Tapsee
-
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
సినిమా ఇండస్ట్రీ వాళ్ల చుట్టే తిరుగుతోంది: స్టార్ హీరోయిన్ కామెంట్స్
మొదట దక్షిణాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి పాపులరిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కలిసి నటిస్తోన్న తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా అవతారం ఎత్తి 'వీక్ ధక్' అనే హిందీ చిత్రాన్ని నిర్మించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ ప్రస్తుత సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతోందని విమర్శించింది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇది చాలా విచారించదగ్గ విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఓ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు సహనటుల అర్హత ఏమిటన్నది చూడనని చెప్పింది. అయితే స్టార్స్‌తో లేని చిత్రాలను ఓటీటీలోకి నెట్టాలని చూస్తున్నారని, అలాంటి భావన సినిమాకు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను మరుగున పడేస్తున్నాయని.. ఈ పరిస్థితి మారాలని తాప్సీ పేర్కొంది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) -
నా విజయాల ఖరీదు చాలా ఎక్కువ: తాప్సీ
తన విజయాల ఖరీదు చాలా ఎక్కువ అంటోంది తాప్సీ. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ రాణిస్తోంది ఈ అమ్మడు. అయితే తొలి రోజుల్లో నటిగా పునాది వేసింది, నిలబెట్టింది, పేరు తెచ్చిపెట్టిండి మాత్రం టాలీవుడే. ఆ తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. అలాంటి తరుణంలో బాలీవుడ్ నుంచి పింక్ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస విజయాలతో అవకాశాలను కొల్లగొడుతోంది. అలాంటి ఈ టాప్ హీరోయిన్ తాజాగా తన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఒక భేటీలో పేర్కొంటూ.. తన మనసులోని భావాలు పంచుకోవడానికి కెరీర్ ప్రారంభంలో ఎవరూ ఉండేవారు కాదని చెప్పింది. అంతా సీనియర్లేనని, దీంతో దూరంగా ఉండే వారి చరిత్రలోనూ చూస్తూ నటిగా పరిణితి పెంచుకుంటూ వచ్చానని వెల్లడించింది. అయితే తాను తన ఇష్టానుసారమే నడుచుకున్నానని, ఈ రంగంలోకి ఎవరికివారు తమ సొంత ఫార్ములాతో రావాలని సూచించింది. కష్టానికి, విజయానికి కచ్చితంగా ఖరీదు ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు తాను తలుపు తెరుచుకుని కాలు బయట పెట్టగానే ఎన్నో కళ్లు తనను వెంటాడతాయంది. ప్రతి నడవడికను గమనిస్తారని, అందుకే తాను చాలా జాగ్రత్తగా తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం నటిగా మంచి స్థాయిలో ఉన్నానని, అయితే ఇందుకు చెల్లించిన ఖరీదు అధికమేనని తాప్సీ పేర్కొంది. -
షారుక్ ఖాన్ కోసం ముంబైలో పంజాబ్ సెట్!
హీరో షారుక్ ఖాన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా నటిస్తున్న ‘పటాన్’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్ చేస్తున్న సినిమా కూడా ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయింది. ఈ రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి(‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, 3 ఇడియట్స్, పీకే’ ఫేమ్) దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందన్నది బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో పంజాబ్ లొకేషన్ సెట్స్ వేశారు చిత్ర యూనిట్. దాదాపు ఇరవై రోజులు ఇక్కడే షూటింగ్ జరుగుతుందట. ఆ తర్వాత విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారు షారుక్ అండ్ కో. అక్రమంగా పాస్‌పోర్టులు పొంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్. -
మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు. -
'మిషన్ ఇంపాజిబుల్' కోసం 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్' సందడి..
Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. చాలా కాలం తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. తాజాగా మంగళవారం (మార్చి 15) మిషన్ ఇంపాజిబుల్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇందులో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్లో తాప్సీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో మాఫీయ డాన్ దావుద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారనేది ఆసక్తిగా ఉంది. 'దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ. 50 లక్షలు ఇస్తారట, వాటిని తీసుకెళ్లి రాజమౌలికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఈ చిన్నారులను 'మీ పేరేంటి అని రిషబ్ అడగ్గా.. 'రఘుపతి.. రాఘవ.. రాజారామ్..' 'ఆర్ఆర్ఆర్' అని సమాధానం ఇస్తారు. తర్వాత ఆ చిన్నారులు తిరిగి మీ పేర్లేంటీ అని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి.. 'ఖలీల్.. జిలానీ.. ఫారూక్' 'కేజీయఫ్' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. -
తెర మీదే అయినా... తగ్గేదే లే!
సినిమాలో ఆటా (డ్యాన్స్) పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు. ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం. గ్లామర్‌కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్ షబానా, సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ తదితర హిందీ చిత్రాలతో కెరీర్ ఇన్నింగ్స్‌ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’లో క్రికెటర్‌గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్ ఉంటారు. నాలోని బెస్ట్‌ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్’’ అని గత ఏడాది టీచర్స్ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇక అచ్చంగా మిథాలీ రాజ్‌లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్ షూట్‌కి ముందు నేను మిథాలీ రాజ్‌తో మాట్లాడాను. పోస్టర్ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది. ఇక బాలీవుడ్లో ఉన్న మరో గ్లామరస్ హీరోయిన్ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ‘ఎన్‌హెచ్ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్ తర్వాత ఓ చాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో అనుష్క నటిస్తున్నారు. ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ టైటిల్‌తో ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్ నచ్చి, ‘ఎన్‌హెచ్ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్ క్రికెటర్‌గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్ గురించి కూడా చెబుతుంది. క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్ యాభైకి టచ్ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్ కూడా లేని జాన్వీ కపూర్ కూడా క్రికెట్ బ్యాట్‌తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్‌ని జాన్వీ అంగీకరించడం విశేషం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్ చేశారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్ చేసి, ‘‘క్రికెట్ క్యాంప్.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘శభాష్ మిథు’, ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకుంటారని చెప్పొచ్చు. -
గ్రహాంతర తాప్సీ!
కిక్ ఇచ్చే కాన్సెప్ట్ దొరికితే కాదనుకుండా పచ్చజెండా ఊపేస్తారు నటీనటులు. తాప్సీ ఇటీవల అలా కిక్ ఇచ్చే కాన్సెప్ట్ విన్నారట. చెప్పింది తమిళ దర్శకుడు భరత్ నీలకంఠన్. రెండేళ్ల క్రితం ‘కే 13’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు భరత్. తాజాగా ఆయన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు కథ రాసుకున్నారట. ఇందులో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో ఏలియన్స్ ప్రస్తావన ఉంటుందట. ఈ గ్రహాంతర వాసుల కథ వినగానే తాప్సీ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నారని సమాచారం. బహు భాషల్లో ఈ సినిమా చేయడానికి భరత్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సాంకేతిక నిపుణులనే తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ మూవీగా తీయాలన్నది టీమ్ ఆశయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందట. ఈ ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణను ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది. -
రాణీ కశ్యప్ కథేంటి?
ఓ హత్య జరిగింది. కానీ ఈ మర్డర్ ఎలా? ఎందుకు జరిగింది? కథేంటి అనేది తాను నటించిన హిందీ చిత్రం ‘హసీన్ దిల్రుబా’లో చూడమని చెబుతున్నారు తాప్సీ. ఈ చిత్రానికి వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్ మెస్సీ, హర్షవర్థన్ రాణే కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రం జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి గత ఏడాది ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇందులో రాణీ కశ్యప్ పాత్రలో కొత్తగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’’ అన్నారు తాప్సీ. -
రష్మీ: ది రాకెట్.. మూడు రకాల లుక్స్‌లో తాప్సీ!
క్రీడల నేపథ్యంలో సాగే చిత్రాలు చేస్తూ తాప్సీ దూసుకెళుతున్నారు. ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా, ‘సాండ్ కీ ఆంఖ్’లో షూటర్‌గా ఈ బ్యూటీ కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘రష్మీ: ది రాకెట్’ చిత్రం కోసం అథ్లెట్‌గా (రన్నర్), ‘శభాష్ మిథు’ (క్రికెట్ క్రీడాకారణి మిథాలీరాజ్ బయోపిక్) సినిమా కోసం క్రికెటర్‌గా మారారు తాప్సీ. ‘రష్మీ: ది రాకెట్’ సినిమా షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రంలో తాప్సీ మూడు రకాల లుక్స్‌లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా, ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్ అయిన క్రీడాకారిణిగా, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణిగా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. ఈ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాస్ట్యూమ్ టీమ్. ఈ మూడు లుక్స్ తాప్సీ అభిమానులకు త్రిబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ‘శభాష్ మిథు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘రన్ లోలా రన్’, ‘దోబార’, తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా.. ఇలా తాప్సీ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాల చిత్రీకరణల్లో భాగంగా రోజుకి 18 గంటలు పని చేశారట తాప్సీ. అంకితభావానికి చిరునామా తాప్సీ అని ఆయా చిత్రబృందాలు అభినందిస్తున్నాయి. చదవండి: డైరెక్టర్ శంకర్‌కు లైకా సంస్థ షాక్! -
‘నీ పని చూసుకో’...
న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ మథియాస్ బో (డెన్మార్క్)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్‌గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్ బో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్ ఓపెన్‌లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్‌లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్ చేయడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన 40 ఏళ్ల మథియాస్ బో 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. పీబీఎల్‌లో పుణే ఏసెస్ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్ యజమాని తాప్సీతో మథియాస్‌కు సాన్నిహిత్యం ఉంది. -
తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ గురి
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ నివాసాల్లో బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కశ్యప్ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్ పాంథమ్ ఫిల్మ్ భాగస్వాములుగా ఉన్న వారందరిపైనా ఆదాయ పన్ను శాఖ దాడులకు దిగింది. అనురాగ్ కశ్యప్ మరికొందరితో కలిసి పాంథమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొన్ని చిత్రాలను నిర్మించారు. 2018లో ఈ ప్రొడక్షన్ కంపెనీని మూసేశారు. ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న దర్శక నిర్మాత విక్రమాదిత్య, నిర్మాత వికాస్ బహల్, నిర్మాత పంపిణీదారుడు మధుమంతేనాలపై దాడులు చేశారు. ఏకకాలంలో ముంబై, పుణేలోని 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి సహ ప్రచారకుడిగా వ్యవహరించినందుకే మధు మంతేనా నివాసంలో సోదాలు నిర్వహించినట్టుగా ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పినందుకేనా ..? ఇటీవల కాలంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తాప్సీ పలు ట్వీట్లు చేశారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తిపోయినప్పుడు కశ్యప్ జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లను సందర్శించి తన సంఘీభావం ప్రకటించారు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేయడానికే ఈ సోదాలు జరిపారని మహారాష్ట్ర మంత్రులు ఆరోపణలు గుప్పించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ శాఖ వంటివన్నీ ప్రభుత్వ వ్యతిరేకుల్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తూ ఉంటాయని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. నిజాలు మాట్లాడే వారిపై ఒత్తిడిని పెంచి వారిని మాట్లాడనివ్వకుండా కేంద్రసర్కార్ చేస్తోందని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఆరోపించారు. -
ఏడు నిముషాల పాత్రే.. కానీ ఎంత పేరు
‘‘సినిమాలో మీ పాత్ర నిడివి ఎంత అనేది ఆలోచించొద్దు. ఆ పాత్ర ఎంత ప్రభావితం చేస్తుందో మాత్రమే ఆలోచించండి’’ అని కొత్త హీరోయిన్లకు ఓ సలహా ఇచ్చారు తాప్సీ. ఈ బ్యూటీ ఇలా అనడానికి ఓ కారణం ఉంది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘బేబీ’ విడుదలై శనివారం (జనవరి 23)తో ఆరేళ్లయింది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ పాత్ర నిడివి కేవలం ఏడు నిమిషాలే. కానీ ఆమెకు మంచి పేరొచ్చింది. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘ఏ ఆర్టిస్ట్ అయినా స్క్రీన్ మీద కనిపించే నిమిషాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే చాలు. అది తక్కువసేపే అయినా కెరీర్‌కి మంచి మలుపు అవుతుంది. ‘బేబీ’ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో నేను చేసిన 7 నిమిషాల షబానా ఖాన్ పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపు అయింది’’ అన్నారు. ఈ సినిమాలో హీరోగా చేసిన అక్షయ్ కుమార్ ‘‘నువ్వు చెప్పింది కరెక్ట్. నిన్ను, నీ కెరీర్ సాగుతున్న విధానాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని తాప్సీని ఉద్దేశించి అన్నారు. ‘బేబీ’ తర్వాత తాప్సీ బాలీవుడ్లో ‘పింక్’ సినిమాలో నటించారు. ఆరేళ్లుగా హిందీలో బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. -
ఆఖరి రౌండ్
పరుగు పందెంలో ఆఖరి రౌండ్‌కి వచ్చేశారు రష్మి.. ఫలితం ఏమైందన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మి రాకెట్’. ఇందులో రష్మి అనే రన్నర్ పాత్రలో తాప్సీ కనిపిస్తారు. ఆఖర్ష్ ఖురానా దర్శకుడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం అయింది. ఫిబ్రవరి వరకూ సాగే ఈ షెడ్యూల్‌తో ‘రష్మి రాకెట్’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో అథ్లెట్‌గా కనిపించడం కోసం శరీరాకృతిని మొత్తం మార్చుకున్నారు తాప్సీ. కఠినమైన వ్యాయామాలు చేశారు. స్ట్రిక్ట్ డైట్ పాటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
నైన్త్లోనే ప్రేమలో పడ్డ టాప్ హీరోయిన్!
తొలి ముద్దు, తొలి ప్రేమ ఎప్పుడు గుర్తు చేసుకున్నా తెలియని అనుభూతికి లోనవడం సహజం. సామాన్యులకు అయినా సెలబ్రిటీలకైనా ఆ ఫీలింగ్ ఒకేలా ఉంటుంది. ఇటీవల ఓ సందర్భంలో తాప్సీ ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తాప్సీ ప్రేమలో పడ్డారట. వన్ ఫైన్ డే బాయ్‌ఫ్రెండ్ దగ్గర ఆ విషయం చెప్పారట కూడా. మొదట ఆ అబ్బాయి తనకు ఇష్టమే అని చెప్పి, తాప్సీని మురిపించాడు. కొన్నాళ్లకు నేను బాగా చదువుకోవా లని చెప్పి తాప్సీకి దూరంగా ఉండ టం మొదలుపెట్టాడు. ఈ బ్యూటీ ఫస్ట్ క్రష్ అలా మటాష్ అయింది. ఆ అబ్బాయిని మిస్సయిన తాప్సీ ఫోన్బూత్కు వెళ్లి అతనికి కాల్ చేసి ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. టీనేజ్‌లో ఏర్పడిన ఆ ప్రేమ గురించి ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తుందని తాప్సీ అన్నారు. -
రన్ రష్మీ రన్
రన్నింగ్ ట్రాక్‌లో రాకెట్లా దూసుకెళ్లాలి అంటే గ్రౌండ్లో గంటలు తరబడి కష్టపడాల్సిందే. ప్రస్తుతం అదే చేస్తున్నారు తాప్సీ. ‘రష్మి రాకెట్’ సినిమాలో రన్నర్‌గా కనిపించనున్నారామె. ఆకర్‡్ష ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడాకారిణి శరీరాకృతి కోసం ఆల్రెడీ డైట్‌ను పూర్తిగా మార్చేశారు తాప్సీ. తాజాగా గ్రౌండ్లో శిక్షణకు దిగారు. ఈ పాత్రకు సంబంధించిన శిక్షణలో భాగంగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు తాప్సీ. ‘రష్మి పాత్ర కోసం ఎగరడం, దూకడం, పరిగెత్తడం, స్కిప్పింగ్... అన్నీ చేస్తున్నాను. ఈ పాత్ర నా మీద కన్నా నా కండరాల మీద తీపి గాయాలు చేస్తోంది’’ అన్నారు తాప్సీ. -
హీరో భార్యకి నచ్చలేదని నన్ను తప్పించారు
హిందీ సినిమా ‘పింక్’ తర్వాత దాదాపు శక్తిమంతమైన పాత్రలే చేస్తున్నారు తాప్సీ. తెర మీద అన్యాయాలను ఎదిరించే ధైర్యం ఉన్న అమ్మాయి పాత్రలు చేస్తున్న ఆమె తెరవెనక కూడా తన మనసులోని మాటలను ధైర్యంగా చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో చెప్పారామె. తాజాగా కొన్ని విషయాలను బయటపెట్టారు. అయితే తాను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ల పేర్లను బయటపెట్టకుండా ‘ఆ హీరో’ అని సంబోధించారు. తాప్సీ మాట్లాడుతూ – ‘‘గతంలో ఓ హీరో భార్యకు నేను ఆ సినిమాలో నటించడం ఇష్టం లేకపోవడంతో నన్ను తప్పించి, వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇంకో సినిమాకైతే హీరోకి నా డైలాగ్ నచ్చలేదు. దాంతో మార్చమన్నాడు. కానీ నేను తిరస్కరించాను. ఆ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. కానీ నేను డైలాగ్ మార్చడానికి తిరస్కరించడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో చెప్పించారు. అలాగే ఒక హీరో సరసన సినిమా కమిట్ అయ్యాక, ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమా బాగా ఆడలేదని బడ్జెట్ కంట్రోల్ చేయాలని నా పారితోషికం తగ్గించుకోమన్నారు. ఇంకో హీరో అయితే నా ఇంట్రడక్షన్ సీన్‌ని మార్చాలని కోరాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్ సీన్‌ని డామినేట్ చేసే విధంగా ఉందని ఆ హీరోకి అనిపించిందట. ఇవన్నీ కూడా నా ముందు జరిగిన విషయాలు. ఇక వెనక ఎలాంటివి జరిగి ఉంటాయో’’ అన్నారు తాప్సీ. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడా తగ్గడంలేదని తాప్సీ చెబుతూ – ‘‘కొన్నాళ్లుగా నాకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమాలనే ఒప్పుకుంటున్నాను. అయితే కొందరు నా నిర్ణయం సరికాదన్నారు. ఇక ఎవరైనా హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే చాలు... ఆమెను హీరోలు తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి వెనకాడతారు. ఏది ఏమైనా నాకు తృప్తినిచ్చే సినిమాలే చేయాలంటే ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేయడంవల్ల ప్రతిరోజూ నేను ఆనందంగా ఉంటాను’’ అన్నారు. హిందీలో నామ్ షబానా, బద్లా, సాండ్ కీ ఆంఖ్, థప్పడ్.. ఇలా వరుసగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నారు తాప్సీ. ప్రస్తుతం హిందీలో చేస్తున్న ‘హసీన దిల్ రుబా’, ‘రష్మీ రాకెట్’ చిత్రాలు కూడా ఆ కోవకి చెందినవే. ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. -
ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు
'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ పన్ను. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో సడన్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తూ బిజీబిజీగా మారారు. ప్రస్తుతం ఆమె "రష్మి రాకెట్" చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోకస్ పెడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె బుధవారం నాడు ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాప్సీ.. సినిమా షూటింగ్లో భాగంగా హెల్మెట్ పెట్టుకోకుండా బుల్లెట్ నడుపుతున్నారు. కానీ ఇది పోలీసుల కంట పడటంతో ఫొటో కొట్టి ఆమెకు ఫైన్ విధించారు. (చదవండి: చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే: కథానాయికలు) ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. "ఛలానా విధిండానికి ముందు.." అంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ సైతం జోడించారు. అయితే ఇది వెనక నుంచి తీసిన ఫొటో కావడంతో అక్కడు ఉన్నది తాప్సీనే అని గుర్తుపట్టడం కాస్త కష్టంగా ఉంది. ఇక తాప్సీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆమె విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమాలో నటించారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ‘రష్మి రాకెట్’ చిత్రం కోసం కేటాయిస్తున్నారు. (చదవండి: ఎన్నో అవమానకర పరిస్థితులు చూశా: తాప్సీ) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
సవాల్‌కి సై
కథని బట్టి కథలోని పాత్రను బట్టి నటీనటులకు కసరత్తు ఉంటుంది. కొన్ని అవలీలగా చేసేవి ఉంటాయి. కొన్ని కష్టపడి చేసేవి ఉంటాయి. కొన్నింటికి శారీరక శ్రమ ఉంటుంది. మరికొన్నింటికి మానసిక శ్రమ. ఏ పాత్రకు సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. పాత్ర ఎంత ఛాలెంజ్ చేస్తే అంత శ్రమిస్తారు. ప్రస్తుతం కొన్ని పాత్రల కోసం కొందరు హీరోయిన్లు శారీరకంగా శ్రమిస్తున్నారు. కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. కొత్త టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు. సుకుమారి భామలు చేస్తున్న కఠోర కసరత్తులు గురించి తెలుసుకుందాం. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు కాజల్. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్య కళరి పయ్యట్టు నేర్చుకుంటున్నారామె. ఇందులో ఆమె పలు ఫైట్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారట. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఇందులో ఈ ఇద్దరూ హాకీ ప్లేయర్స్ పాత్రలో కనిపించనున్నారు. హాకీ ప్లేయర్‌గా కనిపించడానికి చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు కొన్నిరోజుల పాటు హాకీ నేర్చుకున్నారు లావణ్యా త్రిపాఠి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘సీటీమార్’ సినిమా కోసం తమన్నా కబడ్డీ మెళకువలు తెలుసుకున్నారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ ‘సీటీమార్’. ఇందులో కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ‘రష్మీ రాకెట్’ అనే స్పోర్ట్స్ సినిమా చేస్తున్నారు తాప్సీ. ఈ సినిమాలో రన్నర్ పాత్రలో కనిపించనున్నారామె. ఇందుకోసం తన డైట్‌ని మొత్తం మార్చేశారు తాప్సీ. రన్నర్ లుక్ కోసం, రన్నర్‌గా మారడానికి ఫిట్నెస్ మీద మరింత దృష్టిపెట్టారామె. మరింత చురుకుగా పరిగెత్తడం నేర్చుకుంటున్నారట. ‘తేజస్’ అనే హిందీ సినిమాలో పైలట్‌గా కనిపించనున్నారు కంగనా రనౌత్. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారు. త్వరలోనే పైలట్ ట్రైనింగ్ తరగతులకు కూడా హాజరు కానున్నారట. వచ్చే ఏడాది సూపర్ హీరోయిన్గా మారనున్నారు కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ సూపర్ హీరోయిన్ మూవీ చేయనున్నారు. ఇందులో భారీ యాక్షన్ ఉంటుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా మొదలెట్టారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. చాలావరకు గ్లామరస్ రోల్స్ చేసే కథానాయికలు అవకాశం వచ్చినప్పుడల్లా ‘యాక్షన్’ పాత్రల్లో రెచ్చిపోతుంటారు. ఎంతైనా కష్టపడతారు. వీళ్లంతా ప్రేక్షకుల మెప్పు పొంది, ఫుల్ మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుందాం. -
స్వర్గంలో ఉన్నాను!
కరోనా వల్ల పనికి, ఆ తర్వాత రిలాక్సేషన్ కోసం వెళ్లే పిక్నిక్లకు బ్రేక్ పడింది. అయితే లాక్డౌన్ తీయగానే షూటింగ్ ప్రారంభించేశారు తాప్సీ. విజయ్ సేతుపతితో కలసి ఓ తమిళ సినిమా చేశారామె. జైపూర్‌లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాక వెకేషన్‌కు బయలుదేరారామె. తన సోదరి మరియి స్నేహితులతో కలసి మాల్దీవులు చేరుకున్నారు తాప్సీ. అక్కడ సేద తీరుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారామె. ‘భూమి మీద స్వర్గం ఉంది అంటే అది కచ్చితంగా మాల్దీవులే అనుకుంటా. నెక్ట్స్ కొన్ని రోజులు ఇదే మా ఇల్లు’ అని తాప్సీ అన్నారు. ఈ హాలిడే పూర్తయిన వెంటనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటారామె. హిందీలో ‘రాకెట్ రష్మీ’ అనే సినిమా చేస్తున్నారు తాప్సీ. -
మేము సిద్ధమే అంటున్న హీరోయిన్స్
కథానాయికలంటే గ్లామర్‌కి మాత్రమే.. పాటల్లో కలర్ఫుల్గా కనిపించడానికే... సినిమాల్లో నాయికలకు సీన్లు ఉన్నా కథలో పెద్దంత సీన్ ఉండదు. అందుకే... కథతో పాటుగా ప్రయాణించే పాత్రలు ఇవ్వండి. ఛాలెంజింగ్ పాత్రలు రాయండి.. చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే అంటున్నారు కథానాయికలు. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఆ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ల స్టోరీ ఏంటో చూద్దాం. కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ చాలా రకాల పాత్రలు చేశారు. కానీ తొలిసారి వయసుకు మించిన పాత్రను చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్ 80 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు. కాజల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అంటే.. యంగ్ ఏజ్, ఓల్డేజ్ ఏజ్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమాలో రకుల్ పాత్ర డీ గ్లామరైజ్డ్గా ఉంటుంది కూడా. అంటే మేకప్ లేకుండా కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక శ్రియను మనందరం ఇప్పటి వరకూ అన్నీ పాజిటివ్ పాత్రల్లోనే చూశాం. తనలోని విలన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నెగటివ్ యాంగిల్‌ను చూపించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందులో నితిన్ హీరో. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రియ నటించనున్నారని టాక్. ‘సీటీ మార్’ చిత్రం కోసం కబడ్డీ కోచ్‌గా మారారు తమన్నా. కోచ్ ఎలా ఉండాలి? ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి ఈ పాత్ర చేస్తున్నారు తమన్నా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరో. ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా కనిపించనున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉన్నారట. మాంసాహారం ముట్టుకోలేదు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. పరుగుల రాణిగా మారబోతున్నారు తాప్సీ. ‘రాకెట్ రష్మి’ అనే చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారామె. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం డైట్ మార్చేశారు. వ్యాయామాలు చేస్తూ, రన్నింగ్ మీద దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా గ్రామీణ యువతిగా కనిపిస్తారట. అలానే చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆల్రెడీ చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేయడంతోపాటు గ్రామీణ యువతి హావభావాలను నేర్చుకుంటున్నారట. సమంత ఇటీవలే ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించడానికి అంగీకరించారట. ఈ సినిమాలో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో ఆయనకు జోడీగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పూజా హెగ్డే. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తున్నారు కంగనా రనౌత్. ‘తలైవి’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా కొత్త పాత్రలు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి శారీరకంగా లేదా మానసిక శ్రమను ఇష్టంగా తీసుకుంటున్నారు నాయికలు. ఇలాంటి చాన్స్‌లు అరుదుగా వస్తాయి కాబట్టి నిరూపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. శభాష్ అనిపించుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
డెవిల్స్ ఎట్ వర్క్
మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించాను అన్నారు నటి రాధికా శరత్ కుమార్. దీపక్ సౌందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఓ కామెడీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారామె. విజయ్ సేతుపతి, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఆదివారం చిత్రీకరణలో పాల్గొన్నారు రాధిక. తాప్సీతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసి, ‘డెవిల్స్ ఎట్ వర్క్’ (పనిలో ఉన్న దెయ్యాలు) అని కామెంట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో కొద్దిమంది చిత్రబృందంతో జరుగుతోంది. 80 శాతం చిత్రీకరణ ఇక్కడే పూర్తి చేయనున్నారట. ఏడాది చివరి కల్లా సినిమాను పూర్తి చేస్తారట కూడా. -
ఛలో జైపూర్
ఒకవైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు తాప్సీ. తాజాగా ఓ తమిళ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంది. హీరోగా నటిస్తూ, విలన్ పాత్రలు కూడా చేస్తూ విలక్షణ నటుడు అనిపించుకున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారట. దీపక్ సుందరరాజన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సెప్టెంబర్‌లో జైపూర్‌లో షూటింగ్‌ను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట దర్శక,నిర్మాతలు.