telngana
-
ముందు ఎంజీబీఎస్,మెట్రో పిల్లర్లు కూల్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసే ముందు మహాత్మాగాం«ధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)ను, మెట్రో పిల్లర్లను కూల్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని తొలగించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి డీపీఆర్, కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా సుందరీకరణ ఎలా చేస్తారు? ప్రభుత్వమే రోడ్లువేసి, విద్యుత్ కనెక్షన్లు, ఇంటినంబర్, ఆధార్‌కార్డ్‌లు ఇచ్చి.. ఇప్పుడు పేదలు, దిగువ మధ్యతరగతి వారి ఇళ్లు కూలుస్తామంటే ఎలా? ముందు ఇళ్లు కూల్చుతాము, ఆ తర్వాత ప్రణాళిక వేస్తామంటే.. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే బాధిత ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల కూలి్చవేతపై మూసీ ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి దర్బార్ పెట్టి ప్రజలను ఒప్పించాలి.సీఎం వస్తే నేను కూడా అక్కడకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధం’అని కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే ముందు ఇమ్లీబన్లోని ఎంజీబీఎస్‌ను, అక్కడి మెట్రో పిల్లర్లు, స్టేషన్‌ను కూల్చాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో 30, 40 ఏళ్ల కిందటే పేదలు తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే, ప్రభుత్వం పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లను వదిలిపెట్టి పేదలపై పడతామంటే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు’అని హెచ్చరించారు. కాగా, తమతో బీఆర్ఎస్ నేతలెవరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణను లూటీ చేసిన ఆ పార్టీతో ఎలాంటి రాజీ లేదని, ఆ పార్టీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టదని, అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైడ్రా, మూసీపై నేను చెప్పేదే పార్టీ పాలసీ.. ‘హైడ్రా ద్వారా దుందుడుకు చర్యలు తీసుకోవడం సరికాదు. హైడ్రా అనేది రేవంత్‌రెడ్డి పెట్టుకున్న పేరు. అక్రమ నిర్మాణాల కూలి్చవేతలకు జీహెచ్ఎంసీలో ఓ వ్యవస్థ ఉంది. హైడ్రా వెనుక సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి’అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో హైడ్రాపై భిన్నస్వరాలు వినిపించడంపై ఏమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పేదల ఇళ్లు కూల్చమని మా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా’అని కిషన్‌రెడ్డి తిరిగి ప్రశ్నించారు. హైడ్రా, మూసీపై తాను చెప్పేదే పార్టీ పాలసీ అని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు క్షీణిస్తే కేంద్రం జోక్యానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ‘కశ్మీర్లో బీజేపీ వంద శాతం లక్ష్యం చేరుకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాం. భారత్‌కు వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికి చైనా అన్నిరకాలుగా సహాయపడుతోంది’అని తెలిపారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని, అది ముగిసిన అధ్యాయమని అన్నారు. జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదా కల్పనపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
అద్భుతమైన ప్రకృతిని.. చిన్న ప్రదేశంలో చూపించే 'ఇకబెనా ఆర్ట్'.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్ హోటల్లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్ గౌరవనీయమైన కాన్సుల్ జనరల్ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ రేఖారెడ్డి, ప్రెసిడెంట్ నిర్మలా అగర్వాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి.. హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్ డెకరేషన్ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్.అరుదైన కళ.. పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి. – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్.ఏకాగ్రతతోనే సాధ్యం.. ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తికి కలర్ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్ -
ప్యార్ హువా..! ఆర్గానిక్ ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్!!
సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ -
స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్న అర్జున్ ఇరిగేశి.. ఐదేళ్లకు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి తన ప్రొఫెషనల్ కెరీర్లో తొలిసారి స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రంగంలో పని చేస్తున్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘క్వాంట్‌బాక్స్’తో అర్జున్ చేతులు కలిపాడు. ఐదేళ్ల కాలానికిగాను ఈ స్పాన్సర్షిప్ విలువ 15 లక్షల డాలర్లు (సుమారు రూ.12 కోట్ల 41 లక్షలు) కావడం విశేషం. అంటే ఏడాదికి సుమారు రూ. 2 కోట్ల 50 లక్షలుగా ఈ డీల్ ఉంటుంది. భారత చెస్ చరిత్రలో దీనిని అత్యుత్తమ ఒప్పందంగా భావిస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ‘క్వాంట్‌బాక్స్’ వ్యవస్థాపకుడు, మాజీ చెస్ ఆటగాడైన ప్రశాంత్ సింగ్ ఈ ఒప్పందం వివరాలను వెల్లడించారు. 2022లో అర్జున్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది టాటా స్టీల్ చాలెంజర్స్, జాతీయ చాంపియన్‌షిప్, ఢిల్లీ ఓపెన్, అబుదాబి మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన అర్జున్ ప్రస్తుతం 2722 ఎలో రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానంలో ఉన్నాడు. -
Asian Boxing Championships 2022: క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 57 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 3–2తో మునార్బెక్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ బాక్సర్ ఇలియాస్ హుస్సేన్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ గెలిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. మరోవైపు 80 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన లక్ష్య చహర్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య చహర్ 5–0తో షబ్బోస్ నెగ్మత్ (తజికిస్తాన్)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పర్శ్ కుమార్ (51 కేజీలు) 1–4తో ప్రపంచ చాంపియన్ సాకెన్ బిబోసినోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా టోర్నీలో 27 దేశాల నుంచి 267 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. చదవండి: Hylo Open Badminton: తొలి రౌండ్లోనే లక్ష్య సేన్ ఓటమి -
డబుల్ స్వర్ణ పతకాలు సాధించిన రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. రాజా రిత్విక్, తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి, అరవింద్ చిదంబరం (తమిళనాడు), పురాణిక్ అభిమన్యు (మహారాష్ట్ర), సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)లతో కూడిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు టీమ్ విభాగంలో 16 పాయింట్లతో విజేతగా నిలిచింది. వ్యక్తిగతంగా బోర్డు–5పై ఆడిన రాజా రిత్విక్ ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి మరో స్వర్ణ పతకాన్ని సాధించాడు. బోర్డు–3పై ఆడిన హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి. పతకాలు నెగ్గిన రాజా రిత్విక్, హర్ష భరతకోటిలను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం' -
హోరాహోరీగా ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్..
కుత్బుల్లాపూర్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ గ్రౌండ్లో జరిగాయి. అండర్–19, అండర్–26 సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ‘సాక్షి’ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో.ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో వాగ్దేవి బోణీ వాగ్దేవి డిగ్రీ కశాళాల(మంచిర్యాల), ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల (సూర్యపేట) జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్వీ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. వాగ్దేవి కళాశాల జట్టు బ్యాట్స్‌మెన్ సైఫ్ 26 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఏకంగా 46 పరుగులు సాధించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 85 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్వీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులు మాత్రమే చేసింది. 17 పరుగుల తేడాతో వాగ్దేవి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన సాహిప్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా, బెస్ట్ బౌలర్‌గా అశ్విక్ ఎంపికయ్యారు. మరో మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటీ విజయం.. సీనియర్స్ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటీ (దుండిగల్ హైదరాబాద్) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల(సూర్యపేట) 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంఎల్ఆర్ఐటీ కళాశాల జట్టు కేవలం 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 63 పరుగులు సాధించింది. వినయ్ 44 పరుగులు చేసి జట్టు విజయాన్ని సునాయాసం చేశాడు. జూనియర్స్‌లో కేఎల్ఎన్ గెలుపు.. జూనియర్ విభాగంలో మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. మొదటి మ్యాచ్ ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల (మంచిర్యాల), కెఎల్ఎన్ జూనియర్ కళాశాల(మిర్యాలగూడ) తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 49 పరుగులు మాత్రమే చేసింది. కెఎల్ఎన్ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసి 7 వికెట్ల నష్టంతో విజయం సొంతం చేసుకుంది. 24 పరుగులు చేసిన శరత్ బెస్ట్ బ్యాట్స్‌మెన్, 2 వికెట్లు తీసిన ఫైజ్‌కు బెస్ట్ బౌలర్ అవార్డు అందుకున్నాడు. సత్తాచాటిన గౌతమి కళాశాల... మొదటి విజయంతో ఉత్సాహంతో రెండో మ్యాచ్‌కు దిగిన కెఎల్ఎన్ జూనియర్ కళాశాలకు గౌతమి జూనియర్ కళాశాల(ఈసీఐఎల్) చెక్ పెట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెఎల్ఎన్కు ధీటుగా గౌతమి కళాశాల బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. 7 వికెట్ల నష్టానికి 83 పరుగుల భారీ స్కోర్ చేయగా, కెఎల్ఎన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగుల తేడాతో గౌతమి జూనియర్ కళాశాల విజయం సాధించింది. బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా వామన్, బెస్ట్ బౌలర్‌గా తునికి సాహిత్ ఎంపికయ్యారు. నేడు సీనియర్స్ ఫైనల్స్.. తలపడనున్న వాగ్దేవి, ఎంఎల్ఆర్ఐటీ ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున తలపడనున్న నేపథ్యంలో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో విజయం సొంతం చేసుకున్న వాగ్దేవి, ఎంఎల్ఆర్ఐటీ జట్లు గురువారం ఉదయం ఫైనల్స్ బరిలో తలపడనున్నాయి. అదేవిధంగా జూనియర్ సెమీఫైనల్, ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న మర్రి లక్ష్మణ్‌రెడ్డి -
రన్నరప్ రష్మిక జంట
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–శ్రీవల్లి రష్మిక జంట రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో సాత్విక–రష్మిక ద్వయం 6–3, 4–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సోహా సాదిక్–చామర్తి సాయి సంహిత (భారత్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ అనా ఉరెకె (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో సహజ తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. నేడు జరిగే ఫైనల్లో ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ)తో సహజ తలపడుతుంది. -
ఐటీఎఫ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు సౌజన్య అర్హత
బెన్‌డిగో ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య బవిశెట్టి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సౌజన్య 7–5, 7–5తో మూడో సీడ్, భారత్‌కే చెందిన రుతుజా భోస్లేపై గెలిచింది. తొలి రౌండ్లో సౌజన్య 6–1, 6–0తో ఒలివియా (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో టాప్ సీడ్ సుజియోంగ్ జాంగ్ (దక్షిణ కొరియా)తో సౌజన్య ఆడుతుంది. చదవండి: SA vs NZ: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ఘన విజయం -
తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ సంచలనం...
Telangana Gm Erigaisi Arjun: లాత్వియాలో జరిగిన లిండోరస్ అబ్బె బ్లిట్జ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్ 13.5 పాయింట్లు సాధించాడు. అర్జున్ 13 గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని మరో నాలుగు గేముల్లో ఓడాడు. మేటి ప్లేయర్లు కరువానా (అమెరికా), అరోనియన్ (అర్మేనియా) తదితరులపై అర్జున్ గెలిచాడు. షెవ్చెంకో (ఉక్రెయిన్–14 పాయింట్లు) విజేతగా నిలిచాడు. చదవండి: T20 World Cup 2021: అలసటా.. టాస్ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి? -
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్...
హిసార్ (హరియాణా): తన పంచ్ పవర్ సత్తా చాటుకొని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్‌కు టోర్నీ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం లభించడం విశేషం. జాతీయ శిబిరానికి నిహారిక 66 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెళ్ల నిహారిక కాంస్య పతకం సాధించింది. అంతేకాకుండా జాతీయ శిక్షణ శిబిరంలో స్థానం సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా బొర్గోహైన్‌కు నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు ఇచ్చారు. మిగతా 11 కేటగిరీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఈ టోరీ్నకి ముందు ప్రకటించింది. అయితే ఒకట్రెండు కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని బీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. చదవండి: SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! -
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్: నంబర్‌వన్‌గా పాయస్ జైన్
భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువతార పాయస్ జైన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్ జైన్ మూడు అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. మానవ్ ఠక్కర్ (అండర్–21) తర్వాత ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్ పాయస్ జైన్ కావడం విశేషం. వాల్ట్ ఈవెంట్లో అరుణా రెడ్డికి 11వ స్థానం ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి వాల్ట్ ఈవెంట్ ఫైనల్ ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. జపాన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణా రెడ్డి క్వాలిఫయింగ్‌లో 13.353 పాయింట్లు స్కోరు చేసి 11వ స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. అరుణ మూడో రిజర్వ్‌గా ఉంది. టాప్–8 నుంచి ముగ్గురు వైదొలిగితే అరుణా రెడ్డికి ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం.. -
హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్‌కు అభినందన...
సాక్షి, హైదరాబాద్: పెరూలో ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి రెండు రజత పతకాలు సాధించిన హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, షూటింగ్లో ఇషా భారత భవిష్యత్ ఆశాకిరణమని ఈ సందర్భం గా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సునీల్ బథాలా అరంగేట్రం చేయనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన సునీల్‌తో ఈ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. గతంలో భారత అండర్–16 శిబిరంలో పాల్గొన్న సునీల్ 2020 డిసెంబర్లో ఎస్డీఎఫ్సీలో సెంటర్ డిఫెండర్‌గా చేరాడు. తన ఆటతీరుకు మెరు గులు దిద్దుకొని ఐ–లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించాడు. 13 జట్లు పాల్గొనే ఐ–లీగ్ డిసెంబర్లో మొదలయ్యే అవకాశముంది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్’తో... -
యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు సౌమ్య..
Soumya Guguloth: వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్లలో పర్యటించే భారత మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా వచ్చే నెల 2న యూఏఈతో, 4న ట్యూనిషియాతో, 10న బహ్రెయిన్‌తో, 13న చైనీస్ తైపీతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
ఫార్ములా వన్‌లో హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’..
సోచీ (రష్యా): ఫార్ములావన్ (ఎఫ్1) స్టార్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్లో 100వ రేసు విజయాన్ని అందుకున్నాడు. గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తోన్న ‘విక్టరీల సెంచరీ’ని హామిల్టన్ రష్యా గ్రాండ్‌ప్రితో పూర్తి చేశాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అతడు గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేశాడు. రెండో స్థానంలో వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)... మూడో స్థానంలో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) నిలిచారు. పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన లాండో నోరిస్ (మెక్లారెన్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రన్నరప్ గాయత్రి జంట జకోపేన్ (పోలాండ్): పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ పుల్లెల, సామియా ఇమాద్ ఫారూఖీ రన్నరప్‌గా నిలిచారు. మహిళల డబుల్స్ విభాగం ఫైనల్లో గాయత్రి–త్రిషా జాలీ (భారత్) ద్వయం 10–21, 18–21తో మార్గోట్ లాంబర్ట్–యాన్ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 11–21, 9–21తో మూడో సీడ్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూసింది. చదవండి: సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్ టైటిల్ -
సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ విజేత తెలంగాణ..
భువనేశ్వర్: కటక్‌లో జరిగిన జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. ఈ జట్టులో ఎక్కువ మంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన అమ్మాయిలే ఉన్నారు. విజేతగా నిలిచిన జట్టుకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు. చదవండి: SRH Vs DC: ఐదేళ్ల తర్వాత మళ్లీ డకౌట్.. -
తెలంగాణ కుర్రాడు.. స్నేహిత్ ఖాతాలో రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: కజకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో రజతం... డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 6–11, 9–11, 3–11, 11–9, 6–11తో 46వ ర్యాంకర్ కిరిల్ జెరాసిమెంకో (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. డబుల్స్ సెమీఫైల్లో స్నేహిత్–సుదాన్షు గ్రోవర్ (భారత్) జోడీ 11–8, 2–11, 6–11, 12–10, 5–11తో జెరాసిమెంకో–అలెన్ (కజకిస్తాన్) జంట చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది. చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
కట్టుకున్నోడే కాలయముడు!
సాక్షి,భువనగిరి: కలకాలం తోడూ నీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదమరచి నిద్రిస్తున్న భార్యను గొంతునులిమి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన కొండమడుగు వెంకటాచారికి, లక్ష్మి(35)తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. వెంకటాచారి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా, లక్ష్మి మరో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. మరొకరితో సఖ్యతగా మెలుగుతున్నాడని.. వెంకటాచారి మరో మహిళతో సఖ్యతగా మెలుగుతున్నాడని లక్ష్మి అనుమానించింది. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఇదే విషయంపై దంపతులు తీవ్ర స్థాయిలో గొడవ పడడంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చింది. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఆదివారం రాత్రి కూడా ఘర్షణ పడ్డారు. గొంతు నులిమి.. తరచు భార్య గొడవ పడుతుండడంతో వెంకటాచారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఘర్షణ అనంతరం భార్య ఆదమరచి నిద్రిస్తుండగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడే పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. కాగా, పోలీసులు సోమవారం ఉదయం ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. లక్ష్మీ హత్యకు గురైన విషయం తెలుసుకుని బంధువులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. పుట్టింట్లో ఉన్నా ప్రాణాలతో ఉండేవు లక్ష్మీ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్ చెప్పారు. -
హైదరాబాద్‌లో రోబోట్ తయారీ: రామరాజు సింగం
హైదరాబాద్: కరోనా మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. దీంతో అనేక పద్ధతులు మారాయి. టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. వాటిలో ఒకటి రోబోట్స్ వాడకం. ముఖ్యంగా హోటల్స్ లో రోబోస్ వాడకం బాగా పెరిగింది. చాలా హోటల్స్ హ్యూమన్ కాంటాక్ట్ కి బదులు రోబోస్ ని వాడి కస్టమర్స్ కి కరోనా నుంచి అభయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిని గమనించిన రామరాజు సింగం అనే వ్యక్తి హైదరాబాద్‌లో విస్టాన్ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ స్థాపించి రోబోలు ని తాయారు చెయ్యడం మొదలుపెట్టాడు. గత 20 సంవత్సరాలుగా లండన్ లో స్థిరపడిన రామరాజు అక్కడ ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో స్వదేశానికి వచ్చిన ఆయన దేశానికి ఏదైనా చెయ్యాలి అని ఈ రోబోటిక్స్ కి సంబందించిన కంపెనీ పెట్టాడు. ఒక రోబోని తయారు చేసి రెండు లక్షలకు అమ్ముతున్నారు. వేరే దేశాల్లో ఆరు లక్షలు పలికే రోబోలను ఇక్కడ రెండు లక్షలకే అమ్ముతున్నారు. చైనాకి ధీటుగా భారత్ మార్కెట్ ను నిలపాలనేది తన కల అని రామరాజు సింగం తెలిపారు. విస్టాన్ నెక్స్ట్‌జెన్ లో తయారైన రోబోలు రకరకాల పనులు చేస్తూ మరమనిషి అనే పేరుకి కరెక్ట్ గా సూట్ అవుతున్నాయి. -
మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏడాదిగా నష్టాల బాట తప్పడంలేదు. కోవిడ్, లాక్డౌన్, ప్రయాణికుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉండడంతో సుమారు రూ.2 వేల కోట్ల మేర నష్టాలను మూట గట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మెట్రోను ఆదుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణ సంస్థ వర్గాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. ఆపన్న హస్తం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆర్థిక పరంగా తమకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి షరతులు లేని దీర్ఘకాలిక రుణం మంజూరు చేయాలని, లేని పక్షంలో మెట్రో నిర్మాణం ఆలస్యమైన కారణంగా పెరిగిన రూ. 3వేల కోట్ల అంచనా వ్యయాన్ని సాయంగా అందజేయాలని ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ వర్గాలు విన్నవించినట్లు సమాచారం. అత్యధికంగా ఆ రూట్లో.. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం కారణంగా ప్రస్తుతం సుమారు లక్షమంది జర్నీ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సుమారు 60 వేల మంది.. నాగోల్–రాయదుర్గం మార్గంలో సుమారు 30 వేలు..జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపాయి. ►మెట్రోకు షరతులు లేని దీర్ఘకాలిక రుణం మంజూరు, లేదా సర్దుబాటు నిధి కింద పెరిగిన నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వ గ్రాంటుగా అందజేసే అంశం ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో సర్కారు ఎంత మొత్తంలో మెట్రోకు సాయం అందిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది. -
సునీత లక్ష్మారెడ్డికి క్యాబినెట్ హోదా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాల పదవీ కాలం తో పాటు మంత్రి హోదా లో ఉండే అన్నీ వసతులు ఆమెకు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. -
ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పాదయాత్ర: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ అహంకార, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ధ్వజమెత్తారు. అప్రజాస్వామిక, అవినీతిమయ పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని, తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవరోధాల్లేకుండా దోచుకోవడం, దాచుకోవడం సాగుతోందని మండిపడ్డారు. గతవారం వరకు టీఆర్ఎస్ కార్యాల యం నుంచే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం జరి గేదని, తాజాగా కాంగ్రెస్ బీ టీమ్‌గా టీడీపీ మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులను చంద్రబాబు నడిపిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల సక్రమ వినియోగంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్ర ఇరురాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకుంటే కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వా మ్యనికి, నియంతృత్వానికి జరుగుతున్న పోరా టంలో బీజేపీకి అండగా నిలవాలని కోరారు. హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే సీఎం కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి భయపెడుతున్నారని దుయ్యబట్టా రు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న తప్పిదాలను గుర్తించామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని, గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికను సీఎం కేసీఆర్ జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారని పేర్కొన్నా రు. హుజురాబాద్ గడ్డమీద ఎగరేది కాషాయ జెం డానే అన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఆయన అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసుల విషయంలో స్పల్పంగా తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1362 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం రోజు 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పాయారు. నిన్న ఒక్కరోజే 1,813మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,12,196 కు చేరింది. మరణాల సంఖ్య 3556 గా ఉంది. ఇప్పటి వరకు 5,90,072 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,23,0005 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 1,74,37,785 పరీక్షలు పూర్తి చేశారు. చదవండి: లాక్డౌన్ ఎత్తేశారని.. లైట్ తీసుకోవద్దు.. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో రాష్ట్రంలోని పేద, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకూ వైరస్ సోకిందని, రాష్టంలోని ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి మాస్క్‌లు, డ్రెస్ కోడ్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. లాక్డౌన్ నేపథ్యంలో 1897 యాక్ట్ ప్రకారం ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని, పేద ప్రజలు, అసంఘటిత కార్మికులకు షల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా భోజనం కల్పించాలి పిటిషనర్ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఏప్రిల్ 9న మధ్యంతర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుది నివేదిక ఏప్రిల్ 15 వరకు సమర్పించాలని హైకోర్టు అదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. -
డ్రైవర్ కొలువుల్లో కోత..
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంతో అక్కడి కంపెనీలు కుదేలయ్యాయి. ఆ ప్రభావం ఇంటి కార్లు నడిపించే డ్రైవర్లపైనా పడింది. షేక్‌లు నష్టాలను చవిచూడటంతో డ్రైవర్లకు వేతనాలు తగ్గించడం, కొంత మందికి కొన్ని నెలల వేతనాలు ఇవ్వకుండా వేధించడం జరిగింది. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ ప్రభుత్వం మహిళలపై ఉన్న కఠిన చట్టాల్లో మార్పులకు అవకాశం కల్పించింది. దీనికి తోడు అక్కడి మహిళల్లో చైతన్యం రావడంతో ప్రభుత్వం కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మహిళలు డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా కార్లు నడుపుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఆడవారికి డ్రైవింగ్‌కు అవకాశం ఉంది. కళాశాలకు వెళ్లే వారు, ఉద్యోగాలు చేసేవారు, ఇతరత్రా పనులు చేసే మహిళలకు సౌదీ ప్రభుత్వం కేటాయించిన సమయం అనుకూలంగా మారింది. దీంతో అనేక మంది డ్రైవర్లను అరబ్ షేక్‌లు తొలగించారు. ఒక ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటే ఒక్కరినే కొనసాగిస్తూ ఇతరులను తొలగిస్తున్నారు. అంతేగాక గతంలో ఇచ్చిన వేతనాలను ఇప్పుడు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా షేక్‌లకు ఎదురు చెప్పే ధైర్యం మనవారికి లేక తక్కువ వేతనాలకే విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితిలో మన కరెన్సీలో రూ.18వేలకు మించి వేతనం లభించడం లేదు. భోజనం ఇతర ఖర్చులకు రూ.8వేలను మినహాయిస్తే మన కార్మికులు తమ ఇంటికి పంపించేది రూ.10వేల మాత్రమే. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతుండటంతో సౌదీలో డ్రైవర్ విధుల నిర్వహణ వెట్టి చాకిరే అవుతుంది. ఇప్పటికే వందలాది మంది డ్రైవర్లను సౌదిలోని షేక్‌లు తొలగించారు. ఉపాధి కోల్పోయి ఇంటికి చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలనే డిమాండ్ వినిపిస్తోంది. డ్రైవర్ కొలువులకు పెద్ద పీట వేసిన సౌదీ అరేబియాలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితి నెలకొంది. సౌదీ అరేబియాలోని మహిళలు సొంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మనవారి డ్రైవర్ కొలువులకు కోత పడింది. ఆ దేశంలో నాలుగు నెలల ముందు వరకు మహిళలు డ్రైవింగ్ చేయడం నిషేధం. ఈ నిషేధం మొదటి నుంచి కొనసాగుతుంది. దీంతో సౌదీలో ఇంటికి, కంపెనీలకు సంబంధించిన కార్లు, ఇతర వాహనాలను పురుషులే నడపాల్సి ఉంది. ప్రధానంగా ఇళ్లలోని ఆడవారిని బయటకు తీసుకెళ్లి.. మళ్లీ ఇంట్లో దిగబెట్టడానికి మగవారే డ్రైవింగ్ చేస్తారు. అలాగే అరబ్ షేక్‌ల పిల్లలను స్కూళ్లు, కళాశాలలకు తీసుకెళ్లి.. తీసుకరావడానికి కూడా డ్రైవర్లు అవసరం. సౌదీ అరేబియా మినహా మిగిలిన గల్ఫ్ దేశాల్లో ఆడవారికి డ్రైవింగ్‌కు అనుమతి ఉంది. ఒక్క ఈ దేశంలోనే మహిళల స్వేచ్చపై కఠినమైన ఆంక్షలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఇంటి కార్లు నడపడానికి డ్రైవర్లు అవసరం కావడంతో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మన కార్మికులు అనేక మంది సౌదీలో డ్రైవర్లుగా చేరారు. ఒక్కో ఇంటికి మూడు నుంచి ఐదు కార్లు ఉంటాయి. మరి కొందరు షేక్‌ల ఆర్థిక స్థితి బాగుంటే ఇంకా ఎక్కువ కార్లు ఉంటాయి. ఒక్కో ఇంటికి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు డ్రైవర్లను షేక్‌లు పనిలోకి తీసుకున్నారు. పనికి తగిన వేతనం కూడా గతంలో లభించింది. ఒక్కో డ్రైవర్‌కు మన కరెన్సీలో రూ.20వేల నుంచి రూ.25వేల వరకు జీతం వచ్చింది. సీనియర్ డ్రైవర్లకైతే రూ.35వేల వరకు వేతనం లభించిన సందర్భాలు ఉన్నాయి. వేతనంతో పాటు టిప్పుల రూపంలోనూ డ్రైవర్లకు అదనపు ఆదాయం సమకూరేది. మంచి వేతనంతో పాటు నివాస సదుపాయాన్ని అరబ్ షేక్‌లు కల్పించేవారు. కేవలం భోజనం మాత్రమే డ్రైవర్లు సమకూర్చుకోవాలి. సౌదీలో డ్రైవింగ్ చేయడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కార్మికులు ముందుకు వచ్చినా అరబ్ షేక్‌లు ఎక్కువగా తెలంగాణ కార్మికులకే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ 80 శాతం మంది డ్రైవర్లు తెలంగాణవారే. ఆరు నెలల జీతం ఎగ్గొట్టారు.. నా పేరు మహబూబ్. మాది ఏర్గట్ల. నేను ఐదేళ్ల నుంచి సౌదీలో హౌస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. నెలకు వేతనం రూ.20వేల వరకు లభించేది. డ్రైవర్‌గా చేరిన రెండేళ్లలో వేతనం సక్రమంగానే ఇచ్చారు. ఆ తరువాత కోత విధించడం మొదలు పెట్టారు. నెలకు రూ.20వేలు ఉన్న వేతనం రూ.18 వేలకు తగ్గించారు. ప్రశ్నిస్తే ఏదైనా నేరం మోపి పోలీసులకు పట్టిస్తారనే భయంతో యజమానిని ఏమీ అడుగలేదు. ఆరు నెలల పాటు వేతనం ఇవ్వలేదు. ఇంటికి వెళ్లే ముందు ఇస్తామని చెబితే ఓపికతో ఉన్నా. చివరకు విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. చేసేది లేక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే ముందు ఆరు నెలల వేతనం చెల్లించాలని కోరితే లేదు పొమ్మన్నారు. లక్షా ఎనిమిది వేల రూపాయల వేతనం ఎగ్గొట్టారు. వేతనం తగ్గించి ఒప్పందం చేసుకున్నారు నా పేరు ఇర్ఫాన్. మాది పాలెం గ్రామం. సౌదీలో ఇంటి కారు నడుపడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఏజెంటు మొదట నెలకు రూ.20వేలు అని చెప్పాడు. కానీ ఇప్పుడు సౌదీలో డ్రైవర్లకు డిమాండ్ లేకపోవడంతో వేతనం తగ్గిస్తున్నారు. నెలకు రూ.18వేలకు మించి వేతనం ఇవ్వమన్నారు. తక్కువ వేతనమైనా కొన్ని రోజులు పనిచేయాలనే ఉద్దేశంతో వీసా కోసం డబ్బులు చెల్లించాను. ఒప్పందం ప్రకారం వేతనం ఇస్తే ఇంటికి కొంత సొమ్ము పంపవచ్చు. ఇవ్వకపోతే మాత్రం నష్టపోతాం. అంతా అల్లాపై నమ్మకం ఉంచి సౌదీకి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను.