srilatha
-
TS Elections: బరిలో ఎన్నారైలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. మామిడాల యశస్వినీరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం. ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాలకుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది. చల్లా శ్రీలత బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్‌రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్‌గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్నగర్ బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), సైదిరెడ్డి(బీఆర్ఎస్)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్(నిర్మల్) బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈయన క్లాస్మేట్. అంతేకాదు.. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్‌ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్‌ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్‌లో చేరారు) కాదని బరిలోకి దించారు. ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎన్నారైల లిస్ట్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్‌లో లాయర్‌గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్, అట్లాంటాలో లీగల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే. ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. -
'శ్రీదేవి చనిపోయినా రాని సొంత చెల్లెలు'... అసలు కారణం అదేనా!
అతిలోకసుందరి అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రంలో తన అమాయకపు మాటలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో స్టార్ హీరోలందరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. అప్పటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే శ్రీదేవికి ప్రత్యేకస్థానం ఉంటుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. సినీ కెరీర్లో తెలుగు ప్రేక్షకులు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!) అయితే తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో శ్రీదేవి జన్మించారు. రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వీరిలో శ్రీదేవి పెద్దకూతురు. అయితే ఆమె సోదరి శ్రీలత గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే శ్రీదేవిలాగా ఆమె సినిమాల్లోకి రాలేదు. అయితే ఏ సినిమా సెట్‌కు వెళ్లినా అక్కతో పాటే కనిపించేవారు. తల్లి రాజేశ్వరితో పాటు, శ్రీలత కూడా శ్రీదేవితో పాటే ఉండేవారు. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్స్‌లో శ్రీదేవితో పాటు వెళ్లేవారు. అలా 21 ఏళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచారు. అప్పట్లో వీరి కుటుంబం తమిళనాడులో శివకాశిలో ఉండేది. శ్రీదేవి కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమా సెట్స్‌లో శ్రీలత కనిపించారు. శ్రీలత కూడా శ్రీదేవి లాగే నటి కావాలనుకుంది. కానీ ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్‌గా మారింది. తల్లి మరణంతో విభేదాలు అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం వారి మధ్య దూరాన్ని పెంచింది. తల్లి మరణంతో ఇద్దరు సోదరీమణుల మధ్య విభేదాలు పెరిగాయి. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయించాలని ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేక రాజేశ్వరి 1996లో మరణించింది. దీంతో శ్రీదేవి ఆసుపత్రిపై కేసు పెట్టవలసి వచ్చింది. ఈ కేసులో చివరికీ శ్రీదేవిని గెలిచింది. తల్లి మరణంతో పరిహారంగా రూ.7.2 కోట్లు పొందింది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్ ) డబ్బుల కోసం కేసులు ఆస్పత్రి పరిహారంగా చెల్లించిన రూ.7.2 కోట్లు శ్రీదేవి తన వద్దే ఉంచుకుందని సోదరి శ్రీలత ఆరోపించింది. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శ్రీలత తన వాటా డబ్బుల కోసం శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగా లేదని.. అందుకే తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవికి బదిలీ చేసిందని ఆరోపించింది. శ్రీలత ఈ కేసులో గెలిచి తన వాటాగా రూ.2 కోట్లు దక్కించుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం అక్కా, చెల్లెల్ల బంధాన్ని చెరిపేసింది. అంతా అన్యోన్యంగా ఉండేవారు కేవలం డబ్బువల్లే శత్రువులుగా మారిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బోనీకపూర్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కాగా.. సూపర్ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి 2018లో దుబాయ్‌లో ఓ హోటల్లో మరణించారు. ఈ వివాదం వల్లే శ్రీదేవి మరణం తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థనా సమావేశంలో శ్రీలత కనిపించలేదని చెబుతున్నారు. -
ప్రేమ పెళ్లితో.. పుట్టింటి వారికి చెప్పుకోలేక.. మౌనంతో చివరికీ..
సంగారెడ్డి: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన మండల పరిధిలోని షాద్‌నగర్ (గట్పల్లి)లో గురువారం జరిగింది. ఎస్ఐ కోటేశ్వర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలుగానం శ్రీలత (21)ను ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన సిరూర్ రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులుగా శ్రీలతను పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని భర్త రవితో పాటు అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందనే కోపంతో శ్రీలత తల్లిదండ్రులు ఇంటికి దూరం పెట్టారు. వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటి వారికి చెప్పుకోలేక.. అత్తింటివారిని ఎదురించలేక ఈనెల 8న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. మృతురాలి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
‘ఇలాంటి పిల్లల’కూ హక్కులుంటాయి!
‘దివ్యాంగులు మెట్లు ఎక్కలేకపో వడానికి కారణం వాళ్లకు కళ్లో, కాళ్లో లేకపో వడం కాదు సమాజానికి సహానుభూతి లేకపో వడం’ అంటుంది తమిళ రచయిత్రి కంభంపా టి శ్రీలత.డిస్లెక్సియాతో పుట్టిన కూతురి కోసం తానే టీచర్‌గా మారింది శ్రీలత. ‘నార్మల్ వ్యక్తుల మెజారిటీ సమాజం దివ్యాంగుల పట్ల ఎటువంటి బాధ్యత వహించకపో యినా వాళ్లు తమ జీవితాలను నిశ్శబ్దంగా నిర్మించుకుంటూనే ఉంటారు’ అంటుందామె. కూతురి జీవితాన్ని, ఆమెలాంటి దివ్యాంగుల జీవితాలను ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకంగా తీసుకొచ్చిందామె. శ్రీలత తాను రాసిన ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకాన్ని ఏడు అధ్యాయాలుగా విభజించింది. ఆ ఏడింటిలో ఒకదాని పేరు ‘దృష్టి లేనిది ఎవరికి?’. ‘ఈ సమాజంలో దృష్టి లేనిది అంధులకా దివ్యాంగుల పట్ల ఎటువంటి ఆలోచనా లేని సామాన్యులకా?’ అని ప్రశ్నిస్తుంది అందులో.‘సమర్థత (ఎబిలిటీ) మీకు మాత్రమే ఉంటుందా? అందుకే దివ్యాంగులను డిజేబుల్ అంటారా? వారూ సమర్థులే. కాని వారి కదలికలకు వీలు కల్పించలేని నిర్మాణాలు, చదవడానికి వీల్లేని చదువులు, వారికి సమాన అవకాశం ఇవ్వలేని స్కూళ్లు... ఇవి వారిని సమర్థత లేనివారుగా చేస్తున్నాయి’ అంటుందామె. చెన్నైలో నివసించే శ్రీలత సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి. ఆమె రాసిన కవితా సంకలనాలు ఆదరణ పొందాయి. ‘టేబుల్ ఫర్ ఫోర్’ అనే నవల పెద్ద పురస్కారాల వరకూ వెళ్లింది. అయితే ఆ రాసిన పుస్తకాల కంటే తాజాగా వెలువరించిన ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకం విలక్షణమైనది. దానికి కారణం ఆమె కూతురు అనన్యకు 9 ఏళ్లు ఉండగా ‘ఇలాంటి అమ్మాయిని స్కూల్లో ఉంచుకోలేం’ అని ప్రిన్సిపల్ నిర్దాక్షిణ్యంగా చెప్పడమే. ఆ ‘ఇలాంటి అమ్మాయి’ (దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్)ని గుండెలకు హత్తుకుని తానే చదువు చెప్పుకుంది శ్రీలత. దానికి కారణం అనన్య డిస్లెక్సియాతో బాధ పడుతూ ఉండటమే. ఇంకా కచ్చితంగా చె΄్పాలంటే అనన్యకు ‘స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ’ (ఎస్‌ఎల్‌డి) ఉంది. ‘నా కూతురిని కూడా అందరి పిల్లలతో పా టు కూచోబెట్టి చదివించే స్కూళ్లు ఉండాలి. ఆ స్కూల్లో నా కూతురు స్థితిని స్వీకరించే పరిస్థితి ఉండాలి. నా కూతురే కాదు అలాంటి అందరు పిల్లలకు’ అంటుంది శ్రీలత. ‘న్యూరోడైవర్సిటీ’... అంటే మెదడు సంబంధమైన లోపా లతో పుట్టే పిల్లలు– ఆటిజమ్, డిస్ర్పా క్సియా, డిస్కాల్క్యులియా, డిస్గ్రాఫియా... తదితర అవస్థలతో బాధ పడుతుంటే వారి కోసం సమాజంలో ఎటువంటి ఆలోచనా ఉండదని ఈ పుస్తకంలో విపులంగా రాస్తుంది శ్రీలత. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి కంటే టీనేజ్‌కు వచ్చినప్పుడు ఎదురయ్యే మానసిక, శారీరక పరిస్థితుల గురించి చాలా అవగాహన లోపం ఉందని అంటుందామె. అందుకే తన పుస్తకంలో ‘మా షరతులతో మేము’ అనే చాప్టర్‌ను రాసింది. దివ్యాంగులు తమ పరిమితిని గుర్తించి ఆ పరిమితిని స్వీకరించి రాజీ పడక హక్కుల కోసం పో రాడాలని కోరుతుందామె. ‘దివ్యాంగుల హక్కులు మానవ హక్కులు. మీరు జాలి పడి రాల్చే సౌకర్యాలు కాదు’ అంటుంది శ్రీలత. దివ్యాంగుల విషయంలో అన్నింటి కంటే ముఖ్యమైన సమస్య ‘కేర్ గివర్స్’. అంటే ‘చూసుకునేవాళ్లు’. తల్లిదండ్రులు, భార్యాభర్తలు... వీరు దివ్యాంగులతో ఎలా మెలగాలో ఒక చాప్టర్లో రాస్తే తోబుట్టువులు, పిల్లలు ఎలా మెలగాలో ఇంకో చాప్టర్లో రాసింది. ‘పో లియోతో ఉన్న తండ్రితో నార్మల్‌గా పుట్టిన కొడుకు ఎలా మసలుకున్నాడో... తన తండ్రిని అర్థం చేసుకుని ఎలా బాసటగా నిలిచాడో ఒక కేస్‌స్టడీ ఈ పుస్తకంలో ఉంది’ అని చెబుతుంది శ్రీలత. అనేక మంది దివ్యాంగుల గెలుపు కథలను, తల్లిదండ్రుల, తోబుట్టువుల, సహాయకుల, స్పెషల్ ఎడ్యుకేటర్ల అనుభవాలను కథలుగా, ఇంటర్వ్యూలుగా, మౌఖిక కథనాలుగా ఈ పుస్తకంలో రికార్డు చేసింది శ్రీలత. దివ్యాంగుల నిజమైన అవసరాలు ఏమిటో సమాజానికి రావాల్సిన దృష్టి ఏమిటో ఈ పుస్తకం సమర్థంగా తెలియచేస్తుంది. ‘ఇలాంటి పుస్తకాలు ఎంతమంది రాస్తే అంత మంచిది’ అంటుంది శ్రీలత. అన్నింటి కంటే ముఖ్యం శ్రీలత కుమారుడు అనిరుద్ధ తన సోదరి అనన్యను చూస్తూ ‘ప్రతి స్కూల్లో పిల్లలకు దివ్యాంగుల గురించి పా ఠాలు చెప్పాలి. దివ్యాంగులతో ఎలా మెలగాలో పిల్లలకు సిలబస్‌గా ఎందుకు చెప్పరు? అప్పుడు కదా స్కూల్లో ఏ దివ్యాంగ పిల్లవాడైనా చేరితే ఇతర పిల్లలు అతనితో బాగా మెలిగేది’ అన్న మాట ఎంతో ఆలోచించదగ్గది. -
చదువుల తల్లికి కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకి చెందిన నిరుపేద విద్యార్థిని శ్రీలతకు మంత్రి కె.తారకరామారావు అండగా నిలిచారు. ఐఐటీ విద్య కు అవసరమైన డబ్బులను అందించడమేగాక, భవిష్యత్తులోనూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సంపాదించుకున్న కోయ తెగకు చెందిన కారం శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తోంది. తన నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్‌కర్నూల్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. అయితే కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. దీంతో తన ఉన్నత విద్య స్వప్నం చెదిరి పోతుందేమోనని భయపడిన శ్రీలత పరిస్థితులను మంత్రి దృష్టికి తెచ్చింది. వెంటనే కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో శ్రీలత ను అభినందిస్తూ, ఆమె విద్యాభ్యాసం పూర్త య్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం స్ఫూర్తిగా నిలుస్తుందని కేటీఆర్ ప్రశంసించారు. -
ట్యాంక్‌బండ్‌పై సండే సందడి
సాక్షి, కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం సందడి నెలకొంది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు అనుమతివ్వడంతో హుస్సేన్‌సాగర్ అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులు సైకిలింగ్ చేస్తూ మురిసిపోయారు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి కుటుంబసభ్యులతో డిప్యూటీ మేయర్ ఆటవిడుపులో డిప్యూటీ మేయర్... జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌కు కుటుంబ సమేతంగా ఇలా రావడం పిక్నిక్ వచ్చినట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ సంతోషాన్ని వ్యక్త పరిచారు. చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ ప్రభాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
జీహెచ్ఎం'షీ టీమ్'
-
మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి
సాక్షి, బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలోనే బస్తీ యాత్ర చేపట్టి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా నగరంలోని ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్లు ఉండాలన్నదే తన లక్ష్యమని, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని మెరుగు పరిచేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని తన తొలి ప్రాధాన్యత కూడా ఇదేనన్నారు. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామని, వాటిని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి రహిత జీహెచ్ఎంసీని రూపొందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. కరప్షన్ ఫ్రీ అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. అవినీతిపై ఎందాకైనా వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరి సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకు ఇవ్వడంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు గ్రేటర్ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో మహిళా మేయర్లు ఉన్నా ఒకే సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలకే ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని, ఐటీ హబ్‌గా ఉన్న నగరాన్ని హెల్త్ హబ్‌గా, పరిశుభ్రమైన నగరంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మందే మహిళలు ఉండేవారని, కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిగా వందల సంఖ్యలో మహిళలు రావడం తనకెంతో తృప్తి కలిగించిన అంశమన్నారు. ఈ ప్రభుత్వంలోనే మహిళలకు ఎన్నో అవకాశాలు దక్కాయని, ప్రతి రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు. మహిళగా గర్వపడుతున్నానన్నారు. మహిళలే ముందుండి తనను నడిపించారని ప్రతి గెలుపులోనూ బంజారాహిల్స్ డివిజన్ మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. తన వెన్నంటి నిలిచి ఉన్నతిని కోరుకున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు ప్రతిఒక్కరూ గర్విస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నగర అభివృద్ధి విషయంలో అలుపెరుగని కృషి చేస్తా. జీహెచ్ఎంసీలో లోటు బడ్జెట్ ఉందన్న విషయాన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమీక్షిస్తా. అందరితో కలిసి ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. విశ్వనగరం సాధిస్తాం. చదవండి: ‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’ ప్రమాణ స్వీకారంలో పదనిసలు నాన్న ఆశీర్వాదం.. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఉదయం టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు వచ్చారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును మేయర్‌గా సీల్డ్ కవర్లో తీసుకెళ్లారు. సమావేశానికి హాజరయ్యే ముందు గద్వాల విజయలక్ష్మి తన నివాసంలో తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు. పూజలు చేసి.. బంజారాహిల్స్: ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేముందు జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఎన్బీటీనగర్లోని శివాలయంలో, అయ్యప్ప స్వామికి, సాయిబాబాకు పూజలు నిర్వహించారు. దైవభక్తి అధికంగా ఉన్న ఆమె ప్రతిరోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ సాయిబాబా ఆలయాన్ని ఆమె సొంత నిధులతో కట్టించారు. బయోడేటా పేరు : గద్వాల విజయలక్ష్మి భర్త : బాబిరెడ్డి తల్లిదండ్రులు: కే.కేశవరావు, వసంత కుమారి పుట్టిన తేదీ: 28–01–1964 వయసు : 56 విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ, జర్నలిజం నివాసం : బంజారాహిల్స్, ఎన్బీటీ నగర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సికింద్రాబాద్: తనకు లభించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన మోతె శ్రీలతారెడ్డి గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. \ మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచి, డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడంతో ఎలా ఫీలవుతున్నారు? నన్ను డిప్యూటీ మేయర్ చేయడంతో ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న భావనను మరోమారు బలపరిచింది. తెలంగాణ ఉద్యమం తొలిరోజు నుంచి నా భర్త శోభన్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఉద్యమ పటిమకు ప్రతిఫలం అనుకుంటున్నాను. డిప్యూటీతో అసంతృప్తికి గురయ్యారా? ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక మొత్తంగా 21 సంవత్సరాలు టీఆర్ఎస్తోనే ప్రయాణించాం. మేయర్ పదవి ఆశించింది వాస్తవమే. డిప్యూటీతో అయినా గుర్తింపు లభించినందుకు సంతృప్తి లభించింది. నగర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది? మేయర్ గద్వాల విజయలక్ష్మికి నగర అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి నుంచి నగరం శరవేగంగా అభి వృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చూపిన మార్గంలో అభివృద్ధి పనులు చేపడతాం. ఈ ప్రాంతం నుంచి గెలిచిన మీరు సికింద్రాబాద్ ప్రాంతానికి ఏం చేస్తారు? దశాబ్దాలుగా సికింద్రాబాద్ ప్రాంత సమస్యలు తెలుసు. ఇక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ కావడం గర్వంగా ఉంది. వారిద్దరి సహకారంతో సికింద్రాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తాను. బయోడేటా పేరు: మోతె శ్రీలతారెడ్డి భర్త: శోభన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు. తల్లిదండ్రలు: బేతి యశోధ, రంగారెడ్డి. పుట్టిన తేదీ: 01–03–1971. వయసు: 49 సంవత్సరాలు. విద్యార్హత: బీఏ సంతానం: ఇద్దరు అమ్మాయిలు. రాజీవి, శ్రీతేజస్విని (అమెరికాలో ఉంటున్నారు). నివాసం: తార్నాక, సికింద్రాబాద్. -
కేసీఆర్ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ముందునుంచి ఊహించినట్లే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహత్మకంగా వ్యవహరించి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీ దూకుడును సునాయాసంగా ఎదుర్కొన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో అధికార టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. మేయర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేయర్ అభ్యర్ధి రాధా ధీరజ్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక ప్రక్రియను చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. నియమనిబంధనల ప్రకారం మేయర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎక్స్ అఫిషియో సభ్యులు కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు. అనంతరం పోటీలో నిలిచిన ఇద్దరు సభ్యులకు ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే (చేతులెత్తి) వారిని విజేతలు ప్రకటిస్తామన్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతు (56+32) తెలపడంతో విజయం సాధించారు. వ్యూహత్మకంగా వ్యహరించిన కేసీఆర్.. అయితే 44 మంది కార్పొరేటర్ల మద్దతుతో పాటు పదిమంది ఎక్స్అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండటం రాజకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మేయర్ పీఠం టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కెలా సీఎం కేసీఆర్, ఒవైసీ ఒప్పందం కుదుర్చుకున్నారని తొలినుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. రెండు కీలక పదవులను దక్కించుకోవడంలో వ్యూహత్మకంగా వ్యవహరించారు. దీంతో రాజధాని నగరంపై మరోసారి పట్టునిలుకున్నారు. మేయర్ ఎన్నిక: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా -
నకిలీ ఫేస్బుక్.. ప్రేమలోకి దింపి ఆరు లక్షలకు టోపీ..!
సాక్షి, హైదరాబాద్ : ఓ ప్రైవేట్ టీవీ చానల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ సృషించి ఔత్సాహిక కళాకారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా చింతపత్రిలోని వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులోని అత్తూరు గ్రామంలో ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను రోజువారీగా క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్స్‌లో సీరియల్స్ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్ డైరెక్టర్‌గా శ్రీదేవి తుమ్మల అనే పేరు వచ్చేది. సులభ పద్ధతిన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్‌లు కావాలనుకునే వారిని ఈ ఫేస్బుక్ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్ చేసేది. ఎవరైనా ఫేస్బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని కోరేది. ఈ విధంగానే 2018 సెప్టెంబర్‌లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్‌లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. మణికొండకు చెందిన క్రాంతికుమార్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి రోజువారీగా చాట్‌చేసి సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్ అయిన క్రాంతికుమార్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా మలచుకున్న నిందితురాలు శ్రీలత దఫాలవారీగా తన బ్యాంక్ ఖాతాల్లో రూ.ఆరు లక్షలు డిపాజిట్ చేయించుకుంది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయం శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితురాలు శ్రీలతను ఇన్స్పెక్టర్లు పి.లక్ష్మీకాంతరెడ్డి, విజయ్‌కుమార్, ప్రకాశ్‌ల బృందం శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. -
సీరియల్స్‌లో ఛాన్స్ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేట్ టీవీ చానల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ సృషించి అవకాశాల ఇస్తామంటూ అందినకాడికి వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులోని అత్తూరులో నివాసం ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్స్‌లో సీరియల్స్ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా శ్రీదేవి తుమ్మల అని వచ్చింది. దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్‌లు అవాలనుకునేవారితో ఈ ఫేస్బుక్ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్‌లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని విలాస జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్ చేసేది. ఎవరైనా ఫేస్బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని కోరేది. ఈ విధంగానే 2018 సెప్టెంబర్‌లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్‌లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. అలాగే మణికొండకు చెందిన క్రాంతికుమార్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి చాట్‌చేసి సన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్ అయిన క్రాంతికుమార్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న శ్రీలత పలుమార్లు తన బ్యాంక్ ఖాతాల్లో అతడితో రూ.ఆరు లక్షలు డిపాజిట్ చేయించుకుంది. అయితే ఈ విషయం ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితురాలు శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
కట్నం చంపేసింది
-
భర్త, అత్తమామల వేదింపులు..శ్రీలత ఆత్మహత్య
-
అత్తారింటి ఎదుట కోడలి శవంతో ధర్నా
రామంతాపూర్: భర్త, అత్తమామల అదనపు కట్నం వేదింపులు భరించలేక జువ్వాడి శ్రీలత (32) ముంబాయిలోని తన మేనమామ వెంగళ్రావు ఇంట్లో సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి రామంతాపూర్‌లోని అత్తాగారింటికి శ్రీలత మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చారు.విషయం తెలుసుకున్న శ్రీలత అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బంధువులు వారి ఇంటి ఎదుట శ్రీలత మృతదేహాన్ని ఉంచి ఆందోళన కు దిగారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 2011లో జువ్వాడి వంశీరావుతో శ్రీలతకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆడపిల్ల పుట్టిందని అత్తామామలు, భర్త వేధింపులు ఎక్కువవయ్యారు. ఈ క్రమంలోనే కూతురిని పెడుతున్న వేధింపులు భరించలేక శ్రీలత తల్లిదండ్రులు పీసర శ్రీనివాస్‌రావు, చంద్రకళ మనోవేదనతో మృతి చెందారని బందువులు తెలిపారు. -
ఆరోహణం ఆరో ప్రాణం
మంచు కురిసే ప్రాంతంలో.. మైనస్ డిగ్రీల చలిలో.. 5895 మీటర్ల ఎత్తులో ఉన్న ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్దదైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి త్రివర ్ణపతాకాన్ని ఎగురవేసి.. అమ్మాయిలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు వెన్నపూస శ్రీలత. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండల పరిధిలోని మారుమూల పల్లెటూరుకు చెందిన శ్రీలత.. ఆఫ్రికా ఖండం టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతారోహణ చేసి.. యువతులు ఎందులోనూ తీసిపోరని చాటి చెప్పారు. వెల్లటూరు గ్రామపరిధిలోని పాతగిరియపల్లెకు చెందిన వ్యవసాయరైతు వి.వెంకటచంద్రారెడ్డి, అయ్యవారమ్మల కుమార్తె అయిన శ్రీలతకు కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు తలసైనిక్ క్యాంపులో ట్రెక్కింగ్ చేసే సమయంలో పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. అదే సమయంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ఔత్సాహికులకు ఎంపికలు నిర్వహించారు. అయితే అందులో ఈమె ఎంపిక కాలేదు. ఆ క్రమంలో ఈ యేడాది ఫిబ్రవరిలో మౌంట్ కిలిమంజారో పర్వతారోహణ కోసం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించినప్పుడు జిల్లాస్థాయిలో సత్తాచాటి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అక్కడ చక్కటి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో శిక్షణకు అర్హురాలయ్యారు. మంచుకొండల్లో జాతీయస్థాయిలో ట్రెక్కింగ్ శిక్షణకు దేశవ్యాప్తంగా 160 మందిని ఎంపికచేయగా.. ఏపీ నుంచి 40 మంది ఈ శిక్షణకు హాజరయ్యారు. ఏప్రిల్ నెలలో 20 రోజుల పాటు జమ్మూ–కశ్మీర్లో మంచుకొండల్లో కఠోరశిక్షణ ఇచ్చారు. కిలీమంజారో పర్వతారోహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎక్కే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం కిలిమంజారో పర్వతారోహణ చేసే బృందంలో ఒకరిగా శ్రీలత ఎంపికయ్యారు. ఆ తర్వాత విజయవాడలో మళ్లీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వణికించే చలిలో సాహసోపేతమైన పర్వతారోహణలో పాల్గొనాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం అవసరం. పురుషులు సైతం కాస్త వెనుకా.. ముందు ఆలోచించే ఇటువంటి సాహసకృత్యానికి రాష్ట్రం నుంచి 40 మంది వెళ్లగా వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే అమ్మాయిలు ఉండటం విశేషం. ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక కాగా, మరో యువతి శ్రీలత. పోలీస్ ఆఫీసర్ అవడమే లక్ష్యం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి ముంబైకి, అక్కడి నుంచి విమానంలో నేరుగా టాంజానియాకు వెళ్లాం. అక్కడి నుంచి 3 గం. పాటు ప్రయాణించి కిలిమంజారో హిల్స్టేషన్కు సెప్టెంబర్ 7వ తేదీకి చేరుకున్నాం. రోజుకు 10 కి.మీ. ఎక్కాలన్న లక్ష్యంతో తొలిరోజు 12 కి.మీ. మేర ఎక్కాం. ఉదయం పూట –7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రిళ్లు –9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండేది. ఇలా రోజుకు కొన్ని కి.మీ.చొప్పున ఎక్కుతూ అత్యంత ఎల్తైన కిబో(ఉహురు) శిఖరం అంచుకు చేరుకున్నాం. మొత్తం వారం రోజుల్లో 5,895 మీటర్ల ఎత్తు (19,341 అడుగుల ఎత్తులో)న పర్వతాన్ని చేరుకున్నాం. ఆ శిఖరాగ్రంలో త్రివర్ణపతకాన్ని ఎగురవేయడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తాను. భవిష్యత్తులో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేయాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం ప్రస్తుతం ఎస్ఐ ఉద్యోగం సాధించేందుకు సన్నద్ధం అవుతున్నా. – నాగ్, కడప -
శ్రీలత రాజీనామా.. టీఆర్ఎస్లో కలకలం
సాక్షి, కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీలక నాయకురాలు, 12వ డివిజన్ కార్పొరేటర్ మొండి శ్రీలత టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా గులాబీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీలత దంపతులు.. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీరుతో విసిగిపోయి రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటాం : రాజీనామాకు దారితీసిన కారణాలను వివరిస్తూ కార్పొరేటర్ శ్రీలత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మమ్మల్ని అడుగడుగునా కించపరుస్తున్నారు. అభివృద్ధి పనులకు ఒక్కపైసా కేటాయించడంలేదు. ఇదేమని ప్రశ్నించినందుకు మా కుటుంబంపై కక్షగట్టారు. ఓ భూవివాదంలో నా భర్త(చంద్రశేఖర్)ను అన్యాయంగా ఇరికించారు. ఆయన వేధింపులు భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇప్పటికైనా గంగుల మాపై వేధింపులు ఆపకుంటే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటాం’’ అని శ్రీలత పేర్కొన్నారు. కలకలం : సరిగ్గా ఇదే తరహాలో గత ఏడాది సెప్టెంబర్‌లో మరో కార్పొరేటర్ జయశ్రీ రాజీనామా అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే. జయశ్రీ కూడా ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజా రాజీనామాతో కరీంనగర్ టీఆర్ఎస్లో కలకలం రేగింది. నాయకులంతా గంగుల వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్యే బాధితులు ఇంకొందరు కూడా రాజీనామాలు చేస్తారనే ప్రచారం సాగుతోంది. -
నరబలి కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నరబలికి ముందు రోజు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, ఆయన భార్య శ్రీలత, రాజశేఖర్ అత్త చేర్యాల నరసింహస్వామి గుడిలో నిద్ర చేసినట్లు తెలుస్తోంది. అలాగే నరబలికి సలహా ఇచ్చిన పూజారితో రాజశేఖర్ గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నరబలి సమయంలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారని...బలి ఇచ్చిన అనంతరం చిన్నారి మొండాన్నినాచారం లక్ష్మి ఇండస్ట్రీ లోపల పడేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 30 మంది విచారణ చేశారు. వారిలో ఇరవై మంది రాజశేఖర్ కుటుంబసభ్యులు కాగా, మరో పదిమంది పూజారులు ఉన్నారు. ఇక బలి ఇచ్చిన చిన్నారిని వరంగల్ జిల్లా భీమ్ దేవేరుపల్లి మండల్ హామ్లెట్ తండా నుంచి రాజశేఖర్ కొనుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజశేఖర్ నోరు విప్పితేనే... మరోవైపు నరబలి కేసులో రాజశేఖర్ నోరు విప్పితేనేగానీ మిస్టరీ వీడేలా లేదు. కేసు అతని చుట్టూనే తిరుగుతోంది. భార్య శ్రీలత ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చంద్ర గ్రహణం రోజు పసికందును బలి ఇచ్చి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అసలు విషయం చెబితే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందనే అతడు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. -
‘కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళ్తా’
- అదనపు కట్నం కోసం భర్త వేధింపులు - అత్తింటి ముందు మహిళ ధర్నా హైదరాబాద్: కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన మధు, శ్రీలత దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగరీత్యా ఉంటున్న మధు.. భార్య శ్రీలతను కట్నం కోసం వేధిస్తున్నాడు. వివాహ సమయంలో 50 తులాల బంగారంతోపాటు ఎకరం భూమి ఇచ్చినా అతని కట్న దాహం తీరలేదు. ఇంకా కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళతానని తెగేసి చెప్పాడు. ఇందుకు అతని తల్లి, తోబుట్టువులు సహకరిస్తున్నారు. దీంతో శ్రీలత శుక్రవారం కుటుంసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. -
నెలన్నర క్రితం ఒక్కటైన చోటే..
రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల దుర్మరణం నర్సు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళుతుండగా ఘటన భూత్పూర్ / వనపర్తి : నిండునూరేళ్లు కలిసి దాంపత్య జీవితం గడపాలని నెలన్నర క్రితం ఒక్కటైన ఆ జంట అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. ఉద్యో గం కోసం యత్నిస్తుండగా విధి మాత్రం వారిద్దరినీ మృత్యుఒడికి చేర్చింది.. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కాటి రవికుమార్ (25)కు తెలకపల్లి మండ లం చిన్నముద్దునూరు వాసి శ్రీలత (21) తో గత మార్చి 26న పెళ్లి జరిగింది. భర్త స్థానికంగా ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా, భార్య ప్రైవేటు హాస్పిటల్లో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లిన రవికుమార్ భార్యకు వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలని కోరాడు. దీంతో జిల్లా కేంద్రానికి శుక్రవారం ఉదయం బైక్‌పై బయలుదేరారు. అమిస్తాపూర్ శివారులోని గణపతి దేవాలయం సమీపంలోకి చేరుకోగానే గొర్రెలు, మేకల లోడ్‌తో బీదర్ నుంచి చెన్నైకి వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే ఆమెను 108 అంబులెన్సలో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ అశోక్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 45 రోజుల క్రితం ఆనందంగా ఒక్కటైన చోటే భార్యాభర్తలిద్దరూ విగత జీవులుగా ఉండటం చూసిన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. భాదిత కుటుంబాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మున్సిపల్ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు. -
నాదే పొరపాటు!
వేదిక మొన్నీమధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం కూడా మంచిది. పెళ్లి చూపులయ్యాక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామన్నారు. సంబంధం తెచ్చినాయనకు ఫోన్ చేసి అమ్మాయి వయసు కొంచెం ఎక్కువున్నట్లుంది అన్నారట. అంతే - ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. '‘ఆరోజు నీకు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అంతా నా ఖర్మ’’ అంటూ అమ్మ నన్ను తిట్టనిరోజు లేదు. మొదట్లో అమ్మ మాటల్ని లెక్కచేసేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కూడా భయం మొదలైంది. అమ్మ మాటలకు బాధేస్తోంది. అది గమనించిన అమ్మ తిట్టడం మానేసి తనలో తానే బాధపడడం మొదలెట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటంటే - నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఐదంకెల జీతం. అంతా బాగుంది. ‘‘ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాను. ఓ ఏడాది వరకూ పెళ్లి మాట ఎత్తకండి’’ అని అమ్మకూ, నాన్నకూ గట్టిగా చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. అమ్మ మాత్రం నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. నేను ససేమిరా అన్నాను. ఏడాది తర్వాత వచ్చిన సంబంధాల్లో కొన్ని నాకు నచ్చలేదు. కొన్ని నాన్నకు నచ్చలేదు. అలా చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వయసు ముప్ఫైకి దగ్గరపడుతోంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘అమ్మాయికి వయసెక్కువ’ అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ఒక సంబంధం వారికి నేను బాగా నచ్చాను. కానీ, అబ్బాయి వయసు నలభై వరకు ఉంటాయి. దాంతో, ఆ సంబంధం వదులుకున్నాం. ‘‘ఎంచక్కా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది’’ అంటూ అందరి దగ్గరా అంటోంది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా నిజమేననిపిస్తోంది. నా నిర్ణయం కారణంగా అమ్మానాన్నలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ ‘వేదిక’ ద్వారా అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట వినకపోతే చాలా నష్టపోతాం. - శ్రీలత, హైదరాబాద్ -
హృదయం: ఏ ప్రేమా ఇలా మొదలై ఉండదు!
అబ్బాయికి అమ్మాయిని చూడగానే ప్రేమ పుడుతుందంటారు. కానీ అమ్మాయికి అలా పుట్టడం అరుదు. ఒకవేళ పుట్టినా ఆమె బయటపడదు. అతని కళ్లతో ఆమె కళ్లు కలవాలంటే... అతని అడుగులతో ఆమె అడుగులు సాగాలంటే... అతని జీవితమే ఆమె జీవితం కావాలంటే... అతనిపై నమ్మకం కుదరాలి. అతనిలో ఆమెకు ఏదో ప్రత్యేకత కనిపించాలి. కేరళకు చెందిన బిజు నారాయణన్... ఒక గ్రీటింగ్ కార్డుతో శ్రీలతలో ఆ నమ్మకం కలిగించాడు. తన ప్రత్యేకత ఏంటో చూపించాడు. ఇంతకీ ఏం రాసుందా గ్రీటింగ్ కార్డులో? అన్నీ ప్రింటెడ్ అక్షరాలు, ప్రింటెడ్ మాటలే... కానీ కింద మాత్రం ‘టు మై వైఫ్... యువర్స్ బిజు’ అని ఉంది! కోచిలోని మహరాజా కళాశాలలో విద్యార్థులు బిజు, శ్రీలత. డిగ్రీకి ముందు నుంచే ఇద్దరికీ పరిచయం. బిజు గాయకుడు. అప్పటికే కాలేజీలో పాటలు పాడి ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను శ్రీలతను చూడగానే ప్రేమలో పడిపోయాడు. కొన్ని రోజుల తర్వాత, ఆమెకు గ్రీటింగ్ కార్డుఇచ్చాడు. అందులో ‘టు మై వైఫ్’ అని చూశాక, లతకు నోట మాట రాలేదు. తనలో కలిగిన సంభ్రమాశ్చర్యాల్ని బయటపెట్టలేదు. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. లోలోన మాత్రం వీడేంట్రా బాబూ... నన్నప్పుడే భార్య అంటున్నాడు అనుకుంది. ఆ ఒక్క మాటతో ఆమెకు భవిష్యత్తు చూపించాడు బిజు. తనకు తెలీకుండానే బిజు ప్రేమలో పడిపోయింది శ్రీలత. మనసులోనే అతని ప్రేమకు అంగీకారం తెలిపింది. కానీ పైకి ‘ఓకే’ చెప్పడానికి ఆమెకు ఇంకో లిట్మస్ టెస్ట్ అవసరమైంది. ఒకరోజు తన ఫ్రెండ్ ఆషాకు తన ప్లాన్ చెప్పి పంపించింది. సైన్స్ గ్రూపులో అందమైన, సింగర్ కూడా అయిన ఓ అమ్మాయి గురించి అతని దగ్గర ప్రస్తావించింది ఆషా. ‘‘ఆ అమ్మాయి నీకు మంచి మ్యాచ్ అనుకుంటా’’ అందామె. దీనికి బిజు సమాధానం... ‘‘నాకు అమ్మాయిలతో రొమాన్స్ చేసే ఉద్దేశం లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నా’’ అన్నాడు. ఈ విషయం తెలిశాక, శ్రీలత తన జీవితం బిజుతోనే అని ఫిక్సయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు బిజు. శ్రీలత సరే అంది కానీ, ‘‘మనం ఎలా బతుకుతాం. ఇల్లెలా గడుస్తుంది’’ అని అడిగింది. అప్పటికి ఇద్దరి వయసు 20 ఏళ్లు. తర్వాత శ్రీలత తిరువనంతపురంలో లా కోర్సులో చేరింది. బిజు సింగర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆమె లా పూర్తయింది. అతను ఓ మెట్టు ఎదిగాడు. కానీ ఇద్దరి మధ్యా దూరం. దగ్గరగా ఉండాలని ఇద్దరూ మహారాజా కళాశాలలోనే ఎంఏ చేరారు. ఈ కోర్సూ పూర్తయింది. మరోవైపు బిజూ సంగీత కచేరీలు చేసే స్థాయికి ఎదిగాడు. సరిగ్గా తమ తొలి పరిచయమైన పదేళ్లకు 1998లో బిజు, శ్రీలత పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పదేళ్ల తర్వాత పెళ్లిగా మారడమంటే సుదీర్ఘమైన విషయమే కదా! ఇప్పుడు బిజు, శ్రీలతలకు ఇద్దరు పిల్లలు. 13 ఏళ్ల సిద్ధార్ధ్, 8 ఏళ్ల సూర్యనారాయణ్. బిజు తరచు మ్యూజిక్ కన్సర్ట్ల కోసం బయట తిరుగుతుంటాడు. శ్రీలత పిల్లల్ని, కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటోంది. కులాలు వేరని, తాహతులు వేరని ఒకప్పుడు అభ్యంతరం చెప్పిన పెద్దలు, ఇప్పుడు వారితో కలిసిపోయారు. వారి అనుబంధాన్ని చూసి మురిసిపోతున్నారు. ‘‘బిజులా ప్రేమించే వ్యక్తి ఎవరూ ఉండరు. ఐతే అతని ప్రేమ మాటల్లో ఉండదు. చేతల్లో మాత్రమే చూపిస్తాడు. అతను తరచు వేరే ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఎప్పుడొస్తాడా అని మేమంతా ఎదురుచూస్తుంటాం. ప్రతిసారీ బోలెడన్ని బహుమతులతో ఇంటికొస్తాడు. ఐతే తనిచ్చిన తొలి బహుమతే (గ్రీటింగ్ కార్డు) చాలా ప్రత్యేకమైంది. తనపై నేనా రోజు ఏ నమ్మకమైతే పెట్టుకున్నానో... అది నిజమని నిరూపించాడు’’ అంటూ ఉద్వేగంగా చెప్తారు శ్రీలత. మరో ప్రేమ కథ 2011 మే 22. అమెరికాలోని జాప్లిన్. టోర్నెడో గురించి టీవీల్లో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అప్పుడే ఇంటికి వచ్చాడు 31 ఏళ్ల డాన్. భార్య బెథానీ అప్పటికే వణికిపోతోంది. అసలే తమ ఇంటికి బేస్మెంట్ కూడా లేదు. టోర్నెడో తాకిందంటే, ఇల్లు నామరూపాల్లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేయాలి అనుకుంటుండగానే, టోర్నెడో బీభత్సం మొదలైపోయింది. ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. ఇల్లు కూలిపోవడం మొదలైంది. డాన్ చకచకా పిల్లోస్ తీసుకున్నాడు. బెథానీని తీసుకుని బాత్రూమ్లోకి పరుగెత్తాడు. ఆమెను బాత్ టబ్‌లో పడుకోమన్నాడు. తనమీద పిల్లోస్ పెట్టాడు. మీద రక్షణగా తాను పడుకుని టబ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. టోర్నెడో శాంతించాక - ఇల్లు లేదు... డాన్ లేడు. మిగిలింది బెథానీ మాత్రమే. భార్య ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణం వదిలేశాడు డాన్. -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి !
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఆభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు లైగింకదాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక వికలాంగుడు చిన్నారిని ముద్దాడుతున్నట్లు నటించి.. తన మూడుచక్రాల బండిపై చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి ఈఘోరానికి ఒడిగట్టాడు. దారుణమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. మిట్టపల్లి శివ, శ్రీలత దంపతులకు ఇద్దరు సంతానం. శివ సెంట్రింగ్ పనికోసం చెన్నై వెళ్లగా.. ఇద్దరు కూతుర్లతో తల్లి మంచుకొండలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. వారి ఇంటికి సమీపంలోనే తోట నర్సింహరావు అనే వికలాంగుడు వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. శివ కూతుర్లను తరచూ తన మూడు చక్రాల బండిపై తిప్పుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా పెద్ద కూతురు(4)ను బండిపై ఎక్కించుకుని ఇంటికి దూరంగా చీకటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెపుతున్నారు. ఇంట్లో అడుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో తల్లి ఇంటిపక్క వాళ్లను ఆరా తీసింది. నర్సింహరావు తన బండిపై చిన్నారిని తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె వెతుక్కుంటూ వెళ్తుండగా, దూరంగా పాప ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లే సరికి మద్యం మత్తులో తన వంటిపై వస్త్రాలు లేకుండా పడిఉన్న నరిసింహరావును, పక్కనే ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నరిసింహరావును కొట్టి అక్కడే తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరం చూసిన తల్లి శ్రీలత పిట్స్ వచ్చి పడిపోవడంతో ఆమెను కూడా 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని ఎస్ఐ గణేష్ స్టేషన్‌కు తరలించారు. కామాంధుఢిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జీవచ్ఛవాలుగా..
సాక్షి, మంచిర్యాల/మందమర్రి : అది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట. ఆ గ్రామంలో మంచి వైద్యుడు ఉన్నాడు. అతడే కుందారపు శ్రీనివాస్. ఇతనికి పదకొండేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అభిరామ్, కూతురు దీక్షిత జన్మించారు. కలతలు, కలహాలు లేకుండా హాయిగా జీవిస్తున్నా రు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మందమర్రిలోని తన తోడల్లుడు హేమంత్‌కుమార్ నానమ్మ దశ దినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబం హాయిగా గడిపి గురువారం సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిలోని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. వారి ఇంట్లో ఏడు గంటల వరకు గడిపి ఇంటికి బయలు దేరారు. అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా.. అని శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత నా చేయి పట్టుకుని వదల్లేదు. వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు అని రోదించుకుంటూ చెప్పింది శ్రీలత తల్లి లక్ష్మి. ఇంతలోనే ఘోరం.. రాత్రి 7.30 గంటలకు శ్రీనివాస్, శ్రీలత, పిల్లలు కమాన్‌పూర్‌కు బయలు దేరారు. మందమర్రి దగ్గరలోని పాలవాగు కల్వర్టు వద్ద పాము అడ్డు వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు కూర్చున్న దీక్షిత డాడీ పాము అనగానే శ్రీనివాస్ బయపడి కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కింద పదునైన బండలు ఉన్నాయి. బండలపై పడటంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్రంగా దెబ్బతాకింది. పడటంతోనే శ్రీనివాస్ చనిపోయాడు. దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది.. అరిచి అరిచి రెండు గంటల తర్వాత మృతిచెందింది. అభిరామ్ పడటంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని చేయి విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు కూడా నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండటంతో ఎవరూ కనిపించ లేదు. ఎవండి.. ఎవండి.. అరేయ్ బాబు, అమ్మాయి ఎక్కడున్నారు.. అని అన్నా ఎవరి నుంచి మాటలు వినబడ లేదు. కాపాడండి.. కాపాడండి అని అరిచింది.. ఎవరు రాకపోవడంతో ఆమె కూడా అపస్మారక స్థితి లోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు కొడుకు అభిరామ్‌కు మెలుకువ వచ్చింది. మేలకువ వచ్చి.. చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటు నుంచి వస్తుందోనని బాలుడి భయం.. బాలుడు కూడా కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది.. శుక్రవారం వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. కల్వర్టు లోతుగా ఉండటం.. ముళ్లపొదలు అధికంగా ఉండటంతో వీరిని ఎవరు గమనించలేదు. ఆ రోజు కూడా గడిచింది. నిమిషాలు గంటలు.. గంటలు రోజుల్లా గడిచాయి.. ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలత మేలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్పూర్లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర ఉన్నామని చెప్పి మళ్లీ సృ్పహ కోల్పోయింది. ఉదయం నుంచి వెతుకగా.. ఇటు కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబ సభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇటు పోలీసులు, ఆటూ కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ లేపి మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పై నుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శబ్దం విని మాట్లాడాడు. ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు. అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-రామకృష్ణాపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్లు కింద శనివారం రాత్రి పది గంటలకు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.. స్పృహలోకి రాని శ్రీలత మందమర్రి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుందారపు శ్రీలత, అభిరామ్రాం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలత స్పృహలోకి సరిగా రావడం లేదని అమె బంధువులు తెలిపారు. శ్రీలత ఎడమ చేయి విరగడంతో దానికి ఆపరేషన్ నిర్వహించారు. అభిరామ్ రాంలకు కూడా శరీరం లోపలి భాగాల్లో గాయాలు కావడంతో బాలుడిని కూడా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంకా తన భర్త, కుమార్తె మృతి చెందిన విషయం ఇంకా శ్రీలతకు తెలియదని, వారు మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాత్రమే తెలుసు అని బంధువుల తెలిపారు. దీంతో వచ్చిన వారికి వారి మరణవార్త శ్రీలతకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసికంగా తీవ్రంగా గాయపడిందని, ఇంకా ప్రమాదం షాక్‌లోనే ఉందని వారు తెలిపారు. నేడు అయితే పూర్తిస్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఏక్కడ.. బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఎక్కడ ఇంకా నాన్న నిద్రపోయి లేవలేదా.. ఎందుకు ఇంత మంది ఉన్నారు. నాకు మమ్మీ, డాడీ, చెల్లిని చూపించండి అంటూ శ్రీనివాస్ కుమారుడు అభిరామ్ అనడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు బోరున విలపించారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిరామ్‌ను తన తండ్రికి దహన సంస్కారాలు చేసేందును రొంపికుంట గ్రామానికి తీసుకువచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అభిరామ్‌తో కలిసి తలకొరివిపెట్టారు. కమాన్‌పూర్‌లో అంత్యక్రియలు మంచిర్యాలలో శ్రీనివాస్, దీక్షిత మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కమాన్‌పూర్‌కు తరలించారు. ఆదివారం తండ్రీకూతురు అంత్యక్రియలు జరిగాయి. శ్రీలతకు తీవ్రగాయాలు కాగాకరీంనగర్లోని ఓ ఓ ప్రవేటు ఆస్పతిలో చికిత్స పొందుతుంది. ఆమె భర్త, కూతురు కడారి సారి చూపున నోచుకోలేదు. -
లంచావతారాలు
సాక్షి, మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖలోని పలువురు అధికారులు అవినీతిలో నిండా మునిగిపోయారు. మామూళ్ల మత్తులో జోగుతున్నారు. చివరకు లంచావతరాలకు జిల్లా ఎక్సైజ్ శాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత జిల్లాలోనే అదే శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశమైంది. కొద్దినెలల క్రితం విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) శ్రీలత ఏసీబీకి పట్టుబడగా, తాజాగా శుక్రవారం బందరు ఈఎస్ కె.ప్రదీప్‌రావు ఏసీబీకి దొరికిపోయారు. ఒకే జిల్లాలోని ఇద్దరు కీలక అధికారులు అవినీతి నిరోధక శాఖ వలలో పడటం ఎక్సైజ్ శాఖలో అవినీతి పర్వం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్లులు మాదిరిగా సాగుతోందన్న విమర్శలు మరోమారు గుప్పుమన్నాయి. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం బందరు ఈఏస్ పట్టుబడిన క్రమం ఇదీ.. రూ.5 లక్షలు వసూలు... మచిలీపట్నంలోని బార్లు, మద్యం షాపుల నుంచి గత ఐదు నెలలుగా మామూళ్లు ఇవ్వకపోడంతో వాటి నిర్వాహకులపై ఈఎస్ ప్రదీప్‌రావు తన సిబ్బందితో ఒత్తిళ్లు చేయించారు. వేధింపులు తాళలేక బందరుకు చెందిన ముగ్గురు బార్ షాపుల నిర్వాహకులు, ఒక వైన్‌షాపు యజమాని కలిసి గత ఐదు నెలలకు గాను ఒక్కొక్కరు రూ.1.25 లక్షలు చొప్పున మొత్తం రూ.5 లక్షలు లంచం ఇచ్చారు. ఆ మొత్తాన్ని విజయవాడకు చెందిన ఎక్సైజ్ ఎస్సై రామాంజనేయులు తీసుకుని గురువారం సాయంత్రం విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఏసీబీకి ఉప్పందించిన సిండికేట్లు... ఈఏఎస్ వేధింపులు పడలేక మామూళ్లు ఇచ్చిన సిండికేట్లు ఎక్సైజ్ ఎస్సై ఎక్కిన బస్సు నంబర్ సహా పూర్తి సమాచారాన్ని ఏసీబీ ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్‌కు అనుమతి తీసుకుని వల పన్నారు. విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు వద్ద రామాంజనేయులును అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన్ని ప్రశ్నించగా, ఆ మొత్తం ఈఎస్‌కు ఇచ్చేందుకు బార్లు, వైన్ షాపుల నుంచి మామూళ్లుగా తీసుకుని వెళుతున్నట్టు ఆయన ఏసీబీ అధికారుల వద్ద ధ్రువీకరించారు. దీంతో ఈఎస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. పకడ్బందీ వ్యూహం.. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు చుట్టూ పకడ్బందీగానే ఉచ్చు బిగుసుకుంది. అందుకు అనేక కారణాలు ఆయన్ను వెంటాడాయి. మచిలీపట్నంలో ఒక వర్గానికి చెందిన కొందరు సిండికేట్లను ఇబ్బందిపెట్టేందుకు ఉద్దేశపూర్వంగానే ఒక కీలకనేత ఆయన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తరచూ వారిని వేధింపులకు గురిచేయడంతో వాళ్లు అదను కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన కీలక నేతల అనుచరుల అడుగులకు మడుగులొత్తుతున్న ఈఏస్ ఇటీవల ఒక బార్‌ను సీజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రెండు నెలలపాటు బార్ సీజ్ చేయడంతో ఒక వర్గంవారు తీవ్రంగా మండిపడుతూ ఎక్సైజ్ అధికారులకు గత ఐదు నెలలుగా మామూళ్లు ఇవ్వకుండా మొండికేశారు. అయినా వేధింపులు కొనసాగుతుండటంతో డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి ఏసీబీకి ఉప్పందించారు. ఈఎస్ ఇళ్లలో సోదాలు... కృష్ణా, పశ్చిమగోదావరి ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఈఎస్ ప్రదీప్‌రావు ఇళ్లపై దాడులు జరిపారు. ఈఎస్ ప్రదీప్‌రావు స్థానికంగా ఉంటున్న మచిలీపట్నం ఆశీర్వాదపురంలోని ఇల్లు, వరంగల్‌లోని సొంత ఇంటిని ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా.. విలువైన పత్రాలు, డబ్బు, ఇతర సమాచారం కోసం ఈ సోదాలు చేసినట్టు ఏసీబీ అధికారులు ధ్రువీకరించారు. ఏలూరు నుంచి ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్.. మరికొందరు సిబ్బందితో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మచిలీపట్నంలోని ఈఎస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి ఆయన్ని విచారించారు. తగిన ఆధారాలు లభించడంతో ఇప్పటికే ఎక్సైజ్ ఎస్సై రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నామని, ఈఎస్ని కూడా అదుపులోకి తీసుకుని శనివారం అరెస్టు చేస్తామని ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. శ్రీలత నుంచి ప్రదీప్‌రావు వరకు అదే ఎస్సై... ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ ఎస్సై మద్యం షాపులు, బార్ల నుంచి మామూళ్లు వసూలు చేయడంలో దిట్ట అని చెబుతున్నారు. సుమారు నాలుగు నెలల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విజయవాడ ఈఎస్ శ్రీలతకు కూడా ఈ ఎస్సై మామూళ్లు వసూలు చేసి ఇచ్చేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 2012 డిసెంబర్ 31 రాత్రి మైలవరం మండలం కనిమెర్ల, పోరాటనగర్, రెడ్డిగూడెం మండలం నాగులూరు తండా ప్రాంతాల్లో నాటుసారా తాగి 18 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యల్లో భాగంగా విజయవాడ ఎక్సైజ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పనిచేసిన ఈఎస్ శ్రీలతను విజయవాడ బదిలీ చేశారు. ఇక్కడ రూ.65 వేలు లంచం తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో ఆమెను సస్పెండ్ చేసి మచిలీపట్నం ఈఎస్ ప్రదీప్‌రావుకు అదనపు బాధ్యతలు కేటాయించారు. అదే సమయంలో పరిచయమైన ఎస్సై రామాంజనేయులు మామూళ్ల వసూళ్లలో ఆయనకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఆ మొత్తం ఎవరికి? ఎక్సైజ్ ఈఎస్‌కు ఇచ్చేందుకు అని వసూలు చేసిన రూ.5 లక్షల మొత్తం ఎవరి కోసం, ఎక్కడికి తీసుకెళుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక కీలకనేత ఆశీస్సులతో ఇక్కడ విధుల్లోకి చేరిన ఈఎస్ పెద్ద మొత్తాన్ని ఆయనకు పంపుతున్నారా.. అనే ప్రచారం జరిగింది. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ రాజకీయ కక్షసాధింపులకు ఆయుధంగా పనిచేస్తోందన్న విమర్శలను మూటగట్టుకుంది. దీంతో తమను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న ఎక్సైజ్ సిబ్బంది ఆట కట్టించేందుకు సిండికేట్లు కూడా వెనకడుగు వేయడంలేదు. మామూళ్లను నేరుగా తీసుకుని తమ చేతికి మకిలి అంటించుకోవడం దేనికని భావించిన ఎక్సైజ్ అధికారులే వాటిని ఇతర ప్రాంతాల్లో తీసుకునే ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలోని లంచాలను విజయవాడకు తీసుకెళ్లి అక్కడ గుట్టుచప్పుడు కాకుండా అందుకునే ఏర్పాట్లలో భాగంగానే ఇలా చేశారని చెబుతున్నారు. -
ఇసుక లారీ ఢీకొనియువకుడి మృతి
జైపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని భీమారంలో ప్రభుత్వ వసతి గృహం వద్ద సోమవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీ మారం గ్రామానికి చెందిన తువ్వ మల్లేశ్(23) మృతి చెందగా మారం దేవేందర్‌కు గాయాలైనట్లు ఎసై్స శ్రీలత తెలిపారు. ఆమె కథనం ప్రకా రం.. భీమారం గ్రామానికి చెందిన మారం దేవేందర్, తువ్వ మల్లేశ్ ప నుల నిమిత్తం బైక్‌పై చెన్నూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మంచిర్యాల వైపు నుంచి వచ్చిన ఇసుక లారీ బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో దేవేందర్ స్వల్పంగా గాయపడగా మల్లేశ్ తీ వ్రంగా గాయపడ్డాడు. వీరిని మంచి ర్యాల ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌ను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గొల్లపెల్లి ఓదెలుపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నామని ఎసై్స తెలిపారు.