Terrorist activities
-
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్‌యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్‌లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
అతివాద బోధకులకు బ్రిటన్‌లోకి నో ఎంట్రీ
లండన్: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ విద్వేష ప్రబో ధకులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసిందని ‘డైలీ టెలీగ్రాఫ్’ తెలిపింది. తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చే అతివాద మత ప్రబోధకులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి పేర్లను వీసా హెచ్చరిక జాబితాలో చేరుస్తారు. వీరికి దేశంలోకి ప్రవేశించే దారులు మూసుకుపోతాయని ‘డైలీ టెలీగ్రాఫ్’ పేర్కొంది. -
అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్!
ఢిల్లీ: అయోధ్యలో రామ మందరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ.. ఉగ్ర కలకలం రేగింది. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది. భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో భాగంగా ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రరిస్ట్ స్వ్వాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. అయితే ఆ ముగ్గురి వివరాల్ని గానీ.. విచారణకు సంబంధించిన విషయాలపైగానీ ఇంకా ప్రకటన వెలువడలేదు. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్‌లల్లా పటిష్ట భద్రత జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి 11 వేల మంది అతిథులుగా హాజరు కానున్నారు. ఆహ్వానం వెళ్లిన వాళ్లలో రాజకీయ, సినీ, క్రీడా రంగానికి ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో యూపీ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. పది వేల మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పహారాలో.. సీసీ కెమెరాల నిఘా నీడలో అయోధ్య ఉందిప్పుడు. -
పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు
జెరూసలేం: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు పెరిగిన పశి్చమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇన్నాళ్లూ దౌత్య సంబంధాలు మాత్రమే కొనసాగుతున్న పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా వైరం ప్రజ్వరిల్లింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్రీన్ మౌంటేన్ పర్వతప్రాంతంలోని జైష్ అల్ అదిల్(ఆర్మీ ఆఫ్ జస్టిస్) సంస్థకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్లా దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మంతనాలు జరిపిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ రాయబారిపై వేటు జైష్ అనేది 2012లో పాక్‌లో నెలకొలి్పన సున్నీ ఉగ్రసంస్థ. ఇరాన్లో జైష్ తరచూ ఇరాన్ భద్రతాబలగాలపై దాడులకు దిగుతోంది. సైనికులను అపహరిస్తూ ఇరాన్ ప్రభుత్వానికి పెద్దతలనొప్పిగా తయారైంది. పాక్ సరిహద్దు పట్టణం పంజ్‌ఘర్ కేంద్రంగా పనిచేస్తూ జైష్ దాడులకు దిగుతోందని ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ఆరోపించింది. ఈనెలలో సున్నీ ఉగ్రసంస్థ ఒకటి సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి వంద మందిని బలితీసుకున్న విషయం తెల్సిందే. దీంతో సున్నీ ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఇరాన్ నిశ్చయించుకుంది. అందులోభాగంగానే పాక్‌లోని జైష్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే తమ భూభాగంపై విదేశీ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఆక్షేపించింది. పాక్‌లోని ఇరాన్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారిని పిలిపించుకుని తన నిరసన వ్యక్తంచేసింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించింది. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. ‘పాక్ గగనతలాన్ని అనుమతిలేకుండా వినియోగించడం, దురి్వనియోగం చేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించింది. ఇది పాక్ సార్వ¿ౌమత్వాన్ని అవమానించడమే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను అపహాస్యం చేస్తూ ఇలా దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని తీవ్ర పరిణామాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ ఆర్మీ అధికారి కాల్చివేత జైష్ ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన మరుసటి రోజే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారిని ఉగ్రవాదులు కాలి్చచంపారు. పాక్, అఫ్గానిస్తాన్‌లతో సరిహద్దు పంచుకుంటున్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఉగ్రదాడి ఘటన జరిగిందని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ బుధవారం తెలిపింది. -
ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్లో ఎన్ఐఏ దాడుల కలకలం..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ హుస్సేనిపురా, కర్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలో గురువారం ఉదయం ఎన్ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది. ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్లో, ఆదిలాబాద్‌లో ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. పీఎఫ్ఐ టెర్రర్ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: మజ్లిస్ సెక్యులర్ ఎలానో కేసీఆర్ చెప్పాలి: కిషన్‌రెడ్డి డిమాండ్ -
SCO Summit: ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలొద్దు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పాకిస్తాన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. కొన్ని దేశాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సీమాంతర ఉగ్రవాదానికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నాయని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎవరూ సంకోచించవద్దని సూచించారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే శక్తులను అణచివేయడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదం ఒక పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు తొలగిపోవాలంటే ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ అంతం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీఓలో సంస్కరణలకు మద్దతు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత పెద్ద సవాలుగా మారిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలు, అంతర్గతంగా ఉద్రిక్తతలు, మహమ్మారులతో ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని తెలిపారు. ఆసియా, ఐరోపా ఖండాల్లో శాంతికి, సౌభాగ్యానికి, అభివృద్ధికి ఎస్సీఓ అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సహకారం మరింత పెంపొందించుకుంటామని అన్నారు. స్టార్టప్‌లు, నవీన ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, యువజనం సాధికారత, డిజిటలీకరణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటామని వెల్లడించారు. ఎస్సీఓలో సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో ఇరాన్ సైతం సభ్యదేశంగా చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీఓ వర్చువల్ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. భారత్ 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. 2017లో పూర్తిస్థాయి సభ్యదేశంగా మారింది. ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వద్దు: జిన్‌పింగ్ బీజింగ్: ఆసియా ప్రాంతంలో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎస్సీఓ వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడానికి ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటును రష్యా సమాజం మొత్తం ఒక్కటై వ్యతిరేకించిందని చెప్పారు. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ యత్నాలను ఆయన ప్రస్తావించారు. -
అక్రమ సిమ్‌కార్డుల దందాపై ఉక్కుపాదం..మీ పేరు మీద ఎన్ని ఉన్నాయ్?
సాక్షి, హైదరాబాద్: టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్, హత్య చేసిన నిందితులు బేగంబజార్, సికింద్రాబాద్‌ల నుంచి నాలుగు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్ కుటుంబీకులతో బేరసారాలు చేశారు. ► జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరపడానికి ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే వినియోగించారు. 2016 నాటి ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్‌కార్డుల్ని చారి్మనార్ వద్ద ఉన్న ఔట్లెట్లో ఖరీదు చేశాడు. ► పంజగుట్టలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో ఎర వేసి, నిరుద్యోగులు, ప్రధానంగా మహిళల నుంచి డబ్బు కాజేసిన చక్రధర్ గౌడ్ సైతం పెద్ద సంఖ్యలో ప్రీ–యాక్టివెటెడ్ సిమ్‌కార్డులు వాడాడు. నేరగాళ్లతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. అందులో భాగంగానే చక్రధర్ గౌడ్‌కు వీటిని అందించిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్... సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సరీ్వసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అనేక మంది సిమ్కార్డ్స్ విక్రేతలు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద సిమ్‌కార్డులు ముందే యాక్టివేట్ చేస్తున్నారు. అరెస్టులతో పాటు డీఓటీ దృష్టికీ.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందుతున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సరీ్వస్ ప్రొవైడర్లు కచి్చతంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయన్నది నిపుణులు చెబుతున్నారు. ఈ దందా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. ఎవరికి వారు తనిఖీ చేసుకోవచ్చు.. ప్రతి వినియోగదారుడూ తన పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. www.sancharsaathi.gov.in వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులోకి ప్రవేశించిన తర్వాత టాఫ్‌కాప్ పేరుతో ఉండే నో యువర్ మొబైల్ కనెక్షన్స్ లింక్‌లోకి ఎంటర్ కావాలి. అక్కడ కోరిన వివరాలు పొందుపరిచి, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్లు ఉన్నాయో కనిపిస్తాయి. అవన్నీ మీకు సంబంధించినవి కాకపోతే ప్రీ–యాక్టివేటెడ్‌విగా భావించవచ్చు. దీనిపై అదే లింకులో రిపోర్ట్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయించవచ్చు. చదవండి: డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు -
హైదరాబాద్ లో మళ్లీ ఉగ్ర కదలికలు
-
పీఏఎఫ్‌ఎఫ్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు దిగుతున్న జైషే మహ్మద్‌కు ఇది మారుపేరు. ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నుతోంది. యువతను ఉగ్ర భావజాలం వైపు ఆకర్షిస్తోంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం పీఏఎఫ్‌ఎఫ్‌పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. -
అఫ్గాన్ ఉగ్రవాదుల అడ్డా కాకూడదు
న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్ ఆ«ధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న ఎనిమిది ఆసియన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అఫ్గాన్ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్ అడ్డాగా మారకుండా నిరోధించడానికి కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన అఫ్గానిస్తాన్‌ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి. నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి: మోదీ అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఇందుకోసం అక్కడ ఉగ్రవాద సంస్థలకు స్థానం లేకుండా చేయాలన్నారు. అఫ్గాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేయాలన్నారు. అఫ్గాన్‌లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, సంక్షోభం నానాటికీ ముదురుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఇరుగు పొరుగు దేశాలు మానవతాదృక్పథంతో నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి నేతృత్వం వహించి ప్రారంభోపన్యాసం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అఫ్గానిస్తాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు ప్రాంతీయంగానూ సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. తాలిబన్లతో చర్చల ద్వారానే అఫ్గాన్ సమస్యని పరిష్కరించగలమని రష్యా ప్రతినిధి నికోలాయ్æ అన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్ని ఆమోదించింది. మళ్లీ వచ్చే ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. డిక్లరేషన్‌లో ఏముందంటే ? ► అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. ► అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ. ► సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. ► అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు ► మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. ► అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి. ► కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. ► ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి. -
ఇందూరులో ‘తీవ్ర’ కలకలం
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ‘ఉగ్ర కార్యకలాపాల’ వార్తతో ఇందూరు జిల్లా మరోమారు ఉలిక్కిపడింది. బోధన్ యువకుడి అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లాలో గతంలోనూ ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్న ఘటనలూ వెలుగు చూశాయి. ఉగ్రవాదులతో పాటు స్లీపర్‌సెల్స్ జిల్లాలో ఆశ్రయం పొందినట్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిలో కొందరికి ఇక్కడి నుంచి సహకారం లభించినట్లు గతంలో బయటపడింది. ఇక, విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల మంజూరు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందనే అనేమానంతో బోధన్‌లోని రెంజల్ బేస్‌కు చెందిన ఓ యువకుడ్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్న వార్త వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేసింది. అనుమానితులకు అడ్డాగా..! జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు గతంలోనే వెలుగు చూసింది. సమస్యాత్మక ప్రాంతాలను అడ్డాగా చేసుకుని స్లీపర్‌సెల్స్ పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు అప్పట్లోనే గుర్తించాయి. కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరిని జిల్లా పోలీసులు కాల్చి చంపారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తున్నారనే నెపంతో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. బోధన్‌లోని మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లిలోని ఓ ప్రాంతంలో ‘అనుమానితులు’ ఎక్కువగా ఉంటారని పోలీసులే అంతర్గతంగా చెబుతారు. అలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులకు అనేక ‘అడ్డంకులు’ ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇదే నెపంతో కొన్నాళ్లుగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టట్లేదని సమాచారం. కీలకమైన కొన్ని ప్రాంతాల్లో నిఘా వైఫల్యం తరచూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారనే విషయాలు పోలీసులకు తెలియడం లేదు. పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వైఫల్యం.. విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల జారీ వ్యవహారమే జిల్లాలో నిఘా వైఫల్యానికి అతిపెద్ద నిదర్శనంగా నిలిచింది. ప్రధానంగా బోధన్‌తో పాటు మరికొన్ని వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా నిద్ర పోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా 72 మంది రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇచ్చేందుకు ఎస్బీ పోలీసులే క్లీన్చిట్ ఇవ్వడం వారి వైఫల్యానికి, నిర్లక్ష్యానికి పెద్ద ఉదాహరణ. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విదేశీయులు బోధన్ అడ్రస్ పేరుతో పాస్‌పోర్టులు పొంది బంగ్లాదేశ్‌కు వెళ్లి పోయారు. ఇదే తరహాలో ఇద్దరు విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తూ హైదరాబాద్ విమానాశ్రయంలో దొరికి పోవడంతో ఈ తతంగం బయటపడింది. తాజాగా బోధన్‌కు చెందిన యువకుడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానంతో హైదరాబాద్ నుంచి వచ్చిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకోవడం కలవరానికి గురి చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి తమ ‘పని’ చక్కబెడుతుంటే, ఇక్కడే ఉండే నిఘా వర్గాలు మాత్రం అనుమానాస్పద కార్యకలాపాలను మాత్రం గుర్తించలేక పోతున్నాయి. ఇప్పటికైనా నిఘా వర్గాలు మేల్కొనపోతే కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. అసాంఘిక శక్తులకు అడ్డాగా.. ►కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరీ నిజామాబాద్‌లో తలదాచుకుంటూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాడు. ఇదే పని మీద జగిత్యాలకు వెళ్తుండగా, ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. ►సారంగపూర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. 2002లో సారంగపూర్‌లోని ఎస్టీడీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ హతమయ్యాడు. ►బోధన్‌లోని ఓ సైకిల్ షాప్ యజమానిని 1998లో ఆజాం ఘోరి, అతని అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ ఇద్దరు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లలో నిందితులకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ►నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులనే అనుమానంతో ముగ్గురిని నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ►ఇది జరిగిన కొన్నాళ్లకే నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమయ్యాయి. గాంధీజీ విగ్రహానికి నల్ల రంగు పూసిన దుండగులు.. కలెక్టరేట్ వద్ద అరెస్టు చేసిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ పేపర్లలో రాయడం కలకలం రేపింది. -
24 గంటల్లో ఎనిమిది మంది హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో గడిచిన 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచరం అందుకున్న భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి షోపియాన్, షాంపూర్ ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరపగా.. పాంపోర్ ప్రాంతంలో ముగ్గురు, షోపియాన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు డీజీపీ దిల్బార్‌సింగ్ వెల్లడించారు. కాగా.. మీజ్ పాంపోర్ వద్ద ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మసీదులోకి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పకడ్బందీ వ్యూహంతో శుక్రవారం ఉదయం వారిని మట్టుబెట్టాయి. చదవండి: ప్రధాని దత్తత గ్రామంపై కథనం రాసినందుకు.. -
హనీట్రాప్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. విశాఖపట్నం గూడచర్యం కేసులో ఉగ్రవాదులకి నిధులు సమకూర్చిన మరో కుట్రదారుడు అబ్దుల్ రెహమాన్ జబ్బార్ షేక్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో అబ్దుల్ రెహమాన్ భార్య షయిత్సా కాజిర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. విశాఖ నౌకాదళం కేంద్రంగా సాగిన హనీట్రాప్ వ్యవహారం గత ఏడాది డిసెంబర్ 20న బయటపడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు ఎరవేసి విశాఖ నేవీ అధికారుల ద్వారా రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసేందుకు కుట్ర పన్నింది. (నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్ఐఏ!) కుట్రని పసిగట్టిన ఎన్ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో లోతుగా దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 29న విజయవాడ పోలీస్ స్టేషన్లో ఐసీపీ సెక్షన్ 120 బి, 121ఎ, యుపీ (ఏ) చట్టం సెక్షన్ 17,18, అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3 క్రింద అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ నెలలోనే 11 మంది నేవీ అధికారులతో సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరొక సూత్రధారి అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారానే నేవీ అధికారులకి డబ్బులు అందినట్లు ఎన్ఐఏ నిర్దారణ చేసింది. -
భారత్ వ్యతిరేక ఎన్జీవోల కట్టడికి నేపాల్ నిర్ణయం
కఠ్మాండు: భారత్, చైనాలతో సంబంధాలను దెబ్బతీసే కార్యకలాపాలను సాగించే ప్రభుత్వేతర సంస్థ(ఎన్జీవో)లను కట్టడి చేసేందుకు నేపాల్ నడుం బిగించింది. ఇటువంటి సంస్థల కారణంగానే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని భారత్...సరిహద్దుల గుండా టిబెటన్ల కదలికలు ఎక్కువైనట్లు చైనా... నేపాల్‌కు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైన రెండు దేశాలతో సంబంధాలు సవ్యంగా సాగేందుకు ఎన్జీవోల రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు సోషల్ వెల్ఫేర్ కౌన్సిల్ తెలిపిందని ‘కఠ్మాండు పోస్ట్’ తెలిపింది. ముఖ్యంగా సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మదరసాలు, ప్రార్థనా మందిరాలకు ఖతర్, సౌదీ అరేబియా, టర్కీల నుంచి నిధులు అందుతున్నట్లు భారత్ తెలిపిందని పేర్కొంది. అందుకే వీటికి అందే నిధులు, చేపట్టే కార్యక్రమాలపై పర్యవేక్షణ జరిపేందుకు వీలు గా కొత్త చట్టాన్ని తేనున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లోని మదరసాల్లో ఉగ్రవాద కార్యక లాపాలు అంతర్గత భద్రతకు ప్రమాదమంటూ గతంలో నేపాల్‌కు భారత్ హెచ్చరికలు చేసిందని కూడా కౌన్సిల్ వివరించింది. -
ఉగ్రవాదంపై గట్టిగా స్పందించాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠాలు ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా మారాయని, వాటిని కట్టడి చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని భారత్, జపాన్ ఆ దేశాన్ని కోరాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ మంత్రుల స్థాయి వార్షిక భేటీ అనంతరం ఈ మేరకు ప్రకటించాయి. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సహా అంతర్జాతీయ విభాగాలకు ఇచ్చిన హామీలను పాక్ అమలు చేయాలని ఇరు దేశాలు కోరాయి. ఈ భేటీలో భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జపాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగి, రక్షణ మంత్రి టారో కొనో పాల్గొన్నారు. తర్వాత జపాన్ మంత్రులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు జపాన్, భారత సంబంధాలు కీలకమైనవని మోదీ అన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఇండో–జపాన్ వార్షిక సదస్సుకు ప్రధాని షింజో ఆబేను ఆహ్వానించనున్నట్లు మోదీ తెలిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశ అభివృద్ధికి మరింత కృషి కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మోదీ శనివారం ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలిపారు. ‘6 మంత్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్’ హ్యాష్‌ట్యాగ్‌తో పలు ట్వీట్లు చేశారు. రానున్న కాలంలో సుసంపన్న, ప్రగతిశీల, సరికొత్త భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదం స్ఫూర్తితో, ఎన్డీయే ప్రభుత్వం భారత్ అభివృద్ధికి తన కృషిని కొనసాగిస్తోందన్నారు. -
ఉగ్ర ప్రోత్సాహకులపై చర్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది. పార్లమెంట్‌కు అవమానకరం: కాంగ్రెస్ కశ్మీర్లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జవాన్లతో మోదీ దీపావళి జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు. -
చొరబాట్లు ఆపేవరకు ఇంతే
లేహ్: సరిహద్దుల వద్ద చొరబాట్లకు భారత ఆర్మీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. పాక్ చొరబాట్లను ఆపని పక్షంలో ఇలాంటి చర్యలే కొనసాగుతాయని హెచ్చరించారు. శ్యోక్ నది సమీపంలోని తూర్పు లదాఖ్‌లో నిర్మించిన 1,400 అడుగుల కోల్ చెవాంగ్ రించేన్ వంతెనను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత లదాఖ్‌తో స్నేహ బంధం మాత్రమే ఉంటుందని.. శత్రుత్వానికి చోటు ఉండదన్నారు. పాక్ విషయంలో సాయుధ దళాలు ముందస్తు దాడులు చేయలేదని, పాక్ కాల్పులు జరిపిన తర్వాతనే ఎదురుదాడులు చేశాయని చెప్పారు. భారతదేశ సమగ్రతను అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి పాక్ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దీనికి మన సాయుధ దళాలు గట్టిగానే బదులిస్తున్నాయని అన్నారు. సియాచిన్ పర్యటనకు అనుమతి.. లేహ్–లదాఖ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుగాంచిన సియాచిన్‌పైకి పర్యాటకులను అనుమతినిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కునార్ బేస్ క్యాంప్ నుంచి కునార్ పోస్ట్ వరకు ఉన్న మార్గాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పాక్ ఉగ్రదాడులు ఆపాలి: గవర్నర్ పాక్ ఉగ్రదాడులు ఆపకపోతే భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకువెళ్లి అక్కడి ఉగ్రస్థావరాలపై విరుచుకుపడుతుందని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని.. ఉగ్రక్యాంపుల ఏర్పాటు మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో భారత ఆర్మీ ఉగ్ర క్యాంపులను కూల్చివేస్తుందని చెప్పారు. కర్తార్‌పూర్ టికెట్ 1400 దర్బార్ సాహిబ్‌ను సందర్శించుకునే సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ నుంచి సంవత్సరానికి సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ.258 కోట్ల మేర ఆదాయం పొందాలని పాకిస్తాన్ భావిస్తోంది. దీనికోసం కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే భక్తుల నుంచి పెద్దమొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఒక్కో భక్తుడు సుమారు రూ.1,400 చెల్లించాలని పేర్కొంది. దీనిపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఈ నెల 23న కారిడార్‌కు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. భారత్‌కు పాక్ తపాలా సేవలు బంద్ జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం ఆగస్టులో 5వ తేదీన తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అదే నెల 27 నుంచి భారత్‌తో పాక్ తపాలా సేవలను నిలిపివేసింది. రెండు దేశాల మధ్య తపాలా సర్వీసులు రెండు నెలలుగా నిలిచిపోయినట్లు తపాలా శాఖ మంత్రి రవిశంకర్ ధ్రువీకరించారు. తపాలా సేవలను పాకిస్తాన్ ఏకపక్షంగా నిలిపివేసింది. ‘భారత్ నుంచి ఉత్తరాలు తీసుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పాక్ నిర్ణయం ప్రపంచ తపాలా సంఘం నిబంధనలకు విరుద్ధం. ఎంతైనా అది పాకిస్తాన్ కదా..!’ అని వ్యాఖ్యానించారు. ఆ చర్యకు బదులుగా భారత్ కూడా పాక్ మెయిళ్లను తీసుకోవడం బంద్ చేసిందన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సౌదీ విమాన సర్వీసుల ద్వారా జరుగుతున్నట్లు సమాచారం. -
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది
చెన్నై: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్ రావత్ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ జమ్ము: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్ జిల్లాకు చెందిన నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్‌లు కలిసి బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్‌లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్ 9వ తేదీన ఆర్ఎస్ఎస్ నేత చందర్‌కాంత్ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్ హుస్సేన్ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం భారత్‌లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో గాంధీ విగ్రహానికి కొంత మంది అ సాంఘిక శక్తులు గాంధీ ముఖానికి బొగ్గుతో రాసి కాగితాల దండ వేయడంపై పోలీసుశాఖ సీరియస్‌గా దర్యాప్తు జరుపుతోందని సీపీ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని అసాంఘిక శక్తుల ఆట కట్టించి, కూకటి వేళ్లతో పెకిలిస్తామని సీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటోలు, వీడియోలు వస్తే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ఇతరు లు పోస్టుచేయవద్దని సూచించారు. సో షల్ మీడియాపై పూర్తి స్థాయి దృష్టి సారించామన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. నిజామాబాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం లేదన్నారు. ఈ విషయంలో నిజామాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు. -
ఇందూరు గడ్డపై ‘ఉగ్ర’ కదలికలు?!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయా.? సమస్యాత్మక ప్రాంతాలే అడ్డాగా స్లీపర్ సెల్స్ కీలకంగా పని చేస్తున్నాయా.? స్వచ్ఛంద సంస్థ ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయా..? అంటే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో జిల్లాలో పలుమార్లు ఉగ్రవాద కదలికలు వె లుగు చూశాయి. తాజాగా వారం వ్యవధిలో చోటు చే సుకున్న రెండు ఘటనలతో మరోమారు ఉగ్రవాద కా ర్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి. నిజామాబాద్ మండలం గుండారంలో జాతిపిత గాంధీజీ విగ్రహానికి మసి పూసిన నిందితులు దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ వేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. గుండారం గ్రామంలో గల గాంధీ విగ్రహానికి నల్ల రంగ పూసి ఉన్నట్లు ఆదివారం మధ్యాహ్నం గమనించిన స్థానిక యువకులు, విగ్రహం మెడలో పేపర్ల దండ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విగ్రహం వద్దకు వెళ్లి పరిశీలించగా, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ కనిపించింది. అందులో ‘పాకిస్తాన్ జిందాబాద్.. ఇండియా డౌన్ డౌన్ డౌన్.. జీహాద్.., షాదుల్లాను విడుదల చేయాలి.. కాశ్మీర్ పాకిస్తాన్ దే..’ అంటూ తెల్ల కాగితాలపై రాసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాజా ఘటనతో జిల్లాలో అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో విష ప్రచారం చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. జిల్లాలో ‘ఉగ్ర’ కార్యకలాపాలను గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవలే పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కొన్ని రోజులుగా అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై కన్నేసినట్లు సమాచారం. మూడు చోట్ల స్లీపర్ సెల్స్! ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అసాంఘిక శక్తుల కార్యకలాపాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. అయినా ఎక్కడో ఒకచోట ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు జిల్లాలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బోధన్‌లోని అత్యంత సమస్యాత్మకమైన మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లి మండలంలోని ఓ గ్రామంలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు గతంలోనే గుర్తించాయి. అలాగే, నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని సముదాయాల్లోనూ కొందరు అనుమానిత వ్యక్తులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు గతంలోనే పక్కా సమాచారముంది. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే రైళ్లలో వస్తున్న కొందరు అనుమానితులు రాత్రి పొద్దుపోయే వరకూ రైల్వే స్టేషన్ సమీపంలోని సముదాయాల్లో కొందరు స్థానికులతో భేటీ వేస్తున్నట్లు కూడా గతంలోనే గుర్తించారు. ఇక, నిషేధిత సంస్థ సిమికి సంబంధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు గత వారం కలెక్టరేట్ వద్ద అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ తాజాగా గుండారంలో వెలుగు చూసిన పేపర్ల దండలో అగంతకులు డిమాండ్ చేయడం చూస్తుంటే జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు పోలీసులు సూత్రప్రాయంగా నిర్ధారణకు వచ్చారు. గాంధీజీ విగ్రహానికి మసి పూసి, దేశ వ్యతిరేక నినాదాలు రాసిన అగంతకులను గుర్తించే పనిలో పడ్డారు. ‘స్వచ్ఛందంగా’ విష ప్రచారం.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసాంఘిక శక్తలు కదలికలు ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. అవగాహన సదస్సులతో గుట్టు చప్పుడు కాకుండా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్న ఘటనలు ఇటీవల పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, రెంజల్, నందిపేట, కామారెడ్డి ప్రాంతాల్లో ఇలాంటి ఈ వ్యవహారాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతి లేకుండా అవగాహన సదస్సుల పేరిట ఈ విష ప్రచారం కొనసాగుతోంది. జగిత్యాల నుంచి కొందరు జిల్లాకు వచ్చి ఒక సంస్థ పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట మాలపల్లి ప్రాంతంలో ఒక నిర్మాణాన్ని చేపట్టి, స్థానికు యువతను రెచ్చగొట్టేందుకు ఓ సంస్థ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇది గమనించిన పోలీసులు పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంబంధిత యువకుల తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, వదిలేశారు. ఇక, ఒక మహిళతో పట్టణ శివారులోని ఓ గ్రామంలో అవగాహన సదస్సు పేరిట నిషేదిత సంస్థ అందించిన పుస్తకాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్‌లో తల దాచుకుంటూ కార్యకలాపాల నిమిత్తం జగిత్యాలకు వెళ్తున్న కరుడు గట్టిన ఉగ్రవాది అజాం ఘోరిని ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. 2002లో సారంగపూర్ ఎస్టీడీ బూత్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ హతమయ్యాడు. 1998లో బోధన్‌లోని ఓ సైకిల్ షాప్ యజమానిని అజాం ఘోరీ అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. వీరిలో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ ఇద్దరు దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల నిందితులకు సహకరించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. తాజాగా నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమవడంతో జిల్లాలో ఉగ్ర కదలికలపై మరోమారు జోరుగా చర్చ జరుగుతోంది. -
తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు సంపూర్ణ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘తీవ్రవాదం అణచివేతలో దర్యాప్తు సంస్థలు మరింత మెరుగ్గా పనిచేసేలా వాటిని బలోపేతం చేసేందుకు, దేశాన్ని తీవ్రవాద రహితంగా చేసేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి ప్రణాళికకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఏరకమైన తీవ్రవాదం అయినా, ఏ ప్రాంతంలో ఉన్నా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకూ మేం మద్దతిస్తాం. ఈ బిల్లులో క్లాజ్ 8 ఇన్స్పెక్టర్ ర్యాంకు గల అధికారి దర్యాప్తు ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిస్తోంది. తీవ్రవాదుల ఆస్తులు జప్తు చేసేందుకు ఇది దోహదపడటం ప్రశంసనీయం. అలాగే వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను తీవ్రవాదులుగా గుర్తించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది.’ అని పేర్కొన్నారు. -
అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
-
‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ సవరణలపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని హోం మంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. ఉగ్రవాదుల కన్నా దర్యాప్తు సంస్థలు నాలుగడుగులు ముందుండాలంటే ఈ సవరణలు కచ్చితంగా అవసరమేనని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)–2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోవడంపై అమిత్ షా స్పందిస్తూ ‘మీ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఓటింగ్‌కు దూరంగా వెళ్లిపోతున్నారు. దీనికి మేం ఏం చేయగలం?’ అన్నారు. సవరణ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ చట్టంతో సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అనడంపై అమిత్ షా స్పందిస్తూ ‘సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1967లో నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వమే తెచ్చింది. అంటే సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్ వల్లే, ఆనాడే దెబ్బతిన్నది’ అంటూ ఎదురుదాడి చేశారు. ఈ చట్టానికి తెచ్చిన సవరణలను, చట్టాన్ని తాము దుర్వినియోగం చేయబోమనీ, కేవలం ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేందుకే దీనిని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే కొంతమంది వ్యక్తులు సిద్ధాంతాల పేరుతో పట్టణ మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, అలాంటి వారిపై ప్రభుత్వం ఎంతమాత్రమూ దయ చూపదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒవైసీ ఒత్తిడితో నాటకీయ పరిణామాలు సవరణ బిల్లును ఆమోదించడానికి ఓటింగ్ జరపాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పట్టుబట్టడంతో సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ అప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలోనూ బిల్లును ఆమోదించడానికి ముందు ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దీంతో ఆయన అనవసరంగా సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒవైసీ దూకుడుగా సమాధానమిస్తూ ‘ఓటింగ్ కోరడం నా హక్కు. అభ్యంతరం తెలపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 287 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 8 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ పట్టుబట్టగా..నిబంధనలను ప్రస్తావిస్తూ సభ్యులను నిల్చోబెట్టి సమర్థిస్తున్న వారెంత మంది, వ్యతిరేకిస్తున్న వారెంత మంది అని స్పీకర్ లెక్కించారు. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం మొత్తాన్నీ నిల్చొనేలా చేశాను’ అని వ్యాఖ్యానించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడేందుకు మేం సిద్ధమే. ఇప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల్చున్నాం’ అని అన్నారు. సవరణ బిల్లులో ఏముంది? ‘ఉగ్రవాద, వినాశక కార్యకలాపాల నిరోధక చట్టం’ (టాడా), ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ (పొటా)లకు మార్పులు చేస్తూ ఈ ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)’ బిల్లులను కేంద్రం తెచ్చింది. ఈ సవరణలు ఏం చెబుతున్నాయంటే.. ► ఉగ్రవాదానికి పాల్పడిన లేదా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న, ఉగ్రవాద హింసాకాండకు ఏర్పాట్లు చేసిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదానికి ఇతరత్రా సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలను ఈ చట్టం కింద ఉగ్రవాదులుగా లేదా ఉగ్రవాద సంస్థలుగా కేంద్రం ప్రకటించవచ్చు. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే అధికారి.. నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటే ముందుగా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అనుమతి తీసుకోవలసి ఉంది. తాజా సవరణల ప్రకారం.. కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి దర్యాప్తు చేస్తున్న పక్షంలో ఆస్తుల జప్తుకోసం డీజీపీ అనుమతి కాకుండా, ఎన్ఐఏ డీజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేసులను పోలీసులే దర్యాప్తు చేస్తుంటే డీజీపీ అనుమతి అవసరం. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ), పై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. తాజా సవరణల ప్రకారం ఎన్ఐఏలోని ఇన్స్పెక్టర్ లేదా ఆ పై స్థాయి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. ► ప్రస్తుత చట్టానికి అనుబంధంగా తొమ్మిది అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత సవరణ కింద ఆ ఒప్పందాలతో పాటుమరో ఒప్పందాన్ని(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం–2005) కూడా చేర్చారు. ఇక నుంచి ఈ పది ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొంటారు. నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా కేంద్రం చేర్చింది. ఆ సమయంలో కచ్చితంగా సభలో ఉండాలంటూ తమ ఎంపీలకు అధికార బీజేపీ ఇప్పటికే విప్ కూడా జారీ చేసింది. ఉన్నట్టుండి, ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులను జైలుకు పంపేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో తనకున్న భారీ సంఖ్యబలంతో లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. పార్లమెంటు సమాచారం ► ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. న్యాయ శాఖ పరిధిలోని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయని స్పష్టం చేశారు. ► పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పేర్లు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్నందున, పేరు మార్చడాన్ని కేంద్రం తిరస్కరిస్తోందన్నారు. ► కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వెళ్లడం 40 శాతం తగ్గిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. సరిహద్దు చొరబాట్లు 43 శాతం, ఉగ్ర చర్యలు 28 శాతం తగ్గాయన్నారు. యూపీఏ –2లో పోలిస్తే మావోయిస్టుల దాడులు 43 శాతం తగ్గాయని వెల్లడించారు. ► మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, సంఘపరివార్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌ల మృతిపై ప్రత్యేక విచారణ జరిపే ఆలోచనేదీ లేదని మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో తెలిపారు. ► భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో కంచె నిర్మించే ప్రతిపాదనేమీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యలు పక్కాగా తీసుకుంటుండడంతో సరిహద్దు చొరబాట్లు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇండో–పాక్ సరిహద్దులో 2069 కిలోమీటర్లకుగాను 2004 కిలోమీటర్ల కంచె పూర్తయిందన్నారు. ఇండో–బంగ్లా సరిహద్దులో 3326 కిలోమీటర్లకుగాను 2803 కిలోమీటర్ల కంచె పూర్తయిందని వెల్లడించారు. ► మూడేళ్లలో ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా 239 శాటిలైట్లను ప్రయోగించి, రూ. 6,289 కోట్లు ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో తెలిపారు. ► భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రష్యా వెల్లడించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లోక్‌సభలో తెలిపారు. 2014 నుంచి ఈ విషయమై రష్యాను అడుగుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ► విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2015 ఫిబ్రవరి నుంచి 2019 జూలై 18 వరకు 50,605 సమస్యలను నమోదు చేసుకోగా 44,360 సమస్యలను (దాదాపు 90 శాతం) తీర్చామన్నారు. అందులో 36,805 సమస్యలు గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయన్నారు. ఎమ్‌ఏడీఏడీ పోర్టల్ ద్వారా సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. -
ఉగ్ర జాబితాలో అగ్రస్ధానం పాక్‌దే..
ఐక్యరాజ్యసమితి : ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ ప్రతిష్ట మంటగలిసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో ఏకంగా 139 మంది పాక్ టెర్రరిస్టులకు చోటుదక్కింది. పాకిస్తాన్లో నివసిస్తూ ఆ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాదులను తాజా జాబితాలో చేర్చింది. అల్‌ఖైదా ప్రస్తుత నేత అల్ జవహరి ఈ జాబితాలో ముందువరుసలో నిలవగా, తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరేకు చెందిన హఫీజ్ సయీద్, ఆయన అనుచరులు అబ్దుల్ సలాం, జఫర్ ఇక్బాల్‌లున్నారు. ఉగ్రకార్యకలాపాలకు ఊతమిస్తున్న పాక్‌కు చెందిన అల్ రషీద్ ట్రస్ట్, హర్కతుల్ ముజహదీన్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జేఈఎం, రబితా ట్రస్ట్, అల్ అక్తర్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, హర్కతుల్ జిహాద్ ఇస్లామి, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, జమతుల్ అహ్రర్ వంటి సంస్థలు యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే తమది ఉగ్రవాద బాధిత దేశమని తరచూ పాకిస్తాన్ నమ్మబలుకుతోంది. -
ఇస్లాం అతివాదంతో పెను ముప్పు
న్యూఢిల్లీ: ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్–ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరు రోజుల భారత పర్యటనలో ఉన్న నెతన్యాహు మంగళవారం ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక–రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు భారత్ సహజ భాగస్వామి, మిత్రదేశమని చెప్పడంతో అక్కడే ఉన్న నరేంద్ర మోదీ పెదవులపై నవ్వులు విరిశాయి. ఒకప్పుడు ఏమీ లేని ఇజ్రాయెల్ ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తుల ద్వారానే నేడు బలమైన దేశంగా ఎదిగిందని నెతన్యాహు చెప్పారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు, కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్రను పరిమితం చేసేందుకు మోదీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్య దేశాలు కూటమిగా ఏర్పడటం చాలా ముఖ్యమని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు రైసినా డైలాగ్ సదస్సును 2016 నుంచి విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) సంయుక్తంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి మొత్తం 550 మంది ఈ ఏడాది హాజరవుతున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ, యూఎస్ పసిఫిక్ కమాండ్‌కు చెందిన కమాండర్ హ్యారీ హ్యారిస్ తదితరులు బుధవారం ప్రసగించనున్నారు. తాజ్‌ను సందర్శించిన నెతన్యాహు రైసినా డైలాగ్‌ను ప్రారంభించడానికి ముందు నెతన్యాహు తన భార్య సారాతో కలసి తాజ్‌మహల్‌ను సందర్శించారు. నెతన్యాహు దంపతులకు ఆగ్రా విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యాహు సందర్శన నేపథ్యంలో తాజ్‌మహల్‌లోకి రెండు గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతించలేదు. కాగా, మోదీ గతేడాది ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఓల్గా బీచ్‌లో నెతన్యాహుతో కలసి నడిపిన గాల్–మొబైల్ జీప్‌ను నెతన్యాహు మోదీకి బహూకరించనున్నారు. దాదాపు రూ. 72 లక్షల విలువైన ఈ జీప్ సముద్రపు నీటిని నిర్లవణీకరణం చేసి తాగునీటిగా మారుస్తుంది. గాల్–మొబైల్ ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. భారత్ ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సోమవారం ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా–ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. ముంబైకి మోషే 2008 నవంబరు 26న ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయెల్ యూదు బాలుడు మోషే హోల్జ్‌బర్గ్ మంగళవారం మళ్లీ ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న మోషే, ఆ దుర్ఘటన తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. తన తాతయ్య షిమోన్ రోజెన్బర్గ్తో కలసి వచ్చిన అతను...తన తల్లిదండ్రులు చనిపోయిన నారీమన్ హౌస్‌ను సందర్శించి నివాళి అర్పించాడు. భారత్‌కు రావడం ఆనందంగా ఉందన్నాడు. గతేడాది మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు మోషేను, అతని కుటుంబాన్ని కలసిన మోదీ...వారు భారత్‌కు ఎప్పుడైనా రావొచ్చంటూ ఆహ్వానించారు. తాజాగా నెతన్యాహు పర్యటన నేపథ్యంలో మోషే ముంబైకి విచ్చేశాడు.