salaries hike
-
AP: విద్యుత్‌శాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. ఇది కూడా చదవండి: పుంగనూరు అల్లర్లపై నేడు హైకోర్టులో విచారణ.. చంద్రబాబే ఏ1.. -
ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు..
దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్‌జెట్ వార్షికోత్సవం సందర్భంగా తమ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించింది. విమాన పైలట్లకు నెలకు రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష నెలవారీ లాయల్టీ రివార్డు వంటివి ఇందులో ఉన్నాయి. గురుగ్రామ్‌కు కేంద్రంగా పనిచేసే స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కెప్టెన్ల నెల జీతాన్ని రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్లకు నెలలో 75 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. ఈ పెంపుదల 2023 మే 16 నుంచి వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. అలాగే ట్రైనర్లు (డీఈ, టీఆర్ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా పెంచింది ఈ ఎయిర్‌లైన్స్ కంపెనీ. అంతకుముందు నవంబర్లోనూ స్పైస్‌జెట్ తమ పైలట్ల వేతనాలను పెంచిది. అప్పట్లో కెప్టెన్ల జీతం 80 గంటల ఫ్లయింగ్ అవర్స్‌కు గానూ నెలకు రూ. 7 లక్షలు ఉండేది. రూ.లక్ష లాయల్టీ రివార్డ్ అదనంగా ఈ ఎయిర్‌లైన్ సంస్థ తమ కెప్టెన్లకు నెలకు రూ.లక్ష వరకు నెలవారీ లాయల్టీ రివార్డ్‌ను ప్రకటించింది. వారి ఉద్యోగ కాలానికి అనుగుణంగా ఇచ్చే ఈ రివార్డ్ వారి నెలవారీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు స్పెస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతూ భవిష్యత్తు మరింత ఉత్తేజకరంగా ఉంటుందని, ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. స్పైస్‌జెట్ దేశ, విదేశాల్లో మొత్తం 48 గమ్యస్థానాలకు రోజూ దాదాపు 250 విమానాలను నడుపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్, బోయింగ్ 700, క్యూ400 వంటి అత్యాధునిక విమానాలు ఈ సంస్థకు ఉన్నాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
May Day Gift: పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ మే డే గిఫ్ట్..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజున పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల జీతం రూ.వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా అందే జీతంతోపాటు పెరిగిన రూ.1000 కూడా అందుతుందని సీఎం తెలిపారు. తక్షణమే ఈ పెంపు అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల జీతాలను సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. చదవండి: Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు పాలమూరు -రంగారెడ్డి పథకంపై సమీక్ష కాగా, కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం చర్చించారు. జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని.. పంప్‌హౌస్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై సమీక్షించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం సూచించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు! హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు.. -
సచివాలయ ఉద్యోగులకు.. కొత్త పే స్కేల్ వేతనాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వోద్యోగుల మాదిరిగా తొలిసారి పే–స్కేల్, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన వేతనాలు అందుకోనున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్ట్‌లో పాసైన ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రభుత్వం జూలై 1వతేదీ నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వారంతా జూలై నెలకు సంబంధించిన వేతనాలను ఆగస్టు 1వ తేదీ నుంచి అందుకోబోతున్నారు. పీఆర్సీ కమిటీ చెప్పకున్నా.. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కోసం 2018లో కమిటీ ఏర్పాటు చేసే నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అన్నదే లేదు. 2019 మే నెలాఖరున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. పీఆర్సీ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తమ నివేదికలో ఎలాంటి పెరుగుదలను సూచించలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక జీవో తెచ్చి ప్రొబేషన్ ఖరారైన సచివాలయ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా పే – స్కేల్ అమలు చేసిన దాఖలాలు లేవు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం పొందుతున్నారు. వాటి స్థానంలో పే– స్కేల్‌తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ నెల 20వతేదీ నుంచే ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల బిల్లులను ప్రభుత్వానికి సమర్పించే డ్రాయింగ్, డిస్పర్స్‌మెంట్ ఆఫీసర్స్–డీడీవోలు ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. ఆయా డీడీవోల పరిధిలో ఎంత మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారైంది? ఎంత బిల్లులు అప్లోడ్ అయ్యాయనే వివరాలు సేకరించి ఇబ్బందులుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఇటీవల డీడీవోల బదిలీల కారణంగా బిల్లుల సమర్పించడంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల డీడీవోలు వివిధ కారణాలతో బిల్లులు అందించడం ఆలస్యమైనా 30వతేదీ వరకు వచ్చే బిల్లులను కూడా అనుమతించారు. ఆది నుంచి ఆటంకాలు సృష్టిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచే ప్రతిపక్ష పార్టీలు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించాయి. ఇంటర్వ్యూలు లేకుండా రాతపరీక్ష ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అధికార పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని దుష్ప్రచారం చేశాయి. పోటీ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులే అందులోనిజం లేదని తేల్చారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయటాన్ని సహించలేక అవి తాత్కాలికమేనని, జీతాలు పెరగవంటూ ఉద్యోగులను కించపరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేశారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు విపక్షాలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ప్రతిసారీ సీఎం జగన్ సానుకూల వైఖరే.. ‘సచివాలయాల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు వీలు కాదని ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం చెప్పినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం వారిపై ఉన్న అభిమానంతో పెరిగిన కొత్త వేతనాల ప్రకారమే వారికి జీతాలివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తమకు సంబంధించిన అన్ని అంశాల్లో మేలు చేసేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రొబేషన్ ఖరారు అనంతరం తొలిసారి పే స్కేలు ప్రకారం వేతనాలు అందుకోనున్న ఉద్యోగులకు అభినందనలు’ – కాకర్ల వెంకట్రామిరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు గుండె నిండా అభిమానంతో సెల్యూట్ ‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే జీవిత ఆశయం నెరవేరుతున్న వేళ గుండె నిండా అభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌కు సెల్యూట్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నూతన పేస్కేల్ వర్తింపజేయడంతో ఇన్నాళ్లూ విమర్శలు చేసిన వారి నోర్లు మూగబోయాయి. సచివాలయ ఉద్యోగులకు ఇది శుభవార్త కాగా కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచింది. –ఎం.డి.జాని పాషా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ మేలు మరువలేం.. ఒకేసారి 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు ముఖ్యమంత్రి జగన్. ఆయనకు సచివాలయాల ఉద్యోగులు, వారి కుటుంబాలన్నీ జీవిత కాలం రుణపడి ఉంటాయి. ఈ మేలు ఎప్పటికీ మరువలేం. –భీమిరెడ్డి అంజనరెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ సుతేజ్ (గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్) -
ఏపీ: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు
-
మోసం కాకుంటే ఏంటి బాబూ?
సాక్షి, అమరావతి: జీతాల కోసం ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. తను అధికారంలో ఉన్నపుడు నాలుగున్నరేళ్ల పాటు అసలు వారి జీతాలు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ఘనత ఆయనది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయువు పట్టులాంటి చిరుద్యోగులకు అతితక్కువ జీతాలు చెల్లిస్తూ... అవికూడా ఆరు నెలలకో, తొమ్మిది నెలలకో ఇస్తూ వచ్చిన చంద్రబాబు... పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిరుద్యోగులు ఆశ్రయించటం... తనకు పరిస్థితి చేయిదాటిపోతోందోని గ్రహించటంతో ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచీ కొందరికి జీతాలు పెంచటం మొదలెట్టారు. దీన్నేమనుకోవాలి? నాలుగున్నరేళ్లపాటు పట్టించుకోకపోవటం మోసం కాదా? చివర్లో జీవోలిచ్చి చేతులు దులుపుకోవటం దుర్మార్గం కాదా? అలాంటి చంద్రబాబు ఇపుడు వివిధ సంఘాలు, కమ్యూనిస్టుల ద్వారా ఉద్యోగులను రెచ్చగొట్టి తమ ఎజెండాను వారిపై రుద్ది ఆందోళనలు చేయిస్తున్నారంటే ఏమనుకోవాలి? అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి అనేది ఉందా? చిత్తశుద్ధి ఉందో లేదో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు. అదేమిటంటే... రాష్ట్రంలో వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు దాదాపు 3.07 లక్షల మంది ఉండగా... చంద్రబాబు హయాంలో వారికి చెల్లించిన జీతాల బిల్లు ఏడాదికి రూ.1198 కోట్లు. కానీ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఈ ఉద్యోగులందరికీ జీతాలు పెంచటంతో ఈ బిల్లు ఏకంగా రూ.3,187 కోట్లకు చేరింది. అంటే... దాదాపు మూడు రెట్లు పెరుగుదల. ప్రభుత్వంపై ఏకంగా రూ.2వేల కోట్ల మేర భారం పడినా... చిరుద్యోగుల సంక్షేమం అత్యవసరమని మనసా వాచా నమ్మటంతో ముందుకే అడుగేశారు ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ చంద్రబాబుకో... టీడీపీ అనుకూల మీడియాకో తెలియవా అంటే... తెలీకేమీ కాదు. వారిదల్లా రాజకీయ ఎజెండా. దానికోసం ఎర్రజెండాతో సహా దేన్నయినా ఆశ్రయించే నైజం వారిది. అందులో భాగమే తప్పుడు రాతలు, ప్రేరేపించిన ఆందోళనలు. కావాలంటే చంద్రబాబు హయాంలో ఎంత జీతాలుండేవో... జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంత జీతాలున్నాయో ఒకసారి చూద్దాం. -
కర్ణాటక: సీఎం, ఎమ్మెల్యేలకు జీతాలు పెంపు.. ఎవరికి ఎంతంటే?
సాక్షి, బెంగళూరు: కోవిడ్ కష్టకాలంలో ప్రజలు ఉపాధి కరువై అల్లాడుతుండగా, చట్టసభ సభ్యుల వేతనాలు, భత్యాలు భారీగా పెరిగాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మంత్రుల వేతన భత్యాలను, పెన్షన్లను బొమ్మై ప్రభుత్వం పెంచేసింది. మంగళవారం విధానసభలో ఈ మేరకు రెండు బిల్లులను ఆమోదించారు. ఇప్పుడున్న జీతాలతో పోలిస్తే 50 శాతం పెరగడం గమనార్హం. దీనిని మంత్రి మాధుస్వామి సమర్థించుకొన్నారు. కోవిడ్ సమయంలో చాలా కష్టమైంది. డీజిల్, పెట్రోల్ ధరలు, ఇంటి బాడుగలు పెరిగాయి, అందువల్ల జీతభత్యాలను 50 శాతం పెంచాల్సి వచ్చిందని అన్నారు. 2015 తరువాత జీతభత్యాలను పెంచలేదని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 92 కోట్ల భారం పడుతుంది. ఎవరికి ఎంత పెంపు కొత్తగా సీఎం వేతనంలో రూ.50– 75 వేల వరకు పెరుగుతుంది. మంత్రుల జీతంలో రూ.40–60 వేల మధ్య పెరుగుతుంది. వారి వార్షిక అలవెన్స్‌లు రూ.లక్ష పెరిగి రూ.4.5 లక్షలకు చేరతాయి ►మంత్రుల నెలవారి ఇంటి అద్దె రూ.80 వేలు ఉండగా దానిని రూ.1.25 లక్షలకు పెంపు. ఇంటి ముందు తోట నిర్వహణ భత్యం రూ.30 వేలకు పెంపు. నెలకు వెయ్యి లీటర్లకు ఉన్న పెట్రోల్/ డీజిల్ వ్యయం ఇప్పుడు 2 వేల లీటర్లకు పెంపు ►మంత్రుల రోజువారి టూర్ అలవెన్స్ రూ.2,500కు పెంపు. సభాపతులు, ప్రతిపక్ష నేతలకూ ఇవే వర్తిస్తాయి ►ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికి వస్తే వారి వేతనంలో రూ.25– 40 వేల వరకూ వృద్ధి ఉంటుంది. నెలవారి నియోజకవర్గ భత్యం రూ. 60 వేలుగా నిర్ధారణ. మాజీలకు నెలకు రూ.50 వేల పెన్షన్ లభిస్తుంది. -
విప్రో ఉద్యోగులకు శుభవార్త!
ఐటీ రంగ దిగ్గజం విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేడు (జూన్ 18) తన ఉద్యోగులలో 80 శాతం మంది వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాండ్ బి3(అసిస్టెంట్ మేనేజర్, దిగువ స్థాయి) అర్హులైన ఉద్యోగులందరికీ మెరిట్ వేతన పెంపు(ఎంఎస్ఐ)ను ప్రారంభిస్తుందని, ఇది సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాండ్ ఉద్యోగులు కంపెనీ శ్రామిక శక్తిలో 80 శాతంగా ఉన్నారు. ఈ క్యాలెండర్ లో ఉద్యోగులకు ఇది రెండవ వేతన ఇంక్రిమెంట్. ఈ బ్యాండ్ లలో అర్హులైన ఉద్యోగులకు జనవరి, 2021లో కంపెనీ వేతనాలను పెంచినట్లు ప్రకటించింది. బ్యాండ్ సీ1(మేనేజర్లు, ఆపైన) అర్హులైన ఉద్యోగులందరూ జూన్ 1 నుంచి పెంచిన వేతనాలను అందుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. విప్రో ప్రధాన పోటీదారు టీసీఎస్ మొదట ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1, 2021న వేతన పెంపును ప్రకటించింది. -
టెక్ మహీంద్రా లాభం హైజంప్
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఆగస్ట్ 11న డివిడెండ్... టెక్ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్‌ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్‌లో 50 పడకల కోవిడ్ కేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు. బీపీఎస్‌లో పట్టు కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్ కంపెనీ ఎవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్‌ను సొంతం చేసుకున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్(బీపీఎస్) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది. అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది. – సీపీ గుర్నానీ, టెక్ మహీంద్రా సీఈవో -
టీసీఎస్ ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021-22) ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-7 శాతం మేర పెంపు ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించాయి. సుమారు 4.7 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. వేతనాల పెంపు ప్రతిపాదనలను టీసీఎస్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. ఆరు నెలల వ్యవధిలో టీసీఎస్ వేతనాలను పెంచడం ఇది రెండోసారి కానుంది. తాజాగా పెంచబోయేది కూడా కలిపితే ఆరు నెలల కాలంలో 12–14 శాతం మేర వేతనాలను పెంచినట్లవుతుంది. (టీవర్క్ ఫ్రం హోమ్ నుంచి క్రమంగా హైబ్రిడ్ పని విధానం వైపు) -
108 సిబ్బందికి సీఎం జగన్ శుభవార్త
సాక్షి, అమరావతి : ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు జీతాలను భారీగా పెంచారు. సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 28 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 108 సిబ్బంది జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు. (చదవండి : ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం) ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 28వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్ టెక్నీయన్ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్ చెప్పారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు సీఎం జగన్ ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి. ప్రతి మండలానికి కొత్తగా 104, 108 వాహనాలు కేటాయించారు. -
ఆ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు ప్రకటిస్తుంటే సహారా గ్రూప్ తమ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు ప్రమోషన్లను ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని కంపెనీ సోమవారం వెల్లడించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధించడంతో పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు యూపీకి తిరిగివెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో స్ధానికులకు వారి అర్హతలను బట్టి తమ గ్రూపు సంస్థల్లో ఉపాధి కల్పిస్తామని సహారా గ్రూప్ పేర్కొంది. మహమ్మారి విజృంభణ తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపినా ఈ కారణంతో గ్రూపు సంస్ధల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని గట్టి నిర్ణయం తీసుకున్నామని సహారా గ్రూప్ తెలిపింది. పూర్తి భద్రతతో ఉద్యోగులందరూ తమ విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. క్షేత్రస్ధాయిలో పనిచేసే 4,05,874 మంది ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించామని, 4808 మంది కార్యాలయ ఉద్యోగులకు వేతన పెంపుతో ప్రమోషన్లు కల్పించామని పేర్కొంది. తమ వద్ద పనిచేసే ఉద్యోగుల జీవనోపాథికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహారా గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్ధలకు విజ్ఞప్తి చేసింది. చదవండి : ఇప్పట్లో ఆఫీస్ లేనట్టే! -
ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోవరం ప్రకటించారు. సమ్మెలో పాల్గొన్న వారితోపాటుగా ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇంక్రిమెంటు కేటాయిస్తూ ఇన్చార్జీ ఎండీ సునీల్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీఎం నిర్వహించిన సమావేశం లో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఉత్తర్వు వెలువడింది. సాధారణంగా సమ్మెలు జరిగిన సమయంలో ‘‘నో వర్క్ నో పే’’పద్ధతిలో సమ్మె కాలానికి వేతనం ఇవ్వరు. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు 52 రోజుల సమ్మె కాలానికి కూడా విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తూ వేతనం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున సంస్థకు భారం కాకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుందని ఇటీవల సీఎం ప్రకటించారు. ఉద్యోగి మూలవేతనం ఆధారంగా కనిష్టంగా రూ.350 నుంచి రూ.1000 వరకు వివి« ధ కేటగిరీల ఉద్యోగులకు ఇంక్రిమెంటు అందనుంది. ఆ మొత్తం మూలవేతనంలో కలవనున్నందున డీఏ, సహా పలు బెని ఫిట్స్ కూడా అంతమేర పెరగనున్నాయి. -
రవిశాస్త్రి జీతమెంతో తెలుసా..?
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని వరుసగా రెండోసారి నియమించిన భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడి వార్షిక జీతాన్ని దాదాపు 20 శాతం వరకు పెంచిందని సమాచారం. దీంతో ఏడాదికి అతని వార్షిక జీతం రూ.10 కోట్లకి చేరే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం రవిశాస్త్రిపై వేటు తప్పదని అంతా భావించారు. గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోనూ భారత్ జట్టు రాణిస్తుండటం, టీమిండియా ఆటగాళ్లతోనూ రవిశాస్త్రికి ఉన్న సత్సంబంధాలు ఉండటంతో అనూహ్యంగా మళ్లీ అతడినే కోచ్ పదవి వరించింది. ఇటీవల రెండో పర్యాయం ప్రధాన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఏడాదికి రూ. 8కోట్ల వరకు జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల వరకు పెరగనుంది. దీంతో ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉండనుంది. సంజయ్ బంగర్ స్థానంలో ఎంపికైన విక్రమ్ రాథోడ్ కూడా వార్షిక వేతనంగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు అందుకోనున్నారు. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్‌కోచ్ భరత్ అరుణ్‌లకు కూడా వార్షిక వేతనాలు పెరిగాయి. వారు ప్రస్తుతం ఏడాదికి రూ. 3.5 కోట్లు వరకు తీసుకుంటారని సమాచారం. పెంచిన జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల వెస్టిండీస్ పర్యటనని విజయవంతంగా ముగించిన భారత జట్టు ఈనెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆసీస్ గడ్డపై దశాబ్దాల నిరీక్షణ అనంతరం గత ఏడాది టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానంలో కొనసాగుతోంది. -
హోంగార్డులకు తీపి కబురు
సుప్రీం కోర్టు ఆదేశాలతో హోంగార్డులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై శ్రీకాకుళం జిల్లాకు అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. హోంగార్డులకు వేతనాల పెంపు నిర్ణయంతో జిల్లాలో 765 మందికి ప్రయోజనం కలగనుంది. వీరిలో 78 మంది మహిళా హోంగార్డులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డులకు వాస్తవానికి రోజువారి కనీస వేతనం రూ. 679 ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 400 మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. తాజా నిర్ణయంతో రోజువారీ వేతనం మరో రూ. 200 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ. 600 వేతనాన్ని ఇక నుంచి తీసుకోనున్నారు. వేతనం పెంపుదలతో పాటు హోంగార్డులకు మూడునెలల పాటు మెటర్నిటీ సెలవులు, నెలలో రెండురోజుల వేతనంతో కూడిన సెలవులు, ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా రూ. 2.50 లక్షల మేర వైద్యసహాయం, సహజమరణానికి రూ. 5 లక్షలు, దహణ సంస్కారాలకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని హోంగార్డు ఆర్ఐ శ్రీనివాస్‌కుమార్, జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. మాపై బాధ్యత మరింత పెరిగింది వేతనాలు పెంచడం సంతోషం. మాపై బాధ్య త మరింత పెరిగింది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ. 400 వరకు వేతనం ఇస్తున్నారు. తాజా నిర్ణయంతో రూ. 600 తీసుకోనున్నాం. పెంచిన వేతనాలు త్వరగా అమలుజరిగేలా చర్యలు చేపట్టాలి. – గిరిపండా, హోంగార్డు డ్రైవర్, శ్రీకాకుళం -
స్టార్టప్‌ల్లో వీరిదే హవా..
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్టప్‌ల్లో గత ఏడాది అత్యధిక వేతన పెంపును అందుకున్న వారిలో డేటా సైంటిస్టులు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు ముందువరుసలో ఉన్నారు. 2017లో వీరు అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటున 25 శాతం మేర వేతన వృద్ధిని పొందారు. హైరింగ్ కంపెనీ బిలాంగ్ గణాంకాల ప్రకారం డేటా సైంటిస్టులకు మెరుగైన డిమాండ్ నెలకొంది. వ్యాపార మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలను సమాచారాన్ని కంప్యూటింగ్ విధానాల ద్వారా సేకరించి, విశ్లేషించి క్రోడీకరించే క్రమంలో డేటా సైంటిస్టుల పాత్ర కీలకం. వీరికి గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌ల్లో పట్టుతో పాటు ప్రస్తుత ట్రెండ్స్‌పై అవగాహన ఉండాలి. దేశంలోని 40 ప్రముఖ స్టార్టప్‌ల్లో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగిన డేటా సైంటిస్టుల వార్షిక వేతనం గత ఏడాది రూ 25-29 లక్షల వరకూ పెరిగింది. కృత్రిమ మేథ రాకతో పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో డేటా అనాలిసిస్ టీమ్‌లను బలోపేతం చేస్తున్నాయని బిలాంగ్ సహవ్యవస్ధాపకులు రిషబ్ కౌల్ చెప్పారు. మరోవైపు యూజర్లకు, బ్యాకెండ్ ప్రోగ్రామర్లకు మధ్య వారధిలా వ్యవహరించే ఫ్రంట్ ఎండ్ డవలపర్లకూ గత ఏడాది భారీగా వేతన పెంపు నమోదైంది. వీరు ప్రస్తుతం సంవత్సరానికి రూ 18 లక్షల నుంచి 22 లక్షల వరకూ ఉంది. 2014లో వీరి వార్షిక వేతనం కేవలం రూ 10 లక్షల నుంచి రూ 13 లక్షల మధ్య ఉండేది. ఇక సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల వంటి సైబర్ సెక్యూరిటీ విభాగ సిబ్బంది వేతనాలు సైతం గత ఏడాది భారీగా పెరిగాయి. -
ఈ ఏడాది వేతన పెంపు ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది పలు రంగాల్లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.4 శాతం మేర పెరుగుతాయని ఏఓఎన్ ఇండియా కన్సల్టింగ్ నిర్వహించిన వేతన పెంపు సర్వే వెల్లడించింది. 20 భిన్న పరిశ్రమలకు చెందిన 1000 కంపెనీలను ఈ సర్వే పలుకరించింది. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని ఈ సర్వే తేల్చింది. ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు 9.3 శాతం పెరుగుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక మెరుగైన సామర్థ్యం కనబరిచేవారికి కంపెనీలు ఎప్పుడూ పెద్దపీట వేస్తాయని, వారికి సగటు వేతన పెంపు 15.4 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ ఏడాది ప్రొఫెషనల్ సేవలు అందించే సంస్థల్లో వేతన పెంపు అత్యధికంగా 10.6 శాతంగా ఉంటుందని, కన్జూమర్ ఇంటర్నెట్ కంపెనీల్లో 10.4 శాతం, లైఫ్సైన్సెస్లో 10.3 శాతం, ఆటోమేటివ్, వాహన తయారీ కంపెనీల్లో 10.1 శాతం, కన్జూమర్ ఉత్పాదక సంస్థల్లో 10.2 శాతం, ఐటీ అనుబంధ సంస్ధల రంగంలో 9.6 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని అంచనా వేసింది. హైటెక్, ఐటీ పరిశ్రమలో వేతన పెంపు 9.5 శాతం ఉంటుందని పేర్కొంది. నిర్మాణరంగంలో 9.3 శాతం, వినోద, ప్రచురణలు, కమ్యూనికేషన్ రంగంలో 9.1 శాతం మేర వేతనాలు పెరుగుతాయని తెలిపింది. ఆతిధ్య రంగం, రెస్టారెంట్లలో 9 శాతం, ఇంధన, రవాణా రంగాల్లో 9 శాతం, ఇంజనీరింగ్ సేవల్లో 8.9 శాతం, ఆర్థిక సంస్థల్లో 8.5 శాతం, సిమెంట్ రంగంలో 8.4 శాతం చొప్పున వేతన పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది. -
ఏఎన్ఎం జీతాల పెంపు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్ఎంల జీతాలను పెంచు తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు వారి జీతాలను రూ.10 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ఆదివారం ఫైలుపై సంతకం చేశారు. 2003లో యూరోపియన్ కమిషన్ ప్రాజెక్టు కింద 710 మంది ఏఎన్ఎంలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వారి నెల జీతం రూ.10 వేలుగా ఉంది. ఈ నేపథ్యంలో వారి జీతాలను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఫైలుపై సంతకం చేశారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఇటీవల సీఎంను కలసి సెకండ్ ఏఎన్ఎంల జీతాలు కూడా పెంచాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. వారి జీతాలను పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. -
మంత్రుల జీతభత్యాలకు రూ. 295 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతభత్యాలు, ప్రయాణ ఖర్చులకు 2018–19 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 295 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో 29% తగ్గించారు. బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్నే మంత్రి మండలి, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతభత్యాలకు, ఇతర సౌకర్యాలు, విందు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం వినియోగించాలి. ఇక వీవీఐపీలు వినియోగించే విమానాల నిర్వహణ ఖర్చులను కూడా ఈ మొత్తంలోనే ఖర్చు చేయాలని జైట్లీ తెలిపారు. 2017–18 కేంద్ర బడ్జెట్లో రూ. 418.49 కోట్లను కేటాయించారు. ప్రధాని కార్యాలయం పాలనాపరమైన ఖర్చులకు ఈ ఏడాది బడ్జెట్లో రూ. 50.35 కోట్లను కేటాయించారు. -
న్యాయుమూర్తులకు భారీ బొనాంజా..
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను రెండింతలు పైగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని నోటిఫై చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత వేతనం రూ లక్ష నుంచి రూ 2.80 లక్షలకు పెరిగింది. ఇవి కాకుండా డీఏ, ఇతర అలవెన్సులు, అధికారిక నివాసం, కారు సిబ్బంది వంటి సౌకర్యాలు అదనం. సుప్రీం కోర్టు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల వేతనం ప్రస్తుతం ఉన్న రూ 90,000 నుంచి రూ 2.5 లక్షలకు పెరిగింది. క్యాబినెట్ కార్యదర్శి స్దాయిలో వీరికీ అలవెన్సులూ, ఇతర సౌకర్యాలు వర్తిస్తాయి. ప్రస్తుతం నెలకు రూ 80,000 వేతనం అందుకుంటున్న హైకోర్టు న్యాయమూర్తులకు పెరిగిన వేతనం రూ 2.25 లక్షలుగా ఖరారు చేశారు. జనవరి 1, 2016 నుంచి వేతన పెంపును అమలు చేస్తారు. సిట్టింగ్ జడ్జీలతో పాటు పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులకూ వేతన పెంపు వర్తిస్తుంది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వేతనాలు పెంచాలని 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
సుప్రీం, హైకోర్టుల జడ్జీల డీఏ పెంపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల కరువు భత్యం (డీఏ)ను ప్రభుత్వం మూడు శాతం పెంచింది. తాజా పెంపు ఈ ఏడాది జూలై 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు లేఖలు రాసింది.కాగా ఏడవ వేతన సంఘం ప్రకారం న్యాయమూర్తుల జీతాల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులు ప్రస్తుతం మంత్రివర్గం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేబినెట్ ఆమోదం తర్వాత వీటిని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలు నెలకు రూ.1.5 లక్షలు (అన్ని కోతల అనంతరం) వేతనంగా అందుకుంటుండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతకన్నా ఎక్కువగా, హైకోర్టుల న్యాయమూర్తులు రూ.1.5 లక్షల కన్నా తక్కువగా వేతనాలను పొందుతున్నారు. -
108,104 ఉద్యోగులకు ఉగాది కానుక
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 108, 104 సర్వీస్ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీస్ ఉద్యోగులకు రూ.4వేల చొప్పున జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2016 ఏప్రిల్ నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 1578మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు జీతాల పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు పైలట్లు (డ్రైవర్లు), హెల్త్ టెక్నీషియన్లకు రూ.11,500 వేతనం ఉండేది. ఇపుడు వీరికి అదనంగా రూ.4 వేలు పెంపు వర్తించనుంది. -
అంగన్వాడీ కార్యకర్తలకు కేసీఆర్ వరాలజల్లు
-
అంగన్వాడీ కార్యకర్తలకు కేసీఆర్ వరాలజల్లు
హైదరాబాద్ : అంగన్వాడీ కార్యకర్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అంగన్ వాడీ కార్యకర్తలకు, సహాయ సిబ్బందికి జీతాలు పెంచుతూ ప్రకటన చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలు జీతం నెలకు రూ.10, 500, కార్యకర్తల సహయకుల జీతం రూ.6000లకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అంగన్వాడీల్లో పిల్లలకు తగినంత ఆహారం ఇవ్వాలని, గతంలో ఇచ్చినట్లు గ్రాముల లెక్కన వారికి ఆహారం ఇవ్వరాదని, అలాగే పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే మరో ఏడాది తర్వాత మళ్లీ జీతాలు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్హతలు ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలకు సూపర్ వైజర్లుగా పదోన్నతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని కార్యకర్తలకు ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అంగన్వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం విషయంలో తిన్నంత పెట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. గతంలో మాదిరిగా గ్రాముల లెక్కన ఆహారం పెట్టొద్దన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. -
బోధనేతర ఉద్యోగుల జీతాల పెంపు
ఎస్కేయూ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న టైం స్కేల్, మినిమమ్ స్కిల్ ఉద్యోగుల జీతాలు పెంచారు. వర్శిటీలో బుధవారం పాలక మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. రూ 2.91 కోట్లతో రెండు నూతన భవనాల నిర్మాణానికి సమ్మతి తెలిపారు. రూ. కోటితో మందాకిని హాస్టల్ రెండవ అంతస్తు నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. పీజీ, యూజీ, దూరవిద్య పరీక్ష విభాగాలను ఒకే గూటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ 1.91 కోట్లతో మరో భవనాన్ని నిర్మించనున్నారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరును నామకరణం చేశారు. 2017 ఫిబ్రవరిలో స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా 90 ఔట్ సోర్సింగ్ ఉద్యోగల భర్తీకు గతంలో టెండర్లు ఆహ్వానించారు. ఇందులో నాలుగు కంపెనీలు 0 శాతం కమీషన్‌ను టెండర్లు దరఖాస్తు చేశాయి. దీంతో ఆచార్య ఫణీశ్వర రాజు కమిటీను నియమించారు. వారి సూచనల మేరకు కార్తికేయ లిమిటెడ్, విజయవాడ ఔట్సోర్సింగ్ కంపెనీకు నూతన ఉద్యోగుల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఫార్మసీ ప్రిన్సిపల్ ఎంపికకు సంబంధించి గతంలో ముగ్గురుని ఎంపిక చేశారు. మొదట ఎన్నుకున్న వ్యక్తి రాజీనామా చేయడంతో రెండో వ్యక్తిని నియమించారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది.