sanjeev kumar
-
‘ఏపీలో కులగణన చారిత్రక ఘట్టం’
సాక్షి, విజయవాడ: ఏపీలో కుల గణన -2023పై ప్రాంతీయ సదస్సు విజయవాడలో జరుగుతోంది. ఈ సదస్సుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, కె.లక్ష్మణరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ..‘ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశమంతా సీఎం జగన్ ఆలోచనలను ఫాలో అవుతోంది. గతంలో మంజునాథన్ కమిషన్ ఫెయిలైంది. అందుకే సీఎం జగన్ శాశ్వత బీసీ కమిషన్‌ను వేశారు. బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. సామాజిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అన్ని సామాజిక వర్గాలపై సీఎం జగన్‌కు ఎంతో గౌరవం ఉంది. గతంలో ఉద్యమాలు చేసినా కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదు’ అన్నారు. ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘ఏపీలో కులగణనతో ఒక చరిత్ర మొదలవ్వబోతోంది. బీసీలు ఏకమైతే రాజకీయంగా బలవంతులవుతారని 70 ఏళ్లుగా మనల్ని ఎదగనివ్వలేదు. సీఎం జగన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు మనకు రిజర్వేషన్లు కల్పించిన కారణజన్ముడు అంబేద్కర్. ఈనాడు కులగణనకు శ్రీకారం చుట్టి సీఎం జగన్ కారణజన్ముడయ్యాడు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల కోసం కులగణన చేయడం లేదు. కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఏపీలో జరగబోయే కులగణన దేశానికే ఒక నిర్ధేశం అవుతుంది’. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. కులగణన చేయాలని సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ధన్యవాదాలు. అన్ని కులాలకు మేలు జరగాలని 90 ఏళ్ల తర్వాత సీఎం జగన్ ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. మన దేశంలో కులం అనేది ఒక కల్చరల్ ఈవెంట్ వంటిది. కులగణన జరిపే క్రమంలో పకడ్భంధీగా వ్యవహరించాలని కోరుతున్నాను. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ..‘బీసీ కులగణన చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కులగణనకు చట్టబద్ధత ఉండాలి. సచివాలయ సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను జతచేసి చేయాలి. కోర్టు సమస్యలు రాకుండా ఉండాలంటే వాలంటీర్లను కులగణనలో భాగస్వామ్యులను చేయొద్దని కోరుతున్నాను. రాష్ట్రంలోని నాలుగు కమిషన్లను భాగస్వామ్యులను చేయాలి. వలస కార్మికులు, సంచార జాతులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కులగణన జరిగిన తర్వాత సచివాలయాల వద్ద లిస్టులు ప్రదర్శించాలి. కులగణన జరిగే పది రోజుల్లో ఒక రోజు సెలవు ప్రకటించి ఆరోజు అందరి వివరాలు తీసుకోవాలి. ఈకేవైసీకి కులగణనకు ముడి పెట్టవద్దని కోరుతున్నా. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నాను’. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ..‘కులగణన జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. కులగణనను సీఎం జగన్ రాజకీయం కోసం చేయడం లేదు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందేవారికి కులగణనతో చెక్ పడుతుంది. సీఎం జగన్ చొరవతో 90 ఏళ్ల తర్వాత కులగణన జరగబోతోంది. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నాను’. -
ఆర్బీకేల పనితీరు అద్భుతం
సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయంలో వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ కమిటీ బృంద సభ్యులు కితాబిచ్చారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం స్టడీ టూర్లో భాగంగా రెండు రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కమిటీ కన్వినర్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అధ్యక్షతన రాష్ట్రంలో ఎరువులు లభ్యత, పంపిణీ తదితర అంశాలపై శనివారం కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీలోని పలువురు ఎంపీలు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను సందర్శించామని, వాటి ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు దేవాలయాలతో సమానంగా ఆర్బీకేలు ఉన్నాయని, ఈ తరహా వ్యవస్థను మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడంపై అభినందనలు తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ, నానో యూరియా వంటి అత్యాధునిక పద్ధతుల గురించి చర్చించారు. డాక్టర్ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ యూరియా తదితర ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయడం వల్ల వారికి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయని, ఈ విధానానికి ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ వంటి సంస్థలు సహకరిస్తే మరింత నాణ్యంగా సేవలందించవచ్చని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల రైతులందరికీ అందుబాటులోకి రావడం లేదని, డ్రోన్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. -
ప్రేమ మైకంలో జీవితాన్నే నాశనం చేసుకున్న హీరోయిన్, బ్రహ్మచారిణిగా..
సినిమా ఇండస్ట్రీలో చాలామంది తారలు వయసు మీద పడుతున్నా పెళ్లి ధ్యాసే ఎత్తడం లేదు. చేదు అనుభవాల వల్లనో.. అర్ధాంగి అవసరం లేదనో లైఫ్ పార్ట్నర్ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. అలా 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయినవాళ్లు చాలామందే ఉన్నారు. ప్రేమ మైకంలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అందులో ఒకరే సులక్షణ పండిత్.. ఈమె ఇప్పటితరానికి తెలిసుండకపోవచ్చు కానీ 70-80sలో మాత్రం గొప్ప హీరోయిన్.. ఆమె జీవిత కథపై ప్రత్యేక కథనం.. 'ఉల్టాన్' షూటింగ్లో పుట్టిన ప్రేమ సులక్షణ పండిత్.. జితేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హ, రాజేశ్ ఖన్నా, శశి కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి బడా స్టార్స్‌తో నటించింది. ఎన్నో పాటలు పాడింది. అటు నటనతో, ఇటు తన గాత్రంతో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. అయినా తనను దురదృష్టవంతురాలనే పిలిచేవారు. ఎందుకంటే ఆమె తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేయలేదు. కెరీర్‌పై అసలు ఫోకస్ చేయలేదు. అందుకు గల కారణం.. ప్రేమ. అవును, ఆమె హీరో సంజీవ్ కుమార్‌ను మనసారా ప్రేమించింది. అతడితోనే జీవితం అని బలంగా నమ్మింది. ఉల్జాన్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే సులక్షణ అతడిపై మనసు పారేసుకుంది. అతడి మనసులో మరొకరు అప్పటికే సంజీవ్ మరో హీరోయిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. (ఆమె మరెవరో కాదు, హేమమాలిని అని అప్పట్లో ప్రచారం జరిగింది) తనను పెళ్లి చేసుకోవాలనీ ప్రయత్నించాడు. కానీ సదరు హీరోయిన్ అతడి పెళ్లి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసింది. అయినా ఆమె ప్రేమను గెల్చుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నించాడు. అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో పిచ్చివాడయ్యాడు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. పెళ్లనేదే లేకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని డిసైడయ్యాడు. బ్రహ్మచారిగా జీవితం.. ఈ నిర్ణయం సులక్షణ పండిత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎలాగైనా అతడిని ఒప్పించి తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న కోరిక నెరవేరదని గ్రహించింది. తను కూడా ఎవరినీ పెళ్లి చేసుకోకుండా అతడి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేయాలని నిర్ణయించుకుంది. 1985లో 47 ఏళ్ల వయసులో సంజీవ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. అతడిని మనసులోనే భర్తగా ఊహించుకున్న సులక్షణ.. సంజీవ్ మరణాన్ని తట్టుకోలేకపోయింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయానా సులక్షణ సోదరి విజేత పండిత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన సోదరి కళ్లముందే జీవచ్ఛవంలా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది విజేత. నాలుగు గోడల మధ్యే నలిగిపోతూ 2006లో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చింది. అయినా తన తీరు మారలేదు. ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎవరినీ కలిసేది కాదు. ఒంటరిగా తన గదిలోనే ఉండిపోయేది. ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం నలిగిపోయింది. ఒకరోజు బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో తన తుంటి ఎముక విరిగింది. దాన్ని సరిచేయించుకునేందుకు నాలుగు సర్జరీలు చేసుకుంది.. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ తను ఎవరి సాయం లేకుండా లేచి నడవలేని పరిస్థితి! గుడ్డిగా ప్రేమించి, మనసులోనే ప్రియుడికి గుడి కట్టి, కళ్ల ముందే తన మరణాన్ని చూసి గుండె రాయి చేసుకుని బతికింది సులక్షణ! ప్రేమ మైకంలో పడి జీవితాన్నే నాశనం చేసుకుంది. చదవండి: యూట్యూబర్‌తో నిశ్చితార్థం.. మోకాలిపై కూర్చుని ఉంగరం తొడుగుతూ.. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
టీడీపీ గల్లంతు కావడం ఖాయం..
-
TS: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కాషాయ పార్టీకి చెందిన నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో మెదక్ ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, కేంద్ర మంత్రి బాల్యన్ కోసం స్థానిక బీజేపీ నేతలు గెస్ట్ హౌస్ బుక్ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. కానీ, ఆర్ అండ్ బీ అధికారులు గెస్ట్ హౌస్‌కు తాళాలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో మంత్రితో పాటు అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు అర గంట పాటు వేచి చూశారు. అనంతరం.. అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో, అధికారుల తీరుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు -
ఒక ప్రేమ.. రెండు జీవితాలు
‘పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయి అంటారు. కాని సంజీవ్ కుమార్‌కు జతనివ్వడం మరిచిపోయాడు దేవుడు. అందుకే అవివాహితుడిగా మిగిలిపోయాడు’ అంటుంది సులక్షణా పండిత్. సంజీవ్ కుమార్‌ను ప్రేమించిన ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అతని జ్ఞపకాలతో సహజీవనం చేస్తూ! సులక్షణా పండిత్ తొలి చిత్రం ‘ఉల్ఝన్’. అదీ సంజీవ్ కుమార్‌తోనే. ఆ సినిమా సెట్స్ మీదే కుమార్‌తో ప్రేమలో పడింది ఆమె. అతని ప్రశాంత గాంభీర్యం సులక్షణాకు నచ్చిన లక్షణం. తనే చొరవ తీసుకొని కుమార్‌ను పలకరించేది. అప్పటికే హేమమాలిని తిరస్కారంతో ముక్కలైన కుమార్ మనసు సులక్షణా మాటలతో సాంత్వన పొందసాగింది. సినిమా పూర్తయ్యేలోపు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అతని మీదున్న తన ప్రేమను ప్రస్తావించాలని ఆమె అనుకున్నప్పుడల్లా.. హేమ గురించి తాను కన్న కలలను, పడుతున్న వేదనను వెలిబుచ్చుకునేవాడు సంజీవ్ కుమార్. ఇలా ఎప్పటికప్పుడు ఆమె తన మనసులో మాట చెప్పాలని సంసిద్ధమవడం.. అతను తన బాధను ఏకరువు పెట్టడం.. చాలా కష్టంగా ఉండేది సులక్షణాకు. అయినా సహానుభూతితో అర్థం చేసుకునేది. తాను వినడం వల్ల అతను తేలికపడతాడు అని భావించి. ‘‘హేమాజీని పిచ్చిగా ప్రేమించి బద్దలైన గుండె కదా.. మామూలవడం అంత తేలిక కాదు. ఆ ఫేజ్లోంచి బయటపడగానే అతని మీదున్న నా ఫీలింగ్స్‌ను చెప్పాలనుకున్నా. కాని నాకు ఆ చాన్సే రాలేదు’’ అని చెప్పింది సులక్షణా. ఆమె.. సంజీవ్ కుమార్ కోసం పడుతున్న తపన చూసి ‘ఉల్ఝన్’ సినిమాలోని సహ కళాకారులంతా అది సంజీవ్ కుమార్ గ్రహిస్తే బాగుండని అనుకునేవాళ్లు. సులక్షణాతో అనే వాళ్లు కూడా ‘ఆ మనిషికి అర్థం కావడం లేదు కాని, అతనికి నీ తోడు చాలా అవసరం. అతణ్ణి మునుపటి మనిషిలా మార్చగలిగేది నువ్వే’ అని. ‘ఉల్ఝన్’ సినిమాతో తెర మీది వాళ్ల కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. తర్వాత ఆరు సినిమాల్లో నటించి హిట్ పెయిర్ అనే కాంప్లిమెంట్ తెచ్చుకున్నారు. ఆ ప్రశంసను జీవితంలోనూ పొందాలనుకుంది సులక్షణా.. సంజీవ్ కుమార్‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి. ఆమె తనను ఇష్టపడుతున్న విషయం సంజీవ్ మనసు దాటేం పోలేదు. అలాగని అతను మనసూ పెట్టలేదు. కారణం.. ఎంత ప్రయత్నించినా హేమమాలినిని మర్చిపోలేకపోవడమే. తాగినా.. తాగకపోయినా అతని మెదడంతా హేమనే. అప్పటికే హార్ట్ ఎటాక్ కూడా వచ్చింది అతనికి. మందుకు దూరంగా ఉండమన్నారు డాక్టర్లు. ఇంక లాభంలేదని రేయింబవళ్లు అతణ్ణి కాపుకాచుకోసాగింది సులక్షణా. ఆ సందర్భంలోనే ఒకసారి చెప్పింది కూడా ‘మీరంటే నాకు ఇష్టం... నా ప్రాణం కంటే కూడా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది’ అని. నవ్వి ఆమె తలనిమిరాడు సంజీవ్ కుమార్. ‘నిజం.. మీరులేక నేనుండలేను’ అంది కళ్ల నిండా నీళ్లతో. ‘ఈ జీవితానికి హేమాయే. నా మనసులో ఆమెకు తప్ప ఎవరికీ చోటు లేదు. నా మీద ప్రాణం పెట్టుకొని నీ జీవితాన్ని వృథా చేసుకోవద్దు.. ప్లీజ్’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సంజీవ్ కుమార్.పొగిలి పొగిలి ఏడ్చింది సులక్షణా. అయినా అతని చేయి వదల్లేదు. రోజురోజుకీ సంజీవ్ ఆరోగ్యం క్షీణించసాగింది. కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేసింది ఆమె. ‘‘నా ఇన్వాల్వ్మెంట్ చూసి సంజీవ్జీని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నాతో అన్నాడు ఓ రోజు.. ‘ఈ మనిషిని అంతలా పట్టించుకోకు. తర్వాత నువ్వు తేరుకోలేవు. అతనికి రెండేళ్లే టైమ్ ఉంది’ అని. ఆ మాట నాకు మరో షాక్’’ ఓ ఇంటర్వ్యూలో సులక్షణా పండిత్ డాక్టర్లు, సులక్షణా ఎంత చెప్పినా మందుతో దోస్తీ మానలేదు సంజీవ్ కుమార్. హేమమాలిని తలపులను తప్పించుకోవడానికి మత్తే మందనుకున్నాడు. మానసికంగా పెనవేసుకున్న ఒంటరితనాన్ని జయించలేకపోయాడు. శారీరక ఆరోగ్యమూ క్షీణించింది. అమెరికా వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయని షూటింగ్స్‌లో పాల్గొన్నాడు. మానసిక ఒత్తిడి, శారీక శ్రమ.. అతణ్ణి కోలుకోనివ్వలేదు. యాభై ఏళ్లయినా నిండకుండానే ‘గుడ్ బై’ చెప్పేశాడు ఈ లోకానికి. సంజీవ్ కుమార్ మరణంతో కుంగిపోయింది సులక్షణా. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. చాలా ఏళ్లు బయట ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెంచేసుకుంది. చెల్లి విజేతా పండిత్ సహాయంతో కోలుకుంది. ఇప్పటికీ తన గదికే పరిమితమై ఉంటుంది ఎక్కువగా.. సినిమాలు చూస్తూ, పాటలు వింటూ.. కవిత్వం రాస్తూ! -
అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్ యూ’
విలక్షణ నటుడు సంజీవ్ కుమార్‌కు కెరీర్ కలిసొచ్చినట్టుగా ప్రేమ కలిసిరాలేదు. డ్రీమ్‌గర్ల్ హేమమాలిని మీద మనసు పారేసుకున్నాడు.. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడ్డాడు.. ఆమె కోసం పరితపించాడు.. ఒంటరితనాన్ని తోడెంచుకున్నాడు... దాదాపు ముప్పై ఏళ్లు సినీ రంగంలో ఉన్నా లౌక్యం ఒంటబట్టలేదు సంజీవ్ కుమార్‌కు. ఉన్నదున్నట్టు మాట్లాడ్డం అతని గుణం. వచ్చిన కొత్తలోనే ఆనాటికే పేరు ప్రఖ్యాతులున్న నటి నూతన్ (శోభనా సమర్థ్ కూతురు, తనూజ సోదరి, బాలీవుడ్ నటుడు మొహనీశ్ బెహెల్ తల్లి, కాజోల్కు పెద్దమ్మ)ను ఇష్టపడ్డాడు. షూటింగ్ సెట్లోనే అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అప్పటికే వివాహిత అయిన నూతన్‌కు సంజీవ్ కుమార్‌ది పిల్లచేష్టలా తోచింది. కోపంతో అతని చెంప చెళ్లుమనిపించింది. ఆ దెబ్బతో సంజీవ్ కుమార్ జీవితంలో ఎప్పుడూ నూతన్‌కు ఎదురు పడలేదు. (ఆ రెండు ప్రశ్నలకు రియా సమాధానం?) జితేంద్ర మధ్యవర్తిత్వం.. ‘సీతా ఔర్ గీతా’ షూటింగ్ రోజులవి. తొలి రోజే సంజీవ్ కుమార్ మదిలో స్థిరపడిపోయింది హేమమాలిని. భౌతికంగా షూటింగ్లో ఉంటున్నాడు తప్ప అతని డేట్స్ అన్నీ ఆమె తలపులతోనే నిండిపోయాయి. పెదవి విప్పి చెప్పాలంటే భయం. మొదటిసారి ఎదురైన అనుభవం రిపీట్ అయ్యి, రెండో చెంపా చెళ్లుమంటుందేమోనని. అందుకే తనకు, హేమమాలినికీ సన్నిహితుడైన జితేంద్రతో చెప్పాడు తన ఫీలింగ్స్‌ని.. ఆమెకు చేరవేయమని. ప్రేమలో మధ్యవర్తిత్వం కూడదన్న ఎరుక లేక. అయితే సంజీవ్ కుమార్ ప్రేమకు మెసెంజర్‌గా వెళ్లి తాను హేమను ఇష్టపడ్డం మొదలుపెట్టాడు ఆ సరికే శోభ సిప్పీతో డేటింగ్లో ఉన్న జితేంద్ర. ఓ వైపు ‘సీతా ఔర్ గీతా’ పూర్తి కావస్తున్నా హేమ దగ్గర జితేంద్ర తన జిక్ర్ తేలకపోయేసరికి తనే మనసులో మాటను చెప్పేయలనే నిర్ణయానికి వచ్చేశాడు సంజీవ్ కుమార్. ఓ రోజు చెప్పేశాడు కూడా.. ‘హేమాజీ! మీరంటే నాకిష్టం. మీకూ ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని. ‘ఊ.. సరే’ అంటూ సమాధానమిచ్చింది హేమమాలిని. సంజీవ్ కుమార్ సంతోషానికి అవధుల్లేవు. అదెన్నో రోజులు నిలవలేదు. ఈ విషయం హేమమాలిని వాళ్ల అమ్మకు తెలిసి ‘కుమార్‌తో నీ పెళ్లి కుదరదు’ అంటూ హుకుం జారీ చేసింది. ఆ మాటకూ తలొగ్గి సంజీవ్ కుమార్‌కు ‘నో’ చెప్పింది హేమమాలిని. ఇది తెలిసి .. ‘ఐ లవ్ యూ’ అంటూ హేమ ముందుకొచ్చాడు జితేంద్ర... శోభ సిప్పీతో ఉన్న సంబంధాన్ని దాచి. అయితే ఆ నిజాన్ని శోభ సిప్పీనే బయట పెట్టింది హేమమాలిని దగ్గర. ఊహించని ఈ పరిణామానికి కాస్త భంగపడ్డా కోలుకుంది హేమ. కాని.. సంజీవ్ కుమారే కోలుకోలేకపోయాడు. మందును మచ్చిక చేసుకున్నాడు. 1974– 75.. ‘షోలే’ స్క్రిప్ట్ పట్టుకుని సంజీవ్ కుమార్ దగ్గరకు వెళ్లాడు రమేశ్ సిప్పీ. ‘వీరు’ పాత్రను ఆఫర్ చేశాడు. అన్యమనస్కంగా అటూఇటూ కదిలాడు కుమార్. వీరు జత బసంతిగా హేమమాలిని ఓకే అయినట్టు చెవినేశాడు. ఆమెకు దగ్గర కావడానికి దీన్ని ఇంకో చాన్స్‌గా ఉపయోగించుకోవచ్చంటూ కుమార్లో ఆశ పుట్టించాడు సిప్పీ. పాజిటివ్‌గా కదిలాడు కుమార్. అయితే ఆ సమయానికి ధర్మేంద్ర .. హేమమాలిని చేయి అందుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. షోలే స్క్రిప్ట్ పట్టుకుని ధర్మేంద్ర దగ్గరకూ వెళ్లాడు సిప్పీ. ‘ఠాకూర్’ క్యారెక్టర్‌కు మీరైతే బాగుంటుంది’ అంటూ. ఒప్పుకున్నాడు ధర్మేంద్ర. తర్వాత ‘వీరు’ సంజీవ్ కుమార్ వశమైందని తెలిసి, ఆ పాత్ర ఇస్తేనే ‘షోలే’ చేస్తాను లేకుంటే లేదని సిప్పీకి స్పష్టం చేశాడు ధర్మేంద్ర... కుమార్.. హేమను ఇష్టపడుతున్నాడనే స్పృహాతో. మళ్లీ కుమార్‌ను కలిసి జరిగింది వివరించి ‘హేమను కన్విన్స్ చేయడానికి కావల్సింది ఇంకొక్క అవకాశమే కదా ఠాకూర్ రోల్ తీసుకో’ అని సముదాయించాడు సిప్పీ. ‘కానీయ్’ అన్నట్టుగా తలాడించాడు కుమార్. షూటింగ్ ప్రారంభమైంది. కుమార్ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. హేమ దగ్గర తన ప్రేమను ప్రస్తావించాడు మళ్లీ. ‘కాదన్నాను కదా’ అంది ఆమె. ఇదంతా ధర్మేంద్రకు చేరింది. ఆ సినిమాలో ఠాకూర్, బసంతిల మధ్య ఒక్క సీన్ కూడా ఉండరాదని శాసించాడు స్టార్ హోదాలో ఉన్న అతను. అందుకే ‘షోలే’లో సంజీవ్ కుమార్, హేమమాలినిల మధ్య ఒక్క సీన్ కూడా ఉండదు. రెండోసారీ హేమమాలినితో ‘నో ’ అనిపించుకున్నాక కుంగిపోయాడు సంజీవ్ కుమార్. ఒకింత డిప్రెషన్‌లోకీ వెళ్లాడు. ఆ షాక్ వల్లే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందనీ అంటారు సినీ విమర్శకులు. సంజీవ్ కుమార్ నవ్వుకి, నటనకు పడిపోయిన నటీమణులెంతమందో. అతను భోజన ప్రియుడని.. అతనికిష్టమైన వంటలను స్వయంగా వండి, షూటింగ్ స్పాట్స్‌కు తెచ్చిస్తూ అతని మీద తమకున్న ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. పెళ్లి చేసుకోమని కోరారు. అందరికీ అతని నవ్వే సమాధానమైంది. గుండె మాత్రం హేమ ప్రేమ కోసం తపిస్తూ.. షోలే (జ్వాల)లా రగులుతూనే ఉండింది. దిగులు ఇంట్లోని సంజీవ్ కుమార్‌కు ఆ సమయంలో దొరికిన సాంత్వన సులక్షణా పండిట్. -
విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
సాక్షి, కర్నూలు: విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ సంజీవ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లలో రాయలసీమలో ప్రముఖ ఆసుపత్రిగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతామని తెలిపారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు నిధులు విడుదల చేసిందని వెల్లడించారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని సంజీవ్‌కుమార్ పేర్కొన్నారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ) -
‘తెలంగాణ ప్రభుత్వం మొండిగా చేస్తోంది’
కర్నూల్: కరోనా నుంచి తమ కుటుంబ సభ్యులు కోలుకొని, ఆరోగ్యంగానే ఉన్నారని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ తెలిపారు. సోమవారం కర్నూల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న ఆదోని వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా జిల్లాకు తీసుకురానున్నట్లు సంజీవ్‌కుమార్ వెల్లడించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించి పరిష్కారించారని తెలిపారు. (కర్నూలులో 403 మంది కరోనా విజేతలు) అదేవిధంగా కరోనా వైరస్ పట్ల కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల నీటి వాటాలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఇది మంచిది కాదని హితవు పలికారు. ఏపికి రావాల్సిన నీటిని కేటాయించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. జిల్లాలో విద్యుత్ చార్జీలపై ఉన్నతాధికారుల తో సమీక్షిస్తామని సంజీవ్ కుమార్ చెప్పారు. (వలస జీవులకు ఏపీ ప్రభుత్వం అండ) -
మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ
కర్నూలు (రాజ్‌విహార్): తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రిలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. (బయట తిరిగితే క్వారంటైన్కే ! ) కర్నూలులో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. అమెరికా, స్పెయిన్‌లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో బీసీజీ వ్యాక్సిన్ వాడుతుండటం వల్ల ఇక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అమెరికా లాంటి పరిస్థితి ఇక్కడ రాదని వివరించారు. లాక్ డౌన్ ఆంక్షలను రెడ్ జోన్లలో పొడిగించి.. గ్రీన్ జోన్లలో విడతల వారీగా ఎత్తివేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజ్‌భవన్‌కు చెందిన నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. చీఫ్ సెక్యూరిటీ అధికారితో పాటు నర్సింగ్ సిబ్బందికి కరోనా సోకింది. (కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు) -
కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కోనసాగుతున్నప్పటికీ సంక్షేమ పథకాలు ఎక్కడా అటంకం లేకుండా సమర్థవంతంగా కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత బీవై రామయ్య అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంతేగాక వార్డు వాలంటీర్ల వ్యవస్థ కూడా దేశవ్యాప్తంగా ఆదర్శవంతంగా అమలవుతున్నాయన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు. (లాక్డౌన్ ఎఫెక్ట్.. వీడియో కాల్లో పెళ్లి) ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం అన్నారు. కరోనాపై యుద్దంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ మాట్లాడుతూ.. కరోనాపై పోరాటంలో పేదలకు ఎలాంటి కష్టం రాకుండా సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. రేషన్, వృద్దాప్య పింఛన్లు కూడా ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే హఫీజ్ మాట్లాడుతూ.. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కరోనా అన్నది కులమతాలకు అతీతమైనదని సోషల్ మీడియోలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మోద్దని సూచించారు. (మోదీ పిలుపు; నిద్రొస్తే నిద్రపోతా : మమతా) -
'అందుకే వికేంద్రీకరణ దిశగా అడుగులు'
సాక్షి, తాడేపల్లి : 'రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం' అనే అంశంపై వైసీపీ చేనేత విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్పార్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాలు నుంచి చేనేత వర్గం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'రైతు అన్నం పెడితే.. నాగరికత నేర్పిన వారు చేనేతలు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేతల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. నాడు దివంగత సీఎం వైఎస్ ఆర్ విద్య, వైద్యం పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం మగ్గం కార్మికుల కుటుంబానికి రూ. 24 వేలు అందించి సీఎం జగన్ వారికి అండగా నిలిచారు. అర్హతలు సడలించి ఆరోగ్యశ్రీ పథకం కింద 2 వేలుపైగా రోగాలకు ఉచితంగా చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ వెనుకబడిన వర్గాలకు మేలు చేకూరుస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి, అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. గత ప్రభుత్వం రూ. 3 లక్షలు 60 వేల కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఆర్ధిక పరిస్థితి గాడిన పెట్టె దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో మీడియా కంటే..సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజధాని పేరుతో బినామీ కంపెనీలతో కలిసి చంద్రబాబు అమరావతిని దోచుకున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి పేరుతో ఒక భ్రమ సృష్టించారు. ఆయన కుమారుడు లోకేష్ ను గత ఎన్నికల్లో రాజధాని ప్రాంత ప్రజలు దారుణంగా ఓడించారు. రాజధాని పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు.. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. మూడు ప్రాంతాలు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ నడుం బిగించారు. విశాఖపట్నం అంటే.. ఐఏఎస్ అధికారులు అంతా సమ్మతంగా ఉన్నారు. చేనేతలకు మరింత అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని' పేర్కొన్నారు. (రహస్యాలు లేవు.. ప్రజలకు అన్నీ తెలుసు: సజ్జల) కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. చేనేతలు అంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఎక్కువని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత కార్మికులు 13 లక్షలు 50 వేల మంది ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి చేనేతకు 3శాతం అంటే 428 కోట్లు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలకు కేంద్రం కేటాయించదని గుర్తుచేశారు. అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్ ఒక నేతన్న నేస్తం కింద రూ. 180 కోట్లు కేటాయించి చేనేతలు పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్నారని అభిప్రాయపడ్డారు. వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చేనేతలకు 25 మోసపూరిత హామీలు ఇచ్చి టీడీపీ మోసం చేసిందని, అలాగే రూ. వెయ్యికోట్ల రూపాయలు చేనేతలకు ఇస్తామని చెప్పి మాట తప్పారని వెల్లడించారు. చేనేత సహకార సొసైటీలను మరింత బలోపేతం చేయాలని, మగ్గం నేసే ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24వేలు అందచేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు.(విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) బుట్టా రేణుక మాట్లాడుతూ.. వికేంద్రీకరణ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయం ప్రస్తావించిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేనేత హస్తం కింద 360 డిగ్రీల కోణంలో మ్యానిఫెస్టో రూపకల్పన చేసి నవరత్నాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలంటే లక్షల కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజధాని ప్రాంత ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. -
సత్వర న్యాయం అందేలా చూస్తాం
శంషాబాద్: దిశ కుటుంబసభ్యులకు సత్వర న్యాయమందేలా చూస్తామని కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ అన్నారు. రాజకీయ నేతగా కాకుండా ఓ వెటర్నరీ వైద్యుడిగా పరామర్శించడానికి వచ్చానన్నారు. ఆదివారం జస్టిస్ ఫర్ దిశ తల్లిదండ్రులు, సోదరిని ఆయన పరామర్శించారు. అంతకుముందు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం ఎంపీ రంజిత్‌రెడ్డితో కలసి ఆయన శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయానికి వెళ్లి సైబారాబాద్ సీపీ సజ్జనార్‌తో జస్టిస్ ఫర్ దిశ కేసుపై చర్చించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని మంత్రి సూచించారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన కేసును పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు. మంత్రుల వ్యాఖ్యలు సరికాదు.. బాధ్యాయుత పదవుల్లో ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అనుచితంగా మాట్లాడారని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జస్టిస్ ఫర్ దిశ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ మంత్రి 100 నంబరుకు ఫోన్ చేయకపోవడం పొరపాటని అంటే.. మరొకరు ప్రతి మహిâళకు పోలీసు కాపలా ఉంటుందా.. అని వెటకారంగా మాట్లాడారని విమర్శించారు. ఆ మంత్రులపై కూడా జస్టిస్ ఫర్ దిశకు జరిగిన లాంటి సంఘటన జరిగితే గానీ వారికి ఆ బాధ తెలియదన్నారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లెవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేక గొంతులను అణచివేయడానికి పోలీసులను వాడుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. జస్టిస్ ఫర్ దిశ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ ఎలా సాధ్యం’ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఆదివారం సుందరయ్య పార్కు వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ దిశ హత్యను నిరసిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. జస్టిస్ ఫర్ దిశ కేసులో నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కర్ణాటకలో ఉప ఎన్నికల నగారా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు అదే నెల 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో సంజీవ్ కుమార్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణ ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలతో సహా జిల్లాల్లో కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నియమావళి పోటీ చేసే అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. గత జూలైలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్‌కుమార్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. రాజరాజేశ్వరినగర, మస్కి నియోజకవర్గాలపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ ఎన్నికలు జరపడం లేదు. -
కర్నూలులో మరో కేంద్రీయ విశ్వవిద్యాలయం
-
కర్నూలు ఆసుపత్రి చరిత్రలో మరో మైలురాయి
సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో, రాయలసీమలోనే తొలిసారిగా ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి, ఉస్మానియా ఆసుపత్రి యురాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమసింహారెడ్డి, నిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య విజయవంతంగా చేశారు. స్వయాన యురాలజిస్ట్ అయిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించడం విశేషం. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు (24)కు రెండు కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ మార్పిడి తప్పనిసరని వైద్యులు చెప్పారు. పెద్దాసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు జీవన్‌దాన్ ట్రస్ట్ నుంచి ఏడాది క్రితం అనుమతి లభించింది. దీంతో రామాంజనేయులు పేరును రిజిష్టర్ చేయించారు. అతనికి కిడ్నీ ఇవ్వడానికి తల్లి బజారమ్మ ముందుకు వచ్చింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి మొత్తం 35 మందితో కూడిన బృందం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరంతరాయంగా శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. పెద్దాసుపత్రి చరిత్రలో గొప్ప అధ్యాయం : కలెక్టర్ పెద్దాసుపత్రి చరిత్రలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఒక గొప్ప అధ్యాయమని, ఆసుపత్రి మరో మైలురాయిని చేరుకుందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులను, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకుని చాలా గర్వపడ్డానన్నారు. ఇది నిజంగా ఆసుపత్రి చరిత్రలో గొప్ప లక్ష్యసాధనగా పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఒక ఏడాది వరకు అవసరమైన మందులను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. ఒక్క ఆపరేషన్‌తో ఆపకూడదని, ఇకపై మరిన్ని ఆపరేషన్లు చేయాలని వైద్యులను ప్రోత్సహించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వైద్యసేవలు అందించగలిగే వైద్యులు ఇక్కడ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, నెఫ్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్ పీఎన్ జిక్కి, యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య, అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రఘురామ్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. డాక్టర్ సూర్యప్రకాష్‌కు సన్మానం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడంలో సహకరించిన నిమ్స్ యురాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సూర్యప్రకాష్‌ను సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం కర్నూలుకే గర్వకారణమని క్లబ్ జిల్లా చైర్మన్ ఎన్.వెంకటరామరాజు అన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్లు ఎస్.నాగేశ్వర్రావు, డాక్టర్ జి.బాలమద్దయ్య, సభ్యులు రమణగౌడ్, బోస్ పాల్గొన్నారు. 30 ఏళ్ల కల నెరవేరింది నేను కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. మా చేరికతోనే ఈ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారింది. 1971లో నా ఆధ్వర్యంలో ఇక్కడ యురాలజీ విభాగం ప్రారంభమైంది. అప్పట్లో రాయలసీమలోనే నేను మొదటి యురాలజిస్టు. అప్పట్లోనే ఒక రోగికి డయాలసిస్ ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితమే నేను ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించాలని భావించా. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పిలిపించి ఉస్మానియాలో ఉంచారు. 30 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. నా ఆధ్వర్యంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం ఆనందంగా ఉంది. – డాక్టర్ ఎ.విక్రమసింహారెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ -
వ్యూహాలు ఫలించాయా?
సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్ ముఖ్య తారలుగా కేటీ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగస్టు 15న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 1,2’ చిత్రాలకు మా సినిమాకి సంబంధం లేదు. ఇందులో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు కె.టి.నాయక్. -
రిపీట్ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్!
న్యూఢిల్లీ : పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్ కుమార్ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సభాపతి స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...‘ మంత్రి గారు.. మొన్నటి ఎజెండాలో మీ పేరు ఉంది. కానీ మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి’ అని బలయాన్‌తో వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన మంత్రి గైర్హాజరీ పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకానీ మంత్రుల పేర్లను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు. -
‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్సీపీ’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో రెండు రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు తగిలించాల్సిందేనని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ రోజున వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీకి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాట మార్చిన చంద్రబాబు: కాటసాని చంద్రబాబు ఓటమి భయంతో దేశంలో వివిధ నాయకులను కలిసేందుకు వెళ్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నరేంద్ర మోదీని పొడిగిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి ఆయనను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ బాబు జాగ్రత్తగా చూసుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగ సర్వేలను ప్రకటిస్తూ ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పార్టీకి సేవలందించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కర్నూలు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
అవసరమైతే కోర్టుకి వెళతాను
బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ ప్రధాన పాత్రధారులుగా కేటీ నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా దండుపాళ్యం 4’ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? పోలీసులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? అనే అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందింది. ఇందులో ఏడుగురు ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘షూటింగ్ పూర్తయిన మా సినిమాను సెన్సార్‌కు అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదైనా సమస్య ఉంటే ఫలానా సన్నివేశాన్ని, ఫలానా డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్న సమస్య ఏంటో చెప్పకండా రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత ఆయన ఈ సినిమాను సెన్సార్ చేయను. రివైజింగ్ కమిటీకి వెళ్లండన్నారు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నాను. రివైజింగ్ కమిటీనే కాదు... ట్రిబ్యునల్.. అదీ కాకపోతే కోర్టుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమాతో సెన్సార్ బోర్డుకి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను మార్చిలో విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ముందే ప్రచారం.. అపచారం
పార్టీ అభ్యర్థిగా ప్రకటించలేదు, టికెట్ కేటాయించనూ లేదు, అయినా తానే ఫలానా పార్టీ అభ్యర్థిని అని ప్రచారం చేసుకోవడం ఈ రోజుల్లో మామూలు విషయమే. రాష్ట్రంలో ఇప్పుడు అనేకచోట్ల జరుగుతోంది కూడా. అయితే ఇది తప్పని సీఈవో సంజీవ్‌కుమార్ ప్రకటించారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. శివాజీనగర: రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో పోటీ చేసేవారు నామినేషన్ దాఖలు చేయకముందే అభ్యర్థినని ప్రచారం చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సంజీవ్‌కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఆయన బెంగళూరు ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొని మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేయకముందే పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేయటానికి వీలు లేదు, అయితే ఈ విషయంలో ఫిర్యాదులు తమ దృష్టికి రాలేదని, వస్తే అలాంటివారిపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఆశావహులు నామినేషన్లకు ముందే తమంతట తామే ఫలానా పార్టీ అభ్యర్థులమని ప్రకటించుకుని ప్రచారం చేయరాదన్నారు. నామినేషన్ సమర్పించాక, అభ్యర్థిగా ఎన్నికల కమిషన్ పరిగణించిన తరువాతనే ఎన్నికల ప్రచారం చేపట్టాలని తెలిపారు. సీఈఓ ఇంకా ఏమేం చెప్పారంటే... ♦ ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, కార్లలో ఎన్నికల కమిషన్‌ను కళ్లుగప్పి నగదును రవాణా చేయకుండా కట్టుదిట్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్రమాలపై ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకొంటారు. ♦ రాజకీయ విందుల్లో తాము స్వాధీనం చేసుకున్న ఆహారాన్ని పారవేయకుండా అనాథ ఆశ్రమం, నిరాశ్రయులకు పంపిణీ చేస్తాం. ♦ 2 చోట్ల పోటీ చేయవచ్చు ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో పోటీచేయవచ్చు. ఇందుకు ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. రెండు చోట్ల పోటీని నిరోధించే చట్టం ఏదీ లేదు. ♦ 2013లో జరిగిన విధానసభా ఎన్నికలకంటే ఈసారి ఎన్నికలను సక్రమంగా జరిగేందుకు పాటుపడుతున్నాం. ♦ ప్రస్తుతం 4.96 కోట్ల ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరో 8,5000 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఓటర్ల సంఖ్య 5 కోట్లకు చేరుతుంది. ♦ ఓటర్ల కోసం 58 వేలు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి 3 లక్షల 56 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నాం. అటవీ ప్రాంతాలు, ఆదివాసీల ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయగలిగేలా చూస్తాం. ఓటర్లను అధికారులు, రాజకీయ నాయకులు, పోకిరీలు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకొంటాం. ♦ తీర్థహళ్ళి చెక్‌పోస్ట్‌లో రూ.3 కోట్ల 45 లక్షల అక్రమ సొమ్మును పట్టుకున్నాం, రెండు రోజుల తరువాత ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెప్పించుకున్నట్లు ఆధారాలు సమర్పించగా వాపసు ఇచ్చేశాం. ♦ ఎన్నికల్లో అభ్యర్థులు పత్రికలు, టీవీ చానెళ్లలో ప్రచారం చేసుకోవాలంటే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందాలి. ఒకవేళ అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తే ప్రచురించబడిన ప్రకటనలను పరిశీలించేందుకు ఓ కమిటీ ఉంటుందని, అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటారు. దీనిపై మీడియాకు, నాయకులకు అగాహన కల్పించాం. -
ఆవును చంపితే 14 ఏళ్లు.. మనిషిని చంపితే రెండేళ్లు:జడ్జి
న్యూఢిల్లీ: లగ్జరీ కారుతో ఓ మోటార్ సైక్లిస్టును ఢీ కొట్టిన ఘటనలో ఇండస్ట్రియలిస్ట్ తనయుడికి ఢిల్లీ కోర్టు 2 సంవత్సరాల శిక్షను శనివారం విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో 2008లో జరిగిన ఈ ఘటనపై గత తొమ్మిదేళ్ల విచారణకు తెరపడింది. 2008 సెప్టెంబర్ 11వ తేదీన బీబీఏ చదువుతున్న భసిన్.. తన బీఎండబ్ల్యూ కారుతో దక్షిణ ఢిల్లీలోని మూల్‌చంద్ ప్రాంతంలో మోటార్ సైకిల్‌పై తన స్నేహితుడు మృగాంక్ శ్రీవాస్తవతో కలిసి వెళ్తున్న అనుజ్ చౌహన్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాద అనంతరం చండీఘర్‌కు పారిపోతున్న భసిన్‌ను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు. ఈ కేసును పలుమార్లు విచారించిన సెషన్స్ కోర్టు భసిన్‌కు రెండేళ్ల పాటు శిక్షను విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, భసిన్‌కు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆవును చంపిన వ్యక్తికి 5 నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష పడుతోందని.. అదే మనిషిని చంపిన వ్యక్తికైతే కేవలం 2 సంవత్సరాల శిక్షే పడుతోందని అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్ధ అలా ఉందని తామేమైనా చేయడానికి సాయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. జడ్జిమెంట్ కాపీని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపుతున్నట్లు చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 304-ఏలో మార్పులు చేయడానికి ఈ జడ్జిమెంట్ కాపీ ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు. -
సస్పెన్స్‌తో థ్రిల్
సంజీవ్‌కుమార్ హీరోగా నటిస్తూ, నిర్మించిన సస్పెన్స్ ప్రేమకథా చిత్రం ‘థ్రిల్’. ఫాదర్ అండ్ మదర్ సమర్పణలో సురేశ్ సబ్నే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పవిత్ర, సోనాలి కథానాయికలు. సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే చిత్రమిది. కథ బాగా నచ్చడంతో హీరోగా నటించి, నిర్మించా. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘క్షణం’, హిందీలో ‘రాజ్’, ‘1920’ చిత్రాల తరహాలో ‘థ్రిల్’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. జూలై నెలాఖరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను చెప్పిన కథ సంజీవ్‌కి బాగా నచ్చడంతో తొలిసారిగా హీరోగా నటించి, నిర్మించారు. అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు సురేశ్ సబ్నే. సుమన్ శెట్టి, రేలంగి, వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ నాయుడు, సంగీతం: మురళి లియోన్. -
పాతబస్తీ టు ఐసిస్: నిత్యం సంప్రదింపులు
తెలంగాణ పోలీసుల సహకారంతో నగరంలోని 14 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఎన్ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్ఐఏకు చెందిన అధికారులతో పాటు మొత్తం 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి పాతబస్తీలో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇలియాస్ జగ్దానీ, మహ్మద్ ఇలియాస్ ఇబ్రహీం అనే సోదరులు సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు సోదరులే ఇక్కడి చర్యలకు కీలకంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. అనుమానిత ఐఎస్ సభ్యుల నుంచి రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సిరియాలోని ఐఎస్ ప్రధాన కార్యాలయంతో నిత్య సంప్రదింపులు జరుపుతున్నట్లు రూఢీ అయింది. హైదరాబాద్ నగరంలో వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానిస్తున్నారు.