Sarfraz Ahmed
-
ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డు
అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్‌లను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఫీట్‌ను రిజ్వాన్ తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పాకిస్తాన్ వికెట్‌కీపర్‌గా సర్ఫరాజ్ ఆహ్మద్ రికార్డును సమం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్‌కు లభించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రిజ్వాన్ జారవిడచడంతో ఆహ్మద్‌ను అధిగమించలేకపోయాడు. లేదంటే 7 క్యాచ్‌లతో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.నిప్పులు చెరిగిన రవూఫ్కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పీడ్‌స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు. రౌఫ్ 5 వికెట్ల హాల్‌తో చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే రౌఫ్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. రౌఫ్‌తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్
పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నారు. క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. క్రికెటర్ సర్ఫరాజ్‌లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తి నిచ్చారు అంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్బంగా నౌషాద్ మాటలు, సర్ఫరాజ్ బ్యాటింగ్ వీడియోను షేర్ చేశారు. ఒక బహుమతిని కూడా ప్రకటించారు. విశ్వాసాన్ని కోల్పోవద్దు....కఠోర శ్రమ, ధైర్యం, సహనం..ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు. అందుకే స్పూర్తిదాయకమైన తండ్రి నౌషద్ ఖాన్‌కు థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఇది తనకు గౌరవం ఈ బహుమతిని ఆయన స్వీకరిస్తానని విశ్వసిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు. “Himmat nahin chodna, bas!” Hard work. Courage. Patience. What better qualities than those for a father to inspire in a child? For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp — anand mahindra (@anandmahindra) February 16, 2024 జెర్సీ నంబర్ 97తో బరిలోకి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌తో గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి అరంగేట్రం క్యాప్ అందించిన సందర్భంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జెర్సీ నంబర్ 97 సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను నెరవేర్చుకునే ఆశయంలో భాగంగా కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక 97 విషయానికి వస్తే మూడో టెస్టుకు ముందు మాట్లాడుతూ జెర్సీ నంబర్ 97 విశేషాలుతెలిపాడు. తండ్రి పేరులోని నౌ అంటే తొమ్మిది, షాద్ నుంచి 7 తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97 కావడం విశేషమే మరి. -
ఇంకా నయం లుంగీ, బనియన్‌తో రాలేదు?
లండన్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా టోర్నీ ప్రపంచ కప్ 2019 గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ఆరంభానికి ముందు ఆతిథ్య ఇంగ్లండ్ బుధవారం ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ పది జట్ల కెప్టెన్లు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వస్త్రధారణ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మిగతా కెప్టెన్లంతా ఫార్మల్ డ్రెస్సుల్లో రాగా సర్ఫరాజ్ మాత్రం సంప్రదాయ దుస్తులు ధరించాడు. కుర్తా, పైజామాలతో పాటు టీమ్ బ్లేజర్ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో..‘ అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాకిస్తానీ మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే!!’ అంటూ పాకిస్తానీ రచయిత తమ టీమ్ కెప్టెన్‌ను అవమానించే రీతిలో కామెంట్ చేశాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు పాకిస్తాన్‌తో పాటు భారత జట్టు అభిమానులు అండగా నిలిచారు. ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని పాక్ అభిమానులు అభినందించగా... మరికొంత మంది మాత్రం సర్ఫరాజ్‌కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అంటూ ట్రోల్ చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన టీమిండియా ఫ్యాన్స్.. ‘సర్ఫరాజ్‌ను విమర్శించడంలో అర్థంలేదు. నిజానికి కోహ్లి కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సింది. అయినా ఆటగాడి ప్రతిభను చూడాలి అతడి వస్త్రధారణను కాదు. ఒకవేళ రాణీగారు భారత్ వచ్చినపుడు చీర కట్టుకుంటారా. ప్రధాని మోదీని కలిసినపుడు విదేశీ నేతలు మనలా తయారవుతారా? బ్రిటన్ రాజును కలిసినపుడు గాంధీజీ ధోతి కట్టుకున్న విషయం మరచిపోయారా? సర్ఫరాజ్ చేసిన దాంట్లో తప్పేమీలేదు. అనవసరంగా అతడి మీద పడి ఏడవకండి’ అంటూ పాక్ కెప్టెన్‌కు అండగా నిలిచారు. Captains of #Cricket playing nations competing 4 the #CricketWorldCup had a photoshoot with the Queen. Guess who came dressed in his pyjamas? None other than the #Pakistan captain (back row, left). Take a look at him in the other pic. How does one country produce ...? #CricketWC pic.twitter.com/hXxbxrfzlj — Tarek Fatah (@TarekFatah) May 30, 2019 కాగా ప్రపంచ కప్ తొలి పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ 104 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు సాధించిన ఇంగ్లండ్... ఆ తర్వాత పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌లతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈసారి ఫేవరెట్ కాదు కాబట్టి మాపై ఒత్తిడి లేదంటూ బరిలోకి దిగిన సఫారీలు అన్ని రంగాల్లో విఫలమైన భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెన్ స్టోక్స్, భీకరమైన బంతులతో ప్రత్యర్థి పని పట్టిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ హీరోలుగా నిలిచారు. -
భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సిందే : పాక్ కెప్టెన్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందేనని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. క్రీడలను ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయమనడం తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు. ఇక పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందగా.. ఇంతటీ దారుణానికి ఒడిగట్టిన పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని యావత్ భారత్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే పాక్‌తో మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక క్రికెట్ దిగ్గజాలు సచిన్, గవాస్కర్‌లు మాత్రం పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే అది వారికి మేలు చేస్తుందని, పాక్‌తో మ్యాచ్ ఆడి గెలవాలని సూచిస్తున్నారు. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేసింది. -
సర్ఫరాజ్‌కే నాయకత్వ పగ్గాలు
కరాచీ: పాకిస్తాన్ జట్టుకు తొలి సారి చాంపియన్స్ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నమ్మకముంచింది. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే పాక్ జట్టుకు సర్ఫరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ చైర్మన్ ఇషాన్ మణి మంగళవారం ప్రకటించారు. 2017లో ఇంగ్లండ్ గడ్డపైనే పాక్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన సర్ఫరాజ్ స్వదేశం తిరిగొచ్చాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్‌కు కూడా మాలిక్‌కే అవకాశం దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజా ప్రకటనతో దానికి ముగింపు లభించింది. సర్ఫరాజ్ కెప్టెన్సీపై తమకు ఎలాంటి సందేహాలు లేవని... ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌తో పాటు ప్రపంచ కప్‌కు కూడా అతని నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతుందని పీసీబీ చైర్మన్ స్పష్టం చేశారు. (అవన్నీ గాలి మాటలే: సర్ఫరాజ్) -
అవన్నీ గాలి మాటలే: సర్ఫరాజ్
సెంచూరియన్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. సఫారీలతో రెండో వన్డే సందర్భంగా పెహ్లువాకియాపై అనుచిత వ్యాఖ్యలు చేసి సర్ఫరాజ్ నిషేధానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే పాక్ వెటరన్ క్రికెటర్ షోయమ్ మాలిక్‌కు ఆ జట్టు పగ్గాలను అప్పుచెబుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మాలిక్‌తో సర్ఫరాజ్‌కు సఖ్యత లేదనే వార్తలు హల్ చేశాయి. వీరి మధ్య ఎప్పట్నుంచో విభేదాలు నెలకొన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. ప్రధానంగా సర్ఫరాజ్ సారథ్యంలో మాలిక్ ఆడటానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆ వార్తల సారాంశం. కాగా, దీన్ని తాజాగా సర్ఫరాజ్ ఖండించాడు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ గాలి మాటలుగా పేర్కొన్న సర్పరాజ్.. తమ జట్టంతా కలిసి కట్టుగానే ఉందంటూ స్పష్టం చేశాడు. ‘ ప్రస్తుతం మా జట్టులో ఎటువంటి విభేదాలు లేవు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. నా నాయకత్వంలో మాలిక్ ఆడటానికి అయిష్టంగా ఉన్నాడనే వార్తలు సత్యదూరం. మేమంతా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం’ అని సర్పరాజ్ తెలిపాడు. ఇక తమ జట్టు వరుస వైఫల్యాలపై స్పందించిన సర్పరాజ్.. త్వరలోనే గాడిలో పడతామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. -
వారేమీ స్కూల్ పిల్లలు కాదు: పీసీబీ ఫైర్
ఇస్లామాబాద్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిల్ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్‌పై నాలుగు వన్డేల నిషేధం వేయడాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటన తర్వాత సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ అతనిపై నాలుగు వన్డేల నిషేధం వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించింది. ఇది అనాలోచిత చర్యగా పీసీబీ చీఫ్ ఇషాన్ మణి ఆరోపించారు. ఇషాన్ మణి మాట్లాడుతూ.. ‘ ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు కోరాడు. ఇందుకు అంతా అంగీకరించారు. దక్షిణాఫ్రికా బోర్డుతో పాక్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. ఐసీసీ మధ్యలోకి వచ్చి సర్ఫరాజ్ అహ్మద్‌పై చర్యలు తీసుకుంది. ఇక్కడ పెహ్లువాకియా వివరణ కూడా ఐసీసీ తీసుకోలేదు. ఈ క్రమంలో జాతి వివక్షల కింద సర్ఫరాజ్‌పై సస్పెన్షన్ వేయాల్సిన అవసరం ఏంటి?. వారేమీ స్కూల్ పిల్లలు కాదు’ అని ఇషాన్ మణి మండిపడ్డారు. -
తప్పుదొరికిందని అక్తర్ రెచ్చిపోయాడు : పాక్ కెప్టెన్
కరాచీ : దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగు వన్డేల నిషేధానికి గురైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల పట్ల దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ పెహ్లువాకియాకు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పినప్పటికి నిబంధనల మేరకు ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే ఈ తరహా వ్యాఖ్యలతో సర్ఫరాజ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సైతం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ‘ఓ పాకిస్తానీయుడిగా ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించను. తన వ్యాఖ్యల పట్ల సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే’ అని ఘాటుగా ట్వీట్ చేశాడు. అయితే పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒత్తిడో లేక ఎమో కానీ వెంటనే మళ్లీ తన వ్యాఖ్యల పట్ల యూటర్న్ తీసుకున్నాడు. సర్ఫరాజ్ వంటి ఆటగాడు పాక్‌కు ఎంతో అవసరమని, అతను సాధారణ శిక్షతో భయపడతాడని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు. ఐసీసీ చర్యల అనంతరం ఈ నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ సమయం త్వరగా ముగుస్తుందని పేర్కొన్నాడు. అయితే అక్తర్ మాటలు విమర్శల్లా లేవని, వ్యక్తిగతంగా దాడి చేసినట్లు ఉందని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు. సస్పెన్షన్‌తో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా పాకిస్తాన్‌కు వచ్చిన సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడాడు. అక్తర్ వ్యక్తిగతంగా దాడి చేశాడు. అతని మాటలు విమర్శల్లా లేవు. ఇప్పటికే నేను నా తప్పును అంగీకరించాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)కు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఆటపరంగా.. వ్యక్తిత్వంగా మరింత మెరగవుతాను. ఈ సమయంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా క్రీజ్‌లో పాతుకుపోయిన ఆల్‌రౌండర్ ఫెలుక్వాయోను ఉద్దేశించి సర్ఫరాజ్.. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెను ఏం ప్రార్ధించమన్నావు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇవి స్టంప్స్ మైక్‌లో రికార్డవ్వడంతో రచ్చ రచ్చైంది. -
పాక్ కెప్టెన్‌పై వేటు
దుబాయ్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిబంధనావళిని అతిక్రమించిన సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే చివరి రెండు వన్డేలు, రెండు టీ20లకు దూరమవనున్నాడు. దీంతో పాక్ సీనియర్ ఆటగాడు షోయాబ్ మాలిక్ తాత్కాలిక సారథిగా వ్యహరించనున్నాడు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా గానీ, కుటుంబం సభ్యులపై గానీ, వర్ణ, జాతి వివక్షలు, అంపైర్లపై అసహనాన్ని ప్రదర్శిచడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని పేర్కొంది. (‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’) అసలేం జరిగిందంటే..? డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో క్రీడా సూర్తిని మరిచి పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడటం స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. (పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!) దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’
డర్భన్ : మైదానంలో జాతి వివక్ష వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత మంగళవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా సర్ఫరాజ్ ఒళ్లు మరిచి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఫెలుక్వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అతనిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం సర్ఫరాజ్‌ను క్షమిస్తున్నామని ప్రకటించాడు. ‘అతను తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. దీంతో అతన్ని మేం మన్నిస్తున్నాం. ఇక ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో ఐసీసీ ఇష్టం.’ అని క్రిక్ఇన్ఫోతో అన్నాడు. క్రీజ్‌లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనంతో పాక్ కెప్టెన్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. అనంతరం సర్ఫరాజ్ తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేశాడు. -
సర్ఫరాజ్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు
డర్బన్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఫెలుక్వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను ఈ మాటలు అన్నాడు. క్రీజ్‌లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనంతో పాక్ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు బుధవారం సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేశాడు. -
ఒళ్లు మరిచి కామెంట్ చేసిన పాక్ కెప్టెన్
-
పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!
డర్బన్ : పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో క్రీడాస్పూర్తి మరిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌నని, ఓ జట్టు కెప్టెన్ అనే సోయి లేకుండా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారి జట్టు మళ్లీ పెహ్లువాకియా(69 నాటౌట్)నే ఆదుకొని విజయాన్నందించాడు. అయితే సఫారీ ఇన్నింగ్స్ 37 ఓవర్లో పెహ్లువాకియా బ్యాటింగ్‌తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ నోటికి పనిచెబుతూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. పెహ్లువికియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తరహా వ్యాఖ్యల పట్ల క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. సర్ఫరాజ్‌పై ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Sarfaraz Ahmed to Andile Phehlukwayo: "abbay kaale teri Ami kahan bethi hoyi hain aaj, kya parhwa kay aya hai aaj" "black man wheres your mother sat? What have you asked your mother to pray for you today?"#SAvPAK pic.twitter.com/vw6yuE73OE — Saj Sadiq (@Saj_PakPassion) January 22, 2019 -
బౌలర్‌పై అరిచిన పాక్ కెప్టెన్
అబుదాబి: న్యూజిలాండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహనం కోల్పోయాడు. సహచర బౌలర్‌పైనే అరిచి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. ఫీల్డింగ్ సెట్ చేసినట్లు బౌలింగ్ వేయని స్పిన్నర్ బిలాల్ అసిఫ్కు క్లాస్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్ క్రీజ్‌లో ఉన్నప్పుడు బిలాల్ బౌలింగ్ వేస్తున్నాడు. అయితే బిలాల్ కోరినట్లు ఫీల్డింగ్ సెట్ చేశాడు సర్ఫరాజ్. కాగా, బిలాల్ బ్యాట్స్‌మన్‌కు దొరికేటట్లు ఒక లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ బంతికి ముందుకొచ్చీ మరీ ఫోర్ బాదాడు బౌల్ట్. దాంతో చిర్రెత్తిన సర్పరాజ్.. ‘నువ్వు ఏమి చెప్పావ్.. ఎలా బౌలింగ్ వేశావ్’ అంటూ బిలాల్ చీవాట్లు పెట్టాడు. దాంతో చిన్నబోవడం బిలాల్ వంతైంది. అది కివీస్ తొలి ఇన్నింగ్స్ 66 ఓవర్లో చోటు చేసుకోగా, ఆ మరుసటి ఓవర్లో అజాజ్ పటేల్ చివరి వికెట్‌గా వికెట్‌గా ఔటయ్యాడు.ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. దాంతో పాకిస్తాన్‌కు 176 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. Watch “sarfarazsofunnuy_edit_0_edit_0” on #Vimeo https://t.co/RQBDi6qN6p — Sports Freak (@SPOVDO) 19 November 2018 -
హేయ్ సర్ఫరాజ్.. ఏందా బ్యాటింగ్!!
అబుదాబి: 57 పరుగులకే సగం వికెట్లు పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సారథి ఎంతో ఆచితూచి ఆడాల్సివుంటుంది. వికెట్లకు అడ్డుగోడలా నిల్చొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాలి. కానీ పాకిస్తాన్ సారథి, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కానీ వికెట్ల ముందు ‘అడ్డుగోడ’లా నిలబడలేదు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సర్ఫరాజ్ బ్యాటింగ్ తెగువను చూసి అందరూ ముక్కున వేళేసుకుంటున్నారు. ప్రస్తుతం పాక్ కెప్టెన్ బ్యాటింగ్ స్టాన్స్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులతో సహా మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా సర్ఫరాజ్ తీసుకున్న బ్యాటింగ్ స్టాన్స్‌పై కామెంట్స్ చేశారు. కొందరు అభిమానులు సర్ఫరాజ్ ఏంటా బ్యాటింగ్ అంటూ ఫన్నీగా స్పందించగా, మరికొందరు నీ ఆలోచనకు, బ్యాటింగ్ తెగింపుకు జోహార్ అంటూ ట్వీట్ చేశారు. రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (4/78) దెబ్బకు 57/5. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆసీస్ స్పిన్నర్ లయన్ ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చాడు. ఆసీస్ బౌలర్లను తికమక పెట్టడానికి స్టాన్స్ మార్చుకొని బ్యాటింగ్ చేశాడు. మూడు స్టంప్స్‌ను వదిలేసి ఎక్కడో దూరంగా నిలబడి బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆరంగేట్రం ఆటగాడు ఫఖర్ జమాన్(94; 8 ఫోర్లు, సిక్స్)తో కలిసి సర్ఫరాజ్ (94; 7 ఫోర్లు)ల పోరాటంతో కోలుకుంది. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆరు పరుగల దూరంలో సెంచరీ చేజార్చుకున్నా హీరోగా మిగిలాడు. ఇక ఈ టెస్టులో పాక్ అదరగొడుతోంది. పాక్ బౌలర్ మహ్మద్ అబ్బాస్(5/33) ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైంది. -
మా కెప్టెన్‌కు బుర్ర కూడా లేదు..!
దుబాయ్: ఆసియా కప్ మొదలవడానికి కొద్ది రోజుల ముందే భారత-పాకిస్తాన్ జట్ల గురించి చర్చ మొదలైంది. ఈ ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం తప్పదని అంతా భావించారు. కానీ ఈ పోరాటంలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండుసార్లు చిత్తుగా ఓడించింది. ఇలా టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడం ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడుతున్నారు.ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనే కెప్టెన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆసియా కప్‌లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. సర్ఫరాజ్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. అతనికి ఎలాంటి ప్రతిభ లేదు. ఫామ్ కూడా లేదు. అసలు అతనికి బుర్రే లేదు. అతను క్రికెట్‌కు సరిపోడు' అని ఒక అభిమాని విమర్శించగా, ‘సర్ఫరాజ్ ఓవర్రేటెడ్ ప్లేయర్. పాక్ జట్టుకు గతంలో ఎంపిక కూడా కాలేదు’ అని మరొకరు విమర్శించారు. ‘అత్యంత సోమరి కెప్టెన్లలో సర్ఫరాజ్ ఒకరు. అతని కెప్టెన్సీని ఇక మేం అంగీకరించం’ మరొక అభిమాని మండిపడగా, ‘భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది అత్యంత అవమానకర ఓటమి. ఫైనల్స్‌లో సర్ఫరాజ్‌ను చూడాలనుకోవడం లేదు’ అని మరో పాక్ అభిమాని అసహనం వ్యక్తం చేశారు. -
ఆసియాకప్: భారత్ లక్ష్యం 238
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (78), సర్ఫరాజ్ అహ్మద్ (44), ఫకార్ జమాన్ (31), అసీఫ్ అలి(30)లు రాణించడంతో ఆ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్‌కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) సమన్వయలోపంతో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది. ఆదుకున్న మాలిక్- సర్ఫరాజ్.. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్, సర్ఫరాజ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ చక్కటి బంతితో సర్ఫరాజ్ (44)ను ఔట్ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే పాక్ షోయబ్ మాలిక్, అసిఫ్ అలీల వికెట్లు కోల్పోయింది. అసిఫ్ అలీ(30)ని క్లీన్ బౌల్డ్ చేసిన చహల్‌కు ఇది వన్డేల్లో 50వ వికెట్ కావడం విశేషం. చివరి ఓవర్లో బుమ్రా షాదాబ్(10)ను ఔట్ చేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో చహల్, కుల్దీప్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. -
టీమిండియాపై గెలవాలంటే..
దుబాయ్: ఆసియాకప్‌లో టీమిండియాపై గెలవాలంటే తమ జట్టు అన్ని అంశాల్లోనూ మెరుగవ్వాల్సి ఉందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశాడు. ఆసియాకప్ టోర్నీలో హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం తర్వాత తమ ఆటలో కొన్ని లోపాలు గమనించానని పేర్కొన్నాడు. వాటిని భారత్‌తో మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ‘హాంకాంగ్ మ్యాచ్‌లో మేమింకా మెరుగవ్వాల్సిన అంశాలను పరిశీలించా. టోర్నీలో అందరికన్నా ముందంజలో నిలవాలంటే మేం తొమ్మిది లేదా పది వికెట్ల తేడాతో గెలవాల్సి ఉంది. మేం కొత్త బంతితో ఇంకా బాగా బౌలింగ్ చేయాల్సి ఉంది. కావాల్సినంత స్వింగ్‌ను మేం రాబట్టుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత సాధన శిబిరంలో మేం దీనిపై పనిచేస్తాం. హాంకాంగ్‌పై మంచి విజయమే సాధించాం. కానీ భారత్‌పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. కోహ్లి లేకపోయినా భారత్ జట్టు అత్యుత్తమంగానే ఉంది. కోహ్లి లేడనే విషయాన్ని పక్కకు పెట్టే బరిలోకి దిగుతాం. భారత్‌ను ఓడించాలంటే సమష్టి ప్రదర్శన తప్పదు’ అని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. -
సర్ఫరాజ్ అహ్మద్ ధోనిని అనుకరించాడు.. కానీ
-
ధోనిని అనుకరించాడు.. కానీ
బులవాయో: జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాక్ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను పాక్ 5-0 తేడాతో గెలుచుకుంది. అయితే చివరి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చివరి ఓవర్లలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని అనుకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపింగ్ చేస్తున్న సర్ఫరాజ్ 48వ ఓవర్లో బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గ్లోవ్స్ వదిలేసి బంతిని అందుకున్నాడు. ఫఖర్ జమాన్‌ను కీపింగ్ చేయాల్సిందిగా కోరాడు. అనంతరం ఓవర్ వేశాడు. అయితే తన మొదటి ఓవర్ అద్భుతంగా వేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్ కూడా సర్ఫరాజ్ వేశాడు. అయితే ఈ ఓవర్లో జింబాబ్వే బ్యాట్స్‌మన్ పీటర్ మూర్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్‌ను సాధించాడు. తన కెరీర్లో సర్ఫరాజ్ తొలిసారిగా రెండు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేయగా.. జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని ప్రయత్నించి విఫలమయ్యాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. 2009లో జోహానెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని విజయవంతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు. ధోనిలా బౌలింగ్ చేశాడు కానీ.. వికెట్ తీయలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. -
క్రీడా స్ఫూర్తిని మరిచిన మ్యాక్స్‌వెల్
హరారే: రెండు రోజుల క్రితం ఆసీస్‌తో జరిగిన టీ 20 ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ముక్కోణపు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ క్రీడా స్ఫూర్తిని మరిచాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో కరాచలనం చేసే క్రమంలో మ్యాక్స్‌వెల్ అతిగా ప్రవర్తించాడు. అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మ్యాక్స్ వెల్.. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరాచలనం చేయడానికి ఆసక్తికనబరచలేదు. సర్ఫరాజ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా మ్యాక్సీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య పదే పదే మాటల యుద్ధం జరగడమే మ్యాక్సీ అలా ప్రవర్తించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరొకవైపు ఆసీస్ ఓడి పోవడాన్ని కూడా మ్యాక్స్‌వెల్ జీర్ణించుకోలేకపోయినట్లున్నాడు. అయితే ప్రత్యర్థి ఆటగాళ్లతో మ్యాక్సీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. దీనిపై మ్యాక్సీ తాజాగా వివరణ ఇస్తూ.. అది కావాలని చేసింది కాదని సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. కేవలం పొరపాటులో భాగంగానే అలా జరిగిందన్నాడు. ఆ తర్వాత సర్పరాజ్‌ను హోటల్ కలిసి అభినందించినట్లు పేర్కొన్నాడు. -
షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు..!
-
ధోనిని కలిసింది ఒక్కసారే.. కానీ
కరాచీ: తనకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే స్ఫూర్తి అంటున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. పాకిస్తాన్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు బయల్దేరే క్రమంలో గురువారం మీడియాతో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ఎంఎస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఎంఎస్‌ను కలిసింది ఒక్కసారే అయినా.. అతని నాయకత్వ లక్షణాలు, ఆటతీరు తనని ఆకట్టుకున్నాయని పాక్ కెప్టెన్ వెల్లడించాడు. గత ఏడాది పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ పటిమతో జట్టుకి అద్వితీయమైన విజయాల్ని అందించాడు. దీంతో.. మూడు ఫార్మాట్లలోనూ అతడికి కెప్టెన్సీ బాధ్యతలను పీసీబీ కట్టబెట్టింది. ‘ ఎంఎస్ ధోని తన కెరీర్లో మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా పనిచేశాడు. నాయకుడిగా అతనే నాకు స్ఫూర్తి. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య 2017, జూన్ 4న జరిగిన మ్యాచ్‌లో భాగంగా ధోనిని తొలిసారి కలిశాను. ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా అతని నుంచి నేను చాలా నేర్చుకున్నా. అతనే నాకు స్ఫూర్తి’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. గత ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టుని పాకిస్తాన్ ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. -
కోహ్లి నీ కళ్లకు కనిపించటం లేదా?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ ఆఫ్ ది ఇయర్-2017 గానూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆయన ఓటు వేయటంతో అసలు వ్యవహారం మొదలైంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ కెప్టెన్ అవార్డులకు నామినీలను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ కెప్టెన్లు స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ అహ్మద్, అస్గర్ స్టానిక్‌జై, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ పేర్లను ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన మంజ్రేకర్ తాను మాత్రం సర్ఫరాజ్ అహ్మద్‌కే ఓటేస్తానని చెప్పాడు. మంజ్రేకర్ అభిప్రాయం ఏంటంటే... ‘‘కష్టకాలంలో సర్ఫరాజ్ కెప్టెన్సీ పాకిస్థాన్‌కు ఎంతో తోడ్పాటు అందించింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై తడబడే పాక్ జట్టును కెప్టెన్‌గా విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీని తన దేశానికి అందించటం.. ఎక్కువ మ్యాచ్‌లను గెలిపించిన ట్రాక్ రికార్డు ఉంది.(మొత్తం 13 వన్డే మ్యాచ్..11 గెలుపు, 2-ఓటమి.. టీ20మ్యాచ్‌లు 10.. 8-గెలుపు, 2-ఓటమి). మిగతా వారికంటే సర్ఫరాజ్ కష్టం ఎక్కువ కనిపిస్తోంది. అందుకే అండర్ డాగ్ జట్టయిన పాక్ సారథికే నా ఓటు’’ అని తెలిపాడు. అంతే... కోహ్లిని కూడా కాదని, దాయాది జట్టు కెప్టెన్ కు ఓటేయటంపై మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. ‘ఆటగాడిగా, విశ్లేషకుడిగా ఫేలయిన నువ్వు ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్’ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కోహ్లి, సర్ఫరాజ్ ఓవరాల్ ప్రదర్శనలను పోలుస్తూ కోహ్లి గ్రేట్.. మంజ్రేకర్ వేస్ట్ అంటూ సందేశాలు పెడుతున్నారు. మరోవైపు మంజ్రేకర్ అభిప్రాయంపై పాక్‌లోనూ వ్యతిరకత వ్యక్తమవుతోంది. పాక్‌ను అండర్ డాగ్ గా పొల్చటంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్లను జేజిక్కిచ్చుకున్న పాక్‌ను మంజ్రేకర్ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పటంలో తప్పేం లేదన్న కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.