Senior actress
-
ఓ హీరో కమిట్మెంట్ అడిగితే.. నా చెప్పుల సైజు 41 అని చెప్పా: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)-2024 వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.ఖుష్బు సుందర్ మాట్లాడుతూ..' మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. బస్సులో, ట్రైన్లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సినిమా సెట్లో హీరో నాతో అసభ్యంగా మాట్లాడారు. మాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని నాతో అన్నాడు. అప్పుడు వెంటనే నేను నా చెప్పుల సైజు 41. షూటింగ్ సెట్లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు.కాగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. -
ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే..
సనా బేగమ్.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనే కాకుండా ఇటు వెండితెరపై సినిమాల్లోనూ నటించింది. వందలకొద్దీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన ఆమె ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుందోనని కెరీర్ తొలినాళ్లలోనే హీరోయిన్ ఛాన్సులను తిరస్కరించింది. సహాయక నటి పాత్రలతోనే సరిపెట్టుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియకు బ్రేక్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె ఐదారు రోజులనుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. అసలే రంజాన్ పండుగ.. ఇంతరవకూ ఒక్కపోస్ట్ కూడా పెట్టడం లేదేంటా? అని అభిమానులు కంగారుపడిపోయారు. కారణాలు ఆరా తీస్తూ ఆమెకు మెసేజ్‌లు చేశారు. దీంతో సోషల్ మీడియాకు చిన్న గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని బయటపెట్టింది సనా. సర్జరీ విజయవంతం 'ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండనందుకు నన్ను క్షమించండి. దురదృష్టవశాత్తూ ఇటీవలే నా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం తప్పింది. అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మీ ఆదరాభిమానాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Fahad Fazil: నన్ను కమెడియన్‌ను చేశారు.. పుష్ప విలన్ -
మహేశ్‌ది, నాది సేమ్ ఏజ్.. హీరోయిన్గా చేస్తా కానీ తల్లిగా నో ఛాన్స్!
కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టైఫాయిడ్ రావడంతో వదిలేశా కస్తూరి మాట్లాడుతూ.. 'రజనీకాంత్‌తో మూడుసార్లు నటించే ఛాన్స్ వచ్చింది. కానీ చేజారిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. జెంటిల్మెన్ హిందీ వర్షన్లో చిరంజీవి పక్కన హీరోయిన్గా నేను చేయాల్సింది. సరిగ్గా అదే సమయంలో టైఫాయిడ్ రావడంతో ఆ అవకాశం పోయింది. గతేడాది రిలీజైన డెవిల్ మూవీలో సీత చేసిన పాత్ర కూడా ముందు నాకే వచ్చింది. సినిమాకు సంతకం చేశాక నేను యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారు. అదే నా బాధ.. కాలా మూవీలో కూడా రజనీ పక్కన యంగ్‌గా కనిపిస్తున్నానని నన్ను తీసేసి ఈశ్వరి రావును సెలక్ట్ చేశారు. నేను పెద్ద వయస్కురాలిగా కనిపించను.. అదే నా బాధ. నా ముఖంలో నా వయసు కనిపించదు. ఇప్పటికీ తెల్లజుట్టు కూడా రాలేదు. అందుకే కొన్ని సినిమాలకు నేనే నా జుట్టుకు తెల్లరంగు వేసుకుంటున్నాను. తల్లి పాత్రలు వస్తున్నాయి.. కానీ ఏ హీరోకు అని చేయగలను? మహేశ్‌బాబుది, నాది ఒకే వయసు. అతడికి జోడీగా నటించగలను.. కానీ, తల్లిగా ఎలా చేయగలను? చూడటానికి అస్సలు బాగోదు' అని కస్తూరి చెప్పుకొచ్చింది. చదవండి: ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్ -
నా కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.. ప్రకటించిన సీనియర్ నటి
అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది. ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఆమె కోలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తకరమైన విషయాలను పంచుకుంది. తన కుమార్తె 'తేజ లక్ష్మి' గురించి కొంత సమాచారాన్ని పంచుకుంది. అందులో ఇన్నాళ్లుగా తన కూతురు సినిమాల్లో ఎందుకు నటించలేదని, ఇప్పుడు సినిమాల్లో ఎందుకు నటించబోతుందంటూ పలు విషయాలపై ఆమె మాట్లాడింది.ఊర్వశి ఇటీవల తన కుమార్తెతో కలిసి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అది కాస్త నెట్టింట తెగ వైరల్ అయింది. ప్రస్తుతం తేజ లక్ష్మి వయసు 23 ఏళ్లు కావడంతో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆమె చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయం చేసినట్లు తెలిపింది. 'ఇన్ని సంవత్సరాలుగా నా కూతుర్ని సినిమాల్లో నటించేలా చేయలేదు. కారణం ఏంటంటే.. స్టార్ల వారసులు సినిమాల్లో నటించేందుకు వస్తే.. వాళ్ల పేరెంట్స్ ప్రభావం వల్ల జనాలు ఆదరిస్తున్నారు. వారసులకు ఇదే ప్రధాన సమస్యగా ఉంటుంది. అందుకే చదువు పూర్తి చేసి రమ్మని పంపించాను. అయితే ఇప్పుడు ఆమె చదువు పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి తన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ నటించమని చెబుతున్నారని చెప్పింది. ఆమె కూడా ఇప్పుడు సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపుతోంది. కాబట్టి నేను దానికి అంగీకరించాను.ఇప్పుడు కొన్ని కథలు వింటుంది. ఆమె మొదట్లో సినిమాల్లోకి రాకూడదని భావించింది, కానీ విధి ఆమెను సినిమా వైపు నడిపిస్తుంది. దాన్ని మార్చలేమని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్‌తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by 𝐕𝐀𝐍𝐈𝐓𝐇𝐀 (@vanithamagazine) View this post on Instagram A post shared by Urvasi Sivaprasad (@therealurvasi) -
భర్త పోయిన తర్వాత విచ్చలవిడిగా..: ఏడ్చేసిన సురేఖ
సురేఖా వాణి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఈమెకు సుప్రిత అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండితెరకు హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. అయితే వారిని కొందరు అదేపనిగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై స్పందించింది నటి. మొదట్లో భరించలేకపోయా.. ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణి మాట్లాడుతూ.. 'మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. నాకు 19 ఏళ్లకే డైరెక్టర్ సురేశ్ తేజతో పెళ్లయింది. అప్పుడు పెద్దదానిలా మారిపోయాను. ఇప్పుడు నాకు 42 ఏళ్లు.. ఇరవైఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్లు మారరని వదిలేశాను. ప్రతివాడి నోరు మూయించలేం కదా.. నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్ పేరెంట్ను, కాబట్టి ఇలాంటి విమర్శలు, ఎత్తిపొడుపులు ఎలాగో ఉంటాయి. తేజతో మాట్లాడాలనుంది నా భర్త ఆస్పత్రిపాలైనప్పుడు ఎంత ఏడ్చానో.. ఎంత బాగా చూసుకున్నానో! కానీ అతడి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనసలు పట్టించుకోలేదని తేజ వాళ్ల కుటుంబసభ్యులు తప్పుగా అనుకున్నారు. అతడికి డయాబెటిస్ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్‌గా హార్ట్ బీట్ ఆగిపోయింది. దేవుడు ఒక గంట అవకాశమిస్తే తేజతో మనసువిప్పి మాట్లాడాలనుంది. కనీసం కలలో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తనను క్షమించమని అడగాలనుంది. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోవారు అడిగారు. కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు. నాకంటూ సొంతిల్లు లేదు నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి. అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటివరకు నాకు సొంతిల్లు కూడా లేదు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో.. నెలరోజులు డిప్రెషన్లో ఉండిపోయాను. ముద్ద దిగక.. ఏడుస్తూ కూర్చుండిపోయా.. మీ చెడు తిరుగుళ్ల వల్లే ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్లొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమలస్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను' అంటూ కంటతడి పెట్టుకుంది సురేఖ. చదవండి: చిన్న సినిమాకు పెద్ద రివ్యూ ఇచ్చిన మహేశ్ -
శరత్‌బాబుతో బిడ్డను కనాలనుకున్నా..: జయలలిత
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఐటం సాంగ్స్, గ్లామర్ పాత్రలు పోషించింది జయలలిత. అప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుని చేతినిండా సంపాదించింది. కానీ ఆ గ్లామర్ పాత్రల వల్ల ఇప్పటికీ తనకు మంచి పాత్రలు రావడం లేదు. అప్పటి సీనియర్ హీరోయిన్లంతా అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలాంటి చెప్పుకోదగ్గ పాత్రలే రావట్లేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉండిపోయింది. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకున్నా తాజాగా ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. దివంగత నటుడు శరత్‌కుమార్‌ను మనసారా ప్రేమించానని చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ.. 'చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నేను ఆసక్తి చూపలేదు. ఒక్క పెళ్లితోనే నరకం చూశాను. ఇక దానికి జోలికి వెళ్లొద్దనుకున్నాను. అమ్మానాన్న చనిపోయాక హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. ఆఫర్ల సంగతి ఏమో కానీ సినీ ఆత్మీయులు ఉంటారని ఇక్కడ సెటిలయ్యాను. బిడ్డను కనాలనుకున్నాం నేను శరత్‌బాబును ప్రేమించాను. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు! ఆయనతో కలిసుండాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడాయన లేరు కాబట్టి అన్ని వివరాలు చెప్తాను. ఆయనతో కలిసే యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకంటూ ఓ గైడ్ పంపించాడనుకున్నాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు. మేమిద్దరం కలిసి ఓ బిడ్డను కనాలని కూడా ప్లానింగ్ చేసుకున్నాం. కానీ ఆయన దేని గురించైనా సంవత్సరాలతరబడి ఆలోచిస్తారు. అభ్యంతరం లేకపోతే.. మనిద్దరం బిడ్డను కని చనిపోయాక ఆస్తి గురించి ఆమెను ఏమైనా హింసిస్తారేమోనని భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్‌బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్. ఆమెను అక్కా అని, ఆయన్ను బావ అని పిలిచేదాన్ని. బావ.. బావ అంటూ నేను తనకు క్లోజ్ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు పట్టుకెళ్లిపోయాడు' అని చెప్పుకొచ్చింది జయలలిత. తప్పించుకోలేకపోయా.. ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక, తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో వాళ్లు బాగుండాలి అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. పైశాచికత్వంగా ప్రవర్తించేవారూ కాదు. వాళ్ల అవసరం తీర్చుకునేవారు' అని తెలిపింది జయలలిత. చదవండి: కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనట! -
'నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ క్రికెటర్'.. మనసులో మాట చెప్పేసిన జయసుధ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన బాల్యంలో చెన్నైలో చెపాక్ స్టేడియం(ఇప్పటి చిదంబరం స్టేడియం) దగ్గర్లోనే తమ నివాసముండేదని జయసుధ తెలిపింది. మా ఇంటికి.. గ్రౌండ్‌కు మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉండేదని వివరించింది. అక్కడే ఉన్న హిందూ స్కూల్లో చాలామంది సినిమా, క్రికెట్ ప్రముఖులు కూడా చదువుకున్నారు. తనకు చిన్న వయసులో అక్కడే చాలా క్రికెట్ మ్యాచులు జరుగుతుండేవని పేర్కొంది. నేను చాలాసార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచులు చూసేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో తనకు ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే క్రష్ ఏర్పడిందని ఆమె తెలిపింది. అప్పట్లో అందరికంటే అతను హ్యాండ్సమ్గా ఉండేవారని జయసుధ తెలిపింది. అంతే కాకుండా ఆయనను చాలామంది ఇష్టపడేవారని వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. జయసుధ మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలని అనుకున్నా. సెకండ్ ఆప్షన్ సినిమా. ఇక మూడోది టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. కానీ ఈ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో చేశాను. లక్కీగా 12 ఏళ్లకే మొదటి సినిమా చేశా. అప్పట్లో మంజుల గారు చాలా ఫేమస్. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె చేయలేని సినిమాలకు నన్ను పరిచయం చేసేవారు. అలా శోభన్ బాబుతో మొదటి సినిమా చేశా. నా అసలు పేరు సుజాత. అప్పటికే మలయాళంలో ఆ పేరుతో మరో హీరోయిన్ ఉండేది. గుహనాథన్ అనే ఒక తమిళ రైటర్ జయసుధ అనే పేరును సూచించారు. నాకు మొదటి నుంచి సినిమా చేసే లక్షణాలు లేవు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. షూటింగ్లో ఉన్నప్పుడు కామెంటరీ వినేందుకు సిగ్నల్ కోసం అలా వెళ్లిపోయేదాన్ని. క్రికెట్లో నా ఫేవరేట్ సునీల్ గవాస్కర్, ఏక్నాథ్ సోల్కర్ అని ఒకాయన ఉండేవారు. సినిమాల వాళ్లకు క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో టీనేజర్‌గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ నా క్రష్. అతను చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు. నేనే కాదు.. చాలామంది ఆయన్ను చూసేందుకే మ్యాచులకు వచ్చేవారు. ' అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. -
'చాలా బాగుంది' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా?
శ్వేత కొన్నూర్ మీనన్.. ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనుకునేరు? హీరోయిన్ మాళవిక అసలు పేరిది! 19 ఏళ్ల వయసులోనే ఉన్నాయ్ తేడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్‌స్టర్ కొట్టింది. రోజావనం మూవీతో తన సత్తా నిరూపించుకుంది. ఇంకేముంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ రారమ్మని పిలిచింది. చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తం, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. రీఎంట్రీకి సిద్ధం తెలుగు, తమిళంతోపాటు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు కూడా చేసింది. 2009లో చివరగా ఆరుపాడై సినిమా చేసింది. అందులో అతిథి పాత్రలో కనిపించింది. 2007లో సుమేష్ మీనన్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది. చాలాకాలానికి గోల్మాల్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. 44 ఏళ్ల వయసులోనూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోందీ బ్యూటీ. మరింత బలంగా మార్చుతుంది తాజాగా తన సోషల్ మీడియాలో యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ జర్నీ అంత సులువేం కాదు.. కానీ యోగా పట్ల నీకు ఎంత నిబద్ధత ఉందనేది తెలుస్తుంది. రోజూ యోగా మ్యాట్ నేలపై పరచడమనేది మొక్కకు నీళ్లు పోయడంలాంటిది. ఇది మిమ్మల్ని మరింత బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుతుంది. కఠినతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి యోగా చేసి గాఢంగా శ్వాస తీసుకుంటే అది మీ పురోగతికి ఉయోగపడుతుంది. నన్ను నమ్మండి.. ఒక్కసారి కమిట్ అయ్యాక దాన్ని వదిలేయకూడదు.. కట్టుబడి ఉండాలి. ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చే సానుకూల మార్పులను మీరే చూస్తారు. నన్ను నమ్మండి.. ఇదే నిజం అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. కాగా మాళవిక.. తరచూ తన వర్కవుట్, యోగా వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ఆ సినిమాలో నేనూ హీరోయిన్నే.. కానీ నన్ను తీసేశారు! -
ఎన్టీఆర్‌ని వెండితెరకు తెచ్చిన 'కృష్ణవేణి' ఎవరో తెలుసా..?
మణిలాంటి నటి... మణిలాంటి గాయని... మణిలాంటి నిర్మాత... కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమ్యూలమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. ‘మన దేశం’ వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. నేడు నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు సి. కృష్ణవేణి. ఈ సందర్భంగా కృష్ణ‘మణి’ జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు ‘గొల్లభామ, లక్ష్మమ్మ’ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. ‘కచదేవయాని, గొల్లభామ, అనసూయ’ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. ‘తిరుగుబాటు’ సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్‌పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం.. భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. కుమార్తె పేరుపై ‘ఎంఆర్ఏ’ప్రోడక్షన్ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘మన దేశం’ (1949) సినిమా తీసి, విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా ‘వరూధుని’ సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుని పిలిపించి, ‘మన దేశం’లో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గానూ తన ప్రత్యేకత చాటుకున్నారామె. ‘ధర్మాంగద’కి రూ. నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన ‘గుడ్ ఈవెనింగ్, లేడీ డాక్టర్’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952). మహారాష్ట్ర గవర్నర్‌గా చేసిన కోన ప్రభాకరరావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో ‘భక్త ప్రహ్లాద’ (1942) ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన ‘దాంపత్యం’ కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు కృష్ణవేణి. తల్లి బాటలో కుమార్తె కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధా దేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి, లక్ష్మి ఫిలింస్ కంబైన్స్‌పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం ‘భక్త కుంబారా’ (1974)ని నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్ హీరో. తెలుగులో అనురాధ నిర్మించిన తొలి చిత్రం ‘చక్రధారి’ (1977). అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం ‘మా పెళ్లికి రండి’ (2000). జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. - అనురాధా దేవి -
భర్తతో విడాకులు, గుక్కపెట్టి ఏడ్చిన హీరోయిన్.. భరణం అడగమంటే..
సులక్షణ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఒకానొక సమయంలో దక్షిణాదిన టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. తర్వాత అమ్మ పాత్రలు సైతం చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అయితే చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం, ముగ్గురు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవడంతో తన జీవితం అస్తవ్యస్తమైపోయింది. వ్యక్తిగత సమస్యలు కెరీర్‌ను దెబ్బ తీశాయి. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరమైంది. కానీ బతుకుబండిని నడిపించడం కోసం తిరిగి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది, కానీ పూర్వ వైభవం అందుకోలేకపోయింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తున్న ఆమె తాజాగా తన జీవితంలోని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. 18 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే విడాకులు సులక్షణ మాట్లాడుతూ.. '18 ఏళ్ల వయసులోనే నా పెళ్లి జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎస్ విశ్వనాథన్ తనయుడు గోపికృష్ణన్ను పెళ్లి చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. ఏ బంధమైనా సరే ఎప్పుడూ గొడవపడుతూ కలిసి ఉండేకన్నా విడిపోవడమే మంచిది. కలిసి కొట్టుకోవడం కన్నా విడిపోయి స్నేహితులుగా ఉండటం చాలా బెటర్. కానీ విడాకులు తీసుకోవాలంటే ఆ బాధను తట్టుకోగలగాలి. దీనివల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. 23 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. పిల్లల కోసమే బతికాను. భరణం ఆశించలేదు.. విడిపోదామనుకున్నప్పుడు మరీ అంత బాధపడలేదు. కానీ కోర్టులో విడాకులు మంజూరు చేసినప్పుడు గుక్క పెట్టి ఏడ్చేశాను. ఎందుకంటే ఆరోజు సర్వస్వం కోల్పోయినట్లనిపించింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డాను. విడాకుల తర్వాత ముగ్గురి పిల్లల బాధ్యత నేనే చూసుకున్నాను. మాజీ భర్త నుంచి ఎటువంటి భరణం ఆశించలేదు. అందుకు నేను గర్వపడుతున్నాను. అయితే మా లాయర్ భరణం అడగమని, పిల్లల గురించి ఆలోచించైనా డబ్బులు డిమాండ్ చేయమని చెప్పాడు. కానీ నాకు కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా.. నేను బతకగలను.. ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. అతడి దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా నాకు వద్దని చెప్పేశాను. పిల్లల కోసం సినిమాల్లో బిజీ అయ్యా.. మొదట్లో పిల్లలను చూసుకోవడానికి ఏడేళ్లపాటు సినిమాలకు దూరమయ్యాను. కానీ అది కరెక్ట్ కాదనిపించింది. బ్యాంకులో ఉన్నదంతా తింటూ పోతే చివరకు ఏమీ మిగలదని తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాను. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించాలని కష్టపడ్డాను. నాన్న ఉంటే మాకోసం అది చేసేవాడు, ఇది చేసేవాడు అన్న ఆలోచన వారికి ఏనాడూ రానివ్వలేదు. సినిమాలతో బిజీ అయ్యాను. కథ కూడా వినకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను' అని చెప్పుకొచ్చింది. అవకాశాల్లేక వెండితెరకు దూరం సులక్షణ ఆంధప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జన్మించింది. రెండున్నరేళ్ల వయసులో 'కావ్య తలైవి' సినిమాలో చిన్నారి కృష్ణ/డాలీగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన ఆమె చంద్రమోహన్ 'శుభోదయం' సినిమాతో హీరోయిన్గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 450 సినిమాలు చేసింది. ప్రేమ నక్షత్రం, మా ఇంటాయన కథ, మా ఇంటి ప్రేమాయణం, అల్లుళ్లు వస్తున్నారు, డబ్బెవరికి చేదు వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన చివరి చిత్రం గజినీకాంత్ (2018). సులక్షణ ప్రస్తుతం తమిళ, మలయాళంలో సీరియల్స్ చేస్తోంది. చదవండి: కేఎల్ రాహుల్‌పై ట్రోలింగ్.. 100 రెట్లు ఎక్కువ బాధపడతా.. కానీ తను. -
విదేశీ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటి.. పోస్ట్ వైరల్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్ కుమార్. డేరింగ్ అండ్ డాషింగ్ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు. అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్ కుమార్ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్ చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్లో తన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
మరింత దయనీయంగా పావలా శ్యామల పరిస్థితి.. ఏదో ఓరోజు..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎందరో తారలు చివరి దశలో మాత్రం కష్టాల కడలిలో మునిగిపోయారు. ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా అంతే! వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడండి అంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ చేతులెత్తి అర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల జీవిత కథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆర్థిక భారం, వయోభారం.. పావలా శ్యామల... అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. ఒకవైపు ఆర్ధిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి.. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం ఆమెకు మనోవేదనను కలిగిస్తోంది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించాయి. అవార్డులను అమ్మేసుకుంది తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్న రోజులున్నాయని ఆమె తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వచ్చిందని చెప్పింది. అలాంటిది ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని బాధపడింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కంటతడి పెట్టుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదని చెప్తుందంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినీ కెరీర్.. పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ సహా సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించింది. అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్న ఆమె నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదిగూడలోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారీ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతోంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చేయాలనుకునేవారు కింద ఇస్తున్న బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపించవచ్చు. Neti Shyamala, A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager, Yusuf guda Branch, Hyderabad , Cell : 9849175713. చదవండి: ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే.. : రేణు దేశాయ్ -
కూతురి వయసున్న వాళ్లతో హీరోలు రొమాన్స్? సిగ్గనిపించట్లేదా?: నటి
సినీ పరిశ్రమలో హీరోయిన్లకు, కమెడియన్లకు, ఇతరత్రా సెలబ్రిటీలకు వయసైపోతుందేమో కానీ హీరోలకు మాత్రం కాదు! ఒక్కసారి హీరోగా పేరు తెచ్చుకున్నారంటే ఏళ్లకు ఏళ్లు హీరోగానే స్థిరపడిపోతారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని వుడ్స్‌లోనూ ఇదే పరిస్థితి! వాళ్లు హీరోగా నటిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేయడం సరే కానీ తమ కూతురి వయసున్న నటీమణులతో రొమాన్స్ చేయడమే చాలామందికి మింగుడుపడటం లేదు. కానీ దర్శకనిర్మాతలు, హీరోలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడింది సీనియర్ నటి రత్న పాఠక్ షా. 'దీని గురించి ఏమని మాట్లాడాలో కూడా తెలియడం లేదు. కూతురి వయసున్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడానికి వారికి ఏమాత్రం సిగ్గుగా అనిపించడం లేదు.. అలాంటప్పుడు నేనేం మాట్లాడగలను? నేను చెప్పడానికి ఏం లేదు. దీని గురించి మాట్లాడటం నాకే సిగ్గుగా ఉంది. కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. ఆడవాళ్లు నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వాళ్లు సినీ ఇండస్ట్రీలోనూ కచ్చితంగా అద్భుతాలు చేయగలరు. దీనికి కొంత సమయం పడుతుందేమో కానీ తప్పకుండా జరిగి తీరుతుంది' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ షా.. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఖుబ్సూరత్, కపూర్ అండ్ సన్స్ వంటి హిట్ చిత్రాల్లో నటనతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన ధక్ ధక్ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ.. -
మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !
ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు. (ఇది చదవండి: యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!) అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి చెబుతోంది. కేవలం లిక్విడ్ ఫుడ్తోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని.. డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది. తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి వాపోయింది. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు రూ. 5000 అందుతోంది. ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది. ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది. కనకలత తన కెరీర్లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కలం అనే చిత్రంలో కనిపించింది. నాటకాల ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది -
సిక్కిం వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ నటి..!
ఇటీవల సిక్కింలో అనూహ్యంగా సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఆచూకీని కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దాన వీర శూరకర్ణ, ఆ తర్వాత సంఘర్షణ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఆమె నివాసముంటున్నారు. ఈ నెల అక్టోబరు 2న ఆమె తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు కూడా ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిక్కింలో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతవ్వడంతో ఆమె కుమార్తె నబిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడినట్లు నబిత తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని.. వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నా.. ఆర్మీ నంబర్లకు ప్రయత్నించినా అవీ కూడా పనిచేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సైతం గల్లంతయ్యారు. (ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!) -
ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ
సినిమా ఇండస్ట్రీ పైకి చూడటానికి కలర్‌ఫుల్. కానీ లోపల చాలా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఛాన్సుల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్.. చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సంఘటన తన విషయంలోనూ జరిగిందని సీనియర్ నటి ప్రమీలా రాణి చెప్పుకొచ్చింది. ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ఇంకా ఏమేం చెప్పింది? ఎవరీ నటి? కృష్ణా జిల్లాలో పుట్టిన ఈమె పేరు ప్రమీలా రాణి. దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. అప్పట్లో సహాయ పాత్రలు చేసిది. ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు బామ్మగా నటిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన చిత్రాల్లో విక్రమార్కుడు, వేదం, బాహుబలి ఉన్నాయి. అయితే తనకు అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) ఏం జరిగింది? చిన్న వయసులోనే ఈమెకు పెళ్లి చేశారు. అయితే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో భర్త వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేశారు. ఈమెకు 23 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు. దీంతో ఒంటరి అయిపోయింది. ఆ సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం తనకు అవకాశం ఇచ్చి, గెస్ట్ హౌస్‌కి పిలిచారని ప్రమీలా రాణి చెప్పింది. యాక్టింగ్, షూటింగ్ అంటే వస్తానని.. ఇలాంటి వాటికి అస్సలు రానని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆ సినిమా ఛాన్స్ పోయింది. ఇది తప్పితే తనకు ఇండస్ట్రీలో మరెలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వాలనేది చెప్పింది. ప్రస్తుతం ఈమె వయసు 85 ఏళ్లు. ఇప్పటికీ చురుగ్గా ఉంటూ, సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) -
స్టార్ హీరోయిన్ రవళి కెరీర్ ముగిసిపోవడానికి కారణమిదే!
సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. మా అసలు పేర్లు ఇవీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్ హీరోగా ఎస్పీ ముత్తరామన్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు. నటి హరిత దంపతులు పెళ్లి సందడితో ఫుల్ క్రేజ్ తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది. ఆ ప్రచారం వల్లే కెరీర్ నాశనం తన కెరీర్ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి
సీనియర్ నటి జయలలిత గురించి తెలియనివారి ఉండరు. అప్పట్లోనే తెలుగులో అనేక సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. వెండితెరపై నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్‌తో మెప్పించారు. మలయాళ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయలలిత.. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసింది. ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, హంగామా, గోపీ గోపిక గోదావరి, గ్రహణం, భరత్ అనే నేను లాంటి సహాయక పాత్రల్లో నటించారు. అలాగే వ్యాంప్ పాత్రలతో ఆమె ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపైనే కాన్సంట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు. సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసిన జయలలిత స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగులు వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయలలిత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!) జయలలిత మాట్లాడుతూ.. 'నేను అత్యధికంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు రామానాయుడు ఇచ్చారు. అంత మంచి క్యారెక్టర్ ఏ సినిమాలోనూ రాలేదు. నా రెమ్యునరేషన్ గురించి అంతా మా నాన్నే. డేట్స్ కూడా చూసుకునేవారు. బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేశా. బాలయ్య చాలా సరదాగా మాట్లాడేవారు. చిరంజీవి కూడా ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలకరించేవారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉంటాయి. నాకు సెట్లో టైంకు భోజనం పెట్టకపోతే నిర్మాతకు శాపం పెడతా.' అంటూ చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ అసభ్యంగా.. అసిస్టెంట్ డైరెక్టర్ తీరు గురించి మాట్లాడుతూ..' ఓ మలయాళం మూవీ చేసేటప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు మలయాళం భాష రాదు. అప్పుడు మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైమ్ వెళ్లా. అందులో రేప్ సీన్ గురించి చెప్పాలని గదిలోకి రమ్మన్నారు. లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత అతను ఆరు నెలల్లోనే చనిపోయాడు. అతనెలా చచ్చాడో కూడా నాకు తెలియదు.' నటి జయలలిత చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు జయలలిత తెలిపారు. వ్యాంప్ పాత్రల వల్లే కారణంగానే ఆ ఛాన్స్ పోయిందన్నారు. అంతేకాకుండా కళాతపస్వి కే. విశ్వనాథ్ బంధువుతో పెళ్లి సంబంధం కూడా పోయిందని.. కుటుంబం కోసమే వద్దకు వచ్చిన పాత్రలన్నీ చేసినట్లుగా జయలలిత వెల్లడించారు. (ఇది చదవండి: అపాయింట్మెంట్ అడిగితే షాకయ్యారు.. విశాల్ కామెంట్స్ వైరల్!) -
6గురు హీరోలతో స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్.. చివరకు ముగ్గురు పిల్లల తండ్రితో..
వైజయంతిమాల.. కలువపువ్వులాంటి కళ్లు.. చంద్రబింబం లాంటి ముఖము.. తేనెలొలికే పెదాలు.. ఆమె ముఖారవిందాన్ని ఏమని వర్ణించగలం. తను నడిస్తే నాట్యం చేసినట్లే ఉంటుంది. అందం, అభినయం, నాట్యం.. అన్నింటినీ ఒకే మనిషిలో గుమ్మరించినట్లుగా ఉంటుంది. ఆమె గురించే ఈ ప్రత్యేక కథనం.. 13 ఏళ్లకే నటిగా.. తినే మెతుకు మీద మన పేరు రాసి ఉన్నట్లే ఎవరు ఏం చేయాలని కూడా ముందే రాసి ఉంటుందేమో! తమిళనాడులో నటి వసుంధర దేవి కడుపున జన్మించింది వైజయంతిమాల. తల్లి పోలికలతో పాటు నటనైపుణ్యాన్ని పుట్టుకతోనే సంపాదించింది. ఐదేళ్లకే క్లాసికల్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. 13 ఏళ్లకే నటిగా మరింది వైజయంతి. అయితే తల్లి అండ మాత్రం ఆమెకు దక్కలేదు, కానీ అమ్మమ్మే అమ్మగా మారి తన ఆలనా పాలనా, బాధ్యతలు చూసుకుంది. తొలి సినిమా.. 1949లో తమిళంలో 'వాస్‌కాయ్' సినిమా చేయగా అది తెలుగులో 'జీవితం' అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళ అమ్మాయి అయిన వైజయంతి.. తండ్రి సాయంతో తన తొలి చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తన నటన కన్నా తను వేసే స్టెప్పులకే ఎక్కువమంది ఫిదా అయ్యారు. హిందీ కూడా నేర్చుకుని అక్కడ చేసే సినిమాలకు సైతం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్లో బడా స్టార్స్‌తో కలిసి నటించింది వైజయంతిమాల. అందరూ నో చెప్పిన పాత్రకు ఎస్ చెప్పిన హీరోయిన్ కొన్ని సినిమాలు ఆడకపోయినా ఆమె డ్యాన్స్ మాత్రం జనాలు అంత ఈజీగా మర్చిపోయేవాళ్లు కాదు. 1955లో దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్రకు నర్గీస్, బీనా రాయ్, సూర్య అందరూ నో చెప్పారు. కానీ వైజయంతిమాల ఏమాత్రం ఆలోచించకుండా నటించింది. ఈ మూవీలో వైజయంతి నటనకుగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు ప్రకటించారు. అయితే తాను హీరోయిన్‌తో సమానమైన పాత్ర చేశానని, అలాంటప్పుడు అది సహాయ పాత్ర ఎందుకవుతుందని అవార్డును తిరస్కరించింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ రెండు దశాబ్దాలపాటు నటిగా రాణించి భారతీయ సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, ప్లేబ్యాక్ సింగర్‌గానూ మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిందీ హీరోయిన్. ఆ సమయంలో తన గురించి ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. చాలామంది హీరోలతో ఎఫైర్ నడిపిందని టాక్ నడిచింది. ఏ చీర కట్టుకోవాలో కూడా ఆ హీరోనే డిసైడ్ చేసేవారట ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్.. మధుబాలకు బ్రేకప్ చెప్పిన తర్వాత వైజయంతిమాలను ప్రేమించాడని ప్రచారం జరిగింది. తన సినిమాలో ఏ చీర కట్టుకోవాలనేది కూడా దిలీపే నిర్ణయించేవారని టాక్ నడిచింది. తర్వాత షోమాన్ రాజ్ కపూర్‌తో ఆమెను లింక్ చేశారు. నజరాణా సినిమాలో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అప్పట్లో బీటౌన్ కోడై కూసింది. వీళ్లు సహజీవనం చేశారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన రాజ్ కపూర్ భార్య.. బెదిరింపులకు దిగడంతో ఇకమీదట వైజయంతిమాలను కలడం, ఆమెతో పని చేయడం మానేస్తానని వాగ్ధానం చేశాడట. ఆ సమయంలో వైజయంతి అబార్షన్ చేయించుకుందని ఓ పుకారు. వైజయంతిపై మనసు పారేసుకున్న డాక్టర్ సౌత్‌లో జెమిని గణేశన్, శివాజీ గణేశన్, ఎంజీఆర్, రాజేంద్ర కుమార్‌తోనూ ప్రేమాయణం నడిపిందని ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైతే డాక్టర్ చమన్‌లాల్ బాలి తన జీవితంలో అడుగుపెట్టాడో అప్పుడే ఈ ప్రచారాల పరంపరకు ఫుల్స్టాప్ పడింది. డాక్టర్ బాలికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన తరచూ వైజయంతి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు వైజయంతి అమ్మమ్మ అతడి తీరు గమనించి.. ముగ్గురు పిల్లల తండ్రివి, నా మనవరాలిని ఏం చేద్దామనుకుంటున్నావు? అని కోప్పడింది. అంత పెద్దాయనను గుమ్మంలో నిలబెట్టి కోప్పడతావేంటని వైజయంతి ఎదురుతిరగడంతో ఆమె మద్రాసు వెళ్లిపోయింది. విడాకులతో లైన్ క్లియర్ 1966లో బాలి, తన భార్య రూబితో విడిపోయారు. అప్పటి నుంచి వైజయంతి, బాలి కలిసి నివసించడం మొదలుపెట్టారు. కానీ తను డ్రగ్స్ తీసుకుంటోందని రూమర్స్ మొదలయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి లోనైంది వైజయంతి. ఇంతలో 1967లో బాలికి విడాకులు మంజూరవడంతో వైజయంతికి లైన్ క్లియర్ అయింది. 1968 మార్చి 10న మద్రాసులో వైజయంతి- బాలి పెళ్లి చేసుకున్నారు. వీరికి సుచేంద్ర అని ఒక బాబు పుట్టాడు. కొడుకు పుట్టాక డాక్టర్ వృత్తి మానేసిన బాలి.. కుమారుడి పేరిట సుచీ సీ ఫుడ్స్ అనే వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదించాడు. కానీ తర్వాతి కాలంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఆరోగ్యం విషమించి.. అమెరికాలో బైపాస్ సర్జరీ చేయించుకున్న మూడేళ్ల తర్వాత ఆరోగ్యం మరింత దెబ్బతింది. 1986లో ఒకరోజు బాత్రూమ్లో తల గోడకు తగిలింది. కొన్నాళ్లకు తల బొప్పి కట్టి మెదడులో రక్తం గడ్డకట్టడంతో స్పృహ తప్పి పడిపోయారు. ఆపరేషన్ చేసినప్పటికీ మళ్లీ అదే ప్రాంతంలో పుండు ఏర్పడంతో మరోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పటికే కోమాలో ఉన్న బాలి 1986 ఏప్రిల్ 21న కన్నుమూశాడు. వైజయంతి ప్రస్తుతం తన కొడుకుతో కలిసి నివసిస్తోంది. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్, షాక్‌లో ఫ్యాన్స్.. అనారోగ్య సమస్యలే కారణమా? త్వరలోనే అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. వేదిక ఎక్కడంటే! -
కారు డ్రైవర్‌ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్నా: ఏడ్చేసిన జయలలిత
రంగుల ప్రపంచంలో నటిగా రాణించిన జయలలిత నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ మనసిచ్చినవాడితో ఏడడుగులు వేసింది. కానీ పెళ్లి తర్వాత ప్రియుడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే ప్రేమను నటించాడని అర్థం అయింది. గృహ హింస తట్టుకోలేక విడాకులు తీసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. కుటుంబమంతా నాపై ఆధారపడటంతో.. 'నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. నేను పదో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యాను. మయూరి, సప్తపది సినిమా ఛాన్సులు చేతిదాకా వచ్చినట్లే వచ్చి వెనక్కు వెళ్లిపోయాయి. తర్వాత ఎందుకోగానీ అన్నీ వ్యాంప్ క్యారెక్టర్లే వచ్చాయి. అలా ఐటం సాంగ్స్ చేశాను, పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని నటించాను. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉండటంతో వచ్చిన ఆఫర్నల్లా ఒప్పుకుంటూ పోయాను. కానీ ఇలా ఐటం సాంగ్స్ చేయడం వల్ల క్లాసికల్ డ్యాన్స్‌కు దూరమయ్యాను. ఇంటిపై దాడి అయితే జయలలిత అనే పేరు నాకు తమిళనాడులో మైనస్ అయింది. జయలలిత అమ్మ పేరు పెట్టుకుని కమెడియన్‌గా చేస్తున్నావ్, ఐటం సాంగ్స్ చేస్తున్నావ్.. పేరు మార్చుకో అని ఆ పార్టీవాళ్లు మా ఇంటి మీద రాళ్లు రువ్వి దాడి చేశారు. నేను పేరు మార్చుకోననేసరికి అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ ఎలా మొదలైందంటే.. డేట్స్ విషయంలో పెద్ద గొడవ జరిగితే అతడు ముందుండి సమస్యను పరిష్కరించాడు. పెళ్లయిన తెల్లారినుంచే ఆస్తి కోసం గొడవ ఆ చిన్నదానికే లవ్‌లో పడిపోయాను. అతడి కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో! పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు.. తొందరపడుతున్నావని హెచ్చరించడంతో ఆలోచనలో పడ్డాను. కానీ అప్పటికే అతడు రక్తంతో లెటర్స్ రాయడం, విషం తాగి చస్తానని బెదిరించడంతో భయంతో గుడిలో పెళ్లి చేసుకున్నాను.పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆస్తి కోసం పోరు మొదలుపెట్టాడు. లేదంటే పిల్లల్ని కనమని వేధించాడు. పక్షవాతం.. నేనే డబ్బులు పంపించా ఇంట్లో తెలియకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి పిల్లలు పుట్టకుండా మూడు నెలలపాటు టాబ్లెట్స్ వేసుకున్నాను. డబ్బు తీసుకురా లేదంటే యాసిడ్ పోస్తానని అత్తింటివారు బెదిరించారు. రూ.50 లక్షలు, నా బంగారు నగలు సహా ఉన్నదంతా ఊడ్చేశారు. 6 నెలలకే మేము విడిపోయాం. ఇటీవలే రోడ్డుప్రమాదంలో గాయపడగా కాలికి పక్షవాతం వచ్చింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతబి భార్య సరిగా చూసుకోకపోవడంతో మందుల కోసం నెలకు రూ.5 వేలు పంపించాను. అమ్మా అమ్మా అంటూ రూ.4 కోట్లు కాజేశాడు ఈ మధ్య నేను సంపాదించిన రూ.4 కోట్లు పోగొట్టుకున్నాను. అనిల్ గణపతి రాజు.. రాఘవేంద్రరావు దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. రాఘవేంద్రరావుకు సంబంధించిన సీరియల్ చేసేటప్పుడు అనిలే ఇంటికి వచ్చి కారులో పిక్ చేసుకుని వెళ్లేవాడు. తర్వాత అతడు కుందనపు బొమ్మ అని సినిమా కూడా చేశాడు. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. అమ్మా అమ్మా.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేశాను. అయితే డబ్బులు బాగున్నాయని విసిరేస్తోందని నా వెనకాల తిట్టేవాడు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ సపోర్ట్ చేయలేదు' అని చెప్తూ ఎమోషనలైంది జయలలిత. చదవండి: పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించింది.. 35 ఏళ్లకే కెరీర్ ముగించింది! -
చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి
చెన్నై: సీనియర్ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించింది. రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని.. అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గౌతమికి శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పజెప్పింది. కానీ ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్ ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సాయంతో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమి ప్రశ్నించగా.. రాజకీయ అండతో నటిని, ఆమె కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమస్యల వల్ల తన కూతురి చదువు కూడా డిస్టర్బ్ అవుతోందని ఫిర్యాదులో పేర్కొంది గౌతమంది. తన నుంచి కొట్టేసిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్‌పై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గౌతమి ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి సుబ్బలక్ష్మి.. గౌతమి వద్దే ఉంటోంది. కాగా కొన్నేళ్లపాటు కమల్ హాసన్‌తోనూ కలిసి ఉన్న ఆమె 2016లో అతడితో విడిపోయింది. చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన యంగ్ హీరో.. ఫోటోలు వైరల్ -
మొదటి భర్తతో అందుకే విడిపోయా.. ఒంటరితనంతో డిప్రెషన్లో..
అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది. ఊర్వశి పర్సనల్ లైఫ్ ఊర్వశి 2000 సంవత్సరంలో నటుడు మనోజ్ కె.జయన్‌ను పెళ్లాడింది. వీరికి తేజ లక్ష్మి అనే కూతురు పుట్టింది. అయితే వీరి దాంపత్యజీవితం అంత సజావుగా సాగలేదు. 2008లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి చెన్నైవాసి శివప్రసాద్‌ను పెళ్లాడింది. వీరికి ఇషాన్ ప్రజాపతి అనే కొడుకు పుట్టాడు. అటు మనోజ్ కూడా మరొకరిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భర్త మనోజ్ కె.జయన్‌తో ఊర్వశి రోజూ మందు తాగేదాన్ని తాజాగా ఊర్వశి తన మొదటి పెళ్లి గురించి, విడాకులకు గల కారణాన్ని గురించి వెల్లడించింది. 'మనోజ్ నేను విడిపోవడానికి ఒకే ఒక కారణం తాగుడు అలవాటు. అతడి ఇంట్లో అందరూ మందు తాగుతారు. కుటుంబమంతా కలిసే తాగుతారు. నన్ను కూడా తాగమని బలవంతం చేసేవాడు. రోజూ తాగితాగి నేను కూడా తాగుబోతులా తయారయ్యాను. అతడి వల్లే నేను మందుకు బానిసయ్యాను. అదే మా విడాకులకు కారణమైంది. నా కూతుర్ని కూడా నాకు దక్కకుండా చేశాడు. రెండో భర్త శివప్రసాద్‌తో ఊర్వశి ఒంటరితనంతో డిప్రెషన్లోకి.. నేను మందుకు బానిసయ్యానని చెప్పి కూతురి బాధ్యతలను తనే తీసుకున్నాడు. ఒంటరిదాన్నైపోయాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చాలాకాలంపాటు నాలో నేనే కుమిలిపోయాను. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ శివప్రసాద్‌ను రెండో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఆ వయసులో పెళ్లేంటని చాలామంది విమర్శించారు. కానీ నేను వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు నా భర్త, కొడుకుతో సంతోషంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: కిక్ ఇచ్చేందుకు సంతానం రెడీ.. బ్రహ్మానందం, కోవై సరళతో పాటు.. శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను.. సినిమా ఎంట్రీకి ఆ ఫోటోనే కారణం: శ్రీలీల -
అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి
పోలీస్ వెంకటస్వామి అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది తెలుగమ్మాయి రక్ష అలియాస్ రాణి. దాదాపు పదేళ్ల తర్వాత జానీ వాకర్ అనే మలయాళ చిత్రంలో నటించింది. చిరునవ్వుల వరమిస్తావా మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ప్రవేశించింది. తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలే చేసింది. అయితే స్పెషల్ సాంగ్స్ వల్లే మరింత ఫేమస్ అయింది. అనంతరం నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథం.. ఇలా చాలా సినిమాల్లో నటిగా చేసి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈమె వెండితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఐటం సాంగ్స్.. ఇప్పుడు బాధేస్తోంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాను. హీరోయిన్గా క్లిక్ అవకపోయేసరికి ఐటం సాంగ్స్ చేశాను. అప్పుడు బాధనిపించలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తోంది. ఆ సాంగ్స్ చేయడం వల్లే నాకు తల్లి పాత్రలు రావడం లేదు. ఒక తమిళ డైరెక్టర్ ఈ మధ్యకాలంలో ఒక సినిమా చేశాడు. అందులో ఒక రోల్ ఆఫర్ చేశారు. నాకు పెళ్లై, పాప ఉంది.. గతంలోలాగా స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని బోల్డ్‌గా నటించమంటే నా వల్ల కాదు, మంచి పాత్ర అయితేనే చేస్తానని చెప్పాను. నీ సినిమా వద్దు.. ఏమీ వద్దు దానికతడు కూడా అలాంటిదేం లేదు, మంచి పాత్ర అని చెప్పాడు. తీరా సెట్‌కు వెళ్లాక బోల్డ్‌గా నటించమన్నాడు. అదేంటి? నేను చేయనని చెప్పాను కదా అని అడిగితే చేయమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఇబ్బంది పెడుతుండటంతో ఆయన చెంప చెళ్లుమనిపించి ఏంట్రా? ఏమనుకుంటున్నావ్ అసలు? నీ సినిమా వద్దు, ఏమీ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వినయ విధేయ రామ సినిమా కోసం బోయపాటి నాకు రోల్ ఆఫర్ చేయాలనుకున్నారు. కానీ మధ్యలో ఉన్నవాళ్లు.. ఆమె బిజీగా ఉంది, తను చేయదు అని చెప్పడంతో ఆ ఆఫర్ నాదాకా రాలేదు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది' అని రక్ష చెప్పుకొచ్చింది. చదవండి: నా జీవితంలో ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి, బోరున ఏడ్చిన యాంకర్.. ఆందోళనలో ఫ్యాన్స్ గ్రాండ్‌గా బ్రహ్మానందం తనయుడి పెళ్లి.. చిన్న కోడలు ఏం చేస్తుందో తెలుసా? -
మీరు ఒక్కరే రండి అనేవారు.. నాకు అర్థమయ్యేది కాదు: ఆమని
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని. తెలుగులో జంబలకిడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నటనలో అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణుకథ, అల్లంత దూరాన చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమని కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?) ఆమని మాట్లాడుతూ..'హీరోయిన్లలకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు. అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయి. హీరోయిన్స్‌గా అది మనం డెసిషన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివీ జరిగేవి. నాకు ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రెస్సు తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటి వారు కేవలం వాటి కోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్‌ను వద్దనేదాన్ని. ఈ విషయంలో హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయం. మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలంటా అని మేనేజర్ ఫోన్ చేసేవారు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి. ' అని అన్నారు. ఆమని ఓ సంఘటనపై మాట్లాడుతూ..' అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి మైండ్‌సెట్ అర్థమయ్యేది. ఐ యామ్ సారీ.. నేను రాను అని చెప్పేదాన్ని. ' అంటూ సమామాధానమిచ్చింది. (ఇది చదవండి: భార్యతో స్టార్ హీరో విడాకులు.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!) -
తెలుగులో స్టార్ హీరోయిన్.. క్యాన్సర్ సోకి.. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దుస్థితి!
సినిమాల్లో స్టార్డమ్ వస్తే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చనుకుంటారు. కానీ అది కొంతకాలమే! స్టార్డమ్ ఉన్నన్నాళ్లూ దాన్ని అనుభవిస్తారు. అది పోయిన తర్వాత ఏకాకిగా మారుతారు. వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న అందాల తార అశ్విని జీవితంలోనూ ఇదే జరిగింది. వెండితెరపై వెలుగు వెలిగిన ఈమె అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూసింది. ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? తన జీవితం ఎలా ముగిసింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. తెలుగులో 40కు పైగా సినిమాలు నెల్లూరుకు చెందిన అశ్విని 1967 జూలై 14న జన్మించింది. భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. తొలి సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె కొంతకాలానికే హీరోయిన్గా మారింది. వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్ మాస్టర్, నాగార్జునతో అరణ్యకాండ చిత్రాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 110కి పైగా చిత్రాలు చేసింది. పెళ్లి చేసి చూడు, ఇంటి దొంగ, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు.. ఇలా ఒక్క తెలుగులోనే 40కి పైగా సినిమాలు చేసింది. సీక్రెట్‌గా పెళ్లి.. కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తీక్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకుని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్‌లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్లోనూ కనిపించలేదు. ఇంటిని అమ్మేసి అద్దె ఇంట్లో బతుకుబండి.. వంద సినిమాలు చేసిందన్న మాటే కానీ తనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉండేదట! చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం. 2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఓ సీరియల్‌కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని తుదిశ్వాస విడిచింది. ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవడంతో దర్శకుడు పార్తీబన్ ఆర్థిక సాయం చేశాడు. తన నటనతో అందరికీ వినోదాన్ని పంచిన ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది. పెళ్లిపత్రిక పంపింది అశ్విని గురించి డైరెక్టర్ పార్తీబన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'పొందట్టి తెవై సినిమాకు నేను వేరే హీరోయిన్ను అనుకున్నాను. కానీ ఆమె డేట్స్ ఇవ్వకపోవడంతో అశ్వినిని తీసుకున్నాం. తను బాగా సెట్టయింది. ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత నేను మళ్లీ ఆమెను కలవలేదు. అయితే మధ్యలో తన పెళ్లిపత్రిక పంపించింది. కవి, రచయిత పువియరుసు మనవడిని పెళ్లాడుతున్నట్లు తెలిపింది. నేను అవుట్డోర్ షూటింగ్లో ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఓసారి నా కుమారుడు రాధాకృష్ణన్ తన స్నేహితుడు కార్తీక్ తల్లి ఆస్పత్రిలో ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు. ఆమె మరెవరో కాదు, అశ్విని అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చివరికి 2012 సెప్టెంబర్ 23వ తేదీన 45 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆమె కన్నుమూసింది. తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను' అని చెప్పాడు. చదవండి: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న హీరోయిన్, పెళ్లికొడుకు ఎవరో తెలుసా?