series
-
#Shalini Passi లేటెస్ట్ సిరీస్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా సెన్సేషన్ (ఫోటోలు)
-
India vs Sri Lanka: భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 27 ఏళ్ల తర్వాత (ఫోటోలు)
-
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
అలనాటి అందాల కింగ్ ఆఫ్ రోడ్... ఫోటోలు చూస్తే ఫిదా
-
WI vs IND 3rd ODI: విండీస్‌పై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
10 Best KTM Bikes: టాప్ 10 బెస్ట్ కేటీఎమ్ మోటార్ సైకిల్స్
-
భారత మహిళలకు చేజారిన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ మహిళలతో చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయలక్ష్యం 226 పరుగులు...41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులే కావాలి. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (108 బంతుల్లో 77; 9 ఫోర్లు), దీప్తి శర్మ (1) ఒకే ఓవర్లో రనౌటయ్యారు. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును సమం మాత్రమే చేయగలిగింది. చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 33 నాటౌట్) మరో ఎండ్‌లో ఉండగా...చివరి ఓవర్ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్ చేసింది. దాంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ కాగా... అంతకు ముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్ 1–1తో ‘డ్రా’ అయింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (85 బంతుల్లో 59; 5 ఫోర్లు) రాణించింది. స్మృతి, హర్లీన్ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14; 2 ఫోర్లు) నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్‌కు రెండు చొప్పున నాలుగు వికెట్లు కోల్పోవడం భారత్ గెలుపురాతను మార్చింది. అంతకు ముందు ఫర్జానా హక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు), షమీమా సుల్తానా (78 బంతుల్లో 52; 5 ఫోర్లు) బంగ్లా స్కోరులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఫర్జానా నిలిచింది. చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్‌లో అవుటయ్యాక హర్మన్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ‘ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. -
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
బీ న్యూ స్టోర్లలో రియల్మీ 11ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చెయిన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బీ న్యూ స్టోర్‌లో గురువారం నటి వర్ష బొల్లమ్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. బజాజ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్డీబీ, బీనౌ, క్లెవర్పే ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జీరో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని బీ న్యూ స్టోర్ సీఎండీ బాలాజీ చౌదరి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్‌తో పాటు రియల్మీ సౌతిండియా సేల్స్ హెడ్ వేణు మాధవ్‌లు పాల్గొన్నారు. -
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
సింగం సిరీస్ లో..సూర్య,అజయ్ దేవగన్
-
టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది
భారత్ లక్ష్యం 216 పరుగులే...కానీ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై షాట్లు ఆడటమే కష్టంగా మారిపోయింది.. ఇలాంటి స్థితిలో విజయం కోసం భారత్ 43వ ఓవర్ వరకు శ్రమించింది... స్వల్ప ఛేదనలోనూ కాస్త తడబడినా, రాహుల్ పట్టుదలగా నిలబడటంతో చివరకు భారత్ గెలుపును అందుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు సిరాజ్, కుల్దీప్లు చక్కటి బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టిపడేశారు. దాంతో కనీస స్కోరు కూడా సాధించలేక శ్రీలంక చేతులెత్తేసింది. కోల్‌కతా: టి20 మ్యాచ్‌లోనే 228 పరుగులు నమోదై వారం కూడా కాలేదు. అదే వన్డేలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. శ్రీలంక కనాకష్టంగా స్కోరు చేయగా, దానిని ఛేదించేందుకు భారత్ 6 వికెట్లు చేజార్చుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్లతో శ్రీలంకను ఓడించింది. మొదట శ్రీలంక 39.4 ఓవర్లలోనే 215 పరుగుల వద్ద ఆలౌటైంది. నువనిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్, సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. సిరీస్ 2–0తో భారత్ గెలుచుకోగా, చివరి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది. భుజం గాయంతో దూరమైన చహల్ స్థానంలో కుల్దీప్ ఈ మ్యాచ్‌లోకి వచ్చాడు. రాణించిన నువనిదు అవిష్క ఫెర్నాండో (20; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అరంగేట్రం చేసిన నువనిదు ఫెర్నాండో పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. తన ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన అవిష్కను సిరాజ్ మరుసటి ఓవర్లో బౌల్డ్ చేశాడు. తర్వాత కుశాల్, నువనిదు ఓవర్‌కు 6 పైచిలుకు రన్‌రేట్‌తో జట్టు స్కోరును వంద పరుగులకు చేర్చారు. అంతలోనే కుశాల్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)ను కుల్దీప్ ఎల్బీగా పంపడంతో 73 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత స్పిన్, పేస్‌ల వైవిధ్యం లంకను కుదురుకోనివ్వలేదు. ధనంజయ (0)ను అక్షర్ డకౌట్ చేయగా, అసలంక (15), కెపె్టన్ షనక (2)లను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. హసరంగ (21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటికి ఉమ్రాన్ బ్రేకులేయగా, లోయర్ ఆర్డర్లో దునిత్ వెలలగే (34 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్కోరుతో లంక కష్టంగా 200 పరుగులు దాటింది. హార్దిక్ సహకారం లక్ష్యం చిన్నదే అయినా గెలుపు సులువుగా ఏమీ రాలేదు. గత మ్యాచ్ ‘టాప్ 3’ రోహిత్ (17; 2 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 21; 5 ఫోర్లు), కోహ్లి (4) తొలి పది ఓవర్లలోపే అవుటైతే గానీ పిచ్ సత్తా తెలియలేదు. 62 పరుగులకే వీళ్లంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. మిగిలిన ప్రధాన బ్యాటర్స్ ముగ్గురే... అయ్యర్, రాహుల్, పాండ్యా! కానీ లక్ష్యదూరం మాత్రం 154 పరుగులు. కీలక దశలో శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. అయితే రాహుల్, హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించింది. 161 స్కోరు వద్ద పాండ్యా అవుటైనా... రాహుల్ కడదాకా నిలబడ్డాడు. అక్షర్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), కుల్దీప్ (10 నాటౌట్; 2 ఫోర్లు)లతో కలిసి జట్టును గెలిపించాడు. 93 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (బి) సిరాజ్ 20; నువనిదు రనౌట్ 50; మెండిస్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 34; ధనంజయ (బి) అక్షర్ 0; అసలంక (సి) అండ్ (బి) కుల్దీప్ 15; షనక (బి) కుల్దీప్ 2; హసరంగ (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 21; దునిత్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 32; కరుణరత్నే (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 17; రజిత నాటౌట్ 17; లహిరు (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–29, 2–102, 3–103, 4–118, 5–125, 6–126, 7–152, 8–177, 9–215, 10–215. బౌలింగ్: షమీ 7–0–43–0, సిరాజ్ 5.4–0–30–3, పాండ్యా 5–0–26–0, ఉమ్రాన్ 7–0–48–2, కుల్దీప్ 10–0–51–3, అక్షర్ 5–0–16–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మెండిస్ (బి) కరుణరత్నే 17; గిల్ (సి) అవిష్క (బి) లహిరు 21; కోహ్లి (బి) లహిరు 4; అయ్యర్ (ఎల్బీ) (బి) రజిత 28; రాహుల్ నాటౌట్ 64; పాండ్యా (సి) మెండిస్ (బి) కరుణరత్నే 36; అక్షర్ (సి) కరుణరత్నే (బి) ధనంజయ 21; కుల్దీప్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.2 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–33, 2–41, 3–62, 4–86, 5–161, 6–191. బౌలింగ్: కసున్ రజిత 9–0–46–1, లహిరు 9.2–0–64–2, కరుణరత్నే 8–0–51–2, హసరంగ 10–0–28–0, దునిత్ 2–0–12–0, షనక 2–0–6–0, ధనంజయ 3–0–9–1. చదవండి: IND vs SL: సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. -
శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్‌కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్‌బెంచ్‌లో లీక్ అయ్యాయి. మల్టీ-కోర్ టెస్ట్‌లో 750 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్ బెంచ్ తెలిపింది. Exynos 1380 చిప్సెట్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే, గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ ఎం54 5 జీ ఫీచర్లు అంచనా 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13,1080 x 2412 రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్ప్లే 64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధర గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా. -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు
Robert Pattinson Batman Movie Runs Nearly 3 Hours: ప్రపంచవ్యాప్తంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలకు ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. హాలీవుడ్లో సూపర్ హీరోస్ మూవీస్ సహజమే. మిగతా సూపర్ హీరోస్‌కు పవర్స్ అనుకోకుండా జరిగే పలు సంఘటనల ద్వారా వస్తాయి. కానీ బ్యాట్ మ్యాన్ మాత్రం తనకు తాను సొంతగా సూపర్ హీరోల మారతాడు. అది ఎలానో 2005లో వచ్చిన 'బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' చిత్రం చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బ్యాట్‌మ్యాన్ సిరీస్ కొత్త చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్: ది బ్యాట్ అండ్ ది క్యాట్' ట్రైలర్ విడుదలైంది. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్‌గా మారింది. ఇందులో సూపర్ హీరోగా 'ట్విలైట్' మూవీ ఫేమ్ రాబర్ట్ ప్యాటిన్సన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిడివి ఈ సిరీస్‌లోని మిగతా చిత్రాలకంటే ఎక్కువగా ఉండనుందట. ఈ సిరీస్‌లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' రన్‌టైం 2 గంటల 20 నిమిషాలు, 'ది డార్క్‌నైట్' నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉంది. వీటి తర్వాత 2012లో వచ్చిన 'ది డార్క్‌నైట్ రైజెస్' మూవీ రన్‌టైం 2 గంటల 45 నిమిషాలు ఉంది. కాగా ప్రస్తుతం రానున్న 'ది బ్యాట్ అండ్ ది క్యాట్' చిత్ర నిడివి సుమారు 2 గంటల 55 నిమిషాలు ఉండనుందట. అంటే దాదాపు 3 గంటలు. (చదవండి: నా కొడుకు హృతిక్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్) హాలీవుడ్లో విడుదలైన సూపర్ హీరో చిత్రాలు 'జాక్ స్నైడర్ జస్టీస్ లీగ్' రన్‌టైం 4 గంటల 2 నిమిషాలు, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' నిడివి 3 గంటల 1 నిమిషం తర్వాత అతి పెద్ద రన్‌టైం ఉన్న సినిమా ఇదేనని సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు విడుదలైన రెండు ట్రైలర్స్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. -
పాకిస్తాన్‌కు మరో షాక్.. సిరీస్‌ను రద్దు చేసుకున్న ఇంగ్లండ్
-
వెబ్ సిరీస్: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ
లాంగ్వేజ్ : హిందీ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) ఎపిసోడ్స్ : మొత్తం 9 ఎపిసోడ్స్ (ఒక్కొక్కటి 40 నిమిషాలపైనే) ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో కాస్టింగ్ : మనోజ్ వాజ్‌పాయి, సమంత అక్కినేని, షరీబ్ హష్మీ, షహబ్ అలీ, దర్శన్ కుమార్, అశ్లేష థాకూర్, మైమ్ గోపీ, దేవదర్శిని, అలగమ్ పెరుమాల్ తదితరులు క్రియేటర్స్ : డీకే & రాజ్ సొసైటీలో అసాంఘిక శక్తులు అలజడుల కోసం ప్రయత్నించడం.. సీక్రెట్ ఏజెంట్ అయిన హీరో సాధారణ వ్యక్తి ముసుగులో ఆ కుట్రలను అడ్డుకుని, ఆ అసాంఘిక శక్తుల్ని మట్టుపెట్టడం ఇప్పటివరకు మన సినిమాల్లో చూస్తున్నదే. అయితే దానికి వెబ్ సిరీస్‌గా మలిచి.. డీకే అండ్ రాజ్‌లు చేసిన ప్రయత్నమే ఫ్యామిలీమ్యాన్. లోకల్ జేమ్స్ బాండ్ ట్యాగ్ లైన్‌తో ఫ్యామిలీమ్యాన్ ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో.. రెండో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కీ రోల్ పోషిస్తుండడంతో సౌత్‌లోనూ ఈ అమెజాన్ ప్రైమ్ సిరీస్ పట్ల ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి.ఈ తరుణంలో తొలుత కేవలం హిందీ భాషలోనే ఫ్యామిలీమ్యాన్ 2 ను రిలీజ్ చేసి వ్యూయర్స్‌ని నిరుత్సాహపరిచింది అమెజాన్ ప్రైమ్. అయినప్పటికీ రెండో సీజన్ ఏమేర ఆకట్టుకుందో చూద్దాం. కథ.. ఉత్తర శ్రీలంకలో కొన్నేళ్ల క్రితం.. తమిళ రెబల్స్ శిబిరంపై అక్కడి ఆర్మీ దాడి చేయడం, కీలక నేతల పారిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. కట్ చేస్తే.. ఆలస్యంగా ఆఫీస్‌కు వెళ్లి బాస్‌తో క్లాస్‌లు పీకించుకునే ఐటీ జాబ్‌లో చేరతాడు శ్రీకాంత్ తివారి. అయితే, గతంలో టాస్క్ (థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్)లో సీనియర్ ఏజెంట్ అయిన శ్రీకాంత్ ఆ జాబ్‌ను ఆస్వాదించలేకపోతాడు. ఇక టాస్క్‌లో తన కొలీగ్, ఆప్తుడు అయిన జేకే తల్పాడే ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద చెన్నై వెళ్తాడు. అప్పటిదాకా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న శ్రీలంక తమిళ రెబల్స్ ఓ భారీ కుట్రకు పాల్పడుతున్నారని తల్పాడేకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్రీకాంత్‌తో చెప్పడం, అదే టైంలో ఇంట్లో గొడవ కారణంగా శ్రీకాంత్ టాస్క్‌లో చేరడం చకచకా జరుగుతాయి. మరోవైపు తమిళ రెబల్ కమాండర్ రాజ్యలక్ష్మి శేఖరన్ అలియాస్ రాజీ తాను అనుకున్న పనిని సీక్రెట్‌గా చేసుకుంటూ పోతుంటుంది. ఈ క్రమంలో ఆమె ఉనికిని పసిగట్టిన పోలీసులు, టాస్క్ టీం ఆమెను బంధిస్తారు. అయితే మెరుపుదాడితో ఆమెను రెబల్స్ విడిపించుకునే ప్రయత్నంలో రాజీ గాయపడుతుంది. మరోవైపు శ్రీకాంత్ కూతురిని ఓ కుర్రాడి సాయంతో ట్రాప్ చేసి.. కిడ్నాప్ చేసి రెబల్స్ తాము అనుకుంటున్న పని చేసుకుపోవాలనుకుంటారు. చివరికి శ్రీకాంత్ తన కూతురిని కాపాడుకోగలుగుతాడా? తమిళ రెబల్స్-రాజీ కుట్రను శ్రీకాంత్ టీం ఎలా అడ్డుకుంటుంది? అనేది కథ. విశ్లేషణ శ్రీకాంత్ పున పరిచయం, ఫ్యామిలీ డ్రామాతో తొలి రెండు ఎపిసోడ్స్ నిదానంగా నడుస్తాయి. రెండో ఎపిసోడ్ తర్వాతి నుంచి అసలు కథ మొదలవుతుంది. నాలుగో ఎపిసోడ్ చివరి నుంచి కథ పరుగులు పెడుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ బిగి సడలని కథనంతో ఆకట్టుకుంది. తమిళ రెబల్స్ కుట్రలకు ప్లాన్, ట్రేస్ చేయడం, మధ్యలో లీడర్ క్యారెక్టర్ ఫ్యామిలీకి ఇబ్బందులు, ఆ కుట్రలు శ్రీకాంత్ టీం భగ్నం చేయడం, చివరికి రిస్క్ చేసి శత్రువుల్ని మట్టుపెట్టడం.. ఇలా కథలో అంశాలున్నాయి. అయితే ఇవేవీ స్పై తరహా కథల్లోలాగా థ్రిల్ చేయకపోయినప్పటికీ.. వ్యూయర్స్‌ను ఎంగేజ్ మాత్రం చేస్తాయి. నటనపరంగా.. ఏజెంట్ శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ మరోసారి ఆకట్టుకుంటాడు. కుటుంబం కోసం, దేశం కోసం.. నలిగిపోయే పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా మిలింద్ చనిపోయాక భార్యతో ఫొన్లో మాట్లాడుతూ ఏడ్చేసే సీన్ హైలైట్. ఇక సమంతది ప్రతినాయిక పాత్రే. అయినప్పటికీ సామూహిక అత్యాచారానికి గురై, తమ్ముడ్ని కోల్పోయిన బాధితురాలిగా, జాతి గౌరవం కోసం పోరాడే రెబల్ కమాండర్‌గా రాజీ క్యారెక్టర్ అలరిస్తుంది. డేరింగ్ అండ్ బోల్డ్ పాత్రలో రాజ్యలక్ష్మి అలియాస్ రాజీగా సమంత నటన కొత్తగా అనిపించినా.. గుర్తుండిపోతుంది. ఇక శ్రీకాంత్ కుడిభుజంగా జేకే రోల్లో షరీబ్ నటన మెప్పిస్తుంది. కిందటి సీజన్ మాదిరే ఇద్దరి మధ్య పంచ్‌లు పేలాయి. శ్రీకాంత్ కూతురి రోల్లో అశ్లేష థాకూర్ మెప్పించింది. నటి దేవదర్శికి, షరీబ్కి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఫర్వాలేదు. ప్రియమణి, శరద్ ఖేల్కర్ ఫర్వాలేదనిపించారు. కోలీవుడ్ తారాగణం రవీంద్ర విజయ్, మైమ్ గోపి, అజగమ్ పెరుమాళ్ తమదైన నటనతో మెప్పించారు. టెక్నీషియన్స్ పనితనం.. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 హంగులు లేకున్నా ఆకట్టుకోవడానికి కారణం బ్రిసన్ అందించిన సినిమాటోగ్రఫ్రీ. ఈ కథలో చాలా సీన్లను(క్లైమాక్స్‌తో సహా) సింగిల్ టేక్‌లో షూట్ చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక సచిన్ జిగార్, కేతన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. యాక్షన్ పార్ట్‌లో శ్రీకాంత్ టీం, రాజీ టీం మధ్య సహజమైన యాక్షన్ సన్నివేశాలు.. రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. కథలో భాగమైన ‘ఫ్యామిలీ’ డ్రామా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికీ తొలి సీజన్‌తో పోలిస్తే ఇందులో తక్కువే ఉందని చెప్పొచ్చు. ఇక దేశ భక్తి, పంచ్ డైలాగులతో పాటు కథ, కథనాలు, తమిళ సీక్వెన్స్‌ను మేళవించి తొలిసీజన్ మాదిరిగానే ఫ్యామిలీమ్యాన్ 2ను ఆసక్తిిగా తీర్చిదిద్దారు రాజ్ అండ్ డీకే. -
వన్స్‌మోర్ వార్నర్.. ‘బుట్టబొమ్మ’
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 66 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రారంభమైన ఈ వన్డే సిరిస్‌కు తొలిసారి ఆడియెన్స్‌ని అనుమతించారు. సిడ్నీ, కాన్బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని అనుమతించారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి వన్స్‌మోర్ వార్నర్ బుట్టబొమ్మ అంటూ కేకలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. లాక్డౌన్ సమయంలో అన్ని టోర్నిలు నిలిచిపోవడంతో క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో టిక్‌టాక్‌లు చేస్తూ వార్నర్ కుటుంబం అభిమానులకు దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే ‘బుట్టబొమ్మ’, ‘మైండ్‌బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్ చేసి టాలీవుడ్ ఫ్యాన్స్‌కు చేరువయ్యారు వార్నర్. ఈ నేపథ్యంలో నేడు మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు ‘వన్స్‌మోర్ వార్నర్.. బుట్టబొమ్మ’ అంటూ అరిచారు. (చదవండి: జంపా.. ఆర్సీబీ గుర్తొచ్చిందా?) ఇక ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్‌లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. -
సినిమానే సిరీస్‌గా.!
హిందీ సినిమా ‘తైష్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రయోగాత్మకంగా... ఈ సినిమా ఒకే రోజు సినిమాగా, సిరీస్‌గా విడుదలవుతుందట. పులకిత్ సామ్రాట్, జిమ్ షరాబ్, క్రితీ కర్భంధా ముఖ్య పాత్రల్లో దర్శకుడు బీజోయ్ నంబియార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘తైష్’. అక్టోబర్ 29న జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. ‘తైష్’ రెండున్నర గంటల సినిమాలా, 6 ఎపిసోడ్ల మినీ సిరీస్‌లో అందుబాటులో ఉంటుందట. ఈ నిర్ణయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ –‘‘గతంలో సినిమాగా రూపొందించిన సిరీస్‌గా ఎడిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మా చిత్రాన్ని థియేటర్ కోసం తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తయ్యాక టెస్ట్ స్క్రీనింగ్ (అతికొద్ది మందికి సినిమా ప్రదర్శించి ఫలితాన్ని సమీక్షించుకోవడం) నిర్వహించాం. సినిమా బావుంది. ఇందులో పాత్రల గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించింది అని కొందరు అనడంతో సిరీస్ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను అలానే ఉంచి, సిరీస్‌గా ఎలా మలచగలం అని ఆలోచించి దానికి అనుగుణంగా ఎడిటింగ్ చేశాం. ఏది కావాలనుకున్నవాళ్లు అది ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. -
కివీస్ ఇక బిజీ బిజీ
ఆక్లాండ్: ఇన్నాళ్లూ కరోనా వల్ల సొంతగడ్డపై క్రికెట్ టోర్నీలకు దూరమైన న్యూజిలాండ్‌లో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం కానుంది. నవంబర్‌లో వెస్టిండీస్ సిరీస్ మొదలు... వరుసగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో బిజీ బిజీగా క్రికెట్ ఆడనుంది. మంగళవారం దీనికి సంబంధించిన షెడ్యూలును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందుగా కరీబియన్, పాకిస్తాన్‌లు పర్యటించేందుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని, ఆ తర్వాత ఆసీస్, బంగ్లా సిరీస్‌లకు లభిస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వెల్లడించారు. తొలుత విండీస్‌తో నవంబర్ 27, 29, 30 తేదీల్లో మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 3–7, 11–15 వరకు రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ఇది ముగిసిన వెంటనే పాక్‌తో 18 నుంచి మొదలయ్యే మూడు టి20ల సిరీస్‌లో పాల్గొంటుంది. అనం తరం రెండు టెస్టుల సిరీస్ డిసెంబర్ 26 నుంచి జరుగుతుంది. ఫిబ్రవరిలో ఆసీస్‌తో, మార్చిలో బంగ్లాదేశ్‌లో ముఖాముఖి సిరీస్‌లు ఉంటాయి. -
ఇక ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’
లండన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ, చాపెల్–హ్యడ్లీ ట్రోఫీ, వార్న్–మురళీధరన్ ట్రోఫీ తరహాలో ఇప్పుడు మరో సిరీస్‌ను ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్లతో వ్యవహరించనున్నారు. వెస్టిండీస్– ఇంగ్లండ్ జట్ల మధ్య ఇకపై జరిగే టెస్టు సిరీస్‌లను ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’ పేరుతో వ్యవహరిస్తారు. ప్రపంచ క్రికెట్‌పై తమదైన ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు స్టార్లను తగిన విధంగా గౌరవించుకునేంందుకు ఇరు బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్టిండీస్–ఇంగ్లండ్ మధ్య జరిగే తర్వాతి టెస్టు సిరీస్ నుంచి ఈ ట్రోఫీ పేరును ఉపయోగిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే సిరీస్‌ను ఇప్పటి వరకు ‘విజ్డన్ ట్రోఫీ’గా వ్యవహరిస్తున్నారు. ‘క్రికెట్ బైబిల్’గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత మ్యాగజైన్ ‘విజ్డన్’ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1963లో ఇరు జట్ల బోర్డులు కలిపి పెట్టిన పేరు ఇన్నేళ్లు కొనసాగింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు ‘విజ్డన్ ట్రోఫీ’లో చివరిది కానుంది. -
విజయంపై విండీస్ గురి
అనూహ్య పరిస్థితుల్లో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించే అద్భుత అవకాశం వెస్టిండీస్ ముందు నిలిచింది. నాలుగో రోజు చివరి గంట ముందువరకు సాఫీగా ఇన్నింగ్స్ సాగిస్తూ పైచేయి సాధించినట్లు కనిపించిన ఇంగ్లండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ‘డ్రా’కే ఎక్కువ అవకాశాలు కనిపించిన మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు చెలరేగి ఆటను మలుపు తిప్పారు. మ్యాచ్ చివరి రోజు ఆదివారం విండీస్ ఎంత లక్ష్యాన్ని ఛేదించగలదనేది ఆసక్తికరం. సౌతాంప్టన్: శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో ఇంగ్లండ్ స్కోరు 249/3. కానీ విండీస్ బౌలర్ల విజృంభణతో అంతా మారిపోయింది. 30 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ప్రత్యర్థికి విజయావకాశాన్ని అందించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 104 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (127 బంతుల్లో 76; 8 ఫోర్లు), డామ్ సిబ్లీ (164 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ బెన్ స్టోక్స్ (79 బంతుల్లో 46; 6 ఫోర్లు), రోరీ బర్న్స్ (104 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ఆర్చర్ (5 బ్యాటింగ్), వుడ్ (1 బ్యాటింగ్) ఉన్నారు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్ 3 వికెట్లు పడగొట్టగా... జోసెఫ్, ఛేజ్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు మిగిలిన 2 ఇంగ్లండ్ వికెట్లను తొందరగా తీసి 200లోపు లక్ష్యం ఉంటే విండీస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీలక భాగస్వామ్యాలు... ఇంగ్లండ్ స్కోరులో ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ చెప్పుకోదగ్గ స్కోరుతో తమ వంతు పాత్ర పోషించారు. నాలుగో రోజు ఆటను కొనసాగిస్తూ ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. ఈ క్రమంలో వీరిద్దరి కొన్ని చక్కటి షాట్లు ఆడారు. లంచ్‌కు కొద్ది సేపు ముందు ఎట్టకేలకు బర్న్స్‌ను అవుట్ చేసి ఛేజ్ ఈ భాగస్వామ్యానికి తెర దించాడు.తొలి సెషన్లో 30 ఓవర్లలో ఇంగ్లండ్ 64 పరుగులు చేసింది. రెండో సెషన్లో 161 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి సిబ్లీ వెనుదిరగ్గా... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి డెన్లీ (29) అవుటయ్యాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ 30 ఓవర్లలో 89 పరుగులు చేయగా, విండీస్ 2 వికెట్లు పడగొట్టగలిగింది. టీ విరామం తర్వాత క్రాలీతో కలిసి కెప్టెన్ స్టోక్స్ ధాటిగా ఆడాడు. 80 బంతుల్లో క్రాలీ అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకోగా... 19వ బంతికి తొలి పరుగు తీసిన స్టోక్స్ ఆ తర్వాత జోరు పెంచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. అయితే కొత్త బంతితో విండీస్ దెబ్బ కొట్టింది. వరుస ఓవర్లలో స్టోక్స్, క్రాలీలను అవుట్ చేసి పైచేయి సాధించింది. ఆ వెంటనే బట్లర్ (9) కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం బెస్ (3), పోప్ (12) లను అవుట్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 12.3 ఓవర్ల వ్యవధిలో అంతా మారిపోయింది. -
బంగ్లాదేశ్, పాకిస్తాన్ సిరీస్ రద్దు
కరాచీ: కరోనా (కోవిడ్–19) దెబ్బకు వచ్చే నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే, టెస్టు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మధ్య ఏకైక వన్డే ఏప్రిల్ 1న జరగాల్సి ఉండగా... ఫిబ్రవరిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌కు కొనసాగింపుగా రెండో టెస్టు ఏప్రిల్ 5 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అవి ఎప్పుడు జరుగుతాయనే విషయంపై సమాచారం లేదు. మార్చి 24 నుంచి జరగాల్సిన పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ టోర్నీ పాకిస్తాన్ కప్ వన్డే టోర్నమెంట్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఇప్పటికే కుదింపుతో సాగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) క్రికెట్ టోర్నీకి మరో షాక్ తగిలింది. కరోనా భయంతో ఈ లీగ్‌ను వదిలిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), డేవిడ్ వీస్ (ఆస్ట్రేలియా), సెక్కుగె ప్రసన్న (శ్రీలంక) కూడా చేరారు. -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ రద్దు
సిడ్నీ: ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి రెండు వన్డేలతోపాటు మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను కూడా అర్ధంతరంగా రద్దు చేసింది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. మోచేతులను తాకించుకుంటూ అభినందించుకున్నారు. -
‘తొలి అడుగు టీమిండియా సిరీస్‌తోనే’
చెస్టర్ లీ స్ట్రీట్ : మొన్నటివరకు ఎవరికీ తెలియని నికోలస్ పూరన్.. ఒక్క ఇన్నింగ్స్‌తో హీరో అయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో కరేబియన్ స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. నికోలస్ పట్టువదలని విక్రమార్కుడిలా శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించినంత పనిచేశాడు. అయితే చివర్లో లంక బౌలర్లు రాణించడంతో ప్రపంచకప్‌లో విండీస్ వరుసగా ఆరో ఓటమి చవిచూసింది. అయితే నికోలస్ ఒంటరి పోరాటానికి విండీస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నెటిజన్లు ఇప్పుడే అతడిని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారాతో పోల్చుతున్నారు. కాగా, ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో కరేబియన్ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారని భావించినా అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే గెలుపుకంటే ఓటమితో ఎన్నో నేర్చుకుంటామని శతక వీరుడు నికోలస్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు. ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగబోయే సిరీస్‌లో తమ ప్రతాపాన్ని చూపుతామని నికోలస్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను ఆ సిరీస్‌లో పునరావృతం చేయబోమని, విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. (చదవండి: 8 నెలల తర్వాత బౌలింగ్.. తొలి బంతికే.!) ‘ప్రపంచకప్‌లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఓ ఆటగాడిగా చెప్పాలంటే.. గెలుపులో కంటే ఓటమిలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోవచ్చు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లోనూ(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక) గెలుపు చివరంచున బోల్తా పడ్డాము. ప్రస్తుతం జట్టులో చాలా మంది యువకులమే ఉన్నాము. ఈ టోర్నీతో చాలా నేర్చుకున్నాము. ఇక నా వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడే నన్ను ఒకరితో(బ్రయాన్ లారా) పోల్చడం తగదు. టీమిండియాతో త్వరలో జరగబోయే సిరీస్‌పై దృష్టి పెడతాం. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను టీమిండియా సిరీస్‌లో పునరావృతం చేయబోము. విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం. దానికి తొలి అడుగు ఈ సిరీస్‌తోనే మొదలెడతాం’అంటూ నికోలస్ వ్యాఖ్యానించాడు.