Shimbu
-
కోలీవుడ్‌లో సంచలనం.. నలుగురు స్టార్ హీరోలకు షాక్!
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నలుగురు స్టార్ హీరోలకు షాకిచ్చింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. హీరోలు ధనుశ్, శింబు, విశాల్, అథర్వకు తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. ఇకపై వీరు ఏ సినిమాల్లోను నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) నిషేధానికి కారణాలివే! నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలతోనే హీరో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వివాదంపై ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలతో రెడ్ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ చేసిన సినిమా 80 శాతం షూట్ పూర్తయ్యాక.. ఆ తర్వాత సహకరించకపోవడంతో నిర్మాతకు నష్టం జరిగినట్లు తెలిసింది. అందుకే విశాల్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మదియలకన్ నిర్మాణ సంస్థతో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. అయితే షూటింగ్ సమయంలో సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరితో పాటు నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల సంఘం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇక ఈ జాబితాలో ధనుష్, శింబు, విశాల్, అథర్వతో పాటు ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్! ) మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రధాన సంఘాలైన దక్షిణ భారత నటీనటుల సంఘం, తమిళ చిత్ర నిర్మాతల సంఘం మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నటీనటుల కాల్షీట్స్, కొత్త ఒప్పందాలపై నిర్మాతల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి. అదే విధంగా నటీనటుల వైపు నుంచి కొన్ని సమస్యలు ప్రస్తావించారు. ఈ భేటీలో నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరించినందుకు నలుగురు హీరోలపై చర్యలకు దిగింది. అయితే నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్‌లు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
రామ్ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్ రికార్డు.. ఏంటో తెలుసా ?
Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..' సాంగ్ రిలీజై తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక సాహిత్యమందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి #BulletSong Spark Causing the Wildfire on YouTube 💥 Continues to make whole India groove with 100 Million+ Views 🕺💃 Telugu: https://t.co/XiPpHzsESj Tamil: https://t.co/amuQsznXC2@ramsayz @SilambarasanTR_ @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens pic.twitter.com/HU9lVFA1Z1 — Srinivasaa Silver Screen (@SS_Screens) June 15, 2022 -
లాక్డౌన్లో 27 కేజీల బరువు తగ్గాను : శింబు
Hero Simbu Says He Lost 27 Kgs In Lockdown: ‘‘నేను నటించిన ‘మన్మథ, వల్లభ’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధం’’ అని హీరో శింబు అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, యస్.జె. సూర్య, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మానాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. అల్లు అరవింద్, బన్నీ వాసు తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ‘ది లూప్’ రూపొందింది. ఇందులో నేను చేసిన అబ్దుల్ కాలిక్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాల వల్ల సామాన్య వ్యక్తి అయిన అబ్దుల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వాటిని ఎలా అధిగమించాడు? అన్నదే ఈ చిత్రకథ. ఒక్క రోజులో వేరే వేరే సమయాల్లో జరిగే కథ ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్ర పోషించాను. ఈ పాత్ర కోసం 27 కిలోల బరువు తగ్గాను. వెంకట్ ప్రభు మంచి దర్శకుడు. గతంలో ‘మన్మథ’ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దామంటే వద్దన్నారు.. అయినా పట్టుబట్టి నేను డబ్బింగ్ చేయించి, రిలీజ్ చేశాను. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘ది లూప్’ని కూడా నేనే తెలుగులో రిలీజ్ చేయిస్తున్నాను. నాపై నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు
Simbu Cries At His Maanadu Movie Event: కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తమిళ హీరో శింబు కన్నీరు పెట్టుకున్నారు. వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. మూవీ విశేషాలను పంచుకుంటూనే ఒక్కసారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు. చదవండి: పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం వెంకట్ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నాడు. ‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదవ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు. అంతేగాక సినిమా విడుదల తర్వాత తన మరో స్థాయికి వెళ్తుందన్నాడు. ఇప్పటి వరకు సరదాగా మాట్లాడిన శింబు ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనని కొందరూ టార్గెట్ చేశారని, కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా శింబు ఏడవడం చూసిన పక్కనే ఉన్న మిగతా సినిమా క్రూడ్ ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి దాని నుంచి తేరుకున్న శింబు ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం మీరు (అభిమానులు) చూసుకోవాలని కోరారు. శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయనను ఓదార్చారు. -
ఈ సమస్యలకు శింబునే కారణం: ఆర్కే సెల్వమణి
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ)కు మధ్య సమస్యకు నటుడు శింబునే కారణమని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అన్నారు. శింబు ‘అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్’ మూవీ నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు ఆ చిత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శింబు తీరుతోనే తాను నష్టపోయానని.. తనకు పరిహారం చెల్లించాలని రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీంతో రాయప్పన్‌కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. లేనిపక్షంలో ఆయన నటిస్తున్న చిత్రాలకు ఎలాంటి సహకారం అందించబోమని ప్రకటించారు. అయినా శింబు చిత్రాలకు ఫెఫ్సీ కార్మికులు పని చేశారు. ఈ వ్యవహారంతో ఫెఫ్సీ, నిర్మాతల మండలి మధ్య సమస్యలు తలెత్తాయి. దీనిపై ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు శింబు నటిస్తున్న 4 చిత్రాలకు తాము కూడా ఎలాంటి సహకారం అందించలేదన్నారు. అయితే శింబు హీరోగా ఐసరిగణేష్ నిర్మిస్తున్న చిత్రం ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 4 రోజులు అనుమతి ఇవ్వాలని కోరాలన్నారు. నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు ఈ సినిమాకు పని చేశారని వివరించారు. సీఎం స్టాలిన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఆయన పేర్కొన్నారు. -
ఐదు భాషల్లో శింబు ‘రివైండ్’
‘‘శింబు హీరోగా నటిస్తున్న సినిమా టీజర్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అన్నారు హీరో రవితేజ. శింబు, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రివైండ్’. హిందీ–తమిళ్– తెలుగు–కన్నడ–మలయాళ భాషల్లో సురేష్ కామాచి నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మానాడు’, తెలుగులో ‘రివైండ్’ టైటిల్‌తో రూపొందుతోంది. బుధవారం శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ని రవితేజ రిలీజ్ చేశారు. ‘మానాడు’ హిందీ టీజర్‌ని దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ టీజర్‌ని సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, కన్నడ టీజర్‌ని హీరో సుదీప్ విడుదల చేశారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శింబు ముస్లిమ్ పాత్ర చేస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దర్శకులు భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, ఎస్.జె. సూర్య, కరుణాకరన్ నటిస్తుండడం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. -
గౌతమ్ మీనన్‌తో ముచ్చటగా మూడోసారి
తమిళ హీరో శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ మూడోసారి ఒక ప్రాజెక్ట్‌కి కలవనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమయడా’ (ఈ రెండు సినిమాలను ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’గా నాగచైతన్యతో తెలుగులో తెరకెక్కించారు గౌతమ్ మీనన్) చిత్రాలు వచ్చాయి. లాక్డౌన్లో ‘కార్తీక్ డయల్ సెయ్ ద ఎన్’ అనే షార్ట్‌ఫిల్మ్ కూడా చేశారు శింబు, గౌతమ్ మీనన్. ఐ ఫోన్‌తో ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ లఘు చిత్రం చేశారు. తాజాగా ఓ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. వేల్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఇషారీ కే గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘కొన్ని కథలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు గౌతమ్ మీనన్. ఇది ‘విన్నైత్తాండి వరువాయా’కు సీక్వెల్ అని ప్రచారంలో ఉంది. -
త్రిబుల్ ధమాకా
శింబు హీరోగా, తమన్నా, శ్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అఅఅ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యాళ్ళ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. శింబు మూడు పాత్రల్లో కనిపిస్తారు. తమన్నా, శ్రియల పాత్రలు బాగుంటాయి. తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులు ఉంటాయి. డైలాగ్స్, పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. అందరూ మా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సహ నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్. -
అప్పుడే నా పెళ్లి.. లేదంటే..!: త్రిష
చెన్నై: దాదాపు రెండు దశాబ్ధాల పాటు తెలుగులో అగ్రనటిగా రాణించారు చెన్నై భామ త్రిష. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన త్రిష చివరిగా జూనీయర్ సరసన ‘దమ్ము’లో చిత్రంలో నటించారు. ఆ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ఇచ్చిన త్రిష ప్రస్తుతం తెలుగులో తక్కువ.. తమిళ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక మూడు పదుల వయసుకు వచ్చినప్పటికి ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ఓ వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికి అది పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత త్రిష సినిమా పరిశ్రమలోని ఓ హీరోతో ప్రేమాయాణం నడుపుడుతున్నట్లు తరచూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తమిళ హీరో శింబు-త్రిషలు ప్రేమలో ఉన్నారని, త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?) ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో త్రిష తన పెళ్లిపై క్లారిటి ఇచ్చారు. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే నా పెళ్లి లేదంటే సింగిల్‌గానే ఉంటాను’ అని పేర్కొన్నారు. అంతేగాక తను ప్రేమ వివాహమే చేసుకుంటానని, మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు పెళ్లి చేసుకోనన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తి తారసపడకుంటే జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు -
బాబు బంగారం!
సినిమా షూటింగ్ అంటే మినిమమ్ వంద రోజులు యూనిట్ అంతా ట్రావెల్ చేస్తారు. సినిమా భారీతనాన్ని బట్టి రోజులు పెరుగుతాయి. చిన్న సినిమాలంటే ముప్ఫై నలభై రోజుల్లో పూర్తవుతాయి. రోజులు ఎన్నయినా ఒక సినిమా పూర్తయ్యేంతవరకూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి షూటింగ్ చివరి రోజు ఒకింత ఎమోషన్ అవుతారు. కొంతమందైతే బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుంటుంది. షూటింగ్ చివరి రోజున అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలు యూనిట్ సభ్యులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా మరో స్టార్ శింబు కూడా ‘ఈశ్వరన్’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. శింబూకి వివాదస్పద వ్యక్తి అనే పేరుంది. అయితే ఇలాంటి మంచి పనులు చేసి ‘బాబు బంగారం’ అని కూడా అనిపించుకుంటుంటారు. ఇక సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈశ్వరన్’ సంక్రాంతికి విడుదల కానుంది. -
జోడీ కుదిరింది
శింబు, శ్రుతీహాసన్ జంటగా ఓ సినిమాలో నటించబోతున్నారా? అంటే, అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రవితేజ సరసన ‘క్రాక్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలు చేస్తున్నారు శ్రుతీహాసన్. తమిళంలో ‘లాభం’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా శింబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం శింబు ‘మహా’, ‘మానాడు’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారని. ఇందులోనే శింబు సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ పెద్దగా జరగడంలేదు. పరిస్థితులు అనుకూలంగా మారాక ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
సీక్వెల్‌కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్. -
చలో మలేషియా
దాదాపు ఇరవై రోజులకు సరిపడ సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నారు హీరో శింబు. ఇంతకీ ఎక్కడికెళుతున్నారనేగా మీ సందేహం. ఆయన మలేషియాకు వెళ్లబోతున్నారు. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మనాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు బరువు తగ్గడమే కాకుండా, మార్షల్ ఆర్ట్స్‌లో ఫారిన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు ఉంటుందట. మలేషియాలో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
కలిసిపోయారు
తమిళ నటుడు శింబు, హన్సిక అప్పట్లో ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. తాజాగా మళ్లీ కలిశారు. కలిసిపోయారా? అని ఆశ్చర్యపడకండి. ఈసారి కలిసింది ప్రొఫెషనల్‌గా మాత్రమే. హన్సిక తాజా చిత్రం ‘మహా’లో శింబు ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్లో శింబు జాయిన్ అయ్యారు. హన్సిక చేస్తున్న ఈ తొలి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. యుఆర్ ఉజ్వల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు ఫ్లాష్‌బ్యాక్ భాగంలో మెరుస్తారట. ప్రస్తుతం ఫారిన్లో శింబు, హన్సికలపై ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి శింబూని హన్సికనే ఒప్పించారని దర్శకుడు ఇటీవల పేర్కొన్నారు. -
కొత్త కోణం
ఇన్ని సంవత్సరాలుగా ఐశ్వర్యా రాయ్‌ను రకరకాల పాత్రల్లో చూశాం. అందం, అభినయం బ్యాలెన్స్ చేస్తూ గుర్తుండిపోయే రోల్స్ చేశారామె. అయినా నటిగా ఆమె దాహం తీరలేదు. లేటెస్ట్గా ఐష్ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకురానున్నారని తెలిసింది. ఆమె నెగటివ్ రోల్లో కనిపించనున్నారట. తమిళ ఫేమస్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, శింబు, జయం రవి, కార్తీ, నయనతార, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఇందులో ఐశ్వర్యా రాయ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అధికార దాహం కలిగిన రాణి పాత్రలో ఐష్ నటించనున్నారట. చోళుల సామ్రాజ్యం చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
37 రోజులు...13 కిలోలు
చెప్పినంత ఈజీ కాదు సాధించడం. కానీ యాక్టర్ శింబు సాధించాడు. 37 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గుతానని సవాల్ చేశాడు. అన్నట్లుగానే తగ్గాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా సురేశ్ నిర్మాణంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం లండన్‌లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు శింబు. అలాగే లుక్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి సరైన డైట్‌తో కూడిన వర్కౌట్‌తో బరువు తగ్గాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు ఓ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాడు శింబు. ఇందులో గౌతమ్ కార్తీక్ మరో హీరో. -
యంజీఆర్ – యంఆర్ రాధల కథేంటి?
తమిళ సినీ చరిత్రలో యంజీఆర్‌ను యంఆర్ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ చర్చ జరిగే టాపిక్. ఈ కాల్పుల్లో యంజీఆర్ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్‌ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్ రాధా మీద ఓ బయోపిక్ రూపొందనుండటమే. నటి, యంఆర్ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్ రధన్ మీడియా వర్క్స్‌పై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఇది యూత్ కోసమే
ఐదుగురమ్మాయిలు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్’ ‘ఇది చాలా తక్కువ’ అనేది క్యాప్షన్. ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. హీరో శింబు గెస్ట్ రోల్ చేసి, సంగీతం అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించారు. కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో పఠాన్ చాంద్‌బాషా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సురేశ్ కొండేటి సీడీను ఆవిష్కరించి మాట్లాడుతూ – ‘‘యూత్‌ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఇది. పాటలు, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ నెల 26న చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు పఠాన్ చంద్. ఈ వేడుకలో విజయరంగరాజు, మల్లికార్జున్, రంగనాయకులు, కరుణాకర్ రాము తదితరులు పాల్గొన్నారు. -
ఇది చాలా తక్కువ!
తమిళ బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘90ఎంఎల్’. ‘ఇది చాలా తక్కువ’ అన్నది ట్యాగ్‌లైన్. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు ప్రత్యేక పాత్రలో కనిపించి, సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో పఠాన్ చాంద్‌బాషా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తమిళంలో హిట్ అయినట్టే తెలుగులోనూ హిట్ సాధించాలని అన్నారు. నిర్మాత చాంద్‌బాషా మాట్లాడుతూ – ‘‘తెలుగు హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడింది. మేం దక్కించుకున్నాం. కామెడీ డ్రామాగా సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘ఐదుగురు అమ్మాయిలు.. వాళ్లకు ఎదురైన సమస్యల వల్ల మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఎలా బయటపడ్డారన్నది కథ. శింబు స్పెషల్ రోల్, సంగీతం ఆకట్టుకుంటుంది’’ అన్నారు నిర్మాణ సారథి కృష్ణ కాకర్లమూడి. ఈ కార్యక్రమంలో డా. రంగనాయకులు, శ్రీధర్, వాసుదేవ్ వైజాగ్ దివాకర్ పాల్గొన్నారు. -
రాజకీయం చేస్తారా?
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ! -
రాజకీయం చేస్తారా?
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ! -
మళ్లీ కలిశారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది సామెత. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే.. కొందరు కలిసి నటించడం.. ప్రేమలో పడటం చకచకా జరిగిపోతాయి. ప్రేమలో ఉన్నన్నాళ్లూ చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే టైమ్‌లో లవ్‌కి బ్రేకప్ చెబుతుంటాయి కొన్ని జంటలు. అలా విడిపోయిన జంటల్లో శింబు, హన్సిక కూడా ఉన్నారు. విడిపోయాక కలిసి సినిమాలు చేయడం మానేసే జంటలు.. ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మార్చుకుని కలిసి నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటారు. శింబు, హన్సిక కూడా బ్రేకప్ తర్వాత కలిసి నటించడం మానేశారు. ఇప్పుడు హన్సిక 50వ చిత్రం ‘మహా’లో నటించడానికి శింబు అంగీకరించారు. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్లతో వివాదాస్పదం అయ్యింది. దాంతో ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు అదనపు ఆకర్షణ జోడించాలనే ఉద్దేశంతో శింబుతో అతిథి పాత్ర చేయిస్తున్నారట జమీల్. ‘ఈ విషయాన్ని మేమే చెప్పాలనుకున్నాం. కానీ ముందే బయటికొచ్చేసింది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’’ అని హన్సిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. -
90ఎంఎల్‌పై విమర్శల వర్షం
పెరంబూరు: సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అంటూ నటి ఓవియ నటించిన 90ఎంఎల్ చిత్రంపై విమర్శలు వెల్లువడుతున్నాయి. బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఓవియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. దీన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ తెరకెక్కించారు. నటుడు శింబు సంగీతాన్ని అందించడం విశేషం. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. అయితే ఇందులో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్ చుంబనాలు, అదే విధంగా సహజీవనం, లెస్బియన్ సన్నివేశాలాంటివి చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90ఎంఎల్ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాకుండా డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయకూడదని అన్నారు. ఈయన వ్యాఖ్యలకు 90ఎంఎల్ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్ బదులిచ్చేలా మీరు నిర్మించిన చంద్రమౌళి చిత్రంలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకరాలిని కాదు అని వెటకారపు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. అందుకు ధనుంజయన్ నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదని అన్నారు. నా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌నే పొందాను. మీ చిత్రం మాదిరి ఏ సర్టిఫికెట్ కాదు. అయినా చిత్రంలో పాటలు ఎలా ఉండాలన్నది దర్శకుడి నిర్ణయం అని, నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. దీంతో దర్శకురాలు అనితా ఉదీప్ సార్ మీతో వివాదం బోర్ కొడుతోంది. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అని పేర్కొన్నారు. ఆ తరువాత ధనుంజయన్ నుంచి బదులు రాకపోవడంతో అనితా ఉదీప్ ప్లీజ్ పారిపోకండి. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది అని ట్వీట్ చేశారు. వీరి వివాదం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
నాకున్న ఇద్దరు, ముగ్గురి ఫ్యాన్లకే చెబుతున్నా : హీరో
తమిళ నాట నిత్యం వివాదాల్లో ఉండే స్టార్ హీరో శింబు.. ప్రస్తుతం ఓ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అత్తారింటికి దారేది మూవీ రీమేక్‌గా రాబోతోన్న 'వంద రాజవతాన్ వరువేన్' ఫిబ్రవరి ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. థియేటర్ల వద్ద హంగామా చేయవద్దు, టిక్కెట్లను బ్లాక్‌లో కొనకండి, థియేటర్లలోనే చూడండి.. భారీ ప్లెక్స్‌లు, కటౌట్లు, పాలాభిషేకాలు చేయకండి.. డబ్బును వృథా చేయకండి. ఆ డబ్బుతో అమ్మానాన్నలు బాగా చూసుకోండి వారి తరువాతే ఎవరైనా అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం శింబును ఓ ఆటాడేసుకున్నారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని, నీకు అంతా సీన్ లేదు, నువ్వు అంత పెద్ద హీరోవి కాదని, నీకు ఉండేదే ఇద్దరు ముగ్గురు అభిమానులు అంటూ నానా రకాలుగా కామెంట్లు చేశారు. అసలే కోలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా ముద్రపడిన శింబు.. వీటికి తన స్టైల్లో సమాధానం చెప్పాడు. వెంటనే మరో వీడియోను షేర్ చేస్తూ..తాను ఇంతకు ముందు షేర్చేసిన వీడియోలో చెప్పిన వాటికి కొంతమంది నెగెటివ్‌గా కామెంట్ చేశారని, నాకు ఉన్నది ఇద్దరు ముగ్గురు ఫ్యాన్సేనని వారికే ఇది చెబుతున్నా అని.. ఇంతవరకు చేయనంత హంగామా చేయండని, భారీ ప్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టండని, పాల ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో పాలాభిషేకం చేయండంటూ తన స్టైల్లో నెటిజన్లకు కౌంటర్ వేశాడు. -
తమిళ ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్లో అత్తారింటికి దారేది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సగం సినిమా పైరసీ ద్వారా బయటకు వచ్చినా.. కలెక్షన్లలో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ (‘వంత రాజవథాన్ వరువెన్’) టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయగా.. ‘అత్తారింటికి దారేది’ని ఉన్నది ఉన్నట్టుగా దించేశారని కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీని ఫిబ్రవరి ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించగా.. హిప్ హాప్ తమీజా సంగీతాన్నిఅందించారు. మరి ఈ చిత్రం.. అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.