tenth class students
-
యాభై ఏళ్లకు.. ఒక్క చోటకు..
తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ గంజ్ హైస్కూల్లో 1973 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లినవారు.. మనవలు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. గంజ్ పాఠశాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మరణించిన తోటి స్నేహితులు, నాటి ఉపాధ్యాయులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, రాజేశం, రవూఫ్, పూర్వ విద్యార్థులు విశ్వనాథ్ బాలకిషన్, చంద్రమౌళి, సత్యం, గౌరిశెట్టి రాజేందర్, ప్రభాకర్, సోమనాథ్, లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 19 నుంచి మూల్యాంకనం ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాలి్సన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో (పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలు మినహా) మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లో కమిషనర్ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు ఇవీ ♦ మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలి ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాలి. ♦ పరీక్ష రాసిన అభ్యర్థి నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడా అన్న అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గమనించాలి. ♦ ఒకవేళ నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే.. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు వేశారా? లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ♦ అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను పరిహరించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లోని కనీసం 20 ఆన్సర్ స్క్రిప్టులను ఆయా కేంద్రాల్లోని చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించాలి. రోజులో మొత్తంగా 60 వరకు ఆన్సర్ స్క్రిప్టులను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు మూల్యాంకన పూర్తయిన రెండు సమాధానాల పత్రాలను పరిశీలించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 45 పత్రాలను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 20 పత్రాలను పరిశీలించాలి. పొరపాట్లు జరిగితే చర్యలే ♦ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం, ఫొటోస్టాట్ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో ఏ విధమైన మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వరుసగా స్పెషల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ♦ పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ సహా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. ♦ మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాస్థాయి పరిశీలకులు మూల్యాంకన కేంద్రాలను తొలి రెండు రోజులు తప్పనిసరిగా సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. -
కళ్ల ముందు... కదలాడుతూ..
సాక్షి, సిద్దిపేట: చదివిన దాని కన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. అంతకుమించి బాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో 2డీ, 3డీ యానిమేషన్ దృశ్యరూప విద్యాబోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. 3డీ యానిమేషన్లో కళ్ల ముందు కదలాడుతున్నట్లుగా పదో తరగతి పాఠ్యాంశాలను అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు సొంత ఖర్చులతో సిద్దిపేట జిల్లా సర్కారు బడుల్లోని టెన్త్ విద్యార్థులకు అందిస్తున్నారు. మళ్లీ మొదటిస్థానం కోసం.. 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో మొదటి స్థానాన్ని తిరిగి సాధించేందుకు మరింత కృషి అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన మంత్ర లెర్నింగ్ అకాడమీ... 3డీ యానిమేటెడ్ పాఠాలు, స్టడీ మెటీరియల్ రూపొందించింది. మంత్రి హరీశ్‌రావు రూ.20లక్షలకు పైగా వెచ్చించి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించారు. జనవరి 24న సిద్దిపేటలో ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ స్టడీ మెటీరియల్‌ను హరీశ్‌రావు అందించి ప్రారంభించారు. కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేస్తున్న మంత్రి హరీశ్ రావు(ఫైల్) నాలుగు సబ్జెక్ట్‌లు.. గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం నాలుగు సబ్జెక్టుల్లో ఉన్న అన్ని పాఠ్యాంశాలు 3డీ యానిమేషన్లో అందిస్తున్నారు. ఒక్కో పాఠ్యాంశానికి ఒక్కో క్యూఆర్ కోడ్ పొందుపరిచారు. 30 సెకన్ల నుంచి 5 నిమిషాలపాటు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. తరగతి గదుల్లో గంటల వ్యవధిలో బోధించే పాఠాన్ని ఐదు నిమిషాల్లో అర్థం చేసుకునేలా రూపొందించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్ల ద్వారా దృశ్య రూపంలో పాఠాలను సులువుగా అభ్యసించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు హరీశ్ లేఖ.. ‘మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైంది. వారి భవిష్యత్‌కు పునాదులు వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా ప్రోత్సహించండి’ .. అంటూ తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌రావు లేఖలు రాశారు. దృశ్యాలతో కళ్ల ముందు మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్ పూర్తయింది. ప్రస్తుతం రివిజన్ క్లాస్‌లు జరుగుతున్నాయి. స్టడీ మెటీరియల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్‌తో 3డీ యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాలు వస్తున్నాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం. – అక్షయ, టెన్త్ విద్యార్థి, ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ సిద్దిపేటకు పేరు తేవాలి.. 2021–22లో పదోతరగతిలో రాష్ట్రంలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. ఆ çస్థానాన్ని నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్ పాఠాలను అందిస్తున్నాం. తల్లిదండ్రుల ఫోన్లో ఉదయం, రాత్రి వేళల్లో డిజిటల్ పాఠాలు వింటూ మెళకువలు నేర్చుకోవాలి. బాగా చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలి. – హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి -
టెన్త్ విద్యార్థుల వివరాల సవరణకు ఎడిట్ ఆప్షన్
సాక్షి, అమరావతి: పదో తరగతి ధ్రువపత్రాల్లో తలెత్తే లోపాలు విద్యార్థులకు ఆ తరువాతి కాలంలో పెద్ద సమస్యగా, ఇబ్బందికరంగా మారుతుంటాయి. చివరి నిమిషంలో వాటిని సరిచేయించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన నామినల్ రోల్స్‌లో వారి వివరాలను సరైన రీతిలో పొందుపరచకపోతే అవే పొరపాట్లు ధ్రువపత్రాల్లో నమోదవుతుంటాయి. ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఎడిట్ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు తమ స్కూలు ద్వారా టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను సరిచూసుకుని పొరపాట్లు లేకుండా సవరించుకునేందుకు ఈ ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ లాగిన్ నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ వినియోగించి నామినల్ రోల్స్‌లోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. బుధవారం (నేడు) నుంచి ఈనెల 20వ తేదీవరకు ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలోగా వివరాలు సరిచూసుకోవాలని ఆయన కోరారు. సరిచూసుకోవలసిన అంశాలు ► విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు ► పుట్టిన తేదీ ► విద్యార్థి ఎంచుకున్న ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాంబినేషన్ ► విద్యార్థి ఎంపిక చేసుకున్న మాధ్యమం ► ఓఎస్సెస్సీ సబ్జెక్టు కోడ్ ► వొకేషనల్ ఎస్సెస్సీ సబ్జెక్టు, కోడ్ ► విద్యార్థి ఐడెంటిఫికేషన్ చిహ్నాలు (పుట్టుమచ్చలు) ► విద్యార్థి ఫొటో, సంతకం -
సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనా రెగ్యులరే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (జూలై, 2022) పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురందించింది. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్మెంటల్ అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో జారీ చేశారు. ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. 2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్ 6న విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. విద్యార్థులకు వెసులుబాట్లు.. కోవిడ్‌తో తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించేలా చర్యలు తీసుకుంది. సాధారణంగా రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆయా సబ్జెక్టులలో ఎన్ని మార్కులు సాధించినా కంపార్ట్మెంటల్ పాస్‌గానే పరిగణిస్తారు తప్ప డివిజన్లను కేటాయించరు. అయితే ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్డ్ పరీక్షలకు పరీక్ష ఫీజు రద్దు జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సి న రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్మెంట్ పరీక్షల విధానం లేదు. కానీ కోవిడ్‌తో విద్యార్థులు ఇబ్బందిపడటంతో వారికి మార్కులను పెంచుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. 49, అంత కంటే తక్కువ మార్కులు వచ్చినవారు రెండు సబ్జెక్టుల్లో బెటర్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనే ఈ బెటర్మెంట్ విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారు. కాగా టెన్త్ విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియెట్ విద్యార్థులను కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో కంపార్ట్మెంటల్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించి డివిజన్లు ఇవ్వాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. -
లోకేష్ జూమ్ మీటింగ్ లోకి అందుకే వెళ్ళాం: కొడాలి నాని ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ
-
లైవ్ కట్ చేయకుంటే లోకేష్ కు మేమేంటో చూపించే వాళ్లం: వల్లభనేని వంశీ
-
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఆదేశాలిచ్చారు. పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్ టికెట్ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పది పరీక్షలపై మంత్రి బొత్స సమీక్ష విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గురువారం తొలిసారి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయం, ఫర్నిచర్ ఏర్పాట్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు కట్టాల్సిందే.. ఆ మటా ఉత్తిమాటే..!
సాక్షి, నారాయణపేట రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు ప్రక్రియ ఇటు ప్రభుత్వం ప్రకటించడానికి, అటు అధికారులు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్లో వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్చుతూనే వస్తోంది. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరికీ అది ఉపయోగపడటం లేదు. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 11 రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్ఈ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 753 మంది, 70 లోకల్‌బాడీ స్కూల్లలో 5,280, మూడు ఎయిడెడ్ స్కూళ్లలో 102 మంది, 45 ప్రైవేటు పాఠశాలల్లో 1,315 మంది, 11 కేజీబీవీల్లో 504 మంది, ఒక జ్యోతిరావుఫూలే స్కూల్లో 73మంది, రెండు మాడల్ స్కూల్లలో 192 మంది, రెండు మైనార్టీ గురుకులలో 135, ఆరు సోషల్ వెల్ఫేర్‌లో 480, ఒక ట్రైబల్ వెల్ఫేర్‌లో 79మందితో కలుపుకుని మొత్తం 4,354 మంది బాలురు, 4,597 మంది బాలికలతో కలిసి 8,961 మంది టెన్త్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: (రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 706 రోజుల తర్వాత..) వెనకబడిన వారికి మినహాయింపు అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో ఈ ఏడాది మే 11నుంచి 17వరకు జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24 వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో 8,165 మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతుంది. హాస్టల్లో చదువుతున్న వారికి ప్రత్యేకం బీసీ విద్యార్థులు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలిగారు. మక్తల్ గరŠల్స్‌లో 8, బాయ్స్‌లో 17, ఊట్కూర్ బాయ్స్‌లో 9, మద్దూర్ గరŠల్స్‌లో 14, కన్మనూర్ 5, ధన్వాడ మాడల్ స్కూల్లో 1, నారాయణపేట వైదిక పాఠశాలలో 4 చొప్పున 58మంది, అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం 504 మంది బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ పేరెంట్స్ వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అదేవిధంగా 14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువగా ఉన్న వారు మెడికల్ సర్టిఫికెట్తో పాటు రూ.300 చెల్లించి ప్రభుత్వ పరీక్షల విభాగానికి చలాన్ కట్టి జిల్లాలో 55మంది పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా.. ఏటా అక్టోబర్‌లోనే టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్డ్ విడుదల చేసే బోర్డు అధికారులు రెండేళ్లుగా కరోనా కారణంగా ఆలస్యంగా విద్యాబోధన ప్రారంభం కావడంతో ఈసారి సైతం పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ టెన్త్ బోర్డు గతనెల చివరన విడుదల చేశారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లమెంటరీ విద్యార్థులు 3సబ్జెక్టులోపుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబందిత హెచ్ఎంలకు ఈనెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాల్సి ఉండగా, రూ.50 జరిమానాతో ఫిబ్రవరి 24వరకు చెల్లించాల్సి ఉండింది. ఇక రూ.200తో మార్చి 4వరకు, ఆఖరులో రూ.500 అపరాధ రుసుం చెల్లిస్తే మార్చి 14వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్నియాజమాన్య పాఠశాలల హెచ్ఎంలకు వాటి ప్రతిని అందించాము. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. కేవలం బీసీ హాస్టల్‌కు చెందిన 58, కేజీబీవీలకు చెందిన 504తో కలిపి 531మంది ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు. – రాజేంద్రకుమార్, జిల్లా పరీక్షల విభాగ అధికారి -
ప్రాక్టికల్స్ పేరుతో.. 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం
లక్నో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన గురువు బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించాడు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. గౌరవప్రదమైన ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పదవికే మాయని మచ్చగా తయారయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో నవంబర్ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చదవండి: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా.. ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల సాకుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరునాడు సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని సూచించాడు. విద్యార్థుల కోసం భోజనం తయారు చేసి.. అందులో మత్తు మందు కలిపిన ఆహారాన్ని విద్యార్థినులకు అందించాడు. తరువాత విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో ప్రధానోపాద్యాయుడితోపాటు అతని సహచరుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బాలికలను బెదిరించారు. చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం బాలికలు మరుసటి రోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే బాధిత బాలికలు పేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు బాధితులు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని అనేకసార్లు కోరినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తలు ప్రధానోపాధ్యాయుడితోపాటు అతని సహచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదవ్వగా ఒకరిని అరెస్టు చేశారు. అంతేగాక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
‘పది’కి పదే లక్ష్యం
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి నుంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా షెడ్యుల్డు కులాల అభివృద్ధి శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ, వెనుకబడిన(బీసీ) తరగతుల అభివృద్ధి శాఖల అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక మెనూ తయారు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సదాశివపేట(సంగారెడ్డి): జిల్లాలో అన్ని శాఖల బాలుర, బాలికల వసతి గృహాలు ఎస్సీ 37, ఎస్టీ 10, బీసీ 22 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 713 మంది, ఎస్టీ బాలికల బాలుర వసతి గృహాల్లో 170 మంది, బీసీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 362 మంది ఉన్నారు. విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలపై జిల్లా అధికారులు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అంతే కాకుండా తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తరగతులు.. అల్పాహారం పదో తరగతి విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వంద శాతం ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వసతి గృహాల సంక్షేమ అధికారులు పదోతరగతి విద్యార్ధుల కోసం రాత్రి 12 గంటల వరకు స్టడీ అవర్లను నిర్వహిస్తున్నారు. నీరస పడకుండా ఉండటానికి రాత్రి 10.30 అల్పాహారం, టీ అందజేస్తున్నారు. వీటీ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. సబ్జెక్టు నిపుణులను అందుబాటులో ఉంచారు. రాత్రి సమయంలో విద్యార్థులతో పాటు అధికారులు వసతి గృహాల్లో నిద్రించాలని నిర్ణయించారు. విద్యార్థులపై పర్యవేక్షణ మార్చి 19న పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులపై పర్యవేక్షణ పెంచడానికి వసతి గృహాల సంక్షేమ అధికారులు వారంలో రెండు సార్లు వసతి గృహంలో విద్యార్థులతో కలసి భోజనం చేసి అక్కడే నిద్రించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వసతి గృహాల సంక్షేమాధికారులను సంబంధిత అధికారులు 100 శాతం ఫలితాలు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు, ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి సీ, డీ విభాగాలపై సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు ఎక్కువ సమయం కేటాయించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదికి పది జీపీఏ సాధిస్తా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు పదో తరగతి విద్యార్థులకు వసతి గృహంలోనే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు చదివిస్తున్నారు. మధ్యలో స్నాక్స్, టీ ఇస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధిస్తానని నమ్మకుముంది. – బి.రమేశ్, ఎస్సీ వసతి గృహం, సదాశివపేట -
విద్యార్థులకు శుభవార్త
తమిళనాడు, టీ.నగర్: రాష్ట్రంలో పది, ప్లస్ వన్, ప్లస్‌టూ విద్యార్థులకు పరీక్షా సమయాన్ని 2.30 గంటల నుంచి 3 గంటలకు పెంచుతూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసే సమయంలో సమయం సరిపోక అవస్థలు పడుతూ వచ్చారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ పరీక్షా సమయాన్ని అరగంట పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భవిష్యత్తుకు భరోసా
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఆ పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. కొంత మంది ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాగా, మరికొంత మంది విద్యార్థులు ఏ కాలేజీలో చదివితే..ఆ కాలేజీ ఫీజు మొత్తం చెల్లించేందుకు సిద్ధం అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇటీవల వెల్లడైన పది ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అండగా నిలవాలని ‘సాక్షి’ పిలుపు నివ్వడం, ఆ మేరకు వారి ఫొటోలతో సహా ‘రారండోయ్ చదివిద్దాం’ శీర్షికతో మంగళవారం హైదరాబాద్ సిటీ ఎడిషన్‌లో ప్రధాన వార్తగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించి సామాజిక బాధ్యతలో భాగంగా నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందజేసేందుకు అమెరికాలోని బోస్టన్ వాసి బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సీఈఓ చాంద్‌పాషా, ఆయన సోదరుడు ఎస్కే సైదా సూరజ్ సహా గాంధీనగర్‌కు చెందిన శ్రవణ్, కుత్పుల్లాపూర్ సుచిత్రకు చెందిన పి.రఘురాంరెడ్డి, జీడిమెట్లలోని జీఆర్పవర్ స్విచ్‌గేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి చెన్నూరు, హస్తినాపురం చెందిన విశ్వమిత్రా, నాగోలుకు చెందిన ప్రసాద్, జీడిమెట్లకు చెందిన రమేష్‌రెడ్డి, బాలానగర్‌కు చెందిన రమేష్, సైనిక్‌పురికి చెందిన ఆర్కిటెక్ట్ రమేష్, కృష్ణానగర్‌కు చెందిన గృహిణి జయశ్రీ, నాగోల్‌కు చెందిన ప్రసాద్‌లు ముందుకు వచ్చారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారికి సహాయం అందజేసే దాతలను ‘సాక్షి’ త్వరలోనే ఓ వేదికపైకి తీసుకొచ్చి, వారి సమక్షంలోనే దాతల సహాయం అందజేయనుంది. ఇంకా దాతలెవరైనా స్పందించాలనుకుంటే 9912199718, 9912199507 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
కార్పొరేట్ కళాశాలల దందా!
ప్రకాశం ,పర్చూరు: రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. కానీ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల కోసం అప్పుడే వేట మొదలు పెట్టాయి. ఫలితాలు వచ్చేందకు ఇంకా సమయం పడుతుంది. అయినా ప్రైవేటు కళాశాలల మధ్య నెలకొన్న తీవ్ర పోటీతో సాధ్యమైనంత వరకు అడ్మిషన్లు ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభించాయి. అందుకనుగుణంగా తమ సిబ్బందిని ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల మీదకు వదిలారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న ఆయా కొర్పొరేట్ సంస్థల పీఆర్ఓలు.. అడ్మిషన్ల సమయంలోనే ఎంబీబీఎస్ ర్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్ అంటూ మభ్యపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 42,343 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 2018 అక్టోబర్, నవంబర్ నెలల నుంచే పదో తరగతి విద్యార్థుల జాబితా సేకరించిన కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లను అడ్వాన్స్ బుక్ చేసుకుంటున్న వైనం విస్తుగొలుపుతోంది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం పీఆర్ఓలను దించేసి నిర్ణయించిన మేరకు అడ్మిషన్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పీఆర్ఓలు తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్ ఫీజు కింద రూ.2 వేలు కట్టించుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల పీఆర్ఓలు చేరే ముందు ఒక ఫీజు, చేరిన తర్యాత ఇంకో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాక జూన్‌లో ఇంటర్ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకోసం ఎలాంటి ప్రచారం చేయకూడదు. కానీ పలు సంస్థల పీఆర్ఓల ద్వారా ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక తమ పాఠశాలల్లో పది చదివి పాసైన వారిని ఉపాధ్యాయులు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తే రూ.2 నుంచి 5 వేలు వరకు కమీషన్ ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
రండి..బాబూ రండి!
సాక్షి,సిటీబ్యూరో:‘సార్ మీ ఇంట్లో ఎవరైనా పదో తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలున్నారా? ఉంటే మా కాలేజీలో చేర్పించండి. ఫలితాలు వచ్చిన తర్వాత అయితే ఫీజు ఎక్కువగా ఉంటుంది. ముందే రిజర్వు చేసుకుంటే ఫీజులో 20 నుంచి 30 శాతం రాయితీ లభిస్తుంది. ఎంసెట్, నీట్లో ఉచిత శిక్షణ ఇస్తాం’.. పదోతరగతి పరీక్షలు రాస్తున్న తల్లిదండ్రులకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల పీఆర్ఓలు, అధ్యాపకులు ఇస్తున్న ఆఫర్ ఇది. పదోతరగతి పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో అప్పుడే ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల వేట ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకోగా, ఇంకొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్పించే బాధ్యతను ఇప్పటి వరకుఆయా కాలేజీల్లో పనిస్తున్న అధ్యాపకులకు అప్పగించాయి. విద్యార్థులను చేర్పించే విషయంలో ఒకొక్కరికీ ఒక్కోరకమైన టార్గెట్ ఇస్తున్నారు. టార్గెట్ పూర్తి చేసిన వారికే వేతన పెంపు, కొలువు పదిలంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిపోయినా అధ్యాపకులకు ఆయా కళాశాలలు సెలవులు ఇవ్వలేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు అధ్యాపకులు వెళ్లి కరపత్రాలు చూపించి విద్యార్థులను ఆకర్షించే పనిలో పడ్డారు. సాయంత్రం, ఉదయం సమయాల్లో కళాశాల సమీప ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ‘సార్, ఇంట్లో పదో తరగతి పరీక్ష రాసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా..? వారిని మా కళాశాలలో చేర్పించండి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. గ్రేటర్‌లోని పలు జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ముందు గుర్తించిన వాటి యాజమాన్యాలు ఫీజు డిస్కౌంట్లు.. పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రంగులు వేసి..ముస్తాబు చేసి.. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలు ఉన్న సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ఆకర్షించేందుకు వాటి యాజమాన్యాలు తమ కాలేజీల భవనాలకు మెరుగులు దిద్దుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయని అందులో పేర్కొంటున్నాయి. పదో తరగతి చదివే పిల్లల జాబితాలను, ఫోన్ నంబర్లు సేకరించి వారి ఇళ్లకు మధ్యవర్తులను, దళారులను పంపి ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఫీజు ఎక్కువగా ఉంటుందని, అదే ముందే సీటు రిజర్వు చేయించుకున్న వారికి ఫీజులో రాయితీ ఉందంటూ ఆశ చూపుతున్నారు. ప్రవేశాల కోసం రాయితీల ఎర గ్రేటర్ పరిధిలో కొన్ని కళాశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఇంటర్లో చేరేటప్పుడు ఫీజులో 20 శాతం నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నారు. పదిలో మార్కుల ఆధారంగా రాయితీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కానీ విద్యార్థి సదరు కళాశాలలో చేరిన తర్వాత ఏడాది పూర్తి ఫీజు గుంజుతున్నారు. ఎంసెట్, నీట్ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరాక ఏదో రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మధ్యవర్తులతో బేరసారాలు ప్రచారం చేసి విద్యార్థులను ఆకర్షించడంలో కొన్ని కళాశాలలు ఆరితేరాయి. విద్యార్థులకు గాలం వేయడం కోసం రూ.లక్షలు వెచ్చించి మధ్యవర్తులను నియమించుకున్నాయి. వీరు విద్యార్థుల కుటుంబ యోగక్షేమాలు తెలుసుకొని మాట కలపడంలో నేర్పరులు. వీరి మాటల్లో పడి విద్యార్థులను ఆ కళాశాలల్లో చాలామంది తల్లిదండ్రులు చేర్పించేస్తున్నారు. ఆ మాటలు నమ్మి కళాశాలలను ఎంపిక చేసుకుంటే తర్వాత ఇబ్బందులేనని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు కట్టి మోసపోవద్దు అనుమతులు ఉన్న కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో ఉంచుతాం. ఏ కాలేజీలో యే విధమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయో కూడా పొందుపరుస్తాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవాలి. తల్లిదండ్రులు ముందే డబ్బులు కట్టి మోసపోవద్దని మా విజ్ఞప్తి. – జయప్రద, హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి -
‘టెక్ట్స్ నెక్’కు టెన్త్ విద్యార్థుల పరిష్కారం
గురుగ్రామ్: శరీర భంగిమలను సరిచేయడానికి దోహదపడే ఓ పరికరాన్ని గురుగ్రామ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థులు కనుగొన్నారు. ఇది కృతిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా పనిచేస్తుందని తెలిపారు. ఈ పరికరం వినియోగదారుడికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు సులువుగా ఉపయోగించడం, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వెల్లడించారు. ‘టెక్ట్స్ నెక్’తో బాధపడుతున్న వారు ఈ పరికరాన్ని ఉపయోగించి శరీర భంగిమలను సరిచేయొచ్చు. అదే పనిగా మెడను వంచి మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, చాటింగ్ చేయడం ద్వారా మెడపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుండటాన్ని ‘టెక్ట్స్ నెక్’అంటారు. ఈ పోస్చ ర్ పర్ఫెక్ట్ డివైస్‌ను గురుగ్రామ్‌లోని శివ్ నాడర్ పాఠశాల విద్యార్థులు తనిష్కా షహయ్, నవ్య సచ్దేవ్, ఆర్యన్ వర్మ, తేజస్వ్ రాస్తోంగిలు కనుగొన్నారు. ఈ పరికరం ఒక మౌంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు శరీర భంగిమలను వీడియో రూపంలో సంగ్రహిస్తుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. కూర్చున్నప్పుడు లేదా నిలబడ్డప్పుడు ముక్కు, మెడ, కుడి, ఎడమ భుజాల మధ్య దూరాన్ని, కోణాలని ఇది గుర్తిస్తుంది. ఇలా గుర్తించిన డేటాను ప్రతి 30 నిమిషాలకోసారి సగటున లెక్కించి వినియోగదారుడికి పంపుతుంది. దీంతో అతడు తన శరీరాన్ని సరిగా ఉంచుకునేలా తోడ్పడుతుందని వారు తెలిపారు. దీన్ని పాఠశాల విద్యార్థులు, గృహిణులు కూడా ఉపయోగించుకోవచ్చని వర్మ వెల్లడించారు. ఈ పరికరం విలువ దాదాపు రూ.3500 ఉంటుందన్నారు. -
ఆ ఆత్మహత్యలకు.. ‘ఆర్ఎక్స్100’స్ఫూర్తి!
సాక్షి, జగిత్యాల: ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి దర్యాప్తు అనంతరం డీఎస్పీ వెంకట రమణ నిజానిజాలు వెల్లడించారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరి విద్యార్థుల లవ్ ఫెయిల్ కావడంతో గత కొద్దిరోజులుగా డిప్రెషన్లోకి వెళ్లారు. ఈ క్రమంలో టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 సినిమాను చూసి వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ సినిమాతో ప్రభావితులైన విద్యార్థులు మద్యం సేవించి, పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. సినిమాలు కేవలం వినోదం కోసమేనని, వాటి ప్రభావానికి లోనే ప్రాణాలు పోగోట్టుకోవద్దని సూచించారు. ఎన్ని పనులున్నా పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి ఉండాలని.. వారి ప్రవర్తనను నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వారిలో ఏమైన మార్పులు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ.. విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. చెబితే ఎక్కడ కాదంటుందోనని పెదవి దాటనీయలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఎక్కడ తప్పుబడతారోనని.. ఎక్కడ కాదంటారోనని... ఎవరికివారే మానసిక ఆవేదనకు గుర య్యారు. ఇటీవలే తాము ప్రేమించింది ఒకే అమ్మా యిని అని తెలుసుకున్నారు. అమ్మాయి లేకుండా ఉండలేమని భావించారు. చదివే వయసులో ప్రేమేంటని స్కూల్ యాజమాన్యం ప్రశ్నిస్తుందనుకున్నారో.. లేక పెద్దలు కొడతారని భయపడ్డారో... తెలియదు కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలిద్దామని నిర్ణయించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి కలసి తిరిగిన ఇద్దరూ రాత్రి 7 గంటలకు ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. మైకం వచ్చిన తర్వాత మద్యంతోపాటు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థిని కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే అతనూ చనిపోయాడు. -
సత్తా చాటండి.. సాయం పొందండి
అనంతపురం, రాప్తాడు: కొందరు విద్యార్థుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నా రు. అటువంటి వారిని ప్రోత్సాహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్స్( ఎన్ఎం ఎంఎస్) పేరిట ఉపకార వేతనం అం దిస్తోంది. ఇందుకుగానూ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించిన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. గత ఏడాది వరకు రూ.6 వేల చొప్పున ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి రూ.12 వేలకు పెంచారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24వరకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు దీన్ని వినియోగించుకోవాలని ఉపా«ధ్యాయులు సూచిస్తున్నారు. ఎంపిక ఇలా... దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ మొదటివారంలో పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో ప్రతిభ కనబరిచిన వారిని ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. ఎనిమిదో తరగతి చదువుతున్న వారు పరీక్ష రాసేందుకు అర్హులు. దీనిలో అర్హత సాధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12వేలు విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ స్కాలర్షిప్ కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకే ఇస్తారు. కాగా ఒక్కసారి స్కాలర్షిప్ మొత్తం రెట్టింపు చేయడంతో అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాప్తాడు, హంపాపురం, మరూరు, ఎం.బండమీదపల్లి, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది ఏపీ మోడల్ స్కూల్లో ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. రాప్తాడు, హంపాపురం, మరూరు పాఠశాలల నుంచీ ఎంపికయ్యారు. పరీక్షా విధానం ప్రతిభ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు మండల పరిషత్, జిల్లా పరిషత్, గురుకుల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధిం చాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ అర్హత పరీక్ష 180 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్, అర్థమెటిక్, గణితం, సైన్స్, సోషల్, అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జనరల్, బీసీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రయివేటు పాఠశాల మోసం
చైతన్యపురి: వారిద్దరూ కష్టపడి చదివారు.. పాఠశాల నుంచి పదో తరతగి హాల్ టికెట్ తీసుకున్నారు.. గంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి హాల్‌టికెట్ నంబర్ చూసుకుని మరీ సీట్లో కూర్చున్నారు.. ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు.. పరీక్ష రాస్తుండగా వచ్చిన స్క్వాడ్.. ‘మీ హాల్‌టికెట్లు ఫేక్‌వి.. పరీక్ష రాయటానికి వీల్లేదు’ అంటూ పేపర్ తీసేసుకున్నారు. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ పదో తరగతి విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈ సంఘటన గురువారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ♦ ఉదయ్‌కుమార్, ఏదులకంటి అశ్విన్‌కుమార్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సరూర్‌నగర్ ఓల్డ్ పోస్టాఫీస్ సమీపంలోని న్యూ రెయిన్బో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివారు. అయితే, ఈ స్కూలుకు పదో తరగతికి అర్హత లేదు. కానీ స్కూలు యాజమాన్యం మాత్రం పదోతరగతి విద్యార్థులను నగరంలోని వివిధ స్కూళ్ల విద్యార్థులుగా ఫీజులు కట్టించి పరీక్షలకు పంపిస్తుంటారు. ♦ ఈ క్రమంలోఏదులకంటి అశ్విన్‌కుమార్, ఉదయ్‌కుమార్‌ను ‘అల్కాపురి శ్రీద్వారకామయి ఎంహెచ్ఎస్ పాఠశాల’ విద్యార్థులుగా ఫీజులు కట్టించారు. వీరిలో అశ్విన్‌కుమార్‌కు మన్సూరాబాద్‌లోని జడ్పీహెచ్ స్కూల్ సెంటర్ కేటాయించారు. ఉదయ్‌కుమార్‌కు రామకృష్ణాపురంలోని సెయింట్ మార్టిన్ స్కూల్ సెంటర్ ఇచ్చారు. వాస్తవానికి అల్కాపురి శ్రీ ద్వారకామయి ఎంహెచ్ఎస్ పాఠశాల’ మూడేళ్ల క్రితమే మూతపడింది. ♦ న్యూ రెయిన్బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాత్రం విద్యార్థుల హాల్‌టికెట్లపై ‘న్యూ మారుతీనగర్ శ్రీ ద్యారకామాయి స్కూల్ స్టాంపు’ వేసి పరీక్షకు పంపించారు. చదివిన స్కూల్‌కు అనుమతిలేక పోవడం.. లేని స్కూల్ నుంచి ఫీజుల కట్టడం, సంబంధం లేని స్కూల్ స్టాంపులు వేసి అటెస్ట్ చేసి ఇవ్వడంతో చివరి క్షణంలో బోర్డు అధికారులు గుర్తించి ఇద్దరు విద్యార్థులను ‘ఫేక్’గా తేల్చి పరీక్షలు రాయనీకుండా బయటకు పంపించివేశారు. పోలీస్ స్టేషన్లో పిర్యాదు... హాల్‌టికెట్ ఉన్నా పరీక్షలేక పోయిన విద్యార్థులు అశ్విన్‌కుమార్, ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో న్యూరెయిన్బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని టీఆర్ఎస్వీ నాయకులు మహేందర్‌యాదవ్, శివరామకృష్ణ, ప్రవీణ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయని, ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తల్లిదండ్రులకు పరీక్షలు..
రావికమతం(చోడవరం) : పదో తరగతి పరీక్షలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యార్థి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసే ఈ పరీక్షలపైనే అంతా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నపుడే విద్యార్థి బాగా పరీక్ష రాయగలడని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి పది పరీక్షలు మొదలు కానున్నాయి. మండల వ్యాప్తంగా 6 కేంద్రాలలో 1,085 మంది విద్యార్ధులు సన్నద్దంగా ఉన్నారు. అయితే సమయం ముంచుకొస్తున్న కొద్దీ విద్యార్థులు పుస్తకాలపైనే దృష్టంతా పెడుతున్నారు. ఇలాంటపుడే తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో వారి మాటల్లోనే... ♦ పిల్లలపై వత్తిడి లేకుండా వారిని ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు ప్రయత్నించాలి, పిల్లలు పరీక్షలు బాగా రాయగలిగేలా..రాయగలవంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోత్సహించాలి. ఈ విదమైన శాస్త్రీయ పేరెంటింగ్ విదానం వల్ల ఫలితాలు ఉంటాయి. ♦ పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల తపన, శ్రద్ధ అనురాగం వారి లక్ష్య సాధనకు దోహదపడాలి ♦ పరీక్షల సమయంలో ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలి. పరీక్షల్లో ఎపుడూ అడ్డదారులు ఉండవని, కష్టపడి చదివే వారి వెనుకే విజయం ఉంటుందనే ధీమా కలిగించాలి. ♦ జ్ఞాపక శక్తికి 6 నుంచి 7 గంటల నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర లేకుంటే పరీక్ష హాల్లో విద్యార్థులకు ఆవలింతలతో పాటు బద్ధకం ఆవహిస్తుంది. రాత్రి పగలూ చదవకుండా తగిన నిద్ర ముఖ్యమని సూచించాలి. ♦ ఆహార నియమాలను పాటిస్తూ పోషకాహారం అందించాలి. పరీక్షల సమయంలో ఇంట్లోవారు సైతం టీవీ బంద్ చేయాలి. నీరు ఎక్కువగా తాగించాలి. ♦ పిల్లలకు సబ్జెక్టుల్లో వచ్యేచ సందేహాలను తపపక సంబంధిత ఉపాధ్యాయుని సంప్రదించి నివృత్తి చేస్తే మంచిది. ♦ ఏదేనీ పరీక్ష సరిగ్గా రాయకపోతే నిందించవద్దు, కించపర్చవద్దు అలా చేస్తే ఆత్మస్థైర్యం దెబ్బతిని మిగతా పరీక్షలపై పడవచ్చు. -
విద్యార్థికి విషమ ‘పరీక్ష’
అయితే రేకుల షెడ్డు... లేదా పెచ్చులూడే పైకప్పు.. ఫ్యాన్ అనే వస్తువే కనిపించని కేంద్రాలు.. బెంచీలకూ దిక్కులేని పాఠశాలలు...ఇలా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ‘పది’ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసేశారు. ఈ ఏడాదీ పదో తరగతి విద్యార్థులువిషమ పరీక్ష ఎదుర్కోనున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: ఓ పాఠశాలను పదో తరగతి పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే అందులో అన్నీ సదుపాయాలు ఉండి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. ముఖ్యంగా ఫర్నీచర్, వెలుతురు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర ఇబ్బందులు లేని స్కూళ్లు, కళాశాలలను కేంద్రాలుగా వేయాలి. ముఖ్యంగా అధికారులు పరిశీలించి అనుకూలంగా ఉన్నట్లు ధ్రువీకరించుకన్న తర్వాతే కేంద్రాలుగా సిఫార్సు చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులు సౌకర్యమేమో తెలీదుకాని కొందరు ప్రైవేట్ స్కూళ్ల యాజమానులు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరం రుద్రంపేట సమీపంలోని ఓ కేంద్రాన్ని పరిశీలిస్తే అధికారులు ఏస్థాయిలో లాలూచీ పడ్డారనేది స్పష్టమవుతోంది. ఈ కేంద్రంలో గదులన్నీ రేకులషెడ్డులే. అసలే ఎండాకాలం. వేసవి తాపానికి విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇదొక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. గుణ‘పాఠం’ నేర్చుకోని వైనం పదో తరగతి పరీక్షల నిర్వహణలో గత అనుభవాలతో అధికారులు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50,989 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు విద్యార్థులను వెక్కిరించనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అనంతపురం నగరంలోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో బల్లలను సమకూర్చలేని పరిస్థితి. దీనికితోడు రేకుల షెడ్లు, ఇరుకిరుకు గదులున్న పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులకు ఉక్కపోత కష్టాలు తప్పేలా లేవు. మరికొన్ని కేంద్రాల్లో పిల్లలకు వెలుతురు సమస్యా వెంటాడుతోంది. సదుపాయాలు ఉన్నా... విస్మరించారు కొన్ని స్కూళ్లు పరీక్షల నిర్వహణకు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. అలాంటి వాటిని పక్కనపెట్టి ఏమాత్రం సదుపాయాలు లేని కేంద్రాల పట్ల అధికారులు ఆసక్తి చూపడంలో మతలబేమిటో. అన్ని శాఖల ముఖ్య అధికార యంత్రాంగం ఉండే జిల్లా కేంద్రంలోనే ఈ రకంగా ఉంటే ఇక రూరల్ ప్రాంతాల్లో కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో బల్లల కొరత నగరంలో నగరపాలక ఉన్నత పాఠశాల్లో తప్ప ఫర్నీచర్ మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ అరకొరగా ఉంది. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో సగానికి సరిపడే ఫర్నీచర్ కూడా లేదు. అలాగే పాతూరు నంబర్–2 స్కూల్లోనూ ఇదే పరిస్థితి. ఈ కేంద్రంలో 300 మంది విద్యార్థులను కేటాయించారు. ఫర్నీచరు వందమందికి కూడా సరిపడేలా లేదు. ఇలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్ల సెంటర్లదీ ఇదే పరిస్థితి. ఫర్నీచరు అద్దెకు తెచ్చుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అది కేంద్రాల వరకు చేరడం లేదు. అధికారుల ఆదేశాలతో ఆయా కేంద్రాల నిర్వాహకులు చేతి నుంచి పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మొత్తం 189 పరీక్షా కేంద్రాలకు గాను 96 కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఉంది. 14 కేంద్రాల్లో అరకొర, 79 కేంద్రాల్లో అసలే లేదు. సమస్యలు అధిగమిస్తాం పదోతరగతి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. రెవెన్యూ, పోలీసు, రవాణా, విద్యాశాఖ అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇక నీటివసతి, ఫర్నీచర్ తదితర సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటాం. – జనార్దనాచార్యులు, డీఈఓ -
లక్ష్యం చేరేనా ?
కొత్తగూడెం : విద్యార్థులకు పరీక్షల బెల్ మోగింది. మరో 45 రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తామని విద్యాశాఖ అధికారులు చెపుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించటం లేదు. అదనపు తరగతుల నేపథ్యంలో సరైన పౌష్టికాహారాన్ని అందించలేకపోవడంతో పాటు వారిని కనీసం పర్యవేక్షించే అధికారులే లేకపోవడం శోచనీయం. గత ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం 80.49 మాత్రమే. ఈ ఏడాది అంతకు మించి ఉత్తీర్ణత పెంచటానికి అధికారులు ప్రత్యేకంగా తీసుకుంటున్న శ్రద్ధ ఏమీ లేకపోవడంతో ‘వంద శాతం’ ఉత్తీర్ణత సా«ధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ టెస్టులపై నిర్వహించని సమీక్ష.. డిసెంబర్ 31 నాటికి పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేసి జనవరిలో ఉదయం, సాయంత్రం అదనపు తరగతులను నిర్వహించాలి. స్పెషల్ టెస్టులు నిర్వహించి వాటిపై డీఈఓ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. టెస్టుల ఫలితాలపై విశ్లేషణ చేసి ఈనెల 15న జరగబోయే ప్రీ ఫైనల్ పరీక్షలకు, మార్చి 15 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయాలి. ఇందుకోసం విద్యార్థికి ప్రతి సబ్జెక్టుపై నాలుగు, బయాలజీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు రెండు చొప్పున టెస్టులు నిర్వహించాలి. ఈ క్రమంలో జనవరిలో నిర్వహించిన రెండు స్పెషల్ టెస్టులపై డీఈవో వాసంతి సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ అలాంటి దాఖలాలు లేకపోవడం గమనార్హం. జనవరి 27న జిల్లా కేంద్రంలో స్పెషల్ టెస్టులపై ప్రధానోపాధ్యాయుల సమావేశం ఉందని డీఈవో ప్రకటించారు. అనంతరం ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. మళ్లీ ఇంత వరకు సమీక్ష సమావేశం తేదీలనే ప్రకటించలేదు. ఉపాధ్యాయులపై పర్యవేక్షణ ఏది..? పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేసే క్రమంలో ఉదయం, సాయంత్రం ఒక గంట అదనంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. వారికి మానసిక, శారీరక అలసట కలుగకుండా అల్పాహారం అందించాలి. అయితే జిల్లాలో అదనపు తరగతులు జరుగుతున్నప్పటికీ విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. దీనికి విద్యాశాఖ తరపున ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో దాతలపైనే సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అన్ని పాఠశాలల్లో అల్పాహారం పూర్తి స్థాయిలో పెట్టలేకపోతున్నారు. జిల్లాలో రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో వారిలో జవాబుదారీతనం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘పది’ ఉత్తీర్ణత శాతం పెరిగేనా? జిల్లా పరిధిలో 2015–16 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10277 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 7422 మంది ఉత్తీర్ణులయ్యారు. 2016–17 లో ప్రభుత్వ పాఠశాలల్లో 5522 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4106 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి శాతం 80.49గా ఉంది. ఈ ఏడాది మార్చి 15 నుంచి జరగనున్న పరీక్షలకు 71 కేంద్రాలలో 174 ప్రభుత్వ, 99 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 13,235 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 6,493 మంది బాలురు, 6,742 మంది బాలికలు ఉన్నారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న వారి సంఖ్యే అధికంగా ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వ విద్యపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తుండగా, అంతే నమ్మకంతో ఉపాధ్యాయులు, అధికారులు ఉత్తీర్ణత పెంచితే రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ఆదరణ ఉంటుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తాం ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించటానికి కృషి చేస్తాం. స్పెషల్ టెస్టులపై రెండు, మూడు రోజుల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. ఫలితాలలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి అదనంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తాం. ఉపాధ్యాయులు, అ«ధికారులు అందరం ఉమ్మడి కృషితో మెరుగైన ఫలితాలను సాధిస్తాం. – డి వాసంతి, ఇన్చార్జ్ డీఈవో -
పది విద్యార్థులకు ఇదో చివరి అవకాశం!
– రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 6వరకు ఫీజు చెల్లింపు అనంతపురం ఎడ్యుకేషన్ : పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం కల్పించారు. రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 6 వరకు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్ఎంలు 7న బ్యాంకులో చెల్లించాలని, 8న డీఈఓ కార్యాలయంలో నామినల్‌రోల్స్ అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
‘పది’ విద్యార్థులకు హాల్ టికెట్ వేధింపులు అరికట్టాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులను హాల్ టికెట్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వేధించడాన్ని అరికట్టాలని, వాటిని ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం డిమాండ్ చేసింది. వారం రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలుకానుండగా, ప్రైవేట్ సంస్థలు హాల్ టికెట్ల జారీ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించింది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆందోళనకు గురిచేయకుండా షరతులు లేకుం డా హాల్ టికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల ప్రారంభమైన ఇంటర్ పరీక్షల సందర్భంగా కూడా హాల్ టికెట్ల జారీలో విద్యార్థులను ప్రైవేట్ విద్యాసంస్థలు వేధించాయని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని ధ్వజమెత్తింది. -
ఆధార్ ఉంటేనే ‘పది’కి అనుమతి!