Shakalaka Shankar
-
భవనమ్లో థ్రిల్
సప్తగిరి, ధనరాజ్, ‘షకలక’ శంకర్, అజయ్, మాళవికా సతీషన్, స్నేహా ఉల్లాల్ ముఖ్య తారలుగా రూ΄÷ందిన చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్బీ చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూ΄÷ందించిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాలవారూ ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కించిన ‘భవనమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
నా పక్కన రెండు దెయ్యాలు కూర్చున్నాయి.
-
OMG Review: ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: OMG (ఓ మంచి ఘోస్ట్)నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.నిర్మాత: డా.అబినికా ఇనాబతునిదర్శకుడు: శంకర్ మార్తాండ్సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూఎడిటర్: ఎం.ఆర్.వర్మవిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్).. ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన తన మేన మరదలు, స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు(నాగినీడు) కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కిర్తీకి కూడా ఓ సమస్య ఉంటుంది? అటు దెయ్యం, ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసినవాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ, ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఓ మంచి ఘోస్ట్ కూడా ఆ జానర్లో తెరకెక్కిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే.. భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా..ప్రతీది పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో.. రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కిడ్నాప్ డ్రామ అంతగా ఆకట్టుకోదు. నలుగురి గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ.. అతన్ని దెయ్యం అనుకొని ఆ నలుగు భయపడే సన్నివేశాలు.. ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు.. ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే.. మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. -
మంచి కామెడీ దెయ్యం
నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్‌గారు స్టోరీ నరేట్ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్స్ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్‌లో సాయం చేసిన దర్శకుడు రితేష్ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్ మార్తాండ్. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్’’ అన్నారు అబినికా ఇనాబతుని. -
ఓఎమ్‌జీ టీజర్: 'అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖికి చెల్లివైనా..'
‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం టీజర్ ఆరంభమవుతుంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా..’ అంటూ వెన్నెల కిశోర్ చేసే కామెడీ, ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీతో ఈ టీజర్ సాగుతుంది. ఘోస్ట్ క్యారెక్టర్లో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా కనిపించారు. హారర్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమీ గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మించారు. శనివారం ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘త్వరలో ‘ఓఎమ్‌జీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సరికొత్త దళారి
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో శ్రీతేజ్, అక్సా ఖాన్, రూపిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది’’ అన్నారు. ‘‘దళారి’ని రెండు భాగాలుగా తీశాం. ఇప్పుడు తొలి భాగం రిలీ జవుతోంది. ఇందులో మంచి కథ, యాక్షన్ ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ బాగా వచ్చింది’’ అన్నారు ‘షకలక’ శంకర్. ‘‘ఒక ఊరిలోని వెంకట్ రెడ్డి అనే వ్యక్తి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఈ సినిమా కథ చేశాం’’ అన్నారు కాచిడి గోపాల్‌రెడ్డి. ‘‘త్వరలోనే దళారి 2’ చేస్తాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. -
మార్చిలో దళారి
‘షకలక’ శంకర్ హీరోగా, అక్సఖాన్, రూపిక హీరోయిన్లుగా రాజీవ్ కనకాల ప్రధాన ΄ాత్రలో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. కాగా తెలంగాణలోని వేములవాడలో ‘ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సింగర్స్’(ఐటీఎఫ్) నిర్వహించిన గూగులమ్మతల్లి బోనాలు కార్యక్రమంలో ‘దళారి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ కరీంనగర్ జిల్లా బిడ్డగా అందర్నీ మెప్పించే కథతో ‘దళారి’ సినిమా తీశాను’’ అన్నారు కాచిడి గోపాల్ రెడ్డి. ‘‘ఈ సినిమా కథ,పాటలు, డ్యాన్సులు, ఎమోషన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటాయి’’ అన్నారు వెంకట్ రెడ్డి. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'దళారి' సినిమా
Shakalaka Shankar Dalri Movie First Look Released: ‘షకలక’ శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రల్లో గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దళారి’. ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్‌పై సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘దళారి’ టైటిల్ అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్, సస్పెన్స్, యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని సురేష్ కొండేటి అన్నారు. ‘‘కథ, క్వాలిటీ విషయంలో రాజీపడకుండా ఈ సినిమా చేశాం’’ అన్నారు ఎడవెల్లి వెంకట్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: మెంటెం సతీష్, సంగీతం: గౌరహరి. -
రామ్ గోపాల్ వర్మ లాంటి మేధావి బాబాగా మారితే?
The Boss- Never Dies Movies: బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం "ది బాస్". నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా... బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం 'ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు. "ది బాస్-నెవర్ డైస్" సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని.... రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం "ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. -
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘కార్పొరేటర్’
హాస్యనటుడు ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కార్పొరేటర్’. ఇందులో సునీతా పాండే, లావణ్యా శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్ పూనూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ. పద్మనాభిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ‘షకలక’ శంకర్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఓ సందేశం కూడా ఉంది. ఈ సినిమాలో ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉన్నాయి’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాకు యస్.వి. మాధురి సహనిర్మాత. -
'అక్షర' మూవీ రివ్యూ
టైటిల్ : అక్షర జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : నందిత శ్వేత, శకలక శంకర్, అజయ్ ఘోష్, మధునందన్, సత్య, హర్షవర్థన్ తదితరులు నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత : అల్లూరి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ దర్శకత్వం : బి. చిన్నికృష్ణ సంగీతం : సురేశ్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : నరేశ్ బానెల్లి విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'అక్షర'. విద్యావ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అక్షర’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ విద్యా విధాన్ అనే ప్రైవేట్ విద్యా సంస్థలో అక్షర (నందిత శ్వేత) ఫిజిక్స్ లెక్చరర్. అదే కాలేజీకి బోర్డ్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీతేజ్ (శ్రీతేజ్) తొలి చూపులోనే అక్షరతో ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉంటే అక్షర నివాసం ఉండే కాలనీకి చెందిన వాల్తేర్ బాయ్స్ మధు నందన్, సత్య, శంకర్లు ఒకరి తెలియకుండా ఒకరు ఆమెను ప్రేమిస్తుంటారు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాటిని ఫాలో అవుతూ అక్షరను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. అక్షరకు మాత్రం ఈ విషయం తెలియదు. కాలేజీకి వెళ్లడం.. టీచింగ్ అయిపోగానే లైబ్రరీలో గడపడం ఆమె దినచర్య. అలాగే విద్యావ్యవస్థపై పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో శ్రీతేజ్‌కు ఆమె దగ్గరవుతుంది. ఒక రోజు శ్రీతేజ్ తన మనసులో మాటను చెప్పేందుకు అక్షరను ఒక చోటుకు తీసుకెళ్లాడు. తన ప్రేమ విషయాన్ని తెలియజేసేలోపు అక్షర సడెన్‌గా బ్యాగులో నుంచి తుపాకి తీసి శ్రీతేజ్‌ను కాల్చేస్తుంది. అంతే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఆఫీసర్‌ను కూడా అక్షర చంపేస్తుంది. అసలు శ్రీతేజ్‌ని అక్షర ఎందుకు చంపేసింది? అసలు అక్షర ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? విద్యా విధాన్ ప్రైవేట్ సంస్థల యజమాని సంజయ్ స్వరూప్ అంటే అక్షరకు ఎందుకు కోపం? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అన్నదే మిగతా కథ. నటీనటులు ఈ సినిమాకు ప్రధాన బలం నందిత శ్వేత పాత్రే. అక్షర అనే లెక్చరర్ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించారు. ఇక విద్యా విధాన్ విద్యా సంస్థల అధినేతగా సంజయ్ స్వరూప్ తన పరిధి మేరకు నటించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హర్షవర్థన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఆయన చక్కగా నటించాడు. అలాగే శకలక శంకర్, సత్య, మధునందన్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ర్యాంకులు, మార్కుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చూపించిన చిత్రమే అక్షర. అయితే దర్శకుడు చిన్నికృష్ణ ఎంచుకున్న కాస్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మంచి కథకు అనవసర కామెడీని జోడించి సినిమా తేలిపోయేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించేలా చేశాడు. అయితే అసలు కథను సెకండాఫ్‌లో చెప్పినప్పటికీ.. అక్కడ కూడా అనవసర కామెడీని చొప్పించాడు. కేసు విచారణను కూడా నాసిరకం కామెడీతో నీరుకార్చాడు. ఇక చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలను సినిమాకు చాలా ప్లస్. హర్షవర్థన్ చెప్పే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చక్కగా చూపించారు. గిదుటూరి సత్య ఎడిటింగ్ అంతంత మాత్రమే ఉంది. తను చాలా సన్నివేశాల్లో తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నరేశ్ బానెల్లి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ నందిత శ్వేత నటన ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ కథ, కథనం అనవసరపు కామెడీ రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
అందుకే ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చేశాను
షకలక శంకర్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘రాంగ్ గోపాల్‌వర్మ’. ప్రముఖ పాత్రికేయుడు ప్రభు స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు, షకలక శంకర్, అభి, ర్యాప్రాక్ షకీల్, బాబు, పాత్రికేయులు వినాయకరావు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్‌గా పలు సంచలనాలు సృష్టించిన ప్రభు ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చిత్రంతో దర్శకునిగానూ సంచలనాలు సృష్టించాలని వినాయకరావు, సురేశ్ ఆకాక్షించారు. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాలన్నింటిలోకి తనకు బాగా న చ్చిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’’ అన్నారు షకలక శంకర్. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాత ప్రభుకు కృతజ్ఞతలు అన్నారు కెమెరామెన్ బాబు, సంగీత దర్శకుడు షకీల్. ప్రభు మాట్లాడుతూ– ‘‘ఒక దర్శకుని వింత పోకడలకు, వెర్రి చేష్టలకు విసిగిపోయి వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చిత్రాన్ని తెరకెక్కించాను. మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్, టీజర్‌కు చక్కని పేరొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
నటుడు షకలక శంకర్‌ను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ : కరోనా బాధితుల సహయార్థం విరాళాలు సేకరించడానికి విజయవాడ వెళ్లిన సినీ నటులు షకలక శంకర్‌కు పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో విరాళాలు సేకరించవద్దని తెలిపారు. అనుమతి లేకుండా విరాళాలు సేకరిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా బెంజ్ సర్కిల్ లో విరాళాల సేకరణను అడ్డుకోవడంపై షకలక శంకర్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, గతంలోనూ కరీంనగర్లో విరాళాలు సేకరించి బాధితులకు అందజేశామని పేర్కొన్నారు. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరణ అని శంకర్ అన్నారు. విరాళాల కోసం ప్రత్యేకంగా ఒక చోటుని నిర్ణయించుకోలేదని, ఎక్కడ విరాళాలు సేకరణ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్లి పోతానని, అందుకే విజయవాడ వచ్చానని వివరించారు. -
ఈ పాట మెగాభిమానులకు అంకితం
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. నటుడు ‘షకలక’ శంకర్ టైటిల్ పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రభు ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం నేను స్వయంగా రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ..’ అనే పాటని ర్యాప్ షకీల్ చక్కగా పాడటంతో పాటు మా చిత్రానికి సంగీతం అందించాడు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యా¯Œ ్సకు అంకితం చేస్తున్నాను. అందుకే పవన్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చే శాం. చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ముగ్గురు పవన్ అభిమానులకు మా చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు వారి కుటుంబాలకు అందిస్తాం’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ షకీల్ పాల్గొన్నారు. -
వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్ గోపాల్ వర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కమెడియన్ ‘షకలక’ శంకర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘మహిళల పట్ల చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టల్ని ఎండగడుతూ ప్రభు రూపొందించిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయిన నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నేను రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ..’ అనే పాటను త్వరలో విడుదల చేస్తాం’ అని ప్రభు తెలిపారు. (రాంగ్ గోపాల్ వర్మ) -
రాంగ్ గోపాల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: సినీ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. ‘షకలక’ శంకర్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహాగా నేను వ్యతిరేకమైనప్పటికీ సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నాను. ఈ చిత్రం కోసం ప్రభు రాసిన పాట విన్నాను.. చాలా బాగుంది’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. పతాక సన్నివేశాలు, పాట మినహా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది’ అని ప్రభు అన్నారు. (30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా: వర్మ) -
రిస్క్ ఎందుకన్నా అన్నాను
‘‘నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకనే నా సినిమాల్లో తనుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మాత్రం మిస్సయ్యాడు. మా సినిమాల షూటింగ్స్‌లో తను ఆర్టిస్ట్‌గాకంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కష్టపడుతుంటాడు’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బ్యానర్ లోగోను అనిల్ రావిపూడి, టైటిల్ యానిమేషన్‌ను సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పగానే ‘ఎందుకన్నా.. రిస్క్ ఏమో!’ అన్నాను. తను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు.. సినిమా చాలా బాగుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక నేను నిలబడాల్సి వచ్చేది. అందుకే నేనే డైరెక్ట్ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు.. ఇంకొంతమంది చిన్న కరెక్షన్స్ చెప్పారు. అవెంతో ఉపయోగపడ్డాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు తమన్. నిర్మాత పద్మనాభ రెడ్డి, నటులు ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, సంగీత దర్శకుడు సాకేత్ తదితరులు మాట్లాడారు. -
భాగ్యనగర వీధుల్లో...
హాస్యనటుడు వై. శ్రీనివాసరెడ్డి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాకు రచయితగా చేసిన పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు సంగీతం: సాకేత్ కొమండూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధనుంజయ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: చిత్రం శ్రీను. -
విడుదలకు సిద్ధమైన ‘అక్షర’
హీరోయిన్ నందిత శ్వేత నటిస్తోన్న తాజా చిత్రం అక్షర. ఈ సినిమాను అల్లూరి వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మిస్తున్నారు. అక్షర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ..విద్యావ్వవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్నిచ్చేలా ఈ కథను రూపోంచమన్నారు. ఈ సినిమాలో నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని, కమర్షీయల్ ఎలిమెంట్స్ తగ్గకుండా అద్భుతమైన మెసేజ్‌తో ఈ సినిమాని అక్టోబర్ రెండోవారంలో విడుదల చేస్తున్నాట్లు తెలిపారు. అక్షర షూటింగ్ పూర్తి అయిందని, ఇంకా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన అక్షర టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చిందని దీంతో సినిమాపై మా నమ్మకం మరింత రెట్టింపు అయింది, సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితం అలరిస్తుందని మేము నమ్ముతున్నామని అన్నారు. అలాగే ఈ సినిమా దర్శకుడు బి. చిన్నికృష్ట మాట్లాడుతూ..ఈ సినిమా అవుట్ పట్పై మాకు పూర్తి సతృప్తిగా ఉందని, సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపాడు. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తాయని ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. అక్టోబర్ రెండవ వారంలో విడుదల కానున్న మా అక్షర సినిమా మీ అందరికి నచ్చుతుందని అశిస్తున్నాను అన్నాడు. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ తదితరులు నటిస్తున్నాట్లు వెల్లడించారు. -
సమాజానికి కేడీ సందేశం
హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన షకలక శంకర్ ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు, ఓపెనింగ్స్ రాబట్టుకున్న శంకర్ నటించిన తాజా చిత్రం ‘నేనే కేడీ నెం–1’. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎండి రవూఫ్ సమర్పణలో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్ జరుపుకుంటోంది. ఈ నెల చివరి వారంలో సినిమాని విడుదల చేస్తున్నారు. దర్శక–నిర్మాత జాని మాట్లాడుతూ– ‘‘మంచి ఎంటర్టైనర్తో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు కూడా. నేటి బిజీలైఫ్‌లో పిల్లలను పట్టించుకోకుండా, బాధ్యతలు తెలపకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, గాలికి వదిలేస్తున్నారు. ఈ క్రమంలో యువత పెడదోవ పడుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. తల్లిదండ్రులతోపాటు పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులకు కావాల్సిన వాణిజ్య అంశాలన్నీ జోడించాం. ముస్కాన్ అందం, అభినయం, ముకుల్ దేవ్, పృథ్వీ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. పూజా, పి.డి.రాజు, కరాటే కళ్యాణి, రామ్ జగన్, రాజేందర్, నాగ మహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: శ్రావణ్ కుమార్. -
ఎవరు చంపుతున్నారు?
జి. కొండలరావు, పోసాని కృష్ణమురళి, ‘షకలక’ శంకర్ ముఖ్య తారలుగా జి. కొండలరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిసెంబర్ 31’. జి.లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌లో ప్రతి డిసెంబర్ 31న ఎంతోమంది అమ్మాయిలు చనిపోతుంటారు. అసలు వీళ్లను ఎవరు చంపుతున్నారు? అనే మిస్టరీ తెలుసుకునేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిష్ట్ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగుతాడు. అతను హంతకులను ఎలా పట్టుకున్నాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అంబటి రాఘవేంద్రరెడ్డి, రాయితి రమణమూర్తి, జి.అప్పారావు. -
సిన్సియర్ పోలీసాఫీసర్...
తెలుగులో మంచి పేరు సంపాదించిన స్టార్ కమెడియన్లలో షకలక శంకర్ ఒకరు. అతి తక్కువ కాలంలోనే కమెడియన్‌గా పేరు సంపాదించిన శంకర్ హీరోగా మారి, సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘నాలుగో సింహం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. గతంలో సాయికుమార్ హీరోగా నటించిన ‘పోలీస్ స్టోరీ’లో ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..’ అనే పవర్ఫుల్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు షకలక శంకర్ పవర్ఫుల్ నాలుగో సింహంగా నటిస్తున్నారు. ఆర్.ఏ. ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. శంకర్ సరసన అక్షయ్ శెట్టి నటిస్తోంది. ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాలు.. వాటిని చూసీ చూడనట్లుగా ఉండే అవినీతి అధికారుల నిర్వాకాలపై నిప్పులు చెరుగుతూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందీ ఈ చిత్రం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: శ్రవణ్ కుమార్, సంగీతం: అజయ్ పట్నాయక్, ఫైట్స్: దేవరాజ్, ఎడిటింగ్: శ్రీ, కథ–స్క్రీన్ ప్లే–నిర్మాణం–దర్శకత్వం: జానీ. -
డ్రైవర్ రాముడి పోరాటం
నందమూరి తారకరామారావు, జయసుధ జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘డ్రైవర్ రాముడు’ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. హాస్యనటుడి నుంచి హీరోగా మారిన ‘షకలక’ శంకర్ ‘డ్రైవర్ రాముడు’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హర్షిత సింగ్ కథానాయిక. రాజ్ సత్య దర్శకత్వంలో ఓ. వేణుగోపాల్, ఎమ్ఎల్ రాజు, టి. కీరత్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదం, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం టాకీ పార్ట్‌తో పాటు క్లయిమాక్స్‌లో వచ్చే కీలక సన్నివేశాలను శంకర్, ఇతర తారాగణంపై చిత్రీకరిస్తున్నాం. ఇదే షెడ్యూల్లో ఓ భారీ ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సునీల్ కశ్యప్, బ్యానర్: సినిమా పీపుల్, సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్, సంగీతం: కెమెరా: శివారెడ్డి. -
తుఫాన్ బాధితులకు షకలక శంకర్ సాయం
ఇచ్ఛాపురం: మున్సిపాలిటిలోని తుఫాన్ బాధిత ప్రాంతం కండ్రవీధిని సినీనటుడు షకలక శంకర్ సోమవారం సందర్శించారు. తుఫాన్ బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆహార పొట్లాలను అందజేశారు. అనంతరం ఇచ్ఛాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
డబుల్ ప్లాన్!
హాస్యనటుడు ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’. ఈ సినిమా నిర్మాతల్లో ఒక్కరైన సురేశ్ కొండేటి తాజాగా శంకర్ హీరోగా మరో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సురేశ్ ‘సంతోషం’ పత్రికాధినేతగా, నిర్మాతగా ఎదిగారు. ఈ రోజు (శనివారం) సురేశ్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘శంకర్ హీరోగా నిర్మించనున్న సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ–ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ‘శంభో శంకర’ సినిమాకు దీటుగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసుత్త రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇంతవరకూ వచ్చిన పొలిటికల్ మూవీస్‌కు భిన్నంగా ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా మా సినిమా ఉండబోతోంది. కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’’ అని రెండు చిత్రాల ప్లానింగ్ గురించి చెప్పారు. -
కమెడియన్ సినిమాకు మెగాస్టార్ టైటిల్
శ్రీ భవాని ఫిలింస్ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఖైదీ.ఈ సినిమాను హనుమాన్ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా విజయదశమి కానుకగా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానుంది. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ...‘చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’ . అలాంటి గొప్ప సినిమా టైటిల్ తో ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్ హీరోగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం’ అని తెలిపారు. -
కేడీ యాక్షన్
‘శంభో శంకర’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు హాస్యనటుడు ‘షకలక’ శంకర్. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కేడీ నెం1’. జానీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘తుపాకి, ఉరిమి, పులి’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డి. గిరీష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన నిర్మాత కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరీష్‌బాబు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. నేను నిర్మించిన సినిమాలకు వర్క్ చేసిన జానీ దర్శకత్వం చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ బాగుంది. సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘యాక్షన్ చిత్రమిది. ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్. అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ సినిమాలో జానీ నన్ను కొత్తగా చూపిస్తున్నారు. తన దగ్గర్నుంచి చాలా నేర్చుకుంటున్నాను’’అన్నారు శంకర్. ‘‘కామెడీ మాత్రమే కాదు యాక్షన్ కూడా చేయగలడని శంకర్ ఈ సినిమా ద్వారా నిరూపిస్తారు’’ అన్నారు జానీ. -
రాముడి ఆటా పాటా
‘డ్రైవర్ రాముడు’ అనగానే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఇప్పుడు అదే పేరుతో మరో చిత్రం రూపొందుతోంది. మాస్టర్ ప్రణవ్తేజ్ సమర్పణలో కె.వేణుగోపాల్, ఎమ్.ఎల్. రాజు, టి. కీరత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ సత్య దర్శకుడు. ‘శంభో శంకర’ తర్వాత షకలక శంకర్ హీరోగా చేస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ నేతృత్వంలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ‘బాహుబలి’లో ‘మనోహరీ..’తో పాటు పలువురు స్టార్ హీరోల సరసర పలు పాటలకు కాలు కదిపిన స్కార్లెట్ విల్సన్ ఈ పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. శంకర్, స్కార్లెట్‌పై చిత్రీకరించిన ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ స్వరకర్త. -
‘డ్రైవర్ రాముడు’ మూవీ స్టిల్స్
-
డ్రైవర్ రాముడి ఆటా పాటా
హాస్యనటుడిగా ప్రేక్షకులకు నవ్వుల కితకితలు పెట్టిన ‘షకలక’ శంకర్ ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మారిన విషయం తెలిసిందే. తాజాగా శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘డ్రైవర్ రాముడు’. అంచల్ సింగ్ కథానాయిక. రాజ్ సత్య దర్శకత్వంలో వేణుగోపాల్, ఎమ్.ఎల్. రాజు, టి. కీరత్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. రాజ్ సత్య మాట్లాడుతూ– ‘‘మా ‘డ్రైవర్ రాముడు’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం భారీ సెట్లో శివశంకర్ మాస్టర్ నేతృత్వంలో ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా దర్శకుడు రాజ్ సత్య భారీ సినిమాలాగా ‘డ్రైవర్ రాముడు’ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, మొదటి టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సునీల్ కశ్యప్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఐటమ్ సాంగ్ యువతను ఉర్రూతలూగిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ప్రదీప్ రావత్, నాజర్, ‘తాగుబోతు’ రమేశ్, ధన్‌రాజ్, మహేశ్ విట్టా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్, కెమెరా: అమర్ నాథ్. -
షకలక శంకర్‌పై శ్రీరెడ్డి ఫైర్..
సాక్షి, సినిమా: ఇటీవల టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కమెడియన్ షకలక శంకర్‌ను ఉద్దేశించి తన ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా, కారుణ్య కథానాయికగా, శ్రీధర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’. సినిమా ఈ నెల 29న విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్ కోసం శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు మద్యలో తీసుకొచ్చారంటే పళ్లు రాలగొడతానని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నేను ఎవరిని పొగుడుతూ.. వారిని ఓరేంజ్‌కి ఎత్తేసి వాళ్ల పేరు అడ్డు పెట్టుకొని ఇక్కడికి రాలేదు. అయితే ఇటీవల కొంత మంది భక్తులు.. ఓ హీరో భక్తులు.. ఆ హీరోకి తెలియంది ఏంటంటే అతని పేరు చెప్పుకొని అతన్ని దేవుడు.. మా కోసం ఎంతో చేస్తున్నాడు అంటూ.. మొత్తం మీద బతికేస్తున్నారు.. బతకండీ.. ఆ హీరో ఫ్యాన్స్‌ని వాడుకోండి. మీ సినిమా ఓపెనింగ్స్‌కి కావాలి కదా.. వాడుకోండి.. ఓపెనింగ్స్ కోసం ఆ హీరోని పొగడటం.. మీ ఊరు వచ్చినపుడు ఆయన్ని నెత్తిన పెట్టుకొవడం.. మీరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించడం తప్పులేదు.. కానీ నా పేరు అనవసరంగా మద్యలో తీశారంటే మాత్రం పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా... ఓ కమెడియన్‌వి హీరోగా ఇంట్రడ్యూజ్ అయ్యావు.. నీ పని ఏదో నువ్వు చూసుకో.. అందరిలాగా అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. అందరికీ ఒకటే చెబుతున్నాను.. మీ ప్రొడ్యూసర్ ఏం గొప్పోడు కాదు..నువ్వేం పెద్ద గొప్పోడివి కాదు.. కథలు తీస్తే అందరి కథలు ఉన్నాయి మా దగ్గర.. సమయం వచ్చినపుడు అందరి కథలు బయటికొస్తాయి. నీ సినిమా ఓపెనింగ్స్ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొని వ్యాపారం చేసుకోవడం మంచింది కాదు.. దాని కోసం నన్ను మద్యలో లాగటం కరెక్ట్ కాదు. నీ లాంటి పిచ్చ సినిమాలు నేను చూడను అని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు. -
ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు డబ్బులు వచ్చాయి
‘‘పది కోట్ల బడ్జెట్‌తో చేయాల్సిన ‘శంభో శంకర’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే రూపొందించాం. పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకున్నా, సినిమా బాగా రావాలని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు వారు పెట్టిన డబ్బులు వచ్చాయి’’ అని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు. ‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ – ‘‘మా సినిమా పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అని కచ్చితంగా చెప్పగలను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి శివాజీరాజాగారితో కలిసి తిరిగాను. ఆయన మంచితనాన్ని, సేవలను స్ఫూర్తిగా తీసుకుని నా వంతు సహకారాన్ని అందించాలనుకుంటున్నా. ‘శంభో శంకర’ ద్వారా వచ్చిన కొంత అమౌంట్లో పది వేలు చొప్పున పది మంది నిరుపేదలకు అందించాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం శంకర్, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ సినిమా హిట్‌తో ఆ భయం పోయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు డైరెక్టర్ శ్రీధర్. ‘‘మా సినిమా హిట్ అవడంతో మాకంటే ఎక్కువగా ప్రేక్షకులు హ్యాపీగా ఉన్నారు. థియేటర్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మా కష్టం ఫలించింది. ఇకపై కూడా ఇదే విధంగా నిజాయితీగా, నమ్మకంగా సినిమాలు చేస్తా’’ అన్నారు ‘షకలక’ శంకర్. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా, కథానాయిక కారుణ్య, నటులు ఏడిద శ్రీరామ్, ప్రభు, నాగినీడు పాల్గొన్నారు. -
‘శంభో శంకర’ మూవీ రివ్యూ
టైటిల్ : శంభో శంకర జానర్ : కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : షకలక శంకర్, కారుణ్య చౌదరి, నాగినీడు, అజయ్ ఘోష్ తదితరులు సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : ఎన్. శ్రీధర్ నిర్మాత : రమణా రెడ్డి, సురేశ్ కొండేటి స్టార్ హీరోలు సైతం కామెడీ చేస్తూ సినిమాల్లో అభిమానులకు కిక్ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించేది ఎంటర్టైన్మెంటే. సో.. ఈ నేపథ్యంలో కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిలో సక్సెస్ సాధించిన వారు మాత్రం చాలా అరుదు. గతంలో హీరోలుగా మారిన చాలా మంది కమెడియన్స్ తరువాత తిరిగి కామెడీ రోల్స్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన షకలక శంకర్ హీరోగా మారి ‘శంభో శంకర’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి షకలక శంకర్ హీరోగా సక్సెస్ సాధించాడా..? కథ కడప జిల్లా అంకాలమ్మ పల్లె గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరికి రాబందు లాంటి ప్రెసిడెంట్ అజయ్ ఘోష్. ఆ ప్రెసిడెంట్‌కు తోడు గా ఓ అవినీతి పోలీసాఫీసర్. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా ఉంటాడు మన హీరో శంకర్ (షకలక శంకర్). ఇక ఈ కథనంలో ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి). ప్రెసిడెంట్ కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్ ఆ ప్రెసిడెంట్ కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది.(సాక్షి రివ్యూస్) ప్రెసిడెంట్ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ శంకర్ ఊరి ప్రజలకు అండగా నిలబడతాడు. అయితే కథలో ప్రెసిడెంట్ కంటే పెద్దదొంగ ఒకడు ఉంటాడు. అతడికి మన హీరో శంకర్‌కి మధ్య సంబంధం ఏమిటి? అసలైన ఆ గజదొంగ ఎవరు? అనేది తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. నటీనటులు తన కామెడీతో అందరిని నవ్వించే షకలక శంకర్‌కు హీరోగా మారడం కోసం పడ్డకష్టం తెరపై కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘తిండిలేక కొంత ఎక్సర్సైజ్ చేసి మరికొంత సన్నబడ్డా’నని చెప్పుకొచ్చారు శంకర్. హీరో స్థాయిలో కాకపోయినా మంచి లుక్‌లో కనిపించాడు. (సాక్షి రివ్యూస్) ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో బాగానే కష్టపడ్డాడు. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా ఓకే అనిపించాడు. ఇక హీరోయిన్గా పార్వతి పాత్రలో కారుణ్య చౌదరిమ దక్కింది చిన్న పాత్రే. తనకున్న ఏడెనిమిది సన్నివేశాల్లో ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం చేశారు. ప్రెసిడెంట్‌గా అజయ్‌ఘోష్ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో రవి, నాగినీడు, హీరో స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ఒక కమెడీయన్‌ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు.. దర్శకులు కామెడీ ఎంటర్‌టైనర్‌నో లేదా.. కథా బలం ఉండి ఆకట్టుకునే కథనంతో ఉన్న చిత్రాలనో ఎంచుకుంటారు. కానీ దర్శకుడు శ్రీధర్ మాత్రం శంకర్‌తో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ను ట్రై చేశాడు. సినిమా ప్రమోషన్స్‌లో వీరావేశంగా.. కథపై ఉన్న నమ్మకంతో త్రివిక్రమ్, దిల్‌రాజు, రవితేజ, అల్లు శిరీష్‌ను కలిసాను... వాళ్లలో కొందరు తీయడానికి రెడీగా ఉన్నా.. టైమ్ పడుతుందని అన్నారంటూ శంకర్ చెప్పారు.(సాక్షి రివ్యూస్) కానీ సినిమా చూస్తే అంత బలమైన కథగా కనిపించదు. చాలా సన్నివేశాల్లో గతంలో వచ్చిన సినిమాల్లోని ఛాయలు కనిపిస్తాయి. కొన్ని మాస్ డైలాగ్‌లు పర్వాలేదనిపించినా.. శంకర్ బాడీలాంగ్వెజ్‌కు సెట్ కాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. పాటలు వినడానికి పరవాలేదనిపించినా విజువల్‌గా నిరాశపరిచాయి. పవన్ ఇమేజ్ను వాడుకొని జబర్థస్త్‌లో క్రేజ్ తెచ్చుకున్న శంకర్ వెండితెర మీద కూడా అదే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సారి ఆ ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పరవాలేదనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ : శంకర్ ప్రయత్నం అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : కథా కథనం సాంకేతిక వర్గం ముగింపు : ‘పని లేక ఖాళీగా ఉన్నందుకు హీరోగా చేశా’నని చెప్పిన శంకర్ అంతగా మెప్పించలేకపోయాడు. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
మా ఆవిడ వార్నింగ్ ఇచ్చింది
‘హీరో అయిపోవాలని సినిమా చేయలేదు. పని లేక ఖాళీగా ఉండటం ఇష్టం లేక హీరోగా ‘శంభో శంకర’ సినిమా స్టార్ట్ చేశా. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత నేను అనుకున్న రేంజ్ సినిమాలు రాలేదు. కొన్ని నా మనసుకు నచ్చలేదు. మనసుకు సంతృప్తినిచ్చే క్యారెక్టర్స్ రాలేదు’’ అని శంకర్ అన్నారు. శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’. రమణా రెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శంకర్ పంచుకున్న విశేషాలు... ► దొంగతనం చేయడానికి భయం ఉండాలి. అవకాశాలు ఇవ్వమని అడగడానికి భయమెందుకు? నా వద్ద కథ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు సినిమా నిర్మించమని త్రివిక్రమ్‌గారు, రవితేజగారు, ‘దిల్’ రాజుగారి దగ్గరికి వెళ్లాను. వాళ్లు ఎవ్వరూ చేయం అని అనలేదు. కానీ, టైమ్ పడుతుంది అన్నారు. పని లేకుండా ఉండటం నా వల్ల కాదు. అందుకే ఈ సినిమా స్టార్ట్ చేశాం. ► ‘శంభో శంకర’ కథను నేను, శ్రీధర్ కలిసి తయారు చేసుకున్నాం. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే (నవ్వుతూ). ఈ సినిమాని అందరం ప్రేమించి పనిచేశాం. శంకర్ హీరో ఏంటి? అని తక్కువగా చూడలేదు. ఒక్క సీన్‌కి కాదు.. ఈజీగా పది సన్నివేశాలకు ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు రమణారెడ్డిగారికి, సురేశ్ కొండేటిగారికి ధన్యవాదాలు. ► మొన్నటి దాకా ఆర్థికంగా అందరికీ సహాయపడుతుండే వాణ్ణి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నా. మా ఆవిడ వార్నింగ్ కూడా ఇచ్చింది (నవ్వుతూ). క్యారెక్టర్ అడుగుదాం అని వెళ్తే అక్కడే ఓ పది మంది ఉంటారు ఇంకేం అడుగుతాం. హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తా. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రం చేశా. -
బ్లాక్ బస్టర్స్ లిస్ట్‌లో శంకర ఉంటుంది – సురేశ్ కొండేటి
‘‘ఈ సినిమాకు ఫస్ట్ టెక్నీషియన్ సాయికార్తీక్‌గారే. ఆయన తర్వాతే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ సెట్ అయ్యారు. మా అందరి ఆరు నెలల కష్ట ఫలితమే ఈ సినిమా. శంకర్ హీరో ఏంటి? అని అనుకునేవాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది. సినిమా చూస్తే శంకర్‌తో ఎందుకు తీశామో అర్ధమవుతుంది. నిర్మాతల్లో ఒకరైన రమణారెడ్డిగారి వల్లే ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నాకు తెలిసి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్స్ లిస్టులో ‘శంభో శంకర’ ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్ పూర్తయ్యింది. అందరి నమ్మకం ఫలిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సురేశ్ కొండేటి. శ్రీధర్ దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా ఆర్.ఆర్. పిక్చర్స్ , యస్కే పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించిన చిత్రం ‘శంభో శంకర’. జూన్ 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను సంగీత దర్శకుడు సాయి కార్తీక్ విడుదల చేయగా హీరో శంకర్ మొదటి సీడీని అందుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ –‘‘మాటల రచయిత భానుప్రసాద్ గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా కోసం ఏమైనా ఫర్వాలేదని శంకర్ ప్రాణం పెట్టి చేశారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరో శంకర్ మాట్లాడుతూ –‘‘దర్శ కులు శ్రీధర్‌కు, నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయముంది. మాకు సినిమాల మీద ఆసక్తి కలిగేలా చేసింది నటి నిర్మలమ్మగారు. ఆవిడ వల్లే మేం సినిమా జీవితం గురించి తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్పటికీ మాపై ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాను మొదట ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్ల దగ్గరికి తీసుకెళ్లాను. వారు చేస్తామన్నారు, కానీ రెండేళ్లు ఆగాలన్నారు. మా బాధను నెల్లూరులోని రమణారెడ్డిగారు అర్థం చేసుకున్నారు. అలాంటి నిర్మాతలుంటే నాలాంటి ఎందరో హీరోలుగా, శ్రీధర్ లాంటి వారెందరో దర్శకులు అవుతారు. నేను నటునిగా పది రూపాయలు సంపాదిస్తే అందులో ఎనిమిది రూపాయలు కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చేస్తాను. ఈ నెల 29 మేమంతా ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుస్తుంది’’ అన్నారు. -
దూసుకెళుతోన్న శంకర
హాస్య నటుడు ‘షకలక’ శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ‘దిల్’ రాజు వంటి అగ్ర నిర్మాత మా సినిమా టీజర్‌ని ప్రశంసించారంటే ఫలితం ఊహించవచ్చు. మా చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ టాక్ వినిపించడం హ్యాపీ’’ అన్నారు. ‘‘శంకర్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాడన్న ధీమా ఉంది’’ అన్నారు నిర్మాత సురేష్ కొండేటి. -
రెండేళ్లు సినిమా చాన్సులు లేక..
‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘శంభో శంకర’. ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె పిక్చర్స్ సమర్పణలో వై.రమణా రెడ్డి, సురేశ్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘ఆఫీస్‌బాయ్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు శంకర్. ‘గబ్బర్‌సింగ్’ సినిమాకు అద్భుతమైన స్కెచ్‌లు గీశాడు శంకర్. ఈ చిత్రాన్ని 35 రోజుల్లో కంప్లీట్ చేయడం గ్రేట్. ఆ విషయంలో చిత్రబృందాన్ని అభినందిస్తున్నా’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ – ‘అందరూ ఎక్సర్సైజులు చేసి తగ్గాను అనుకుంటున్నారు. రెండేళ్లు సినిమా చాన్సులు లేక తిండిలేక తగ్గిపోయాను (నవ్వుతూ). ఆ సమయంలో ఈ అవకాశం వచ్చింది. నా వంతు ప్రయత్నం చేశాను. ప్రేక్షకుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా. దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’ అన్నారు. ‘శంకర్‌ని దృష్టిలో పెట్టుకునే చేశాను. నా నెక్ట్స్ సినిమా కూడా తనతోనే ఉంటుంది. పాటలు, కెమెరా అన్నీ బాగా కుదిరాయి. టీమ్ సహకారంతో మంచి సినిమా తీయగలిగాం’’ అన్నారు శ్రీధర్. ‘‘సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చుతుంది’ అన్నారు రమణారెడ్డి. ‘కథ నచ్చడంతో నేను కూడా ఇందులో పార్టనర్ అయ్యాను. శంకర్ అద్భుతంగా నటించాడు’ అన్నారు సురేశ్ కొండేటి. -
నవ్వుల రాముడు
డ్రైవర్ రాముడు అనగానే 1979లో ఎన్టీఆర్, జయసుధ నటించిన ‘డ్రైవర్ రాముడు’ సినిమా గుర్తు రావడం సహజం. ఇప్పుడు అదే పేరుతో ‘షకలక’ శంకర్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. రాజ్ సత్య దర్శకుడు. సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని వేణుగోపాల్ కొడమగుళ్ల, ఎమ్.ఎల్. రాజు, ఆర్.ఎస్. కిషన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే మూడో షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్ బాబు చేతుల మీదగా విడుదల చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ – ‘‘ఏ సినిమాలో అయినా ‘షకలక’ శంకర్ ఉన్నాడంటే ఆ సినిమాలో కామెడీ బావుంటుంది. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్నాడంటే ఆ సినిమా ఎంత వినోదాన్ని పంచుతుందో ఊహించవచ్చు. ఈ చిత్రదర్శక–నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రాజ్ సత్య మాట్లాడుతూ – ‘‘డ్రైవర్ రాముడు’ చిత్రం ద్వారా శంకర్‌లోని మరో కోణాన్ని, ఆయన మార్క్ కామెడీనే కాకుండా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఓ ఎమోషనల్స్టోరీని చూపించబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: రఘు కులకర్ణి. -
డ్రైవర్ రాముడు టీజర్
డ్రైవర్ రాముడు ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. కమెడియన్ ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు రాజ్ సత్య డ్రైవర్ రాముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా లాంఛ్ చేయించారు. ప్రదీప్‌సింగ్ రావత్‌కి శంకర్ మధ్య జరిగే సరదా డైలాగులతో టీజర్‌ను చూపించారు. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శంకర్ మార్క్ కామెడీతోపాటు ఎమోషనల్గానూ కథ ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. అంచల్ సింగ్ శంకర్‌కు జోడీగా నటిస్తోంది. ఎమ్.ఎల్. రాజు, ఎస్.ఆర్. కిషన్ నిర్మిస్తున్న డ్రైవర్ రాముడు త్వరలోనే విడుదల కానుంది. -
‘షకలక’ శంకర్ డ్రైవర్ రాముడు టీజర్ విడుదల
-
అవకాశాలు రాలేదని బాధపడే వారికి శంకర్ ఓ స్ఫూరి – వీవీ వినాయక్
శంకర్ హీరోగా శ్రీధర్. ఎన్ దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్. పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘శంభో శంకర’. మే డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ– ‘‘శంకర్ రెండేళ్లు నాతో ట్రావెల్ చేశాడు. శ్రీకాకుళం నుంచి వచ్చి హీరోగా ఎదగడం ఆశ్చర్యంగాను, సంతోషంగాను ఉంది. సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బాధపడే వాళ్లకు శంకర్ ఓ స్ఫూర్తి. ఫస్ట్ పాట బావుంది. శంకర్ మాస్ లుక్‌లో బావున్నాడు. సినిమా సక్సెస్ అయి, అందరికీ మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో నాకు వినాయక్‌గారు గాడ్‌ఫాదర్. ఆయన వద్ద చాలా కాలం పనిచేసి, చాలా విషయాలు నేర్చుకున్నాను. నా మిత్రుడు శ్రీధర్‌తో సినిమా చేస్తున్నాను. నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శంకర్. ‘‘శంకర్, నేను ఫ్రెండ్స్. ఈ సినిమాతో నేను డైరెక్టర్‌గా, శంకర్ హీరోగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. ఏది అడిగినా సమకూర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. ‘‘వినాయక్‌గారు ఈ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శంకర్ స్టార్ హీరోల్లాగే కష్టపడ్డారు. శ్రీధర్ శ్రమించి స్క్రిప్ట్ చేశారు. నిర్మాత బడ్జెట్ విషయంలో రాజీపడలేదు. సినిమా హిట్ అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు’’ అన్నారు నిర్మాత సురేశ్ కొండేటి. నిర్మాతల్లో ఒకరైన రమణా రెడ్డి పాల్గొన్నారు. -
ఎమోషనల్ డ్రైవర్
హాస్యనటుడిగా మంచి స్థానం సంపాదించకున్న షకలక శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రాముడు’. రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకం పై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ఎల్ రాజు, ఆర్ఎస్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శంకర్‌లో మరో కొత్త కోణాన్ని చూపించే చిత్రం ఇది. శంకర్ మార్క్ కామెడీతో, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రకథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు, ఒక్క పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం. ఇప్పటికే టైటిల్‌కి, పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: అమర్నాథ్, ఆర్ట్: రఘు కులకర్ణి. -
కన్నీళ్లు పెట్టిస్తాడు
హాస్యనటుడు శంకర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘శంభో శంకర’. కారుణ్య కథానాయిక. శ్రీధర్.ఎన్ దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ– ‘‘కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తయింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలిచిత్రం ‘శంభో శంకర’. నిర్మాతల సహకారం వల్లే సినిమా అనుకున్నట్టుగా తీశా. పాటలు, ఫైట్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు దర్శకుడు శ్రీధర్. ‘‘ఇప్పటి వరకూ కమెyì యన్‌గా అలరించిన శంకర్ ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపిస్తాడు. సెంటిమెంట్ సీన్స్‌లో అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తాడు. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మరో నిర్మాత సురేష్ కొండేటి. ఈ సినిమాకు సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రాజశేఖర్. -
డ్రైవర్ రాముడు
‘డ్రైవర్ రాముడు’ సినిమా పేరు వినగానే ఎన్టీఆర్ గుర్తుకురాకమానరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ‘డ్రైవర్ రాముడు’ పేరుతో మరో సినిమా రూపొందుతోంది. కమెడియన్ ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాజ్ సత్య తెరకెక్కిస్తున్నారు. ఎమ్.ఎల్. రాజు, ఎస్.ఆర్. కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. రాజ్ సత్య మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ప్రేక్షకులకు నవ్వులు పంచిన శంకర్‌లోని మరో కొత్త కోణాన్ని మా సినిమాలో చూస్తారు. శంకర్ టైప్ వినోదంతో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారి బ్లాక్ బస్టర్ ‘డ్రైవర్ రాముడు’ టైటిల్‌ని మా సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం. శంకర్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని వంద శాతం అలరిస్తారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇప్పటివరకూ నన్ను కమెడియన్‌గా ఆదరించిన ప్రేక్షకులు హీరోగానూ ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్‌గారి గెటప్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్ బాగుందంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు శంకర్. ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్, సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: అమర్ నాద్. -
నాట్ ఏ జోక్
కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్ అన్నారు. కామెడీ ఆడకపోతే ఏడ్చిన సినిమాలెన్నో! సినిమాకి రన్ ఉన్నట్లే... కమెడియన్‌కు కూడా రన్ ఉంటుంది. క్లాప్‌లు పడుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అసలు మొదటి క్లాప్ పడటానికే ఎన్ని గడపలు తొక్కాలో! తొక్కాలో, తొక్కించుకోవాలో! ధన్‌రాజ్, షకలక శంకర్ నవ్వించడానికి, కవ్వించడానికి రియల్ లైఫ్ టేకులు ఎన్నో తిన్నారు. అన్ని బొప్పులు కట్టాక.. ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇదిగో ఇలా మీ ముందు కూర్చున్నారు. ధన్‌రాజ్: హాయ్ శంకర్.. ‘రాజుగారి గది’ సినిమాలో ఇద్దరం కలిసి బోల్డన్ని సీన్లు చేశాం. మన కాంబినేషన్లో ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందంటావ్? శంకర్:: ఇప్పుడు చేస్తున్నవే కంటిన్యూ చేస్తే బెటర్ అన్నయ్యా. అప్పట్లో కోట శ్రీనివాసరావుగారు, బాబు మోహన్‌గారు అన్ని సినిమాల్లోనూ తెగ నవ్వించారు. వాళ్లలా మనం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా. ధన్‌రాజ్: కొత్తగా ఏదైనా ట్రై చే స్తేనే కదా మన గొప్పదనం. సీరియస్ పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది? శంకర్:చాలా బాగుంటుంది. ఒక పని చేద్దాం. ప్రభాస్, రామ్‌చరణ్ సినిమాల్లో విలన్లుగా చేద్దాం. అప్పుడు వాళ్ల ఫ్యాన్స్ మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. అది మనకు కొత్తగా ఉంటుంది (నవ్వు). ధన్‌రాజ్: నిన్ను నువ్వు అద్దంలో చూసుకుని ‘వారెవా ఏమి ఫేసు...అచ్చం హీరోలా ఉంది బాసు..’ అనుకుని ఉంటావు కదా. మరి నీకు హీరోగా చేయాలని ఎప్పుడూ అనిపించలేదా? శంకర్: లేదు. నువ్వే హీరోగా మొన్నో సినిమా చేశావ్. ఇప్పుడు ‘బంతిపూల జానకి’ చేస్తున్నావ్. నేను కూడా ఎంటరైతే పేక్షకులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతారన్నయ్యా (నవ్వుతూ). ధన్‌రాజ్:ఏదో నా ఈ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేవి చేస్తున్నా తప్పితే హీరోగా సెటిల్ అవుదామన్న ఉద్దేశం నాక్కూడా లేదు. మహా అయితే ఒక మూడు నాలుగు సినిమాల్లో హీరోగా చేస్తానేమో. కమెడియన్‌గా అయితే మూడొందలు సినిమాలు చేసేయొచ్చు. ఓకేనండి.. ఇప్పుడు మేం (సాక్షి) కొన్ని ప్రశ్నలడుగుతాం..? ధన్, శంకర్: ఏవండీ.. మేమిద్దరం పదో తరగతి పాస్. కొంచెం మా స్థాయికి తగ్గట్టుగా అడుగుతారా (నవ్వులు). ♦ హీరోలు సిక్స్ ప్యాక్ చేయాలి.. మీకా ప్రాబ్లమ్ లేదు కదా... ధన్‌రాజ్: అవునండి. మాలాంటివాళ్లు వర్కవుట్లు గట్రా అంటూ ఇరగబడిపోకూడదు. జిమ్ సెంటర్‌కి వెళ్లి బాగుందా లేదా అని చూసి రావడం బెటర్. ఒకవేళ జిమ్ చేసినా నాకు కండలు రావు. నా జీన్స్ అలాంటివి. శంకర్: సిక్స్ ప్యాక్ లేకపోయినా కొంచెం ఫిజిక్ బాగుండాలండీ. నన్ను చూసి ఏంట్రా.. ఆ పొట్టేసుకుని! కొంచెం బాగుండాల్రా అని ఇద్దరు, ముగ్గురు హీరోలన్నారు. ‘అదేంటండి.. కమెడియన్నే కదా’ అంటే, ‘అయితే ఇలానే ఉండాలని లేదురా... కామెడీ అంటే బాడీతో కాదు.. ఎక్స్ప్రెషన్స్ నుంచి కామెడీ పుట్టాల’న్నారు. అప్పట్నుంచీ కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. ♦ హీరోలకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పైగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. మీకు ఏమీ అనిపించదా? ధన్‌రాజ్: మాకూ ఫేస్బుక్లో ఫాలోయర్స్ ఉన్నారు. ‘ఆ క్యారెక్టర్ బాగా చేశావ్. లవ్ యు’ అని అమ్మాయిలు మెసేజ్‌లు ఇస్తుంటారు. అభిమానంతో వాళ్లలా అంటారు. అది గ్రహించకుండా మేం కూడా ‘లవ్ యు’ అంటే తేడాలొచ్చేస్తాయ్ (నవ్వు). ♦ ధనరాజ్లో మీకు నచ్చిన అంశాలు? శంకర్: మంచివాడు. ఫ్రెండ్స్‌కు ఏదైనా కష్టమొస్తే ఎంత అర్ధరాత్రి అయినా స్పందిస్తాడు. ఒకవేళ తను చేయాల్సిన పాత్ర వేరొకరికి వస్తే ‘సరే.. తను చేస్తాడా.. ఓకే’ అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అందుకే మా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. ♦ కామెడీకి ఓ రూపం ఉందనుకుందాం.. అప్పుడు అది ఆడ అయ్యుంటుందా? మగ అయ్యుంటుందా? ధన్‌రాజ్: నేనైతే అబ్బాయి అనే అంటాను. అబ్బాయి అయితే ఎలాంటి కామెడీ అయినా చేయొచ్చు. అమ్మాయి అయితే హద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది. ♦ పువ్వుల్లో కామెడీగా ఉండే పువ్వు ఏది? ధన్‌రాజ్:మొగలిపువ్వు అండి. ఎందుకోనండి మొగలిపువ్వు అని వినగానే నాకు నవ్వొచ్చేస్తుంది. అందుకని కామెడీ ఫ్లవర్ అంటే నాకు మొగలిపువ్వే. శంకర్: నాకు పువ్వులతో పెద్దగా పరిచయం లేదండి. ధన్‌రాజ్: ఏం తమ్ముడూ.. ఈ మధ్య పెళ్లయ్యింది కదా.. మల్లెపువ్వులు కూడా తీసుకెళ్లవా..? శంకర్: అన్నయ్యా.. సంపేయమాక. ♦ ఫ్రూట్స్‌లో కామెడీగా ఉండేది? ధన్‌రాజ్: సీమచింతకాయలు. అవి అలా వంకర టింకరగాఎందుకుంటాయ్ అనిపిస్తుంది. ఇవి జంతికల్లా ఎలా పుట్టాయ్ అని నవ్వుకుంటాను. శంకర్: అయ్య బాబోయ్.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియదండి. నాకు అన్ని పండ్లూ రుచిగా అనిపిస్తాయి కానీ, నవ్వు తెప్పించేది ఏదీ లేదండి. ధన్‌రాజ్: మనతో నటించేవాళ్లతో కెమిస్ట్రీ సెట్ అయితే దర్శకులు ఇంకా కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య చాలామంది దర్శకులు మాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. శంకర్: త్రివిక్రమ్‌గారితో ‘అ..ఆ’ చేశాను. ఆయన ‘శంకర్... నీకో ఫ్లో ఉంటుంది కదా చేసి చూపించు’ అన్నారు. అంత పెద్ద డెరైక్టర్ కూడా అలా అడిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ♦ శంకర్... మీరు రామ్గోపాల్వర్మగారిని బాగా ఇమిటేట్ చేస్తారు కదా! ఆయన ఎప్పుడైనా మెచ్చుకున్నారా? శంకర్: ‘సత్య-2’ ఆడియో ఫంక్షన్లో ఆయన్ను ఇమిటేట్ చేశాను. సరదాగా నవ్వారు. ♦ అవకాశాలు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడి ఉంటారు? ధన్‌రాజ్: అవునండి. ఇప్పుడు సినిమాల్లో రావడం చాలా ఈజీ. యూట్యూబ్‌లో మనం చిన్న వీడియో పెడితే చాలు బాగుంటే తీసేసుకుంటున్నారు. నేను ‘జగడం’ చేసే టైమ్‌లో ఫొటో పట్టుకుని తిరిగేవాణ్ని. దాని వెనకాల ‘కె.ధనరాజ్’ అని నా పేరు, హైట్, ఫోన్ నెంబర్ రాసుకునేవాడిని. అది కూడా సొంత ఫోన్ నంబర్ కాదు. పీపీ నంబర్. ఇన్కమింగ్ కాల్కి రూపాయి తీసుకునేవాళ్లు. ఇప్పటివాళ్లకి అంత బాధ లేదు. శంకర్ అయితే ‘జబర్దస్త్’తో బాగా ఫేమస్ అయ్యాడు. ♦ మీ ఇద్దరికీ మధ్య జరిగిన గమ్మత్తయిన సంఘటన ఏదైనా.. ధన్‌రాజ్: కెరీర్ కొత్తల్లో శంకర్‌కి నేను 1500 రూపాయలకు సెల్‌ఫోన్ అమ్మా. ఇప్పటికీ రూ.500 బాకీ. మరి.. నా 500 ఎప్పుడు ఇస్తావ్? (శంకర్ తో నవ్వుతూ). శంకర్: చెక్ ఇస్తాన్లే అన్నయ్యా (నవ్వుతూ). ♦ ఇంతకీ మీ కష్టాలు తీరిపోయాయనుకుంటున్నారా? ధన్‌రాజ్: లేదండి. ఏ స్థాయికి వె ళ్లినా దానికి తగ్గ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఇంకా కృష్ణానగర్‌లో మాకన్నా టాలెంటెడ్ కమెడియన్స్ బోల్డంత మంది ఉన్నారు. మా అదృష్టం బాగుండి టీవీలో క్లిక్ అయ్యాం. ♦ స్టూడియో గేటు లోపలికి ఎంటర్ కానివ్వనప్పుడు మనసులో రగిలిపోయారా? శంకర్: రగిలిపోయిన రోజులు చాలా. ఆ మంట ఉండాలి. లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు. ధన్‌రాజ్: కాన్ఫిడెన్స్ పెరగకపోయినా ఫర్వాలేదు కానీ, తగ్గితే మాత్రం ఇంత దూరం రాలేం. స్టూడియో గేటుల దగ్గర ఆపేసినప్పుడు ఏదో రోజు మాకు సలామ్ కొడతారని అనుకునేవాళ్లం. కానీ, ఈరోజు మేం ఆ సలాముల కోసం ఎదురు చూడటంలేదు. మా కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉండటం కోసం అప్పట్లో అలా అనుకునేవాళ్లం. ♦ హీరోల్లా మీకు జోడీ ఉండదు కదా.. బాధగా ఉండదా? శంకర్:ఉంటే బాగానే ఉంటుంది. లేడీ కమెడియన్లు తక్కువ ఉన్నారు. తమిళమ్మాయి విద్యుల్లేఖా రామన్ చాలా బాగా నవ్విస్తుంది. ఇంకా చాలామంది రావాలి. ధన్‌రాజ్: అంటే లేడీ కమెడియన్ జోడీగా ఉండాలనుకుంటున్నాడన్న మాట. చూశారా.. శంకర్ మనసులో ఎంత ఆలోచన ఉందో (నవ్వుతూ). శంకర్:జోడీ అని కాదండి. లేడీ కమెడియన్లు ఉంటే బాగుంటుంది కదా అని. ♦ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలని లేదా? శంకర్: ఇప్పుడో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాం. ధన్‌రాజ్: అవునండీ.. ఆవిడెవరో కాదు.. హాట్ గాళ్ సన్నీ లియోన్. మేమిద్దరం ‘బుర్రకథ’ అనే సినిమాలో చేస్తున్నాం. ఆ సినిమాలోనే సన్నీ లియోన్‌తో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. భలే గమ్మత్తుగా ఉంటాయ్. ♦ ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారా? సెక్యూర్డ్ ప్లేస్‌కి చేరుకున్నారా? ధన్‌రాజ్: ఇంటికి సెక్యూర్టీ పెట్టుకునేంత రేంజ్‌కి ఎదగలేదు కానీ భార్యా కొడుకుని బాగా చూసుకునేంత సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నాను. మొన్నీ మధ్యే ఇల్లు కూడా కొనుకున్నాను. హ్యాపీ అండి. ♦ రియల్‌లైఫ్‌లో ఎవరు బాగా నవ్విస్తారు? శంకర్: నా కన్నా ధనరాజ్ ఎంతమందినైనా నవ్విస్తాడు. ఎదురుగా వందమంది ఉన్నా కంగారు పడడు. ధన్‌రాజ్: నేను మాట్లాడుతూనే ఉంటా. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను సరదాగా ఉండటానికే ఇష్టపడతాను. శంకర్ నాతో కాకుండా ఎవరితోనూ అంతగా కనెక్ట్ కాలేడు. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. కామెడీ చేసే విషయంలో నాకన్నా తనే బెస్ట్. ♦ మీ ఇద్దరిలో ఉన్న సిమిలారిటీస్! ధన్‌రాజ్: ఇద్దరం బుల్లితెర మీద ఫేమస్ అయ్యాం. చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ‘రాజుగారి గది’తో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఒకే ఒక్క తేడా. శంకర్ లావుగా ఉంటాడు...నేను సన్నగా ఉంటా అంతే. ♦ శంకర్ గురించి ఎవరికీ తెలియని విషయం? ధన్‌రాజ్: శంకర్‌లో మంచి చిత్రకారుడు ఉన్నాడు. ఇలా చూసి అలా గీసేస్తాడు. వంట బాగా చేస్తాడు. శంకర్: నాకు వంట బాగానే వచ్చండి. బయటివాళ్లకు అప్పుడప్పుడూ రుచి చూపిస్తుంటాను. వినాయక్‌గారికి, కృష్ణవంశీ గారికీ ఇష్టం. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అప్పుడు పవన్ కల్యాణ్‌గారికి చేపల పులుసు వండి తీసుకెళ్లాను. మూడు రోజుల పాటు తిన్నారు. శంకర్: నాకీ మధ్యే పెళ్లయ్యింది. ఏదో అలా అలా ఎదుగుతున్నాను. కెరీర్, పర్సనల్ లైఫ్ హ్యాపీ. ♦ హీరోలకైతే పెళ్లి సంబంధాలు క్యూలు కడతాయి. మరి కమెడియన్ల పరిస్థితి ఏంటి? ప్రేమ... గట్రా! ధన్‌రాజ్: నాది ప్రేమ వివాహం. వన్ డే లవ్‌స్టోరీ. చూడగానే నచ్చింది. చెప్పేశాను. ఒప్పేసుకుంది. పెళ్లి చేసేసుకున్నాను. శంకర్: నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమలు మనకు సూట్ కావు కూడా. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ♦ మ్యారీడ్ లైఫ్‌లో కామెడీ ఎలా ఉంటుందనుకుంటున్నారు? ధన్‌రాజ్: పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంటుంది. ఇంటికి త్వరగా వెళ్లిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ కూడా అదే అంటున్నాడు. ‘అన్నా నేను ఇంటికి వెళిపోతాను. నా భార్యతో కబుర్లు చెప్పుకుంటా. కాలక్షేపం అవుతుంది’ అని అంటున్నాడు. నేను తొమ్మిదేళ్ల క్రితం ఇదే అన్నా. జీవితాంతం ఎవరూ ఇలా అనరు. చిన్ని చిన్ని గొడవలు, అలకలు ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. సినిమా కోసం నటించి, ఇంటి దగ్గర కూడా నటిస్తే మాత్రం జీవితం కూడా సినిమా అయిపోతుంది. ♦ ఏడ్చినా నవ్వినా కన్నీళ్లొస్తాయి... మీకలాంటి సందర్భాలు ఉన్నాయా? ధన్‌రాజ్: ‘పిల్ల జమిందారు’ సినిమాలో మా నాన్నగారు చనిపోయే సీన్ ఒకటుంది. మా అమ్మ చనిపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు జేబులో అర్ధరూపాయో, రూపాయో ఉంది. ఆవిడ దహన సంస్కారాలు ఎలా చేయాలి? నాకు ఏడపు రాలేదు. భయం వేసింది. డబ్బు సమకూరాక ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మణికొండలో పూడ్చి పెట్టడానికి స్థలం ఇవ్వలేదు. కాలిస్తేనే ఇస్తాం.. ఇక్కడ ప్లేస్ లేదన్నారు. ‘భవిష్యత్తులో నేను డబ్బులు సంపాదించుకుంటాను. సమాధి కడతాను’ అన్నప్పటికీ ఇవ్వలేదు. అంతకు మించిన పెద్ద బాధాకరమైన సంఘటన నా జీవితంలో ఉండదు. అది గుర్తు చేసుకుని ‘పిల్ల జమిందారు’ సీన్ చేశాను. దాంతో సీన్ పండింది. శంకర్: సెట్లో మేం కామెడీ సీన్ ఇరగదీసినప్పుడు హాయిగా నవ్వుకుంటాం. బాగా చేశామనే ఆనందం తట్టుకోలేక కూడా కన్నీళ్లొచ్చేస్తాయ్. ♦ నవ్వు రాని కామెడీ ఉంటుంది.. అలా ఎవరైనా కామెడీ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ధన్‌రాజ్: మేం కూడా అలాంటివి కొన్ని చేస్తుంటాం. జేబ్ శాటిస్ఫేక్షన్ కోసం చేసినప్పుడు ఇలాంటివాటి గురించి ఆలోచించకూడదు. ♦ ఫైనల్లీ కామెడీ లేని సినిమా గురించి చెబుతారా? ధన్‌రాజ్: కామెడీ లేని సినిమా అంటే ఆ సినిమా టైటిలే ‘కామెడీ లేని సినిమా’. కామెడీ లేని సినిమా వేస్ట్ అనను. అది లేకుండా కూడా సినిమా ఆడితే అప్పుడా కంటెంట్ చాలా గొప్పగా ఉన్నట్లు. ‘మనీ మనీ’లో ఎక్స్ట్రార్డినరీ కామెడీ ఉంటుంది. ‘శివ’లో ఉండదు. ఆ రెండూ బాగా ఆడాయి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు కామెడీ లేకపోయినా ఫర్వాలేదు. కామెడీ లేని సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కొంచెం ఉప్పు తగ్గిన సాంబారు ఎలా ఉంటుందో ఆ సినిమా అలా ఉంటుంది. శంకర్:: కామెడీ ఉన్న సినిమా బాగుంటుంది. కథ డిమాండ్ చేయకపోయినా కావాలని కామెడీ పెడితే కామెడీ రాదు. అందుకే, కథకు తగ్గ కామెడీ అయితే బెస్ట్. చివరిగా ఒక్క మాట. మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం. మమ్మల్నిద్దర్నీ కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్ అండి. - డి.జి. భవాని -
పవన్‌కల్యాణ్ నా దేవుడు
చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి సత్తా నిరూపించుకోవడానికి జబర్దస్త్ ప్రోగ్రాం ఉపయోగపడింది ‘గీతాంజలి’తో వెండితెరకు పరిచయం సాక్షితో హాస్యనటుడు షకలక శంకర్ భూదాన్‌పోచంపల్లి : సినిమా పరిశ్రమలో నేటి తరం హాస్య నటుల్లో షకలక శంకర్‌ది ప్రత్యేకమైన స్థానం. వెండితెరపై తన హావాభావాలతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అనతికాలంలోనే రెండు పదులకు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన రాజుగారి గది సినిమా విజయవంతమై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం 15కు పైగా చిత్రాల్లో న టిస్తూ బిజీ నటుడి మారాడు. బుధవారం గౌస్‌కొండ గ్రామ పరిధిలో జరిగిన బుర్రకథ సినిమా షూటింగ్లో పిచ్చివాడి పాత్రను పోషిస్తున్న శంకర్ తన సినీ జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...... ప్రతి సినిమా ఐదారుసార్ల చూసేది నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. చదువుకొనే రోజుల్లో మా స్కూల్ పక్కనే సినిమా థియేటర్ ఉండేది. అందులో ఆడే ప్రతి సినిమాను ఐదారు సార్లు చూసేవాడిని. ఇలా ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని కోరిక ఏర్పడింది. జబర్ద్‌స్త్ ప్రొగ్రాం ద్వారా... నాలో ఉన్న టాలెంట్‌ను నిరూపించుకోవ డానికి జబర్ద్‌స్త్ ప్రొగ్రాం ఎంతో దోహదపడింది. నిరంతరంగా రెండేళ్ల పాటు సాగిన ప్రోగ్రాంలో ఎన్నో వైవిధ్యమైన హాస్యపాత్రలు పోషించి తన నటనను మెరుగుపర్చుకున్నా. ఈ వేదికే సినిమా రంగంలోకి అడుగిడగడానికి దోహదపడింది. నాగబాబు, సంజీవ్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు గీతాంజలి సినిమాతో వెండితెరకు పరిచయం అ య్యాను. నన్ను నటుడు నాగబాబు, దర్శకుడు సం జీవ్‌కుమార్ సినిమాల్లో ఎంతో ప్రోత్సహించారు. ఇ ప్పటి వరకు 15పైగా సినిమాల్లో నటించాను. వీ టిలో ఎక్స్‌ప్రెస్ రాజా, రాజుగారి గది మంచి పేరుతెచ్చా యి. అలాగే లౌక్యం, రన్ రాజా రన్, గరం, డిక్టేట ర్, సర్థార్ గబ్బర్‌సింగ్ తదితర సినిమాలు గుర్తింపుని చ్చాయి. 15 సినిమాలు విడుదలకు ఉన్నాయి ప్రస్తుతం 15 సినిమాల వరకు విడుదలకు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అల్లరి నరేష్‌తో ‘వీడు గోల్డ్ ఏహే’, రైట్..రైట్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ, సెల్ఫీ, హీరో సునిల్‌తో ఓ సినిమాలతో పాటు, మరికొని ఇంకా పేరు పెట్టని చిత్రాలున్నాయి. నాన్న సర్పంచ్ నా అసలుపేరు ఎస్.శంకర్రావు. మాది శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల గ్రామం. మానాన్న రామారావు ప్రస్తుతం గ్రామ సర్పంచ్. అమ్మ లక్ష్మి గృహిణి. పవన్‌కల్యాణ్‌కు వీరాభిమానిని.. ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్ నా దేవుడు. ఆయనంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి ఆయన వీరాభిమానిని నేను. రాజుగారి గది, రాజా ఎక్స్‌ప్రెస్‌లో నా నటను చూసి పవన్‌కల్యాణ్‌తో పాటు హాస్యనటులు నరేశ్, సునిల్, ఆలీ మెచ్చుకున్నారు. వారు చూపిన అభిమానం ఎన్నటికి మరువలేను. ప్రస్తుతం సినిమాల్లో తీవ్రమైన పోటీ ఉంది. అయినప్పటికీ ఎవరి టాలెంట్ వారిదే. ప్రేక్షక దేవుళ్లు ఆదరించినంతకాలం ఇలా నవ్విస్తూనే ఉండాలన్నది నా కోరిక. -
మయసభలో వినోదం!
హాస్యనటుడు ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మయసభ’. నెప్పలి కృష్ణ దర్శకత్వంలో ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై సరోజని, దేవా, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వినోదభరితంగా సాగే చిత్రమిది. రొటీన్‌కి భిన్నంగా ఇందులో సరికొత్త వినోదాన్ని ప్రేక్షకులు చూస్తారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రం పూర్తి చేయాలనుకున్నాం. ఇప్పటివరకు 50శాతం షూటింగ్ పూర్తయింది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఆద్యంతం వినోదంతో ఈ ‘మయసభ’ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో ఉండే నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి. ఖమ్మం, కృష్ణాజిల్లా, హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని ‘చిత్రం’ శ్రీను తెలిపారు. చింటు, జూ.రేలంగి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, కెమేరా: గోపి కాకర్ల. -
కొత్త జీవితాన్నిచ్చిన నగరమిది..
చిన్నతనం నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చితోనే ఇక్కడికి వచ్చాను. అమ్మా నాన్న నాకు జన్మనిస్తే ఈనగరం పునర్జన్మనిచ్చింది. అసలు హైదరాబాద్ లేకపోతే మాలాంటి వాళ్లకు ఏ రకంగా అవకాశాలొస్తాయి..! ఈ మహానగరం ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. చాలా మంది హైదరాబాద్‌లో ఏం ఇష్టమని అడుగుతారు? నా దగ్గర నుంచి ఏ గోల్కొండో, చార్మినార్ ఇలాంటివి ఊహిస్తారు. కానీ నాకు నచ్చిన ప్లేస్ ఫిలింనగర్. ఇక్కడ నుంచే నా పోరాటం స్టార్ట్ అయింది. ఈ ప్రయాణంలో నగరం నాకు మంచి మిత్రులను పరిచయం చేసింది. బతకడం నేర్పించింది. నా జీవితానికి కొత్త అర్థం నేర్పిన నగరమిది. - షకలక శంకర్ -
'సాహసం సేయరా డింభకా' స్టిల్స్
-
'షకలక శంకర్'తో సాక్షి చిట్ చాట్
-
‘షకలక’ శంకర్
కష్టాలను మరచిపోయేందుకు నవ్వుతూ గడిపాడు. ప్రేక్షకులను నవ్విస్తూ తన పేదరికాన్ని ఎదిరించాడు. పకపకా నవ్వాలంటే అతడి కామెడీ చూడాల్సిందే అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. శ్రీకాకుళం యాస విప్పితే కిలకిలా నవ్వకుండా ఉండలేం.. రాంగోపాల్‌వర్మలా అనుకరిస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే! అతడే షకలక కామెడీ శంకర్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్ ఆర్థిక స్తోమత లేక పదో తరగతికే ఫుల్స్టాప్ పెట్టేశాడు. అష్టకష్టాలు పడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చే వాడు. ఒకరోజు మంజునాథ సినిమా షూటింగ్లో చిరంజీవిని చూసి ఫిదా అయిపోయాడు. ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకుని 2002లో హైదరాబాద్ బస్సెక్కాడు. పెయింటింగ్ తప్ప ఇంకే పనీ రాదు. హైదరాబాద్‌లో మొదట స్నేహితుల వద్ద ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనికి వెళ్లాడు. ఆ తర్వాత ప్రముఖ సినీనటి నిర్మలమ్మ వద్ద పనిచేశాడు. అప్పుడే సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ బాయ్‌గా పని చేస్తూ సినిమాలు చూస్తూ గడిపేవాడు. రన్ రాజా రన్ దర్శకుడు అప్పట్లో తాను తీసిన షార్ట్‌ఫిలింలో ఒక అవకాశం ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకున్నాడు. క్లిక్ కావడంతో వెంటనే ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి జబర్దస్త్ కామెడీషోలో అవకాశం ఇవ్వడం.. ప్రేక్షకులు ఆదరించడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. తర్వాత గీతాంజలి, రన్ రాజా రన్ సినిమాల్లో నటించాడు. అనేక సినిమాల్లో నటిస్తూ శంకర్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇదంతా షార్ట్ ఫిల్మ్ మహిమే అంటాడు శంకర్! -
అదృశ్యమై..నటుడయ్యాడు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:వ్యక్తి అదృశ్యం..ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..తన కొడుకు తప్పి పోయాడని తండ్రి ఆవేదన...అదే కొడుకు ప్రయోజకుడిగా మారాడని తెలిస్తే.. తిరిగి ఇంటికి వస్తే.. కన్నవారి కళ్లల్లో ఆనందం చెప్పలేనిది. అదే జరిగింది శేషు శంకర్ ( షకలక శంకర్) విషయంలో. పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈయన నేడు మంచి కమేడియన్‌గా చిత్ర పరిశ్రమలో గుర్తిం పు తెచ్చుకున్నాడు. ఒక టీవీ చానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో 50 ఎపిసోడుల్లో నటించి తనలోని కళా ప్రతిభను ప్రదర్శిస్తున్న ఈయన సంక్రాంతి సందర్భంగా స్వగ్రా మమైన ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస గ్రామ పరిధిలోని శేసు పేట లో బుధవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. 10వ తరగతి తప్పి.. పదో తరగతి పరీక్షలో తప్పడంతో శంకర్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి రాములు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో తన కుమారుడు అదృశ్యమయ్యాడని 2000 సంవత్సరం లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈయన హైద రాబాద్ చేరుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి సహకారంతో తొలుత పెయింటర్‌గా జీవితం ప్రారంభించారు. సిక్కోలు జిల్లా మండ లికం, యాస, తూర్పు రామాయణం జానపదం వంటి అంశాల్లో పట్టు ఉండడంతో సినీ రంగంలో చేరాలని భావించాడు. పెయింటర్‌గా పనిచేస్తూనే మరో పక్క సినిమాల్లో ప్రయత్నాలు ప్రారం భించాడు. కొత్త నటీనటులు కావాలని పత్రికల్లో వచ్చే ప్రకటనలు చూసి అక్కడ వాలిపోయేవాడు. అయితే చిత్ర పరిశ్రమలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి అవకాశాలు ఆంత సులభం కాదు. అందులోనూ కు గ్రామం నుంచి వచ్చిన ఇతనికి కూడా అంతతేలిగ్గా అవకాశాలు లభించలేదు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా శంకర్ ప్రయత్నాలు చేస్తుండగా 2007లో చంద్ అనే డెరైక్టర్ నూతన నటీనటులతో ‘నోట్ బుక్’ సినిమా తీశారు. ఈ సినిమాలో నటించేందుకు శంకర్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో అధైర్య పడకుండా మళ్లీ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కొన్ని చిన్న సినిమాల్లో నటించినా అవి రిలేజ్‌కు సైతం నోచు కోలేదు. ఇంతలో ఓ చానెల్లో వస్తున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంపిక వ్వడంతో ఇతని జాతకం మారి పోయింది. ప్రముఖ నటుడు నాగ బాబు, నటి రోజా వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ కార్య క్రమం శంకర్‌లోని కమేడియన్ను పూర్తిస్థాయిలో వెతికితీసింది. దీంతో పాటు మరో 50 భాగాలు చేసేందుకు శంకర్ ఆ చానెల్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కార్యక్రమం ప్రాచుర్యం పొందటంతో సినిమా అవ కాశాలు కూడా వస్తున్నాయి. మోహన్ బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ డెరైక్టు చేస్తున్న సినిమాలో అవకాశం లభించింది. మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంతో రూపు దిద్దు కుంటున్న ఆగడు, ఈరోజుల్లో దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపు దిద్దు కొంటున్న చిత్రంలో పాటు మరో 10 చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినట్టు శంకర్ ‘న్యూస్‌లైన్’కు చెప్పా రు. పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఘన సన్మానం శంకర్‌కు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తనవం తు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి శ్రీనివాసరావు, సర్పంచి అంబటి సుజాత, నానాజీ పాల్గొన్నారు.