Solar eclipse
-
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణ కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సైన్స్ బోధించేది వేరు. సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం ‘కృత్రిమ రావుకేతువుల’ సాయంతో కోరుకున్నప్పుడల్లా కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో జంట ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డ్ అటానమీ3 (ప్రోబా3). ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కక్ష్యలో పరస్పరం దగ్గరగా మోహరించే ఈ శాటిలైట్లు... లేజర్లు, కాంతి సెన్సర్లతో అనుసంధానమై ఉంటాయి. రెండో ఉపగ్రహం నుంచి చూస్తే సూర్యుడు కనబడకుండా ఉండేలా మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ తరహా కృత్రిమ సూర్యగ్రహణాలు అక్కరకొస్తాయని పరిశోధకులు అంటున్నారు. విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, మన సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో ఉండే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అద్యయనాలకు ‘ప్రోబా3’ మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఉపగ్రహాలు... ఒకే ఉపగ్రహంగా! ‘ప్రోబా3’ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ‘ప్రోబా3’లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో రెండు ఉపగ్రహాలను అతి దగ్గరగా కలిపి ఉంచేలా (లాక్ చేసేందుకు) కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనప్పటికీ... 144 మీటర్ల పొడవుండే ఏకైక అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ‘ప్రోబా3’ అనేది రెండేళ్ళు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇందులో సౌరగోళం ఆకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం నిర్వహించే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. తన పక్కనే ఉండే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహానికి సూర్యబింబం తాత్కాలికంగా కనిపించకుండా ‘అకల్టర్’ ఉపగ్రహం అడ్డుపడుతుంది. అలా ‘అకల్టర్’ ఉపగ్రహం ఏర్పరచిన ఛాయలో ఉంటూ ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం సూర్యుడి కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఉభయ ఉపగ్రహాలు భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు ‘అకల్టర్’ ఉపగ్రహం తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా సదరు డిస్క్ లాంటి పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహంలోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. ‘అకల్టర్’లో లేజర్, విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్, ‘కరోనాగ్రాఫ్’లో షాడో పొజిషన్ సెన్సర్లు ఉంటాయి. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుందని ఈఎస్ఏ ‘ప్రోబా3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వెల్లడించారు. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. దురదృష్టవశాత్తూ సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున ప్రతి రెండేళ్ళకోసారి మాత్రమే సంభవిస్తాయని, వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గలీనో వివరించారు. అంత కష్టపడినా చివరికి ఫలితం వాతావరణం దయపై ఆధారపడివుంటుందని, వాతావరణం అనుకూలించకుంటే ఆ ప్రయత్నాలన్నీ వృథాయేనని చెప్పారు. అంతగా ప్రయాసపడినా ఏవో కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని గలీనో తెలిపారు. సవివర పరిశోధనలకు ఆ అతి స్వల్ప సమయం సరిపోదన్నారు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారని, అయితే అంతర కరోనాను ఆ ప్రయోగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని తెలిపారు. సూర్యుడి ఉపరితలంపై 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కాగా కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇది వైరుద్ధ్యభరిత అంశమని ‘ప్రోబా3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ అన్నారు. నిజానికి సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలని, కానీ కరోనా విషయంలో అలా జరగదని, అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర కరోనాను అధ్యయనం చేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని చెప్పారు. సూర్యుడి ఉపరితలం కంటే సూర్యుడికి బాహ్య పొర అయిన కరోనా ఎందుకు ఎక్కువ వేడిమితో ఉందో తెలుసుకునేందుకు అంతర కరోనాను తాము దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని, కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ‘ప్రోబా3’ అందిస్తుందని ఫ్రాన్సిస్కో డీగో చెప్పారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో అంతరిక్షంలోకి సూర్యుడు భారీ స్థాయిలో ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూమి ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతోపాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. ఈ అంశాలపై ‘ప్రోబా3’ అవగాహనను పెంచుతుందని, సౌర భౌతికశాస్త్రాన్ని అది పంపే ఫలితాలు సమూలంగా మార్చివేస్తాయని భావిస్తున్నారు. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహాన్ని బెల్జియం కేంద్రంగా ఉన్న లీగ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని 15 కంపెనీలు, పలు సంస్థల కన్సార్టియం ఈఎస్ఏ కోసం అభివృద్ధి చేసింది. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా3’ జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సివుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగాసి’ రాకెట్ కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ఈఎస్ఏ, ఇస్రో ఈ ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సివుంది.జమ్ముల శ్రీకాంత్ -
పగలే కమ్ముకున్న చీకట్లు
మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. Ever seen a total solar #eclipse from space? Here is our astronauts' view from the @Space_Station pic.twitter.com/2VrZ3Y1Fqz — NASA (@NASA) April 8, 2024 అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా. Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶 Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America. pic.twitter.com/YH618LeK1j — NASA (@NASA) April 8, 2024 మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్ జత చేశారు. View of the eclipse from orbit pic.twitter.com/2jQGNhPf2v — Elon Musk (@elonmusk) April 9, 2024 -
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది. అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. -
Solar Eclipse 2024: భారత్‌లో కనిపిస్తుందా? లేదా?
-
నేడే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే..
ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఇవాళ ఏర్పడనుంది. అయితే నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది. అయితే.. హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ముందు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. 54 సంవత్సరాల తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘంగా ఉండే గ్రహణం కాబోతోంది. దాదాపు ఐదుగంటల 25 నిముషాలు ఉంటుంది. గ్రహాల స్థానం మారినప్పుడు, వ్యక్తి యొక్క విధి కూడా మారుతుంది. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. వాటిలో సూర్యగ్రహణం , చంద్రగ్రహణం కూడా ముఖ్యమైనవి. 2024లో రెండు సూర్య గ్రహణాలు , రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. తొలి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడింది. ఏప్రిల్ 8న, అంటే ఇవాళ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది. 🌒🌘🌑🌔సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం మంచిది కాదని తెలిసిందే. సూర్యగ్రహణాలను వీక్షించడానికి కంచు పాత్రలలోని నీటి నుండి పనికిరాని ఎక్స్-రే ప్లేట్ల వరకు ప్రతిదీ ఉపయోగించబడింది. అయితే ఇప్పుడు గ్రహణాన్ని ప్రత్యేక సన్ గ్లాసెస్ తో చూడొచ్చని సూచిస్తుంటారు నిపుణులు. 🌒🌘🌑🌔జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు ప్రజల విధిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి, ఈ ప్రత్యేకమైన రోజున మీరు తినడానికి , తిరగడానికి కొన్ని నియమాలను ఉన్నాయి. కాబట్టి ప్రజలు గ్రహణం రోజు ఏదైనా తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి , గ్రహణ సమయంలో తినకుండా ఉండాలి. 🌒🌘🌑🌔సైన్స్ ఉన్నప్పటికీ, గ్రహణం గురించి కొన్ని జానపద కథలు ఉన్నాయి. నీరు తీసుకోకూడదని, ఆహారం తినకూడదని ఎన్నో నియమాలున్నాయి. ఈ సమయంలో లైంగిక సంపర్కం నిషేధించబడింది. అయితే, ఈ ఆలోచనలకు స్పష్టమైన కారణం లేదు ఖచ్చితంగా శాస్త్రీయ వివరణ లేదు. 🌒🌘🌑🌔ఈ పరిస్థితిలో, గర్భిణీ స్త్రీలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నమ్ముతారు. గ్రహణం ప్రారంభమైన వెంటనే గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. సూర్యగ్రహణం యొక్క దుష్ప్రభావాలు గర్భంలో ఉన్న శిశువును ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. 🌒🌘🌑🌔సూర్యగ్రహణం సమయంలో సాత్విక , తేలికపాటి ఆహారాన్ని తినాలని చెబుతారు ఆ సమయంలో చీకటిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది ఫలితంగా, పసుపు, అల్లం, తులసి మొదలైన ఆహారాలలో ఉండే మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మీరు కొబ్బరి నీరు, పండ్లను తినవచ్చు. ఏప్రిల్ 8న రాత్రి 9.12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఈ కాలంలో పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. చంద్రగ్రహణం మాదిరిగానే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా గ్రహణ సమయం , ఇతర నియమాలు వర్తించవు. కానీ, పాటించేవాళ్లను కాదనలేం కదా!. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. ►వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశికి చెందిన వ్యక్తులు లాభసడతారు. కోరుకున్న ఉద్యోగం లభించడంతోపాటు వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారస్తులకు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు మానుకోవాలి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. గ్రహణం చెడు ప్రభావాన్ని నివారించేందుకు పేదలకు దానం చేయాలి. ►మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారస్తులకు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు మానుకోవాలి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. గ్రహణం చెడు ప్రభావాన్ని నివారించేందుకు పేదలకు దానం చేయాలి. అయితే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉత్తర అమెరికాలోని విభాగాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు ఈ ఈ సూర్య గ్రహణం చూసే అవకాశం ఉంది. తగినంత కంటి రక్షణ లేకుండా సూర్యుడిని ప్రత్యక్షంగా చూడటం వలన తీవ్రమైన కంటి సమస్యలు వస్తాయన్నది తెలిసిందే. ఔ సాధారణంగా.. గ్రహణం వీక్షించేందుకు ప్రత్యేక సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్, టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా సోలార్ ఫిల్టర్లతో కూడిన కెమెరాలను ఉపయోగించడం మంచిది. అయితే కంటి భద్రతతో పాటు, సూర్య గ్రహణాల సమయంలో చర్మాన్ని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల కలిగే నష్టాలు. బహిరంగ గ్రహణ పరిశీలన కోసం సన్‌స్క్రీన్ అప్లికేషన్, టోపీలు ధరించడం , రక్షణ దుస్తులు ధరించడం మంచిది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల 12 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. ఆ మరుసటి తెల్లవారుజామున రెండు గంటల 22 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. మెక్సికో కెనడా, యూరప్, యూకే, ఐర్లాండ్ అమెరికా తదితర దేశాల్లో మాత్రమే ఈ సూర్య గ్రహణం కనిపించనుంది. వాతావరణ పరిస్థితులు అనుమతించినట్లయితే, మెక్సికోలోని మిలియన్ల మంది వ్యక్తులు, యునైటెడ్ స్టేట్స్‌లోని 15 రాష్ట్రాలు , తూర్పు కెనడాలోని కొన్ని ప్రాంతాలు భూమి , సూర్యుని మధ్య చంద్రుడు కదులుతున్నప్పుడు, సూర్యుని కాంతిని క్షణికంగా అడ్డుకోవడంతో ఒక అద్భుతమైన సంఘటనను చూసే అవకాశం ఉంటుంది. టోటాలిటీ.. నేటి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంతో.. మెక్సికో, యూఎస్, కెనడా మధ్య 185 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది. అందుకే దీనిని టోటాలిటీ అని కూడా పిలుస్తారు. యూఎస్‌లో సుమారు 18 రాష్ట్రాలు కూడా దీనిని చూడవచ్చు. మొత్తం గ్రహణ సమయంలో కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే టోటాలిటీ(పూర్తిగా చీకటి కావడం) ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA ప్రకారం.. గరిష్ట దృశ్యం మొత్తం చీకటి మార్గంలో 4 నిమిషాల 27 సెకన్ల వరకు ఉంటుందట. గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ ప్రకారం.. టోటాలిటీ పూర్తి వ్యవధి 4 నిమిషాల 27 సెకన్ల వరకు ఉంటుంది, ఇది ఇంతకు ముందు.. ఆగస్టు 21, 2017 నాటి గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ కంటే రెట్టింపు. మధ్యరేఖ (పూర్తి మార్గం) వెంట చాలా ప్రదేశాలు 3.5 మరియు 4 నిమిషాల మధ్య మొత్తం వ్యవధిని చూస్తాయి. భారత్ ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు. అయితే చూడాలనుకునేవాళ్లకు ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఉంటుంది. నాసా స్పేస్ ఏజెన్సీ యూట్యూబ్ అఫీషయిల్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10గం:30ని. ప్రారంభించి, అర్ధరాత్రి 1గం:30ని. వరకు లైవ్ ఇవ్వనుంది. నోట్: నిపుణుల అభిప్రాయాల సేకరణతో పైకథనం ఇవ్వబడింది -
అమెరికాలో సూర్య గ్రహణం సందడి
ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్‌తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌత్‌వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్లను విడుదల చేసింది. -
సోలార్ సీట్లు.. ఇలా కూడా వినియోగించుకోవచ్చా?
సోలార్ ఉత్పత్తులను తయారు చేసే అమెరికన్ కంపెనీ తాజాగా సోలార్ సీటును మార్కెట్లోకి తెచ్చింది. ఆరుబయట పచ్చిక మీద పరుచుకుని సేదదీరడానికి, ఆరుబయట విందు వినోదాలు చేసుకునేటప్పుడు కుర్చీ మీద అమర్చుకోవడానికి వీలుగా ఈ సోలార్ సీటును రూపొందించింది. చలికాలంలో ఎండ సోకుతున్నా, చలి తీవ్రత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సోలార్ సీటు మీద కూర్చుంటే, దీని వెనుకవైపు ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ సీటు బ్యాటరీకి చేరుతుంది. దీనిని ఆన్ చేసుకుంటే, ఈ సీటు క్షణాల్లోనే వెచ్చబడుతుంది. బయట ఎంత చల్లని వాతావరణం ఉన్నా, కాస్త ఎండసోకే చోటు ఈ సోలార్ సీటును అమర్చుకుని, కూర్చుంటే చాలు.. చలికాలాన్ని వెచ్చగా ఆస్వాదించవచ్చు. దీని ధర 249 డాలర్లు (రూ.20,763) మాత్రమే! -
నేడు వలయాకార సూర్య గ్రహణం
నేడు అరుదైన సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్‌లో ఇది కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్‌ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు. అలాగే.. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీన సూర్య గ్రహణం సంభవించింది. ఇవాళ సంభవించేంది రెండో గ్రహణం. మూడో గ్రహణం.. అక్టోబర్ 28-29 తేదీల మధ్య చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణమే అయినా.. భారత్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు. -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య
బ్రిటిష్ కొలంబియా: సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్ కింగ్’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్కింగ్గా కొనసాగుతోంది. అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్కింగ్’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
Solar Eclipse 2023: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు ఈ పనులు చేయొద్దు..!
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఉన్నాయి. ఈ రోజు గర్భిణీలు అసలు బయటకు రాకూడదని ప్రాచీన కాలం నుంచి విశ్వసిస్తున్నారు. గ్రహణం వల్ల కడుపులోని బిడ్డకు హానికరం అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో గర్భంతో ఉన్న మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోజు వాళ్లు ఏమేం చేయకూడదో చెప్పారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.. గ్రహణం వేళ గర్భిణీలు చేయకూడనివి.. ► సూర్యగ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు ఇంటి లోపలే ఉండాలి. ఈ సమయంలో బయటకు వెళ్తే పట్టుబోయే బిడ్డకు, తల్లికి హానికరం అని ప్రాచీన విశ్వాసం. గ్రహణం నీడ మీద పడినా కూడా తల్లీబిడ్డలకు మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ► సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అసలు చూడవద్దు. చూస్తే కళ్లతో పాడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ► గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తినొద్దు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో బాగా ఆకలివేసి తప్పనిసరిగా తినాల్సి వస్తే మాత్రం పండ్లను శుభ్రంగా నీటితో కడిగి తినాలని పెద్దలు సూచిస్తున్నారు. ► గ్రహణం సమయంలో వీరు నిద్ర కూడా పోవద్దు. ► సూదులు, కత్తెర్లు, కత్తులు వంటి వస్తువులను గ్రహణం సమయంలో అసలు ఉపయోగించవద్దు. ఇలా చేస్తే కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ► కత్తులు, పదునైన ఆయుధాలను అసలు ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేస్తే.. బిడ్డ పట్టేటపుడు అవయవాలు చీలి పోతాయి. అంటే శిశువులు పెదాలు చీలి పోయి జన్మించడం వంటివి జరగవచ్చు. ► గ్రహణం సమయంలో శారీ పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు కూడా ధరించకూడదు. ► ఈ సమయంలో గర్భిణీలు దుర్వ గడ్డి(గరికె)పై మంచం వేసుకొని కూర్చుని సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తే మంచిది. ఈ విశ్వాసాలు నిజం కాదని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. గ్రహణం అనేది సహజ చర్యకు విరుద్ధం కాబట్టి కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని, కానీ ఏమేరకు హాని కలుగజేస్తాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేవి వాస్తవం కాదంటున్నారు. కాగా.. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఏప్రిల్ 20న మొదటి, అక్టోబర్ 14న రెండో సూర్యగ్రహణం ఉంది. మే 5-6 మధ్య మొదటి చంద్ర గ్రహణం, అక్టోబర్ 28-29 మధ్య రెండో చంద్ర గ్రహణం ఉన్నాయి. అయితే మొదటి సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, సౌత్, ఈస్ట్ ఆసియా దేశాల్లో మాత్రమే కన్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో కన్పించకవోచ్చని పేర్కొన్నారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
గ్రహణ ప్రభావం.. ఆశ్చర్యం, ఆ వింతని చూసేందుకు ఎగబడ్డ జనం!
రామకుప్పం: మండలంలోని కెంచనబళ్ల పంచాయతీ, రెడ్డివానిపోడు గ్రామానికి చెందిన కర్ణ కుటుంబీకులు పూర్వీకుల కాలం నుంచి సూర్యగ్రహణం రోజు రోలుకు పూజలు చేసి రోకలిని నిలబెట్టేవారు. మంగళవారం సూర్యగ్రహణం వేళల్లో రోలుకు పూజలు చేసి అందులో నీరుపోసి రోకలిని నిలబెట్టారు. గ్రహణ ప్రభావం ఉండడం చేత రోకలి ఎటువంటి సపోర్టు (ఆధారం) లేకుండా రోలు మీద నిటారుగా నిలబడింది. గ్రహణ సమయంలో రోలు నుంచి రోకలిని వేరుచేసి తట్టలో నింపిన కుంకుమ నీళ్లలో రోకలిని నిలబెట్టగా రోకలి నిటారుగా నిలబడింది. రోకలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదే వింత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం, మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గ్రహణం ప్రభావంతో ఎటువంటి ఆధారం లేకుండా రోకళ్లు నిలబడటం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
Surya Grahan 2022: దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం(ఫోటోలు)
-
కృష్ణానది తీరాన సూర్యగ్రహణం వీక్షిస్తున్న జనం (ఫొటోలు)
-
గ్రహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
-
ముగిసిన సూర్యగ్రహణం
దేశంలోని కొన్ని చోట్ల సూర్య గ్రహణం 4.29 గంటల సమయంలో మొదలై గరిష్ఠంగా గంటా 45 నిమిషాల పాటు కనిపించింది. సాయంత్రం 6.26 గంటలకు గ్రహణం పూర్తయింది. ఢిల్లీ, జమ్ము, అమృత్సర్, వారణాసి వంటి చోట్ల సూర్య గ్రహణం ముందుగా కనిపించింది. ఆయా ప్రాంతాలను బట్టి సూర్య గ్రహణం సమాయాల్లో తేడాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 4.58 గంటల నుంచి 5.55 గంటల వరకు సూర్య గ్రహణం కనిపించింది. బిర్లా ప్లానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. గ్రహణం వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు సందర్శకులు. గ్రహణం మధ్యకాలం సాయంత్రం 5.29 గంటలుగా నిపుణులు తెలిపారు. గాగుల్స్ పెట్టుకుని మాత్రమే గ్రహణం వీక్షించాలని సూచించారు. 22 ఏళ్ల తర్వాత ఏర్పడిన అరుదైన గ్రహణం కావటంతో చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. -
సూర్యగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత
-
అరుదైన సూర్య గ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత (ఫొటోలు)
-
Solar Eclipse: 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం
సాక్షి, తిరుపతి/విజయవాడ: దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఈ రోజు ఏర్పడుతోంది. ఇది కేతు గ్రస్త సూర్య గ్రహణం కావడం విశేషం. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతు ప్రభావంతో ఏర్పడే దానిని కేతు గ్రస్తమని అంటారు. సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుంది. ఈ గ్రహణ కాలం దాదాపు గంట 15 నిముషాలు పాటు ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నారు. సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. చదవండి: AP: మహిళలకు బ్యాంకుల రెట్టింపు రుణాలు ఉదయం 11 గంటలకు విజయవాడ దుర్గగుడి పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. నేడు ప్రదోషకాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. రేపు(బుధవారం) స్నపనాభిషేకాలు, అర్చన, హారతి, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. రేపు ఉదయం నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు సాయంత్రం పంచహారతులు,పల్లకీ సేవ మాత్రమే ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆలయ తలుపులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పుణ్యా వచనం, స్వామివారికి అభిషేకం తరువాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలు, స్వామి, అమ్మవారి ఉభయ దేవాలయాల ద్వారాలను అధికారులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. యాదాద్రి ఆలయం మూసివేత యాదాద్రి భువనగిరి జిల్లా: సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8:50 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు(బుధవారం) స్వాతి నక్షత్రం సందర్బంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి కానున్నాయి -
గ్రహణాలు వీడాలి!
దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది. దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు. ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు. సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు. హైదరాబాద్ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు. ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం. ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. -
25న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు. దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు. -
గ్రహణం రోజుల్లో శ్రీవారి ఆలయం మూత
తిరుమల: ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే, నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ రెండు రోజులూ ఆలయ తలుపులు తెరిచిన తరువాత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ రెండు రోజులూ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. హోటళ్లు కూడా గ్రహణం పూర్తయ్యే వరకు మూసి ఉంచుతారు. దీనికనుగుణంగా తిరుమల యాత్రను రూపొందించుకోవాలని భక్తులను టీటీడీ కోరింది. శ్రీవారి దర్శనానికి 30 గంటలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,223 మంది శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 36,658 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించారు. దర్శనానికి 30 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలేశుని సేవలో ప్రముఖులు శ్రీవారిని మంగళవారం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలతో సత్కరించారు. -
భక్తులకు అలర్ట్.. ఈ నెల 25న దుర్గగుడి మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఈ నెల 25వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతోపాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తామని ఆలయ వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గమ్మ దర్శనం నిలిపివేయడంతోపాటు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు. చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తిరిగి 26 ఉదయం ఆరు గంటలకు దుర్గగుడి తెరుస్తామని, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మహా నివేదన సమర్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన తెల్లవారుజాముతోపాటు ఉదయం జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.