SEC
-
గ్రామీణ ఓటర్లు @ 1,67,33,584
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తాజాగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రచురించింది. దీనికి సంబంధించి ఇదివరకే ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం, ఆ మేరకు ఓట్ల తొలగింపు తర్వాత మండల, పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై డిస్ప్లే చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 1,67,33, 584 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. రాష్ట్రంలోని మొత్తం 538 మండలాలు, వాటి పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డుల్లో ఈ మొత్తం ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతరులు (ట్రాన్సజెండర్లు) ఉన్నారు. నల్లగొండ జిల్లా టాప్.. మేడ్చల్ లాస్ట్ గ్రామీణ ఓటర్ల పరంగా చూస్తే నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలోని 31 మండలాల్లోని 856 గ్రామపంచాయతీల్లో 7,392 వార్డుల్లో మొత్తం 10,42,545 ఓటర్లున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యల్ప గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో గతంలో ఐదు మండలాలు ఉండగా వాటిలో కీసర, ఘట్కేసర్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్ జిల్లా 3 మండలాల్లోని 34 గ్రామపంచాయతీలు..320 వార్డుల్లో మొత్తం 64,397 ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. -
ట్విటర్ కొనుగోలుపై విచారణ.. ససేమిరా అంటున్న మస్క్
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) 2022లో ఎక్స్ (ట్విటర్) సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీని కొనుగోలు చేసే సమయంలో ఏవైనా ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించారా అనే దిశలో అమెరికాకు చెందిన SEC దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ట్విటర్ సంస్థను కొనుగోలు చేసిన సమయంలో ఏవైనా చట్టాలను ఉల్లంగించారా అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎస్ఈసీ స్టేట్మెంట్స్, డీల్స్ వంటి వాటికి సంబందించిన ఫైలింగ్ గురించి మస్క్‌ను ప్రశ్నించడానికి సన్నద్ధమైంది. ఎలాన్ మస్క్ ఈ దర్యాప్తుకు హాజరు కావడానికి నిరాకరించినట్లు సమాచారం. కానీ దీనికి సాక్ష్యమివ్వడానికి ఎస్ఈసీ మస్క్‌ను బలవంతం చేస్తోంది, దీనికోసం ఫెడరల్ కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఇప్పటికే యూఎస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అనేక సార్లు మస్క్ వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు, మళ్ళీ హాజరు కావాల్సిన అవసరం లేదని మస్క్ తరపు లాయర్ తెలిపాడు. ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్! ఎలాన్ మస్క్ ట్విటర్లో ఎంత వాటా కలిగి ఉన్నారనే దాని గురించి నిజం చెప్పారా.. లేదా అని తెలుసుకోవడానికి ఎస్ఈసీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. 2023 మేలో శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చి మాట్లాడాల్సిందిగా ఎస్ఈసీ కోరింది. దీనికి మస్క్ సెప్టెంబర్ 15న రావడానికి అంగీకరించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని రాలేకపోతున్నట్లు తెలిపాడు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య! ఎస్ఈసీ చేపట్టిన దర్యాప్తు కేసులను కొట్టివేయడానికి మస్క్ చేసిన ప్రయత్నాలను US డిస్ట్రిక్ట్ జడ్జి ఆండ్రూ కార్టర్ తిరస్కరించారు. మిలియన్ల కొద్దీ స్టాక్లను కొనుగోలు చేయడానికి, ట్విటర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ట్వీట్స్ చేయడానికి, ఎగ్జిక్యూటివ్‌లు, అంతర్గత వ్యక్తులతో సమావేశం కావడానికి సమయం ఉంటుంది, కానీ విచారణకు రావడానికి మాత్రం సమయం ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. -
అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ స్కీముతో అక్రమంగా ఒక మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.5 కోట్లు) పైగా లాభాలు ఆర్జించారంటూ భారత సంతతికి చెందిన ఏడుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్(ఎస్ఈసీ) ప్రకారం.. శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ట్విలియోలో హరి ప్రసాద్ సూరి, లోకేష్ లగుడు, ఛోటు ప్రభు తేజ్ పులగం సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేసేవారు. కంపెనీకి సంబంధించిన అంతర్గత వివరాలను వీరు తమ స్నేహితులైన దిలీప్ కుమార్ రెడ్డి కముజుల, సాయి నెక్కలపూడి, అభిషేక్ ధర్మపురికర్, చేతన్ ప్రభు పులగంలకు చేరవేసేవారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని వీరంతా ట్విలియో ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేశారు. 2020 తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించడానికి ముందు ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వీరు 1 మిలియన్ డాలర్ల పైగా లాభాలు అక్రమంగా ఆర్జించినట్లు ఎస్ఈసీ అభియోగాలు మోపింది. సూరి, లోకేష్, ఛోటులు ప్రత్యేకంగా చాటింగ్ కోసం కంపెనీలో ప్రైవేట్ చానల్ ఏర్పాటు చేసుకుని .. 2020 మార్చి-మే మధ్య కాలంలో కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల అంచనాల గురించి తెలుగులో చర్చించుకున్నారని తెలిపింది. అప్పట్లో 110 డాలర్లుగా ఉన్న షేరు 150 డాలర్లకు వెడుతుందని వారు అంచనాకు వచ్చారని ఎస్ఈసీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందేందుకు, తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వీరంతా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉపయోగించుకున్నారని తెలిపింది. నిందితులు ఇలా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఎస్ఈసీ పేర్కొంది. (చదవండి: హమ్మ బాబోయ్! ఈ బైక్ ధరకు కారు వచ్చేస్తుందిగా) -
ఎన్నికల ఏర్పాట్ల పై SEC పర్యవేక్షణ
-
Huzurabad Bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
సాక్షి, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి నా, దినపత్రిక, టీవీ మాధ్యమాల్లో ప్రసారం చేసినా.. ఎన్నికల నిబంధనల మేరకు శిక్షార్హులని స్పష్టం చేశారు. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్‌క్లియర్
-
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈనెల 25న ఉ.8 నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించుకోవచ్చన్న డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్ఈసీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్ నిబంధనలతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా, మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఎలక్షన్లో 56.86% పోలింగ్ నమోదైంది. అయితే, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. -
నేడు అన్ని పార్టీ ల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిసమావేశం
-
నేడు ఏ పీ ఎస్ ఈ సి గా భాద్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని
-
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. -
హైకోర్టులో మరోసారి ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఈసీకి ఎదురుదెబ్బ
-
రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ
-
హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్ఈసీ సమయం కోరారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎస్ఈసీ ఆలస్యం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. చదవండి: చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం సిట్టింగ్‌లకు టీడీపీ షాక్.. జనసేనతో లోపాయికారి ఒప్పందం! -
ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్ నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేసింది. వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది. కాగా, తిరుపతి కార్పోరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేకాదు..వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి : పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు -
ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు
-
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: ఎస్ఈసీ
-
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కనపెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్ఈసీ వెల్లడించారు. చదవండి: పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం పులివెందుల ‘పంచ్’ అదిరింది -
వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయండి
సాక్షి, అమరావతి : ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంటూరు జిల్లా పొన్నూరు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిదేవిని టీడీపీ సీనియర్ నేతలు మల్లికార్జున, ఉన్నం మారుతీచౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి బెదిరించారు. కొండాపురం ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. కొండాపురంలో బలవంతపు ఏకగ్రీవాన్ని ఎస్ఈసీ రద్దు చేయాలి. 45 ఏళ్లుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కామనూరులో బలవంతపు ఏకగ్రీవాలతో ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు. బీసీ రిజర్వ్డ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ కరీమూన్‌ను వరదరాజులరెడ్డి బెదిరిస్తున్నారు. షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు. -
నిమ్మగడ్డకు షాకిచ్చిన కంపసముద్రం గ్రామస్తులు
సాక్షి, నెల్లూరు: మంత్రి గౌతమ్‌రెడ్డి ఇలాకలో పంచయతీ ఎన్నికలు సంచలనంగా మారాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాలలో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలపై కంపసముద్రం గ్రామస్తులు తిరగుబాటు చేశారు. ఏకగ్రీవాలపై ఆయన చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్తులు తీర్మాణం తీసుకుని ఎస్ఈసీకి షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ ఎసీఈసీగా ఉన్నంతకాలం పంచాయతీ ఎన్నిక వద్దంటూ గ్రామస్తులు తీర్మాణించడంతో అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి మొదట 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా వారంతా గ్రామస్తుల తీర్మాణంతో నామినేషన్‌ను ఉపంసహరించుకున్నారు. -
‘గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదు’
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండానే ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చారని అంబటి పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. గతంలోనూ చాలాచోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని.. నిమ్మగడ్డ మాత్రం ఎందుకు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షల నేపథ్యంలో అంబటి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు సరికావని ఆయన అన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని అంబటి గుర్తుచేశారు. ఇది దుర్మాగం ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధుల హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మండిపడ్డారు. మా హక్కులకు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. -
ఆ యాప్ వాడొద్దు: ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
విజయవాడ: ఎస్ఈసీ నిబద్ధతపైన ఈ-వాచ్ యాప్‌తో అనుమానం వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ-వాచ్ యాప్ డేటా విషయంలో గోప్యత కనిపిస్తోందని ఆరోపించారు. ఇంత గోప్యంగా ఎందుకు అని ప్రశ్నించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు తయారుచేసిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్‌ను ఎందుకు తేలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలతో, సీఈసీతో సంబంధం లేకుండా కొత్త యాప్ ఎలా తెచ్చారని అడిగారు. టీడీపీ నాయకులు ఈ-వాచ్ యాప్ తయారు చేయడానికి టైం పట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఈసీ తీసుకొచ్చిన సీ-విజిల్ యాప్‌ను వాడాలని కోరినట్లు తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబుకు లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీ విజిల్ యాప్ వినియోగించాలని విజ్ఞప్తి చేసినట్లు లేళ్ల తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అనేక అభ్యంతరాలున్నాయని చెప్పారు. ఎస్ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తుచేశారు. నిమ్మగడ్డ ఇంత రహాస్యంగా యాప్‌ని ఎందుకు తయారుచేయాల్సి వచ్చిందో చెప్పాలని, ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. నిఘా యాప్ పక్కన పెడితే సీ విజిల్ యాప్ వినియోగిస్తారనుకుంటే ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన ఈ వాచ్ ఎలా ఉపయోగిస్తారని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాచ్ యాప్ టీడీపీ కార్యాలయంలో తయారైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అరాచకాలు ఎస్ఈసీకి కనిపించవా అని ప్రశ్నించారు. ఈ వాచ్ ఎక్కడ తయారు చేశారో.. ఎలా తయారు చేశారో.. ఫిర్యాదులు చేరతాయో లేదో కూడా తెలియదని.. దీనిపై ఎన్నో అనుమానాలున్నాయని లేళ్ల అప్పిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అరెస్ట్ చేయండి: అచ్చెన్నపై ఎస్ఈసీకి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: తొలివిడత నామినేషన్ల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో పాల్పడుతున్న దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సోమవారం అచ్చెన్నాయుడిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘అచ్చెన్నాయుడి దౌర్జన్యాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయాలి. టీడీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషనర్ స్పందించాలి. చంద్రబాబు రౌడీ రాజకీయాలని పెంచిపోషిస్తున్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఫోన్లో ఏ విధంగా బెదిరించారో ఆధారాలు కూడా సమర్పించాం. గ్రామాలలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని టీడీపీ చూస్తోంది. ఎన్నికల నిబంధనలకి విరుద్దంగా మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు’’ అని ప్రశ్నించారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలి: లేళ్ల అప్పిరెడ్డి అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలతో తిరుగుతూ వైఎస్సార్సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దౌర్జన్యాలని చూశాం. ఆయన ప్రోద్బలంతోనే టీడీపీ మద్దతుదారు సురేష్ వైఎస్సార్సీపీపై దౌర్జన్యానికి దిగారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక విలువలతో వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోంది. పోలీస్ వ్యవస్ధపై టీడీపీ ఆరోపణలను ఖండిస్తున్నాం. డీజీపీ, పోలీస్ పనితీరును ఎస్ఈసీ సైతం అభినందించారు’’ అని తెలిపారు. (చదవండి: అచ్చెన్న బరితెగింపు) ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కి లేఖ రాసింది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ప్రయాణిస్తే అది ఎన్నికల ప్రచారంగానే భావిస్తామని సీఎస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించరాదని సూచించింది. చైర్మన్లతో పాటు ప్రభుత్వ అధికారులను తీసుకుని వెళ్లవద్దని.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటపుడు వారి నేమ్ బోర్డ్స్ ఉండవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో సూచించింది. -
నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అధిపతి హోదాలో ఉన్న గవర్నర్ విశ్వభూషణ్‌ను శాసించే రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ లేఖ రాయడంపై న్యాయ కోవిదులు, నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ను ఉద్దేశించి శుక్రవారం రాసిన లేఖలో నిమ్మగడ్డ ఉపయోగించిన భాష, తద్వారా ప్రస్ఫుటమైన భావం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, తద్వారా రేఖ దాటారని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పనితీరును విమర్శిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా తన ఫిర్యాదుపై స్పందించి గవర్నర్ ఏం చేయాలో కూడా నిర్దేశించడం కచ్చితంగా పరిధి దాటటమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఆదేశించే అధికారం ఎక్కడిది? ‘ఈ వ్యవహారంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించవద్దు... కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించండి’ అని హుకుం జారీ చేస్తున్నట్లుగా గవర్నర్‌కు చెప్పడమంటే.. తన దృష్టికి వచ్చిన ఓ అంశంపై ఎలా వ్యవహరించాలో గవర్నర్‌కు తెలియదన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘గవర్నర్ తన దృష్టికి వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, నిపుణులను సంప్రదించి తగిన విధంగా స్పందిస్తారు. అది ఆయన విచక్షణాధికారాలకు సంబంధించిన విషయం. కానీ అందులో నిమ్మగడ్డ అనుచిత జోక్యం చేసుకోవడం ద్వారా తన పరిధిని పూర్తిగా అతిక్రమించారు’ అని రాజ్యాంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించవద్దని, కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించాలని గవర్నర్‌ను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎక్కడిదని వ్యాఖ్యానించారు. ఆనవాయితీ ప్రకారం చూసినా.. ‘నిమ్మగడ్డకు విశ్వాసం లేకుంటే ఆయన సంప్రదించకూడదు. కానీ గవర్నర్ ఎందుకు సంప్రదించకూడదో అర్థం కావడం లేదు. అంటే తనకు విశ్వాసం లేదు కాబట్టి గవర్నర్ కూడా విశ్వసించరాదని ఆదేశించినట్లుగా ప్రవర్తించారు. అడ్వొకేట్ జనరల్‌పై గవర్నర్ తన పరిశీలనతో ఓ అంచనాకు వస్తారు. సంప్రదించాలో లేదో ఆయన నిర్ణయించుకుంటారు. అంతేగానీ తన ఆంతర్యాన్ని గవర్నర్‌పై రుద్దాలని ఎస్ఈసీ భావించడం సరికాదు’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సాధారణంగా రాజ్యాంగపరమైన నిబంధనలు, ఇతర అంశాలపై గవర్నర్ తొలుత రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌నే పిలిపించి మాట్లాడటం సంప్రదాయమని గుర్తు చేశారు. చివరిసారిగా చెబుతున్నా.... నిమ్మగడ్డ హుకుం జారీ చేసినట్లుగా ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు వేస్తానని గవర్నర్‌ను హెచ్చరించే ధోరణిలో లేఖ రాయడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. ‘మీకు చివరిసారిగా చెబుతున్నా..’ అని గవర్నర్‌నుద్దేశించి లేఖలో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘మంత్రులకు సూచించండి... నిర్దేశించండి... వారి నుంచి హామీ తీసుకోండి’ అంటూ లేఖ రాయడం గవర్నర్‌ను ఆదేశిస్తున్నట్లుగా ఉందని తేల్చి చెబుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్న అడ్వొకేట్ జనరల్‌ను తూలనాడుతూ, అవమానిస్తున్నట్లుగా లేఖలో సంబోధించడం.. చివరకు గవర్నర్‌ను సైతం ఆదేశించేలా లేఖ రాయడం కచ్చితంగా లక్ష్మణ రేఖను దాటటమేని పేర్కొంటున్నారు. -
నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ లీవ్‌లో వెళ్లిన అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ అనారోగ్య సమస్యలతో నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయి ప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ( టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్ ) ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్ఈసీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు విస్మయం చెందాయి. ఉద్యోగులను బెదిరించడం ద్వారా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారంటూ వాపోతున్నాయి. -
అశోక్‌బాబుకు ఏపీ ఉద్యోగుల జేఏసీ కౌంటర్
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండి వైఖరిని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొనమనడంపై మండిపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రకటనపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు కరోనాను అడ్డుకోగలవా? అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. (చదవండి: బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ) ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేం. గడిచిన 10 నెలల్లో ఎంతో మంది ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఉద్యోగుల ప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా?.ఎన్నికల నిర్వహణ అంత చిన్న విషయం కాదు.మరో మూడు నెలలు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి.ఉద్యోగుల విజ్ఞప్తిని ఎస్ఈసీ పరిగణలోకి తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఉద్యోగులను విమర్శించే అర్హత టీడీపీ నేత అశోక్‌బాబుకు లేదు. రాజకీయ వ్యవహారాలు చూసుకోవాలంటూ’ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కౌంటర్ ఇచ్చారు. (చదవండి: స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి) ఎస్ఈసీ పునరాలోచించాలి.. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు కరోనాను ఆపలేవని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మండిపడ్డారు. కరోనాతో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. తమ విజ్ఞప్తిని ఎస్ఈసీ పునరాలోచించాలని ఆయన కోరారు.