signature
-
రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
US Elections 2024: సంతకం రాక.. ఓట్లు చెల్లక
వాషింగ్టన్: మనకు ఒక కచ్చి తమైన సంతకం అంటూ లేకపోతే ఎంత నష్టమో అమెరికా ఎన్నికలను చూసి తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా వచ్చి న చాలా ఓట్లు సంతకంలో తేడాల వల్ల చెల్లకుండాపోయా యి. సంతకం చేయడం రాకపోవడంతో ఓటు వేసి నా అవి చెల్లలేదు. ప్రధానంగా యువ ఓటర్ల విషయంలో ఈ సమస్య ఎదురైంది. ఓటు–బై–మెయిల్ బ్యాలెట్‌లోని సంతకం, ఓటర్ రికార్డులోని సంత కం ఒకేలా ఉండాలి. ఎన్నికల అధికారులు రెండింటినీ సరిపోల్చుతారు. ధ్రువీకరణ తర్వాతే ఆ ఓటు ను లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తే సదరు ఓటరుకు సమాచారం ఇస్తారు. సంతకాన్ని సరిచేసుకొనే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు స్పందించపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లలేదు. నెవడా రాష్ట్రంలోని క్లార్క్ కౌంటీలో 11,300, వాషో కౌంటీలో 1,800 ఓట్ల విషయంలో సంతకాలను మళ్లీ సరిదిద్దాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి ఫ్రాన్సిస్కో అగిలార్ చెప్పారు. నేటి టెక్నా లజీ యుగంలో చేతితో రాయడం పెద్దగా అవసరం పడట్లేదు. అన్నీ కంప్యూటర్, ఫోన్లోనే టైప్ చేస్తున్నారు. సాధారణంగా సంతకాలను వంపు తిరిగిన అక్షరాల్లో(కర్సివ్) చేస్తారు. అమెరికా పాఠశాలల్లో ఇటీవలి కాలంలో కర్సివ్ చేతిరాత నేరి్పంచడం లేదు. దాంతో పిల్లలకు సంతకాలు చేయడం రావడం లేదని నిపుణులు అంటున్నారు. -
దురదృష్టం అంటే ఈమెదే.. కూటమికి కూడా!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది. రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్‌కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్‌నుంచి రెండుసార్లు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. -
సంతకాన్ని జంతర్‌మంతర్ చేసినచో...
శూన్యంలో నుంచి కూడా కళను సృష్టించే నైపుణ్యం ఆర్టిస్ట్‌ల సొంతం. తాజా విషయానికి వస్తే... ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తెల్లకాగితంపై చేసిన సంతకాన్ని క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చాడు రాబిన్ బార్. సంతకం నుంచి అప్పటికప్పుడు ప్రేయసీప్రియులను సృష్టించిన రాబిన్ బార్ ఇలాంటి అలాంటి ఆర్టిస్ట్ కాదు...రికార్డ్ హోల్డర్ స్పీడ్ పెయింటర్. జస్ట్...కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ 21 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రాబిన్ బార్‌పై నెటిజనుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. -
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్‌పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్‌పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు, ఇతర నేతలు గాంధీభవన్‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేధించిన అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకు సాయం చేస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని నిందించారు. అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన గాజర్ల అశోక్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ మాజీ నేత గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఉద్యమపంథా వీడి సాధారణ జనజీవనం గడుపుతున్న అశోక్ ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై కొంతకాలంగా సన్నిహితులు, అభిమా నులతో చర్చలు జరుపుతున్నారు. అందరి అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అశోక్ చేరిక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పరకాల అసెంబ్లీ టికెట్ అశోక్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సిగ్నేచర్ గ్లోబల్ @ రూ. 366–385
ముంబై: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్(ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 366–385 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఐపీవో ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 603 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 127 కోట్ల విలువైన షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 730 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 330 కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో ఉంది. కంపెనీ గతేడాది జులైలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 432 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది చివరికల్లా రూ. 1,100 కోట్ల నికర రుణ భారం నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను ఇతర సంస్థలు, భూముల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.35 శాతం వాటా ఉంది. ఐఎఫ్‌సీ 5.38 శాతం వాటాను కలిగి ఉంది. అనుబంధ సంస్థ సిగ్నేచర్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా గురుగ్రామ్‌లోని సోలెరా ప్రాజెక్టుతో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
సంతకం చేయలేకపోయిన కొత్త ఉద్యోగి! ఎందుకో తెలిస్తే..
Ola Electric New Employee: భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ 'ఓలా' మార్కెట్లో పొందుతున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో మంచి అమ్మకాలను పొందింది. అయితే తాజాగా ఎస్1 స్కూటర్ ఉత్పత్తి నిలిపి వేసి ఆ స్థానంలో ఎస్1 ఎయిర్ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పితూ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. కొత్త ఉద్యోగి.. ఓలా ఎస్1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ మీద కంపెనీ ఉద్యోగులు సంతకాలు చేశారు. కానీ ఇటీవల ఉద్యోగిగా నియమితమైన 'బిజిలీ' (కుక్క) మాత్రం సంతకం చేయకుండా సీటుపై కూర్చుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సంస్థ సీఈఓ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఎస్1 ఎయిర్ స్కూటర్ కోసం బుకింగ్స్ చేసుకుంటున్నారు. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ. 85099 నుంచి రూ. 1.1 లక్షల మధ్య ఉండనుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్కూటర్ ధర ఈ నెల 15 తరువాత రూ. 10వేలు వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! ఇక బిజిలీ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులకు ముందు కంపెనీ సీఈఓ కుక్కకు ఉద్యోగం కల్పిస్తూ దానికి ఐడీ కార్డుని కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. The first S1 Air. Bijlee couldn’t sign so she sat on it! pic.twitter.com/7zwhpmjmI5 — Bhavish Aggarwal (@bhash) August 6, 2023 -
అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అధికారిక వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యను జూన్ 11న 2,33,248గా, తర్వాత 2,33,506గా పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అభ్యర్థుల సంఖ్య అలా ఎలా పెరిగిందని, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంతకాల్లో భారీగా మార్పు ఉన్నా ఇన్విజిలేటర్ ఎందుకు అభ్యంతరం తెలుపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకసారి ప్రశ్నపత్నం లీకై మరలా పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి తీర్పు రిజర్వు చేశారు. తప్పిదాలు పట్టించుకోలేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన టీఎస్పీఎస్సీ అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని, ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్లు అయ్యింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్‌ను మ్యానిప్యులేట్ చేసేందుకు ఇది అవకాశం ఇస్తుందని పిటిషనర్లు వినతిపత్రం ఇచ్చినా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్నారు. పైగా అత్యంత కీలక పోస్టులు భర్తీ చేసే గ్రూప్–1 విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కీలకమైన గ్రూప్–1 పరీక్షలో వేలిముద్రలు తీసుకోని టీఎస్పీఎస్సీ..గ్రూప్–4 పరీక్షకు మాత్రం వేలిముద్రలు తీసుకుంది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి..’అని కోరారు. పకడ్బందీగా ప్రిలిమ్స్: ఏజీ టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు లాంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో హాల్ టికెట్లను సరిపోల్చి చూశారు. ఆ తర్వాతే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ప్రిలిమ్స్‌ను కమిషన్ సమర్థవంతంగా నిర్వహించింది. ఓ అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లి అయిన తర్వాత పెళ్లికి ముందు ఉన్న ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది. ఈ ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు..’అని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని, టీఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు, మెయిన్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
మంత్రులు.. తొలి సంతకాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ ప్రారంభం అనంతరం మంత్రులు వారికి కేటాయించిన చాంబర్లకు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఏ మంత్రి.. ఏ ఫైలుపై సంతకం చేశారంటే.. కేటీఆర్ (ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ): డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. హరీశ్‌రావు (ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ ఫైలుపై తొలి సంతకం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం కింద రూ.151.64 కోట్ల నిధుల విడుదల ఫైలుకూ క్లియరెన్స్. గంగుల కమలాకర్ (పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ): అంగన్వాడీలకు పోషకాలతో కూడి న సన్నబియ్యం పంపిణీ ఫైలుపై తొలి సంతకం. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళికల ఫైలుపై మరో సంతకం. తలసాని శ్రీనివాస్ యాదవ్ (పశుసంవర్థక, మత్య్స శాఖ): ఉచిత చేపపిల్లల పంపిణీ ఫైలుపై తొలిసంతకం చేశారు. గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ నిధుల విడుదల, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీ పనులకు రూ.75కోట్ల గ్రాంటు విడుదల ఫైళ్లకు ఆమోదం. సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ): అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సంపూర్ణ ఆహార పథ కానికి ఇకపై బలవర్ధక సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని అందించే ఫైలుపై తొలి సంతకం. మల్లారెడ్డి (కార్మిక, ఉపాధి కల్పన శాఖ): కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వనున్న శ్రమశక్తి అవార్డుల ఫైలుపై తొలి సంతకం. కొప్పుల ఈశ్వర్ (ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ): దళితబంధు పథకం రెండో విడత లబ్దిదారుల ఎంపిక ఫైలుపై తొలి సంతకం. ఎర్రబెల్లి దయాకర్‌రావు (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ): రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మండలాల్లో ఐకేపీ భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం. మహమూద్ అలీ (హోంమంత్రి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలీస్ స్టేషన్లలో పోస్టుల మంజూరు ఫైలుపై తొలి సంతకం. శ్రీనివాస్‌గౌడ్ (ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ): రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడాపోటీల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వ్యవసాయ, సహకార శాఖ): రైతులకు రాయితీపై పచి్చరొట్ట విత్తనాల పంపిణీ ఫైలుపై తొలి సంతకం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం. వేముల ప్రశాంత్‌రెడ్డి (రోడ్లు, భవనాల శాఖ): రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై తొలి సంతకం. జగదీశ్‌రెడ్డి (విద్యుత్ శాఖ): వ్యవసాయానికి రూ.958.33 కోట్ల విద్యుత్ రాయితీ విడుదల ఫైలుపై తొలి సంతకం. ఇంద్రకరణ్‌రెడ్డి (దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వంద ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైలుపై తొలి సంతకం. ప్రధాన దేవాలయాల్లో తృణధాన్యాలతో కూడిన ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైలుపై రెండో సంతకం. సబితారెడ్డి (విద్యాశాఖ): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 19,800 మంది టీచర్లకు రూ. 34. 25 కోట్లతో ట్యాబ్‌లు అందజేసే ఫైలుపై తొలి సంతకం. 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటు ఫైలుపై మరో సంతకం. అజయ్‌కుమార్ (రవాణాశాఖ): కొత్త జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. -
పుష్ప 2 నుండి అదిరిపోయే అప్డేట్..
-
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోస్టుమెన్ నిర్వాకం..
-
సిగ్నేచర్ గ్లోబల్ రెడీ: వెయ్యికోట్ల ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ సర్వప్రియా సెక్యూరిటీస్, ఇన్వెస్టర్ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడిగా రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉంది. మధ్యస్థాయి, చౌక గృహ విభాగంపై దృష్టిపెట్టిన కంపెనీ.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, భూముల కొనుగోలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన సిగ్నేచర్ గ్లోబల్ ఐపీవో చేపట్టేందుకు జులైలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా హర్యానాలో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించింది. థర్మజ్ క్రాప్‌నకు ఓకే: ఆగ్రోకెమికల్ కంపెనీ థర్మజ్ క్రాప్ గార్డ్ పబ్లిక్ ఇష్యూ తొలి రోజు సోమవారానికల్లా 1.8 రెట్లు అధికంగా స్పందన లభించింది. రూ. 216–237 ధరలో చేపట్టిన ఇ ష్యూ ద్వారా కంపెనీ రూ. 251 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా 80, 12,990 షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 1.44 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.6 రె ట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 35 శాతం స్పందన నమోదైంది. కంపెనీ విభిన్న ఆగ్రో కెమికల్ ఫార్ములేషన్ల తయారీ, పంపిణీలను నిర్వహిస్తోంది. -
పంచనామాపై బలవంతంగా సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు «భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసివచి్చన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వెలుగులోకి రఘురామ కృష్ణరాజు పేరు -
సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ వారియర్స్ వాళ్లే: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వర్తించే కార్మికులే సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ యోధులని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కోవిడ్ సమయంలో మరణించిన వారికి కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారాలను చేయలేకపోయారని, అలాంటి సమయంలో శ్మశాన వాటిక కార్మికులు చేసిన వృత్తి ధర్మం మాటల్లో వర్ణించలేనిదని ఆయన కొనియాడారు. జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ ఆధ్వర్యంలో శ్మశాన కార్మికులకు చేయూతనందించేందుకు బుధవారం మాదాపూర్‌లోని ఈ–గెలేరియా మాల్ వేదికగా ‘బెస్ట్ సిగ్నేచర్’ అనే ఫండ్ రైసింగ్ కాంటెస్ట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ సజ్జనార్ తన సిగ్నేచర్‌తో కాంటెస్ట్‌లో పాల్గొని ఫండ్‌రైసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో గౌరవప్రదంగా అంతిమ క్రియలను నిర్వర్తించిన నిజమైన హీరోల సంక్షేమానికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ కాంటెస్ట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కోవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని దాదాపు ఐదు వందల శ్మశానాల్లో నాలుగు వేల మంది కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారని జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ అధ్యక్షులు ధన్నారపు రాకేష్ తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో కార్మికుల పిల్లల పాఠశాల విద్య, ఆరోగ్య బీమా, వారి వృత్తిపరమైన భద్రత, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా పాల్గొనే వారు కనీసం రూ.500 కన్నా ఎక్కువ చెల్లించి తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కాంటెస్ట్‌లో ఆకట్టుకునే సంతకం ఉన్న మొదటి విజేతకు రూ.25 వేలు, ఆ తరువాతి స్థానాల్లో రూ.15 వేలు, రూ. 10 వేల బహుమతులతో పాటు రూ. వెయ్యితో ఐదు కన్సోలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు jcibph.in లేదా 903120 01980, 9951143775లో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో మెట్రో రైల్ అడ్వర్టైజ్ లీజింగ్ హెడ్ కెవి నాగేంద్ర ప్రసాద్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ ఆనందిత సిన్హా, గిరీష్ భట్, మనోహర్ భట్, సీఎస్ చలం, అనిల్ కుమార్ సిద్దూ, పీ వీరభద్రుడు, కేసీజీఎఫ్ బుధపూర్ణిమ అధ్యక్షుడు అనిల్ దండూ, రమేష్ దాడిగల, రఘురాజ్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు) -
కలెక్టర్, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాల ఫోర్జరీతో భూములకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన వ్యవహారంలో కూడేరు పోలీసులు తీగ లాగితే డొంక కదులుతోంది. అనుమానితులను పుట్టపర్తి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కూడేరు మండలం కమ్మూరుకు చెందిన బోయ నారాయణప్ప పేరిట సర్వే నంబరు 525, 526లో 34.86 ఎకరాల భూమిని ఇటీవల అనంతపురం, ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాగార్జునరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, మరో ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఎకరా రూ.54 లక్షల ప్రకారం అగ్రిమెంటు చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు అగ్రిమెంటు మీద ఎక్కువ ధరతో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ భూమిలో కొంత భాగానికి 1954లో మంజూరైన డీ–పట్టా భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ) నుంచి తొలగింస్తే మరింత ఎక్కువ ధర దక్కుతుందన్న ఆశతో ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూడేరు తహసీల్దార్, అనంతపురం ఆర్డీఓ కార్యాలయాల్లో సంతకాలు పూర్తయిన తర్వాత ఫైలు కలెక్టర్ కార్యాలయానికి చేరి ఆగిపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. గతంలో కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన మహబూబ్‌బాషాను ఆశ్రయించారు. రూ.10 లక్షలు ఇస్తే త్వరగా చేయించి ఇస్తానని వారితో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వారు కొంత మొత్తాన్ని ముట్టజెప్పడంతో వారికి మహబూబ్‌బాషా ఎన్ఓసీ తెచ్చిచ్చారు. దానిని చూపి వ్యాపారులు అధిక ధరకు భూమిని విక్రయించేందుకు తోటి రియల్టర్లను కలిశారు. భూమి పత్రాలతో పాటు ఆ సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లో షేర్ చేశారు. అలా చక్కర్లు కొట్టిన ఆ పత్రాలు ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి చేతికి చేరాయి. రెండు రోజుల క్రితం లేదన్న ఎన్ఓసీ ఇప్పుడు ఎలా వచ్చిందని ఆరా తీసిన ఆ ప్రజాప్రతినిధి చివరకు కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. దీంతో కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్ అని నిర్ధారణ అయింది. కలెక్టరేట్లో సహకరించిందెవరు? కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌తో ఎన్ఓసీ సృష్టించిన వైనంపై కలెక్టరేట్లో మహబూబ్‌బాషాకు ఎవరు సహకరించారనే అంశంపై విచారణ మొదలైంది. సంబంధిత సెక్షన్‌లోని సిబ్బందిని పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో కీలక నిందితుడు కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌తో ఎన్ఓసీ సృష్టించిన కీలక నిందితుడు మహబూబ్‌బాషా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూడేరు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మహబూబ్బాషాపై అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో 420, 421, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. (చదవండి: ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...) -
భార్యకు యూట్యూబ్ చానల్.. రూ.4 కోట్ల ఆదాయం.. ఆ భర్త ఏంచేశాడంటే?
నరసరావుపే టౌన్(పల్నాడు జిల్లా): ఛీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు మంగళవారం తెలిపారు. వివరాలు.. బరంపేటకు చెందిన పోతుల విక్రమ్, లక్ష్మీజ్యోతి భార్యాభర్తలు. విక్రమ్ ఆదిత్య పేరిట లక్ష్మీజ్యోతి యూట్యూబ్ చానల్‌ను 2014లో నుంచి నిర్వహిస్తోంది. సుమారు ఈ చానల్‌కు 10 లక్షల మంది సబ్ స్క్రెబర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మీజ్యోతి హైదరాబాద్‌కు చెందిన వ్యాకుడ్ ఆవుట్ కంపెనీతో తన యూట్యూబ్ చానల్ ద్వారా యాడ్స్ ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భర్త విక్రమ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్నారు. చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా.. అయితే లక్ష్మీజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి వ్యాకుడ్ అవుట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భర్త విక్రమ్ రద్దు చేశాడు. యూట్యూబ్ చానల్ ద్వారా ప్రతినెల వచ్చే ఆదాయాన్ని తన రెండో భార్య తమ్ముడు వావిళ్ళపల్లి సంతోష్ అకౌంటుకు మళ్లించాడు. రెండేళ్ల నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు మోసం చేసి దారి మళ్లించినట్లు లక్ష్మీజ్యోతి గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. -
అభ్యర్థి సంతకాలు ఫోర్జరీ చేశారంటూ టీడీపీ నాటకాలు
-
పనిమనిషి బాగోతం .. రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి 15 లక్షల టోపీ..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఓ పెద్దమనిషి ఇంట్లో పనిమనిషి చెక్కులపై నకిలీ సంతకం చేసి రూ.15 లక్షల వరకూ నొక్కేశాడు. కోరమంగల నివాసి విశ్రాంత ఐఏఎస్ అదికారి ఎస్ఆర్.విజయ్ (84) బాధితుడు. గంగావతి కి చెందిన కాసీంసాబ్ (34)పై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ తనయుడు తన తండ్రి బాగోగులు చూసుకోవడానికి ఓ సంస్థ ద్వారా కాసీంసాబ్‌ను ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అతడు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. కాశీం ఈ నెల 21 తేదీన సోదరుని పెళ్లికి ఊరికి వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. ఈ సమయంలో విజయ్ తన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా చెక్కుల ద్వారా రూ.14.90 లక్షల నగదు బదిలీ అయినట్లు తెలిసి కంగుతిన్నాడు. కాసీంసాబ్‌కు ఫోన్ చేసి విచారించగా పొంతనలేకుండా మాట్లాడాడు. దీంతో బాధితుడు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వంచకుని కోసం గాలిస్తున్నారు. చదవండి: కేర్‌టేకర్ హల్చల్.. గట్టిగా కేకలేస్తూ, నగ్నంగా తిరుగుతూ -
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
దోమకొండ: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరి చేసి ఖాళీ స్థలాన్ని డాక్యుమెంట్ చేసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ సోమవారం తెలిపారు. పంచాయితీ కార్యదర్శి తన సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు. గ్రామానికి చెందిన నందాల ఈశ్వరవ్వ అనే మహిళకు చెందిన 130 గజాల స్థలాన్ని ఆగస్టు 24న బొడపుంటి రవి అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో పంచాయతీ ధ్రువీకరణ పత్రంతో పాటు, కార్యదర్శి స్టాంప్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తమ విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు సదరు డాక్యుమెంట్‌ను రద్దు చేసినట్లు సబ్ రిజిస్ట్రర్ స్వామిదాస్ తెలిపారన్నారు. నిందితుడ బొడపుంటి రవితో పాటు నందాల ఈశ్వరవ్వపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
చదువుకునే రోజుల్లో సెల్‌ఫోన్ గొడవ లేదు
జూబ్లీహిల్స్: ప్రముఖ నటి తమన్నా భాటియా శుక్రవారం పార్క్‌హయత్ హోటల్లో సందడి చేశారు. సిగ్నేచర్ మాస్టర్ క్లాస్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాహుబలి చిత్రం తన పాత్రల ఎంపికలో మార్పు తెచ్చిందని, ప్రస్తుతం కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా అర్థవంతమైన పాత్రలు ఎంపిక చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. తాను చాలా సాధారణ అమ్మాయిగానే భావిస్తుంటానని, నటి, సెలబ్రిటీ అనే విషయమే తనకు గుర్తుండదన్నారు. తాను చదువుకునే రోజుల్లో సెల్‌ఫోన్ గొడవ లేదన్నారు. అప్పట్లో తనకు నటీమణులు శ్రీదేవి, మాధురి దీక్షిత్ తదితరులు ఆదర్శమని, వారి నటనచూసే సినీ రంగానికి వచ్చానన్నారు. ప్రస్తుతం సంపత్‌నంది చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. పూర్తిస్థాయిలో నృత్య ప్రధాన చిత్రం చేయాలని ఉందన్నారు. -
చెదరని సంతకం
ఒక్క సంతకం.. జీవిత గమనాన్ని మారుస్తుంది. ఒక్క సంతకం.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఒక్క సంతకం.. నీకు రక్షణగా నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. ఆ సంతకమే చెదిరిపోతే.. జీవితం చెల్లని చీటీ అవుతుంది. చెల్లని సంతకంతో జీవితం ప్రశ్నార్థకమవుతుంది. అశ్వతి రూపొందించిన ఈ పెన్ను వణికే చేతికి చెదరని సంతకాన్ని భరోసాగా ఇస్తోంది. ‘‘ఇదేంటి! నా కాఫీ కప్పు ఏమైంది? కాఫీ ఇంత పెద్ద మగ్గులో ఇచ్చావేంటమ్మా’’ కూతురిచ్చిన కాఫీ మగ్గు అందుకుంటూ అన్నారు రామకృష్ణారావు. మగ్గులో సగానికే ఉంది కాఫీ. ఇంత పెద్ద మగ్గులో నుంచి కాఫీ ఎలా తాగాలి. ‘‘కాకిలాగ అడుగున రాళ్లేసి తాగాలా? కొబ్బరి బోండాం తాగినట్లు స్ట్రా వేసుకుని తాగాలా? తల్లీ’’ కాఫీ మగ్గు మీదున్న మనవరాలి ఫొటోను చూసి మురిపెంగా నవ్వుకుంటూ కూతుర్ని అడిగారాయన. ‘‘నాన్నా! నిన్న నీళ్లు తాగేటప్పుడు మీ చెయ్యి వణికి, నీళ్లు మీమీద ఒలికిపోయాయి. గుర్తులేదా. నీళ్లు కాబట్టి సరిపోయింది. వేడి కాఫీ ఒలికితే ..?’ చిరుకోపంగా అంటూ లోపలికి వెళ్లిపోయిందామె. ‘‘నాకు వయసైపోవడమేంటి? పిల్లలతోపాటు పరుగుపెట్టగలను’’ బింకంగా అంటూ కాఫీ మగ్గులోకి తొంగి చూశారాయన. ‘‘మీ సిగ్నేచర్ ట్యాలీ కావట్లేదు. మళ్లీ చేయండి’’బ్యాంకు క్లర్క్ డిపాజిట్ ఫామ్‌ని, చెక్ లీఫ్‌ని మార్చి మార్చి చూస్తూ, కంప్యూటర్లో ఉన్న స్పెసిమెన్ సిగ్నేచర్‌తో సరిపోల్చుకుంటూ అన్నది.‘‘కొన్నేళ్లుగా నెలనెలా వచ్చి డిపాజిట్ ఫామ్, చెక్కుల మీద సంతకం చేస్తూనే ఉన్నాను కదమ్మా. ఇప్పుడు కొత్తగా సరిపోలకపోవడం ఏంటి’’ ఆందోళనగా అడిగారు సుజాతమ్మ. ‘‘రాసేటప్పుడు మీ చెయ్యి వణుకుతున్నట్లుంది. పెద్దవయసు కదా. ఇప్పుడే వస్తాను’’ అంటూ ఆ చెక్ లీఫ్ పట్టుకుని మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లిందామె. సుజాతమ్మ చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నది ‘పెద్ద వయసు కదా’ అనే మాట ఒక్కటే. క్లర్క్ వచ్చి సీట్లో కూర్చుని మళ్లీ కంప్యూటర్ స్క్రీన్‌ని కళ్లు విప్పార్చి చూస్తోంది. ‘‘ప్రతినెలా నా పెన్షన్ నుంచి ఓ అనాథ శరణాలయానికి విరాళం పంపిస్తుంటానమ్మా. డబ్బు ఆగిపోతే వాళ్లు ఇబ్బంది పడతారు తల్లీ’’ బతిమలాడుతున్నట్లు అడిగింది సుజాతమ్మ. ‘‘ఇప్పటికి పాస్ చేస్తున్నాం. మరో రోజు వచ్చి కొత్తగా సంతకాలు చేయండి. సిస్టమ్‌లో ఫీడ్ చేస్తాం’’ అని చెప్పిందా క్లర్కు. ‘‘తాతయ్యా! నువ్వేసిన బొమ్మ చూడు, ఎలా వంకర పోయిందో’’ బుంగమూతి పెట్టాడు సుహాస్. బొమ్మ సరిగ్గా రాలేదన్న సంగతి శ్రీనివాసరావుకి తెలుస్తూనే ఉంది. గొప్ప చిత్రకారుడిగా అందుకున్న అవార్డులు ఆయన కళ్లముందు మెదిలాయి. డ్రాయింగ్ టీచర్‌గా స్కూల్లో పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించిన ముప్పై ఏళ్ల అనుభవం వంకర్లు పోతోంది. ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన కలలో ఉన్నాయి. తాను కలగన్న చిత్రాలను కాన్వాస్ మీద చూసుకోవడం అనేది కూడా ఇక కలేనా.. ఒక్కసారిగా ఆందోళన ఆవరించిందాయన్ని. ఈ సమస్య రామకృష్ణారావు, లలితమ్మ, శ్రీనివాసరావులది మాత్రమే కాదు. లక్షమందిలో ఇద్దరు– ముగ్గురు ఈ ‘ప్రోగ్రెసివ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్’తో బాధపడుతున్నారు. డెబ్బై – ఎనభై ఏళ్లు నిండిన వాళ్లలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను వాడుకలో పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. బ్రిటిష్ ఫిజీషియన్ ‘జేమ్స్ పార్కిన్సన్’ రెండు వందల ఏళ్ల కిందట ఈ వ్యాధి లక్షణాల మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. అందుకే దీనిని పార్కిన్సన్స్ డిసీజ్ అంటున్నాం. ఇప్పుడు అశ్వతి సతీశన్ అనే 23 ఏళ్ల అమ్మాయి పార్కిన్సన్స్తో బాధపడే వాళ్ల కోసం ప్రత్యేకమైన పెన్నును డిజైన్ చేసింది. ఇలాంటి వినూత్నమైన ఉపకరణానికి రూపకల్పన చేసినందుకు ఆమె ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ‘జేమ్స్ డైసన్ అవార్డు 2019’ అందుకున్నారు. అశ్వతి సతీశన్ అహ్మదాబాద్‌లోని ఎన్ఐడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్)లో గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. ఆమె తన కోర్సు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అధ్యయనాన్ని మరింతలోతుగా కొనసాగించారు. వందల మంది పార్కిన్సన్స్ పేషెంట్లను స్వయంగా కలిశారు. ‘‘నేను కలిసిన వాళ్లు అందరూ పెద్దవాళ్లు, ఉన్నత చదువులు చదివి మంచి హోదాలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్లున్నారు. అవార్డులందుకున్న గొప్ప చిత్రకారులున్నారు. అలాంటి వాళ్లను కనీసం సంతకం కూడా చేయలేని స్థితిలో చూశాను. వీళ్లకోసం కొత్త ఉపకరణాన్ని తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాను. గైరోస్కోపిక్ ప్రిన్సిపల్స్‌తో పెన్నుని డిజైన్ చేశాను. ఒక తిరిగే వస్తువు కదలికను దాని ఇరుసు నియంత్రిస్తూ ఉంటుంది. అదే విధానాన్ని ఈ పెన్ను తయారీలో అనుసరించాను. నేను తయారు చేసిన ఫ్లియో పెన్ బ్యాటరీతోనూ, కరెంట్ రీచార్జ్ ద్వారా కూడా పని చేస్తుంది. నా ప్రయోగం సక్సెస్ అయింది. నా ప్రయోగాన్ని నిపుణులు ఆమోదించి అవార్డు ఇచ్చారు. ఇది వినియోగదారుల చేతుల్లోకి రావడానికి టైమ్ పడుతుంది. యూకేకి చెందిన జేమ్స్ ఫౌండేషన్ వాళ్లు అవార్డుతోపాటు వచ్చిన రెండువేల పౌండ్లతో నా పరిశోధనను విస్తృతం చేస్తాను’’ అని చెప్పారు అశ్వతి. – వాకా మంజులారెడ్డి జీవితం సాఫీగా సాగుతుంది పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో చెయ్యి వణకడంతోపాటు స్లో నెస్, స్టిఫ్నెస్ ఉంటాయి. ఆ ప్రభావం హ్యాండ్ రైటింగ్ మీద పడుతుంది. అక్షరాల సైజు కూడా తగ్గిపోతుంది. దీనిని మైక్రో గ్రాఫియా అంటారు. మూడు నుంచి ఐదేళ్ల వరకు కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ దైనందిన జీవనంలో గణనీయమైన మార్పులేవీ కనిపించవు. మొదట్లో మందుల ప్రభావం ఎనిమిది గంటల సేపు ఉంటుంది. క్రమంగా ఆరు గంటలకు తగ్గిపోతుంటుంది. నరాల బలహీనత కుడి–ఎడమల్లో కొంచెం తేడా ఉంటుంది. కుడివైపు తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లలో అన్నం కలుçపుకునేటప్పుడు, తినేటప్పుడు చెయ్యి వణకడం స్పష్టంగా తెలుస్తుంటుంది. సంతకాలు మ్యాచ్ కాకపోవడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి దశలో సంతకాలు మానేసి వేలిముద్ర వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న పెన్ను చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ల లైఫ్ ఈజీ అవుతుంది. – డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి న్యూరాలజిస్ట్ -
సీఎం సంతకం ఫోర్జరీ
హైదరాబాద్: ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/పీలో 2 ఎకరాల భూమికి రెగ్యులరైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి లెటర్ హెడ్‌తో ఉన్న కాపీని రెవెన్యూ డిపార్ట్మెంట్కు నిందితులు పంపించారని తెలిపారు. లెటర్ హెడ్లను యాకుత్‌పురాకు చెందిన టీఆర్ఎస్ లీడర్ నుంచి రూ.45 వేలకు నిందితుల్లో ఒకడైన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశాడని వెల్లడించారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ -
‘ఆహా’ర్యం.. మాటే మంత్రం..
సాక్షి, హైదరాబాద్: అందం, ఆహార్యంతోనే కాదు.. మాట్లాడే తీరులోనూ ఇవాంకా ట్రంప్ అదరహో అనిపించింది. ఆత్మ విశ్వాసాన్ని ప్రతి బింబిస్తున్న నడకతో, ముఖ్యంగా మోముపై చెరగని చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో సదస్సుకు వచ్చినవారంతా ఆమెకు అభిమాను లైపోయారు. ఈ నేపథ్యంలో ఇవాంకా మాట తీరు, సంతకం, వస్త్రధారణలను హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు విశ్లేషించారు. ఆ మాటే మంత్రం... ‘‘చెప్పే విషయాన్ని సరిగా ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్టే అనేది పబ్లిక్ స్పీకింగ్‌లో ఒక ప్రాథమిక సూత్రం. ఇవాంకా తన ప్రసంగం ప్రారంభంలోనే అందరి మనసులనూ హత్తుకున్నారు. అంతే అద్భుతంగా చివరి వరకూ ప్రసంగాన్ని కొనసాగించారు. ‘హలో ఎవ్రీవన్.. థాంక్యూ బీయింగ్ హియర్ అండ్ ఫర్ ఇన్క్రెడిబుల్లీ వార్మ్ వెల్కమ్ (అందరికీ నమస్కారం.. సుస్వాగతం. ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది)’ అంటూ ఇవాంకా పలకరించిన తీరు ఆకట్టుకుంది. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రస్తుతిస్తూ.. ఇరు దేశాల మధ్య అనుబంధాలను వివరిస్తూ ప్రతీ పదం స్పష్టంగా పలికారు. చెరగని చిరునవ్వుతో సరైన పదాలను వినియోగిస్తూ అందరికీ కనెక్టయ్యారు. సత్య నాదెళ్ల వంటి తెలుగువారిని, టీ–హబ్, సిటీ ఆఫ్ పెరల్స్‌ను ప్రస్తావిం చారు. ఆమె ఆహార్యం, నేరుగా అందరి వైపూ చూస్తూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె ఒక మంచి వక్త అనిపించింది. అవసరాలకు అనుగుణంగా పదాల మధ్య ఇచ్చిన విరామాలు, మధ్య మధ్యలో ‘థాంక్యూ’లు ఆహూతులను కట్టిపడేస్తాయి. ‘దిస్ ఈజ్ ది ఫ్యూచర్.. వి కెన్, విల్ అండ్ మస్ట్ బిల్డ్ టుగెదర్ అండ్ దిస్ ప్రామిస్’ అనే వాక్యంతో ఇవాంకా ప్రసంగాన్ని ముగించారు.’’ – డి.రామచంద్రం, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అది విజయానికి ‘సంతకం’.. ‘‘ఇవాంకాది అసాధారణ వ్యక్తిత్వం. దీనికి ప్రతీక ఆమె సంతకమే. ఆ సంతకం యాంగిల్ అండ్ రౌండెడ్ (ఓ వైపు వంగినట్లుగా ఉండి గుండ్రంగా)గా ఉంది. ఆమెలో బిజినెస్ సెన్స్ అద్భుతమని దీని అర్థం. అలాగే సంతకంలో ‘కంటిన్యూయస్ ఫ్లో, కనెక్టింగ్ లెటర్స్ (ఒకదానిని ఒకటి తాకుతూ అక్షరం వెంటే అక్షరం ఉండటం)’ విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణిని పట్టిస్తుంది. సంతకంలో లోయర్ జోన్ అక్షరాలు మానసికంగా, శారీరకంగా సమర్థవం తమైన స్థాయిని (హైఎనర్జీ లెవల్స్‌ను) సూచిస్తున్నాయి. చివరి అక్షరం రాసిన తీరు ఆమె స్వతంత్ర భావాలకు నిదర్శనం. సంతకంలో ఫ్రీఫ్లో ఆఫ్ స్ట్రోక్స్ వ్యాపారంలో దూరదృష్టికి, సంతకం కింద ఉన్న పెద్ద సర్కిల్ భావోద్వేగాలకు, సెంటిమెంట్స్‌కు, సంతకంలో పొడవాటి స్ట్రోక్స్ (అక్షరాలు) సృజనాత్మకతకు, స్ఫూర్తిదాయక లక్షణాలకు, కొత్త విషయాల పట్ల చూపే ఉత్సాహానికి నిదర్శనాలు. ఆమె ప్రేమాస్పదురాలు కూడా. అప్పుడప్పుడు తొం దరగా స్పందించడం, వేగంగా మూడ్ మారి పోయే లక్షణం ఉండే అవకాశముంది. – రణధీర్ కుమార్, సిగ్నేచర్ అనలిస్ట్ వైవిధ్యాన్ని గుర్తు చేసేలా.. ‘‘విమానాశ్రయంలో దిగిన ప్పుడు ఇవాంకా ధరించిన దుస్తులు సెమీ ఫార్మల్. రౌండ్‌నెక్ టీషర్ట్‌పై నలుపురంగు ట్రౌజర్‌ను కాంబినేషన్‌గా ధరించారు. దానిపై బ్లాక్ అండ్ వైట్ బ్లేజర్ వేసుకున్నారు. దానిపై ఏకరూపత కలిగిన డిజైన్లు (సిమ్మెట్రికల్ ప్యాట్రన్స్) ఉన్నాయి. తన కన్నా ఉన్నత స్థాయి వారిని, సీనియర్లను కలవడానికి వెళ్లినప్పుడుగానీ.. లంచ్ లేదా తేనీటి విందు వంటి సందర్భాల్లో వీటిని ధరిస్తారు. ఇక ఇవాంకా హెచ్ఐసీసీలో సదస్సు జరుగుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు.. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చేవారికి కలుస్తున్న విషయాన్ని గుర్తు చేసేలా వస్త్రాలను ధరించారు. పూల డిజైన్లను ముద్రించిన కూల్ కలర్ గౌన్‌ను వేసుకున్నారు. (సాధారణంగా గ్రీన్, లెమన్ ఎల్లో, లైట్ పింక్ తదితర వాటర్ కలర్స్‌ను ఫ్యాషన్ పరిభాషలో కూల్ కలర్స్ అంటారు). అంతేగాకుండా ఈ డ్రెస్‌లో హైదరాబాదీలకు బాగా నచ్చే ఆకుపచ్చ, పసుపు రంగులకు ఆమె ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తోంది..’’ – సంతోష్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ రావమ్మా.. ఇవాంకా! సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్ ద్వారా 3.14 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్ఐసీసీ చేరుకున్నారు.