Shivraj Singh Chouhan
-
బురద గోతిలో దిగబడిన శివరాజ్‌సింగ్ కారు
బహరగోరా: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ నేపధ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తరచూ జార్ఖండ్‌లో పర్యటనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన జార్ఖండ్‌లోని బహరగోరా చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బురద గుంతలో కూరుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన భద్రతా సిబ్బంది కారు చుట్టూ నిలబడి, కారును గొయ్యి నుంచి బయటకు తీయడాన్ని చూడవచ్చు. #WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K— ANI (@ANI) September 23, 2024ఇంతటి వర్షం మధ్యనే బహారగోరాలో జరిగిన బహిరంగ సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘మేఘాలు గర్జిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూస్తుంటే జార్ఖండ్‌లో చీకటి పోతుందని, సూర్యుడు ఉదయిస్తాడని, కమలం వికసిస్తుందని, మార్పు వస్తుందని నేను చెప్పగలను. జార్ఖండ్‌లోని మట్టిని, ఆడబిడ్డలను కాపాడుకుంటామని భారతీయ జనతా పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
వ్యవసాయ విజయాలకు పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఆగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పథకం అమల్లో అంకితభావం, విజయాలకు గుర్తింపుగా తెలంగాణకు అవార్డును అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌కు అవార్డును ప్రదానం చేశారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ అమల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన రాష్ట్రంగా తెలంగాణను గుర్తించారు.కాగా ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.2,836 కోట్ల మేర ప్రయోజనం లభించింది, ఈ నిధులతో 2,199 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు నెలకొల్పామని రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో నెలకొలి్పన యూనిట్లలో ప్రధానంగా 1,322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 785 గిడ్డంగులు, 163 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 101 పోస్ట్–హార్వెస్ట్ సౌకర్యాలున్నాయి. వీటిద్వారా రాష్ట్ర రైతులు మెరు గైన వసతులతో అధిక ఆదాయం పొందుతున్నా రని రఘునందన్ రావు తెలిపారు. ఈ స్కీమ్ కింద అత్యుత్తమ పనితీరున్న జిల్లాలుగా నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట గుర్తింపు పొందాయి. ఈ స్కీమ్ కింద రైతులకు 3% వడ్డీ సబ్సిడీ లభిస్తోంది. తద్వా రా రైతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి తీసుకునే రుణాలపై 6% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల రుణం వరకు వేరే హామీ అవసరం లేదు. -
కేంద్రం ఆదుకోవాలి... తక్షణ సాయం అందించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరద బీభత్సంతో అపారనష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచి్చన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్, బండి సంజయ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమయ్యారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తోపాటు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణసాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర కలి్పంచండి: తుమ్మల విన్నపం ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. తెలంగాణలో కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫారి్మంగ్‌ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చౌహాన్ త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నిబంధనలను సడలించాలి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లు కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పారీ్టలు, రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. -
రాజకీయాలకు కాదు..రైతుల కోసం వచ్చాం
కూసుమంచి: ‘భారీగా వరదలు వచ్చాయి.. రైతులు ఎంతో నష్ట పోయారు. ఈ నష్టాన్ని కళ్లారా చూశాను. రైతులను ఆదుకునేందుకే నేనూ, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీ వద్దకు వచ్చామే తప్ప రాజకీయాల కోసం కాదు’ అని కేంద్ర వ్యవసా యశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు శుక్రవారం కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఖమ్మం జిల్లాకు వచ్చారు. ముందుగా ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాక.. కూసుమంచి మండలానికి చేరుకున్నారు.అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి జాతీయరహదారి గుండా వెళుతూ పాలేరువాగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పాలేరు వద్ద ఎడమకాల్వకు పడిన గండి, నర్సింహులగూడెం వద్ద దెబ్బతిన్న వరిని పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వరద నష్టంపై ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.నేనూ రైతునే..వరదలకు వరి, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఏరియల్ సర్వే ద్వారా గమనించానని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. తాను రైతునేనని, రైతుల కష్టా లు తెలుసునని చెప్పారు. వందేళ్లలో ఇవే భారీ వర దలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగా.. వాస్తవాన్ని చూసి చలించిపోయానన్నారు. ఒక్క పంటలే కాకుండా ఇళ్లు, వస్తువులు దెబ్బతినగా జంతు వులు మృత్యువాత పడ్డాయని, రైతులు ఈ వరదల్లో పంటలనే కాదు, వారి జీవనాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రైతులకు ఎలా మేలు చేయా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, అందుకే ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో వాల్సి వచ్చిందని మంత్రి చౌహాన్ తెలిపారు.రైతు కన్నీరు.. ఓదార్చిన కేంద్ర మంత్రినవోదయ విద్యాలయంలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన రైతు హలావత్ వెంకన్న హిందీలో మాట్లాడారు. వరదలతో తాము సర్వస్వం కోల్పోయామని, ఆశలన్నీ గల్లంతయ్యాయని కన్నీరు పెడుతూ కేంద్రమంత్రి చౌహాన్ కాళ్లపై పడబోగా ఆయన రైతును పైకి లేపి ఓదార్చారు. ‘మీ బాధలు కళ్లారా చూశాను.. కంటనీరు రానివ్వం’ అని భరోసా కల్పించారు. పర్యటన అనంతరం నాయ కన్‌గూడెం టోల్‌ప్లాజా నుంచి కేంద్ర మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒకే హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. -
ఢిల్లీకి మారిన శివరాజ్ సింగ్ చౌహన్.. కుమారుడికి లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీకి మకాం మార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ సీఎం హస్తీనాకు షిఫ్ట్ అయ్యారు.అయితే చౌహన్ నిర్ణయంతో ఆయన కుమారుడు కార్తీకే సింగ్ చౌహన్ రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బుధ్నీఅసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చౌహన్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మోరెనా నుంచి పోటీ గెలుపొందారు. ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బుధ్నీ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీకే బరిలో దిగనున్నట్లు సమాచారం. -
ఆ ముగ్గురు రాజకీయ జోకర్లు.. మాజీ సీఎం సెటైర్లు
బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్, శివసేన నేతలను జోకర్లుగా అభివర్ణించారు. ఆ ముగ్గురు రాజకీయ జోకర్లుకాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా, శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోకర్లని, వాళ్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇలా చేస్తూనే ఉంటారు. ప్రజలు వాటిని ఎంటర్టైన్గా భావిస్తారని తెలిపారు. ఎవరూ సీరియస్‌గా తీసుకోరువారి స్థాయి కంటే దిగజారి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో రాజకీయ జోకర్లుగా మారారు. అయ్యర్, పిట్రోడా, రౌత్‌లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు అని చౌహాన్ వ్యాఖ్యానించారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ‘ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మేధోపరంగా దివాళా తీశారు. ఇది మునుపటి బలహీనమైన యూపీఏ ప్రభుత్వం కాదని, 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం’ అని ఇదే విషయాన్ని అయ్యర్ గమనించాలి చౌహాన్ సూచించారు.భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్‌మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చౌహాన్.. ‘భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేశారని అన్నారు. అదే సమయంలో దేశానికి ఇబ్బంది కలిగించే ఎవరినీ విడిచిపెట్టరని హెచ్చరించారు.ప్రపంచ దేశాలకు భారత్ విశ్వ గురువు ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం విశ్వ గురువుగా మారుతుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ మరో ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడవలసి ఉంటుంది. కానీ అలా చేయడానికి తగినంత మంది సభ్యులు ఉండరు’ అని చౌహాన్ నొక్కాణించారు. -
లోక్‌సభ బరిలో మాజీ సీఎం.. అక్కడి నుంచే పోటీ?
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు సాధించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి 370కు పైగా సీట్లను గెలుస్తుందని ఇటీవల ఆయన ప్రకటించారు. మరోవైపు విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల పంపకాల చర్చలు ఇంకా ఖరారు కాలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అయితే బీజేపీ కాంగ్రెస్‌లు ఇంకా ఎవరి పేరును ప్రకటించలేదు. కాగా తాజాగా మీడియాకు అందిన సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని విదిశ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విదిశ జిల్లా జనాభా దాదాపు 14.5 లక్షలు. ఇక్కడ 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1989 నుంచి ఇక్కడ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన రమాకాంత్ భార్గవ విదిశ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయనకు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిపై రమాకాంత్ భార్గవ విజయం సాధించారు. ఈ స్థానంలో మొత్తం 12,50,244 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థికి 3,49,938 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రమాకాంత్ భార్గవకు 8,53,022 ఓట్లు దక్కాయి. మధ్యప్రదేశ్‌లోని ఇతర స్థానాల మాదిరిగానే విదిశలో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎవరిని బరిలోకి దింపుతాయో అధికారికంగా ఇంకా నిర్ణయం వెల్లడికాలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ విషయానికొస్తే విదిశ అతని సొంత జిల్లా. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఆయనకు విదిశ టిక్కెట్ ఇవ్వనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆశించడం కంటే చనిపోవడం మేలు: మాజీ సీఎం శివరాజ్ సింగ్
భోపాల్: సీఎం పదవి నుంచి దిగిపోయినవేళ మధ్యప్రదేశ్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం బాధ్యతలు చేపట్టనుండగా, మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి తనకు ఏదో ఒక పదవి కావాలని అధిష్టానాన్ని కోరుకోవడం కంటే చనిపోవడం మేలని పేర్కొన్నారు. అలా తాను అడగలేనని చెప్పారు. తన ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త సీఎం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంలో ఆయనకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మహిళా కార్యకర్తలు కొందరు కంటనీరు పెట్టుకోవడం, శివరాజ్‌సింగ్ భావోద్వేగానికి గురైనట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 📌 Women Supporters get Emotional while meeting Outgoing Madhya Pradesh CM Shivraj Singh Chouhan. #TNI #Insight #PiN #Politics #MadhyaPradesh #Women #ShivrajSinghChouhan pic.twitter.com/8KDwHOwnHw — The News Insight (TNI) (@TNITweet) December 12, 2023 బీజేపీ అనూహ్య నిర్ణయం.. మరోవైపు.. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపారు. One tight slap to Congress handles pic.twitter.com/gj6myS7mM8 — Rishi Bagree (@rishibagree) December 12, 2023 కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు మాత్రమే పాటిస్తానని వెల్లడించారు. తానొక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పేర్కొన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 230 స్థానాలకు గాను 163 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను సాధించగా.. ఈ సారి ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత తగ్గింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా సమష్టిగా ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ముఖచిత్రంగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్‌కు కాకుండా వేరే వ్యక్తిగా సీఎం పదవి ఇస్తారని పుకార్లు పుట్టాయి. అటు.. శివరాజ్ సింగ్నే సీఎం గా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవిపై తాజాగా శివరాజ్ సింగ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ కలిశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి సోమవారం వచ్చిన కమల్‌నాథ్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్.. కమల్‌నాథ్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంత చేసుకుంది. 230 స్థానాలకు గానూ ఏకంగా 163 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా కమల్‌నాథ్ సారధ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. #WATCH | Madhya Pradesh | State Congress president Kamal Nath meets Chief Minister Shivraj Singh Chouhan at his residence in Bhopal. The party registered a thumping majority in the state election, winning 163 of the total 230 seats. pic.twitter.com/CSTFecTjKC — ANI (@ANI) December 4, 2023 -
వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు
భోపాల్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్‌కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ భావించడం లేదు. నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు. గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్‌ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్‌ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్’ స్కూళ్లు
Madhya Pradesh Elections: మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగనుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సరికొత్త హామీ ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సాగర్ జిల్లాలో ప్రచార ర్యాలీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ స్కూల్‌కు వచ్చి వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత బస్సుతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ‘రాష్ట్రంలోని ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తాం. ఇక్కడ లైబ్రరీ, ల్యాబ్‌లు, స్మార్ట్ క్టాస్రూమ్లతో పాటు విద్యార్థులను స్కూల్‌కి తీసుకొచ్చి, ఇంటికి చేర్చేందుకు బస్సులు ఉంటాయి. ఇవన్నీ ఉచితమే’ అని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. కాగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1990 నుంచి ఆయన ఇక్కడ ఐదు పర్యాయాలు పోటీ చేసి గెలుపొందారు. -
50 శాతం కమీషన్ల పాలన : కమల్‌నాథ్
నర్సింగాపూర్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ పాలనలో 50 శాతం కమీషన్ల రాజ్యం నడుస్తోందంటూ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఆరోపించారు. చౌహాన్ అవినీతి పాలన రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేసిందన్నారు. బుధవారం నర్సింగాపూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో యువత, రైతులు, అన్ని సామాజిక వర్గాల భవిష్యత్తును బీజేపీ పాలన సర్వనాశనం చేసిందన్నారు. కేవలం బీజేపీ నేతలు, అధికార పెద్దలు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. 18 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి వ్యవస్థ వంటివన్నీ పూర్తిగా పట్టాలు తప్పాయన్నారు. అబద్ధపు పథకాలను ప్రకటించనిదే చౌహాన్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. -
సీఎం శివరాజ్‌సింగ్ భావోద్వేగం.. బీజేపీని గెలిపిస్తారా? అంటూ..
భోపాల్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రచారంలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిండోరిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ప్రజలను కోరారు. తాను మంచి ప్రభుత్వాన్నే నడుపుతున్నానా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా? ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీనే విజయం సాధించాలని ఆశిస్తున్నారా?. ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగాలని కోరుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక, సీఎం శివరాజ్‌సింగ్ అడిగిన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. అనంతరం పోటీ చేసేందుకు తాము ప్రజల అనుమతి తీసుకుంటామని సీఎం విలేకరులతో తెలిపారు. అంతకుముందు కూడా.. కొన్ని సమావేశాల్లో సీఎం చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. సొంత నియోజకవర్గం బుధ్నిలో తనను ఎన్నికల్లో పోటీ చేయమంటారా అని ప్రజలను అడిగిన విషయం తెలిసిందే. మరోవైపు.. మధ్యప్రదేశ్ పర్యటనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ధార్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎంపై శివరాజ్ సింగ్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ.. సీఎం గురించి మాట్లాడేందుకు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. సీఎం పేరు ప్రస్తావించకుండానే ఓట్లు అడుగుతున్నారని అన్నారు. దీని బట్టి వచ్చే ఎన్నికల్లో సీఎం ఓటమి చవిచూడడం ఖాయమని ప్రియాంక ఎద్దేవా చేశారు. -
మీరొక డమ్మీ సీఎం.. అందుకే పక్కన పెట్టేశారు
భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మన రాష్ట్రం ఎప్పుడు వచ్చినా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడంతో ప్రధానికి మీ విషయం అర్థమైందని మీరు ముఖ్యమంత్రే కానీ డమ్మీ ముఖ్యమంత్రి అని అన్నారు. డమ్మీ సీఎం.. ఈరోజు 'జన ఆశీర్వాద యాత్ర' ముగింపు సందర్బంగా ప్రధాని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్న నేపథ్యంలో ఎక్కడా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ఉనికి కనిపించడంలేదని చెబుతూ ఆయనొక అబద్దాలు కోరు అని ప్రధానికి అర్థమైందని అందుకే ప్రచార కార్యక్రమంలో ఈయన లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకొచ్చారు. మీరు ముఖ్యమంత్రే కానీ అసలు ముఖ్యమంత్రి కాదని అందుకే బీజేపీ నేత అమిత్ షా ఎన్నికలు పూర్తైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామన్నట్టు గుర్తు చేశారు. అన్నీ అబద్దాలే.. మీరు అబద్ధాలతో ప్రధానిని చాలా ఇబ్బంది పెట్టారని రైతుల ఆదాయం రెట్టింపయ్యిందని మీరు చెబితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్లు ఆయనకు తెలిసిపోయిందని పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గాయని మీరు చెప్పినవి కూడా అబద్ధాలేనని ఆయనకు తెలిసిపోయిందన్నారు. ప్రధానికి అర్ధమైపోయింది.. అన్నిటినీ మించి ప్రధాని బుందేల్‌ఖండ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బుందేల్‌ఖండ్‌పై నిర్లక్ష్య వైఖరితో వ్యవహారించిందని ఏకంగా ప్రధానితోనే చెప్పించారు. కానీ కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ.7,600 కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇలా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం వల్లనే ప్రధాని సీఎంను పక్కన పెట్టేశారని అన్నారు. ఇది కూడా చదవండి: ‘మామూలు రైళ్లకే రంగులేసి వందేభారత్‌గా దోపిడీ’ -
మూత్రవిసర్జన ఘటన.. ఊహించని ట్విస్ట్
ఇవాళ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. సంతోషం.. కానీ కొన్నాళ్ల పోయాక ఈ ఘటన నుంచి మీడియా, పోలీసులు, ప్రజలందరి దృష్టి మళ్లిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి.. భయంతో బతకాల్సిందేనా?.. అంటూ తన పూరి గుడిసె ముందు కూర్చుని కళ్లలో భయంతో ప్రశ్నిస్తున్నాడు 35 ఏళ్ల దశ్మత్ రావత్. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న హేయనీయమైన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుబ్రి గ్రామానికి చెందిన గిరిజనుడైన దశ్మత్ రావత్‌పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేయడం.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారం రేపగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటికి సంబంధించి కొంత పోర్షన్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ బుల్డోజర్ కూల్చేయించింది. ప్రవేశ్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టింది కూడా. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ కోరడంతో ఈ ఘటన ఇంకా హైలెట్ చర్చగా మారింది. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడిచిపెట్టాలంటూ దశ్మత్ రావత్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ‘జరిగిందేదో జరిగింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఇకనైనా అతన్ని క్షమించి వదిలిపెట్టాలి అని మీడియా ద్వారా రావత్ ప్రభుత్వాన్ని కోరాడు. అతను చేసింది తప్పే కదా అని మీడియా అడగ్గా.. ‘‘అవునూ.. అతను చేసింది ముమ్మాటికీ తప్పే. అది నేనూ ఒప్పుకుంటా. అతను మా ఊరి పూజారి. అందుకే అతన్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రావత్ చెబుతున్నాడు. పైగా ఆ ఘటన ఈ మధ్య జరిగింది కాదని.. ఎప్పుడో 2020లో జరిగిందని చెప్పాడను. అది 2020లో. ఓ రాత్రిపూట పదిగంటల సమయంలో ఓ దుకాణం వద్ద నేను కూర్చున్నా. అతను నా దగ్గరకు వచ్చి నాపై మూత్రం పోశాడు. ఆ సమయంలో నేను అతని ముఖం కూడా చూడలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన తప్పు తాను తెలుసుకున్నాడతను. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటోంది ఒక్కటే.. అతన్ని విడిచిపెట్టి మా ఊరికి మంచి రోడ్డు వేయమని అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడతను. ఇప్పుడంటే ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తనకు ధైర్యం చెబుతుందని, కొన్నాళ్లకు అందరూ విషయం మర్చిపోయిన తర్వాత వాళ్లు మామీద కక్ష సాధిస్తే ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేశాడు. తాము, తమ పిల్లలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎవరితో గొడవలు వద్దని అన్నాడు. అందుకే జరిగిందేదో జరిగింది నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాడు. మరోవైపు రోజు 100, 200 రూపాయలు సంపాదిస్తేనేగానీ తమ కుటుంబం గడవదని.. అలాంటిది ఊరిలో ఎవరితో తమకు శత్రుత్వం వద్దని భార్య ఆశా సైతం వాపోతోంది. ऐसे पापी दुनिया में बहुत हैं मुख्यमंत्री शिवराज सिंह चौहान किसका _ किसका पैर धोएंगे !#ArrestGoluGurjar#GoluGurjar #MPNews #SidhiUrineCase #SidhiMP #Gwalior #शिवराज pic.twitter.com/vdkrDzO890 — Viral Notebook (@NotebookVi42149) July 8, 2023 ఇదిలా ఉంటే.. మూత్ర విసర్జన ఘటన పెనుదుమారం రేపడం వెనుక రాజకీయ విమర్శలు కారణం అయ్యాయి. నిందితుడు బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ కాంగ్రెస్.. కాదు కాంగ్రెస్‌వి ఉత్త ఆరోపణలే అని బీజేపీ పరస్పరం విమర్శించుకున్నాయి. ఇక బాధితుడు రావత్ కాళ్లను సీఎం చౌహాన్ కడగడాన్ని కూడా కాంగ్రెస్ డ్రామాగా అభివర్ణించింది. ప్రభుత్వంపై బ్రహ్మణ సంఘాల మండిపాటు నిందితుడు శుక్లా ఇంటి పోర్షన్‌ను అక్రమ భాగమంటూ కూల్చివేయడంపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శుక్లా చేసింది పాపపు పనే అయినప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులను శికక్షించాల్సిన అవసరం ఏముందంటూ నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద ప్రవేశ్ శుక్లాపై కఠినమైన నేరారోపణలు నమోదు అయ్యాయి. आदिवासी व्यक्ति की सरकार से अपील गांव के ब्राह्मण हैं छोड़ दीजिए जो हुआ सो हुआ...#news #news14today #news #ShivrajSinghChouhan #mutrakand #aadiwasi pic.twitter.com/La1cijtI1b — NEWS14TODAY (@news14_today) July 8, 2023 -
MP Urination Incident: ఘోరం... దారుణం!
కొన్ని ఉదంతాలు మనల్ని విషాదంలో ముంచెత్తుతాయి. మనం మనుషులుగానే మనుగడ సాగిస్తు న్నామా, సమాజం ఇంత అమానుషంగా మారిందా అనే ఆందోళన కలిగిస్తాయి. మధ్యప్రదేశ్‌లో ప్రవేశ్ శుక్లా అనే దుండగుడు ఆదివాసీపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం అటువంటిదే. అసలు ఊహకు కూడా అందని రీతిలో శుక్లా ఇలా రెచ్చిపోవడానికి కారణమేమిటి? మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉదంతం విషయంలో చకచకా కదిలింది. వెనువెంటనే ఆ దుండగుడిని కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించింది. అతను నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసింది. ఆదివాసీకి రూ. 6.5 ల„ý లు పరిహారంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు...ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుణ్ణి తన నివాసానికి పిలిపించుకొని అతని కాళ్లు కడిగి తలపై జల్లు కున్నారు. దుండగుడు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంవల్ల తమపై ఆ మచ్చ పడుతుందన్న భయంతో ప్రభుత్వం వేగంగా కదిలివుండొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉదంతంపై ఇంకా నిరసలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఉదంతం చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వాలు తక్షణం స్పందించటం, కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవటం, బాధితులకు రక్షణ కల్పించటం సాధారణ ప్రజలకు భరోసానిస్తుంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ప్రవేశ్ శుక్లా వంటి దుండగులు ఈ సమాజంలో నాగరిక వేషంలో ఎలా మనుగడ సాగించగలుగుతున్నారు? రాజకీయ పార్టీల్లోకి ఎలా చొరబడగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించకపోతే ఇవి పదే పదే పునరావృతమవుతూనే ఉంటాయి. దళితులనూ, ఆదివాసీలనూ, అట్టడుగు కులాల వారినీ అకారణంగా అవమానించటం, వారిని అత్యంత హీనంగా చూడటం మన దేశంలో కొత్తగాదు. తాజా ఉదంతం వీడియో సాక్షిగా బయటికొచ్చింది కనుక ఇంతగా స్పందన వచ్చింది. ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలింది. కానీ చట్టానికి దొరక్కుండా, సాక్ష్యాలకు చిక్కకుండా నిత్యం సాగుతున్న దుండగాల మాటేమిటి? ఈ ఉదంతంపై నిరసనల హోరు ప్రారంభమైన రోజే సర్వోన్నత న్యాయస్థానం విశ్వవిద్యాలయాల పర్యవేక్షణను చూస్తున్న యూజీసీకి కీలకమైన ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యాలయాల్లో వివక్షకు తావులేకుండా చేయటానికి ఇంతవరకూ తీసుకున్న, తీసుకోబోతున్న చర్యలేమిటో చెప్పా లని కోరింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ వివక్షకు బలై ప్రాణం తీసుకున్న రోహిత్ వేముల తల్లి, ముంబైలో వైద్య విద్యలో పీజీ చేస్తూ తోటి విద్యార్థినుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఆదివాసీ యువతి పాయల్ తాడ్వి తల్లి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. వారి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గత ఏడాది కాలంలో మూడు ఉన్నత శ్రేణి సంస్థల్లో ముగ్గురు విద్యార్థులు కులోన్మాదుల హింస భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వైనాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి ఉదంతాలప్పుడు విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థల్లో వివక్ష లేనేలేదని బుకాయించారు. వారికి వత్తాసు పలికిన విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. సరిగ్గా గ్రామ స్థాయి నుంచి ఉన్నత శ్రేణి విద్యాసంస్థల వరకూ నిత్యం వినబడే ఇలాంటి బుకాయింపులే మన సమాజంలో ఆధిపత్య కులాల హింసకు లైసెన్సునిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ యధేచ్ఛగా కొనసాగుతూనే ఉన్న రెండు గ్లాసుల వ్యవస్థ, మహానగరాలనుకునేచోట అపార్ట్మెంట్లలో పనివాళ్ల పట్ల చూపే వివక్ష... అట్టడుగు కులాలవారికీ, మైనారిటీలకూ ఇళ్లు అద్దెకు దొరక్క పోవటం వంటివి ఈ హింసను అడుగడుగునా చాటుతూనే ఉన్నాయి. వాటిని సరిచేయటానికి పూనుకోవాల్సిన వ్యవస్థలు చాలా సందర్భాల్లో రాజీపడుతున్నాయి. పైకి ఎంతో గౌరవప్రదంగా కనబడే వ్యక్తులే ఈ వివక్షకు బాధ్యులవుతుండటం చేదు నిజం. ఎంతో గొడవ జరిగి, పెను వివాదమైతే తప్ప చర్యలకు సిద్ధపడటం లేదు. అసలు పట్టించుకోకపోవటం వేరు...అతిగా పట్టించుకోవటం వేరు. పర్వేశ్ శుక్లాను కఠినమైన చట్టంకింద అరెస్టు చేశారు. మంచిదే. ఆదివాసీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిపై జల్లుకున్నారు. పాలకుడిగా మానసిక వేదనకు లోనయి ఈ పని చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ దుండగుడి నివాసం కూల్చేయటం ఎలాంటి చర్య? తప్పు చేసిన ఏ వ్యక్తయినా చట్టం ముందు సమానమేనని, వారిపై కఠిన చర్య తీసుకుంటామని సందేశం పంప డానికి బదులు, తాము ఏం చేస్తే అదే చట్టమనే ధోరణి ప్రదర్శించటం ఎలాంటి సంకేతాలిస్తుంది? శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలోచించాలి. అట్టడుగు కులాలవారిపై ఆధిపత్య కులాల హింసను అంతమొందించటంలో, మహిళలపై నిత్యం సాగే అమానుషత్వాన్ని అరికట్టడంలో మన సమాజం పదే పదే విఫలమవుతున్న తీరు ఆందోళన కలిగించే అంశం. 2002లో గుజరాత్ అగ్నిగుండమైనప్పుడు బిల్కిస్ బానో అనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యావజ్జీవ శిక్ష పడిన 11మంది నేరస్తులను నిరుడు విడుదల చేయటం, దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నా ఇంకా అతీ గతీ లేకపోవటం అందరూ గమని స్తూనే ఉన్నారు. అటువంటప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు వస్తున్నందువల్లే శివరాజ్ సింగ్ సర్కారు వేగంగా స్పందించిందన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేయగలమా? ఏదేమైనా చట్ట ప్రకారం వ్యవహరించటంలోనే, సంయమనం పాటించటంలోనే ప్రభుత్వాల సమర్థత వెల్లడవుతుంది. అది ప్రజాస్వామిక సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది. -
మూత్ర విసర్జన ఘటన: గిరిజన యువకుని కాళ్లు కడిగిన సీఎం శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్‌లోని సిధి గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించిన పోలీసులు.. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడుడైన గిరిజన యువకుడి పాదాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కడిగారు. దశమత్ రావత్‌ను సీఎం గురువారం భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అతన్ని ఓ కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. దళితుడి రెండు కాళ్లను ప్లేట్లో ఉంచి అతని పాదాలను నీళ్లతో కడిగారు శివరాజ్ సింగ్ చౌహన్. అనంతరం అతనికి బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువతో సన్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు తినిపించి కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత.. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మూత్ర విసర్జన వీడియో చూసి తన మనసుకు బాధనిపించిందన్నారు.ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనలో నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని సీఎం వెల్లడించారు. मेरे संज्ञान में सीधी जिले का एक वायरल वीडियो आया है... मैंने प्रशासन को निर्देश दिए हैं कि अपराधी को गिरफ्तार कर कड़ी से कड़ी कार्रवाई कर एनएसए भी लगाया जाए। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 4, 2023 మరోవైపు నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీకి చెందినవాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ దళిత, గిరిజన ద్వేషానికి ఈ ఉదంతం అద్దం పడుతోందని కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా దుయ్యబట్టారు. బీజేపీ హయాంలో వారిపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయని రాహుల్ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తితో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. దీనిపై విచారణకు నలుగురు వ్యక్తుల కమిటీ వేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించడం విశేషం. ఈ చర్య హీనమైనదని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. #WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat. CM tells him, "...I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP — ANI (@ANI) July 6, 2023 -
Shocking: వధువులకు ఇచ్చిన మేకప్ కిట్లలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గతంలో వివాహానికి ముందు కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లిలో వధువులకు అందించే మేకప్ కిట్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు అందజేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకం కింద సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా 296 జంటలు ఒకటయ్యాయి. కాగా కొత్తగా పెళ్లైన వధువులకు ఈ పథకం కింద అందించిన మేకప్ కిట్ బాక్స్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. మేకప్ కిట్ తెరిచి చూసిన వధువులు వాటిలో కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో సీఎం చౌహాన్నపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై జిల్లా అధికారి భుర్సింగ్ రావత్ స్పందించారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మందులను పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత తమది కాదని. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వీటిని అందజేసే అవకాశం ఉందన్నారు. తాము కేవలం ముఖ్యమంత్రి కన్యా వివాహ/నిఖా యోజన కింద లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి రూ.49,000ని ట్రాన్స్ఫర్ చేస్తామని, పెళ్లి సమయంలో ఆహారం, వాటర్, టెంట్, వాటికి సంబంధించిరూ. 6000 వేలు అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు పెళ్లికి సాయం అందించాలనే నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వధువు కుటుంబానికి ప్రభుత్వం రూ.55,000 వేల అందిస్తుంది. చదవండి: Protesting Wrestlers: పతకాలు విసిరేస్తాం! నిరహార దీక్షకు దిగుతాం! Shamelessness at its peak in @ChouhanShivraj’s Govt : The @BJP4India government of #MadhyaPradesh has distributed #condoms and #contraceptivepills in the make-up boxes given under the #KanyaVivahYojana. Do you have any shame left, #CM Ji❓ pic.twitter.com/Cz8WRIGgcl — MD Kareem (@MDKareemWadi) May 30, 2023 -
సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి!
భోపాల్: ఓ తండ్రి ఏడాది వయసున్న తన బాబుని సీఎం ప్రసంగిస్తుండగా వేదికపైకి విసిరేశాడు. ఈ చర్య అక్కడున్న ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ఈ విపరీత చర్యకు అతనిపై మొదట ఆగ్రహం వ్యక్తం చేసినా.. చివరికి దీని వెనుక కారణం తెలుసుకుని అతని బాధని అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి ఎందుకు ఇలా చేశాడంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఖేష్ పటేల్ సాగర్‌లోని కేస్లీ తహసీల్‌లోని సహజ్‌పూర్ గ్రామ నివాసి. అతను తన భార్య నేహా, ఏడాది వయసున్న కుమారుడితో నివసిస్తున్నాడు. తన కుమారుడికి 3 నెలల వయస్సు ఉన్నప్పుడే వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించి అందుకు బాగా ఖర్చు అవుతుందని చెప్పారు. తనకు అంత స్థోమత లేకపోయినా ఇప్పటి వరకు తన కుమారుడి వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. అయితే డాక్టర్ సర్జరీ చేయించాలని అందుకు మరో 3.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడే సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ సభకు వచ్చారు. అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రిని సహాయం చేయాలని కోరుందుకు ముకేశ్, నేహా కూడా వెళ్లారు. అయితే సీఎంని కలవడానికి వారికి అనుమతి దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ముకేశ్.. ముఖ్యమంత్రి స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన బిడ్డను వేదికపైకి విసిరేశాడు. భద్రతా సిబ్బంది బాబును కాపాడి, తల్లికి అప్పగించారు. మొదట అతనిపై కోపడినప్పటికీ.. చివరికి చిన్నారి సమస్యను తెలుసుకున్న సీఎం బాబుకు వైద్యసహాయం అందించాలని స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్‌బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో పైలట్ ఇలా చేశారు. హెలికాప్టర్ మనావర్ నుంచి ధార్ వెళ్తుండగా సమస్య రావడంతో తిరిగి మనావర్కే వచ్చింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ నిలిచిపోవడంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా బస్సులోనే ధార్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. సాంకేతిక కారణాలు తలెత్తిన ఈ హెలికాప్టర్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందింది. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
జోడో యాత్రలో వివాదాస్పద కంప్యూటర్ బాబా.. బదులివ్వాలన్న బీజేపీ
అగర్‌మాల్వా(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం వివాదాస్పద గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మహుదియా గ్రామం వద్ద శనివారం ఆయన రాహుల్‌తో కలిసి నడిచారు. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై చేయి చేసుకున్న కేసులో నాందేవ్ 2020లో అరెస్టయ్యారు. అలాంటి పలు కేసులున్న, జైలుకు వెళ్లొచ్చిన నిందితునితో రాహుల్‌తో కలిసి నడవడమేంటని బీజేపీ నిలదీసింది. అయితే, దేశ క్షేమం కోసం చేపట్టిన యాత్రలోకి సాధువులతో సహా అందరూ ఆహ్వానితులేనని కాంగ్రెస్ బదులిచ్చింది. అయితే ఈ కంప్యూటర్ బాబాకు 2018లో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహాయ మంత్రి హోదాతో కూడిన పదవి కట్టబెట్టింది! అనంతరం బీజేపీతో పొసగక ఆయన కాంగ్రెస్ పంచన చేరారు. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్‌ను శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. -
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
నందిగామ: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని హార్ట్ఫుల్నెస్ కేంద్రం, కాన్హా శాంతి వనాన్ని (రామచంద్రమిషన్) ఆయన సతీమణి సుద్నాసింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. గురూజీ కమ్లేష్ పటేల్(దాజీ)తో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ధ్యానం చేస్తే ఆనందమయ జీవితాన్ని గడుపుతారన్నారు. మురికి నీటి నుంచి విడిపోయి కమలం వికసించినట్లు జీవితం ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానంతో అనేక రుగ్మతలు, ఒత్తిళ్లు దూరం అవుతాయని తెలిపారు. కాన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి కమ్లేష్ పటేల్ బీడు భూములను హరిత వనంలా మార్చారని అభినందించారు. కాన్హా శాంతి వనంలో టిష్యూ కల్చర్ ఎంతగానో ఆకర్షించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని శుష్క భూములను సైతం హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందం కావాలంటే శాంతి కావాలని, అది ధ్యానంతోనే వస్తుందని అన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయమని కమ్లేష్ పటేల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు రూపొందించిన ‘నషా ముక్తి’యాప్‌తో పాటు ‘అవును.. మీరు దీన్ని చేయగలరు’(ఎస్.. యూకెన్ డూ ఇట్) అనే పుస్తకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ పోలీస్ జావ్రా 24వ బెటాలియన్‌లో 6 హెక్టార్లలోని బంజరు భూమిలో 25 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌గా హార్ట్ఫుల్నెస్ కేంద్రం అభివృద్ధి చేసిందని గురూజీ గుర్తుచేశారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లు, సబ్ సెంటర్లలో గ్రూప్ మెడిటేషన్ల ద్వారా మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వేలాది మంది మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అభ్యాసీలు పాల్గొన్నారు. -
చీతా ప్రాజెక్టు: చీతాలను వదిలిన ప్రధాని మోదీ
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మరో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. చీతా ప్రాజక్టులో భాగంగా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను శనివారం ఉదయం ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేం. సుమారు 74 ఏళ్ల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. మొత్తం ఎనిమిది చీతాలను ప్రత్యేక పరిస్థితుల నడుమ భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని నమీబియా పరిస్థితులకు దగ్గరగా ఉండే షియోపూర్ ప్రాంతంలో కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు. మోదీ స్వయంగా వాటిని ఫొటోలు తీస్తూ కనిపించారు. Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV — ANI (@ANI) September 17, 2022 చీతా ప్రాజెక్టులో భాగంగా.. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో బోయింగ్ విమానంలో వాటిని శనివారం గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆ విమానానికి స్వాగతం పలికారు. ఆపై ఆ చీతాలను వైమానిక విమానంలో కునో నేషనల్ పారర్క్కు తరలించారు. మూడు మగ, ఐదు ఆడ చీతాలతో జనాభా పెంచే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం.