srirama navami
-
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. -
భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక
శ్రీరామ చంద్రమూర్తి జీవిత కథే రామాయణం. ఆ రామాయణాన్ని అనుసరిస్తే చాలు మనం ఎలా వ్యవహరించాలో అర్ధం అయిపోతుంది. ఎలా ఉండకూడదో ఎలా నడుచుకోకూడదో కూడా తెలిసిపోతుంది. మనకి కర్తవ్య బోధ చేస్తూ దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే కాంతి బాటే రామాయణం. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ రామనామమే భక్తకోటికి తారక మంత్రంగా ఉండిపోయింది. ఎన్ని యుగాలు దాటినా అదే మంత్రం లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. రామ రాజ్యం రావాలంటే రాముడు చూపిన బాటలో ధర్మాన్ని ఆచరించడమొక్కటే మార్గం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. రామరాజ్యం యావత్ ప్రపంచానికే ఆదర్శ రాజ్యం ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో ప్రజలంతా ఏ చీకూ చింతా లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారో ఏ రాజ్యంలో అయితే ప్రజలు మానసిక క్షోభలు పడకుండా మనశ్శాంతిగా ఉంటారు ఏ రాజ్యంలో అయితే ప్రజలు ఆకలి దప్పులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారో దాన్ని రామరాజ్యం అంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదే రామరాజ్యం. అందుకే రాముడి పాలనలో అందరూ పిల్లా పాపలతో హాయిగా జీవించారు. వన వాసం పూర్తి చేసుకుని తండ్రి మాటను దక్కించాడు. సత్య నిష్ఠ పాటించాడు. తిరిగి అయోధ్య చేరి రాజ్యాధికారం చేపట్టాడు. పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్న సూత్రాన్ని రాముడు పాటించాడు. తన రాజ్యంలో ఓ మామూలు మనిషి తన సతీమణి సీత గురించి చేసిన వ్యాఖ్యలకు కూడా గౌరవం ఇచ్చాడు. సీత గురించి తనకు తెలిసినా ప్రజల నుండి ఓ విమర్శ వచ్చినపుడు పాలకుడిగా తాను జవాబుదారుగా ఉండాలనుకున్నాడు రాముడు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతోన్నా.. కడలి అంతటి దుఖాన్ని దిగమింగుకుని సీతను అడవుల్లో వదిలి రావల్సిందిగా తమ్ముడు లక్ష్మణుణ్నే ఆదేశించాడు రాముడు. అందులో ఓ మంచి పాలకుడు ఎలా వ్యవహరించాలన్న నీతి ఉంది. అది పాలకులందరికీ ఆదర్శమే అంటారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని ప్రజల మాటలు పట్టించుకోకుండా ఉంటే అది ధర్మ బద్ధమైన పాలన అనిపించుకోదని రాముడు అనుకున్నాడు కాబట్టే సీతను అడవులకు పంపాడు. సీతారాముల జీవన యానమే రామాయణం. అది పరమ పవిత్రం. తర తరాలకూ ఆదర్శనీయం. అందుకే అది నిత్య పారాయణ గ్రంధం కూడా. రామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు తెలీని ఆనందం ఆవహించేస్తుంది. ఒక్క సారి చదివితే మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంటుంది. చదువుతున్న కొద్దీ కొత్తగానే ఉంటుంది. అదే సమయంలో మధురంగా అమృతంలా ఉంటుంది. అందుకే యుగాల తరబడి రామాయణం కల్పవృక్షంలా వెలుగుతూనే ఉంది. శ్రీరామ నవమి అంటే లోకానికి పండగ. జనులందరికీ పండగ. సీతారాముల కళ్యాణం అంటే అదో వేడుక. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక. -
జగ్గూభాయ్‌తో గోపీచంద్.. అదిరిన 'రామబాణం' పోస్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. గతంలో గోపీచంద్‌కి లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్‌కి ఇది మూడో చిత్రం. ఈ వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ(గురువారం)శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో గోపీచంద్‌తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. పంచెకట్టులో చేతులు పట్టుకొని నడుస్తున్న స్పెషల్ లుక్ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. -
అందుకే ఆయనను సకల గుణధాముడు అన్నారు! రాముడే దేవుడు..
రాముడే దేవుడు నరుడి అవతారం ఎత్తిన అద్భుతమే రామాయణం. దేవుడే నరుడి అవతారం ఎత్తి ఆ నరులు ఎలా మసులుకోవాలో ఏది మంచో ఏది చెడో ఏది ధర్మమో ఏది అధర్మమో తన నడవడిక ద్వారానే నేర్పిన జగద్గురువు శ్రీరామ చంద్రుడు. రాముని జీవితాన్ని చదివితే చాలు జీవితాలు ధన్యం అయిపోతాయి. ఎలా జీవించాలో అర్ధం అవుతుంది. మనుషుల్లో మనిషిగా పుట్టి మనుషులకు కర్తవ్య బోధ చేసిన ఆదర్శనీయుడు శ్రీరాముడు. అందుకే యుగాల తరబడి రాముణ్ని కొలుచుకుంటున్నాం. గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. మంచి లక్షణాలు కలగలసిన మూర్తి సృష్టిలోని అన్ని మంచి లక్షణాలు అన్ని గొప్పతనాలు ఒక మూర్తిగా మారితే ఆ దివ్యమూర్తే రాముడు అవుతాడు. అందుకే ఆయన్ను సకల గుణధాముడు అన్నారు. మానవ జీవితంలో ప్రతీ ఒక్కరూ ఎలా ఉండాలో ఎలా బతకాలో ఏ విలువలు పాటించాలో ఏయే ధర్మాలు ఆచరించాలో తాను ఆచరించి అందరికీ నేర్పించిన మహానుభావుడు దశరథ రాముడు. చెడుపై మంచి సాధించే విజయంలో అడుగడుగునా ధర్మ పథానే నడవాలని చాటి చెప్పిన దేవుడు మన రాముడు. మనుషులకు ధర్మోపదేశం ఇచ్చేందుకే ఆ నారాయణుడు మనిషి అవతారం ఎత్తి రాముడయ్యాడు. ఆయనే మనకి దేవుడయ్యాడు. హరుడే నరుడైన దివ్య ఘట్టం చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం లో అవతరించాడు రాముడు. రావణ వధ కోసం శ్రీనారాయణుడు మనిషి జన్మ ఎత్తి మనుషుల్లో మనిషిగా కలిసి మెలిసి సాగించిన ప్రస్థానమే రామాయణం. అయోధ్య మహారాజు దశరథుడి ముగ్గురు రాణులు నోము ఫలమున నలుగురికి జన్మనిచ్చారు. అందులో అగ్రజుడే శ్రీరామ చంద్రుడు. కారణ జన్ముడు. సకల గుణ ధాముడు. రాముని జన్మ వృత్తాంతం భక్తులకు ఓ పర్వమే. వేల సంవత్సరాలు దాటినా యుగాలు మారినా ముల్లోకాలకూ రాముడే ఆదర్శనీయుడు ఇప్పటికీ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. రాముడు మనిషి అవతారం ఎత్తింది మనుషులకు ఓ దారి చూపించడానికే. వారిలో వ్యక్తిత్వ వికాసం కల్పించడానికే. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తన నడవడిక ద్వారానే నేర్పించాడు రాముడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. తండ్రి దశరథుడు పిలిచి నువ్వు వనవాసానికి పోవాలంటే అలాగే తండ్రీ అని మారు మాట్లాడకుండా కట్టుబట్టలతో అడవులకు బయలు దేరాడు. సకల రాజభోగాలు, సుఖాలు , అధికారం అన్నీ వదులకుని రాజభవనాన్ని అయోధ్య నగరాన్ని వీడి అడవులకు వెళ్లిపోయాడు. తండ్రుల మాటను పిల్లలు పెడచెవిన పెట్టకూడదని దీని ద్వారా నేర్పాడు రాముడు. -
రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్లో పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. -
'హరిహర వీరమల్లు' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్న పవన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma 🏹 - Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/8jV4BvzGJm — Mega Surya Production (@MegaSuryaProd) April 10, 2022 -
ప్రభాస్ ‘నో’ చెప్పి ఉంటే ఆదిపురుష్ ఉండేది కాదు
‘‘మీ మనసు స్వచ్ఛంగా ఉంటే మీరు ప్రతి విషయాన్ని స్వచ్ఛంగా చూస్తారు. నా మనసు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు తప్పులు చేస్తామనే భయం ఉండదు. అందుకే రామాయణం లాంటి చరిత్రను భయం లేకుండా ‘ఆదిపురుష్’గా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు ఓం రౌత్. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఇతర పాత్రల్లో పేరున్న నటీనటులతో ఓం రౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘రాముడి జీవితం నాకు ఆదర్శం’’ అన్నారు ఓం రౌత్. శ్రీరామ నవమి సందర్భంగా ‘సాక్షి’తో ఓం రౌత్ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు ఈ విధంగా... ► రాముడి గురించి రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యమా? ఓం రౌత్: కచ్చితంగా సాధ్యం కాదు. జీవితంలో ఎలా నడుచుకోవాలనేది చెప్పడానికి రాముడు మంచి ఉదాహరణ. ఆయన్ను ‘మర్యాద పురుషోత్తమ్’ అంటారు. మంచి లక్షణాలున్న రఘురాముడి గురించి చెప్పడానికి ఒక్క సినిమా సరిపోదు. అందుకే రాముడి జీవితంలోని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ‘ఆదిపురుష్’ చేశాను. ► మీరు ‘ఆదిపురుష్’ తీయడానికి 30 ఏళ్ల క్రితం రామానంద్ తీసిన ‘రామాయణ్’ సీరియల్ ఆదర్శం అనుకోవచ్చా? రాముడిని అర్థం చేసుకునే ప్రాసెస్ నా చిన్నప్పుడే మొదలైంది. నా గ్రాండ్ పేరెంట్స్ ద్వారా రామాయణం విన్నాను. అలాగే రామానంద్ సాగర్ ‘రామాయణ్’ కొన్ని విశేషాలు తెలియజేసింది. రాముడి గురించి మాట్లాడిన ప్రతిసారీ నాకు కొత్త విషయం తెలుస్తుంది. రామాయణం ఆధారంగా జపనీస్ డైరెక్టర్ యుగో సాకో తీసిన జపనీస్ సినిమా చూశాక నాకూ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. అది యానిమేషన్ మూవీ. 2000లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ సినిమా చూశాను. రాముడి గురించి విదేశీయులు అంత ఆకట్టుకునేలా తీస్తే భారతీయులమైన మనం ఎందుకు తీయకూడదనిపించింది. కరోనా లాక్డౌన్లో ‘ఆదిపురుష్’ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ► 40ఏళ్ల వయసులో... అది కూడా దర్శకుడిగా తక్కువ సినిమాల అనుభవం ఉన్న మీకు రామాయణం లాంటి పెద్ద సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదేమో? నా చిన్నప్పుడే రఘురాముడికి ఇన్స్పైర్ అయ్యాను. రాముడి జీవన విధానాన్ని ప్రపంచం మొత్తం ఆచరిస్తే బాగుంటుందనే ఆలోచన నా చిన్నప్పుడే నాకు కలిగింది. రాముడి క్వాలిటీస్ నన్ను అంతగా ఆకట్టుకున్నాయి. చిన్నప్పటినుంచీ రాముడంటే ఆరాధనాభావం ఉంది. అయినప్పటికీ రాముడి సినిమా అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ పాత్ర మీద పెంచుకున్న మమకారం ‘ఆదిపురుష్’ తీసేలా చేసింది. నేటి తరానికి రాముడి గురించి తెలియాలి. ► ‘యంగ్ రెబల్ స్టార్’ ఇమేజ్ ఉన్న ప్రభాస్‌ని సాత్వికంగా కనిపించే రాముడి పాత్రకు తీసుకోవాలని ఎందుకనిపించింది? తీక్షణంగా ఉండే ప్రభాస్ కళ్లు, తన ఫిజిక్ రాముడి పాత్రకు సూటబుల్. మన కళ్లు మన హృదయానికి ప్రతిబింబాలు అంటారు. మనసులో ఉన్న భావాలను కళ్లు పలికిస్తాయి. అలా ప్రభాస్ తన కళ్లల్లో కరుణ రసాన్ని చూపించగలుగుతారని పూర్తిగా నమ్మి, తనే ఈ పాత్ర చేయాలనుకున్నాను. అలాగే రాముడిలో ఉండే లక్షణాల్లో ‘పరాక్రమ వీర’ ఒకటి. రెబల్ ఇమేజ్‌తో ప్రభాస్ ఆ వీరత్వాన్ని చూపించగలరని నమ్మాను. ఈ క్యారెక్టర్ గురించి చెప్పి, ‘వి’ షేప్ బాడీ బాగుంటుందన్నాను. ఫిజిక్‌ని అలానే మలచుకున్నారు. అలాగే హిందీ భాష మీద కూడా ప్రభాస్ పట్టు సాధించారు. ► ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే.. ఈ సబ్జెక్ట్ గురించి ప్రభాస్‌కి చెప్పడానికి వెళ్లే ముందు కాదనరనే నమ్మకంతో వెళ్లాను. సినిమా గురించి చెప్పగానే ‘ఓకే.. చేస్తాను’ అన్నారు. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకోకపోయి ఉంటే ‘ఆదిపురుష్’ ఉండేది కాదు... తీసేవాడిని కాదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి నన్ను ఆ ‘ఆల్మైటీ’ (దేవుడు)యే ఎన్నుకున్నాడని నా నమ్మకం. నన్నే కాదు.. నటీనటులు, టెక్నికల్ టీమ్ అందర్నీ ఆ దేవుడే ఎంపిక చేసి, ఈ ప్రాజెక్ట్ చేయించాడని నమ్ముతున్నాను. ► మూడు సీన్లు విని, ప్రభాస్ ఈ సినిమా చేస్తానని అన్నారట.. అవును.. నిజమే. ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ప్రభాస్‌తో నాకంతగా పరిచయం లేదు. కథ చెప్పడానికి ఫోన్ చేశాను. మూడు సీన్లు విని, ప్రభాస్ ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి కథ చెప్పాను. ► ‘ఆదిపురుష్’ని దేవుడే తీయించాడని చెప్పారు. మీకు భక్తి ఎక్కువ అని తెలుస్తోంది.. మీరు సెంటిమెంట్స్‌ని నమ్మితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే ‘ఫైర్ యాక్సిడెంట్’ జరిగినందుకు అప్సెట్ అయ్యారా? భయపడ్డారా? ఏమాత్రం భయపడలేదు.. అప్సెట్ అవ్వలేదు. నిజానికి పెద్ద ఘటనే జరిగింది. నా టీమ్ చేసిన హార్డ్‌వర్క్ (సెట్ వర్క్) వృథా అయిందని బాధపడ్డాను. అయితే ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. చాలా త్వరగానే సెట్ పూర్తి చేసి, షూటింగ్ పూర్తి చేసేలా చేశాడు. జీవితంలో కష్టాలు వస్తాయి... పోతాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే... సెట్ మాత్రమే పాడయింది తప్ప, మా టీమ్‌లో ఉన్న ఎవరికీ ఏమీ కాలేదు. అందుకే దేవుడు మా పక్షాన ఉన్నాడని అంటున్నాను. ► ప్రభాస్ మంచి భోజనప్రియుడు.. తన టీమ్‌కి విందులు ఇవ్వడం ఆయన అలవాటు.. మరి మీ టీమ్‌కి? ప్రభాస్‌తో వర్క్ చేయడం నాకో మంచి అనుభూతి. ఇంటి ఫుడ్ తెప్పించి, అందరికీ ఇచ్చేవారు. షూటింగ్ సమయంలో టేస్టీ ఫుడ్స్ చాలానే లాగించాం (నవ్వుతూ). ఇంకో విషయం ఏంటంటే.. షాట్ గ్యాప్‌లో కూడా ఫుడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. రేపు ఏం తిందాం అని కూడా ముందు రోజు చర్చించుకునేవాళ్లం. ► ఫైనల్లీ.. మీ జీవితంపై రాముడి ప్రభావం? అది చెప్పడానికి మాటలు చాలవు. మనందరం ఉదయం నిద్ర లేచేటప్పుడు ‘మంచి జరగాలి’ అనుకుంటాం. ఆ మంచి ఎక్కడ్నుంచి వస్తుంది? మన నమ్మకంలోంచి పుట్టుకొస్తుంది. ఆ నమ్మకం ఎక్కడ నుంచి వస్తుంది? మనం నమ్మిన రఘురాముడి నుంచి వస్తుంది. రాముడి నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ‘ఆదిపురుష్’తో ప్రేక్షకులను వేల ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నా అన్నారు.. మీరు చేసిన రీసెర్చ్ గురించి? నిజానికి రామాయణం గురించి ప్రపంచం చాలానే రాసింది. మన కళ్ల ముందు బోలెడంత మెటీరియల్ ఉంది. ఎక్కువ టైమ్ కేటాయించి, అవి స్టడీ చేస్తే చాలు. నేను ఎక్కువ టైమ్ కేటాయించి, అన్నీ స్టడీ చేశాను. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ బుక్స్ చదివాను. అప్పటి కట్టడాలు ఎలా ఉండేవి? డిజైన్లు ఎలా ఉండేవి? అనే విషయాల మీద అవగాహన పెంచుకున్నాను. వేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్ టెక్నాలజీతో చూపిస్తున్నాను. నేను నమ్మిన కథను నిజాయితీగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాను. ఒక బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్ ఓ సాధనంలా ఉపయోగపడతాయి తప్ప కేవలం వాటితోనే సినిమాని నడిపించాలనుకోకూడదని నా అభిప్రాయం. అందుకే కథ బాగా రాసుకుని, దాన్ని స్క్రీన్‌కి ట్రాన్స్‌ఫార్మ్ చేశాను. ఆ కథ ఎలివేట్ కావడా నికి వీఎఫ్ఎక్స్ వాడాను. -
రాముడు నడయాడిన పవిత్ర భూమి..కోరిన కోర్కెలు తీర్చే కోదండ రామాలయం
-
ఘనంగా శ్రీ రామాయణ జయమంత్రం కార్యక్రమం
శ్రీరామనవమి సందర్బంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీరామాయణ జయ మంత్రం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో 22 దేశాలనుంచి అనేక మంది హాజరయ్యారు. సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్, మలేషియా తెలుగు సంఘం మలేషియా, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో జయ మంత్రదీక్ష కార్యక్రమం జరిగింది. ఇండోనేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులయిన రామాయణ హరినాథ రెడ్డి ఈ జయమంత్ర దీక్షను వీక్షకులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో ఉపాసించిన జయ మంత్రం అత్యంత శక్తివంతమైనదన్నారు. వ్యక్తులు తాము అనుకున్న పనులు నెరవేరాలంటే ఈ దీక్షను 48 రోజులపాటు పాటించాలన్నారు. జయ మంత్ర ఉపాసన మనిషికి ధైర్యాన్నిస్తుందన్నారు. ఈ మంత్రం అజాత శత్రువులను చేస్తుందన్నారు. ఆశావాద దృక్పథాన్ని పెంచుతుందని, ఆయుష్షును వృద్ధి చేస్తుందన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి మూలం రామాయణమన్నారు. ప్రతి ఒక్కరు జయ మంత్ర దీక్ష తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపడానికి ముందుకొచ్చిన హరినాథ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులయిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ.. జయ మంత్రం మన అందరినీ విజయ బాటలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 1,000 మందికి పైగా సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిపైన్స్, న్యూజిలాండ్ మొదలగు దేశాల వారు జూమ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారని తెలియజేశారు. మలేషియా తెలుగు సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ.. హనుమంతుడు ఆచరించిన జయమంత్రాన్ని ప్రజలకు తెలియజేసి, రామాయణ హరినాథరెడ్డి సమాజానికి మహోపకారం చేశారన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. శ్రీరామనవమి రోజు రెండు మహాకార్యాలను నిర్వహించుకున్నామన్నారు. మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని అంజనాద్రి పర్వతంపై హనుమంతుడు జన్మించారనే విషయాన్ని నిరూపించడం. రెండవది ఈ జయమంత్ర దీక్షను తీసుకోవటమన్నారు. అనంతరం రామాయణంలోని సందేహాలను డా. సునీత, ఉషారాణి, డా. అరుణ కుమారి తదితరులు అడుగగా హరినాథ్‌రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గసభ్యులకు, మలేషియా తెలుగు సంఘం వారికి, టీటీడీ, శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల వారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం జగన్
అమరావతి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీతారాముల, దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిలషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
నవమికి రాముడు?
‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్ , రావణుడి ప్రాతలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా వచ్చే నెల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రదర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఏప్రిల్ రెండోవారం వరకు జరగుతుందని సమాచారం. -
ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు
ఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే అని గుర్తుంచుకోవాలి. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. అలాగే, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి మీ లావాదేవీలనుముందే ప్లాన్ చేసుకోవడం అవసరం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్! -
సీతారాముల విగ్రహాలకు అభిషేకం
-
రాములోరి పెళ్లిపై కరోనా ప్రభావం
-
ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!
పుణే/న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రామమందిర నిర్మాణాన్ని కచ్చితంగా ఏ రోజున ప్రారంభిస్తామనేది త్వరలో జరగనున్న ట్రస్ట్ తొలి భేటీలో నిర్ణయిస్తామని దేవగిరి తెలిపారు. రెండేళ్లలో మందిరాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలి విరాళం రూపాయి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ట్రస్ట్‌కు అందజేసింది. కేంద్రం తరఫున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము బుధవారం ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మసీదుకు ఇచ్చిన స్థలం చాలా దూరంగా ఉంది మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలం అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో రోడ్డు కూడా సరిగాలేని ఓ గ్రామంలో ఉందని ‘అయోధ్య’ వివాదంలోని ముస్లిం పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేటాయించిన ప్రదేశంచాలా దూరంలో ఉంది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద స్థలం ఉన్న 67 ఎకరాల్లోనే మందిరం, మసీదు ఉండాలని 1994లో ఇస్మాయిల్ ఫరుఖి కేసులో సుప్రీం తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
సాక్షి, భద్రాచలం : భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానానికి మంత్రి చేరుకొని వాటిని సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి కిటకిటలాడింది. మిథిల కల్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా.. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి వారు సిద్ధమయ్యారు. నేడు(ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, పెళ్లి సామగ్రితో ఆలయానికి చేరుకున్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాదికోసారి శ్రీరామనవమి నా డు భద్రాద్రిలో అంగరంగ వైభంవగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం కోసం అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. దేశ నలుమూలల నుం చి తరలివచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం మహాపట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, శనివారం రాత్రి రామాలయంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమా లను తిలకించిన భక్తు లు పరవశించిపోయా రు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే.. భద్రాద్రి మిథిలా స్డేయంలో ఆదివారం ఉదయం 10.30 గంట ల నుంచి 12.30 గంట ల వరకు జరిగే రామ య్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించి తరించేందుకు ఇప్పటికే భక్తులు భారీగా చేరుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్... ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాల య పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌక ర్యం కల్పించారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. రామాలయం, మాఢవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలు గొందుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మిథి లా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ తంతు నిర్వహిస్తారు. రామతీర్థంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సీతారాములకు ఆలయ అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్‌రూరల్ : జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్రలో చోటు చేసుకున్న అల్లర్లపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మంగళవారం ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ.. భక్తులు, పోలీసులపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, వొడిసెల శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని దానాల్లో.. అన్నదానం మిన్న
భద్రాచలంటౌన్: అన్ని దానాల్లో.. అన్నదానం గొప్పదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, మజ్జిగ, మంచినీరు, పులిహోర, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌సెంటర్ నందు సెంట్రింగ్ అండ్రాడ్ బెండింగ్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌కో సిమెంట్ ఆధ్వర్యంలో స్థానిక మాధవి ఎంటర్‌ప్రైజస్‌ద్వారా భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైవీ రామారావు, వెంకటరెడ్డి, గడ్డం స్వామి, ఎంబీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల లీటర్ల పానకం, వడపప్పు, 2క్టింటాళ్ల పులిహోర పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, కోవూరు సంతోష్‌కుమార్, తిరుమలరావు, కృష్ణమోహన్, మూర్తి, పీ గౌతమ్, మహిళా అధ్యక్షురాలు సాగరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, బద్ది శ్రీనివాసరావు, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. ఇండియన్‌రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల మంచినీటి ప్యాకెట్లను 5వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మారుతి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, జీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో.. భద్రాచలం విచ్చేసిన భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో బుడగం శ్రీనివాసరావు, కుంచాల రాజారాం, సాగర్, శ్రీను, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మథ«ర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. స్థానిక బస్టాండులో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపకుడు కొప్పుట మురళీ, జీ నాగరాజు, అజిత్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామ నవమి ప్రసాదం... స్వీకరిద్దాం రారండి!
శ్రీరామ నవమి నాడు పానకం ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం. కేవలం ఒక ప్రసాదంగా మాత్రమే కాదు... అందులోనూ ఎన్నో పోషకాలూ, ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. బెల్లం ♦ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. జీర్ణ వ్యవస్థ మీద, పేగుల మీద భారాన్ని తొలగిస్తుంది ♦ బెల్లం శ్వాసకోశ వ్యవస్థనూ, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది ♦ బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఈ పీచుపదార్థాలే బెల్లాన్ని మంచి క్లెన్సర్‌గా పనిచేసేలా చేస్తాయని ప్రతీతి. క్లెన్సర్‌గా ఇది కాలేయాన్ని సైతం శుభ్రపరుస్తుంది ♦ బెల్లంలో ఖనిజాలు, లవణాలు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ♦ బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల అవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్‌ను హరిస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ♦ కీళ్ల నొప్పులు ఉన్నవారి బాధలకు బెల్లం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మిరియాల్లో... ♦ మిరియాలలోని పైపరిన్ అనే పోషకం మెదడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు మతిమరుపు, అలై్జమర్స్ లాంటి అనేక సమస్యలు నివారితమౌతాయి ♦ మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు సమర్థంగా అరికట్టి ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి, మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి ∙జలుబు, దగ్గులకు తొలి చిట్కా మిరియాలే ∙ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం. యాలకులు... శ్రీరామ నవమి వేసవిలో వచ్చే పండుగ. ఈకాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని గుణాన్ని నివారించడానికి తోడ్పడేవి యాలకులు. శ్రీరామ నవమి పానకానికి మంచి రుచి, సువాసనను ఇస్తాయవి. వాటితోనూ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సుగంధద్రవ్యం వల్ల కలిగే ప్రయోజనాలలో కొన్ని... ♦ ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లతోపాటు గుండెజబ్బులనూ నివారిస్తాయి ♦ దేహంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉన్నా యాలకులు నివారిస్తాయి ♦ యాలకుల్లో మూడ్‌ను బాగుండేలా చేసే లక్షణంతో పాటు డిప్రెషన్‌ను దూరం చేసే గుణం ఉంది ♦ నోటి పరిశుభ్రతనూ, ఆరోగ్యాన్ని (ఓరల్ హైజీన్)ను కాపాడతాయి. ఇక నవమి ప్రసాదంలోని వడపప్పులో... పెసర్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలివి... ♦ పెసర్లలో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ♦ ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి ♦ పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి ♦ పెసర్లలో ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి అవి తోడ్పడతాయి. కొబ్బరిలో... వడపప్పులో చిన్నచిన్న కొబ్బరి ముక్కలు, కొబ్బరి కోరు వేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ♦ కొబ్బరిలో 61 శాతం డయటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి అది ఒంట్లోకి విడుదల అయ్యే చక్కెరను చాలా నెమ్మదిగా అయ్యేలా చూస్తుంది ♦ కొబ్బరిలోని సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు వయసును తగ్గిస్తాయి. కొబ్బరి తినేవారు దీర్ఘకాలం యౌవనంతో ఉంటారు ♦ కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు... ఆహారంలో కొబ్బరిని ఎక్కువగా వాడేవారికి గొంతు ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన రావు కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కొబ్బరి తిన్నప్పుడు ఆ కొవ్వుల కారణంగా ఆకలి అంతగా అనిపించదు. అందుకే కొబ్బరి తినేవారిలో ఆకలి కాస్త తగ్గడం వల్ల తినే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన బరువు తగ్గే సాధనంగా కొబ్బరిని ఎంచుకొని, దాని వాడకం పెంచుకోవడం మంచిదనేది ఒబేసిటీని తగ్గించే నిపుణులు చెబుతున్న మాట. మన సంప్రదాయంలో స్వాభావికంగానే ఆరోగ్యాన్ని కాపాడే మంచి లక్షణాలు ఉన్నాయి. శ్రీరామనవమి నాటి వడపప్పులో, పానకంలో కూడా. అందుకే నవమి నాటి ప్రసాదాలను స్వీకరిస్తే... దైవకృపకు కృప... ఆరోగ్యానికి ఆరోగ్యం. -
సోమవారం ప్రజాసంకల్పయాత్రకు విరామం
సాక్షి, గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం 120వ రోజు పాదయాత్ర ముప్పళ్లలో ముగిసింది. నేటి ఉదయం నరసారావుపేట నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఆపై బరంపేట, బీసీ కాలనీ, ఇనప్పాలెం మీదుగా పాదయాత్ర ములకలూరు చేరుకుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంచించారు. ములకలూరు, గొల్లపాడుల మీదుగా కొనసాగిన పాదయాత్రను వైఎస్ జగన్ ముప్పళ్లలో ముగించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ నేడు 12.5 కి.మీ నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఓవరాల్‌గా వైఎస్ జగన్ 1598.5 కి.మీ నడిచి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారు. -
పానకం, వడపప్పే ఎందుకు?
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది, దేహకాంతినిస్తుంది. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుందని పండితుల మాట. వడపప్పు తయారీ కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరరగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. పానకం తయారీ కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరాయల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ∙ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ గ్లాసులోకి తీసుకుని తాగాలి. -
వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భద్రాద్రిలోను, ఏపీలో ఒంటిమిట్టతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. -
26నే శ్రీరామ నవమి
నెల్లిమర్ల రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల 25నా లేక 26న జరపుకోవాలా? అనే విషయంపై సందిగ్ధం వీడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు రోజుల్లో ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు రామతీర్థం దేవస్థానం అర్చకుల నుంచి వివరణ సేకరించారు. అర్చకులు పంచాంగాలను చూసి ఈ నెల 25న నవమి ఉన్నప్పటికీ అష్టమి కలిసి రావడంతో కల్యాణం జరిపించేందుకు శుభం కాదని స్థానాచార్యులు నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు సాయిరామాచార్యులు తదితరులు దేవాదాయశాఖకు వివరణ ఇచ్చారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ రోజున శ్రీరాముని కల్యాణం నిర్వహించకూడదని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 26వ తేదీ ఉదయం 5.30కు నవమి పోయి దశమి వస్తుందని సూర్యోదయం తరువాత స్వామివారి వేడుకను జరుపుకోవచ్చునని అర్చకులు చెబుతున్నారు. ఆ సూచనల మేరకు దేవాదాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, 26నే రామతీర్థంలో కల్యాణాన్ని జరుపుతున్నట్లు తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 26నే సెలవు దినంగా ప్రకటిస్తూ శుక్రవారం అధికారిక జీఓను జారీ చేసింది. అష్టమితో కూడిననవమి చేయరాదు ఆదివారం నవమితో పాటు అష్టమి కూడా కలిసి వచ్చింది. ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి కల్యాణాన్ని ఆ రోజు నిర్వహించడం మంచింది కాదు. 26వ తేదీ ఉదయం 5.30 గంటలకే నవమి పోయి దశమి వస్తుంది. సూర్యోదయమైన తరువాత దశమి నాడు కల్యాణ వేడుకను నిర్వహించవచ్చు. ఇదే విషయాన్ని దేవదాయశాఖకు తెలియజేశాం. ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 25నుంచి 26వ తేదీకు మార్చింది.– సాయిరామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, రామతీర్థం -
అంతా రామమయం
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలా కల్యాణోత్సవాలు శ్రీరామ నవమి మహోత్సవం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. జిల్లాలోని పెదపూడి మండలం జి.మామిడాడలోని కోదండరామ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. అన్నవరంలోని రత్నగిరిపై, కె.గంగవరం మండలంలోని సత్యవాడలో జరిగిన కల్యాణోత్సవం కనువిందు చేసింది. ఏజెన్సీ ప్రాంతమైన వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలో శ్రీరామ నామస్మరణ మారుమోగిపోయింది. రాజమహేంద్రవరం, కాకినాడలతోపాటు అన్ని ప్రాంతాల్లోని రామాలయాలే కాకుండా వీధుల్లో కూడా స్వచ్ఛందంగా చలువ పందిళ్లు వేసుకొని అర్థరాత్రి వరకూ భజనలు, భక్తి గీతాలతో భక్తులను అలరింపజేశారు. గొల్లల మామిడాడలో.. జి.మామిడాడ(పెదపూడి) : వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. బాజాభజంత్రీలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల శ్రీరామనామస్మరణతో కోదండరాముని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై సీతారాముల వారి కల్యాణం కనుల పండువగా సాగింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లలమావిుడాడలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముని కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటకూర్మరంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 11.10 గంటలకు స్వామి వారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ సీహెచ్ అరుణకుమార్, శ్రీదేవి దంపతులు, సీతారాములకు పట్టువస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. అలాగే ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి, తోటత్రిమూర్తులు సూర్యకుమారి, పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ద్వారంపూడి వెంకటరెట్టి మంచిముత్యాలు తలంబ్రాలు స్వామి వారికి సమర్పించారు. 11.40 గంటలకు ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి శ్రీదేవి మహాలక్ష్మి ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకిలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తాడి శ్రీ వ్యవహరించారు. 12 గంటలకు ప్రారంభం.. మ««ధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ సంకల్పం ప్రారంభమైంది. మ్యధ్యాహ్నం 1.26 గంటలకు రక్షాబంధ¯ŒS చేశారు. 1.26 గంటలకు మంచి ముత్యాల దండ చూపించారు. మంత్రస్నానం చేయించారు. కన్యాదానం చేశారు. 2.05 గంటలకు జీలకర్ర బెల్లం కల్యాణమూర్తుల శిరస్సుపై ఉంచారు. 2.20 గంటలకు మాంగల్య సూత్రధారణ రాముల వారితో చేయించారు. 2.30 గంటలకు తలంబ్రాలు తంతు పూర్తి చేశారు. రామయ్య తండ్రి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట తంతు యథావిధిగా జరిగింది. కల్యాణం తలంబ్రాలు వేసుకున్నవారికి కొద్ది కాలంలోనే కల్యాణం జరుగుతుందని, ముందురోజు ఆలయానికి చేరి నిద్రించేవారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కల్యాణానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తలంబ్రాలు, బియ్యం పంపిణీ చేశారు. ఆలయ ఆర్గనైజర్ నల్లమిల్లి అచ్చుతానందరెడ్డి, పలువురు ఏర్పాట్లు పర్యవేక్షించి సేవలందించారు. జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం ర్యాలి(ఆత్రేయపురం) : ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణాన్ని బుధవారం రాత్రి 8.45గంటలకు వేదమంత్రోచ్ఛారణ నడుమ కడు రమణీయంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన శ్రీనివాసులు వెంకటచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, ఆలయ అర్చకులు కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. జగన్మోహిని, కేశవస్వామికి వేదపండితులు వాడపల్లి రంగాచార్యులు, పెద్దింటి శ్రీనివాసాచార్యులు, వాడపల్లి భాస్కరాచార్యులు , వేదపండిట్ టీవీ ఫణికుమార్, పురాణ పండిట్ హరిరామనా«థ్లు వివాహ క్రతువు నిర్వహణకు సహకరించారు. తొలుత స్వామి వార్ల ఉత్సవ విగ్రహలను గర్భగుడి నుంచి కల్యాణ మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. ముందుగా పండితులు విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, నిత్యహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు పట్టు వస్త్రాలు , మంగళసూత్రాలను సమర్పించారు. ఉదయం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూల మాలలతో అలంకరించి గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ కరుటూరి నరసింహరావు, జగన్మోహినీ కేశవస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. శ్రీరామగిరిలో.. శ్రీరామగిరి(వీఆర్‌పురం) : మరో భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీరామగిరి సుందర సీతారామచంద్ర స్వామివారి కల్యాణం రామనామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. పుణ్యగోదావరి, పవిత్ర శబరి నదుల సంగమ ప్రాంతానికి చేరువగా మాతంగ మహారుషి నిర్మించిన ఆలయంలో సుందర సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తజనుల నడుమ సాగింది. భక్తులు తనివితీరా కల్యాణాన్ని వీక్షించారు. సుందర సీతారామచంద్రులకు చేతులు జోడించి జేజేలు పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు వివాహ వేడుకలో భాగంగా కొండవీుద ఆలయంలో తెల్లవారుజామున ఒంటి గంటకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కల్యాణ ఘట్టాలను క్రమ పద్ధతిలో చేపట్టారు. పుణ్య నదీతీర్థాన్ని స్వామివారికి సమర్పించిన అనంతరం అర్చకులు కల్యాణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీతారాములను ఆలయంలో వధూవరులుగా చేశారు. అలాగే గర్భగుడిలోని మూలవిరాటులకు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి దేవరాజ వాహనంపై కొండ దిగువన ఉన్న కల్యాణ మండపానికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చి, వేదికపై అధిష్టింపజేశారు. అక్కడ ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శోడషోపచార పూజలను వేదపండితులు నిర్వహించారు. పూర్ణాహుతుని తదుపరి శాంతి కల్యాణాన్ని చేపట్టారు. సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కల్యాణోత్సం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాజేశ్వరి.. స్వామివారి కల్యాణానికి రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చింతూరు ఐటీడీఏ పీఓ చినబాబులు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు మరికొందరు భక్తులు స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎటపాక సీఐ ఆర్.రవికుమార్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS కమిటీ సభ్యురాలు కొమరం ఫణీశ్వరమ్మ, ఎంపీపీ కారం శిరమయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యాల కుసుమాంబ, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్, వీఆర్‌పురం ఎస్సై ఎ¯ŒS.రామకృష్ణ , కూనవరం ఎస్సై అజయ్‌బాబు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS ఆచంట శ్రీనివాస్, ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు.