srikanth reddy
-
YSRCP కార్యకర్త శ్రీకాంత్ రెడ్డిపై రాళ్లు, రాడ్లతో దాడి
-
ఇంద్రుడు, చంద్రుడు అంటూ కట్టుకథలు
-
చంద్రబాబు శ్వేత పత్రాలపై శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
తిరుపతి ఎస్వీయూలో టీడీపీ నేతల వీరంగం
-
నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులు అమెరికా వెళ్లడం గొప్ప విషయం..!
-
చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్
-
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల్లో అవకతవకలను సరిదిద్ది, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ వినతిపత్రాలు సమర్పించింది. వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆ జిల్లా కలెక్టర్ గిరిషాను కలిసి ఈమేరకు వినతిపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. టీడీపీ యాప్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుతూ యాప్ జనరేట్ అయ్యే ఓటీపీని సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్లను కోరారు. టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం : గడికోట ఓట్ల పరిశీలన ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజల వ్యక్తిగత స్వేఛ్చను హరించేలా సేకరణ చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యాప్‌లో సమాచారం పొందుపరిచే మిషతో టెలిఫోన్ నంబర్ తీసుకుని ఓటీపీ కూడా అడుగుతున్నారని తెలిపారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. కలెక్టర్ దృష్టికి రాజంపేట ఉదంతం రాజంపేట నియోజకవర్గంలో ఇలా సమాచారం ఇవ్వని ఓ ఇంట్లోని వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతాన్ని కలెక్టర్ దృష్టికి శ్రీకాంత్‌రెడ్డి తీసుకువెళ్లారు. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల కింద సమాచారం అడిగారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తోందంటూ ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి కోరారు. 2019కి ముందు నుంచే బోగస్ ఓట్లు : పేర్ని నాని 2019కి ముందు నుంచే ఒకే డోర్ నెంబర్ లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని పేర్ని నాని సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అలా గే కొందరు ఏపిలో, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. మరి కొందరికి మున్సిపల్ ఏరియాలో, గ్రామంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ చిరునామాల్లో ఉంటున్న వారిని అడగ్గా వారికీ విషయం తెలియదని చెబుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు చేర్చారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి అవకతవకలు, బోగ స్ ఓట్లపై ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి ఫిర్యా దు చేశామని తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచార ణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. -
Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ
టైటిల్: ఆదికేశవ తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్, సుమన్, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి సంగీతం : జీవీ ప్రకాశ్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: 24 నవంబర్ 2023 ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే.. ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ. ఎలా ఉందంటే..? ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్‌కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్‌లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్‌గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చదవండి: సౌండ్ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదికేశవగా వస్తోన్న మెగా హీరో.. ట్రైలర్ చూశారా?
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన, కొండపొలంతో అలరించిన హీరో వైష్ణవ్ తేజ్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందించారు. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..
కామారెడ్డి: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై రాజారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన అల్లి శ్రీకాంత్‌రెడ్డి(35) కొన్నేళ్లుగా కామారెడ్డిలో కార్ డెకార్స్ నడుపుతూ హౌజింగ్ బోర్డు కాలనీలో భార్య, పిల్లలతో నివాసముంటున్నాడు. ఆయన ఇద్దరు మిత్రులతో కలిసి తన కారులో ఫరీదుపేటలో జరిగిన ఓ శుభ కార్యానికి హాజరై కామారెడ్డి వెళ్తున్నాడు. ఆరేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్య రేఖ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
Maa Awara Zindagi Movie: ‘మా ఆవారా జిందగీ’ మూవీ రివ్యూ
టైటిల్: మా ఆవారా జిందగీ నటీనటులు: బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు నిర్మాణసంస్థ: విభా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: నంద్యాల మధుసూదన్ రెడ్డి దర్శకుడు:దేపా శ్రీకాంత్ రెడ్డి సంగీతం-ప్రతీక్ నాగ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్ వి., ఉరుకుంద రెడ్డి ఎడిటర్: సాయిబాబు తలారి విడుదల తేది: జూన్ 23, 2023 ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే? భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), చెర్రీ (ఎల్బీ), జస్వంత్ (లంబు) నలుగురు కుర్రాళ్లు పనీపాట లేకుండా ఖాళీగా, అవారాగా తిరుగుతుంటారు. ఎప్పుడూ తాగడం, జల్సాలు చేయడమే వీరి పని. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. ఎస్సై రెడ్డి (షియాజీ షిండే) ప్రతీ సారి వీరికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. ఎస్సై కూతురు కిడ్నాప్‌కు గురవుతుంది. కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కిడ్నాప్‌లో ఆ నలుగురి ప్రమేయం ఉందా? చివరకు ఆ నలుగురు చేసిన పనులేంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే?.. శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్‌లు అల్లరి చిల్లరగా కనిపించే యువకుల పాత్రలో చక్కగా నటించారు. వీరు నలుగురు కలిసి చేసిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది. హీరోయిజాలు చూపిస్తూ తెగ యాక్షన్ సీక్వెన్సులు చూపించే కారెక్టర్లు కాకపోవడంతో మరింత ఈజీగా నటించేశారు. ఆ నలుగురి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక షియాజీ షిండే పాత్ర కూడా బాగానే ఉంది. అయితే ఆ పాత్రకు డబ్బింగ్ మాత్రం అంతగా సూట్ అయినట్టు కనిపించదు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి. ఎలా ఉందంటే? ఈ మధ్య కామెడీ అడల్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ తీస్తోన్న ఈ సినిమాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో అయితే ఇలాంటి సినిమాలకు కొదవే లేకుండాపోతోంది. ఓటీటీలో అడల్ట్ జానర్లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఆవారా జిందగీ అటువంటి జానర్లోకే వస్తుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం ఆ నలుగురు చుట్టూ తిరుగుతుంది. తినడం,తిరగడం, తాగడం అనే సీన్లతోనే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి కాస్త కథనం మారుతుంది. చేజింగ్ సీన్లు, అడల్ట్ సీన్లు ఎక్కువగా వస్తుంటాయి. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ సినిమా క్లైమాక్స్ మాదిరిగా కాకుండా రియాల్టీకి దగ్గరగా ఉండేలా చేశాడు. అక్కడే దర్శకుడి టేస్ట్ కనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ నాచురల్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్ సహజంగానే వచ్చినట్టుగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బూతు డైలాగ్‌లకు బీప్ సౌండ్లు పడ్డాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం నిర్వీర్యం అయిపోయింది : శ్రీకాంత్ రెడ్డి
-
ఓటీటీలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?
'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. (చదవండి: First Day First Show Trailer: ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రైలర్ చూశారా?) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మూవీలో ప్రధానంగా పవన్ కల్యాణ్ 'ఖుషీ' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపైనే కథను రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అంచనాలు పెంచినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. Relive the nostalgia of cinema and celebration 🎥 #FirstDayFirstShow will be streaming on @ahavideoIN from Sept 23rd.#FirstDayFirstShowOnAHA #FDFS @Im_Srikanth_R @SanchitaBashu24 @Wamceee @lnputtamchetty @anudeepfilm @radhanmusic @PoornodayaFilms @SrijaEnt @MitravindaFilms pic.twitter.com/dtbNM2A6FO — Srija Entertainments (@SrijaEnt) September 14, 2022 -
అలా సినిమా చాన్స్ వచ్చింది.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు. -
ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డా: అనుదీప్
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనుదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు ఉంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ ఉన్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపథ్యాన్ని తీసుకుని ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ కథని చెబుతున్నాం. ► నా జీవితానికి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.`ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే ఉండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. మహేశ్‌బాబు నటించిన 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. ► లెక్కలు వేసుకొని నేను సినిమాలు తీయను. సినిమా చేసినప్పుడు మాజా రావాలి.అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. ► ఈ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ ఉంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ ఉంటుంది. ► ‘జాతిరత్నాలు’లాగే `ఫస్ట్ డే ఫస్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ ఉంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ► ఈ చిత్రానికి మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ ఉంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు ఉంటే బాగుండని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా బాధ్యత ఉంటుంది. ► రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను. ► కామెడీ విషయంలో ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా ఉన్న కథలు కూడా రాయాలని ఉంది. ► హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు ఉంటాయి. సినిమా అంటే క్రేజీ ఉండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నారాయణ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ ఉంది. ► నాగ్ అశ్విన్ `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం. ► శివకార్తికేయన్ తో చేస్తున్న ప్రిన్స్ సినిమా పాండిచ్చేరి నేపధ్యంలో సాగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళిలో రిలీజ్ ఉంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా ఉంటుంది. ► జాతిరత్నాలు 2 తీసే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేశ్ కోసం ఓ కథను రాశా. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా. ఆయన ఒప్పుకుంటే నా తర్వాతి చిత్రం వెంకటేశ్ గారితోనే ఉంటుంది. -
కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..? హీరోయిన్ సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు. -
అజ్ఞాతంలో కరాటే కల్యాణి
-
నటి కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు..
Child Welfare Officials Raid In Actress Karate Kalyani Home: నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్‌రెడ్డి పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీడియోలు చేయి డబ్బులిస్తా అన్నాడు, చెంప పగలకొట్టాను : కరాటే కల్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరువురు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది. 'బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్‌ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్‌ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. -
కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ ఫేస్బుక్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్‌రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. -
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
సాక్షి, అమీర్‌పేట: యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్‌గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్‌రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): కడప ప్రజల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దారుణమని, ఇది ఆయన పార్టీ అజెండానా? లేక సొంత అజెండానా? అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గడికోట మీడియాతో మాట్లాడుతూ.. ఆంగ్లేయుల హయాంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉందనే విషయాన్ని ఇలాంటి కుహనా నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మానవత్వం కడప సొంతం.. ఒక మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేని సంప్రదాయం.. తమ కడుపు మాడ్చుకొని ఇతరులకు అన్నం పట్టే సహృదయం కడప ప్రజల సొంతమని గడికోట పేర్కొన్నారు. సోము వీర్రాజు పద్ధతి మార్చుకోకుంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కును సైతం కోల్పోతారని హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కడప గూండాలు, రౌడీలు, పులివెందుల పంచాయతీ అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. సీమలో ఆయా పార్టీల జెండాలు మోసే వ్యక్తులు ఇలాంటి కుహనా వ్యాఖ్యల పట్ల సిగ్గు పడాలన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారని వివరించారు. దిక్కుతోచకే బాబు విమర్శలు.. దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని తరచూ చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు ఈర‡్ష్యతోనే విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. బీజేపీ క్షమాపణ చెప్పాలి: వామపక్షాలు రాయలసీమకు విమానాశ్రయాలు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలను వామపక్ష రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీర్రాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ విమర్శించారు. విజయవాడ లబ్బీపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, విషప్రచారాల్లో నిమగ్నమై వికృత క్రీడ ఆడుతుందన్నారు. చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’ -
సీఎంను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి
తిరుపతి క్రైం: ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మానవ బాంబై చంపేస్తానని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైలం శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ ఇన్చార్జి వళిగల మోహన్ ఈస్టు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో బిజినెస్‌మ్యాన్ అనే అకౌంట్లో కన్నాబాయి యూజర్ ఐడీ ఫేక్ అకౌంట్ నుంచి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎంపీ గురుమూర్తి ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్టు వారు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.