Rythu Dinotsavam
-
కళ్యాణదుర్గం: వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు
-
ఆపదొస్తే నేనున్నా.. మనసున్న మారాజు మా రాజన్న
జననేత వైఎస్సార్ ఏ నాయకుడైనా దశాబ్దాల తరబడి ప్రజల మనసులలో గూడు కట్టుకుంటే ఆయన గొప్ప నాయకుడు అవుతారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనసులలో తన తండ్రితో పాటు తను గుర్తుండిపోవాలని కోరుకుంటుంటారు. నిజమే! జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల స్మృతిలో ఎలా ఉండిపోగలిగారు? ఒక ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు కారణమా? ఆయనలోని మానవత్వ కోణం కారణమా? తనను కలిసి సాయం అభ్యర్ధించినవారందరికి ఏదో రూపంలో సహాయపడాలని భావించే వ్యక్తి కావడం కారణమా? వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా అనేక రూపాలలో జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ప్రాతినిద్యం వహించిన రాజకీయ పార్టీపై భిన్నాభిప్రాయం కలిగినవారైనా, ఆయన వ్యక్తిత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన కొన్ని స్కీములు చిరకాలం నిలిచిపోయాయి. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సైతం వాటిని కొనసాగించవలసి రావడమే వాటి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అప్పట్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ను ఆయన ప్రతిపాదించి అమలు చేసినప్పుడు తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చు పెడితే సరిపోతుందని వాదించేది. పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం కాని వైఎస్ ఆర్ పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని తలపెట్టి ఆ స్కీమ్ ను కొనసాగించారు. అప్పట్లో కొన్ని సన్నివేశాలను మాబోటి వాళ్లం చూసి ఆశ్చర్యపోయామంటే అతిశయోక్తి కాదు. ఒకసారి ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తూ అక్కడే ఉన్న మెడికల్ షాప్ కు వెళ్లాను. అక్కడ ఒక పేద వృద్దురాలు ఒక కార్డును కౌంటర్ లో ఇచ్చి కొన్ని మందులు తీసుకుంది. ఇంత వృద్దురాలు, అంతగా చదువు లేని ఈ మనిషి ఇంత పెద్ద ఆస్పత్రికి ఎలా వచ్చిందా? అన్న ఆసక్తి కలిగి ఆరా తీశాను. వైఎస్ ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ కార్డు ఆధారంగా ఆమె వచ్చి డాక్టర్ కు చూపించుకుని మందులు కూడా తీసుకువెళుతోంది. ఆ రకంగా నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నేతగా వైఎస్ ఆర్ నిలిచిపోయారు. (చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్) బాబుకు ఆనాడే చెప్పారు ఆయనకు నీటిపారుదల ప్రాజెక్టులంటే ప్రాణం. ఈ మాట ఏదో ఇప్పుడు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకసారి హైదరాబాద్ జూబ్లిహాల్ లో ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్ సభ సభ్యుడిగా అప్పట్లో వైఎస్ ఉండేవారు. ఆ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ పోలవరం తదితర భారీ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, అలా చేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతావని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే ఎన్నికల ముందు ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసేవారు. 1999 ఎన్నికల తర్వాత వైఎస్ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో వైఎస్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాళ్ల వద్ద పూలు పెట్టి నిరసన తెలిపేవారు. తదుపరి 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ప్రాదాన్యత క్రమంలో ఇరిగేషన్ కు సంబందించి ఒక అధికారిక సమావేశం మంత్రులతో నిర్వహించారు. ఆ సందర్భంగా శర్మ అనే సీనియర్ ఐఎఎస్ అధికారి ఉండేవారు. ఆయన ఆ సమావేశంలో ఒక నివేదిక ఇచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. నలభైఆరువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తే ఇరవైతొమ్మిది ప్రాజెక్టులను చేపట్టవచ్చని వివరించారు. అప్పట్లో జెసి దివాకరరెడ్డి కూడా వైఎస్ క్యాబినెట్ లో ఉండేవారు. ఇంత పెద్ద నివేదికను చంద్రబాబుకు చూపించలేదా అని అడిగారు. దానికి ఆ అధికారి సమాధానం ఇస్తూ తాము చూపించామని, కాని అంత ఆసక్తి కనబరచలేదని, దాంతో దానిని పక్కనపెట్టామని చెప్పారు. ప్రభుత్వం చూపే శ్రద్దను బట్టే తాము నివేదికలు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇది వాస్తవమే. చంద్రబాబు సి.ఎమ్. గా ఉన్న రోజుల్లో పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ఎవరైనా అడిగినా సీరియస్ గా తీసుకునేవారు కారు. అవి అయ్యే ప్రాజెక్టులు కావని ఆయన భావించేవారు. ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని వైఎస్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేశారు. ఆ రోజు అధికారిక సమావేశం నుంచి బయటకు వచ్చి లిప్ట్ లో కిందకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న పాత్రికేయులను ఆయనే వాట్ సర్ అంటూ పలకరించారు. (చదవండి: అన్నదాత కలల పండుగ!) అలా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఆ క్రమంలో నా వద్దకు కూడా ఆయన వచ్చారు. పోలవరం, పులిచింతల పూర్తి చేస్తారా? సార్ ? అని నేను ప్రశ్నించాను. అవును చేసి చూపిస్తాం సార్ అని జవాబు ఇచ్చారు. అదే విషయాన్ని ఆ తర్వాత తిరుపతి మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు. పట్టు వదలని వైఎస్సార్ అయినా అవి అంత తేలికగా అవుతాయా అన్న సంశయం ఉండేది. కాని వైఎస్ ఆర్ మాత్రం పట్టు వదలిపెట్టలేదు. చంద్రబాబు టైమ్ లో పులిచింతల ప్రాజెక్టును నల్గొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు వ్యతిరేకించేవారు. దాంతో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టిడిపి నేతలు ఈ ప్రాజెక్టు గురించి అడిగినా, ఇప్పుడు మాట్లాడవద్దంటూ వారిని వారించేవారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం సంబంధిత నాయకులను పిలిచి మాట్లాడి ఎవరైనా సహకరించాల్సిందేనని స్పష్టం చేసి పనులు ఆరంభించారు. అదే ఈరోజు కృష్ణా,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు వరదాయిని అయింది. ఈ ఏడాది జూన్ మొదట్లో ఆశించిన మేర వర్షాలు పడలేదు. అయినా పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసిన నీటిని సాగునీటి అవసరాలకోసం ప్రభుత్వం విడుదల చేయగలిగింది. మహానేత ముందు చూపు పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఈ స్వరూపం సంతరించుకోవడానికి కారణం వైఎస్ ఆర్ అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఆయన పోలవరంపై అఖిలపక్షం పెట్టి దాని ఆనుపానులను చర్చించారు. అంతేకాదు. ఖమ్మం జిల్లాలో, పశ్చిమగోదావరి జిల్లాలో ముంపు ప్రాంతవాసులకు, నిర్వాసితులకు అప్పట్లో మంచి ప్యాకేజీ ప్రతిపాదించి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రావల్సిన అనుమతులు సంపాదించడంలో నిర్విరామకృషి చేశారు. అవన్ని ఒక రూపానికి వచ్చిన దశలో, ప్రాజెక్టు పనులు ఆరంభించబోయే టైమ్ కు ఆయన దురదృష్టవశాత్తు కన్నుమూశారు. అయినా ఆయన కలలు కన్న పోలవరం ఇప్పుడు సాకారం అవుతోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా రాష్ట్ర విభజన సమయంలో ఒప్పుకోవడానికి అప్పటికే అన్ని అనుమతులకు ఓకే కావడం కూడా కారణం అని చెప్పాలి. అప్పట్లో పోలవరం కుడి, ఎడమ కాల్వల తవ్వకం చేపట్టి విశాలమైన కాల్వలను నిర్మించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలేమిటని అప్పట్లో టిడిపి విమర్శించేది. కాని వైఎస్ దూరదృష్టి ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు టైమ్ లో పట్టిసీమ లిప్ట్ ను చేపట్టగలిగారంటే దానికి కారణం వైఎస్ తవ్వించిన కాల్వే. ఈ రోజుల్లో ఈ కాల్వలకు భూ సేకరణ చేయాలంటే ఎంతో కష్టం అయ్యేది. ఈ రకంగా ఆయన చేసిన మేలును విభజిత ఆంద్రప్రదేశ్ ఎన్నటికి మరవదు. అదే కాదు. వెలిగొండ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ.. వాటన్నిటిపై ఎన్నో రకాలుగా విపక్షాలు అడ్డు తగలడానికి ప్రయత్నించినా ఆయన లెక్క చేయలేదు. అవే ఇప్పుడు ఎపికి ప్రాణపదంగా మారాయి. హైదరాబాద్ అభివృద్దికి అవుటర్ రింగ్ రోడ్డు ఎంతగా ఉపకరిస్తోందో చెప్పనవసరం లేదు. దానికి పునాదిరాయి వేసింది వైఎస్ ఆరే. భూ సేకరణ జరిపించింది ఆయనే. ప్రధానిని ఒప్పించిన వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాదించి ఆనాటి ప్రధానిని ఒప్పించిన ఘనత కూడా వైఎస్ దే. చంద్రబాబు నాయుడు టైమ్ లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించి మొత్తం హైదరాబాద్ నగరాన్ని తానే కట్టానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి పరిశ్రమలు ఆయన టైమ్ లో వచ్చాయి. కాని కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో విఫలం అయింది. అంతేకాక సోనియాగాంధీ మాట వినలేదన్న కక్షతో ఏకంగా వైఎస్ కుమారుడైన జగన్ స్థాపించిన పరిశ్రమలలో పెట్టుబడులపై పిచ్చి ఆరోపణలతో కేసులు పెట్టించి జైలులోకూడా నిర్భందించారు. దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేకుండా పోయింది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని చాలా కష్టపడుతోంది. ఎపిలో అయితే ఆ ఆశ కూడా లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పట్టణాలలో రాజీవ్ గృహకల్ప వంటి స్కీములు చేపట్టారు. జిల్లా కేంద్రాలన్నిటిలో రోడ్లకు ఒక షేప్ తెచ్చి అందంగా తయారు చేయించడంలో ఆయన ప్రభుత్వ కృషి ఎంతగానో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అడిగితే కాదనని నేత వ్యక్తులుగా తనను కలిసినవారిపట్ల ఆయన ఎంతో ఆదరణ చూపించేవారు. ఉదాహరణకు పులివెందుల నుంచి నీరుకావి పంచె కట్టిన ఒక సామాన్య రైతు వచ్చి సెక్రటేరియట్ లో వైఎస్ ను కలిశారు. ఆయన తన ఇంటిలో పెళ్లికి ఆర్ధికసాయం అడిగారు. వెంటనే వైఎస్ ఎవరికో పోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్లి డబ్బు తీసుకోవాలని సిబ్బంది చెప్పారు. ఆ రైతు అక్కడకు వెళ్లారు. ఆయన వెళ్లి ఒక పారిశ్రామికవేత్తను కలిసి సార్ వెళ్లమన్నారని చెప్పగా ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఈ వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వడమా అని అనుకున్నారు. అసలు ఎందుకు ఈ డబ్బు వాడాలని అనుకుంటున్నది అడిగాడు. దానికి తన ఇంటిలో పెళ్లి గురించి ఆ రైతు చెప్పగానే చాలా సంతోషంగా ఆ పారిశ్రామికవేత్త డబ్బు అందచేశాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో ఒక ప్రముఖుడు నాకు చెప్పారు. ఇలా ఒకటికాదు. ఉదయాన్నే ప్రజాదర్బార్ లో విన్నపాలు ఇవ్వడానికి వచ్చేవారందరిని పలకరించి వారి సమస్యలు వినేవారు. ఒకసారి ఒక వ్యక్తిని చూసి ఇదేమిటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. మిమ్మల్ని కలవడానికే వచ్చానని అతను చెప్పారు. వెంటనే ఆయనను క్యాంప్ ఆఫీస్ లోని ఒక గదిలో కూర్చోబెట్టమన్నారు. దర్బార్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన ఆర్దికసాయం కోసం వచ్చారు. ఆ వివరాలు తెలుసుకుని తను చేయదగిన సాయం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే వైఎస్ కు క్లాస్ మేటే. తెనాలి నుంచి వచ్చిన ఆయనను అంత ఆదరంగా చూసి పంపించారు. ఇలా ఎన్నో ఘట్టాలు వైఎస్ చరిత్రలో ఉన్నాయి. ఆ 30 సీట్లు ఎంతో కీలకం ఇక రాష్ట్ర విభజనపై ఆయన అభిప్రాయాలు అందరికి తెలిసినవే. అందులో రాజకీయ కోణాలు ఎలా ఉన్నా, వైఎస్ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నది ఎక్కువ మంది నమ్మకం. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మొత్తం బాధ్యతను తన భుజ స్కందాల మీద వేసుకుని పార్టీని గెలిపించారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రాగలిగిందంటే ఎపి నుంచి వచ్చిన ముప్పైకి పైగా లోక్ సభ సీట్లు ఎంత కీలకం అయ్యాయో చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ కి వచ్చేసరికి కాంగ్రెస్ కు 156 సీట్లే వచ్చాయి. అధికారం వచ్చినా ఆ సీట్ల సంఖ్య తనకు సంతృప్తి కలిగించలేదు. అందుకే తనకు ప్రజలు పాస్ మార్కు మాత్రమే ఇచ్చారని, వచ్చేసారి ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేలా పాలన చేస్తానని నిజాయితీగా తన అభిప్రాయాన్ని వైఎస్ ఆర్ చెప్పారు. ఒక నేత లేకుంటే రాష్ట్రం ఎన్ని గండాలను ఎదుర్కుంటుందో చెప్పడానికి ఆ రోజుల్లో చాలా మంది వైఎస్ లేని లోటు గురించి ఉదహరించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ప్రస్తుతం విభజిత ఎపిలో అంతకు మించిన పాలన అందించడమే కాదు. వైఎస్ ఆర్ ను నిత్యం జనం గుండెల్లో ఉండేలా చేస్తూ, ఆయన జయంతిని ఒక పండగలా మార్చారు. ఏ కుమారుడు తన తండ్రికి ఇంతకన్నా గొప్ప నివాళి అర్పించలేడని రుజువు చేసుకుంటున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్
Updates: ►తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్ ►వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ►ఏ పథకం చూసిన గుర్తుకొచ్చే నేత వైఎస్సార్ ►వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు గుర్తొస్తాయి. ►దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంటబీమా పరిహారం జమ చేస్తున్నాం ►2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం ►రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుంది. ►ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు ►మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు ►గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించారు. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొనున్నారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేతకు నివాళులర్పిస్తారు. 9న గండికోటకు సీఎం జగన్ ఈనెల 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్ ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్–1 పనులను, పులివెందులలో నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారం¿ోత్సవం చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు కడపలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి
పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ముందుచూపు, చకచకా అభివృద్ధితో ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన ఆ వైతాళికుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని అజేయుడి 73వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ.. (రామగోపాల్ ఆలమూరు – సాక్షి, అమరావతి): ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఐదేళ్ల మూడు నెలలపాటు మాత్రమే పని చేశారు. కానీ.. ఆ కొద్ది కాలంలోనే పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సమగ్రాభివృద్ధివైపు ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. రూపాయి డాక్టర్‌గా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అపర భగీరథుడు ‘1978లో శాసనసభలో తొలిసారి అడుగు పెట్టాక కోస్తా పర్యటనకు వెళ్లినప్పుడు కాలువల్లో గలగలా పారుతున్న నీటిని చూసి కరువుతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకు కూడా జలధారలు అందించాలనే సంకల్పం నాలో ఏర్పడింది. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కోరితే.. ‘‘దోసిలి పట్టు.. పోస్తా’’ అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజు నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో సీఎంగా సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం తలపెట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరానికి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా.. 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. అనారోగ్యం పాలైన పేద కుటుంబాలు ఆపత్కాలంలో సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన ప్రయాసలకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎనలేని భరోసా ఇచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. పేదరికానికి విద్యతో విరుగుడు.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని ధృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడకుండా వివిధ పనుల కల్పన ద్వారా వైఎస్సార్ నివారించగలిగారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు. అజేయుడు.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైఎస్సార్ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు. రైతును రాజు చేసిన మారాజు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. నేడు రైతు దినోత్సవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలుత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేస్తున్నారు. రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు.. వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా రూ.1,27,633.08 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన విషయాన్ని రైతులకు వివరించనున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం లబ్ధి కలిగిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైఎస్సార్ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నింటిపై రైతు దినోత్సవ వేడుకల్లో అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. -
రాజన్న రాజ్యంలో రైతే రారాజు.. రైతు దినోత్సవం సందర్భంగా
సాక్షి, అమరావతి : వైఎస్సార్.. ఆయన ప్రతీ అడుగు రైతు కోసమే.. ప్రతీ ఆలోచన రైతు సంక్షేమం కోసమే.. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలిసంతకంతో మొదలైన తన పాలనలో విద్యుత్ బకాయిల మాఫీ, రుణమాఫీ, గిట్టుబాటు వ్యవసాయం, సహకార రంగానికి ఆర్థిక చేయూత, జలయజ్ఞం వంటి కార్యక్రమాలతో అన్నదాత గుండెల్లో దైవంగా నిలిచారు. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పైలుపై మొదటి సంతకం చేశారు. అప్పటివరకు ఉన్న విద్యుత్ బకాయిలు రూ.1,100 కోట్లను ఒక్క సంతకంతో మాఫీచేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం ఉచిత విద్యుత్‌ను సమర్ధవంతంగా అమలుచేసి ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలు బట్టలు ఆరబెట్టుకోడానికే ఉపయోగపడతాయంటూ హేళన చేసిన నాటి ప్రతిపక్ష నేతల నోళ్లకు తాళాలు వేశారు. ఈ పథకం ద్వారా నేడు తెలుగు రాష్ట్రాల్లో 40.25 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. పైసా భారంలేకుండా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. వైఎస్సార్ బాటలోనే ఇప్పుడు తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రుణమాఫీని అమలుచేయించిన ఘనత వైఎస్సార్‌దే. ఈ పథకం కింద అత్యధికంగా సుమారు రూ.12 వేల కోట్లకు పైగా లబ్ధిపొందింది ఏపీ రైతులే. ఇక రుణమాఫీ దక్కని 36లక్షల మంది రైతులకూ లబ్ధిచేకూర్చాలనే లక్ష్యంతో ఒకొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహం కింద రూ.1,800 కోట్లు వారి ఖాతాలో నేరుగా జమచేశారు. టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకూ రూ.2 లక్షల పరిహారాన్ని అందజేసి వైఎస్ ఆదుకున్నారు. గిట్టుబాటు వ్యవసాయం.. సహకారానికి సాయం 1999లో క్వింటాల్‌కు రూ.490లు ఉన్న ధాన్యం మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550లకు చేరింది. అంటే ఐదేళ్లలో పెరిగిన మద్దతు ధర కేవలం రూ.60 (12.5 శాతం). అలాంటిది 2004-09 మధ్య రూ.550 నుంచి రూ.1,000లకు మద్దతు ధర పెరిగింది. వైఎస్సార్ హయాంలో పెరిగిన మద్దతు ధర అక్షరాల రూ.450 (82.5 శాతం). ధాన్యం ఒక్కటే కాదు అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు అదే స్థాయిలో పెరిగేందుకు కృషిచేశారు. మహానేత హయాంలో మద్దతు ధరల కంటే ఎక్కువ మొత్తానికి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగారు. మరోవైపు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 డీసీసీబీల్లో 18 దివాళ తీసేస్థాయికి చేరుకోగా, వైద్యనాథన్ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800కోట్ల సాయమందించి వాటిని లాభాలబాట పట్టించారు. సహకార వ్యవస్థకు జవసత్వాలు కల్పించి గాడిలో పడేటట్లు చేశారు. జలయజ్ఞం.. కరువుకు కళ్లెం 2004 నాటికి రాష్ట్రంలో సాగునీటి వనరులున్న వ్యవసాయ విస్తీర్ణం 80లక్షల ఎకరాలు మాత్రమే. కానీ, బీడు భూములన్నింటినీ సశ్యశ్యామలం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా.. రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు జలయజ్ఞం కింద 86 ప్రాజెక్టులు చేపట్టారు. రూ.54 వేల కోట్లు ఖర్చుచేసి 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తిచేశారు. 23.49 లక్షల ఎకరాలకు కొత్తగా నీరందించగా, 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడమే కాదు ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. కుడిఎడమ కాలువలను దాదాపు పూర్తిచేశారు. జలయజ్ఞంలో చేపట్టిన పనుల్లో 70 శాతం పూర్తిచేశారు. రాష్ట్రం నుంచి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతీ లబ్ధిదారునికి రూ.30 వేల రాయితీతో రూ.1.50 లక్షల విలువైన పాడి పశువులను అందించారు. -
నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు: సీఎం జగన్
రాయదుర్గం: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిపియని సీఎం తెలిపారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సీఎం జగన్ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు ఆనాడు ఏం చేశావ్? అయ్యా చంద్రబాబు ఇవాళ మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌లు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా ’ అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అని చంద్రబాబుని సీఎం జగన్ నిలదీశారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా రైతులేనని, రైతుల కోసం అందరూ కలిసి రావాలని సీఎం అన్నారు. నీటిని రాజకీయాలకు వాడుకోవద్దని సీఎం జగన్ సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంక్షేమ శేఖరుడు.. రాజన్న
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఉద్యాన వర్సిటీని స్థాపించి ఉద్యాన రైతులకు ఆసరాగా నిలిచారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. ఆరోగ్యశ్రీ, 108లతో ప్రాణదాతగా నిలిచారు.. నీటిపారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు. అడుగడుగునా తన గురుతులతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. గురువారం ఆయన జయంతి సందర్భంగా మహానేతా.. అందుకో మా జోత అంటూ పశ్చిమవాసులు నివాళులర్పిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: పశ్చిమగోదావరి సమృద్ధిగా ఉండాలి. అన్నదాతకు సాగు కష్టాలు తీరితేనే అంతా బాగుంటుంది. అవసరాలకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వగలితే అంతా చేసినట్టే ఇది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నమ్మినమాట. దానిని ఆచరణలో పెట్టడంతో ‘పశ్చిమ’ ముఖ చిత్రం మారేలా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శాశ్వతంగా తన ముద్ర ఉండేలా మేలు చేశారు. రాష్ట్ర జీవనాడి పోలవరం కోసం వైఎస్సార్ పరితపించారు. అన్ని అనుమతులూ తీసుకువచ్చి కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 80 శాతానికిపైగా పనులు పూర్తి చేయించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఈస్థాయిలో పరుగులు పెట్టడానికి వైఎస్సార్ చూపిన చొరవే కారణం. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఆయన చలువతోనే రూపుదిద్దుకున్నాయి. ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపారు. 2005లో రూ.17 కోట్లతో మరమ్మతులకు నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన రూ.90 కోట్లతో తమ్మిలేరు కరకట్టను పరిపుష్టి చేశారు. ఏజెన్సీలోని కొండ కాలువలపై హైలెవెల్ బ్రిడ్జిని రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరు చేసినా ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ వంతెనను కలగా మిగిల్చాయి. జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్మెంట్ నిర్మించడానికి చొరవ చూపడంతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు. జిల్లాలో అర్హులైన పేదలకు 30 వేల ఎకరాలు భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసి రైతు బాంధవుడిగా నిలిచిపోయారు. గిరిజనులకు పట్టాలు జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు సుమారు 30 వేల ఎకరాల పోడు భూములకు గాను వైఎస్సార్ పట్టాలిచ్చారు. గిరిజన ప్రాంతంలోని సుమారు 1,700 మంది గిరిజన పోడు భూమి రైతులకు 6,500 ఎకరాలకు పట్టాలను అందించడంతో పాటు భూములను సాగులోకి తీసుకువచ్చేలా బోర్లు వేయించి విద్యుత్ సదుపాయం కల్పించారు. ఉద్యాన’ వెలుగులు తాడేపల్లిగూడెంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఉద్యాన సాగు అభివృద్ధితో పాటు యువతకు విద్యావకాశాలు కల్పించేలా ఆయన తీసుకున్న చొరవ చిరస్మరణీయం. పోగొండ జలాలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తికావడంలో వైఎస్సార్ చొరవ ఉంది. ప్రస్తుతం సుమారు 7,600 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందంటే అది ఆయన చలువే. -
తెలంగాణలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి తెలంగాణలోనూ ఘనంగా జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సర్కిల్లో కేక్ కట్‌చేశారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలలో భాగంగా గూడూరు, కొండ్రపోల్, బొత్తలపాలెం, దామచర్లలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇంజమ్ నర్సిరెడ్డి, మిర్యాలగూడ అధ్యక్షుడు పిల్లుట బ్రహ్మం, దామచర్ల అధ్యక్షుడు అన్నెం కరుణాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరిలోనిన కిసాన్ నగర్లో శక్తీ మిషన్ అధ్యక్షురాలు కర్తాల శ్రీనివాస్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తులు సత్యనారాయణలు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల వైఎస్సార్ జయంతిని సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి
సాక్షి, అమరావతి: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప: వైఎస్సార్ జయంతి సందర్భంగా వేంపల్లిలో ఉర్దూ జూనియర్ కళాశాలను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఉర్దూ కళాశాల మంజూరుకు సహకరించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్దికి ముస్లిం మైనారిటీలు కృతజ్ఞతలు తెలిపారు. నాడు వైఎస్సార్ ఇచ్చిన హామీని వైఎస్సార్ జయంతి సందర్భంగా నేడు సీఎం వైఎస్ జగన్ నెరవేర్చడంతో మైనారిటీలు ఆనందం వ్యక్తం చేశారు. వేంపల్లిలో ఉర్దూ జునియర్ కలాశాలకు రూ.4 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రొద్దుటూరులో వైఎస్సార్ జయంతి సందర్భంగా రూ. 86 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 311 మందికి వైఎస్ఆర్సీపీ నాయకులు పంపిణీ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య బద్వేలు, గోపవరం ,అట్లూరు మండలంలోని పలు చోట్ల ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఘనంగా వైఎస్సార్ 71వ జన్మదిన జయంతి వేడుకలు జరిగాయి. పట్టణంలోని సాయిరాం థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు: జిల్లాలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో మంత్రి అనిల్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. రాపూరు, సైదాపురం, పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. అదే విధంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ చేశారు. డక్కిలి, వెంకటగిరిలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, మార్టేరు,పెనుగొండ, ఆచంటలో దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు ఘనంగా వైఎస్సార్ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదర్శ రైతులను సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్ పుట్టిన రోజు నాడు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు ఇంచార్జ్ గోకరాజు కనక రంగరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహ రాజు పెదఅమిరం గ్రామంలో కేక్ కట్ చేసి, వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో దివంగత నేత వైఎస్సార్ 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భీమవరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పూల మాల వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కామన నాగేశ్వరరావు , ఏఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి: రాజమండ్రిలో వైఎసాఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ జయంతోత్సవం నిర్వహించారు. నగరంలోని పలు చోట్ల ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదే విధంగా కొంతమూరులో రైతులకు సన్మానం చేశారు. కృష్ణా: గుడివాడలో దివంగత నేత వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి కొడాలి నాని పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, రాష్ట్ర నాయకులు శశిభూషణ్, మండల హనుమంతరావు, గొర్ల శీను, అడప బాబ్జి, పాలేరు చంటి పాల్గొన్నారు. పెడన మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జోగి రమేష్ దివంగత నేత వైఎస్సార్ 71వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బండారుమల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ బండారూ ఆనందప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గరిక ముక్కు చంద్రబాబు, మెట్ల గోపి, కటకం ప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో రైతు దినోత్సవం వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ రోజు తమ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ రెండు అడుగులు వేసి పాలన సాగిస్తున్నారని తెలిపారు. మహానేత రాజశేఖరరెడ్డి ఆత్మ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటుందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా కైకలూరు మార్కెట్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నోబుల్, ముంగర నరసింహారావు, అడవి కృష్ణ, గాదిరాజు నారాయణరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు తిరుపతి ఘనంగా జరిగాయి. తుడా సర్కిల్లో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. తెలుగు రాష్టాల ప్రజల మనస్సులను చురగొన్న వైఎస్సార్ గొప్ప పాలనను అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలో వైఎస్సార్ 71వ జయంతిని ఎమ్మెల్యే వెంకటేగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం: జిల్లాని చీరాలలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహనికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూల మాల లేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి దివంగత నేత రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ఆయన జన్మదినాన్ని ర్తెతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయ౦ అన్నారు. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం రెండుగా విడిపోయేది కాదన్నారు. రాజధాని పేరుతో చ౦ద్రబాబు వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఒంగోలులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చర్చి సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి , శిద్ధా రాఘవరావు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం నల్ల కాలువ గ్రామ సమీపంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతి వనంలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. వైయస్ఆర్ కాంస్య విగ్రహానికి నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య, శిల్ప భువనేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా బ్రహ్మణ కొట్కూరులో ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, అధికారులు పాల్గొన్నారు. ఆదోనిలో వైస్సార్ జయంతి సందర్భంగా వైస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలాభిషేకం చేసి పుల మాల వేశారు. అనంతపురం: వైఎస్సార్ జయంతి సందర్భంగా కదిరిలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సిద్దారెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మడకశిరలో వైఎస్సార్ సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పూల మాల వేసి నివాళులు అర్పించారు. విశాఖ పట్నం: దివంగత మహానేత వైఎస్సార్ 71 జయంతిని పురస్కరించుకుని పాయకరావుపేటలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గొల్ల బాబురావు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతు భరోసా కేంద్రo నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యలమంచిలిలో ఘనంగా వైస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. వైస్సార్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్యదొర,రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్, రంగా సాయి, బెజవాడ నాగేశ్వరరావు, కర్రి శివ, వియ్యపు గోపి పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బాలయ్య శాస్త్రి లే అవుట్లో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. శ్రీకాకుళం వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు పాల్గొన్నారు. టెక్కలిలో వైఎస్సార్ 71 వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ కాకుళం పార్లమెంట్ కన్వినర్ దువ్వాడ శ్రీనివాస్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. రణస్థలంలో చ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నరసన్నపేటలో వైఎస్సార్ 71 వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమదాలవలసలో వైఎస్ రాజశేకరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలకొండలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే వి.కళావతి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. రాజాంలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కంబాల జోగులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. పలాసలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పూల మాల వేసి నివాళులు అర్పించారు. గుంటూరు : జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. తెనాలిలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేదలకు అన్నదానం చేశారు. అదే విధంగా రైతు దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతులకు సన్మానం చేశారు. నిజాంపట్నంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు పూల మాల వేసి నివాళులు అర్పించారు. మంగళగిరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. బాపట్లలో వైఎస్సార్ జయంతి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కేక్ కట్ చేశారు. అనంతరం వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద జెండా అవిష్కరించారు. నరసరావుపేటలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో రైతు భరోసా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. -
జలయజ్ఞ ప్రదాత రాజన్న
సాక్షి, విజయనగరం: భూమి ఉన్నా నీరు లేక... అదను దాటిపోతున్నా దున్నుకోలేక.. సొంత పొలమున్నా సాగులేక... బతుకు తెరువు కోసం పరాయి పంచన కూలీలై కష్టాలు పడుతున్న జిల్లా రైతుల పాలిట రాజశేఖరరెడ్డి అపర భగీరథుడయ్యారు. ఆసియాలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించారు. పెద్దగెడ్డ నుంచి పంట చేలకు సాగునీరందేలా రిజర్వాయర్ కట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును తొంభైశాతం పూర్తి చేశారు. సాగు, తాగునీరు ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు పూర్తిస్థాయిలో చేయూతనందించి ఇక్కడి అన్నదాతలకు దేవుడయ్యారు. ఆ మహనీయుని 71వ జయంతి నేడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుతూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పడింది. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గానికి మంజూరు చేశారు. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించారు. వెంగళరాయ సాగర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాలువలు అభివృద్ధి పనులు చేశారు. అరుదైన రబ్బర్ డ్యామ్ కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో జంఝావతి డ్యామ్‌నకు శ్రీకారం చుట్టారు. కానీ పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేపట్టకపోవడంతో ఒడిశాతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని తొలగించేందుకు అటు ఒడిశా, ఇటు ఏపీ ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ ఒడిశా ప్రభుత్వం ముంపు గ్రామాలను వదులు కోవడానికి ససేమిరా అనడంతో అక్కడ డ్యామ్ రివర్ గ్యాప్ మూసివేయకుండా వదిలేశారు. దీనివల్ల నదిగుండా ప్రవహించే నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన గమనించిన మహానేత 2006లో ఆ్రస్టియా టెక్నాలజీతో రూ.5 కోట్లతో ఆసియాలోనే మొట్టమొదటి సారిగా రబ్బరు డ్యామ్‌ను నిర్మించారు. రబ్బరు డ్యామ్ ద్వారా నీటిని నిల్వచేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు సాగునీటిని అందించే అవకాశం కలిగింది. డ్యామ్ లోపలి భాగంలో 0.03 టీఎంసీల నీరు నిల్వ ఉండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుకూలమైంది. దీని ద్వారా 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తోటపల్లితో మారిన దశ గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సింహభాగం పనులు టీడీపీ అధికారం చేపట్టకముందే జరిగాయి. తోటపల్లి చానల్ ద్వారా సుమా రు 3వేల ఎకరాలకు నీరందించేందుకు పైలాన్ ప్రారంభోత్సవాన్ని వైఎస్ అప్పట్లో చేశారు. పార్వతీపురం మండలం అడారుగెడ్డ నిర్మాణానికి కూడా రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధులు కేటాయించారు. విజయనగరం పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు 2007లో సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తొలి జలయజ్ఞ ఫలం పెద్దగెడ్డ పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్ పేరు చెప్పగానే అక్కడి ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్సార్. జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో పెద్దగెడ్డ రిజ ర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను 2006లో ఆయనే ప్రారంభించారు. ఈ సమయంలోనే సమీపంలోని అరుకు–పాచిపెంట ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరి యల్ సర్వే నిర్వహించారు. ఇక్కడ అందాలను చూసి అబ్బురపడ్డారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు చేశారు. అప్పుడే సుమారు 2 ఎకరాల పా ర్క్ ఏర్పాటయ్యింది. రిజర్వాయర్‌లో ఉండే నాటు పడవల స్థానంలో విశాఖపట్నం నుంచి మిషన్బోట్లు తీసుకువచ్చా రు. ఇవే గాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే రూపకల్పన చేసి వాటి ఫలాలను జిల్లాకు అందించారు. -
వైఎస్సార్ హయాం సాగునీటి శకం
ఆంధ్రప్రదేశ్ తెలుగు క్యాలెండర్లో కొత్త పండగ చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రైతు దినోత్సవం అయింది. ముక్కారు పంటలతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్న సింహపురిలో వైఎస్సార్ హయాం సాగునీటి శకంగా మారింది. వ్యవసాయ రంగాన్ని ప్రస్తావించాలంటే క్రీ.పూర్వం.. క్రీ.శకం అన్నట్లుగా దశాబ్దం ముందు వైఎస్సార్, దశాబ్దం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ఈ రోజు పల్లెకు ఆ పండగొచ్చింది. వైఎస్సార్ కేవలం ఐదేళ్ల తన పాలనలో వందేళ్ల అవసరాలు తీర్చేలా సాగునీటి రంగం అభివృద్ధికి పునాదులు వేశారు. ఆయన హయాంలోనే కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. మరి కొన్ని పురుడు పోసుకున్నాయి. జిల్లాలో చారిత్రాత్మకంగా చెప్పుకో దగిన ప్రాజెక్ట్‌ల్లో 78 టీఎంసీ సామర్థ్యం కలిగిన సోమశిల ఒకటి. దాదాపు మూడు దశాబ్దాలుగా 35 టీఎంసీల సామర్థ్యం దాటని ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి సామర్థ్యానికి పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ రెండోది. సీఎంగా ఉండి నేదురుమల్లినే పూర్తి చేయలేకపోయిన స్వర్ణముఖిని వైఎస్సార్ రెండేళ్లలోనే పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. చారిత్రాత్మకమైన నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలకు శ్రీకారం చుట్టితే.. దశాబ్ద కాలంగా పురోగతికి నోచుకోలేదు. వీటిని ఈ ఏడాది ఆఖరులోగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే తెలుగుగంగ, ఎస్ఎస్ కెనాల్‌తో పాటు ప్రధాన పట్టణాల దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. సాక్షి, నెల్లూరు: అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురిని జలపురిగా మార్చిన అపర భగీరథుడు. దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు జలయజ్ఞం చేసిన పాలక కర్షకుడు. వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్‌లకు పునాదులు వేసి, పూర్తి చేసిన జలయాజి్ఞకుడు.. రాజశేఖరుడిని దశాబ్దం తర్వాత కూడా జిల్లా రైతాంగం స్మరిస్తోంది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్ నిర్వహించిన పాదయాత్ర తర్వాత జిల్లాలో బస్సు యాత్రలో అడుగడుగునా అన్నదాతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో సాగునీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. జలయజ్ఞం ద్వారా వందల రూ.కోట్లతో సమగ్ర సోమశిల నుంచి పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం వరకు అన్నింటికి ఆయన అంకురార్పణ చేశారు. ప్రధానంగా 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకు వచ్చారు. సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు. జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్‌లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించారు. సంగం బ్యారేజీ.. 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత బ్యారేజీ స్వరూపం మారడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహించడంతో పనులు నేటికి సాగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించారు. ప్రస్తుతం 85 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 1,185 మీటర్ల పొడవు, 84 గేట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 42 ర్యాంపులకు గాను 38 పూర్తి చేశారు. బ్యారేజీ పూర్తయితే.. జిల్లాలోని 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహపడుతుంది.పెన్నా డెల్టా లో 2.47 లక్షల ఎకరాలకు, కనుపూరు కెనాల్ పరిధిలో 63 వేల ఎకరాలు, కావలి కెనాల్ 75 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడానికి దోహదపడుతుంది. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సాగుకు లబ్ధి చేకూరుతుంది. సోమశిల నుంచి 40 కిలో మీటర్ల దిగువ భాగంలో దీన్ని నిర్మించడం ద్వారా కుడి వైపున నెల్లూరు చెరువు, నెల్లూరు కాలువ, కనుపూరు కాలువ, కనిగిరి ప్రధాన కాలువ, దువ్వూరు కాలువ, కావలి కాలువ పరిధిలోని 3.85 లక్షల ఎకరాల సాగుకు ఇబ్బంది లేకుండా నీటి విడుదల జరుగుతుంది. పెన్నా బ్యారేజ్.. 2008లో పెన్నా బ్యారేజీ రూ.126 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజీని నిర్మిస్తున్నారు. 0.55 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో తలపెట్టిన పెన్నాబ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా ప్రస్తుతం రూ.149.39 కోట్లకు చేరి 90 శాతం పనులు పూర్తి చేసుకుంది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించడంతో వేగంగా సాగుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొద్ది నెలల్లో పూర్తయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తామని ప్రకటించారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణంతో 5 మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్ కాలువల పరిధిలోని ఈ ఆయకట్టుకు పూర్తిగా నీరందుతుంది. నెల్లూరు నగర తాగునీటి అవసరాలు తీరుతాయి. నెల్లూరు–కోవూరు రహదారి మార్గంలోనూ పూర్తిగా ఇబ్బందులు తొలగుతాయి. 35 ఏళ్ల కల.. మూడేళ్లలో సాకారం వాకాడు: స్వర్ణముఖి నదిపై బ్యారేజీ కం బ్రిడ్జి నిర్మాణం చేయాలనే 50 ఏళ్ల డిమాండ్.. 35 ఏళ్ల కలను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. పాతిక వేల ఎకరాల వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారు. నదీ పరివాహక ప్రాంతమైనా సాగునీటి కొరత కారణంగా కరువు తాండవం చేసేది. 1972లో స్వర్ణముఖి నదిపై గ్రైయిన్ వాల్ ఆనకట్ట నిర్మాణానికి అప్పటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుతో రూ.6 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేయించారు. కానీ పూర్తి చేయలేకపోయారు. 1990లో జనార్దన్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతాంగం కష్టాలు తీర్చాలని స్వర్ణముఖి నదిపై బ్యారేజ్ నిర్మించాలని భావించారు. 1991లో జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.11 కోట్లతో శంకుస్థాపన చేశారు. దురదృష్టవశావత్తు బ్యారేజీ పనులు ప్రారంభించకుండానే జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. 2005లో వైఎస్సా ర్ జలయజ్ఞంలో భాగంగా స్వర్ణముఖి నదిపై రూ. 50 కోట్లు వ్యయంతో బ్యారేజీ కం‡బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పనులు పూర్తి చేసి 2008లో బ్యారేజీని రైతులకు అంకితమిచ్చారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో బ్యారేజీ ఆధారంగా సుమారు 25 వేల ఎకరాల్లో వ్యవసాయం సస్యశ్యామలంగా మారింది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చేశారు. బీడు భూముల్లో సైతం ఏడాదికి మూడు పంటలు పండించి సుభిక్షంగా ఉన్నారు. ప్రస్తుతం బ్యారేజీ 2 మీటర్లు ఎత్తుతో 34 గేట్లు, 35 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉండే ట్యాంక్ ఉంది. కరువు నేలపై జలసిరులు వెంకటగిరి: కరువు నేలపై జల సిరులు పారించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. కరువుతో అల్లాడే నియోజకవర్గ రైతాంగ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్ఎస్ కెనాల్, తెలుగుగంగ బ్రాంచ్ కాలువలు వంటి భారీ ప్రాజెక్ట్‌లకు పునాదులు పడ్డాయి. చారిత్రిక ప్రసిద్ధి చెందిన వెంకటగిరిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వెంకటగిరికి పురపాలక సంఘం హోదా కల్పించారు. రాబోయే 100 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సమస్య తలెత్తకుండా పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందుకు సుమారు రూ.72 కోట్లతో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌ను తీసుకువచ్చారు. మెట్ట ప్రాంతమైన వెంకటగిరి రైతులను ఆదుకునేందుకు జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచ్ కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు. వెంకటగిరితో పాటు చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు 2006లో రూ.344 కోట్లు అంచనాతో స్వర్ణముఖి–సోమశిల లింక్ కెనాల్ నిర్మాణానికి రాపూరులో ఆయన శంకుస్థాపన చేశారు. వెంకటగిరీయుల సెంటిమెంట్‌ను గౌరవించి విశ్వోదయ కళాశాల స్థలాలను అమ్మబోమని బహిరంగ సభలో ప్రకటించి నూతన కళాశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. వెంకటగిరికి అతి చేరువలో మన్నవరం వద్ద ఎనీ్టపీసీ, భెల్ ప్రాజెక్ట్‌లు సంయుక్తంగా రూ.6,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎన్బీపీపీఎల్ పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత ఆయనదే. గూడూరు దాహార్తికి.. శాశ్వత విముక్తి గూడూరు: గూడూరు దాహార్తికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శాశ్వత విముక్తి కల్పించారు. గూడూరు పట్టణ ప్రజలకు ఎండాకాలం వచ్చిందంటే గొంతెండేది. పట్టణానికి తాగునీరందించేందుకు విందూరు, వేములపాళెం గ్రామాల వద్ద ఉన్న వాటర్ వర్క్స్ నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. ఎండాకాలంలో తాగునీటి వనరులైన బోర్లు ఒట్టిపోయి పట్టణ ప్రజలు తాగునీటికి అల్లాడే పరిస్థితి. ఈ క్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఇప్పటి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి గూడూరు పట్టణ ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారని, వారి దాహార్తిని శాశ్వతంగా తీర్చాలంటూ వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన 2008లో కండలేరు నుంచి గూడూరుకు పైప్లైన్ల ద్వారా తీర్చేందుకు రూ.64.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో 2009 కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని తీసుకొస్తున్నారు. వేములపాళెం వద్ద, రిజర్వాయర్ ఏర్పాటు చేయడంతో పాటు, శుద్ధి చేసే పరికరాలను, కండలేరు నుంచి పైప్‌లైను ఏర్పాటు పనులు జరిగి పట్టణ ప్రజల శాశ్వత దాహార్తి తీరింది. పల్లెబాట వరం.. ఎస్ఎస్ ట్యాంక్ సూళ్లూరుపేట: దశాబ్దాల సూళ్లూరుపేట దాహార్తిని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కమాటతో శతాబ్దానికి సరిపడా తీర్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాలో సూళ్లూరుపేటలో ప్రారంభించిన పల్లెబాటలో స్థానిక నేతలు అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. వందేళ్లలో పెరిగే పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటికి ఇబ్బందులు రాకుండా కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో సమ్మర్ స్టోరేజీని నిర్మించారు. సమ్మర్ స్టోరేజీని నింపుకోవడానికి తెలుగుగంగ ఏడో నంబర్ బ్రాంచ్ కాలువ నుంచి 14 ఆర్ కాలువ ద్వారా నీటిని అందించాలనేది వైఎస్సార్ ప్లాన్. ఆ ప్లాన్‌లో గడిచిన ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. 2012–13లో రూ.117 కోట్లతో నీటి పథకాలు, మరో రూ. 75 కోట్లతో ఇంకో ఎస్ఎస్ ట్యాంక్ మంజూరు చేస్తానని హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. టీడీపీ హయాంలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు ప్రతిపాదన మరుగున పడింది. ప్రస్తుతం వైఎస్సార్ ఇచ్చిన సమ్మర్ స్టోరేజీ మాత్రం పట్టణవాసులు గొంతు తడుపుతోంది. అపర భగీరథుడు సైదాపురం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో గంగ జలాలను సైదాపురానికి తీసుకువచ్చిన అపర భగీరథుడు. మెట్టప్రాంతానికి కండలేరు జలాలను తెప్పించి తద్వారా బీడు భూములను మాగాణి భూములుగా మార్చారు. సుమారు 23 వేల ఎకరాల భూములు నేడు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జలయజ్ఞం ద్వారా గంగ బ్రాంచ్ కాలువలను నిర్మాణానికి నిధులను పుష్కలంగా విడుదల చేశారు. కండలేరు నుంచి 2ఏ బ్రాంచ్ కాలువ నిర్మాణానికి నిధులను విడుదల చేశారు. 2ఏ నిర్మాణ ద్వారా ఈ ప్రాంతంలోకి గంగ నీరు వచ్చి చేరుతుండటంతో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. సుమారు 15 వేల ఎకరాలు సాగవుతోంది. గతంలో వర్షాధారంగా ఆధారపడి ఉన్న రైతులకు 2ఏ బ్రాంచ్ కెనాల్ ద్వారా ప్రతి చెరువుకు సాగు నీరు అందించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. అలాగే 2 బీ కెనాల్ ద్వారా మరో 7 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. సమగ్ర సోమశిల సాక్షి, నెల్లూరు: సింహపురి సిగలో జలనిధి ఉన్నా.. వ్యవసాయానికి సాగునీటి కరువు వెంటాడేది. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్న సోమశిల ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండేళ్లలోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సంకలి్పంచారు. వైఎస్సా ర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులను పూర్తి చేసి 2007 నాటికి 72 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అంకితమిచ్చి చెరగని ముద్ర వేసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత.. పెన్నానదికి ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురిసిన వర్షాలకు జలాశయాలు నిండి వృథాగా సముద్రంలో కలుస్తుంటే కరువు ప్రాంతాల గొంతు తడపాలన్న ప్రయత్నమే జిల్లాలోని సోమశిల జలాశయానికి పునాది పడింది. సోమశిల ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 5,84,500 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ప్రతిపాదన చేశారు. ఇందులో 4,05,500 ఎకరాలు మాగాణి భూముల స్థిరీకరణతో పాటు కొత్తగా 1,79,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల వద్ద పెన్నానదిపై జలాశయం నిర్మించేందుకు 1973లో ఐదో పంచవర్ష ప్రణాళికలో రూ.17.20 కోట్ల అంచనాలతో అనుమతులు ఇచ్చారు. అన్ని అనుమతులతో ఈ ప్రాజెక్ట్ 1976లో ప్రారంభమైనప్పటికీ పనులు పురోగతిలో లేకుండాపోయాయి. 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినా.. 1989 నాటికి కూడా ప్రాజెక్ట్ ముఖ్య నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు ఎనీ్టఆర్ 1983లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభించారు. కరువు ప్రాంతాల కడగండ్లు తీర్చడానికి ఆ నీళ్లు సరిపోవని బచావత్ ట్రిబ్యునల్ కాదన్నా, అప్పటి తెలంగాణ నాయకులు జలదోపిడీ విమర్శలు చేసినా లెక్క చేయకుండా 2005 సెపె్టంబర్ మహానేత వైఎస్సార్ జీఓ 170 ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నీటి తరలింపు సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1,10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా డిజైన్ చేయించారు. ఆ నాటి కృషి ఫలితమే నెల్లూరు జిల్లాలో వర్షాలు కువరకపోయినా రైతాంగం ధీమాగా పంటలు పండించుకొనే పరిస్థితి వచ్చింది. జగన్ హయాంలో కల సాకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సమగ్ర సోమశిల ముఖచిత్రం మారింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూములకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటేందుకు రూ.450 కోట్లు ఆ శాఖకు కేటాయించారు. ఇప్పటి వరకు సోమశిలకు భారీ వరదలు వచ్చినా కేవలం 73 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచేవారు. మిగిలిన 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు లభించలేదు. కొత్త ప్రభుత్వం రాకతో అటవీ భూములకు పరిహారం కొలిక్కి రావడంతో 78 టీఎంసీల నీరునిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది కురిసిన వర్షాలకు 78 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్‌తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్‌కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్‌కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
హామీల అమలులో ఆయన తరువాతే ఎవరైనా..
స్వచ్ఛమైన చిరునవ్వు.. అదే నవ్వుతో భుజంపై చేయి వేసి పలకరింపు.. ఒకసారి పరిచయమైతే చాలు.. ఎన్నేళ్ల తరవాత కనపడినా పేరు పెట్టి పిలుస్తూ అక్కున చేర్చుకునే అది్వతీయమైన జ్ఞాపకశక్తి ఆయన సొంతం. తన ప్రజలకు ఏదో చేయాలన్న తపన.. ఎవరొచ్చి ఏదడిగినా కార్యాచరణపై మదిలో ప్రణాళికలు వేసుకోవడం. ఇవన్నీ ఆయనను మహానేతను చేశాయి. పాదయాత్రలు.. బస్సుయాత్రలతో జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వేలవేల విన్నపాలు చిరునవ్వుతో స్వీకరించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక వాటన్నింటికీ పరిష్కారాలు చూపించారు. వ్యక్తిగతమైనవే కాకుండా సామాజిక పరమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. మౌలిక వసతుల కల్పన.. వ్యవసాయ, పారిశ్రామిక, వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎంత జ్ఞాపకంగా వ్యక్తులను, వ్యక్తిగత సమస్యలను, అభివృద్ధి సంబంధ వినతులను గుర్తు పెట్టుకుని అభివృద్ధిని పరుగులు పెట్టించారో.. ఆయన హయాంలో చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులు.. వ్యక్తిగతంగా పొందిన లబ్ధి ఇక్కడి ఆయన స్మృతులుగా కలకాలం నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. అన్నదాత బాగుకోసం అహరహం తపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం రైతు దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వంనిర్ణయించింది. జిల్లాకు ఆయనతో ఉన్న అనుబంధం ఇలా.. ఎన్నెన్నో అభివృద్ధి పనులు రామచంద్రపురం: పట్టణ ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముచ్చుమిల్లి, తాళ్లపొలం వద్ద రాజీవ్ గృహకల్పలను నిర్మించి సుమారుగా 860 కుటుంబాలకు నీడనిచ్చారు. రూ.10 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించారు. వైఎస్ఆర్ హయాంలో నియోజకవర్గంలో సుమారు రూ. 700 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. సీమాంక్ సెంటర్ నిర్మాణం.. ఏటిగట్ల అభివృద్ధి ఆయన చలవే కొత్తపేట: కొత్తపేటలో వైద్య విధాన పరిషత్ 50 పడకల కొత్తపేట కమ్యూనిటీ ఆస్పత్రిలో ప్రసవం పోసుకున్న తల్లీ, పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా 20 పడకల సీమాంక్ సెంటర్‌ను రూ 29.30 లక్షల వ్యయంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గోదావరి వరదల వల్ల గండ్లు పడకుండా వశిష్ట గోదావరి ఎడమ, గౌతమి గోదావరి కుడి ఏటిగట్లను సుమారు రూ.100 కోట్లతో ఆధునికీకరించారు. ఆత్రేయపురం మండలంలో రూ.11 కోట్లతో వసంతవాడ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం, రూ.11 కోట్లతో బొబ్బర్లంక మెగా రక్షిత మంచినీటి పథకం, లంక భూములు కోతకు గురికాకుండా రూ 17 కోట్లతో గ్రోయన్స్ నిర్మించారు. తాండవ ఆధునికీకరణకు రూ.57 కోట్ల కేటాయింపు తుని: అధికారంలోకి వచ్చిన తర్వాత తాండవ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.57 కోట్లు కేటాయించారు. మధ్య తరగతి కోసం రాజీవ్ గృహ కల్ప, పేదల కోసం 30.50 ఎకరాల్లో 1154 మందికి పట్టాలు ఇచ్చారు. మోడల్ మార్కెట్, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు అనేక కార్యక్రమాలను ప్రజలకు అందించారు. తాండవ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెరకు మద్దతు ధర కలి్పంచడంతో పాటు ప్రభుత్వం నుంచి రాయితీలు కలి్పంచారు. పశుజీవశాస్త్ర పరిశోధన సంస్థ అభివృద్ధికి.. సామర్లకోట: పశు జీవశాస్త్ర పరిశోధన సంస్థ అభివృద్ధికి 2005లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.10 కోట్లు విడుదల చేశారు. ఆ నిధులతో అధునాతన సాంకేతిక పద్ధతిలో కోళ్లకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి, వ్యాక్సిన్‌ను తయారుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు అందజేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సామర్లకోటకు రూ.8.50 కోట్లు, పెద్దాపురం మున్సిపాలిటీకి రూ.7.50 కోట్లు విడుదల చేయగా వాటితో వాటర్ ట్యాంకులు, పైపు లైన్ల నిర్మాణం చేశారు. పెద్దాపురం మండలం రామేశ్వరం మెట్టపై దళితులకు కేటాయించిన భూములు సాగు చేసుకోవడానికి 72 బోర్లు ఆయన పాలనలో ఏర్పాటు చేశారు. గురుకుల పాఠశాల, హాస్టల్ భవన నిర్మాణాలు మామిడికుదురు: పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో రూ.13 కోట్లతో గురుకుల పాఠశాల, హాస్టల్ భవనం నిర్మించారు. ముంగండలో రూ.ఏడు కోట్ల తో తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.30 కోట్ల వ్యయంతో ఏటిగట్లను ఆధునికీకరించారు. ఎస్ఎస్ఏ నిధులు రూ.23 కోట్లతో నియోజకవర్గంలో పాఠశాలల భవనాలు నిర్మించారు. మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో రూ.5.50 కోట్లతో టీటీడీ కల్యాణ మంటపాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో సుమారుగా 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి ముమ్మిడివరం: నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్లకు పైగా నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తాళ్లరేవు మండలంలో ఉప్పంగల పంచాయతీ పరిధిలో సుమారు రూ.6కోట్లు, ఐ.పోలవరం మండలం మురమళ్ల, ముమ్మిడివరంలో సుమారు రూ.24కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.100 కోట్లతో ఏటిగట్లను ఆధునికీకరించి వరదల బారినుంచి ప్రజలను కాపాడారు. దిండి రిసార్ట్స్‌కు శంకుస్థాపన రాజోలు: ముఖ్యమంత్రి హోదాలో 2005 ఫిబ్రవరి 25న దిండి రిసార్ట్స్‌కు శంకుస్థాపన చేశారు. మరోసారి 2008 ఏప్రిల్ 15వ తేదీన సఖినేటిపల్లి–నర్సాపురం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం మలికిపురం కళాశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్నేహశీలి కాట్రేనికోన: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి స్నేహశీలి. ఆయన కంట పడితే చాలు చక్రంజీ అంటూ ఆప్యాయంగా పిలిచే వారు’’ అని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన యేడిద చక్రపాణీరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి తాను కలవగానే ‘‘చక్రంజీ బాగున్నావా?’’ అంటూ ఆప్యాయంగా పిలిచే వారన్నారు. ఆయనతో తనకున్న అనుబంధం మరపురానిదని ఆయన అంటున్నారు. ‘‘సీఎల్పీ నాయకుడి హోదాలో, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ఒకసారి, ముఖ్యమంత్రి హోదాలో 2009 జనవరి 3న మరోసారి కాట్రేనికోనలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చారు. ఆ సమయంలో కందికుప్పలోని మా ఇంటికి వచ్చారు. ఆయన స్నేహానికి విలువనిచ్చే మనిíÙ. నిబద్ధత కలిగిన నాయకుడు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో రహదారులు, నదీపాయలపై వంతెనల వంటి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే వాడిని. వెంటనే ఆయన అధికారులకు ఆదేశాలిచ్చి, చక్రంజీ చెప్పిన సమస్యలపై నివేదిక ఇమ్మని చెప్పేవారు. వారం పది రోజుల్లో ఆయా సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసేవారు. ఆయన జ్ఞాపకాలు జీవితాంతం మరువలేనివి’’ అని చక్రపాణీరావు గుర్తు చేసుకున్నారు. అమలాపురం అభివృద్ధిపై చెరగని ముద్ర అమలాపురం: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఆరేళ్ల పాలనాకాలంలో ప్రజల్లో చిరస్థాయిగా ఉండే పనులు చేపట్టారు. ఆయన హయాంలో అమలాపురం నియోజకవర్గం తొలుత అమలాపురం పట్టణం, రూరల్ మండలంలో కొంతభాగం, అయినవిల్లి మండలం, అంబాజీపేట మండలంలో కొన్ని గ్రామాలు ఉండేవి. తరువాత నియోజకవర్గ పునరి్వభజనలో అమలాపురం పట్టణం, మండలం పూర్తిగాను, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. పూర్వపు నియోజకవర్గంలోను, మారిన నియోజకవర్గంలోను వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి పనులు చేశారు. వైనతేయనదీ పాయ మీద అల్లవరం మండలం బోడసకుర్రు–మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక మధ్య తొలుత రూ.55 కోట్లతో అంచనాతో వంతెన మొదలు పెట్టగా, పూర్తయ్యే నాటికి రూ.65 కోట్లు అయ్యింది. ఎన్‌హెచ్ 216లో (అప్పట్లో ఎన్‌హెచ్–16)లో భాగంగా దీని నిర్మాణం జరిగింది. దీని నిర్మాణం వల్ల విశాఖ, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాల వాసులకు రాజోలు దీవితోపాటు పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరం, కృష్ణా జిల్లా కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం చేరేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఆక్వా, కొబ్బరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేయడం సులభతరమైంది. రాజీవ్‌నగర బాటలను దివంగత వైఎస్సార్ అమలాపురంలో ఆరంభించారు. దీనిలో భాగంగా ఆయన ఏప్రిల్ ఒకటి, 2005న అల్లవరం, అమలాపురం మున్సిపాలిటీల్లో పర్యటించారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోటితో పట్టణ పరిధిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును ప్రారంభించారు. పట్టణంలో పలు డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి కోట్ల నిధులు కేటాయించారు. రూ.3 కోట్లతో పట్టణ పేదలు 240 మందికి గూడు కల్పించేందుకు పట్టణ శివారు నల్లమిల్లిలో రాజీవ్‌గృహ కల్ప పనులకు శంకుస్థాపన చేశారు. పాత అమలాపురం నియోజకవర్గంలో భాగంగా ఉన్న అయినవిల్లి, అంబాజీపేట, ఇప్పటి అల్లవరం మండలాల్లో వైనతేయ ఎడమ, గౌతమి కుడి, వృద్ధగౌతమి కుడి, ఎడమ ఏటిగట్లను సుమారు రూ.30 కోట్లతో పటిష్ఠం చేశారు. గోదావరి నదీ గర్భంలో కలిసిపోయే ప్రమాదమున్న కొండకుదురులంక, పొట్టిలంకల్లో నదీకోత నివారణకు రూ.3.5 కోట్లతో గ్రోయిన్ల నిర్మాణం జరిగింది. సొంతింటి కలను సాకారం చేసిన వైఎస్ మండపేట: సొంతింటిలో జీవించాలన్న పేదల కలను సాకారం చేసి వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. 2006 ఏప్రిల్ 1న కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.460 కోట్లుతో దాదాపు 4,600 ఎకరాలు సేకరించి 1.84 లక్షల మంది పేదలకు పంపిణీ చేశారు. జిల్లాలో 2,14,205 ఇళ్లు మంజూరు చేసి రూ.743.96 కోట్లు విడుదల చేశారు. అప్పటి వరకు అర్బన్ ఏరియాల్లో అందిస్తున్న రూ.30 వేల హౌసింగ్ రుణాన్ని రూ. 55 వేలకు, రూరల్‌లో రూ. 22,500 సాయాన్ని రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్ ఏరియాల్లో రూ.75 వేలు, రూరల్‌లో 65 వేలకు పెంచారు. మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంతలో రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలను సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం. హామీల అమలులో ఆయన తరువాతే ఎవరైనా.. మలికిపురం: ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెవిన పడిందంటే చాలు.. అది ఆయన మనస్సులో గుర్తుండి పోతుంది. ఎంపీగా, సీఎల్పీ నేతగా ఉన్నప్పటి నుంచీ వైఎస్సార్‌తో తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన అల్లూరు కృష్ణంరాజుకు విడదీయరాని అనుబంధం ఉండేది. వైఎస్సార్ ప్రోత్సాహంతోనే కృష్ణంరాజు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు. మాట తప్పని నాయకుడిగా ప్రజలతో కృష్ణంరాజు గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. సీఎల్పీ నేతగా 2004లో బస్సుయాత్ర చేస్తూ వైఎస్సార్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో 2005లో రాజశేఖరరెడ్డి దిండి రిసార్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్లో దిండి నుంచి అంతర్వేదికి రాజశేఖరరెడ్డితో పాటు కృష్ణంరాజు కూడా వెళ్లారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం ఆలయం ప్రధాన గోపురాలు అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌ను కృష్ణంరాజు కోరగా వెంటనే రూ.కోటి విడుదల చేశారు. అదే సమయంలో సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మించాలని కూడా వైఎస్సార్‌ను కోరారు. హెలికాప్టర్ నుంచి వంతెన నిర్మాణ ప్రాంతాన్ని చూపించారు. దీనిపై వైఎస్సార్ అధ్యయనం చేసి, సుమారు 100 ఏళ్ల నుంచి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిన వంతెన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2007లో సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిధుల కొరత ఉండడంతో కేంద్రంతో వారధి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చారు. బీఓటీ పద్ధతిలో వంతెన నిర్మాణ పనులను మైటాస్ కంపెనీకి అప్పగించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ ఆకస్మిక మృతి అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణం ఊసే ఎత్తలేదు. ఎంతో అభివృద్ధి.. ఆయన హయాంలోనే.. రాజమహేంద్రవరం రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల అభివృద్ధిలో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆప్తుడయ్యారు. నగరంలోని తూర్పురైల్వే బుకింగ్ కార్యాలయం, ఐఎల్టీడీ జంక్షన్ వద్ద రూ.18 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచాయి. విజయవాడ నుంచి విశాఖపట్టణం వైపు రాకపోకలు సాగించేందుకు దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరి నదిపై నాలుగు లైన్ల వంతెనకు శ్రీకారం చుట్టారు. ఈ వంతెన వల్ల ప్రయాణికులకు 35 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. దేవదాయశాఖ భూమిని తీసుకుని రామకృష్ణ థియేటర్ వెనుక సమగ్ర మురికివాడల అభివృద్ధి, గృహనిర్మాణ పథకంలో రూ.57.36కోట్లతో వాంబేకాలనీ నిర్మించి 1900 మందికి నీడ కలి్పంచారు. శాటిలైట్ సిటీ రాజీవ్ గృహకల్ప సముదాయం, ఐఓసిఎల్ తదితర ప్రాంతాల్లో సైతం ఇళ్లు నిర్మించారు. రూరల్ నియోజకవర్గంలో (అప్పటి కడియం) బొమ్మూరు వెంకటగిరికొండపై సుమారు రూ.20 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని నిర్మించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచాలన్న ఉద్దేశంతో రూ.20కోట్లతో నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్స్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ భవనాన్ని నిర్మించి 2009లో ప్రారంభించారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఎన్ఏసి భవనం ఇదే. ఇక కడియం మండలంలో నిర్మించిన మూడు వంతెనలు మండలంలోని ప్రజల ఇబ్బందులను ఎంతగానో తీర్చాయి. కాకినాడ కెనాల్‌పై కడియం, జేగురుపాడు గ్రామాల వద్ద, కోటిపల్లి కెనాల్‌పై బుర్రిలంక వద్ద నిర్మించిన వంతెనలు ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్నంపల్లి అక్విడెక్ట్ నిర్మించారు ఐ.పోలవరం: ‘‘రైతుల సమస్యలపై తక్షణమే స్పందించే గుణం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. రైతులందరూ హైదరాబాద్ వెళ్లగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ మా సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఒక చిరునవ్వు నవ్వి ‘మీ సమస్య పరిష్కరిస్తా’నని చెప్పి నాలుగు రోజుల్లోనే నిధులు మంజూరు చేశారు. అన్నదాతల పట్ల ఆయన చూపిన ప్రేమానురాగాలే ఆయనను అన్నదాతగా నిలిపాయ’’ని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన రైతు నాయకుడు పిన్నంరాజు బాబ్జీరాజు తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో ఐల్యాండ్‌లో 18 వేల ఎకరాలకు సాగునీరు, 65 వేల మందికి తాగునీరు అందించేలా అన్నంపల్లి అక్విడెక్టును నిర్మించారు. అది శిథిలావస్థకు చేరడంతో ఐల్యాండ్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత ప్రజలు అప్పటి ప్రభుత్వాలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ప్రాంత రైతులం 2006 జనవరిలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లాం. ఆయనకు అన్నంపల్లి అక్విడెక్టు ఆవశ్యకతను వివరించాం. వైఎస్సార్ వెంటనే స్పందించి, నిధులు సమకూర్చడమే కాకుండా త్వరలోనే భూమిపూజ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మూడు నెలల్లో రూ.19 కోట్లతో నూతన అక్విడెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐల్యాండు ప్రజలను ఆదుకొన్న అన్నదాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి’’ అని పిన్నంరాజు బాబ్జీరాజు తెలిపారు. -
అన్నదాత కలల పండగ
ఆకాశవీధి నుంచి మేఘం దీవించేట్టు అమృతాక్షితల్ని వాన చినుకుల రూపంలో వెదజల్లితే... అవధుల్లేని ఆనందంతో పులకించి పోయేవాడు రైతన్న. పుడమి ఒడిలో పుట్టిన పచ్చదనం... చివురు వేసి ఆశలు తొడిగితే... అంతులేని సంతోషంతో పరవశించి పోయేవాడు రైతన్న.. నేలతల్లిని నమ్మి... సేద్యం చేసి మానవాళి ఆకలితీర్చే మహోన్నతుడు రైతన్న.. ఆ కష్టజీవికి... అంతటి ధన్య జీవికి ఒక్కడు గుడికట్టాడు... నేనున్నానని... నీకేం కాదని భుజం తట్టాడు. అన్నదాతకు అండ నేనన్నాడు... అన్ని విధాలా ఆదుకున్నాడు. ఎండిన బతుకులకు ఏరువాకలా వచ్చి... వేదనను పరిమార్చిన వర్షపు చినుకయ్యాడు. ఆ ఉదాత్తుడు.. ఆ ఉన్నతుడు... అందుకే ‘రాజన్న’ కర్షకుల కంటి దీపమయ్యాడు. బడుగుల ఇంటి వెలుగయ్యాడు. వ్యవసాయం దండగన్న వ్యర్థ వ్యాఖ్యలను ఎండగట్టి... సేద్యాన్ని పండుగ చేసిన ఆ చిరునవ్వుల రేడు... నేడు లేకపోయినా... రైతన్న తలపాగలా... పొలానికి పచ్చదనపు నగలా వెలుగుతూనే ఉన్నాడు... ఉంటాడు. నాబిడ్డలకు అన్ననే అండ మాది మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లె (మజరా నంద్యాలంపేట ) గ్రామం. మాకున్న ఎకర పొలంతోపాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాం... పసుపు, మిరప, ఉల్లి పంటలను సాగు చేశాం. ఇలా రెండు మూడు సంవత్సరాలు సాగు చేసినా మా దరిద్రమేమోగాని ఒక పక్క పంట అరకొర దిగుబడి. దానికి గిట్టుబాటు ధరలేక పెట్టుబడులు తీరక రూ.6.50లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచక నా భర్త శ్రీనివాసులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు వివరాలు రాసుకుపోయారు. ఏమి చేయాలో దిక్కుతోచలేదు. అయినా ప్రభుత్వ సాయం అందలేదు. అయితే మా కష్టాన్ని, మా బాధలను గుర్తించిన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.7లక్షల సాయం అందించి ఇంటి పెద్ద కొడుకుగా ఆదుకున్నారు. జగన్నను ఎప్పటికీ మరచిపోం...ప్రాణం ఉన్నంతవరకు ఆయకు రుణపడి ఉంటాం. – గొడ్లవీటి రాధా, మహిళా రైతు, పెద్దశెట్టిపల్లె, మైదుకూరు మండలం ఊహించని భరోసా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు, క్రిమి సంహారక మందులను అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం బయట కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వాటిలో నాణ్యత లేక పోవడంతో పంట నష్టం వచ్చి కష్టాలు పడే వాళ్లం. ప్రభుత్వాలు కూడా పంట నష్ట పోతే పరిహారం ఇచ్చే దానికి సవాలక్ష నిబంధనలు పెట్టేవారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు. ఇక ఏ చింతా ఉండదు. వ్యవసాయం సులభతరం నాపేరు సిద్ధారెడ్డి, కేసీ అగ్రహారం, రెడ్డివారిపల్లిపంచాయతీ, రైల్వే కోడూరులో నివాసం ఉంటున్నాను. నాకు రెండెకరాల పొలం ఉంది. పలు పైర్లు సాగుచేస్తాను. పొలంబడి వల్ల రైతులకు వ్యవసాయంపై అవగాహన వచ్చింది. దీంతో సాగులో మెలకువలు నేర్చుకున్నాం. రసాయన ఎరువులు ఎక్కువగా వాడకూడదని.. సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడి సాధించవచ్చని సూచించారు. నేడు మా ఊర్లో రైతులందరూ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ముందుకు పోతున్నారు. పరిహారం.. రైతుకు వరం నా పేరు బీ రంగారెడ్డి. రాజంపేట మండలం ఆకేపాడు గ్రామం. ఈయనకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అరటి సాగచేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ మాసంలో ప్రకృతి ప్రకోపానికి 1.80 ఏకరా నష్టపోయాడు. పంట చేతికి వచ్చే ప్రకృతి రూపంలో అరటిగెలలను ధ్వంసం చేసింది. అరటి చెట్లు నేలకొరిగిపోయాయి. సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రకృతి ప్రభావంతో నష్టపోయిన ఈ రైతుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద పరిహారం అందచేస్తుండటంతో రంగారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గత ప్రభుత్వాలు తమ గురించి పట్టించుకోకపోయినా, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని నిరూపించిందని బాధిత రైతు అంటున్నారు. కాలువలు జలకళ.. ఇంట గలగల నా పేరు దీవెన నాగరాజు. నాది వేముల మండలం గొందిపల్లె గ్రామం, నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షాలు పడితే పంట సాగు చేసుకోవాలి. లేదంటే భూమిని బీడుగా ఉంచుకోవాలి. అయితే ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్ కాలువకు నీరు వదలడంతో నాకున్న రెండు ఎకరాలలో మే 9వ తేదీన వేరుశనగ పంట సాగు చేశా. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయ్యాక కాలువకు నీటిని వదిలారు. రెండు నెలలుగా నీరు వస్తోంది. వర్షాలు లేకున్నా కాలువ నీటితోనే పంటలు పండించుకుంటున్నా. పంట పూతకు వచ్చి ఊడలు దిగే దశకు చేరింది. మరో 40రోజులలో పంట దిగుబడులు చేతికి వస్తాయి. ఖరీఫ్ సీజన్‌కు సకాలంలో కాలువకు నీటిని వదలడం తొలిసారి చూస్తున్నా. నాతో పాటు రైతులందరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. రైతుగా ఇంతకంటే ఇంకేం కోరుకుంటాం. అన్న మద్దతు ఈ రైతు పేరు చందు వెంకటసుబ్బయ్య. జమ్మలమడుగు మండలంలోని గొరిగేనూరు గ్రామం. ఈ ఏడాది తనకున్న ఆరు ఎకరాల్లో శనగ పంట సాగుచేశాడు. గతేడాది రబీ సీజన్లో సాగుచేసిన పంట దిగుబడి వచ్చింది. అయితే గిట్టుబాటు ధరలేదు. క్వింటాల్ కనీసం రూ.3800 మాత్రమే పలుకుతోంది. ఈ రేటుకు అమ్మకం చేస్తే నష్టంవస్తుంది. అయితే ప్రభుత్వం మద్దతు ధర కింద క్వింటాకు రూ. 4875 ప్రకటించింది. దీంతో మార్క్‌ఫెడ్ ద్వాదా మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 25 క్వింటాల్ శనగలు మార్క్‌ఫెడ్‌లో విక్రయించాడు. డబ్బులు కూడా తన ఖాతాకు జమచేసిందని... ప్రభుత్వం ఆదుకోవడం తమకు ఎంతో ఊరట కలిగించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. జీవితాంతం రుణపడిఉంటాం నా పేరు పోలయ్య. మాది కాశినాయన మండలం, మిద్దెల గ్రామం. నేను నరసాపురంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పంట పెట్టుబడి కోసం రుణం తీసుకున్నాను. నాలుగేళ్ల నుంచి సక్రమంగా పంటలు పండకపోవడంతో లోను రెన్యూవల్ చేయలేకపోయాను. గడువు దాటితే వడ్డీ అదనంగా పడింది. దీంతో పక్కన అప్పులు చేసి వడ్డీ కట్టి లోను రెన్యూవల్ చేయించుకున్నాను. అయితే జగనన్న రైతులకు వడ్డీ లేని రుణాలు అందించడం సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి వడ్డీ బాధ తప్పుతుంది. జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను. -
రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ఏటా రైతు దినోత్సవంగా పాటించనుంది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవిగా వ్యవసాయ రంగ నిపుణులు చెబుతారు. కాగా, వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడంపై రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)వ తేదీని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ఏటా రైతు దినోత్సవంగా పాటించనుంది. -
‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’డెస్క్ ఇన్చార్జ్, సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబుకు 2019 సంవత్సరానికి గాను ప్రతి ఏటా రైతు దినోత్సవం సందర్భంగా కర్షక సాధికార సంఘటన (కేఎస్ఎస్) అందించే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రైతులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలకు కె.ఎస్.ఎస్ ఈ పురస్కారాలను అందిస్తోంది. పంతంగితో పాటుగా పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర ఆజాద్ (తెలంగాణ), ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు అన్నే పద్మావతి (నూజివీడు), టీ న్యూస్ చేను–చెలక ఎడిటర్ విద్యాసాగర్, సైంటిస్ట్ డా.సురేంద్రరాజులకు ఈ అవార్డు లభించింది. ఈమేరకు కేఎస్ఎస్ అధ్యక్షుడు మారం కరుణాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలది పురుషోత్తంరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న రాజేంద్రనగర్‌లోని ‘వాలంతరి’లో జరిగే సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
రాజన్న సాక్షిగా రైతన్న పండగ
సాక్షి, విజయనగరం : పట్టణాలు, పల్లెలకు సోమవారం పండగ వచ్చింది. మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం, సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి తొలి సంతకంతో పెంచిన పింఛన్లను జిల్లా అంతటా పంపిణీ చేయడంతో పండగ వాతావరణ నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలోని అన్నివర్గాల పింఛన్ లబ్ధిదారులకు నెలకు 27 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం కేటాయించగా... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు రూ.73 కోట్లు అంటే 46 కోట్లు అధికంగా పింఛన్ సొమ్ము పంపిణీకి శ్రీకారం చుట్టింది. తొలిరోజు 35 శాతం పంపిణీ.. సాయంత్రం 6 గంటలకు తీసుకున్న నివేదిక ప్రకారం జిల్లాలో ఉన్న 3,05,618 మందిలో 35 శాతం అంటే 1,07,561 మందికి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. అత్యధిక శా తం బొండపల్లి మండలం 60.65 శాతం పంపిణీ నమోదయిం ది. మండలలో 7,214 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా 4,375 మందికి పింఛన్ చేతికి అందింది. అత్యల్పంగా రామభద్రపురంలో 10.14 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారు. జిల్లాలో 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థినులకు 200 సైకిళ్లు పంపిణీ చేశారు. వాడవాడలా వైఎస్సార్ జయంతి... వైఎస్సార్ జయంతి వాడవాడలా నిర్వహించారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛను డబ్బులు పంపిణీని ప్రారంభించారు. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నాలుగు మండల కేంద్రాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుతో పాటు వైఎస్సార్సీపీ నాలుగు మం డలాల అధ్యక్షులు చనమల్లు వెంకటరమణ, పతివాడ అప్పలనాయు డు, బంటుపల్లి వాసుదేవరావు, ఉప్పాడ సూర్యునారాయణరెడ్డి తది తరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లిమర్లలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధి లోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. సీతానగరం, పార్వతీపురం మండలాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించగా, బలిజిపేట మండలంలో స్థానిక నాయకులు జయంతి వేడుకలు జరుపుకున్నారు. బొబ్బిలి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అనంతరం మరిశర్ల రామారావు ఆధ్వర్యంలో అమ్మిగారి కోనేటి గట్టు వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సుమారు 150 మందికి స్కూల్‌బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులను అందజేశారు. బాడంగిలో వైఎస్సా ర్ సీపీ నాయకులు నాగిరెడ్డి విజయకుమారి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఎస్.కోట మండల కేంద్రం, వేపాడ మండలంలో రాజన్న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్‌చేసి అభిమానులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. కొత్తవలస మండలం చీడివలసలో వైఎస్సార్ మండల యువజన సంఘ అధ్యక్షుడు లెంక వరహాలు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి జయంతి వేడుకలు నిర్వహించారు. వద్ధులకు పింఛన్లు పంపిణీచేశారు. అనంతరం కొత్తవలస జంక్షన్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. విజయనగరం పట్టణంలోని 10వ వార్డు ఖమ్మవీధిలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పింఛన్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్నదొర క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పాచిపెంట మండల కేంద్రంలోని సాలాపు వీధిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, మాజి వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరిశ్వరరావు తదితరులు కేక్ కట్ చేశారు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలల వేసి నివాళులర్పించారు. జియ్యమ్మవలసలోని పెదమేరంగి కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మండల కన్వీనర్ గౌరీశంకరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నివాళులర్పించారు. -
ప్రతి ఇంటా పండుగ జరుపుకోవాలి
సాక్షి, నరసన్నపేట : రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, వారి శ్రేయస్సుకు అన్ని విధాలా దోహద పడుతుందని, రైతు పక్షపాత ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతే రాజు అని రానున్న ఐదేళ్లలో నిరూపిస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిందంటే రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో రైతులు గమనించాలని మంత్రి అన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి రైతు దినోత్సవాన్ని వ్యవసాయ శాఖ జేడీ రత్నకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఇప్పటికే రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, రైతు భరోసాతోపాటు అనేక పథకాలు ప్రకటించిందన్నారు. ఏటా రైతులకు రూ.12,500లను పెట్టుబడి రాయితీ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే వడ్డీలేని రుణాలు, ఉచిత పంటల బీమా అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. వ్యవసాయ జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళంలో రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి జిల్లా యంత్రాంగం సహరించాలని కోరారు. జిల్లాలో ప్రతీ ఎకరాకూ సాగు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతుకూ వడ్డీలేని రుణం: కలెక్టర్ జిల్లాలో రైతులు ఖరీఫ్ కాలంలో పెట్టుబడుల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గుర్తించామని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ రైతుకూ వడ్డీలేని రుణం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు. రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ రైతులకు 65 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. 19,690 మందికి ఎల్ఈసీ కార్డులు ఇచ్చామని, వారందరికీ రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఉద్యావన పంటలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉద్దానంలో తిత్లీకి దెబ్బతిన్న 15 వేల హెక్టార్లులో కొబ్బరి తోటలను ఎన్ఆర్ఈజీ ఎస్‌లో భాగంగా మళ్లీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నీటి వనరులు లేని చోట్ల డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని 90 శాతం సబ్సిడీతో అవసరమైన పరికరాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ జేడీ రత్నకుమార్ మాట్లాడుతూ ప్రతి హెక్టారుకు 5,400 కిలోల ధాన్యం ఉత్పత్తి చేయాలనే లక్ష్యం తో ఈ ఖరీఫ్‌లో పనిచేస్తున్నామని, 2.12 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుందన్నారు. వంశధార, నాగావళి, తోటపల్లి, మడ్డువలస తది తర ప్రాజెక్టుల ద్వారా ప్రతీ ఎకరాకు సాగు నీరు అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరలివచ్చిన మహిళా రైతులు వ్యవసాయ శాఖ నరసన్నపేటలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రైతు సదస్సుకు మహిళా రైతులు భారీగా తరలివచ్చారు. రైతులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇదే సభా వేదికపై నరసన్నపేట మండలానికి చెందిన పింఛనుదారులకు వైఎస్సార్ భరోసా పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. అలాగే ఆదర్శ రైతులకు సత్కారం చేశారు. స్టేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల పరిధిలో ఉన్న రైతు సంఘాలకు, రుణాలు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావుతోపాటు జిల్లా స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ ఏడీలు జి.సత్యవతి, వడ్డాది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కడప బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాకు బయల్దేరారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్‌లో బయల్దేరి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు. 8.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళతారు. 8.50 నుంచి 9.10 గంటల వరకూ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. 9.15 గంటలకు రోడ్డు మార్గాన బయల్దేరి 9.30 గంటలకు చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రానికి చేరుకుంటారు. గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 10 గంటల వరకూ అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి బహిరంగ సభ ప్రదేశానికి వెళతారు. అక్కడ ఏర్పాటు చేసి స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. వైఎస్ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే రైతు దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే కడప, ఇడుపులపాయ, గండి, జమ్మలమడుగు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం
-
రైతన్నల ఆత్మాభిమానమే నా లక్ష్యం
సాక్షి, అమరావతి : రైతన్నలు ఆత్మాభిమానంతో జీవించేలా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజకూ న్యాయం జరగాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో వెలుగులు చూడడమే తన ఆశయమని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతు బాంధవుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు తొలి లేఖ రాశారు. ఇందులో తన ప్రాధమ్యాలను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు... ఆత్మ బంధువులు, అన్నదాతలైన రైతన్నలకు మీ జగన్ నమస్కరిస్తూ రాస్తున్న లేఖ.. డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతిఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన బాటను మరింత మెరుగు పరిచేందుకు మన ప్రభుత్వం నవరత్నాలతో ముందుకు వచ్చింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరు నుంచే ప్రతి రైతు కుటుంబానికీ రూ.12,500 రైతు భరోసా కింద అందించబోతున్నాం. ఈ డబ్బును బ్యాంకులు ఇంతకు ముందున్న మీ అప్పులకు జమ చేసుకోకుండా నేరుగా మీ చేతికే అందించబోతున్నాం. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8,750 కోట్ల మేర పెట్టుబడి సహాయం అందబోతోంది. 15.36 లక్షల కౌలు రైతులకూ మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. రూ.2 వేల కోట్లతో విపత్తుల సహాయనిధి తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పుతున్నాం. శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 ప్రోత్సాహకంగా ప్రకటిస్తూ జీవో జారీ చేశాం. ఈ రోజు నుంచే ఆ డబ్బును అందించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ శీతల గిడ్డంగులు, గోదాముల నిర్మాణంతో పాటు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం. కౌలుదారులకు మేలు చేస్తాం.. భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ, కౌలుదారులకు సైతం మేలు చేసేలా 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురాబోతున్నాం. తద్వారా కౌలు రైతులకు అన్ని రకాలుగా మంచి చేయాలని నిర్ణయించాం. వ్యవసాయానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందిస్తాం. ఆ డబ్బు రైతు కుటుంబం చేతికే అందిస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందిస్తున్నాం. సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు అదనంగా రూ.4 బోనస్ రెండో ఏడాది నుండి ఇవ్వబోతున్నాం. పామాయిల్ రైతులకు రూ.85 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించబోతున్నాం. పొగాకు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకున్నాం. నాఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు భూసార కార్డులు, రాయితీపై విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువుల పంపిణీ, రాయితీపై సూక్ష్మపోషకాల సరఫరా వంటి వాటికి చర్యలు తీసుకుంటున్నాం. కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపడతాం. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగశాలలు, ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. చివరిగా ఒక్క మాట... పండించిన ప్రతి ధాన్యపు గింజపై అది ఎవరు తినాలో దేవుడు రాసి పెడతాడన్నది నానుడి. కష్ట జీవులైన రైతులు, వారి కుటుంబాల్లో ఆనందాలను నింపేలా మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికీ.. అవినీతిని నిర్మూలించడానికి సాగిస్తున్న కృషికి దేవుడి దీవెనలు, మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నా. ప్రతి రైతన్నకూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు’’ రూ.84 వేల కోట్ల పంట రుణాలు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రైతులకు రూ.84,000 కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించాం. రూ.లక్ష వరకు పంట ఋణాలు తీసుకున్న రైతులు గడువు లోపు తిరిగి చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీ ఉండదు. వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియంను ఇక ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.2,163 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. పగటి పూటే 9 గంటల విద్యుత్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకువచ్చేలా రూ.1,700 కోట్లు ఖర్చు చేసున్నాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. -
నేడే రైతు పండుగ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో ప్రారంభమయ్యే రైతు దినోత్సవ కార్యక్రమాలు సాయంత్రం వరకూ కొనసాగుతాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు వైఎస్సార్సీపీ రైతు విభాగం, పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధాన కార్యక్రమాన్ని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఆయన సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్‌లో దివంగత మహానేత సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం గండి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత జమ్మలమడుగులో రైతు దినోత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను ప్రకటించడంతో పాటు మూడు ముఖ్యమైన పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. సామాజిక పింఛన్ల పంపిణీకి శ్రీకారం అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా ఇప్పటికే ప్రకటించిన పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గం(కేబినెట్) ఆమోద ముద్ర వేసిన మిగతా పథకాలను సోమవారం రైతు దినోత్సవ సభలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు వడ్డీలేని రుణాల పంపిణీ, ఉచిత పంటల బీమా, రబీ నుంచే అందించే పెట్టుబడి సాయం రూ.12,500 వంటి కీలక పథకాలకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ‘వైఎస్సార్ రైతు భరోసా’లో భాగంగా ప్రకటించిన వడ్డీ లేని రుణాల పథకం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. ఇక ఉచిత పంటల బీమా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం రూ.2,163 కోట్లు కేటాయించారు. 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు కౌలు రైతులు మీ–సేవా కేంద్రానికి వెళ్లి, ఒక్క రూపాయి చెల్లించి పంట పేరు, చిరునామాను నమోదు చేయించుకోవాలి. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50,000 అందించే రైతు భరోసా పథకాన్ని, దురదృష్టవశాత్తూ రైతు దుర్మరణం పాలైనా, ఆత్మహత్యకు పాల్పడినా రూ.7 లక్షలు చెల్లించే పథకాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు దినోత్సవ సభలో లాంఛనంగా ప్రారంభిస్తారు. వీటితో పాటు సామాజిక పింఛన్ల పంపిణీని కూడా ఇదే సభలో ఆరంభిస్తారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, శనగ రైతులకు మార్కెట్ వ్యత్యాస ధర చెల్లింపు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 17 మంది రైతులకు సన్మానం రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన 17 మంది ఉత్తమ రైతులకు జమ్మలమడుగు సభలో సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సన్మానం జరుగనుంది. అలాగే సభా స్థలి సమీపంలో వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఈ స్టాళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే పరికరాలను, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పంట రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసే అరటి పరిశోధన కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రైతన్నలకు వైఎస్ జగన్ సందేశం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు లేఖ రూపంలో రాసిన సందేశాన్ని అధికారులు చదివి వినిపిస్తారు. శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, రైతులు, రైతు ప్రముఖులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రైతులను, శాస్త్రవేత్తలను సన్మానిస్తారు. రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్‌కుమార్ ఇప్పటికే సంబంధిత జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం, మార్కెట్ యార్డుల్లో, మార్టేరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అన్నదాతలకు వైఎస్సార్సీపీ రైతు విభాగం శుభాకాంక్షలు రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అగ్రి మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నదాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్న సీనియర్ రైతు దంపతులను గుర్తించి, సన్మానించాలని సూచించారు. రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎం.సుచరిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొంటారని ఆ ఫౌండేషన్ ఛైర్మన్ పద్మశ్రీ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఉత్తమ రైతులను సన్మానించాలని పలు స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించాయి. (వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి సమగ్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ నెల 8న ఏపీ వ్యాప్తంగా రైతు దినోత్సవ కార్యక్రమాలు
-
ఈ నెల 8న రైతు దినోత్సవం