Senator
-
మొదటి అధ్యక్షురాలి అవకాశం మీకే!
న్యూయార్క్: అమెరికా సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్తోపాటు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన అల్ స్మిత్ మెమోరియల్ డిన్నర్‌కు హాజరైన ట్రంప్..కమలా హ్యారిస్ నెగ్గకుంటే మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం మీకే వస్తుందంటూ షుమర్‌ను ఆటపట్టించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు వచ్చి సరదాగా పట్టించుకుంటారు. ఇలా అందే విరాళాలు కేథలిక్ చారిటీలకు వెళ్తుంటాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారిస్ రాలేదు. బదులుగా చుక్ షుమర్ వచ్చారు. వేదికపై ట్రంప్‌కు సమీపంలోనే ఆయన కూడా ఉన్నారు. ‘షుమర్ చాలా డల్‌గా కనిపిస్తున్నారు. మరో కోణం కూడా చూడాలి. వాళ్ల పార్టీ చాలా చురుగ్గా తయారైంది. కమల అవకాశం కోల్పోతే, మొదటి అధ్యక్షురాలయ్యే అవకాశం మీకే వచ్చే అవకాశముంది’అని షుమర్నుద్దేశించి ట్రంప్ బిగ్గరగా అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.ఈసారి కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్.. ‘నా ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి రావల్సిన అవసరం లేదని భావించినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తీవ్రంగా అవమానించారు. గతంలో 1984లో వాల్టర్ మొండెల్ మాత్రమే ఇలా చేశారు. అప్పట్లో ఆయన రొనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు’అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై అనంతరం కమల తనదైన శైలిలో స్పందించారు. ‘సహాయకుడు రాసిచ్చిన జోకుల్ని చదివేందుకే అవస్థలు పడ్డ ట్రంప్.. టెలీ ప్రాంప్టర్‌ను లోపలికి అనుమతించలేదంటూ ప్రశ్నించారు. తను అనుకుంటున్న జోకులకు ప్రేక్షకులు నవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ జోకులు ఎవరికైనా అర్థమవుతాయా? ట్రంప్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాదు’అంటూ చురకలు అంటించారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రంప్ జోకులపై మిశ్రమ స్పందన వచ్చింది. -
పాక్‌లో కారు బాంబు పేలుడు.. నలుగురు మృతి
పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగింది. కారులోని బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చిన ఘటనలో పాక్ మాజీ ఎంపీతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మామండ్ బజౌర్‌లోని దమడోలా ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పేలుడు జరిగిన సమయంలో పాక్ పార్లమెంటు మాజీ సభ్యుడు హిదయతుల్లా అక్కడే ఉన్నారు. కాగా ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్, ప్రధాన కార్యదర్శి నదీమ్ అస్లాం చౌదరి ఈ పేలుడును ఖండించారు. ఈ ఘటనలో మృతులకు సంతాపం వ్యక్తం చేశారు.హిదయతుల్లా 2012 నుండి 2018 వరకు, తిరిగి 2018 నుండి 2024 వరకు సెనేట్‌లో స్వతంత్ర సభ్యునిగా ఉన్నారు. హిదయతుల్లా పాక్ ఎగువ సభలోని విమానయాన స్టాండింగ్ కమిటీ చైర్మన్, నేషనల్ యాంటీ టెర్రరిజం అథారిటీ (నాక్టా) సభ్యునిగా కూడా ఉన్నారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. -
నెతన్యాహు ప్రసంగానికి హాజరుకాను:సెనేటర్
యుద్ధ నేరస్తుడు బెంజమిన్ నెతన్యాహును యూఎస్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు చట్టసభ సభ్యులు ఆహ్వానించడాన్ని సెనేటర్ బెర్నీ శాండర్స్ తప్పబట్టారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగానికి హాజరుకావడం లేదని పేర్కొన్నారు.అక్టోబర్ ఏడవతేదీ నాటి హమాస్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. అయితే నెతన్యాహు రైట్ వింగ్ తీవ్రవాద నాయకత్వంతో పాలస్తీనా ప్రజలపై యుద్ధానికి దిగారు. ఇటువంటి హక్కు ఇజ్రాయెల్‌కు లేదంటూ సెనేటర్ బెర్నీ శాండర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.రిపబ్లికన్, డెమొక్రాటిక్ నేతలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సెనేట్, ప్రతినిధుల సభలో ప్రసంగించేందుకు అధికారికంగా ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు అంగీకారాన్ని తెలిపారని, కాంగ్రెస్ ఉభయ సభల ముందు ఇజ్రాయెల్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేదీ వెల్లడించలేదు. Right now tens of thousands of children in Gaza are facing starvation, malnutrition, and famine.And Congressional leadership thinks it’s okay to invite war criminal Netanyahu to address Congress?No. Unacceptable. pic.twitter.com/sun43kAE4z— Bernie Sanders (@BernieSanders) June 4, 2024 -
‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరగుతున్న యుద్ధాన్ని అమెరికా రిపబ్లిక్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం రెండో ప్రప్రంచ యుద్ధంతో అభివర్ణించారు. అమెరికా.. జపాన్‌పై బాంబులు వేసి యుద్ధం ముగించటం అప్పట్లో గొప్ప నిర్ణయమని అన్నారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు సైతం అమెరికా బాంబులు ఇస్తే హమాస్‌తో యుద్ధాన్ని ముగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లిండ్సే గ్రాహం మొదటి నుంచి ఇజ్రాయెల్ మద్దతుదారు.ఇజ్రాయెల్‌కు 3000 భారీ బాంబులు అందజేయటాన్ని నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెరల్ హార్బర్‌కు సంబంధించి అమెరికా జర్మనీ, జపాన్‌లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుపై విసిరి ఆ యుద్ధాన్ని ముగించింది. అది అప్పుడు చాలా గొప్ప నిర్ణయం. అదే విధంగా ఇజ్రాయెల్‌కు కూడా బాంబులు అందజేస్తే.. హమాస్‌తో యుద్ధం ముగిస్తుంది. ఇజ్రాయెల్ ఇంకా నష్టాన్ని భరించే స్థితిలో లేదు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేయవచ్చు’’ అని గ్రహం అన్నారు.ఇక.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌పై బాంబు వేయటం సరైన నిర్ణయమే అయితే.. ప్రస్తుతం ఇజ్రాయెల్ బాంబులు వేస్తే కూడా సరైన నిర్ణయమే అవుతుందని జోబైడెన్‌ను విమర్శించారు.ఇక.. రఫాలో యుద్ధం కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ సైన్యానికి ఇటీవల అమెరికా 3000 భారీ బాంబుల అందజేతను నిలిపివేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో గాజాలో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఇజ్రాయెల్‌కు బాంబులు అందించడాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. -
ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారి.. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం!
బ్రిటన్ పార్లమెంట్లో ప్రధానిగా రిషి సునాక్ భగవద్గీతపై ప్రమాణం చేయడం భారతీయులకు ఎంతో గర్వంగా అనిపించింది. వలస పాలనతో మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల దేశంలో మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని అవ్వడం, మన హిందూమత గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేయడం ప్రతీ భారతీయుడిని భావోద్వేగానికి గురి చేసింది. అలా చేసిత తొలి యూకే ప్రధానిగా రిషి సునాక్ అందరీ దృష్టిని ఆకర్షించారు కూడా. మళ్లీ అదే తరహాలో ఆస్ట్రేలియా పార్లమెంట్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అంతేగాదు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఓ చారిత్రక ఘట్టానికి వేదికయ్యింది. అదేంటంటే.. ఆస్ల్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలో ఈ ఘటన సాధించిన తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పటికీ మన కోర్టుల్లో దీనిపైనే ప్రమాణం చేస్తారు. మన చట్ట సభల్లో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియన్ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనేటర్(ఎంపీ) ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు. The Legislative Assembly and the Legislative Council have chosen Senator Varun Ghosh to represent Western Australia in the Senate of the Federal Parliament. 📄Read Hansard or view our broadcast archive after the joint sitting: https://t.co/TtFao460FO pic.twitter.com/TMEx59SqTG — Legislative Assembly (@AssemblyWA) February 1, 2024 లెజిస్టేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకి ప్రాతినిథ్యం వహించేందుకు వరుణ్ ఘోషను ఎంపిక చేశాయి. ఈ మేరకు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో..పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యయానికి తెరతీసినప్పుడూ అతనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా. అని పేర్కొన్నారు పెన్నీ వాంగ్. ఇక ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ కూడా ట్విట్టర్లో పశ్చిమా ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉండటం అద్భుతంగా ఉంది. అని అన్నారు. Welcome Varun Ghosh, our newest Senator from Western Australia. Fantastic to have you on the team. pic.twitter.com/TSnVoSK3HO — Anthony Albanese (@AlboMP) February 5, 2024 వరుణ్ నేపథ్యం.. పెర్త్‌లో నివాసం ఉండే వరుణ్ ఘోష్ వృత్తి రీత్యా న్యాయవాది. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ లాలో డిగ్రీని పొందాడు. క్రేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్కూడా. అతను వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకు సలహదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీలో చేరడంతో అతని రాజకీయ జీవితం పెర్త్‌లో ప్రారంభమయ్యింది. ఇక వరణ్ ఘోష్ మాట్లాడుతూ..తాను మంచి విద్యను అభ్యసించడం వల్లే అధికారాన్ని పొందగలిగాను కాబట్టి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని గట్టిగా విశ్వసిస్తాను అని చెప్పారు. కాగా, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ సెనేటర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులోనే వరుణ్ ఘోష్ లేబర్ పార్టీలో చేరారు. భారతీయ – ఆస్ట్రేలియన్ బారిస్టర్ అయిన ఘోష్ గతవారం లేబర్ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. #VarunGhosh on Tuesday became the first ever India-born member of the Australian Parliament to take oath on #Bhagavadgita. Varun Ghosh from Western Australia has been appointed as the newest Senator after the Legislative Assembly and the Legislative Council chose him to represent… pic.twitter.com/KzIhIYSZC0 — DD India (@DDIndialive) February 6, 2024 (చదవండి: 'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?) -
వామ్మో చైనా ఇన్ఫెక్షన్
వాషింగ్టన్: చైనాలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ నిమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనాకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. -
కన్సాస్ సెనేటర్‌గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
Lidia Thorpe: పిడికిలి ఎత్తి.. రాణిగారి పరువు తీసింది!
వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. చాలా దేశాల వలే ఎన్నో ఘోరమైన గాయాలను ఓర్చుకుంది ఆ దేశం. విముక్తి కోసం వేల మంది వీరుల త్యాగాలతో రక్తపుటేరు ప్రవహించింది ఆ గడ్డపై. ఫలితంగా పేరుకు స్వాతంత్రం వచ్చినా.. గణతంత్రంగా మారే అవకాశం ఇంకా దక్కలేదు వాళ్లకు. అందుకే నిరసన గళాన్ని వినిపించేందుకు తన ప్రమాణ కార్యక్రమానికి వేదికగా చేసుకుంది ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ప్. విక్టోరియా ప్రావిన్స్ నుంచి ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ తరపున సెనేటర్‌గా ఎన్నికైంది లిడియా థోర్ప్(48). చట్ట సభకు ఎంపికైన అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియన్‌గానూ ఆమె మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సోమవారం చట్టసభ్యురాలిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంది. వాస్తవానికి గత వారం నూతన సెనేటర్లు అందరూ ప్రమాణం చేయగా.. ఈమె మాత్రం కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. దీంతో సోమవారం ఆమె ఒక్కరితోనే ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ సమయంలో చదవాల్సిన ప్రింటెడ్ కార్డును ముందు ఉంచి లిడియా.. ‘సార్వభౌమాధికారం’ అని కాకుండా.. ‘వలసదారు’ అంటూ క్వీన్ ఎలిజబెత్ 2ను సంభోధించింది. దీంతో సభలో ఉన్న తోటి చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నది మాత్రమే చదవాలని, లేకుంటే ప్రమాణం చెల్లదని ఆమెకు సూచించారు. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఓ చూపు చూసింది. ఈలోపు లేబర్ పార్టీ సభ్యురాలు, చాంబర్ ప్రెసిడెంట్ సూ లైన్స్ జోక్యం చేసుకుని.. ప్రమాణం మళ్లీ చేయాలని, ప్రింటెడ్ కార్డు మీద ఏం ఉంటే అదే చదవాలని కోరింది. దీంతో ఈసారి అన్యమనస్కంగా, కాస్త వెటకారం ప్రదర్శిస్తూ ప్రమాణం చేసిందామె. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్వీన్ ఎలిజబెత్-2ను సెనేటర్ లిడియా థోర్ప్ ఘోరంగా అవమానించిందన్నది పలువురి వాదన. అయితే ఆమె మాత్రం తన చేష్టలను సమర్థించుకుంటోంది. అంతేకాదు మిగతా చట్ట సభ్యులకు లేని దమ్ము ఆమెకు మాత్రమే ఉందంటూ పలువురు పౌరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. Lidia Thorpe, a Djab Wurrung and Gunnai Gunditjmara senator with Australia's Green Party, called the country's symbolic head of state, Queen Elizabeth II, a colonizer while taking her oath of office pic.twitter.com/phS9lUcsDp— NowThis (@nowthisnews) August 2, 2022 క్వీన్ఎలిజబెత్-2 తమకు సార్వభౌమాధికారం ఎప్పుడూ ఇవ్వలేదని, అందుకే తాను ఆ పదం వాడలేదని స్పష్టం చేసింది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా రాజరికానికి కట్టుబడి ఉండడం ఆస్ట్రేలియా ప్రజలు చేసుకున్న ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చెప్తోంది ఆమె. ► వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. వేల మంది అబ్ఒరిజినల్(అక్కడి తెగలు) ఆస్ట్రేలియన్లను దారుణంగా హతమార్చారు. చాలావరకు తెగలను వేరే చోటుకు బలవంతంగా వెల్లగొట్టారు. ► 1901లో ఆస్ట్రేలియాకు స్వాతంత్రం ప్రకటించారు. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగుతున్నారు. ► 1999లో రాణి సర్వాధికారాలను తొలగించాలంటూ ఆస్ట్రేలియన్ పౌరులు ఓటేశారు. ఆ సమయంలో తొలగింపు హక్కు చట్ట సభ్యులకు ఉంటుందని, ప్రజలకు ఉండదనే చర్చ నడిచింది. ► ప్రజలంతా తమ దేశం రిపబ్లిక్‌గానే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, రాజ్యాధినేతను ఎలా ఎన్నుకోవడం అనే విషయంలోనే అసలు సమస్య తలెత్తుతోంది. ► మొన్నటి ఎన్నికల్లో ఆంటోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ‘మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్’గా ఆయన ప్రకటించుకున్నారు. ► అయితే రాజరికపు ఆస్ట్రేలియా.. పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా మారేందుకు మరో రెఫరెండమ్ జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. -
ట్రంప్ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్ అనునూయులు హింసకు, హేట్ స్పీచ్‌కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. నిజానికి పలుమార్లు డెమొక్రాట్లే నిజమైన విద్వేష ప్రసంగాలివ్వడం, హింసను రెచ్చగొట్టడం చేశారని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ విమర్శించారు. ట్రంప్‌పై తీర్మానం మతిమాలిన చర్య అని మార్క్ రూబియో, లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్ అన్నారు. అంతకుముందు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్ సెనేటర్లు ఓటు వేశారు. ఐదుగురు అటువైపే అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేశారు. మిట్ రోమ్నీ, బెన్సాసే, సుసాన్ కోలిన్స్, లీసా ముర్కోవిస్కీ, పాట్ టూమీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానానికి 55 అనుకూల ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ను అభిశంసించాలంటే సెనేట్‌లో మూడింట్ రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే డెమొక్రాట్లకు 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. ఇలాంటి తీర్మానాలు అమెరికా ప్రతిష్టను భంగపరుస్తాయని రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యానించారు. అభిశంసనంటే పదవి నుంచి దింపడమని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారని ప్రశ్నించారు. ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంటని సెనేటర్ రూబియో కొట్టిపారేశారు. కావాలంటే ట్రంప్‌ను ఒక పౌరుడిగా కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయవచ్చని, అభిశంసన కుదరదని చెప్పారు. ట్రంప్ అభిశంసన అగ్గి రాజేయడమవుతుందని హెచ్చరించారు. ట్రయల్ కొనసాగుతుంది సెనేట్‌లో సాధారణ మెజార్టీ లభించినందున ట్రంప్‌పై అభిశంసన ట్రయల్ య«థాతథంగా కొనసాగనుంది. ఫిబ్రవరి 9న ట్రయల్ జరగనుంది. అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలు బలోపేతం చేసుకునే యత్నాలు చేస్తాయి. అయితే ట్రయల్ అనంతరం తీర్మానానికి రెండు సభల ఆమోదం అవసరం. డెమొక్రాట్ల అధీనంలోని హౌస్‌లో తీర్మానానికి ఆమోదం లభించినా సెనేట్‌లో మాత్రం ఆమోదం లభించదని తాజా ఓటింగ్‌తో తేలింది. అందువల్ల ట్రంప్‌పై అభిశంసన జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
యువ సెనేటర్ నుంచి వృద్ధ ప్రెసిడెంట్ దాకా..
వాషింగ్టన్: ఐదు దశాబ్దాలుగా అమెరికా రాజకీయాల్లో కొనసాగుతున్న జో బైడెన్(77) కల ఎట్టకేలకు నెరవేరింది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డొనాల్డ్ ట్రంప్‌పై ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్నారు. అమెరికా చరిత్రలో పిన్నవయస్కులైన సెనేటర్లలో ఒకడిగా రికార్డు సృష్టించిన బైడెన్ ఇప్పుడు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మరో రికార్డు నెలకొల్పబోతున్నారు. ఆయన గతంలో ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1988, 2008లో అధ్యక్ష పదవి కోసం పోటీపడినప్పటికీ డెమొక్రటిక్ పార్టీలోనే విజయం సాధించలేకపోయారు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ► జో బైడెన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన అసలు పేరు జో రాబినెట్ బైడెన్ జూనియర్. ► యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు. ► 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. ► మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. ► దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు. ► సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా ఆయన అప్పట్లో పేరుగాంచారు. ► 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్ మొదటి భార్య, 13 నెలల వారి కుమార్తె నవోమీ మరణించారు. ► బైడెన్ 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ► వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. ఒక కుమారుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించాడు. -
సెనెటర్ శారమ్మ
ఇంకా సెనెటర్ కాలేదు. కానీ అయ్యేలా ఉన్నారు. అవుతారు కూడా. మంచికోసం పోరాడాలి. మంచి దారిలో పెట్టాలి. మంచికి తోడు అవ్వాలి. ఇన్ని హోప్స్ ఉన్నాయి... ఒబామాకు శారా మీద. ఆ ఆశలే ఆమె గెలుపు. గొప్పగా అనిపిస్తుంది.. ఇక్కడి వాళ్లు ఎక్కడికో వెళ్లి అక్కడి రాజకీయాల్లో ప్రముఖులు అయిపోవడం. పారిశ్రామికవేత్తలైతే ‘తెలివుంది కనుక’ అనుకోవచ్చు. నటీనటులైతే ‘టాలెంట్ ఉంది కనుక’ అనుకోవచ్చు. ఇంకా ఏ రంగానికి ఆ రంగంలో ఎవరికి వారు కష్టపడితే సుప్రసిద్ధ ఎన్నారైలు అయిపోవచ్చు. కానీ మనవాళ్లు పాలకులుగా కూడా ఎదుగుతున్నారే! అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాలలో!! ప్రజలు ఎన్నుకుంటేనే ఎక్కడైనా సభల్లోకి ప్రవేశం. మరి భారతీయులు.. దేశంకాని దేశంలో.. ఎలా చట్టసభల ప్రతినిధులు అవుతున్నారు? ఎలా అంటే.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి. అక్కడి ప్రజలకు సేవలు అందించి, సదుపాయాలను కల్పించి! వ్యాపారికి తెలివి, నటులకు టాలెంట్.. ఉన్నట్లే.. రాజకీయంగా ‘నాయకత్వ సమర్థత’ మనవాళ్లను నిలబెడుతోంది. యు.ఎస్.లోని మైన్ రాష్ట అసెంబ్లీకి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న 48 ఏళ్ల శారా గిడియన్.. మన భారతీయ సంతతి మహిళే. ఇప్పుడామె ఆ పై స్థానానికి పోటీ చేయబోతున్నారు. అమెరికన్ ‘సెనెటర్’గా! సెనెటర్‌గా శారా అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం మద్దతు ఇవ్వగానే (‘ఎండార్స్’ అంటారు ఇలా మద్దతు ఇవ్వడాన్ని) వెనువెంటనే ఆమె తరఫున పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆమె కొత్తగా ప్రచారం గానీ, పరిచయం కానీ చేసుకోవలసిందేమీ లేదు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడన్ కూడా శారాకు మద్దతు పలికారు. ఇద్దరు దిగ్గజాలు ఇటొకరు, అటొకరు ఉండి (ఒబామా, బైడన్) శారాను సెనెట్‌కు పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె పని తీరు మీద వారికున్న నమ్మకం, విశ్వాసం అది. 2012 లో మైన్ అసెంబ్లీలో దిగువ సభకు ఎన్నికయ్యారు శారా. అది ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం. తర్వాత 2016లో అదే సభకు స్పీకర్ అయ్యారు. ఇప్పుడు మైన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ వెళ్లేందుకు.. ప్రస్తుతం ఇదే రాష్ట్రం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా సెనెట్‌లో ఉండి, మళ్లీ పోటీ పడుతున్న సీనియర్ సెనెటర్ 67 ఏళ్ల సుజేన్ కాలిన్స్‌ను డీకొనబోతున్నారు! ఆమెపై గెలిస్తే అమెరికన్ సెనెట్‌లో శారా రెండో భారతీయ సంతతి సభ్యురాలు అవడం అటుంచి, సుజేన్పై గెలవడం పెద్ద విషయం అవుతుంది. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న రోజే అమెరికన్ సెనెట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సభ్యులకు ఆరేళ్ల పదవీ కాలం ఉండే సెనెట్.. ప్రతి ‘సరి’ సంవత్సరంలో ఎన్నికలకు వెళుతుంది. శారా తండ్రి ఇండియా నుంచి వెళ్లి యు.ఎస్.లోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో స్థిరపడిన పిల్లల వైద్యుడు. నలుగురు పిల్లల్లో శారా ఆఖరి సంతానం. రోడ్ ఐలాండ్‌లోనే పెరిగింది. శారా తల్లి రెండో తరం ఆర్మేనియన్ సంతతి మహిళ. శారా అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ చేశారు. చదువు అయ్యాక ఓ సెనెటర్ దగ్గర ఇంటెర్న్‌గా ఉన్నారు. తర్వాత మైన్స్టేట్లోని ఫ్రీపోర్ట్ టౌన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు! అరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పోలిస్ సంస్కరణలు, తుపాకీ సంస్కృతి నియంత్రణ.. వీటికోసం శారా చాలా కృషి చేశారు. ఇలాంటి వారు సెనెట్‌లో ఉంటే అమెరికాకు మంచి జరుగుతుందని ఒబామా తన ఎండార్స్మెంట్లో రాశారు. శారా సెనెటర్‌గా ఎన్నికైతే కమలా హ్యారిస్ తర్వాత సెనెటర్ అయిన రెండో భారత సంతతి మహిళ అవుతారు. శారా భర్త, ఆమె ముగ్గురు పిల్లలు ఫ్రీపోర్ట్లో నివాసం ఉంటారు. భర్త బెంజమిన్ లాయర్. భర్త, పిల్లలతో శారా -
సెనెటర్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇది అత్యధిక పోటీ ఉండే సెనేట్ రేసుల్లో ఒకటి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఒబామా ప్రకటించారు. ఆ పేర్లలో భారత సంతతికి చెందిన సారా గిడియాన్ కూడా ఉన్నారు. 48 ఏళ్ల ఎంఎస్ గిడియాన్ ప్రస్తుతం మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. సారా గిడియాన్‌ను అభ్యర్థిగా పెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సెనెటర్ స్థానాల్లో మైనే రాష్ట్రం కూడా ఒకటి. ఇటీవల వచ్చిన పోల్స్ ఫలితాల్లో కూడా సారా గిడియాన్‌కు ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపినట్టు తేలింది. కాల్సిన్కు 44 శాతం లీడ్ ఉండగా సారా గిడియాన్ పోటీతో అది 39 శాతానికి పడిపోయింది. గిడియాన్ తండ్రిది భారత్, తల్లిది అమెరికా. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందని ఒబామా ఈ సందర్భంగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఆమోదించిన అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని ఒబామా అన్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం సెనెటర్‌గా వ్యవహరిస్తున్న సూసన్ కాలిన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సారా ఒకవేళ నవంబర్‌లో ఎన్నికైతే అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ మహిళగా గుర్తింపు పొందుతారు. సారా గిడియాన్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ సెనెట్‌కు పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సారి భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికయిన సంగతి తెలిసిందే. చదవండి: అన్నంత పని చేసిన ట్రంప్! -
గ్రీన్‌కార్డు కోసం 195 ఏళ్లకు పైగా..
వాషింగ్టన్ : అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డు పొందేందుకు ఓ భారతీయుడు 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ వెల్లడించారు. ఈ సమస్యను అధిగమించేందుకు చట్టబద్ద పరిష్కారానికి ముందుకు రావాలని సహచర సెనేటర్లకు ఆయన విజ్క్షప్తి చేశారు. వలసదారులను అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించేలా గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. ప్రస్తుత గ్రీన్‌కార్డు విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సెనేటర్ మైక్ లీ పిలుపు ఇచ్చారు. వలసదారు మరణించిన సందర్బాల్లో వారి గ్రీన్‌కార్డు దరఖాస్తును నిరాకరిస్తుండటంతో వలసదారు సంతానానికి ఈ విధానం ఉపకరించడం లేదని లీ పేర్కొన్నారు. ‘భారత్ నుంచి ఇప్పుడు ఎవరైనా బ్యాక్‌లాగ్‌లో చేరితే ఈబీ-3 గ్రీన్‌కార్డు కోసం 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిఉంటుందని అన్నారు. గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వలస ఉద్యోగులు, వారి పిల్లల ప్రయోజనాలను కాపాడాలిని కోరుతూ సెనేటర్ డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ లీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక వర్క్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు గ్రీన్‌కార్డులు కీలకమని చెప్పారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల పెండింగ్‌తో వారి కుటుంబాలు ఏళ్లకు ఏళ్లు నిరీక్షించడంతో వారు తమ వలస హోదాను కోల్పోతున్నారని సెనేటర్ డర్బిన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్ -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి భారతీయ సంతతి పార్లమెంటు సభ్యురాలు కమలా హ్యారిస్ తప్పుకున్నారు. 2020లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తగినన్ని నిధులు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కాలిఫోర్నియా నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమలా మంగళవారం ఓ కార్యకర్తకు ఫోన్ చేసిన సందర్భంలో ఈ విషయం తెలిసింది. ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజుతో ముగిస్తున్నానని, ఇందుకు చింతిస్తున్నానని 55 ఏళ్ల కమలా హ్యారిస్ మంగళవారం ఓ ట్వీట్ కూడా చేశారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు అని ట్వీట్లో పేర్కొన్నారు. -
నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం
క్రైస్ట్‌చర్చ్ : న్యూజీలాండ్‌లో జరిగిన దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ సెసేటర్కు ఊహించని అవమానం జరిగింది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన దాడిలో 49 మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు ముస్లింలే కారణమంటూ ఆస్ట్రేలియన్ సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహం చెందిన ఓ టీనేజర్.. అన్నింగ్పై గుడ్డుతో దాడి చేశాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. మసీదులపై దాడి అనంతరం అన్నింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు న్యూజిలాండ్‌లో జరిగిన రక్తపాతానికి ముస్లింలే కారణం. న్యూజిలాండ్ ముస్లిం వలసదారులకు స్వర్గధామంగా మారింది. వారి జనాభా పెరిగిపోవడం వల్లే ఇలా జరిగింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడిన మరుసటి రోజే అన్నింగ్ మెల్బోర్న్లో మీడియాతో మాట్లాడుతుండగా ఓ బాలుడు వెనక నుంచి వచ్చి అన్నింగ్ తలపై గుడ్డు పగలకొట్టాడు. అంతటితో ఊరుకోక ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో కూడా తీశాడు. అనుకోని సంఘటనకు షాక్‌కు గురయిన అన్నింగ్ వెంటనే ఆ యువకుడిపై దాడికి దిగాడు. అనంతరం బాలున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు జనాలు. After the Christchurch terrorist attack, Australian senator Fraser Anning released a statement saying, "Let us be clear, while Muslims may have been the victims today, usually they are the perpetrators..." So, a 17-year-old smacked him with an egg.pic.twitter.com/P8wEv6GR4F — UberFacts (@UberFacts) March 16, 2019 అయితే అన్నింగ్ తీరుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆయనను సెనేట్ నుంచి తొలగించాలని ఇప్పటికే కొన్ని పిటిషన్లు సిద్ధమయ్యాయి. ఇందులో 2,25,000 మంది సంతకాలు కూడా చేశారు. (మృతుల్లో ఐదుగురు భారతీయులు) -
2020 అమెరికా అధ్యక్ష బరిలో వారెన్!
వాషింగ్టన్: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్(69) ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులకు పంపిన వీడియో సందేశంలో ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ముందు, అవకాశాలపై అధ్యయనం చేసేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో తదుపరి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసరబోతున్నానని అధికారికంగా ప్రకటించిన తొలి డెమొక్రటిక్ నాయకురాలిగా ఆమె నిలిచారు. ట్రంప్ విధానాల్ని తీవ్రంగా ఎండగట్టే వారెన్ ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మసాచుసెట్స్ నుంచి సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ఇండో–అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్, హిందూ మతానికి చెందిన మరో సభ్యురాలు తులసీ గబ్బార్డ్‌లు కూడా ట్రంప్‌పై పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. -
సమాచార నిల్వపై మోదీకి అమెరికా సెనెటర్ల లేఖ
వాషింగ్టన్: టెక్నాలజీ కంపెనీలు భారత వినియోగదారుల సమాచారాన్ని భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనపై సానుకూల వైఖరిని అనుసరించాలని ప్రధాని మోదీని కోరుతూ ఇద్దరు అమెరికా సెనెటర్లు లేఖ రాశారు. ఈ నిబంధన కారణంగా అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నేతలు జాన్ కోర్నిన్, మార్క్ వార్నర్‌లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలాగైతే కంపెనీలు భారత్‌లో సమర్థంగా వ్యాపారం చేయలేవనీ, అదే జరిగితే భారత ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆటంకాలు ఎదురవుతాయని హెచ్చరించారు. భారత్‌లోనే సమా చారాన్ని నిల్వ చేసినంత మాత్రాన భారతీయుల డేటాకు భద్రత ఏమీ లభించదని అభిప్రాయపడ్డారు. -
సెనెటర్ మెక్కెయిన్ కన్నుమూత
న్యూయార్క్: అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, ట్రంప్ బద్ద్ధ విరోధి, భారత్‌కు మంచి మిత్రుడిగా పేరుపడ్డ సెనెటర్ జాన్ మెక్కెయిన్(81) అనారోగ్యంతో కన్నుమూశారు. వియత్నాం యుద్ధ హీరోగా అమెరికన్ల మనసు గెలుచుకున్న ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం సాయంత్రం 4.28 గంటలకు(భారత కాలమానం ఆదివారం తెల్లవారుజామున) తుదిశ్వాస విడిచారు. మెక్కెయిన్ కోరిక మేరకు వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆయన కుటుంబం శుక్రవారమే ప్రకటించింది. అరిజోనా రాష్ట్రం నుంచి ఆరుసార్లు సెనెటర్ పనిచేసిన కెయిన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు 2017లో బయటపడింది. అప్పటి నుంచి రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్నా ఆరోగ్యం పూర్తి క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ‘నా హృదయం బద్ధలైంది. 38 సంవత్సరాలు ఈ అద్భుతమైన వ్యక్తితో ప్రేమ ప్రయాణం చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. బతికున్నంత కాలం నచ్చినట్లుగానే జీవించారు. మరణం కూడా అంతే.. ఆయనను ప్రేమించినవారు చుట్టుఉండగా.. తాను ఎంతో ఇష్టపడిన చోటే ప్రాణాలు వదిలారు’ అని మెక్కెయిన్ భార్య సిండీ ట్విట్టర్లో తెలిపారు. వియత్నాం యుద్ధంలో నేవల్ అధికారిగా పనిచేసిన కెయిన్ దాదాపు ఐదేళ్లు శత్రువు చేతిలో చిత్రహింసలు అనుభవించారు. అయినా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలతో బయటపడి అమెరికన్ల ప్రశంసలు అందుకున్నారు. సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన కెయిన్ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2000లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి పోరులో జార్జి బుష్ చేతిలో ఓడిపోగా.. 2008 రిపబ్లికన్ అభ్యర్థిగా ఎంపికైనా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేతిలో ఓడిపోయారు. అంత్యక్రియలకు ట్రంప్ రావద్దు రిపబ్లికన్ సెనేటర్‌గా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరంకుశ నిర్ణయాల్ని ఎండగట్టడంలో మెక్కెయిన్ ఎప్పుడూ ముందుండేవారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రకటనల్ని తీవ్రంగా విమర్శించారు. శరణార్థుల విషయంలో అమెరికా విధానాల్ని తూర్పారపడుతూ ట్రంప్‌కు పక్కలో బల్లెంలా మారారు. తన అంత్యక్రియలకు సైతం రావద్దని ట్రంప్‌కు తన వైఖరిని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు ట్రంప్‌ను ఆహ్వానించడం లేదని ఇప్పటికే కెయిన్ కుటుంబం ప్రకటించింది. మెక్కెయిన్ మృతి పట్ల పార్టీల కతీతంగా సంతాపం వెల్లువెత్తింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జి బుష్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. మెక్కెయిన్ మృతికి భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌తో స్నేహానికి పెద్దపీట భారత్‌తో స్నేహ సంబంధాల్ని కాంక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సీఎన్ఎన్కు సంపాదకీయం రాస్తూ.. ‘ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్టీలకతీతంగా అమెరికా–భారత్ సంబంధాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవో కొన్ని దేశాలకు మాత్రమే ఇంత తక్కువ కాలంలో గొప్ప గౌరవం లభించింది. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో మోదీ పర్యటన చాటిచెప్పింది’ అని ప్రస్తుతించారు. అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, ఉద్యోగ కల్పనలో అవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. -
టెక్నికల్ ప్రాబ్లమ్.. అమెజాన్‌తో తంటాలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సాంకేతికతతో అమెరికన్ సెనెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్.కామ్‌కు చెందిన ఫేషియల్ రికగ్నిషన్(ముఖాలను గుర్తించే) మెషీన్లు వారి గుర్తింపును తప్పుగా చూపిస్తున్నాయి. కరుడుగట్టిన క్రిమినల్స్‌గా గుర్తిస్తుండటంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మే నెల నుంచి మరీ ఎక్కువైపోయిందని ప్రముఖ సర్వే సంస్థ ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ నార్తన్ కాలిఫోర్నియా(ఏఎల్‌సీయూ) ఓ నివేదికలో వెల్లడించింది. ఓరెగాన్, ఓర్లాండో, ఫ్లోరిడాలోని సెనెటర్ల కోసం ఏర్పాటు చేసిన మెషీన్లలో ఈ పొరపాటును ఎక్కువగా గుర్తించారు. ఎడర్వర్డ్ మార్కే, డీ మాస్, తదితరులతోపాటు లూయిస్ లాంటి దిగ్గజాలను ఇలా మొత్తం 28 మంది సెనెటర్లను క్రిమినల్స్‌గా గుర్తింపును చూపిస్తున్నాయి. చట్టసభల్లో, కార్యాలయాల్లో, సమావేశాల్లో వాళ్లు పాల్గొన్నప్పుడు సెనెటర్లను ఫేషియల్ సర్వైలెన్స్ కెమెరాలు వారిని క్రిమినల్స్‌గా చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారి వద్దకు వెళ్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి అని ఏసీఎల్యూ పేర్కొంది. ఒక్క కాలిఫోర్నియాలోనే 25,000 వేల మంది డేటా అమెజాన్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంది. అలాంటప్పుడు మున్ముందు సామాన్యులకు కూడా ఈ పొరపాటుతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని ఏఎల్‌సీయూ అంటోంది. ఈ విషయంలో గతంలో కొందరు సెనెటర్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని వెల్లడించింది. అయితే అమెజాన్ మాత్రం తమ పొరపాటును సర్దిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తోంది. ‘ఒక వ్యక్తి రియల్ టైమ్ ఇమేజ్‌లను పాత ఫొటోలతో పోల్చి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. అలాంటప్పుడు పొరపాటు సదరు ఏజెన్సీ సంస్థలదే తప్ప మాది కాదు’ అని అమెజాన్ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. రాయల్ వివాహ వేడుక దగ్గరి నుంచి చిన్న చిన్న పార్కుల్లో పిల్లలు తప్పిపోయిన సమయంలో కూడా అమెజాన్ మెషీన్లనే ఉపయోగిస్తున్నారని, అక్కడ ఎవరికీ రాని ఇబ్బందులు ఇక్కడ మాత్రమే ఎందుకొస్తున్నాయన్న వాదనను అమెజాన్ తెరపైకి తెస్తున్నారు. ఏల్సీయూ మాత్రం మెషీన్లలో 80 శాతం ఇన్స్టాలైజేషన్లో పొరపాట్లు ఉన్నాయని, కావాలంటే బహిరంగంగా నిరూపిస్తామని అంటోంది. ఏదిఏమైనా టెక్నాలజీపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి వినియోగదారుల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం అమెజాన్‌పైనే ఉందన్నది చాలా మంది చెబుతున్న అభిప్రాయం. -
శ్వేతసౌధంపై కమలహారిస్ కన్ను...!
వాషింగ్టన్: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్ని తోసి పుచ్చలేనంటూ భారత సంతతికి చెందిన కమలా దేవి హారిస్ ప్రకటించి అమెరికా రాజకీయాల్లో ఓ మోస్తరు చర్చకు తెరతీశారు. తన రాజకీయ భవిష్యత్ గురించి, అత్యున్నత పదవికి పోటీపడడం గురించి ఆమె ప్రకటించడం ఇదే తొలిసారి. ఎమ్మెస్ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్ష పదవికి పోటీచేసే విషయం కొట్టివేయలేను అని స్పష్టంచేశారు. ప్రస్తుతానికి డెమొక్రాటిక్ పార్టీ నుంచి ఆ దేశ అత్యున్నత స్థానానికి పోటీ చేసేందుకు బెర్రీ సాండర్స్, ఎలిజిబెల్ వారెన్, కొరీ బూకర్ తదితరులకు అవకాశం ఉంది. ఎన్నో ఫస్ట్లు... భారతీయ–ఆఫ్రికన్ మిశ్రమ సంతతికి చెందిన మొదటి అమెరికన్ సెనేటర్‌గా 2016లో ఎన్నికైన ఆమె అంతకు ముందు కాలిఫోర్నియా అటర్నీ జనరల్‌గానూ ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలసపౌరుల హక్కులు పరిరక్షించే వ్యక్తిగా ఆదరణ పొందారు. తల్లీ,బిడ్డలను వేరేచేసేలా అమెరికా సరిహద్దుల్లో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలుచేయడాన్ని ‘మానవత్వంపై దాడి’గా ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వీరి హక్కుల కోసం పోరాడిన అనుభవం అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆమెకు కలిసి రావొచ్చునని భావిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) చట్టంపై మన వైఖరేమిటంటూ స్వపక్షం డెమొక్రాట్లను కూడా ఆమె సవాల్ చేసి ఇరుకునపెట్టారు. నేపథ్యమిదీ... యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా–బర్కిలీలో న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నై నుంచి అమెరికా వెళ్లారు. అక్కడే జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో పరిచయం పెళ్లికి దారితీసింది. తాత పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆ తర్వాత దౌత్యాధికారిగా పనిచేశారు. అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమల జన్మించారు. చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. తండ్రి ఆఫ్రికా సంతతికి చెందినవాడు కావడంతో, అటు ఆఫ్రికా, ఇటు ఆసియా సంస్కృతుల కలబోతగా ఆమె నిలుస్తోంది. మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్ ఒబామాతోనూ పోల్చేవారు. 1986లో హోవార్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి,దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011–17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలకబాధ్యతలు చేపట్టారు. -
నేను సూపర్ విలన్ భార్యను
మనీలా : పాపులారిటీ ఉన్న వాళ్ల పేర్లను వాడుకుని ప్రచారం పొందడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఆఖరికి కామిక్ విలన్‌ను కూడా వదలటం లేదు కొందమంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజయపథంలో దూసుకుపోతున్న అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లోని విలన్ థానోస్ తన భర్తంటూ ఫిలిప్పీన్స్ సెనేటర్ ట్విటర్లో పోస్టులు పెట్టారు. వివరాలలోకి వెళితే.. మే 5న ఫిలిప్పీన్స్ సెనేటర్ నాన్సీ బినయ్ ఇన్ఫినిటీ వార్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మాయోయావోలో ఫోటోలు దిగి ట్విటర్లో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీలో పాల్గొన్న ఆమె తలపై వైకింగ్స్ కిరీటాన్ని ధరించి థానోస్ భార్యను తానే అని ప్రకటించుకున్నారు. మరి ఆమె అవెంజర్స్ సినిమా చూసి ఇలా మాట్లాడారా? లేదా ఫిలిప్పీన్స్ పర్యాటక రంగాన్ని పాపులర్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారో అని తెలియక తలలు పట్టుకుంటున్నారు అక్కడి వారు. కామిక్ విలన్ మనిషిని ఏట్లా పెళ్లి చేసుకుంటాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “I am the wife of Thanos,” Sen @nancybinay exclaims in jest as well-wishers sing “Happy birthday” | via @sherieanntorres pic.twitter.com/ez9oa2bjhy — ABS-CBN News (@ABSCBNNews) May 10, 2018 -
విమానంలో వ్యక్తి వికృత చర్య..
వాషింగ్టన్ : అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని ఓ వ్యక్తి తన అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురిచేశాడు. సీటెల్ నుంచి ఆంకొరేజ్ బయల్దేరిన విమానంలో తండ్రితో పాటు ప్రయాణిస్తున్న యువకుడు విమానం ల్యాండ్ అవటానికి కొద్ది సేపటి ముందు.. నగ్నంగా పరిగెడుతూ వికృత చర్యకు పాల్పడ్డాడు. దీంతో అవాక్కైన విమాన సిబ్బంది అతడిని బాత్రూమ్లో బంధించారు. సోమవారం జరిగిన ఈ సంఘటన గురించి అలస్కా మాజీ సెనేటర్ ఎల్లిస్ గ్రిన్స్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎయిర్ మార్షల్‌తో పాటు మరో వ్యక్తి.. (బహుశా అతడి తండ్రి అనుకుంటా) కలిసి ఆ యువకుడిని బాత్రూమ్లో ఉంచి తాళం వేశారు. అతడి ప్రవర్తనకు ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. అతడు డ్రగ్స్ తీసుకుని ఉండటం వల్ల అలా ప్రవర్తించి ఉంటాడని మేమంతా భావించాం. కానీ మా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగిందంటూ’ ఎల్లిస్ గ్రిన్స్ వ్యంగంగా ట్వీట్ చేశారు. అయితే ఈ సంఘటనపై స్పందించిన అలస్కా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఫ్లైట్ 107లో అసభ్య ప్రవర్తించిన వ్యక్తిని బంధించడం సరైందేనని, విమానం ల్యాండ్ అయిన తర్వాత అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు. -
ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది
-
ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది
న్యూయార్క్ : సాధరణ పౌరులేమోగానీ నాయకులు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా అతి చేయాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.. పదవి పోయి తీరుతుంది. అమెరికాలో ఓ సెనేటర్ పరిస్థితి అంతే అయింది. ఓ బార్‌కు వెళ్లిన షెల్ రాక్ లోవా సెనేటర్ బిల్ డిక్స్ ఓ లాబీయిస్ట్ మహిళకు అందరి ముందే గాటు ముద్దు పెట్టాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన కొంతమంది ఆన్లైన్లో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. బాధ్యత గల వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ తీవ్ర స్థాయి దుమారం రేపింది. దాదాపు 52 నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోను లిబరల్ న్యూస్ వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చూపిన ప్రకారం బార్లో ఉండే స్లూల్స్పై డిక్స్ మరో మహిళతో కూర్చొని ఉన్నాడు. దర్జాగా మందుకొడుతూ రెచ్చిపోయి ఆమెను గాఢంగా చుంబించాడు. అయితే, ఆ మహిళ వివరాలు మాత్రం బయటపెట్టకుండా ఆమె ఒక లాబీయిస్ట్ అంటూ సదరు న్యూస్ సంస్థ తెలిపింది. పలు మున్సిపాలిటీ గ్రూపులకు ఆమె లాబీయిస్టుగా పనిచేస్తారని వెల్లడించింది. ఈ ఘటన ఇదే నెల (మార్చి) 1న చోటు చేసుకుంది. దీంతో లోవా సెనేట్ ప్రెసిడెంట్ జాక్ వైట్వర్ ఓ కీలక ప్రకటన చేశారు. మార్చి 12 అర్ధరాత్రి 2గంటల నుంచి డిక్స్ సెనేటర్ బాధ్యతలకు ముగింపు అని వెల్లడించారు. డిక్స్ తన కుటుంబంలో మూడో తరం రైతు. బట్లర్, గ్రండి, హార్డిన్, ఇతర జిల్లాల్లో తన వ్యవసాయ కార్యకలాపాలు చూసుకునేవారు. పదేళ్లపాటు లోవా హౌస్‌లో పనిచేశారు. 2010 నుంచి వరుసగా సెనేటర్‌గా ఎంపికవుతూ వస్తున్నాడు. అయితే, ఈ ఘటనపై డిక్స్ వ్యక్తిగతంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అతడి పూర్తి వివరాలను అప్పుడే లోవా సెనేట్ రిపబ్లికన్స్ వెబ్సైట్ నుంచి కూడా తొలగించారు. -
పాక్ సెనెట్‌కు హిందూ మహిళ
కరాచి: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణకుమారి కోల్హీ చరిత్ర సృష్టించారు. ఆ దేశ సెనెట్‌కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డుకెక్కారు. సింధు ప్రావిన్స్‌లోని థార్ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్ గ్రామానికి చెందిన కోల్హీ (39).. ఆ ప్రావిన్స్‌లోని రిజర్వ్ స్థానానికి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున పోటీ చేసి సెనెటర్‌గా గెలుపొందారు. పాక్‌లో మైనార్టీలకు హక్కులున్నాయని తెలిపేందుకు కోల్హీ గెలుపే నిదర్శనమని భుట్టో పేర్కొన్నారు. కోల్హీ మాట్లాడుతూ.. ‘నేనో మానవ హక్కుల కార్యకర్తను. మైనార్టీలు.. ముఖ్యంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తు న్నా. ఈ స్థానంలో మరో మహిళను కూడా పీపీపీ నామినేట్ చేసి ఉండొచ్చు. కానీ మైనార్టీలకు అండగా ఉన్నామని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు. మూడేళ్లు జైల్లో.. 1979లో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన కోల్హీ.. మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్ జైలులో బానిసగా జీవించారు. ‘నేను, నా కుటుంబం, బంధువులు ఉమర్‌కోట్‌లోని ఓ భూస్వామికి చెందిన ప్రైవేటు జైల్లో బానిసలుగా ఉన్నాం. ఆ ప్రాంతంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడ్డాం’ అని కోల్హీ చెప్పారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను చిన్న పిల్లనని.. మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు. 16 ఏళ్ల వయసులో 9వ గ్రేడ్ చదువుతున్నపుడు లాల్ చంద్‌ను కోల్హీ వివాహమాడారు. 2013లో సింధ్ వర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు.