Taxi Drivers
-
డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండి’
ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయడంపై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీటీఏ) 290 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,718 కోట్లు) భారీ జరిమానా విధించింది.డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఉబెర్ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయడం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) ప్రకారం "తీవ్రమైన ఉల్లంఘన" అని డీటీఏ పేర్కొంది. "యూఎస్‌కు డేటా బదిలీకి సంబంధించి ఉబెర్ జీడీపీఆర్ నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనది" అని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఛైర్మన్ అలీడ్ వోల్ఫ్సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్‌లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్, మెడికల్ డేటాను సైతం ఉబెర్ సేకరించిందని డీపీఏ తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్ ఈ సమాచారాన్ని తమ యూఎస్ ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఉబెర్ తెలిపింది. "ఇది లోపభూయిష్ట నిర్ణయం. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనది" అని ఉబెర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
హైవేలపై డ్రైవర్లకు భవనాలు: మోదీ
న్యూఢిల్లీ: ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై తగినంత విశ్రాంతి తదితర సౌకర్యాల నిమిత్తం కొత్త పథకం తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘ఇందులో భాగంగా తొలి దశలో అన్ని సదుపాయాలతో కూడిన 1,000 అధునాతన భవనాలు నిర్మిస్తాం. వాటిలో ఫుడ్ స్టాళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, విశ్రాంతి స్థలాల వంటివిన్నీ ఉంటాయి’’ అని వెల్లడించారు. శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2024లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది ఇందులో కీలక పాత్ర కానుందన్నారు. దేశ మొబైల్ పరిశ్రమకు ఇది స్వర్ణయుగమన్నారు. -
ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!
నంగర్హర్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అక్కడ రోజుకో ఆంక్ష అన్నట్లే ఉంది. ఇప్పటికే ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం.. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లకు పలు ఆంక్షలు విధించింది. ట్యాక్సీల్లో ముష్కరులను ఎవరినైనా తీసుకొస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్లను తాలిబాన్ అనుబంధ సంస్థలకు సంబంధించిన వారిని మినహాయించి ఇతర ముష్కరులను ఎవ్వరిని మీరు ట్యాక్సిల్లో ఎక్కించుకోని తీసుకురావద్దని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) ఆ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ల అందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్మెన్లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తాలిబన్లు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్సులలో మోహరిస్తున్న ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇలాంటి ఆదేశాలు జారిచేసిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) -
ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 5వేలు సాయం
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కొనసాగుతోంది. తొలుత వారం రోజుల పాటు లాక్డౌన్ విధించగా.. మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో మరి కొద్ది రోజులు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలను ఆదుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పేదలకు రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలోని 72 లక్షల రేషన్ కార్డుదారులకు రాబోయే రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా రేషన్ ఉచితంగా అందజేస్తామని, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ తెలిపారు. 2 నెలల పాటు రేషన్ ఉచితంగా ఇస్తామంటే.. లాక్డౌన్ రెండు నెలలు కొనసాగుతుందని అనుకోవద్దని స్పష్టతనిచ్చారు. అలాగే, ఢిల్లీలోని ఆటోరిక్షాలు, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా రూ.5,000 ఆర్ధిక సాయం ప్రకటించారు. కరోనా కాలంలో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్న డ్రైవర్లు ప్రతి ఒక్కరికీ ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు జరపడం కూడా కష్టతరంగా మారింది. శ్మశనాల్లో సామర్థ్యానికి మించి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల కోసం రెండు మూడు రోజులు నీరిక్షించే పరిస్థితి నెలకొంది. చదవండి: సీఎంలకు కేజ్రివాల్ లేఖ: ప్లీజ్ మాకు ఆక్సిజన్ పంపండి -
ట్యాక్సీ డ్రైవర్ ఆత్మహత్య: ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన
బెంగళూరు: డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో విమానశ్రాయంలో టాక్సీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. కర్ణాటక టూరిజం శాఖలో పని చేస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం తన కారులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు డ్రైవర్ బుధవారం ఉదయం మరణించాడు. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు ‘‘బీఎల్‌ఆర్‌ఏ విమానాశ్రయంలో ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నాం. ప్రయాణికులు బీఎంటీసీ బస్సు సేవలను, వ్యక్తిగత వాహనాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం’’ అంటూ ట్వీట్ చేసింది. Taxi services at @BLRAirport have been regularised. Passengers may opt for app-based taxis or BMTC bus services for travel to and from BLR Airport.#taxi #bengaluru #KIAB #bengaluruairport pic.twitter.com/KB55MQ9VBP — BLR Airport (@BLRAirport) March 31, 2021 రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ప్రతాప్ (32) అనే ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రతాప్ బుధవారం ఉదయం మరణించాడు. ఇందుకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయం ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరిస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ప్రతాప్ మృతికి కారణాలు తెలియదు. తీవ్రంగా గాయపడటంతో అతడి వద్ద నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేకపోయాం’’ అని తెలిపాడు. -
పెరిగిన పెట్రో చార్జీలతో మూలనపడ్డ టాక్సీలు
-
ఆటో, టాక్సీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఆటో, టాక్సీ డ్రైవర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అయితే హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ట్యాక్సీ, కారులో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. ఇక ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతి లేదన్నారు. అలాగే తెలంగాణా బస్సులు కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లడానికి అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. (చదవండి : తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్) -
రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం
సాక్షి, బెంగళూరు: బైక్ సేవల సంస్థ రాపిడో డ్రైవర్లపై దాడి చేసి దోచుకున్న ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు డ్రైవర్లను బెదిరించి డబ్బు, మొబైల్, బ్యాంకు కార్డులను ఎత్తుకుపోయారు. ఈ రెండు ఘటనలు సోమవారం ఉదయం బెంగళూరు నగరంలో చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని ధానేశ్వర్ బేకు హోసూర్ రోడ్‌లోని కుడ్లు గేట్ సమీపంలో ని ఘటనలో డ్రైవర్‌ను ఎత్తుకుపోయి మరీ చోరీకి పాల్పడ్డారు. రాపిడో డ్రైవర్ ధనేశ్వర్ (37) యాప్ ద్వారా వచ్చినసమాచారం ప్రకారం కస్టమర్‌ను పికప్ చేసుకునేందుకు సంబంధిత ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న ఒక వ్యక్తి కత్తితో ఎటాక్ చేసి డ్రైవర్ మెడ కోశాడు. అనంతరం రెండు మొబైల్ ఫోన్లు, రూ .1200 నగదుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు, పవర్ బ్యాంక్ లాక్కున్నాడు. అనంతరం ధనేశ్వర్ను బలవంతంగా మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు దుండగులు పొంచి వున్నారు. ఈ ముగ్గురూ కలిసి ధనేశ్వర్ను కొట్టి మరీ ఏటీఎం కార్డు పిన్ అడిగి రూ .500 డ్రా చేశారు. గూగుల్ పే ద్వారా రూ .165 బదిలీ చేయమని బలవంతం చేశారు. అక్కడితో ఆగకుండా మరింత డబ్బుకోసం డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఎలాగోలా ధనేశ్వర్ అక్కడినుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన మరో సంఘటనలో, మరో రాపిడో డ్రైవర్ అమల్ సింగ్ (27) ను ముగ్గురు వ్యక్తులు ఇదే విధంగా కత్తితో బెదిరించి, దోచుకోవడం గమనార్హం. పరప్పన అగ్రహార సమీపంలో ఉన్న పికప్ పాయింట్ వద్దకు అమల్సింగ్ చేరుకోగానే, ముగ్గురు సాయుధ వ్యక్తులు అతడిపై మూకుమ్మడిగా దాడిచేసి మొబైల్ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆధార్, పాన్ కార్డు ఉన్న వాలెట్ , ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులే ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’గా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు అందించే రూ.10 వేలు వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. బుధవారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిం దని.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్ని గ్రామ/వార్డు వలంటీర్లకు పంపించామని ఇప్పటి వరకు 74 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులపై పరిశీలన జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో అందిన దరఖాస్తుల్ని ఎంపీడీవోలు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు 45,223 దరఖాస్తుల్ని ఆమోదించారన్నారు. 17,230 దరఖా స్తులకు కలెక్టర్లు మంజూరు అనుమతులిచ్చారని వివరించారు. అధికంగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్ 5న అర్హులైన డ్రైవర్లకు నగదు చెల్లింపుల రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారని చెప్పారు. -
‘ఆర్థిక సాయానికి 25లోగా దరఖాస్తు చేసుకోండి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందజేయనున్న రూ.10 వేలు ఆర్థిక సాయానికి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరూ ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం వెల్లడించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్న సంగతి తెలిసిందే. భార్య, భర్తను ఓ యూనిట్‌గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. వారిని మరో యూనిట్‌గా పరిగణిస్తారు. వారు కూడా ఆర్థిక సాయం పొందడానికి అర్హులేనని రవాణాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. (చదవండి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు) వర్షాలు తగ్గిన తర్వాత 160 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపడుతామని తెలిపారు. 86 వేల దరఖాస్తులు ఆన్లైన్లో.. 40 వేల దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో అందాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లైసెన్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారు కూడా ఈ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణబాబు వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ అవుతుందని చెప్పారు. (వచ్చే నెల 4 నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు) -
ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి.. భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. మొదటి రోజు 7,559 మంది వాహన యజమానులు కమ్ డ్రైవర్లు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటోడ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బీమా, ఫిట్నెస్, మరమ్మత్తుల కోసం ఏడాదికి రూ.10 వేలు అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారుచేశారు. అంతేకాక.. అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణా మంత్రి, అధికారులతో ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సాయంపై కాలపరిమితి నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి పథకానికి దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని, ఇదే నెల 25న దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీగా ఖరారు చేశారు. 30లోగా గ్రామ/వార్డు వలంటీర్లు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 1లోగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని అందిస్తారు. అక్టోబర్ 4 నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీంతో రవాణా శాఖ అధికారులు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దరఖాస్తులను రవాణా శాఖ వెబ్సైట్ (www. aptransport. org), అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు/ఆర్టీవోలు/ఎంవీఐ కార్యాలయాలతో పాటు మీసేవ, సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకునేందుకు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం పొందేందుకు దరఖాస్తుదారులకు గ్రామ/వార్డు వలంటీర్లకు సహకారం అందిస్తారు. 25లోగా రిజిస్ట్రేషన్ అయిన వాటికే వర్తింపు ఇదిలా ఉంటే.. గ్రామ/వార్డు వలంటీర్లు దరఖాస్తుదారుడి నుంచి ఆధార్, తెల్ల రేషన్ కార్డులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ, అకౌంట్ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, మైనార్టీ అయితే) జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం యజమాని వద్ద వాహనం ఉందో లేదో చూడాలి. ఆ తర్వాత దరఖాస్తులను ఎంపీడీవో/సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ కమిషనర్/బిల్ కలెక్టర్లకు పంపిస్తారు. కాగా, సొంత ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుందని రవాణా శాఖ పేర్కొంది. వాహనం భార్య పేరున ఉండి భర్త వాహనం నడుపుతుంటే సాయం భార్యకు వర్తిస్తుందని తెలిపింది. అన్ని రవాణా కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు కాగా, ఈ పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రతి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు రవాణశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రవాణా కమిషనర్ కార్యాలయంలోని సంయుక్త రవాణా కమిషనర్ (ఐటీ) నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటుచేశామన్నారు. ఎంతమంది అర్హులున్నప్పటికీ వారందరికీ ఈ ఆర్థికసాయం వర్తింపజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చినట్లు ఆయన చెప్పారు. -
టూవీలర్లకు ఈ పథకం వర్తించదు : మంత్రి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం టూవీలర్ ట్యాక్సీలకు ప్రస్తుతం వర్తించదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏటా రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందజేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి అర్హులైన టూవీలర్ ట్యాక్సీలకు కూడా ఈ పథకం అమలు చేసే దిశగా ఆలోచిస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్న మంత్రి దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. వాహనాలను ఫైనాన్స్‌లో తీసుకున్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, లబ్దిదారులు కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవాలని కోరారు. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు రావొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్న మంత్రి, ఒకవేళ అంతకు మించి దరఖాస్తులొచ్చినా ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -
రూ. పది వేల సాయానికి అర్హతలివే..
-
రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ
సాక్షి, అమరావతి: ఆటో రిక్షాలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. నేటి (మంగళవారం) నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్సైట్ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్ ఎన్కంబర్డ్) ఖాతాను తెరవాలి. ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్ సాయపడతాడు. ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్ఎంఎస్ డేటాబేస్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు. కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పరిశీలన కోసం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రూ. పది వేల సాయానికి అర్హతలివే.. - ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్ సొంతదై ఉండి, సొంతగా నడుపుకోవాలి. - ఆటో రిక్షా/లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. - సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పన్నుల రశీదులు) సరిగా ఉండాలి. - అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. - దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి. -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని తన పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్ల సాయం అందించనున్నారు. ఈ సాయాన్ని ఈ నెల నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అర్హులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. రేపటి నుంచి (మంగళవారం) అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్లో అందిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు వెళతాయి. అనంతరం వెరిఫికేషన్ కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపుతారు. ఆ తర్వాత సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపజేయనున్నారు. 2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్న వారివి 3.97 లక్షలకు పైగా ఉన్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల నాలుగో వారంలో స్క్రూటినీ చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10 వేల నగదును బ్యాంకుల్లో వారి ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం అందుకు సంబంధించిన రశీదుల్ని లబ్ధిదారులకు గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారు. బతుకు భారం తగ్గించేందుకు చేయూత రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిట్నెస్, బీమా, మరమ్మతులకు అయ్యే ఖర్చు ఏటా రూ.10 వేల వరకు ఉంటోంది. సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుకునే వారికి ఈ ఖర్చు భారంగా మారింది. కష్టాలెదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు మేలు చేయడం అటుంచి ఆటోలపై చంద్రబాబు సర్కారు 2017లో జీవిత కాల పన్ను మోపింది. ఫిట్నెస్ సర్టిఫికెట్లు జాప్యమైతే రోజుకు రూ.50 వంతున జరిమానా విధించింది. ఆటో డ్రైవర్ల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఆటో డ్రైవర్లు పాదయాత్రలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. ప్రతి చోటా ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు కలిసి చంద్రబాబు ప్రభుత్వం తమను ఎలా ఇబ్బంది పెడుతుందో.. సోదాహరణగా విన్నవించారు. రోడ్ ట్యాక్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా పేరుతో ఏడాదికి రూ.10 వేల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను కళ్లారా చూసిన, విన్న వైఎస్ జగన్.. తాము అధికారంలోకి రాగానే ఉపాధి కోసం ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్న వారికి రూ.10 వేల సాయం అందిస్తామని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్రలో ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి సభలోనూ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెబుతూ వారి సమస్యల్ని ప్రస్తావించారు. రూ.10 వేల సాయంతో బీమా, రోడ్ ట్యాక్స్‌లు, చిన్న చిన్న రిపేర్లకు ఇబ్బంది లేకుండా పోతుందన్నారు. ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే వీరి కోసం నిధులు కేటాయించారు. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున సాయం అందించనున్నారు. భార్య, భర్తను ఓ యూనిట్‌గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. మరో యూనిట్‌గా పరిగణించి వారికి కూడా సాయం అందించనున్నారు. ప్రాథమికంగా 4 లక్షల మంది డ్రైవర్లకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని రవాణా శాఖ చెబుతోంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంఖ్య పెరిగినా సాయం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ కసరత్తు ప్రారంభం సాక్షి, మచిలీపట్నం: అర్హులైన వారి జాబితా సిద్ధం చేసే పనిలో రవాణా శాఖ నిమగ్నమైంది. ఆటోల వరకు ఇబ్బంది లేకున్నప్పటికీ, సొంత ట్యాక్సీలు నడుపుతున్న వారిని గుర్తించాల్సి ఉంది. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు ఎన్ని ఉన్నాయి ? ప్రస్తుతం ఎన్ని నడుస్తున్నాయి? వారి యజమానుల స్థితి గతులు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరొక వైపు ట్రావెల్ ఏజెన్సీల పరిధిలో ఉన్న కార్లు మినహా, వ్యక్తిగతంగా నడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆ లెక్కన ఎన్ని ట్యాక్సీలున్నాయి? వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న వివరాల మేరకు సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుతున్న వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేయాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం లేదా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రవాణా శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఆటో కార్మికులతో మంత్రి మాటామంతి ఆటో కార్మికుల సాధక బాధలు తెలుసుకునేందుకు మంత్రి పేర్ని నాని ఆదివారం స్వయంగా మచిలీపట్నంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆటోలోనే ప్రయాణించారు. ఆటో కార్మికులు, కార్మిక సంఘాలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వంద రోజుల్లో అమలు చేసిన వైఎస్ జగన్ లాంటి సీఎంను తామెన్నడూ చూడలేదని ఆటో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సొమ్ము ఏటా ఆటో, ట్యాక్సీల నిర్వహణకు ఎంతగానో ఉపకరిస్తుందని వారు పేర్కొన్నారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ తమ టార్గెట్ పేరుతో ఆర్టీఏ, పోలీస్ వేధింపులు తాళలేకపోతున్నామని, వాటి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. రానున్న ఐదేళ్లు మీకు మంచి రోజులేనని, అనవసరపు వేధింపులు ఉండబోవని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు తదితరులున్నారు. -
టాక్సీ దారి తప్పితే అలర్ట్
శాన్ఫ్రాన్సిస్కో: టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్రూట్లో వెళ్తుంటే అలర్ట్ చేసేలా గూగుల్ మ్యాప్స్ నూతన ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ‘ఆఫ్ రూట్’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా భారత్‌లోనే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్‌లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్లో ఆఫ్ రూట్ అలర్ట్ అనే ఈ ఫీచర్ ఉంటుందని సోమవారం ఎక్స్‌డీఏ డెవలపర్లు తెలిపారు. టాక్సీ ఎంచుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో 500 మీటర్లు దాటిన ప్రతిసారి ఈ ఫీచర్ ద్వారా వినియోగదారునికి అలర్ట్ వస్తుందని తెలిపారు. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్ చూపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ ఇంకా ప్రకటించలేదు. బ్రెయిన్ లైవ్ స్టేటస్, బస్ ప్రయాణ సమయం, మిక్స్డ్ మోడ్‌లో ఆటోరిక్షా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి నూతన ఫీచర్లను గూగుల్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. -
ఆస్ట్రేలియాలో ఉబెర్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఐపీవోకు సిద్ధమవుతున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌కు ఆస్ట్రేలియాలో ఎదురుదెబ్బ తగిలింది. చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలను పొందుతూ తమ ఉపాధిని నాశనం చేసిందని వేల మంది స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు ఆస్ట్రేలియాలో క్లాస్ యాక్షన్ దావా వేశారు. సరైన లైసెన్సులు లేని డ్రైవర్ల ద్వారా పర్మిట్లు లేని వాహనాలు నడిపి ఉబెర్ చట్టాలను ఉల్లంఘించిందని వారు ఆ దావాలో పేర్కొన్నారు. ఉబెర్ చర్యల కారణంగా తాము కోల్పోయిన మొత్తం ఆదాయాన్ని తిరిగి చెల్లించాలని ట్యాక్సీ డ్రైవర్లు ఆ దావాలో కోరినట్లు వారి తరఫున కేసు వేసిన లా సంస్థ మారీస్ బ్లాక్బర్న్ పేర్కొంది. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద క్లాస్ యాక్షన్ దావాగా మారుతున్నట్లు సంస్థ తెలియజేసింది. ఆస్ట్రేలియాలో ఉబెర్ చట్టవిరుద్ధ కార్యకలాపాల విషయంలో కోర్టు ఇచ్చే తీర్పు మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంది. నిజంగానే ఉబెర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కంపెనీపై ఎంత మేర ప్రతికూల ప్రభావం ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఉబెర్ కేసు ఓడిపోయి పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా.. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయమున్న కంపెనీకి మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లింపు పెద్ద సమస్య కాబోదని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ఉబెర్‌కు పొంచి ఉన్న చట్టపరమైన రిస్కుల గురించి ఇన్వెస్టర్లకు కనీసం హెచ్చరికలాంటిదైనా ఇచ్చినట్లవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా అమెరికాలో 10 బిలియన్ డాలర్ల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సిద్ధమవుతున్న తరుణంలో ఉబెర్‌కు ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
విమానాశ్రయం వద్ద డిష్యుం..డిష్యుం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓలా, ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లు బాహాబాహి తలపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. వివరాలు.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఏర్పోర్టుకు వస్తున్న ఒక ట్యాక్సీని ఒక కంపెనీ ట్యాక్సీ డ్రైవర్ ఓవర్టేక్ చేసేందుకు యత్నించి వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టాడు. విమానాశ్రయంలో ప్రయాణీకులను దించేసిన ట్యాక్సీ డ్రైవర్లు తమ కంపెనీల ట్యాక్సీ డ్రైవర్లను కూడదీసుకుని పార్కింగ్ లాట్లో పరస్పరం దూషించుకుంటూ తన్నుకున్నారు. విమానాశ్రయం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. ఘటనకు కారణమైన ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ట్యాక్సీ డ్రైవర్ల అరెస్ట్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి చొరబడి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నట్యాక్సీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, తర్వాత అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలసులకు సమాచారం అందింది. దీంతో ఐదుగురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా వారి కార్లను సీజ్ చేయడంతో పాటు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మారాలంటే మాకు 2.5 లక్షలు కావాలి!
న్యూఢిల్లీ: తమ వాహనాలను సీఎన్జీ ట్యాక్సీలుగా మార్చుకోవడానికి కనీసం రూ.2.5 లక్షల మేరకు ఖర్చవుతుందని ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్‌లను అనుమతించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం క్యాబ్ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ క్యాబ్స్ రోడ్లపై కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు రోడ్లపై వాహనాలను అడ్డుకుంటు నిరసన తెలుపుతున్నప్పటికీ సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు క్యాబ్స్ కంపెనీలు, డ్రైవర్లు మాత్రం తమ గోడును చెప్పుకుంటున్నారు. క్యాబ్స్ ను సీఎన్జీ రూపంలోకి మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు సలహా ఇచ్చిన మాట నిజమే. ఆ ప్రాసెస్ కోసం ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది. కానీ, డీజిల్, పెట్రోల్ క్యాబ్స్ ను సీఎన్జీ వాహనాలుగా మార్చే టెక్నాలజీ మన దేశంలో అందుబాటులో లేదని మొత్తుకుంటున్నారు. టాక్సీ డ్రైవర్ల కోరిక మేరకు నిబందనల్లో కాస్త సడలింపు జరగాలని, దశల వారీగా ఈ నిషేధం విధించాలంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. శాంతి భద్రతలకు సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతారని ఆప్ ప్రభుత్వం విన్నవించింది. పెట్రోలు, డీజిల్ వాహనాల కంటే కూడా సీఎన్ జీ క్యాబ్స్ నుంచి తక్కువ కాలుష్యం వస్తుందని సుప్రీం మళ్లీ చెబుతోంది. ఢిల్లీలో 30,000 నుంచి 40,000 వేల వరకు పెట్రోల్, డీజిల్ ఇంధనంతో నడిచే ఉబెర్, ఓలా క్యాబ్స్ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. నేడు(మే 5న) ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పుపైనే టాక్సీ డ్రైవర్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ల నిరసనతో గత మూడు రోజులుగా నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ఢిల్లీ రోడ్లపై కదలని వాహనాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్‌లను అనుమతించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంపై క్యాబ్ డ్రైవర్లు సంతృప్తిగా లేరు. క్యాబ్స్ తరుపువారు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మే 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు రోడ్లపై వాహనాలను రెండో రోజు అడ్డుకుంటున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెయిన్ రోడ్ల కూడళ్లలో తమ నిరసన తెలిపితేనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు తమ గోడును అర్థం చేసుకుంటుందని వారు భావించినట్టు కనిపిస్తోంది. మెహ్రౌలి-బదార్పుర్ రోడ్డు మార్గంలో, కార్కారీకి వెళ్లే మార్గంలో ఉన్న దక్షిణ ఢిల్లీలోని సాకెత్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ-నోయిడా మార్గం, దౌలా కువాన్, మహిపాల్ పుర్, గుర్గావ్ కు వెళ్లే ఇతర ప్రధాన మార్గాలలో టాక్సీ డ్రైవర్లు తమ నిరసన తెలుపుతూ వాహనాలను అడ్డుకుని దార్లను మూసివేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ తమ నిరసన తెలుపుతున్నారని టాక్సీ డ్రైవర్ల తీరును వివరించారు. డీజిల్, పెట్రోల్ వాహనాలను సీఎన్ జీ వాహనాలుగా మార్చుకునే పరిజ్ఞానం అందుబాటులో లేదని, అందుకే కొంత గడువు ఇవ్వాలని క్యాబ్స్ యజమానులు సుప్రీంకోర్టును అభ్యర్థించగా... ఇప్పటికే చాలినంత సమయం ఇచ్చామని, తమ ఆదేశాలను పాటించి తీరాలని సుప్రీం గట్టిగా మందలించిన విషయం తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులోకి అనుమతిలేని ట్యాక్సీడ్రైవర్లు
అదుపులోకి తీసుకున్న పోలీసులు! శంషాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా విమానాశ్రయంలోని అరైవల్ ప్రాంగణంలోకి వెళ్లిన మూడు ట్యాక్సీ కార్లతోపాటు వాటి డ్రైవర్లను ఆర్జీఐఏ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని ట్యాక్సీలు అరైవల్ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయనే సమాచారం మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. -
మీరే సారథులు..
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.... ప్రయాణికుల ప్రాంగణమే కాదు. విభిన్న భాషలు, సంస్కృతులకు నిలయం. రకరకాల పనులపై నగరానికి నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ మాత్రమే కాదు. నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలోనూ ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. చారిత్రక హైదరాబాద్ మహానగరాన్ని సందర్శించేందుకు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకులు రైలు దిగి, స్టేషన్ బయటకు రాగానే వారిని మొట్టమొదట పలుకరించేది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లే. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటో, ట్యాక్సీలను ఆశ్రయించవలసిందే. పర్యాటకులు నగరంలోకి ప్రవేశించగానే వారిని ఎలా పలుకరించాలి? మర్యాదగా ఎలా వ్యవహరించాలి? ఏ చారిత్రక , పర్యాటక ప్రదేశాలు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే అంశాలపై ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఐఆర్సీటీసీ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. రహదారి భద్రతా నియమాలపైన కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అతిథులను ఆహ్వానిద్దాం... దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆ ప్రాంతానికి వచ్చే విశిష్ట అతిథులుగా భావించి, ఆహ్వానించాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన గోవాలో ఈ శిక్షణ ను విజయవంతంగా నిర్వహించింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరేవేసే వ్యక్తులు మాత్రమే కాకుండా సాంస్కృతిక, చారిత్రక వారథులుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీరికి శిక్షణ ఇస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం విభాగ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య ‘సాక్షి’తో చె ప్పారు. ఈ క్రమంలో ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొంతమంది ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందిస్తున్నారు. దశలవారీగా ఈ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ‘హైదరాబాద్ నగరానికి నిత్యం 50 వేల నుంచి లక్ష మందికి పైగా టూరిస్టులు వస్తారు. వారంతా నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా కారు లేదా ఆటోలు అవసరం. అలా వేలాది మంది డ్రైవర్లు ప్రత్యక్షంగా పర్యాటక రంగంతో ముడిపడి ఉన్నారు. వారు పర్యాటకులతో వ్యవహరించే పద్ధతిపైనే ఆ రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే రైల్వేశాఖ ఈ శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది.’ అని సంజీవయ్య వివరించారు. ఈ వేసవి సెలవుల్లో పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ, వరంగల్, తదితర ప్రాంతాల్లో కూడా డ్రైవర్లకు శిక్షణనివ్వనున్నట్లు వెల్లడించారు. -
ఆటోవాలాలకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊరట లభించే నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు తీసుకుంది. ఓవర్ చార్జింగ్, ప్రయాణీకులు అడిగిన చోటికి రానని నిరాకరించడం, పీఎస్బీ బ్యాడ్జిలు, యూనిఫారం ధరించకుండా వాహనం నడపడం వంటి చిన్న నేరాలకు ఆటో, టాక్సీ డ్రైవర్లపై కేసు నమోదు చేసే అధికారాన్ని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ కమిషనర్ గీతాంజలి గుప్తా అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర రవాణా అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. ఆ తరువాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మోటారు వాహనచట్టం నిబంధనల ప్రకారం 66/192ఏ కింద యూనిఫారం ధరించకపోవడం, అడిగిన చోటికి రానని నిరాకరించడం, స్టాండ్ వద్ద ప్రయాణికున్ని ఎక్కించుకోకపోవడం, పోలీస్‌ల హెల్ప్‌లైన్ నంబర్లను ప్రదర్శించకపోవడం వంటి చిన్న నేరాలకు జరిమానా విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు ట్రాఫిక్ పోలీసులకు ఉన్నాయి. ఇటువంటి మామూలు ఉల్లంఘనలకు ఆటోవాలాలను శిక్షించే అధికారాన్ని ట్రాఫిక్ పోలీసుల వద్ద నుంచి తొలగించనున్నారు. కాగా, లెసైన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ లేకుండా వాహనాలను నడపడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడేవారిపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడతారు. -
‘శివ వాహతుక్ సేన’ సేవలు
31న మహిళల కోసం ముంబై: నూతన వత్సర వేడుకల సందర్భంగా నగరంలోని మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని శివసేన కోరింది. శివసేనకు అనుబంధ యూనియన్ అయిన ‘శివ వాహతుక్ సేన’లో సుమారు 16 వేల ఆటోలు, 10 వేల ట్యాక్సీ డ్రైవర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా శివ వాహతుక్ సేన అధ్యక్షుడు హాజీ అరాఫత్ షేక్ మాట్లాడుతూ..‘ 31వ తేదీ రాత్రి మహిళా ప్రయాణికులు వేడుకల అనంతరం ఇంటికి క్షేమంగా చేరే బాధ్యత మీదేనని మా సభ్యులందరికీ చెప్పాం.. అసాంఘిక శక్తులు ఆ సమయంలో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటివారిపై ఒక కన్నేసి ఉంచాలని హెచ్చరించాం.. ఎటువంటి ఘటన ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని చెప్పాం.. ’ అని తెలిపారు. ‘మామూలుగా ఆటో,ట్యాక్సీ డైవర్లపై పలు ఆరోపణలు వినబడుతుంటాయి.. దూర ప్రాంతా లకు వచ్చేందుకు నిరాకరిస్తారని, రద్దీ సమయంలో ఎక్కువ చార్జీలు వసూలుచేస్తారనే విమర్శలున్నాయి.. అయితే 31 రాత్రి మాత్రం వారు భిన్నంగా వ్యవహరించనున్నారు.. మహిళలు క్షేమంగా ఇంటికి చేరేందుకు వారు సహకరించనున్నారు..’ అని ఆయన వివరించారు. తమ యూనియన్ పిలుపునకు పుణే, నవీముంబై, ఠాణేలోని ఇతర ట్యాక్సీ, ఆటో యూని యన్లు కూడా సానుకూలంగా స్పందించాయని తెలిపారు.