tender notification
-
నాలుగు ప్యాకేజీలు నలుగురికి!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు. 6న ఫైనాన్స్ బిడ్ పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.ఖజానా దోపిడీకి రంగం సిద్ధంరాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే. -
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు!
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో 2014–19 మధ్య ఖజానాను దోచేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు దోపిడీకి అడ్డొస్తున్న జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను రద్దు చేసి, పాత విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉపక్రమించారు. ప్రజా ధనం దోపిడీకి కుటంత్రం పన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రూ.వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉంటే టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అడ్డగోలుగా అంచనాలు పెంచినా, కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు పెట్టినా ప్రజలు ఎత్తిచూపే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ పెద్దల భయం. వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, ఇంజినీర్ల నుంచివచ్చిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి టెండర్ షెడ్యూలులో మార్పులు సూచిస్తే ఆ మేరకు మార్చి టెండర్ నోటిఫికేషన్ మళ్లీ జారీ చేయాలి. అప్పుడు కమీషన్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కవన్నది ప్రభుత్వ పెద్దల భయం. అందుకే తమ అడ్డగోలు దోపిడీకి అడ్డుగా ఉండే జ్యుడిషియల్ ప్రివ్యూను లేకుండా చేసేందుకు సిద్ధమయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్ల రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి.. అంచనా వ్యయాన్ని పెంచేయించడం, అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, అధిక ధరలకు పనులను కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. ఆ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం నిత్యకృత్యంగా చంద్రబాబు మార్చుకున్నారు.ఆనాటి దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్‌కు అప్పగించారు. » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి రూ.99 లక్షల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి, వాటి వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేసి.. సీఎం రమేష్ కు అప్పగించారు. అంటే పెంచిన మొత్తం రూ.114.09 కోట్లు సీఎం రమేష్ కు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 3–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.8.69 కోట్ల విలువైన పని మాత్రమే మిగింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. అంటే పెంచిన రూ.140.45 కోట్లు సీఎం రమే‹Ùకు చెల్లించారు. » హంద్రీ–నీవా రెండో దశలో 2014 నాటికి 4–బి ప్యాకేజీలో రూ.1.34 కోట్లు, 5–బి ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. 4–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, వాటిని తన సన్నిహితుడైన ఆర్. మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించారు. ఆ మేరకు బిల్లులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. » వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసినచంద్రబాబు.. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. ఆ పనులను సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. సీఎం రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీవో 22, జీవో 63లను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం టీడీపీ ప్రభుత్వ అవినీతికి తార్కాణం. » వంశధార స్టేజ్–2 ఫేజ్–2, తోటపల్లి, మడ్డువలస, గుండ్లకమ్మ నుంచి హంద్రీ–నీవా, మిడ్ పెన్నార్ ఆధునికీకరణ పనుల్లోనూ చంద్రబాబుది ఇదే తీరు. » 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. అక్రమాలకు అడ్డొస్తుందనే నెపంతోనే జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేయాలని నిర్ణయించారు.ఆదర్శవంతమైన జ్యుడిషియల్ ప్రివ్యూ రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్్రఫ్టాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. -
TS: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిలళకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. TSRTC is inviting applications from entrepreneurs for the supply of various types of city buses under the Hire Scheme in the Greater Hyderabad zone. Prospective entrepreneurs may visit our website at https://t.co/r7jl9XZYI0 for details or contact 9100998230. @TSRTCHQ @PROTSRTC pic.twitter.com/oTbFhTndxE — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్ నంబర్: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభించిందని.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్లలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చదవండి: TS: ఉదయం 4.30 నుంచే ప్రజావాణి.. ఫిర్యాదుల్లో ఎక్కువగా ఏమున్నాయంటే -
AP: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 1,489 ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. కొత్తగా 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను కొనుగోలు చేయనుంది. డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయారీ కంపెనీల నుంచే వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కో బస్ ఖరీదు దాదాపు రూ.45లక్షల చొప్పున మొత్తం రూ.670కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కాగా టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలిపేందుకు ఈ నెల 19 సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఇచ్చారు. - టెండర్ పత్రాలు అందుబాటులో ఉంచిన జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్ www.judicialpreview. ap.gov.in - టెండర్ల ప్రక్రియపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు ఈమెయిల్స్ పంపాల్సిన జ్యుడీషియల్ ప్రివ్యూ ఈమెయిల్ ఐడీలు judge&jpp@ap.gov.in, apjudicialpreview@gmail.com. ఇది కూడా చదవండి: ఆదుకోవాలని వచ్చిన వారికి తక్షణ సాయం -
రూ.635.21 కోట్లతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్ 19న చెయ్యేరుకు వచ్చిన ఆకస్మిక భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించే పనులకు రూ.635.21 కోట్ల అంచనాతో జలవనరులశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని షరతు విధించింది. జనవరి 10వ తేదీలోగా టెండర్లో పాల్గొనేందుకు షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆర్థిక బిడ్‌ను జనవరి 17న ఉదయం 11 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్ అప్పగించాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్.ఎల్.టి.సి.)కి ప్రతిపాదనలు పంపుతారు. కాంట్రాక్టు సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్‌ను ఎస్.ఎల్.టి.సి. ఆమోదిస్తుంది. తర్వాత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తూ జలవనరుల శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. -
యుద్ధ ప్రాతిపదికన ‘తారకరామతీర్థ’ పనులు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్‌లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.150.24 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు జ్యుడిషియల్ ప్రివ్యూకు ప్రతిపాదనలు పంపారు. చదవండి: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్ జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి, ఎంపికైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఆ గ్రామాల్లో తాగు నీటికి కూడా 0.162 టీఎంసీలు సరఫరా చేస్తారు. విజయనగరం కార్పొరేషన్‌కు తాగునీటి కోసం 0.48 టీఎంసీలను సరఫరా చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజ్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్‌కు 2.7 టీఎంసీల నీటిని తరలిస్తారు. దీని ద్వారా కుమిలి చానల్ సిస్టమ్ పరిధిలోని 8,172 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 16,538 ఎకరాలకు నీళ్లందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కుమిలి రిజర్వాయర్ డైక్–2, డైక్–3లలో 2.2 కిలోమీటర్ల మట్టికట్ట పనుల్లో రూ.150.24 కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌ను తొలగించి, ఆ పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపారు వడివడిగా భూసేకరణ, పునరావాసం తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు అవసరమైన 3,446.97 ఎకరాల భూమికిగాను ఇప్పటికే 3,243.28 ఎకరాలను సేకరించారు. మిగతా 203.69 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. కుమిలి రిజర్వాయర్‌లో మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులోని 2,219 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. భూసేకరణ, పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విజయనగరం కార్పొరేషన్‌కు తాగు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
రూ. 256.53 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీలో పూడికతీత
సాక్షి, అమరావతి: ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేసిన రెండు కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక మేటల తొలగింపునకు రూ. 256.53 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21న ఆర్థిక బిడ్, అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టెండర్లను జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఇసుక మేటల తొలగింపు ద్వారా బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా గోదావరి డెల్టా రైతులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయడంతో పాటు పూడిక తీసిన ఇసుక ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్నది సర్కార్ ఉద్దేశ్యం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గోదావరి డెల్టాలో ఉన్న 10.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తారు. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేయడం వల్ల ఆ నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ఖరీఫ్‌లో పంటలకు నీళ్ల ఇబ్బంది లేకపోయినా.. రబీలో నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో బ్యారేజీకి 3 కి.మీ. నుంచి 12.5 కి.మీ. వరకూ ఎడమ వైపున ఇసుక మేటల తొలగింపునకు రూ. 135.85 కోట్లు.. కుడి వైపున ఇసుక దిబ్బల తొలగింపునకు రూ. 120.68 కోట్లతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లను ఖరారు చేశాక ఇసుక తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఏపీఎండీసీకి బాధ్యత అప్పగింత.. ధవళేశ్వరం బ్యారేజీలో ఇసుక మేటలను తొలగించేందుకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) భరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇసుకను తొలగించడం, దాన్ని విక్రయించడం వరకు అన్ని బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించింది. పూడిక తీసిన ఇసుకను విక్రయించగా రూ. 256.53 కోట్ల కంటే అధికంగా ఆదాయం వస్తే.. ఆ లాభంలో వాటాలు ఏపీఎండీసీకి, సర్కార్ ఖజానాకు చేరుతాయి. పూడికతీతతో వచ్చే ఇసుకతో నిర్మాణరంగానికి మేలు జరుగుతుందని, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. -
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5.64 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్‌లో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ పేర్కొన్న మొత్తంతో పోల్చితే.. ఖజానాకు రూ.26.5 కోట్లు ఆదా అయ్యాయి. పెన్నా నది నుంచి వచ్చే వరద జలాలను ఒడిసిపట్టి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 41,810 ఎకరాలకు నీళ్లందించడం, 4,66,521 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా మొత్తం 5,08,331 ఎకరాలను సస్యశ్యామలం చేయడం, 10 లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టడానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే జల వనరుల శాఖ అధికారులు ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమశిల–కండలేరు వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని 772 నుంచి 1,540 క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టేందుకు రూ.1,304.11 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఆ టెండర్లను ఈ నెల 20న తెలుగు గంగ సీఈ హరినారాయణరెడ్డి తెరిచారు. ఈ పనులకు వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్స్, రాఘవ కనస్ట్రక్షన్స్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక బిడ్ మదింపులో ఎంఆర్కేఆర్ సంస్థ అర్హత సాధించలేదు. దాంతో ఆ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను తోసిపుచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరిచారు. రూ.1,324.97 కోట్లకు షెడ్యూల్ కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ మొత్తాన్నే కాంట్రాక్ట్ విలువగా పరిగణించి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.1,298.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి తెలుగు గంగ సీఈ ప్రతిపాదనలు పంపారు. ఈ టెండర్‌ను ఎస్‌ఎల్‌టీసీ లాంఛనంగా ఆమోదించనుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ టెండర్లో అంతర్గత అంచనా విలువతో పోల్చితే ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. -
యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతు పనులు చేపట్టేందుకు వారంలోగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. నెలలోగా టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థికఏడాదిలో కురిసిన భారీ వర్షాలు, తుపాన్లకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గతేడాది రూ.1,000 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టడంతో రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారాయి. అయితే మళ్లీ ఈ మరమ్మతులు లేకుండా రెన్యువల్ లేయర్ వేసేందుకు రూ.2,205 కోట్ల నిధులు కేటాయించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల పరిధిలోని 2,726 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.2 కోట్ల లోపు పనులకు జిల్లా పరిధిలోనే టెండర్లు రూ.2 కోట్ల లోపు విలువైన పనులకు జిల్లా పరిధిలోనే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తారు. రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువైన మరమ్మతు పనులకు రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో టెండర్లు జరుగుతాయి. అయితే జిల్లా, రాష్ట్ర స్థాయి పనులకు రివర్స్ టెండర్లు జరుగుతాయి. ఏప్రిల్ నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, మే నెలలోగా మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) ఎండీ శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
‘పోతిరెడ్డిపాడు–గోరకల్లు’ అభివృద్ధి పనుల్లో రూ.16.5 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్ఆర్) నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ లైనింగ్.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా అభివృద్ధి చేసే పనుల టెండర్లలో ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. టెండర్ల ప్రక్రియను మంగళవారం స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) పరిశీలించి, ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత 1.622% తక్కువ ధరలకు పనులను దక్కించుకున్న పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. పీహెచ్ఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ అభివృద్ధి పనులకు రూ.1,017.22 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ టెండర్లలో ఎన్సీసీ, ఎస్ఆర్సీ ఇన్ఫ్రా, ఓమ్ మెటల్స్ ఇన్ఫ్రా, పీఎన్సీ ఇన్ఫ్రా సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఓమ్ మెటల్ప్ ఇన్ఫ్రాకు పనులు చేసిన అనుభవం లేకపోవడంతో టెక్నికల్ బిడ్‌లో ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు. ► మిగిలిన మూడు సంస్థలు ప్రైస్ బిడ్‌కు అర్హత సాధించాయి. ప్రైస్ బిడ్‌లో 0.9% అధిక ధర(రూ.1026.375 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ► ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన రూ.1026.375 కోట్లను కాంట్రాక్టు విలువగా పరిగణించి.. ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ గడువు ముగిసే సమయానికి 1.622% తక్కువ ధర(రూ.1,000.716)కు కోట్ చేసిన పీఎన్సీ ఇన్ఫ్రా సంస్థ ఎల్–1గా నిలిచింది. ► దాంతో ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. ► టెండర్ల ప్రక్రియపై కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి శుక్రవారం ఈఎన్సీ సి.నారాయణరెడ్డికి పంపారు. ఈఎన్సీ నేతృత్వంలో మంగళవారం ఎస్‌ఎల్‌టీసీ సమావేశమై టెండర్‌ను ఆమోదించనుంది. -
పోతిరెడ్డిపాడు కాలువ వ్యవస్థ అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్ట్ జలవిస్తరణ ప్రాంతం నుంచి కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువను గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ (0 కి.మీ. నుంచి 56.77 కి.మీ. వరకూ) అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీఆర్పీ(పోతిరెడ్డిపాడు) హెడ్ రెగ్యులేటర్.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయనుంది. ఈ పనులకు రూ.1,061.69 కోట్ల అంచనా వ్యయంతో ఓపెన్ విధానంలో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 14న సాయంత్రం ఐదు గంటల వరకూ షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు. ► ఈ నెల 15న ప్రీ–క్వాలిఫికేషన్ బిడ్ సమావేశాన్ని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ నిర్వహిస్తారు. షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ.7.8 కోట్ల డీడీలను సీఈకి అందజేయాలి. ► ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఆర్థిక (ప్రైస్) బిడ్ తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర (ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్ని ‘కాంట్రాక్టు విలువ’గా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకూ ‘ఈ–ఆక్షన్’(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఈ– ఆక్షన్‌లో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్ట్ సంస్థకు పనులను అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు. ► ఈ నెల 21న ఎస్‌ఎల్‌టీసీ టెండర్ ప్రక్రియను పరిశీలించి, ఆమోదించి, కాంట్రాక్ట్ సంస్థకు వర్క్ ఆర్డర్ జారీ చేయడానికి అనుమతి ఇస్తుంది. ► కృష్ణా నది నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్ట్‌లను నింపడం ద్వారా కరువును తరిమికొట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి విదితమే. -
జ్యుడిషియల్ ప్రివ్యూ ఓకే
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) వరకూ.. బీసీఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), గాలేరు–నగరి కాలువ 56.775 కి.మీ అభివృద్ధి పనుల టెండర్ ప్రతిపాదనకు జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ ఎస్సార్బీసీ.. గాలేరు–నగరి కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచేలా వాటికి లైనింగ్ చేయడం, అవుకు వద్ద మూడో సొరంగం తవ్వే పనులకు సంబంధించిన టెండర్ ప్రతిపాదనకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం తెలిపింది. దాంతో.. ఈ రెండు పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ► పీహెచ్ఆర్ నుంచి బీసీఆర్ వరకూ.. బీసీఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ వరకూ ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ అభివృద్ధి పనుల అంచనా వ్యయాన్ని రూ.1,061.69 కోట్లుగా నిర్ణయించింది. ► గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ కాలువలకు లైనింగ్, అవుకు వద్ద మూడో సొరంగం తవ్వే పనుల అంచనా వ్యయాన్ని రూ.1,269.49 కోట్లుగా నిర్ణయించింది. ► ఈ రెండు పనుల పూర్తికి 36 నెలల గడువు పెట్టింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతోనే టెండర్ నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ఓపెన్ విధానంలో టెండర్ నిర్వహించనుంది. ► ప్రైస్‌బిడ్ తెరిచిన తర్వాత.. ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనుంది. -
రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు
సాక్షి, విజయవాడ: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ రోజు(సోమవారం) నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. జ్యుడిషియల్ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేసినట్టు చెప్పారు. -
9న మద్యం దుకాణాల టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నవంబర్ 1న కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం ఈ నెల 9 నుంచి 16 వరకు కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 13వ తేదీ ఆదివారం దరఖాస్తులు తీసుకోరు. జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాల యాలతోపాటు హైదరాబాద్, నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలోని రెండో ఫ్లోర్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 18న డ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఈ నెల 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్ 1 నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు. -
రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం
-
పోలవరం హెడ్‌వర్క్స్, హైడల్ కేంద్రాలకు ‘రివర్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్ల అంచనా విలువతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టెండర్ డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేసింది. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచే డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 20వతేదీ ఉదయం 11 గంటల వరకు బిడ్ దాఖలు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్ దాఖలు చేసుకోవాలనే నిబంధనను అడ్డుపెట్టుకుని నోటిఫికేషన్ జారీచేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి టెండర్ల విధానాన్ని అపహాస్యం చేసింది. పోటీ లేకపోవడం వల్ల అధిక ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో ఖజానాపై తీవ్ర భారం పడింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పోటీపడేలా దేశంలో ఎక్కడ రిజిస్టర్ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలైనా సొంతంగా లేదా జాయింట్ వెంచర్‌గా ఏర్పడి బిడ్లు దాఖలు చేసుకునేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. బిడ్ దాఖలుకు అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థలు స్వీయ ధ్రువీకరణ హామీపత్రాన్ని సమర్పించాలి. తప్పుడు హామీపత్రం అందచేస్తే కాంట్రాక్టు సంస్థ బ్యాంకు గ్యారంటీ (అంచనా విలువలో 2.5 శాతం అంటే రూ.124.68 కోట్లు), ఈఎండీ(అంచనా విలువ ఒక శాతం అంటే రూ.49.87 కోట్లు)ని వెరసి రూ.174.55 కోట్లను జప్తు చేస్తారు. ► ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్లో నిర్వహించే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పారదర్శకతకు నిలువుటద్దంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఈనెల 21న ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) అందజేయాలి. 23న ఆర్థిక బిడ్ తెరుస్తారు. ► అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థను ఎల్–1గా ఎంపిక చేస్తారు. ► ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం ఎల్–1 సంస్థకే పనులు అప్పగించాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కి ప్రతిపాదన పంపి ఆమోదిస్తే టెండర్‌ను ఖరారు చేస్తారు. ► రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఎల్–1గా నిలిచిన సంస్థ పేరును గోప్యంగా ఉంచుతారు. కేవలం ఆ సంస్థ కోట్ చేసిన ధరను మాత్రమే టెండర్లో పాల్గొన్న మిగతా సంస్థలకు కనిపించేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ► ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరనే అంచనా విలువగా పరిగణించి ఈనెల 23న మధ్యాహ్నం ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ► ఒక్కో స్లాట్‌ను 15 నిమిషాల చొప్పున విభజించి ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే కాంట్రాక్టర్ ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధర కన్నా 0.5 శాతం తక్కువ కాకుండా కోట్ చేయాలి. ► ఈ–ఆక్షన్‌కు నిర్దేశించిన 2.45 గంటల సమయం ముగిశాక అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా, ఆ తర్వాత తక్కువ ధరకు కోట్ చేసిన వారిని ఎల్–2, ఎల్–3, ఎల్–4, ఎల్–5లుగా ఖరారు చేస్తారు. ► ఈఎండీని జప్తు చేసి ఎల్–2గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరను అంచనా విలువగా పరిగణించి మళ్లీ ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. టెండర్ షెడ్యూలు ఇదీ.. బిడ్ డాక్యుమెంట్ డౌన్లోడ్: ఈనెల 5న మధ్యాహ్నం 1 గంట నుంచి బిడ్ల స్వీకరణ: ఈనెల 5న మధ్యాహ్నం 1 గంట తర్వాత బిడ్ దాఖలుకు తుది గడువు: ఈనెల 20 ఉదయం 11 గంటల్లోగా ప్రీ–బిడ్ మీటింగ్: ఈనెల 11న ఉదయం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ ఎస్ఈ కార్యాలయంలో ప్రీ–బిడ్ సమావేశంలో వ్యక్తమైన సందేహాల నివృత్తి: ఈనెల 16న ప్రీ–క్వాలిఫికేషన్ స్టేజ్: ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్ ఓపెన్: ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్ నిర్వహణ: ఈ నెల 23న ఉదయం మధ్యాహ్నం 1 గంట తర్వాత టెక్నికల్ బిడ్: అక్టోబర్ 1 టెండర్ ఖరారు -
అవినీతికి ఫుల్స్టాప్
ఏం జరుగుతుందంటే...? రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయటానికి ముందుగానే సంబంధిత డాక్యుమెంట్‌ను న్యాయ పరిశీలన కోసం హైకోర్టు న్యాయమూర్తికి పంపిస్తారు. న్యాయమూర్తి దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాల కోసం వారం రోజుల పాటు డాక్యుమెంట్‌ను అందరికీ అందుబాటులో ఉంచుతారు. అనంతరం న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల బృందం వీటిని క్షుణ్నంగా పరిశీలించి 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. ప్రజల సలహాల మేరకు తగిన మార్పులు చేర్పులు సూచిస్తుంది. వీటిని కచ్చితంగా అమలు చేస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా ముందుగా న్యాయపరమైన పరిశీలన తరువాతే పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించే చరిత్రాత్మక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును కూలంకషంగా చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదించింది. ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టెండర్లను పారదర్శకంగా ఖరారు చేసేందుకు న్యాయ పరిశీలనను ఏర్పాటు చేస్తామని అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేస్తూ అక్రమాలు, పక్షపాతం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం–2019 బిల్లు రూపుదిద్దుకుంది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. పారదర్శకతకు పెట్టపీట ఈ బిల్లు ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల డాక్యుమెంట్ ముందస్తు పరిశీలన జరుగుతుంది. ప్రజల నుంచి అందిన సూచనల మేరకు, న్యాయమూర్తి పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ బిడ్డింగ్‌కు వీలుగా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యంగా బిల్లుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందరికీ సమాన అవకాశాలు.. కొత్త విధానంలో ఏదైనా పనిని ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్స్ సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా జడ్జి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే న్యాయపరిశీలన పరిధిలోకి రావాల్సిందేనని బిల్లులో స్పష్టం చేశారు. న్యాయమూర్తికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి తగిన రక్షణను ప్రభుత్వమే కల్పించనుంది. జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖలన్నీ పాటించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలని, ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లాలనే నిబంధన బిల్లులో పొందుపరిచారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలని బిల్లులో స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ విధానం ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా న్యాయమూర్తికి వెసులుబాటు కల్పించారు. జడ్జి, జడ్జి వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తారు. ఈ చట్టం ద్వారా తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రతినిధులపై ఎట్టి దావా క్లెయిమ్ లేదా ఇతర న్యాయ ప్రొసీడింగ్స్ ఏవీ వేయకూడదు. బిల్లులోని ఆర్థిక మెమోరాండంలో నెలవారీ వ్యయం కోసం రూ.3 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.ఐదు కోట్లను ప్రాధమికంగా కేటాస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్లులో కీలక అంశాలు ఇవీ... 1. ఏ టెండరైనా, ఏ పనైనా విలువ రూ.100 కోట్లు దాటితే టెండర్ పత్రాలను న్యాయమూర్తి పరిశీలనకు పంపుతారు. 2. తరువాత దాన్ని ప్రజా బాహుళ్యం (ఇంటర్నెట్, వెబ్ సైట్)లో 7 రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 3. న్యాయమూర్తికి సాంకేతిక తోడ్పాటు కోసం టెక్నికల్ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జడ్జి కోరితే వేరేవారిని కూడా నియమిస్తుంది. వారికి జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. 4. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను న్యాయమూర్తి ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందం 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. సంబంధిత శాఖల అధికారులను పిలిచి అందుకు అనుగుణంగా టెండర్లలో మార్పులు చేర్పులు సూచిస్తుంది. 5. వారం రోజులు ప్రజా బాహుళ్యంలో, 8 రోజుల పాటు న్యాయమూర్తి పరిశీలనలో టెండర్ డాక్యుమెంట్ ఉంటుంది. 6. మొత్తం 15 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. 7. న్యాయమూర్తి సూచించిన మార్పుచేర్పులను తప్పనిసరిగా అమలు చేస్తూ టెండర్లను పిలుస్తారు. ఇదీ ప్రభుత్వ ఉద్దేశం... ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో కూడిన వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోంది. సమాన అవకాశాలు, వ్యయం, నాణ్యతా సూత్రాలను పాటిస్తూ సమర్ధవంతమైన రీతిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని ధృఢంగా నిర్ణయించింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు యావత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మరీ ముఖ్యంగా రూ.100 కోట్లు అంతకు మించిన విలువ గల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం సమగ్ర చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ఉన్నత న్యాయస్థానానికి చెందిన గౌరవ న్యాయమూర్తి ఆధ్వర్యంలో తగిన యంత్రాంగం ఏర్పాటుకు చట్టం తేవాలని నిర్ణయించింది. గౌరవ న్యాయమూర్తి విధులు నిర్వర్తించడానికి అవసరమైన నిపుణులు, సిబ్బందిని ఆయన కోరిన విధంగా సమకూర్చుతుంది’’ కొత్త చట్టం పరిధిలోకి వచ్చేవి (పీపీపీ ప్రాజెక్టులతో సహా ) 1.రోడ్లు (రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లా రోడ్లు, ఇతర జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు) వంతెనలు, బైపాస్‌లు 2. ఆరోగ్యం 3. భూమిని తిరిగి తీసుకొనుట 4. కాలువలు, ఆనకట్టలు 5. నీటిని సరఫరా చేయటం, శుభ్రపరచటం, పంపిణీ చేయుటం 6. వ్యర్ధ పదార్థాల నిర్వహణ 7. మురుగు, మురుగుపారుదల 8. పబ్లిక్ మార్కెట్లు 9. వర్తక ప్రదర్శన, సమ్మేళం, వస్తు ప్రదర్శన, సాంస్కృతిక కేంద్రాలు 10. పబ్లిక్ భవనాలు 11. దేశీయ జల రవాణా 12. గ్యాస్, గ్యాస్ పనులు 13. క్రీడలు, విహారాల మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఉద్యానవనములు, పార్కులు 14. రియల్ ఎస్టేట్ 15. ఇ–గవర్నెన్స్ ప్రాజెక్టులు, ఐటీ మౌలిక సదుపాయాలు 16. ప్రైవేట్ రంగ కంపెనీలు, కంపెనీల కన్సార్టియంతో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం, జాయింట్ వెంచర్ ద్వారా పట్టణాభివృద్ధి 17. ఫైబర్ గ్రిడ్, వై–ఫై సర్వీసులతో సహా టెలి కమ్యునికేషన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు 18. పునరుత్పాదక (సౌర–పవన) ఇంధన ప్రాజెక్టులతో సహా విద్యుత్ ఉత్పాదన, ప్రసారం, పంపిణీ 19. హై–వే ప్రాజెక్టులలో ఏకీకృత భాగంగా ఉన్న గృహ నిర్మాణం లేదా ఇతర కార్యకలాపాలతో సహా ఇతర హై–వే ప్రాజెక్టులు 20. ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్, డిపోలు 21. పట్టణ రవాణా ప్రాజెక్టులతో సహా రైల్వే వ్యవస్థ 22. ఓడ రేవులు, అంతర్దేశీయ ఓడరేవులు 23. లాజిస్టిక్ హబ్‌లు స్వేచ్ఛా వాణిజ్య ప్రదేశాలతో సహా పరిమితి లేకుండా వాటికి విమానాశ్రయాలు 24. ఆకర్షణీయ నగర ప్రాజెక్టులతో సహా పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు 25. విద్యా సంస్థలు -
ఇంటి దోపిడీ రూ.4,930.15 కోట్లు!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్ రూ.4,930.15 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో కలసి టీడీపీ పెద్దలు పేదల పొట్ట కొట్టినట్లు స్పష్టం చేసింది. సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణానికి రూపొందించిన అంచనాలతోనే గత ప్రభుత్వం షేర్ వాల్ టెక్నాలజీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంచనా వ్యయాన్ని చదరపు అడుగుకు రూ.800 చొప్పున పెంచేసింది. పోటీ లేకుండా చేసి తొమ్మిది సంస్థలకు అధిక ధరలతో పనులను అప్పగించారని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. వీఎన్‌సీ–ఎస్వీసీ(జేవీ), వీఎన్‌సీ, కేఎంవీ, షాపూర్జీ పల్లోంజీ, ఎన్సీసీ, కేపీసీ, టాటా, ఎల్ అండ్ టీ, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే పాల్గొనేలా నిబంధనలు రూపొందించారని పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక, భూసేకరణ లేకుండానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో ధరల సర్దుబాటు కింద అధిక మొత్తం పరిహారం చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొంది. పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించకపోవడాన్ని తప్పుబట్టింది. అడగడుగునా నిబంధనల ఉల్లంఘనపై ఏపీ టిడ్కో అధికారులను ప్రశ్నిస్తే ‘ఉన్నత స్థాయి ఒత్తిళ్ల మేరకు పెద్దలు ఎలా చెబితే అలా చేశాం..’ అని సమాధానం ఇచ్చారని పేర్కొంది. కఠిన చర్యలకు కమిటీ సిఫారసు.. పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉండగా వారిపై అప్పుల భారం మోపి మరీ నిధులను కాజేసిన వైనంపై విధానపరమైన నిర్ణయం తీసుకుని అక్రమాలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ నిపుణుల కమిటీ ఈనెల 17వతేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంపై కమిటీ విచారణ జరిపి రికార్డులు తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో విచారించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పేదలకు సొంతింటి పేరుతో దోపిడీ.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదలకు 225 చోట్ల 4,54,909 గృహాలను నిర్మించే పనులను 34 ప్యాకేజీలుగా విభజించి 2017 ఏప్రిల్‌లో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్లు పిలిచారు. ఇళ్లను మూడు రకాలుగా 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.5 లక్షల చొప్పున మొత్తం రూ.3 లక్షలు చెల్లిస్తాయి. ఈ నిధులతో సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్లను నిర్మించే అవకాశం ఉన్నా టీడీపీ సర్కారు పేదలపై పెనుభారం మోపింది. గత సర్కార్ వ్యవహరించిన విధానాల వల్ల 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ వ్యయం రూ.5.72 లక్షలకు(లబ్ధిదారుడిపై భారం రూ.2.72 లక్షలు), 365 చదరపు అడుగులకు రూ.6.74 లక్షలకు (లబ్ధిదారుడిపై భారం రూ.3.74 లక్షలు), 430 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ వ్యయం రూ.7.71 లక్షలకు (లబ్ధిదారుడిపై భారం రూ.4.71 లక్షలు) పెరిగిందని కమిటీ తేల్చింది. ఫలితంగా ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.25,170.99 కోట్లకు చేరుకుందని నిపుణుల కమిటీ పేర్కొంది. లబ్ధిదారుడి వాటా రూపంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి మరీ ఈ డబ్బులను టీడీపీ సర్కార్ దోచేసింది. చ.అడుగుకు రూ.800 పెంపు సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1100కి మించదని అయితే షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో చదరపు అడుగుకు రూ.1900కు పెంచేశారని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 15 నెలల్లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా రెండేళ్లు గడిచినా అసంపూర్తిగానే ఉన్నాయని కమిటీ తెలిపింది. 100 మిమీల మందం కలిగిన గోడలతో నిర్మిస్తున్న ఇళ్లు చలి, ఎండలను ఆపలేవని అభిప్రాయపడింది. గ్రావెల్లో గోల్మాల్ రూ.60 లక్షలు! కృష్ణా జిల్లా జక్కంపూడి వద్ద జీ+3 విధానంలో 10,624 ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని నిపుణుల కమిటీ ఈనెల 12న తనిఖీ చేసింది. ఈ పనులను 4.53 శాతం అధిక ధరలకు అంటే రూ.649.44 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మే 27 నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్లకు గ్రావెల్‌ను 16 కి.మీ.ల నుంచి తరలిస్తున్నట్లు బిల్లులు చెల్లించారు. నిజానికి ఇళ్లు నిర్మిస్తున్న ప్రదేశం నుంచే గ్రావెల్‌ను తవ్వి సేకరించారు. ఇందులో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలు దోచిపెట్టారు. రూ.649.44 కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను ఒకే డీఈఈ, రెండు జిల్లాల్లో విస్తరించిన రూ.మూడు వేల కోట్ల విలువైన పనులను ఒక ఎస్ఈ, ఒక ఈఈ, 12 మంది డీఈలు పర్యవేక్షిస్తున్నారని.. దీనివల్ల పనుల నాణ్యత లోపించిందని నిపుణుల కమిటీ తేల్చింది. తనిఖీలు తుంగలోకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ అకౌంట్ కోడ్ (పేరా 294 నుంచి 297) ప్రకారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనులను తనిఖీ చేసి రికార్డు చేసేవరకు బిల్లులు చెల్లించకూడదు. రూ.5 లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న వాటిల్లో ఈఈ స్థాయి అధికారి కనీసం 30 శాతం పనులను తనిఖీ చేయాలి. రూ.50 లక్షలకు మించితే మూడింట ఒక వంతు లేదా మూడింట రెండొంతుల పనిని ఎస్ఈ స్థాయి అధికారి తనిఖీ చేశాకే బిల్లులు చెల్లించాలి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి తనిఖీలు లేకుండా, చెక్ మెజర్మెంట్ చేయకుండానే బిల్లులు చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చింది. కాంట్రాక్టర్లకు లబ్ధి ఇలా... - ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో రూ.7 లక్షలతో మోడల్ హౌస్ నిర్మించాల్సి ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 225 ప్రాంతాల్లో ఏ ఒక్క చోట కూడా కాంట్రాక్టర్లు వీటిని కట్టలేదు. దీనివల్ల కాంట్రాక్టర్లకు రూ.15.75 కోట్ల మేర లబ్ధి చేకూరింది. - రూ.9.50 లక్షలతో 500 చదరపు అడుగుల్లో ఏపీ టిడ్కోకు సైట్ ఆఫీస్ నిర్మించి ఇవ్వాలి. కానీ ఒక్కచోట కూడా కాంట్రాక్టర్లు దీన్ని పాటించకపోవడంతో వారికి రూ.21.38 కోట్ల మేరకు ప్రయోజనం కలిగింది. - ఒక్కో స్టీల్ ఫ్రేమ్, షట్టర్స్(యూనిట్)ను రూ.6 వేల చొప్పున అధిక ధరకు కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు రూ.272.95 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కిటీకిలను కూడా ఒక్కో యూనిట్ రూ.6 వేల చొప్పున అధిక ధరకు కొనడంతో కాంట్రాక్టర్లకు రూ.272.95 కోట్ల మేర లబ్ధి కలిగింది. - ఇళ్లలో అంతర్గత విద్యుదీకరణ, నీటి సరాఫరా, పారిశుద్ధ్యం పనులకు చదరపు అడుగుకు రూ.175 చొప్పున చెల్లిస్తామని ఎస్టిమేట్లలో పేర్కొన్న ఏపీ టిడ్కో చదరపు అడుగుకు రూ.50 చొప్పున అధికంగా చెల్లించింది. ఇందులో కాంట్రాక్టర్లకు రూ.578.80 కోట్లను దోచిపెట్టారు. - విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ పనుల్లోనూ కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు రూ.20 చొప్పున అధికంగా చెల్లించారు. పెయింటింగ్‌లో చదరపు అడుగుకు రూ.30 చొప్పున అధికంగా ఇచ్చారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు రూ.578.80 కోట్ల మేర లబ్ధి చేకూరింది. - అల్యుమినియం షట్టరింగ్ వల్ల చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.200 చొప్పున పెరిగి పేదలపై రూ.3186.92 కోట్ల భారం పడిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. కనీసం రిజిస్టర్లూ లేవు... - డిజైన్ 1893–2016 ప్రకారం రిజిడ్ మోనోలిథిక్ కన్స్టక్షన్ విధానంలో వంద మీమీల గోడ నిర్మించాల్సి ఉండగా ఒకే లేయర్ రీయిన్పోర్స్మెంట్ వినియోగిస్తుండటాన్ని కమిటీ తప్పుబట్టింది. - ఐబీఎం ప్రమాణాల ప్రకారం విస్కస్ మాడిఫైడ్ ఏజెంట్ క్యూబిక్ మీటర్‌కు 0.4 కేజీని వినియోగించాలి. సిమెంటు, నీటి నిష్పత్తి 0.43 శాతం ఉండాలి. క్షేత్ర స్థాయి పరీక్షలు, కోర్ డెస్ట్ల్లో వాటి పరిమాణాలు చాలా తక్కువగా ఉండటంతో పనులు నాసిరకంగా ఉన్నాయి. - ఒప్పందం ప్రకారం విద్యుత్ ఉపకరణాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల్లో ఉపయోగించే ఉపకరణాలు, డోర్స్, ప్లోరింగ్, టైల్స్ సరఫరా చేయడం లేదు. చౌకగా దొరికే నాసిరకమైన ఉపకరణాలను వినియోగిస్తున్నారు. - సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రమాణాల మేరకు ఏపీ టిడ్కో అధికారులు రిజిస్టర్లు నిర్వహించడం లేదు. -
అవినీతిపై రాజీలేని పోరు
ప్రథమ ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి.ఆ తర్వాత పట్టణ నిరుపేదల ఇళ్లు, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వంశధార ప్రాజెక్టుల పనులపై విచారించండి. అనంతరం ప్రాధాన్యతల వారీగా వివిధ రంగాల్లో చోటు చేసుకున్న కుంభకోణాలపై విచారణ చేయండి. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెండర్లపై ఎవరైనా ఆరోపణలు చేసినా, అసత్య కథనాలు ప్రచురించినా పరువు నష్టం దావా వేస్తాం. జ్యుడిషియల్ కమిషన్‌కు సాంకేతిక సలహాలు అందించడం కోసం నిపుణుల కమిటి సేవలు వినియోగించుకుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి మీతో భేటీ అవుతా. విచారణ పురోగతిని సమీక్షించి ఏవైనా సమస్యలుంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తా. వంద రూపాయల వస్తువు రూ.80కే వస్తుందంటే.. రూ.80కే కొంటామా? లేక రూ.వందకు కొంటామా? కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ మాత్రం రూ.వందకే కొనుగోలు చేసింది. రాజధానిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు చేశారు. ఇటీవల మరమ్మతుల కోసం గోడలను పరిశీలిస్తే ఒక్క ఇటుక కూడా కనిపించ లేదు. ఫ్లైవుడ్‌తో గోడలు కట్టారు. – నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు వ్యవస్థీకృతం చేసిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత అవినీతి దేశంలో మరెక్కడా ఉండదని ఢిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని, ఆయన తీరు వల్లే జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా కళ్లు మూసుకుంటే రాష్ట్రం భవిష్యత్ అధోగతిపాలవుతుందన్నారు. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చే వరకు విశ్రమించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఈనెల 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కమిటీ సభ్యులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి సమావేశమయ్యారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్రమార్జన కోసం అవినీతిని వ్యవస్థీకృతం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేయడం.. మిగిలిపోయిన పని అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు కుదిరితే నామినేషన్ పద్దతిలో కట్టబెట్టడం, కుదరకపోతే టైలర్ మేడ్ నిబంధనలతో టెండర్ నిర్వహించి అప్పగించడం.. అవసరం లేకపోయినా జీవో 22, జీవో 63 ద్వారా అదనపు నిధులు దోచిపెట్టడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున దోచుకున్నారని, ఈ దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానా అతలాకుతలమైందని వివరించారు. ప్రజా ధనాన్ని మిగిల్చే అధికారులకు సన్మానం చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తాను సిద్ధమైతే, అవినీతిని పట్టించుకోకుండా కళ్లు మూసుకోవాలని కొందరు తనకు ఉచిత సలహాలు ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని, అందుకే అత్యంత పారదర్శకత కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. అంచనా వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేస్తే అధికారులు ఏం చేస్తారు.. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి అంచనా వ్యయాన్ని పెంచేశారు.. ప్రజాధనాన్ని ఒకరు దోచేస్తే ఆ తప్పు అధికారులపై పడుతోంది’ అని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న వారు నిజాయితీగా ఉంటే దిగువ స్థాయిలో ఉన్న వారు కూడా అలాగే ఉంటారని అభిప్రాయపడ్డారు. అవినీతిని నిర్మూలించడం కోసం తాము కృత నిశ్చయంతో పని చేస్తున్నామని, ఇదే అంశాన్ని కార్యదర్శుల నుంచి విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) వరకూ స్పష్టం చేశానని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలూ తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఒత్తిడి వల్ల అంచనా వ్యయం పెంచేసి.. ఖజానాకు జరిగిన నష్టాన్ని బయటపెట్టి.. ప్రజాధనాన్ని మిగిల్చే అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లు.. చెవులూ మీరే.. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం కోసం అనేక తర్జనభర్జనలు పడ్డామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ‘విభిన్న రంగాల్లో అత్యంత నిష్ణాతులు, నిజాయితీపరులు, నిబద్ధత కలిగిన వారైన మీ ఏడుగురిని నిపుణుల కమిటీకి ఎంపిక చేశాం. మా ప్రభుత్వ కళ్లూ, చెవులూ మీరే. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ చేయండి. ఏ ప్రాజెక్టులు అవసరమో.. ఏవి అనవసరమో తేల్చి చెప్పండి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించాల్సిన ప్రాజెక్టులు ఏవో సూచించండి.. విచారణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు.. ఇతరత్రా అన్ని వసతులు సమకూర్చుతాం’ అంటూ నిపుణుల కమిటీకి దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రధానమైన ప్రాజెక్టులకు విచారణ పేరుతో ఆటంకం కలిగించకూడదన్నారు. సాగునీటి ప్రాజెక్టులే కాదు.. పీఏంఏవై పథకం కింద పట్టణ పేదలకు నిర్మిస్తున్న ఇళ్లు మొదలు.. రాజధాని వరకు చంద్రబాబు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరించారు. పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.1.50 లక్షలు.. వెరసి రూ.మూడు లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని చెప్పారు. ఇసుక, భూమి ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో చదరపు అడుగు రూ.1,100కే నిర్మించి ఇవ్వవచ్చని, అయితే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు చదరపు అడుగు రూ.2,200 చొప్పున పనులు కట్టబెట్టడం వల్ల పేదలపై భారం పడిందన్నారు. ఉచితంగా రావాల్సిన ఇంటికి ఒక్కో లబ్ధిదారుడు నెలనెలా రూ.మూడు వేల చొప్పున బ్యాంకుకు కిస్తులు కట్టాల్సిన దుస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించేందుకు నమూనా టెండర్ డాక్యుమెంట్‌ను రూపొందించి ఇవ్వాలని కోరారు. జ్యుడిషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు విచారణ అనంతరం రివర్స్ టెండరింగ్ చేయాల్సిన ప్రాజెక్టులను సూచిస్తే, వాటి అంచనా వ్యయాన్ని అలానే ఉంచి.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీని వల్ల ప్రజాధనం ఎంత ఆదా అయిందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందుకు కారణమైన నిపుణులు, అధికారులకు ప్రజల సమక్షంలో సన్మానం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా భారీ ఎత్తున ప్రాజెక్టులు.. మౌలిక సదుపాయాల కల్పన పనులు తదితరాలు చేపడతామని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రసారమాధ్యమాలు లేనిపోని ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో నిర్వీర్యమైన టెండర్ల వ్యవస్థకు జీవం పోసేందుకు జ్యుడిషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి ఇందుకోసం జడ్జిని కేటాయించాలని కోరామని గుర్తు చేశారు. రూ.వంద కోట్ల కంటే ఎక్కువ విలువైన పనుల టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిషియల్ కమిషన్‌కు పంపుతామని.. దాన్ని ఏడు రోజులపాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని.. ప్రజలు చేసే సూచనల ఆధారంగా టెండర్ డాక్యుమెంట్లో జ్యుడిషియల్ కమిషన్ మార్పులు చేర్పులు చేసి ఎనిమిది రోజుల్లోగా సర్కార్‌కు అందిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్ కమిషన్ ఖరారు చేసిన డాక్యుమెంట్‌తోనే టెండర్లు నిర్వహిస్తామని, దీని వల్ల అక్రమాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు రిటైర్డు ఈఎన్సీలు ఎల్.నారాయణరెడ్డి, అబ్దుల్ బషీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఎన్సీ సుబ్బరాయశర్మ (రహదారులు, భవనాల శాఖ), రిటైర్డు ఈఎన్సీ ఎఫ్‌సీఎస్ పీటర్ (రహదారులు, భవనాల శాఖ), ఏపీ జెన్కో రిటైర్డ్ డైరెక్టర్ ఆదిశేషు, సీడీవో రిటైర్డు సీఈ ఐఎస్ఎన్ రాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగారి మాయ.. కమీషన్ల యావ
టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే కోటరీ కాంట్రాక్టర్లతో సమావేశమైన మంత్రి దేవినేని ఉమా.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆస్థాన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రి ఆదేశాల మేరకు.. ఆ కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. సింగిల్ బిడ్ దాఖలైతే.. జీవో 94 ప్రకారం టెండర్‌ను రద్దుచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌తోపాటు మరో కాంట్రాక్టర్‌తో ఐదు శాతంలోపు అంటే.. 4.89 శాతానికి ఒకరు.. 4.99 శాతానికి మరొకరితో షెడ్యూలు దాఖలు చేయించేలా ఒప్పందం చేసుకున్నారు. 4.89 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి.. తద్వారా రూ.85 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసుకోవడానికి మంత్రి పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, అమరావతి: నీటి లభ్యతపై హైడ్రాలజీ విభాగం క్లియరెన్స్ ఇవ్వలేదు.. అయినా 50 వేల ఎకరాలకు నీళ్లందించే ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రూ.325 కోట్లతో పూర్తయ్యే పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం)ను రూ.495 కోట్లుగా నిర్ణయించి ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. అనంతరం రూ.85 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసుకోవడానికి ప్రణాళిక రచించారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోటా కింద సీఎం చంద్రబాబునాయుడు మంజూరు చేసిన కోటపాడు– చనుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకం ఈ దందాకు కేంద్రంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరి నది నుంచి 15.50 టీఎంసీల నీటిని పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 2008లో రూ.1,700.57 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచి.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.8 లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరికరించే పనులకు సెప్టెంబరు 3, 2016న రూ.4,909 కోట్లతో అనుమతిచ్చారు. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల కింద 4.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వకుండా దానిని పక్కన పెట్టి.. ఆ నీటిని పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను గోదావరి–పెన్నా నదుల అనుంధానం తొలి దశ పేరుతో రూ.6,020 కోట్లతో ఇటీవల పనులు చేపట్టారు. తాజాగా చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువపై కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో 89.90 కి.మీ వద్ద 50 క్యూసెక్కులను ఎత్తిపోసేలా కోటపాడు, 98.20 కి.మీ వద్ద 100 క్యూసెక్కులు ఎత్తిపోసేలా చనుబండ, 100.50 కి.మీ వద్ద మూడు దశల్లో 800 క్యూసెక్కులు ఎత్తిపోసేలా విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం, చాట్రాయి, నూజివీడు మండలాల్లో 50 వేల ఎకరాలకు నీళ్లందించడానికి రూ.698.90 కోట్లతో పథకాన్ని చేపట్టడానికి సర్కార్ అనుమతిచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా టీడీపీపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుంటే.. ఇదే జిల్లా మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమాపై ఆ వ్యతిరేకత తారస్థాయికి చేరింది. నీళ్లు ఇస్తున్నట్లు మాయచేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు భారీఎత్తున కమీషన్లు కొట్టేయడానికే ఎన్నికలకు ముందు తన కోటా కింద దేవినేని ఉమా ఈ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించుకున్నట్లు ఆ శాఖ అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు.. ఈ ఎత్తిపోతలకు హైడ్రాలజీ విభాగం అనుమతివ్వలేదు. ఇదేమీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతలపై ముందుకెళ్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. రూ.170 కోట్లు పెంచేశారు.. ఇదిలా ఉంటే.. కోటపాడు–చనుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా చింతలపూడి ప్రధాన కాలువపై 89.90 కి.మీ వద్ద కోటపాడు సమీపంలో 1.42 క్యూమెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు రూ.45 కోట్లు.. అలాగే, 98.20 కి.మీ వద్ద చనుబండ సమీపంలో 2.832 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే పనులకు రూ.90 కోట్లు.. 100.50 కి.మీ వద్ద విస్సన్నపేట–1 ఎత్తిపోతలలో భాగంగా 9.911 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు, విస్సన్నపేట–2 ఎత్తిపోతల కింద 8.495 క్యూమెక్కుల నీటిని, విస్సన్నపేట–3లో 4.247 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు రూ.190 కోట్లకు మించి వ్యయంకాదని అధికారులు తేల్చారు. అంటే.. ఈ మొత్తం ఎత్తిపోతల పనులను రూ.325 కోట్లతో పూర్తిచేయవచ్చు. కానీ, రూ.495 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేయడం గమనార్హం. -
రూ.1,000 కోట్ల కమీషన్లకు ముఖ్యనేత ‘టెండర్’
సాక్షి, అమరావతి: కంచె.. చేను మేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సినవారే దొరికినంత దోచుకుంటున్నారు. రాయలసీమలో తాజాగా చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల టెండర్లే అందుకు నిదర్శనం. కోటరీ కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు జరిపారు.. కమీషన్ల లెక్క తేలడంతో వారికి తలా ఒక ప్రాజెక్టు కేటాయించారు. రూ.4,515.61 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్రాజెక్టులకు సోమవారం వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. ఈ క్రమంలో అధికారుల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేశారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తే కనీసం పది శాతం తక్కువ ధరలకు కాంట్రాక్టర్లు కోట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖజానాకు రూ.474.24 కోట్ల మేర మిగిలేది. ముఖ్యనేత కాంట్రాక్టర్లను కుమ్మక్కయ్యేలా చేయడంతో సగటున 4.99 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ దాఖలు చేసే షెడ్యూళ్లను ఎల్–1గా తేల్చి టెండర్లు ఖరారు చేయనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.272 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. అంచనా వ్యయ ప్రతిపాదనల్లోనే అక్రమాలకు పాల్పడటం వల్ల వ్యయాన్ని సుమారుగా రూ.1,000 కోట్లకుపైగా పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. టెండర్లను ఖరారు చేశాక కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి రూ.వెయ్యి కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకుని ఎన్నికల్లో వెదజల్లడానికి స్కెచ్ వేశారు. వివరాల్లోకి వెళితే.. ఆర్డీఎస్ కుడి కాలువతోపాటు వేదవతి ఎత్తిపోతల, గాలేరు–నగరి రెండో దశ, హంద్రీ–నీవా రెండో దశలో మిగిలిపోయిన పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని 2014లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇన్నేళ్లపాటు వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి ఇస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆర్డీఎస్కు మినహా మిగిలిన ప్రాజెక్టులకు హైడ్రాలాజికల్ క్లియరెన్స్ లేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పక్కన పెట్టేసి.. ఉజ్జాయింపుగా అంచనాలు వేసి.. వాటి ఆధారంగానే టెండర్లు పిలవాలంటూ అధికారులపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అక్రమాలకు నిదర్శనాలివే.. - ఆర్డీఎస్ కుడి కాలువ (ఆర్డీఎస్ ఆనకట్ట ఎగువన కోసిగి మండలం బాత్రబొమ్మలాపురం నుంచి ఉల్చాల వరకూ 162.849 కి.మీ.ల మేర కాలువ తవ్వాలి. నాలుగు రిజర్వాయర్లు, నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులు చేయాలి) పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని కర్నూలు జిల్లా అధికారులు ప్రతిపాదించారు. కానీ వాటిని తోసిపుచ్చిన సర్కార్ రూ.1,557.37 కోట్లతో ఒకే ప్యాకేజీ కింద ఆ పనులను ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే గడువు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - వేదవతి ఎత్తిపోతల పథకం (వేదవతి నుంచి 4.20 టీఎంసీలను మూడు దశల్లో ఎత్తిపోసి 2.029 టీఎంసీల సామర్థ్యంతో హాలహర్వి రిజర్వాయర్, 1.027 టీఎంసీల సామర్థ్యంతో మొలగవల్లి రిజర్వాయర్‌ను నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిస్ట్రిబ్యూటరీలు చేయాలి) పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవడానికి అనుమతి ఇవ్వాలని కర్నూలు జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను సర్కార్ బుట్టదాఖలు చేసింది. ఈ పనులను ఒకే ప్యాకేజీ కింద రూ.1,536.28 కోట్ల అంచనా వ్యయంతో, ఎల్ఎస్–ఓపెన్ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే గడువుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ – యోగి వేమన రిజర్వాయర్– హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల పథకం (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి అనంతపురం జిల్లాలోని యోగి వేమన రిజర్వాయర్‌కు జలాలను తరలించి 12,880 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు.. యోగి వేమన రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం రెండో దశకు కాలువలోకి నీటిని ఎత్తిపోయడం) పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అనంతపురం జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను సర్కార్ తుంగలో తొక్కింది. ఈ పనులను ఒకే ప్యాకేజీ కింద రూ.1,182.35 కోట్ల వ్యయంతో, ఎల్ఎస్–ఓపెన్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేయాలనే గడువు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - మేర్లపాక చెరువు నుంచి–మల్లెమడుగు రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పనులకు రూ.239.61 కోట్లతో ఎల్ఎస్–ఓపెన్ విధానంలో 12 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధన పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - అధికారులు సూచించినట్టు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. అప్పుడు తక్కువ ధరలకే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే అవకాశం ఉండేది. కానీ.. సర్కార్ ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవడంతో కోటరీలోని నలుగురు బడా కాంట్రాక్టర్లు మాత్రమే ఈ పనులు చేయడానికి అర్హత సాధిస్తారు. ఆ మేరకే నిబంధనలు పెట్టారు. ఎన్నికలకు ఇం‘ధనం’ కోసమే.. నాలుగు ప్రాజెక్టులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్.. ఇందులో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ – యోగివేమన రిజర్వాయర్–హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల మినహా మిగిలిన 3 ప్రాజెక్టుల టెండర్లలో షెడ్యూలు దాఖలు చేయడానికి 18న తుది గడువుగా విధించింది. 19న టెక్నికల్ బిడ్.. 21న ప్రైస్ బిడ్ ఖరారు చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు 4 ప్రాజెక్టుల పనులను చేపట్టడానికి కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి రూ.1,000 కోట్లు కమీషన్లు దండుకుని వాటినే ఎన్నికల్లో వెదజల్లడమేనన్నది స్పష్టమవుతోంది. -
వైకుంఠపురం బ్యారేజీ పనుల్లో అడ్డగోలుగా అంచనాల సవరణ
-
మరో వంచనకు ‘డిజైన్’!
సాక్షి, అమరావతి: వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనుల్లో మరోసారి వంచనకు రంగం సిద్ధమైంది! ఈ పనులకు ఇప్పటికే రెండుసార్లు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసినా ఓ కాంట్రాక్టర్ ఎత్తుగడలతో రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనాలు భారీగా పెంచి మూడోసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పోలవరం పనులను నామినేషన్‌పై అప్పగించిన కాంట్రాక్టర్‌కే దీన్ని కూడా కట్టబెట్టేలా ప్రణాళిక రచిస్తున్నారు. సర్కారు పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్)ను రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నారు. అక్రమాలను గతంలోనే బహిర్గతం చేసిన ‘సాక్షి’ రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో జూలై 9న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే పనుల అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ముఖ్యనేతపై కాంట్రాక్టర్ ఒత్తిడి తేవటంతో టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకానికి రూ.1,213 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి సెప్టెంబరు 5న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంచనాల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘వైకుంఠపురంలో రూ.400 కోట్లు గోవిందా’ శీర్షికన సెప్టెంబరు 7న, ‘వైకుంఠపురం అంచనాల్లో వంచన’ శీర్షికన సెప్టెంబరు 18న ప్రచురించిన కథనాల ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. ఈ కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు అంచనా వ్యయం ఖరారుపై విచారణ జరిపారు. మట్టి పేరుతో మోసం! బ్యారేజీ నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే మట్టి దొరుకుతున్నా 32 కి.మీ. దూరం నుంచి తరలించాలంటూ రవాణా ఖర్చుల రూపంలోనే రూ.47.19 కోట్లను ఉత్తినే కాంట్రాక్టర్‌కు ఇచ్చేయడానికి ఎత్తుగడ వేసినట్లు విచారణలో వెల్లడైంది. గైడర్ వాల్స్ అవసరం లేకున్నా చేపట్టాలని చూపడం ద్వారా రూ.150 కోట్లు అంచనా వ్యయం పెంచినట్లు గుర్తించారు. స్పిల్‌వే కుడి వైపున 600 మీటర్ల పొడవున మట్టికట్ట నిర్మిస్తే సరిపోతుందని, దీన్ని 1,732 మీటర్లకు పెంచడం ద్వారా అంచనా వ్యయం రూ.200 కోట్ల మేర పెరిగిందని తేలింది. ఈ నేపథ్యంలో అంచనాలను రూ.397.19 కోట్ల మేర తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పూర్తి స్థాయిలో విచారించి అక్రమాలను నిగ్గు తేల్చకుండా కేవలం రూ.150 కోట్ల మేర మాత్రం కోత వేసి రూ.1,063 కోట్లను ఐబీఎంగా ఖరారు చేసి టెక్నికల్ బిడ్ తెరిచిన రోజు ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భావించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 6వతేదీన టెక్నికల్ బిడ్ తెరవగా అంచనా వ్యయం తగ్గించారని పసిగట్టిన ముఖ్యనేత కోటరీలోని ప్రధాన కాంట్రాక్టర్ ఎవరూ షెడ్యూలు దాఖలు చేయకుండా చక్రం తిప్పారు. దీంతో మళ్లీ టెండర్‌ను రద్దు చేశారు. కోటరీ కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూడా.. బ్యారేజీ పనులకు మళ్లీ టెండర్ పిలవడానికి కసరత్తు చేస్తున్న అధికారులతో ఇటీవల సమావేశమైన ముఖ్యనేత అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తెచ్చారు. పోలవరంలో నామినేషన్‌పై భారీ ఎత్తున పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూడా దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. దీంతో ఇక చేసేది లేక అంచనా వ్యయం పెంచడానికి అధికారులు సాకులు వెతుకుతున్నారు. డిజైన్‌లో భారీ మార్పులంటున్న అధికారులు వ్యాప్కోస్ రూపొందించిన బ్యారేజీ డిజైన్ సక్రమంగా లేదని చెబుతున్న అధికారులు అందులో భారీ మార్పులు చేసినట్లు పేర్కొంటున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ వైకుంఠపురం బ్యారేజీ పనుల ఐబీఎంను రూ.1,376 కోట్లకు పెంచి ముఖ్యనేత సూచించిన నిబంధనలతో మూడోసారి టెండర్ నోటిఫికేషన్ సన్నాహాలు చేస్తున్నారు. అంటే బ్యారేజీ పనుల అంచనా వ్యయం దాదాపు రూ.575 కోట్లు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ పనులను కోటరీ కాంట్రాక్టర్‌కే అప్పగించి భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారు. -
‘వైకుంఠపురం’లో రూ.400 కోట్లు గోవిందా!
సాక్షి, అమరావతి: ఈ రెండు టెండర్ నోటిఫికేషన్లను పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ నిబంధనలను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. వైకుంఠపురం బ్యారేజీ టెండర్లలో చోటుచేసుకున్న గోల్మాల్ ఇదీ. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో ముఖ్యనేత యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారనడానికి ఇదో నిదర్శనం. పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ విధానంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కే వైకుంఠపురం బ్యారేజీ పనులను సైతం అప్పగించాలని ముఖ్యనేత ముందే నిర్ణయించారు. కానీ, జూలై 9న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో జారీ చేసిన టెండర్లలో అస్మదీయ కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం ఉండదని అనుమానం వచ్చి, వాటిని రద్దు చేసేలా చక్రం తిప్పారు. తాజాగా ఈ నెల 5న వైకుంఠపురం బ్యారేజీ పనులతోపాటు బ్యారేజీ నుంచి రాజధానికి నీటిని సరఫరా చేసే పథకం పనులకు ఒకే ప్యాకేజీ కింద ఈపీసీ(ఇంజనీరింగ్–ప్రొక్యూర్మెంట్–కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. జూలై 9న జారీ చేసిన టెండర్లో అంచనా వ్యయం రూ.801.88 కోట్లు. ఈపీసీ విధానంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లో ఐబీఎం అధికారికంగా ఇప్పటివరకూ నిర్ణయించలేదు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు రూ.1,239.21 కోట్లు. ఇందులో నీటి పథకం వ్యయం రూ.145 కోట్లకు మించదు. అంటే వైకుంఠపురం బ్యారేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.292.33 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి జూలై 9న జారీ చేసిన టెండర్ల సమయంలోనే అంచనా వ్యయం రూ.154 కోట్ల మేర పెంచేశారు. మొత్తం మీద బ్యారేజీ పనుల వ్యయాన్ని రూ.446.33 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యనేత జేబుల్లోకి రూ.400 కోట్లు వైకుంఠపురం బ్యారేజీ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. బిడ్లు దాఖలు చేయడానికి తుది గడువు సెప్టెంబర్ 19. ఈ నెల 11న ప్రీబిడ్ సమావేశాన్ని విజయవాడలో కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ నిర్వహించనున్నారు. 21న టెక్నికల్ బిడ్.. 25న ప్రైస్ బిడ్ తెరిచి ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి రూ.400 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో ముఖ్యనేతకు ముట్టనున్నాయి. జూలై 9న లంప్సమ్(ఎల్ఎస్) ఓపెన్ విధానంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ పని పేరు: రాజధానిలో ప్రాంతంలో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం నీటి నిల్వ సామర్థ్యం: 10 టీఎంసీలు అంచనా వ్యయం: 801.88 కోట్లు బిడ్ దాఖలు చేయాలంటే.. ♦ జాయింట్ వెంచర్లు(ఇద్దరు లేదా ముగ్గురు కాంట్రాక్టర్లు కలిసి) అనర్హులు. ♦ బిడ్ దాఖలు చేయాలంటే 2008–09 నుంచి 2017–18 వరకు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.200.47 కోట్ల విలువైన బ్యారేజీ పనులను పూర్తి చేసి ఉండాలి. ♦ బ్యారేజీ పనుల్లో 14.60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.12 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలి. 2,710 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను ఉపయోగించి గేట్లను ఒకే ఏడాదిలో తయారు చేసి ఉండాలి. ♦ కాంట్రాక్టర్ వద్ద రూ.120 కోట్ల మేర నగదు నిల్వ ఉండాలి. సెప్టెంబర్ 5న ఈపీసీ విధానంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ పని పేరు: వైకుంఠపురం బ్యారేజీ, రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని సరఫరా చేసే పథకం నీటి నిల్వ సామర్థ్యం: 10 టీఎంసీలు అంచనా వ్యయం: రూ.1,239.21 కోటు!్ల బిడ్ దాఖలు చేయాలంటే... ♦ జాయింట్ వెంచర్లు అర్హులే. ఇందులో కాంట్రాక్టర్లు ముగ్గురికి మించకూడదు. ♦ గత పదేళ్లలో ఏదైనా ఒక ఏడాదిలో రూ.303 కోట్ల విలువైన బ్యారేజీ, నీటి పథకాల పనులు చేసిన అనుభవం ఉండాలి. ఒక ఏడాదిలో 13.96 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,58,850 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, 4,260 మెట్రిక్ టన్నుల స్టీలును వినియోగించి గేట్లు తయారు చేసి, అమర్చిన అనుభవం ఉండాలి. ♦ ఐదు క్యూమెక్కుల సామర్థ్యంతో 2 పంపులు, 2 మెగావాట్ల సామర్థ్యంతో రెండు మోటార్లు, 1.8 మీటర్ల వ్యాసార్ధం.. 2 కిలోమీటర్ల పొడవున ప్రెజర్మైన్ పనులు చేసి ఉండాలి. -
రూ.150 కోట్ల అవినీతి స్రవంతి
సాక్షి, అమరావతి : టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపారు. అడిగిన మేరకు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కు మాత్రమే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేశారు. ఒక కాంట్రాక్టర్‌పై సాంకేతిక (టెక్నికల్) బిడ్‌లో అనర్హత వేటు వేశారు. బరిలో ఒక్క కాంట్రాక్టరే మిగలడంతో నిబంధనల ప్రకారం ఆర్థిక(ఫైనాన్స్) బిడ్ తెరవకూడదు. ఎందుకంటే పోటీ లేకపోవడం వల్ల అధిక (ఎక్సెస్) ధరలకు పనులు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకే షెడ్యూలు మిగిలినప్పుడు ఆర్థిక బిడ్ తెరవ కుండా టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం జీవో 174లో స్పష్టంగా పేర్కొంది. నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫైనాన్స్ బిడ్‌ను తెరిపించారు. అస్మదీయ కాంట్రాక్టర్ 4.57 శాతం అధిక ధరకు కోట్ చేసినట్లు వెల్లడైంది. ఆ టెండర్లను ఆమోదిం చాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ. 150 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారనున్నాయి. సీఎం చంద్రబాబు కనుసన్నల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగిస్తున్న ఈ అక్రమాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం వేదికైంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా 63.4 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 30 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో రూ.7,214.1 కోట్ల అంచనాతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని జనవరి 2, 2009న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఆయన హఠాన్మరణంతో ఈ పథకం మరుగున పడింది. అంచనా వ్యయం పెంచేసి.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని మరుగున పడేయడంపై ప్రజలు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. రూ. 2,022.20 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశను గతేడాడి సెప్టెంబర్ 5న మంజూరు చేసింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి పది టీఎంసీలను మళ్లించి విశాఖపట్నం జిల్లాలో 9 మండలాల్లోని 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. కానీ.. 2009లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.801.03 కోట్లు మాత్రమే. అంటే అంచనా వ్యయాన్ని రూ.1,221.17 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత తొలి దశ పనులను రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. ఈ పనులను తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాపార భాగస్వామి అయిన హెచ్‌ఈఎస్–ఇన్ఫ్రాకు అప్పగించాలని సీఎం చంద్రబాబును మంత్రి యనమల మొదట్లోనే కోరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. యనమల ప్రతిపాదన మేరకు గత ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో మొదటి ప్యాకేజీ (పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 3.5 కి.మీ.ల ప్రధానకాలువ తవ్వకం, లైనింగ్, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్) పనులకు రూ.268.92 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 4.85 శాతం అధిక ధరలకు అంటే 281.96 కోట్లకు హెచ్‌ఈఎస్ సంస్థకు కట్టబెట్టారు. రెండో ప్యాకేజీలోనూ అదే దందా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశలో రెండో ప్యాకేజీ పనుల (పెదపూడి రిజర్వాయర్‌లోకి రెండు దశల్లో నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం)కు రూ. 603.87కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ విధానంలో జూన్ 8న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్లలో ఇతరులు ఎవరికీ పాల్గొనే అవకాశమే లేకుండా చేసేందుకు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 15,118 ఎకరాలకు మాత్రమే పైపుల ద్వారా నీళ్లందించాలని ప్రతిపాదించారు. అంటే.. పైపుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించిన అనుభవమున్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులనే నిబంధన పెట్టేందుకే దీనిని చొప్పించారని స్పష్టమవుతోంది. ఆ నిబంధన మేరకే హెచ్‌ఈఎస్ సంస్థ మెగా సంస్థతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు. దానితో షెడ్యూల్ దాఖలు చేయించారు. ఎన్సీసీ సంస్థ మరో షెడ్యూల్ దాఖలు చేసింది. ఈనెల 2న టెక్నికల్ బిడ్ తెరిచారు. ఎన్సీసీ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్లో తప్పులు ఉన్నాయంటూ ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు. అంటే బరిలో హెచ్‌ఈఎస్–మెగా (జేవీ) మాత్రమే మిగిలింది. షెడ్యూలు ప్రకారం ఈనెల 4న ప్రైస్ బిడ్ తెరవాలి. ఒకే ఒక సంస్థ బరిలో మిగిలిన నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రైస్ బిడ్ తెరవకూడదని అధికారులు నిర్ణయించారు. కానీ.. మంత్రులు దేవినేని, యనమల అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈనెల 12న ప్రైస్ బిడ్ తెరిపించినట్లు తెలుస్తోంది. ఇందులో 4.57 శాతం అధిక ధరలకు ఆ సంస్థ కోట్ చేసింది. ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ సీవోటీకి సోమవారం అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదముద్రే తరువాయి.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ రెండో ప్యాకేజీ టెండర్లను ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబు, ఇద్దరు మంత్రులు సీవోటీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ టెండర్లను తిరస్కరించాలి. కానీ.. ఒత్తిడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆ టెండర్లను ఆమోదించే అవకాశం ఉందని అధికారవరర్గాలు వెల్లడించాయి. 2017–18 ఎస్ఎస్ఆర్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే రెండో ప్యాకేజీ పనుల్లో జమ్మాదులపాలెం, తీడ పంప్ హౌస్‌ల పనులకు రూ. 243 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారవర్గాలే చెబుతున్నాయి. లీడింగ్ ఛానల్ తవ్వకం పనులకు రూ. 50.73 కోట్లు, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ. 130 కోట్లకు మించి వ్యయం కాదు. అంటే.. మొత్తం 423.13 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. పనుల వ్యయాన్ని రూ. 603.87 కోట్లకు పెంచేసి టెండర్లు పిలవడం, వాటిని 4.57 అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా రూ. 150 కోట్లకుపైగా కమీషన్లు రాబట్టుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.