ్, అతుల్ ఆటో, బజాజ్ హిందుస్థాన్ షుగర్, బేయర్ క్రాప్‌సైన్స్, బాష్, కెపాసిట్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, క్రిసిల్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ పిపావావ్ పోర్ట్, గ్రాఫైట్ ఇండియా, ఎంఆర్ఎఫ్, నాట్కో ఫార్మా, ఎన్సిసి, ఎన్‌హెచ్‌పిసి, ఆయిల్ ఇండియా, పెట్రోనెట్ ఎల్ఎన్జి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ తదితరాలు ఈ రోజు త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి. -
33 పైసలు ఎగిసిన రూపాయి.. మళ్లీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ రూపాయికూడా మంగళవారం భారీగా పుంజుకుంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే రూపాయి 72.50 వద్ద ప్రారంభ మైంది. అనంతరం 33 పైసలు పెరిగి 72.43 కు చేరుకుంది. కానీ ఈ లాభాలను నిలబెట్టుకోలేకపోయిన రూపాయి 72.64 వద్ద కొనసాగుతోంది. సోమవారం రూపాయి 72.76 ఏడాది కనిష్టం వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ ముడి చమురు ఫ్యూచర్స్ 2.41 శాతం పెరిగి బ్యారెల్‌కు 53.15 డాలర్లకు చేరుకుంది. అయితే బంగారం ధరలు ఫ్యూచర్స్ లో స్వలంగా తగ్గా, వెండి ధరలు పుంజుకున్నాయి. అటు దలాల్ స్ట్రీట్‌లో, ఇటు కరెన్సీ మార్కెట్లో కూడా కరోనావైరస్ ఆందోళన కొనసాగుతోంది. దీంతోపాటు ఢిల్లీలో ఒకటి, తెలంగాణా ఒక పాజిటివ్ కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు నేడు సానుకూలంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్456పాయింట్లు పెరిగి 38,603 వద్ద, నిఫ్టీ 1590 పాయింట్లు పెరిగి 11,292 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ. 1,354.72 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. కాగా చైనాలో విస్తరించిన కోవిడ్-19 క్రమంగా ప్రపంచదేశాలను చుట్టముడుతోంది. తాజాగా భారతదేశంలో మరో రెండు కరోనా వైరస్ బాధితులను గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. -
బంగారం ‘బంగారమే’ : మళ్లీ పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు ఎంతైనా బంగారం బంగారమే అన్న రేంజ్లో తిరిగి పుంజుకున్నాయి. నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెట్టిన ధరలు సోమవారం మళ్లీ ర్యాలీ అయ్యాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.593 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.41,829 వద్ద ట్రేడ్ అయింది. మునుపటి సెషన్లో భారీగా పడిపోయిన తరువాత బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లో1.42 శాతం ఎగిసాయి. కిలో వెండి ధర రూ. 45350 వద్ద కొనసాగుతోంది. అటు ప్రపంచ మార్కెట్లలో, మునుపటి సెషన్లో 5 శాతం నష్టపోయిన పసిడి ఈరోజు లాభాల్లో వుంది. కరోనా వైరస్ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో శనివారం ముగింపుతో పోలిస్తే బంగారం 18 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం ధర 1,603 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి 1.3 శాతం పెరిగి ఔన్సు ధర 16.88 డాలర్లకు చేరింది. ఇతర విలువైన లోహాలలో పల్లాడియం ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి 2,611 డాలర్లు, ప్లాటినం 1.9 శాతం 880 డాలర్లకు చేరుకుంది. మరోవైపు శుక్రవారం 1500 పాయింట్లకు పైగా కుప్పకూలిన దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా రికవరీ సాధించాయి. ఆరంభంలోనే దాదాపు 750 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 587 పాయింట్ల లాబంతో 39 వేల మార్క్‌కు దిగువన, నిఫ్టీ 164 పాయింట్ల లాభంతో 11365 వద్ద 11500 స్థాయికి దిగువన కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్-19 ఆందోళన, ఆర్థిక మందగమనంపై శుక్రవారం ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా వుందని, అవసరమైతే అన్ని చర్యల్ని తీసుకోవడానికి తాము (ఫెడ్) సిద్ధంగా ఉందంటూ వడ్డీరేట్ల కోత సంకేతాలందించారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్లు భారీగా తగ్గించనుందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్థికవేత్తలు ఆదివారం అంచనా వేశారు. అలాగే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 1,800 డాలర్లకు చేరుతుందని పేర్కొంది. #IBJA’s indicative #Retail selling #Rates for #Gold #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 pic.twitter.com/qnLHc763Xp — IBJA (@IBJA1919) March 2, 2020 -
పెరిగిన కోటక్ బ్యాంకు లాభాలు
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు కోటక్ మహీంద్ర క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించింది. 1747 కోట్ల రూపాయలను నికర లాభాలు నమోదు చేసింది. గత ఏడాదితో రూ. 1,441 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 21 శాతం లాభాలు ఎగిశాయి. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 10,829 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. ఆదాయం 9,140 కోట్లుగా ఉంది. ఎన్పీఏలు 2.14శాతంనుంచి 1.91 శాతానికి దిగి వచ్చాయని కంపెనీ ఫలితాల సందర్భంగా వెల్లడించింది. -
పసిడికి పండుగ కళ : భారీగా పెరిగిన ధర
సాక్షి, ముంబై: పండుగశోభతో బంగారం ధరలు కళ కళలాడుతున్నాయి. సోమవారం పసిడి ధర రూ.200 పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.32,250కి చేరింది. విలువైన మెటల్స్‌లో మరో కీలకమైన వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. గత కొద్ది రోజులు నుంచి భారీగా తగ్గుతూ వచ్చిన వెండి ధర నేడు అమాంతం పెరిగింది. రూ.350 పెరగడంతో కేజీ వెండి రూ.39,750కి చేరింది. ప్యూచర్స్ మార్కెట్లో ఒక దశలో 400రూపాయలకు పైగా పుం/iకున్న బంగారం పది గ్రా. ధర 32వేల మార్క్‌ను క్రాస్ చేసింది. ప్రస్తుతం ధర పది గ్రా. రూ. 266 లాభంతో 32, 112 వద్ద ఉంది. ఢిల్లీలో, 99.9శాతం, 99.5శాతం స్వచ్ఛత పది గ్రాముల రూ .200 చొప్పున లాభపడి వరుసగా రూ .32,250 కు రూ. 32,100 గా నమోదయ్యాయి. సావరిన్ బంగారం ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఎనిమిది గ్రాముల బంగారం 100 రూపాయలు పెరిగి 24,700 వద్ద ఉంది. అలాగే సిల్వర్ కిలోకు 350 రూపాయలు పెరిగి 39,750 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, పండగ సీజన్, స్థానిక నగల వర్తకుల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లలో, బంగారం ధరలు 1శాతం పుంజుకోవడం, బలహీనమైన ఆసియా స్టాక్ మార్కెట్లు, చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఫెడ్ అధిక వడ్డీరేట్లు బంగారం ధరలను ప్రభావితం చేసినట్టు తెలిపారు. స్టాక్ మార్కెట్ క్రాష్ తరువాత గోల్డ్ మరింత ఆకర్షణీయంగా ఉందని సింగపూర్ డీలర్ గోల్డ్ సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్ పేర్కొన్నారు. -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లనుమళ్లీ పెంచింది. ప్రామాణిక ఫెడరల్ ఫండ్స్ రేటును 25శాతం పెంచింది. తాజా పెంపుతో ఫెడ్ ఫండ్ రేటు 1.75 శాతం నుంచి 2.0 శాతానికి చేరింది. ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోం హెచ్. పోవెల్ మాట్లాడుతూ, 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా బలపడిందని, తిరిగి సాధారణ పరిస్తితికి చేరుకుంటోందని పేర్కొన్నారు. 2018లో నిరుద్యోగిత రేటు అంచనాలను 3.6 శాతానికి తగ్గించింది. 2019లో మూడు సార్లు, 2020లో మరో ఒక దఫా రేట్ల పెంపు ఉండనుంది. కాగా ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి కాగా ఈ సంవత్సరం చివరికల్లా మరో రెండు సార్లు పెంపు ఉంటుందని యూఎస్ ఫెడ్ అధికారుల అంచనా. చివరిసారి గత మార్చిలో వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన ఫెడ్ 2015నుంచి ఏడుసార్లు వడ్డీరేట్లను పెంచినట్లయింది. అలాగే, 2019, 2020 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 2 శాతం పైనే ఉంటుందని కూడా అంచనా వేసింది. -
టీసీఎస్‌కు బైబ్యాక్ కిక్
సాక్షి,ముంబై: ఐటీ సేవల దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్ భారీ లాభాలతో ట్రేడ్అవుతోంది. ఈ నెల15న సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను పరిశీలించనుందన్నవార్తలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. భారీ కొనుగోళ్లతో టీసీఎస్ షేరు దాదాపు 3 శాతం పుంజుకుంది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 15న సమావేశం నిర్వహిస్తున్నట్లు టీసీఎస్ మంగళవారం తెలియజేసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలలో కొంతమేర వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే షేర్ల బైబ్యాక్‌కు వెచ్చించాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. కాగా గత ఏడాది రూ .16,000 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్‌ను నిర్వహించింది టీసీఎస్. మొత్తం ఈక్విటీలో 3 శాతం లేదా 5.61 కోట్ల షేర్లను ఈక్విటీ వాటాకి 2,850 రూపాయల ధర వద్ద కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
వరుసగా పదకొండో రోజూ ఆగని పెట్రోల్ పరుగు
-
పదకొండో రోజూ ఆగని పరుగు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇంధన ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆందోళన, విమర్శలు కొనసాగుతుండగానే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11 రోజుకూడా మోత మెగిస్తున్నాయి. వరుసగా 11 రోజు గురువారం కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు 19-31 పైసలు పెరిగాయి. ఈ మొత్తం 11 రోజుల్లోనూపెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు లీటరుకు రూ.2.50 మేర ఎగిసాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ ప్రకారం మే 24, గురువారం ఉదయం 6 గంటలనుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ .77.47 పలుకుతోంది. కోలకతాలో రూ. 80.12, ముంబైలో రూ .85.29, చెన్నైలో లీటరుకు 80.42 రూపాయలుగా ఉంది. ఉంది. అలాగే ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.68.53గానూ, కోలకతాలో రూ. 71.08, చెన్నైలో రూ. 72.35, ముంబైలో రూ .72.96 పలుకుతోంది. ఇక హైదారాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.07 పలుకుతోంది. లీటరు డీజిల్ ధర రూ. 74.49గా ఉంది. -
మండుతున్న చమురు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరింత ఎగిశాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.15 శాతం బలపడి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ సైతం 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారం అమెరికాలో చమురు నిల్వలు 1.4 మిలియన్ బ్యారళ్లమేర క్షీణించినట్లు ఆ దేశ ఇంధన శాఖ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్ స్టాక్పైల్స్ సైతం 3.79 మిలియన్లు తగ్గిందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. వెనిజులా చమురు సరఫరాలు సైతం తగ్గడం దీనికి మరోకారణంగా మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరా తగ్గుముఖం పట్టడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడురోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. వరుసగా పెట్రోల్ , డీజిల్ ధరలు ఇప్పటికే కొత్త గరిష్టాలను తాకుతున్న సంగతి తెలిసిందే. -
నాలుగునెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. మార్చి నెల 2.47 శాతంతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 3.18శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.6 శాతంగా ఉంది. ఆహార ధరల్లో పెరుగుదలో దీనికి దారి తీసింది. ప్రభుత్వం సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 0.67 శాతంగాఉంది. గత నెలల ఇది -0.07గా ఉండగా. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 0.87 శాతానికి పెరిగింది. గత నెలలో -0.29 శాతానికి పెరిగింది. నుంచి 0.0 శాతానికి పెరిగింది.సహజ వాయువు, ముడి పెట్రోలియం 2.4 శాతం పెరిగింది. గత నెలలో 80.2 శాతం నుంచి 82.1 శాతంగా నమోదైంది. కాగా డబ్ల్యుపీఐ మార్చి నెలలో 2.47 శాతానికి తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎనిమిది నెలల కనిష్ట స్థాయిని తాకింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 25శాతం జంప్..కానీ..
సాక్షి,ముంబై: యాక్సిస్బ్యాంకు క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో వృద్దిని నమోదు చేసింది. నికర లాభంలో 25శాతం పెరుగుదలను నమోదు చేసింది, అధిక వడ్డీ, ఫీజు ఆదాయాలు,బ్యాడ్ లోన్ల తగ్గుదల నేపథ్యంలో లాభాల్లో మెరుగుపడింది. యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక నికరలాభం 25 శాతం పెరిగి రూ .726 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .580 కోట్ల నుంచి రూ .780 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్ల బెడద 5.28 శాతానికి దిగివచ్చింది. ఇది గత క్వార్టర్లో 5.90శాతం ఉండగా, గత ఏడాది 5.22శాతంగా ఉంది.