Tennessee
-
USA: టోర్నడో ఎగరేసుకుపోయినా... చెక్కుచెదరలేదు!
అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్భుతమే జరిగింది. రెండు భయానక టోర్నడోలు రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా ఆరుగురు వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకెగిసి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ నాలుగు నెలల బుడతడు మాత్రం చెక్కు చెదరలేదు! అంతటి ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కని్పంచే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఇలా జరిగింది.. సిడ్నీ మూర్ (22), అరామిస్ యంగ్‌బ్లడ్ (39) దంపతులది టెన్నెసీలోని క్లార్క్స్‌విల్లే. మొబైల్ వ్యాన్లోనే నివాసం. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రిన్స్టన్కు ఏడాది కాగా రెండో వాడు లార్డ్‌కు నాలుగు నెలలు. గత శనివారం హఠాత్తుగా టోర్నడో (భారీ సుడిగాలి) క్లార్క్స్విల్లేను కకావికలు చేసి పారేసింది. స్థానిక అధికార యంత్రాంగం టోర్నడో సైరన్ ఇవ్వకముందే వారి మొబైల్ వ్యాన్‌పై విరుచుకుపడింది. చూస్తుండగానే పైకప్పును లేపేసింది. దాంతో మూర్ హుటాహుటిన ప్రిన్స్టన్ను హృదయానికి హత్తుకుని నేలకు కరుచుకుపోయింది. ఊయలలో నిద్రిస్తున్న లార్డ్‌ను కాపాడేందుకు తండ్రి పరుగులు తీశాడు. అప్పటికే ఆ చిన్నారిని టోర్నడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. సుడిగాలి, అందులో అప్పటికే చిక్కిన అనేకానేక శిథిలాల మధ్య పాపం పసివాడు సుడులు తిరుగుతూ కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మొబైల్ వ్యాన్ పూర్తిగా నేలమట్టమైంది. హోరు గాలులు, వాటిని మించిన జోరు వానతో పరిస్థితి భీతావహంగా తయారైంది. శిథిలాల్లోంచి పెద్ద కొడుకుతో పాటుగా మూర్ పాక్కుంటూ సురక్షితంగా బయటికి రాగలిగింది. కానీ పసివాడితో పాటు అతన్ని కాపాడబోయిన తండ్రి సైతం సుడిగాలి దెబ్బకు కొంత దూరం ఎగిరిపడ్డాడు. అంతెత్తు నుంచి అమాంతంగా కిందపడి భుజం విరగ్గొట్టుకున్నాడు. అంతటి నొప్పితోనే బాబు కోసం 10 నిమిషాల పాటు శిథిలాల దిబ్బలన్నీ ఆత్రంగా వెదికాడు. చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్ గుక్కపట్టి ఏడుస్తూ కని్పంచాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. ఇదంతా ఏదో సినిమాలో సన్నివేశంలా తోస్తోందంటూ జరిగిన భయానక ఘటనను మూర్ గుర్తు చేసుకుంది. ‘‘హోరు వానలో జారిపోయిన భుజంతో నిలువెల్లా తడిసి చేతుల్లో మా చిన్న కొడుకుతో నా భర్త తిరిగొస్తున్న దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ హర్షాతిరేకాలు వెలిబుచ్చింది. టెన్నెసీలో అంతే... టెన్నెసీ రాష్ట్రం అమెరికాలో భారీ టోర్నడోలకు పెట్టింది పేరు. గత శనివారం గంటకు ఏకంగా 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడ్డ టోర్నడోలు పెను విధ్వంసమే సృష్టించాయి. వాటిలో ఒక టోర్నడో అయితే మాంట్గొమరీ కౌంటీ నుంచి లొగాన్ కౌంటీ దాకా ఏకంగా 43 మైళ్ల దూరం ప్రయాణించింది. దారిపొడవునా సర్వాన్నీ తుడిచిపెట్టేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్కూల్లో నరమేధం.. చిన్నారులు, సిబ్బంది మృతి
నాష్విల్లే: అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మరోసారి ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. టేనస్సీ స్టేట్ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్లో సోమవారం ఘోరం జరిగింది. ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు(9 ఏళ్లలోపు వయసు వాళ్లే), ముగ్గురు సిబ్బంది(స్కూల్ హెడ్ సహా) ఉన్నారు. కాల్పులు జరిపింది అదే స్కూల్ పూర్వ విద్యార్థి కాగా, ఆమెను అక్కడిక్కడే కాల్చి చంపారు పోలీసులు. నాష్‌విల్లేకు చెందిన 28 ఏళ్ల ఆడ్రీ హేల్ ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు ప్రకటించారు. రెండు రైఫిల్స్ Assault Rifles, ఓ హ్యాండ్ గన్‌తో స్కూల్ సైడ్ డోర్ నుంచి ప్రవేశించిన దుండగురాలు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే కుప్పకూలారు. ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని దాడులకు ప్లాన్! మిగతా పిల్లలు, స్టాఫ్‌ను భద్రంగా బయటకు తీసుకొచ్చారు. కాల్పులకు దిగిన మహిళను అక్కడిక్కడే కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఆడ్రీ హేల్ అదే స్కూల్లో పూర్వ విద్యార్థి. ఆమెను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, బహుశా కోపంలోనే ఆమె అలా దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆమె కాల్పులకు తెగబడింది. కేవలం స్కూల్‌ను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకోలేదు. ఆమె దగ్గర మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన మ్యాప్‌లు దొరికాయి. అందులో ఈ స్కూల్ ఒకటి. బహుశా.. ఆమె మరిన్ని దాడులకు సిద్ధమై ఉందేమో అని ఓ అధికారి తెలిపారు. కోపంలోనే ఆమె కాల్పులకు దిగిందా? లేదా ఇంకా వేరే కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాల్పుల ఘటనపై వైట్‌హౌజ్ స్పందించింది. హృదయవిదారకరమైన ఘటన అని ఓ ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్ ప్రభుత్వం చేస్తున్న ఆయుధ నిషేధ చట్టానికి Assault weapons Ban మద్దతు ఇవ్వాలంటూ రిపబ్లికన్లను వైట్‌హౌజ్ ఆ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి స్కూల్స్‌పై దాడుల్లో నరమేధం ఎప్పటికప్పుడు ఆయుధాల నిషేధ చట్టం గురించి చర్చ తీసుకొస్తోంది అక్కడ. కిందటి ఏడాది టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. 2012లో.. కనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది చనిపోగా.. అందులో 20 మంది పిల్లలే ఉన్నారు. -
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
విలయ విధ్వంసం.. 94కు చేరిన మరణాలు, వైరలైన దృశ్యాలు
వాషింగ్టన్/శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఆరు రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటకీ, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, మిస్సోరి, అర్కాన్సస్, మిస్సిసిపీ రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మృతుల సంఖ్య 94కు చేరింది. కెంటకీలోని మేఫీల్డ్ పట్టణంలో కొవ్వొత్తుల ఫ్యాక్టరీ ధ్వంసం కావడంతో 80 మంది మరణించారని గవర్నర్ ఆండీ బెషియర్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. Another video from my cousins house. #kywx #Tornado This historic tornado ripped through our small community. pic.twitter.com/ly2IID2N64 — H🏀🏀P There it is (@TotallyTwitched) December 11, 2021 ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్ గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు ఉద్యోగులు, ఆర్కాన్సస్‌లో ఓ నర్సింగ్ హోమ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరు, టెన్నెస్సీలో నలుగురు, మిస్సోరీలో ఇద్దరు టోర్నడోల కారణంగా కన్నుమూసినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. Dawson Springs, Ky is 70 miles away from #Mayfield and was also devastated by the #Tornado #WX pic.twitter.com/kBwBxcxURi — WxChasing- Brandon Clement (@bclemms) December 11, 2021 మేఫీల్డ్ పట్టణం పూర్తిగా ధ్వంసమయ్యింది. పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లు, కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. పట్టణంలో ఎటుచూసినా విధ్వంసమే కళ్ల ముందు కనిపిస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆరు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద విలయాల్లో ఒకటని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇక టోర్నడో విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. MUST WATCH: A man from #Kentucky lost his home after the #tornado Yet, here he sits at his piano playing the @Gaithermusic tune, “There’s Something About That Name.” The peace that passes understanding. #ARwx @FOX16News @KARK4News @NWS @HaydenNix pic.twitter.com/LiGHMmKDzb — Cassandra Webb (@cassandrawebbtv) December 12, 2021 Mayfield, KY at daybreak - drone. The town has basically been flattened, no words. Video: LiveStormsMedia#Mayfield #Kentucky #Tornado #tornadoemergency #severewx #SevereWeather #tornadoemergency #tornadooutbreak #longtracktornado pic.twitter.com/DBadxT9pSD — AC 😷 (@ACinPhilly) December 11, 2021 చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం.. చైనాలో విరుచుకుపడ్డ టోర్నడోలు, 12 మంది మృతి -
వందేళ్లలో అమెరికాలో భారీ వర్షం.. 22 మంది మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికాలోని టెన్నెస్సీ భారీ వర్షం ధాటికి అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదల్లో వందలాది కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో మనుషులు గల్లంతయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక వందేళ్లలో అమెరికా చూసిన అత్యంత భారీ వర్షం ఇదే అంటున్నారు అధికారులు. టెన్నిస్సీలోని హంప్రీ కౌంటీలో 24 గంటల్లో 43 సెంటీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. (చదవండి: రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!) -
అదృష్టం అంటే ఈ కుక్కదే.. రూ.36 కోట్ల ఆస్తి
వాషింగ్టన్/టేన్నసీ: సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు.. జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. కుక్కల్లో ఈ విశ్వాసం పాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అవి మన నుంచి ప్రేమను తప్ప ఇంకేం ఆశించవు. మరి కొందరైతే కుటుంబ సభ్యులతో సమానంగా వీటిని చూసుకోవడమే కాక.. ఏకంగా వాటికి ఆస్తిలో వాటా కూడా ఇస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన అమెరికాలోని టేన్నసీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన వీలునామాలో పెంపుడు కుక్క పేర మీద 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. వివరాలు.. టేన్నసీకి చెందిన బిల్ డోరిస్(84) అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ట్రావేలింగ్ హాబీ కల డోరీస్ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క లులుని తన స్నేహితుడు మార్ట్ బర్టన్ వద్ద వదిలేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో గతేడాది డోరిస్ మరణించాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు. ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం డోరిస్ లాయర్ ఆయన చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్ట్‌కి అందించాడు. దానిలో డోరిస్ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. ఈ మొత్తాన్ని లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం వాడాలని కోరాడు. ఇక లులు బాధ్యతని తన స్నేహితుడు మార్ట్ తీసుకోవాల్సిందిగా వీల్లులో అభ్యర్థించాడు డోరిస్. లులు పేరు మీద ఉన్న ఆస్తికి అతను ట్రస్టీగా ఉంటాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మార్ట్ మాట్లాడుతూ.. ‘‘డోరిస్ రాసిన వీలునామా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. డోరిస్, లులు ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన బిడ్డలానే చూసేవాడు’’ అని తెలిపారు. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! వాలెంటైన్స్ డే: ఫ్రీగా విడాకులు ఇప్పిస్తాం -
వాలెంటైన్స్ డే: ఫ్రీగా విడాకులు ఇప్పిస్తాం
వాషింగ్టన్/టేనస్సీ : ప్రేమికుల దినోత్సవం నాడు ఒంటరి వ్యక్తులు జంటగా మారతారు. చాలా మంది ఇష్టపడే వ్యక్తికి తమ ప్రేమను తెలపడం కోసం ప్రేమికుల దినోత్సవం వరకు వెయిట్ చేసి.. వాలెంటైన్స్ డే నాడు ప్రపోజ్ చేస్తారు. అంటే ఒంటరిని జంటగా మార్చే రోజు. అయితే ఓ లా కంపెనీ మాత్రం వెరైటీగా ప్రేమికుల దినోత్సవం నాడు ఓ లక్కీ కపుల్‌కి ఫ్రీగా విడాకులు ఇప్పిస్తామని ప్రకటించింది. టేనస్సీ క్రాస్‌విల్లేలోని పవర్స్ లా ఫర్మ్ ఈ ఆఫర్ ఇచ్చింది. ఒక లక్కీ కపుల్‌ని సెలక్ట్ చేసి.. వారి విడాకులకు సంబంధించి ఉచితంగా లీగల్ సర్వీస్ చేస్తామని.. కోర్టు ఫీజు కూడా తీసుకోమని వెల్లడించింది. (చదవండి: బాయ్‌ఫ్రెండ్ లేకపోతే కాలేజీకి రావొద్దు) ఈ మేరకు పవర్స్ లా తన ఫేస్బుక్ పేజిలో ‘‘ఈ ఏడాది ఎంతో భయంకరంగా గడిచింది. కరోనా వల్ల దేశం రెండుగా చీలడమే కాక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో మేం ఓ లక్కి కంటెస్టెంట్‌కి వాలెంటైన్స్ డే సందర్భంగా ఉచితంగా విడాకులు ఇప్పించడానికి నిర్ణయించాము. ఎందుకంటే వాలెంటైన్స్ డే లాంటి పిచ్చి సంస్కృతి వల్ల మనిషి తన ఆర్థిక స్థితిని ఆలోచించుకోకుండా.. ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొలేకనో.. మరి ఇతర కారణాల వల్లనో విడిపోవాలని భావిస్తున్నాడు. అలాంటి వారిలో ఒకరిని సెలక్ట్ చేసి ఉచితంగా విడాకులు ఇప్పిస్తాం. ఇక మన దేశంలో విడాకులు తీసుకోవడం ఎంత ఖర్చుతో కూడుకున్న పనే తెలిసిందో. 1150 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుంది. చాలా మంది దీన్ని భరించే స్థితిలో కూడా లేరు. అందుకే ఈ ఆఫర్’’ అని సంస్థ ఫేస్బుక్ వేదికగా ప్రకటించింది. (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను) ఇక ఆసక్తి ఉన్న వారు తాము ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో తెలుపుతూ.. తన కంపెనీకి ఈమెయిల్ చేయాల్సిందిగా సూచించింది. అంతేకాక భార్యభర్తలిద్దరు విడాకులకు సిద్ధంగా ఉండాలని.. సంతానం ఉండకూడదు అని వెల్లడించింది. ఇక ఇందులో ఉచితంగా పాల్గొనవచ్చని తెలిపింది. విన్నర్‌ని ఫిబ్రవరి 19న ప్రకటిస్తామని వెల్లడించింది. -
ఫేమస్ అవ్వాలని బాంబు పెట్టాడు!
వాషింగ్టన్: క్రిస్టమస్ పర్వదినం నాడు అమెరికా టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలో ఓ వాహనంలో అమర్చిన బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక దాడికి పాల్పడిన వ్యక్తిని ఆంథోనీ క్విన్ వార్నర్‌గా గుర్తించారు. అయితే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే క్విన్ వార్నర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరగడానికి వారం ముందు క్విన్ వార్నర్ ‘ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని’ ఇరుగుపొరుగు వారితో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా క్విన్ వార్నర్ ఇంటి పక్క నివసించే రిక్ లాడ్ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్‌కు వారం ముందు నిందితుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. ‘క్రిస్టమస్‌కు వారం రోజుల ముందు నేను, క్విన్ వార్నర్ కాసేపు పండగ గురించి ముచ్చటించుకున్నాం. మాటలో మధ్యలో క్విన్ వార్నర్ క్రిస్టమస్ సందర్భంగా శాంటా తన కోసం ఏదైనా మంచిది తీసుకురాబోతన్నాడు అని అన్నాడు. అంతేకాక ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని వ్యాఖ్యానించాడు. అయితే అతడి మాటల వెనక ఇంత దారుణమైన ఆలోచన దాగుందని నాకు ఆనాడు తెలియలేదు. అసలు అతడి మీద ఎలాంటి అనుమానం కలగలేదు’ అన్నాడు లాడ్. ప్రస్తుతం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ వెనక గల ప్రధాన ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే క్విన్ వార్నర్ కంప్యూటర్, హార్డ్డ్రైవ్ని స్వాధీనం చేసుకున్నారు. (15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు) గత శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలింది. అయితే పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్ వ్యాన్ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన తమకు వచ్చినట్లు తెలిపారు. మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది అంటూ రికార్డు చేసి ఉంచిన సందేశం తమకు వినపడిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించామని, దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. -
మెంఫిస్ నగరంలో మహానేతకు ఘన నివాళి
టేనస్సీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తాతా రాజశేఖర్‌రెడ్డి మెంఫిస్ నగరంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కార్యనిర్వాహక వర్గం నాయకులు జైపాల్‌రెడ్డి, వీరమోహన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, రాజా చెన్నం, రమేష్ సనపాల, సూర్యరెడ్డి, విజయ్‌రెడ్డి చిట్టెం, వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. వైఎస్సార్ తన పాలనలో ప్రజల కోసం పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారని, పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించారని గుర్తు చేసుకున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అన్నదాతలకు ఉచిత కరెంట్, జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించిన తీరును స్మరించుకున్నారు. వైఎస్సార్ పాలనని తలపిస్తూ రాజన్న ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రవేశపెడుతున్న విధానం, విద్యార్థి దశ నుంచే నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న తీరును కొనియాడారు. మరిన్ని కాలాలపాటు జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. -
పాపం తాబేలు.. పరుగెత్తలేక దొరికిపోయింది!
తాబేలు.. చిట్టి పొట్టి అడుగులు వేసుకుంటా బుజ్జిబుజ్జిగా నడిచే జీవి. మెల్లగా నడిచేవారిని తాబేలులాగే ఏంటా నడక అంటారు. అది ఎంత మెల్లగా నడుస్తుందంటే.. దాదాపు రెండున్నర నెలల్లో ఒక మైలు దూరం కూడా వెళ్లలేనంత. అవును.. 68 కిలోల ఓ తాబేలు, 74 రోజుల్లో మైలు దూరం కూడా పరుగెత్తలేకపోయింది. ఫలితంగా తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చి బంధీ అయింది. వివరాల్లోకివెళితే.. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని యాష్లాండ్ సిటీకి చెందిన లిన్ కోల్ అనే మహిళ సోలొమాన్ అనే తాబేలును పెంచుకుంటోంది. 15 ఏళ్ల వయసు గల ఆ తాబేలు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో లిన్ కోల్ ఆందోళనకు గురై.. తాబేలు కనిపించడం లేదనే స్టిక్కర్లను చుట్టుపక్కల ఏర్పాటుచేసింది. కొద్ది రోజుల పాటు చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోయింది. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి) అయితే 74 రోజుల తరువాత లిన్ కోల్ ఇంటి సమీపంలోని ఓ వ్యాలీ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఓ వ్యక్తికి తాబేలు కనిపించింది. వెంటనే లిన్ కోల్‌కు ఫోన్ చేసి ఆమె ఇంటికి వచ్చి మరీ ఆ వ్యక్తి తాబేలును అందజేశాడు. అయితే ఈ 74 రోజుల్లో అది కేవలం ఒక మైలు దూరం కూడా వెళ్లకపోవడం విశేషం. తన తాబేలు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని.. తన పెంపుడు తాబేలును మళ్లీ చూస్తానని అనుకోలేదని లిన్ కోల్ పేర్కొంది. యజమానికి ఆనందం ఉన్నప్పటీకీ.. తాబేలుకి మాత్రం పరుగెత్తలేక దొరికిపోయానన్న బాధ ఉండే ఉంటుంది. -
ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైనా చూశారా
వాషింగ్టన్ : అమెరికాలోని టెనేస్సీ రాష్ట్రానికి చెందిన జేడ్ డాడ్‌కు వింత అనుభవం ఎదురైంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి రెన్యువల్‌ను ఆన్లైన్లో అప్లై చేశారు. సరిగ్గా వారం క్రితం పోస్ట్ ద్వారా లైసెన్స్ ఇంటికి వచ్చింది. అయితే జేడ్ లెసెన్స్‌ను చూడగానే కొంచెం ఆశ్చర్యానికి లోనైంది. డ్రైవింగ్ లైసెన్స్‌పై తన ఫోటోకు బదులు ఖాళీగా ఉన్న కుర్చీ మాత్రమే కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని సదరు ఆర్టీఏ ఆఫీసుకు ఈ-మెయిల్ ద్వారా పంపించింది. అయితే డాడ్ ఫోన్లో చెప్పిన విషయం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారిణి నమ్మలేదు. జేడ్ పంపిన మెయిల్‌ను చూసి ఆమె కూడా షాక్‌కు గురైంది. నిజంగా.. ఇది నమ్మలేకపోతున్నా.. ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళతా అని చెప్పారు.(భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో) అయితే అసలు విషయం ఏంటంటే డాడ్ ఆన్లైనలో అప్లై చేసేటప్పుడు.. ఫోటో సరిగానే దిగింది.. సేవ్ చేసేటప్పుడు మాత్రం తను దిగిన ఫోటో కాకుండా పొరపాటున ఖాళీగా ఉన్న కుర్చీని అప్లోడ్ చేసింది. ఈ విషయాన్ని గమనించని అధికారులు అదే ఫోటోను పెట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ ద్వారా పంపించారు. అయితే డాడ్ దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదు.. అంతేగాక ఫోటో వల్ల తాను పని చేస్తున్న సంస్థలో జరిగిన ఫన్నీ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. ఆఫీసులో బాస్‌తో పాటు కొలీగ్స్ ఖాళీగా ఉన్న కుర్చీని చూపిస్తూ ' డాడ్.. ఖాళీ కుర్చీలో ఉన్నావా' అంటూ ఆటపట్టించేవారు అంటూ తెలిపారు. ఈ వింత డ్రైవింగ్ లైసెన్స్‌ను జేడ్ డాడ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఈ సోమవారం డాడ్‌కు మళ్లీ లెసెన్స్ పోస్ట్‌లో వచ్చింది.. ఈసారి మాత్రం ఖాళీ కుర్చీ కాకుండా ఆమె ఫోటోనే వచ్చింది. -
కోర్టులో గంజాయి సిగరెట్ కాల్చాడు..
-
వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు
టేనస్సీ : కోర్టు ఆవరణలో జడ్జీ ముందే ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ (గంజా సిగరెట్)ను తాగిన ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలో చోటు చేసుకుంది. కోర్టు ధిక్కారణ కేసు కింద అతనికి 10 రోజులు జైలు శిక్ష కూడా విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాల్లోకి వెళితే.. టేనస్సీ నగరానికి చెందిన స్పెన్సర్ బోస్టన్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇటీవల అతన్ని టెనస్సీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతను తన వాదనలు వినిపిస్తూ.. గంజాయి విక్రయాన్ని చట్ట బద్ధం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బోనులోనే నిలబడి జేబులో నుంచి సిగరెట్ తీసి కాల్చాడు. అందరికి గంజాయి సిగరెట్ చూపిస్తూ.. ఇది తీసుకోవడం తప్పు కాదు.. బహిరంగంగా గంజాయి తీసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉందంటూ గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు ఆవరణలో.. న్యాయమూర్తి ముందే సిగరెట్ కాల్చిన బోస్టన్‌కు కోర్టు ధిక్కారణ కేసు కింది 10 రోజులు జైలు శిక్ష విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. నిందితుడు స్పెన్సర్ బోస్టన్ -
అమెరికాలో ఇద్దరు భారత విద్యార్ధుల మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని టెనెస్సీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్ధులు మరణించారు. థ్యాంక్స్ గివింగ్ డే రోజు జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్ యజమాని పోలీసులకు లొంగిపోయాడని అధికారులు వెల్లడించారు. మరణించిన ఇద్దరు విద్యార్ధులు టెన్నెస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అభ్యసిస్తున్న జుడీ స్టాన్లీ (23) వైభవ్ గోపిశెట్టి (26)లుగా గుర్తించారు. దక్షిణ నాష్‌విలేలో నవంబర్ 28 రాత్రి నిస్సాన్ సెంట్రాలో వెళుతున్న వీరిద్దరినీ ట్రక్ ఢీకొనడంతో మరణించారని స్ధానిక పోలీసులు తెలిపారు. స్టాన్లీ ఫుడ్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తుండగా, గోపిశెట్టి పీహెచ్డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరి మరణం వర్సిటీలో విషాదం నింపిందని ఇది దురదృష్టకర ఘటన అని అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్ ఓనర్ డేవిడ్ టోర్స్‌పై లుక్అవుట్ నోటీస్ జారీకాగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరోవైపు ఇండియాలో జరిగే వీరిద్దరి అంత్యక్రియలకు వర్సిటీ విద్యార్ధులు గోఫండ్ మీ ద్వారా విరాళాలు సేకరించారు. ఎన్నో కలలతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వీరి అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని పలువురు ప్రవాస భారతీయులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు విద్యార్థి మృతి
టెనెస్సీ: అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయ విద్యార్థులు జుడీ స్టాన్లీ(23), వైభవ్ గోపిశెట్టి(26) టెనెస్సీ స్టేట్ యూనివర్సిటీ(టీఎస్‌యూ)లో ఫుడ్ సైన్స్ కోర్సు చదువుతున్నారు. వీరిద్దరూ నవంబర్ 28న జరిగిన ఓ పార్టీ నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో వేగంగా వస్తున్న ట్రక్కు వీరి కారును ఢీ కొట్టడంతో టెనెస్సీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విద్యార్థులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టారెస్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాగా మృతుల్లో ఒకరైన వైభవ్ గోపిశెట్టి విజయవాడకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. భారతీయ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై టెనెస్సీ యూనివర్సిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్వదేశంలో జరిగే వీరి అంత్యక్రియల కోసం యూనివర్సిటీ విద్యార్థులు ‘గో ఫండ్ మీ పేజ్’ను ఏర్పాటు చేసి 42వేల డాలర్లు సేకరించారు. -
టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో జరిగిన ఈ ఉగాది సంబరాల్లో లైవ్ కాన్సర్ట్‌లో గాయనీ గాయకులు సుమంగళి, గీతా మాధురి, రోహిత్, శ్రీకాంత్, మెహర్ చంటి లైవ్ బాండ్‌తో అలరించారు. సుమారు 800 మంది ఆహుతులు పాల్గొన్న ఈకార్యక్రమాన్ని ముందుగా షాలిని వేమూరి భరతనాట్యంతో ప్రారంభించారు. క్రిస్టల్ ఈవెంట్స్ వారు చక్కని స్టేజి డెకరేషన్, ఫోటో బూత్ రెడీ చేయగా, మామ్ అండ్ మీ కాన్సెప్ట్ తో నిర్వహించిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. తొలుత సోలో, తర్వాత డ్యూయెట్ పాటలతో స్టేజి మార్మోగిపోయింది. యాంకర్ సాహిత్య తన వ్యాఖ్యానంతో అబ్బురపరిచింది. టెన్నెస్సీ తెలుగు సమితి తదుపరి కార్యవర్గాన్ని అధ్యక్షులు దీప్తి రెడ్డి సభకు పరిచయం చేశారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులను, స్పాన్సర్స్, సింగర్స్ అందరిని సత్కరించారు. టాలెంట్ షో, తానా క్యూరీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాఫుల్ విజేతలకు అయిదు గ్రాముల గోల్డ్ కాయిన్స్ అందజేయడం విశేషం. అలాగే వినయ గోపిశెట్టి రూపకల్పన చేసిన విభా ఫ్యాషన్ షో హైలెట్‌గా నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా చేసిన డ్రమ్స్ షో, సింగర్స్ సంగీతం స్టాండింగ్ ఒవేషన్ అతిథులను ఆకట్టుకుంది. పెద్దలు కార్యక్రమాన్ని ఆస్వాధించడంకోసం తమ పిల్లలకు విడిగా ప్రొఫెషనల్ ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చెయ్యడం విశేషం. చివరిగా అధ్యక్షులు దీప్తి రెడ్డి ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన టీటీయస్ కార్యవర్గ సభ్యులు, అడ్వైజరీ కమిటీ, యూత్ కమిటి, స్పాన్సర్స్, అలాగే ఉగాది పచ్చడితోపాటు రుచికరమైన భోజనాన్ని అందించిన అమరావతి రెస్టారెంట్, విజయవంతంచేసిన ప్రేక్షకులు, ప్రత్యేకంగా ప్లాటినం స్పాన్సర్షిప్ ద్వారా లైవ్ బాండ్‌ని సమర్పించిన డాక్టర్ దీపక్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది. -
టెన్నెస్సీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
టెన్నెస్సీ : అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తి రెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం నిర్వహణలో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకల్లో ముగ్గుల పోటీలలో భాగంగా తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేశాయి. బొమ్మల కొలువు, చిత్రలేఖనం, చర్చా వేదిక తదితర పోటీలలో పిల్లలు పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించడంతో ముసి ముసి నవ్వులతో కేరింతలు కొట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల విజేతలకు ట్రోపీలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు వంటి వివిధ పోటీల విజేతలకు బహుమతులు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడీ బ్యాగ్స్ అందజేశారు. అలాగే కళా రంగానికి చేస్తున్న సేవలకు గాను మోనికా కూలేని సత్కరించారు. పాత కొత్త పాటలతో గాయకులు సందీప్ కూరపాటి, గాయని శృతి నండూరిలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇండియా నుంచి తెప్పించిన సంక్రాంతి స్పెషల్ అరిసెలతోపాటు అమరావతి రెస్టారెంట్ వారు అందించిన పసందైన విందు భోజనాన్ని అందరూ ఆస్వాదించారు. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకించి యూత్ కమిటీ సభ్యులను టెన్నెస్సీ తెలుగు సమితి సేవా కార్యక్రమాలవైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లితండ్రులను కొనియాడారు. అలాగే ఈ వేడుకల నిర్వహణలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు, ఆడియో సహకారం అందించిన డీజే శ్రీమంత్ బృందావనం, వీడియో, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్ తదితరులను అభినందించారు. -
త్వరలో వస్తానన్నాడు.. అంతలోనే..
టెన్సిపీ : అమెరికాలో తెలుగు వ్యక్తి సునీల్ ఎడ్ల (61) గురువారం రాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. సునీల్ మరో రెండు వారాల్లో సొంతూరుకు రావాల్సి ఉందని ఆయన బంధువులు వెల్లడించారు. ‘క్రిస్టమస్, తల్లి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సునీల్ ఈ నెల (నవంబర్) 27న స్వస్థలానికి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు తమతో గడుపేందుకు వస్తున్నానీ చెప్పాడు’ అని ఆయన బంధువులు తెలిపారు. అంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. (అమెరికాలో ఎన్ఆర్ఐ హత్య) కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన సునీల్ 30 ఏళ్ల క్రితం అమెరికా వలస వచ్చాడు. అట్లాంటిక్ పట్టణంలోని ఓ రెస్టారెంట్లో ఆయన ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజు సునీల్ డ్యూటీ నిమిత్తం ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు బయటకు రాగా.. 16 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఆయనను కాల్చి చంపారు. అంనతరం సునీల్‌కు చెందిన సబారు ఫోర్స్టర్ కారులోనే పరారయ్యారు. కాగా, అట్లాంటిక్‌సిటీ పోలీసులు నిందితులను పట్టుకుని జైలుకు తరలించారు. వారిపై హత్య, దోపిడీ నేరాలు మోపామని చెప్పారు. ఆయనకు భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెన్సీసీలోని వివిధ చర్చిలలో పాటలు పాడటం ద్వారా సునీల్ చాలా మందికి సుపరిచితులు. మెదర్ చర్చిలోనూ ఆయన చాలా సార్లు పాటలు పాడారని ఆయన బంధువులు తెలిపారు. -
అమెరికాలో ఎన్ఆర్ఐ హత్య
టెన్సీసీ : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. టెన్సీసీ రాష్ట్రంలో తెలుగు వ్యక్తి ఎడ్ల సునీల్ హత్యకు గురయ్యారు. ఇద్దరు మైనర్లు కాల్చి చంపారు. గత 25 ఏళ్లుగా టెన్సీసీలోని నార్త్ నాష్ విల్లేలో సునీల్ స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి నుంచి మనవడిని తీసుకుని బయటకు వస్తుండగా సునీల్‌పై ఇద్దరు మైనర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సునీల్ అక్కడికక్కడే కుప్పకూలారు. హత్య తరువాత సునీల్‌కు సంబంధించి కారులోనే ఇద్దరు దుండగులు పారిపోయారు. కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే హంతకులను పోలీసులు పట్టుకున్నారు. ఎడ్లసునీల్ బంధువులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తెలంగాణలోని మెదక్‌లోనూ ఉన్నారు. టెన్సీసీలోని వివిధ చర్చిలలో పాటలు పాడటం ద్వారా సునీల్ చాలా మందికి సుపరిచితులు. మెదర్ చర్చిలోనూ ఆయన చాలా సార్లు పాటలు పాడారని ఆయన బంధువులు తెలిపారు. ఎడ్ల సునీల్ హత్యతో ఎన్ఆర్ఐలు షాక్‌కు గురయ్యారు. ఆయన కుటుంబానికి పలువురు సంతాపం తెలిపారు. ఈ హత్య జాతివిద్వేశం వల్ల జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. -
టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
టెన్నెస్సీ : అమెరికాలోని నాష్విల్ నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. సుమారు 700 మందికి పైగా పాల్గొన్న ఈ సంబరాలకు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వం వహించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజతో సంబరాలను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణలో గుడుల్లోలానే తులసి అమ్మవారి విగ్రహంతోపాటు బతుకమ్మ ముగ్గు వేసి మరీ చేసిన అందరంగా అలంకరించి వేడుకలను జరిపారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు వేదిక ప్రాంగణానికి వన్నె తెచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తూ ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ లను భక్తిశ్రద్దలతో కొలిచారు. అలాగే స్థానిక కళా నివేదనం, కోలాటం మరియు ధీంతానా గ్రూప్స్ వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్ లో అందరు కలియ తిరుగుతూ షాపింగ్ చేశారు. సభాప్రాంగణ సమర్పకులకు, ఫుడ్ వాలంటీర్లకు సర్ప్రైజ్ రాఫుల్ బహుమతులు అందజేశారు. బతుకమ్మ పోటీలలో రెండు కేటగిరీల్లోనూ రంగు రంగుల పూలతో ఎంతో అందంగా, క్రియేటివ్‌గా చూడ చక్కగా అలంకరించడంలో విజేతలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. విజేతలకు చీరలు బహుకరించారు. బతుకమ్మను తెచ్చినవారందరికి గుడీ బ్యాగ్స్ అందజేశారు. అలాగే స్టెమ్ బిల్డర్స్ వారు సమర్పించిన రాఫుల్ బహుమతులు కూడా అందజేశారు. మహిళలకు ఆహ్వానంలో భాగంగా మల్లె పూలు, జాజి పూలు అలాగే తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తాంబూలం అందించారు. చివరిగా టెన్నెస్సీ తెలుగు సమితి బతుకమ్మ సంబరాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాష్విల్ వాసులందరికి, రుచికరమైన తేనీయ విందునందించిన అమరావతి రెస్టారంట్, ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ వారికీ, ఈ కార్యక్రమ రూపకల్పనలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులకు, యూత్ కమిటీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు దీప్తి రెడ్డి దొడ్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. -
కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చి..
టెన్నెస్సీ : కోమాలో ఉండగా మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఉదంతం అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రంలో వెలుగు చూసింది. కారు ప్రమాదం కారణంగా కోమాలోకి పోయిన ఓ గర్భిణి కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చింది. కోమాలోంచి బయటకు వచ్చిన ఆమె బిడ్డను చూసుకున్న కొన్ని రోజులకు కన్నుమూసింది. ఈ ఉదంతం టెన్నెస్సీలోని నాక్స్విలే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. శారిష్టా గెలస్ అనే మహిళ 2014 సంవత్సరంలో తన స్నేహితురాళ్లతో కలసి ఓ వేడుకకు వెళ్లి కారులో తిరిగి వస్తోంది. అప్పుడు జరిగిన కారు ప్రమాదంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో శారిష్టా నాలుగు నెలల గర్భవతి. ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేదని ఆమె బతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు అన్నారు. కోమాలో ఉన్న ఆమె 26 వారాల తర్వాత ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత కొద్ది నెలలకే ఆమె కళ్లు తెరచి బిడ్డను చూసుకుంది. అలా మంచంపై నుంచే మూడు సంవత్సరాల పాటు కన్న కొడుకు ఎదుగుదలను చూసుకున్న ఆమె పిల్లాడి మూడో పుట్టిన రోజు వేడుక జరిగిన కొద్ది రోజులకే మరణించింది. -
ఎన్నికల బరిలో రెజ్లింగ్ సూపర్‌స్టార్
వాషింగ్టన్: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ సూపర్ స్టార్ కేన్ త్వరలో ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున టెన్నెస్సె రాష్ట్రంలోని నాక్స్ కౌంటీ పట్టణ మేయర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మంగళవారం రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో 51 ఏళ్ల కేన్ గెలుపొందారు. కేన్ అసలు పేరు గ్లెన్ జాకోబ్స్. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి యాజమాని అయిన జాకోబ్స్.. రెజ్లింగ్ స్టార్‌గా విపరీతమైన ఆదరణ పొందారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రాథమిక పోటీల్లో కేవలం 17 ఓట్ల తేడాతో జాకోబ్స్ గెలుపొందారు. ‘బహుశా రెజ్లింగ్ స్టార్ అయినందుకే నాకు ఓట్లేసి ఉంటారేమో’ అని ఫలితాల అనంతరం కేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ పాలనపై జాకోబ్స్ ప్రశంసలు కురిపించాడు. ఆగష్టులో జరగబోయే మేయర్ ఎన్నికల్లో డెమొక్రట్ అభ్యర్థి లిండా హనే పై ఆయన పోటీ చేయబోతున్నారు. కేన్ తరపున మరో స్టార్ రెజ్లర్ అండర్ టేకర్ కూడా ప్రచారంలో పాల్గొనటం విశేషం. Thanks to everyone who helped win this historic victory!! The people who cast a ballot for me, my great team, my wonderful volunteers. Looking forward to VICTORY in the general election! — Glenn Jacobs (@GlennJacobsTN) 2 May 2018 -
అమెరికా రెస్టారెంట్లో కాల్పులు
వాషింగ్టన్: అమెరికాలోని రెస్టారెంట్లోకి ఓ దుండగుడు నగ్నంగా ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలోని వాఫెల్ హౌస్ రెస్టారెంట్లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు సామూహిక కాల్పులకు పాల్పడేందుకు ఉపయోగించే ఏఆర్–15 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు సెక్యూరిటీ సిబ్బంది ఒకరు పోలీసులకు తెలిపాడు. చిన్నపాటి జుట్టుతో ఉన్న అతడు శ్వేతజాతీయుడని పేర్కొన్నాడు. నగ్నంగా రెస్టారెంట్లోకి ప్రవేశించిన అతడు కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు. గత అక్టోబర్‌లో లాస్వేగాస్లో 58 మంది మృతిచెందిన కాల్పుల ఘటనతోపాటు ఫిబ్రవరిలో ఫ్లోరిడా స్కూల్లో 17 మంది విద్యార్థులను బలి తీసుకున్న ఘటనలోనూ ఏఆర్–15 రైఫిల్నే దుండగులు ఉపయోగించారు. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్‌ను నిషేధించాలని కోరుతున్న వారి సంఖ్య 62 శాతానికి పెరిగింది. -
టెన్నెస్సీలో ఘనంగా ఉగాది వేడుకలు
నాష్విల్ (అమెరికా) : టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో నాష్విల్ లో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో నిర్వహించిన ఈ ఉగాది సంబరాలకు డాక్టర్ దీపక్ రెడ్డి, జితేందర్ కట్కూరి, శారద కట్కూరి సమర్పకులుగా వ్యవహరించారు. స్థానిక తెలుగు వారు సుమారు 600 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొనడం విశేషం. టెన్నెస్సీ లోని నాష్విల్ సంగీత నగరంగా పేరొందడం అందరికీ తెలిసిందే. మరి ఆ సంగీత నగరంలో ప్రముఖ తెలుగు సినీ కోయిల సునీత అడుగెడితే, రాగం అందుకుంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదు. సునీతతో పాటు మాటీవీ సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. ముందుగా దీప్తి రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ శ్రవణంతో కార్యక్రమం మొదలవగా, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన భరతనాట్యం, సినీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సునీత, దినకర్లు క్లాసిక్ పాటలతో మొదలుపెట్టి జానపద, సాంఘీక, ఫాస్ట్ బీట్ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. తర్వాత స్పాన్సర్స్ ని, సునీత, దినకర్ లను పుష్ప గుచ్ఛం, శాలువా, జ్ఞాపికలతో టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించారు. మధ్య మధ్యలో రాఫుల్ డ్రాల్లో విజేతలకు ఉప్పాడ పట్టుచీరలు, ముత్యాల నగలు వంటి విలువైన బహుమతులు గాయని సునీత చేతులమీదుగా అందజేశారు. దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ ఉగాది సంబరాలకు వెన్నంటి ఉండి తమ పూర్తి సహకారం అందించిన కార్యదర్శి కిరణ్ కామతం, సాంస్కృతిక కార్యదర్శి ప్రశాంతి చిగురుపాటి, ఫుడ్ కమిటీ లీడ్ నిషిత కాకాని, రిజిస్ట్రేషన్ కమిటీ లీడ్ రజని కాకి తదితర అడ్వైసరీ కమిటీ, యూత్ కమిటి సభ్యులు, అలాగే విజయవంతంచేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తమ పాటలతో అందరిని ఆహ్లాదపరచిన సునీత, దినకర్, ఆడియో & లైటింగ్ అందించిన డి.జె. శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్, వేదికనందించిన ఫాదర్ ర్యాన్ ఆడిటోరియం యాజమాన్యం, వేదికను చక్కగా అలంకరించిన డాజిల్ ఈవెంట్స్, రుచికరమైన విందు బోజనాలను అందించిన పారడైస్ బిర్యానీ ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఉగాది సంబరాలను ముగించారు. -
విమానం నుంచి జారిపడ్డ ఫోన్: వైరల్ వీడియో
నాష్విల్లే: చేతిలో నుంచి జారిపడితేనే పగిలిపోయే మొబైల్ ఫోన్.. వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా కనీసం చిన్న గీత కూడా పడలేదు. పైగా ఆ వీడియో వైరల్ అయింది. అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన బ్లేక్ హెండర్సన్ మొన్న ఆదివారం ఓ చిన్నతరహా విమానంలో ప్రయాణిస్తుండగా... అతి సమీపం నుంచి వేరొక విమానం దూసుకురావడాన్ని గమనించాడు. వెంటనే తన శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మొబైల్ ఫోన్ తీసి దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అనూహ్యంగా మొబైల్‌ఫోన్ చేతి నుంచి జారిపోయింది! వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతూ అది దృశ్యాలను రికార్డు చేయడం, చివరికి ఒక ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ల్యాండ్ కావడం, ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫోన్‌ను చూసి ఆ ఇంటివాళ్లు ఆశ్చర్యపోవడం.. అంతా సెకన్లలో జరిగిపోయింది. టెలికాం కంపెనీ సహాయంతో జీపీఎస్ ద్వారా హెండర్సన్ పోగొట్టుకున్న మొబైల్‌ను తిరిగి పొందాడు. అంత ఎత్తునుంచి పడినా ఫోన్‌కు చిన్న గీత కూడా పడకపోవడం విచిత్రం. హెండర్సన్ బంధువొకరు.. ఫోన్లో రికార్డయిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది.