swimming championship
-
స్విమ్మర్ సామదేవ్కు కాంస్యం
మలేసియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ తీర్థు సామదేవ్ కాంస్య పతకం సాధించాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో సామదేవ్ 16 నిమిషాల 18.31 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
వరల్డ్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్.. జలకన్యల విన్యాసాలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో జాతీయ సీనియర్ స్విమ్మింగ్ పోటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 5 వరకు హైదరాబాద్ వేదికగా జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 500 మందికిపైగా స్విమ్మర్లు బరిలోకి దిగనున్నారు. తెలంగాణ తరఫున 22 మంది స్విమ్మర్లు పోటీపడనుండగా... పురుషుల బృందానికి సూర్యాన్షు, మహిళల బృందానికి వ్రితి అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. జాన్ సిద్దిఖి, ఆయూశ్ యాదవ్ కోచ్‌లుగా వ్యవహరిస్తారు. ఒలింపియన్ స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాశ్, మానా పటేల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. కేటీ లెడెకీ ఆరోసారి... అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకీ వరుసగా ఆరోసారి ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. గతంలో మైకేల్ ఫెల్ప్స్, రియాన్ లోచ్టె, నటాలీ కులిన్, ఎలిజబెత్ బీసెల్, నాథన్ అడ్రియన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అమెరికా జాతీయ పోటీల్లో లెడెకీ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. లెడెకీ ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 19 స్వర్ణాలు గెలిచింది. అల్పైన్ వారియర్స్‌కు ఐదో విజయం గ్లోబల్ చెస్ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్జీ అలై్పన్ వారియర్స్ జట్టు ఐదో విజయం సాధించింది. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సభ్యుడిగా ఉన్న గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టుతో దుబాయ్‌లో బుధవారం జరిగిన ఏడో రౌండ్లో అలై్పన్ వారియర్స్ 10–8తో గెలిచింది. ఆనంద్‌తో జరిగిన గేమ్‌లో కార్ల్సన్ 72 ఎత్తుల్లో నెగ్గాడు. వారియర్స్‌కే చెందిన ప్రజ్ఞానంద 42 ఎత్తుల్లో ఇసిపెంకోను ఓడించగా... అర్జున్, ఎలిజబెత్ పాట్జ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. గుకేశ్, ఇరీనా ఓడారు. -
వాటర్ పోలో చాంపియన్ పోటీల్లో విజేత వెస్ట్రన్ రైల్వే
గచ్చిబౌలి: తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 2వ ఆల్ ఇండియా ఇంటర్ క్లబ్ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వెస్ట్రన్రైల్వే మొదటి బహుమతి అందుకుంది. రెండో బహుమతి ఇండియన్ నేవీ, మూడవ బహుమతి ఆర్మీ రెడ్ జట్లు అందుకున్నాయి. విజేతలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ కొండా విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్రితి అగర్వాల్‌కు మరో పసిడి పతకం
జాతీయ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రెండో స్వర్ణ పతకం సాధించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అండర్–17 బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి 17ని:37.78 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. అండర్–17 బాలుర 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్లో తెలంగాణకే చెందిన బిక్కిన సాయి నిహార్ (4ని:40.08 సెకన్లు)... అండర్–14 బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్ ప్రీతమ్ (28.51 సెకన్లు) రజతాలు నెగ్గారు. చదవండి: రన్నరప్ హర్ష భరతకోటి -
రెండు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు
రష్యా స్విమ్మర్ క్లిమెంట్ కొలెస్నికోవ్ రెండు రోజుల వ్యవధిలో రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న యూరోపియన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 20 ఏళ్ల కొలెస్నికోవ్ బుధవారం జరిగిన 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో స్వర్ణం గెలిచాడు. ఫైనల్ రేసును కొలెస్నికోవ్ 23.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మంగళవారం సెమీఫైనల్ సందర్భంగా 23.93 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కొలెస్నికోవ్ బద్దలు కొట్టాడు. చదవండి: ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’ -
బొమ్మలేసే చేతులు నదిని గెలిచాయి
ఈమె పేరు శ్యామల గోలి. చిన్నప్పటి నుంచి చదువులో యావరేజ్.. తండ్రి ఒకటి తలిస్తే తాను ఇంకోటి నేర్చుకున్నారు. ఎవరూ ఊహించని దారి ఎంచుకున్నారు.. బొమ్మల్ని కదిలించి యానిమేటర్ అయ్యారు.. నష్టాలకు ఎదురీదారు. తన 44వ యేట స్విమ్మింగ్‌ను కెరీర్‌గా తీసుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల (డిసెంబర్ 22వ తేదీన) హుగ్లీలో పధ్నాలుగు కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ అన్ని విజయాల వెనక ఒక ఫెయిల్యూర్ ఇచ్చిన ప్రేరణ ఉంది. తండ్రి చెప్పిన మాట తాలూకు శక్తి ఉంది. శ్యామల సొంతూరు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట. మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్. చాలా రికార్డులు బ్రేక్ చేశారు. కాని తన ముగ్గురు పిల్లలను క్రీడలకు దూరంగా పెట్టారు. ఆటల్లో నెగ్గుకు రాగలరేమో కాని ఆ రంగంలోని రాజకీయాల్లో నెగ్గుకు రావడం కష్టమని.. ఆ రంగంలోని కష్టనష్టాలను చూసి, అనుభవించిన వాడిగా. వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లినప్పుడల్లా జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిల్లో ఐఏఎస్ ఆఫీసర్ల హోదా, వాళ్లకు అందే గౌరవాలు చూసి తన పెద్ద కూతురు శ్యామల (శ్యామలకు ఒక తమ్ముడు, చెల్లి)ను ఐఏఎస్ చేయాలని నిశ్చయించుకున్నాడు. శ్యామల మాత్రం అనుకోలేదు, ఆసక్తీ చూపించలేదు. అందుకే ఆమె గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. పెళ్లితో కాదు.. ఆర్థిక స్వాతంత్య్రంతో.. చదువులో అంతగా ఆసక్తిలేని శ్యామలకు మొదటి నుంచీ చిత్రలేఖనం మీదే శ్రద్ధ. హైస్కూల్లో ఉన్నప్పుడే బీఈడీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ కోసం కాన్సెప్ట్ డెవలప్‌చేసి.. బొమ్మలు గీసిస్తూండేవారు. పిల్లలను ఆటలకు దూరంగా ఉంచారే కాని తండ్రిగా వెంకటరాజు పిల్లలనెప్పుడూ బంధించలేదు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడి మధ్య లింగవివక్షనూ చూపించలేదు. చిన్నప్పుడొకసారి శ్యామల తనకు ఇష్టమైన సినిమా నటుడి బొమ్మతో ఉన్న పేపర్‌ను పుస్తకానికి అట్టగా వేసుకుంటే చూసి ‘‘ అమ్మాయికి పెళ్లి పరమావధి కాదు.. ఆర్థిక స్వాతంత్య్రంతోనే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఇలాంటి బొమ్మలు పెళ్లి మీదకు ఆలోచనలు మళ్లిస్తాయి’’ అని కూతురిని హెచ్చరించారు. ఆ మాటతో అప్పటికప్పుడు అట్టను చించనైతే చించేశారు కాని చదువు మీద ఆసక్తయితే పెంచుకోలేదు ఆమె. ఫలితం.. టెన్త్‌లో ఫెయిల్. ఆ ఫెయిల్యూరే ఆమెలో పట్టుదలను పెంచి తర్వాత విజయాలను చూపించింది. నాగార్జున యూనివర్శిటీలో ఎమ్మే సోషియాలజీ చేయించింది. తర్వాత.. ‘‘ఏముంది? పెళ్లి. మా వారి పేరు మోహన్. సివిల్ ఇంజనీర్. అయితే మా నాన్న మాట మాత్రం మరచిపోలేదు’’అంటూ తన జీవితంలోని తర్వాత ఘట్టం చెప్పారు శ్యామల. రెండేళ్లకు బాబు పుట్టాడు. అప్పుడు వాళ్లాయన ఉద్యోగరీత్యా గుజరాత్లో ఉన్నారు. ఒకసారి సంక్రాంతి కోసమని సామర్లకోట వచ్చారు. తర్వాత రెండు నెలలకే బంధువుల పెళ్లి ఉంటే చంటిబాబుతో మళ్లీ అంతదూరం ప్రయాణం చేసి రావడం కష్టమని శ్యామలను ఊళ్లోనే ఉంచి అతను వెళ్లిపోయారు. ఆ టైమ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు శ్యామల. కాకినాడలోని ఎరీనా మల్టీమీడియా ఇన్స్టిట్యూట్లో చేరి మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. యేడాది కోర్స్‌ను మూడు నెలల్లో పూర్తిచేశారు శ్యామల. సరిగ్గా అప్పుడే భర్తకు బెంగళూరు బదిలీ అయింది. మకాం బెంగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరికి మారింది. యానిమేషన్ సిరీస్.. మల్టీ మీడియా, వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా కోర్స్ ఇచ్చిన నేర్పు, నైపుణ్యంతో, తండ్రిమాటనూ ప్రాక్టికల్ చేయడానికి ఫోటోగ్రాఫిక్స్ స్టూడియో పెట్టారు. మంచి లాభాల్లో సాగుతూన్నప్పుడే పిల్లాడి స్కూల్ కోసం బెంగళూరుకి షిఫ్ట్ కావల్సి వచ్చింది. ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేక ఉద్యోగం కోసం వెదికారు. చిన్న యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగం దొరికింది. అప్పటికే బాబు కోసం స్పైడర్ మాన్లాంటి యానిమేషన్ క్యారెక్టర్ ఒకటి తయారు చేయాలని పంచతంత్ర కథలను తనే రిటోల్డ్ చేసుకొని.. బొమ్మలు గీస్తూ.. గ్రాఫిక్ చేస్తూ .. వాటికి తన వాయిస్‌నే రికార్డ్ చేస్తూండేవారు ఇంట్లో. తను పనిచేస్తున్న స్టూడియోలోనే మణిరత్నం ‘బాయ్స్’సినిమాలోని ఒక పాటకు విజువల్ ఎఫెక్ట్స్ తయారు చేసిన శరత్ అనే యానిమేటర్‌తో పరిచయం అయింది ఆమెకు. ‘‘ఆయన పనితీరు గమనిస్తూండేదాన్ని. ఆయనేమో తనను ఎక్కడ కాపీ కొడతున్నానో అనుకొని మానిటర్‌ను నాకు కనపడకుండా తిప్పుకొనేవారు. ఆనక నా వర్క్ గురించి తెలిసి కొన్ని టెక్నిక్స్ నేర్పించాడు’’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు శ్యామల. తర్వాత కొద్దికాలానికే ఆ స్టూడియో మూత పడింది. కాని ఆమె ఆగలేదు. డిజిటల్ డ్రీమ్ డిజైనర్స్ పేరుతో వెబ్డిజైనింగ్లోకి అడుగిడారు ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని. చెన్నై నుంచి సౌది అరేబియాదాకా దాదాపు రెండువందలకు పైగా దేశీ, విదేశీ ప్రాజెక్ట్‌లకు పనిచేశారు. ఈలోపు భర్తకు హైదరాబాద్‌లో మంచి అవకాశం రావడంతో అనివార్యంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది ఆమె. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్స్‌కి పనిచేస్తూనే తన చిరకాల వాంఛ అయిన యానిమేషన్ ప్రాజెక్ట్ మీదా మనసు పెట్టారు. ఆ పైలట్ ప్రాజెక్ట్స్‌ను తీసుకొని ప్రతి టీవీ చానల్‌కు వెళ్లి డెమోస్ ఇచ్చేవారు. ఏ చానలూ స్పందించలేదు. యేడాది తర్వాత ‘మా టీవీ’ వాళ్లు ‘మా జూనియర్స్’ చానెల్‌ను ప్రారంభిస్తూ ఆమెను పిలిచారు యానిమేషన్ సిరీస్ కావాలని. అప్పడు దొరికింది యానిమేషన్ ఫిలమ్సలో ఆమెకు బ్రేక్. పిల్లలున్న ప్రతి ఇంటికీ గోలి శ్యామల సుపరిచితులయ్యారు. ఏకైక మహిళా యానిమేషన్ సిరీస్ ప్రొడ్యూసర్‌గా దాదాపు పదేళ్లు కొనసాగారు. సొంత ప్రొడక్షన్లో కొన్ని ప్రయోగాలూ చేశారు. అందులో భాగంగానే లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ మూవీ తీసి ఆర్థికంగా నష్టపోయారు. దాంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అది శారీరక ఆరోగ్యం మీదా ప్రభావం చూపించడంతో యానిమేషన్‌ను పాజ్ చేశారు. స్విమ్మింగ్‌తో.. చిన్నప్పటి నుంచి నీళ్లంటే భయపడే శ్యామల తన ఆరోగ్యాన్ని నీటిలోనే వెదుక్కున్నారు. మూడేళ్ల కిందట ఈత నేర్చుకొని. కెరీర్‌గా మలచుకుని. 44వ యేట రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన పోటీలు, ఈవెంట్లలో పాల్గొని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్‌ను దాటేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ‘‘సాధించాలనే పట్టుదలకు వయసు ఏ మాత్రం అడ్డుకాదని నన్ను ప్రోత్సహిస్తున్న కోచ్ ఆయుష్ యాదవ్‌కు కృతజ్ఞతలు. నా ప్రతి ఎఫర్ట్ నాకో కొత్త విషయాన్ని నేర్పింది. మరింత తర్ఫీదునిచ్చింది. వీటన్నింటికీ వెన్నంటే ఉన్న మా వారు, మా అబ్బాయి, మా నాన్నే నా స్ట్రెన్త్. విమెన్ సేఫ్టీకి సంబంధించి ఒక యానిమేషన్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ఉంది’’ అని చెప్తారు శ్యామల గోలి. – సరస్వతి రమ -
ఐరన్ లేడీ స్విమ్మర్ ఎట్ 90
గ్లాస్గో (స్కాట్లాండ్): స్విమ్మింగ్ సర్క్యూట్లో ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా పేరున్న హంగేరి స్విమ్మర్ కటింకా హోస్జూ తన ఖాతాలో 90వ పతకాన్ని జమ చేసుకుంది. యూరోపియన్ షార్ట్ కోర్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలో దిగిన 30 ఏళ్ల కటింకా అందరి కంటే ముందుగా 4ని.25.10 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకాన్ని సాధించింది. దీంతో తన 15 ఏళ్ల కెరీర్లో సాధించిన పతకాల సంఖ్యను 90కు పెంచుకుంది. ఇందులో 60 పసిడి పతకాలు ఉండటం విశేషం. ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన కటింకా 25 పసిడి పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో, 31 బంగారు పతకాలను యూరోపియన్ చాంపియన్‌షిప్‌లలో సాధించింది. గత ఏడాది తన కోచ్, భర్త షేన్ టసప్తో తెగదెంపులు చేసుకున్న కటింకా... వారం రోజుల క్రితం ప్రస్తుత కోచ్ అర్పద్ పెట్రోవ్కూ గుడ్‌బై చెప్పేసి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కోచ్ లేకుండానే ఒంటరిగా సన్నద్ధమవుతోంది. -
రాజ్‌కుమార్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. శనివారం సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎమ్సీ స్విమ్మింగ్ పూల్‌లో 80 ప్లస్ విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో సి.రాజ్‌కుమార్ (తెలంగాణ) విజేతగా నిలిచాడు. తెలంగాణకే చెందిన ఓం అవతార్ రెండో స్థానంలో నిలిచాడు. 35–39 ఏళ్ల విభాగంలో జరిగిన 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో అజిత్ సుదర్శన్ (తెలంగాణ) తొలి స్థానంలో నిలువగా... త్రిపథ్ ప్రశాంత్ (మహారాష్ట్ర), చంద్రకాంత్ (మహారాష్ట్ర) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 55–54 ఏళ్ల విభాగంలో బ్యాక్‌స్ట్రోక్‌లో కె.సురేంద్ర (తెలంగాణ), జక్రియా అలీఖాన్ (ఏపీ), ఉత్తమ్ పాటిల్ (మహారాష్ట్ర) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 30–34 ఏళ్ల విభాగంలో బ్యాక్‌స్ట్రోక్‌లో మీనాక్షి జైన్ (తెలంగాణ) తొలి స్థానంలో నిలువగా... సోనాలీ మనోహర్ (మహారాష్ట్ర), సప్నా యాదవ్ (మహారాష్ట్ర) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన 650 మందికి పైగా స్విమ్మర్లు పాల్గొంటున్నారు. -
ఏపీ స్విమ్మర్ తులసీ చైతన్య అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ ఎం.తులసీ చైతన్య అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా గుర్తింపు పొందాడు. 35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను 30 ఏళ్ల తులసీ చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో పూర్తి చేశాడు. విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీ చైతన్య ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్ స్విమ్మర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 2015, 2017 ఆలిండియా పోలీస్ అక్వాటిక్స్ మీట్లో ‘బెస్ట్ స్విమ్మర్’ పురస్కారం పొందిన తులసీ చైతన్య ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ పోలీసు క్రీడల్లో పాల్గొని భారత్‌కు 20 పతకాలు అందించాడు. కాటలీనా చానెల్‌ను ఈదడానికి తులసీ చైతన్య ద్రోణాచార్య అవార్డీ ప్రదీప్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ ఘనత సాధించే క్రమంలో తనకు మద్దతు నిలిచిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు, అడిషనల్ డీజీపీ శ్రీధర్ రావు, రూ. 2 లక్షల ఆరి్థక సహాయం అందించిన పాలకొల్లుకు చెందిన వ్యాపారవేత్త నరసింహ రాజు, తెలంగాణ ప్రిన్సిపల్ హోం సెక్రటరీ రాజీవ్ త్రివేదిలకు ఈ సందర్భంగా తులసీ చైతన్య కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఏడాది జిబ్రాల్టర్ జలసంధిని ఈదడమే తన లక్ష్యమని, ఇప్పటి నుంచే దాని కోసం శిక్షణ ప్రారంభిస్తానని తులసీ చైతన్య తెలిపాడు. -
ఓవరాల్ చాంప్ సిద్ధార్థ డిగ్రీ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) పురుషుల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సిద్ధార్థ డిగ్రీ, పీజీ కాలేజి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. బద్రుకా కాలేజి ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో సిద్ధార్థ జట్టు 16 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 9 పాయింట్లు సాధించిన లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజి, అవినాశ్ డిగ్రీ కాలేజి జట్లు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో యశ్‌వర్మ (లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజి), వై. హేమంత్ రెడ్డి (అవినాశ్ కాలేజి), టి. సాయి తరుణ్ (సిద్ధార్థ డిగ్రీ కాలేజి) సత్తా చాటారు. వీరు ముగ్గురు ఆయా విభాగాల్లో తలా 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. 200 మీటర్ల మెడ్లే, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లలో యశ్ వర్మ విజేతగా నిలిచాడు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో వై. హేమంత్ రెడ్డి చాంపియన్‌గా నిలిచాడు. 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 50 మీటర్ల బటర్ ఫ్లయ్, 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లలో సాయి తరుణ్ అగ్రస్థానంలో నిలిచి మూడు స్వర్ణాలను అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో బద్రుకా ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ డైరెక్టర్ టీఎల్ఎన్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బద్రుకా కాలేజి ప్రిన్సిపాల్ సోమేశ్వర్ రావు, తెలంగాణ అక్వాటిక్ సంఘం కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు ∙200 మీ. మెడ్లే: 1. యశ్ వర్మ (లిటిల్ ఫ్లవర్ కాలేజి), 2. సాత్విక్ నాయక్ (బద్రుకా), 3. చరణ్ (సెయింట్ జోసెఫ్). ∙100 మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. హేమంత్ రెడ్డి, 2. రోనక్ జైస్వాల్ (బద్రుకా), 3. సాయి ప్రసన్న (ప్రగతి మహావిద్యాలయ). ∙100 మీ. ఫ్రీస్టయిల్: 1. తేజస్విన్ (సిద్ధార్థ), 2. సుహాన్ (సెయింట్ జోసెఫ్), 3. గురునాథ్ (భవన్స్). ∙100 మీ. బటర్‌ఫ్లయ్: 1. యశ్‌వర్మ, 2. తేజస్విన్ (సిద్ధార్థ), 3. సాత్విక్ నాయక్ (బద్రుకా). ∙50 మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. హేమంత్ రెడ్డి, 2. సాయిప్రసన్న (ప్రగతి), 3. సాయి లక్ష్మణ్ (భవన్స్). ∙100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. యశ్‌వర్మ, 2. శశాంక్ యాదవ్ (ఎస్వీ డిగ్రీ కాలేజి), 3. చరణ్ (సెయింట్ జోసెఫ్). ∙50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. సాయి తరుణ్, 2. శశాంక్ యాదవ్ (ఎస్వీ డిగ్రీ కాలేజి), 3. సుహాన్ (సెయింట్ జోసెఫ్). ∙50 మీ. బటర్‌ఫ్లయ్: 1. సాయి తరుణ్, 2. తేజస్విన్ (సిద్ధార్థ), 3. గౌతమ్ సూర్య (బద్రుకా). ∙50 మీ. ఫ్రీస్టయిల్: 1. సాయి తరుణ్, 2. గురునాథ్ సాయి (భవన్స్ వివేకానంద), 3. సి. మనీశ్ (ఎస్పీ కాలేజి). ∙200 మీ. ఫ్రీస్టయిల్: 1. హేమంత్ రెడ్డి, 2. గౌతమ్ సూర్య (బద్రుకా), 3. సుహాన్ (సెయింట్ జోసెఫ్). -
చాంపియన్ రజత్ అభిరామ్
సాక్షి, హైదరాబాద్: సీఐఎస్సీఈ రీజినల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహించిన బాలుర స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ స్విమ్మర్ రజత్ అభిరామ్ రెడ్డి సత్తా చాటాడు. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం జరిగిన అండర్–19 బాలుర 1500మీ. ఫ్రీస్టయిల్ విభాగంలో రజత్ చాంపియన్‌గా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. కృష్ణకాంత్ (అభ్యాస స్కూల్) రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 50మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో హర్షల్ గుప్తా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్) విజేతగా నిలవగా... వైష్ణవ్ గౌడ్ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), సాకేత్ అగర్వాల్ (అభ్యాస రెసిడెన్షియల్ స్కూల్) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ఈ పోటీల్లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. స్టీఫెన్ కుమార్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌షిప్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఏఎస్‌ఐఎస్‌సీ సంయుక్త కార్యదర్శి సుందరి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు ∙50మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. వైభవ్, 2. పద్మేశ్, 3. రుషికేశ్. ∙50మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. స్టీఫెన్ కుమార్, 2. కవీశ్, 3. హర్షుల్ గుప్తా. ∙ 400మీ. ఫ్రీస్టయిల్: 1. రవితేజ, 2. శివరామ్, 3. కవీశ్. ∙50మీ. బటర్‌ఫ్లయ్: 1. సాకేత్ అగర్వాల్, 2. శివరామ్, 3. రవితేజ ∙ 100మీ. ఫ్రీస్టయిల్: 1. కవీశ్, 2. వైష్ణవ్, 3. కె. ధన్‌రాజ్. ∙100మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. రజత్ అభిరామ్, 2. వి. వైభవ్, 3. జి. పద్మేశ్. ∙100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. స్టీఫెన్ కుమార్, 2. అలోసిస్ జెరోమ్, 3. సాకేత్ అగర్వాల్. ∙100మీ. బటర్‌ఫ్లయ్: 1. శివరామ్, 2. రవితేజ, 3. ల„Š్య. ∙200మీ. ఫ్రీస్టయిల్: 1. రవితేజ, 2. రుషి, 3. ల„Š్య. ∙200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. స్టీఫెన్ కుమార్, 2. జెరోమ్, 3. ధ్రువ్. ∙200మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. రజత్ అభిరామ్, 2. వైభవ్, 3. పద్మేశ్. ∙200మీ. బటర్‌ఫ్లయ్: 1. శివరామ్ ∙400మీ. మెడ్లీ: 1. కృష్ణకాంత్, 2. నచికేత్. ∙వ్యక్తిగత ఓవరాల్ చాంపియన్‌షిప్: 1. స్టీఫెన్ కుమార్, 2. రజత్ అభిరామ్, 3. కవీశ్. -
విజేత నరేందర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న యూరోపియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్ బండి నరేందర్ సత్తా చాటాడు. ఇటలీలో జరుగుతోన్న ఈ పోటీల్లో పీర్జాదిగూడకు చెందిన నరేందర్ 800మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు. ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన వెన్ పీటర్ రజతాన్ని గెలుచుకోగా... రష్యా స్విమ్మర్ బుచర్ రాబర్ట్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈ క్రీడల్లో నరేందర్ స్విమ్మింగ్‌తో పాటు ఆర్చరీలోనూ రాణిస్తున్నాడు. ఆర్చరీలో అతను రెండోరౌండ్ పోటీలకు అర్హత సాధించాడు. -
స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: సీఐఎస్సీఈ రీజినల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన బాలికల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ (కింగ్‌కోఠి) స్విమ్మర్ పి. స్తుతిశ్రీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో శుక్రవారం జరిగిన పోటీల్లో ఆమె 4 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అండర్–19 బాలికల 100మీ. ఫ్రీస్టయిల్, 200మీ. ఫ్రీస్టయిల్, 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్, 200మీ. బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లలో స్తుతి విజేతగా నిలిచింది. వీటితో పాటు ఆమె వ్యక్తిగత విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆమెతో పాటు ఆర్. పూర్వి పతకాల పంట పండించింది. 400మీ. ఫ్రీస్టయిల్, 200మీ. బటర్‌ఫ్లయ్, 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి 3 పసిడి పతకాలను గెలుచుకున్న పూర్వి... 200మీ. ఫ్రీస్టయిల్లో కాంస్యాన్ని అందుకుంది. కావ్యప్రియ కాంస్యం, రజతం... అయేషా అజీమ్ కాంస్యం... కావ్య యశస్విని స్వర్ణం, రజతం... సారా అజీమ్, నిధి, అవని తలా ఓ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. అండర్–19 బాలికల విభాగంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ (కింగ్‌కోఠి) జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్ లభించింది. అండర్–14 బాలికల విజేతల వివరాలు 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. యుక్త (రమాదేవి పబ్లిక్ స్కూల్), 2. చంద్రముక్త (లిటిల్ ఫ్లవర్ స్కూల్), 3. క్రాంతి గుప్తా (అరబిందో). 100మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. రాబియా అరస్తు (నాసర్‌స్కూల్), 2. తన్వీ (ఇండియన్ బ్లోసమ్), 3. డింపుల్ (అభ్యాస). 100మీ. ఫ్రీస్టయిల్: 1. దిశా కుమారి (ఫ్యూచర్ కిడ్స్). 50మీ. ఫ్రీస్టయిల్: 1. దిశా కుమారి (ఫ్యూచర్ కిడ్స్). -
విజేతలు సచిన్, ప్రహర్షిత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ యూత్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సచిన్ సాత్విక్, ప్రహర్షిత విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని డాల్ఫిన్ స్విమ్మింగ్‌పూల్ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో గ్రూప్–8 బాలుర విభాగంలో సచిన్... గ్రూప్–3 బాలికల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో ప్రహర్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. సచిన్ సాత్విక్ లక్ష్యాన్ని అందరికన్నా ముందుగా 32.19సెకన్లలో పూర్తి చేయగా... ఉదయ 37.09 సెకన్లలో చేరుకొని రజతాన్ని అందుకున్నాడు. రిషికేశ్ (41.16సె.) కాంస్యాన్ని గెలుచుకున్నాడు. బాలికల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో ప్రహర్షిత (28.03సె.), హేమ వర్షిణి (28.60సె.), శ్రీజని (29.78సె.) వరుసగా పసిడి, రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. బాలికల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో అనిక్ 33.66 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని చాంపియన్‌గా నిలిచింది. సమీక్ష (33.69సె.), అవని (56.85సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఫ్రీస్టయిల్ విభాగంలో శ్రీజన్ (23.40సె.), ప్రహర్షిత (23.84సె.), తనీష అండ్ హేమవర్షిణి (23.94సె.)... బటర్‌ఫ్లయ్ విభాగంలో ప్రణవి (29.94సె.), లక్ష్య (36.26సె.), టియారా (36.35సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అక్వాటిక ఫినోమినన్ వ్యవస్థాపకులు సందీప్, సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమ ప్రకాశ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. -
రాష్ట్ర స్విమ్మింగ్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను ఆదివారం ప్రకటించారు. 19 మంది చొప్పున బాలబాలికల జట్లకు ఎంపికయ్యారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈనెల 26 నుంచి 30 వరకు జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. జట్ల వివరాలు గ్రూప్–1 బాలురు: ఎస్. రుత్విక్ నాగిరెడ్డి (టీఎస్ఏ), డి. కల్యాణ్, అభిలాష్ (ఖమ్మం), హేమంత్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, విశ్వాస్‌రెడ్డి (రంగారెడ్డి), సాకేత్ (హైదరాబాద్), టి. సాయి తరుణ్ (కరీంనగర్); బాలికలు: ప్రణతి, హంసిని (హైదరాబాద్), జాహ్నవి, ఇష్వి మతాయ్ (రంగారెడ్డి). గ్రూప్–2 బాలురు: సాయి నిహార్ రెడ్డి, అభిషేక్ (రంగారెడ్డి), త్రిషుక్ (వరంగల్), ఎం. హనుమాన్ (హైదరాబాద్); బాలికలు: కాత్యాయని, మెహ్రూష్, సంస్కృతి (హైదరాబాద్), సంజన, వృతి అగర్వాల్ (రంగారెడ్డి), ఆస్తా (టీఎస్ఏ), రిత్విక (నిజామాబాద్). గ్రూప్–3 బాలురు: ఎం.సుహాస్ ప్రీతమ్ (హైదరాబాద్), అక్షిత్ (రంగారెడ్డి); బాలికలు: రాజ్ శ్రీలాస్య, సుదీక్ష (రంగారెడ్డి), మోక్షిత (హైదరాబాద్). గ్రూప్–4 బాలురు: అభయ్, యశస్వి, నమన్ (రంగారెడ్డి), గౌతమ్ శశివర్ధన్ (హైదరాబాద్); బాలికలు: వెన్నెల, శ్రీనిత్య (రంగారెడ్డి), అదితి (హైదరాబాద్). -
ఇష్వికి స్వర్ణం, రెండు రజతాలు
దుండిగల్: తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇష్వి మతాయ్ సత్తా చాటింది. బౌరంపేటలోని జీయాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో ఒక స్వర్ణం, రెండు రజతాలు సహా మొత్తం 3 పతకాలను గెలుచుకుంది. శుక్రవారం జరిగిన బాలికల 200మీ. విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్న ఇష్వి... 50మీ., 100మీ. విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. బాలుర విభాగంలో యశ్వంత్ రెడ్డి ‘బెస్ట్ స్విమ్మర్’ అవార్డును అందుకున్నాడు. రంగారెడ్డి జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, ‘పెటా’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాఘవ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. -
సురేంద్రకు నాలుగు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆగాఖాన్ అకాడమీకి చెందిన స్విమ్మర్ సురేంద్ర సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ టోర్నీలో 4 స్వర్ణాలు, ఒక రజతాన్ని కైవసం చేసుకున్నాడు. 50 మీ. బ్యాక్‌స్ట్రోక్, 100 మీ. బ్యాక్‌స్ట్రోక్, 50 మీ. బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లలో సురేంద్ర పసిడి పతకాలను సాధించాడు. 4/50 మీ.మెడ్లీలో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకున్నాడు. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన రామ్‌శంకర్ రజత, కాంస్యాలను సాధించాడు. 50మీ. ఫ్రీస్టయిల్లో రెండో స్థానంలో నిలిచిన శంకర్, 4/50 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గ్లెన్డేల్ అకాడమీకి చెందిన స్విమ్మర్ శివ యాదవ్ స్వర్ణ, రజతాలను సొంతం చేసుకున్నాడు. 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో శివ చాంపియన్‌గా నిలిచాడు. 4/50 ఫ్రీస్టయిల్ రిలేలో రెండో స్థానం తో సరిపెట్టుకున్నాడు. సాధన ఇన్ఫినిటీ ఇంటర్నే షల్ స్కూల్‌కు చెందిన సందీప్ 50మీ. బ్యాక్‌స్ట్రోక్, 4/50 మీ. మెడ్లీలో రన్నరప్‌గా నిలిచి రెండు రజతాలను దక్కించుకున్నాడు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సిద్ధార్థ మూడు కాంస్యాలు, ఒక రజతాన్ని సాధించాడు. 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్, 50మీ. ఫ్రీస్టయిల్, ఫ్రీస్టయిల్ రిలేలో మూడోస్థానంలో నిలిచిన సిద్ధార్థ... 4/50 మీ. మెడ్లీ రిలేలో రజతాన్ని గెలుచుకున్నాడు. -
అఫ్సర్, అజిత్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మొహమ్మద్ అఫ్సర్, అజిత్ విజేతలుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో ఆదివారం 30–34 వయో విభాగంలో జరిగిన 400 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్‌ను అఫ్సర్ 6ని. 56.70సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని సాధించాడు. రాజు (7ని.18.03సె.) రజతాన్ని దక్కించుకున్నాడు. 35–39 వయో విభాగంలో జరిగిన 400 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో అజిత్ (6ని.2.29సె.), బిశాల్ (7ని.31.30సె.), మొహమ్మద్ యూనస్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కుమారస్వామికి నాలుగు పతకాలు పురుషుల 54–59 వయో విభాగంలో కడియాల కుమారస్వామికి నాలుగు పతకాలు వచ్చాయి. 50 మీటర్ల బటర్‌ఫ్లైలో స్వర్ణం, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్యం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజతం సాధించారు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం అధ్యక్షులు బజ్రంగ్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఇతర వయోవిభాగాల విజేతలు ∙400 మీ. ఫ్రీస్టయిల్: 90+ పురుషులు: 1. గులామ్. 25–29 మహిళలు: 1. తంజిల్లా మౌల్వి, 2. ఎం. అనిత. 25–29 పురుషులు: 1. నష్కార్, 2. సీహెచ్. మహేశ్, 3. ఎం. మహేశ్. ∙30–34 మహిళలు: 1. షేక్ సాజిదా. 40–44 పురుషులు: 1. శంకర్, 2. విశ్వనాథ్, 3. కుమారస్వామి; మహిళలు: 1. పి. రమాదేవి. ∙ 50 మీ. బటర్‌ఫ్లై: 50–54 పురుషులు: 1. జాకబ్, 2. శ్రీనివాస్ రెడ్డి, 3. ముకర్రమ్ ఖాన్. 55–59 మహిళలు: 1. విజయలక్ష్మి. , , -
స్వర్ణాలు నెగ్గిన రవి, సురేంద్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాస్టర్స్ స్విమ్మిం గ్ చాంపియన్‌షిప్‌లో సురేంద్ర అదరగొట్టాడు. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో నాలుగు పసిడి పతకాలతో సత్తా చాటాడు. 50, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో విజేతగా నిలిచిన సురేంద్ర... 50 మీటర్ల బటర్‌ఫ్లయ్, ఫ్రీస్టయిల్ విభాగాల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే టోర్నీలో నగరానికి చెందిన సందీప్, శివ యాదవ్, రవి కుమార్ పతకాల పంట పండించారు. సందీప్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లలో విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను కొల్లగొట్టాడు. శివ యాదవ్ 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో చాంపియన్‌గా నిలిచి రెండు పసిడి పతకాలను సొంతం చేసుకున్నాడు. రసూల్‌పురాకు చెందిన మరో స్విమ్మర్ సిలివేరి రవి కుమార్ స్వర్ణం, రెండు రజతాలను గెలుచుకున్నాడు. 25–29 వయో విభాగంలో బరి లోకి దిగిన రవికుమార్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడిని అందుకున్నాడు. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో రజతాలను కైవసం చేసు కున్నాడు. ఈ విజయాలతో వీరు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టు కర్నూలులో అక్టోబర్ 28, 29 తేదీల్లో జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. -
కుమారస్వామికి నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ కుమారస్వామి సత్తా చాటాడు. మాస్టర్స్ అక్వాటిక్ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డిలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి టోర్నీ లో స్వర్ణం, రెండు రజతాలు, కాంస్యంతో కలిపి మొత్తం 4 పతకాలను కొల్లగొట్టాడు. 55–59 వయో విభాగంలో బరిలోకి దిగిన కుమారస్వామి 200మీ. వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు. 100మీ. బ్యాక్‌స్ట్రోక్, 50మీ. బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లలో రన్నరప్‌గా నిలిచి రెండు రజతాలను సొంతం చేసుకున్నారు. 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో మూడోస్థానంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. -
ఓవరాల్ చాంప్ సెయింట్ జోసెఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠి జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో సీనియర్స్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ బాలికల కేటగిరీలో మొత్తం 9 స్కూల్స్ పాల్గొనగా 38 పాయింట్లతో సెయింట్ జోసెఫ్ అగ్రస్థానంలో నిలిచింది. నాసర్ బాలికల స్కూల్ 25 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. సోమవారం జరిగిన సీనియర్ బాలికల 4–100మీ. రిలేలో సెయింట్ జోసెఫ్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. నాసర్ జట్టు రజతాన్ని గెలుచుకోగా, అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు జూనియర్ బాలికల కేటగిరీలో విశాఖపట్నంకు చెందిన సెయింట్ జాన్స్ పరీశ్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండియన్ బ్లోసమ్స్ స్కూల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రీజియన్ సంయుక్త కార్యదర్శి యు. సుందరి, కార్యదర్శి మారుతి ప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేశారు. బాస్కెట్‌బాల్‌లోనూ టైటిల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లోనూ సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి జట్టు విజేతగా నిలిచింది. హబ్సిగూడ డివిజన్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి జట్టు 45–34తో ఫ్యూచర్కిడ్స్పై గెలుపొందింది. -
ఏపీ స్విమ్మర్లకు రెండు స్వర్ణాలు
పుణే: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణాలు, తెలంగాణకు ఒక కాంస్యం లభించాయి. గ్రూప్–4 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్)... గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్) పసిడి పతకాలు గెలిచారు. సామదేవ్ 33.30 సెకన్లలో... లోహిత్ 2 నిమిషాల 23.95 సెకన్లలో తమ రేసులను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందారు. గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో తెలంగాణ స్విమ్మర్ వై. జశ్వంత్ రెడ్డి 1ని:03.92 సెకన్లలో రేసును ముగించి కాంస్యం గెలిచాడు. -
ప్రకాశ్‌కు పసిడి
న్యూఢిల్లీ: మలేసియా ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ మెరిశాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ప్రకాశ్ పసిడి పతకం గెలిచాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో ప్రకాశ్ ఒక నిమిషం 58.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి.