spa center
-
తిరుపతి స్పా సెంటర్లపై పోలీసుల దాడులు..
-
HYD: స్పా సెంటర్లలో రాసలీలలు.. ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మధురా నగర్ పీఎస్ పరిధిలో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుండి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు.వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ నామోదర్, నాగరాజు, సతీష్‌లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే, వీరు ముగ్గురు పీఎస్ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లంచాలతోపాటుగా అక్కడి యువతులతో వీరు రాసలీలలకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు కూడా వచ్చాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.ఈ క్రమంలో సదరు స్పా సెంటర్లోకి ముగ్గురు కానిస్టేబుల్స్, మరో హోంగార్డ్ వెళ్లిన దృశ్యాలను పోలీసులు.. సీసీ కెమెరాల్లో పరిశీలించారు. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు. అలాగే, వారితోపాటు ఉన్న హోంగార్డ్ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్‌పోర్టుకు పంపించి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. -
గుడిమాల్కాపూర్లోని అక్రమ స్పాసెంటర్లపై పోలీసుల దాడులు
-
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
-
Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: మసాజ్ కేంద్రాలు, స్పాల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్‌లపై కేసు నమోదు చేశారు. ది వెల్వెట్ స్పాపై... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ది వెల్వెట్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు. -
స్పా ముసుగులో వ్యభిచారం..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై భవానీపురం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్ట్‌చేసి, 11 మంది యువతులను హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం బైపాస్ రోడ్డు దియాస్ బార్ సమీపంలోని ఓ భవనంలో నగరానికి చెందిన సంపర శ్రీవిద్య తనిష్క బ్యూటీ వరల్డ్ అండ్ స్పా నిర్వహిస్తోంది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో స్పా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు. సంపర శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో స్పా సెంటర్లో 11 మంది యువతులు, ముగ్గురు విటులు ఉన్నారు. స్పా సెంటర్ నిర్వాహకురాలు శ్రీవిద్య, ఆమె భర్త సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపి నట్లు సీఐ సలాం తెలిపారు. 11 మంది యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం హోంకు తరలించినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం
సాక్షి,బళ్లారి: నగరంలోని ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో స్పా సెంటర్ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వస్తోంది. ఆదివారం రాత్రి నగరంలోని ఇన్ఫ్యాంట్రీ రోడ్డులో వేశ్యవాటికపై కౌల్‌బజార్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. తనిఖీలు చేసి పలువురు మహిళలను రక్షించడంతో పాటు సెంటర్‌ను నిర్వహిస్తున్న ప్రభుగౌడతో పాటు మరో ఏడుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగాల్యాండ్, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలను రక్షించి, అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే వారిని పట్టుకున్నారు. నగరంలో పలు స్పా(మసాజ్) సెంటర్ల పేరుతో లోపల అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే స్పా సెంటర్లలో అసాంఘీక కార్యకాలాపాలు జరుపుతూ నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయిలో ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లను తనిఖీ చేస్తే పైన బోర్డులు మాత్రం మసాజ్ సెంటర్లు అని చూపుతూ లోపల మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు సమాచారం. -
డాక్టరై హాస్పిటల్ పెట్టాలనుకుంది.. వ్యభిచారం కూపంలో అడ్డంగా దొరికిన శృతి
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని కార్వీ ఎదురుగా ఓ అపార్ట్మెంట్లో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్–హక్ కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శృతి, రమణ, జాహెద్ ఉల్ హక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. యువతులను రెస్క్యూహోంకు తరలించారు. 18 మంది విటులను కోర్టులో హాజరుపరిచారు. డాక్టర్ కావాలనుకుని.. దారి మళ్లిన యువతి.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి శృతి చదువుల్లో రాణించింది. డాక్టర్ కావాలనుకొని ఉక్రెయిన్‌లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో ఏడాది ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలం వచ్చేసింది. అనంతరం అమీర్‌పేట్‌లోని ఓ శిక్షణ కేంద్రంలో ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ కూడా తీసుకుంది. అదే సమయంలో బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గానూ పని చేసింది. ఆ సమయంలోనే అయిదు నక్షత్రాల హోటల్ తళుకుబెళుకులను కళ్లారా చూసింది. స్టార్ హోటల్ లైఫ్‌కు పూర్తిగా అలవాటు పడింది. డాక్టర్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా కలలు కని అవి సాకారం కాకపోవడంతో.. తేలికగా డబ్బు సంపాదించే మరో మార్గంలో వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గతేడాది పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించింది. కాగా.. కొద్ది రోజుల్లోనే పంజగుట్ట పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. స్పా సెంటర్ నిర్వహణలో మెలకువలు తెలుసుకున్న సదరు యువతి జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ అదే దారి పట్టింది. ఈసారి బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్ తెరిచింది. కొద్ది రోజుల్లోనే ఆమె మసాజ్ సెంటర్ వ్యాపారం వృద్ధి చెందింది. పోలీసులు మరోసారి స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించారు. రెండోసారి ఆమె బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడి తాజాగా సోమవారం జైలుకు వెళ్లింది. -
బంజారాహిల్స్: ఆలివర్ లేక్ స్పాలో వ్యభిచారం
హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్ నెం–9లోని ప్లాట్ నెంబర్ సి–12లో కొంత కాలంగా ఆలివర్ లేక్ స్పా పేరుతో ఓ వ్యక్తి స్పా నిర్వహిస్తున్నాడు. అయితే స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా క్రాస్ మసాజ్ చేస్తూ ఈజీమనీకి అలవాటు పడినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్ ఎస్ఐ హరీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించగా ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. వివిధ ప్రా ంతాల నుంచి యువతులను మసాజ్ థెరపిస్ట్‌ల పేరుతో రప్పిస్తూ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లుగా తేలింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మేనేజర్ సుమంత్, యజమాని సోమాకమల్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. స్పాను సీజ్ చేశారు. మసాజ్ థెరపిస్ట్‌ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న యువతులకు రూ. 21వేల చొప్పున, కస్టమర్ల నుంచి రూ. 2 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్టు
పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులతో పాటు, విటులను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–1 నవీన్‌నగర్‌లో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు పంజగుట్ట పోలీసుల సహకారంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యభిచారం కేంద్రం నిర్వాహకులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అక్షయ్ అలియాస్ వినయ్, అదే ప్రాంతానికి చెందిన సబ్ ఆర్గనైజర్ ఆర్.శృతి, అందులో ఉద్యోగం చేసే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 20 మంది యువతులను కాపాడారు. విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్ (సనత్‌నగర్): స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటకు చెందిన ఎస్.అనిల్‌కుమార్ (31) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కృష్ణారెడ్డి బిల్డింగ్స్‌లో ఓషన్ బ్యూటీ స్టూడియో నిర్వహిస్తున్నాడు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం స్టూడియోపై దాడులు నిర్వహించగా అక్కడ స్పా, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రానికి ఎటువంటి అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ లేకపోగా, కస్టమర్ల రిజిస్ట్రర్ నిర్వహించకపోవడం, సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం, అర్హులైన థెరపిస్ట్ లేకపోవడం తదితర సమస్యలను గుర్తించారు. స్టూడియోను మూసివేసి నిర్వాహకులు అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. చదవండి భార్యకు వేరొకరితో సంబంధం.. అనుమానం ఉన్మాదిని చేసింది -
బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: స్పా ముసుగులో క్రాస్‌మసాజ్ చేస్తూ వ్యభిచార గృహాలుగా మార్చిన నాలుగు స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను పునరావాసకేంద్రాలకు తరలించారు. ఈ స్పాలన్నీ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కృష్ణ టవర్‌లో కొనసాగుతున్న ఔరం సెలూన్ అండ్ స్పా, రోడ్ నెం.12లోని హదర్వా హమామ్ స్పా, కిమ్తి స్వేర్‌లోని ఎఫ్2 లగ్జరీ థాయ్ స్పా, బంజారాగార్డెన్ బిల్డింగ్‌లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలపై దాడులు చేశారు. మసాజ్ థెరపిస్ట్‌ల పేరుతో కొంత మంది యువతులను నియమించుకొని క్రాస్ మసాజ్‌కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దాడుల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్ అండ్ స్పాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్ అండ్ స్పాలో థాయ్‌లాండ్ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు తగిలించి క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. థాయ్‌లాండ్ యువతులను పునరావాస కేంద్రానికి తరలించి మేనేజర్ సమీర్‌పై కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు జంగం సుధాకర్ పరారీలో ఉన్నారు. అలాగే హదర్వ హమామ్ స్పా మేనేజర్ యామిన్ జిలానీ, యజమాని భీమ్‌సింగ్‌లను కూడా అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా కస్టమర్ ఎంట్రీ రిజిష్టర్ లేకుండా, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వీటిని కొనసాగిస్తున్నట్లుగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
విజయవాడ: స్పా పేరిట హైటెక్ వ్యభిచారం..
పటమట(విజయవాడతూర్పు): మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్ నిర్వాహకులను సోమవారం పటమట పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణమండపం సమీపంలో ఉన్న కె.సూ్టడియోలో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, దీనిపై తమకు అందిన సమాచారంతో తాము దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను, ఎనిమిది మంది యువతులను, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామని సీఐ కాశీనాథ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. -
Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఎలాన్ స్పా పేరుతో బెజవాడ అభిలాష్ అనే వ్యక్తి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. పలువురు యువతులతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మసాజ్ థెరపిస్టుల పేరుతో మణిపూర్ తదితర ప్రాంతాలనుంచి యువతులను తీసుకొచ్చి వారిని సెక్స్ వర్కర్లుగా మార్చి ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. ముషీరాబాద్‌కు చెందిన బెజవాడ అభిలాష్(33)తో పాటు స్పా మేనేజర్ లిఖినా జవోమితో పాటు అయిదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. అభిలా‹Ùతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కస్టమర్లలో ఓ వైద్యుడు, ఓ చాక్లెట్ కంపెనీ వ్యాపారి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, వాస్తు కోర్సు చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కొనసాగుతున్న స్పోరా స్పాలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు చింతల స్వామిపై కేసులు నమోదు చేశారు. -
Hyderabad: స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. కస్టమర్లు, యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: స్పాసెంటర్పై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ముగ్గురు కస్టమర్లు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం నాగోలు మమతానగర్‌కు చెందిన నాగోజు విగ్నేష్‌రాజు(32) వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఫ్యూజియన్ హునిక్స్ స్పాసెలూన్ నిర్వహిస్తున్నాడు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసి అత్తాపూర్‌కు చెందిన ఎల్లమద్ది నగేశ్(27) జగదీష్Ù(37) అశోక్(40)తో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఈ సెంటర్‌పై కేసు నమోదైందని, అయినా వారు నిబందనలు పాటించకపోవడంతో మరోసారి ఎస్వోటీ పోలీసులు దాడి చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పాసెంటర్‌ను తక్షణమే ఖాళీ చేయించాలని, లేదంటే ఆ అంతస్తును సీజ్ చేయిస్తామని భవన యజమానిని వనస్థలిపురం సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. -
బయటకు స్పా సెంటర్.. కానీ లోపల అందమైన అమ్మాయిలతో..
మాదాపూర్(హైదరాబాద్): స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని పిల్లర్ నంబర్ 1725 వద్ద విసన్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో దాడి చేశారు. చదవండి: మాదాపూర్: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ.. దీంతో నిర్వాహకులు సరూర్‌నగర్‌కి చెందిన రాసుల మంగ(36), సహా నిర్వాహకులు కూకట్‌పల్లికి చెందిన కొండురు పాక సురేష్, విక్కీ, కస్టమర్ లింగంపల్లికి చెందిన కాకి సునంద్ (22), ముంబై, వెస్ట్‌బెంగాల్‌కి చెందిన విక్టిమ్ మిన్న హర్కతున్(22)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2వేలు నగదు, బ్లాక్ కలర్‌టీవీ, ఒప్పో గోల్డ్ కలర్ సెల్‌ఫోన్, వీవో బ్లూ కలర్ మొబైల్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
Jubilee Hills: స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..
సాక్షి,జూబ్లీహిల్స్: స్పా మసాజ్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకునితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఆ స్పాపై దాడి చేసి నిర్వాహకులతో సహా 9మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కస్టమర్లను అరెస్ట్ చేశారు. చదవండి: Hyderabad: పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం -
Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం.. బెంజ్ కారులో వచ్చి..
సాక్షి, హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో హ్యాపీ థాయ్ స్పా సెంటర్‌పై బంజారాహిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది యువతులు, ఇద్దరు విటులను, ఇద్దరు మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: కోకాపేటలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్ అయితే ఈ స్పాను ఓయువతి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడిన ఒక విటుడైన గోపాల గుప్తా ఏకంగా బెంజ్ కారులో ఇక్కడికి వచ్చి పోలీసులకు చిక్కాడు. స్పాలో మరో బాగస్వామి అయిన మహేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. -
స్పాలో అక్రమాలంటూ.. ఓనర్‌ను బెదిరించి, ఆపై
బెంగళూరు: తమ చేతిలో ఉన్న పనితో సమాజానికి మంచి చేయాల్సింది పోయి వక్రమార్గం పట్టారు ప్రబుద్ధులు. నగరంలోని రామ్మూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్పా యజమానిని బెదిరించి రూ.1.60 లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో ఆర్టీ నగర కావల్ బైరసంద్ర విలేకరి సయ్యద్ ఖలీం (28), పోలీస్ హోంగార్డులు అసిఫ్ (27), డి.జే.హళ్ళి సంపంగిరాం (31), ఆనంద్‌రాజ్ (30), బెన్సన్ లింగరాజపురం వినాయక్ (28) అనే నిందితులు పోలీసులు పట్టుకున్నారు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలని విలేకరితో కలిసి హోంగార్డులు ఒక స్పాకు వెళ్లారు. మీ స్పాలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారు. ఫిబ్రవరి 26న రూ.60 వేల నగదు, రూ. లక్షను గూగుల్ పే ద్వారా తీసుకున్నారు. తరువాత స్పా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఐదుగురినీ అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. -
స్పా, మసాజ్ సెంటర్లలో అశ్లీల కార్యక్రమాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని మసాజ్ సెంటర్లు, స్పా, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని డీజీపీ శైలేంద్ర బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కెమెరాలను కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని పలు మసాజ్ సెంటర్లు, స్పాలు, బ్యూటీ క్లబ్‌లు, సెంటర్లు, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు. విల్లుపురంలోని ఓ ఆయుర్వేద చికిత్స కేంద్రంలో పోలీసులు తరచూ నిర్వహిస్తున్న సోదాలను వ్యతిరేకిస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. మసాజ్ సెంటర్లు, స్పాల ముసుగులో సాగుతున్న కార్యక్రమాలను గుర్తుచేస్తూ, పోలీసులకు సమాచారం వస్తే ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పాలు, మసాజ్ సెంటర్లు, ఆయుర్వేద చికిత్స కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే.. -
సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఇద్దరు మహిళలు, విటుడు అరెస్ట్
సాక్షి, అడ్డగుట్ట: స్పా అండ్ సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్ నిర్వాహకుల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. ఈస్ట్ మారేడుపల్లిలోని గీతా టిఫిన్స్ ఎదురుగా ఉన్న లరీసా ఎక్స్క్లూసివ్ స్పా అండ్ సెలూన్ సెంటర్ నిర్వాహకులు రంగం కిషోర్(35), అనీష్(25) సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తుకారాంగేట్ పోలీసులు సెంటర్‌పై దాడి చేశారు. సెంటర్ యజమానులు కిషోర్, అనీష్‌లతో పాటు ఇద్దరు మహిళలను, విటుడు ఆంటొనీ(46)ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు సెల్ఫోన్లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకొని మంగళవారం రంగం కిషోర్, అనీష్, ఆంటొనీలను రిమాండ్ చేశారు. మహిళలను ప్రజల్వ హోంకు తరలించినట్లు తెలిపారు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు -
అక్రమంగా స్పాల నిర్వహణ.. పోలీసుల దాడులు
బనశంకరి: అక్రమంగా నిర్వహిస్తున్న మూడు స్పా కేంద్రాలపై సీసీబీ పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి ఇద్దరిని అరెస్ట్‌చేసి ఇద్దరు విదేశీయులతో పాటు 13 మంది మహిళా సిబ్బందిని రక్షించారు. ఉత్తర భారతదేశానికి చెందిన దేవేందర్, అభిజిత్ అనే ఇద్దరు పట్టుబడ్డారు. ఉద్యోగాల ఆశచూపించి ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు, యువతులను పిలిపించుకుని వారిచే నగరంలోని స్పాల్లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేశారు. నేపాల్, టర్కీ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, నాగాలాండ్‌కు చెందిన ఇద్దరు, అసోంకు చెందిన ముగ్గురు మహిళలు, ఢిల్లీ మహిళ, పశ్చిమబెంగాల్-ముగ్గురు, స్థానికులైన ఇద్దరు మహిళలను సీసీబీ పోలీసులు కాపాడారు. మరికొందరు నిందితులపై హెచ్ఎస్ఆర్ లేఔట్, అశోక్‌నగర, మడివాళ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. -
బాడీ మసాజ్ కోసం.. అందమైన అమ్మాయిల ఫొటోలు.. ఆతర్వాత..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): బాడీ మసాజ్ కోసం ‘లొకాంటో’ స్పాసైట్‌లో సెర్చ్ చేసి యువకుడికి భారీ టోకరా వేశారు లొకాంటో ప్రతినిధులు. మసాజ్ చేసేందుకు అందమైన అమ్మాయిలను ఇంటికి పంపిస్తానంటూ మోసం చేశారు. గంటకు రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు చార్జ్ చేస్తారన్నారు. అందమైన అమ్మాయిని బట్టి రేటు ఉంటుందన్నారు. అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి ఎర వేశారు. ఇలా పలు దఫాలుగా అమాయకుడి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. అంత పంపినా మసాజ్‌కు అమ్మాయిని పంపకుండా కాలయాపన చేస్తుండటంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో... ఇన్వెస్ట్మెంట్ పేరుతో తనని మోసం చేశారంటూ నగర వాసి మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ. 2.20 లక్షలు పెట్టుబడి పెట్టింగా.. ఒక్క రూపాయి కూడా లాభం రాలేదని ఫిర్యాదు చేశాడు. క్రెడిట్ కార్డు అప్డేట్ పేరుతో... క్రెడిట్ కార్డ్ అప్డేట్ పేరుతో తనని మోసం చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీవీవీ తెలుసుకుని ఓటీపీ చెప్పడంతో అకౌంట్లో నుంచి రూ. 1.02 లక్షలు కాజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, 10 మందికి పైగా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం అయితే ఈ మసాజ్ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి స్పా సెంటర్లపై దాడులు జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు.