Singareni Workers Federation
-
సింగరేణిని కాపాడుకోవాలి!
కేంద్ర ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75 వేల కోట్లు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్‌లను దశల వారీగా వేలం వేస్తూ వస్తున్నది. కార్పొరేట్ల చేతుల్లోకి ఇప్పటికే 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. గత పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే పరిస్థితి విపక్షాలకు లేదు. చర్చకు అవకాశమే లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం తీసుకొంది.అది ప్రవేశపెట్టిన బిల్లుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు అందరూ మద్దతు పలికారు. ఇందులో బొగ్గు బ్లాక్‌ల వేలంతో పాటు కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు. సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు అనుబంధం కాని కారణంగా బతికి పోయింది!ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ )లో 25 శాతం పెట్టుబడి ఉపసహరణకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. కేంద్రం నిర్ణయం కారణంగా మరిన్ని షేర్లు ప్రైవేటుపరం కానున్నాయి. ఇదంతా బీసీసీఎల్‌ను అమ్మేసే కుట్రలో భాగమే అనక తప్పదు!మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక తాజాగా దేశంలోని 60 బొగ్గు బ్లాక్‌లకు వేలం వేసే ప్రక్రియ మన తెలంగాణలోనే మొదలు పెట్టారు. గత పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఇప్పుడు బీజేపీకి లేకున్నా, మోదీ తన విధానం మాత్రం మార్చుకోలేదనేది కొత్తగా నిర్వహించిన వేలం వల్ల స్పష్టమవుతోంది. గతంలో రామగుండానికి పీఎం నరేంద్ర మోదీ వచ్చినపుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు.ఇప్పుడు అదే మాట మన బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు బొగ్గు బ్లాక్‌ల కేటాయించమని డిమాండ్ చేసినా ఏమీ సమాధానం చెప్పలేదు! ‘రైల్వేతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఛాయ్ అమ్మాను! నేను రైల్వేను ప్రైవేట్ పరం చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారు, నేను అలా చేస్తానా?’ అని చెప్పిన పీఎం తర్వాత చేసిన పని ఏమిటో జగమెరిగిన సత్యం! అంతే కాదు అదే పీఎం మోడీ, ‘ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి’ అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఏ మాట నమ్మాలి?కేంద్ర, రాష్ట్రాల వాటాలు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి. ఇందులో కేంద్రం వాటా 49 శాతం ఉంది. రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. గత 20 ఏండ్లకు పైగా లాభాల్లో నడుస్తూ, 2001– 2002 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అనారోగ్యం పాలై దరఖాస్తు చేసుకుంటే ఇన్వాలిడేషన్ చేసి, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే కావడం విశేషం!ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటి విధానాల వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షల పైచిలుకు ఉన్న కార్మికుల సంఖ్య 3 లక్షలకూ, సింగరేణిలో 1991లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకూ పడిపోయాయి. కోల్ ఇండియా కూడా మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది! కోల్ బ్లాక్‌లను కేటాయించకుండా ఉంటే సింగరేణి నష్టాల్లో పడుతుంది. అప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయవచ్చనేది కేంద్రం యోచన కావచ్చు. అందుకే అది బొగ్గు బ్లాక్‌లను కేటాయించడంలేదని చెప్పవచ్చు.ఈ విషయం మీద మన తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని మోదీతో మాట్లాడుతామన్నారు. మరో వైపు ‘మా బ్లాకులు మాకు ఇవ్వండి’ అని మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లిఖిత పూర్వకంగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు పీఎం మోదీకి లేఖ రాశారు. ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2015 లోని బొగ్గు బ్లాక్‌ల వేలం చట్టం లోనే, 17 (ఏ) సెక్షన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాక్‌లను వేలంలో పాల్గొనకుండానే కేటాయించవచ్చు! ఆ దిశలో కేంద్రం ముందుకు పోతుందని ఆశిద్దాం! అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం! ఛలో ఆజ్ నహీ తో కల్ నహీ! తెలంగాణ గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి హక్కు ఉన్నది! – ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, 9951865223. -
రేపే ‘సింగరేణి’ ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈనెల 27న జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. పాతికేళ్ల కిందట మొదలైన ఎన్నికల పోరు దక్షిణ భారత్‌లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 39 వేల మంది కార్మికులు పని చేస్తు న్నారు. 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట రెండేళ్లు ఉండగా తర్వాత నాలుగేళ్లకు పెంచారు. చివరి సారిగా 2017 అక్టోబర్‌లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాల పరిమితి 2021 అక్టోబర్‌తో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 6న నోటిఫికేషన్ వచ్చినా.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ 6న వెలువడింది. అదేనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు ఈనెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రచారంలో ఉధృతి పెంచాయి. మొత్తం 39,773 మంది కార్మికులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లెందులో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు సా«ధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు. ‘గుర్తింపు’ఎవరికో..? తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్ తొమ్మిది ఏరియాల్లో గెలుపొందగా, ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ.. ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒక దశలో పోటీకి టీజీబీకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురి పెట్టింది. -
గనులు తెచ్చి.. ఉపాధినిచ్చే...ఘనులెవరు..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి తమ బతుకుల్లో వెలు గులు నింపాలని అన్ని కార్మి క సంఘాలు డిమాండ్ చేశాయి. సింగరేణి కార్మి కుల ఎజెండాపై గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘సాక్షి చర్చా వేదిక’లో అన్ని గుర్తింపు, జాతీయ, విప్లవ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కెంగర్ల మల్లయ్య– టీజీబీకేఎస్, వాసిరెడ్డి సీతారామయ్య– ఏఐటీయూసీ, జనక్ ప్రసాద్–ఐఎన్టీయూసీ, రియాజ్ అహ్మద్– హెచ్ఎంఎస్, యాదగిరి సత్తయ్య–బీఎంఎస్, తుమ్మల రాజారెడ్డి– సీఐటీయూ,జి.రాములు– ఏఐఎఫ్టీయూ, విశ్వనాథ్, నరేష్–ఐఎఫ్టీయూ పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, కాంట్రాక్టు కార్మి కుల క్రమబద్దీకరణ, రెండుపేర్లకు చట్టబద్ధత, ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటికల, డీఎంఎఫ్ నిధుల మళ్లింపు వంటి ప్రధాన సమస్యలపై ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పార్టీలు కేవలం వాగ్దానాలతో కాలయాపన చేయడమే తప్ప.. ఇంతవరకూ ఆ సమస్యలను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగనులు, ఉపాధి ఎక్కడ...? తెలంగాణ రాష్ట్రం వస్తే.. కొత్త గనులు వచ్చి స్థానికులకు ఉపాధి లభిస్తుందనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని కార్మిక సంఘాల నేతలు వాపోయారు. ఇక్కడ మరో 180 ఏళ్లకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గినా.. ఏటా ఐదు కొత్త గనులు ప్రారంభించి, దాదాపు లక్ష మందికి కల్పించే వీలుందని సింగరేణి ఉన్నతాధికారులే ధ్రువీకరించారని గుర్తు చేశారు. కానీ 1.16 లక్షల మంది కార్మికులున్న సంస్థను ఇపుడు 40 వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మి కులు ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్నా.. వారికి అత్తెసరు వేతనాలే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవీ డిమాండ్లు ♦ కాంట్రాక్టు కార్మి కులను వెంటనే క్రమబద్దీకరించాలి. ♦ ఆదాయపు పన్ను మినహాయింపులో స్లాబ్ మార్చడం లేదా పార్లమెంటులో చట్టం ద్వారా శాశ్వత ఉపశమనం కల్పించాలి ♦ డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మిమినరల్ ఫౌండేషన్ ట్రస్ట్) నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించకుండా సింగరేణి ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. ♦ ఇక రెండు పేర్ల చట్టబద్ధతపై విధానపరమైన నిర్ణయం తీసుకుని వారి వారసులకు 40 ఏళ్ల వయోపరిమితితో కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించాలి. ♦ బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న డిమాండ్‌ను నిలబెట్టుకోవాలి ♦ సింగరేణి డిక్లరేషన్ తేవాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్ తరహాలో అన్ని పార్టీ లు సింగరేణి డిక్లరేషన్ చేసిన వారికే ఈ ఎన్నికల్లో ఓటేస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సింగరేణి మనుగడకు గతంలో పార్టీలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తారో వారికే తమ సంఘాలు, కార్మి కులు మద్దతు తెలుపుతాయని నేతలు స్పష్టం చేశారు. -
సింగరేణి కార్మికులకు రూ. 1726 కోట్లు.. ఒక్కొక్కరికి 2 నుంచి 6 లక్షలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన బకాయిలపై సింగరేణి సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సింగరేణిలో జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం అమలు అవుతున్న విషయం తెలిసిందే. పదో వేజ్‌బోర్డు కాలపరిమితి 2021 జూలై 1తో ముగిసింది. అప్పటి నుంచి 11వ బోర్డు అమల్లోకి వచ్చింది. ఈ మేరకు 2021 జూలై నుంచి 2023 మే 31 వరకు మొత్తం 22 నెలలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులకు పెరిగిన వేతన బకా యిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై కార్మిక సంఘాలు క్రమం తప్పకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వేజ్‌బోర్డు వేతన బకాయిలు ఈనెల 21న చెల్లిస్తామని సింగరేణి ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో పని చేస్తున్న 42 వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ బకాయిల మొత్తం జమచేస్తారు. ఇందుకు సంస్థ రూ.1,720 కోట్లు కేటాయించింది. కనిష్టంగా రూ.2.60 లక్షలు సింగరేణిలో ప్రారంభ వేతనం పదో వేజ్‌బో ర్డులో రూ. 25,000 ఉండగా 11వ వేజ్‌బోర్డ్‌లో ఇది రూ. 37,000కు చేరుకుంది. సీనియర్ విభాగంలో గరిష్ట వేతనం రూ.76వేల నుంచి రూ.90 వేలకు పైగా చేరుకుంది. దీంతో ఒక్కో కార్మికుడు పొందే వేతనాల బకాయిల మొత్తం కనిష్టంగా రూ. 2.64 లక్షలు ఉండగా, గరిష్టంగా రూ.3.08 లక్షల వరకు ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయంలో గరిష్టంగా రూ.6 లక్షల వరకు వేతన బకాయిలు అందనున్నాయి. చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
పేర్లు.. పింఛను వెతలు...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్) విధించిన కొత్త నిబంధన కొందరు రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇబ్బందిగా మారింది. వాస్తవానికి విశ్రాంత కార్మికుల సంక్షేమానికి సీఎంపీఎఫ్ బతికిఉన్న ప్రతీ కార్మికుడు, అతడి భార్య వివరాలు డిజిటలైజేషన్ చేయాలని ఇటీవల నిర్ణయించింది. కొందరు సింగరేణి కార్మికుల భార్యలు మరణించగా, రెండో వివాహం చేసుకున్నారు. ఇలాంటి వారి వివరాలు ఇంతవరకూ డిజిటలైజ్ కాలేదు. అందుకే, భార్యల ప్ర యోజనాలు కాపాడేందుకు, వితంతువులకు పింఛన్ ఇవ్వాలన్న సదుద్దేశంతో సీఎంపీఎఫ్ ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా కోల్‌బెల్ట్‌లో మొదలుపెట్టింది. రిటైరైన కార్మికులంతా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆధార్ వివరాలు సమర్పిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా రు. సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ కార్మికులు 84,808 మంది ఉన్నారు. న్యాయపరమైన చిక్కులతోనే... సింగరేణిలో చాలామంది కార్మికులు గతంలో అలియాస్ పేర్లతో విధులు నిర్వర్తించేవారు. అప్పట్లోయాజమాన్యం కూడా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వాల దృష్టిలో ఉన్నదే. తెలంగాణ ఆవిర్భవించాక రెండుపేర్లు ఉన్న కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని సీఎం హామీ ఇచ్చినా..న్యాయపరమైన చిక్కుల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు సీఎంపీఎఫ్ విధించిన కొత్త నిబంధనలు రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల పాలిట ప్రతికూలంగా మారాయి. రెండు రోజులుగా తిరుగుతున్నా జీడీకే–2గనిలో కోల్‌ఫిల్లర్‌గా పనిచేసి తొమ్మిదేళ్ల కిందట రిటైర్డ్ అయ్యా. అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నా. పాత రామగుండం నుంచి 2 రోజులుగా బ్యాంకుకు వచ్చి వెళ్తున్నా. ఇంకా పని కాలేదు. ఇద్దరికి బ్యాంకు అకౌంట్లు ఉండాలంటున్నారు. తర్వాతే జాయింట్ చేస్తామని చెబుతున్నారు. - ఈదునూరి శంకర్ రిటైర్డ్ కార్మికుడు గర్రెపల్లి నుంచి వచ్చా జీడీకే–2ఏ గనిలో పనిచేసి 11 ఏళ్ల కిందట రిటైర్డ్ అయ్యా. మళ్లీ అన్ని పేపర్లు అడుగుతున్నారు. చేతకాకున్నా మనుమడిని పట్టుకొని బ్యాంకుకు వచ్చా. గంటల తరబడి లైన్లో కూర్చోవాల్సి వచ్చింది. మళ్లీ పేపర్లు అన్నీ నింపి ఫొటోలు ఇవ్వాల్సి రావడం ఆలస్యం అవుతోంది. - పిట్టల గంగయ్య రిటైర్డ్ కార్మికుడు 20 శాతం మారుపేర్లతోనే... సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల్లో సుమారు 20శాతం మంది మారుపేర్లతో పనిచేశారు. వీరికి సింగరేణిలో ఒకపేరు, సొంత గ్రామంలో మరోపేరు ఉంది. వీరందరికీ మొన్నటి వరకూ రెండు ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత కేంద్రం రెండు పేర్లతో ఉన్న ఆధార్‌కార్డుల తొలగింపు మొదలుపెట్టింది. దీంతో వందలాదిమంది సింగరేణి కార్మికులు తమ ఆధార్‌కార్డులు కోల్పోవాల్సి వచ్చింది. కొందరు మారుపేరు కార్డు కోల్పోగా, మరికొందరు సొంత పేరుతో ఉన్న కార్డులు కోల్పోయారు. ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారింది. వితంతువులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. అందుకే, మారుపేర్లతో ఉన్న కార్మికులను అలియాస్ పేరుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అసలు తమకు వచ్చేది అరకొర పింఛన్ అని, దానికి ఇన్ని తిప్పలు పెట్టి తమ పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. ఊర్లో ఉన్న ఆస్తులు రైతుబంధు, రైతుబీమా వివిధ సంక్షేమ పథకాలకు సొంతపేరుతో ఉన్న ఆధార్‌కార్డు లింక్ అయ్యాయని, ఇప్పుడు తామేం చేయాలో తెలియని అయోమయ స్థితి నెలకొందని వాపోతున్నారు. యాల్సి వచ్చిందని విలపించారు. -
ఆత్మహత్యకు యత్నించి.. చివరికి..
పెద్దపల్లి: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటూ జీడీకే–1వ గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు తాటికొండ సంజీవ్(30) ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. ఈనెల 23న సంజీవ్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సంజీవ్‌కు ఆరునెలల కిత్రం ములుగుకు చెందిన అమ్మాయితో వివాహం కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ సుగుణాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాహుబలి గని!
కరీంనగర్: రాబోయే రోజుల్లో వంద మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజ మాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రసుత్తం 78 మిలియన్ టన్నుల లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, రాబోయే రో జుల్లో మరో 22మిలియన్ టన్నులు పెంచేందు కు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే మరో భా రీ ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుకు వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగు గనులు కలిపి రామగుండం కోల్‌మైన్ పేరుతో కొత్త ఓసీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 633.45మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ ప్రాజెక్టు రెండేళ్లలో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆర్జీ–3ఏరియాకు అనుబంధంగా.. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–3 ఏరియాకు అనుబంధంగా రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. భవిష్యత్‌లో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కలుపుకుని ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గని, ఆర్జీ–3 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–1, 2, మూసివేసిన జీడీకే–10 గనిని కలుపుకుని మెగా ప్రా జెక్టు ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ఆర్జీ–2, 3 జీఎంలతో ఎ ప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతున్నారు. రెండు ఏరియాల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రాజెక్టు పనులు సిద్ధం చేసేందుకు ప్రత్యేక అధికారిని యాజమాన్యం నియమించింది. పెరుగనున్న బొగ్గు ఉత్పత్తి రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏ టా 10మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ కాలానుగుణంగా అన్ని గనులను ఒకే ఓసీపీ కిందకు తీసుకరానున్నారు. నూతన మెగా ఓసీపీ మూలంగా వకీల్‌పల్లి గనిని మరో రెండేళ్లలో మూసివేయనున్నారు. ఇప్పటికే మూ సివేసిన జీడీకే–10గనితో పాటు నాలుగు గనులను ఒకే ప్రాజెక్టు పరిధిలోకి తీసుకరానున్నారు. దీనివల్ల సరిహద్దు సమస్య లేకుండా ఉండనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓసీపీ–2 ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మార్పు తదితర పనుల మూలంగా ఉత్పత్తి వెనకపడింది. ఇదే ప్రాజెక్టు పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ ప్రాజెక్టు గని కూడా ఇందులో అంతర్భాగంగా కొనసాగించనున్నారు. రెమిడేషన్ ప్లాన్‌లో వకీల్‌పల్లి, ఓసీపీ–1 పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఉత్పత్తి తీసిన వకీల్‌పల్లిగని, ఓసీపీ–1 ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం రెమిడేషన్ ప్లా న్ చేయాల్సింది ఉంది. ఈ మేరకు రెండు గనుల అధికారులు సమీప గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే రెండు గనులకు సంబందించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. క్లియరెన్స్ రాగానే రామగుండం కోల్‌మైన్ ఓసీపీ కోసం యాజమాన్యం ఎన్విరాన్మెంట్ విభాగానికి దరఖాస్తు చేసుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈఏడాది నవంబర్‌లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. 2024 నాటికి నాలుగు గనుల సరిహద్దు కలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు ప్రొఫైల్ వివరాలు.. ప్రాజెక్టు పేరు: రామగుండం కోల్‌మైన్, విస్తరణ: 3445హెక్టార్లు, బొగ్గు నిల్వలు: 633.45మిలియన్ టన్నులు, ఏటా బొగ్గు ఉత్పత్తి: 14మిలియన్ టన్నులు(భూగర్భగనితో కలిపి), ఓవర్‌బర్డెన్: 2,846 మిలియన్ క్యూబిక్‌మీటర్లు, ప్రాజెక్టు జీవిత కాలం: సుమారు 30ఏళ్లు, అటవీభూమి: 719హెక్టార్లు. -
సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ వేతనాలు నేడు
సింగరేణి (కొత్తగూడెం)/గోదావరిఖని: సింగ రేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ ప్రకారం కొత్త వేతనాలను సంస్థ సోమవారం చెల్లించనుంది. కోల్ ఇండియా పరిధిలోని సింగరేణితో పాటు మరో 8 బొగ్గు పరిశ్రమలకు చెందిన సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు జూలై నుంచి కొత్త వేతనాలు అందించేందుకు సర్క్యులర్ విడుదల చేసింది. 10వ వేజ్‌బోర్డ్‌లో 1వ కేట గిరీ నుంచి ఏ1 గ్రేడ్ కార్మికులు, సూపర్వైజర్లు కలిపి సుమారు 42వేల మంది పనిచేస్తున్నా రు. వీరికి జూన్ వరకు నెలకు రూ.320 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా, 11వ వేతన సవరణలో అదనంగా రూ.70 కోట్ల మేర పెరి గాయి. గతంలో కేటగిరీ–1 కార్మికులకు రోజు కు రూ.1011.27 చెల్లించగా, ఇప్పుడు రూ.1502.66 చెల్లిస్తారు. ఏ1 గ్రేడ్, సూపర్ వైజర్లకు వేతనం గతంలో రూ.47,802.52 ఉండగా, 11వ వేజ్‌బోర్డు అమలుతో రూ.71, 030.56కు పెరిగింది. ఇంకా వీటికి అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి. బకాయి వేతనాలు విడుదల.. 10వ వేజ్‌బోర్డ్ కాల పరిమితి 2021 జూన్ 30 తో ముగిసింది. అంటే 2021 జూలై 1 నుంచి 11వ వేజ్‌బోర్డు అమలు కానుంది. ఈ నేపథ్యంలో 23 నెలల బకాయిలు కూడా కార్మికుల ఖా తాల్లో జమ కానున్నాయి. 11వ వేజ్‌బోర్డ్‌లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీ బీ) జీతం పెరుగుదలతోపాటు 25 శాతం అల వెన్స్‌లు కలిపి ఒకొక్క కార్మికుడికి వారి వేతన స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉంది. -
బొగ్గు రవాణా మరింత పెంచాలి
శ్రీరాంపూర్: బొగ్గు రవాణా మరింత పెంచాలని సింగరేణి(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో నూతనంగా నిర్మించిన రెస్ట్హాల్ను ప్రారంభించారు. అనంతరం సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణా మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం బీ.సంజీవరెడ్డి, ఏరియా ఇంజనీర్ రమేశ్‌బాబు, సీహెచ్‌పీ డీజీఎం వెంకటేశ్వరరావు డీజీఎం సివిల్ శివరావు, డీజీఎం ఐఈడీ చిరంజీవులు, ఆర్కే 5 గని మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, గుర్తింపు సంఘం నాయకులు లక్ష్మణ్, వెంగల కుమారస్వామి, ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజ్, ఐఎన్టీయూసీ బ్రాంచిఉపాధ్యక్షుడు శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై ఉత్తర తెలంగాణలో జంగ్ సైరన్
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కోల్ట్‌బెల్ట్ ప్రాంతంలో మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గుగనుల వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌బెల్టు ప్రాంతాల్లో ‘మహా ధర్నాలతో’ జంగ్ సైరన్ మోగించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొగ్గు గనులకు నిలయమైన గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు, కార్మికసంఘాల నేతలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పార్టీ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ పుట్టమధు భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే మహాధర్నాలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేలా మహాధర్నా విజయవంతం చేసేందుకు శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కోల్‌బెల్టు నేతలకు సీఎం ఫోన్..! సింగరేణి సమస్య కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే బొగ్గు గనుల వేలంకు కేంద్రం యత్నిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం పోరుబాటను ఎంచుకుంది. దీనిలో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నాకు సంబంధించి కేటీఆర్ సింగరేణి పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మాట్లాడగా, పార్టీ నిరసన కార్యక్రమాలపై సీఎంవో కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ఫోన్లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించే మహాధర్నాకు కార్మికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
ఇది పింఛనా.. ఇగ పెంచరా?
గోదావరిఖనికి చెందిన ఎర్రం నర్సయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. ఆయన నెలనెలా వస్తున్న పింఛన్ రూ.600 మాత్రమే. భార్యాభర్తలిద్దరూ ఇదే పింఛన్‌తో గడపాలి. 1997లో పనిలోంచి దిగిపోయాడు. కాలుకు దెబ్బతగిలి గాయమవడం, షుగర్ కారణంగా అది పెద్దదవడంతో మోకాలి వరకు తొలగించారు. రెండో కాలు విరగడంతో రాడ్ వేశారు. రెండు కాళ్లూ పనిచేయని దుస్థితి. అయినా ఇదే పింఛన్‌తో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మట్ట లింగయ్య 28ఏళ్లపాటు సింగరేణిలో పనిచేసి 2002లో రిటైరయ్యాడు. అప్పటి నుంచీ ఆయనకు రూ.580 పింఛన్ మాత్రమే వస్తోంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ఆయన.. మందులు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నట్టు వాపోతున్నాడు. .. ఇది కేవలం నర్సయ్య, లింగయ్యల గాథ మాత్రమేకాదు. బొగ్గుగనుల్లో పనిచేసి రిటైర్ అయిన వేలాది మంది కార్మికుల గోస ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ కంటే కూడా తమకు వచ్చే కార్మిక పింఛన్ చాలా తక్కువని.. కార్మిక పింఛన్ ఉందని ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. (సాక్షిప్రతినిధి, కరీంనగర్) ఏళ్లపాటు సేవలు చేసినా.. రిటైరైన తర్వాత సుఖంగా విశ్రాంత జీవితం గడుపుతామని కలలు కన్న బొగ్గుగని కార్మికుల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. నామమాత్రపు పింఛన్‌తో బతుకీడుస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి కోసం కష్టపడిన కార్మికులు వయసు మీదపడ్డాక కీళ్ల అరుగుదల, శ్వాసకోస సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నారు. పింఛన్ సొమ్ము ఎటూ సరిపోక అప్పులపాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.2,016 పింఛన్ ఇస్తోంది. కానీ రిటైర్డ్ కార్మికులు సీఎంపీఎఫ్ పింఛన్ అందుకుంటుండటంతో వారికి ఆసరా పథకానికి అర్హత లేకుండా పోయింది. కానీ ఆసరా కన్నా చాలా తక్కువగా కేవలం రూ.500, వెయ్యిలోపే సీఎంపీఎఫ్ పింఛన్ వస్తుండటం గమనార్హం. ఏళ్లుగా పోరాడుతున్నా.. పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోలిండియా వ్యాప్తంగా 2011లో పెన్షనర్ల అసోసియేషన్ ఏర్పడింది. నాలుగేళ్లపాటు పోరాడిన అసోసియేషన్ అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి గోడు వినిపించుకున్నా స్పందన రాలేదు. దీనితో తమకు న్యాయం చేయాలంటూ.. 2015 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ అంశాన్ని కిందికోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఏడేళ్లు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై నిర్ణయం వెలువడలేదు. ఈ కేసు వచ్చే నెల 11న తిరిగి విచారణకు రానున్నట్టు నాయకులు తెలిపారు. పెన్షన్ లోటుపై పట్టింపేది? మొత్తం పెన్షన్‌దారులు ఎంతమంది? మూలనిధి ఎంత ఉంది? రిటైర్ అవుతున్న బొగ్గు గని కార్మికులకు ఎంత పెన్షన్ చెల్లించాలనే అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయించాల్సిన ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ కనీసం ప్రతి మూడేళ్లకోసారి సమావేశం కావాలి. ఫండ్‌లో లోటు లేకుండా చర్యలు చేపట్టాలి. దీనితో ఇప్పటివరకు రూ.45 వేలకోట్ల లోటు ఏర్పడినట్టు సమాచారం. దీనిని పూడ్చేందుకు ఇటీవలే చర్యలు చేపట్టారు. కోలిండియా యాజమాన్యంతో మేనేజ్మెంట్ కమిటీ చర్చించి టన్ను బొగ్గుపై రూ.15 లెక్కన సీఎంపీఎఫ్ ట్రస్ట్‌కు చెల్లించేందుకు అంగీకరించేలా చేసినట్టు తెలిసింది. 10న సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఈనెల 10న కోలిండియా స్థాయిలోని సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో రిటైర్డ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా.. బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని 2011లో కోలిండియా అధ్యక్షుడితో కలిసి పోరాటం ప్రారంభించాం. అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి సమస్య వివరించాం. సానుకూల స్పందన రాలేదు. ఐదేళ్లపాటు అనేక రూపాల్లో పోరాటం చేసి.. చివరికి సుప్రీంకోర్టులో కేసు వేశాం. వచ్చేనెల 11న విచారణ జరగనుంది. – కేఆర్సీ రెడ్డి, రిటైర్డ్ జీఎం, కోల్‌మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి మా సమస్యపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొంత చలనం వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో చేసిన చట్టంలో లోపాలతో ఇబ్బంది పడుతున్నాం. తక్కువ పెన్షన్‌తో చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. – మడిపెల్లి బాబురావు, ప్రధాన కార్యదర్శి, కోల్‌మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ -
సింగరేణి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
-
Diwali Bonus: దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలి
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో పని చేసే ప్రతి కార్మికుడికి దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు. అక్టోబర్ 4న ఢిల్లీలో జరిగే జేబీసీసీఐ సమావేశంలో దీనిపై తమ యూనియన్ తరఫున చర్చిస్తామని పేర్కొన్నారు. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ. 68,500 పీఎల్ఆర్ బోనస్ ఇప్పించడంలోనూ హెచ్ఎంఎస్ పాత్రే కీలకమని తెలిపారు. చదవండి: కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు తమ యూనియన్ ఏ విషయంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని, యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు నష్టం కలిగే చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలను ఈనెల 25వ తేదీన ప్రకటిస్తామని డైరెక్టర్ (పా) చెప్పారని, కానీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘమైన ఏఐటీయూసీ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. -
సింగరేణిలో మూడో రోజు సమ్మె
-
బొగ్గుబాయి ముచ్చట చెప్పకపాయె!
గోదావరిఖని(రామగుండం): ‘అన్ని దుకాణాలు తెరువుమన్నడు.. మద్యం అమ్ముతమని చెప్పిండు.. రైతుకు తక్లీబ్ కాకుండా చూస్తమన్నడు.. లాక్‌డౌన్‌తో లాయర్లు తిప్పలువడుతున్నరు.. వాళ్లకు రూ.15 కోట్లు రిలీజ్ చేస్తన్నమన్నడు.. కానీ నెల రోజుల సంది బొగ్గుబాయిల లేఆఫ్ చెయ్యవట్టి ఇంటికాడనే ఉండవడ్తిమి.. మన గురించి ఒక్క ముచ్చటన్న మాట్లాడకపాయె.. మన సీఎం సారు.. ఇప్పటికే ఏప్రిల్‌లో సగం జీతమే వచ్చింది. ఈ నెలంతా గిట్లనే లేఆఫ్ ఉంటే ఎట్ల’ అని చర్చించుకుంటున్నారు సింగరేణి భూగర్భ గనుల కార్మికులు. కరోనా విజృంభణతో సింగరేణిలో కూడా ఒకరిద్దరు కార్మికులకు మార్చి చివరి వారంలో పాజిటివ్ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కార్మిక కుటుంబంలో ఇద్దరికి కూడా పాజిటివ్ రావడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. పనిస్థలాల్లో కార్మికులు భౌతిక దూరం పాటించడం సాధ్యం కాకపోవడం.. కరోనా భయం నెలకొనడంతో డీడీఎంఎస్ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం గత నెల 2న 22 భూగర్భ గనులు మూసివేసింది. దీంతో ఉప్పత్తి నిలిచిపోవడంతో పాటు వివిధ భూగర్భ గనుల్లో పనిచేసే 22వేల పైచిలుకు కార్మికులు కూడా ఏప్రిల్‌కు సంబంధించి సగం వేతనాలు కోల్పోయారు. మార్చి వేతనంలో ప్రభుత్వమే 50 శాతం కోత విధించింది. వరుసగా రెండు నెలలు సగం జీతమే.. సంస్థ వ్యాప్తంగా 22భూగర్భ గనుల్లో పనిచేస్తున్న 22వేల మంది కార్మికులు వరుసగా మార్చి, ఏప్రిల్‌లో సగం వేతనం కోల్పోయారు. ప్రస్తుతం సింగరేణి ప్రభావిత జిల్లాల్లో కరోనా ఉధృతి తుగ్గుముఖం ప ట్టింది. కొత్తగా కేసులు నమోదు కావడంలేదు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో భూగర్భ గనుల లేఆఫ్ ఎత్తివేతపై సీ ఎం నిర్ణ యం తీసుకుంటారని కార్మికులు భావించా రు. స మావేశంలో సింగరేణికి సంబంధించి ప్రస్తావనలేకపోవడం, విలేకరుల సమావేశంలో కూడా సీఎం ఎ లాంటి ప్రకటన చేయకపోవడంతో లే ఆఫ్ గనుల్లో పనిచేసే కార్మికులు నిరుత్సాహానికి గురయ్యారు.. గనులు తెరవాలంటున్న కార్మికులు.. కరోనా దెబ్బతో భూగర్భ గనులు మూతపడి నెల దాటిన నేపథ్యంలో లే ఆఫ్ ఎత్తివేయాలని కార్మికులు కోరుతున్నారు. సింగరేణి ప్రభావిత జిల్లాల్లో క రోనా కేసులు కొత్తగా నమోదు కానందున తాము విధులు నిర్వహించేందుకు సిద్ధమని పేర్కొంటున్నా రు. లే ఆఫ్ ఎత్తివేస్తే సంస్థతోపాటు, తమకూ లాభం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. డీజీఎంఎస్ ఆదేశాలు వస్తేనే.. లే ఆఫ్ ఎత్తివేయాలంటే డీడీఎంఎస్ నుంచి ఉత్తర్వులు రావాలని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో విధుల నిర్వహణ, ఉత్పత్తి గురించిన గైడ్‌లైన్స్ కూడా జారీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. లే ఆఫ్ ఎత్తివేయడం సింగరేణి యాజమాన్యం చేతిలో లేదని చెబుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. -
కార్మికుడి అదృశ్యం.. విషాదాంతం
గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికుడి అదృశ్యం విషాదంతో ముగిసింది. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిలోకి వెళ్లి ఈనెల 7న కార్మికుడు కొడెం సంజీవ్(58) అదృశ్యమయ్యాడు. 11 రోజుల గాలింపు తర్వాత జీడీకే–6ఏ గని ప్రాంతంలో 43వ లెవల్, 4 సీమ్, 1డీప్‌లో మృతిచెంది కన్పించాడు. మృతదేహాన్ని శుక్రవారం కుళ్లిపోయిన దశలో అధికారులు గుర్తించారు. గనిలో మొదటిషిప్టులో విధుల్లోకి వెళ్లిన సంజీవ్ ముందుగా కేటాయించిన పంపు వద్ద నీటిని క్లియర్‌చేసి, 1డీప్, 27వ లెవల్, 4వ సీమ్‌లో పంపు ఆపరేటర్‌గా పనులు చేపట్టాడు. విధుల అనంతరం బయటకు రావాల్సి ఉంది. ఈక్రమంలో దారి తప్పి మూసివేసిన జీడీకే–6ఏగని వైపు సీమ్‌లోకి గాలిలేని ప్రాంతానికి వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహానికి ఐదుమీటర్ల దూరంలో సేఫ్టీల్యాంప్, వాటర్‌బాటిల్ పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు. దారి తప్పడం వల్లే మృత్యువాత వయసుపైబడడడం, విధుల వద్ద ఒక్కడే ఉండడం, మానసికస్థితి సరిగా లేకపోవడం వల్ల దారితప్పి మృత్యువాత పడినట్లుగా అధికారులు చెబుతున్నారు. తాను పని చేసిన పంపునకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో మూసివేసిన గని ప్రాంతంలో మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సంజీవ్ చనిపోయిన ప్రాంతంలో 2ఫీట్ల మేర నీరు ఉందని అధికారులు తెలిపారు. తెచ్చుకున్న వాటర్బాటిల్లో నీరు అయిపోవడం, గాలి సరిగా లేకపోవడంతో అక్కడే కుప్పకూలి మృతిచెంది ఉంటాడని అంటున్నారు. డీడీఎంఎస్ ప్రత్యేక బృందాలతో గాలింపు గని కార్మికుడి అదృశ్యంపై గురువారం రాత్రి రంగంలోకి దిగిన డిప్యూటీ డైరెక్టర్ మైన్‌సేఫ్టీ(డీడీఎంఎస్) సుబ్రహ్మణ్యం అదేరోజు గనిపైకి వచ్చి జాతీయ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. గాలింపు జరిపిన బృందాలతో కూడా చర్చించి శుక్రవారం గనిలో వెతకని ప్రాంతాన్ని గుర్తించారు. గనిపై ప్రత్యేక పట్టున్న డిప్యూటీ మేనేజర్లు మాధవరెడ్డి, ఉమాశంకర్, హెడ్‌ఓవర్‌మెన్ నాగేశ్వర్రావుతో కూడిన ప్రత్యేక బృందాలను జీడీకే–6ఏ గని మూసివేసిన ప్రాంతాన్ని గాలింపు చేసేందుకు నిర్ణయించారు. డీడీఎంఎస్ కూడా గనిలోకి దిగి పరిస్థితి సమీక్షిస్తున్న క్రమంలో డిప్యూటీ మేనేజర్ మాధవరెడ్డి టీం సంజీవ్ మృతదేహాన్ని గుర్తించి డీడీఎంఎస్‌కు సమాచారం చేరవేసింది. హెచ్ఎంఎస్ ఫిర్యాదుతో రంగంలోకి డీడీఎంఎస్ సింగరేణి కార్మికుడి అదృశ్యంపై హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ ఫిర్యాదుతో డీడీఎంఎస్ రంగంలోకి దిగింది. గనిలోనే కార్మికు డు ఉన్నాడని గట్టిగా వాదించడంతోపాటు రియాజ్‌అహ్మద్ కూడా డీడీఎంఎస్ సిబ్బందితో గనిలోకి దిగి గాలింపు జరిపారు. ఈప్రాంతానికి గాలింపు బృందాలు వెళ్లకపోవడం వల్లే ఆచూకీ లభ్యం ఆలస్యమైంది రియాజ్ అహ్మద్ ఆరోపించారు. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి కార్మికుడి కుటుంబానికి రావాల్సిన ఎక్స్‌గ్రేషియాతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన (కరోనా) అత్యవసర విభాగం కింద గుర్తించి రూ.50 లక్షలు అదనంగా చెల్లించాలని, యాజమాన్యం వైఫల్యానికి అదనంగా మరో రూ.25 లక్షలు చెల్లించాలని జాతీయ సంఘాల నాయకులు రియాజ్‌అహ్మద్, కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లే కార్మికుడు మృతిచెందాడని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సంజీవ్ కుటుంబస భ్యులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఓదార్చారు. ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. -
సింగరేణి ఉద్యోగుల భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకారంగా సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగులు, అధికారులు తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని నిర్ణయించారు. తమ వేతనం నుంచి ఒక్కరోజు మూలవేతనం, కరువు భత్యంను సీఎం సహాయనిధికి చెల్లించాలని సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. 2,400 మంది సింగరేణి అధికారుల ఒక రోజు మూలవేతనం, కరువు భత్యం కలిపి రూ.కోటి, ఇక 47 వేల మంది కార్మికుల ఒకరోజు మూలవేతనం, కరువు భత్యం కలిపి రూ.7 కోట్ల 50 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు, కార్మికుల వితరణ కలిపి మొత్తం రూ.8.50 కోట్ల చెక్కును త్వరలో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయాలలో సింగరేణి ఉద్యోగులు, అధికారులు ఇదే తరహాలో వితరణను చాటుకున్నారు. క్లిష్ట సమయంలో కార్మికులు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో దక్షిణ భారత విద్యుత్ అవసరాలకు బొగ్గు అందిస్తున్న సింగరేణి సంస్థను అత్యవసర సేవల సంస్థగా గుర్తించారని..కనుక సింగరేణి ఉద్యోగులు, అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎటువంటి బొగ్గు కొరత లేకుండా సింగరేణి ఉద్యోగులు నిత్యం పాటుపడుతున్నారని వివరించారు. ప్రతి గనిలో, కార్మిక కాలనీల్లో, ఆస్పత్రుల్లో, కరోనా వ్యాప్తి నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
నో మాస్క్.. నో శానిటైజర్
గోదావరిఖని(రామగుండం): కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్షణక్షణం భయపెడుతోంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఇంట్లోంచి భయటకు రావొద్దని లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలను మినహాయించింది. ఇందులో భాగంగా విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికుల రక్షణను యాజమాన్యం గాలికి వదిలేసింది. మాస్క్..శానిటైజర్.. అందివ్వకుండా కరోనా ముప్పు కొనితెచ్చిపెడుతోంది. పెద్ద సంఖ్యలో కార్మికుల హాజరు.. భూగర్భ గనులకు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరు అవుతున్నారు. వీరి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర సర్వీసుల కింద భూగర్భ గనుల్లో పనులు నిర్వహిస్తున్న సింగరేణి యాజమాన్యం అదే స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. భూగర్భ గనుల్లో ఏర్పాట్లు మరీ అధ్వానంగా ఉన్నాయని పలువురు కార్మిక నాయకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈసమయంలో భూగర్భ గనుల్లోకి పెద్ద సంఖ్యలో కార్మికులను అనుమతించడం ఎటు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లో 15వేల మంది.. రామగుండం రీజియన్‌లోని 8భూగర్భ గనులు, నాలుగు ఓసీపీల్లో రోజు 15వేల మంది కార్మికులు విధులకు హాజరవుతున్నారు. భూగర్భ గనుల్లోని పనిస్థలాల్లో సామూహికంగా పనిచేసే అవకాశం ఉన్న క్రమంలో వారికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మస్టర్లు వేసే సమయంలో కార్మికుల మధ్య దూరాన్ని పాటించాలని కోరుతున్నారు. ఓసీపీల్లోని భారీ యంత్రాల్లో షిఫ్టు తర్వాత సానిటేషన్ చేసి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు. యాజమాన్యం భూగర్భ గనుల లోపలకి వెళ్లే కార్మికులకు మాస్కులు అందజేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. మాస్కులు లేకుండానే గనిలోనికి మ్యాన్‌రైడింగ్ ద్వారా పంపిస్తున్నారని, ఎవరికనా ఎదైనా వైరస్ అంటితే సింగరేణి కార్మికవర్గం ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు. గనిలోకి వెళ్లే కార్మికుల్లో ఎవరికైనా వైరస్ సోకితే ఆదేవుడే రక్షించాలని వేడుకుంటున్నారు. బుధవారం కొంత మంది కార్మికులు యాజమాన్యం తీరుపై ఆందోళన చెంది విధులకు వచ్చి తిరిగి వెళ్లినట్లు తోటి కార్మికులు తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం విధులకు వచ్చే అన్ని విభాగాల కార్మికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. జలుబు, జ్వ రం, దగ్గు ఉన్న కార్మి కులకు డ్యూటీకి అనుమతించడంలేదు. అన్ని ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేశాం. అలాగే మాస్కులు మార్కెట్లో దొరకడం కష్టంగా మారడంతో కాటన్‌గుడ్డ కొనుగోలు చేసి ప్రత్యేక మాస్కులు కుట్టించి అందిస్తున్నారు. గనులకు హాజరైయ్యే ఉద్యోగులకు సానిటైజేషన్ చేస్తున్నాం.– కె.నారాయణ, ఆర్జీ–1 జీఎం -
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి
సాక్షి, సింగరేణి: కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని వేజ్‌బోర్డు సభ్యుడు, జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి డాక్టర్ బీకే రాయ్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) 26వ మహాసభ జరిగింది. ఈ సభను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బీకే రాయ్ మాట్లాడుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ఆలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ సాధనకు ఎన్నో పోరాటాలు చేసిన కార్మికులను అణగదొక్కాలనే కేసీఆర్ ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మిక వ్యతిరేక వైఖరిపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. పరిశ్రమలను ప్రైవేటీకరించటం, అమ్మివేయడాన్ని బీఎంఎస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. దేశంలో బీఎంఎస్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన, జీతభత్యాల పెంపు కోసం పోరాటాలు సాగిస్తోందని అన్నారు. ఇతర 11 జాతీయ సంఘాలు పోరాటాలు చేసినట్లు నటిస్తున్నాయని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి బొగ్గు రంగంలో ఇతర కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మె చేశాయని, బీఎంఎస్ మాత్రం 5 రోజుల సమ్మె చేసిందని అన్నారు. బీఎంఎస్ సమ్మె దెబ్బతో కేంద్ర మంత్రి దిగివచ్చి కోలిండియా సింగరేణిలో ఎఫ్‌డీఐలను అనుమతించబోమని ప్రకటించారని అన్నారు. 1991లో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారని, ఆ విధానాలనే ప్రధానులు అటల్‌బిహారి వాజ్‌పేయి, నరేంద్రమోదీలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షింపబడతాయని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు ఈ నెల 19న బీఎంఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి, బూర్ల లక్ష్మీనారాయణ, మాధవ నాయక్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఏబీకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీర్‌గరుడే, జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేశం, దక్షిణభారత సంఘటన కార్యదర్శి సామ బాల్‌రెడ్డి, కెంగర్ల మల్లయ్య, రవిరాజ్‌వర్మ, రవిశంకర్, లట్టి జగన్మోహన్, ఎం.రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గుగని కార్మికుల టోకెన్ సమ్మె విజయవంతం
సాక్షి, భూపాలపల్లి: బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని బొగ్గుగని కార్మికులు మంగళవారం చేపట్టిన టోకెన్ సమ్మె విజయవంతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగ్గుగని కార్మికులు స్వచ్ఛందంగా టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెతో భూపాలపల్లి ఏరియాలోని 6700 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో సుమారు 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి, సంస్థకు 2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో టీజీజీకేఎస్, ఏఐటీసీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీసీ, సీఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, బీఎమ్ఎస్ వంటి పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 600 మంది బొగ్గుగని కార్మికులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బొగ్గు పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులపై తమ నిరసనను తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టోకెన్ సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎమ్ఎస్, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూతో పాటు కోల్ ఇండియా సంఘాలు.. సింగరేణిలో ఒక్క రోజు టోకెన్ సమ్మెకు పిలుపు నిచ్చాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీజీజీకేఎస్ కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. మణుగూరు ఏరియాలో అత్యవసర విధులకు సంబంధించిన కార్మికులు తప్ప, మిగతా 90 శాతం మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో మణుగూరు ఏరియాలో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు
సాక్షి, కరీంనగర్ : బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్‌డీఐ లను నిలిపివేయాలని సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆదివారం సింగరేణిలో కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(టీబీజీకేఎస్) మద్దతు ప్రకటించింది. మరోవైపు సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సింగరేణి యాజమాన్యం నిమగ్నమైంది. -
కోల్ ఫీల్డ్‌లో గోల్ ఎవరిది?
రాష్ట్రంలో, కేంద్రంలో వీచే రాజకీయ గాలులతో పనిలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఎంతటి వారినైనా.. నిర్దాక్షిణ్యంగా ‘బొగ్గు’ చేయటమే వారికి తెలిసిన విద్య. రాష్ట్రానికి నల్లబంగారం సిరులు కురిపిస్తున్న సింగరేణి కార్మికుల తీరు.. తీర్పు ఇది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అప్రతిహత విజయాలు సాధిస్తున్న రోజుల్లోనూ సింగరేణి బెల్టులో విభిన్న తీర్పులు వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో వెన్నంటి ఉన్న సింగరేణీయులు 2014లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు సమానంగా ఆ పార్టీకి ఘన విజయాలను అందించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సింగరేణి బొగ్గు గనులు నెలవై ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్కు విజయాన్ని అందించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ఓడిపోయిన సీట్లలో సింగరేణి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలే అధికం. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కార్మికుల తీర్పు ఎలా ఉండబోతుందోనన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కొంతమేర ఆదిలాబాద్ స్థానంలో సింగరేణి ప్రభావం ఉంది. పెద్దపల్లి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల తలరాత మార్చే శక్తి సింగరేణి కార్మికులకు ఉంది. ఈ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు సెగ్మెంట్లలోనే 19 వేల మంది కార్మికులు ఉండగా, రామగుండం, మంథనిల్లోని ఆర్జీ 1,2,3 పరిధిలో కూడా అదే స్థాయిలో కార్మికులు, ఇతర స్థాయి ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబాలను, స్వగ్రామాల్లోని వారి బంధువులను కార్మికులు ప్రభావితం చేస్తారు. ఈ లెక్కన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల, బెల్లంపల్లిల్లో స్వల్ప మెజారిటీలతోనే టీఆర్ఎస్ సిట్టింగులు విజయం సాధించగా, చెన్నూరులో మాత్రం బాల్క సుమన్ 28 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని రెండింటిలో టీఆర్ఎస్ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ పార్లమెంటు పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా మిగతా పార్లమెంటు స్థానాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. పెద్దపల్లితో పాటు టీఆర్ఎస్ను దెబ్బకొట్టిన లోక్‌సభ నియోజకవర్గం ఖమ్మం. ఈ నియోజకవర్గం పరిధిలోని సత్తుపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపొందగా , కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే పూర్వ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పినపాకల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి, ఆదిలాబాద్‌లోని ఆసిఫాబాద్ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 5 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తరించిన 11 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి ఓటర్ల ప్రభావం కచ్చితంగా పడుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సింగరేణి కార్మికులకు కోపమెందుకొచ్చింది..? తెలంగాణ ఉద్యమంలో 11 సింగరేణి ఏరియాల కార్మికులు టీఆర్ఎస్ వెంట నడిచారు. దీంతో టీఆర్ఎస్ అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) ఏర్పాటైంది. దశాబ్దాల పాటు సింగరేణిలో గుర్తింపు యూనియన్లుగా ఆధిపత్యం చెలాయించిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అదే ఊపులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. కార్మికులకు వారసత్వ ఉద్యోగాల కోసం టీఆర్ఎస్ సర్కారు చేసిన ప్రయత్నానికి కోర్టు తీర్పు కారణంగా బ్రేక్ పడింది. అలాగే కార్మిక సంఘం నాయకులు కొందరు టీబీజీకేఎస్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ అన్ఫిట్నెస్ కోసం రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేసే కార్యక్రమం ఇప్పటికీ సింగరేణిలో సాగుతోంది. కార్మికులను కొందరు యూనియన్ నేతలు వేధించారనే విమర్శలూ ఉన్నాయి. ఈ పరిణామాలతో విసుగు చెం దిన రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి డివిజన్ల కార్మికులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు టార్గెట్‌గా..! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సింగరేణి పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలే టార్గెట్‌గా ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గెలిచిన 8 మంది విపక్షాల ఎమ్మెల్యేలను దగ్గర చేసుకునే పనిలో పడింది. రామగుండం నుంచి సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై ఘన విజయం సాధించిన కోరుకంటి చందర్ తొలుత కారెక్కారు. మొన్నటి శాసనమండలి ఎన్నికల ముందు ఆసిఫాబాద్ , పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు టీఆర్ఎస్లో చేరారు. అదే బాటలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నడిచారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో 8 మంది విపక్ష ఎమ్మెల్యేలలో భూపాలపల్లి, మంథని నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మినహా ఆరుగురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టే. ఈ ప్రభావం వచ్చే పార్లమెంటు ఎన్నికలపై పడుతుందని, అది టీఆర్ఎస్కు ఎంత వరకు అనుకూలిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.- పోలంపల్లి ఆంజనేయులు, కరీంనగర్ ప్రతినిధి సింగరేణి‘క్షేత్ర’స్థాయి ఇదీ లోక్‌సభ స్థానాలు 5 అసెంబ్లీ సెగ్మెంట్లు 11 ♦ కాంగ్రెస్: మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, ఆసిఫాబాద్ (ప్రస్తుతం మంథని, భూపాలపల్లి మాత్రమే కాంగ్రెస్‌కు మిగిలాయి) ♦ టీడీపీ: సత్తుపల్లి, (ఈ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి చేరింది) ♦ సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్: రామగుండం ♦ టీఆర్ఎస్: మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు -
సింగరేణిలో ప్రమాదాలను నివారిస్తాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో జరిగే ప్రమాదాలను శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషిచేయాలని అధికారులకు, కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి సంస్థ 45వ త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశంలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, గుర్తింపు సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా లో వృద్ధిరేటుతో పురోగమిస్తున్న సంస్థను ప్రమాదరహితంగా రూపుదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి గనిలో మ్యాన్ రైడి రగ్ సిస్టంలను ఏర్పాటు చేశామని, అందరికీ తేలికపాటి ఎల్ఈడీ క్యాపు ల్యాంపులను సమకూర్చామని తెలిపారు. ఓ.సి.గనుల్లో ఓ.బి (ఓవర్ బర్డెన్) డంపు సామర్థ్యంపై సిస్రో (ఆస్ట్రేలియా కంపెనీ)తో అధ్యయనం చేయిస్తున్నామని, భూగర్భ గను ల్లో రక్షణ పెంపుదలకు తగిన శిక్షణ, సూచనల కొరకు సిమ్టార్స్ (ఎస్ఐఎమ్టీఆర్ఎస్) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ప్రమాదాలు జరుగుతున్న విభాగాలను, పరిస్థితులను గమనించి అక్కడ తీసు కోవాల్సిన రక్షణ చర్యలపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రక్షణ అనేది యాజమాన్య బాధ్యతే కాదని, ప్రతి కార్మికుడు, ప్రతి అధికారి బాధ్యత అన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రమాదాలను నివారించి శూన్య స్థానానికి తీసుకురాగలమని పేర్కొన్నారు. డిప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) విద్యాపతి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తీసుకొంటున్న రక్షణ చర్యలు ప్రశంసనీయమన్నారు. టెక్నాజీలతో ఇక్కడి అధికారులు, కార్మికులు బాగా పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్నారని, ప్రమాదాలనూ శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. వీటి నివారణకు కార్మిక సంఘాలు చేస్తున్న సూచనలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, కార్మికులు కూడా భద్రతతో పనిచేయాలని సూచించారు. -
సమష్టి కృషితో లక్ష్యాన్ని అధిగమించాలి
మణుగూరుటౌన్(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సింగరేణి అధికారులు, కార్మికులు సమష్టి కృషితో ఏరియా 2018–19 ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలో అన్ని గనుల, డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని సూచించారు. రక్షణ విషంలో అన్ని గనుల కంటే మణుగూరు ఏరియాను ముందుంచాలన్నారు. ఏరియా ఉత్పత్తి లక్ష్యాలకు సంబంధించిన నాణ్యతా, పనిగంటలు, ఉత్పత్తి వ్యయం, గనులు, ఏరియా లాభ నష్టాలు, సాధించాల్సిన ఉత్పత్తికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. అధేవిధంగా భూగర్భ గనుల్లో యంత్రాల వినియోగంపై తగు సలహాలు, సూచనలు చేశారు. బొగ్గు రవాణా, నాణ్యత, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉత్పత్తి ఖర్చు, లక్ష్య సాధనకు కార్యాచరణ వంటి తదితర అంశాలను విరించారు. ఏరియాకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, మ్యాన్ పవర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రమేష్‌రావు, ఏరియా ఇంజనీర్ డీవీఎస్ఎన్ రాజు, డీజీఎం ఐఈడీ రవి, ప్రాజెక్టు అధికారులు లక్ష్మీపతిగౌడ్, లలిత్‌కుమార్, శ్రీహరి, డీజీఎం వర్క్‌షాప్ నర్సిరెడ్డి, ఫైనాన్స్ వెంకరమణ, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాంతో పాటు సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు, అన్ని గనుల అధికారులు పాల్గొన్నారు. -
నేడు గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎ స్ ఎన్నికలు గోదావరిఖని వేదికగా ఆదివారం జరుగనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపొం దేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల నాయకులు గనుల వద్ద ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న తమ యూనియన్ సభ్యులను కలుసుకుని తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులను గోదావరిఖనికి తరలించేందు ఆయా వర్గాల నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. 2012 జూన్ 28వ తేదీన జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆ తర్వాత వివిధ కమిటీ ల్లో నాయకుల కు పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారని ద్వితీయశ్రేణి నాయకత్వం కినుక వహించింది. దీంతో వారందరూ సింగరేణి వ్యాప్తంగా ఏకం కాగా, వారికి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నాయకత్వం వహించారు. చివరకు అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించినట్లు సమావేశాల్లో ప్రకటించి కోర్టును ఆశ్రయించ డంతో సింగరేణిలో వర్గపోరు నెలకొంది. ఈ మేరకు హైకోర్టు సూచన మేరకు ఆదివారం రీజినల్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో గోదావరిఖనిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆర్ఎల్సీ ఐదు కేంద్రాల్లో 11 డివిజన్లకు చెందిన కార్మికులు ఓటు వేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. కాగా శనివారం సాయంత్రం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బందిని ఆర్ఎల్సీ శ్రీవాస్తవ, డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఆయా సెంటర్లకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రితో తరలించారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియా ఓట్లే కీలకం... ఇదిలా ఉండగా, సింగరేణి గుర్తింపు సంఘం అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో సింగరేణిలోని 11 డివిజన్లకు చెందిన 40,752 మంది మంది ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ రామగుండం ఏరియాలోని 10,451 మంది, శ్రీరాంపూర్ ఏరియాలోని 12,358 మంది కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో పోటీ చేస్తున్న అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల ప్యానెళ్లు ఈ రెండు ఏరియాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, శ్రీరాం పూర్ డివిజన్లు గోదావరిఖనికి సమీపంలో ఉండడంతో సభ్య త్వం కలిగిన కార్మికులను ఎక్కువ మందిని తరలించే పనిలో రెండువర్గాల నాయకత్వం నిమగ్నమైంది. కాగా, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కార్పొరేట్ నుంచి కూడా ఓటు హక్కు కలిగిన కార్మికులను బస్సుల ద్వా రా గోదావరిఖనికి తరలించేందుకు నాయకు లు ఏర్పాట్లు చేశారు. అయితే యాజమాన్యం ఆదివారం ప్లేడేను వర్తింపచేయడంతో కొంత మంది కార్మికులు విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. గనులపై ముగిసిన ప్రచారం... హైకోర్టు ఆదేశాల మేరకు రీజినల్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తున్న టీబీజీకేఎస్ ఆఫీస్ బేరర్ల ఎన్నికల ప్రచారం శనివారం నాటితో ముగి సింది. ఆయాగనులు, ఓపెన్కాస్ట్లపై కెంగెర్ల, మిర్యాల వర్గాల నాయకులు విస్తృతంగా ప్రచా రం చేపట్టి తమ గుర్తులకే ఓటువేయాలని కో రారు. కాగా, తమకు టీఆర్ఎస్ నాయకత్వం మద్దతు ప్రకటించిందని కార్మికులంతా తమకే ఓటు వేసి గెలిపిస్తారని అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య ధీమా వ్యక్తం చేస్తుండగా.. రెండేళ్ల పాలనలో మల్లయ్య కార్మికులకు చేసిందేమీ లేదని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారని, అందువల్ల కార్మికుల అండ తమకే ఉంద ని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి గెలుపు ధీమాలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.