Star Campaigners
-
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అవుట్
ముంబై: హారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను లోక్‌సభ ఎన్నికలకు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి బీజేపీ తొలగించింది. తమ పార్టీకి చెందిన నేతలు మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని, ఇతర పార్టీ నేతలు అవకాశం లేదంటూ మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాసిన లేఖ కారణంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. శివసేన, మహారాష్ట్ర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇతర పార్టీల నేతలు ఉన్నారు. శివసేన లిస్ట్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండగా.. రాష్ట్ర బీజేపీ జాబితాలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఉన్నారు. అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాశారు. అదే పార్టీకి చెందిన వాళ్లే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని చెబుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950ని ఉదహరించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ సవరించిన జాబితాను బీజేపీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించింది. చదవండి: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు! -
పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్‌లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్‌ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్‌కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
స్టార్ క్యాంపెయినర్లకు సీఎం జగన్ పిలుపు
సాక్షి, తాడేపల్లి: మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 -
స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు? వాళ్ల ఖర్చెవరు భరిస్తారు?
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉండడంతో ఎన్నికల ఫీవర్ ముదిరిపోతోంది. ఎవరికివారు పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు సాధారణ అభ్యర్థుల జాబితాను మాత్రమే కాకుండా.. స్టార్ క్యాంపెయినర్ల పేర్లను విడుదల చేయడం ప్రారంభించాయి. ఇంతకీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకు? వారికయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు? 'స్టార్ క్యాంపెయినర్' ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి లేదా ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీ ఎంపిక చేసే వ్యక్తి. స్టార్ క్యాంపెయినర్‌కు ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం సినీ నటులు మాత్రమే క్యాంపెయినర్లుగా పనిచేయాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ప్రచారకర్తలుగా ఉంటారు. స్టార్ క్యాంపెయినర్లను వారి పాపులారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబితాను భారత ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యంత్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై. అధికార బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్స్ అంటే సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రసిద్ధి. ఖర్చు ఎవరు భరిస్తారు? గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ గరిష్టంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నామినేట్ చేయవచ్చు. కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీ గరిష్టంగా 20 మంది స్టార్ క్యాంపెయినర్లను మాత్రమే నామినేట్ చేయగలదు. ప్రచారకర్తలు పార్టీ గురించి మాట్లాడుతూ.. పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులన్నింటినీ రాజకీయ పార్టీలు భరిస్తాయి. ప్రధానమంత్రి లేదా మాజీ ప్రధాని స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నప్పుడు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో సహా భద్రతకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ప్రధాని వెంట మరో స్టార్ క్యాంపెయినర్ ఉంటే, భద్రతా ఏర్పాట్లలో అభ్యర్థి 50 శాతం ఖర్చు పెట్టాలి. -
యూపీపై గురి.. ఏకంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. ఇక్కడ ఎన్నికల కోసం ఏకంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ కేంద్ర, రాష్ట్ర నాయకులు, మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు పార్టీ కోసం ర్యాలీలు, బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జాబితాలో ఉన్నది వీళ్లే.. ఉత్తరప్రదేశ్‌కు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఎమ్మెల్యే ఆరాధన మిశ్రా, రాష్ట్ర మాజీ స్పీకర్ సల్మాన్ ఖుర్షీద్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రసంగించనున్నారు. వీరితోపాటు రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ, రాజీవ్ శుక్లా, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, దీపేంద్ర సింగ్ హుడా, రంజిత్ రంజన్, ప్రదీప్ జైన్ ఆదిత్య, నిర్మల్ ఖత్రీ, రాజ్ బబ్బర్, బ్రిజ్‌లాల్ ఖబ్రీ, అజయ్ కుమార్ లల్లు, పీఎల్ పునియా, ఇమ్రాన్ మసూద్, మీమ్ అఫ్జూద్ నదీమ్ జావేద్, సుప్రియా సింగ్, ధీరజ్ గుర్జార్, ప్రదీప్ నర్వాల్, తౌకీర్ ఆలం, రాజేష్ తివారీ, సత్యన్నారాయణ పటేల్, నీలాన్షు చతుర్వేది, అల్కా లాంబా ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు!
న్యూడిల్లీ: త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్‌లో చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటకకే పరిమితమై ప్రజలకు చేరువవుతున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లలో పేర్కొన్న వారంతా మే 10 జరగబోయే ఎన్నికల కోసం కాషాయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. చదవండి: త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం -
బీజేపీలోకి కిచ్చా సుదీప్, దర్శన్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ గ్లామర్‌ను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పలువురు తారలు రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుంటున్నా కూడా. తాజాగా కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్న సమయంలో కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హోటల్లో వీళ్లు బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే వీళ్లు పార్టీ కండువాలు కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్లిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేస్తారని సమాచారం. ‘కిచ్చా’ సుదీప్ నాయక(ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సుదీప్‌ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గతంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాడు కూడా. 2020లో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం దర్శన్ ప్రచారం నిర్వహించారు. ఆపై అంబరీష్ మరణం తర్వాత.. జరిగిన మాండ్యా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర సుమలత అంబరీష్‌కు మద్దతు ప్రకటించాడు దర్శన్. తాజాగా.. సుమలత బీజేపీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతుండగా.. అది ఫేక్ అని బీజేపీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరుగుతుండగా.. 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
శ్రీలంక తరహాలో రాష్ట్రంలో కుటుంబ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: శ్రీలంక తరహాలోనే తెలంగాణలోనూ ఒకే కుటుంబం దోపిడీ సాగుతోందని భువనగిరి ఎంపీ, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సంపద నలుగురు జేబుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులైన తర్వాత సోమవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను స్వీకరిస్తాన ని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కొత్తగా తిట్టాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, భూముల దోపిడీ పెరిగిపోయిందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కుం టుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వేలసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సర్కారు బడులు మూసేస్తున్నారు. వైద్యం పడకేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా కేసీఆర్ ఫాంహౌస్‌కు మాత్రం నీళ్లు తీసుకెళ్లారు’అని విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీలో చేసిన దీక్ష ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం లో కాంగ్రెస్‌పార్టీ బలపడుతున్న నేపథ్యంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కేసీఆర్, మోదీలు కలసి ఆడుతున్న రాజకీయక్రీడ అని అన్నారు. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ‘స్టార్’.. ఇది దేనికి సంకేతం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యానికి చేసింది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరివరకు బరిలో ఉన్న ఆయనకు ఉన్నట్టుండి ప్రత్యేక పదవి కట్టబెట్టడం, అది కూడా ఎన్నికల సమయంలో ఇచ్చే ఈ పదవిని ఇప్పుడు ఇవ్వడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. నిజానికి వెంకటరెడ్డికి ఏఐసీసీలో ఏదైనా పదవి ఇస్తారని, లేదా ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా పంపుతారని ఇప్పటివరకు భావించారు. కానీ రాష్ట్రంలోనే కీలకమైన బాధ్యత అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డికి ఈ పదవి ఇవ్వడం వెనుక అధిష్టానానికి ప్రత్యేకమైన ఆలోచన ఉందని, రాష్ట్రంలో పార్టీ ఏకపక్షంగా ముందుకెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపట్ల వ్యతిరేకంగా ఉన్న ఆయనను ఈ పదవి ఇచ్చి బుజ్జగించారని, తద్వారా పార్టీలో సమస్యలు లేకుండా సర్దుబాటు చేశారనే వాదనా వినిపిస్తోంది. సమన్వయం కోసమేనా? ఇటీవల రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగేంతవరకు రాష్ట్ర పార్టీ రెండు వర్గాలుగా పనిచేసింది. ఓ వర్గం పూర్తిస్థాయిలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని బలపర్చగా.. మరోవర్గం అంటీముట్టనట్టుగా, ఒకదశలో వ్యతిరేకంగా వ్యవహరించింది. ఈ వర్గంలోని కొందరు నేతలు అప్పుడప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అసమ్మతి వ్యక్తపర్చేందుకు విధేయుల పేరిట సమావేశాలు నిర్వహించడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 40 మంది ముఖ్య కాంగ్రెస్ నాయకులను పిలిపించి మాట్లాడడం ద్వారా రాహుల్‌గాంధీ సమస్యను కొంతవరకు సర్దుబాటు చేయగలిగారు. ఈ పరిణామాలతో కొందరు పార్టీ సీనియర్లతో సమన్వయం చేసుకోవడం రేవంత్‌కు కష్టమనే భావనకు అధిష్టానం వచ్చిందని.. వారిని సమన్వయం చేసే బాధ్యత కోమటిరెడ్డికి అప్పగిస్తూ, స్టార్ క్యాంపెయినర్ హోదా కల్పించిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇక పార్టీ కార్యక్రమాల నిర్వహణలో రేవంత్‌తోపాటు మరో కీలక నేతకూ భాగం కల్పించాలన్న ఉద్దేశంతోనే కోమటిరెడ్డిని ముందుకు తెచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. తద్వారా పార్టీలో రెండో అధికార కేంద్రం ఉందనే భావన కలుగుతుందని, ఇది అసమ్మతిని తీవ్రం కానివ్వదనే ఆలోచన కూడా పార్టీ అధిష్టానానికి ఉన్నట్టు నేతలు అంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ హోదా వల్ల ఎంపీ కోమటిరెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించి సభలు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని.. ఇందుకు అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా.. : కోమటిరెడ్డి నల్లగొండ/రామన్నపేట: శ్రీరామనవమి రోజున తనను పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించడం సంతోషకరమని, ఇది దేవుడి దీవెన అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలుచోట్ల శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు నల్లగొండకే తన పోరాటాన్ని పరిమితం చేశానని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ఎలా నాశనం చేస్తున్నారో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు భూములిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం వాటిని లాక్కొని రియల్ ఎస్టేట్‌కు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూస్వాములను ఆదుకుంటోందని విమర్శించారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, పూర్వ వైభవం తెస్తానని ప్రకటించారు. -
యూపీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం సాగిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భుజానికెత్తుకున్నారు. తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తల(స్టార్ క్యాంపెయినర్లు) జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్‌లతో పాటు ఇటీవల పార్టీలో చేరిన విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌లతో పాటు 30 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. (చదవండి: సమాజ్‌వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి) -
గ్రేటర్ ఎన్నికలు: స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల ఘట్టం ఇప్పటికే ముగిసింది. ఎన్నికల గడువు కూడా దగ్గరపడుతోంది. ప్రచారానికి పెద్దగా సమయం కూడా లేదు. దీంతో అధికార టీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్టార్ క్యాంపెయిర్లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రత్యక్షంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూనే స్మార్ట్ఫోన్లు వాడే యువత, ఉద్యోగులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రెస్మీట్లు ఏర్పాటు చేస్తూ నేతలు ఇచ్చే హామీలు, మాటల తూటాలను పోస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్ ప్రచారం ముమ్మరం అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డివిజన్ల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రచారంలో ప్రధాన స్టార్‌గా దూసుకుపోతున్నారు. మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పది పదిహేను డివిజన్లకు తగ్గకుండా రోడ్‌షోలతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఒక్కో డివిజన్‌కు మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఇలా.. గ్రేటర్లో పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అభ్యర్థుల గెలుపు కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి సహా పలువురు నేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీలను ఎండగడుతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడం, కార్యకర్తలు చేజారకుండా కాపాడుకోవడం వీరికి తలకుమించిన భారంగా మారింది. ఎంఐఎం అలా.. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ పార్టీ అభ్యర్థుల తరపున పాతబస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా డోర్ టు డోర్ వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. ఆ మాస్కులకు డిమాండ్ కరోనా నేపథ్యంలో అభ్యర్థులు తమ పార్టీ గుర్తులతో ఉన్న మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. మాస్క్‌లపై పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ తరహా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీటితో పాటు టోపీలు, కండువాలు, బ్యానర్లు, ప్లకార్డులు, తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ జెండాలపై అభ్యర్థి ఫొటో, పార్టీ గుర్తు ఉండేలా చూస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో బీజేపీ.. అధికార పార్టీ దూకుడుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారం నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. నగరంలోని ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాల నుంచి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, ఐటీ విభాగం కార్యకర్తలను నగరానికి రప్పించింది. డివిజన్‌కు కనీసం పది మంది సభ్యులకు తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల ఇన్చార్జి భూపేందర్ యాదవ్ సహా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సహా పలువురు నేతలు పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే మరో వైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మైకుల మోత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మైకుల మోత మోగుతోంది. సోమవారం నుంచి ఇది పతాక స్థాయికి చేరింది. వివిధ పారీ్టల బ్యానర్లు, జెండాల రెపరెపలతో సిటీలో ఎటుచూసినా ఎన్నికల జోష్ నెలకొంది. ప్రచార సామగ్రి తయారీ జోరందుకుంది. పర్యావరణ క్లాత్‌తో.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో ప్లాస్టిక్, పాలిథిన్‌తో తయారైన పోస్టర్లు, బ్యానర్లను వాడుతున్నారు. ఆయా సంస్థల నిర్వాహకులు ప్రచార సామగ్రిని అభ్యర్థుల డిమాండ్ మేరకు ప్రింటింగ్ చేసి అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డోర్ టు డోర్ తిరిగి ఓటర్లను కలిసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచార రథాలు, డప్పు దరువులు, తెలంగాణ ఆటాపాటలతో ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం కుల సంఘాలు, కాలనీ, అపార్ట్మెంట్, గేటేడ్ కమ్యూనిటీల అసోసియేషన్ సభ్యులతో సమావేశమవుతున్నారు. తాజాగా యువనేత కేటీఆర్ నగరంలోని క్రిస్టియన్స్ అసోసియేషన్లను కలుస్తున్నారు. -
ఎన్నికల ప్రచారాన్ని పరుగెత్తించేది వీరే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. వివిధ పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు దుమ్ము లేపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను వివిధ పార్టీలు సమర్పించాయి. కేసీఆర్, కేటీఆర్‌ల నేతృత్వంలో గులాబీ దళం... అధికార టీఆర్ఎస్ నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మహ్మద్ మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీకి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసరెడ్డి జాబితా సమర్పించారు. కాంగ్రెస్ నుంచి ఎవరంటే... కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి (ఎంపీ), పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, జెట్టి కుసుమకుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజన్‌కుమార్ యాదవ్ ప్రచారం చేస్తారు. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి ఎస్ఈసీకి ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ లేఖ సమర్పించారు. కమలదళం విషయానికొస్తే.. బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం. రఘునందన్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు బీజేపీ జాబితా సమర్పించింది. -
‘గ్రేటర్’ ఎన్నికలు : బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం పది మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారికి జాబితాను అందించింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి కిషన్ రెడ్డి మినహా ఇతర కేంద్ర మంత్రులు రానట్లుగా తెలుస్తోంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా బండి సంజయ్ ( రాష్ట్ర అధ్యక్షుడు) కిషన్ రెడ్డి (కేంద్ర మంత్రి) డీకే అరుణ లక్ష్మణ్ మురళీదర్ రావు వివేక్ గరికపాటి మోహన్‌రావు రాజాసింగ్(గోషామాల్ ఎమ్మెల్యే) ధర్మపురి అరవింద్ రఘునందన్‌రావు (దుబ్బాక ఎమ్మెల్యే) బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ‘గ్రేటర్’ ఎన్నికల్లో బీజేపీ ఆచూ తూచి వ్యవహరిస్తోంది. మొత్తం అభ్యర్థులను ప్రకటించకుండా.. ఇతర పార్టీల అసంతృప్తుల కోసం ఎదురు చూస్తోంది. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని వారిని ఎన్నికల బరిలోకి దించనుంది. తాజాగా ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. రామచంద్రపురం సిట్టింగ్ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, వెంగల్రావునగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మనోహర్ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. మనోహర్, గతంలో జీహెచ్ఎంసీ వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతకర వీడియోలు పెట్టి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అతనికి టీఆర్ఎస్ సీటు లభించకపోవడంతో బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అతనికి వెంగల్‌రావ్‌నగర్ టిక్కెట్ ఇచ్చింది. -
ఆయన స్టార్‌క్యాంపెయినర్ కాదనే అధికారం ఈసీకి లేదు
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీ మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కి లేదని కోర్టు స్పష్టం చేసింది. తనని స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడాన్ని కమల్‌నాథ్ కోర్టులో సవాల్ చేశారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసి, మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్‌నాథ్ ఎన్నికల కమిషన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాదని, ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తాము చర్యలు చేపట్టామని కమిషన్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ద్వివేదీ కోర్టుకి తెలిపారు. అయితే ఒక నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఈసీకి ఉందా? అంటూ కమల్‌నాథ్ లేవనెత్తిన ప్రశ్నతో సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారించింది. వారి నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఆ పార్టీకే ఉంటుంది తప్ప, ఆ అధికారం ఈసీ కి ఉండదని ఈసీ తరఫున హాజరైన న్యాయవాదికి కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 13న కమల్‌నాథ్ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ఉపన్యాసంపై ఆధారపడి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీచేసిందని కమల్‌నాథ్ పేర్కొన్నారు. ‘బాబ్రీ’ మాజీ జడ్జికి భద్రత పొడిగింపు కుదరదు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్ నాయకులు ఆడ్వాణీసహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన మాజీ ప్రత్యేక జడ్జి జస్టిస్ ఎస్కే యాదవ్‌కు భద్రత పొడిగించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ కేసు సున్నితమైన అంశం కనుక, అటువంటి కేసులో తాను తీర్పునిచ్చినందున తనకు వ్యక్తిగత భద్రత కొనసాగించాలంటూ జస్టిస్ యాదవ్ సుప్రీంకోర్టును కోరారు. లేఖలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా భద్రత పొడిగింపు సాధ్యం కాదని కోర్టు త్రిసభ్య బెంచ్ తెలిపింది. -
ఈసీకి ఆ అధికారం లేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ 'స్టార్ క్యాంపెయినర్' హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు 'స్టే' విధించింది. ‘స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి అభ్యర్థిని తొలగించడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.. నాయకుల హోదాపై ఈసీకి నిర్ణయాధికారం ఎక్కడిది’ అని కోర్టు ప్రశ్నించింది. ఈసీకి ఆ నిర్ణయాధికారం లేనందున... కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కమల్ నాథ్ పిటిషన్‌పై సోమవారం(నవంబర్ 2) విచారణ చేపట్టింది. (చదవండి: ‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్) మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇమర్తి దేవిని 'ఐటెం' అని కమల్ నాథ్ విమర్శించడం తీవ్ర దుమారం రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతో... కమిషన్ కమల్ నాథ్ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కమల్ నాథ్ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 'ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒకరకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే' అని కమల్ నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో తన స్టార్ క్యాంపెయినర్ హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 13వ తేదీ నాటి తన ప్రసంగంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపిన ఈసీ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా ఇలాంటి చర్య తీసుకున్నట్లు ప్రకటించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌నుద్దేశించి మాఫియా, కల్తీకోరు అంటూ కమల్‌నాథ్ తూలనాడటాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కమల్‌నాథ్ రాష్ట్ర మహిళా మంత్రి, బీజేపీ అభ్యర్థిని ఇమార్తీదేవిని ‘ఐటెం’ అంటూ పేర్కొనడం వివాదాస్పదం అయింది. నిబంధనావళిని ఆయన పలుమార్లు అతిక్రమించారంటూ ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్య తీసుకుంటున్నట్లు ఈసీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ హోదా ఉన్న నేత ప్రచార ఖర్చును సంబంధిత రాజకీయ పార్టీ భరిస్తుంది. ఆ హోదా లేకుంటే ఆ నేత ప్రచార ఖర్చంతా ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఖర్చు కిందికే వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3వ తేదీన జరిగే ఉప ఎన్నికలకు ప్రచార గడువు నవంబర్ ఒకటో తేదీతో ముగియనుంది. -
కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్‌కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించడం పట్ల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది. (చదవండి: ‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్ నాథ్ వివరణ) అలానే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కూడా కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక ఇప్పటి నుంచి కమల్ నాథ్ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వలో స్పష్టం చేసింది. అలానే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హుందాగా, గౌరవప్రదంగా మెలగడం కోసం అందరి ఏకాభిప్రాయంతో ప్రవర్తనా నియమావళిని రూపొందించారని.. ఇది అనేక దశాబ్దాలుగా అమలులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా నటుడు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌ని గుజరాత్ రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉండటం విశేషం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లతో పాటు వివేక్ ఒబెరాయ్ పేరు కూడా చేర్చారు. మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా బాలీవుడ్ నటుడిని పెట్టుకోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోదీ బయోపిక్ ఈ సార్వత్రిక ఎన్నికల ముందు విడుదల చేస్తే ప్రజల మీద ప్రభావం పడుతుందని, ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మోదీ బయోపిక్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుకుంటుందని సోమవారం (ఏప్రిల్ 1)న బాంబే హైకోర్టు తెలిపింది. మోదీ బయోపిక్ విడుదల వల్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కాదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని హైకోర్టు వెల్లడించింది. ఎన్నికల సంఘం అభిప్రాయంతో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విభేదించారు. మోదీ బయోపిక్ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం లేదని చెప్పడం సరికాదని, ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇప్పుడున్న ఎన్నికల సంఘం బలహీనమైనదిగా చరిత్రలో నిలుస్తుందని విమర్శిచారు. -
బాబు@ ‘సీబీఎన్’ చానల్
‘ఈ’పేపర్ని, ‘ఆ’ పేపర్ని చింపి పడేశాడు చంద్రబాబు! పార్టీ కార్యకర్తల ప్రాడక్ట్ మీద ఎప్పుడూ ఆయన అంత కోపం ప్రదర్శించలేదు. ‘‘చెత్తగాళ్లు, చెత్త న్యూస్’’ అన్నాడు. చుట్టూ ఆయన పెట్టుకున్న స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ‘‘నిన్నంతా మీరేమీ పీకలేదా?’’ అన్నాడు చంద్రబాబు. ‘‘పీకాము నాయుడుగారూ.. వాళ్లే, మేము పీకిందేమీ రాయలేదు’’ అన్నారు. చంద్రబాబు మండిపడ్డాడు. ‘‘జగన్ ఇలా అన్నాడు. జగన్ అలా అన్నాడు. కేసీఆర్‌తో సెల్ఫీ దిగాడు. కేటీఆర్‌తో కుల్ఫీ తిన్నాడు.. ఇదా న్యూస్! జనాన్ని జగన్‌కి దూరం చేసే న్యూస్ రాయమంటే జగన్‌కి మనవాళ్లను కూడా దగ్గర చేసే న్యూస్ రాస్తున్నారు’’ అన్నాడు. స్టార్ క్యాంపెయినర్ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒక కన్ను మూసి, పళ్లు పటపటలాడించాడు. ‘‘ఏంటా ఎక్స్ప్రెషన్?’’ అన్నాడు చంద్రబాబు. ‘‘మీ మీద కాదు. వాళ్ల మీద’’ అన్నాడు. ‘‘వాళ్ల మీద అంటే.. వేళ్ల మీద? అన్నాడు చంద్రబాబు చికాగ్గా. ‘‘అదేనండీ నాయుడుగారూ.. మన రెండు పేపర్ల మీద! మన పేపర్లు అయివుండి, పొద్దస్తమానం జగన్.. జగన్.. అంటాయేంటీ! ఆయనెరూ.. పీయుష్ గోయెల్. ఈ మధ్య ఆయన హైదరాబాద్‌లో ఏదో హోటల్లో దిగాడంట. ‘జగన్ నా ఫ్రెండు’ అన్నాడంట. పీయుష్కి జగన్ ఫ్రెండయితే జగన్‌కి వచ్చే నష్టం ఏంటి, మనకొచ్చే లాభం ఏంటి? అది రాసుకొచ్చాడు రాధాకృష్ణ! వేస్ట్ ఎనాలిసిస్. పీయుష్ గోయెల్ కేంద్ర మంత్రి అని వర్ల రామయ్య చెప్పే దాకా నాకే తెలీదు. జనానికేం తెలుస్తుంది’’ అన్నాడు రాజేంద్రప్రసాద్. నిజమేనన్నట్లు చూశాడు వర్ల రామయ్య. ‘‘ఆ పీకే గురించి ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదు. పీకే అంటే జనం పవన్‌కళ్యాణ్ అనుకుంటారు కానీ, ప్రశాంత్ కిశోర్ అనుకుంటారా! జగన్‌కి పీకే ఐడియాలు ఇస్తున్నాడని రాస్తే, పవన్ జగన్‌కి సపోర్ట్ చేస్తున్నాడని జనం జగన్‌కి ఓటేసే ప్రమాదం ఉంది. ఆ ప్రశాంత్ కిశోర్ జగన్ అడ్వయిజర్ అని రాజేంద్రప్రసాద్ చెప్పేవరకు నాకూ తెలీదు.’’ అన్నాడు వర్ల రామయ్య. విసుగ్గా చూశాడు చంద్రబాబు. ‘‘మీకు మీరు చెప్పుకోవడం మానేసి, నాక్కూడా చెబుతుండండి’’ అన్నాడు. ‘‘మీక్కూడా చెప్పాం నాయుడుగారూ’’ అన్నారు రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య. ‘ఏం చెప్పారు?’ అన్నాడు బాబు కళ్లద్దాల లోపల్నుంచి చూస్తూ. ‘‘మనమూ ఒక సీబీఎన్ చానల్, మనమూ ఒక ‘సీ’టీవీ పెట్టుకుందాం అని చెప్పాం. మీరు వినలేదు. ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్ మనవే కదా. మళ్లీ మనకో పేపర్, మనకో చానల్ ఎందుకు.. డబ్బులు దండగ అనేశారు’’ అన్నారు స్టార్ క్యాంపెయినర్లు. ‘అవునా..’ అన్నట్లు చూశాడు చంద్రబాబు. ‘ఈ’ పేపర్‌కి, ‘ఆ’ పేపర్‌కీ లైన్ కలపమన్నాడు. కలిపారు. మాట్లాడి పెట్టేశాడు చంద్రబాబు. ‘‘ఏమంటున్నారు సార్.. ’’ అడిగారు స్టార్ క్యాంపెయినర్లు. ‘‘రోజూ మీరు పీకిందేనా.. మేం పీకిందీ రాసుకోవాలి కదా’’ అంటున్నారు.. అన్నాడు చంద్రబాబు. రాజేంద్రప్రసాద్ మళ్లీ ఒక కన్ను మూసి, పళ్లు పటపటలాడించాడు. – మాధవ్ -
40 మంది స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గానూ 40 మందితో స్టార్ క్యాం పెయినర్ల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. ఈ మేర కు ఆ జాబితాను ఎన్నికల సంఘానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ అందజేశారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఆ జాబితాలోని నేతలంతా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో షెడ్యూల్‌ను బీజేపీ సిద్ధం చేస్తోంది. జాబితాలోని వారు.. జాబితాలో మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితి న్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్‌లాల్, జగత్ ప్రకాష్ నడ్డా, నిర్మలా సీతారామన్, ఉమాభారతి, స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, యోగీ ఆదిత్యనాథ్, హేమామాలిని, అరవింద్ లింబావలి, సుగుణాకర్‌రావు, పురుషోత్తం రూపాల, సాధ్వి నిరంజన్‌జ్యోతి, సౌదాన్ సింగ్, కృష్ణదాస్, మురళీధర్‌రావు, రాం మాధవ్, సయ్యద్ షానవాజ్ హుస్సేన్, జీవీఎల్ నర్సింహారావు, సురేశ్ ప్రభు ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సహా 13 మంది రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
20 మంది స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 20 మంది స్టార్ క్యాంపెయినర్లను టీఆర్ఎస్ ఎంపిక చేసింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జాబితాను అందించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, 11 మంది మంత్రులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్.శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బండ ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ అధినేత రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిలు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. రెండు రోజుల కింద ఎన్నికల ప్రధానాధికారికి ఇచ్చిన జాబితాలో టి.హరీశ్‌రావు పేరు లేదు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ పేరు ఉంది. తాజాగా సోమవారం సమర్పించిన జాబితాలో సంతోష్ స్థానంలో హరీశ్‌రావు పేరు చేర్చడం గమనార్హం. లోక్‌సభ పార్టీ బాధ్యుల మార్పు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రతి సెగ్మెంట్లకు మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. మంత్రులతోపాటు ఒక్కో సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా నియమించారు. నల్లగొండ లోక్‌సభకు నూకల నరేశ్‌రెడ్డిని, ఖమ్మం లోక్‌సభకు తక్కళ్లపల్లి రవీందర్‌రావులకు బాధ్యతలను అప్పగించారు. -
40 మంది స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా సోమవారం జాబితాను ప్రకటించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, నారాయణస్వామి, అశోక్‌చౌహాన్, పరమేశ్వర, మిక్రాకుమార్, చిండియా, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, సిద్దరామయ్య, డీకే శివకుమార్, జైపాల్‌రెడ్డి, ఆర్సీ కుంతియా, శ్రీనివాసన్ కృష్ణన్, సలీంఅహ్మద్, బీఎస్ బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, విజయశాంతి, జానారెడ్డి, మధుయాష్కి, దామోదర రాజనరసింహ, షబ్బీర్‌అలీ, రాములునాయక్, రేవంత్‌రెడ్డి, రేణుకా చౌదరి, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నవజ్యోత్‌సింగ్ సిద్దూ, నితిన్‌రౌత్, నదీమ్ జావేద్, నగ్మా, ఖుష్బు, అనిల్ థామస్, కెప్టెన్ ప్రవీణ్ దావర్ ఉన్నారు. -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా పీఎం, సీఎం
సాక్షి, ముంబై: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీకి కీలకంగా మారిన రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దించుతోంది. బీజేపీ బలంగా భావించే మహారాష్ట్రాలో బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. రెండూ బలమైన పార్టీలు కావడంతో ఎక్కువ సీట్లు సాధించాలని కమలదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను స్టార్ క్యాంపెయినర్లుగా బీజేపీ నియమించింది. వీరితో పాటు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావిస్ ప్రచారంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి బీజేపీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. నాగపూర్, నాసిక్, అమరావతి, నవీ ముంబై వంటి నగరాల్లో భారీ సభలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. వీరితో పాటు ప్రచార సభల్లో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కూడా పాల్గొననున్నారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో 50-50 పద్ధతిలో ఇరు పార్టీలు పోటీచేయాలని ఒప్పంద కుదర్చుకున్న విషయం తెలిసిందే. -
ఫైనల్ టచ్..! అతిరథులు సుడిగాలి పర్యటనలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారం ముగిసే సమయం సమీపిస్తుండ డంతో అన్ని పార్టీల అతిరథ నేతలందరూ మరోసారి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 5తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అగ్రనేతల షె డ్యూళ్లు ఖరారయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ముఖ్యనేతలపైనే ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వారు మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను అ త్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అ తిథుల రాకకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా ఇప్పటికే రెండుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. నాగర్‌కర్నూల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్ 4న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ప్రచారసభలు నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం మరోసారి ఉమ్మ డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే కొడం గల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన సభలో పాల్గొనగా... ఈసారి గద్వాలలో నిర్వహిం చే సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. ఆశలన్నీ కేసీఆర్‌పైనే.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఎట్టి పరిస్థితిలో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బరిలో నిలిచిన నేతలందరూ ఆశలన్నీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీదే పెట్టుకున్నారు. దీంతో ఆయన కూడా ప్రతీ నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేశాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత జడ్చర్లలో జరిగిన సభకు హాజరైన కేసీఆర్.. మరోమారు దేవరకద్ర, నారాయణపేట సభల్లో పాల్గొని మాట్లాడారు. తాజాగా ఒకేరోజు మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట సభకు హాజరయ్యారు. ఇప్పుడు ఆదివారం నాగర్‌కర్నూల్‌లో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత 4న ఒకే రోజు ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, కొండగల్‌లో జరిగే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితుల చోట్ల సభలు నిర్వహించి.. కేడర్‌ను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కల్వకుర్తి, మక్తల్, అచ్చంపేటలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట్ల.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టేందుకు టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావును నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిగా నియమించారు. అలంపూర్, గద్వాల్, మక్తల్, కొడంగల్‌లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు నడిపించేందుకు హరీశ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటించిన హరీశ్.. కొందరిని నియోజకవర్గంలో నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్ఎస్ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వ్యూహాత్మకంగా ప్రజాఫ్రంట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలందరూ కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అన్నిచోట్ల కూడా కూటమి నాయకులుకలిసి బరిలో నిలిచిన అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలు, టీ పీసీసీ ముఖ్యనేతలందరూ విస్తృతంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. గత నవంబర్ 28న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలపై రాహుల్ ధీటైన విమర్శలు చేస్తున్నారు. రాహుల్ సభల ద్వారా కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నెలకొనడంతో.. ఈనెల 3న గద్వాలలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కమలం ‘గురి’ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సైతం తన పట్టును నిలుపుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. ఉమ్మడి జిల్లా కొన్ని స్థానాలైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తోంది. పలు సర్వేల్లో కల్వకుర్తి, నారాయణపేటల్లో పార్టీ అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కనీసం ఈ రెండు స్థా నాలను గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు సభ ద్వారా కేడర్‌లో జోష్ నింపారు. మరోవైపు మంచి వాగ్దాటి ఉన్న స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా ఆయా నియోజకవర్గాల్లో ప ర్యటించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పా టు జె.పి.నడ్డా తదితరులు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో వ్యూహకర్తగా పేరున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యూ హాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పాలమూరు నుంచే ప్రా రంభించిన నేపథ్యంలో... తాజాగా ఆయన మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని నారా యణపేట, కల్వకుర్తి(ఆమనగల్)ల్లో ఆదివారం జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. -
బీజేపీ ‘స్టార్ వార్!’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొంత మంది కీలక నేతలను ఆ పార్టీ రంగంలోకి దించనుంది. ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్ బహిరంగ సభల్లో పాల్గొనగా, అమిత్‌షా 9 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా హైదరాబాద్‌లోనే మకాం వేసి, పార్టీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించడంతోపాటు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంతోష్ గంగ్వార్, పార్టీ సీనియర్ నేతలు మురళీధర్‌రావు, రాంమాధవ్, పురంధేశ్వరి, స్వామి పరిపూర్ణానంద వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ మేడ్చ ల్ అభ్యర్థి మోహన్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. పరిపూర్ణానంద ఇప్పటికే పదుల సంఖ్యలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా, మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఐదో తేదీ వరకు కీలకసభలు ఈ నెల ఒకటి(శనివారం) నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే బహిరంగ సభలు తమకు ఎంతో కీలకమైనవని బీజేపీ పేర్కొంటోంది. ఈ నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో పరిణామాలు మారుతాయని, బీజేపీకి మరింత అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 2 న అమిత్‌షా నారాయణ్‌పేట్, కల్వకుర్తి (ఆమనగల్), కామారెడ్డి బహిరంగసభలు, ఉప్పల్, మల్కాజిగిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2న భూపాలపల్లి, ముధోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిలో, 5న కరీంనగర్, వరంగల్, గోషామహల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. 4న కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, రవిశంకర్ ప్రసాద్‌ల సభలు నిర్వహించనున్నారు. శనివారం(నేడు) ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ భద్రాచలం, ఎల్లారెడ్డి, ఖైరతాబాద్ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు.